National News
-
శంకర్-దివ్య విడాకుల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్
ప్రముఖ టెక్ ఎంట్రాప్రెన్యూర్ ప్రసన్న శంకర్ నారాయణ ఇంటి వ్యవహారం.. మొత్తంగా రచ్చకెక్కింది. అరెస్ట్ భయంతో పరారీలో ఉన్న ఆయన.. సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేశారు. అది కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. అరెస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ రచ్చ కాస్త శాంతించింది. చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ(Prasanna Sankar Narayana).. ప్రముఖ హెచ్ఆర్ టెక్ స్టార్టప్ 'రిప్లింగ్' సహ వ్యవస్థాపకుడు. అంతేకాదు.. అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతులు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. అయితే.. .. దివ్య, అమె కుమారుడు అమెరికా పౌరులు. ఈ నేపథ్యంలో, భరణంగా నెలకు రూ. 9 కోట్లు చెల్లించాలని దివ్య డిమాండ్ చేయగా, దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈలోపు హఠాత్తుగా సీన్ చెన్నైకి మారింది. భారత్‌కు వచ్చిన దివ్యఅమెరికా కోర్టు ప్రసన్నకు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, ప్రసన్న తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, దివ్య తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు(Prasanna Sankar) ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.అయితే కుమారుడు తనతో సంతోషంగా ఆడుకుంటున్నాడని ప్రసన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దివ్య ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, డబ్బుల కోసం డిమాండ్ చేశారని ప్రసన్న ఆరోపించాడు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.కొడుకును కిడ్నాప్ చేసినట్టు తన భార్య దివ్య ఫిర్యాదు చేయడంతో, ప్రస్తుతం తాను చెన్నై పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని.. పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తన మొబైల్ ఫోన్ లొకేషన్, కారు, యూపీఐ, ఐపీ అడ్రస్ లను ట్రాక్ చేస్తున్నారని ప్రసన్న శంకర్ ఆరోపించారు. చివరకు.. పోలీసుల హామీతో ఆయన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు.దివ్య ఏమన్నారంటే..ప్రసన్న శంకర్ ఒక కామ పిశాచి అని భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని తెలిపారు. ఈ కారణంగానే అతడు సింగపూర్ లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని వివరించారు. తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని ఆరోపించారు. English Translation of @myprasanna 's video:"My name is Prasanna. I was born and brought up in Chennai. I went to US and founded a 10B dollar company. I'm a Tech Entrepreneur. Recently me and my wife got divorced and we had 50/50 custody of our son after signing a MOU.." https://t.co/uxSvgS1Xar— 7y913.acc (@aayeinbaigan) March 23, 2025అయితే.. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై గొడవలు జరిగాయని వెల్లడించారు. అంతేకాకుండా, తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు దివ్య ఫిర్యాదు చేసిందని... అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదైందని వివరించారు. అమెరికా పోలీసులు, కోర్టు ఈ ఆరోపణలను విచారించి, అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయని అన్నారు. ఆ తర్వాత కూడా... నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు, నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్‌లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. -
కర్ణాటకలో భయపెడుతున్న హనీట్రాప్
-
WELCOME BACK సునీత... టైమ్ ఎప్పుడంటే?
-
Haryana: కాంగ్రెస్‌కు ఘోర పరాభవం
ఛండీగఢ్: హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లకుగానూ తొమ్మిదింటిని బీజేపీ కైవసం చేసుకోగా.. మిగిలిన ఒక స్థానం మానేసర్‌లో బీజేపీ రెబల్ లీడర్ ఇంద్రజిత్ యాదవ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయన విజయం దాదాపు ఖరారైనట్లు సమాచారం. గురుగ్రామ్, ఫరిదాబాద్, రోహతక్, హిసార్లాంటి కీలక ప్రాంతాలతో పాటు మరో మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో మార్చి 2వ తేదీన పోలింగ్ జరిగింది. అలాగే.. పానిపట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మార్చి 9వ తేదీన విడిగా పోలింగ్ జరిగింది. వీటితోపాటు అంబాలా, సోనిపట్ మేయర్ పోస్టుల కోసం ఉప ఎన్నికలు, అలాగే.. 21 మున్సిపల్ కమిటీల ప్రెసిడెంట్స్, వార్డ్ మెంబర్స్ ఎన్నిక కోసం మార్చి 2వ తేదీన ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం నుంచి ఫలితాలు వెలువడడం ప్రారంభం అయ్యాయి. దాదాపు అన్ని చోట్ల కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఏ చోటా కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా అడ్డా రోహతక్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. పలు వార్డు మెంబర్స్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా భావించాయి. ఈ క్రమంలో రాజస్థాన్ సీఎం నయాబ్ సైనీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాలతో బీజేపీ ప్రచారం చేయించగా.. ప్రతిగా కాంగ్రెస్ సచిన్ పైలట్, హుడాలతో ప్రచారం చేయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 68 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. -
ముఖవాలో గంగా మాత ఆలయాన్ని సందర్శించిన ప్రధాని
-
మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా
-
భారత్‌కు అమెరికా సాయం.. బంగ్లాకు మళ్లిందా?
న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్ డాలర్ల సాయం వ్యవహారం.. కొత్త మలుపు తిరిగింది. ఆ సాయం భారత సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లోపు ఆ సాయాన్ని బంగ్లాదేశ్‌కు మళ్లించారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ నుంచి కథనం వెలువడంది. దాని ఆధారంగా బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో మండిపడుతున్నాయి.భారత్‌లో ఓటింగ్ శాతం పెంపు కోసం ఇచ్చిన ఆ నిధులను బంగ్లాదేశ్‌లో ఓ ప్రాజెక్టు వినియోగించారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) దీనిని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. బీజేపీ, ఆ పార్టీ అనుకూల మీడియాపై విరుచుకుపడ్డారు. దానిని షేర్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. అయితే.. ఆ కథనాన్ని ఫేక్ అంటూ బీజేపీ ఖండించింది. Lies first mouthed in Washington. Lies then amplified by BJP's Jhoot Sena.Lies made to be debated on Godi media.Lies now thoroughly exposed. Will the Liars apologise? pic.twitter.com/nY7iP4jmnN— Jairam Ramesh (@Jairam_Ramesh) February 21, 2025 FAKE NEWS ALERT 🚨‼️The Indian Express story discusses $21 million in funding to Bangladesh in 2022. However, the article misrepresents the reference to a $21 million funding tranche intended to ‘promote’ voter turnout in India.What Indian Express conveniently sidesteps is… pic.twitter.com/niOaWXivm5— Amit Malviya (@amitmalviya) February 21, 2025భారత్‌లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ 21 మిలియన్ డాలర్ల(రూ.182 కోట్ల నిధులు) కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓటింగ్‌ను పెంచడంద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ విమర్శించారు. అందుకే డోజ్ దానిని రద్దు చేసిందని సమర్థించుకున్నారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌లో దుమారం రేగింది.విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలుబొమ్మలా మారారని బీజేపీ ధ్వజమెత్తగా.. ట్రంప్‌వి అర్థం లేని ఆరోపణలని కాంగ్రెస్ తిప్పికొట్టింది. ట్రంప్ వ్యాఖ్యలతో 2024 ఎన్నికల్లో విదేశీ శక్తులు పని చేస్తున్నాయని అప్పట్లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు నిజమని తేలిందని బీజేపీ పేర్కొంది. విదేశీ శక్తులతో కలిసి రాహుల్ గాంధీ.. భారత్ వ్యూహాత్మక, భౌగోళిక ప్రయోజనాలను దెబ్బతీయాలని చూశారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విమర్శించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేని ఆరోపణలేనని కాంగ్రెస్ కొట్టిపారేసింది. యూఎస్ ఎయిడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేత పత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండు చేశారు.ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను రద్దు చేసినట్లు ప్రకటించింది. డోజ్ నిర్ణయం.. భారత్‌లో రాజకీయ వివాదానికి దారి తీసింది. -
జాగ్రత్త.. అలాంటి కంటెంట్ ప్రసారం చేయొద్దు
న్యూఢిల్లీ: ఓటీటీ, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు కఠిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా అశ్లీల కంటెంట్‌ను మితిమీరి ప్రసారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫిర్యాదులకు చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారమే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.ఓవర్ ది టాప్(OTT) ఫ్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లు ఐటీ రూల్స్ (2021) నైతిక విలువలు(Code of Ethics) పాటించాల్సిందే. అలాగే చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘‘ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ఫిర్యాదులకు కఠిన చర్యలు తప్పవు. .. ఐటీ రూల్స్ లోని 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు మితిమీరి ఏ కంటెంట్‌ను ప్రసారం చేయొద్దు’’ అని కేంద్రం హెచ్చరించింది. అలాగే వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని, స్వీయనియంత్రణ కలిగి ఓటీటీలు నైతిక విలువలను పాటించాలని ఆదేశించింది. సంబంధిత శాఖ సలహాదారు కాంచన్ గుప్తా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు.Advisory to OTT platforms against nisitha, indecency and obscenity:Ministry of Information & Broadcasting has issued an advisory to online curated content publishers (OTT platforms) and self-regulatory Bodies of OTT platforms, to ensure strict adherence to India’s laws and the… pic.twitter.com/xMjddk9ns0— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) February 20, 2025ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటు పార్లమెంట్ లోనూ చర్చ జరగ్గా..అటు సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో యూట్యూబ్‌లాంటి ఫ్లాట్ఫారమ్లలో అభ్యంతరకర కంటెంట్‌పై నియంత్రణ ఉండాలంటూ సర్వోన్నత న్యాయస్థానం పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
CEC appointment hearing: వాయిదా కోరిన కేంద్రం.. సరికాదన్న పిటిషనర్ లాయర్
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌పై విచారణను వాయిదా వేయాలని కేంద్రం కోరింది. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం, ఆ స్థానంలో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర మంత్రిని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని జస్టిస్ సూర్యకాంత్,ఎన్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అత్యవసర విచారణ చేపట్టింది.అయితే విచారణ ప్రారంభమైన కాసేపటికే.. రాజ్యాంగ ధర్మాసనం ముందు తాను హాజరు కావాల్సి ఉందని చెబుతూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ వాయిదా వేయాలని కోరారు. అయితే ప్రతీ కేసు విచారణ వాయిదా కోరడం సరికాదని పిటిషనర్ అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్జీ కాకుంటే.. 17 మంది లా ఆఫీసర్లు ఉంటారని, అలాంటప్పుడు వాయిదా కోరడం సరికాదని అన్నారు. ఈ తరుణంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సోలిసిటర్ జనరల్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్పాలని ధర్మాసనం కోరింది.ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ.. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(Chief Election Commissioner)గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జాతి నిర్మాణానికి తొలి అడుగు ఓటు అని, ఎన్నికల సంఘం ఎప్పుడూ ఓటర్లకు మద్ధతుగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నూతన సీఈసీగా జ్ఞానేశ్వర్ ఎంపికపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా లు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించడం తెలిసిందే.వివాదం ఏంటంటే..2023లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం నియామకాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అందులో సీఈసీ, ఈసీల ఎంపిక కోసం ఏర్పాటు చేసే ప్యానెల్లో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలని పేర్కొంది. అంటే.. ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత, సీజేఐ ఆ ప్యానెల్లో ఉండాలి. కేంద్రం కొత్త చట్టం చేసేంత వరకు ఈ విధానం పాటించాలని స్పష్టం చేసింది. అయితే కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా సీజేఐని మినహాయించింది. సీజేఐ బదులుగా కేంద్ర మంత్రిని చేర్చింది. ఈ మేరకు 2023లోనే ఓ కొత్త చట్టం(Chief Election Commissioner and Other Election Commissioners Act, 2023) తీసుకొచ్చింది. అయితే కొత్త చట్టం ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని, ఈసీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యేలా ఉందని, అన్నింటికి మంచి అది ప్రజా స్వామ్యానికి ప్రమాదమని చెబుతూ పలువురు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాబట్టి సీజేఐనే కొనసాగించాలని కోరుతున్నారు. దీంతో సుప్రీం కోర్టు ఇవాళ ఈ అంశంపై అత్యవసర విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే.. మార్చి 15, 2024 కొత్త చట్టం ప్రకారం కేంద్రం చేపట్టిన ఈసీ నియామకాలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడం విశేషం. అయినప్పటికీ ప్రతిపక్షాలు సహా కొన్ని సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నాయి. -
ఢిల్లీలో భూకంపం
-
సిక్కుల ఊచకోత కేసులో దోషిగా మాజీ ఎంపీ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆయన్ని ఈ కేసులో దోషిగా ప్రకటించారు. అయితే శిక్ష ఖరారుపై వాదనలను మాత్రం ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేశారు. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేశారు కూడా. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ ఘటనను సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. ఈ క్రమంలో సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. అయితే.. సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని కోర్టు ఇవాళ్టి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది. ఈ తీర్పును ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) ప్రధాన కార్యదర్శి జగ్దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా సిట్‌ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఢిల్లీ కంటోన్మెంట్లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధా ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
ఉచితాలపై సుప్రీం కోర్టు సీరియస్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి:ఉచితాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయ పార్టీలు ప్రజలను పరాన్న జీవులుగా మార్చేస్తున్నాయని మండిపడింది.పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన ఓ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగష్టీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉచితాలపై వ్యాఖ్యానించింది. ఉచితంగా రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండా ప్రజలు ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంది.‘‘ఇలా అంటున్నందుకు క్షమించాలి. ఇలాంటి వ్యక్తులను(ఉచితాలను అందుకుంటున్న వాళ్లను) సమాజ పురోగతిలో భాగం చేయకుండా.. పరాన్నజీవుల తరగతిని మనం సృష్టించడం లేదా?. ఎన్నికల సమయంలో ఉచితాలను ప్రకటించడం వల్ల.. పని చేసేందుకు జనం ఇష్టపడడం లేదు. ఎలాంటి పనులు చేయకుండానే ఉచితంగా రేషన్ వాళ్లకు అందజేస్తున్నారు’’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.అయితే పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించే అంశం కేంద్రం పరిశీలనలో ఉందని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ అంశం పరిశీలనకు కేంద్రం ఎంత సమయం తీసుకుంటుందో వివరణ ఇవ్వాలని ఆటార్నీ జనరల్‌ను ఆదేశించిన బెంచ్.. పిటిషన్ విచారణను ఆరువారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ఉచితాల(freebies)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదేం కొత్త కాదు. కిందటి ఏడాది డిసెంబర్‌లోనూ ఇదే తరహాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో 81 కోట్ల మంది ఉచితంగా రేషన్, సబ్సిడీల కింద రేషన్ అందుకుంటున్నారనే విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ‘‘ఇలా ఎంత కాలం ఉచితాలు ఇస్తూ పోతారు? వాళ్లకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేమా?’’ అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆనాడు వ్యాఖ్యానించింది. ‘సుప్రీం’కే వెళ్లండి: ఢిల్లీ హైకోర్టుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఉచితాల హామీలు ఓటర్లపై గుప్పించాయి. అయితే ఇది అవినీతి చర్యల కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఓ పిటిషన్ వేశారు. అయితే బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది.ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. ఉచితాలు ప్రకటించడం అవినీతి కిందకే వస్తుందని మాజీ న్యాయమూర్తి ధింగ్రా తన పిటిషన్లో పేర్కొన్నారు. మూడు పార్టీలు పోటాపోటీగా ప్రజలకు లంచం ఎర వేశాయి. ఈ వ్యవహారంపై ఈసీని దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే అలాంటి ప్రకటనలు చేసిన వాళ్లు రాజ్యాంగం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. అదేవిధంగా.. ఓటర్ల వివరాలను సేకరించడం, వాటిని థర్డ్ పార్టీకి ఇవ్వడం అడ్డుకోవాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. అయితే.. పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. సుప్రీం కోర్టులో ఇదే తరహా పిటిషన్‌పై విచారణ జరుగుతున్నందున అక్కడికే వెళ్లాలని ఆయనకు సూచించింది. -
PPC: మోదీతో సందడి చేయనున్న సెలబ్రిటీలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’.. ఈ ఏడాది కొత్త ఫార్మాట్లో జరగనుంది. మోదీతో పాటు ఈసారి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే పరీక్షా పే చర్చ ఇప్పటికే ఏడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పిబ్రవరి 10వ తేదీన న్యూఢిల్లీలోని భారత మండపంలో 8వ ఎడిషన్ జరగనుంది. అయితే ఈ చర్చకు ప్రత్యేకత తీసుకురావాలని అధికారులకు మోదీ సూచించారు. ఈ క్రమంలోనే ప్రముఖులను చర్చలో భాగం చేయనున్నారు. ఆధ్యాత్మికవేత్త సద్గురు, నటి దీపికా పదుకొనే, మేరీ కోమ్, విక్రాంత్ మెస్సీ, భూమి ఫడ్నేకర్, అవనీ లేఖరా, రుజుతా దివేకర్, సోనాలి సభార్వల్, ఫుడ్‌ఫార్మర్, టెక్నికల్ గురూజీ, రాధికా గుప్తా.. ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతుల చదివే సుమారు 2,500 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మరోవైపు.. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే విద్యార్థులందరినీ పీపీసీ కిట్స్‌ను కేంద్ర విద్యా శాఖ అందించనుందని సమాచారం. అలాగే.. లెజెండరీ ఎగ్జామ్ వారియర్స్‌గా ఎంపిక చేసిన 10 మందికి ప్రధాని నివాసం సందర్శించే అవకాశం కల్పించనున్నారు. -
ఐదు ట్రాలీ బ్యాగుల్లో నీట్‌గా ఫారిన్ గంజాయి
న్యూఢిల్లీ: రాజధానిలో మరోసారి మత్తు దందా బయటపడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ముఠాకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్ చేసిన అధికారులు.. మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో గ్రీన్ చానెల్ దాటేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగుల నుంచి 94 ప్యాకెట్లలో నీట్‌గా ప్యాక్ చేసిన గంజాయి బయటపడింది. అది ఫారిన్ గంజాయి అని, దాని విలువ రూ.47 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఆ ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. -
ఢిల్లీ సీఎంపై కేసు నమోదు.. సీఈసీపై అతిషీ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ (Atishi Marlena)పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆమెపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో ఆమె మద్ధతుదారులపైనా మరో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ పరిణామాలతో ఆమె ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు అరవై మంది మద్ధతుదారులతో.. పది వాహనాల్లో ఆమె పతేహ్ సింగ్ మార్గ్‌కు వచ్చారు. అయితే ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా.. ఆమె నిరాకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదైంది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమే అని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో ఆమె మద్ధతుదారులపైనా మరో కేసు నమోదైంది. అయితే ఈ పరిణామంపై అతిషి ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ పోలీసులు అక్రమంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని, నిజంగా కోడ్‌ను ఉల్లంఘించిన వాళ్లను వదిలేశారని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌పైనా ఆరోపణలు గుప్పించారు.ఎన్నికల సంఘం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. రమేష బిధూరి కుటుంబ సభ్యులు బహిరంగంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. అయినా వాళ్ల మీద ఎలాంటి చర్యలు లేవు. అందుకు సంబంధించిన ఘటనపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశా. ప్రతిగా నా మీదే కేసు నమోదు చేశారు. రాజీవ్కుమార్గారూ.. ఎన్నికల ప్రక్రియను ఇంకెంత దిగజారుస్తారు? అంటూ సందేశం ఉంచారామె. ఇదిలా ఉంటే.. ఆప్ కన్వీనర్ సైతం సీఈసీ రాజీవ్‌కుమార్ మీద ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగాల్సి ఉంది.चुनाव आयोग भी ग़ज़ब है!रमेश बिधूड़ी जी के परिवार के सदस्य खुले-आम आचार संहिता का उल्लंघन कर रहे हैं। उन पर कोई एक्शन नहीं।मैंने शिकायत कर के पुलिस और @ECISVEEP को बुलाया, और इन्होंने मेरे ऊपर केस दर्ज कर दिया! राजीव कुमार जी: आप चुनावी प्रक्रिया कि कितनी धज्जियां उड़ायेंगे https://t.co/UlRiBzbELV— Atishi (@AtishiAAP) February 4, 2025 -
ఉత్తరాఖండ్ లో ఇవాల్టి నుంచే ఉమ్మడి పౌరస్మృతి అమలు
-
నేడు ఈసీ 75 ఏళ్ల వేడుకలు
-
ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్కౌంటర్
-
బుద్ధిమంతుడి ముసుగుతో అమ్మాయిలకు టోకరా
బుద్ధిమంతుడిలా నటించి.. డేటింగ్ ప్లాట్ఫామ్లో మోడల్‌నంటూ నమ్మించి వందల మంది యువతులను మోసగించిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తుషార్ సింగ్ బిష్ట్‌ను దిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 23 ఏళ్ల తుషార్ సింగ్ బిష్ట్‌ను ఢిల్లీ పోలీసులు తాజాగా తమ అదుపులోకి తీసుకున్నారు. తుషార్ బీబీఏ పూర్తి చేశాడు. గత మూడేళ్లుగా నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్‌గా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ డబ్బుపై దురాశతో సైబర్ నేరాలకు అలవాటుపడ్డాడు. ఓ యాప్ నుంచి వర్చువల్ ఇంటర్నేషనల్ మొబైల్ నంబరు కొనుగోలు చేసి డేటింగ్ యాప్ బంబుల్, సోషల్ మీడియా వేదిక స్నాప్‌చాట్‌లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ ఫొటోలు, స్టోరీలను తీసుకుని తన ప్రొఫైల్‌లో పోస్ట్ చేసేవాడు. అమెరికాలో తాను ఫ్రీలాన్స్ మోడల్‌గా పనిచేస్తున్నానని, త్వరలోనే భారత్ వస్తున్నానని నమ్మించి అనేకమంది యువతులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వారితో స్నేహం చేసి ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించాడు. కొంతకాలానికి ఆ వీడియోలతోనే వారిని బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు.గతేడాది డిసెంబరులో ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న ఓ యువతి తుషార్‌పై ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తులో అతగాడి మోసాల చిట్టా బయటకు వస్తోంది. 2024 జనవరిలో బంబుల్‌లో అతడితో పరిచయం అయినట్లు బాధిత యువతి తెలిపింది. ప్రేమ పేరుతో ప్రైవేటు వీడియోలు తీసుకొని, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది. వాటిని డార్క్‌వెబ్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించడంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మరిన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి.ఇప్పటిదాకా దాదాపు 700 మందికి పైగా అమ్మాయిలను అతడు వలలో వేసుకున్నట్లు గుర్తించారు. బంబుల్‌లో 500 మంది, స్నాప్‌చాట్‌లో 200 మంది యువతులతో స్నేహం చేసి వారి నుంచి డబ్బులు గుంజినట్లు తెలిపారు. అతడిని అరెస్టు చేసి ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
అన్నదాతలకు అండగా..
