‘‘కేంద్ర బడ్జెట్‌లో ఘన మైన లక్ష్యంతో కేటాయించిన రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీ వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువ తకు లబ్ధి చేకూర్చనుంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ ప్రత్యేకంగా విద్య, ఉద్యో గాలు, నైపుణ్యాల వృద్ధి కోసం రూ. 1.48 లక్షల కోట్లు వ్యయం చేయనుంది’’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యో గాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధితోపాటు ఎమ్‌ఎస్‌ఎంఈ రంగం గురించి కూడా బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్–2024 అనేక విధాలుగా ప్రత్యేకమైందే. కాని అది కీలక మైన ఉద్యోగాల కల్పనలో విఫలమవడం ఖాయం. ఇది ఉద్యోగాలు సృష్టించే బడ్జెట్ కాదు.
ఉద్యోగ కల్పన దిశగా 2.1 కోట్ల మంది ఫ్రెషర్స్‌కు ప్రయోజనం చేకూర్చేలా ఒక నెల జీతం లేదా మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రూ. 15,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొ న్నారు. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో నెలకు రూ. 15 వేల వేతనంతో 2.1 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టు కొస్తాయని ఆమె అంచనా వేశారు. ఇది ఊహా జనిత అంచనా మాత్రమే. ఇది ఉద్యోగాలు లభించే ప్రాంతాలకు యువత వలస పోయేట్లు మాత్రమే చేస్తుంది. కానీ వాస్తవంలో ఎలాంటి కొత్త ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం కచ్చితంగా లేదు.
మరో స్కీమ్ ఏమంటే.. తయారీ రంగం, అదేవిధంగా వ్యవస్థీకృత రంగంలో కొత్తగా ఉద్యో గాలు కల్పించే కంపెనీలకు మేలు చేసేలా ఆ యా ఉద్యోగుల పీఎఫ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. వ్యవస్థీకృత రంగ ఉద్యోగాల వేత నంలో పీఎఫ్ అనేది చాలా తక్కువ మొత్తం. దీని వల్ల వేతన వ్యయం కొంత తగ్గుతుంది. యజ మాని మంచి వ్యక్తి అయితే ఆ మొత్తాన్ని ఉద్యోగికి ఇచ్చి వేతనం పెంచే ప్రయత్నం చేస్తాడు. అంతే కాని పీఎఫ్ ఇచ్చే స్కీమ్ ఏ రకంగానూ కొత్త ఉద్యో గాల కల్పనకు ప్రోత్సాహం ఇచ్చేది కాదు.
ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయడం వల్ల నైపు ణ్యాలు పెరుగుతాయి. ఎందుకంటే.. వాస్తవ నైపు ణ్యాలు ఐటీఐల్లో లభించడం లేదు. ఉద్యోగంలో చేరిన తర్వాతే అవసరమైన స్కిల్స్ నేర్చుకుంటు న్నారు. ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన తర్వాత సదరు అభ్యర్థికి సరైన ఉద్యోగం లభించకుంటే.. ఆ ఐటీఐ చదువు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అదే విధంగా అప్రెంటిస్ స్కీమ్, ఇంటర్న్ షిప్ స్కీమ్స్ కూడా సప్లయ్ వైపు తీసుకున్న చర్యలే తప్ప కొత్త ఉద్యోగాలు సృష్టించేవి కాదు. వాస్తవానికి వ్యాపారం విస్తరించినప్పుడే కొత్త ఉద్యోగాల కల్పన అనేది సాధ్యమవుతుంది. కొత్త మార్కెట్లు లేదా కొత్తగా డిమాండ్ పెరగడం వల్ల వ్యాపారాల విస్తరణ జరుగుతుంది. ఆర్థిక మంత్రి ఊహించినట్లు సప్లయ్ సైడ్ చర్యల వల్ల కొలు వుల సృష్టి జరగదు. ఉద్యోగాల కల్పన అనేది డిమాండ్‌ను పెంచే ప్రోత్సాహకాల వల్లనే సాధ్య మవుతుంది.
అసలు మొత్తంగా ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే సరిగా లేదు. ఎందుకంటే... స్కిల్స్ పెంచడం, అప్రెంటిస్, ఇంట ర్న్‌షిప్ అవకాశాలు కల్పించడం వల్ల నైపుణ్యా లున్న యువత సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇలా స్కిల్స్ పెంచుకున్న యువతకు తక్షణమే ఉద్యోగాలు చూపించలేకపోతే అది మరింత వైఫ ల్యంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం వ్యవ స్థలో డిమాండ్ పెంచే చర్యలు తీసుకోవాలి.
కొత్త ఉద్యోగాలు భారీగా సృష్టించేది ఎవరు? ఐటీ రంగం కాని, పెద్ద పెద్ద కంపెనీలు కాని కాదు. వీరంతా ఇప్పుడు ఆటోమేషన్‌ను విని యోగిస్తున్నారు. వీరు భారీ సంఖ్యలో కొలువులు ఆఫర్ చేసే పరిస్థితి లేదు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఎమ్‌ఎస్‌ఎంఈ రంగమే! బడ్జె ట్‌లో ముద్రా లోన్ మొత్తాన్ని పది లక్షల రూపా యలకు పెంచారు. కానీ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనకంజ వేస్తుండటంతో అవి అవస రమున్న వారికి చేరడంలేదు. ఎంఎస్ ఎంఈలలో పెట్టుబడులు పెంచేలా రుణ గ్యారెంటీ స్కీమ్ మరొకటి కూడా ఉంది. కానీ దురదృష్టవ శాత్తు ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు భారీగా పన్ను రాయితీలు ఇస్తోంది. ఎంఎస్‌ఎంఈలకు మాత్రం తిరిగి చెల్లించే రుణాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఎంఎస్‌ఎంఈ రంగంలో వృద్ధితోపాటు లాభాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ రంగానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా అవసరం. వ్యాపార విస్తరణకు, వృద్ధికి, మను గడకు సబ్సిడీ అందించాలి. జీఎస్‌టీ ఒకరకంగా ఎంఎస్‌ఎమ్‌ఈ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. కాని ఆర్థిక మంత్రి ఈ రంగం మనుగడ కోసం ఏమీ చేయడంలేదు. వడ్డీ రాయితీ తప్పితే ఎంఎస్‌ఎంఈ రంగానికి ఎలాంటి సబ్సిడీ అందు బాటులో లేదు. అంతిమంగా చెప్పేదేమంటే... ఎక్కువ మందికి ఉపాధి కల్పించే, అధికసంఖ్యలో ఉద్యోగాలు సృష్టించే ఎంఎస్‌ఎమ్‌ఈ రంగ వృద్ధి, విస్తరణకు అవసరమైన ప్రోత్సా హాన్ని అందించడంలో బడ్జెట్ 2024–25 విఫల మైంది!!
– టి. మురళీధరన్, వ్యాసకర్త, టీఎమ్‌ఐ గ్రూపు ఫౌండర్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment