debt
-
ఏపీ అప్పు రూ.5.62 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పులు 34.70 శాతం ఉంటాయని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2023–24)లో జీఎస్డీపీలో అప్పులు 34.58 శాతమని వెల్లడించారు.సోమవారం లోక్‌సభలో ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు దేశంలోని రాష్ట్రాల అప్పుల వివరాలను పంకజ్ చౌదరి వెల్లడించారు. రాష్ట్రాల నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలకు సర్దుబాట్లు ఏమైనా ఉంటే ఆ తర్వాత సంవత్సరాల రుణాల పరిమితుల్లో చేరుతాయని వివరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగా అప్పులు ఉన్నాయా..? లేదా..? అనేది రాష్ట్రాల శాసనసభలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. -
మరో రూ.11వేల కోట్లు.. అప్పు చేసిన కూటమి ప్రభుత్వం
సాక్షి,విజయవాడ : కూటమి ప్రభుత్వం అమరావతి కోసం రూ.11 వేల కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు మొత్తాన్ని మొత్తం అప్పు అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టనుంది.ఇక,రూ.11 వేల కోట్ల అప్పు కోసం హాడ్కోతో సీఆర్డీఏ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రపంచ బ్యాంకు ఋణానికి అదనంగా హడ్కో రుణం తీసుకుంది. రూ. 11 వేల కోట్లను అమరావతిలో పనులకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది. -
‘అమరావతిలో వేల ఎకరాల్ని అమ్ముతాం.. అప్పులు తీరుస్తాం’: నారాయణ
సాక్షి,విజయవాడ : అమరావతి భూములపై ఏపీ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి వేల ఎకరాల భూముల్ని సేకరించింది. వాటిలో నాలుగువేల ఎకరాలు అమ్మేయనున్నట్లు తెలిపారు.భూములు ధర పెరిగాక రైతుల నుండి సేకరించిన భూముల్లో 4 వేల ఎకరాలు అమ్ముతాం. రైతులకు అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్ లను తిరిగి ఇస్తాం. రైతులు భూములు అమ్మిన డబ్బులతో అప్పులు తీరుస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
రూ.9 వేల కోట్ల అప్పునకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) పలు రకాల బాండ్ల విడుదల ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు సమీకరించుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయనగరం జిల్లాలోని గాజులరేగ గ్రామంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఎకరానికి సంవత్సరానికి రూ.వెయ్యి అద్దె ప్రాతిపదికన 33 ఏళ్లపాటు రెండు ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పర్యాటకానికి భూముల కేటాయింపు పాలసీ–2024–29కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం కోసం 27 ఎకరాల భూమి ఏపీఐఐసీకి బదలాయించేందుకు ఆమోదం తెలిపింది.తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వ్యవసాయ, సహకార శాఖకు 10.72 ఎకరాలు కేటాయించేందుకు, రాజమండ్రిలోని గోదావరి నదిపైన ఉన్న హేవ్ లాక్ వంతెనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వీలుగా 116.974 ఎకరాల భూమిని, కాకినాడ జిల్లా తమ్మవరం గ్రామంలో 66.12 ఎకరాల భూమిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థకు కేటాయించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లా వేలయిర్పాడులోని ఆర్‌ఎస్‌నెంబర్ 74లో 5.75 ఎకరాలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు కేటాయించేందుకు నిర్ణయించారు. చిత్తూరు జిల్లా జంగాలపల్లి గ్రామంలోని సెయింట్ గ్యాబ్రియేల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థకు కేటాయించిన 4.64 ఎకరాల్లో నిర్మాణానికి మరో 18 నెలలు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో సెంచూరియన్ స్కూల్ ఆఫ్ రూరల్ ఎంటర్ర్పైజ్ మేనేజ్మెంట్ ట్రస్ట్–భువనేశ్వర్‌ను సెంచూరియన్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ట్రస్టు–విశాఖపట్నంగా మార్చుతూ తదనుగుణంగా ఏపీ ప్రైవేటు యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2016 (యాక్ట్ 18 ఆఫ్ 2018) సవరణ బిల్లు 2025ని శాసనసభ ఆమోదం కోసం పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సెంట్రల్ పూల్‌కు కొత్తగా 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఇన్ సర్వీసులో ఉన్న పీజీ డాక్టర్లు దానికనుగుణంగా వేతనాలు పొందడానికి వీలుగా పీజీ లీన్ ఉత్తర్వులు ఇవ్వడానికి ఆమోదించింది. కుప్పం నియోజకవర్గంలో రూ.5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గీత కులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో నాలుగు దుకాణాలను సొండి కులాల వారికి కేటాయిస్తూ చేసిన సవరణను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ)లో 22 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఎంపీడీవోల డైరెక్ట్ రిక్రూట్మెంట్ రద్దు ఏపీపీఎస్సీ ద్వారా ఎంపీడీవోల నియామక ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఎంపీడీవో ఖాళీలను ఇకపై పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సర్వీసు రూల్స్‌లో సవరణ తీసుకొచ్చే పలు ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంపీడీవో, డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్పీవో) ఇక ఒకే క్యాడర్‌గా కొనసాగుతారు. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) స్థాయిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డీపీవో, డిప్యూటీ జడ్పీ సీఈవో పోస్టులతో పాటు డీడీవో పోస్టుల్లో మూడో వంతు నేరుగా నియామకం చేపట్టే విధానం తీసుకురానున్నారు. మండల స్థాయిలో పనిచేసే ఈవోపీఆర్డీలకు ఇక డిప్యూటీ ఎంపీడీవో హోదా కల్పిస్తారు. జడ్పీ సీఈవో పోస్టుల్లో సగం ఐఏఎస్ అధికారులను నియమించే నిబంధనను మంత్రివర్గం ఆమోదించింది. ఐఏఎస్ అధికారులను నియమించని పక్షంలో జడ్పీ సీఈవో ఫీడర్ క్యాటరీ సిబ్బంది లేదా ఇతర శాఖ నుంచి డిప్యూటేషన్ విధానంలో నియమిస్తారు. వేరే శాఖ సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ నియామకాల్లో బాధ్యతలు అప్పగించే పక్షంలో అలాంటి వారికి ఇక ముందస్తు శిక్షణను తప్పనిసరి చేశారు. సీబీఐ పరిధిలో ఉన్నా జోక్యం చేసుకోవాలి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ పరిధిలో ఉన్నప్పటికీ జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబు పోలీస్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై ఆయన మంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వివేకా హత్య కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని, ఇప్పుడు వాచ్మెన్ రంగన్న అలానే మృతి చెందడం సందేహాస్పదంగా ఉందని చెప్పారు.రంగన్న మృతికి సంబంధించిన వివరాలను సీఎం, మంత్రులకు డీజీపీ వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చెప్పారని, ఇప్పుడు వాచ్మెన్ రంగన్నను పోలీసులే చంపారని వైఎస్సార్సీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయని చెప్పినట్లు తెలిసింది. అందుకే ఆ పార్టీ కుట్రల గురించి అప్రమత్తంగా ఉండాలని తాను ముందు నుంచీ చెబుతున్నానని చంద్రబాబు అన్నట్లు సమాచారం. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు కూడా ఇలానే చనిపోతూ వచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు సాక్షులు చనిపోయారన్నారు. రంగన్నను హత్య చేసి, దానిని ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఇందులో దాగి ఉందని పలువురు మంత్రులు అన్నట్లు తెలిసింది. -
వైఎస్సార్సీపీ రీట్వీట్‌తో నీళ్లు నమిలిన నారా లోకేష్
సాక్షి,అమరావతి : రాష్ట్ర అప్పులపై నారా లోకేష్ కాకిలెక్కలు చెప్పారు. కళ్లార్పకుండా అబద్దాలను చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా చెలామణి అవుతున్నారు. నారా లోకేష్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే అని చూపుతూ ట్వీట్లో పేర్కొన్నారు. విభజన సమయానికి ఏపీ వాటా అప్పుల వడ్డీ రూ.7,488 కోట్లు ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్ర అప్పులు బాగా పెరిగాయి.ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ఆధారాలతో సహా నిరూపించింది. వైఎస్సార్సీపీ రీట్వీట్‌తో లోకేష్ నీళ్లు నమిలారు. ఆర్థిక విధ్వంసుడు తన తండ్రేనని తేలడంతో కిక్కురుమనకుండా లోకేష్ సైలెంట్ అయ్యారు. ఈ తొమ్మిది నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు.. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. మరి ఆ లక్షన్నర కోట్లకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు,లోకేష్ నోరెత్తకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .@naralokesh.. నీ ట్వీట్ చూస్తుంటే పబ్లిక్ ఫైనాన్స్‌పై నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని అర్థమవుతోంది మార్కెట్ రుణాలపై వడ్డీ చెల్లింపునకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అనుకోవడం నీ అవివేకంరాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో 75% మార్కెట్ రుణాలే కాదు..ఇంకా మిగతా వాటిల్లో కూడా చాలా… https://t.co/ZTVFSAL3IP— YSR Congress Party (@YSRCParty) February 17, 2025 -
‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం .. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు’అని రాజ్యసభలో బడ్జెట్‌పై (parliament budget session) చర్చ సందర్భంగా మాట్లాడారు. నిర్మల సీతారామన్ ఇంకా ఏమన్నారంటే? ‘ఏపీ విభజన సమయంలో తెలంగాణ (telangana debt) మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది. నేను ఏ పార్టీని తప్పుబట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోదీ ప్రభుత్వమే.ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్‌లో ఎయిమ్స్, 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు, రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్ కేటాయింపు, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం,ఐదు కొత్త వందేభారత్ ట్రైన్ల కేటాయింపు, 40రైల్వే స్టేషన్స్ రీడెవలప్, పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్‌జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల మంజూరు, 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు..ఇలా చెప్పుకుంటూ పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ! -
మరీ ఇంత అన్యాయమా?.. కోర్టు మెట్లెక్కిన విజయ్ మాల్యా!
బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా కర్ణాటక కోర్టును ఆశ్రయించారు. తాను వ్యాపార నిమిత్తం భారత్‌లోని పలు బ్యాంకుల్లో చేసిన అప్పు కంటే.. అవి తన వద్ద నుంచి వసూలు చేసిన మొత్తం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని ఆరోపించారు. కాబట్టి రికవరీ చేసిన మొత్తానికి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్ను అందించేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని మాల్యా తన పిటిషన్లో కోరారు.బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా తరుపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఆర్ దేవదాస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య తన వాదనల్ని కోర్టుకు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.6,200 కోట్ల అప్పు చేసిందని.. అందుకు బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని అన్నారు. ఈ విషయం గురించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. మాల్యాకు చెందిన రూ.14, 131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని, ఆయన తీసుకున్న రుణంలో దాదాపు రూ.10, 200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారు. కాబట్టి బ్యాంకులు తీసుకునే తదుపరి రికవరీ చర్యలపై తాత్కాలిక స్టే విధించాలని, అన్నీ బ్యాంక్ స్టేట్మెంట్లు అందించాలని మాల్యా కోరారు.వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది. -
మరో ఆరువేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి,విజయవాడ : సూపర్ 6లో ఒక్క పథకం అమలు చెయ్యకుండానే అప్పులు చేయడంలో కూటమి ప్రభుత్వం సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తుంది. తాజాగా, మంగళవారాన్ని అప్పువారంగా మార్చేస్తూ..అర్బీఐ వద్ద అర్రులు చాచింది. మరో ఆరువేల కోట్లు అప్పు చేసింది.చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం..రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు సమీకరిస్తోంది. ఈ ఆరువేల కోట్లతో బడ్జెట్ అప్పులు మొత్తం రూ.80,827 కోట్లకు చేరాయి. తద్వారా ఎనిమిది నెలల్లోనే రికార్డ్ స్థాయిలో కార్పొరేషన్లు,బ్యాంక్‌ల ద్వారా మరో రూ.52 వేల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది. -
లోన్ తీసుకుని మరీ మరదలు హత్యకు సుపారీ
ముజఫర్‌నగర్: లోన్ తీసుకుని మరీ.. మరదలిపై సామూహి క అత్యాచారం, హత్య చేయించాడో ప్రభుద్ధుడు. ఈ దారుణ ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది. ముజఫర్‌నగర్‌కు చెందిన ఆశిష్ అనే వ్యక్తి.. తన భార్య చెల్లెలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు.. ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. చంపేంత ధైర్యం ఒక్కడికే లేదు. అందుకోసం ఇద్దరు మనుషులను మాట్లాడుకున్నాడు. వారికి చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో రూ.40 వేలు అప్పుగా తీసుకుని మరీ శుభమ్, అతని స్నేహితుడు దీపక్‌కు చెల్లించాడు. జనవరి 21న బాధితురాలికి కాల్ చేసి రప్పించారు. స్కూటర్‌పై మీరట్‌లోని నాను కాలువ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత కండువాతో గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టి.. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు. 21న ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి ఎంతకీ రాకపోవడం, ఫోన్ పనిచేయకపోవడంతో జనవరి 23న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చివరిసారి ఆశిష్, శుభం, దీపక్‌లతో కనిపించినట్లు తేలింది. ఆశిశ్‌ను విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. మరదలు బ్లాక్మెయిల్ చేయడంవల్లే చంపాల్సి వచ్చిందని చెప్పాడు. ఘటనా స్థలం నుంచి బాధితురాలి అవశేషాలు, కాలిపోయిన దుస్తులు, ఉంగరం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని...
తలమడుగు/తాంసి ఆదిలాబాద్ జిల్లా: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బు ఇవ్వకపోవడం, తాను అప్పు తీసుకున్న వారికి సమాధానం చెప్పలేక ఓ వ్యక్తి మనోవేదనకు గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించి . అందులో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, తలమడుగు ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం ఉండం గ్రామానికి చెందిన ఆకుల రాకేశ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో రాకేశ్ తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన తన మేనమామ వద్ద పెరిగాడు. రాకేశ్‌కు ఆదిలాబాద్‌కు చెందిన లావణ్యతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్ల కూతురు ప్రశస్త్య ఉంది. మొదట్లో ఆటో నడిపేవాడు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏడాది క్రితం ఫర్టిలైజర్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో మృతుడి మేనమామ–అత్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సాయి, స్పందన ఉన్నారు. వారు రాకేశ్ సంరక్షణలోనే ఉన్నారు. ఇద్దరూ ఉన్నతవిద్య అభ్యసించగా, సాయి బెంగ ళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. స్పందన ఇటీవల నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. రాకేందర్‌కు రూ.60 లక్షలు అప్పుగా..ఆదిలాబాద్‌లోని విద్యానగర్ కాలనీలో 21 మంది సభ్యులతో కలిసి రాకేందర్ ఆర్కే సొసైటీని ప్రారంభించాడు. లావణ్య సైతం ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉంది. అందులో కొంత పెట్టుబడి కూడా పెట్టారు. అయితే ఆ సొసైటీ దివాలా తీసింది. అదే విధంగా రాకేందర్‌కు రూ.60లక్షలు అప్పుగా ఇచ్చినట్లు రాకేశ్–లావణ్య దంపతులు సూసైడ్ నోట్ రాశారు. బాకీ ఉన్న డబ్బుల వివరాలు కూడా అందులో పేర్కొన్నారు. రాకేందర్ తీసుకున్న ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వివరించారు. దీంతో ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం, బయట తాను చేసిన అప్పులను తీర్చే మార్గం కనిపించకపోవడంతో కొద్ది రోజులుగా రాకేశ్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.సొంత చేనుకు వచ్చిన... శనివారం ఉదయం తలమడుగు మండలం ఉండం శివారులో ఉన్న తన సొంత చేనులో రాకేశ్(35), ఆయన భార్య లావణ్య, మరదలు స్పందన(19) పురుగు మందు తాగారు. ఆ తర్వాత లావణ్య జిల్లా కేంద్రంలో ఉండే తన బాబాయికి ఫోన్ ద్వారా సమాచారం ఇచి్చంది. దీంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే రాకేశ్, స్పందన చనిపోయారు. కొనఊపిరితో ఉన్న లావణ్యను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. కూతురుకు తాగించేందుకు మందు లేకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. -
తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త!
భూపాలపల్లి రూరల్: ‘తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త.. అమ్మను బాగా చూసుకో.. అమ్మకు, నీకు తోడుగా, అండగా ఉండాల్సిన సమయంలో మీకు అన్యాయం చేసి తిరిగిరాని లోకానికి వెళ్తున్నా.. నన్ను క్షమించండి’.. అంటూ ఓ యువరైతు సెల్ఫీ వీడియో తీసి, లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన నీలాల శేఖర్ (29)తండ్రి రాజయ్య 15 ఏళ్ల క్రితం చనిపోయాడు.తల్లి వెంకటమ్మ, తమ్ముడు సిద్ధూతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి సరిగ్గా లేక, పెట్టుబడి కూడా రాలేదు. రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన శేఖర్.. నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న శేఖర్ ఆదివారం చనిపోయాడు. కాగా, తాను కచ్చితంగా చనిపోతానని భావించిన శేఖర్.. ముందే తీసిన సెల్ఫీ వీడియోలో అప్పుల బాధతోనే పురుగు మందు తాగినట్లు స్పష్టం చేశాడు. అంతకుముందే ఆయన రాసి పెట్టుకున్న లేఖ కూడా బయటికి వచ్చింది. లేఖ, సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఆ రైతు కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో కుటుంబంతో సహా కొమ్మర నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ రైతు సంఘం(సీపీఎం) అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఇదే రోజున నంద్యాల జిల్లా ఎం.లింగాపురానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ రైతు సంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మరో ప్రకటనలో విమర్శించారు. -
అప్పు ఇచ్చిన వ్యక్తి పంట తీసుకెళ్లడంతో..కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
నకరికల్లు: అప్పు తీర్చలేదని తాను పండించిన పంటను అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకెళ్లడంతో అవమానభారం తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన కౌలు రైతు చెన్నంశెట్టి కోటేశ్వరరావు కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా రెండెకరాల్లో సాగు చేశాడు. వరుస నష్టాలతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు భారంగా మారాయి.ఒక ఎరువుల దుకాణంలో పంటకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.2 లక్షలకు చేరింది. అప్పును తీర్చేందుకుగాను 95 బస్తాలకు పైగా ధాన్యం, మరోవైపు రూ.50 వేల నగదు దశలవారీగా చెల్లించినా ఇంకా బాకీ మిగిలి ఉంది. కాగా, శుక్రవారం వరి పంట నూర్పిడి చేయగా వచ్చిన మొత్తం 80 ధాన్యం బస్తాలను దుకాణదారుడు తన గుమస్తాను పంపి తీసుకెళ్లాడు. దీంతో కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. -
మళ్లీ రూ.5వేల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ అప్పు చేస్తోంది. ఈసారి ఏకంగా రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. ఈ నెల 31వ తేదీన ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం 12 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 13 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 14 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.2,000 కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం నవంబర్ వరకు రూ.65,590 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రూ.4,237 కోట్లు అప్పు చేసింది. ఈ నెల 31వ తేదీన మరో రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులే రూ.74,827 కోట్లకు చేరనున్నాయి. ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేసింది. దీనికి తోడు చంద్రబాబుతోపాటు కూటమి నేతలు కూడా అప్పులు ఎక్కువగా చేశారంటూ లేని అప్పులను కూడా కలిపి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పరిధిలోను, బడ్జెట్‌కు బయట పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నప్పటికీ ఎల్లో మీడియా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు అప్పులు చేస్తే ఒప్పు... అదే గత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తే తప్పు... అన్నట్లుగా చిత్రీకరించడమే ఎల్లో మీడియా నైజంగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
6 నెలల్లోనే రికార్డ్ స్థాయిలో బాబు సర్కార్ అప్పులు
సాక్షి, అమరావతి: మరో రూ.5 వేల కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు సర్కార్ రెడీ అయిపోయింది. మంగళవారం అప్పుకి ప్రభుత్వం ఇండెంట్ పెట్టేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరించనుంది. మొత్తం రూ.74,872 కోట్లకు బడ్జెటరీ అప్పులు చేరనున్నాయి. 6 నెలల్లోనే రికార్డ్ స్థాయిలో బాబు సర్కార్ అప్పులు చేసింది.కాగా, సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడం, అప్పులు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోంది. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నన్ను గెలిపించండి.. సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా.. నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్’ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేయడం పైనే దృష్టి పెట్టారు. మంగళవారాన్ని పూర్తిగా అప్పుల వారంగా మార్చేశారన్న విమర్శలు వస్తున్నాయి.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.74,590 కోట్లకు చేరాయి. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు రూ.65,590 కోట్లకు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు మరో రూ.9,000 కోట్లకు ఎగబాకాయి. ఇక రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేసేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈ మేరకు సీఆర్డీఏకు అనుమతిస్తూ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
రూ.లక్ష కోట్ల అప్పు!
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్లోనూ, బడ్జెటేతర అప్పుల్లోనూ దూసుకుపోతున్నారు. ఆర్నెల్లలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పుల దిశగా రాష్ట్రం పరుగులు తీస్తోంది. మరోవైపు గత ఏడాదితో పోల్చితే అమ్మకాల పన్ను ఆదాయంతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ వరకు రాబడులు, వ్యయాలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. రాజధానికి రూ.52 వేల కోట్లు! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.74,590 కోట్లకు చేరాయి. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు రూ.65,590 కోట్లకు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు మరో రూ.9,000 కోట్లకు ఎగబాకాయి. ఇక రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేసేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈ మేరకు సీఆర్డీఏకు అనుమతిస్తూ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.అంటే సీఎం చంద్రబాబు ఆర్నెల్ల పాలనలో ఇప్పటికే చేసిన అప్పులు, చేయనున్న అప్పులు కలిపి మొత్తం రూ.1.05 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి. అంతేకాకుండా ప్రాథమిక అంచనా మేరకు రాజధానికి రూ.52 వేల కోట్ల మేర నిధులు అవసరమని, ఇప్పటికే రూ.31 వేల కోట్లు సమీకరించినందున మిగతా నిధులు రూ.21 వేల కోట్లు కూడా సమీకరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏకి ప్రభుత్వం నిర్దేశించింది. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమే అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పథకాలు లేవు.. పన్నుల మోతలే సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోగా అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపారు. ఏ ఒక్క పథకం అమలు కాకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అమ్మకం పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనం. కాగ్ గణాంకాల మేరకు గతేడాది నవంబర్‌తో పోల్చితే ఈ ఏడాది నవంబర్ నాటికి అమ్మకం పన్ను ఆదాయం రూ.1,043 కోట్లు తగ్గిపోయింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల ఆదాయం రూ.868 కోట్లు క్షీణించింది. మరోపక్క కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రూ.12,510 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు సంబంధించి సామాజిక వ్యయం కూడా గత నవంబర్‌తో పోల్చితే తగ్గిపోయిందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు రెవెన్యూ లోటు రూ.9,742 కోట్లు అదనంగా పెరిగింది. -
తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేటీఆర్.. కాంగ్రెస్‌పై ప్రివిలేజ్ మోషన్
సాక్షి,తెలంగాణ భవన్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ‘బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందని, కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారంటూ’ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. అప్పుల అంశంపై సోమవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ రాష్ట్ర అప్పులు రూ. 7 లక్షల కోట్లంటూ అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేము ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం. ఆర్బీఐ నివేదిక ప్రకారం అప్పు రూ. 3.89 లక్షలు మాత్రమే అని పేర్కొంది. కానీ రూ.7లక్షల కోట్ల అప్పులంటూ ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం ‘ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ నివేదిక తేల్చిందని అన్నారు.డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. కావున తెలంగాణ శాసనసభ కార్యవిధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్ఎస్ శాసనసభా పక్షం తరపున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’ అని ట్విట్లో పేర్కన్నారు. We will be moving a privilege motion against the Congress Govt for its repeated attempts to mislead the legislature & the people of Telangana by stating that the total state debt is 7 lakh crore where as RBI report exposed their lies stating that the debt is only 3.89 lakh crore… pic.twitter.com/Of7N3Yk0I1— KTR (@KTRBRS) December 16, 2024 -
రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 బిలియన్ డాలర్లు(రూ.24,900 కోట్లు) రుణాన్ని పొందేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది చెల్లించాల్సిన రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు దాదాపు ఆరు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.కంపెనీ గతంలో తీసుకున్న దాదాపు 2.9 బిలియన్ డాలర్ల రుణాల మెచ్యురిటీ 2025 మొదటి త్రైమాసికంలో ముగుస్తుంది. కాబట్టి కంపెనీ ఆయా రుణాలు చెల్లించి తిరిగి రిఫైనాన్స్కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్యాంకు ఇంతమొత్తంలో చెల్లించడం ఒకింత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కాబట్టి, దాదాపు ఆరు బ్యాంకులతో సంస్థ అధికారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే 2023 నుంచి కొంత విరామం తర్వాత రిలయన్స్ ఆఫ్‌షోర్ రుణాల(ఇతర దేశాలు అందించే అప్పులు) మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినట్లుగా అవుతుంది. ఇదిలాఉండగా, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇటీవల రుణాల ద్వారా 8 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉండడంతో రుణాలు పొందేందుకు మార్గం సులువవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: గ్లోబల్ సౌత్ లీడర్‌గా భారత్మూడీస్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్‌ను Baa2 వద్ద స్థిరంగా ఉంచింది. ఇది ఇండియన్ సావరిన్ గ్రేడ్ కంటే మెరుగ్గా ఉండడం కూడా రిలయన్స్‌కు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. సంస్థ ఆర్థిక స్థితి, విభిన్న వ్యాపార నమూనా, వినియోగదారుల్లో విశ్వసనీయత..వంటి అంశాలు కూడా రుణదాతలకు భరోసా కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐ
ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కట్టు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల సంఘం సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. మితిమీరిన దూకుడు లక్ష్యాలు భారతదేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూలత చూపుతాయని హెచ్చరించింది.2024–25లో మొత్తం ద్రవ్యలోటును రూ.16,13,312 కోట్లకు కట్టడి చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 4.9 శాతం. 2023–24లో జీడీపీలో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యలోటు ప్రభుత్వానికి రుణ సమీకరణ అవసరాలను సూచిస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థికమంత్రి ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ రాబోయే కేంద్ర బడ్జెట్ కోసం కొన్ని సూచనలు చేశారు.నెమ్మదిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల్లోనూ దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణ ఈ వృద్ధికి కీలకమైనది. రుణ–జీడీపీ నిష్పత్తులు తగిన స్థాయిల్లో కొనసాగించడానికి ద్రవ్యలోటు కట్టడి ముఖ్యమైనది.రాబోయే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ రుణాన్ని గణనీయంగా తగ్గించేలా ఉండాలి.దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక సక్రమంగా అమలయ్యేందుకు కేంద్రం ఆర్థిక స్థిరత్వ రిపోర్టింగ్‌ను వెలువరించాలి.తీవ్ర ఒత్తిడి పరిస్థితులలో ఆర్థిక స్థిరత్వం కోసం ఔట్‌లుక్‌ను అందించాలి.రిపోర్టింగ్‌లో దీర్ఘకాల (10–25 సంవత్సరాలు) ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం, ఆర్థిక వృద్ధి, సాంకేతిక మార్పు, వాతావరణ మార్పు మొదలైన అంశాల ప్రభావానికి సంబంధించిన లెక్కలు ఉండాలి. పలు దేశాలు ఇదే ధోరణిని అవలంభిస్తున్నాయి. బ్రెజిల్ విషయంలో ఇవి 10 సంవత్సరాలు ఉంటే, బ్రిటన్ విషయంలో 50 ఏళ్లుగా ఉంది.ఇదీ చదవండి: ఐదు లక్షల మంది సందర్శకులతో భారత్ బ్యాటరీ షో!రాష్ట్రాలకు సంబంధించి ద్రవ్య క్రమశిక్షణ చాలా అవసరం. రాష్ట్ర స్థాయి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం, 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి మార్కెట్ నుంచి నేరుగా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అనుమతించడం, రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థల ద్వారా రుణాలు తీసుకునే విషయంలో హామీలను అందించడం ఇందులో ఉన్నాయి. ద్రవ్య క్రమశిక్షణను కొనసాగించే విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర పారదర్శక క్రెడిట్ రేటింగ్ వ్యవస్థను రూపొందించాలి. రుణాలు తీసుకోవడం, ఖర్చు చేయడం వంటి అంశాలు నిర్ణయించడంలో రాష్ట్రాలకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి రాష్ట్రాల రేటింగ్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రుణంగా ప్రత్యేక సహాయం వంటి పథకాలు రూపొందించవచ్చు. -
బాబు అప్పులు.. 6 నెలల్లో రూ.67,237 కోట్లు
సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నన్ను గెలిపించండి.. సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా.. నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్’ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేయడం పైనే దృష్టి పెట్టారు. మంగళవారాన్ని పూర్తిగా అప్పుల వారంగా మార్చేశారు. తాజాగా మంగళవారం సెక్యురిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 7.11 శాతం వడ్డీకి రూ.4,237 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. 10 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,237 కోట్లు, 14 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,500 కోట్లు, 15 సంవత్సరాల కాలవ్యవధితో రూ.1,500 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. దీంతో బాబు సర్కార్ ఆరు నెలల్లో ఇప్పటి వరకు చేసిన అప్పు రూ.67,237 కోట్లకు చేరింది. ఇందులో బడ్జెట్ లోపల రూ.59,237 కోట్లు అప్పు చేయగా, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరు మీద రూ.8,000 కోట్లు అప్పు చేసింది. కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు తమ కార్యకలాపాలకు అప్పు చేసేందుకు గ్యారంటీలు ఇవ్వడాన్ని చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా తప్పుపట్టాయి. కానీ ఇప్పుడు పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.2,000 కోట్లు, మార్కెఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు, ఏపీఐఐసీ ద్వారా రూ.1,000 కోట్లు.. కలిపి మొత్తం రూ.8,000 కోట్ల అప్పునకు చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి0ది. చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే అది ఒప్పులా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే తప్పులా ఎల్లో మీడియాకు కనిపించడం గమనార్హం.ఈ వారం అప్పు రూ.4,237 కోట్లు ఇప్పటి వరకు చేసిన మొత్తం అప్పు రూ. 67,237 కోట్లు బడ్జెట్ లోపల రూ.59,237 కోట్లు బడ్జెట్ బయట రూ.8,000 కోట్లుప్రభుత్వ గ్యారంటీలతో బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పులు (రూ.కోట్లలో..) పౌరసరఫరాల సంస్థ రూ.2,000 కోట్లు మార్క్‌ఫెడ్ రూ.5,000 కోట్లు ఏపీఐఐసీ రూ.1,000 కోట్లు మొత్తం రూ.8,000 కోట్లు -
వీధి వ్యాపారులకు రూ.5 లక్షల వరకు రుణం
ప్రైవేటు రుణ రంగంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సంచలనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా తమ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేసి వారికి లోన్ల ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో వీధి వ్యాపారులు సైతం ఇప్పుడు రూ.5 లక్షల వరకు రుణాలు పొందవచ్చని పేర్కొంది.రోజువారీ వసూళ్ల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్‌లను ఉపయోగించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు రోజువారీ చెల్లింపు సౌకర్యంతో రుణాలను అందిస్తామని ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ వెల్లడించింది. ‘ఇది చిన్న వ్యాపారాల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న తన బడ్జెట్ ప్రెజెంటేషన్‌లో ప్రకటించిన న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్‌కు అనుగుణంగా ఉంది. ఈ మోడల్ కింద బ్యాంకులు చిన్న వ్యాపారుల బ్యాలెన్స్ షీట్లతో కాకుండా డిజిటల్ లావాదేవీల ఆధారంగా వ్యాపారాలను అంచనా వేయాలి. బలమైన నగదు రాక ఉన్నప్పటికీ రుణం పొందడంలో వ్యాపారులు విఫలం చెందుతున్నారు. ఇటువంటి వారు క్యూఆర్ కోడ్ లావాదేవీల ఆధారంగా రుణం అందుకోవచ్చు’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పుఈ సందర్భంగా ముత్తూట్ ఫిన్‌కార్ప్ వన్ సీఈవో చందన్ ఖైతాన్ మాట్లాడుతూ.. భారత్‌లో దాదాపు 6 కోట్ల అనధికారిక సూక్ష వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఇవి దేశంలోని అతిపెద్ద ఉపాధి సృష్టికర్తలలో ఒకటని, దేశ జీడీపీకి ఇవి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. సంప్రదాయకంగా అధికారిక రుణాలను పొందడంలో అడ్డంకులను ఎదుర్కొనే అనధికారిక సూక్ష వ్యాపారాలకు క్రెడిట్‌ను అందుబాటులో ఉంచడం క్యూఆర్–కోడ్ ఆధారిత రుణ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తిని వారి రోజువారీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించామని తెలిపారు. ఇప్పటి వరకు 75,000 పైచిలుకు అనధికారిక సూక్ష వ్యాపారులకు రుణం సమకూర్చామని వివరించారు. -
ఒక్కో అమెరికా పౌరుడి తలపై 91 లక్షల అప్పు.. అప్పుల కుప్పగా అమెరికా
-
ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్
ప్రపంచంలో ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయని, అవి చాలా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ముఖ్యంగా దానివల్ల అమెరికాకు చాలా నష్టం కలుగుతుందన్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.రోమ్‌లోని బ్యాంకోర్ ప్రైజ్ అవార్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రభుత్వ రుణాలు పెంచుకునే దేశాలకు భవిష్యత్తులో సంక్షోభాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దానివల్ల అప్పులు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇటీవలి ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల ప్రభుత్వ రుణాలు అధికమవుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఇదో హెచ్చరిక. వచ్చే ఏడాది వైట్‌హైజ్ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు రుణాలు తగ్గించుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుప్రపంచ ప్రభుత్వ రుణం ఈ ఏడాది చివరి నాటికి 100 ట్రిలియన్ డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 93% చేరుకుంటుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ అప్పు దాదాపు 31 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణం మందగించడం, వడ్డీ రేట్లు తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వాలు రుణాలు క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తాయని రాజన్ అన్నారు. దేశాల అప్పులు పెరగడంవల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇతర దేశాల నుంచి రుణం పొందే అవకాశం ఉండదని చెప్పారు. -
అప్పులపై ఇన్నిరోజులూ పచ్చి అబద్ధాలే..!
సాక్షి, అమరావతి: అప్పుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా, అదీ కూటమి ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లోనే తేలిపోయింది. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌కు రూ.91,443 కోట్ల అప్పులు, మరో రూ.1.09 లక్షల కోట్ల పన్నులు ఆధారంగా ఉండటం విశేషం. ఓసారి రూ.14 లక్షల కోట్లు అప్పులని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఎల్లోమీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి పయ్యావుల సోమవారం అసెంబ్లీకి సమరి్పంచిన బడ్జెట్ పత్రాల్లో స్పష్టమైంది. బడ్జెట్ అప్పులతో పాటు గ్యారెంటీల ద్వారా చేసిన అప్పులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2023–24 ఆర్థిక ఏడాది పూర్తయ్యేనాటికి రూ.6.46 లక్షల కోట్లేనని బడ్జెట్ పత్రాల్లో మంత్రి పేర్కొన్నారు. ఇందులో బడ్జెట్ అప్పులు 2023–24 మార్చి కి రూ.4.91 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పులు రూ.1.54 లక్షల కోట్లేనని చెప్పారు. 2024–25 ఏడాది మార్చికి బడ్జెట్ అప్పులు రూ.5,60,094.25 కోట్లకు చేరతాయని, ఇది జీఎస్డీపీలో 34.14%గా ఉంటుందని మంత్రి బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు.వైఎస్ జగన్ పాలనలోనే అప్పులు తక్కువఇవాళ అసెంబ్లీ సాక్షిగా తేలిన రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. ఇందులో చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికే రూ.4,06,383 కోట్ల అప్పు ఉంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో సైతం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేస్తూ.. సుమారు రూ.2 లక్షల కోట్లకుపైగా డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రాష్ట్ర అప్పు ఇంతేనని తేలింది. ఈ లెక్కన వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు కంటే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులే ఎక్కువని బట్టబయలైంది. రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ టీడీపీ కూటమి నేతలు చెప్పింది దు్రష్పచారం అని తేటతెల్లమైంది. -
బాబు సర్కారు ప్రగతి.. 59,000 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల్లో గొప్పలు పోయిన చంద్రబాబు.. ఈ ఐదు నెలల్లో పైసా సృష్టించలేదు. అభివృద్ధి, సూపర్ సిక్స్ హామీలూ అటకెక్కేశాయి. ఉచిత ఇసుక అంటూ జనాన్ని ఎన్ని పిల్లిమొగ్గలు వేయిస్తున్నారో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. పల్లెల్లో జ్వరం వచ్చినా మందు బిళ్లలు దొరకవు. చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటీ అంటే.. అప్పులు. ఈ అప్పుల గ్రాఫ్ మాత్రం రాకెట్ స్పీడ్‌తో ఆకాశంలోకి దూసుకుపోతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలేవీ అమలు చేయని ప్రభుత్వం ఈ వేల కోట్ల అప్పుల సొమ్మంతటినీ దేనికి ఖర్చు చేస్తోందోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.59,000 కోట్లు అప్పు చేసింది. బడ్జెట్ పరిధిలో చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం 7.17 శాతం వడ్డీతో మరో రూ.3,000 కోట్లు అప్పు చేసింది. దీంతో బడ్జెట్ పరిధిలో చేసిన రుణాలు రూ.51,000 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.8,000 కోట్లు బడ్జెటేతర అప్పు చేశారు. తాజాగా తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 19 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 23 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఈ రుణం తీసుకుంది. నాడు గగ్గోలు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడైనా అప్పు తెస్తే.. ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ ఎల్లో మీడియా కథనాలను అచ్చేశాయి. చంద్రబాబు అండ్ కో కూడా లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపించేవారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రజల పరువు ప్రతిష్టలను దిగజార్చడమే లక్ష్యంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలు, కేంద్ర అనుమతి మేరకు రుణాలు తెచ్చినా అప్పు చేయడం మహాపరాధంగా బాబు అండ్‌కో చిత్రీకరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.ఇప్పుడు చంద్రబాబు మంగళవారాల్లో అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు పెగలడంలేదు. వివిధ కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వ గ్యారెంటీతో చంద్రబాబు సర్కారు మరో రూ.8,000 కోట్ల బడ్జెటేతర అప్పు చేసినా ఎల్లో మీడియా కిమ్మనడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల కార్యకలాపాల కోసం అప్పు చేసేందుకు గ్యారెంటీలు ఇవ్వడాన్ని చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా తప్పుపట్టాయి. పైగా ఆ అప్పులను దాచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.2,000 కోట్లు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు ఏపీఐఐసీ ద్వారా రూ.1,000 కోట్లు మొత్తం రూ.8,000 కోట్లు అప్పు తెచ్చింది. దీనిపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే తప్పు అని గగ్గోలు పెట్టిన వారికి అదే పని చంద్రబాబు సర్కారు చేస్తే ఒప్పవుతుందా అని అంటున్నారు. -
Andhra Pradesh: అప్పుల్లో మనోళ్లది రెండోస్థానం
సాక్షి, హైదరాబాద్: అప్పులు, చేబదుళ్ల వంటివి చేసే వారిలో తెలంగాణ ప్రజలు దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. లక్షమందికి గాను సగటున 42,407 మంది ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుంచో, మరో రూపంలోనో అప్పులు తీసుకున్నట్టు వెల్లడైంది. అప్పులు తీసుకున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయానికొస్తే...లక్ష మందికి గాను సగటున 60,092 మంది రుణాలు తీసుకుని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. లక్ష మందికి గాను 35,703 మంది రుణం తీసుకోవడం ద్వారా తమిళనాడు ప్రజలు మూడో స్థానంలో నిలిచారు. కాంప్రహెన్సి యాన్యువల్ మాడ్యులర్ సర్వే (సీఏఎంఎస్)–2022–23 (2022 జూలై నుంచి 2023 జూన్ దాకా)కు సంబంధించిన వివరాలను కేంద్ర అర్థ గణాంకాల శాఖ విడుదల చేసింది. తెలంగాణలో అప్పులు తీసుకున్న వారిలో పురుషులు 54,538, మహిళలు 30,287 ఉన్నట్టుగా సర్వేలో వెల్లడైంది. రూ.500 లేదా ఆపై మొత్తాన్ని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తీసుకుని ఈ సర్వే నిర్వహించేనాటికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోతే ఆ వ్యక్తిని రుణగ్రస్తునిగా (ఇన్‌డెబ్టెడ్) పరిగణనలోకి తీసుకున్నారు. అఖిల భారత స్థాయిలో 3,02,086 కుటుంబాలకు చెందిన (గ్రామీణ ప్రాంతాల్లో 1,73,096, పట్టణ ప్రాంతాల్లో 1,28,990) 12,99,988 మంది నుంచి అప్పుల వివరాలు సేకరించారు. జాతీయ సగటుకు మించి పట్టభద్రులు తెలంగాణకు సంబంధించి సర్వే వెల్లడించిన ఇతర అంశాలను పరిశీలిస్తే..21 ఏళ్లు ఆ పైబడిన వయసు వారు జాతీయ సగటు కంటే ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీలలో పట్టభద్రులుగా ఉన్నారు. 62.3 శాతం మంది సైన్స్, టెక్నాలజీలో గ్రాడ్యుయేట్స్. అదే ఏపీలో 58.5 శాతం మంది మాత్రమే ఈ సబ్జెక్ట్‌లలో పట్టభద్రులు. సైన్స్, టెక్నాలజీలో గ్రాడ్యుయేట్స్ అయిన వారిలో పురుషులు 61.6 శాతం, మహిళలు 63.6 శాతం ఉన్నారు. వీరి శాతం కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అత్యధికం. దేశవ్యాప్తంగా ఇతర గణాంకాల విషయానికొస్తే...15–24 ఏళ్ల మధ్యనున్న వారిలో 96.9 శాతం మంది ఏదైనా ప్రకటనను చదివి, రాయగలుగుతున్నారు. సాధారణ లెక్కలు చేయగలుగుతున్నారు. వీరిలో పురుషులు–97.8%, మహిళలు–95.9%. 18 ఏళ్లు ఆపై వయసున్న వారిలో అఖిల భారత స్థాయిలో 94.6% మంది ఏదైనా బ్యాంక్‌లో లేదా ఆర్థిక సంస్థలో ఖాతా కలిగి ఉన్నారు. దేశంలో 92.3 శాతం మంది మొబైల్ ఫోన్లు (స్మార్ట్ఫోన్లతో సహా) వాడుతున్నారు.–ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారు 64.8% మంది. ఏదైనా సమాచారం కోసం ఇంటర్నెట్ సెర్చ్ చేయడంతో పాటు ఈ–మెయిల్స్ పంపగలిగినవారు, ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలా పాలు నిర్వహించగలిగినవారు 39.4% ఉన్నారు. -
రుణ మార్గదర్శకాలు కఠినతరం
మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ‘రుణ పూచీకత్తు’ మార్గదర్శకాలను కఠినతరం చేసినట్లు స్వీయ నియంత్రణ సంస్థ–మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకునేవారికి భారం పెరిగిపోతోందని, దీనితో తీసుకున్న రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో ఎంఫిన్ తాజా నిర్ణయం తీసుకుంది. రుణాల్లో నెలకొన్న ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి తాజా చర్య దోహదపడుతుందని ఎంఫిన్ తెలిపింది. బుల్లెట్ రీపేమెంట్ (రుణ వ్యవధిలో అప్పటికి చెల్లింపులు జరిపింది పోగా మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లిచడం), చెల్లించని ఈఎంఐల గురించి ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద తగిన సమాచారం అందడంలేదని ఎంఫిన్ తెలిపింది. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రస్తుత మార్గదర్శకాలు దోహపదడతాయని ప్రకటన వివరించింది. అయితే మార్గదర్శకాలు ఏమిటన్నది నిర్ధిష్టంగా తెలియరాలేదు.ఇదీ చదవండి: తగ్గిద్దామా? వద్దా?ఇక ఒకే రుణగ్రహీత ఐదేసి రుణాలను తీసుకున్న పలు సందర్భాలూ వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వ్యవహారాలు ఆందోళనను సృష్టిస్తున్నాయి. ఒక రుణ గ్రహీత నెలవారీ సంపాదన ఎంత? చెల్లింపుల సామర్థ్యం ఏమిటి? అనే అంశాలపైనా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు తగిన సమాచారం లేకపోవడం సమస్యకు మరో కారణం. ఆయా అంశాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. సంబంధిత వర్గాల నుంచి ఆరు నెలలకు పైగా అందిన సమాచారం మేరకు 12 కోట్ల రుణ రికార్డులను విశ్లేషించిన తర్వాత కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే మార్గదర్శకాలపై త్వరలో పూర్తి సమాచారం వెలువడనుంది. -
అత్యధికుల జీవితం అప్పులతో సరి
సాక్షి, అమరావతి: భారతీయుల్లో ఎక్కువ మంది ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారా. అవునంటోంది కేర్ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ. మనవాళ్లు పొదుపు చేయడం కంటే.. అప్పులు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోంది. భారతీయులకు పొదుపు కంటే రెండు రెట్లు అధికంగా అప్పులు ఉన్నట్టు కేర్ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత అప్పులు ఈ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగిస్తున్నా.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇవి ప్రమాదకర స్థాయిలో లేవని పేర్కొంది. దేశ జీడీపీలో వ్యక్తిగత అప్పులు ఏకంగా 38 శాతానికి చేరాయి. ప్రస్తుతం దేశ జీడీపీ 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.173.82 లక్షల కోట్లుగా అంచనా వేస్తుంటే.. అందులో 38 శాతం అంటే సుమారు రూ.66 లక్షల కోట్లకు సమానమైన అప్పులు మనవాళ్లు చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్ జీడీపీలో వ్యక్తిగత అప్పులు 35 శాతం, దక్షిణాఫ్రికాలో 34 శాతానికే పరిమితమైనట్టు కేర్ఎడ్జ్ తన నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో మన దేశంలో వ్యక్తిగత పొదుపు జీడీపీలో 24 శాతానికే అంటే రూ.42 లక్షల కోట్లకే పరిమిత మైంది.అప్పులతో ‘రియల్’ పరుగులుమొత్తం వ్యక్తిగత అప్పుల్లో 50 శాతం గృహరుణాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు రుణాలు తీసుకుంటుండడం వ్యక్తిగత అప్పులు భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. అప్పు తీసుకుని ఖర్చు చేయకుండా సంపద సృష్టించుకోవడం కోసం వ్యయం చేస్తుండటాన్ని ఆహ్వానించింది. అప్పు తీసుకుని విలాసాలకు ఖర్చు చేయకుండా ఇల్లు, రియల్ ఎస్టేట్ వంటి సంపద సృష్టికి విని యోగంచడం సంతోషం కలిగించే విషయంగా పేర్కొంది. దేశంలో పొదుపు ఆలోచనలో భారీ మార్పు వచ్చిందని, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటికంటే స్థిరాస్తుల్లో అధికంగా ఇన్వెస్ట్ చేయ డానికి మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పులు విలాసాలకు విని యోగిస్తారని, కానీ.. భారత దేశంలో అప్పులను సంపద సృష్టికి వినియోగిస్తుండటంతో జీడీపీలో వ్యక్తిగత అప్పులు 38 శాతానికి చేరినా అది ప్ర మాదకర స్థాయి కాదని వెల్లడించింది. ఈ అప్పు లు నియంత్రించే స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. ఇతర అప్పులు వస్తే క్రెడిట్ కార్డు వంటి అన్ సెక్యూర్డ్ రుణాలు భారీగా పెరుగు తున్నట్టు హె చ్చరించింది. ఇదే సమయంలో వ్యక్తిగత ఆదా యం వృద్ధి చెందాల్సి ఉంటుందని పేర్కొంది. -
రుణాలు పీక్... డిపాజిట్లు వీక్
న్యూఢిల్లీ: రుణాల పెరుగుదల డిపాజిట్ వృద్ధిని మించిపోతోందని, ఇది బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ (ద్రవ్య లభ్యతా) సవాళ్లకు దారితీయవచ్చని ఫిక్కీ–ఐబీఏ నివేదిక ఒకటి పేర్కొంది. రుణ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను పెంచడం అలాగే రుణ రేటును తక్కువగా ఉంచడం బ్యాంకుల ఎజెండాలో అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) విభాగం వాటా తగ్గినట్లు సర్వేలో పాల్గొన్న బ్యాంకుల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ తెలియజేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు సహా మొత్తం 22 బ్యాంకులు (మొత్తం అసెట్ పరిమాణంలో వీటి వాటా 67 శాతం) ఈ సర్వేలో పాల్గొన్నాయి. 2024 జనవరి నుంచి జూన్ మధ్య జరిగిన ఈ 19వ దఫా ఫిక్కీ–ఐబీఏ సర్వే నివేదికలో వ్యక్తమైన అభిప్రాయాల్లో కొన్ని..2024 ప్రథమార్థంలో 80 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు కాసా డిపాజిట్ల వాటా తగ్గుదలను నమోదుచేసుకోగా, సగానికి పైగా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇదే విషయాన్ని తెలిపాయి. అయితే అధిక, ఆకర్షణీయమైన రేట్ల కారణంగా టర్మ్ డిపాజిట్లు వేగం పుంజుకున్నాయి. సర్వేలో 71% బ్యాంకులు గత ఆరు నెలల్లో మొండిబకాయిల స్థాయిలు తగ్గిన్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల రేటు 90 శాతంగా ఉంటే, ప్రైవేటు రంగ బ్యాంకుల రేటు 67 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు, లోహాలు, ఇనుము, ఉక్కు వంటి రంగాల్లో వృద్ధికి తగినట్లుగా దీర్ఘకాలిక రుణ డిమాండ్ కనబడుతోంది. ప్రత్యేకించి మౌలిక విభాగం పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ రంగానికి రుణ డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు సర్వేలో 77% బ్యాంకులు వెల్లడించాయి. బ్యాంకులు– ఫిన్‌టెక్ కంపెనీల మధ్య భాగస్వామ్యం– నూతన ఆవిష్కరణలు, సేవల విస్తృతి, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవడం వంటి సానుకూల చర్యలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: రూ.932కే విమాన టికెట్ఏటీఎం చానెల్ నిర్వహణ విషయంలో వ్యయాలు తగ్గాలి. వ్యూహాత్మక స్థానాలను ఎంచుకోవడం, ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్‌ఛేంజ్ ఫీజులను పెంచడం, వ్యయాలు– ప్రయోజనాలను విశ్లేషించడం, సాంకేతికతను పెంచడం వంటి పలు కీలక సూచనలను బ్యాంకర్లు చేశారు. -
80 రోజుల్లో రూ.19,000 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 80 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.19,000 కోట్లు అప్పు చేసింది. తాజాగా మంగళవారం 7.25 శాతం వడ్డీతో రూ.4,000 కోట్లు అప్పు తీసుకుంది. పదేళ్ల కాల వ్యవధిలో రూ.వెయ్యి కోట్లు, 13 ఏళ్ల కాల వ్యవధితో మరో రూ.1,000 కోట్లు, 20 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంకో రూ.1,000 కోట్లు, 23 ఏళ్ల కాల వ్యవధితో మరో రూ.1,000 కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాన్ని సమీకరించింది. దీంతో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.19,000 కోట్లు అప్పు చేసినట్లైంది.ఇదేనా సంపద సృష్టి?వైఎస్సార్ సీపీ హయాంలో పరిమితికి లోబడి రుణాలు తీసుకున్నా ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ నాడు ఎల్లో మీడియా కధనాలను ప్రచురించగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారంటూ వాటి ఆధారంగా చంద్రబాబు బృందం ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం 80 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.19 వేల కోట్లు అప్పు చేసినా టీడీపీ అనుకూల మీడియా కిక్కురుమనకపోవడం గమనార్హం. ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ పెంపు మినహా ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాంటప్పుడు ఈ అప్పులన్నీ ఎందుకోసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అప్పులు చేయడం ద్వారా కాకుండా సంపద సృష్టించడం ద్వారా అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు గుప్పించిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెడుతున్నట్లు స్పష్టమవుతోంది. -
వారం వారం.. అప్పుల హారం
సాక్షి, అమరావతి: ‘అప్పు’డే మంగళవారం ఎప్పుడు వస్తుందా అని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లుగా ఉంది అప్పుల పరంపరను చూస్తుంటే. వచ్చే మంగళవారం కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 4,000 కోట్లు అప్పు చేయనుంది. గడిచిన మంగళవారమే రూ. 3,000 కోట్లు చంద్రబాబు సర్కారు అప్పు చేసిన విషయం తెలిసిందే. సెపె్టంబర్ 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 4,000 కోట్లు అప్పును సమీకరించనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం సెక్యూరిటీల వేలం వివరాలను వెల్లడించింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంగళవారాల్లో రూ. 15 వేల కోట్లు అప్పు చేసింది. కొత్తదానితో కలిపి అది రూ. 19 వేల కోట్లకు చేరనుంది. అప్పు చేయడమే తప్పుగా ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా దాటకుండానే ఏకంగా రూ. 19 వేల కోట్లు అప్పు చేశారు. వచ్చే మంగళవారం 10 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 1,000 కోట్లు, 13 సంవత్సరాల కాల వ్యవధిలో మరో రూ. 1,000 కోట్లు, 20 సంవత్సరాల కాల వ్యవధిలో రూ. 1,000 కోట్లు, 23 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 1,000 కోట్లు చంద్రబాబు సర్కారు అప్పు చేయనున్నట్లు ఆర్బీఐ నోటిఫై చేసింది. -
అప్పు తిరిగి ఇవ్వ లేదని..
కాచిగూడ: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే 12గంటల్లో కేసును చేధించిన కాచిగూడ పోలీసులు చిన్నారిని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండలం డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ రఘు, ఇన్స్పెక్టర్ చంద్రకుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఫుట్‌పాత్‌పై పార్వతమ్మ అనే యాచకురాలు తన మనవరాలు(1.5) శ్రీలక్షి్మతో కలిసి నిద్రించింది. మంగళవారం తెల్లవారుఝామున నిద్ర లేచి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఓ మహిళ చిన్నారిని తీసుకుని ఆటోలో అఫ్జల్‌గంజ్ వైపు వెళుతున్నట్లు గుర్తించారు. దీంతో డబీర్‌పురా రైల్వే స్టేషన్ సమీపంలో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ చేసింది తానేనని అంగీకరించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన యాచకురాలు దాసరి మంజుల భిక్షాటన కోసం నగరానికి రాకపోకలు సాగించేదని, కిడ్నాప్‌నకు గురైన చిన్నారి శ్రీలక్ష్మి తల్లి మమత ఆమెవద్ద రూ.1500 అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతోనే మంజుల పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు ఆమె మరిది మున్నాతో పాటు ఆమె ఇద్దరు బాలలు సహకరించినట్లు గుర్తించారు. చిన్నారిని ఆమె అమ్మమ్మకు అప్పగించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఈ మంగళవారం మరో రూ. 3 వేల కోట్లు
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం మరో రూ. 3,000 కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. 27న రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ అప్పును సమీకరించనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం సెక్యూరిటీల వేలం వివరాలను వెల్లడించింది.ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంగళవారాల్లో రూ. 12 వేల కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే అప్పుతో కలిపి మొత్తం రూ. 15 వేల కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది. 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 22 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,000 కోట్లు వచ్చే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనుంది.రూ. 2,500 కోట్లు సర్దుబాటుసీఏజీ ద్వారా విదేశీ ప్రాజెక్టుల రుణాలకు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 2,500 కోట్లకు సార్వత్రిక ఎన్నికల ముందే వైఎస్ జగన్ సర్కారు పరిష్కారం కనుగొంది. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ ఏడాది జనవరి నుంచి సీఏజీతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఉమ్మడి ఏపీలో విదేశీ ప్రాజెక్టుల రుణాల చెల్లింపులన్నీ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేస్తూ వస్తోంది. తెలంగాణ వాటాను కూడా ఏపీ ప్రభుత్వమే చెల్లించింది. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి రూ. 2,500 కోట్లు రావాల్సి ఉందని సీఏజీ గత జనవరిలోనే తేల్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఎన్నికల కోడ్ రావడంతో తెలంగాణ నుంచి రావాల్సిన ఆ నిధుల విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ రూ. 2,500 కోట్లను ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గురువారం సర్దుబాటు చేసింది. -
దివాలా దిశగా అగ్రరాజ్యం!
ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా అమెరికాకు గుర్తింపు ఉంది. అది అలా వృద్ధి చెందడానికి అప్పులు కూడా ఒక కారణం. ఏంటీ..ఆశ్చర్య పోతున్నారా? అవును..అమెరికా అప్పులతోనూ ఎదిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏటా ఆ దేశం కట్టే వడ్డీలే అందుకు నిదర్శనం. జూన్ 2024 లెక్కల ప్రకారం..దేశీయంగా వసూలైన వ్యక్తిగత ఆదాయపు పన్నులో 76 శాతం అంటే జాతీయ రుణాన్ని చెల్లించేందుకే వెచ్చిస్తోంది. ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్‌లు వెలిశాయి. వాటిని ధ్రువపరిచేలా ప్రముఖ వ్యాపారవేత్త ఇలొన్‌మస్క్ ‘అమెరికా దివాలా దిశగా ప్రయాణిస్తోంది’ అంటూ స్పందించారు. దాంతో ఈ ట్వీట్ మరింత వైరల్‌గా మారింది.పెరుగుతున్న జాతీయ రుణం అమెరికాలో చాలా కాలంగా ప్రధాన సమస్యగా ఉంది. టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ ఈ విషయాన్ని గతంలోనూ చాలాసార్లు తెలిపారు. తాజాగా ‘అమెరికా దివాళా దిశగా వెళ్తోంది’ అంటూ పీటర్ స్టాంజ్ అనే వ్యక్తి అప్లోడ్ చేసిన పోస్ట్‌లోని వివరాలను ధ్రువపరుస్తూ స్పందించారు. అమెరికా వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లలో దాదాపు 76 శాతం జాతీయ రుణ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నట్లు పీటర్ చెప్పారు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయేందుకు కారణం మాజీ అమెరికా అధ్యక్షులు ఫ్రాంక్లిన్ డీ రూజువెల్ట్, రిచర్డ్ నిక్సన్ అని అన్నారు.1970 కాలంలో అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న రిచర్డ్ నిక్సన్ దేశీయ విధానాల కంటే విదేశీ వ్యవహారాలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఓటర్లు తమ సొంత ఆర్థిక స్థితిపైనే దృష్టి సారిస్తారని నమ్మాడు. అప్పటికే దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం తిరిగి తన ఎన్నికకు ముప్పుగా మారుతుందని గ్రహించాడు. దాంతో ‘న్యూ ఫెడరలిజం’ విధానాలు అమలు చేశాడు. అందులో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేకంగా గ్రాంట్లను ప్రతిపాదించాడు. ఫలితంగా అమెరికా అప్పులు మూటగట్టుకుంది. రూజ్వెల్ట్ అధ్యక్ష పదవిలో ఉన్నపుడు సంపన్నులపై పన్ను రేట్లను 79%కు పెంచారు. ధనవంతులు ఈ రేటును తగ్గించుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకున్నారు. దాంతోపాటు అమెరికాలో ప్రైవేట్ పెట్టుబడులు తగ్గాయి. ఫలితంగా ఉద్యోగ కల్పన కుంటుపడింది. నిరుద్యోగం పెరిగింది.America is headed for bankruptcy fyi https://t.co/O6FH5BK4aQ— Elon Musk (@elonmusk) July 26, 2024ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!పీటర్ స్టాంజ్ ఎక్స్‌లో అప్లోడ్ చేసిన వీడియోపై పీటర్ షిఫ్ అనే క్రిప్టో విమర్శకుడు స్పందించాడు. ‘అమెరికా అప్పులు అక్కడితో ఆగవు. త్వరలో ఫెడరల్ పన్ను ఆదాయంలో 100% రుణవడ్డీని చెల్లించడానికే వెచ్చిస్తారు. అన్ని ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు చేయాల్సిందే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం, అప్పులను పరిశీలిస్తోంది’ అన్నారు. జూన్ 2024లో యూఎస్ ప్రభుత్వం ట్రెజరీ సెక్యూరిటీలపై 140.238 బిలియన్ డాలర్లు (రూ.11 లక్షల కోట్లు) వడ్డీ చెల్లించింది. ప్రభుత్వం అదే నెలలో వ్యక్తిగత ఆదాయ పన్నుల రూపంలో 184.9 బిలియన్ డాలర్లు(రూ.15.4 లక్షల కోట్లు) వసూలు చేసింది. -
ఈసారి అప్పులు రూ.62,012కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్లో అప్పుల పద్దు అదిరిపోయింది. గత ఏడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్లు ఎక్కువగా, మొత్తం రూ.62,012 కోట్లు రుణ సమీ కరణ జరగనుంది. గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదన గణాంకాలు ఈ మేరకు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సేకరించనున్నట్టు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇక గతంలో తీసుకున్న అప్పులకు అసలు, వడ్డీల చెల్లింపు కోసం రూ.30 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. ఇందులో రుణం చెల్లింపుల కోసం రూ.13,117.60 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.17,729 కోట్లు ప్రతిపాదించారు. మొత్తం రూ.62 వేల కోట్ల రుణ సమీకరణ చేస్తే,అందులో దాదాపు సగం అంటే రూ.30,846 కోట్లు గతంలో తీసుకున్న అప్పులకు గాను అసలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతుందని కేటాయింపులు చెబుతున్నాయి. ఇవి పోగా మిగతా రూ.31,166 కోట్ల రుణాలను ఈ ఏడాది వినియోగించుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్నఅప్పులు, చెల్లింపులుఏటేటా అప్పుల చిట్టా పెరిగిపోతుందని గత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడుల్లో రూ.44,060 కోట్లు రుణాల కింద వస్తే, 2023–24లో రూ.52,576 కోట్లు తీసుకున్నారు. ఈ ఏడాది రూ.62 వేల కోట్లను అప్పుల పద్దు కింద ప్రతిపాదించడం గమనార్హం. అయితే తీసుకునే అప్పుల కంటేచెల్లింపులు ఎక్కువ చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరంఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూలై 24నాటికి రూ.35,118 కోట్లు అప్పుగాతీసుకుంటే.. గతంలో ఉన్న అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపుల కింద రూ.42,892 కోట్లు కట్టామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా రూ.6,050 కోట్లు అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాల్సి ఉండేదని, కానీ ఇప్పుడు నెలకు రూ.5,365 కోట్లు చెల్లిస్తున్నామని వివరించారు. హైదరాబాద్అభివృద్ధిపైప్రభుత్వానిదిస్పష్టమైన విజన్నగర అభివృద్ధికికేటాయింపులపై మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షంసాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు తెలంగాణ వార్షిక బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉందని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ 2024–25 ప్రవేశపెట్టిన అనంతరం ఉత్తమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్ హైదరాబాద్ వాసుల జీవన నాణ్యతను పెంపొందించడానికి, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా దాని స్థానాన్ని పటిష్టం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ‘మెట్రో విస్తరణ ఓల్డ్ సిటీ–శంషాబాద్ విమానాశ్రయంతో సహా కీలక ప్రాంతాలను కలుపుతుంది. నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ చేంజ్లుగా అభివృద్ధి చేయాలని, కనెక్టివిటీని మరింత పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. లండన్‌లోని థేమ్స్ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు తరహాలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌గా మార్చడానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. హైడ్రా ఏర్పాటు దేశానికే ఆదర్శం’ అని ఉత్తమ్ తెలిపారు. నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న 6 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తామని వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు హామీపత్రం: రేవంత్సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలకు హామీపత్రంగా అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకొని బడ్జెట్‌కు రూపకల్పన చేశామన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకొని రూపొందించిన బడ్జెట్ ఇది. ఆరు గ్యారంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్. ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవిక లెక్కల బడ్జెట్ ఇది. కేంద్ర వివక్ష.. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్‌ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖామాత్యులు మల్లు భట్టి విక్రమార్క, ఆయనబృందానికి నా అభినందనలు’ అని రేవంత్ పోస్ట్ చేశారు. -
ఆర్థికంగా ఏపీ బలోపేతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలోపేతమవుతోందని కేంద్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడాన్ని కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని స్పష్టం చేసింది. ఆర్బీఐ నివేదికలతో పాటు కాగ్ గణాంకాల ఆధారంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసినట్లు సర్వే నివేదిక తెలిపింది. ఏపీ సహా 23 పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని.. ద్రవ్య లోటు, అప్పులు భారం తగ్గుతోందని సర్వే నివేదిక స్పష్టం చేసింది.అలాగే ఏపీ సహా పలు రాష్ట్రాల వ్యయంలో నాణ్యత పెరిగిందని.. మూలధన వ్యయంపై ప్రభుత్వాలు దృష్టి సారించడం మెరుగుపడిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించారని వెల్లడించింది. మహిళల సాధికారత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు పాలనాపరమైన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపించిందని నివేదిక పేర్కొంది.వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపడుతోందని.. తద్వారా గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనాలను ఏపీతో పాటు తొమ్మిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.. తద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతోందని నివేదిక తెలిపింది. మొత్తంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కితాబిచి్చంది. ఏపీ అప్పు రూ.4.85 లక్షల కోట్లుఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు తమ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టానికి(ఎఫ్ఆర్బీఎం) అనుగుణంగా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రాల అప్పులు ఉంటాయని ఆయన తెలిపారు. 2024 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,85,490 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. -
మంగళవారం.. అప్పుల హారం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో రూ.2,000 కోట్లు అప్పుచేస్తోంది. దీంతో ఈ నెలరోజుల్లో ఆయన చేసిన అప్పు రూ.9,000 కోట్లకు చేరనుంది. 16 ఏళ్ల కాల వ్యవధికి రూ.వెయ్యి కోట్లు, 19 ఏళ్ల కాల వ్యవధికి మరో రూ.వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. మరోవైపు.. చంద్రబాబు మంగళవారం మంగళవారం వరుసపెట్టి అప్పులు చేస్తున్నప్పటికీ ఆయనకు భజన చేసే పచ్చమీడియా దీనిపై ఏమాత్రం వార్తలు ప్రచురించడంగానీ, ప్రసారం చేయడంగానీ చేయట్లేదు. కానీ, గత సీఎం వైఎస్ జగన్ పరిమితుల్లోపే అప్పులు చేస్తే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు, ఎల్లో మీడియా కలిసి నానా యాగీ చేశాయి. పైగా, ప్రతీ మంగళవారం అప్పులు చేస్తున్నారని.. దీనివల్ల బ్రహ్మాండం బద్దలైపోతున్నట్లు గుండెలు బాదుకుంటూ తెగ దు్రష్పచారం చేశారు. అదే బాబు సర్కారు విచ్చలవిడిగా ఇప్పుడు అప్పులు చేస్తున్నా అవి తేలు కుట్టిన దొంగలా ఉండడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. గత నెల ఓ మంగళవారం రూ.2,000 కోట్లు అప్పుచేసిన చంద్రబాబు సర్కారు, ఈ నెల 2వ తేదీ మంగళవారం ఒక్కరోజే రూ.5,000 కోట్లు అప్పు చేసింది. ఇప్పడు వచ్చే మంగళవారం మరో రెండువేల కోట్లు తీసుకుంటోంది. వైఎస్ జగన్ సర్కారు అప్పు చేసినప్పుడల్లా పదే పదే పతాక శీర్షికల్లో ప్రచురించిన ఆ ఎల్లో మీడియా ఇప్పుడు అసలు పట్టించుకోకపోవడం గమనార్హం. -
ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్
మైక్రో ఫైనాన్స్ కంపెనీలు(సూక్ష్మ రుణ సంస్థలు) ఒక వ్యక్తికి రూ.2 లక్షలకు మించి అప్పు ఇవ్వకూడదని ఎంఫిన్ (మైక్రో-ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్) ఆదేశించింది. అదికూడా గరిష్ఠంగా నాలుగు సంస్థలు మాత్రమే ఈ మొత్తాన్ని సమకూర్చాలని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇష్టానుసారంగా రుణాలివ్వడంతో సాధారణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు ఎంఫిన్ పేర్కొంది.సూక్ష్మ రుణ సంస్థలు ఇష్టారాజ్యంగా రుణాలు జారీ చేయడం వల్ల, ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దాంతో మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద మొండి బకాయిలు పెరుకుపోతున్నాయి. మార్కెట్లోని బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు రానివారు, కొన్ని కారణాల వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కుదరని వారు సూక్ష్మ రుణ సంస్థలను సంప్రదిస్తున్నారు. దాంతో అధికవడ్డీకి ఆశపడి ఆయా సంస్థలు ప్రజలకు రుణాలిస్తున్నాయి. కానీ వాటిని తిరిగి చెల్లించే క్రమంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దానివల్ల ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దానికితోడు సంస్థలు ఇచ్చిన అప్పు రికవరీ శాతం తగ్గిపోతుంది. ఈ వ్యవహారాన్ని గుర్తించిన ఎంఫిన్ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.సూక్ష్మ రుణ సంస్థలకు నియంత్రణ వ్యవస్థగా ఎంఫిన్ వ్యవహరిస్తోంది. ఎంఫిన్ తెలిపిన వివరాల ప్రకారం..మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఒక వ్యక్తికి గరిష్ఠంగా రూ.2 లక్షలు మాత్రమే అప్పుగా ఇవ్వాలి. ఈ మొత్తాన్ని నాలుగు సంస్థల వరకు మాత్రమే సమకూర్చాలని తెలిపింది.ఇదీ చదవండి: గిఫ్ట్సిటీలో యూరోపియన్ బ్యాంక్ ప్రారంభంసూక్ష్మ రుణ సంస్థల వినియోగదార్లుగా దాదాపు రూ.3 లక్షల వార్షికాదాయం గల కుటుంబాలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఈ రంగం ఎంతగానో విస్తరించింది. ప్రస్తుతం సూక్ష్మ రుణాల పరిశ్రమకు 7.8 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు. వీరికి జారీ చేసిన రుణాల మొత్తం రూ.4.33 లక్షల కోట్లకు పైగా ఉందని సమాచారం. -
రూ.5.4 లక్షల కోట్ల రుణ ప్రణాళిక సిద్ధం చేసిన ఎస్ఎల్బీసీ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి సంబంధించి రుణ ప్రణాళికలు రూపొందించేందుకు 227వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు రూ.5.4 లక్షలకోట్ల రుణ ప్రణాళికను సిద్ధం చేశారు.ప్రభుత్వం రూపొందించిన రుణ ప్రణాళికలోని వివరాల ప్రకారం..విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాధాన్య రంగాలకు రూ.3,75,000 కోట్లు(గతంతో పోల్చితే 16 శాతం అధికం), ఇతర రంగాలకు రూ.1,65,000 కోట్లు అవసరం. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు కావాల్సి ఉంది. గతంలో కంటే ఇది 14 శాతం పెరిగింది. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్ల రుణాలు అవసరం. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగం వృద్ధికి గతేడాదిలో రూ.2,31,000 కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 90 శాతం అనగా రూ.2,08,136 కోట్లు మంజూరయ్యాయి.ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే ఎంఎస్ఎంఈ రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు రుణాలు కావాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లకు పెంచారు. గతంలో కంటే ఇది 26 శాతం అధికం. గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు, సాంప్రదాయేతర ఇంథన రంగానికి రూ.8000 కోట్లు రుణాలు కావాలని ప్రాణాళికలు సిద్ధం చేశారు.ఐదు ప్రధాన విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.1. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడం. 2. పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం.3. డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం.4. స్కిల్ డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకోవడం.5. సంపద సృష్టించే, జీఎస్డీపీ పెంచే రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి..ముఖ్యమంత్రి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క రోజే రూ.5,000 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఒక్క రోజే రూ.5,000 కోట్లు అప్పు చేసింది. అంతే కాదు.. ఈ నెలలోనే మరో రూ.4,000 కోట్లు అప్పులు చేయడం ద్వారా ఒక్క జూలైలోనే మొత్తం రూ.9,000 కోట్లు రుణ భారం మోపనుంది. తొమ్మిదేళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 21 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు 24 సంవత్సరాల కాల వ్యవధితో రూ.1000 కోట్ల మేర తాజాగా కూటమి సర్కారు అప్పులు చేసింది. 7.36 శాతం నుంచి 7.37 శాతం వరకు వడ్డీతో ఈ అప్పులు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ అప్పులను సమీకరించింది. ఈ ఆర్ధిక ఏడాదిలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల్లో మొత్తం రూ.17 వేల కోట్లు అప్పులు చేయనున్నట్టు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి తెలిపింది. ఇందులో జూలైలో రూ.9,000 కోట్లు అప్పు చేయనుండగా ఆగస్టు, సెప్టెంబర్‌లో రూ.8,000 కోట్లు అప్పు చేయనున్నట్లు సమాచారం అందచేసింది. ఈ మేరకు ఏ మంగళవారం ఎంత అప్పులు తీసుకుంటారో వెల్లడించింది. కాగా ఇప్పటికే గత నెలలో కూటమి సర్కారు రూ.2,000 కోట్లు అప్పు చేయడం తెలిసిందే. నాడు గగ్గోలు..ప్రతి మంగళవారం అప్పు చేయనిదే పూట గడవదంటూ వైఎస్ జగన్ సర్కారుపై పదేపదే విషం కక్కిన ఎల్లోవీుడియా ఇప్పుడు రూ.వేల కోట్ల అప్పులు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నా కిక్కురుమనకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గత సర్కారు ఆచితూచి అప్పులు చేస్తే అదేదో మహాపరాథం అన్నట్లుగా నిత్యం గగ్గోలు పెట్టిన ఓ వర్గం మీడియాకు తాజా పరిణామాలు కంటికి కనిపించడం లేదా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అప్పులు సంపద సృష్టిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయా? అని ఎద్దేవా చేస్తున్నారు. గత సర్కారు పరిమితికి లోబడే అప్పులు చేసినా రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అయిపోతోందంటూ ఎల్లో మీడియా పదేపదే విషం చిమ్మిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. -
‘పవర్’ చూపించిన అనిల్ అంబానీ.. తొలగిన చీకట్లు!
ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చీకటి రోజులు తొలగిపోయాయి. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన ఆయన రిలయన్స్ పవర్‌తో బలమైన పునరాగమనం చేస్తున్నారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది.బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని కలిగి ఉండేది. రుణాలిచ్చిన బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేసింది. గత కొన్ని నెలలుగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులతో డెట్ సెటిల్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ బ్యాంకులకు మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించింది. ఫలితంగా రిలయన్స్ పవర్ ఇప్పుడు స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా మారింది.అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ప్రస్తుతం 38 లక్షలకు పైగా రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో రూ .4016 కోట్ల ఈక్విటీ బేస్‌ను కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని 3960 మెగావాట్ల సాసన్ యూఎంపీపీ, 1200 మెగావాట్ల రోసా థర్మల్ పవర్ ప్లాంట్ తో సహా ఇది 5900 మెగావాట్ల ఆపరేటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 2008లో సుమారు రూ.260.78 వద్ద ట్రేడైన రిలయన్స్ పవర్ షేరు భారీ పతనం తర్వాత 2020 మార్చి 27న షేరు ధర రూ.1.13 వద్ద ముగిసింది.కొన్నేళ్లుగా నెమ్మదిగా కోలుకుంటున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ మరోసారి ట్రేడర్ల దృష్టిని ఆకర్షించింది. రిలయన్స్ పవర్ షేరు ప్రస్తుతం రూ.26.15 పైన ట్రేడవుతోంది. ఇది త్వరలోనే రూ.36 మార్కును చేరుకోవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?
అప్పుల ఊబిలో కూరుకుపోయి మనుగడ అంచున కొట్టుమిట్టాడుతూ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీలను జాంబీ కంపెనీలుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జాంబీ కంపెనీల సంఖ్య గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది.అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో జాంబీ కంపెనీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీలకు పెరిగింది. ఒక్క యునైటెడ్ స్టేట్స్లోనే ఇలాంటి కంపెనీలు 2,000 లకు చేరాయి. ఏళ్ల తరబడి చౌక రుణాలు పేరుకుపోవడం, మొండి ద్రవ్యోల్బణం రుణ వ్యయాలను దశాబ్ద గరిష్టాలకు నెట్టింది.వీటిలో అనేక చిన్న, మధ్య తరహా కంపెనీలు త్వరలోనే తమ లెక్కల రోజును ఎదుర్కోవలసి రావచ్చు. వందల బిలియన్ డాలర్ల రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోవచ్చు. గత మూడేళ్లలో కార్యకలాపాల ద్వారా తమ రుణాలపై వడ్డీని కూడా చెల్లించడానికి తగినంత డబ్బు సంపాదించడంలో విఫలమైన కంపెనీలను సాధారణంగా జాంబీలుగా నిర్వచిస్తారు.కార్నివాల్ క్రూయిజ్ లైన్, జెట్ బ్లూ ఎయిర్ వేస్, వేఫేర్, పెలోటన్, ఇటలీకి చెందిన టెలికాం ఇటాలియా, బ్రిటిష్ సాకర్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ లను నడుపుతున్న కంపెనీలతో సహా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్‌లలో గత దశాబ్దంలో ఇలాంటి కంపెనీల సంఖ్య 30 శాతం పెరిగిందని అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో తేలింది.మార్చిలో ఫెడరల్ రిజర్వ్ కోత ప్రారంభిస్తుందనే అంచనాతో రుణదాతలు తమ వాలెట్లను తెరవడంతో ఈ ఏడాది మొదటి కొన్ని నెలల్లో వందలాది జాంబీ కంపెనీలు తమ రుణాలను రీఫైనాన్స్ చేసుకున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో 1,000 కి పైగా జాంబీ కంపెనీల స్టాక్స్ 20 శాతానికి పైగా పెరగడానికి సహాయపడింది. కానీ చాలా కంపెనీలు రీఫైనాన్స్ పొందలేకపోయాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి, ఏకైక ఫెడ్ కోతను ఆశిస్తున్న నేపథ్యంలో జాంబీ కంపెనీలు 1.1 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. -
అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి
డబ్బు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అప్పుల ఊబిలో చిక్కుకోవాల్సిందే. మనకు తెలిసిన చాలామంది, మరీ ముఖ్యంగా జీతం తీసుకుంటున్నవారు తరచూ అప్పులు చేయడం గమనిస్తుంటాం. బాధ్యతా రహితంగా డబ్బు తీసుకుంటే భవిషత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పు చేస్తున్న చాలామందికి దాని తీవ్రత తెలియక మళ్లీ అదే పనిచేస్తుంటారు. అప్పు ఉచ్చులో చిక్కుకుంటున్నామని సూచించే కొన్ని సంకేతాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలకు చెల్లిస్తుంటే క్రమంగా అప్పుల్లోకి జారుకుంటున్నారని తెలుసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ పెరుగుతున్న క్రమంలో చాలామంది ఈజీ ఈఎంఐలు, డిస్కౌంట్లు, సేల్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చుతో ఇబ్బందులు తప్పవు. అప్పు మిమ్మల్ని మరింత ఊబిలో పడేస్తుంది. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాలంటే మాత్రం వచ్చే ఆదాయంలో ఈఎంఐలు 50శాతం కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.రోజువారీ ఖర్చుల కోసం అప్పురోజువారీ ఆర్థిక అవసరాల కోసం తరచు అప్పు తీసుకుంటే మాత్రం మీ ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులకు అప్పు తీసుకుంటే రుణఊబిలోకి వెళ్లే ప్రమాదం ఉంది.క్రెడిట్ కార్డుతో జాగ్రత్తతీసుకున్న అప్పులను తీర్చడానికి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు తీయడానికి భారీగా చార్జీలు వసూలు చేస్తారు. ఇది 2.5శాతం నుంచి 3.5శాతం వరకు ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన, అసోసియేటెడ్ వడ్డీ 35శాతం నుంచి 50శాతం వరకు చేరవచ్చు.పేమెంట్లను చెల్లించకపోవడంక్రెడిట్ కార్డ్ డ్యూ డేట్‌లోపు పేమెంట్ చెల్లించాలి. అందులో మినిమం డ్యూ కడితే సరిపోతుందనుకోవద్దు. మిగిలిన డ్యూ మొత్తాన్ని నెలవారీగా వడ్డీ విధిస్తారు. అది మరింత ప్రమాదకరం. దాంతో మీ సిబిల్ స్కోర్ ప్రభావం చెందుతుంది. ఒక సర్వే ప్రకారం, దాదాపు 21శాతం మంది క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం లేదు లేదా గత సంవత్సరంలో కనీస బకాయి మొత్తాన్ని మాత్రమే చెల్లించడం ద్వారా దాన్ని రోల్ ఓవర్ చేశారు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను ఫార్వర్డ్ చేసినా మూడుశాతం వడ్డీ భరించాలి. ఈ రోల్ఓవర్ చక్రంలో చిక్కుకున్నట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి.భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై అప్పుభవిష్యత్తులో ఫలానా వారు డబ్బు ఇస్తారనో.. లేదా ఈ సంవత్సరం చివర్లో బోనస్ వస్తుందనో ఇప్పుడే అప్పు తీసుకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. తప్పని పరిస్థితుల్లో ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవచ్చు. కానీ రాబోయే బోనస్, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిపై కాదు.ఇంక్రిమెంట్లను నమ్మొద్దుభవిష్యత్తులో వచ్చే జీతం, ఇంక్రిమెంట్లను ఎక్కువగా అంచనా వేస్తారు. కెరీర్ ప్రారంభ దశల్లో ఇంక్రిమెంట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఇవి రిటైర్మెంట్ వరకు కొనసాగకపోవచ్చు. కాబట్టి కనిపించని భవిషత్తుపై అంచనాలతో ప్రస్తుతం అప్పులు చేయడం తప్పు.ఫ్లోటింగ్ వడ్డీ రేట్లుఉద్యోగంలో చేరిన వెంటనే చాలామంది అడిగేప్రశ్న.. ‘ఇల్లు ఎప్పుడు కొంటారు’ అని.. దాంతో స్థోమతకు మించి అప్పు చేసైనా సరే ఇల్లు కొనాలనుకుంటారు. దీర్ఘకాల వ్యవధికిగాను హోమ్లోన్లను ఎంచుకునేప్పుడు ఫ్లోటింగ్ రేట్లును సెలక్ట్ చేసుకుంటారు. దాంతో వడ్డీ రేట్ల పెంపు వల్ల వచ్చే ఈఎంఐలలో ఆకస్మిక పెరుగుదలకు సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తులో కిస్తీలు 20శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకొని లోన్ రీపేమెంట్ కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం మంచిది.లోన్ తీర్చడానికి మళ్లీ అప్పువడ్డీ ఖర్చులను తగ్గించడానికి, హోం లోన్ రీఫైనాన్స్ చేయడం వంటివాటి కోసం తప్పా..అప్పు తిరిగి చెల్లించడానికి డబ్బు తీసుకోవడం మంచిది కాదు. సాధారణంగా, సామాజిక ఒత్తిళ్ల కారణంగా హోంలోన్, కారు లోన్ ఈఎంఐలు, అద్దె, పాఠశాల ఫీజులు వంటి చెల్లింపులను వాయిదా వేయడానికి వెనుకాడతారు. బదులుగా, కొందరు క్రెడిట్ కార్డ్‌లను ఆశ్రయిస్తారు. అవసరమైన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ అప్పును పెంచుకుంటూ పోతారు. -
Fact Check: పరిమితికి లోబడ్డా పైశాచిక రాతలే!
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రామోజీలో ఆవేశం శృతిమించుతోంది. సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’ సభలు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమవుతుండడంతో ఆయనలో కడుపుమంట తారాస్థాయికి చేరుతోంది. ఫలితంగా తన క్షుద్రపత్రిక ఈనాడులో రాతలు అదుపు తప్పడమే కాదు పట్టాలూ తప్పుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం అదే పనిగా అశుద్ధ కథనాలు వండివారుస్తున్న రామోజీ అప్పులపై అదే పనిగా కొట్టిన డప్పే మళ్లీ మళ్లీ కొడుతూ తన కడుపు ఉబ్బరాన్ని తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. నిజానికి.. అప్పులపై నానా చెత్త పోగేసి విషం కక్కుతున్న ఆయన ఒకసారి కాగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి చూస్తే బాబు హయాంలో ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి ఎంత అప్పుచేశారో తెలుస్తుంది. అలాగే, వైఎస్సార్సీపీ హయాంలో కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు ఏమిటి? ఎంత అప్పు చేశారనేది అర్థమైపోతుంది. కానీ, రామోజీ అలా చేయరు. ఎందుకంటే.. తన ఆత్మబంధువు చంద్రబాబు బండారం బయటపడిపోతుంది కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై రామోజీ ప్రచారం చేస్తున్న అబద్ధాల కుప్పలోని ‘ఫ్యాక్ట్‌చెక్’ఏమిటంటే.. బాబుకు, జగన్‌కు తేడా ఇదీ.. వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించడంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసింది. మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా ఏడుపేనా? మరోవైపు.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో పరిమితి ఉన్నప్పటికీ ఏకంగా రూ.26,668.46 కోట్లు తక్కువగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పుచేసింది. రాష్ట్ర విభజనానంతరం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జగన్ సర్కారు అతి తక్కువగా 2.18 శాతం ద్రవ్యలోటు రికార్డు చేసింది. కోవిడ్ లాంటి సంక్షోభం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఏ ఏడాది కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేయలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసినా ఈనాడు రామోజీకి అది కనిపించలేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో ఈనాడు రామోజీ విషం కక్కుతున్నారు. నిజానికి.. అప్పులుచేసి రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కట్టకుండా, ఎన్నికల హామీలు అమలుచేయకుండా కన్సల్టెన్సీల పేరుతో, గ్రాఫిక్స్ పేరుతో, పోలవరం, తాత్కాలిక రాజధానికి బస్సుల్లో జనాన్ని పంపించి భజనలు చేయించుకోవడానికి చేసిన వృధా వ్యయాన్నే విపక్ష నేతగా జగన్ అప్పట్లో తప్పుబట్టారు ఇప్పుడు రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మరోపక్క పరిమితికి లోబడే అప్పులు చేస్తూ ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తూ లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు. అప్పుల గణాంకాలన్నీ కాగ్, ఆర్బీఐ నివేదికల్లో ఉన్నాయి. కళ్లు కనిపిస్తుంటే ఒకసారి చూడు రామోజీ యనమల మాటలు మర్చిపోతే ఎలా? ఇక ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి మీ బాబు ఐదేళ్లతో పాటు ఎన్నికల ముందు ఏప్రిల్, మే నెలలో కలిసి మొత్తం రూ.37,354 కోట్లు ఎక్కువగా అప్పుచేశారు. బాబు హయాంలో చేసిన ఎక్కువ అప్పుల కారణంగా ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయాల్సిన అప్పుల్లో కేంద్రం కోత విధించింది. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పరిమితి ఉన్నప్పటికీ ఇప్పటివరకు రూ.366.06 కోట్లు తక్కువ అప్పుచేసింది. వచ్చే ప్రభుత్వానికి అప్పు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్న మాటలు మర్చిపోతే ఎలా రామోజీ? గుర్తున్నాసరే జగన్ సర్కారును తప్పుపట్టడమే పని కాబట్టి నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో డప్పు వాయిస్తున్నావా రామోజీ? అలాగే, చంద్రబాబు హయాంలో అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 21.87 శాతం ఉండగా.. ఇప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో అది 12.13 శాతమే ఉంది. అప్పులు, ఆదాయ, వ్యయాల గణాంకాలన్నీ ప్రతీనెలా కాగ్ తన వెబ్సైట్లో ఉంచుతోంది. ఇది ఒక్క ఏపీవే కాకుండా అన్ని రాష్ట్రాల గణాంకాలు ఉంచుతోంది. ఇందులో దాపరికం ఎక్కడిది? నీవన్నీ తప్పుడు రాతలు తప్ప అందులో ఒక్కటీ వాస్తవంలేదు రామోజీ.. బాబుకు, జగన్‌కు తేడా ఇదీ.. వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసింది. మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హమీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. ఇదీ మీ బాబుకు వైఎస్ జగన్‌కు ఉన్న తేడా రామోజీ. -
2032–33 నాటికి కట్టాల్సింది.. రూ.2.5 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై అప్పుల భారం తీవ్రంగా ఉందని, రానున్న పదేళ్లలో రుణాల తిరిగి చెల్లింపు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’నివేదికలో పేర్కొంది. మార్కెట్ రుణాల మీద వడ్డీ, అసలు కలిపి.. 2032–33 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,52,048 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 2022 మార్చి 31తో ముగిసిన (2021–22) ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిర్వహణ తీరుపై కాగ్ రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీ ముందుపెట్టింది. బడ్జెట్లో పేర్కొనకుండా తీసుకున్న రుణాల్లో (ఆఫ్ బడ్జెట్) కాళేశ్వరానికే ఎక్కువగా ఉన్నాయని కాగ్ పేర్కొంది. ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)’కింద రూ.66,854 కోట్లు తీసుకున్నారని.. ఈ రుణాల అసలు, వడ్డీ కలిపి 14 ఏళ్లలో రూ.1,45,545 కోట్లు చెల్లించాలని పేర్కొంది. దీనితో సమీప భవిష్యత్తులో అభివృద్ధి ప్రణాళికల విషయంలో రాష్ట్ర సామర్థ్యం పరిమితం అవుతుందని వ్యాఖ్యానించింది. కాగ్ నివేదికలోని అంశాలివీ.. ► రెవెన్యూ రాబడులు 26 శాతం పెరిగినా మిగులును సాధించడంలో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా విఫలమైంది. బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న ఆఫ్ బడ్జెట్ రుణాలు, ఇతర చెల్లింపులను కలిపితే.. జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి 37.77 శాతంగా ఉంది. ఇది ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించిన దానికంటే 12.77 శాతం, 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దానికంటే 8.47 శాతం ఎక్కువ. ►2021–22లో రెవెన్యూ వ్యయం 11 శాతం పెరిగింది. ఇందులో జీతాలు, వడ్డీ చెల్లింపులే ఎక్కువ భాగం ఉన్నాయి. విద్య, ఆరోగ్యం మీద ఖర్చు విషయంలో రాష్ట్రం వెనుకంజలో ఉంది. మొత్తం వ్యయంలో 8శాతం విద్య, 4శాతం ఆరోగ్యంపై ఖర్చు చేశారు. ► అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూలధన వ్యయం 81శాతం పెరిగింది. 2021–22లో రూ.28,874 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చుపెట్టారు. అయితే 2022 నాటికి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల మీద రూ.1,09,612 కోట్లు మూలధనం ఖర్చయింది. ► బడ్జెట్ వ్యయం కింద రూ.2,30,872 కోట్లకు ప్రభుత్వం అసెంబ్లీ అనుమతి తీసుకుంది. తర్వాత అనుబంధంగా రూ.24,144 కోట్ల మేర అంచనాలకు ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ ఖర్చు రూ.2,63,092 కోట్లుకాగా.. నికర అధిక వ్యయం రూ.8,076 కోట్లు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను పరిగణనలోకి తీసుకోకపోతే అయిన ఖర్చు రూ.1,95,818 కోట్లే. అంటే బడ్జెట్ అంచనాల్లో వాస్తవఖర్చు 77శాతమే. ► 2014–15 నుంచి 2020–21 వరకు కలిపి బడ్జెట్లకు అదనంగా చేసిన రూ.2,14,062 కోట్ల ఖర్చుకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. ఇది ప్రజావనరుల నిర్వహణలో క్రమశిక్షణ రాహిత్యమే. ► దళితబంధు కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు. కానీ వినియోగ పద్దులో రూ.4,442 కోట్లు ఖర్చు చూపెట్టారు. వాస్తవంగా ఖర్చయినది రూ.2,101 కోట్లు మాత్రమే. అనర్హులకు ‘ఆసరా’తో రూ.1,175 కోట్లు నష్టం అర్హతలేని 2.02 లక్షల మందికి లబ్ధి కలిగిందన్న కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద అనర్హులకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ కొందరు లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించినా కూడా వారిని జాబితా నుంచి తొలగించారని తెలిపింది. దీనితో 2021 మార్చి 31తో ముగిసిన (2020–21) ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షల మంది అనర్హులకు రూ.1,175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగినట్టు తేల్చింది. కుటుంబ ఆదాయానికి సంబంధించిన సిస్టమ్‌లో అంతర్గతంగా కచ్చితమైన నియంత్రణలు లేవని.. దీనితో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ ఆదాయమున్నవారికీ లబ్ధి కలిగిందని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) డేటాలోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 16శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లకు అర్హత లేదని స్పష్టమవుతోందని, అయినా పింఛన్ దరఖాస్తుల పరిశీలన, మంజూరు, గుర్తింపు ప్రక్రియలను సమర్థవంతంగా చేయలేదని తప్పుపట్టింది. 2018 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య సగటున నెలకు 2.30 లక్షల (6 శాతం) మంది లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపు జరగలేదని పేర్కొంది. ఇసుక విధానంలో లోపాలతో ఖజానాకు గండి ఇసుక వెలికితీతలో టీఎస్ఎండీసీ తీరును తప్పుపట్టిన కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానంలోని లోపాలతో, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) తీరుతో ఖజానాకు నష్టం వాటిల్లిందని ‘కాగ్’పేర్కొంది. టీఎస్‌ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్న గిరిజన సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను సబ్ లీజ్‌కు అప్పగించడంతో.. థర్డ్ పార్టీకి రూ.11.61 కోట్లు అనుచిత లబ్ధి జరిగిందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఇసుక కాంట్రాక్టర్లకు చెల్లించే ధర నిర్ణయంలో ఆలస్యంతో రూ.172.64 కోట్ల మేర ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందని పేర్కొంది. అధిక లోడింగ్, వాహనాల కదలికలను గుర్తించే సీసీ కెమెరాలు, జీపీఎస్ పరికరాలను అరకొరగా ఏర్పాటు చేయడం సరికాదని తెలిపింది. ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల కార్యకలాపాలపై టీఎస్ఎండీసీ పర్యవేక్షణ లోపభూయిష్టమని పేర్కొంది. అనుమతులు లేకుండా చేపట్టిన తవ్వకాలతో 2022 మార్చి నాటికి రూ.108.96 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని కాగ్ తెలిపింది. 2016–21 మధ్య రూ.171.32 కోట్లు రహదారి చార్జీలు వసూలైతే.. అందులో ప్రభుత్వం రూ.162.27 కోట్లను ఇతర ప్రయోజనాలకు మళ్లించిందని పేర్కొంది. -
ఏప్రిల్ నుంచి కీలక ఛార్జీల నిబంధనలు అమలు...
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)రుణ ఎగవేతలపై జరిమానా ఛార్జీలకు సంబంధించి ఆర్బీఐ కీలక నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వేసే జరిమానా ఛార్జీలను ఆదాయ వృద్ధి సాధనంగా ఉపయోగించడాన్ని నిషేధించిన ‘ఫెయిర్ లెండింగ్ విధానం’ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ సోమవారం తెలిపింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా వడ్డీని ఆదాయ పెంపు సాధనంగా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్బీఐ గత ఏడాది ఆగస్టు 18న ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించింది. దీని ప్రకారం బ్యాంకులు రుణ పునఃచెల్లింపుల్లో వైఫల్యం వంటి ‘‘సహేతుకమైన’’ ప్రాతిపదికపై మాత్రమే జరిమానా ఛార్జీలను విధించడానికి వీలవుతుంది. ఇటువంటి జరిమానా ఛార్జీలు బ్యాంకుల బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం వివక్షత లేని పద్ధతిలో డిఫాల్ట్ కింద ఉన్న మొత్తంపై మాత్రమే అమలువుతాయి. అటువంటి ఛార్జీలపై వడ్డీని లెక్కించడం జరగదు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ సూచనలు క్రెడిట్ కార్డ్‌లు, అంతర్జాతీయ వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలకు వర్తించదు. -
బ్యాంక్‌లోన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలంటే..
బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. అన్ని సందర్భాల్లోనూ రుణం దొరకండ అంత తేలికేమీ కాదు. కొందరికి ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం కష్టం అవుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకున్నప్పటికీ బ్యాంకులు రుణ దరఖాస్తును తిరస్కరిస్తోంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు రుణగ్రహీత ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. రుణ దరఖాస్తును తిరస్కరించేందుకు చాలా కారణాలుంటాయి. అంతకు ముందు తీసుకున్న రుణాల చెల్లింపు తీరు, ఆదాయాన్ని మించిన అప్పుల్లాంటివీ ఇందులో ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరించిన వెంటనే మళ్లీ కొత్తగా వేరే బ్యాంకులో దరఖాస్తు చేయకముందు చాలా విషయాలు సరిచేసుకోవాలి. మీ దరఖాస్తును బ్యాంకు ఎందుకు తిరస్కరించిందో కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రుణదాతలు కచ్చితంగా దీన్ని తెలియజేస్తారు. క్రెడిట్ స్కోరు 700 పాయింట్ల లోపు ఉన్నప్పుడు రుణ దరఖాస్తును ఆమోదించడం కష్టం. తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలు మీ ఆదాయంలో 50-60 శాతానికి చేరడం, వాయిదాలను ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగంలో సమస్యలు, తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి చట్టపరమైన చర్యల వంటి వాటివల్లా దరఖాస్తు తిరస్కరించే ఆస్కారం ఉంది. మీ క్రెడిట్ నివేదికలో తప్పుడు వివరాలూ కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. వాయిదాలు చెల్లింపులో.. రుణ తిరస్కరణ ఎదురుకాకుండా చూసుకునేందుకు ఆరోగ్యకరమైన రుణ చరిత్రను నిర్వహించడం ఎంతో కీలకం. వాయిదాలను సకాలంలో చెల్లించాలి. 750కి మించి క్రెడిట్ స్కోరున్నప్పుడు రుణ దరఖాస్తును సులభంగా ఆమోదిస్తారు. తక్కువ స్కోరు వల్లే రుణం లభించలేదు అని తేలితే.. ముందుగా స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. చిన్న మొత్తంలో ఉన్న అప్పులను పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు క్రమంగా పెరుగుతుంది. తప్పుడు వివరాలుంటే.. వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా, సంతకం, పాన్, ఆధార్ ఇలా పలు వివరాలను రుణ దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ రుణదాతల యాప్‌లోనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటిలో ఏ చిన్న పొరపాటు గుర్తించినా, రుణ దరఖాస్తు ఆమోదం పొందదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలు సరిచూసుకోవాలి. నిత్యం లోన్లు అడుగుతుంటే.. కొంతమంది అవసరం లేకపోయినా వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులను సంప్రదిస్తారు. ఇలా మీరు అడిగిన ప్రతిసారీ మీ క్రెడిట్ స్కోరు స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి, తక్కువ వ్యవధిలోనే బహుళ రుణ దరఖాస్తులు మీ క్రెడిట్ స్కోరును గణనీయంగా దెబ్బతీస్తాయి. మీ స్కోరును కాపాడుకునేందుకు సాధ్యమైనంత వరకూ తక్కువ దరఖాస్తులు చేయడం మేలు. అనేకసార్లు దరఖాస్తు చేస్తే.. మీరు అప్పుల మీదే ఆధారపడుతున్నారని బ్యాంకులు భావించే అవకాశం ఉంది. తనిఖీలు చేసుకోండి.. క్రెడిట్ నివేదికలో తప్పులు దొర్లినప్పుడు వాటిని వెంటనే గుర్తించేలా ఉండాలి. కాబట్టి, క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. కొన్ని క్రెడిట్ బ్యూరోలు నెలకోసారి వీటిని ఉచితంగానే అందిస్తాయి. మీ ఆర్థిక ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఏదైనా పొరపాట్లు ఉంటే, వెంటనే వాటిని గుర్తించి, సరి చేసుకునేందుకు వీలవుతుంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు, అది పెరిగేందుకు కొంత సమయం పడుతుంది. రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బాకీల్లాంటివి సకాలంలో చెల్లించాలి. అప్పుడు మీపై బ్యాంకులకు విశ్వాసం పెరిగి, రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలుంటాయి. -
రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ పుస్తక రచయిత.. కారణం ఇదే..
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం అన్న వెంటనే చాలా మందికి ఆర్థిక పాఠాలు, గుడ్ డెట్-బ్యాడ్ డెట్, స్టాక్మార్కెట్లో పెట్టుబడులు, వాటి ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, వ్యాపారం.. ఇలా చాలా అంశాలు గుర్తుకొస్తాయి. 1997లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పుస్తకం దాదాపు 4 కోట్ల కాపీలు అమ్ముడైంది. అయితే ఈ పుస్తకం రచయిత రాబర్డ్టి కియోసాకి ప్రస్తుతం అప్పుల్లో ఉన్నారంటూ ఆయనే స్వయంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం. రాబర్ట్టి కాయోసా ఇన్‌స్టా వేదికగా ఓ రీల్ పోస్ట్ చేశారు. అందులో ఆస్తులు, రుణాల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడారు. ‘మన చుట్టూ ఉన్నవాళ్లు చాలా మంది విలాసాల కోసం అప్పు చేస్తారు. కానీ నేను మాత్రం ఆస్తులను కొనడానికి అప్పు చేస్తాను. ఫెరారీ, రోల్స్ రాయల్స్ వంటి విలాసవంతమైన వాహనాలు అప్పు. అవి ఆస్తులు కావు. సంపాదనను డబ్బు రూపంలో ఆదా చేయను. ఆ మొత్తాన్ని వెండి, బంగారం రూపంలో మారుస్తాను. పెట్టుబడుల్లో భాగంగా నేను చేసిన అప్పు 1.2 బిలియన్ డాలర్ల(రూ.10 వేల కోట్లు)కు చేరింది’ అని ఆయన చెప్పారు. పెట్టుబడుల రూపంలో తాను చేసిన అప్పే ఆయన ఆస్తి అని కియోసాకి అన్నారు. ఇదీ చదవండి: అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు కియోసాకి తన పుస్తకంలో పెట్టుబడులకు సంబంధించి వివరంగా చెప్పారు. అత్యవసర వస్తువులు, అవసరమైన వస్తువులు, అనవసరమైన వస్తువులు అంటూ విభజించుకుని డబ్బు వెచ్చించాలని చెప్పారు. డబ్బును మరింత పెంచేలా పెట్టుబడిపెట్టేందుకు చేసే రుణాలు గుడ్ డెట్ అని ఆయన రాశారు. డబ్బు ఖాళీగా బ్యాంక్ ఖాతాల్లో ఉండడంకంటే మంచి రాబడులు వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. స్టాక్మార్కెట్లో డివిడెంట్ ఇచ్చే స్టాక్ల్లో పెట్టుబడి పెట్టాలని, మార్కెట్ ఒడుదొడుకులను లోనైతే బంగారం, రియల్ ఎస్టేట్‌లో మదుపు చేయాలని ఆయన తన పుస్తకంలో రాశారు. -
అప్పుల ఊబిలో విద్యుత్ రంగం
మణుగూరు రూరల్: విద్యుత్ సెక్టార్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టివే సిందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్ కొనుగోలుకు రూ.30,406 కోట్లు, బకాయిల పేరుతో రూ.59,580 కోట్లు అప్పు చేసి లెక్కలు లేకుండా తారుమారు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను శనివారం భట్టి సందర్శించారు. జెన్కో అధికారులతో కలిసి వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి వివరాల గురించి అడిగి తెలుసుకు న్నారు. అనంతరం సీఈ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. బీటీపీఎస్‌తో వచ్చే సమస్యలు అధిగమించేందుకు.. ప్రస్తుతం బీటీపీఎస్‌తో అనేక సమస్యలు తలె త్తుతున్న క్రమంలో వాటిని అధిగమించేందుకు భవిష్యత్‌లో ఉన్నత మైన ప్రణాళికలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. బీటీపీ ఎస్‌లో సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి ఉండగా.. సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగిస్తున్నా రని, దీంతో పర్యావర ణానికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్య లను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. జమలాపురం ఆలయాన్ని, మామునూరు పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, రేమిడిచర్లలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మిస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జెన్కో సీఎండీ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి కృష్ణభాస్కర్, పినపాక, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్ పాల్గొన్నారు. -
అప్పు ప్రమాదఘంటికలివే..
డబ్బు.. మనిషిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తుంది.. పతాలానికి తోసేస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అప్పుల మూటలు కూడగట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీతం వస్తున్న వారు నిత్యం ఏదో రూపంలో అప్పులు తీసుకుంటారు. అప్పుల్లో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. అప్పుచేసి ఆ సొమ్మును మరింత పెంచేలా ఎక్కడైనా పెట్టుబడిపెడితే అది మంచి అప్పు. అదే అప్పు విలాసాలకు వాడితే దాన్ని చెడు అప్పు అంటారు. తీసుకునే అప్పుపై సరైన అవగాహన లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి వారు తీసుకున్న అప్పుతో మరింతో లోతుల్లోకి వెళుతున్నామని తెలియకపోవచ్చు. కానీ కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ ప్రమాదాన్ని కొంత తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వస్తువలు కొనాలంటే సరిపడా డబ్బు లేకుండా ఈజీ ఈఎంఐల బాట పడుతుంటారు. వ్యక్తిగత ఈఎంఐలు సులువే అనిపించినప్పటికీ, వీటివల్ల ఇతర ఖర్చులకు డబ్బు సరిపోదు. కిస్తీల విలువ నెలవారీ ఆదాయంలో 50శాతం కంటే తక్కువగా ఉండాలి. అనేక బ్యాంకులు వ్యక్తులు ఈ 50శాతం పరిమితి మించకుండా నిరోధించడానికి పరిమితులను కూడా విధించాయి. అయితే చాలా మంది ఈజీ ఈఎంఐలు, తగ్గింపులు, సేల్స్ ఆఫర్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చులో మునిగిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. కనీస అవసరాలను తీర్చుకోవడానికి తరచు అప్పు తీసుకుంటే మాత్రం ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి అప్పులు తీసుకోవడం వల్ల రుణఊబిలోకి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో దాదాపు అన్ని బ్యాంకులతోపాటు ఆన్లైన్ పేమెంట్ యాప్‌లు సైతం క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలా మంది తమకున్న అప్పులు తీర్చడానికి క్రెడిట్‌కార్డులను తీసుకుంటుంటారు. కానీ అప్పులు తీర్చడానికి తిరిగి క్రెడిట్ కార్డ్ రూపంతో అధిక వడ్డీలకు అప్పుచేయడం దారుణం. దాంతో ఆ క్రెడిట్ కార్డ్ బకాయిలను సైతం తీర్చలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. పరిస్థితి శ్రుతిమించితే తీసుకున్న అప్పులను రోల్ఓవర్ చేయాడానికి సైతం వెనుకాడరు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో తిరిగి అప్పు పుట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని గ్రహించాలి. ఇదీ చదవండి: ఆగిపోతున్న సరకు రవాణా..! అప్పు తీసుకోడదా..? అంటే తీసుకోవాలి. కానీ అది మన ఆర్థిక పరిధిలో ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవడం మంచిదే కానీ, ఈఎంఐలను లెక్కించేటప్పుడు అన్ని కనీస అవసరాలుపోను జీతం సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంతకుమించి దాదాపు ఆరు నెలలకు సరిపడే అత్యవసర నిధిను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
కరెంటు లెక్క..అప్పుల కాక..రణరంగంలా మారిన అసెంబ్లీ
-
తెలంగాణ అప్పు రూ.6,85,765 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘పదేళ్ల బీఆర్ఎస్ విధ్వంసం–ఆర్థిక అరాచకం’పేరుతో విడుదల చేయనున్న శ్వేతపత్రంలో భాగంగా 1956–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, తద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించనున్నట్లు సమాచారం. అలాగే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023–24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి మొత్తం అంచనాలు, జరిగిన ఖర్చుతో పాటు అప్పుల గురించి శాసనసభకు తెలియజేయనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలకు, ఖర్చుకు పొంతన లేదని, రెండింటికీ మధ్య సుమారు 20 శాతం తేడా ఉందంటూ గణాంకాలు వెల్లడించనున్నట్లు తెలిపాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24 వరకు మొత్తం రూ.14,87,834 కోట్లను ప్రతిపాదిస్తే, ఖర్చు చేసింది కేవలం రూ.12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించనుంది. అప్పులు ఇలా..! ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.75 వేల కోట్ల అప్పు ఉంటే గత పదేళ్లలో అది రూ.6,85,765 కోట్లకు చేరింది. అందులో ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు లోబడి తెచ్చిన అప్పు రూ.3.89 లక్షల కోట్లయితే, వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిళ్లు, సంస్థలకు గ్యారంటీల ద్వారా ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్లకు పైగా సమకూర్చి ఖర్చు పెట్టింది. మరో రూ.1.09 లక్షల కోట్లను గ్యారంటీలిచ్చి కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టింది. ఇక ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా రూ.60 వేల కోట్ల మేర కార్పొరేషన్లే నేరుగా అప్పులు చేశాయి..’అని విశదీకరించనున్నారు. ‘రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.12 లక్షల కోట్లకు పైగా కేవలం మిషన్ భగీరథ, సీతారామ, కాళేశ్వరంతో పాటు కొంతమేర పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టారు. ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల్లో కొంత వెచ్చించి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. అయితే 1956 నుంచి 2014 వరకు అన్ని బడ్జెట్లు కలిపి తెలంగాణకు వచ్చి న వాటా కేవలం రూ.5 లక్షల కోట్లకు పైగా మాత్రమే. ఈ తక్కువ మొత్తంతోనే నాగార్జున సాగర్ నుంచి కృష్ణా, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఇతర సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు అమలు చేశాయి..’ అని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. -
వేలకోట్ల అప్పు తీర్చే యోచనలో అదానీ గ్రూప్.. ఎలాగంటే..
అదానీ గ్రూప్ ఎక్కువగా రుణాలను కలిగి ఉందని.. వాస్తవ విలువ కంటే అధిక లెవరేజ్ పొందిందంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. దాంతోపాటు హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో షేర్ విలువ బాగా తగ్గిపోయింది. అయితే ఆ సమయంలో చాలా రుణాలను కంపెనీ గడువు కంటే ముందే చెల్లించి తన పొటెన్షియల్‌ను నిరూపించుకుంది. వచ్చే ఏడాది రూ.15వేల కోట్లు విదేశీ కరెన్సీ బాండ్లు మెచ్యూర్ అవుతుండటంతో.. అదానీ గ్రూప్ నగదు చెల్లింపులు, కొత్త బాండ్ విక్రయాల ద్వారా డెట్ రీఫైనాన్సింగ్ పూర్తి చేయాలని చూస్తోంది. ఇందుకోసం ప్రణాళికలను రూపొందిస్తోంది. 2019లో విక్రయించిన అదానీ గ్రీన్ హోల్డింగ్ కంపెనీ బాండ్లలో రూ.6200 కోట్లు తిరిగి చెల్లించడానికి, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూర్ అయ్యే నగదు, అందుకు సమానమైన లిక్విడిటీ పూల్‌ను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు గ్రూప్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. జులై నాటికి అదానీ పోర్ట్స్‌కి చెందిన రూ.5400 కోట్ల రుణాలను నగదు రూపంలో చెల్లించటానికి సైతం అదానీ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఏడాది రూ.2700 కోట్లు నగదును చెల్లించింది. మే నెలలో మెచ్యూర్ అయ్యే అదానీ గ్రీన్‌కు చెందిన రూ.4100 కోట్ల బాండ్ రీఫైనాన్స్ కోసం రూ.3400 కోట్లు సమీకరించడానికి రుణదాతలతో అదానీ గ్రూప్ చర్చలు ప్రారంభించింది. అయితే 20 ఏళ్ల కాలానికి దీర్ఘకాలిక నిధులను సమీకరించటానికి చర్యలు తీసుకుంటున్నట్లు గ్రూప్ వర్గాలు తెలిపాయి. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం మొత్తం అదానీ గ్రూప్ సంస్థలు సుమారు రూ.62వేల కోట్లు రుణాలను కలిగి ఉన్నాయి. హోల్డింగ్ కంపెనీలతో పోలిస్తే, నగదు ప్రవాహాన్ని సృష్టించే ఆపరేటింగ్ కంపెనీల్లో రీఫైనాన్సింగ్ సులభం అవుతుందని సమాచారం. దాంతో అదానీ గ్రూప్ రీపేమెంట్ వ్యూహంలో భాగంగా దీన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు, నాన్-క్యుములేటివ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అదనంగా రూ.250 కోట్లు సమీకరించే ప్రణాళికలను కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఇదీ చదవండి: ఇస్రో వేల కోట్లు సంపాదన.. కేంద్ర మంత్రి ఏమన్నారో తెలుసా? కంపెనీ గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌తో సహా భారతదేశం అంతటా 13 పోర్ట్‌లు, టెర్మినల్‌లను నిర్వహిస్తోంది. అలాగే అదానీ పోర్ట్స్ శ్రీలంకలోని ఒక కంటైనర్ టెర్మినల్ కోసం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.4600 కోట్ల రుణాన్ని పొందింది. -
ఆదాయంతోపాటు అభివృద్ధి
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత సర్కారు హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలోనే ఆదాయం పెరగడంతోపాటు అభివృద్ధి జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. టీడీపీ హయాం కంటే ఇప్పుడే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా నమోదైందని, గత ప్రభుత్వంతో పోల్చితే అప్పులు కూడా ఇప్పుడే తక్కువని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమానికి గత సర్కారు కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో రెట్లు అధికంగా వ్యయం చేసిందని గణాంకాలతో సహా బహిర్గతం చేశారు. మంత్రి బుగ్గన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పులు, ఆదాయం, వృద్ధిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖలు ద్వారా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఒకసారి రూ.పది లక్షల కోట్లు మరోసారి రూ.11 లక్షల కోట్లు, ఇంకోసారి రూ.నాలుగున్నర లక్షల కోట్లు అంటూ యనమల తన లేఖల్లోనే పరస్పర విరుద్ధ గణాంకాలను పేర్కొనటాన్ని గుర్తు చేశారు. కొత్తగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలైన పురందేశ్వరి లాంటి వారు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేయడంపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐకి కూడా ఇదే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలపై ఆమె కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్ర ఆర్ధిక శాఖ, కాగ్, ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలే వాస్తవాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలు ఇదే విషయాన్ని పార్లమెంట్లో సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అప్పులు, రాష్ట్ర ఆదాయం, స్థూల ఉత్పత్తిపై తాను చెబుతున్న లెక్కల్లో తప్పులుంటే చెప్పాలని యనమలకు సవాల్ విసిరారు. స్కిల్ స్కామ్‌కు సంబంధించి రూ.250 కోట్లకు లెక్కలు కనిపించడం లేదని బుగ్గన వెల్లడించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రూ.370 కోట్లకు నామినేషన్‌పై డిజైన్ టెక్కు ఇచ్చారని, ఈ స్కామ్ 2017లోనే జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీ విచారణలో వెలుగులోకి వచ్చిందన్నారు. సెబీ, ఈడీ కూడా దీనిపై విచారణ చేశాయన్నారు. ఎవరి హయాంలో అప్పులు ఎలా? 2018–19 నాటికి (టీడీపీ హయాంలో) రూ.2,57,210 లక్షల కోట్లు 2021–22 నాటికి (వైఎస్సార్సీపీ హయాంలో) రూ.3,93,718 లక్షల కోట్లు మూడేళ్లలో వైఎస్సార్సీపీ హయాంలో పెరిగిన అప్పులు రూ.1,36,500 కోట్లు సగటున ఏడాదికి రూ.45,500 కోట్లు అప్పులు ♦ టీడీపీ హయాంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.33,032 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీల సంక్షేమానికి రూ.74,249 కోట్లు వ్యయం. ♦ టీడీపీ హయాంలో ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.11,400 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్ సీపీ పాలనలో ఎస్టీల సంక్షేమానికి రూ.25,323 కోట్లు వ్యయం ♦ టీడీపీ హయాంలో బీసీ సంక్షేమానికి రూ.30,970 కోట్లు వ్యయం ♦ వైఎస్సార్సీపీ నాలుగేళ్లలో బీసీ సంక్షేమానికి చేసిన వ్యయం రూ.1,12,960 కోట్లు ♦ మైనారిటీలకు టీడీపీ హయాంలో వ్యయం సున్నా ♦ వైఎస్సార్సీపీ నాలుగేళ్లలో మైనారిటీల సంక్షేమానికి చేసిన వ్యయం రూ.11,157 కోట్లు ♦ చంద్రబాబు హయాంలో విద్యుత్ బకాయిలు డిస్కమ్‌లకు చెల్లింపు రూ.20,165 కోట్లు ♦ వైఎస్సార్సీపీ పాలనలో నాలుగేళ్లలో రూ.57,417 కోట్లు చెల్లింపు టీడీపీ హయాంలో గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పుల పెరుగుదల ఇలా ♦ 2014 నాటికి గ్యారెంటీ అప్పులు రూ,13,247 కోట్లు ♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.57,687 కోట్లు ♦ 2014 నాటికి నాన్ గ్యారెంటీ అప్పులు రూ.22,000 కోట్లు ♦ 2019 టీడీపీ దిగిపోయే సమయానికి రూ.66,664 కోట్లు వైఎస్సార్సీపీ వచ్చాక నాలుగేళ్లలోగ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు ♦ వైఎస్సార్ సీపీ హయాంలో గ్యారెంటీ అప్పులు రూ.1,18,000 కోట్లు ♦ నాన్ గ్యారెంటీ అప్పులు రూ.83,000 కోట్లు బాబు హయాంలో ఓవర్ డ్రాప్ట్ 2018–19లో 74.3 శాతం వినియోగం ♦ వైఎస్సార్సీపీ పాలనలో అనుమతించిన రోజుల్లో 2019–20లో 39.5 శాతం వినియోగం ♦ 2020–21లో అనుమతించిన రోజుల్లో 51.5 శాతమే ఓవర్ డ్రాప్ట్ వినియోగం ♦ 2014–15లో ద్రవ్యలోటు మూడు శాతానికి అనుమతిస్తే 3.95 శాతానికి చేరింది ♦ 2018–19లో మూడు శాతానికే అనుమతి ఉంటే 4.06 శాతానికి చేరింది. ♦ ఇప్పుడు 2021–22లో 4.5 శాతానికి అనుమతి ఉంటే ద్రవ్యలోటు కేవలం 2.01 శాతమే ఉంది. ♦ టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు రూ.1,62,828 కోట్లను అసెంబ్లీ అనుమతి లేకుండా అధికంగా వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా ♦ 2014 నాటికి అప్పు రూ.1,34,600 లక్షల కోట్లు ♦ 2019 మే నాటికి మొత్తం అప్పు రూ,3,28,700 లక్షల కోట్లు.. అంటే అప్పుల పెరుగుదల 19.55 శాతం వైఎస్సార్సీపీ హయాంలో అప్పుల పెరుగుదల ఇలా ♦ 2022–23 నాటికి మొత్తం అప్పు రూ.4,99,895 లక్షల కోట్లు. అంటే అప్పు పెరుగుదల శాతం 15.46 శాతమే ♦ టీడీపీ హయాంలో ఐదేళ్లలో మూలధన వ్యయం రూ.76,139 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.15,227 కోట్లే ♦ వైఎస్సార్సీపీ హయాంలో మూడేళ్లలో మూల ధన వ్యయం రూ.55,086 కోట్లు. సగటు వార్షిక మూల ధన వ్యయం రూ.18,362 కోట్లు ♦ టీడీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల రూ34,73,477 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.6,95,695 లక్షల కోట్లు ♦ వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల రూ.43,34,192 లక్షల కోట్లు. ఏడాదికి సగటు పెరుగుదల రూ.10,83,548 లక్షల కోట్లు. -
అప్పు చేసి.. ఆస్తి అమ్మి..
ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు అభ్యర్థుల తంటాలు ఎన్నికల ఖర్చు కోసం దొరికిన చోటల్లా అప్పు చేసేవారు కొందరైతే... భూములు, ఆస్తులు అమ్ముతున్నవారు మరికొందరు ఉన్నారు. ఎలాగైనా గెలవాలనే భావనతో ఖర్చు ఎంత అయినా సరే అంటూ బరిలో ఉంటున్నారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రధాన పార్టీ అభ్యర్థి.. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏం వెనకేసుకున్నాడో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి తెలిసినవారిని, పరిచయం ఉన్నవారిని కలుస్తూ.. కాస్త డబ్బులు సర్దాలంటూ కోరుతున్నారు. చేబదులుగానే కాదు భూమిని తాకట్టు పెట్టి, అప్పులు చేసి మరీ ఎన్నికల ఖర్చు కోసం వీలైనంత సొమ్మును రెడీ చేసుకుంటున్నారు. ‘‘నా దగ్గర ఉన్న డబ్బుకు తోడు అక్కడా ఇక్కడా మరింత సర్దుబాటు చేసుకుంటున్నాను. అవసరం మనది. నానా రకాల పత్రాల మీద సంతకాలు చేయించుకోనిదే ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు..’’ అని సదరు అభ్యర్థి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఆయన.. ఎన్నికల ఖర్చు కోసం ఇటీవలే తన భూమిని అమ్మేశారు. గతంలో ఇతరులకు అప్పుగా, చేబదులుగా ఇచ్చి న సొమ్మును తిరిగి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ ఎక్కువై, ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. భూమిపోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఐదేళ్లదాకా ఆగాల్సిందే. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. దొరికిన చోటల్లా డబ్బు సిద్ధం చేసుకుని అయినా ఈసారి గట్టెక్కాల్సిందే..’’ అని సదరు ఎమ్మెల్యే అంటున్నారు. ... ఇలా ఈ ఇద్దరే కాదు, ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులందరిదీ ఇదే మాట. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నవారి నుంచి కొత్తగా బరిలోకి దిగుతున్న వారి వరకు ఇదే వరుస. ముందు జాగ్రత్తగా ఇప్పటికే సొమ్ము రెడీ చేసుకుంటున్నవారు కొందరు.. పార్టీల నుంచి టికెట్ ఖరారుకాగానే బరిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నవారు మరికొందరు. స్వతంత్రులుగానో, ఏదైనా చిన్న పార్టీ నుంచో పోటీ చేయడానికి సిద్ధమైనవారు ఇంకొందరు.. ఎవరిని కదిలించినా ఆఫ్ ది రికార్డుగా ‘ఖర్చు’ కష్టాలను ఏకరవు పెడుతున్నారు. సమయం దగ్గరపడుతుండటంతో..: బీఆర్ఎస్ తరఫున మెజారిటీ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలోకి దిగుతున్నారు. బీ–ఫారాలు కూడా అందుకుని ప్రచారమూ ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రెండు జాబితాలు విడుదల చేసింది. బీజేపీ కూడా 53 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లపై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. ఇప్పటికే టికెట్లు ఖరారైనవారు దూకుడుగా ముందుకు వెళ్తుండగా.. టికెట్ కచ్చి తంగా దక్కుతుందన్న భరోసా ఉన్నవారూ ‘ఖర్చు’ మొదలుపెట్టేశారు. ఇక టికెట్ ఆశిస్తున్నవారూ అస్త్రశ్రస్తాలను సిద్ధంగా పెట్టుకుంటున్నారు. అంతా డబ్బు సమీకరణ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎంత ఖర్చవుతుంది, ఎంత సమకూరింది, ఇంకా ఎంత అవసరమనే లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్, తనిఖీల నేపథ్యంలో ఎక్కడికక్కడే నమ్మకస్తులు, అనుచరుల వద్ద డబ్బును సిద్ధంగా పెట్టి.. ఏయే సమయంలో, ఏ ఖర్చులకు వాడాలో సూచిస్తున్నారు. - గౌటే దేవేందర్ -
కౌలు రైతులకు తీపికబురు
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరింత అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది పంట హక్కు సాగు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేసిన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇందుకోసం తొలిసారిగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ వెబ్‌పోర్టల్‌ను అనుసంధానించింది. ఫలితంగా బ్యాంక్ లోన్చార్జ్ మాడ్యూల్లో భూ యజమానులతోపాటు కౌలుదారుల వివరాలను సైతం బ్యాంకర్లు ఖరారు చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేసే అవకాశం కల్పించింది. సాధారణంగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్ బ్యాంకుల లోన్చార్జ్ మాడ్యూల్లో అనుసంధానమై ఉంటుంది. లోన్‌చార్జి మాడ్యూల్లో సర్వే నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయగానే భూ యజమానుల పేర్లు మాత్రమే కన్పించేవి. దీంతో కౌలుదారులకు రుణాల మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ఏదో సాకుతో వెనుకడుగు వేస్తుండేవారు. రబీ సీజన్లో మరింత ఎక్కువ మంది కౌలుదారులకు రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంతో సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను సీసీఆర్సీ వెబ్ పోర్టల్‌తో ప్రభుత్వం అనుసంధానించింది. లోన్చార్జ్ మాడ్యూల్తో సీసీఎల్ఎ వెబ్‌ల్యాంబ్ పోర్టల్ అనుసంధానించి ఉండడంతో ఆటోమేటిక్‌గా లోన్‌చార్జి మాడ్యుల్లో భూ యజమానుల వివరాలతో పాటు కౌలుదారుల వివరాలు కూడా బ్యాంకర్లకు కనిపిస్తాయి. భూ యజమానులను ఒప్పించి.. భూ యజమానుల వివరాలతో పాటు కౌలు రైతుల వివరాలను ఖరారు చేసుకుని బ్యాంకర్లు వారికి రుణాలు మంజూరు చేస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చిన భూమిపై భూ యజమాని కనుక పంట రుణం తీసుకుని ఉంటే కౌలుదారులకు పంట రుణం మంజూరు చేయరు. అయితే, సాగు చేయకపోయినప్పటికీ వరుసగా రెండు సీజన్లలో భూ యజమాని కనుక పంట రుణం పొంది ఉంటే, అటువంటి వారిని గుర్తించి ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తారు. తమ భూమి కౌలుకు తీసుకున్న వాస్తవ సాగుదారులకు చేయూతనిచ్చేలా సహకరించాలని సూచిస్తారు. ఫలితంగా భూ యజమానుల స్థానంలో కౌలుదారులు పంట రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. నాలుగేళ్లలో రూ.6,906 కోట్ల పంట రుణాలు.. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. ఆంక్షల పేరిట బ్యాంకులు మోకాలడ్డేవి. ప్రస్తుతం ఏటా 11 నెలల కాల పరిమితితో జారీ చేస్తున్న కౌలు కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. నాలుగేళ్లలో 17.61 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా.. వీరిలో 9.83 లక్షల మందికి రూ.6,905.76 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. 2023–24 సీజన్లో 8.89 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీల జారీ లక్ష్యం కాగా.. ఇప్పటికే 8.19 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేశారు. వీరికి కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇప్పటికే 3.33 లక్షల మందికి రూ.1,085.42 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. నూరు శాతం రుణాలు మంజూరే లక్ష్యం మరింత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సీïసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ పోర్టల్‌ను అనుసంధానం చేశాం. ఫలితంగా కౌలుదారులకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లకు మరింత వెసులుబాటు కలుగుతుంది. జేఎల్‌జీ గ్రూపులతో పాటు వ్యక్తిగతంగా కూడా కౌలుదారులు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ఈ మార్పు చేశాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం
Coffee Day Enterprises ఆర్ధిక సవాళ్లు ఎదుర్కొంటున్న కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఈ జులై–సెపె్టంబర్ త్రైమాసికంలో దాదాపు రూ. 434 కోట్ల రుణ(అసలు, వడ్డీ) చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడించింది. అంతకుముందు ఏప్రిల్–జూన్‌లోనూ రూ. 440 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యం చెందడం గమనార్హం! తాజా త్రైమాసికంలో స్వల్ప, దీర్ఘకాలిక రుణాల చెల్లింపులను పూర్తిచేయలేకపోయినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. వీటిలో క్యాష్ క్రెడిట్ తదితర రుణాలు రూ. 189.14 కోట్లుకాగా.. వీటిలో అసలు విలువ రూ. 183.36 కోట్లుగా కంపెనీ తెలియజేసింది. ఇక చెల్లించవలసిన అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీల(ఎన్సీడీలు, ఎన్సీఆర్పీఎస్లు) విలువ రూ. 244.77 కోట్లలో అసలు రూ. 200 కోట్లుకాగా.. వడ్డీ రూ. 44.77 కోట్లుగా వివరించింది. డిఫాల్ట్ నేపథ్యంలో రుణదాతలు రుణ రికవరీ నోటీసుల జారీతోపాటు.. న్యాయ వివాద చర్యలకు దిగినట్లు తెలియజేసింది. రికవరీ నోటీసులు, న్యాయ వివాదాలు, రుణదాతలతో వన్‌టైమ్ సెటిల్మెంట్ పెండింగ్‌లోఉన్న కారణంగా 2021 ఏప్రిల్ నుంచి వడ్డీ మదింపు చేయలేదని వెల్లడించింది. -
4 నెలల్లో నాలుగో వంతు రాబడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నాలుగు నెలల్లో నాలుగో వంతు రాబడులు వచ్చాయి. ఈ ఏడాదికి మొత్తం రూ.2.58 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించగా జూలై నెల ముగిసే నాటికి రూ.67,494.73 కోట్ల మేర ఖజానాకు ఆదాయం సమకూరిందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మొత్తం బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇది 26 శాతం అన్నమాట. ఇందులో పన్నుల వాటా కింద రూ.42,712.27 కోట్లు వచ్చింది. ఆ తర్వాత అప్పుల పద్దు కింద కూడా ఎక్కువ సమకూరింది. ఈ ఏడాది బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా రూ.38,234 కోట్లు సేకరించాలన్నది అంచనా కాగా, అందులో దాదాపు 54 శాతం ఇప్పటికే సమకూరింది. 2023 జూలై నాటికి రూ.20,637.23 కోట్లు అప్పుల ద్వారా సేకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు పంపిన నివేదికలో వెల్లడించింది. మొత్తం రాబడుల్లో అప్పులే 30 శాతం ఉండడం గమనార్హం. ఇక పన్నుల ఆదాయంలో ఎక్కువగా జీఎస్టీ నుంచి రూ.15 వేల కోట్లకు పైగా వచ్చింది. మొత్తం అంచనాల్లో ఇది కూడా 30 శాతం దాటింది. ఎక్సైజ్ రాబడులు కూడా 30 శాతం దాటాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నుల్లో వాటా కలిపి రూ.6,300 కోట్లకు పైగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై నాటికి రాబడులు 3 శాతానికి పైగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. -
చరిత్రలో తొలిసారి నాయీ బ్రాహ్మణులకు టీటీడీ బోర్డులో చోటు
కడప కార్పొరేషన్: సీఎం వైఎస్ జగన్‌కి నాయీ బ్రాహ్మణులు ఆజన్మాంతం రుణపడి ఉంటారని ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు సిద్దవటం యానాదయ్య అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో స్థానిక హెడ్‌పోస్టాఫీసు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. యానాదయ్య మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా టీటీడీ పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం
దూకుడు మూలధన వ్యయం కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( Reliance Industries Ltd )కు చెందిన రిటైల్ విభాగం నికర రుణం అనేక రెట్లు పెరిగింది. ఏడాది క్రితం రూ.1,600 కోట్లు ఉన్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd ) నికర రుణం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.37,500 కోట్లకు పెరిగినట్లుగా కంపెనీ ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది. కంపెనీ మూలధన వ్యయంలో భారీ పెరుగుదలే నికర రుణం ఈ స్థాయిలో పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కంపెనీ క్యాపెక్స్ 70 శాతం పెరిగి రూ.51,400 కోట్లకు చేరింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం మూలధన వ్యయంలో మూడవ వంతు. రిలయన్స్ మూలధన వ్యయం గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 2023 ఆర్థిక సంవత్సరంలో 85 ఉందని జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఒక పరిశోధనా నోట్లో తెలిపింది. ఇక కంపెనీ రిటైల్ సెగ్మెంట్ మూలధన వ్యయం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లకుపైగా ఉంది. స్థాయితో సంబంధం లేకుండా పోర్ట్‌ఫోలియో స్ప్రెడ్‌లో రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోంది. ఇదీ చదవండి: Yousta: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే.. -
సంపద పెరిగింది..అప్పులు తగ్గాయి
సాక్షి, అమరావతి: కోవిడ్ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో కంటే వైఎస్సార్ సీపీ పాలనలో సంపద పెరగడంతోపాటు అప్పులు తగ్గాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గణాంకాలతో సహా మీడియాకు గురువారం వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రి, కాగ్ చెప్పినవి వాస్తవాలని తెలిపారు. కొందరు స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లు అంటూ చేస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదన్నారు. ఎల్లో మీడియా, విపక్షాల మాటలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులపై పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కలు, అసెంబ్లీలో సీఎం వెల్లడించిన గణాంకాలు మాత్రమే వాస్తవాలన్నారు. రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లేనని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడంతో ఇంత తక్కువ ఎలా చెబుతారంటూ ఎల్లో మీడియాతో పాటు విపక్ష నేతలు బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. కేరళను అప్పులకు అనుమతించకుండా ఏపీకి మాత్రం ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నారంటూ ఎల్లో మీడియా కథనాలు ప్రచురించడం విచిత్రంగా ఉందన్నారు. ♦ గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎల్లో మీడియా ఏనాడైనా కథనాలు ప్రచురించిందా? ఇప్పుడు రూ.వెయ్యి కోట్ల అప్పులపై ఐదుసార్లు వార్తలు రాసి రూ.ఐదు వేల కోట్ల అప్పుల తరహాలో చిత్రీకరిస్తోంది. బడ్జెట్ బయట చూసినా లోపల చూసినా అప్పులు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఆయన హయాంలో పరిమితికి మించి రూ.16,418 కోట్లు అప్పులు చేయడంతో ఇప్పుడు ఆ మేరకు కోత పడింది. అనుమతి ఉన్నా సరే మేం రూ.28,466 కోట్లు తక్కువ అప్పులు చేశాం. ♦ చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం కాగా ఇప్పుడు 12.4 శాతం మాత్రమే ఉంది. మేం అప్పులు చేసినా డీబీటీ రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరవేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు ఎటు వెళ్లినట్లు? టీడీపీ అధికారంలో ఉండగా సంపద పెరగలేదు కానీ అప్పులు మాత్రం పెరిగాయి. తాను సంపద పెంచే నిపుణుడినంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. కర్నాటక, తమిళనాడుతో పాటు వైఎస్సార్సీపీ పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టోలను ప్రకటించుకున్నారు. ♦ గత ఎన్నికల ముందు ఏప్రిల్‌లో పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు రూ.5,500 కోట్లు అప్పు చేయలేదా? వచ్చే ప్రభుత్వం పాలన చేయలేదు. సంక్షేమ పథకాలు అమలు చేయలేరు. ఇక అప్పులు పుట్టకుండా చేశామంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించలేదా? అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఏ సంక్షేమ పథకాన్నీ ఆపకుండా నిర్విఘ్నంగా అమలు చేస్తోంది. పరిమితికి లోబడే అప్పులు చేస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు పార్లమెంట్‌లోనూ ప్రశి్నంచారు. కేంద్రం వాస్తవాలను వెల్లడించడంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలకు దిక్కు తోచట్లేదు. ♦ దేశంలో రాష్ట్రానికో నిబంధన ఉండదు. పరిమితికి లోబడి కేంద్రం అప్పులను అనుమతిస్తోంది. ♦ రాష్ట్ర అప్పులపై మాట్లాడుతున్న వారు, కథనాలను ప్రచురిస్తున్న వారు అసలు మన రాష్ట్రంలోనే ఉండరు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ అప్పుల గురించి దు్రష్పచారం చేస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు అప్పులు చేస్తే ఇప్పుడు రూ.10 వేల కోట్లు మాత్రమే అప్పు చేశాం. విద్యుత్ సంస్థలకు భారీగా పెట్టిన బకాయిలను సైతం తీరుస్తున్నాం. రెవెన్యూ రాబడులు, వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధిని గమనిస్తే సంపద ఎవరి హయాంలో ఎంత పెరిగిందో స్పష్టమవుతుంది. ♦ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ వయసులో తాను కొదమ సింహం అంటూ జంతువులతో పోల్చుకోవడం ఎందుకు? సింహం అంటే సింగిల్‌గా వస్తుంది. మరి ఆయన ఎప్పుడైనా సింగిల్‌గా పోటీ చేశారా? చంద్రబాబు పొత్తులు పెట్టుకోని పార్టీ లేదు. ఒకే పారీ్టతో రెండేసి సార్లు పొత్తులు పెట్టుకున్న ఘనత ఆయనదే. ♦ కొత్తగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించినవారు ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు అంటే ఏమిటో అధ్యయనం చేశాక మాట్లాడాలి. నాబార్డు నుంచి రూ.7,992 కోట్లు అప్పులు చేయలేదు. తీసుకున్నది రూ.3,281 కోట్లు మాత్రమే. కంటిన్జెన్సీ ఫండ్ గవర్నర్ వద్ద అత్యవసరాల కోసం ఉంటుంది. కొత్తగా వచి్చన వారు దాన్ని కూడా అప్పు కింద లెక్కించారు. పబ్లిక్ అకౌంట్ పద్దు నుంచి గత ప్రభుత్వం రూ.36,241 కోట్లు వాడుకోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3,475 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, వైఎస్సార్ హయాంతోపాటు విభజన అనంతరం మరోసారి టీడీపీ పాలనలో, వైఎస్సార్సీపీ వచ్చాక బడ్జెట్ బయట, లోపల చేసిన అప్పులు, రెవెన్యూ రాబడులు, వడ్డీల శాతం గణాంకాలను బుగ్గన వెల్లడించారు. ఆ వివరాలివీ... ♦ 2014–15 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,22,605 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 23.35 శాతం) ♦ 2018–19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 30.27 శాతం) ♦ 2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,42,442 కోట్లు (రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.5 శాతం) ♦ చంద్రబాబు పాలనలో అప్పులు ఏడు శాతానికిపైగా పెరగగా ఇప్పుడు నాలుగేళ్లల్లో మూడు శాతం మాత్రమే పెరిగాయి. ♦ 2014 – 2019 అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 శాతం ♦ 2019 నుంచి 2022–23 వరకు అప్పుల వార్షిక వృద్ధి రేటు 12.4 శాతం ♦ చంద్రబాబు హయాం కంటే ఇప్పుడు అప్పుల వృద్ధి రెండు శాతం తక్కువగానే ఉంది ♦ 1999 – 2004 రెవెన్యూ రాబడులు వృద్ధి 12.4 శాతం (ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాం) ♦ 2004 – 2009 రెవెన్యూ రాబడులు వృద్ధి 21.6 శాతం (వైఎస్సార్ హయాం) ♦ 2014 – 2019 రెవెన్యూ రాబడులు వృద్ధి 6 శాతం ♦ 2019 – 2023 రెవెన్యూ రాబడులు వృద్ధి 16.7 శాతం ♦ వైఎస్సార్ హయాంతో పోలిస్తే చంద్రబాబు జమానాలో రెవెన్యూ రాబడులు 15.6 శాతం క్షీణించగా ఇప్పుడు 10.7 శాతం పెరిగాయి ♦ 2014 – 2019 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,95,000 కోట్లు ♦ 2019 – 2023 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11,00,000 కోట్లు ♦ రాష్ట్ర విభజన నాటికి గ్యారెంటీలు, గ్యారెంటీలు ఇవ్వని అప్పులు రూ.35,000 కోట్లు ♦ 2019 మే నాటికి ఆ అప్పులను చంద్రబాబు రూ.1,40,500 కోట్లకు పెంచారు. అంటే 21.8 శాతం పెంచారు. ♦ వైఎస్సార్సీపీ వచ్చాక రూ.2,09,000 కోట్లకు పెరిగాయి. అంటే 12.6 శాతమే పెరిగాయి. -
నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!
Bollywood Art Director Nitin Desai: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) అకాల మరణం అటు పలువురి ప్రముఖులను ఇటు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుమానాస్పద మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ. బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆయన మరణానికి సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు విని పిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, కర్జాత్‌లోని ఎన్డీ స్టూడియోలోని అతని గదిలో నితిన్ దేశాయ్ మృతదేహం లభ్యమైంది. క్లీనింగ్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ఈ విషయాన్ని గమనించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కర్జాత్, ఖలాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం నితిన్ దేశాయ్ కొన్ని ఆర్థిక సంస్థల నుండి ఫిక్స్డ్ టర్మ్ లోన్ తీసుకున్నాడు.అదే అతని జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసి, చివరికి మరణానికి దారి తీసింది. రూ. 180 కోట్ల రుణం వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీనికి సంబంధించి సదరుసంస్థ ఎన్డీ స్టూడియోసీజ్కు సిద్ధమౌతోంది. కలీనాకు చెందిన ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రాయగడ కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసింది. కానీ జప్తు చర్యలకు కలెక్టర్ కార్యాలయం తుది అనుమతి ఇవ్వలేదు. ఎన్డి స్టూడియో సీజ్‌కు సంబంధించిన దరఖాస్తు తన కార్యాలయానికి అందిందని రాయగడ రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ సందేశ్ షిర్కే ధృవీకరించారు. కానీ జూలై 25న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించింది. మార్చి 31, 2021న ఖాతాని నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా వర్గీకరించారని, జూన్ 30, 2022 నాటికి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.252.48 కోట్లుగా తేలింది. (ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?) నితిన్ దేశాయ్ వల్ల సీఎఫ్ఎం అనే ఆర్థిక సంస్థ నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్నారు. 2 సంవత్సరాల 2016, 2018లో ఒప్పందం ప్రకారం దీని కోసం దేశాయ్ 40 ఎకరాల భూమి,ఇంకా 3 వేర్వేరు ఆస్తులను తనఖా పెట్టాడు. అనుకోని కారణాల వల్ల 2020నుంచి రుణం తిరిగి చెల్లించలేకపోయాడు. కొంత సమయం తర్వాత CFM తన రుణ ఖాతాలన్నింటినీ ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించింది. అయితే అప్పుడు కూడా రుణం రికవరీ కాలేదు. దీంతో దీంతో దేశాయ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయమై కొద్దిరోజుల క్రితం ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ బల్దితో కూడా చర్చించినట్టు సమాచారం. VIDEO | "He was a good friend of mine. I met him 10-15 days ago, but didn't feel that he was in any kind of tension," says Shiv Sena (UBT) leader Baban Dada Patil on film art director Nitin Desai's suicide. pic.twitter.com/uBBG8Q0cSX — Press Trust of India (@PTI_News) August 2, 2023 #WATCH | Maharashtra: Forensic team arrived at ND Studios in Karjat, Raigad district, where the body of art director Nitin Desai was found hanging. pic.twitter.com/lEgENNCRjy — ANI (@ANI) August 2, 2023 ఎమ్మెల్యే మహేష్ బల్ది ఏమన్నారు? ఆర్థిక ఇబ్బందుల వల్లే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కర్జాత్ ఎమ్మెల్యే మహేశ్ బల్ది తెలిపారు. ఆయన మాట్లాడుతూ- నితిన్ దేశాయ్ తన నియోజకవర్గానికి నిత్యం వచ్చేవారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉదయం ఎన్డీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా? ) నితిన్ కుడిభుజం కాకా ఎన్డీ స్టూడియోస్‌ను నడిపిన నితిన్ కుడిచేతిగా భావించే కాకా కూడా ఆర్థిక ఇబ్బందులగురించి మాట్లాడారు. కానీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ప్రేరణగా నిలిచేవ్యక్తి ఆయన. కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.ఇంతలోనే ఇలా జరగడం విషాదకరమన్నారు. నితిన్ దేశాయ్ మరణంతో అక్షయ్ కుమార్, మేకర్స్ అప్‌కమింగ్ మూవీ OMG 2 ఆన్లైన్ ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేశారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) Unbelievably sad to know about the demise of Nitin Desai. He was a stalwart in production design and such a big part of our cinema fraternity. He worked on so many of my films… this is a huge loss. Out of respect, we are not releasing the OMG 2 trailer today. Will launch it… — Akshay Kumar (@akshaykumar) August 2, 2023 నాలుగు జాతీయ అవార్డులు, అద్భుతమైన సినిమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్ , దేవదాస్ మూవీలకు నాలుగు సార్లు జాతీయ అవార్డులను సాధించిన నితిన్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంపై పలువురు నటులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్లను కూడా రూపొందించిన ఘనత ఆయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ అతను పనిచేసిన కొన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమాలు . Shocking news this morning - Art Director Nitin Desai is no more. Such a warm human being, associated with many of my projects and ballets, his passing is a terrible loss to the film industry. May he find peace wherever he is🙏 pic.twitter.com/STNsz6Kwr8 — Hema Malini (@dreamgirlhema) August 2, 2023 -
అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం.. పంచాయితీ తీర్పు, రాత్రంతా చీకట్లోనే
ఇచ్చోడ: అప్పు చెల్లించేవరకు ఇంటికి తాళం వేసి ఉంచాలన్న పంచాయితీ పెద్దల తీర్పు కారణంగా బాధిత కుటుంబం రాత్రంతా చీకట్లోనే ఇంటి ముందు జాగరణ చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన రాజేందర్ అనే ఆసామి వద్ద అదే గ్రామానికి చెందిన తాత్ర శీను పాలేరుగా పనిచేసేందుకు మూడునెలల క్రితం ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.7 వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని రూ.34 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. గత జూలై 30వ తేదీ వరకు (దాదాపు మూడు నెలలపాటు) పనిచేశాడు. అయితే ఎడ్లజత సరిగా లేక, వాటితో వేగలేక తాను పనిచేయలేకపోతున్నానని యజమానికి పలుమార్లు చెప్పాడు. కానీ, రాజేందర్ స్పందించకపోవడంతో శీను సోమవారం పనికి వెళ్లలేదు. రాజేందర్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త కన్నమయ్యతోపాటు గ్రామానికి చెందిన కుమ్మరి సాయన్న, కాళ్ల భూమయ్య పంచాయితీ పెట్టారు. శీను పనికి రాకుంటే తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వా లని తీర్పు చెప్పారు. కొంత సమయం ఇవ్వాలని బాధితుడు ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. డబ్బులు చెల్లించేవరకు ఇంటికి తాళం వేస్తామని చెప్పా రు. పంచాయితీ పెద్దల తీర్పు మేరకు ఇంటికి తాళం వేయడంతో శీను భార్య గంగమణి, తల్లి పోసాని, కుమారులు మల్లేశ్, నవీన్‌తోపాటు కోడలు లక్ష్మి ఇంటి ఆవరణలోనే సోమవారం రాత్రంతా జాగరణ చేశారు. బాధితుడు శీను మంగళవారం ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
గుదిబండ.. ‘అప్పు’డే!.. పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు మరోసారి వెలుగులోకి
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అప్పులపై టీడీపీతో పాటు దాని అనుబంధ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో మరోసారి తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. 2019 నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్లు అప్పులుండగా 2023 మార్చి నాటికి రూ.4,42, 442 కోట్లకు చేరినట్లు తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అసెస్ చేస్తోందా? 2019 మే నుంచి ఏపీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది? ఆర్థిక పరిస్థితిని అంచనా వేశారా?..’’ అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనల మేరకు వ్యవహ రిస్తోందని తేల్చి చెప్పారు. ద్రవ్యలోటు తగ్గింపు, వివేకంతో కూడిన రుణ నిర్వహణ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల్లో సుస్థిరత, పారదర్శకతను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్బీఎంను అసెంబ్లీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను, ఆర్ధిక పరిమితులను అమలు చేస్తున్నారా.. లేదా? అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన వ్యయ విభాగం పరిశీలన చేస్తూ ఉంటుందని వివరించారు. కాకి లెక్కలతో పరిపాటిగా.. టీడీపీ దుష్ప్రచారానికి నిత్యం వంత పాడుతున్న ఎల్లో మీడియా అప్పులపై తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో మరోసారి తేటతెల్లమైంది. ఒకసారి రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరోసారి రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ కాకి లెక్కలతో కథలు అల్లటం ఎల్లో మీడియాకు రివాజుగా మారింది. ఈ విష ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నా రహస్యంగా అప్పులను దాచారనే విధంగా ఎల్లో మీడియా అవాస్తవాలను వండి వారుస్తోంది. పరిమితులకు లోబడే అప్పులు తీసుకుంటున్నామని, టీడీపీ హయాంతో పోలిస్తే పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు స్పష్టం చేసింది. తీసుకున్న అప్పులను సామాజిక హితం కోణంలోనే ఖర్చు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు, నగదు బదిలీతో పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. కోవిడ్ సమయంలోనూ డీబీటీతో పేదలను ఆదుకోవడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా చర్యలు తీసుకుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇవన్నీ ముమ్మాటికీ నిజమని రుజువైంది. ఈ గణాంకాలను ఆర్బీఐ నివేదిక ప్రకారం వెల్లడిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా పాఠకులకు తప్పుడు సమాచారాన్ని చేరవేయకుండా విశ్వసనీయతతో జర్నలిజం విలువలను పాటించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
అప్పులు కావవి విష ప్రచారం..ఇదీ నిజం!
సాక్షి, అమరావతి: అప్పులు అప్పులు అంటూ ఆంధ్రప్రదేశ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన వారికి కేంద్రం ప్రటించిన నివేదిక చెంపపెట్టుగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తమిళనాడు అత్యధిక రుణ బకాయిలున్న రాష్ట్రంగా నిలిచింది. 2022-23 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర (స్టేట్ డెవలప్మెంట్ లోన్- ఎస్డీఎల్) బకాయిలు రూ.7.54 లక్షల కోట్లుగా ఉండగా, దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అప్పు రూ.7.10 లక్షల కోట్లకు చేరుకుందని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా తెలిపారు. గడిచిన మూడు ఆర్ధిక సంవత్సరాల్లో (2020 -2023) అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలోనూ తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ కర్ణాటక, ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సంఖ్య రాష్ట్రం తీసుకున్న అప్పు 1 తమిళనాడు రూ.7.54 లక్షల కోట్లు 2 ఉత్తర ప్రదేశ్ రూ.7.10 లక్షల కోట్లు 3 మహారాష్ట్ర రూ.6.80 లక్షల కోట్లు 4 పశ్చిమ బెంగాల్ రూ.6.08 లక్షల కోట్లు 5 రాజస్థాన్ రూ.5.37 లక్షల కోట్లు 6 కర్ణాటక రూ.5.35 లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా మారాలని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లేనని ఆయన వివరించారు. ఈ వాస్తవాలను విస్మరించి 10 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం చేయడం దుర్మార్గం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. లోక్‌సభలో ఖమ్మం బీఆర్ఎస్ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు సీతారామన్. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అప్పు ఉంటే 2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లుగా ఉంది. రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా పరివర్తన తెచ్చుకోవాలి. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లే. 10 లక్షల కోట్ల అప్పు… pic.twitter.com/t8pveEL21r — Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2023 -
రూ.90 వేల కోసం సొంత మామనే హతమార్చి.. ఆ తర్వాత..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రూ.90 వేల అప్పు తీర్చమని అడిగినందుకు సొంత మేనమామనే కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. స్థానికంగా జిల్లాలో వివేక్ శర్మ(45) వ్యాపారిగా స్థిరపడ్డాడు. ఈ క్రమంలో తన మేనల్లుడు మోహిత్‌కు అప్పుగా రూ.90 వేలను ఇచ్చాడు. డబ్బు చెల్లించమని అడిగినా ప్రయోజనం లేకపోవడంతో వివేక్ శర్మ నేరుగా మోహిత్ ఇంటికే వెళ్లాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని మోహిత్.. వివేక్‌ను హత్య చేయాలని పథకం పన్నాడు. టీలో మత్తు మందు ఇచ్చి, అపస్మారక స్థితికి వెళ్లాక.. వివేక్ శర్మ దేహాన్ని ముక్కలుగా కోశాడు. ఆనంతరం సంచుల్లో వేసి సమీపంలో ఉన్న ఓ ఆనకట్ట వద్ద పూడ్చి పెట్టాడు. వివేక్ శర్మ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తాను హత్య చేయలేదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. శరీరభాగాలు పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృత దేహాన్ని వెలికితీశారు. శరీర భాగాలలోని చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా అది వివేక్దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం మృతుని శరీర భాగాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఇదీ చదవండి: టోల్ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి.. -
లిస్టెడ్ రియల్టీల రుణాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టయిన టాప్08 రియల్టీ కంపెనీల రుణ భారం గత మూడేళ్లుగా తగ్గుతూ వస్తోంది. దీంతో మార్చితో ముగిసిన గతేడాది(2022-23)కల్లా ఉమ్మడిగా నికర రుణ భారం రూ. 23,000 కోట్లకు పరిమితమైంది. వెరసి 2019–20లో నమోదైన రూ. 40,000 కోట్లతో పోలిస్తే 43 శాతం క్షీణించింది. ఇందుకు ప్రధానంగా గృహ విక్రయాలు జోరందుకోవడంతో మెరుగుపడిన నగదు రాక(క్యాష్ ఫ్లో) ప్రభావం చూపినట్లు అనరాక్ పేర్కొంది. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా హౌసింగ్‌కు భారీస్థాయిలో డిమాండు కొనసాగుతోంది. ఇది దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన రియల్టీ రంగ దిగ్గజాలు రుణ భారాన్ని తగ్గించుకునేందుకు సహకరిస్తోంది. (ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!) రెసిడెన్షియల్పై దృష్టి గృహ నిర్మాణం, అభివృద్ధి రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్-8 కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న అనరాక్ ఆర్థిక పనితీరును విశ్లేíÙంచింది. ఈ జాబితాలో డీఎఫ్‌ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్(లోధా), గోద్రెజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, శోభా లిమిటెడ్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, పుర్వంకారా, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ ఉన్నట్లు పేర్కొంది. లిస్టెడ్ రియల్టీ డెవలపర్స్ నికర రుణ భారం 2019–20లో రూ. 40,500 కోట్లుగా నమోదుకాగా.. 2022–23కల్లా రూ. 23,000 కోట్లకు క్షీణించింది. సగటు రుణ వ్యయాలు 10.3 శాతం(2020) నుంచి 9 శాతానికి(2023) తగ్గాయి. 2020–21లో వడ్డీ వ్యయాలు 9.05 శాతంగా నమోదుకాగా.. రుణ వ్యయాలు 2021–22లో 7.96 శాతానికి చేరాయి. అమ్మకాలు, ఆదాయం పుంజుకోవడంతో రియల్టీ దిగ్గజాల నికర రుణభారానికి చెక్ పడినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పురీ పేర్కొన్నారు. కరోనా ముందుకంటే.. జాబితాలోని లిస్టెడ్ రియల్టీ కంపెనీల అమ్మకాల పరిమాణం కరోనా మహమ్మారి ముందుస్థాయిని సైతం అధిగమించినట్లు అనుజ్ వెల్లడించారు. ఇవి కొత్త రికార్డు బాటలో సాగుతున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో నగదు రాక బలపడటంతో రుణ భారాన్ని భారీగా తగ్గించుకుంటున్నట్లు తెలియజేశారు. 2022 ఏప్రిల్ మొదలు వడ్డీ రేట్ల పెంపు రుణ వ్యయాలను నామమాత్రంగా పెంచినట్లు వివరించారు. భారీ కంపెనీలపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని తెలియజేశారు. ఫలితంగా 2016–17లో 17 శాతంగా ఉన్న అతిపెద్ద లిస్టెడ్, అన్‌లిస్టెడ్ డెవలపర్స్ మార్కెట్ వాటా 2022–23 కల్లా రెట్టింపై 36 శాతాన్ని తాకినట్లు వెల్లడించారు. -
కాఫీడే కష్టాలు: రూ. 440 కోట్ల రుణాల డీఫాల్ట్
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) రూ. 440 కోట్ల మొత్తాన్ని డీఫాల్ట్ అయ్యింది. రూ. 220 కోట్ల రుణానికి సంబంధించి రూ. 190 కోట్ల అసలు, సుమారు రూ. 6 కోట్ల వడ్డీని చెల్లించలేకపోయినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు అలాగే, ఎన్సీడీలు మొదలైన బాకీల విషయంలో దాదాపు రూ. 245 కోట్లు డీఫాల్ట్ అయినట్లు వివరించింది. 2019లో వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ మరణానంతరం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయిన సీడీఈఎల్ ఆ తర్వాత నుంచి అసెట్ల విక్రయం తదితర మార్గాల్లో రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇదీ చదవండి: Jio Bharat Phone: జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: నిత్యం విషపు రాతలు రాసే రామోజీకి వాస్తవం ఏదైనా విరోధే. అధికారంలో మనవాడు ఉంటే అప్పు చేసినా అది లోకకల్యాణం కోసమే.. వేరొకరు అధికారంలో ఉండి అప్పు చేస్తే పెను భూతం.. ఇదే రామోజీ పత్రికా ఫిలాసఫీ. అందుకే గురువారం ‘నిండా మునిగిన పౌరసరఫరాల సంస్థ’ శీర్షికతో ఈనాడు పత్రిక పౌర సరఫరాల పైనే పనికిమాలిన ఏడుపు కథనం అచ్చేసింది. అసత్యాల కథనాలు అల్లింది. రాష్ట్ర విభజన తర్వాతి లెక్కతో మొదలెట్టి.. మధ్యలోని టీడీపీ కాలం నాటి లెక్కల ఎక్కాలను ఎగ్గొట్టి.. ప్రస్తుతం అప్పుల భారం పెరిగిందంటూ.. ప్రతి పేద ఇంటికీ నాణ్యమైన రేషన్ అందిస్తున్న సంక్షేమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ‘అప్పుల’ పేరుతో ఈనాడు రాసిన ‘తప్పుడు రాతల’ పురాణంలో వాస్తవాలేమిటో చూద్దాం.. ఆరోపణ: పౌర సరఫరాల సంస్థ రుణ భారం పెరిగిపోతోంది వాస్తవం: 2014–15లో పౌర సరఫరాల సంస్థ అప్పు రూ.6,042 కోట్లు. ప్రస్తుతం అది రూ.31,600. ఇందులో రూ.20 వేల కోట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ గ్యారెంటీలతో చేసిన అప్పు. అందులో బ్యాంకులకు తిరిగి చెల్లించింది. రూ.300 కోట్లు మాత్రమే. ప్రస్తుతం.. ప్రభుత్వ గ్యారంటీలతో పౌర సరఫరాల సంస్థ నాలుగేళ్లలో రూ.23,950 కోట్లు అప్పు తీసుకుంటే అందులో రూ.11,800 కోట్లు తిరిగి బ్యాంకులకు చెల్లించింది. వీటిల్లో టీడీపీ హయాంలో తీసుకున్న రుణాలకు రూ.2వేల కోట్లు ఈ ప్రభుత్వమే చెల్లించడం విశేషం. ఈనాడు రాతల్లో చేసిన అప్పు కనిపిస్తోంది తప్ప.. తిరిగి తీర్చింది చెప్పట్లేదు. వాస్తవానికి పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొంటుంది. దానిని మరాడించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ ఇస్తుంది. ఇదంతా జరిగి సబ్సిడీ మొత్తం రాష్ట్రానికి వచ్చేసరికి ఆలస్యం అవుతోంది. ఈ సమయంలో రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండేందుకు బ్యాంకు రుణాలు తీసుకుంటోంది. కేంద్రం నుంచి రావాలి్సన మొత్తం వచ్చిన వెంటనే బ్యాంకులకు తిరిగి చెల్లిస్తోంది. ఆరోపణ: ప్రభుత్వ గ్యారెంటీలు రూ.42 వేల కోట్లకు చేరాయి వాస్తవం: పౌర సరఫరాల సంస్థ ప్రస్తుత రుణం రూ.31,600 కోట్లు. వాస్తవానికి రుణాల సేకరణకు ప్రభుత్వ గ్యారెంటీలు రూ.37 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇక్కడ అనుమతించిన దానికంటే తీసుకున్న రుణం తక్కువగా ఉంది. ఈనాడు మాత్రం రూ.37 వేల కోట్ల రుణ అనుమతులు ఉండగా.. ప్రభుత్వం కొత్తగా మరో రూ.5 వేల కోట్లకు అనుమతులు ఇవ్వడంతో రూ.42 వేల కోట్లకు చేరాయని రాసుకొచ్చింది. ఇక్కడ కార్పొరేషన్ రుణం కోసం ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ఏడాదిలో వినియోగించుకోకుంటే గడువు ముగిసిపోతుంది. ఆ తర్వాత పౌర సరఫరాల సంస్థ తనకు రుణం కావాల్సి వస్తే.. ప్రభుత్వం పాత గ్యారెంటీల్లో నుంచే ఆ మొత్తాన్ని తీసుకుంటుంది. తాజాగా పౌరసరఫరాల సంస్థలో ప్రభుత్వం అలానే రూ.5 వేల కోట్ల రుణ అనుమతులను తీసుకుంది. దీనిని వక్రీకరిస్తూ ఈనాడు రూ.42 వేల కోట్లంటూ తప్పుడు లెక్కలు చెప్పింది. ఆరోపణ: ప్రభుత్వం రాయితీ సొమ్ము విడుదల చేయట్లేదు. రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు ఉంటే రూ.900 కోట్లతో సర్దుకోమన్నారు వాస్తవం: ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు నాలుగేళ్లలో పంచదార, కందిపప్పు, బియ్యానికి రూ.8,766.83 కోట్ల సబ్సిడీ చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఒకేసారి రూ.7 వేల కోట్ల వరకు ఇచ్చింది. ఈనాడు మాత్రం 2019–20, 2020–21, 2021–22 లెక్కలను మాత్రమే చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు రాబట్టలేని రూ.1,756.57 కోట్లు మొత్తాన్ని తెలంగాణ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం కూడా రూ.31,197 కోట్ల సబ్సిడీని ఏపీకి చెల్లించింది. ఆరోపణ: ధాన్యం బకాయిల కోసం అప్పలు చేస్తోంది. అయినా సమయానికి రైతులకు డబ్బులు చెల్లించట్లేదు వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఆర్బీకేల ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం సేకరిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ప్రతి పైసా రైతుకు మద్దతు ధర కల్పించేందుకే ఖర్చు చేస్తోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.10,001.43 కోట్లు పౌర సరఫరాల సంస్థ సొమ్మును వివిధ కార్యక్రమాలకు దారి మళ్లించింది. అందులో 2019 ఎన్నికలకు ముందు రూ.4 వేల కోట్లు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించింది. పౌర సరఫరాల సంస్థ లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వానికి అవసరం లేకుండాపోయింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4,800 కోట్లు బకాయిలు పెట్టిపోయింది. వీటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని తిరిగి పౌర సరఫరాల సంస్థకు చెల్లించింది. తద్వారా సంస్థ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసింది. ఇవన్నీ ఈనాడుకు కనిపించవా? రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నాలుగేళ్లలో రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించేందుకు రూ.58,728.77 కోట్లు ఖర్చు చేసింది. 32, 75,790 మంది రైతుల నుంచి 3.10 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇదే టీడీపీ హయాంలో చూస్తే కేవలం 18 లక్షల మంది రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాస్తవంగా టీడీపీ ఐదేళ్ల పాలనలో కంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఎక్కువ మంది ధాన్యం రైతులకు మద్దతు అందించడం విశేషం. మద్దతు ధరతో పాటే ప్రతి ఖరీఫ్ సీజన్లో రూ.400 కోట్లు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చుల కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వీటితో పాటు కరోనా సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రాష్ట్రంలోని రైస్ కార్డుదారులకు ఏప్రి ల్ 2019 నుంచి సెప్టెంబర్ 2022 వర కు ఉచిత బియ్యం పంపిణీ కోసం ఏకంగా రూ.6,329.20 కోట్లు అదనంగా ఖర్చు చేసి పేదలను ఆదుకుంది. చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? వీటితో పాటు ప్రతి నెలా నాణ్యమైన బియ్యం ఇంటింటికీ పంపిణీ కోసం రూ.1,146 కోట్లు, బహిరంగ మార్కెట్లో కందిపప్పు, పంచదార ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలోనూ వాటిని సబ్సిడీపై అందించినందుకు రూ.2,727.82 కోట్లు, వంట నూనె పంపిణీకి రూ.126 కోట్లు అదనంగా ఖర్చు చేసింది. సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలకు బియ్యాన్ని నేరుగా సరఫరా చేస్తోంది. వీటన్నింటికీ కలిపి సుమారు రూ.10,329.02 కోట్లు అదనపు భారాన్ని మోస్తోంది. ఇంత పెద్ద ఎత్తున రైతులకు, పేదల సంక్షేమానికి పని చేస్తున్న ఏపీ ప్రభుత్వంలోని పౌర సరఫరాల సంస్థ రుణ భారం రూ.31,600 కోట్లు ఉంటే... ఇలాంటి సంస్కరణలు లేని.. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో మాత్రం ఆ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అప్పు ఏకంగా రూ.49 వేల కోట్లు ఉండటం గమనార్హం. తెలంగాణలోనూ ఈనాడు పత్రికను నడిపిస్తున్న రామోజీ.. అక్కడ నోరెత్తకుండా.. ఏపీలో మాత్రం గుండెలు బాదుకోవడం ఎల్లో ఏడుపునకు నిదర్శనం. -
ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్..రూ. 51,424 కోట్లు మొండి బాకీలు వసూలు!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 180 దివాలా పరిష్కార ప్రణాళికలకు ఆమోదముద్ర వేసింది. ఇంత అత్యధిక సంఖ్యలో ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించడం ఇప్పటివరకూ ప్రథమం. దీనితో మొత్తం రూ. 51,424 కోట్ల మొండి బాకీలు వసూలయ్యాయి. చివరిసారిగా 2019 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 1.11 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. అప్పట్లో 77 ప్రణాళికలకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. వీటిలో ఎస్సార్ స్టీల్, మోనెట్ ఇస్పాత్ వంటి భారీ ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో ఎన్సీఎల్టీ 1,255 దివాలా ప్రక్రియ దరఖాస్తులను విచారణకు స్వీకరించింది. రూ. 1,42,543 కోట్లకు క్లెయిమ్‌లు రాగా అందులో 36 శాతం సొమ్మును రుణదాతలకు పొందగలిగారు. దివాలా బోర్డు ఐబీబీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ►2023 ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకూ ఎన్సీఎల్టీ 678 ప్రణాళికలను క్లియర్ చేసింది. రుణదాతలు రూ. 2.86 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారు. ►ఎన్సీఎల్టీకి దేసవ్యాప్తంగా 31 బెంచ్‌లు ఉండగా, వాటిలో 28 పనిచేస్తున్నాయి. ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తులు, సహాయక సిబ్బంది కొరత ఉంది. ప్రెసిడెంట్ సహా 63 మంది జ్యుడిషియల్, టెక్నికల్ సిబ్బందిని మంజూరు చేయగా ప్రస్తుతం 37 మందే ఉన్నారు. గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం 15 మంది సిబ్బందిని నియమించింది. ఎన్సీఎల్టీ బెంచ్ పనిచేయాలంటే కనీసం ఒక జ్యుడిషియల్, ఒక టెక్నికల్ సభ్యులు ఉండాలి. ►ఎన్సీఎల్టీ బెంచ్‌లు ఇప్పటివరకు 6,567 కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రణాళికలను (సీఐఆర్‌పీ) పరిశీలించగా వాటిలో 4,515 సీఐఆర్పీలపై విచారణ ముగిసింది. ► తయారీ, రియల్ ఎస్టేట్ రంగాల సంస్థలు అత్యధికంగా సీఐఆర్పీపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. మొత్తం కేసుల్లో తయారీ రంగ వాటా 39 శాతం, రియల్ ఎస్టేట్ 21 శాతం, నిర్మాణ రంగం 11 శాతం, హోల్‌సేల్..రిటైల్ ట్రేడ్ వాటా 10 శాతంగా ఉంది. ►నిర్దేశిత గరిష్ట గడువు 330 రోజుల్లోగా తగిన కొనుగోలుదారు ఎవరూ ముందుకు రాకపోవడంతో 76 శాతం పైగా కేసులు లిక్విడేషన్‌కు దారి తీశాయి. -
జేపీ అసోసియేట్స్ రూ. 4 వేల కోట్లు డిఫాల్ట్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్ సంస్థ జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్) తాజాగా రూ. 3,956 కోట్ల రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయ్యింది. ఇందులో అసలు రూ. 1,642 కోట్లు ఉండగా, వడ్డీ రూ. 2,314 కోట్లు ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వివిధ రూపాల్లో తీసుకున్న ఈ మొత్తాన్ని ఏప్రిల్ 30న చెల్లించాల్సి ఉన్నప్పటికీ విఫలమైనట్లు ఎక్సే్చంజీలకు తెలిపింది. తాము 2037 నాటికి రూ.29,277 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రూ. 3,956 కోట్లు మాత్రమే ఈ ఏడాది ఏప్రిల్ 30 కల్లా కట్టాల్సి ఉందని జేఏఎల్ వివరించింది. -
రుణ చెల్లింపుపై అదానీ గ్రూప్ దృష్టి
న్యూఢిల్లీ: ఇటీవల రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన అదానీ గ్రూప్ తాజాగా 13 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,066 కోట్లు) రుణాలను ముందస్తుగా చెల్లించే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని బిలియనీర్.. గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తోంది. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో కంపెనీ కొద్ది రోజులుగా రుణాలను ముందుగానే చెల్లిస్తోంది. దీనిలో భాగంగా గత నెలలో 2024 జూలైలో గడువు తీరనున్న 13 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను బైబ్యాక్ చేసేందుకు అదానీ పోర్ట్స్ టెండర్‌కు తెరతీసింది. ఈ బాటలో మరో 4 రుణాలను తిరిగి చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. టెండర్‌కు 41.27 కోట్ల డాలర్ల విలువైన బాండ్లు దాఖలైనట్లు అదానీ పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. -
అప్పుడు అమ్మక.. ఇప్పుడు అమ్ముకోలేక
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు తుమ్మిడే వెంకన్న. కుము రం భీం జిల్లా దహేగంకు చెందిన ఈయన పత్తి సాగు చేశాడు. ధర పెరుగుతుందనే ఆశతో ఇంట్లో 50 క్వింటాళ్ళ వరకు నిల్వ చేశాడు. ఆరు నెలల పాటు ఎదురుచూసినా పెరగకపోవడంతో క్వింటాల్ రూ.7,500 చొప్పున 20 క్వింటాళ్లు అమ్మేశాడు. మరో 30 క్వింటాళ్ళు ఇంట్లోనే నిల్వ ఉంది. అయితే ఎక్కువ రోజులు కావడంతో పురుగులు వస్తున్నాయని, పత్తి పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ ధరకు అమ్మలేక, ఇంట్లో నిల్వ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది పత్తికి పలికిన ధర రైతుల్ని ఊరించింది. దీంతో ఈ ఏడాది పండించిన పంటను చాలామంది రైతులు అమ్మకుండా రాబోయే రోజుల్లో మంచి ధర పలుకుతుందనే ఆశతో వివిధ రకాలుగా నిల్వ చేశారు. కొందరు దళారుల మాట నమ్మి అమ్మలేదు. మరికొందరు సొంతంగానే వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. కొందరు క్వింటాళ్ల కొద్దీ పత్తి ని ఇళ్లలోనే దాచుకున్నారు. ఎలుకలు, పురుగులు, దుర్వాసన సమస్యను ఎదుర్కొంటూ నెలల తరబడి ఎదురుచూశారు. కానీ ధర పెరగలేదు సరికదా.. సీజన్ మొదట్లో ఉన్న ధర కూడా క్రమంగా తగ్గిపోయింది. దీంతో పత్తిని నిల్వ చేసిన రైతులు పంటను మరింత కాలం నిల్వ చేయలేక, అలాగని అమ్ముకోలేక లబోదిబోమంటున్నారు. చెడిపోయిన 20 శాతం పత్తి రాష్ట్రంలో గత ఏడాది 46 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తే.. ఈ ఏడాది 50 లక్షల ఎకరాల్లో పండించారు. మొత్తం 28.41 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో ప్రైవేటు సంస్థలు 9.86 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, కొంతమంది పత్తి రైతులు మహారాష్ట్రలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అమ్ముకున్నారు. దాదాపు సగం పత్తిని రైతులు భవిష్యత్తులో మంచి ధర వస్తుందనే ఆశతో దాచిపెట్టారు. అయితే వారి ఆశ అడియాసే అయ్యింది. ప్రస్తుతం అమ్మకుండా నిల్వ ఉన్న 14 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల పత్తిలో 20 శాతం మేర నల్లబడి, చెడిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలుపు నుంచి నలుపులోకి.. పత్తిని నిల్వ చేసేందుకు కొందరు గోడౌన్లు అద్దెకు తీసుకుంటే మరికొందరు సొంత ఇళ్లల్లో దాచారు. కొందరు ఆరు బయటే కల్లాల్లో టార్పాలిన్ కవర్ల కింద కప్పిపెట్టారు. అయితే అమ్మకుండా ఎక్కువరోజులు కావడంతో పత్తి నుంచి వివిధ రకాల పురుగులు బయటకొస్తున్నాయి. ఎలుకల బెడదా పెరిగింది. ముఖ్యంగా ఇళ్లల్లో దాచినవారికి ఇబ్బందులెదురవుతున్నాయి. ఇల్లంతా ఒక రకమైన దుర్వాసన కూడా వ్యాపిస్తోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఆరుబయట వర్షాలు, ఎండల తాకిడితో పత్తి రంగు నల్లగా మారుతోంది. పత్తికి సరైన ఉష్ణోగ్రత ఉండాలి. అప్పుడే తెలుపు రంగు దెబ్బతినకుండా ఉంటుంది. అలాంటి పత్తికే మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. కానీ దిగుబడి వచ్చిన తర్వాత మూడు నెలలుగా నిల్వ చేయడంతో సరైన ఉష్ణోగ్రత లేక నల్లగా మారిపోతోంది. పత్తి గింజల నుంచి బంక లాంటిది బయటకొస్తోంది. ఈ పరిస్థితుల్లో కొందరు పొరుగు రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు ప్రయత్ని స్తున్నారు. కానీ అక్కడికి రవాణా, దళారులకు కమీషన్, ఇతరత్రా ఖర్చులు కలిపితే క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వ్యయమయ్యే పరిస్థితి ఉంది. అయినా రాష్ట్ర సరిహద్దులో ఉన్న రైతులు అక్కడే అమ్మేందుకు ఇష్టపడుతున్నారు. మరొకొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న ధరకే అమ్ముకుంటున్నారు. పెరుగుతున్న వడ్డీ భారం ఒక్కో రైతు ఎకరానికి రూ.25 వేల వరకు పత్తి సాగు కోసం ఖర్చు చేశాడు. కొందరు అప్పులు చేసి మరీ పంట వేశారు. సకాలంలో అమ్ముకుంటే అప్పు తీరిపోయేది. మిత్తి డబ్బులు కూడా మిగిలేవి. కానీ ప్రస్తుతం వడ్డీ భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు తీర్చాలంటూ తీవ్రంగా వత్తిడి చేస్తున్నారు. దీంతో కొందరు కొత్త అప్పులు చేసి పాత అప్పులు తీరుస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఇంట్లో ఉన్న బంగారం అమ్మి లేదా తాకట్టు పెట్టి అప్పులు తీరుస్తున్నట్లు సమాచారం. -
పాక్ 2026 నాటికి ఆ దేశాలకు రూ. 63 వేల కోట్లు చెల్లించాలి! లేదంటే..
పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు అధిక విదేశీ బాహ్య రుణాలు, ద్రవ్యోల్బణం, విదేశీమారక నిల్వలతో పోరాడుతోంది. మరోవైపు రాజకీయ అస్తిరత చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్ పరిస్థితిపై సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ 2023 నుంచి 2026 నాటికల్ల చైనా, సౌదీ అరేబియాలకు దాదాపు రూ. 63 వేల కోట్ల విదేశీ రుణం చెల్లించాల్సి ఉందని తెలిపింది. తీవ్ర నగదు కొరతతో సతమత అవుతున్న పాక్ ఒకవేళ విదేశీ రుణాలను చెల్లించలేక చేతులెత్తేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందిని హెచ్చరింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్(యూఎస్‌ఐపీ) ప్రచురించిన సర్వేలో ప్రస్తుతం పాక్ విపరీతమైన ద్రవ్యోల్బణం, ఉగ్రవాద సమస్య, రాజకీయ విభేదాలతో అల్లాడుతుందని, అందువల్ల విదేశీ రుణాలను చెల్లించలేని దీనస్థితికి చేరుకునే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించింది. అప్పులో ఊబిలోకి కూరుకుపోయిందని రాబోయే మూడేళ్లలో చైనా, సౌదీలకు అధిక మొత్తంలో చెల్లించాల్సిన రుణ ఒత్తిడిని ఎదుర్కొనకు తప్పదని నివేదిక సూచించింది. అదీగాక ఏప్రిల్ 2023 నుంచి జూన్ వరకు బాహ్య రుణ సేవల భారం సుమారు రూ. 36 వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నందున సమీప కాలంలో తీవ్ర రుణ ఒత్తిడి తప్పదని నివేదిక పేర్కొంది. కానీ పాక్ అధికారులు చైనాను రీఫైనాన్స్ చేయమని ఒప్పించాలని భావిస్తున్నారని ఎందుకంటే గతంలో చైనా ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు అలా చేశాయని నివేదిక వెల్లడించింది. పాక్ ఈ బాధ్యతలను నెరవేర్చగలిగినా వచ్చే ఏడాది మరింత సవాలుగా మారుతుందని, పైగా రుణ సేవలు దాదాపు రూ. 20 వేల కోట్లకు పైగా పెరుగుతుందని తెలిపింది. ఇదిలా ఉండగా, వాస్తవానికి పాక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ఇవ్వాల్సిన రూ. 9 వేల కోట్లు నిధుల కోసం వేచి ఉంది. ఇది గతేడాది నవంబర్లోనే పాక్‌కి పంపిణీ అవ్వాల్సి ఉంది. ఈ నిధులు పాక్‌కి 2019లో ఆమోదించిన రూ 53 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌లో భాగం. ఈ 2019కి సంబంధించిన ఐఎంఎఫ్ ప్రోగాం జూన్ 30, 2023న ముగుస్తోంది. అలాగే నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గడువుకు మించి ప్రోగ్రామ్ పొడిగించటం అసాధ్యం. దీని గురించి పాక్ ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతున్నప్పటికీ..ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు. కాగా, ఇప్పటికే పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ కార్యక్రమాన్ని పునరుద్ధరించేలా అన్ని కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు ముందకు వచ్చింది కూడా. పైగా పాక్‌కు అదొక్కటే తప్ప ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడే సులభమైన మరో పరిష్కారమార్గం అందుబాటులో లేకపోవడం గమనార్హం. (చదవండి: కూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్..10 మంది గల్లంతు) -
ద్రవ్యలోటు తగ్గింది
సాక్షి, అమరావతి: గత ఆర్థికసంవత్సరం (2021–22)లో.. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం 1.46 శాతం తగ్గిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31తో ముగిసిస సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. రాష్ట్ర బడ్జెట్ లోపల అప్పులు, బడ్జెట్ బయట అప్పుల వివరాలను కాగ్ నివేదికలో విశ్లేషించింది. 2021–22 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికన్నా ద్రవ్యలోటు గణనీయంగా తగ్గిందని, దీంతో తీసుకున్న రుణాలు కూడా తగ్గినట్లు పేర్కొంది. 2021–22 నాటికి రాష్ట్ర మొత్తం రుణబకాయిలు జీఎస్డీపీ లక్ష్యంలోపలే ఉన్నాయని తెలిపింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు 2021–22 నాటికి రాష్ట్ర రుణబకాయిలు జీఎస్డీపీలో 35.60 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువగా 31 శాతమే ఉన్నాయని పేర్కొంది. అప్పటికి రాష్ట్ర రుణాలు రూ.3,72,503 కోట్లుగా ఉన్నాయి. ఇక 2020–21లో జీఎస్డీపీలో రుణాలు 34.35 శాతం ఉండగా 2021–22లో రుణాలు జీఎస్డీపీలో 31 శాతానికి తగ్గినట్లు కాగ్ తెలిపింది. 2021–22లో బడ్టెట్ ప్రతిపాదించిన అంచనాలకన్నా వాస్తవ పరిస్థితులు వచ్చేనాటికి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు గణనీయంగా తగ్గినట్లు కాగ్ పేర్కొంది. ద్రవ్యలోటు రూ.38,224 కోట్లు ఉంటుందని అంచనా వేయగా దానిని రూ.25,013 కోట్ల్లకే పరిమితం చేసినట్లు కాగ్ పేర్కొంది. ఇలా ద్రవ్యలోటు 2.08 శాతానికే పరిమితమైంది. బడ్జెట్లో రెవెన్యూ లోటు రూ.19,546 కోట్లు ఉంటుందని ప్రతిపాదించగా వాస్తవంగా రెవెన్యూ లోటు రూ 8,611 కోట్లకు పరిమితం చేశారు. ఇక 2021–22లో రెవెన్యూ రాబడులు 28.53 శాతం పెరిగాయని, దీని ఫలితంగా 2021–22లో రెవెన్యూ, ద్రవ్యలోటు గణనీయంగా మెరుగుపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని కాగ్ వివరించింది. మరోవైపు.. 2021–22 నాటికి బడ్జె్జటేతర రుణాలు రూ.1,18,393.81 కోట్లు ఉన్నాయి. ఈ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర మొత్తం రుణాలు జీఎస్డీపీలో 40.85 శాతంగా ఉంటుందని పేర్కొంది. అశాస్త్రీయ రాష్ట్ర విభజన కారణంగా ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక లోటును ఎదుర్కొంటోందని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చినట్లు కాగ్ తెలిపింది. భౌగోళిక ప్రాతిపదికన ఏపీ తెలంగాణకు ఆస్తులను కోల్పోయిందని, కానీ.. జనాభా ప్రాతిపదికన చెల్లింపుల బాధ్యతను పొందిందని, బకాయిలు తీర్చడానికి ఏపీకి వనరులు కూడా లేవని ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేటగిరి హోదా, 2014–15 రెవెన్యూ లోటుగ్రాంట్ వంటి విభజన హామీల అమలుకు కేంద్రంతో నిరంతరాయంగా ప్రయత్నిస్తోందని.. కోవిడ్ మహమ్మారి ఆర్థికపరమైన ఒత్తిడిని మరింత పెంచిందని తెలిపింది. ఈ కారణంగా రుణంగా తీసుకున్న నిధులలో కొంతభాగాన్ని లోటు ఫైనాన్సింగ్ కోసం, బాకీలను తీర్చేందుకు ఉపయోగించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని కాగ్ వెల్లడించింది. -
డెట్ మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు షాక్!
డెట్ మ్యూచువల్ ఫండ్స్ (Debt Mutual Funds) మదుపర్లకు కేంద్రం భారీ షాకిచ్చింది. ఆర్థిక బిల్లు 2023 సవరణల్లో భాగంగా లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ (ltcg) ప్రయోజనాన్ని ఎత్తివేసింది. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై పెట్టుబడి పెట్టగా వచ్చే రాబడిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని డెట్ మ్యూచువల్ ఫండ్లకు ఇకపై ఎల్టీసీజీ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం డెట్ మ్యూచువల్ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఈ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఇండికేషన్‌తోపాటు 20 శాతం ఎల్టీసీజీ చెల్లించాలి. ఇండికేషన్ లేకుండా అయితే 10 శాతం పన్ను పే చేస్తే సరిపోతుంది. కానీ ఇక నుంచి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లంతా తమకు వచ్చే ఆదాయంపై ఇన్‌కం టాక్స్ శ్లాబ్ ఆధారంగా పన్ను పే చేయాల్సిందే. దీనివల్ల ఈక్విటీ మార్కెట్ లింక్డ్ డిబెంచర్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై విధించే పన్నులు సమానం అవుతాయి. -
స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణ
ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణకు తెరతీసింది. రుణాలను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా కార్లయిల్ ఏవియేషన్ పార్టనర్స్‌కు కంపెనీలో 7.5 శాతం ఈక్విటీ వాటాను కేటాయించనుంది. కార్గో బిజినెస్(స్పైస్‌ఎక్స్‌ప్రెస్)లోనూ కార్లయిల్ ఏవియేషన్ వాటాను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు సెక్యూరిటీల జారీ ద్వారా మరో రూ. 2,500 కోట్లు సమకూర్చుకోనుంది. విమాన లీజింగ్ కంపెనీ కార్లయిల్ ఏవియేషన్‌కు చెల్లించవలసిన 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 830 కోట్లు)కుపైగా రుణాలను ఈక్విటీతోపాటు తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే డిబెంచర్లు(సీసీడీలు)గా మార్పిడి చేయనుంది. ఇందుకు స్పైస్‌జెట్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేరుకి రూ. 48 లేదా సెబీ నిర్ధారిత ధరలో 7.5 శాతం వాటాను కార్లయిల్(2.95 కోట్ల డాలర్లు)కు స్పైస్‌జెట్ కేటాయించనుంది. కార్గో బిజినెస్‌కు చెందిన సీసీడీలను(6.55 కోట్ల డాలర్లు) కార్లయిల్‌కు బదిలీ చేయనుంది. వెరసి 10 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకోనుంది. -
Sri Lanka: పాపం శ్రీలంక.. నిధులు లేక ఎన్నికలు వాయిదా..!
కొలంబో: అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రభుత్వ ఖజానా ఎప్పుడో ఖాళీ కావడంతో కనీసం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్చి 9న నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 3న కొత్త తేదీలను వెల్లడించే అవకాశం ఉంది. శ్రీలంక విదేశీ మారక నిల్వలు 500 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఆర్థికి పరిస్థితి అద్వాన్నంగా మారడంతో ఈ దేశానికి అప్పులు ఇవ్వకుండా ఐఎంఎఫ్, పారిస్ క్లబ్ ఆంక్షలు విధించాయి. దీంతో మిత్ర దేశం చైనా కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో తమపై ఐఎంఎఫ్ ఆంక్షలు ఎత్తివేసేలా చూసి అమెరికా, జపాన్ తమను ఆదుకుంటాయేమోనని లంక గంపెడు ఆశలు పెట్టుకుంది. ఐఎంఎఫ్ ప్రతిపాదించిన విధంగా 10 సంవత్సరాల రుణ మారటోరియంతో ఆర్థిక సహాయం కోసం చైనా వైపు శ్రీలంక చూస్తున్నప్పటికీ అలా జరిగే సూచనలు కన్పించడం లేదు. అసలు సమస్య ఏంటంటే ఒకవేళ శ్రీలంకకు చైనా సాయం చేయాల్సి వస్తే ఇతర దేశాలకు కూడా ఆర్థిక సాయాన్ని అందించవలసి ఉంటుంది. ఆఫ్రికాలో బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)తో పాటు, తమ చిరకాల మిత్ర దేశం పాకిస్తాన్‌కు కూడా చైనా ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే పాకిస్తాన్‌కు 700 మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసింది తప్ప కొత్తగా రుణాలు ఇవ్వలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం ఆ దేశ విదేశీ మారకపు నిల్వలు 3.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది మూడు వారాల దిగుమతికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్, శ్రీలంకలో పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో రెండు దేశాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలు తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: 'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!' -
మనకు తిండి.. రైతుకుతిప్పలు
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్) దేశం వ్యవసాయపరంగా అభివృద్ధి సాధిస్తోంది. గత ఆరేళ్లలో దేశం నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు బాగా పెరిగాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇలా వృద్ధి సాధించడం ఏ దేశానికికైనా శుభసూచకమే. ఈ ఎగుమతులతో రైతులు బాగుపడితే, వారి ఆర్థిక పరిస్థితి మెరుగైతే అది శుభం. కానీ దేశంలోని రైతాంగం పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నా.. ఆ ప్రయోజనం అన్నదాతలకు అందడం లేదు. పైగా అప్పుల పాలవుతున్నారు. ఎందుకంటే చాలా వరకు ప్రైవేట్ సంస్థలే ఎగుమతులు చేస్తున్నాయి. ఆ లాభాన్ని వ్యాపారులే పొందుతున్నారు. ఇలా ఎగుమతులు పెరిగిన కొద్దీ ఆహార ధాన్యాల ధరలు మండుతున్నాయి. ఈ లాభమూ దళారులకే వెళ్తుంటే... వినియోగదారులపై భారం పడుతోంది. మార్కెట్ మాయాజాలంతో.. ఐదారేళ్లుగా దేశమంతటా వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల దిగుబడులు విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో ఆహార ధాన్యాల ఎగుమతులు పెరుగుతూ వస్తున్నాయి. వరి, గోధుమ, పప్పు దినుసులు, నూనె గింజలు. కాఫీ. జనపనార (జ్యూట్), చెరుకు, తేయాకు, పొగాకు, వేరుశనగ, డెయిరీ పదార్థాలు, పళ్లు ఎగుమతి అవుతున్నాయి. అయితే దేశంలో ఎగుమతులు, దిగుమతులకు సంబం«ధించి సరైన విధానం లేని కారణంగా రైతులకు నష్టం జరుగుతోంది. మార్కెట్లోకి ఆహార ధాన్యాలు రావడానికి ముందు దిగుమతులను పెంచడం, రైతుల నుంచి ఆహార ధాన్యాలు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాక దిగుమతులు నిలిపేసి, ఎగుమతులకు అవకాశం ఇవ్వడం వల్ల వ్యాపారులకే లబ్ధి జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. మధ్యలో దళారీ వ్యవస్థ రెండు చేతులా సంపాదిస్తోంది. గణనీయంగా ఎగుమతులు.. ప్రస్తుతం దేశం నుంచి బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. 2021–22 సంవత్సరంలో జరిగిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో బియ్యం వాటా 19 శాతం. తర్వాత చక్కెర (9 శాతం), స్పైసెస్ (8శాతం), మాంసం (7శాతం) ఉన్నట్టు భారత పరిశ్రమలు, వాణిజ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇక గోధుమల ఎగుమతులు కూడా పెరుగుతున్నా యి. 2020–21లో వీటి ఎగుమతుల విలువ 568 మిలియన్ డాలర్లు కాగా.. 2021–22లో ఏకంగా 2.1 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో తొలిసారిగా కాఫీ పొడి ఎగుమతులు బిలియన్ డాలర్లు దాటాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాఫీ తోటల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. చేపల ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. సముద్ర తీరం అధికంగా ఉన్న పశ్చిమబెంగాల్, ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి ఏకంగా 7.7 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయి. ఆరుగాలం కష్టపడే రైతులు.. మనకు అన్నం పెడుతున్నారు.. ఆహార ధాన్యాల ఎగుమతులతో ఇతర దేశాలకూ తిండి పెడుతున్నారు.. లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులతో దేశ ఆర్థికవ్యవస్థకు ఊతంగా నిలుస్తున్నారు.. కానీ వారు మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నారు. అవి తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏయే దేశాలకు ఎగుమతులు? భారత్ నుంచి ఆహార ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటున్న దేశాల్లో అమెరికా, బంగ్లాదేశ్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, ఇండోనేసియా, సౌదీ అరేబియా, ఇరాన్, నేపాల్, మలేసియా దేశాలు ప్రధానంగా ఉన్నాయి. వీటితోపాటు కొరియా, జపాన్, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ తదితర దేశాలూ మన నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే మన దేశం నుంచి అత్యధికంగా ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్న దేశం అమెరికా. మన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏకంగా 11.5 శాతం ఒక్క అమెరికాకే వెళ్తున్నాయి. వాటి విలువ 5.7 బిలియన్ డాలర్లు. విదేశాల్లోని భారత ఎంబసీల్లో అగ్రిసెల్స్తో.. భారత వ్యవసాయ, దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి వీలుగా.. కేంద్రం వియత్నాం, అమెరికా, బంగ్లాదేశ్, నేపాల్, యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా, మలేషియా, ఇండోనేసియా, సింగపూర్, చైనా, అర్జెంటీనాల్లోని భారత ఎంబసీల్లో అగ్రిసెల్స్ను ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కృషి చేయడంతోపాటు వ్యాపార, పర్యాటక, సాంకేతిక, పెట్టుబడుల ప్రోత్సాహానికి ఈ విభాగాలు పనిచేస్తున్నాయి. రైతుల పరిస్థితి మారడం లేదు రైతులు బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి వ్యవసాయ వృద్ధికి దోహదం చేస్తున్నారు. 2021–22లో బ్యాంకులు రూ.16 లక్షల కోట్లు రుణాలు ఇస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ రూ.8 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారు. సేవలు, పారిశ్రామిక రంగాల్లో వేల పరిశ్రమలు మూతపడినా.. వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. దేశంలో 2022–23కు సంబంధించి వానాకాలంలో 11 కోట్ల ఎకరాల్లో వరి వేయాల్సి ఉంటే.. 10 కోట్ల ఎకరాల్లోనే వేశా రు. ఆశించిన దిగుబడి రావట్లేదు అదే జరిగితే ఇబ్బందే. దేశవ్యాప్తంగా 2021–22లో 12,600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. – సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకుడు ఎగుమతులున్నా.. గిట్టుబాటు ధర ఏది? దేశం నుంచి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. కానీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతులు ధాన్యం అమ్మేశాక ఎగుమతుల నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎగుమతుల విధానం సరిగా లేదు. భారీ వర్షాల కారణంగా ఈసారి పంటల దిగుబడి తగ్గుతుంది. పత్తికి సంబంధించి కాటన్ అడ్వయిజరీ బోర్డు సమావేశంలో పత్తి ఉత్పత్తి, నిల్వ, ఎగుమతులను సమీక్షించేవారు. ఇప్పుడా అడ్వయిజరీ బోర్డు లేక సమస్య తలెత్తింది. పత్తిధర తగ్గిపోయింది. – దొంతి నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణుడు -
రూ.4 కోట్లతో రియల్టర్ పరారీ పట్టిస్తే రూ.3 లక్షలిస్తాం
జగిత్యాల క్రైం: దొంగల్ని పట్టిస్తే నగదు బహుమానం ఇస్తాం.. అంటూ పోలీసులు ప్రకటించడం చూసే ఉంటారు. కానీ జగిత్యాలలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పులు చేసి పారిపోవడంతో.. అతన్ని పట్టిస్తే రూ.3 లక్షల నజరానా.. అంటూ బాధితులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. జగిత్యాల జిల్లా గోవిందుపల్లికి చెందిన గాండ్ల వెంకన్న కుటుంబంతో సహా 15 రోజులుగా కనిపించడం లేదు. వెంకన్న చాలాకాలంగా చిట్టీలు నడుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకంగా ఉండటంతో చాలామంది నమ్మి అతనికి సుమారు రూ.4 కోట్ల వరకు అప్పు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వెంకన్న పదిహేను రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. దీంతో బాధితులు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ‘గాండ్ల వెంకన్న కనిపించడం లేదు.. ఆయనను పట్టించిన వారికి రూ.3 లక్షల నజరానా ఇస్తాం’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాధితులెవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. -
కేంద్ర రుణ భారం రూ.147 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి రూ.147.19 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థికశాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్ త్రైమాసికం ముగిసేనాటికి ఈ పరిమాణం 145.72 లక్షల కోట్లు. అంటే మొదటి త్రైమాసికం నుంచి రెండవ త్రైమాసికానికి ప్రభుత్వ రుణ భారం ఒక శాతం పెరిగిందన్నమాట. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►మొత్తం రుణ భారంలో సెప్టెంబర్ ముగిసే నాటికి పబ్లిక్ డెట్ (క్లుప్తంగా ప్రభుత్వం తన లోటును తీర్చడానికి అంతర్గత, బాహ్య వనరుల నుండి తీసుకున్న రుణ మొత్తం) వాటా 89.1 శాతం. జూన్ 30 నాటికి ఈ విలువ 88.3 శాతం. దీని పరిధిలోకి వచ్చే డేటెడ్ సెక్యూరిటీల్లో (బాండ్లు) 29.6 శాతం మేర ఐదు సంవత్సరాలకన్నా తక్కువ కాలపరిమితిలో మెచ్యూర్ అవడానికి సంబంధించినది. ►డేటెడ్ సెక్యూరిటీల ద్వారా ప్రభుత్వం రెండవ త్రైమాసికంలో సమీకరించాల్సిన నోటిఫై మొత్తం రూ.4,22,000కోట్లుకాగా, సమీకరించింది రూ.4,06,000 కోట్లు. రీపేమెంట్లు రూ.92,371.15 కోట్లు. ► కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో కమర్షియల్ బ్యాంకుల వెయిటేజ్ సెప్టెంబర్ 38.3 శాతం ఉంటే, జూన్ త్రైమాసికానికి ఈ రేటు 38.04 శాతంగా ఉంది. ► గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ప్రభుత్వం చేసిన మొత్తం రీక్యాపిటలైజేషన్ (మూలధన కేటాయింపుల) పరిమాణం మొత్తం రూ.2,90,600 కోట్లు. ప్రైవేట్ రంగ బ్యాంకుగా వర్గీకరణ జరిగిన (2019 జనవరి 21న) ఐడీబీఐ బ్యాంక్‌కు రీక్యాపిటలైజేషన్ విలువ రూ. 4,557 కోట్లు. ►2021 సెప్టెబర్ 24 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వల పరిమాణం 638.64 బిలియన్ డాలర్లు అయితే, 2022 సెప్టెంబర్ 30 నాటికి ఈ విలువ 532.66 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► 2022 జూలై 1 నుంచి 2022 సప్టెంబర్ 30 మధ్య డాలర్ మారకంలో రూపాయి విలువ 3.11 శాతం క్షీణించింది. జూలై 1న రూపాయి విలువ 79.09 ఉంటే, సెప్టెంబర్ 30 నాటికి 81.55కు పడింది. -
దేశంలో తెలంగాణ రైతుల స్థానం.. అప్పుల్లో 5.. ఆదాయంలో 25
సాక్షి, హైదరాబాద్: మన రైతన్నలు ఆదాయంలో బాగా వెనుకంజలో ఉన్నారు. అప్పుల భారం కూడా భారీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. నెలకు సగటున రూ.10,218 ఆదాయం మాత్రమే పొందుతున్నాడు. అంటే రోజుకు రూ.340 మాత్రమే. అదే సమయంలో ఒక్కో రైతుకు సగటున రూ.74,121 అప్పు ఉంది. ఇక రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో, ఆదాయంలో 25వ స్థానంలో ఉండటం గమనార్హం. 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు దేశంలోని వ్యవసాయ కుటుంబాలు, రైతుల అప్పు, ఆదాయంపై సర్వే జరిగింది. సర్వే వివరాలు ఇటీవల పార్లమెంటులో చర్చకు రాగా.. అందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. రైతు కోసం ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా రైతు పరిస్థితి పూర్తిస్థాయిలో బాగుపడటం లేదు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రూ.313 మాత్రమే కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో నిలిచారు. తెలంగాణ రైతుల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. రైతు కుటుంబసభ్యుల సగటు ఆదాయం నెలకు రూ.9,403గా ఉంది. ఏడాదికి రూ.1,12,836. అంటే రోజుకు రూ.313 మాత్రమేనన్న మాట. ఇది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సగటు జీతం కంటే దాదాపు సగం తక్కువ. ఇక ఆదాయంలో తెలంగాణ రైతు దేశంలో 25వ స్థానంలో ఉన్నాడని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా మేఘాలయ రైతు సగటున నెలకు రూ. 29,348 ఆదాయం పొందుతున్నాడు. పంజాబ్ రైతు రూ. 26,701, హరియాణ రైతు రూ.22,841, అరుణాచల్‌ప్రదేశ్ రైతు రూ. 19,225 పొందుతున్నాడని కేంద్రం తెలిపింది. రైతన్న ధనికుడు కాదని తేలిపోయింది ధనిక రాష్ట్రమని చెబుతున్న తెలంగాణలో రైతన్న ధనికుడు కాదని స్పష్టమైపోయింది. రూ.2.75 లక్షల తలసరి ఆదాయం ఉందని చెబుతున్నా, అది రైతుకు లేదని తేలిపోయింది. దిగుబడి పెరిగింది.. పంటలు బాగా పండిస్తున్నామని చెబుతున్నా, రైతుకు మార్కెట్లో అన్యాయం జరుగుతోంది. రైతుబంధు కౌలు రైతులకు అందడం లేదు. రుణమాఫీ కొందరికే చేశారు. దీంతో అప్పులు పెరిగాయి. రైతులు ఆ రుణం నుంచి బయటపడటం లేదు. కౌలు రైతులకు రైతుబంధు, రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంది. కౌలు రైతులు ఈ రాష్ట్రపు వారు కాదా? వారి బాగోగులు ప్రభుత్వానికి పట్టవా? – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణులు -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల పరిష్కారం
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ 2022 సెప్టెంబర్ 30కల్లా రూ. 56,943 కోట్ల రుణాలను పరిష్కరించినట్లు తెలియజేసింది. వివిధ ఆస్తుల మానిటైజేషన్ ద్వారా సంస్థల సంఖ్యను సైతం 302 నుంచి 101కు కుదించినట్లు వెల్లడించింది. వీటిలో 88 దేశీ సంస్థలుకాగా.. 13 ఆఫ్‌షోర్ కంపెనీలున్నట్లు పేర్కొంది. జాతీయ కంపెనీ చట్ట అపిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ)కి దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ వివరాలు పొందుపరచింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కంపెనీ రిజల్యూషన్ పురోగతిపై తాజాగా సమాచారమిచ్చింది. సెప్టెంబర్‌కల్లా అంచనా రుణ పరిష్కారం రూ. 55,612 కోట్లుకాగా.. మరో రూ. 1,331 కోట్ల రు ణాలను లాభాల్లో ఉన్న గ్రీన్ సంస్థల ద్వారా చెల్లించినట్లు కంపెనీ ఎండీ నంద్ కిషోర్ తెలియజేశారు. కంపెనీ సంక్షోభంలో కూరుకుపోయే సమయానికి 169 దేశీ, 133 ఆఫ్‌షోర్ సంస్థలను కలిగి ఉంది. 2018లో తొలిసారిగా రుణ చెల్లింపుల్లో విఫలమైంది. ఇదే సమయంలో రూ. 90,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించవలసి ఉండటం గమనార్హం! -
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కొత్త ఫండ్ చూశారా?