న్యూఢిల్లీ: రైతన్నలకు మరింత చేయూతనిచ్చేలా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. డై అమ్మోనియం ఫాస్ఫేట్(డీఏపీ)పై అదనపు రాయితీ గడువును పొడిగించింది. 50 కిలోల డీఏపీ ఎరువు రూ.1,350కి లభించనుంది. ఈ రాయితీ వల్ల ప్రభుత్వంపై రూ.3,850 కోట్ల భారం పడనుంది. వాస్తవానికి అదనపు రాయితీ గడువు గత ఏడాది డిసెంబర్ 31న ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. డీఏపీపై వన్–టైమ్ స్పెషల్ ప్యాకేజీని పొడిగించాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. జనవరి 1వ తేదీ నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఈ ప్యాకేజీ కింద టన్ను డీఏపీ రాయితీని రూ.3,500గా నిర్ణయించారు. గత ఏడాది ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 దాకా అమల్లో ఉంది. డీఏపీ ధరను నియంత్రించడానికి ప్రభుత్వం రూ.2,625 కోట్లు ఖర్చు చేసింది. ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా అదనపు రాయితీ గడువును మరోసారి పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. తక్కువ ధరలకే రైతులకు డీఏపీ అందించాలన్నదే లక్ష్యమని స్పష్టంచేసింది. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ మన దేశంలో 2024–25 రబీ, ఖరీఫ్ సీజన్లలో తగినంత డీఏపీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. రైతన్నలు 50 కిలోల డీఏపీని ఇకపై కూడా రూ.1,350కే కొనుగోలు చేయవచ్చని చెప్పారు. అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. డీఏపీపై వన్–టైమ్ స్పెషల్ ప్యాకేజీ రూ.3,850 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, యుద్ధాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. 2014 నుంచి 2024 దాకా ఎరువుల రాయితీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11.9 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 2004 నుంచి 2014 దాకా ఇచ్చిన దానికంటే(రూ.5.5 లక్షల కోట్లు) ఇది రెండు రెట్లు అధికం కావడం గమనార్హం. 28 గ్రేడ్ల ఫాస్ఫేటిక్ అండ్ పొటాసిక్ ఎరువులను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. రెండు పథకాలకు కేటాయింపులు పెంపు రెండు పంటల బీమా పథకాల గడువును కేంద్రం పొడిగించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్)ను మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగింది. రెండు బీమా పథకాల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 15వ ప్లానింగ్ కమిషన్ గడువు ప్రకారం 2025–26 వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ రెండు బీమా పథకాల అమలు కోసం ప్రత్యేకంగా ఫండ్ ఫర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ(ఎఫ్ఐఏటీ) పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం విశేషం. ఈ నిధికి ప్రభుత్వం రూ.824.77 కోట్లు కేటాయించింది. రెండు పథకాలకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అందుకే వీటికి నిధుల కేటాయింపులు పెంచుతున్నట్లు వివరించారు. పంటల బీమా పథకాల్లో పంటల నష్టం అంచనా, క్లెయిమ్ సెటిల్మెంట్ను వేగంగా పూర్తిచేయడానికి ఫండ్ ఫర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలసీల సంఖ్యలో పీఎంఎఫ్‌బీవై అనేది దేశంలో అతిపెద్ద బీమా పథకం. ప్రీమియంల విషయంలో మూడో అతిపెద్ద పథకం. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ అమలుకు 2020–21 నుంచి 2024–25 దాకా రూ.66,550 కోట్లు కేటాయించగా, 2021–22 నుంచి 20253–26 వరకు ఈ కేటాయింపులను రూ.69,515.71 కోట్లకు పెంచారు. #WATCH | Delhi | On PM Fasal Bima Yojana, Union Minister of Electronics & IT Ashwini Vaishnaw says, "Farmers will continue to get DAP at Rs 1,350 per 50 kg bag, which costs more than Rs 3,000 in other countries... This package will cost about Rs 3,850 crore... Since 2014, PM… pic.twitter.com/yUyKNBfxqf— ANI (@ANI) January 1, 2025 #WATCH | Delhi | On PM Fasal Bima Yojana, Union Minister of Electronics & IT Ashwini Vaishnaw says, "Rs 800 crore fund for innovation and technology has been created for faster assessment, faster claim settlement, and fewer disputes... To increase coverage and ease enrollment, PM… pic.twitter.com/DAJEGcgWm5— ANI (@ANI) January 1, 2025కొత్త సంవత్సరంలో తొలి నిర్ణయం రైతులకే అంకితం నూతన సంవత్సరంలో కేబినెట్ మొదటి సమావేశంలో తీసుకున్న మొదటి నిర్ణయాన్ని రైతు సోదరులకు, సోదరీమణులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘పంటల బీమా పథకాలకు నిధుల కేటాయింపులు పెంచాలన్న ప్రతిపాదనను కేబినెట్ సమావేశంలో ఆమోదించాం. దీనివల్ల పంటలకు మరింత భద్రత లభిస్తుంది. పంటలకు నష్టం వాటిల్లినా రైతులు దిగులు పడాల్సిన అవసరం ఉండదు. డీఏపీపై వన్–టైమ్ ప్రత్యేక ప్యాకేజీ గడువును పెంచడంతో తక్కువ ధరకే ఎరువు లభిస్తుంది’’ అని ప్రధానమంత్రి వివరించారు. -
ఆరెస్సెస్ చీఫ్‌పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య ఆగ్రహం
రాష్ట్రీయ స్వయంసేవక్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మందిర్-మసీద్ వివాదాలను ఉద్దేశించి భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భగవత్‌కు హిందువుల మనోభావాలపై పట్టింపు లేనట్లు ఉందని అన్నారాయన. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..‘‘అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. కానీ, సాధారణ హిందువులు అలా ఏనాడూ అనుకోరు. దేశంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఆయనకు(మోహన్ భగవత్‌కు) హిందువుల నొప్పేంటో పట్టన్నట్లు ఉంది. హిందువుల ప్రస్తుత దుస్థితి ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన మాటలతో ఆ విషయం స్పష్టమైంది’’ అని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు.భగవత్ ఏమన్నారంటే..ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పుణే(Pune)లో జరిగిన ‘ఇండియా ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇటీవల కాలంలో మందిర్-మసీద్ వివాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతిరోజూ కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించమంటారు?.. .. ఇది కొనసాగకూడదు. కలిసిమెలిసి ఎలా ఉంటామో భారత్ చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. దీనిలో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను వారే ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే. ఎవరి ఇష్టమైన భగవంతుడి ఆరాధనను వారు పాటించడమే ఈ దేశ ఆచారం. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరం. అలాగే.. కలుపుగోలు సమాజాన్ని మనకు మంచింది. మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. మేం హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్(Rama Krishna Mission) లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకొంటాం. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నాం. దీనిని మనం ప్రపంచానికి అందించాలనుకొంటే.. ఓ ఉదాహరణగా నిలవాలి’’ అని అన్నారు.👉ఇదిలా ఉంటే.. భగవత్ వ్యాఖ్యలపై జగద్గురు స్వామి రామభద్రచార్య సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవత్ తమ అనుచరుడి కాదని మండిపడ్డారు. ఆయన ఎంతోమంది భస్వాసురులను సృష్టించారని.. వాళ్లే ఆరెస్సెస్ నెత్తిన చెయ్యి పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 👉మరోవైపు.. రాజకీయంగానూ ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. సామరస్యం పాటించాలని భగవత్ బీజేపీనే కోరుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. యోగి ఆదిత్యానాథ్‌కు ఆయన(మోహన్ భగవత్) గనుక సూచిస్తే.. ఏ సర్వేలు. వివాదాలు ఉండవని అఖిలేష్ అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందిస్తూ.. మోహన్ భగవత్‌ది ద్వంద్వ ధోరణి అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ఈ పుణ్య క్షేత్రాల నగరం గురించి తెలుసా? -
‘EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?’
ఈవీఎంల వ్యవహారంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందా? అంటూ ప్రశ్నించింది. ఈవీఎంలతో ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీలు ‘న్యాయ’ పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలను) నిందించడాన్ని వదిలేసి ఫలితాలను అంగీకరించాలంటూ విపక్ష కూటమిలోని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాశంమైంది. అయితే..ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పార్టీ తరఫున సీనియర్ నేత మాణికం ఠాగూర్.. ‘‘సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన యూబీటీ.. ఇవన్నీ ఈవీఎంలకు వ్యతిరేకంగానే మాట్లాడాయి. ఒమర్ అబ్దుల్లా.. మీ తరఫున ఓసారి వాస్తవాల్ని పరిశీలించండి. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని స్పష్టంగా ప్రస్తావించింది. సీఎం అయ్యాక మా భాగస్వాముల ధోరణి ఎందుకు మారిందో? అని ప్రశ్నించారాయన. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై.. ఎంవీఏ కూటమి నుంచి పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఈవీఎంలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే ఇండియా కూటమిలో భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా మాత్రం ఈవీఎం అవకతవకలపై విరుద్ధంగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్ చేసి ఆయన మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. It’s the Samajwadi Party, NCP, and Shiv Sena UBT that have spoken against EVMs. Please check your facts, CM @OmarAbdullah. The Congress CWC resolution clearly addresses the ECI only. Why this approach to our partners after being CM? https://t.co/rr3mpyJqx8— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 16, 2024‘‘గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదు. వందమందికి పైగా సభ్యులు అదే ఈవీఎంలతో మీ పార్టీ(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) తరఫున నెగ్గినప్పుడు దానిని ఘన విజయంగా తీసుకున్నారు. కొన్ని నెలల తర్వాత మీరు అనుకున్న ఫలితాలు రాకపోయేసరికి ఈవీఎంలను నిందిస్తున్నారు. పక్షపాతంతో కాకుండా సిద్ధాంతాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా...ఓటింగు విధానంపై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే దానిపై పోరాటం చేయాలి. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదు. ఓటర్లు ఒకసారి మనల్ని ఎన్నుకుంటారు. మరోసారి ఎన్నుకోరు. నేనే దీనికి ఉదాహరణ. లోక్‌సభ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. సెప్టెంబరులో అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించాను. యంత్రాలను నేనెప్పుడూ ఆడిపోసుకోలేదు’’ అని అన్నారు. మొన్నటి జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసే పోటీ చేశాయి.ఇదీ చదవండి: ఆ కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చేశారు! -
ఆస్పత్రిలో అద్వానీ
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ(97) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఢిల్లీ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు ప్రకటించారు.ఇదిలా ఉంటే.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీ గతంలోనూ అస్వస్థతకు లోనయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది.. కొన్నిరోజులకే వెంటనే కోలుకున్నారు.BJP leader and Bharat Ratna LK Advani admitted to Apollo hospital in Delhi.— News Arena India (@NewsArenaIndia) December 14, 2024క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యాక అద్వానీ మీడియా ముందు కనిపించడం అరుదుగా మారింది. రామమందిర ప్రారంభానికి ఆహ్వానం అందినప్పటికీ.. వయసురిత్యా ఇబ్బందులతో ఆయన హాజరుకాలేకపోయారు. మొన్న.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తర్వాత ప్రధాని మోదీ కూడా అద్వానీ నివాసానికి వెళ్లారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మోదీ.. అద్వానీ ఆశీస్సులు తీసుకున్నారు.ఇదీ చదవండి: సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు -
క్రియాశీలకంగా లేని జన్‌ధన్ ఖాతాల్లో వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీవై)కింద దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో 54.03 కోట్ల ఖాతాలు తెరవగా ఇందులో సుమారు 11.30 కోట్ల ఖాతాలు క్రియాశీలకంగా లేవని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. లావాదేవీలు నెరపని ఈ అకౌంట్లలో ఈ ఏడాది నవంబర్ 20వ తేదీ నాటికి రూ.14,750 కోట్ల బ్యాలెన్సు ఉందని వివరించారు. 2017లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 39.62% వరకు ఉన్న జన్ ధన్ ఖాతాల సంఖ్య 2024 నవంబర్‌కు 20.91%కి పడిపోయాయన్నారు.రెండేళ్లపాటు ఎటువంటి లావాదేవీలు జరగని సేవింగ్/కరెంట్ ఖాతాలను ఆర్బీఐ క్రియాశీలకం కాని ఖాతాగా పరిగణిస్తుందన్నారు. ఖాతాలను క్రియాశీలకంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. క్రియాశీలకం కాని ఖాతాల సంఖ్యను తగ్గించుకోవాలని బ్యాంకులను కోరామన్నారు. ఎప్పటికప్పుడు కేవైసీ అప్‌గ్రేడేషన్, వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ వంటి వాటితో అకౌంట్లను క్రియాశీలకం చేయాలని సూచిస్తున్నామన్నారు.పీఎం–కిసాన్తో 2 కోట్ల ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) ద్వారా దేశవ్యాప్తంగా 2.04 కోట్ల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి చేకూరుతోందని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన పీఎం–కిసాన్ కింద ఇప్పటి వరకు 18 విడతలుగా రూ.3.46 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇటీవలి 18వ ఇన్స్టాల్మెంట్లో 9.58 కోట్ల మంది లబ్ధిదారులు కాగా, వీరిలో 1.16 కోట్ల మంది ఎస్సీ రైతులు, 88.34 లక్షల మంది ఎస్టీ రైతులు, ఇతర కేటగిరీలో 7.54 కోట్ల మంది రైతులు ఉన్నారని వివరించారు. పథకం కింద ఏటా రూ.6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోందంటూ ఆయన ఈ మొత్తాన్ని పెంచే యోచన లేదని వివరించారు.‘పీఎం విశ్వ కర్మ’ కింద రూ.1,751 కోట్ల రుణాలు పీఎం విశ్వకర్మ పథకం కింద అక్టోబర్ 31వ తేదీ నాటికి రూ.1,751 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభకు తెలిపారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, శిల్పి వృత్తులకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లోని నిపుణులు, పనివారికి సులభంగా రుణాలు అందేలా పలు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పథకం కింద ఈ వర్గం వారు మొత్తం 2.02 లక్షల బ్యాంకు అకౌంట్లు తెరిచారని చెప్పారు. 2023–24 నుంచి 2027–28 కాలానికి గాను కేంద్రం వీరికి ఈ పథకం కింద చేయూతనిచ్చేందుకు రూ.13 వేల కోట్లు కేటాయించింది. 18.74 కోట్ల రైతులకు పంట రుణాలు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా సుమారు 18.74 కోట్ల మంది రైతులు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. ఇందులో మొదటిస్థానంలో తమిళనాడు నిలిచిందని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రాంనాథ్ ఠాకూర్ మంగళవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రైతులకు వ్యవసాయ రుణాలతో బ్యాంకు ఖాతాలున్నాయని వివరించారు. చదవండి: ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదంతమిళనాడులో అత్యధికంగా 2.88 కోట్ల మంది రైతులు పొందగా, తర్వాతి స్థానంలో యూపీలోని 1.88 కోట్ల మంది, కర్ణాటకలో 1.62 కోట్ల మంది రుణాలు పొందారని తెలిపారు. 2019–2024 మధ్య కాలంలో కేంద్రం ఎటువంటి పంట రుణాలను మాఫీ చేయలేదని చెప్పారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతుల రుణాలను రద్దు చేశాయని మంత్రి పేర్కొన్నారు. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
-
కొలువుదీరిన మహా ప్రభుత్వం.. మంత్రి పదవులపై సస్పెన్స్
-
సంభాల్ అల్లర్ల వెనుక పాక్ ప్రమేయం?!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ అల్లర్ల అంశం యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే.. ఈ దాడులకు సంబంధించి షాకింగ్‌కు గురి చేసే విషయం ఒకటి ఫోరెన్సిక్ దర్యాప్తులో వెలుగు చూసింది. హింసకు ఉపయోగించిన ఆయుధాలపై మేడ్ ఇన్ పాక్ గుర్తులు బయటపడడంతో.. వీటి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ హింసాకాండలో పాకిస్తాన్‌కు చెందిన క్యాట్రిడ్జ్‌లు గుర్తించింది దర్యాప్తు బృందం(సిట్). నవంబర్ 24వ తేదీన కోట్ గర్వీ అల్లర్లు జరిగిన చోట.. ఐదు ఖాళీ షెల్స్, రెండు క్యాట్రిడ్జ్‌లను(మిస్ ఫైర్ అయినవే) ఫోరెన్సిక్స్ టీం సేకరించింది. అవి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తయారైనవేనని నిర్ధారణ అయ్యిందని ఏఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు. మరోవైపు.. పాక్‌కు చెందిన ఆయుధాల జాడ కనిపించడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోందని సంభల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ అంటున్నారు. అదే టైంలో.. ఈ హింసాకాండలో భాగమైన వాళ్ల కోసం గాలింపు ఉధృతం చేశామని వెల్లడించారాయన.ఘటనా స్థలంలో.. సుమారు 90 నిమిషాల పాటు ఫోరెన్సిక్ తనిఖీలు కొనసాగాయి. పాక్‌తో పాటు అమెరికాకు చెందిన క్యాట్రిడ్జ్‌లు లభ్యమయ్యాయి. అలాగే అల్లర్లకు ఉపయోగించిన మందు సామగ్రి పాకిస్తాన్లో తయారైనట్లు తేలింది. దీంతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు 12 బోర్ షెల్స్, రెండు 32 బోర్ షెల్స్ ఉన్నాయి. మరింత పరిశీలనకు.. మున్సిపల్ శాఖకు ఆ ప్రాంతంలో శుభ్రం చేయొద్దని సిట్ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు ముమ్మరం ద్వారానే పాక్ ప్రమేయంపై ఒక స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు. పొలిటికల్ హీట్ఘర్షణల దృష్ట్యా యూపీ సర్కార్ డిసెంబర్ 10వ తేదీ వరకు సంభాల్‌లో నిషేదాజ్ఞలు అమలు చేస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాకం గాంధీలు సంభాల్ పర్యటనకు వెళ్తుండగా.. ఘాజీపూర్ దగ్గర కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని ఇద్దరూ యూపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. వారు ఢిల్లీ వెళ్లకుండానే తిరిగి ప్రయాణమయ్యారు.ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో నవంబర్ చివరివారంలో హింసాకాండ చోటుచేసుకుంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదు ఉన్న ప్రాంతంలోనే ఆలయం ఉందని గతంలో హిందూ పిటిషనర్లు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై కోర్టు విచారించి సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సర్వే చేస్తున్న సమయంలో కొంతమంది అడ్డుకోవడంతో పాటు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల కేసుకు సంబంధించి.. 400 మందిని గుర్తించామని, ఇందులో 33 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. -
అలక వీడిన షిండే.. మహా సీఎంగా ఫడ్నవీస్
-
చండీగఢ్ లో ప్రధాని మోదీ పర్యటన
-
పెళ్లి కొడుక్కి ‘సినిమా చూపించిన మావా!’
