
న్యూఢిల్లీ: సెబీ చైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తమను తాము సమర్థించుకుంటున్నారని, కాంగ్రెస్ ఆరోపణలకు విరుద్ధమైన వాస్తవాలను బయటపెడుతున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
సెబీ చైర్‌పర్సన్ మాధబి పురి బచ్ దంపతుల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి స్పందించారు. మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ తమను తాము రక్షించుకొంటూనే, తమపై వచ్చిన ఆరోపణలకు ధీటుగా స్పందిస్తున్నారన్నారు.
‘చాలా ఆరోపణలకు సమాధానాలు వస్తున్నాయ్. ఈ నిజాలను వాళ్లు(పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) పరిగణనలోకి తీసుకుంటారనే అనుకుంటున్నాను’ అని ఆమె అన్నారు. ‘మాధబి పురి బచ్ సమాధానాలపట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా?’ అనే మరో ప్రశ్నకు.. ‘నేనిక్కడ ఉన్నది అది తప్పో, ఒప్పో నిర్ధారించేందుకు కాదు’ అని నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.
బచ్ దంపతులు అక్రమాలకు పాల్పడ్డారని, లాభాపేక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. అదానీ వ్యవహారంలో బచ్ అవినీతికి దిగారని హిండెన్‌బర్గ్ ఆరోపించినదీ తెలిసిందే.
ఇదీ చదవండి: సెబీ పనితీరును సమీక్షిస్తాం: PAC
Comments
Please login to add a commentAdd a comment