హైదరాబాద్: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా యాక్సిస్ నిఫ్టీ ఎస్డీఎల్ సెప్టెంబర్ 2026 డెట్ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. నవంబర్ 16తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నిఫ్టీ ఎస్డీఎల్ సెప్టెంబర్ 2026 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల ఆధారంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. దీర్ఘకాలిక కోణంలో 3-5 ఏళ్ల వ్యవధికి నాణ్యమైన డెట్ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు అనువైనది. (పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్) -
రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది
తిరువనంతపురం: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతుంటారు. కేరళలో ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. అయితే అతనికి కష్టం, అదృష్టం ఒకేసారి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుల్లో కూరుకుపోయి బాధపడుతున్న అతడ్ని అదృష్టం వరించి లక్షాధికారిని చేసింది. వివరాలు.. కొల్లాం జిల్లా మినగపల్లికి చెందిన ఓ మత్స్యకారుడికి భార్య, పిల్లలు ఉన్నారు. అవసరాల నిమిత్తం ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 9 లక్షలు లోన్ తీసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది తీర్చలేకపోయాడు. అక్టోబర్ 12న చేపలు పట్టుకునేందుకు వెళ్తుండగా ప్రభుత్వానికి చెందిన అక్షయ లాటరీ రూ.70 లక్షల విలువైన టికెట్ కొనుగోలు చేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి అతనికి బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్ డబ్బులు రూ.9 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు పంపించింది. లేకుంటే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొంది. బ్యాంక్ నోటీసులు చూసిన మత్స్యకారుడు తీవ్ర కుంగుబాటుకి లోనయ్యాడు. ఏం చేయాలో.. లోన్ డబ్బులు ఎలా కట్టాలో తెలియక తల పట్టుకున్నాడు. చివరికి ఇంటిని అమ్మి అయినా లోన్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. చదవండి: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది! అంతలోనే ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. నోటీసులు అందుకున్న కొన్ని గంటల్లోనే అక్షయ లాటరీ టికెట్ దక్కినట్లు కాల్ వచ్చింది. రూ. 70 లక్షల విలువైన మొదటి బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. దీంతో పీకల్లోతు అప్పుల్లో ఉన్న మత్య్సకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ డబ్బుల గురించి మాట్లాడుతూ.. ముందుగా ఇంటి లోన్‌ను తీర్చనున్నట్లు తెలిపారు. అలాగే తమ పిల్లలకు మంచి చదువులు అందించి వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వాట్సాప్‌లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ -
Bhuma Family: భూమా కుటుంబంలో 'దావా'నలం
దివంగత భూమా నాగిరెడ్డి దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆళ్లగడ్డ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తే భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ ప్రధాన అనుచరుడు గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్య ఈ దావా వేశారు. దీనికి ప్రధాన కారణం నంద్యాల ఆంధ్రా బ్యాంకులోని అప్పును ఎగవేసేందుకు ఓ పథకం ప్రకారం కోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి తన పేరుపై ఉన్న భూమిని నంద్యాల ఆంధ్రా బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకున్నారు. నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకూ నెలవారీగా వాయిదాలు చెల్లించారు. వారు చనిపోయిన తర్వాత అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించాలని బ్యాంకు నుంచి భూమా వారసులపై ఒత్తిడి పెరిగింది. దీని నుంచి బయట పడేందుకు వారు పథకం రచించారు. బ్యాంకులో రుణం తీసుకునేందుకు ముందే తనఖా పెట్టిన ఆస్తి మాదాల వెంకటరమణయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు ఓ అగ్రిమెంట్ సృష్టించారు. తర్వాత తమకు విక్రయించిన ఆస్తిని తమకు తెలియకుండా బ్యాంకులో తనఖా పెట్టి మోసం చేశారని కోర్టులో దావా వేశారు. అయితే, ఈ దావా దాఖలు వెనుక భూమా వారసుల ప్రమేయం ఉందనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఈ దిశగానే సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. బకాయిల బాగోతం ఇదీ 2011 డిసెంబరు నెలలో భూమానాగి రెడ్డి పేరు మీద ఉన్న సర్వే నంబర్ 66/1 లో 1.94, 66/1 లో 4.37, 73 లో 6.17, 370/1ఎ లో 1.50, 370/ఏ2 లో 4.10, 370 /ఏ3 లో 0.40, 370/బి3లో 0.43, ఎకరాలు, భూమా శోభానాగి రెడ్డి పేరుమీద ఉన్న 356/ఏ, 170/ఏ లోని 1190 చదరపు గజాలు, 75/3 లో 1.08, 75/1లో 013 ఎకరాలు, భూమా శివలక్షమ్మ పేరుమీద ఉన్న 574/1లో 1.00, 574/2లో 1.40 ఎకరాల భూము లను ఉమ్మడిగా నంద్యాల ఆంధ్రా బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకున్నారు. ఈ ఆస్తులను బ్యాంకు తనఖా కంటే 4 నెలల ముందే అంటే 2011 ఆగస్టు 10న తనకు విక్రయించారని, అందుకు సంబంధించి అగ్రిమెంట్ రాసిచ్చారని వెంకటరమణయ్య ఓ అగ్రిమెంట్ సృష్టించినట్లు తెలుస్తోంది. రూ. 30 లక్షలు అగ్రిమెంట్ రోజు ఇచ్చారని, ఆపై 2014 ఫిబ్రవరి 10న మరో రూ.3 లక్షలు ఇచ్చారని దావాలో పేర్కొన్నారు. శోభానాగిరెడ్డి మృతి తర్వాత వారి వారసులు అఖిల, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలు 2016 జనవరి 5న రూ.5 లక్షలు, భూమానాగిరెడ్డి మృతి తర్వాత 2019 డిసెంబర్ 26న రూ.6 లక్షలు తీసుకున్నారని, మిగిలిన సొమ్ము చెల్లిస్తామని సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాలని ఆళ్లగడ్డ కోర్టులో ఈ నెల 6న వెంకటరమణయ్య దావా వేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! తల్లిదండ్రులు మృతి చెందిన తరువాత వారి పేరు ప్రతిష్టలు తగ్గకుండా వారసులు చూస్తారు. ఎవరైనా వారి గురించి తప్పుగా మాట్లాడినా జీర్ణించుకోలేరు. ఇందుకు విరుద్ధంగా భూమా వారసులు రాజకీయంగా పదవులు.. కోట్లాది రూపాయల ఆస్తుల అనుభవిస్తూ వారిపైనే కోర్టులో దావా వేయించడం పట్ల భూమా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడమే కాదు వారు చేసిన అప్పులను కూడా చెల్లించాలని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు పై ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు రూ 100 కోట్ల దాకా ఉంటుంది. ఇంత విలువైన ఆస్తులను భూమా దంపతులు మాదాల వెంకటరమణయ్యకు కేవలం రూ. 45 లక్షలకు విక్రయించారంటే నమ్మశక్యం కావడం లేదని భూమా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎవరీ మాదాల వెంకటరమణయ్య గుంటూరు పట్టణానికి చెందిన వెంకటరమణయ్య ఇటీవల ఆళ్లగడ్డ ప్రాంతంలో తరచూ వినపడుతున్న గుంటూరు శీనుకు తండ్రి. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌కు శీను అత్యంత సన్నిహితుడు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసు, హైదరాబాద్‌లో స్థలం విషయంలో జరిగిన కిడ్నాప్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆయా కేసుల్లో అఖిలప్రియ, భార్గవరామ్‌తో పాటు గుంటూరు శీను ప్రధాన నిందితుడు. ఇప్పుడు అతని తండ్రి వెంకటరమణయ్య భూమా దంపతులతో పాటు వారి వారసులైన భూమా అఖిలప్రియ, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలపై కోర్టులో కేసు వేయడం ఒక ఎత్తైతే ఆ దావాకు వకాల్తా పుచ్చుకున్నది అభిలప్రియ వ్యక్తిగత లాయరే కావడం విశేషం. బ్యాంకుకు శఠగోపం పెట్టేందుకే! భూమా దంపతులు ఉన్నప్పుడు తీసుకున్న రుణానికి సంబంధించి 2015 సంవత్సరం వరకు క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తూ వచ్చారు. వారు మృతి చెందినప్పటి నుంచి వారసులు కంతులు కట్టక పోవడంతో ప్రస్తుతం సుమారు రూ. 19 కోట్ల వరకు బకాయి పడ్డట్టు తెలుస్తోంది. ఈ రుణం చెల్లించాలని అనేక దఫాలుగా వారి వారసులైన కూతుర్లు, కొడుకుకు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో విసిగి పోయిన బ్యాంకర్లు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని ఇటీవల నోటీసులు పంపించారు. అయితే, సదరు షెడ్యూల్ ఆస్తులు వివాదాస్పదంగా ఉన్నాయని సృష్టిస్తే వేలం పాటలో ఎవ్వరూ పాల్గొనరు. తద్వారా బ్యాంకులకు శఠగోపం పెట్టొచ్చనే ఉద్దేశంతో తమకు అత్యంత సన్నిహితుడు అయిన గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్యతో దావా వేయించారని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. -
'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ..కొండంత అప్పును మంచులా కరిగించేసింది..కానీ!
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కేఫె కాఫీ డే సంస్థ తెలిపింది. వీటిలో ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్ తదితర అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీలున్నట్లు పేర్కొంది. అయితే భర్త వీజీ సిద్ధార్థ మరణంతో కొండలా పేరుకు పోయినా అప్పును మాళవిక హెగ్డే మంచులా కరిగించేశారు.కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కెఫె కాఫీ డే ఆర్ధిక వ్యవహారాలు బిజినెస్ వరల్డ్‌లో హాట్ టాపిగ్గా మారాయి. ఎందుకంటే? మాళవిక హెగ్డే మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. భర్త మరణంతో వెలుగులోకి 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కొండంత అప్పును మంచులా కరిగించేసింది కేఫె కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కెఫె కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా! -
నిధుల సమీకరణలో కెన్ ఫిన్ హోమ్స్
న్యూఢిల్లీ: గృహ రుణ రంగంలో ఉన్న కెన్ ఫిన్ హోమ్స్ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణలో ఉంది. నాన్ కన్వర్టబుల్ రిడీమేబుల్ డిబెంచర్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని అందుకోనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. కెనరా బ్యాంకును ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ అక్టోబర్ 17న జరిగే సమావేశంలో ఈ మేరకు బోర్డ్ అంగీకారం కోరనుంది. రుణాల పెంపు ప్రణాళికకు 2022 సెప్టెంబర్ 7న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలిపారని కెన్ ఫిన్ హోమ్స్ వెల్లడించింది. కెన్ ఫిన్ హోమ్స్‌లో కెనరా బ్యాంక్‌నకు 29.99 శాతం వాటా ఉంది. -
రుణ బకాయిలు రూ.33,787 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (టీఎస్సీఎస్సీఎల్) బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలు ఏయేటికాయేడు పెరిగి పోతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్న కార్పొరేషన్ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపని కారణంగా అప్పుల భారం పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అప్పటికే ఉన్న బకాయిలతో పాటు ప్రతి ఏటా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూనే వచ్చింది. ఈ విధంగా 2014 –15 నుంచి 2021–22 వరకు బ్యాంకులకు కార్పొరేషన్ చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.33,787.26 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు లేకనే.. రాష్ట్రం ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సెంట్రల్ పూల్ కింద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి అప్పగిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా కార్పొరేషన్ ఏటా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ధాన్యం కొనుగోలు చేస్తోంది. సీఎంఆర్ తీసుకున్న తరువాత కార్పొరేషన్‌కు ఎఫ్‌సీఐ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ విధంగా ఎఫ్‌సీఐ తీసుకున్న సీఎంఆర్‌కు అనుగుణంగా కిలోకు రూ.32 చొప్పున రాష్ట్రానికి క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. అయితే సీఎంఆర్ ఆలస్యం అవుతున్న కొద్దీ ఎఫ్‌సీఐ చెల్లింపులు కూడా ఆలస్యంగానే ఉంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత వడ్డీ భారం పడుతున్నా.. అది కొంతే. కాగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి తీసుకున్న బియ్యానికి గాను చెల్లించాల్సిన మొత్తం చెల్లించక పోవడంతో సంస్థపై భారం అధికంగా పడుతోంది. బ్యాంకులకు రుణ బకాయిలు కట్టడం కష్టమవుతోంది. రూ.4,747 కోట్ల నుంచి పెరుగుతూ.. పీడీఎస్ బియ్యం, హాస్టళ్లు, గురుకులాల వంటి రాష్ట్ర అవసరాల కోసం స్టేట్‌పూల్ కింద ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచే బియ్యాన్ని తీసుకుంటుంది. అలా తీసుకుంటున్న బియ్యానికి కిలో రూ.32 లెక్కన చెల్లించాలి. ఆ సొమ్ము చెల్లించకపోవడంతో బకాయిలు రూ.వేల కోట్లలో పేరుకుపోయాయి. తెలంగాణ ఏర్పాటు అయిన 2014–15, ఉమ్మడి రాష్ట్రం నాటి బకాయిలు కలిపి రూ.4,747 కోట్లు ఉండగా, అవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2019–20లో బ్యాంకు రుణ బకాయిలు రూ.15,302.79 కోట్లు ఉండగా, 2021–22 నాటికి రూ. 33,787.26 కోట్లకు పెరిగిపోయాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు సాగిన ఉచిత బియ్యం పంపిణీ, అదనపు కోటా విడుదల, తదితర కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేసింది. కానీ డబ్బులు చెల్లించలేదు. వడ్డీలకే వేల కోట్లు పౌర సరఫరాల సంస్థ తీసుకున్న అప్పులకు గాను వడ్డీల కింద ఏటా రూ.వేల కోట్లు చెల్లిస్తోంది. 2021–22 లో పౌరసరఫరాల సంస్థ బ్యాంకుల నుంచి రూ. 29,804 కోట్లు అప్పు తీసుకోగా, ఇందుకు చెల్లించాల్సిన వడ్డీ రూ.1, 568 కోట్లు. కాగా బకాయిలకు సంబంధించిన వడ్డీ కూడా కలుపుకొని చెల్లించిన మొత్తం రూ. 2,100.55 కోట్లు. 2014–15లో రూ.146.80 కోట్లు వడ్డీగా చెల్లించిన పౌరసరఫరాల శాఖ 2015–16 లో రూ.1,012.48 కోట్లు చెల్లించింది. ఇలా పెరుగుతూ వచ్చి 2022–23 నాటికి చెల్లించాల్సిన వడ్డీ రూ. 9,222.50 కోట్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.360.68 కోట్లు వడ్డీ కింద కార్పొరేషన్ చెల్లించడం గమనార్హం. -
చావులోనూ వీడని బంధం
కౌడిపల్లి(నర్సాపూర్): చావులోనూ బంధాన్ని వీడకుండా భార్యాభర్తలిద్దరూ ఒకేతాడుతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పంటలసాగులో వచ్చిన నష్టం ఆ దంపతుల ప్రాణాలను మింగేసింది. ఈ ఘటన శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లిలో చోటుచేసుకుంది. ముట్రాజ్‌పల్లికి చెందిన ఆకుల బాషయ్య(57), శివ్వమ్మ(53) భార్యాభర్తలు. వీరికి కొడుకు నరేశ్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. నరేశ్ ఏడాదిగా హైదరాబాద్‌లో ఉంటూ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. బాషయ్య, శివ్వమ్మ గ్రామంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్లు, సాగు కోసం చేసిన రూ.4 లక్షల అప్పులు, ఇటీవల వేసిన బోరు ఫెయిల్ కావడం, పంటలో నష్టం రావడం.. వీటికితోడు భార్య అనారోగ్య పరిస్థితి ఆయనను ఆందోళనకు గురిచేశాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక తరచూ మథనపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారంరాత్రి పదిగంటల వరకు ఆ దంపతులు ఇరుగుపొరుగు వారితో ముచ్చట పెట్టి అనంతరం ఇంట్లోకి వెళ్లిపోయారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన మంగమ్మ బట్టలు ఉతికేందుకని బాషయ్య ఇంటికి వెళ్లి తలుపుతట్టగా లోపలి నుంచి ఉలుకూపలుకూలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా దంపతులిద్దరూ ఒకేతాడుతో దూలానికి ఉరేసుకుని మృతిచెందారు. కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇదీ నిజం.. నమ్మొద్దు విష ప్రచారం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నో విమర్శలకు సూటిగా, స్పష్టమైన సమాధానం చెప్పింది. అప్పులపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని నమ్మొద్దంటూ సవివరంగా, పూర్తి గణాంకాలతో తేటతెల్లంగా ప్రజల ముందుంచారు. ఎల్లో మీడియాతో కలిసి విపక్షాలు చేస్తోన్న విష ప్రచారం నమ్ముతారా? నిజాలను కళ్లకు కట్టినట్టు చూపించే గణాంకాలను నమ్ముతారా? 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో వృద్ధి రేటు ఎంత? 2019 నుంచి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ను నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ పాలనలో అభివృద్ధి ఎలా ఉంది? ఈ లెక్కలు మీరే చూడండి. 2018-19 చంద్రబాబు పాలనలో వృద్ధి రేటు 5.36% ఏపీ ర్యాంకు 21 2019 -20 సీఎం జగన్ పాలనలో వృద్ధి రేటు 6.89% ఏపీ ర్యాంకు 6 కోవిడ్ సమయంలో విపత్కర పరిస్థితులను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్నాయి. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆర్థికంగా అన్ని కష్టాలను తట్టుకుంది. వృద్ధి రేటులో నాలుగో స్థానానికి ఎదిగింది 2020 -21 వృద్ధి రేటు 0.08% ఏపీ ర్యాంకు 4 2021 -22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. వృద్ధి రేటులో అద్భుతంగా రాణించింది, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2021 -22 వృద్ధి రేటు 11.43% ఏపీ ర్యాంకు 1 2014 నుంచి 2019 వరకు అంటే చంద్రబాబు హయాంలో జాతీయ ఆదాయంలో రాష్ట్రం వాటా 4.45% మాత్రమే ఉండగా.. 2019 నుంచి అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాత, ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు జాతీయ ఆదాయంలో ఏపీ వాటా 5% చేరింది. అప్పులపై అసలు నిజం ఇది విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.లక్షా 20వేల 556 కోట్లు ఉంటే దాన్ని చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే సమయానికి రూ.2లక్షల 69వేల 462 కోట్లకు తీసుకెళ్లారు. అంటే అప్పుల్లో అది 123.52% పెరుగుదల. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చే నాటికి అప్పులు రూ.2లక్షల 69వేల 462 కోట్లు ఉంటే.. ప్రస్తుతం అది రూ.3కోట్ల 82లక్షల 165 కోట్లుగా ఉంది. అంటే సీఎం జగన్ హయాంలో అప్పులు పెరిగింది 41.83% మాత్రమే. అప్పులపై కాగ్ చెప్పిన వాస్తవమిది ♦చంద్రబాబు హయాంలో ప్రభుత్వ గ్యారంటీతో వివిధ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు చేసిన అప్పు రూ.14028 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే సమయానికి అది రూ.59257 కోట్లకు చేరింది. మొత్తమ్మీద అప్పుల శాతం 19.55 % ♦ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో పీఎస్‌యూలు తీసుకున్న అప్పు 15.46% మాత్రమే ♦ఏపీ సర్కారుపై విషపు రాతలు రాస్తోన్న ఎల్లో మీడియా అసలు నిజాలు మాత్రం దాచిపెడుతోంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఏపీలో ఉందంటూ దుష్ప్రచారం చేస్తోంది. ఒక సారి కేంద్రం అప్పులు, వృద్ధి రేటు చూస్తే నిజాలు వెల్లడవుతాయి. ఈ లెక్కలు పార్లమెంటు సాక్షిగా కేంద్రం సమర్పించిన బడ్జెట్లో చెప్పినవే. ♦ 2014-19 మధ్య కేంద్రం అప్పులు రూ.62లక్షల 42వేల 220 కోట్లు ♦ వృద్ధి రేటులో అప్పు శాతం 50.07% ♦ 2020-21 కల్లా కేంద్రం అప్పులు రూ.1 కోటీ 20లక్షల 79వేల 18 కోట్లు ♦ వృద్ధి రేటులో అప్పు శాతం 61% కేంద్రం vs ఆంధ్రప్రదేశ్ .. అప్పుడెంత? ఇప్పుడెంత? మీరే గమనించండి ♦2014-19 మధ్య కేంద్రం అప్పులు 59.88% పెరిగితే అదే సమయంలో ఏపీలో సర్కారు నడిపించిన చంద్రబాబు అప్పుల శాతాన్ని ఏకంగా 123.52% పెంచేశారు. ♦2019 నుంచి మార్చి 31, 2022 వరకు కేంద్రం అప్పులు 43.8% పెరిగిన , అదే సమయంలో ఏపీ సర్కారు అప్పుల శాతం పెంపు 41.83% మాత్రమే ఇదీ వాస్తవం ♦ 2018-19 మధ్య వడ్డీ, అప్పు కలిపి చంద్రబాబు సర్కారు చెల్లించింది రూ.28886 కోట్లు అయితే 2021-22 మధ్య సీఎం జగన్ చెల్లించింది రూ.36007 కోట్లు ♦ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, 2019 నుంచి కరోనా కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వాటిని తట్టుకుని ఏపీని నిలబెట్టింది ♦ సీఎం జగన్ సర్కారు. సంక్షేమం, సంస్కరణలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను కరోనా నుంచి కాపాడుకున్నారు సీఎం జగన్. పచ్చ ప్రచారం ఆపండి, నిజాలు చూడండి ♦ మూలధన వ్యయం విషయానికి వస్తే టిడిపి హయాంలో రాష్ట్రం సగటు రూ.15227 కోట్లు. అదే సీఎం జగన్ హయాంలో మూలధన వ్యయం రాష్ట్రం సగటు రూ.18362 కోట్లు. ఈ లెక్కలు దాచిపెట్టి రాష్ట్రం శ్రీలంకలా మారబోతుంటూ చొక్కాలు చించుకున్నారు విష ప్రచారం చేశారు. కేంద్రం ఇచ్చిందెంత? కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా చాలా కీలకమైన అంశం. 2015 నుంచి 2019 వరకు ఏ ఏడాది చూసినా 34.91% నుంచి 36.63% వరకు ఉంది. అంటే చంద్రబాబు సర్కారుకు కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పన్నుల్లో వాటా ఇచ్చింది. సీఎం జగన్ హయాంలో అంటే 2019 నుంచి ఏ ఏడాది చూసినా 29.35% నుంచి 23.13% మధ్యలోనే కేంద్ర పన్నుల వాటా ఉంది. 15వ ఆర్థిక సంఘం 41% ఇవ్వాలని చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రజంటేషన్ pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్లు డ్రామా.. చివరికి
సాక్షి, బెంగళూరు: అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి తాను చనిపోయినట్లు డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ఈఘటన మాండ్య శ్రీరంగపట్టణ తాలూకా బొట్టనహళ్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన మను అనే వ్యక్తి ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేశాడు. బయట వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. బాకీ తీర్చాలని ఆసాములు ఒత్తిడి చేయడంతో గత నెల 12 నుంచి కనిపించకుండా పోయాడు. తాను ధరించిన విగ్‌కు కోడి రక్తం పూసి, చెప్పులను కాలువ వద్ద వదిలేసి గోవా వెళ్లాడు. వాటిని గమనించిన తల్లిదండ్రులు మనుని ఎవరో హత్య చేశారని భావించారు. ఇదిలా ఉండగా సుప్రియ అనే యువతికి రూ. 8 లక్షలు ఇచ్చినట్లు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వాలని, లేదంటే సినిమా తరహాలో చంపేస్తానని ఓ వ్యక్తి మనును బెదిరించినట్లు ఒక ఆడియో వైరల్ అయింది. దీంతో మను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి మను బతికే ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పుల బాధతోనే డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. చదవండి: బెంగళూరులో ఘోరం.. తమ్ముని భార్య వేధిస్తోందని -
అప్పులు తగ్గించుకుంటున్నాం...
న్యూఢిల్లీ: వ్యాపారాల విస్తరణ కోసం ఎడాపెడా రుణాలు తీసుకుంటూ (ఓవర్లీవరేజ్), అప్పుల కుప్పగా మారిందంటూ వస్తున్న విమర్శలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల భారాన్ని సగానికి పైగా తగ్గించుకున్నామని తెలిపింది. నికర రుణాలు, ఆపరేటింగ్ లాభాల నిష్పత్తిని మెరుగుపర్చుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఓవర్లీవరేజ్ అంశంపై ఇటీవలి క్రెడిట్‌సైట్స్ నివేదికపై స్పందిస్తూ అదానీ గ్రూప్ 15 పేజీల నోట్‌ను విడుదల చేసింది. రుణాలు, నిర్వహణ లాభాల నిష్పత్తి గడిచిన తొమ్మిదేళ్లలో 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లకు దిగి వచ్చినట్లు పేర్కొంది. 2015–16లో గ్రూప్ సంస్థల మొత్తం రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు 55 శాతంగా ఉండగా .. 2021–22లో దీన్ని 21 శాతానికి తగ్గించుకున్నట్లు తెలిపింది. ఇక అప్పట్లో 31 శాతంగా ఉన్న ప్రైవేట్ బ్యాంకుల రుణాలు ప్రస్తుతం 11 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. బాండ్ల ద్వారా సమీకరించుకుంటున్న నిధుల పరిమాణం 14 శాతం నుంచి 50 శాతానికి పెరిగిందని అదానీ గ్రూప్ పేర్కొంది. 2022 మార్చి ఆఖరు నాటికి గ్రూప్ స్థూల రుణాల రూ. 1.88 లక్షల కోట్లుగాను, నగదు నిల్వలను తీసేస్తే నికర రుణాలు రూ. 1.61 లక్షల కోట్లుగాను ఉన్నాయి. కమోడిటీ ట్రేడింగ్ కంపెనీగా మొదలైన అదానీ గ్రూప్ గత కొన్నేళ్లుగా పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్ లాంటి వివిధ రంగాల్లోకి శరవేగంగా విస్తరించింది. ఇందుకు కా వాల్సిన ఆర్థిక వనరుల కోసం రుణాలనే ఎంచుకుంటోందని, తద్వారా అప్పుల కుప్పగా మారిందని క్రెడిట్ఇన్సైట్స్ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ‘గడిచిన కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ దూకుడుగా విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తోంది. అత్యధికంగా పెట్టుబడులు అవసరమయ్యే కొత్త లేదా సంబంధం లేని వ్యాపారాల్లోకి అడుగుపెడుతోంది. దీనితో రు ణాల గణాంకాలు, నిధుల ప్రవాహంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది‘ అని క్రెడిట్‌సైట్స్ తెలిపింది. పరిస్థితి తల్లకిందులైతే .. రుణాల ఆధారిత వృద్ధి ప్రణాళికలు బెడిసికొట్టి, తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకుపోయే ముప్పు ఉందని హెచ్చరించింది. ఫలితంగా గ్రూప్ కంపెనీల్లో ఒకటి పైగా సంస్థలు దివాలా తీసే అవకాశాలు ఉన్నాయని క్రెడిట్‌సైట్స్ పేర్కొంది. -
రాబడి కోసం కొత్త మార్గం..!
కొందరు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడి సాధనాల కోసం తరచూ అన్వేషిస్తుంటారు. పెట్టుబడుల్లో ఎక్కువ వైవిధ్యం కోరుకుంటారు. కొందరికి రాబడే ప్రామాణికం. రిస్క్ ఉన్నా ఫర్వాలేదు ఎక్కువ రాబడి కావాలన్నది వారి విధానం. ముఖ్యంగా నేటి తరం యువ ఇన్వెస్టర్లు స్థిరమైన ఆదాయం కోసం డెట్‌కు ప్రత్యామ్నాయ సాధనాల కోసం చూస్తున్నారు. సంప్రదాయ డెట్ సాధనాలతో పోలిస్తే వారికి ఎక్కువ రాబడి కావాలి. ఈక్విటీ మార్కెట్లలో మాదిరిగా అస్థిరతలు ఉండకూడదు. ఎలానూ ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. కనుక ప్రత్యామ్నాయాలు కోరుకునే వారు పెరిగిపోతున్నారు. ఈ తరహా ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చిన సాధనమే ‘ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్’. ఇది ఎలా పనిచేస్తుంది? రాబడులు ఏ మేరకు ఉంటాయి? తదితర వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ఇన్వాయిస్ ఫైనాన్స్ / డిస్కౌంటింగ్ అంటే... ఇన్వాయిస్ ఫైనాన్స్, డిస్కౌంటింగ్‌ను సులభంగా అర్థం చేసుకుందాం. ఒక పేపర్ తయారీ కంపెనీ ఉంది. రూ.లక్ష విలువ చేసే పేపర్‌ను నోట్‌బుక్ తయారీ కంపెనీకి విక్రయించింది. ఒప్పందం ప్రకారం 90 రోజుల తర్వాత రూ.లక్షను నోట్‌బుక్ తయారీ కంపెనీ చెల్లిస్తే చాలు. కానీ, అంతకంటే ముందే నిధుల అవసరం పేపర్ కంపెనీకి ఏర్పడింది. దీంతో నోట్‌బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను రూ.90వేలకే ఒక ప్లాట్ఫామ్లో విక్రయానికి ఉంచింది. దీన్ని ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటారు. ఈ డీల్‌లో పేపర్ కంపెనీకి వెంటనే రూ.90వేల క్యాష్ ఫ్లో అందుతుంది. దీన్ని కొనుగోలు చేసిన ఇన్వెస్టర్‌కు 90 రోజులకే రూ.10వేల లాభం వస్తుంది. అలా కాకుండా.. ఇదే పేపర్ తయారీ కంపెనీ నోట్ బుక్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.లక్ష ఇన్వాయిస్ను వెంటనే నగదుగా మార్చుకోవాలని అనుకుంది. డిస్కౌంట్‌కు విక్రయించకుండా, 90 రోజుల కాలానికి 12 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తూ రూ.లక్ష రుణం కోరింది. దీన్ని ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ అంటారు. ఎలా పనిచేస్తుంది..? ఇది స్టార్టప్‌ల కాలం. ఏటేటా వందలాది స్టార్టప్‌లు ఉనికిలోకి వస్తున్నాయి. వీటి విస్తరణకు నిధులు అవసరం ఎంతో ఉంటుంది. అదే సమయంలో అవి నిధుల కోసం ప్రతిసారి ఈక్విటీ జారీ మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఈక్విటీ విలువ పలుచబడిపోతుంది. దీనివల్ల రాబడులూ పలుచన అవుతాయి. ఇక్కడే రెవెన్యూ బేస్డ్ ఫైనాన్సింగ్ (కంపెనీల ఆదాయాన్ని చూసి రుణాలు ఇవ్వడం) అవసరం ఎదురవుతుంది. ఇది అటు స్టార్టప్‌లకు, ఇటు పెట్టుబడి అందించే వారికీ ప్రయోజనం చేకూరుస్తుంది. కంపెనీలకు తలనొప్పి లేని నిధులు అందుతాయి. జిరాఫ్, బెటర్ఇన్వెస్ట్, క్రెడ్ఎక్స్ ఇలా పలు సంస్థలు ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్‌కు సంబంధించి మంచి పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తుంటాయి. వెంచర్ క్యాపిటల్ (వీసీ), ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉన్నారు కదా? అన్న ప్రశ్న ఎదురుకావచ్చు. కానీ, ఇవి ఊరికే పెట్టుబడులు అందించవు. భారీ రాబడులు ఆశిస్తాయి. లేదంటే తాము అందించే పెట్టుబడులకు భారీ వాటా కోరుకుంటుంటాయి. రిస్క్ ఎక్కువగా ఉండే వ్యాపారాలకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి నిధులు లభించడం అసాధ్యం. అందుకనే ఆదాయం చూసి రుణాలు అందించే ఆర్బీఎఫ్ మార్కెట్ విస్తరిస్తోంది. ఈ విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లకు ‘ఇన్వాయిస్ ఫైనాన్స్/ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ రూపంలో పెట్టుబడుల అవకాశాలు లభిస్తాయి. ఇన్వాయిస్ల రూపంలో కంపెనీలు తమకు కావాల్సిన నిధులను సమకూర్చుకుంటాయి. ఇన్వాయిస్లపై కంపెనీలకు నిధులు రావాల్సి ఉన్నప్పుడు.. వాటిని ఇన్వెస్టర్లకు హామీగా ఉంచి/లేదా విక్రయించి కంపెనీలు నిధులు కోరతాయి. సౌకర్యవంతం... ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. వారికి భిన్నమైన పెట్టుబడుల అవకాశాలను అందించేందుకు ఎన్నో ఆన్లైన్ వేదికలు కూడా ఏర్పాటువుతున్నాయి. అలా వచ్చిందే ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్. 18 ఏళ్లు నిండి, కేవైసీ పూర్తి చేసిన వారు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి లక్ష రూపాయిల నుంచి మొదలవుతుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు, కొన్ని కేసుల్లో కనీసం రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తమ ప్లాట్‌ఫామ్‌పై నమోదైన ఇన్వెస్టర్లకు ఆయా సంస్థలు పెట్టుబడుల అవకాశాలను తీసుకొస్తుంటాయి. ఇందుకోసం ఇన్వెస్టర్, రుణ గ్రహీత ఇద్దరి నుంచి ‘స్ప్రెడ్ (వడ్డీ రేటు మధ్య వ్యత్యాసం) రూపంలో చార్జీలను వసూలు చేస్తాయి. పెట్టుబడుల అవకాశాలను లిస్టింగ్ చేసేందుకు కూడా చార్జీ తీసుకుంటాయి. రుణం కోసం కంపెనీలు ఆఫర్ చేసే ఇన్వాయిస్లను ఆయా ప్లాట్‌ఫామ్‌లు ముందుగా తనిఖీ చేస్తాయి. అవి నిజమైనవా, కావా అన్నది నిర్ధారించుకుంటాయి. అంతా డీజిటల్‌గా జరిగిపోయే విధానం కావడంతో ఇరువైపుల వారికి సౌకర్యంగా ఉంటుంది. పైగా అందుబాటు ధరలకే నిధులు కంపెనీలకు లభిస్తాయి. ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు అందుతాయి. కొత్తవారు, అనుభవం లేని వారు అయితే తెలిసిన ఇన్వెస్టర్‌తో సంయుక్తంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల అవకాశాలు జిరాఫ్ ప్లాట్‌ఫామ్.. ఏడేళ్ల చరిత్ర కలిగిన లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ డీల్ ను అందిస్తోంది. కాలవ్యవధి కేవలం 91 రోజులు. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 12.25 శాతంగా ఉంది. అంటే రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలల్లో రూ.1.03 వేలు లభిస్తాయి. జిరాఫ్ డీల్‌ను లిస్ట్ చేయడానికే పరిమితం కాదు. సదరు పెట్టుబడిని కాల వ్యవధి వరకు పర్యవేక్షిస్తుంటుంది. ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇస్తుంది. డిఫాల్ట్ అవకాశాలు ఏర్పడితే... డిఫాల్ట్ (ఎగవేత) అవకాశాలు ఉన్నట్టు భావిస్తే ఇన్వెస్టర్ల తరఫున తనే ఆయా హక్కులను వినియోగించుకుని డీల్స్‌ను క్లోజ్ చేసి, నిధులు రాబడుతుంది. జిరాఫ్ ప్లాట్‌ఫామ్‌పై 30/60 రోజుల కాలవ్యవధితో కూడిన ‘ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ డీల్ కూడా ఉంది. క్రెడ్ఎక్స్ ప్లాట్ఫామ్లో కనీస పెట్టుబడి రూ.3 లక్షలుగా ఉంది. కాల వ్యవధి 30/90 రోజులు. ఇక బెటర్ఇన్వెస్ట్ ప్లాట్‌ఫామ్ అయితే ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేస్తోంది. సినీ నిర్మాణంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తోంది. సినిమా విడుదలైన 60/90 రోజుల తర్వాత నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సినీ నిర్మాణ సంస్థలకు ఆదాయం వస్తుంది. మరి అప్పటి వరకు వాటికి నిధుల అవసరం ఎంతో ఉంటుంది కదా. అందుకుని సినీ నిర్మాణ సంస్థలు ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి ఇన్వాయిస్లను ఇన్వెస్టర్లకు విక్రయిస్తుంటాయి. ఇక్కడ ఓటీటీ సంస్థలే నేరుగా ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. వీటి వార్షిక రాబడి 12.18 శాతంగా ఉంది. ఆయా అంశాలు అన్నింటిపై నిపుణుల సలహాలు అవసరం. రిస్క్‌లు ఏమిటంటే.. ఏ పెట్టుబడిలో అయినా రిస్క్ ఉంటుంది. ఈ ఆన్లైన్ వేదికలు రాబడి నుంచి పన్ను మేర తగ్గించి ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేస్తాయి. ఇక ఇన్వెస్టర్లు తమవైపు నుంచి ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదని అవి చెబుతుంటాయి. కానీ, మిగిలిన ప్లాట్‌ఫామ్‌లకు ఈ విషయంలో స్పష్టత లేదు. కనుక ప్లాట్‌ఫామ్‌లు పన్ను కోత అమలు చేస్తే, ఆ మేరకు టీడీఎస్ అడిగి రిటర్నుల్లో చూపించుకోవడం మంచిది. తక్కువ సందర్భాల్లో పెట్టుబడికి కూడా నష్టం ఏర్పడొచ్చు. కాకపోతే ఆయా పెట్టుబడుల అవకాశాలకు సంబంధించి రిస్క్‌ను తాము ముందే విశ్లేషించినట్టు ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆలస్యం అయినా, ఎగ వేతలు ఏర్పడినా, మోసాలు జరిగినా, తప్పుదోవ పట్టించినా బాధ్యత తీసుకోవు. ఇవి కేవలం ఇరువైపుల వర్గాలను కలిపేందుకు, వారికి సేవలు అందించడానికే పరిమితమవుతుంటాయి. దేనీకి హామీ ఇవ్వవు. కనుక సంప్రదాయ డెట్ పెట్టుబడి సాధనాలకు ఇవి ప్రత్యామ్నాయం కావు. పీపీఎఫ్‌లో 7%, ఎఫ్‌డీల్లో 6–7% మేర రాబడి వస్తుంది. కానీ, వాటిల్లో హామీ ఉంటుంది. ఇన్వాయిస్ ఇన్వెస్టింగ్‌కు ఇటువంటి హామీ ఉండదు. నిధులు ఆశించే సంస్థల పేరు, బ్రాండింగ్ తదితర అంశాల ఆధారంగా రిస్క్‌ను కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఆయా సంస్థలకు సంబంధించి గత చరిత్ర ఆధారంగానూ నిర్ణయం తీసుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటే రిస్క్ ఎదురుకావచ్చు. దీర్ఘకాలానికి ఇన్వాయిస్లపై రుణాలు తీసుకునే సంస్థల విషయంలో ముందుగానే తగినంత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మూడేళ్లకు పైగా కాలంలో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మారిపోయే రిస్క్ ఉంటుంది. మూడు నెలల నుంచి ఏడాదిలోపు ఇన్వాయిస్లపై రిస్క్ తక్కువగా ఉంటుంది. -
అప్పు ఇచ్చిన మహిళ పట్ల దురుసు ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: అప్పిచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మౌలాలికి చెందిన తోట ప్రేమ్‌కుమార్ (43) 2014లో స్థానికంగా ఉండే ఓ మహిళ వద్ద రూ. 15 లక్షలను అప్పుగా తీసుకుని ఏడాది తర్వాత ఇస్తానన్నారు. ఏడాదైనా డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించడంతో విచారణ చేసిన న్యాయస్థానం సోమవారం నిందితుడికి రెండేళ్ల జైలుశిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. -
Sri Lanka: రుణ ఉపశమనం కాదు.. రుణ న్యాయం కావాలి
శ్రీలంక పార్లమెంటులో జూలై 20న అధ్యక్షుడిగా విక్రమసింఘె ఎన్నిక, కొత్త ప్రధాని గుణవర్దనె నియామకం, ప్రధాని మోదీ వారిని అభినందించటం ఇటీవలి వార్తలు. విక్రమ సింఘె గెలుపు ఖాయమని ముందు రోజునే తేలిపోయిందనీ, గెలుపునకు భారత ప్రభుత్వ సహాయ సహకా రాలున్నాయనీ, ఆ ఇద్దరూ అమెరికా, యూరప్, ఇండియాలకి ఆమోదయోగ్యులే అని విశ్లేషణలు వెలువడ్డాయి. జూలై 19నే కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక ప్రభుత్వానికి పూర్తి సహకారం, ఐఎంఎఫ్ రుణం పొందటానికి తగిన సాయం చేస్తామని విదే శాంగమంత్రి జయశంకర్ చెప్పారు. పనిలోపనిగా ఇక్కడి రాష్ట్రాల రుణాలను, సబ్సిడీలను ఈ సందర్భంగా తప్పుపట్టే రీతిలో వివరించారు. ఇది అప్రస్తుతమనీ, శ్రీలంక ‘దేశం’ అప్పులను ‘రాష్ట్రాల’ అప్పులతో పోల్చి గందర గోళం సృష్టిస్తున్నారనీ, ఆ పేరుతో ఇక్కడ ‘రాజకీయాలు’ చేయటం, పరోక్షంగా రాష్ట్రాలను నిందించటం తగదనీ వివిధ పార్టీలు నిరసన తెలిపాయి. శ్రీలంకకు చెందిన 30 మంది ఆర్థిక, సామాజిక శాస్త్రాల నిపుణులు; మాజీ అధికారులు, విద్యార్థి కార్మిక రైతాంగం మత్స్యకారుల సంఘాల నేతలు అధ్యక్ష ఎన్నిక తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి ముఖ్య కారణం ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్ సావరీన్ బాండ్ (ఐఎస్బీ), అమెరికా, యూరపు దేశాల, ‘బ్లాక్ రాక్’ వంటి కమర్షియల్ రుణాలూ, వారి షరతులే. 2022 మే నెలలో శ్రీలంక రుణాలు 5 వేల కోట్ల డాలర్లు కాగా అందులో సగానికి పైగా పైన పేర్కొన్న రుణ సంస్థల వాటాయే. నిజానికి ఈ ఏడు కట్టాల్సిన రుణం 500 కోట్ల డాలర్లే. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం, వాటివల్ల భారాలు పెరిగి, టీ వంటి ఎగుమతులూ, టూరిజం ఆదాయం తగ్గి, అనేక దేశాల్లాగే శ్రీలంకా దెబ్బతిన్నది. స్వతంత్రం వచ్చాక శ్రీలంకలో బాకీలు తీర్చలేని స్థితికి చేరడం ఇదే మొదటిసారి. కాగా అతిశయోక్తులతో, తప్పుడు సమాచారంతో పై పాశ్చాత్య శక్తులు, వారి మీడియా విదేశీమారకం (డాలర్ల) కొరతనీ ‘దివాళా స్థితిగా చిత్రించి’ రుణదిగ్బంధనం వంటిది చేశారు. మానవాభివృద్ధి సూచికలో పైకి వచ్చిన శ్రీలంకని ప్రస్తుత రుణ సంక్షోభంతో ఇప్పుడు ‘అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం’గా (ఎల్డీసీ) పునర్వర్గీకరించ చూస్తున్నారు. అలాంటి దేశాలకు ఆర్థిక విదేశాంగ వ్యవహారాల్లో అటానమీ, సార్వభౌమాధికారం నిరాకరించబడుతుంది. ఇది నిజంగా దివాళా కాదు, ఇది వారు ‘సృష్టించిన డిఫాల్ట్’. తమ వ్యూహా నికి తగినట్టుగా వారు శ్రీలంక వనరులను, ఆస్తులను, పెట్టుబడులను తగ్గించి చూపి, ఆర్థిక–ద్రవ్య లెక్కలనూ, సూచికలనూ, అల్గారిథమ్స్– మ్యాట్రిసెస్నూ తారుమారు చేస్తున్నార’’నేది ఆ ప్రకటన సారాంశం. శ్రీలంకలో ‘ఆర్థిక ప్రజాస్వామ్య సమష్టి వేదిక’ పేరిట ఉన్న ఈ ప్రకటనలో ఐఎంఎఫ్‌తో కొద్దివారాల క్రితమే మొదలైన చర్చలలో పారదర్శకత బొత్తిగా లేదని ఆరోపించారు. ప్రపంచ సముద్ర రహదారుల్లో కీలక స్థావరంగా ఉన్న శ్రీలంక ‘క్వాడ్’లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ‘కోవిడ్–19 బెయిల్ అవుట్ ఫండ్’ పేరిట అమెరికా ప్రభుత్వం అనేక పేద దేశాలకు రుణాలు ఇచ్చి ఆయా దేశాల సంపదల్ని కాజేయటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్నీ, ప్రాజెక్టుల్నీ... చౌకగా, చాటుగా అమ్మేసే, ప్రైవేటీకరించే రీతిలో స్థానిక వనరుల ఆస్తుల విలువను తగ్గించి చూపుతున్నారనీ; దేశ ఇంధనం, ఆహార భద్రతలనూ, సార్వభౌమత్వాన్నీ బలిపెడుతున్నారనీ ఆరోపించారు. ‘యుగ ఘనవి పవర్ ప్లాంట్’ని ఇప్పటికే అమె రికాకు చెందిన కంపెనీ ‘న్యూఫోర్ట్రెస్’కు కారుచౌకగా కట్ట బెట్టారని ఉదహరించారు. ‘ఇప్పుడు కావల్సింది రుణ ఉపశమనం కాదు, రుణ న్యాయం’ అన్నారు. అర్జెంటీనా, గ్రీస్, లెబనాన్ దేశాల్ని ఉదహరించి, ‘సంక్షోభానికి ఐఎమ్ఎఫ్ కారణమే కాని పరిష్కారం కాజాలదు’ అని చెప్పారు. డాలరు ఏకచ్ఛత్రాధిపత్యాన్ని రద్దు చేసి, వివిధ కరెన్సీల బాస్కెట్‌తో లావాదేవీలు జరపాలనీ... కుబేరులపై పన్నులు వేసి వసూలు చేయాలనీ, ‘స్థానిక ఉత్పత్తుల్ని కొనాలి’ అన్న ఉద్యమాన్ని ప్రోత్సహిం చాలనీ వారు కోరారు. రాజపక్స కుటుంబాల వంటి వాటికాజేసిన ఆస్తులను రాబట్టడం అవసరమే కానీ అంతకు మించి రుణ న్యాయం, రుణాల రద్దు అవసరమని అన్నారు. మొత్తం మీద ఈ ప్రకటన శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితినీ, ప్రజల ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తోంది. (క్లిక్: పై కోర్టుల్లోనూ రిజర్వేషన్లు ఉండాలి) - డా. ఎమ్. బాపూజీ సీఎస్ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త -
అందుకే భారత్‌కు శ్రీలంక పరిస్థితి రాలేదు: రఘురామ్ రాజన్
భారత ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ(RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్)నిల్వలు తగినంత ఉండడంతో పాటు వీదేశి అప్పులు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. అందుకే శ్రీలంక, పాకిస్తాన్లో ఉన్న సమస్యలు దేశంలో లేవని చెప్పారు. ఫారెక్స్ నిల్వల విషయంలో ఆ రెండు దేశాలు పూర్తిగా విఫలమయ్యాయని దీని కారణంగానే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు. రేట్లను పెంచడం గురించి రాజన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఉందని, అది తగ్గించేందుకు ఆర్బీఐ వడ్డీ రేటును పెంచిందన్నారు. ప్రపంచంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, త్వరలో భారత్‌లో కూడా తగ్గుతుందన్నారు. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం జూలై 22తో ముగిసిన వారానికి విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు 571.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2022 మార్చి చివరి నాటికి, భారతదేశం విదేశి రుణం $620.7 బిలియన్లకు చేరుకుంది. జీడీపీ(GDP) నిష్పత్తికి విదేశీ రుణం 2021 మార్చి చివరి నాటికి 21.2 శాతం నుంచి 2022 మార్చి చివరి నాటికి 19.9 శాతానికి తగ్గింది. శ్రీలంకలో వద్ద ఫారెక్స్ నిల్వలు ఇటీవల $50 మిలియన్ల కంటే తక్కువగా పడిపోయాయి. తద్వారా దేశం విదేశీ రుణాలపై చెల్లింపులను నిలిపివేయవలసి వచ్చింది. పాకిస్థాన్‌లోనూ పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ తాజా డేటా ప్రకారం, జూలై 22, 2022తో ముగిసిన వారానికి పాకిస్తాన్ ఫారెక్స్ నిల్వలు $754 మిలియన్లు తగ్గి $8.57 బిలియన్లకు చేరుకున్నాయి. పాలసీ చదవండి: భారత్‌కు ఉబర్ గుడ్‌బై, స్పందించిన సీఈవో -
టీడీపీ హయాంలో తెచ్చినవి దొర అప్పులు అవుతాయా?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తెస్తే అవి దొంగ అప్పులు అవుతాయా? అదే తెలుగుదేశం హయాంలో అప్పులు తెస్తే మాత్రం అవి దొర అప్పులు అవుతాయా? తెలుగుదేశం పక్షాన పనిచేస్తూ బట్టలు విప్పుకు తిరుగుతున్న ఒక పత్రిక రాస్తున్న వార్తలు, కథనాలు గమనిస్తే, జర్నలిజం ఇంత నీచంగా మారిందా అన్న ఆవేదన కలుగుతుంది. రాష్ట్రాల అప్పులపై కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన సమాధానంపై ఈ పత్రిక తీవ్ర అసహనంతో కథనం ఇచ్చింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని, ఏపీ ప్రభుత్వ అప్పుల గురించి సీరియస్‌గా లేదని వాపోయింది.ఏ పత్రిక అయినా రాష్ట్రాలు చేసే అప్పులపై ఒక విధానం కలిగి ఉంటే దానిని సంపాదకీయంలో రాయవచ్చు. లేదా ఆర్టికల్స్ ద్వారా తెలియచేయవచ్చు. లేదా నిజంగానే ఏ రాష్ట్రం అయినా నిబంధలకు విరుద్దంగా అప్పులు తెస్తే ఆ విషయాన్ని చెప్పవచ్చు. కాని అసలు ఏ ప్రభుత్వం అయినా నిబందనలతో నిమిత్తం లేకుండా ఎలా అప్పులు తేగలుగుతుంది. అసాధారణ పరిస్థితులలో తప్ప కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవకాశం ఇస్తుందా? బ్యాంకులు ఏ ఆధారం లేకుండా రుణాలు ఎలా ఇస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసే రుణాలు కాకుండా కార్పొరేషన్ లు, ప్రత్యేక వాహక సంస్థల ద్వారా చేసే అప్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని , తద్వారా రుణ పరిస్థితిపై , తద్వారా వచ్చే ఇబ్బందులపై విశ్లేషించవచ్చు. కాని దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నా, ఏపీ ప్రభుత్వమే అప్పులు చేస్తున్నట్లు, దానివల్ల రాష్ట్రం దివాళా తీస్తోందని ప్రచారం చేయడం దారుణంగా ఉంటుంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఆర్ధిక సంస్థలతో ఒప్పందం అయి సుమారు ఎనభైవేల కోట్ల రుణం తీసుకుంది. అది కరెక్టా?కాదా అన్నదానిపై ఈ టీడీపీ మీడియా నోరు ఎత్తడం లేదు. తెలంగాణ అనేకాదు.అనేక రాష్ట్రాలు కార్పొరేషన్లు ,ఎస్ పి వి ల ద్వారా రుణాలు సేకరిస్తున్నాయి. మిగిలినవాటి సంగతి ఎలా ఉన్నా ఎపికి మాత్రం అప్పు పుట్టకూడదన్న తపనతో ఉన్న ఆ వర్గం మీడియా దారుణమైన కథనాలు రాయడానికి వెనుకాడడం లేదు. టీడీపీ మీడియా గా పేరొందిన ఈనాడుతో సహా మరికొన్ని మీడియా సంస్థలు ఏపీ ప్రభుత్వం అప్పు ఎనిమిది లక్షల కోట్లు అని ప్రచారం చేశాయి. కార్పొరేషన్ల అప్పులను కూడా బడ్జెట్ రుణాలుగా లెక్కించాలని కేంద్రం చెప్పిందని ఒకసారి, కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిందని మరోసారి, ఇలా రకరకాల వార్తలతో ప్రజలలో గందరగోళం సృష్టించే యత్నం చేశాయి. నిజానికి కేంద్రం ఏదో ఒక రాష్ట్రానికే ఇలాంటి లేఖలు రాయలేదు. అన్ని రాష్ట్రాలకు కలిపి లేఖ రాసింది. కాని దానిని ఏపీకి మాత్రమే పరిమితం చేసి దుష్ప్రచారం చేశారు. తీరా పార్లమెంటులో ఏపీ అప్పు 3.98 లక్షల కోట్లేనని తేల్చడంతో ఈ మీడియాకు మింగుడు పడడం లేదు. అందుకే ఆ అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కార్పొరేషన్ ల రుణాలను కూడా ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారన్న విషయాన్ని శీర్షికలలో పెట్టి సంతృప్తి చెందారు. నిజమే. ఏ ప్రభుత్వం అయినా తన శక్తి మేరకే అప్పులు చేయాలి. పిండి కొద్ది రొట్టె అంటారు. అలాగే కేంద్రం కాని ,ఆర్బీఐ కాని, లేదా ఆయా బ్యాంకులు కాని ఇలాంటి విషయాలన్నిటిని పరిగణనలోకి తీసుకునే అప్పులను అనుమతిస్తాయి. కొన్ని సార్లు ప్రత్యేక వాహక సంస్థ ద్వారా రుణాలు తీసుకుంటారు. అది గత టీడీపీ ప్రభుత్వంలోనూ జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలోను జరుగుతుండవచ్చు. కాని అదేదో జరగకూడనిది జరిగిపోయినట్లు ఈ మీడియా ప్రచారం చేసింది. గత ప్రభుత్వం రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని దానిని పసుపు-కుంకుమ స్కీమ్ కు మళ్లించింది. అలాగే పౌర సరఫరాల సంస్థ ద్వారా సేకరించిన రుణాలను కూడా ఇతర అవసరాలకు మళ్లించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు. అమరావతి అబివృద్ది బాండ్ల పేరుతో ప్రత్యేక అనుమతి పొంది పదిశాతం వడ్డీకి రుణాలను తెచ్చిన ఘనత కూడా గత ప్రభుత్వానిదే. అప్పుడు ఇవే పత్రికలు అబ్బో చంద్రబాబు కాబట్టి ఆ రుణాలు వచ్చాయని ప్రచారం చేశాయి. అంతే తప్ప..ఎందుకీ అడ్డగోలు అప్పులు, ఇంత వడ్డీ ఏమిటి అని ప్రశ్నించలేదు. ఇటీవల ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ ద్రవ్యలోటు రెండు శాతానికి తగ్గిన వైనాన్ని వివరించారు. అదే చంద్రబాబు టైమ్‌లో ఇది రెట్టింపు లోటుగా ఉన్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం పరిమితి తీసుకున్న అప్పులు పదహారు వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రం కోత పెట్టింది.దానిపై జగన్ అభ్యంతరం కూడా చెప్పారు. ఇంత జరిగినా, ఇప్పుడే పరిమితి మించి అప్పులు తీసుకుంటున్నారని, చంద్రబాబు టైమ్ లో అంతా చక్కగా జరిగిపోయినట్లు గా కలరింగ్ ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లపాటు కరోనా పట్టి పీడించింది. దానిని తట్టుకోవడానికి అప్పులు తీసుకోవాలని కేంద్రమే సూచించింది. ఇక గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన వేలాది కోట్ల రూపాయల బాకీల బాధ్యత ఈ ప్రభుత్వంపై పడింది. ఇవేవి గమనంలోకి తీసుకోకుండా టీడీపీ మీడియా విష ప్రచారం చేసింది.వారికి పూర్తి నిరాశ కలిగించే రీతిలో కేంద్రం సమాధానం ఉండడంతో ఇప్పుడు కేంద్రంపైనే విమర్శలు కురిపిస్తూ ఒక పత్రిక రోదించింది. కేంద్రం ఏపీపై ఏ చర్య తీసుకోవడం లేదని , హెచ్చరికలు డ్రామాలే అంటూ ఏడ్చి మొత్తుకుంది. కేంద్రానికి రాష్ట్రం తప్పుడు లెక్కలు ఇస్తోందని కూడా ఆరోపించింది. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి వైసీపీ మద్దతు ఇచ్చాక వాటిని కేంద్రం పట్టించుకోవడం లేదని రాసింది. ఇదంతా వారి కుళ్లు బుద్ది తప్ప మరొకటి కాదు.టీడీపీ హయాంలో జరిగినవన్నీ దొర అప్పలా. పరిమితి మించి చేసిన అప్పులపై ఆనాడు కేంద్రం ఏ చర్య ఎందుకు తీసుకోలేదు? తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణాలు తీసుకోవడమే కష్టంగా ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. అలాంటి సమయంలో జగన్ ప్రభుత్వం సమర్దంగా నిధులు సమకూర్చుకుని తను అనుకున్న స్కీములను అమలు చేసి ప్రజల ఆదరణ పొందుతోందన్నదే ఈ టీడీపీ మీడియా బాధ తప్ప మరొకటికాదు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అసభ్యకర మెసేజ్‌లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా అసభ్య మెసేజ్ పంపతూ.. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నటి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. అమీర్‌పేట, నాగార్జునానగర్ కాలనీలో ఉంటున్న నటి (42) కు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ పదిహేనేళ్లుగా పరిచయం. ప్రవీణ్ భవనాలు నిర్మించే బిల్డర్. 8 ఏళ్ల క్రితం ఆమె వద్ద రూ. 47 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. బాధితురాలు అపార్ట్మెంట్లో ఉండే మరో మహిళ వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి -
అప్పు దొరక్క ఇద్దరు.. తీరక మరో ఇద్దరు..
నార్నూర్(గాదిగూడ)/టేకుమట్ల/న్యాల్కల్/కెరమెరి: వానాకాలం పంటల సాగుకి పెట్టుబడి అప్పు దొరకలేదని ఇద్దరు, అప్పులు తీర్చే మార్గం కానరాక మరో ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఒకరు మహిళారైతు కావడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖడ్కి గ్రామానికి చెందిన మాడవి మారు(50)కు 8 ఎక రాల భూమి ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కూ తుళ్లు, కొడుకు ఉన్నారు. గతేడాది పెద్ద కూతురు పెళ్లి కోసం అప్పు చేశాడు. మరోవైపు నిరుడు అధికవర్షాలతో పంట దిగుబడి ఆశించిన మేర రాలేదు. ఇదివరకే బ్యాంకు నుంచి రూ.లక్ష పంట రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం మాఫీ చేస్తుందని తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు కొత్త రుణం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈ వానాకాలం సాగు నిమిత్తం విత్తనాలు కొనేందుకు మళ్లీ అప్పు కోసం ప్రయత్నించగా ఎక్కడా లభించలే దు. దీంతో మనస్తాపం చెందిన మారు గురువారం తెల్లవారుజామున తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం తుమ్మగూడకు చెందిన రాథోడ్ మోహన్(45) తనకున్న నాలుగెకరాల్లో పతి సాగు కోసం గతేడాది రూ.2 లక్షల అప్పు తెచ్చాడు. దిగుబడి రాకపోవడంతో అప్పులు చెల్లించలేదు. ఈసారి పెట్టుబడి నిమిత్తం ఎక్కడ తిరిగినా అప్పు పుట్టలేదు. ఇదే విషయం భార్య శారదాబాయితో చెబుతూ మథనపడ్డాడు. బుధవారంరాత్రి ఇంట్లో అందరూ నిద్రించాక 11 గంటల ప్రాంతంలో పురుగులమందు తాగాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రూ. 10 లక్షల వరకు అప్పులయ్యాయని.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన గంధం రజిని(35), రాంనారాయణ దంపతులు. పెళ్లయి 16 ఏళ్లు దాటినా వారికి సంతానం కలగలేదు. భర్త కారోబార్‌గా పనిచేస్తున్నాడు. రజిని తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తోంది. ఈసారి పత్తి దిగుబడి సరిగా రాలేదు. దీనికితోడు అప్పులు సుమారు రూ.10 లక్షల మేర పెరిగిపోయాయి. అప్పులు పెరిగిపోవడం, పిల్లలు కలగకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల 24న ఇంట్లో పురుగుల మందు తాగింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందింది. మెదక్ జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్ గ్రామానికి చెందిన ధనవంత్రెడ్డి(60)కి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూతుళ్ల వివాహాల కోసం అప్పు చేశాడు. తనకున్న ఎకరంన్నర పొలంలో పంటలు అంతంత మాత్రంగానే పండటంతో కుటుంబపోషణ కూడా భారంగా మారింది. అప్పులు తీర్చే మార్గం లేక జీవితంపై విరక్తి చెంది గురువారం సాయంత్రం మెటల్‌కుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. -
అప్పులు తీర్చాలంటూ భర్త వేధింపులు..
బోయినపల్లి(చొప్పదండి): అత్తింటి వేధింపులకు మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇంటి అవసరాలకు చేసిన అప్పులు తీర్చాలం టూ భర్త, అత్తమామలు వేధించడంతో ఇద్దరు కుమారులతో కలసి తల్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో గురువారం ఈ సంఘటన జరిగింది. బోయినపల్లికి చెందిన బొజ్జ అనూష (23) పోతర్ల మహిపాల్ ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మోక్షిత్ (3), మణి (18 నెలలు) అనే కుమారులు ఉన్నారు. కుటుంబ అవసరాలకు రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ నేపథ్యంలో జీవనోపాధికి మహిపాల్ ఇటీవల గల్ఫ్ వెళ్లా డు. అనూష ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దనే ఉంటోంది. కాగా, అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వస్తుండడంతో వాటిని అనూషనే తీర్చాలంటూ అత్తామామలు సత్తవ్వ–లచ్చయ్యతోపాటు గల్ఫ్‌లో ఉంటున్న భర్త మహిపాల్ ఫోన్లో వేధించారు. దీంతో మానసిక వేధింపులు భరించలేక అనూష కుమారులు మోక్షిత్, మణిలతో కలసి గ్రామ సమీపంలోని వ్యవసాయబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. బుధవారం రాత్రి అప్పుల విష యంపై ఇంట్లో గొడవ జరిగినట్లు సమాచారం. తన కూతురు అనూష, మనుమలు మోక్షిత్, మణిల చావుకు కారకులైన అత్త పోతర్ల సత్తవ్వ, మామ పోతర్ల లచ్చయ్య, భర్త మహిపాల్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అప్పిచ్చి.. ఆందోళన చేసి.. ప్రాణాలు పోగొట్టుకుని..
శంకరపట్నం: ప్రాణస్నేహితుడని డబ్బు అప్పిస్తే.. అతను తిరిగి ఇవ్వలేదు సరికదా.. తిరిగి అడిగితే.. ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. డబ్బు కోసం ఆందోళన చేపట్టిన బాధితుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన ఈరెల్లి సంపత్, శనిగరపు సతీశ్ ప్రాణస్నేహితులు. సంపత్ 2020లో సతీశ్‌కు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. 2021లో తిరిగి డబ్బులు అడిగితే రూ.3 లక్షలు చెల్లించి మిగతా రూ.7 లక్షలు ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ క్రమంలో సంపత్ అనారోగ్యానికి గురయ్యారు. వైద్యానికి డబ్బులు అవసరం కావడంతో కిడ్నీవ్యాధితో బాధపడుతూనే బాకీ డబ్బుల కోసం సతీశ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సతీశ్ బాకీ డబ్బులు ఇవ్వకుండా, ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో వెళ్లిపోయినప్పటికీ సంపత్ అక్కడే 12 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కాగా, పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం మెట్పల్లి గ్రామానికి వచ్చారు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సతీశ్ కోసం సాయంత్రం వరకు వేచిచూశారు. అప్పటికీ రాకపోవడంతో సతీశ్ ఇంటి ఎదుటే మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే హుజూరాబాద్ రూరల్ సీఐ జనార్దన్ మృతుడి కుటుంబసభ్యులకు నచ్చజెప్పడంతో వారు ఆ ప్రయత్నం మానుకున్నారు. జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మృతుడి భార్య లలిత.. శనిగరపు సతీశ్, మరికొందరిపై ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మల్లారెడ్డి తెలిపారు. -
ఫైనాన్స్‌పీర్ 31 మిలియన్ డాలర్ల సమీకరణ!
హైదరాబాద్: ఎడ్యు–ఫిన్‌టెక్ స్టార్టప్ ఫైనాన్స్‌పీర్ .. సిరీస్ బీ ఫండింగ్‌లో భాగంగా 31 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆవిష్కార్ క్యాపిటల్, అమెరికాకు చెందిన క్యూఈడీ ఇన్వెస్టర్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులు సేకరించినట్లు సంస్థ తెలిపింది. కోవిడ్–19 విజృంభించిన 2020లో కూడా 3 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నట్లు .. మహమ్మారి ప్రభావంతో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులకు తోడ్పాటు అందించినట్లు ఫైనాన్స్‌పీర్ సీఈవో రోహిత్ గజ్భియె తెలిపారు. -
నిధుల బాటలో ఐనాక్స్ విండ్..ఎన్ని వందల కోట్లంటే!
న్యూఢిల్లీ: విండ్ ఎనర్జీ సంస్థ ఐనాక్స్ విండ్ నిధుల సమీకరణ బాట పట్టింది. ఈక్విటీ షేర్ల, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 402.5 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ప్రిఫరెన్షియల్ మార్గంలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ప్రమోటర్లు రూ. 150 కోట్లు సమకూర్చనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ప్రమోటరేతర విదేశీ కంపెనీ సమేనా గ్రీన్ లిమిటెడ్ ప్రిఫరెన్షియల్ షేర్లు, మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 153 కోట్లు అందించనున్నట్లు పేర్కొంది. ఇదే విధంగా లెండ్ లీజ్ కంపెనీ ఇండియా సైతం రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. -
ధరల దాడిని ఇలా ఎదుర్కోండి..!