మరికొద్ది గంటల్లో అక్కడ వివాహ మహోత్సవం జరగాల్సి ఉంది. పెళ్లి బాజాలతో అక్కడంతా కోలాహలం నెలకొంటుందని అనుకునేరు. బదులుగా.. పెండ్లి కొడుకు వీపు విమానం మోత మోగింది. అయితే.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. ఆ దాడిని ఆపారు. తన్నులు తిన్న ఆ యువకుడికి కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథనం చదివి తెలుసుకోండి..సోహన్‌లాల్ యాదవ్‌కు మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే సడన్‌గా అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈలోపు.. ఇదేం తెలియని పెళ్లి కూతురు తరఫువాళ్లు తమ ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. పెండ్లి టైం దగ్గర పడడంతో బాజాభజంత్రీలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కానీ, అక్కడి నుంచి సీన్ పీఎస్‌కు మారింది.పెళ్లి కొడుకు తరఫు వాళ్లు రాకపోవడంతో.. పెళ్లి కూతురు వాళ్లంతా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల జోక్యంతో.. అబ్బాయి తరఫు వాళ్లంతా వచ్చారు. చివరకు ఆ అమ్మాయితో వివాహానికి అబ్బాయి ఒప్పుకున్నాడు. అయితే.. అదేరోజు మరో ముహూర్తానికి వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఇంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడు రోజులపాటు కనిపించకుండా పోయిన ఆ యువకుడు.. మరో ఊరిలో ఇంకో అమ్మాయితో కలిసి ఉన్నాడని అమ్మాయి తరఫు వాళ్లకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులంతా అతన్ని చితకబాదారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆ దాడిని ఆపారు. ఆ యువకుడికి భోజనం పెట్టి మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకందామని చెప్పారు. అయితే.. ఇక్కడే ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.పెళ్లి కోసం తాము ఎంతో ఖర్చు చేశామని, ఆ డబ్బంతా ఇచ్చి కదలమని కండిషన్ పెట్టారు. దీంతో ఖంగుతినడం అతని వంతు అయ్యింది. ‘‘మేం ఇక్కడికి ఆలస్యంగా వచ్చాం. ఆ మాత్రం దానికే పెండ్లి రద్దు చేసుకున్నారు. పైగా పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇచ్చేదాకా నన్ను కదలనివ్వమంటున్నారు. అంతా చెప్తున్నట్లు నేనేం అదృశ్యం కాలేదు. పని మీద ఊరెళ్లా. నా ఫోన్ పని చేయకుండా పోయింది. బాగు చేసుకునేసరికి పోలీసులు రమ్మని పిలిచారు. పెళ్లికి నేను రెడీ, కానీ వాళ్లు సిద్ధంగా లేరు’’ అని పారిపోయే ప్రయత్నం చేసిన పెళ్లి కొడుకు మొబైల్ వీడియో సందేశం ఒకటి వైరల్ అయ్యింది. ఇక అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. 10 నెలల కిందట నా కూతురికి వివాహం నిశ్చయించా. పెండ్లి కొడుకుగా చేశాక.. అతను నాకు కారు కావాలనే డిమాండ్ చేశాడు. ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. ఆపై కారు వద్దు.. క్యాష్ కావాలన్నాడు. దానికీ మేం ఒప్పుకున్నాం. ఆ తర్వాతే అన్ని ఏర్పాట్లు చేశాం. పెండ్లి రోజు బంధువులంతా వచ్చినా.. పెండ్లి కొడుకు రాలేదు. చివరకు.. మా దగ్గరి బంధువును అక్కడికి పంపిస్తే అతను ఊర్లోనే లేడని సమాచారం ఇచ్చాడు. అందుకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లే సరికి పీఎస్‌లో ఆ యువకుడు కూడా ఉన్నాడు. వరకట్నం కేసు పెడతామని వాళ్లు హెచ్చరించారు. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ, మాకీ పెళ్లి ఇష్టం లేదు. అతను చేసిన మోసం ఇప్పుడే బయటపడింది. ఒకవేళ పెండ్లి తర్వాత బయటపడి ఉంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది. అందుకే పరిహారం చెల్లించమని కూర్చున్నాం. ఉత్తర ప్రదేశ్ అమేథీ పోలీసులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. अमेठी : दूल्हे राजा के इंतजार में दुल्हन के हाथों की मेहंदी हो गई फीकीकाफी इंतजार के बाद पुलिस के हस्तक्षेप पर सुबह पहुंची बारातसुबह बारात पहुंचने पर दुल्हन के घरवालों ने दूल्हे को बनाया बंधकशादी में हुए खर्च को लेकर अड़े दुल्हन के घर वाले@amethipolice @Uppolice #Amethi pic.twitter.com/VxYSFPcSUQ— Tasleem choudhary (JOURNALIST) (@tasleem7573) December 3, 2024 -
మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ!
-
మహారాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అలకపాన్పు !
-
‘ఆధారాల్లేకుండా అదానీపై కాంగ్రెస్ ఆరోపణలు’
న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంతో.. కాంగ్రెస్ కావాలనే రాజకీయం చేస్తోందని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు మహేష్ జెఠ్మలానీ అంటున్నారు.అదానీపై అమెరికాలో నమోదైంది అభియోగాలు మాత్రమే.. అవి రుజువు కాలేదని అన్నారాయన.ఛార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారాలు లేవు. అయినా కావాలనే కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది.అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ పనితీరు గురించి ట్రంప్ ఎప్పుడో చెప్పారు. యూఎస్ న్యాయశాఖ.. బైడెన్ కనుసన్నల్లో పని చేసే విభాగం. అంతర్జాతీయంగా వ్యాపారం నిర్వహిస్తున్న భారత కంపెనీల పై అమెరికాలో దాఖలైన అభియోగాలను గుడ్డిగా నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ, అభియోగ పత్రంలో లంచాలు ఇచ్చినట్లు ఆధారాల్లేవు.సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కేందుకు భారత అధికారులకు లంచాలకు కుట్ర చేశారనే ఆరోపణలకు ఆధారాలు ఎక్కడున్నాయి?. ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ ఆధారాలు చూపాలి. దీన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటోంది. మహారాష్ట్రలో ఓటమి తర్వాత ఈ అంశాన్ని డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, మణిపూర్ మినహా మిగిలిన అంశాలేవీ లేవా? అని ప్రశ్నించారాయన.The US indictment against #Adani is based on claims, not proven facts. There's no allegation of bribery in India, only a speculative charge of conspiracy to bribe. The case revolves around bond issuances by #AdaniGreenEnergy, where the DOJ infers without evidence that bondholders… pic.twitter.com/KsBAUwPbWl— Mahesh Jethmalani (@JethmalaniM) November 27, 2024 -
మహారాష్ట్ర సీఎంపై సస్పెన్స్ వీడనుందా!
-
కాంగ్రెస్ గ్యారెంటీలపై సొంత ఎమ్మెల్యే నుంచే వ్యతిరేకత!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేశారు. ఎన్నికల హామీల్లో కొన్నింటిని రద్దు చేయాలంటూ సదరు ఎమ్మెల్యే చేసిన బహిరంగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు.విజయనగర ఎమ్మెల్యే హెచఆర్ గవియప్ప.. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఎన్నికల హామీల వల్ల జనాలకు ఇళ్ల సదుపాయం కల్పించలేకపోతున్నామని, కాబట్టి వాటిలో కొన్నింటిని రద్దుచేయాలని సీఎం సిద్ధరామయ్యను పబ్లిక్‌గా కోరారాయన.ఉచిత పథకాల వల్ల ఇళ్ల నిర్మాణ పథకం సజావుగా ముందుకు సాగడం లేదు. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. రెండు నుంచి 3 గ్యారెంటీ స్కీంలను తీసేయాలని కోరుతున్నా. అవి లేకపోయినా పెద్దగా ఫర్వాలేదు. తద్వారా కొందరికైనా ఇళ్లను నిర్మించి ఇవ్వగలం. ఇక నిర్ణయం సీఎంకే వదిలేస్తున్నా. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారు.ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕರಿಂದಲೇ ವಿರೋಧ - ಒಂದೆರಡು ಗ್ಯಾರಂಟಿ ಸ್ಕೀಂ ತೆಗೆಯುವಂತೆ ಸಿಎಂಗೆ ಮನವಿ ಮಾಡ್ತೀವಿ ಎಂದ ಶಾಸಕ ಗವಿಯಪ್ಪ#CongressGuarantee #Congress #Gaviyappa #Bellary pic.twitter.com/3fsw27C1HD— soumya Sanatani (Modi Ka Parivar) (@NaikSoumya_) November 26, 2024అయితే .. ఎమ్మెల్యే వాదనను డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఎన్నికల హామీల అమలులో వెనకడుగు వేయబోయేది లేదని స్పష్టం చేశారాయన. ఆయన ఇలా చేయాల్సింది కాదు. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తాం. ఎలాంటి పథకాన్ని ఆపే ప్రసక్తే లేదు. మేం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన సహించేది లేదు అని శివకుమార్ పేర్కొన్నారు.గవియప్ప సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో తన నియోజకవర్గానికి నిధుల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపించారాయన. అయితే.. ఆ ఆరోపణలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సిరాజ్ షేక్ ఖండించారు. అంతేకాదు.. ఆరెస్సెస్‌తో ఉన్న అనుబంధమే గవియప్పతో అలా మాట్లాడిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు..
-
National : పార్లమెంట్లో 16 కీలక బిల్లులు
-
‘నా మేనకోడలిని కావాలని చంపలేదు’
ముంబై: మహారాష్ట్ర థానేలో దారుణం చోటు చేసుకుంది. మేనమామతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి చనిపోగా.. ఆ మరణాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని కాల్చేశాడా వ్యక్తి. మిస్సింగ్ కాస్త విషాదంతంగా ఈ కేసు మారిన వివరాల్లోకి వెళ్తే..థానే ఉల్లాస్‌నగర్‌లో ప్రేమ్‌నగర్ కాలనీకి చెందిన మూడేళ్ల బాలిక నవంబర్ 18వ తేదీ నుంచి కనిపించడం లేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. పోలీస్ ఇంటరాగేషన్‌లో ఆమె మేనమామ.. పొంతన లేని సమాధానాలిచ్చాడు. దీంతో తమ శైలిలో పోలీసులు విచారించగా.. అసలు విషయం చెప్పాడు. కావాలని తాను తన మేనకోడలిని చంపలేదని కన్నీరు పెట్టుకున్నాడతను. మేనకోడలితో ఆడుకుంటున్న టైంలో.. సరదాగా ఆమెను చెంప దెబ్బ కొట్టాడట. ఆ దెబ్బకు కిచెన్ శ్లాబ్‌కు తగిలి ఆమె కుప్పకూలిపోయి అక్కడికక్కడే చనిపోయిందట. ఆమె చనిపోవడంతో భయంతో శవాన్ని కాల్చేసి.. ఊరికి దూరంగా పొదల్లో పడేసినట్లు చెప్పాడు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిచ్చిన సమాచారంతో చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకి తరలించారు. -
ఎన్డీఏ వైపే సర్వేలు.. మహారాష్ట్ర, జార్ఖండ్ లో NDA కూటమిదే పైచేయి
-
UP Accident: ఘోర బస్సు ప్రమాదం
లక్నో: యూపీలో అర్ధరాత్రి యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించారు. 15 మందికి గాయాలు కాగా.. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.ఢిల్లీ నుంచి అజాంఘడ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు.. తప్పల్ వద్ద ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఢీ కొట్టింది. ఘటనలో ఐదుగురు చనిపోగా.. ఇందులో ఓ పసికందు, మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తుక్కుతుక్కు అయ్యింది. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతికష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రుల్ని జెవార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. यमुना एक्सप्रेस वे पर हुआ बड़ा हादसा, कांच से भरे ट्रक और वोल्वो बस में हुई टक्करअलीगढ़ : यमुना एक्सप्रेसवे पर वोल्वो बस और काँच से भरे ट्रक की हुई भिड़ंत, टप्पल के समीप हुआ हादसा। एक दर्जन से अधिक यात्रियों के घायल होने की सूचना। यात्रियों के बीच मची चीख पुकार। PS TAPPAL… pic.twitter.com/NlsQHitlJp— Praveen Vikram Singh (@praveen_singh5) November 20, 2024 -
Maharashtra Election: ఓటు వెయ్యడానికిబారులు తీరిన జనం
-
ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
మహారాష్ట్రలో ఉత్కంఠ రేపుతోన్న రాజకీయాలు
-
ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు..
-
పొలిటికల్ ట్విస్టులతో దద్దరిల్లిపోతున్న మహారాష్ట్ర
-
యూపీలో ఘోర అగ్ని ప్రమాదం
-
వాయు కాలుష్యం.. పాఠశాలలు బంద్
-
బీజేపీకి ఝలక్.. ఢిల్లీ మేయర్ పీఠం ఆప్ కైవసం
-
కాలుష్య కోరల్లో దేశ రాజధాని..
