జన్యు నిధుల అనుసంధానం కీలకం! | Sakshi Guest Column On National Gene Bank | Sakshi
Sakshi News home page

జన్యు నిధుల అనుసంధానం కీలకం!

Published Mon, Mar 17 2025 4:49 AM | Last Updated on Mon, Mar 17 2025 4:49 AM

Sakshi Guest Column On National Gene Bank

అభిప్రాయం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025–26 ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెండవ ‘నేషనల్‌ జీన్‌ బ్యాంక్‌’ ఏర్పాటును ప్రక టించారు. ఇది ఒక మిలియన్‌ జన్యు పదార్థాల శ్రేణులతో నిండి, భవిష్యత్తులో ఆహారం– పోషకాల భద్రత కోసం ఏర్పాటు చేయబోయే నిర్మాణంగా చెప్పుకొచ్చారు. జన్యు వైవిధ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికీ, వైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యం కోసం... పబ్లిక్, ప్రైవేట్‌ రంగాలూ, కమ్యూ నిటీలూ (వ్యక్తుల సమూహాలు, సంఘాలు, సంప్ర దాయ జాతులు) కలిసికట్టుగా ప్రయత్నిచవలసిన అవసరం ఉంది. 

అందువల్ల నిపుణులు ఈ నిర్ణ యాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. నూతనంగా ఏర్పడ నున్న రెండవ జీన్‌ బ్యాంకుతో కమ్యూనిటీ విత్తన బ్యాంకుల అనుసంధానం ద్వారా పారిశ్రామిక రంగంతో సహా సంబంధిత వ్యక్తులు, సంస్థలు (షేర్‌ హోల్డర్లు) అందరూ అంతర్జాతీయ ఒప్పందం (కన్వెన్షన్‌ ఆన్‌ బయోలా జికల్‌ డైవర్సిటీ–సీబీడీ 1993), జాతీయ జీవ వైవిధ్య చట్టం–2002 (ఎన్‌బీఏ–2002)లో పొందుపరిచిన మూడు సూత్రాలకు (పరిరక్షణ, స్థిరమైన వినియోగం, న్యాయమైన – సమానమైన లాభాల పంపిణీ) కట్టుబడి ఉండగలరన్న ఆశా భావం వ్యక్తం అవుతోది.

జాతీయ జన్యు బ్యాంక్‌ అనేది భవిష్యత్‌ తరాలకు వివిధ పంటలు, అడవి జాతులు, అనేక రకాల చెట్ల జన్యువులను నిల్వచేసే సదుపాయం. కమ్యూనిటీ విత్తన బ్యాంకులు పంటల అభివృద్ధి, ఆహార భద్రత, స్థిరమైన సమాజ అభివృద్ధికి బిల్డింగ్‌ బ్లాక్‌లుగా ఉపయోగపడే స్థానిక ప్రత్యామ్నాయ జన్యు వనరులుగా గుర్తించబడ్డాయి. 

జన్యు వనరుల సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవి దశాబ్దాల నుండి అనధికార వ్యవ స్థలుగా కొనసాగుతూనే ప్రాంతీయ కమ్యూనిటీలకు సంప్రదాయ విత్తన కోశాగారాలుగా పని చేస్తున్నాయి. అందులో ఉన్న వైవిధ్యభరిత జన్యు పదార్థాలను ఒక వ్యవస్థలో ఏకీకృతం చేయగలిగే కమ్యూనిటీ నిధులుగా ప్రస్తుతం సంఘటిత పడుతూ, అక్కడి వెనుకబడిన ఆదివాసీ కమ్యూ నిటీ వర్గాలకు సేవలు అందిస్తున్నాయి. 

ఈ కమ్యూనిటీ విత్తన బ్యాంకులు స్థానికంగా నిర్వహించబడే సంస్థలు. ఇవి విత్తనాలను సేకరించడం, నిల్వ చేయడం, కమ్యూనిటీ విత్తన అవసరా లను తీర్చడం వంటి సేవలు అందిస్తున్నాయి. అవి దేశంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద–చిన్న పంటలు, ఔషధ మొక్కలు, అలాగే నిర్లక్ష్యం చేయబడి తక్కువ ఉపయోగంలో ఉన్న మొక్కల జాతులను తమ పరిధిలో అంతరించి పోకుండా రక్షణ కలిగిస్తూ ఉంటాయి. 

అయితే ప్రస్తుతం ఇవి సరైన నిల్వ, మౌలిక సదుపాయాలు, విత్తన శుద్ధి పరికరాలు, నిర్వహణ సిబ్బందికి శిక్షణ లేమి, ఆర్థిక మద్దతు లోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. ఈ సమస్యలను పరిష్కరించవలసి ఉంది.

భారత్‌ తన మొదటి జాతీయ జన్యు నిధిని 1996లో జాతీయ జాతీయ జన్యు వనరుల బ్యూరో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చే సింది. మొట్ట మొదటి జన్యు నిధికి ఉన్న 0.47 మిలియన్ల నమూనాల పరి రక్షణ సామర్థ్యాన్ని అధిగమించి, రెండో జాతీయ జన్యు నిధికి నిల్వ సామర్థ్యాన్ని ఒక మిలియన్‌ దాకా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

అయితే, దేశంలోని అధిక జీవవైవిధ్య సాంద్రత ఉన్న ప్రాంతాలలోని స్థానిక పరిరక్షకుల సంఘాలతో  కమ్యూనిటీ విత్తన నిధులను జాతీయ జీన్‌ బ్యాంకుతో అనుసంధాన పరచడం ఒక ప్రగతిశీల ఆచరణయోగ్య కార్యక్రమం. భారత దేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈశాన్య, అండమాన్‌–నికోబార్‌ దీవులు వంటి అనేక జీవవైవిధ్య సాంద్రత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. కనుక, ప్రస్తుత, భావితరాల ఆహార మరియు పోషకాల భద్రతా లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ రెండవ జాతీయ జన్యు బ్యాంకు ఏర్పాటు చొరవలో స్థానిక పరిరక్షకులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలి.

బలిజేపల్లి శరత్‌ బాబు
వ్యాసకర్త భారత వ్యవసాయ మండలి విశ్రాంత శాస్త్రవేత్త 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement