
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం .. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు’అని రాజ్యసభలో బడ్జెట్‌పై (parliament budget session) చర్చ సందర్భంగా మాట్లాడారు. నిర్మల సీతారామన్ ఇంకా ఏమన్నారంటే?
‘ఏపీ విభజన సమయంలో తెలంగాణ (telangana debt) మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది. నేను ఏ పార్టీని తప్పుబట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోదీ ప్రభుత్వమే.
ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్‌లో ఎయిమ్స్, 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు, రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్ కేటాయింపు, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం,ఐదు కొత్త వందేభారత్ ట్రైన్ల కేటాయింపు, 40రైల్వే స్టేషన్స్ రీడెవలప్, పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్‌జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల మంజూరు, 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు..ఇలా చెప్పుకుంటూ పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము’ అని వ్యాఖ్యానించారు.
👉చదవండి : కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ!
Comments
Please login to add a commentAdd a comment