-
ప్రశాంతంగా ముగిసిన ఝార్కండ్ తొలి విడత ఎన్నికలు
-
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం.. తొలి రోజే ఆర్టికల్ 370 రగడ
-
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లో భారీ ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్ సండే మార్కెట్లోని టూరిస్ట్ సెంటర్ ఆఫీస్(TRC)పై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. శ్రీ నగర్ నగరానికి గుండెకాయగా చెప్పుకునే లాల్ చౌక్‌ను ఆనుకున్న రోడ్డులోనే సండే మార్కెట్ పేరిట వారాంతపు సంత నిర్వహిస్తారు. మార్కెట్ కారణంగా టీఆర్సీ గ్రౌండ్లో విపరీతమైన జన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు చేర్చాయి. ప్రస్తుతం అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. లష్కరే తాయిబా గ్రూప్‌కు చెందిన టాప్ కమాండర్ ఒకరిని.. ఖన్యార్ ప్రాంతంలో భారత సైన్యం మట్టుపెట్టింది. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. #BREAKINGGrenade attack in Srinagar's busy Sunday market injures 5 civiliansIncident occurred near the heavily-guarded Tourist Reception Centre (TRC)Comes a day after security forces neutralized top Lashkar-e-Taiba commander in downtown #Srinagar. Security forces on site… pic.twitter.com/iaWl1NJNL9— Nabila Jamal (@nabilajamal_) November 3, 2024ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అక్కడ వరుసగా ఉగ్రవాద కదలికలు పెరిగాయి. గత వారం రోజులుగా మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. అంతకు ముందు నుంచే సైనిక వాహనాలపైనా దాడులు జరుగుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ కట్టుదిట్టం చేశాయి. ఒకవైపు సైనికులు.. మరోవైపు అమాయక ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వరుస ఉగ్రదాడి ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు దురదృష్టకరమని , సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా లోపం లేదని.. ఉగ్రవాదులకు భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని చెప్పారు.ఇదీ చదవండి: కశ్మీర్ ఓటమి.. కమలం పార్టీ కీలక నిర్ణయం -
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
-
జనగణన వచ్చే ఏడాదే షురూ!. కేంద్రం కీలక నిర్ణయం. 2026 నాటికి ప్రక్రియ పూర్తి. తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన?
-
విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..
-
ఇకపై సుప్రీంకోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం
-
కాలుష్య కోరల్లో యమునా నది
-
మహా సంగ్రామంలో విజేతగా నిలిచేదెవరు ?
-
అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 8 బోగీలు
-
మరో అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు
-
J&K: ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
-
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
పశ్చిమ బెంగాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసిన జూనియర్ డాక్టర్లు
-
ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ దారుణహత్య
-
తమిళనాడులో గూడ్స్ రైలును ఢీ కొన్న మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్... రెండు బోగీల్లో మంటలు... పట్టాలు తప్పిన 13 కోచ్‌లు.. ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
-
హర్యానాలో హ్యాట్రిక్ విజయం దిశగా బీజేపీ
-
Watch Live: హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు
-
అమిత్ షా అధ్యతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం
-
హర్యానాలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ ప్రారంభం..
-
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
-
అలాంటి వాళ్లకు అదే సరైన శిక్ష: గడ్కరీ
గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మన దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. చాక్లెట్లు తిని దాని రేపర్లు రోడ్లపైనే పడేస్తుంటారు. ఇదే వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు చాక్లెట్ కాగితాలు జేబులో పెట్టుకుని హుందాగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ మాత్రం రోడ్లపై పడేస్తుంటారు అని చురకలంటించారాయన. అలాగే.. గుట్కాలు తిని రోడ్ల మీద ఉమ్మేసే వాళ్లను కట్టబడి చేయడానికి కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ ఓ చక్కటి ఐడియా ఇచ్చారు. పాన్ మసాలా, గుట్కాలు తిని రోడ్లమీద ఉమ్ములు వేసే వాళ్ల ఫోటోలు తీసి వార్తాపత్రికల్లో ప్రచురించాలి అని సూచించారాయన. ఇది సోషల్ మీడియాకు ఎక్కడంతో సూపర్ ఐడియా కేంద్ర మంత్రిగారూ అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. నేను మారిపోయాను అప్పట్లో తాను కూడా చాక్లెట్ పేపర్లు బయటకు విసిరేసే వాడినని, అయితే ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకున్నానని గడ్కరీ చెప్పారు. ఇప్పుడు తాను చాక్లెట్లు తింటే గనుక ఆ రేపర్‌ను ఇంటికి వచ్చాక పారేస్తుంటానని చెప్పారు. -
ఢిల్లీ రాజ్ ఘాట్ లో గాంధీ జయంతి వేడుకలు
-
ముంబైలో హై అలర్ట్..
-
జమ్మూ కాశ్మీర్ లో రెండో దశ పోలింగ్..
-
చెట్టును ఢీ కొట్టిన వ్యాన్.. ఆరుగురి దుర్మరణం
చెన్నై: తమిళనాడులో ఈ వేకువఝామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్ చెట్టును ఢీకొట్టి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్లకురిచి జిల్లా ఉలుందూర్పేట రహదారిపై మెట్టాథూర్ వద్ద ఈ వేకువజామున ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. యాక్సిడెంట్ తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో.. పోలీసులు క్లియర్ చేశారు.వ్యాన్‌లోని ప్రయాణికులు తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియరావాల్సి ఉంది. Six, including a woman, were killed in a road accident at Mettathur near #Ulundurpet, #Kallakurichi district, in the early hours of Wednesday. Seventeen others were injured and hospitalized. @NewIndianXpress @xpresstn pic.twitter.com/AswLMstNQw— Bagalavan Perier B (@Bagalavan_TNIE) September 25, 2024 -
బద్లాపూర్ నిందితుడు హతం: ఎన్కౌంటర్ వెనక కుట్ర?
ముంబై: మహారాష్ట్రలోని ‘బద్లాపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్ తీవ్ర దుమారం రేపుతోంది. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అక్షయ్‌ను.. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌పై అతని తల్లి స్పందించారు. అక్షయ్‌ని చంపడానికి పోలీసులు చెప్పిన కారణాలను తోసిపుచ్చారామె. ఈ కేసులో పెద్ద కుట్రలో భాగంగా తన కుమారుడుని పోలీసులు హత్య చేసినట్లు ఆరోపించారు. ‘‘నా బిడ్డ అక్షయ్ షిండే హత్య పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర. పోలీసులే నా బిడ్డను హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని కూడా విచారించాలి. విచారణ జరిపి దోషులకు శిక్ష పడుతుందని హామీ ఇచ్చే వరకు నా కుమారుడి మృతదేహాన్ని తీసుకోవడానికి మేము అంగీకరించము’ అని అన్నారామె.#BadlapurSchoolSexualAssaultCase: Accused Shot Dead In Police Custody, Mother Alleges Conspiracy#DNAVideos For more videos, click here https://t.co/6ddeGFqM3o pic.twitter.com/2urBcFH6cY— DNA (@dna) September 24, 2024 క్రెడిట్స్: DNA (@dna)ఈ ఎన్కౌంటర్ ఘటన మహారాష్ట్రలో రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నమే నిందితుడిని ఎన్కౌంటర్ చేయించటమని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. ‘‘పోలీసులు అక్షయ్ షిండేను తీసుకువెళ్లే సమయంలో అతని చేతులు కట్టేయలేదా? అనికి తుపాకీని ఎలా లభించింది. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు?. ఈ కేసులో స్కూల్ మేనేజ్మెంట్పై ఎటువంటి చర్యలు లేవు. కానీ అరెస్టు చేసిన నిందితుడిని మాత్రం ఆత్మ రక్షణ పేరుతో అనుమానాస్పద ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. మాకు బద్లాపూర్ పోలీసులపై నమ్మకం లేదు. ఈ ఘటపై జ్యుడిషియల్ విచారణకు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని తీసుకువెళ్తున్న సమయంలో హోం శాఖ చూపిన నిర్లక్ష్యం సందేహాస్పదంగా ఉంది. ప్రభుత్వం బలహీనంగా మారినట్లు కనిపిస్తోంది’ అని ఎన్సీపి(ఎస్పీ) చెందిన ఓ నేత రాష్ట్ర హోం శాఖపై విమర్శలు గుప్పించారు.అయితే.. ప్రతిక్షాల ఆరోపణలపై సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ పథకం విజయవంతం చేసింది. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రతిపక్షంలో ఉన్న మూడు పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయని అన్నారు.చదవండి: పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘బద్లాపూర్’ రేప్ నిందితుడి మృతి -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు
-
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశి... మరో ఐదుగురు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేటి నుంచి మావోయిస్టు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాలు
-
వారెవ్వా.. నీళ్లలో తేలియాడే రెస్టారెంట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గోరఖ్‌పూర్‌లోని పర్యాటక ప్రాంతం రామ్‌గఢ్ తాల్ సరస్సులో తేలియాడే రెస్టారెంట్ ఇది. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ రెస్టారెంట్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రారంభించారు. महायोगी गुरु श्री गोरखनाथ जी की तपोस्थली गोरखपुर में आज रामगढ़ताल में फ्लोटिंग रेस्टोरेंट के लोकार्पण तथा ग्रीनवुड अपार्टमेंट आवासीय परियोजना के आवंटियों को प्रमाण-पत्र वितरण हेतु आयोजित कार्यक्रम में सम्मिलित हुआ।रामगढ़ताल क्षेत्र देश-दुनिया के पर्यटकों को आकर्षित करने के साथ… pic.twitter.com/eDEErOF6Nm— Yogi Adityanath (@myogiadityanath) September 19, 2024 -
యాక్సిడెంట్ నిందితునికి అరగంటలోనే బెయిల్..!
ఢిల్లీ: దేశ రాజధాని రీజియన్‌లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు ఓ నిండు ప్రాణం బలైంది. అతివేగంగా రాంగ్రూట్లో వచ్చి ఓ యువ బైకర్‌ను ఢీ కొట్టడంతో స్పాట్లోనే అతను చనిపోయాడు. అయితే ఈ కేసులో గురుగావ్ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్వారకాకు చెందిన 23 ఏళ్ల అక్షత్ గార్గ్.. తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం డీఎల్ఎఫ్ ఫేజ్ 2 గోల్ఫ్ కోర్స్ రోడ్లో వెళ్తున్నాడు. ఆ టైంలో హఠాత్తుగా రాంగ్రూట్లో వచ్చిన ఓ మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనం అతని బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ ఎగిరి కాస్త దూరంలో పడింది. ఆ ప్రమాదం తర్వాత అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 24 గంటలు గడవక ముందే బెయిల్ మీద రిలీజ్ చేశారు.అక్షత్ స్నేహితుడి బైక్‌కు ఉన్న గోప్రో యాక్షన్ కెమెరా ద్వారా యాక్సిడెంట్ రికార్డయ్యింది. అయితే పోలీసులు ఆ వీడియోను సాక్ష్యంగా పరిగణించబోమని చెప్పారని, నిందితుడిని అరగంటలోనే బయటకు పంపించేశారని అక్షత్ స్నేహితుడు వాపోయాడు. విషయం బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. బెయిల్ రద్దు చేసి కేసు విచారణ చేపడతామని గురుగావ్ పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో #JusticeforAkshat ట్రెండ్ నడుస్తోందిShocking Car-Bike Collision in Gurgaon, accused released on bail same day! Car driving on wrong side of Gurgaon Golf Course road DLF Phase-II rammed into a bike killing the rider Akshat Garg on the spot. Accused driver Kuldeep Thakur who was in the SUV with a BJP sticker on it… pic.twitter.com/qUETDrAZ1C— Nabila Jamal (@nabilajamal_) September 19, 2024 -
జమ్మూ కశ్మీర్ లో ప్రారంభమైన తొలి విడత పోలింగ్
-
సెబీ చీఫ్ వ్యవహారంపై స్పందించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: సెబీ చైర్పర్సన్ మాధవీ పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తమను తాము సమర్థించుకుంటున్నారని, కాంగ్రెస్ ఆరోపణలకు విరుద్ధమైన వాస్తవాలను బయటపెడుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.సెబీ చైర్పర్సన్ మాధబి పురి బచ్ దంపతుల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి స్పందించారు. మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ తమను తాము రక్షించుకొంటూనే, తమపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా స్పందిస్తున్నారన్నారు.‘చాలా ఆరోపణలకు సమాధానాలు వస్తున్నాయ్. ఈ నిజాలను వాళ్లు(పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) పరిగణనలోకి తీసుకుంటారనే అనుకుంటున్నాను’ అని ఆమె అన్నారు. ‘మాధబి పురి బచ్ సమాధానాలపట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా?’ అనే మరో ప్రశ్నకు.. ‘నేనిక్కడ ఉన్నది అది తప్పో, ఒప్పో నిర్ధారించేందుకు కాదు’ అని నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.బచ్ దంపతులు అక్రమాలకు పాల్పడ్డారని, లాభాపేక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. అదానీ వ్యవహారంలో బచ్ అవినీతికి దిగారని హిండెన్‌బర్గ్ ఆరోపించినదీ తెలిసిందే.ఇదీ చదవండి: సెబీ పనితీరును సమీక్షిస్తాం: PAC -
వంట నూనెల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కాం కేసులో.. ఇవాళ సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కడంతో ఆప్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. భారీగా తీహార్ జైలు వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. వాళ్లకు అభివాదం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘వర్షంలోనూ నా కోసం ఎదురు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నన్ను జైల్లో బంధించి నా మనోస్థైర్యం దెబ్బ తీయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు నా బలం, నాలో ధైర్యం వంద రేట్లు పెరిగింది’’ ఆయన పేర్కొన్నారు. నేను నిజాయితీపరుడిని కాబట్టే దేవుడు నాకు మద్దతుగా నిలిచాడునన్ను జైల్లో వేస్తే బలహీనపడతానని అనుకున్నారుజైలు గోడలు నన్ను బలహీనపర్చలేవు దేశాన్ని అమ్మే.. విచ్ఛిన్నం శక్తులకు వ్యతిరేకంగా పోరాడతాదేశానికి నా సేవ కొనసాగిస్తాకేజ్రీవాల్కు స్వాగతం పలికిన వాళ్లలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, మంత్రి అతీషి, సీనియర్ నేత మనీష్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. తదితరులు ఉన్నారు. #WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal greets party workers and leaders outside Tihar Jail in DelhiThe Supreme Court granted him bail in the Delhi excise policy case today pic.twitter.com/Ydwlmu6CLN— ANI (@ANI) September 13, 2024 లిక్కర్ స్కాం కేసులో.. మనీలాండరింగ్ అభియోగాలపై ఈ ఏడాది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు.ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు.ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు దిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.అయితే.. దీనిపై ఈడీ (ED) అభ్యంతరం వ్యక్తంచేయడంతో మరుసటి రోజే దిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.అనంతరం జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జులైలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఇక.. ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ.. ఆయన సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది.దాదాపు ఆరు నెలలపాటు లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్.. ఎట్టకేలకు బయటకు వచ్చారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్
-
భారతీయ మేధా శిఖరం!
యాభై ఐదు సంవత్సరాల నాటి మాట. 1969 మేలో పూనా–బొంబాయి మధ్యగల లోనావాలా అనే హిల్ స్టేషన్లో లెస్లీ సాక్నీ ప్రజాస్వామ్య శిక్షణ శిబిరంలో ఓ పది, పధ్నాలుగు రోజులున్నాను. ఎమ్.ఆర్. మసానీ ఆ శిబిరానికి ప్రారంభోపన్యాసం చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ఆచార్యులు ఎస్.పి. అయ్యర్ ప్రిన్సి పాల్గా తరగతులు నిర్వహించారు. నానీ పాల్కీవాలా ఆ సంస్థ అధ్యక్షులు. సోలీ సొరాబ్జీ, రజనీ పటేల్, వి.బి. కార్నిక్, వి.వి. జీన్, అరవింద్ దేశ్‌పాండే, రాము పండిట్, ఫెడీ మెహతా, ఎస్.వి. రాజు వంటి వారు వివిధ అంశాలపై శిక్షణ గరిపారు.వారిలో ఎ.జి. నూరానీ కూడా ఉన్నారు. ఆయన అప్పటికే ఒక దశాబ్ద కాలంగా వివిధ అంశాలపై పూంఖానుపుంఖాలుగా వివిధ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ఇండి యన్ ఎక్స్‌ప్రెస్, హిందూ, స్టేట్స్‌మన్ వంటి స్వదేశీ పత్రికలకే గాక, పాకి స్తాన్‌లోని ‘డాన్’ పత్రికలో కూడా వారి రచనలు ప్రచురితమవుతుండేవి. ఆ తదుపరి ఫ్రంట్‌లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి వాటికి కూడా రాసేవారు. జాకీర్ హుస్సేన్, బొంబాయి హైకోర్టులో మొట్టమొదటి భార తీయ వకీలు బద్రుద్దీన్ త్యాబ్జీ జీవిత చరిత్రలను ప్రచురించారు. కశ్మీర్ సమస్య, బాబ్రీ మసీదు, ఆర్టి కల్–370, లద్దాఖ్, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ పాత్ర, పౌరహక్కులు, భగత్ సింగ్‌పై విచారణ, సావర్కర్, హైదరాబాదు డిమాలిషన్ వంటి భిన్న విభిన్న అంశాలపై రచనలు చేశారు.తదాదిగా బొంబాయిలోగానీ, ఢిల్లీలోగానీ నూరానీని కలుసుకొనే అవకాశం దొరికేది. దక్షిణ బొంబాయిలో వీలు దొరికినప్పుడల్లా ఆయననను కలిసేవాడిని. ఎం.ఆర్. మసానీ అక్కడే బీచ్కాండీలో ఉండేవారు. నూరానీ నేపియన్ సీ అపార్టుమెంట్స్‌లో ఉండేవారు. అవి రెండూ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండేవి. దానితో మసానీ దగ్గరకెళ్లినప్పుడు విధిగా నూరానీని కూడా కలిసేవాడిని. నూరానీ బల్ల కుర్చీమీద కాకుండా, మంచంమీద కూర్చుని రాసేవారు. చుట్టూ అప్పడాలు ఆరబోసినట్లు లెక్కకు మించిన పుస్తకాలు తెరిచి, తిరగేసి ఉండేవి. ఏదైనా అంశంపై చర్చిస్తుండగా, ఎదురుగా ఉన్న పుస్తకాల్లో ఫలానా పుస్తకం తీసి ఫలానా చాప్టర్ చదవమనేవాడు.తాను చెప్పిన దానిని, వివరంగా అర్థం చేసుకోవడానికి ఉదయం చదివిన పత్రికలలో అవసరమయిన అంశాలను కత్తిరించి, అంశాల వారీగా ఫైల్ చేసేవారు. కొన్ని వందలు, వేల ఫైళ్ళు అలా ఉన్నాయి. ఏ అంశంమీద రాసినా, లోతైన పరిశోధన చేసేవారు. వాజ్‌పేయి–ముషారఫ్‌ల మధ్య ఆగ్రాలో జరిగిన చర్చలపై రాసే దానికి, పూర్తి సమాచారం రాబట్టడానికై, పనిగట్టుకొని ఇస్లామాబాద్ వెళ్లి పరిశోధన గావించారు. క్రీ.శ. 1775–1947ల మధ్య జరిగిన రాజకీయ ప్రేరిత విచారణలపై సమగ్ర పరిశోధన చేసి గ్రంథస్థం గావించారు. ‘జిన్నా–తిలక్ – కామ్రేడ్స్ ఆఫ్ ఫ్రీడం స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. అయితే ఏది ఎలా ఉన్నా ఎవరిమీదా వ్యక్తిగతంగా విమర్శ చేసేవారు కాదు. ‘రాజాజీ – అంకి తమైన, నిబద్ధతగల హిందువు, మహో న్నతమైన భారతీయుడు, అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు అలు పెరుగని రక్షకుడు’ అని కొనియాడారు. షేక్ అబ్దుల్లా, కరుణానిధిల తరఫున సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టులలో వకీలుగా తన వాదనలను వినిపించారు.నూరానీకి కొన్ని నిర్దిష్టమయిన, చిత్ర–విచిత్రమయిన అభిరుచులు ఉండేవి. ఢిల్లీ వస్తే ఇండియా ఇంటర్నేష నల్ సెంటర్లో 38వ నంబరు గదిలోనే మకాం. ఓల్డ్ ఢిల్లీ, నిజాముద్దీన్, కరోల్ బాగ్, జామా మసీదు వంటి చోటసందులు – గొందులలోని హోటళ్లలో కబాబ్–కుర్మా ఎక్కడ దొరుకు తుందోనని శోధించి, ఆస్వాదించేవారు. గత నెలాఖరులో తన 94వ ఏట కన్నుమూసిన అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ సేకరించిన వేలాది పుస్తకాలు, పేపర్ క్లిప్పింగ్‌లు ఏమవుతాయో? ఏదైనా జాతీయ స్థాయిలో నున్న గ్రంథాలయం గానీ, పరిశోధనా సంస్థలు, లేక జాతీయ పత్రికలు భద్రపరిచి, సద్వినియోగం గావించడం అవసరం. అవి భావి తరాలకు ప్రజాసేవా రంగాలలో, పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టే యువతరానికి ఉపయుక్తం కాగలవు. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు, 98663 76735 -
ఉత్తరప్రదేశ్ లో ఆగని తోడేళ్ల దాడులు
-
రక్తం మరిగిన తోడేళ్లు.. కనిపిస్తే కాల్చివేత!
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్ల భయోత్పాతం కొనసాగుతూనే ఉంది. తాజాగా హర్ది ప్రాంతంలో అవి ఓ పసికందును పొట్టన పెట్టుకున్నాయి. ఇద్దరు వృద్ధురాళ్లపై దాడి చేసి గాయపరిచాయి. దాంతో గత రెండు నెలల్లో తోడేళ్లకు బలైన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఎనిమిది మంది చిన్నారులే! 34 మంది గాయపడ్డారు. ఆరు తోడేళ్లలో నాలుగింటిని పట్టుకోగా రెండు మాత్రం నిత్యం అధికారులకు చుక్కలు చూపుతున్నాయి. ఆవాసాలు మారుస్తూ, రోజుకో గ్రామాన్ని లక్ష్యం చేసుకుంటూ తప్పించుకుంటున్నాయి. తప్పనిసరైతే వాటిని కాల్చివేయాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశాలిచ్చారు. దాంతో ట్రాంక్విలైజర్లతో షూటర్లను రంగంలోకి దించారు. తోడేళ్లను గుర్తించి పట్టుకునేందుకు, వీలవని పక్షంలో మట్టుపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ‘ఆపరేషన్ భేడియా’కీలక దశకు చేరిందని బహ్రయిచ్ డీఎఫ్‌వో అజీత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్ల పీడ విరగడయ్యేదాకా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.బహ్రయిచ్‌లో మంగళవారం తెల్లవారుజాము 3.35గంటలకు మహసీ సబ్ డివిజన్లోని నౌవన్ గరేతి గ్రామంలో తోడేలు ఓ ఇంట్లో దూరి అంజలి అనే రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లింది. షాక్‌కు గురైన తల్లి అరిచేలోపే పాపను నోట కరుచుని పారిపోయింది. రెండు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో చేతుల్లేకుండా చిన్నారి మృతదేహం దొరికింది. అనంతరం ఉదయాన్నే అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని కొటియా గ్రామంలో వరండాలో నిద్రిస్తున్న కమలాదేవి (70) అనే వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. ఆమె అరుపులతో కుటు ంబీకులు అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో అరగంట తరువాత మూడో దాడిలో సుమన్ దేవి (65) అనే మరో వృద్ధురాలు గాయపడింది. సోమవారం రాత్రి పండోహియా గ్రామంలో తోడేళ్ల దాడిలో గాయపడ్డ అఫ్సానా అనే ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి హర్ది దర్హియా గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై తోడేలు దాడి చేసింది. మెడను కరిచి లాక్కెళ్లబోయింది. తో డేలుతో తల్లి ధైర్యంగా పోరాడి తన బాబును కాపాడుకోగలిగింది. అదే రాత్రి మరో 50 ఏళ్ల వ్యక్తిపైనా తోడేలు దాడి జరిగింది.శ్మశాన నిశ్శబ్దం... తోడేళ్ల దెబ్బకు బహ్రయిచ్‌లో మార్కెట్లు మూతపడ్డాయి. వీధులు పగలు కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మహసీ సబ్ డివిజన్లోనైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభావిత సీతాపూర్, లఖింపూర్ ఖేరి, పిలిభీత్, బిజ్నోర్ డివిజన్లలోనూ తోడేళ్ల భయం నెలకొని ఉంది. ఆ ప్రంతాలకు అదనపు ఫారెస్ట్ గార్డులు, ట్రాప్ బృందాలను పంపుతున్నారు. తోడేళ్లు నిత్యం తమ ఆవాసాలను మారుస్తుండటంతో పట్టుకోవడం కష్టమవుతోందని జిల్లా మేజి్రస్టేట్ మోనికా రాణి తెలిపారు. ‘‘అవి తెలివిగా ప్రతిసారీ కొత్త గ్రామా న్ని లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా నాలుగింటిని పట్టుకున్నాం. ఇంకో రెండు దొరకాల్సి ఉంది’’అన్నారు. తమ బృందం నిరంతరం గస్తీ కాస్తోందని, వాటినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (సెంట్రల్ జోన్) రేణుసింగ్ చెప్పారు. పిల్లలను ఇళ్ల లోపలే ఉంచాలని, రాత్రిపూట తలుపులకు తాళం వేసుకోవాలని అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.వీడియో ఆధారాలడిగారు...తోడేళ్లు తమ ఇళ్ల పక్కనే కనిపిస్తూ వణికిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ అధికారులకు చెబితే వీడియో ఆధారాలు అడుగుతున్నారని మండిపడుతున్నారు. ‘‘మా ఇంటి పక్కన తోడేలు కనిపిస్తే కుక్కనుకొని తరిమికొట్టాం. పొలాల వైపు పరుగెత్తడంతో తోడేలని గుర్తించాం. దాంతో పిల్లలంతా క్షేమంగా ఉన్నారా, లేరా అని చూసుకున్నాం. అంజలి తోడేలు బారిన పడిందని తేలింది’’అని నౌవన్ గరేతికి చెందిన బాల్కే రామ్ వెల్లడించారు. -
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు..?
-
భారత్ అమ్ముల పొదిలో ‘అరిఘాత్’
సాక్షి, విశాఖపట్నం: భారత్ అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి ‘అరిఘాత్’చేరింది. అరిహంత్ క్లాస్‌లో రెండోదైన ఈ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్‌ను విశాఖ నేవల్ డాక్‌యార్డులో గురువారం జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన త్రివిధ దళాలు అణుశక్తిని సముపార్జించుకుని మరింత బలోపేతమయ్యాయని తెలిపారు. అణుత్రయాన్ని బలోపేతం చేసుకుంటూ వ్యూహాత్మక సమతుల్యత, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో భారత్ కీలకంగా మారుతోందన్నారు.దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని, సైనికులకు అత్యాధునిక, నాణ్యమైన ఆయుధాలు, మౌలిక సదుపాయాలు, ఇతర పరికరాల్ని సమకూర్చేందుకు మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని చెప్పారు. దేశాన్ని అగ్ర రాజ్యాలతో సమానంగా నిలబెట్టిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ సంకల్పాన్ని దేశం ఎప్పటికీ మరవదన్నారు. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ సహా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.అరిఘాత్ ప్రత్యేకతలు..పొడవు: 111.6 మీటర్లు వెడల్పు: 11 మీటర్లు డ్రాఫ్ట్: 9.5 మీటర్లు బరువు: 6,000 టన్నులు సామర్థ్యం: ఉపరితలంలో గంటకు 22–24 కి.మీ. (12–15 నాటికల్ మైళ్లు).. సాగర గర్భంలో గంటకు 24 నాటికల్ మైళ్లు నిర్మాణం: విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ సెన్సార్ సిస్టమ్, ఇతర ప్రత్యేకతలు: సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, టార్పెడోలు, సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్, పంచేంద్రియ యూనిఫైడ్ సోనార్ సబ్‌మెరైన్, సముద్ర జలాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థ, కంట్రోల్ సిస్టమ్. మిస్సైల్ రేంజ్ : 750 కిలోమీటర్లు -
అసోంలో ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ రద్దు..
న్యూఢిల్లీ: ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అసోం అసెంబ్లీ గురువారం బిల్లును ఆమోదించింది. ముస్లిం పెళ్లి, విడాకుల చట్టం–1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆప్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్సెస్ బిల్లు–2024ను తీసుకువచి్చంది. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిశ్వ శర్మ సర్కారు ఈ కొత్త బిల్లును తెచ్చింది.గతంలో ఖాజీలు చేసిన పెళ్లిళ్లు చెల్లుబాటు అవుతాయని, ఇకపై జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరని సీఎం హిమంత వివరణ ఇచ్చారు. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా పేర్కొన్నారు. వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి. అవివాహితులా, విడాకులు తీసుకున్నారా లేక వైధవ్యం సంప్రాప్తించిందా? అనే వివరాలను వెల్లడించాలి. ఇరువురి అంగీకారంతోనే వివాహం జరగాలి. ఏ ఒక్కరి సమ్మతి లేకుండా వివాహం జరిగినా అది చెల్లదు. వివాహిత మహిళల, భర్తలను కోల్పోయిన వారి హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని అసోం ప్రభుత్వం చెబుతోంది. -
Kolkata Incident: ఏం జరిగిందో చెప్పండి!
కోల్‌కతా: కన్నబిడ్డను కోల్పోయిన విషయం తెలిస్తే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయే తల్లిదండ్రులను ఓదార్చుతూ ధైర్యం చెప్పాల్సిందిపోయి వారిని గందరగోళపరుస్తూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం వైఖరి తాజాగా బహిర్గతమైంది. కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యోదంతం మర్నాడు ఉదయం ఆస్పత్రి యాజమాన్యం ఆమె కుటుంబానికి చేసిన ఫోన్‌కాల్స్ డేటా తాజాగా మీడియాకు వెల్లడైంది. దీంతో సున్నితమైన అంశం పట్ల ఆస్పత్రి యాజమాన్యం ఎంత నిర్దయగా వ్యవహరించిందో అందరికీ అర్థమైంది. ఆగస్ట్ 9న ఉదయం 10 గంటలకు ఆస్పత్రి మహిళా అసిస్టెంట్ సూపరింటెండెంట్ చేసిన మూడు ఫోన్‌కాల్స్ వివరాలు ఇవీ..మొదటి ఫోన్‌కాల్ ఉదయం 10.53 నిమిషాలకు..వైద్యురాలి తండ్రి: అసలేం జరిగింది?అవతలి వ్యక్తి: ఆమె ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదు. ఆస్పత్రిలో చేర్పించాం. త్వరగా వచ్చేయండివైద్యురాలి తండ్రి: దయచేసి చెప్పండి. అక్కడేం జరిగింది?అవతలి వ్యక్తి: ఆ వివరాలన్నీ డాక్టర్ చెప్తారు. మీ నంబర్ దొరికితే ఫోన్ చేశాం. ముందు మీరు బయల్దేరండివైద్యురాలి తండ్రి: అసలు మీరెవరు?అవతలి వ్యక్తి: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. డాక్టర్‌ను కాదు.వైద్యురాలి తండ్రి: అక్కడ వైద్యులే లేరా?అవతలి వ్యక్తి: మేమే నీ బిడ్డను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చాం. వచ్చి మమ్మల్ని కలవండివైద్యురాలి తల్లి: ఆమెకు ఏమైంది?. డ్యూటీ లో లేదా? జ్వరం వచ్చిందా?వైద్యురాలి తండ్రి: ఆమెకు సీరియస్‌గా ఉందా?అవతలి వ్యక్తి: అవును. మీరు వీలైనంత త్వరగా వచ్చేయండిఐదు నిమిషాల తర్వాత రెండో ఫోన్‌కాల్.. అవతలి వ్యక్తి: ఆర్జీ కర్ ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నావైద్యురాలి తల్లి: చెప్పండిఅవతలి వ్యక్తి: బయల్దేరారా లేదా?వైద్యురాలి తల్లి: బయల్దేరాం. ఇప్పుడు ఆమె ఎలా ఉంది?అవతలి వ్యక్తి: ముందయితే రండి. వచ్చాక మాట్లాడుకుందాం. ఆస్పత్రిలో ఛాతీ విభాగాధిపతి ఆఫీస్‌కే నేరుగా రండివైద్యురాలి తల్లి: సరేనండిమూడో ఫోన్‌కాల్...వైద్యురాలి తండ్రి: హలో చెప్పండిఅవతలి వ్యక్తి: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుంది. చనిపోయిందని అనుకుంటున్నాం. పోలీసులు కూడా వచ్చేశారు. ఆస్పత్రి వాళ్లం కూడా ఇక్కడే ఉన్నాం. త్వరగా రండి అని చెప్పడానికే మీకు ఫోన్ చేశాంవైద్యురాలి తండ్రి: నేరుగా అక్కడికే వస్తున్నాంవైద్యురాలి తల్లి: నా కూతురు నాకిక లేదు (బోరున విలపిస్తూ). -
స్త్రీ ధనంపై మహిళకే హక్కు : సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తప్పు చేసిన వారికి తగు శిక్ష పడేలా చేయడానికే నేర విచారణ జరుగుతుందని, అంతే తప్ప ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తన కూతురికి వివాహ సమయంలో ఇచ్చిన స్త్రీ ధనాన్ని ఆమె మాజీ అత్తమామలు తిరిగి ఇవ్వడం లేదంటూ తెలంగాణకు చెందిన పడాల వీరభద్రరావు సుప్రీంకోర్టులో నమ్మకద్రోహం కేసు వేశారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు, బంధువులు కానుకల రూపంలో ఇచ్చే నగదు, ఆస్తులను స్త్రీ ధనంగా పరిగణిస్తారు. స్త్రీ ధనంపై భార్య లేదా మాజీ భార్యకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుందని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్ పేర్కొన్నారు. ఇదివరకే న్యాయస్థానాలు దీన్ని స్పష్టం చేశాయన్నారు.వ్యక్తిగత కక్ష్యలు మనసులో పెట్టుకొని.. ప్రతీకారం తీర్చుకోవడానికి న్యాయ విచారణ ప్రక్రియను ఉపయోగించుకోకూడదని వీరభద్ర రావుకు ధర్మాసనం సూచించింది. 1999లో తన కూతురికి పెళ్లి సమయంలో బంగారు నగలు, ఇతర కానుకలు ఇచ్చానని, తర్వాత దంపతులు అమెరికాకు వెళ్లారని రావు కోర్టుకు తెలిపారు. 2016లో అమెరికాలో విడాకులు తీసుకున్నారని, తన కూతురికి ఇచి్చన నగలు ఆమె మాజీ అత్తమామల దగ్గరే ఉన్నాయని వాదించారు. అయితే స్త్రీ ధనంపై భర్తకు గాని, తండ్రికి గాని ఎలాంటి హక్కులు ఉండవని, స్త్రీ ధనాన్ని తిరిగి రాబట్టుకోవడానికి కేసు పెడితే ఆమె పెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం
-
గుజరాత్ ను ముంచెత్తిన వరద.. చూస్తేనే భయమేసే పరిస్థితులు
-
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న బంద్..
-
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న బంద్..
-
నేపాల్ లో ఘోర ప్రమాదం.. బస్సులో 40 మంది భారతీయులు
-
కోల్ కతా ఘటనపై సుప్రీం కోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్
-
కర్ణాటక పాలిటిక్స్‌లో ట్విస్ట్.. ఇప్పుడు కుమారస్వామి వంతు!
బెంగళూరు: ఓ సామాజికకార్త ఫిర్యాదు ఆధారంగా.. అవినీతి ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రినే విచారణ చేపట్టేందుకు అనుమతించడంతో కర్ణాటక గవర్నర్ తీరు సర్వతత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపింది. కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అయితే ఈలోపు కన్నడనాట మరో మలుపు చోటు చేసుకుంది.అక్రమ గనుల వ్యవహారంలో జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిని విచారణ చేపట్టేందుకు అనుమతించాలని ఆ రాష్ట్ర లోకాయుక్తా మంగళవారం గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్‌ను కోరింది. అయితే.. ఈ వ్యవహారంలో లోకాయుక్తా విజ్ఞప్తి చేయడం ఇదే మొదటిసారేం కాదు. కిందటి ఏడాది సైతం రాజ్‌భవన్‌కు రిక్వెస్ట్ పంపగా.. అక్కడి నుంచి తిరస్కరణ ఎదురైంది.2007లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ సంస్థకు(ఎస్‌ఎస్‌వీఎం కంపెనీ) చట్టాన్ని అతిక్రమించి అప్పనంగా మైనింగ్ లీజ్‌ను కట్టబెట్టారన్నది ప్రధాన అభియోగం. దీనిపై 2013-17 మధ్య జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలోని కర్ణాటక లోకాయుక్త ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు జరిగింది. కిందటి ఏడాది నవంబర్ 1వ తేదీన ఏడీజీపీ చంద్రశేఖర్, రాజ్‌భవన్‌కు కుమారస్వామిని విచారించేందుకు అనుమతించాలని లేఖ రాశారు. తాజాగా ఆగష్టు 8వ తేదీన ఛార్జ్‌షీట్ ఆధారంగా రెండో విజ్ఞప్తి సిట్ తరఫు నుంచి రాజ్‌భవన్‌కు నివేదిక వెళ్లింది. అయితే.. గతంలో గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో పాటు తాజా పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. ‘‘గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించకూడదు. ఆయన రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాష్ట్రపతికి ప్రతినిధిగా ఆయన వ్యవహరించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వానికి కాదు’’ అని అన్నారు. అంతేకాదు.. బీజేపీ మాజీ మంత్రులు శశికళ జోలే, మురుగేష్నిరాని, జీ జనార్ధన్రెడ్డిలపై ఉన్న అభియోగాలపై విచారణకు కూడా గవర్నర్ అనుమతించలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం కుమారస్వామి కేంద్ర కేబినెట్లో ఉన్నారు. దీంతో ఆయన్ని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అనుమతి గనుక లభిస్తే మాత్రం.. రాజకీయంగా అది ఆయనకు కాస్త ఇబ్బందికర పరిస్థితే. అయితే.. కుమారస్వామి తాజా పరిణామాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాత కేసును తిరగదోడి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారాయన. గతంలో(2017) మూడు నెలలో దర్యాప్తు పూర్తి చేయాలని సిట్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ, సిట్ అప్పుడు విఫలమైంది. సిద్ధరామయ్యకే గనుక దమ్ముంటే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లాలి అని కుమారస్వామి సవాల్ విసిరారు. టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త జులై 26వ తేదీన సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 10 గంటల తర్వాత సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) స్కామ్‌లో.. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం, అలాగే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 చట్టంలోని 218 సెక్షన్ ప్రకారం విచారణ జరపొచ్చని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్య.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ స్వల్ప ఊరట లభించింది. తాము తదుపరి విచారణ జరిపేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఆగష్టు 29న సిద్ధరామయ్య పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. -
కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారంటే...?
‘జమ్మూ–కశ్మీర్’ విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం. ఏదో ఒక కారణంగా కశ్మీర్ రోజూ వార్తల్లో ఉంటోంది. పార్టీలు, నాయకులు, మేధావులు, జాతీ యవాదులు ఏదో ఒక సంద ర్భంలో కశ్మీరు గురించి మాట్లా డుకుంటూనే ఉంటారు. దేశమంతా కశ్మీరు గురించి చర్చిస్తున్న విషయాల్నే కశ్మీరీలు మాట్లాడుకుంటు న్నారా? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కశ్మీరీల మనసుల్లో ఏముంది? అని అన్వేషించడానికి ‘పీపుల్స్ పల్స్’ బృందం క్షేత్రస్థాయిలో పర్య టించింది. కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు... ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నిక అని కశ్మీరీలు అంటారు. అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నిక లన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేనని వారు భావిస్తున్నారు. జమ్మూ– కశ్మీరులో ఏ మూలకు వెళ్లి ఎవ్వరితో మాట్లాడినా... చాలా సమస్యలపై వారికి ఏకాభిప్రాయం లేనప్ప టికీ, ఉమ్మడి అభిప్రాయం ఉన్నది ఒక విషయంలోనే: ఆ రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నారు.2019 ఆగస్టు 5న ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తి హోదా తొలగిపోయింది. రాష్ట్రాన్ని కశ్మీర్, లద్దాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు, పూర్వ జమ్మూ– కశ్మీర్‌కి లభిస్తున్న స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, ఈ సెప్టెంబర్ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వ హించాలని ఆదేశించింది. ‘‘ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదే శాలతో ఎన్నికలు జరిగినా... మహా అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’’ అని శ్రీనాగ్లో ఒక వ్యాపారి చెప్పాడు. ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది.రాష్ట్ర హోదాపాలన విషయంలో ఢిల్లీ మోడల్ని, సామాన్య స్థానికులతో పాటు గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదా రులుగా ఉన్న గుజ్జర్ సామాజిక వర్గం బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ–కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరు ద్ధరించాలని, ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తు న్నారు. కశ్మీర్ విషయంలో తమది చరిత్రాత్మక నిర్ణయ మని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటోంది. కానీ, కశ్మీరులో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీ పరి స్థితిపై కొంత అనిశ్చితి నెలకొంది.కశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫ ల్యాలు ఉంటాయి. కానీ, అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే ఏ విధంగా చూసినా మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావి స్తున్నారు. ‘‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగి పోయాయి. ఎన్నికలు లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాల నను ఆశించలేం అని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య అంతరం పెరిగి పోయింది. మీడియాలో చూపించే వంతెనలు, అండర్ పాస్‌లను పక్కన పెడితే, స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయార య్యాయి. కొత్త రోడ్లు వేయడం, రోడ్లను రిపేర్ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న దాని కన్నా 2019కి కంటే ముందే బాగుండేదని అనేక ఉదాహరణలు చెబు తున్నారు.జమ్మూ, శ్రీనగర్‌లు గవర్నమెంట్ ప్రకటనల్లో మాత్రమే పేరుకు స్మార్ట్ సిటీలనీ, తగిన మౌలిక వస తులు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనీ స్థానిక వ్యాపారులు చెబుతు న్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ, బయట నుంచి వచ్చిన వాళ్లే మద్యం వ్యాపారం చేస్తు న్నారనీ, ముఖ్యమైన స్థానాలన్నింటీలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులే ఉంటున్నారనీ, ఇది తమకు న్యాయం చేయడం లేదనీ ప్రజలు ఏకాభిప్రా యంతో ఆరోపిస్తున్నారు. ‘‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటి వాళ్లనే ఎందుకు నియ మిస్తున్నారు? ఎందుకు అంత భయం?’’ అని అడ్వ కేట్‌గా పనిచేస్తున్న షేక్ షకీల్ ప్రశ్నించారు.‘‘మాకు ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. మేం ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహుల కింద నేరం మోపు తున్నారు. గత 5 ఏళ్లుగా మేం ఎన్నుకోని ప్రభుత్వంలో ఉన్నాం’’ అనేది కశ్మీరీ యువత అభిప్రాయం. చలికాలంలో జమ్మూ, వేసవికాలంలో శ్రీనగర్ నుంచి జరిగే దర్బార్ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్ పెట్టింది. దీనికి అనవసర ఖర్చు అవు తోందనీ, ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయ మనీ బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ, 5 ఏళ్ల తర్వాత చూస్తే దర్బార్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం. ‘‘దర్బార్ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవి. వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చే మాకు ఆదాయం అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకు పోయాయ’’ని జమ్మూ వ్యాపారి వికాస్ శర్మ చెప్పాడు. జనం కోరు తున్నట్టు దర్బార్‌ను పునరుద్ధరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనీ, అందుకే తాము అడిగినా నాయకత్వం పట్టించు కోవడం లేదని స్థానిక బీజేపీ నాయకులు చెబు తున్నారు.35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జమ్మూ–కశ్మీరులో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నికలను బహిష్కరించిన ఈ ప్రాంతంలో, ప్రభుత్వాన్ని ఎన్ను కోవడానికి తపిస్తున్న ప్రజల గాఢమైన కోరికకు ఈ ఓటింగ్ శాతం అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరించాలనీ, ‘దిగుమతి’ సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావా లనీ కోరుకుంటున్న కశ్మీరీల కల నెరవేరుతుందా, లేదా అనేది ఇంకో నెలన్నరలో తేలనుంది.– జి. మురళీకృష్ణ, వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థలో పరిశోధకులు -
ఉజ్జయిని మహాకాళేశ్వరునికి రక్షా బంధనం
-
ఉరి సెక్టార్ లో సైనికులకు రాఖీలు కట్టిన స్థానిక మహిళలు
-
బీజేపీ లో చేరిక పై స్పందించిన జార్ఖండ్ మాజీ సీఎం
-
కోల్‌కతా బాధితురాలిపై అసభ్యకర పోస్టులు.. మంచు మనోజ్ ఆగ్రహం
కోల్‌కతాలో డాక్టర్‌పై జరిగిన దారుణం గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఆమెకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొందరు ఆకతాయిలు.. సదరు బాధితురాలిని ఉద్దేశించి చెప్పుకోలేని విధంగా అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు వీటిపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.(ఇదీ చదవండి: పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్)'జన్మనిచ్చిన మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవ్వడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. స్క్రీన్ వెనకాల ఉండి దారుణమైన పోస్టులు చేస్తున్న వారిని గుర్తించి శిక్షించడంలో విఫలమయ్యాం. కోల్‌కతా ఘటనలో బాధితురాలిని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంస్కృతిని నార్మలైజ్ చేయకుండా జవాబుదారీగా నిలబడాలని కోరుతున్నా' అని మనోజ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.ఏం జరిగిందంటే? కోల్‌కతాలోని ఆర్ జీ కర్ ఆస్పత్రిలో రాత్రి పూట విధుల్లో ఉన్న 31 ఏళ్లట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హతమార్చారు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది. తొలుత ఈ ఘటనని ఆత్మహత్య అనుకున్నారు. కానీ యువతి శరీరంపై దాడి చేసిన గుర్తులు ఉండగా పోస్టు మార్టం చేయగా రిపోర్టులో ఆమెపై సాముహిక అత్యాచారం జరిగిందని విషయం బయటపడింది.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!) -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ ప్రెస్..
-
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఓపీ బంద్
-
హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం..
-
వయనాడ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ... అన్ని విధాలా ఆదుకుంటామని బాధితులకు భరోసా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వయనాడ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
నేడు వయనాడ్ లో మోదీ పర్యటన..
-
ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియాకు బెయిల్
-
వక్ఫ్ బోర్డు బిల్ పై కేంద్రం కీలక నిర్ణయం
-
జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వక్ఫ్ సవరణ బిల్లు... లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కోచింగ్ సెంటర్లను నియంత్రించాలి!
భారీ వర్షాల కారణంగా మురుగు కాలువ పొంగిపొర్లి, ఢిల్లీలో ఒక సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థలో ఉన్న నేలమాళిగ గ్రంథాలయంలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించిన దుర్ఘటనలో ముగ్గురు విద్యా ర్థులు జల సమాధి కావటం యావత్ దేశాన్ని కలచివేసింది. చని పోయిన ముగ్గురిలో ఒకరు బిహార్ లోని ఔరంగాబాద్‌కు చెందిన తానియా సోనీ తండ్రి మంచిర్యాల సింగరేణిలో సీనియర్ మేనేజర్ కావడంతో తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానియా సోనీ మృతదేహాన్ని తరలించడంలో తండ్రి విజయ్ కుమార్‌కు సహాయ సహకా రాలు అందించాల్సిందిగా ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు ఆదే శాలు జారీ చేశారు.ఢిల్లీలోని పలు కోచింగ్ సెంట ర్లలో కనీస సౌకర్యాలు లేవనీ, కోచింగ్ సెంటర్లు నరక కూపాలుగా ఉన్నా యనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి అవినాష్ దూబే అనే సివిల్స్ ఆశావహ అభ్యర్థి లేఖ రాయటంతో అందరి దృష్టి కోచింగ్ సెంటర్లపై పడింది. ప్రధానంగా మన తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లో అనుమతి లేని పలు కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇవి వరంగల్, ఇతర జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాయి. హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల మూలంగా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్ పేట్ నిరుద్యోగుల కూడళ్ళుగా పేరుపొందాయి. దేశవ్యాప్తంగా సుమారు 80 వేల పైచిలుకు కోచింగ్ సెంటర్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం. సంవత్సరానికి 70 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగు తున్నట్లు అంచనా.అడ్డూ అదుపూ లేని కోచింగ్ సెంటర్లపై మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టింది. కోచింగ్ సెంటర్లను సేవారంగంలోకి తెచ్చి వాటిపై పన్నులు వేశారు. 2024 జనవరి 18న కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి అనుమతులు ఉండవు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నామ మాత్రపు రుసుముతో ఒక వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు. భవన యజమానులు అగ్నిమాపక శాఖ విధించిన రక్షణ నిబంధనలు పాటించరు. గృహ అవస రాలకు అని అనుమతి తీసుకుని ఆ భవనాలనే కోచింగ్ సెంటర్లుగా వాడుతూ విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందు తున్నారు, ఎంతెంత ఫీజులు చెల్లిస్తున్నారు అనే లెక్కలు ఉండవు. తరగతి గదిలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పైన జీఎస్టీ వంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. పైగా వెలుతురు లేని గదుల్లో 100 మంది కూర్చోవాల్సిన చోట 500 మందికి బోధిస్తున్నారు. కనీస మౌలిక సౌకర్యాలు ఉండవు. వీటి కన్నా కన్నా జైళ్ళు నయమనే భావన కలుగుతుంది. జైళ్ళలో మరుగుదొడ్లు, మూత్ర శాలలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా జైలు గదుల్లో వెలుతురు ఉంటుంది. నిబంధనల ప్రకారం గదిలో లెక్కకు మించి ఖైదీలను ఉంచరు.అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన భద్రతా ప్రమా ణాలు పాటించని కోచింగ్ సెంటర్లను నియంత్రించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇటీవల హరి యాణా ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నమోదు నియంత్రణ బిల్లు–2024ను తెచ్చి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసింది. అట్లాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చట్టం తెచ్చి, తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా విద్యార్థి నిరు ద్యోగుల శ్రేయస్సుకు పాటుపడాలి.– కోటూరి మానవతా రాయ్, వ్యాసకర్త టీపీసీసీ అధికార ప్రతినిధి; తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, 90009 19101 -
కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు
-
భారత్ ఆహార మిగులు దేశంగా మారింది... అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
-
ఈవీఎంలలో గోల్ మాల్..
-
వణుకుతున్న వాయనాడ్..
-
దేశం విడిచి పారిపోయిన పూజా ఖేద్కర్?
న్యూఢిల్లీ: వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన ఏఐఎస్ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పరారీలో ఉన్నారా?. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారా?. ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడం వెంటనే.. ఆమె దేశం విడిచి పారిపోయారా?. ముందస్తు బెయిల్ విషయంలో పూజా ఖేద్కర్‌కు గురువారం చుక్కెదురైంది. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల కోటా విషయంలో ఆమె మోసం చేశారని, ఈ అంశాల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్ తప్పదని ఆమె భావించారు. వెంటనే తన లాయర్ ద్వారా ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. పూజాను కస్టోడియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్ తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే.. జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుటా హాజరై ఆమె తన వివరణ ఇచ్చుకోలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఆగష్టు 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30 దాకా అవకాశం ఇచ్చింది. అయినా ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. పుణే పోలీసులు సైతం ఆమె పరారైన విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. -
SC, ST వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఢిల్లీ అతలాకుతలం..
-
చూస్తుండగానే కుప్పకూలిన భవనం..
-
భారీ వర్షం.. స్కూల్స్ బంద్
-
కొలువుల బడ్జెట్ మాత్రం కాదు!
‘‘కేంద్ర బడ్జెట్లో ఘన మైన లక్ష్యంతో కేటాయించిన రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీ వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువ తకు లబ్ధి చేకూర్చనుంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ ప్రత్యేకంగా విద్య, ఉద్యో గాలు, నైపుణ్యాల వృద్ధి కోసం రూ. 1.48 లక్షల కోట్లు వ్యయం చేయనుంది’’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యో గాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధితోపాటు ఎమ్ఎస్ఎంఈ రంగం గురించి కూడా బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్–2024 అనేక విధాలుగా ప్రత్యేకమైందే. కాని అది కీలక మైన ఉద్యోగాల కల్పనలో విఫలమవడం ఖాయం. ఇది ఉద్యోగాలు సృష్టించే బడ్జెట్ కాదు.ఉద్యోగ కల్పన దిశగా 2.1 కోట్ల మంది ఫ్రెషర్స్‌కు ప్రయోజనం చేకూర్చేలా ఒక నెల జీతం లేదా మూడు ఇన్స్టాల్మెంట్స్లో రూ. 15,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొ న్నారు. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో నెలకు రూ. 15 వేల వేతనంతో 2.1 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టు కొస్తాయని ఆమె అంచనా వేశారు. ఇది ఊహా జనిత అంచనా మాత్రమే. ఇది ఉద్యోగాలు లభించే ప్రాంతాలకు యువత వలస పోయేట్లు మాత్రమే చేస్తుంది. కానీ వాస్తవంలో ఎలాంటి కొత్త ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం కచ్చితంగా లేదు.మరో స్కీమ్ ఏమంటే.. తయారీ రంగం, అదేవిధంగా వ్యవస్థీకృత రంగంలో కొత్తగా ఉద్యో గాలు కల్పించే కంపెనీలకు మేలు చేసేలా ఆ యా ఉద్యోగుల పీఎఫ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. వ్యవస్థీకృత రంగ ఉద్యోగాల వేత నంలో పీఎఫ్ అనేది చాలా తక్కువ మొత్తం. దీని వల్ల వేతన వ్యయం కొంత తగ్గుతుంది. యజ మాని మంచి వ్యక్తి అయితే ఆ మొత్తాన్ని ఉద్యోగికి ఇచ్చి వేతనం పెంచే ప్రయత్నం చేస్తాడు. అంతే కాని పీఎఫ్ ఇచ్చే స్కీమ్ ఏ రకంగానూ కొత్త ఉద్యో గాల కల్పనకు ప్రోత్సాహం ఇచ్చేది కాదు.ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయడం వల్ల నైపు ణ్యాలు పెరుగుతాయి. ఎందుకంటే.. వాస్తవ నైపు ణ్యాలు ఐటీఐల్లో లభించడం లేదు. ఉద్యోగంలో చేరిన తర్వాతే అవసరమైన స్కిల్స్ నేర్చుకుంటు న్నారు. ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన తర్వాత సదరు అభ్యర్థికి సరైన ఉద్యోగం లభించకుంటే.. ఆ ఐటీఐ చదువు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.అదే విధంగా అప్రెంటిస్ స్కీమ్, ఇంటర్న్ షిప్ స్కీమ్స్ కూడా సప్లయ్ వైపు తీసుకున్న చర్యలే తప్ప కొత్త ఉద్యోగాలు సృష్టించేవి కాదు. వాస్తవానికి వ్యాపారం విస్తరించినప్పుడే కొత్త ఉద్యోగాల కల్పన అనేది సాధ్యమవుతుంది. కొత్త మార్కెట్లు లేదా కొత్తగా డిమాండ్ పెరగడం వల్ల వ్యాపారాల విస్తరణ జరుగుతుంది. ఆర్థిక మంత్రి ఊహించినట్లు సప్లయ్ సైడ్ చర్యల వల్ల కొలు వుల సృష్టి జరగదు. ఉద్యోగాల కల్పన అనేది డిమాండ్‌ను పెంచే ప్రోత్సాహకాల వల్లనే సాధ్య మవుతుంది. అసలు మొత్తంగా ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే సరిగా లేదు. ఎందుకంటే... స్కిల్స్ పెంచడం, అప్రెంటిస్, ఇంట ర్న్‌షిప్ అవకాశాలు కల్పించడం వల్ల నైపుణ్యా లున్న యువత సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇలా స్కిల్స్ పెంచుకున్న యువతకు తక్షణమే ఉద్యోగాలు చూపించలేకపోతే అది మరింత వైఫ ల్యంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం వ్యవ స్థలో డిమాండ్ పెంచే చర్యలు తీసుకోవాలి.కొత్త ఉద్యోగాలు భారీగా సృష్టించేది ఎవరు? ఐటీ రంగం కాని, పెద్ద పెద్ద కంపెనీలు కాని కాదు. వీరంతా ఇప్పుడు ఆటోమేషన్‌ను విని యోగిస్తున్నారు. వీరు భారీ సంఖ్యలో కొలువులు ఆఫర్ చేసే పరిస్థితి లేదు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఎమ్ఎస్ఎంఈ రంగమే! బడ్జె ట్లో ముద్రా లోన్ మొత్తాన్ని పది లక్షల రూపా యలకు పెంచారు. కానీ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనకంజ వేస్తుండటంతో అవి అవస రమున్న వారికి చేరడంలేదు. ఎంఎస్ ఎంఈలలో పెట్టుబడులు పెంచేలా రుణ గ్యారెంటీ స్కీమ్ మరొకటి కూడా ఉంది. కానీ దురదృష్టవ శాత్తు ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు ఇస్తోంది. ఎంఎస్ఎంఈలకు మాత్రం తిరిగి చెల్లించే రుణాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఎంఎస్ఎంఈ రంగంలో వృద్ధితోపాటు లాభాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ రంగానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా అవసరం. వ్యాపార విస్తరణకు, వృద్ధికి, మను గడకు సబ్సిడీ అందించాలి. జీఎస్టీ ఒకరకంగా ఎంఎస్ఎమ్ఈ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. కాని ఆర్థిక మంత్రి ఈ రంగం మనుగడ కోసం ఏమీ చేయడంలేదు. వడ్డీ రాయితీ తప్పితే ఎంఎస్ఎంఈ రంగానికి ఎలాంటి సబ్సిడీ అందు బాటులో లేదు. అంతిమంగా చెప్పేదేమంటే... ఎక్కువ మందికి ఉపాధి కల్పించే, అధికసంఖ్యలో ఉద్యోగాలు సృష్టించే ఎంఎస్ఎమ్ఈ రంగ వృద్ధి, విస్తరణకు అవసరమైన ప్రోత్సా హాన్ని అందించడంలో బడ్జెట్ 2024–25 విఫల మైంది!!– టి. మురళీధరన్, వ్యాసకర్త, టీఎమ్ఐ గ్రూపు ఫౌండర్ చైర్మన్ -
వయనాడ్ లో మరణ మృదంగం
-
కేరళ విలయంలో మనిషే విలన్..
-
విలయనాడ్: 200 దాటిన మృతుల సంఖ్య
కేరళ వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 200 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. రక్షించిన వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు భారీ వర్షంలోనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం గురించి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు. కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో మంగళవారం వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించారు, మరో 200 మంది గాయపడ్డారు. ఇక 180 మంది గల్లంతవ్వగా వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ వాయినాడ్లో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి సీతక్కకేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందామని పిలునిచ్చిన సీతక్కఆపదలో ఉన్నవారికి మానసిక ధైర్యాన్ని, మనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యతవయనాడ్ లో వరదల వల్ల కొండచరియలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారుఅంత్యంత హృదయ విషాదకర ఘాటనతో ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నమైయ్యాయిచేయి చేయి కలిపి కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందాంకాంగ్రెస్ పార్టీకి , నాకు కేరళ రాష్ట్రంతో ప్రత్యేక అనుబందం ఉందివరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలునిచ్చిన మంత్రివయనాడ్తో పాటు మరో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక.. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలో సర్వం కోల్పోయిన వాళ్ల కోసం ఆహారం, బట్టలు, మందులు అందించేందుకు, రక్తదానం కోసం.. ఆర్థిక సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రే ఫర్ వయనాడ్ లాంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. చలియార్ నది నుంచి 15 మృతదేహాల్ని బయటకు తీసిన రెస్క్యూ టీంలునీలంబూర్ నుంచి ఐదు ఆంబులెన్స్‌లలో మృతదేహాలు మెప్పాడికి పయనం.. మృతదేహాల తరలింపు కోసం 28 ఆంబులెన్స్‌ల ఏర్పాటుమృతుల సంఖ్య 168కి చేరికముందక్కై గ్రామం శివారులోని ఎలా రిసార్ట్, వన రాణి రిసార్ట్‌లలో తలదాచుకున్న 19 మందిని రక్షించిన ఆర్మీ.. సురక్షిత ప్రాంతాలకు తరలింపుయుద్ధ ప్రాతిపాదిక.. ముందక్కై చురాల్‌మల్ మధ్య వారధిని నిర్మాణం చేపట్టిన ఆర్మీ. వారిధి పూర్తైతే ఆంబులెన్స్‌లతో పాటు ఆహారం, తాగునీరు సరఫరా చేసేందుకు సిద్ధమైన అధికారులు481 మందిని రక్షించినట్లు ప్రకటించుకున్న సహాయక బృందాలు #WayanadLandslide: Medical camp set up by DSC Centre to provide aid. 19 civilians rescued by 122 TA battalion so far. @SpokespersonMoD pic.twitter.com/ufprk66U5U— DD News (@DDNewslive) July 31, 2024 #WATCH | केरल में भारतीय तटरक्षक बल ने वायनाड में हुए भूस्खलन से प्रभावित नागरिकों के लिए बचाव और राहत अभियान शुरू किया।@IndiaCoastGuard#WayanadLandslide | #Keralalandslide | #WayanadDisaster | #RescueOperstions pic.twitter.com/mnAn2Ny1Fr— डीडी न्यूज़ (@DDNewsHindi) July 31, 2024 యుద్ధ ప్రతిపాదికన రెస్యూ ఆపరేషన్తాత్కాలిక వంతెనలతో పలువురిని రక్షించిన సహాయక బృందాలుఆర్మీ జాగిలాలతో శిథిలాల కింద తనిఖీలుఅంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్యప్రమాదకరస్థాయిలో కేరళ నదులుగల్లంతైనవారిపై కేరళ సర్కార్ ఫోకస్వివరాలు తెలుసుకుంటున్న జిల్లా యంత్రాంగంముందక్కైలో టీ ఎస్టేట్ కార్మికులు గల్లంతుప్రమాదం తర్వాత కనిపించని కార్మికులుకార్మికుల్లో బెంగాల్, అసోంవాసులే ఎక్కువరేషన్కార్డు, ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర సమాచారం ప్రకారం ఆరాఆచూకీ లేనివారి గురంచి హెల్ఫ్లైన్లకు వందల కొద్దీ కాల్స్నీలంపూర దగ్గర కొన్ని మృతదేహాల గుర్తింపుమరో 3 వేల మందిని రక్షించిన సహాయక బృందాలు కేరళ కేబినెట్ ఎమర్జెన్సీ భేటీఅత్యవసరంగా సమావేశమైన కేరళ మంత్రి మండలిసీఎం విజయన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంవయనాడ్ విపత్తుపై చర్చ ప్రధాన ఏజెండాగా కొనసాగుతున్న భేటీ వయనాడ్ విపత్తుపై ఖర్గే రియాక్షన్పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వయనాడ్ విపత్తుపై స్పందించిన నేతలువయనాడ్ వరదలు దురదృష్టకర సంఘటన, ఇది జాతీయ విపత్తువయనాడ్లో పరిస్థితిని చాలా సీరియస్‌గా తీసుకున్నాం.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ లో పర్యటిస్తారు.పార్టీ కార్యకర్తలు పునరావాస పనుల్లో నిమగ్నమయ్యారు.రాజ్యసభలో వయనాడ్ వరదల అంశాన్ని లేవనెత్తుతాం.కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి.:::మల్లికార్జున ఖర్గే ,కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్. ఎటు చూసిన బురద.. ఆర్తనాదాలేకేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడి, మండక్కై, చూరాల్మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. ఎటుచూసినా.. అయిన వాళ్ల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, మూగ జీవాలను కోల్పోయి ఏడుస్తున్న దృశ్యాలు అగుపిస్తున్నాయిసాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న వాళ్లూ కనిపిస్తున్నారుమరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల(అసోం, బెంగాల్‌కు చెందినవాళ్లే ఎక్కువ) ఆచూకీ దొరకడం లేదు.కేరళ ఆరోగ్య మంత్రికి ప్రమాదం.. స్వల్ప గాయాలుకేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదంవయనాడ్ సహాయక చర్యల పరిశీలనకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంమంజేరి వద్ద స్కూటీతో మంత్రి వాహనం ఢీవీణా జార్జ్‌కు స్వల్ప గాయాలు.. ఆసుపత్రికి తరలింపు Veena George Accident: Kerala Health Minister Suffers Minor Injuries in Car Accident Near Manjeri While Traveling to Landslide-Hit Wayanadhttps://t.co/WS9Xk2EwNg#VeenaGeorge #Kerala #Wayanad— Lokmat Times (@lokmattimeseng) July 31, 2024VIDEO Credits: Lokmat Times వయనాడ్‌లో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్యకొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 156 చేరిన మృతుల సంఖ్య An Ariel view of deadly disaster in Wayanad Kerala. The Wayanad landslide was triggered by extremely heavy rainfall caused by the warming of the Arabian Sea, according to climate experts.#Wayanad #WayanadLandslide #KeralaDisaster #KeralaLandslides pic.twitter.com/SxVByBKjP4— Kavita Raj Sanghaik (@KAVITARAJ5) July 30, 2024సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గ్రామస్థులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమైంది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయిన గ్రామస్థులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. తొలుత ముందక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారమందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంత మంది బాధితులను సమీపంలోని చూరాల్‌మలలోని వెల్లారిమల పాఠశాలవద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున 4.10 గంటలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరంసహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. చుర్మలమల గ్రామంలోని కొంత భాగం తుడిచి పెట్టుకుపోయింది. ముందక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. #WayanadLandslide Rescue operations are in full swing as all services of the Armed Forces engage in extensive efforts along with Civil administration and Disaster Relief Forces to assist those affected. Over 700 individuals have been safely evacuated through a combination of… pic.twitter.com/MwaJa3okbZ— Southern Command INDIAN ARMY (@IaSouthern) July 30, 2024కేరళ జల విలయంవయనాడులో 150 దాటిన మృతుల సంఖ్యసహాయక చర్యలు ముందుకు సాగే కొద్ది.. బయటపడుతున్న మృతదేహాలుగంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్యవరదల్లో కిలోమీటర్ల దూరం వరకు చలియార్ నదిలో కొట్టుకుపోయిన మృతదేహాలుటీ గార్డెన్లలో పనిచేస్తున్న 600 మంది కార్మికుల ఆచూకీ గల్లంతుముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్న ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ , ఎన్డీఆర్ఎఫ్ముందకై , చూరల్మల లో భారీ ఎత్తున ప్రాణ నష్టంచూరల్మలలో వంతెన కొట్టుకుపోవడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంతాత్కాలిక వంతెన నిర్మించిన ఎన్ డి ఆర్ ఎఫ్, ఆర్మీమరో నాలుగు రోజులపాటు వయనాడు సహా నాలుగు జిల్లాలలో భారీ వర్షాలువయనాడుకు ఎవరూ రావొద్దని కోరిన కేరళ సీఎం పినరయ్ విజయన్ విజ్ఞప్తి ఈ నేపథ్యంలోరాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన వాయిదాఅరేబియా సముద్రం వేడెక్కాడంతో అస్థిరమైన వాతావరణ పరిస్థితులుఅతి తక్కువ సమయంలో అతి ఎక్కువ భారీ వర్షం పడిందంటున్న వాతావరణ నిపుణులుకొండ చరియలు విరిగిపడే ప్రమాదాన్ని ముందే పసిగట్టే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్న నిపుణులు#WayanadLandslide :Rescue teams were risking their own lives to save hundreds stranded in the most challenging conditions in #Wayanad.The Army, IAF, NDRF have rescued 481 people till evening and 3000 people have been moved to rescue camps.The death toll in #WayanadDisaster… pic.twitter.com/Ou3et1bTCO— Surya Reddy (@jsuryareddy) July 30, 2024 వయనాడ్ తొలిరోజు రెస్క్యూ ఆపరేషన్‌లో.. మరణాలు: 151 (తాజా ప్రకటనతో కలిపి)రక్షించింది: 481 మందిగుర్తించిన మృతదేహాలు:39 మాత్రమేబంధువులకు అప్పగించిన మృతదేహాలు: 32చలియార్ నది నుంచి 31 మృతదేహాల సేకరణఆస్పత్రిలో చేరిన వాళ్ల సంఖ్య: 128వయనాడ్ రిలీఫ్ క్యాంప్‌ల సంఖ్య: 45రిలీఫ్ క్యాంప్‌కి చేరింది: 3,069మిస్సింగ్: 98 (అధికారిక ప్రకటన)400 కుటుంబాల జాడపై ఇంకా స్పష్టత రాలేదు. ఉత్తరాధి నుంచి వలస వచ్చిన కూలీల పరిస్థితిపై వాళ్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Terrific footage in #wayanad, Kerala . #WayanadLandslide#WayanadDisaster #WayanadLandslides #WayanadRains #WayanadTragedy pic.twitter.com/6dvYHhpWLl— Sharad.N (@Sharad_N_D) July 31, 2024 రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదావయనాడ్ విలయం గురించి తెలియగానే.. అక్కడి మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పినరయి విజయన్‌తో పాటు వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారాయన. నిన్న సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి విపత్తు ప్రాంతంలో సందర్శించాలనుకున్నారు. అయితే.. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో త్వరలో ఆయన అక్కడకు వెళ్లనున్నట్లు సమాచారం. సుమోటోగా ఘటనవయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) దక్షిణాది ధర్మాసనం సుమోటోగా విచారణకు తీసుకుంది. జ్యుడీషియల్ సభ్యురాలు పుష్ప సత్యనారాయణ, నిపుణుల సభ్యుడు సత్యగోపాల్ ధర్మాసనం మంగళవారం కేరళ ప్రమాద ఘటనపై ఆవేదన వ్యక్తం చేసింది. దీనిని సుమోటోగా విచారించనున్నట్లు తెలిపింది. త్వరలో ఈ కేసును జాబితాలో చేర్చాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. वायनाड लैंडस्लाइड अपडेट...मरने वालों की संख्या बढ़कर 151 हो गई है...#WayanadLandslides #WayanadLanslide pic.twitter.com/yj4lf1RCbC— Gaurav Kumar (@gaurav1307kumar) July 31, 2024ముందే పసిగట్టలేమా?కొండచరియలు విరిగి పడటం ముందే గుర్తించవచ్చు. ఇలాంటి ఘటనలు జరగడానికి ముందు.. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేలలో గోడల్లో పగుళ్లు రావడం, గోడలు కదలటం, స్తంభాలు, వృక్షాలు పక్కకు వరగడం, కొండల నుంచి కొద్ది కొద్దిగా మట్టి రాలటం, శిలలు పడటం వంటివి సహజ సూచికలని నిపుణులు అంటున్నారు. వయనాడ్ ప్రమాదం నేపథ్యంలో.. కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని ముందే పసిగట్టి హెచ్చరించే వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు, నిపుణులు మంగళవారం సూచించారు. అయితే.. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అనుకున్నంత సులువుకాదని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ అంటున్నారు.இவர்களை போன்ற NDRF வீரர்களை மக்கள் கொண்டாட வேண்டும் . நாட்டில் எங்கு இயற்க்கை சீற்றம் ஏற்பட்டாலும் அங்கு களத்திற்கு சென்று மக்களை காப்பாற்ற வேண்டும் என்று செயல்பட்டு கொண்டிருக்கும் இவர்களை போன்ற வீரர்களுக்கு நன்றிகளும் பாராட்டுகளும் .#WayanadLandslidespic.twitter.com/ZJnrmORPlG— சாத்தூர் நகர தலைமை தளபதி விஜய் மக்கள் இயக்கம் (@VMIsattur) July 31, 2024సముద్రం వేడెక్కి..మానవ తప్పిదాలే దైవభూమి కష్టాలకు కారణమనే చర్చ జరుగుతుండగా.. వయనాడ్ విషాదానికి అరేబియా సముద్రం వేడెక్కడమూ ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్ర ఉష్ణోగ్రత దట్టమైన మేఘ వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తోందని, ఈ కారణంగా కేరళలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షాలు పడి కొండచరియలు విరిగిపడే అవకాశాలు పెరుగుతున్నాయంటున్నారు. ప్రాణాలు చేతపట్టుకుని. .వయనాడ్ విలయంలో వెల్లువెత్తిన బురద ప్రవాహంలో చిక్కిన ఓ వృద్ధుడు గంటల కొద్దీ ఒక పెద్ద బండరాయిని ఆధారంగా పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. స్థానికులు అతని ఆర్తనాదాలు విని కూడా వరద ప్రవాహ తీవ్రత కారణంగా ఏమీ చేయలేకపోయారు. దాంతో వృద్ధుడు జోరు వానలో, వరద ప్రవాహం నడుమ గంటల పాటు బండరాయి చాటునే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చివరికి సహాయక బృందాలు చాలాసేపు శ్రమించి ఆయన్ను కాపాడాయి. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి.பாக்கவே பதறுது 😢 #WayanadLandslides pic.twitter.com/wH0J39Ib2T— அஜய் (@ajay_offcl) July 31, 2024ఎటు చూసినా.. విలయనాడ్ బాధిత గ్రామాల ప్రజల ఆర్తనాదాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తమవారి కోసం వారు పడే ఆరాటం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున అక్కడ కొండచరియలు విరిగిపడి బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు. వారు తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని విలపించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫోన్ సంభాషణలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి.My thoughts and prayers are with the people of #Wayanad. May they get the strength to overcome this. Amen.#WayanadLandslides #WayanadRains #Rahul_Gandhi #RahulGandhiInParliament pic.twitter.com/zoHALkkgtc— Payal (@rjb2025) July 31, 2024పెనువిషాదంసోమవారం అర్ధరాత్రి దాటాక ఆ ప్రాంతమంతటా భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వెల్లువెత్తిన బురద, ప్రవాహం ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గ్రామాలతో పాటు సహాయ శిబిరాలు కూడా బురద ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఎటుచూసినా అంతులేని బురదే కప్పేసింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది తప్పించుకునే అవకాశం కూడా లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మెప్పాడి ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండ ప్రాంతమంతా తడిసీ తడిసీ వదులుగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముందక్కై, చూరల్మల, అత్తమల, నూల్‌పుజా తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. -
జల సమాధి.. 600 మంది ఆచూకీ గల్లంతు
-
వయనాడ్: ఊళ్లను ఊడ్చేసిన కొండచరియలు.. 70 మంది మృతి
తిరువంతనపురం: కేరళ వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయం.. పెను విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. మెప్పాడి రీజియన్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 70 మృతదేహాల్ని సహాయక బృందాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. సుమారు 1,200 శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం.. ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్థానిక సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ మధ్యాహ్నాం ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. ఇప్పటివరకు 400 మందిని రక్షించి.. రిలీఫ్ క్యాంప్‌లకు తరలించారు. ముందక్కై నుంచి ఎయిర్లిఫ్ట్ముందక్కై గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత క్యాంప్‌లకు తరలించనున్నట్లు ఎమ్మెల్యే సిద్ధిఖీ తెలిపారు. ‘‘ఎంత మంది ఆచూకీ లేకుండా పోయారు, ఎంత మంది చనిపోయారు అనేదానిపై ఇప్పుడే పూర్తి సమాచారం అందడం కష్టం. చాలా చోట్లకు కనెక్టివిటీ తెగిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా అక్కడికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అన్నారాయన. యుద్ధ ప్రతిపాదికన వంతెనలుకేరళ విలయం ధాటికి వయనాడ్‌లో వంతెనలు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యలకూ విఘాతం ఏర్పడుతోంది. దీంతో.. యుద్ధ ప్రతిపాదికన వంతెనలు పునరుద్ధరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. హెలికాఫ్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ.. వాతావరణం అనుకూలించట్లేదని ఆమె చెప్పారు. వయనాడ్‌కు రాహుల్ గాంధీకాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్‌కు వెళ్లనున్నారు. కొండ చరియలు ప్రాంతాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచే ఆయన రెండుసార్లు ఎంపీగా నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం.. ఎక్స్ వేదికగా ఆయన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కూడా.I am deeply anguished by the massive landslides near Meppadi in Wayanad. My heartfelt condolences go out to the bereaved families who have lost their loved ones. I hope those still trapped are brought to safety soon.I have spoken to the Kerala Chief Minister and the Wayanad…— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2024 కేరళలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు బలమైన గాలులు తోడవ్వడం పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కొండచరియలు విరిగిపడడం, చెట్లు కూలిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసర్‌గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి ఈ నాలుగు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. అయితే.. సోమవారం అర్ధరాత్రి దాటాక.. మెప్పాడి రీజియన్‌లోని మందకై ప్రాంతంలో మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. 2గం. సమయంలో ఒకసారి, 4గం. సమయంలో మరోసారి, ఆపై అరగంటకు మరోసారి చరియలు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు చలియార్‌నది ఉప్పొంగడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. బురద నీరు, బండరాళ్లు, కూలిన చెట్లు చుట్టుముట్టేయడంతో జనం చిక్కుకుపోయారు. ఘటన సమాచారం అందుకోగా.. ఎన్డీఆర్ఎఫ్, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, అలాగే సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌కు చేరుకున్నాయి. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలిగాయి. దీంతో ఉదయం నుంచి సహాయక చర్యల్ని ఉధృతం చేశారు. మట్టి దిబ్బల కింద వందలాది మంది(1200 మంది అని ఒక అంచనా) చిక్కకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వంతెనలు తెగిపోవడం, భారీ వర్షం పడుతుండడంతో సహయక చర్యలు కొనసాతున్నాయి. Hundreds Feared Trapped Following Massive Landslides in Kerala's #Wayanad#Kerala #Landslides #WayanadLandslide pic.twitter.com/8yJIKixPP9— TIMES NOW (@TimesNow) July 30, 2024 Video Credits: TIMES NOW Kerala's Wayanad Devastated by Landslides; Hundreds Feared Trapped#Kerala #Landslides #WayanadLandslide pic.twitter.com/cR67TWKzFi— TIMES NOW (@TimesNow) July 30, 2024 Video Credits: TIMES NOW Major Landslide in Wayanad. Many fear dead. One portion of Chooral hills and the township near Mepadi has collapsed. Very similar to the Puthumala landslide that occured in 2019. pic.twitter.com/nSfvuzlddq— Viju B (@floodandfury) July 29, 2024 ఎటు చూసినా విధ్వంసమే..మెప్పాడి ముండకైలో ప్రాంతంలో ఇప్పటి వరకు పదిహేనుకు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ముందక్కై, అట్టమల, నూల్పూజ, చురల్మల గ్రామాలు ఊడ్చిపెట్టుకుపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.వంతెన కూలిపోవటంతో అత్తమల, చురల్మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. గతంలో.. 2018లో సంభవించిన విపత్తులో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.రంగంలోకి హెలికాఫ్టర్లుసహాయక బృందాలు మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వాళ్లను వెలికి తీసి.. చికిత్స కోసం మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్నాయి. ఇంకా చాలా మంది మట్టి చరియల కింద చిక్కుకున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు ఈ ప్రమాదంలో ప్రభావితం అయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే విపత్తుపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రాలేమని రెవెన్యూ మంత్రి కె.రాజన్ అంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఎయిర్‌పోర్స్ మిగ్ 17 హెలికాఫ్టర్లు రంగంలోకి దించినట్లు తెలిపారాయన. BREAKING: 7 bodies found, hundreds feared trapped as two landslides hit Kerala’s Wayanad last night and early this morning…!#Wayanad #WayanadLandSlide pic.twitter.com/hTBGy52x0u— நெல்லை செல்வின் (@selvinnellai87) July 30, 2024 Landslide visuals are coming in from #Wayanad #keralarains pic.twitter.com/a5Y9APcvst— MasRainman (@MasRainman) July 30, 2024 తక్షణ చర్యలకు ఆదేశంఘటన గురించి తెలియగానే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రుల బృందాన్ని మెప్పాడికి వెళ్లాలని ఆదేశించారు. తక్షణ బృందాలతో సహా ఏజెన్సీలు అన్నీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని, ఆ సహాయక చర్యలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకృతి విపత్తు నేపథ్యంలో 9656938689, 8086010833 నెంబర్లతో కంట్రోల్ రూపం ఏర్పాటు చేసినట్లు, వైద్య బృందాలను అక్కడికి పంపించినట్లు ఆ ప్రకటన పేర్కొంది.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. విపత్తుపై ఆరావయనాడ్ భారీ ప్రకృతి విపత్తుపై ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ద్రౌపది ముర్ము తన సందేశం తెలియజేశారు. ఇక ప్రధాని మోదీ.. కేరళ సీఎం విజయన్‌కు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. కేంద్రం తరఫున అన్నివిధాలుగా సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి సురేష్ గోపితోనూ ప్రధాని మాట్లాడారు. ఇంకోవైపు.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ మాట్లాడి బీజేపీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలని కోరినట్లు సమాచారం. వయనాడ్ కలెక్టర్, అధికారులతో ఫోన్లో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాలని కోరారు.ఇక వయనాడ్ విపత్తు మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రధాని కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయలు, అలాగే.. గాయపడ్డ వాళ్లకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఎక్స్ ఖాతాలో పీఎంవో ట్వీట్ చేసింది. అలాగే ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపింది. Pained by the loss of lives in massive landslides in Wayanad, Kerala. My condolences to the bereaved families. I pray for the speedy recovery of the injured and for the success of rescue operations.— President of India (@rashtrapatibhvn) July 30, 2024The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the landslides in parts of Wayanad. The injured would be given Rs. 50,000. https://t.co/1RSsknTtvo— PMO India (@PMOIndia) July 30, 2024ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం
-
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన ఇండియా కూటమి
-
భవిష్యత్తు మార్చేసిన ఒక్క ప్రశ్న
-
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి
-
కంగనా ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీంతో పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. మండి లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కంగనా ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను రద్దు చేయాల్సిందేనని కిన్నౌర్‌కు చెందిన లాయక్ రామ్ నేగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను(రామ్ నేగి) వేసిన నామినేషన్ పత్రాన్ని అసంబద్ధంగా తిరస్కరించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని కంగనా రనౌత్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆదేశాలు జారీ చేశారు. మండీ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లాయక్ రామ్ నేగి తాను పోటీచేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ, తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు చెల్లవని, అందుకే కంగనా రనౌత్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు.లాయక్ రామ్ నేగి అటవీ శాఖ మాజీ ఉద్యోగి. నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారికి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించారు. విద్యుత్, నీరు, టెలిఫోన్ తదితర శాఖల నుంచి ఎలాంటి బకాయిలు లేవని చూపేందుకు ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒకరోజు సమయం ఇచ్చారు. అయితే నేగి ఈ సర్టిఫికెట్లను గడువులోగా సమర్పించినప్పటికీ, రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించినట్లు నేగి ఆరోపిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం.. నేగి దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా తిరస్కరించినట్లు రుజువైతే, మండీ లోక్‌సభ ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి. మండి లోక్‌సభ స్థానం నుంచి రనౌత్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
వికసిత భారత్ లక్ష్యం నెరవేరేనా?
మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్లో అద్భుతాలు ఏమీ లేవనే చెప్పాలి. అయితే ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎమ్ఎస్ఎమ్ ఈలు); అలాగే మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉత్పాదకతలో పెరుగుదల; ఉద్యోగాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యం; సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం, తయారీ సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధన రంగం, మౌలిక వసతుల కల్పనలో మెరుగుదల, ఆవిష్కరణలు– పరిశోధనల అభివృద్ధికి ప్రోత్సాహకాలు, భవిష్యత్ సంస్కరణలు లాంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి చేరుకునే రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. 48 లక్షల 20 వేల 512 కోట్ల రూపాయల బడ్జెట్లో... కేటాయింపులు, నిర్దేశిత లక్ష్యాలు గత బడ్జెట్‌కి కొన సాగింపుగానే కనిపిస్తున్నాయి.బడ్జెట్‌కు ఒకరోజు ముందుగా ప్రకటించిన ఆర్థిక సర్వేలో చెప్పినట్లుగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 2030 నాటికి ప్రతి ఏటా 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి బడ్జెట్లో ఉద్యోగాల కల్పనకూ, ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకూ, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపి స్తోంది. విద్య, నైపుణ్యాల అభివృద్ధికే 1.48 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. రాబోయే ఐదు సంవ త్సరాలలో ఐదు ఉద్యోగ పథకాల ద్వారా 4.1 కోట్ల యువతకి ఉద్యోగాల కల్పన కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నైపుణ్య అభివృద్ధిలో భాగంగా 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వటం ద్వారా, ఐదేళ్లలో కోటి మంది యువతకి ప్రయోజనం చేకూర్చే ఇంట ర్నషిప్ పథకాన్ని ప్రకటించారు.మూడు ఉద్యోగ అను సంధాన ప్రోత్సాహకాల ద్వారా లక్ష మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల విద్యా రుణాలు ఇవ్వటం ద్వారా, క్రెడిట్ గ్యారంటీ పథకంతో ఎంఎస్ఎమ్ఈలకు 100 కోట్ల రుణాలను ఇవ్వడం ద్వారా, 11 లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడం ద్వారా, ముద్ర యోజన రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచటం ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచి నిరుద్యోగ సమస్యకి కళ్ళెం వేయవచ్చని ప్రభుత్వం భావించినట్లు ఉంది. అయితే కొంత కాలంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నప్పటికీ నిరుద్యోగాన్ని అదుపు చేయడంలో సఫలం కాకపోవడం గమనార్హం.25 వేల గ్రామాలకు కొత్తగా రోడ్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పట్టణాలలో కోటి ఇళ్ళ నిర్మాణం, రాబోయే ఐదు సంవత్సరాలలో గృహ నిర్మాణంపై 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనే నిర్ణయం, ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఇవ్వటం కొంతమేరకు ఆహ్వానించదగిన పరిణామమే. కానీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించిన 1.52 లక్షల కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధికి కేటాయించిన 2.66 లక్షల కోట్ల రూపాయలు ఆ యా రంగాలను బలోపేతం చేయ డానికి సరిపోవు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు అదుపు లోనే ఉన్నాయని ఆర్థిక మంత్రి చెబుతున్నా నమ్మ శక్యంగా లేదు.ఈ బడ్జెట్లో కొన్ని కేటాయింపులు ఘనంగా కనిపించినా అవి మొత్తం ఖర్చు చేస్తారా అనేది అను మానమే. ఎందుకంటే... గత బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇంధనం లాంటి ఏడు కీలక రంగా లకు కేటాయించిన కేటాయింపులలో దాదాపు 1.21 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయలేక పోయి నారనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక సర్వేలో చెప్పినట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టకుండా, విద్య – ఉపాధి రంగాల మధ్య అంతరాన్ని పూడకుండా, వ్యవసాయ వృద్ధిని చోదకంగా మార్చకుండా... అంచనా వేస్తున్న ఏడు శాతం వృద్ధిరేటుతో భవిష్యత్తు లక్ష్యాలను అందుకోలేమనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.– డా. తిరునహరి శేషు, వ్యాసకర్త అర్థశాస్త్ర ఉపన్యాసకులు, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
కీలక పథకాలు.. భారీ కేటాయింపులు..
-
లోక్ సభలో నీట్ పేపర్ లీకేజీపై విపక్షాల నిరసన
-
అమృతకాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్: మోదీ
-
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... రేపు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పూరీ రత్నభాండాగరం ఇవాళ మళ్లీ ఓపెన్ చేయనున్న అధికారులు
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్...
-
‘వాట్సాప్ గ్రూప్‌లో సూటిపోటి మాటలు.. భరించలేకపోతున్నా!’
ఢిల్లీ: ఆమె ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగిణి. కానీ, పని చేసే చోట ఏదో ఒకరూపంలో వేధింపులు ఎదుర్కొంది. వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి.. ఆమె తినే తీరు, మాట్లాడే విధానం.. ఇలా తోటి ఉద్యోగులు అన్నింటా ఆమెను హేళన చేస్తూ వచ్చారు. అది పరిధి దాటి వాట్సాప్ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్ చేసే స్థాయికి చేరుకుంది. భరించలేక లేఖ బలవన్మరణానికి పాల్పడిందామె.నోయిడా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేసే శివాని త్యాగి ఆత్మహత్య ఘటన ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఘజియాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందామె. ఆరు నెలలపాటు ఆఫీస్‌లో తోటి ఉద్యోగులు ఆమెను వేధించారని, అది భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని శివాని కుటుంబం ఆరోపిస్తున్నారు. వీటికి తోడు..ఆమె గదిలో దొరికిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్ వాట్సాప్ గ్రూప్‌లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్ డీసీపీ గ్యానన్‌జయ్ సింగ్ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్ చేసేందుకే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారాయన.వేధింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. వేధింపులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించింది. కానీ, పైఅధికారులు ఆమెను ఆపుతూ వచ్చారు. అయితే ఓ సహోద్యోగిణితో వాగ్వాదంలో శివాని ఆమెపై చెయ్యి చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఆమెకు తొలగింపు నోటీసులు ఇచ్చారు. శివాని అది తట్టుకోలేకపోయింది అని ఆమె సోదరి మీడియాకు చెబుతూ కంటతడి పెట్టింది. -
అలా నన్ను దోషిగా తేల్చడం తప్పు!: పూజా ఖేద్కర్
ముంబై: తన వివాదాలు ముసురుకుంటున్న వేళ.. ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మీడియా ముందు పెదవి విప్పారు. దోషిగా నిరూపితం అయ్యేంత వరకు అందరూ నిర్దోషులేనని, కేవలం మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని అన్నారామె. శిక్షణలోనే ఉండగానే గొంతెమ్మ కోర్కెల ద్వారా బదిలీ ఉత్తర్వులతో వార్తల్లోకి ఎక్కిన 34ఏళ్ల ఈ ఐఏఎస్.. చివరకు తప్పుడు సర్టిఫికెట్లతో, అక్రమ మార్గంలో సివిల్ సర్వీస్‌లో చేరారంటూ సంచలన అభియోగాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వ్యవహారంపై కేంద్రం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు పూజతో పాటు ఆమె కుటుంబ సభ్యుల భాగోతాలంటూ అక్కడి మీడియా ఛానెల్స్ రోజుకో కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ ఆమె మీడియాతో తొలిసారి ముఖాముఖి మాట్లాడారు. ఒక వ్యక్తి దోషిగా తేలేంతవరకు నిర్దోషినే. అలా అని మన రాజ్యాంగమే చెప్పింది. కేవలం మీడియా తన కథనాల ద్వారా నన్ను దోషిగా చూపించడం సరికాదు. అవి ఆరోపణలు అని మీరు చెప్పొచ్చు. కానీ, ఇలా నన్ను దోషిగా చూపించడం మాత్రం ముమ్మాటికీ తప్పు అని అన్నారామె. #WATCH | Maharashtra: Trainee IAS officer Puja Khedkar says "I will testify in front of the expert committee and we will accept the decision of the committee...I do not have the right to tell you whatever investigation is going on. Whatever submission I have, will become public… pic.twitter.com/vsGISCyRho— ANI (@ANI) July 15, 2024నిపుణుల కమిటీ ముందు వాంగ్మూలం ఇస్తాను. ఏం విచారణ జరుగుతోందో బహిరంగంగా వెల్లడించే హక్కు నాకు లేదు. కానీ, కమిటీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారామె. తనపై వస్తున్న ఆరోపణలపై ఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థకు వాట్సాప్ సందేశాల ద్వారా స్పందించిన ఆమె.. తర్వాత నేరుగా మీడియా ముందుకే వచ్చి స్పందిస్తున్నారు. -
ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ రికార్డు
-
46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథ ఆలయ వజ్రాభరణాల నిధి గది. మొదటిరోజు గది పరిశీలన. త్వరలో వజ్రాభరణాల లెక్కింపు మొదలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రత్న భాండాగారం రహస్యం ఇదే
-
పూరి రత్న భాండాగారంలో విష సర్పాలు !