ఈక్విటీకి హెడ్జింగ్ అన్ని రకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం రిస్క్ ఉంటుంది. ఈక్విటీలు సైతం అందుకు అతీతం కాదు. కంపెనీల వ్యాపారాలపైనా ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుందని గుర్తించాలి. ద్రవ్యోల్బణం వల్ల కంపెనీలకు ముడి సరుకుల ధరలు పెరిగిపోతాయి. దీనివల్ల తయారీ కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతాయి. అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయాల్లో పరిశీలించినప్పుడు.. 2009–10లో నిఫ్టీ 50 కంపెనీల (ఫైనాన్షియల్ కంపెనీలు మినహా) ఎబిట్డా 19.86 శాతంగా ఉంటే, 2013–14 నాటికి 16.31 శాతానికి క్షీణించింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తర్వాత నెలకొన్న పరిస్థితులు ఇందుకు దారితీశాయి. ఆ సమయాల్లో వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా క్షీణిస్తుంది. దాంతో అవసరమైన కొనుగోళ్లకు పరిమితమై.. అనవసరపు ఖర్చును నియంత్రించుకునేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తారు. దాంతో కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. కనుక ద్రవ్యోల్బణం కొన్ని కంపెనీలకు ప్రతికూలిస్తే.. కొన్ని కంపెనీలకు అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. కనుక పెట్టుబడుల్లో వైవిధ్యమైన కంపెనీలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సహజంగానే హెడ్జింగ్ (రక్షణ) ఉండేలా చూసుకోవచ్చు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కొన్ని రకాల థీమ్‌లను పరిశీలించొచ్చు. రెండేళ్ల క్రితం 2020 మార్చిలో సన్ ఫ్లవర్ నూనె లీటర్ రూ.85. రెండు నెలల క్రితం రూ.120. ఇప్పుడు రూ.180–200కు పైనే. 2019 జూలైలో పెట్రోల్ లీటర్ ధర రూ.73. 2020 జూన్‌లో రూ.80. 2021 జూలైలో రూ.100. 2022 ఏప్రిల్‌లో రూ.120. ఇలా నిత్యావసరాల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీన్నే ద్రవ్యోల్బణంగా చెప్పుకోవాలి. కరెన్సీ విలువను తినేసే చెద పురుగు ఇది. పెట్టుబడికి రాబడి తోడైనప్పుడే సంపదగా మారుతుంది. ఈ క్రమంలో పెట్టుబడి విలువను హరించే ద్రవ్యోల్బణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోని అంశం ఇది. ఇంటి నిర్మాణం అప్పుడే చెక్కకు చెద పట్టకుండా కెమికల్ కోటింగ్ వేయిస్తాం. అలాగే, పెట్టుబడి చేస్తున్నప్పుడే ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా యోచించాలి. ప్రస్తుతం ప్రపంచదేశాలు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో నిత్యావసరాల ధరలు రెక్కలు విప్పుకున్నాయి. దీనికంటే ముందు కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ధరల ఒత్తిళ్లకు దారితీశాయి. అధిక ద్రవ్యోల్బణం నికర రాబడిని తగ్గించేస్తుంది. కనుక ప్రతి ఇన్వెస్టర్‌కు పెట్టుబడితోపాటు, ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా తెలుసుకోవాలి. అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. 2002, 2013, 2016, 2018లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా నమోదైంది. గత 20 ఏళ్ల కాలంలోని సగటు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో నికర రాబడి 6.5 శాతానికి పైనే ఉంటేనే పెట్టుబడి ఫలితమిచ్చినట్టు. ఈక్విటీల కంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో (డెట్) ఇన్వెస్ట్ చేసే వారిపై ద్రవ్యోల్బణ కాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్థిరాదాయ పథకాల్లో రాబడికి, ద్రవ్యోల్బణానికి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. 2008 నుంచి 2013 మధ్య అధిక ద్రవ్యోల్బణం సమయంలో 10 ఏళ్ల సావరీన్ బాండ్ నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని గమనించాలి. కనుక పెట్టుబడులపై ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించినప్పుడే అధిక ప్రయోజనం. ద్రవ్యోల్బణం అంచనాలు.. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోరుకునే వారు ముందుగా మధ్య కాలానికి అది ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు రావాలి. 1960నుంచి వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎన్నో సందర్భాల్లో రెండంకెల స్థాయిలో నమోదైంది. 1973–74, 1980–81, 1991–92 సంవత్సరాల్లో సగటు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్లో కొనసాగింది. ఆయా కాలాల్లో చమురు ధరలు గణనీయంగా పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణం సెగలకు నేపథ్యంగా ఉన్నాయని చెప్పుకోవాలి. 1970ల్లో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం.. 1980, 1990ల్లో గల్ఫ్ యుద్ధం, ఇరాక్‌పై కువైట్ దురాక్రమణ వంటివన్నీ ధరల్లో అస్థిరత్వానికి దారితీశాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత 2008–2013 మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 11.06 శాతం వరకు వెళ్లింది. సగటున 9.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులతో ద్రవ్యోల్బణం మరింత పైపైకి వెళ్లొచ్చన్న అంచనాలున్నాయి. చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు పైనే ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.5–6 శాతం మధ్య ఉండొచ్చని చాలా మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నోమురా అయి తే 6.3%గా అంచనా వేసింది. ద్రవ్యో ల్బణం తగిన అంచ నాలతోనే పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, రక్షణ ఎలా కల్పించుకోవాలన్న అంశంపై స్పష్టత సాధ్యపడుతుంది. బంగారంతో రక్షణ ఉంటుందా? బంగారం ధరలు ద్రవ్యోల్బణంతోపాటే పెరుగుతాయన్న ఒక నమ్మకం ఉంది. కానీ, అన్ని వేళలా ఇదే ధోరణి ఉంటుందని చెప్పలేం. బంగారం డిమాండ్ అన్నది ప్రధానంగా ఇన్వెస్టర్లు, ఆభరణాల కొనుగోలుదారులపై ఆధారపడి ఉంటుంది. ధరలు పెరుగుతున్నప్పుడు స్వల్ప కాలంలో ఆ ప్రయోజనం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తారు. కానీ, అధిక ధరల కారణంగా వినియోగదారుల నుంచి ఆభరణాలకు డిమాండ్ తగ్గుతుంది. ధరలు తగ్గుతున్నప్పుడు బంగారం ఆభరణాలకు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆ సమయంలో పెట్టుబడులకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకు రారు. బంగారాన్ని దీర్ఘకాల పెట్టుబడి సాధనంగా పరిగణించే వారు చాలా తక్కువ. దాన్ని ట్రేడింగ్, స్వల్పకాల హెడ్జింగ్ సాధనంగానే ఎక్కువ మంది పరిగణిస్తుంటారు. ఈ ధోరణి కారణంగా బంగారం అన్నది ద్రవ్యోల్బణం హెడ్జింగ్‌కు సంబంధించి ప్రభావవంతమైన సాధనంగా కాబోదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల్లో బంగారం ధరలు పెరుగుతుంటాయి. పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యం దృష్ట్యా ఒక పెట్టుబడి సాధనంగాను బంగారాన్ని చూడొచ్చు. ఇతర సాధనాలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో బంగారం నుంచి సానుకూల రాబడి అందుకోవచ్చు. కనుక పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు. స్థిరాదాయ పెట్టుబడులు (డెట్) డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ద్రవ్యోల్బణం తీరుపై ఎప్పుడూ కన్నేసి ఉంచాల్సిందే. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని బట్టే వడ్డీ రేట్ల గమనం ఆధారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టలు తెంపుకుని వెళుతున్న తరుణంలో దీన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు కీలక విధాన రేట్ల పెంపు బాటలో వెళ్లాల్సి వస్తుంది. ఇతరత్రా ఏ చర్యలు తీసుకున్నా కానీ, రేట్ల పెంపును చేపట్టక తప్పదు. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉంటే, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. దీంతో సమీప భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంకు రేట్ల పెంపు చేపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బాండ్ల ఈల్డ్స్ పెరిగి, వాటి ధరలు తగ్గుతాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 7 నుంచి 7.5 శాతానికి చేరొచ్చని అంచనా. యూఎస్ ఫెడ్ కూడా రేట్ల పెంపు విషయంలో దూకుడుగానే ఉంది. ఈ ఏడాది చివరికే 2 శాతానికి చేర్చాలన్న అంచనాలతో ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడికి కూడా కలసి సావరీన్ బాండ్ల ఈల్డ్స్ పెరిగేందుకు దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి? ఈ సమయంలో స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాల బాండ్లను ఎంపిక చేసుకోవడం సరైనది. దీనివల్ల రేట్ల పెరుగుదల నుంచి ప్రయోజనం పొందొచ్చు. పెట్టుబడులు స్వల్పకాలంలోనే మెచ్యూరిటీకి వస్తాయి కనుక వాటిని తిరిగి అధిక రేట్లపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిపై ఫిక్స్డ్ డిపాజిట్‌కే పరిమితం కావాలి. రేట్ల పెంపు ముగిసే వరకు స్వల్పకాల బాండ్లనే నమ్ముకోవడం సరైనది. రేట్ల పెంపు ముగిసిన తర్వాత మూడేళ్ల కాలానికి పెట్టుబడులు పరిశీలించొచ్చు. 2023 లేదా 2024లో రేట్ల పెంపు ముగిసే అవకాశం ఉంది. ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్లకూ ఇదే వర్తిస్తుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు (రిస్క్ తీసుకోని) లిక్విడ్ లేదా మనీ మార్కెట్ ఫండ్స్‌కు పరిమితం కావాలి. స్వల్పకాలంలో పెరిగే రేట్ల నుంచి వీటికి ప్రయోజనం ఉంటుంది. అధిక రిస్క్ తీసుకునే వారు కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇక్కడ క్రెడిట్ రిస్క్ ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో, వడ్డీ రేట్లు పెరిగే సమయాల్లో ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ అనుకూలం. వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించే బాండ్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఒకే విడత పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్ 2020ను ఎంపిక చేసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం 7.15 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ రేటు సవరణకు లోనవుతుంది. దీని కాల వ్యవధి ఏడేళ్లు. ప్రభుత్వ హామీతో వచ్చే మెరుగైన సాధనం ఇది. ఆరు నెలలకోసారి వడ్డీ రేటు చెల్లింపు ఉంటుంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి కూడా అనుకూలం. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకుంటామనుకునే వారు.. పీపీఎఫ్‌ను కూడా పరిశీలిం చొచ్చు. ఇందులో ప్రస్తుతం 7.1 శాతం రేటు అమల్లో ఉంది. మార్కెట్ లీడర్స్ మోట్ (వ్యాపార బలాలు) ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పెరిగిన ధరలను వినియోగదారులకు బదిలీ చేయగలవు. ధరలను పెంచినా ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవలను వినియోగదారులు పక్కన పెట్టలేని విధంగా వాటికి ఆదరణ ఉంటుంది. కనుక ఆయా కంపెనీల లాభాలు అంతగా ప్రభావితం కావు. నిఫ్టీ50 సూచీలోని కంపెనీల లాభాలు వార్షికంగా 9 శాతం చొప్పున 2010–2014 మధ్య (అధిక ద్రవ్యోల్బణ కాలం) పెరగడాన్ని గమనించొచ్చు. అంటే లాభాల మార్జిన్లపై ఒత్తిడి ఉన్నా కానీ అవి వృద్ధిని నమోదు చేయగలిగాయి. కన్జ్యూమర్ నాన్ డిస్క్రీషనరీ ద్రవ్యోల్బణం గరిష్టాలకు చేరినప్పుడు వినియోగదారులు విలాస ఉత్పత్తుల కొనుగోలు తగ్గించుకుంటారే కానీ, కన్జ్యూమర్ స్టాపుల్స్ను తగ్గించుకోలేరు. 2011–12లో 28.5%, 2012–13లో 25.3% చొప్పున బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభాల్లో వృద్ధిని చూపించింది. ఆ సమయం లో రిటైల్ ద్రవ్యోల్బణం 10% మేర ఉంది. అదే సమయంలో బజాజ్ ఆటో ఆదాయంలో 10% వృద్ధి చూపించినా, లాభాల పెరుగుదల 1.3 శాతమే. కమోడిటీ స్టాక్స్ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కమోడిటీ స్టాక్స్‌లో పెట్టుబడులు కూడా పోర్ట్‌ఫోలియోకు రక్షణనిస్తాయి. ఆ సమయంలో ముడి చమురు, ఇతర కమోడిటీల ధరలు పెరిగిపోతాయి. దీంతో ఆయా కంపెనీల లాభాలు కూడా గణనీయ వృద్ధిని చూస్తాయి. ప్రభుత్వరంగ చమురు కంపెనీలపై ప్రభుత్వం నుంచి కొంత నియంత్రణ ఉంటుంది. అలాగే, ప్రభుత్వరంగ మెటల్ కంపెనీల పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ మెటల్ కంపెనీలైన హిందాల్కో, వేదాంత తదితర కంపెనీలు అధిక ద్రవ్యోల్బణం సమయాల్లో మంచి పనితీరు చూపిస్తుంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్లు) ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల హెడ్జింగ్ సాధనంగా రీట్లను కూడా ఫండ్ మేనేజర్లు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇవి ఆదాయాన్ని ఆర్జిస్తూ డివిడెండ్ రూపంలో ఆ మొత్తాన్ని వాటాదారులకు పంపిణీ చేస్తుంటాయి. కాలానుగుణంగా వీటి నిర్వహణలోని ప్రాజెక్టుల విలువ పెరుగుతుంది. అద్దె అదాయం కూడా పెరుగుతుంది. దీంతో ఎప్పటికప్పుడు డివిడెండ్ ఆదాయానికి తోడు.. పెట్టుబడి వృద్ధిని కూడా ఇన్వెస్టర్లు చూడొచ్చు. ప్రసు ్తతం మన స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయిన రీట్ల సగటు డివిడెండ్ రాబడి 4–6% మధ్య ఉంది. -
అప్పు వంకతో నీచమైన పనులు
తనకు బాకీ పడ్డ సొమ్మును తీర్చేందుకు ఓ అమ్మాయికి దారుణమైన పనిని అప్పగించింది ఓ యువతి. ఒకరోజులో 17 మందితో.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితురాలు ఆ పని చేసింది. విషయం బాధితురాలి తల్లిదండ్రుల దృష్టికి చేరడంతో.. కోర్టుకు చేరుకుంది ఈ అఘాయిత్యం. ఇంగ్లండ్‌లో వ్యభిచారం చట్టవిరుద్ధమైన చోట ఎస్కార్ట్ ఏజెన్సీలు వెలుస్తుంటాయి. డబ్బు తీసుకుని క్లయింట్లకు తోడును అందించడం ఈ ఏజెన్సీల పని. అలాంటి ఏజెన్సీలో పనిచేస్తోంది 23 ఏళ్ల జార్జియా అలియాస్ టైలర్ జో వాకర్. ఇన్స్టాగ్రామ్ ద్వారా సదరు టీనేజర్‌తో పరిచయం పెంచుకుంది. ఆపై ఆర్భాటాల ద్వారా ఆ టీనేజర్‌ను ఎట్రాక్ట్ చేసింది. సుందర్ల్యాండ్లోని తన అపార్ట్‌మెంట్‌కు రావాల్సిందిగా యువతిని ఆహ్వానించింది. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరింది సదరు యువతి. ఇందుకోసం ట్యాక్సీ, ఇతర ఖర్చులను కూడా వాకరే భరించింది. ఆపై యువతిని అభ్యంతరకరంగా చిత్రీకరించింది. ఆపై యువతి వయసును 18 ఏళ్లుగా చెబుతూ.. ఫొటోలతో సహా ఎస్కార్ట్ఏజెన్సీ ప్రొఫైల్‌లో అప్లోడ్ చేసింది. దీంతో క్లయింట్లు వాకర్ ఇంటికి రాగా.. యువతి భయంతో పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే బాకీ తీర్చకపోతే వ్యక్తిగత ఫొటోల్ని బయటపెడతానని బెదిరించింది వాకర్. పైగా తాను చెప్పినపని చేస్తే తక్కువ టైంలో బోలెడంత డబ్బు వస్తుందని టీనేజర్‌కు ఆశపెట్టింది. అలా రెండు వారాల్లో 30 మందితో బలవంతంగా చేయికూడని పనులు చేయించింది. వచ్చిన సొమ్ములో 700 పౌండ్లను వాకర్ తీసుకోగా.. 3000 పౌండ్లు మాత్రం యువతికే ఇచ్చింది. దీంతో మురిసిపోయిన యువతి లగ్జరీ ఐటెమ్స్‌తో ఇంటికి చేరుకుంది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. అసలు విషయం ఆరా తీయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. నేరం ఒప్పుకున్న వాకర్‌కు 16 నెలల జైలు శిక్ష, అక్కడి చట్టాల ప్రకారం.. నిరుద్యోగ భృతి కింద అందాల్సిన వేతనంలోనూ రెండేళ్లపాటు కోత విధిస్తున్నట్లు న్యూక్యాజిల్ క్రౌన్ కోర్టు Newcastle Crown Court తీర్పు ఇచ్చింది. అంతేకాదు వాకర్‌ను మరోసారి వ్యభిచారం వైపు మళ్లకుండా చూడాలంటూ ఆమె తరపు న్యాయవాదిని జడ్జి ఆదేశించింది. -
ఆలుమగలను మింగిన అప్పులు
మహబూబాబాద్ రూరల్: అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందారు. దీంతో వారి ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం శివారు బోడతండాలో సోమవారం ఈ విషాదం జరిగింది. బోడతండాకు చెందిన కౌలురైతు బోడ సిరి మూడెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేయగా నష్టం వచ్చింది. రూ.6 లక్షల అప్పు, వడ్డీ రూ.4 లక్షలు కలుపుకుని మొత్తం రూ.10 లక్షలు కుటుంబానికి భారమయ్యాయి. దీంతో సిరి ఈ నెల 14న తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. అంతకుముందే జనవరి 31న సిరి భార్య బోడి (34) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందింది. కాగా, తన కుమార్తె మృతికి భర్త సిరి, బావ లింగ్యా కారణమని బోడి తండ్రి బానోత్ మత్రు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిరి బాగా తాగివచ్చి గొడవ చేస్తుండగా వద్దన్నందుకు లింగ్యా, సిరి కలిసి గడ్డి మందులో యాసిడ్ కలిపి బోడికి తాగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పీకల్లోతు అప్పుల్లో అగ్రరాజ్యం అమెరికా..!
అగ్రరాజ్యం అమెరికాకు ఉన్న అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత అగ్రరాజ్యం అమెరికా పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఆ దేశ ట్రెజరీ డిపార్ట్ మెంట్ వెల్లడించిన డేటా ప్రకారం.. ఆ దేశ మొత్తం ప్రభుత్వ రుణ బకాయిలు ఇప్పుడు 30 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నుంచి బయట పడటానికి అమెరికా ఎక్కువగా ఖర్చు చేయడంతో ప్రభుత్వ రుణాలు భారీగా పెరిగాయి. 2019 చివరి నుంచి ఇప్పటి వరకు జాతీయ రుణం సుమారు 7 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది. ఆ దేశ ఆర్థికవేత్తలు ఇది నిజంగా అతి పెద్ద సమస్య అని అంటున్నారు."ఇది స్వల్పకాలిక సంక్షోభం కాదు, కానీ మేము దీర్ఘకాలంలో పేదవారిగా ఉండబోతున్నామని అర్థం" అని ప్రపంచ ప్రధాన వ్యూహకర్త డేవిడ్ కెల్లీ అన్నారు. వడ్డీ ఖర్చులు మాత్రమే రాబోయే 10 సంవత్సరాలలో $5 ట్రిలియన్లను అధిగమిస్తుందని అంచనా వేశారు. ఇది 2051 నాటికి మొత్తం ఫెడరల్ ఆదాయంలో దాదాపు సగం ఉంటుందని పీటర్ జి. పీటర్సన్ ఫౌండేషన్ సంస్థ తెలిపింది. పెరుగుతున్న రుణ ఖర్చుల వల్ల వాతావరణ మార్పు వంటి ప్రధాన ప్రాధాన్యతలపై అమెరికా చేసే ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నట్లు కెల్లీ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ ప్రభుత్వం ఇప్పుడు జపాన్ & చైనా నేతృత్వంలోని విదేశీ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు దాదాపు 8 ట్రిలియన్ డాలర్లు బకాయి పడింది. (చదవండి: కష్టకాలంలో శ్రీలంకకు అండగా భారత్..!) -
Telangana: అప్పు 41 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 40 వేల కోట్ల మార్కును దాటనుంది. గత డిసెంబర్ నాటికే రూ. 39 వేల కోట్ల రుణాలను తీసుకున్న ప్రభుత్వం.. మంగళవారం మరో రూ. 2 వేల కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా రూ.2 వేల కోట్ల విలువైన బాండ్లను వేలం వేయనుంది. దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన మొత్తం రూ.20,659 కోట్ల విలువైన బాండ్ల వేలానికి ఆర్బీఐ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ మేరకు మంగళవారం జరిగే వేలంలో 12 సంవత్సరాల కాలపరిమితి గల రూ.2 వేల కోట్ల విలువైన రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను వేలం వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఆర్థిక పరపతి మెండుగానే ఉన్న మన రాష్ట్ర బాండ్ల వేలం సులభంగా జరిగిపోతుందని, రూ.2 వేల కోట్ల సమీకరణ పెద్ద కష్టమేం కాదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. గత అక్టోబర్ నాటికి రూ. 28 వేల కోట్ల అప్పు కాగ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ. 28,349 కోట్లను ప్రభుత్వం బహిరంగ రుణాల ద్వారా సేకరించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ అప్పు రూ.39 వేల కోట్లకు చేరింది. ఇప్పుడు రూ.2 వేల కోట్ల బాండ్ల వేలంతో రూ.40 వేల కోట్ల మార్కు దాటనుంది. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని పక్కాగా అమలు చేసే రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణకు రానున్న రెండు నెలల్లో మరో రూ.6 వేల కోట్ల వరకు రుణాన్ని సమీకరించే అవకాశముంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారమే రూ.47,500 కోట్లను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు మిగిలిన మొత్తాన్నీ రుణాల రూపంలో సమీకరించుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.31 వేల కోట్లకు పైగా మాత్రమే రుణంగా తీసుకోవాలని వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ కరోనా మిగిల్చిన కష్టాల వల్ల భారీగా అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఏడాది మొత్తం రూ.45 వేల కోట్లకు పైనే అప్పు చేయాల్సి వచ్చింది. ఒక్క 2021 జనవరి నెలలోనే రూ. 6 వేల కోట్లు రుణాలను సర్కారు సమీకరించడంతో ఆ ఏడాది అప్పటివరకు రూ.37 వేల కోట్లుగా ఉన్న అప్పు రూ.43 వేల కోట్లు దాటింది. తర్వాతి రెండు నెలల్లో మరో రూ.2,500 కోట్లకు పైగా అప్పులు తీసుకోవడంతో ఆ ఏడాది అప్పులు రూ. 45 వేల కోట్లు దాటాయి. -
అప్పుల బాధలు: గతంలో భర్త, చిన్నకుమారుడు, అల్లుడు.. ఇప్పుడేమో
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): అప్పుల బాధ తాళలేక, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందనే మనస్తాపంతో పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితిపై పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం విదితమే. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రామకృష్ణ, ఆయన భార్య ఓ కుమార్తె మృతి చెందగా, మరో కుమార్తె సాహితి కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది. అయితే, రామకృష్ణ తన కుటుంబీకులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సమయంలో మరో గదిలో నిద్రిస్తున్న ఆయన తల్లి సూర్యావతి మంటల్లో కాలిపోతున్న కొడుకు, కోడలు, మనవరాళ్ల పరిస్థితిని కళ్లారా చూసింది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడంతో వారు మంటల్లో మాడిపోయారు. ఈ దృశ్యాలు కళ్ల ముందే కదలాడుతుండగా సూర్యావతి గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఆమెను పలకరించగా..కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ కుటుంబ స్థితిని వెల్లడించింది. గతంలో రెండు మరణాలు.. సూర్యావతి భర్త చిట్టెబ్బాయ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని మోతుగూడెంలో వైద్య, ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించేవారు. 1992లో ఆయన ప్రయాణిస్తున్న జీప్‌లో తహసీల్దార్ ఎక్కగా.. తహసీల్దార్ లక్ష్యంగా మావోలు పేల్చిన మందుపాతరలో చిట్టెబ్బాయ్ కూడా మృతి చెందారు. ప్రస్తుతం కుమారుడు, కోడలు మాదిరిగానే మాంసం ముద్దగా ఇంటికి మృతదేహం వచ్చిందని సూర్యావతి బోరున విలపించింది. అంతేగాక చిన్న కారణంతో క్షణికావేశానికి లోనైన చిన్న కుమారుడు సురేష్ 1999లో ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడని గుర్తు చేసుకుంది. ఇక మిగిలిన కొడుకు నాగ రామకృష్ణ, కోడలు, పిల్లలను అపురూపంగా చూసుకుంటున్నట్లు తెలిపింది. అయితే, వ్యాపారాల్లో నష్టపోవడమే కాక ఇష్టమొచ్చిన చోట అప్పులు చేసినా విషయం తనకు ఏనాడూ చెప్పలేదని వాపోయింది. తీరా రూ.30లక్షలు ఇవ్వాలని, లేదంటే ఇళ్లు అమ్మాలని అడుగుతుండడమే కాక నెలనెలా రూ.వేలల్లో డబ్బు ఇవ్వాలని గొడవ చేసేవాడని తెలిపింది. ఆస్తి పంపకాల్లోనూ తాను అన్యాయం చేయలేదని, డబ్బు వృథా చేయొద్దని మాత్రమే చెప్పానని వెల్లడించింది. హైదరాబాద్‌లో ఉన్న ఇంటి స్థలాన్ని కూడా అతడికే ఇవ్వగా, రెండు, మూడు రోజుల్లో అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆశిస్తున్న నేపథ్యంలో ఎవరో చెప్పిన మాటలు నమ్మి తనతో పాటు సోదరిపై కక్ష పెట్టుకుని అన్యాయంగా కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడని రోదిస్తోంది. ఇప్పుడు తనకు దిక్కెవరని ఆమె విలపిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టించింది. కాగా, సూర్యావతి కూతురు భర్త సైతం కరోనాతో మృతి చెందడం గమనార్హం. చావుబతుకుల మధ్యే సాహితి మంటల్లో కాలిపోయి రామకృష్ణ, ఆయన భార్య, ఓ కుమార్తె మృతి చెందగా.. మరో కుమార్తె సాహితి మాత్రం ప్రాణాపాయ స్థితిలో బయటపడింది. ఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో నుండి బయటకు పరుగెత్తుకొచ్చింది. తనను ఎవరైనా కాపాడుతారని, ఆస్పత్రికి తీసుకెళ్తారని ఆశగా ఎదురుచూసింది. అయితే, చుట్టుపక్కల వారు, ఫైర్ ఇంజన్, పోలీసులు, అంబులెన్స్ వచ్చే సరికి గంటకు పైగా సమయం పట్టడం, ఆమెపై సకాలంలో నీళ్లు పోసి కాపాడకపోవడంతో ఒళ్లంతా కాలిపోయి చావుబతుకుల మధ్యే కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, 90శాతానికి పైగా సాహితి శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ముగిసిన అంత్యక్రియలు నాగ రామకృష్ణ, ఆయన భార్య, ఓ కుమార్తె మృతదేహాలు మంటలో మాడిపోయాయి. ఈ మేరకు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం పాత పాల్వంచ హిందూ శ్మశాన వాటికలో ముగ్గురి అంత్యక్రియలను నాగరామకృష్ణ భార్య శ్రీలక్ష్మి సోదరుడు జనార్దన్ పూర్తిచేశారు. -
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం..!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి ఉన్న రుణభారాన్ని వదిలించుకునేందుకు ఓవర్సీస్ బాండ్లను జారీ చేసేందుకు రిలయన్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది. రూ. 500 కోట్ల డాలర్ల బాండ్స్..! రిలయన్స్ డిసెంబర్ 31 న జరిగిన సమావేశంలో ఓవర్సీస్ బాండ్లపై కంపెనీ నిర్ణయం తీసుకుంది. సుమారు 500 కోట్ల డాలర్ల విలువ గల బాండ్లను జారీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశీయ చట్టాలకు లోబడి యూఎస్ డాలర్ డినామినేషన్ కలిగి ఉండి ఫిక్స్డ్ రేట్ గల సీనియర్ అన్ సెక్యూర్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. కాగా బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను రిలయన్స్ బయటకు తెలుపలేదు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధానంగా దాని ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ఉపయోగించాలని రిలయన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం -
AP: అదుపులోనే అప్పులు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే..
సాక్షి, అమరావతి: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఊదరగొడుతున్న ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తేటతెల్లమైంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. మరో పక్క కోవిడ్ నియంత్రణ, నివారణ వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అదనపు అప్పులకు అనుమతిచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక ఏడాది అంటే 2020–21లో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా పరిమితికి లోబడే అప్పులు చేసింది. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) ప్రాథమిక అకౌంట్ల పరిశీలనలో వెల్లడైంది. తమిళనాడు గత ఆర్థిక ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ఏకంగా 55.54 శాతం మేర అప్పు చేసింది. బిహార్ 47.69 శాతం, కర్ణాటక 40.12 శాతం, తెలంగాణ 37.50 శాతం, పంజాబ్ 24.22 శాతం బడ్జెట్ అంచనాకు మించి అప్పు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాకు మించి కేవలం 14.23 శాతమే అప్పు చేసింది. ఆదాయం తగ్గినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిలుపుదల చేయకుండా కొనసాగించింది. కోవిడ్ సంక్షోభం, లాక్డౌన్ల నేపథ్యంలో 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో ఏకంగా రూ.14 వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. మరో వైపు కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలకు ఏకంగా రూ.8 వేల కోట్లు వ్యయం చేసింది. మొత్తం మీద రూ.30 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసింది. అయినప్పటికీ ప్రతిపక్షంతో పాటు ఎల్లో మీడియా రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2020–21 ఆర్థిక ఏడాదిలో కాగ్ ప్రాథమిక అకౌంట్ల మేరకు వివిధ రాష్ట్రాల బడ్జెట్ అంచనాలు, వాస్తవంగా చేసిన అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల కంటే తక్కువే విభజన సమయం నుంచి ఏపీకి తప్పనిసరి రెవెన్యూ వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కోవిడ్ సమయంలో మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అదనపు రుణాలకు అనుమతించింది. అయితే ఇటీవల కొంత మంది ఏపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తోందని తరుచూ ప్రస్తావిస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ఆర్థికంగా బలహీనంగా ఉంది. కోవిడ్ సంక్షోభంతో పాటు మరో పక్క రెవెన్యూ రాబడికి మించి తప్పసరి వ్యయాలు చేయాల్సి వస్తోంది. ఆస్తుల కల్పనకు సంబంధించి ఇరిగేషన్, విద్యుత్ వంటి ప్రాజెక్టులపై వ్యయం చేస్తున్నప్పటికీ వాటి ద్వారా వచ్చే రాబడి వాటి నిర్వహణకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి తప్పనిసరి ఖర్చులు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ప్రభుత్వం 2020–21లో చేసిన అప్పులు అదుపులోనే ఉన్నాయి. – ఎం.ప్రసాదరావు, రిటైర్డ్ ఎకనమిక్ ప్రొఫెసర్, ఆంధ్రా విశ్వ విద్యాలయం -
గ్లోబల్ ట్రేడ్‌లో ఇలా రుణం తీర్చడం ఇదే ఫస్ట్ టైం!
వస్తు మార్పిడి.. తెలియని విషయమేం కాదు. పాతరోజుల్లో బాగా ఆచరణలో ఉండేది. కరెన్సీ వాడకంలోకి వచ్చాక.. క్రమంగా తగ్గిపోయింది. అయితే దేశాల మధ్య రుణ ఒప్పందాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి కదా. ఈ క్రమంలో గ్లోబల్ ట్రేడింగ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక, ఇరాన్ నుంచి కొన్ని ఏళ్లుగా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఈ మేరకు నాలుగేళ్లుగా 251 మిలియన్ డాలర్ల విలువైన రుణం పేరుకుపోయింది. దీనిని తీర్చేందుకు సంచలన ప్రకటన చేసింది ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం. రుణాన్ని ధన రూపేణ కాకుండా.. వస్తుమార్పిడి రూపంలో తీరుస్తామని, ఈమేర విలువ చేసే సిలోన్ టీ ఉత్పత్తులను ఇరాన్‌కు అందిస్తామని పేర్కొంది. గత యాభై ఏళ్లలో విదేశీ వాణిజ్యంలో ఈ తరహా ప్రకటన చేసిన దేశం శ్రీలంకే కావడం విశేషం!. ఇందుకు సంబంధించి శ్రీలంక మంత్రి రమేశ్ పాథిరానా అధికారికంగా ఓ ప్రకటన చేశారు. జనవరి నుంచి ప్రతీ నెలా 5 మిలియన్ డాలర్ల విలువ చేసే తేయాకు ఉత్పత్తులను ఇరాన్‌కు అందిచనున్నట్లు తెలిపారు. ఆయిల్ ఉత్పత్తుల విషయంలో ఇరాన్‌కి పడ్డ రుణం నాలుగేళ్లుగా పేరుకుపోతోంది. ఈ తరుణంలోనే లంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదా? ఇదిలా ఉంటే యూఎన్, యూఎస్ ఆంక్షల పరిధిలో ‘టీ’ కూడా ఉంది. అయితే మానవతా కోణం దృష్ట్యా(ఎమర్జెన్సీ సందర్భాల్లో) టీ అనేది ఫుడ్ జాబితాలో ఉందని గుర్తు చేస్తోంది లంక ప్రభుత్వం. అంతేకాదు ఇరాన్ బ్యాంక్‌ల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు లంక ప్రకటించుకుంది. మరోవైపు శ్రీలంక గత కొంతకాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ వస్తోంది. విదేశీ మారకద్రవ్య సంక్షోభం, కరోనా ప్రభావంతో టూరిజం నిలిచిపోవడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక ప్రతీ ఏడాది 340 మిలియన్ కేజీల టీని ఉత్పత్తి చేస్తోంది. కిందటి ఏడాది 265 మిలియన్ కేజీల టీని ఎగుమతి చేయగా.. 1.24 బిలియన్ డాలర్లు సంపాదించింది. దేశం మొత్తం మీద ఐదు శాతం జనాభా తేయాకు ఆధారిత పనులతో జీవనం కొనసాగిస్తోంది. చదవండి: బ్రిటన్ను వెనక్కి నెట్టిన భారత్! -
2022 మార్చి 31 నాటికి దేశ అప్పు ఎంతంటే..!
భారత రుణభారంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభలో పేర్కోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31, 2022)నాటికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో దేశ రుణం 62 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఆర్థిక లోటు, రుణభారాలపై నజర్..! సోమవారం లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో, దేశ రుణ భారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటుందని వెల్లడించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా మెరుగైన సమ్మతి ద్వారా పన్ను రాబడిని పెంచడం, ఆస్తుల మానటైజేషన్ ద్వారా వనరుల సమీకరణ, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపరచడం మొదలైనవి ఆర్థిక లోటు, రుణ భారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన చర్యలని చౌదరి చెప్పారు. పుంజుకున్న ఆదాయాలు..! 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు జీడీపీలో 6.8 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో అంచనా వేశారు. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం... ప్రభుత్వం ఆశించిన దానికంటే బలంగా ఆదాయం పుంజుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.6 శాతం ఆర్థిక లోటు ఉంటుందని తెలిపినట్లు పంకజ్ చౌదరీ అన్నారు. అంచనాలకు మించి..! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం ఎఫ్వై22లో భారత ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం వృద్ధి చెందుతుందని పంకజ్ అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగా ఐఎమ్ఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ అప్డేట్ గురించి ప్రస్తావించారు. భారత్ 2021లో 9.5 శాతం, 2022లో 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిందనే విషయాలను చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. చదవండి: ఏటీఎం ‘విత్‌డ్రా బాదుడు’.. 21రూ. మించే! ఇంతకీ ఆర్బీఐ ఏం చెప్పిందంటే.. -
స్క్విడ్ గేమ్: రీల్ కాదు.. రియల్‌గానే జరుగుతోంది!
Squid Game South Korea Debt Trap: స్క్విడ్ గేమ్.. ఈ సెన్సేషన్ వెబ్ సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కథలో జీవితాలతో ఆడుకునేవాడు ఒకడైతే.. ఆ ఆటలో పాల్గొనేవాళ్లు 456 మంది. పేరుకు పిల్లల ఆటలేగానీ.. ఓడితే మాత్రం ప్రాణాలు తీస్తుంటాయి. 45 బిలియన్ వాన్ల ప్రైజ్‌మనీ (38 మిలియన్ డాలర్లు) గెల్చుకోవడానికి వాళ్లంతా పడే తాపత్రయమే ఈ కథ. గమనార్హం ఏంటంటే.. ఈ ఆటగాళ్లంతా అప్పుల్లో కూరుకుపోయిన వాళ్లే కావడం. అయితే ఈ అప్పుల ఊబి కథ.. కథ కాదు. దక్షిణ కొరియాలో లక్షలమంది ఎదుర్కొంటున్న సమస్యకు ప్రతిరూపం. రిటైర్మెంట్ వయసుకు దగ్గర పడుతున్న యు వీ సూక్.. గతంలో అవసరాల కోసం కొంత అప్పు చేసి.. ఆపై మొత్తం తీర్చేసింది. కానీ, ఇప్పటికీ కలెక్షన్ ఏజెన్సీల నుంచి ఆమెకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేస్తామని ఆమెను బెదిరిస్తున్నారు. రీపేమెంట్ వ్యవస్థలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకుంటున్న ఏజెన్సీలు, బాకీ తీర్చే సమయంలో ఆమె పక్కాగా లేకపోవడం.. వెరసి ఇప్పుడు ఆమె పీకల మీదకు వచ్చి పడింది. ►దక్షిణ కొరియాలో అప్పు చేయడం ఒక పెద్ద అపరాధం. అవి తీర్చడం కంటే చావడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు అక్కడి ప్రజలు. ►కానీ, ఆర్థిక అవసరాలు కొందరిని అప్పుల వైపు ప్రొత్సహిస్తున్నాయి. ముఖ్యంగా చిరు వ్యాపారులకు అవే దిక్కుమరి. ►2017లో 48 శాతం ఉన్న అప్పుల శాతం.. 2021 జూన్ నాటికి 55 శాతానికి చేరుకుంది. ►అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి దివాళ తీసిన వాళ్లు 50 వేల మందికి పైనే ఉన్నట్లు 2020 కోర్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ సంఖ్య గత ఐదేళ్లతో పోలిస్తే.. చాలా ఎక్కువ అని కొరియా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ చెబుతోంది. ►దక్షిణ కొరియా అంటే గంగ్నమ్ స్టైల్ నుంచి బీటీఎస్ గ్రూప్ పాప్ ఆల్బమ్స్, సినిమాలు- వెబ్ సిరీస్‌లు, స్మార్ట్ ఫోన్లు ఇవే గుర్తుకొస్తాయి. కానీ, స్క్విడ్ గేమ్ ఎంటర్టైన్మెంట్ కోణంలోనే కాదు.. సౌత్ కొరియాలో పెరిగిపోతున్న ‘అప్పు’ ముసుగులో జరుగుతున్న చీకటి కోణాల్ని ప్రస్తావించింది. ►అప్పుల నుంచి విముక్తి లేని దేశంగా, మోస్ట్ అడ్వాన్స్డ్ దేశాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదు అవుతున్న దేశంగా దక్షిణ కొరియా టాప్‌లో ఉంది. ►చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలు వడ్డీ గుంజుతూ పీల్చి పిప్పి చేస్తున్నాయి. ►కాలపరిమితిని సైతం పక్కన పెట్టి దారుణాతీ దారుణంగా వ్యవహరిస్తున్నారు అక్కడి బ్యాంకర్లు. తిరిగి చెల్లించేందుకు సైతం అవకాశాలు ఇవ్వకుండా ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. అందుకే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ►‘‘ట్రంప్ లాంటి కుబేరుడు కొరియాలో ఉండి ఉంటే.. అధ్యక్షుడు కాదు కదా.. ఈ పాటికి దివాళ తీసి రోడ్ల మీద అడుక్కు తీనేవాడేమో’’ అంటున్నారు సియోల్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది. ►2018లో ఓ చట్టం తీసుకొచ్చారు.. పబ్లిక్ ఫైనాషియల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థపై నిషేధం విధించారు. అంటే.. బ్యాంకులు, ప్రభుత్వ సహకార గ్రూపుల ఆధిపత్యం కొనసాగుతోంది. దారుణం ఏంటంటే.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే కోణాన్ని పరిగణనలోకి తీసుకుని.. జాయింట్ షూరిటీల ద్వారా ఒకరు పోయిన మరొకరిని ఇబ్బందిపెట్టే చట్టం మార్చుకున్నాయి బ్యాంకులు. ►టెక్నాలజీని అందిపుచ్చుకునే దేశం సౌత్ కొరియా.. స్టార్టప్‌లను సైతం ప్రొత్సహిస్తుంటుంది. కానీ, వ్యాపారాల విషయాల్లో మాత్రం చిన్న చూపు చూస్తూనే ఉన్నాయి. ఫలితంగా ర్యూ క్వాంగ్ హాన్ లాంటి వాళ్లు లోన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ►సెప్టెంబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్ సిరీస్‌ను.. ఇప్పటిదాకా 142 మిలియన్ల మంది చూసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించుకుంది. అంతేకాదు ఈమధ్య కాలంలో 4.38 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ పెరగడానికి ఈ సిరీస్ కూడా ఒక కారణం అయ్యింది. దక్షిణ కొరియా సమాజంలోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్‌ను తీసినట్లు ప్రకటించుకున్నాడు వాంగ్ డోంగ్ హ్యూక్. - సాక్షి, వెబ్‌స్పెషల్ చదవండి: అక్కడేమో ప్రాణాలతో చెలగాటం! ఇక్కడేమో.. -
ప్రపంచ దేశాల అప్పు ఎంతో తెలిస్తే షాకే...!
Global Debt Jumps To A New High: మన దగ్గర సరిపడా డబ్బులు లేకపోతే ఏం చేస్తాం..! మనకు తెలిసిన స్నేహితుల నుంచో లేదా బంధువుల నుంచి అప్పుగా తీసుకుంటాం. వారి దగ్గర అప్పు ఎందుకులే అనుకునే వారు బ్యాంకులను ఆశ్రయిస్తారు. అలాగే మన దేశంతో సహా ఇతర దేశాలు పలు అంతర్జాతీయ బ్యాంకులను ఆశ్రయిస్తాయి. ఇతర దేశాల నుంచి కూడా పలు దేశాలు అప్పును తీసుకుంటాయి. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు వంటి నుంచి పలుదేశాలు అప్పులను పొందుతాయి. ప్రపంచదేశాల అప్పు తెలిస్తే షాకే...! ఆయా దేశాల అభివృద్ధి కోసం వరల్డ్ బ్యాంకు, ఇతర సంస్థల నుంచి ప్రపంచదేశాలు అప్పులను పొందుతాయి. తాజాగా ప్రపంచదేశాల అప్పుపై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎమ్ఎఫ్) కీలక వ్యాఖ్యలను చేసింది. ప్రపంచదేశాల అప్పు సుమారు 226 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బుధవారం రోజున ఐఎమ్ఎఫ్ వెల్లడించింది. కోవిడ్-19 రాకతో పలు దేశాలు భారీగా అప్పులను తీసుకున్నట్లు పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే 2021గాను భారత అప్పులు సుమారు 90.6 శాతానికి పెరిగినట్లు ఐఎమ్ఎఫ్ తెలిపింది. ప్రపంచవ్యాప్త రుణ సేకరణ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు, చైనా 90 శాతం మేర నిధులను సమకూర్చాయి. మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం ఏడు శాతం మేర నిధులను మాత్రమే అందించాయి. చదవండి: భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..! కోవిడ్-19రాకతో వేగంగా...! కోవిడ్-19 రాకతో ప్రపంచదేశ ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పలు అభివృద్ధి చెందుతున్నదేశాలు, ఇతర చిన్నచిన్న దేశాలు అప్పుల కోసం ఎగబడ్డాయి. కోవిడ్-19 ఎదుర్కొనే సమయంలో ఆయా దేశాల రుణస్థాయిలు వేగంగా పెరిగి అధిక స్థాయికి చేరాయని ఐఎమ్ఎఫ్ 2021 ఆర్థిక మానిటర్ నివేదిక విడుదల సందర్భంగా ఐఎమ్ఎఫ్ ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ విటర్ గ్యాస్పర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయా దేశాల పబ్లిక్, ప్రైవేటు రుణాల పెరుగుదల వాటి ఆర్థిక స్థిరత్వం, పబ్లిక్ ఫైనాన్స ప్రమాదాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రాకతో 2021లో సుమారు 65 నుంచి 75 మిలియన్ల వరకు దారిద్ర్యంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్..! నీ రాక..వారికి శాపమే..! -
సర్వే: రూ.71.4 లక్షల కోట్లకు రాష్ట్రాల రుణ భారం
ముంబై: రాష్ట్రాల రుణ భారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే వాటి రుణ భారం 2021–22లో 33 శాతంగా ఉంటుందని పేర్కొన్న క్రిసిల్, 2020–21 ఆర్థిక సంవత్సరంతో (34 శాతం) పోల్చితే దాదాపు సమానమేనని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు పెరగడం, వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే అంశంగా పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► 2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్రాల మొత్తం రుణం రూ.7.2 లక్షల కోట్లు పెరుగుతుంది. తద్వారా ఈ మొత్తం రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుంది. అయితే ఆదాయాలు 15 శాతం పెరిగి, మూడవ వేవ్ రాకుండా ఉంటేనే ఈ లెక్కల అంచనా నిజమవుతుంది. లేదంటే రుణ భారాలు మరింత పెరగక తప్పదు. ► మొత్తం జీఎస్డీపీలో దాదాపు 90 శాతం వాటా కలిగిన 18 రాష్ట్రాలను పరిశీలనలోకి తీసుకుంటే, ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిమాణం 0.9 లక్షల కోట్ల నుంచి (గత ఏడాది) రూ.1.4 లక్షల కోట్లకు పెరగడం ఊరటనిచ్చే అంశం. ► 2019–20లో రాష్ట్రాల ఆదాయ లోటు రూ.1.8 లక్షల కోట్లు. కరోనా కష్ట కాలం 2020–21లో ఇది రూ.3.8 లక్షల కోట్లకు పెరిగింది. 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. ఇదే కాలంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు జీఎస్డీపీలో వరుసగా 3.7 శాతం, 3.6 శాతంగా ఉంటే, 2021–22లో 4.4 శాతంగా ఉండే వీలుంది. ► 2019–20లో స్థూల ద్రవ్యలోటు 5.1 శాతం. 2020–21లో ఇది 7.6 శాతానికి చేరింది. 2021–22లో ఇది మరింతగా 8.2 శాతానికి పెరిగే వీలుంది. ► ఒక్క రెవెన్యూ లోటును తీసుకుంటే, 2020– 21లో రూ.3.8 లక్షల కోట్లయితే (జీఎస్డీపీలో 2 శాతం), 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు (జీఎస్డీపీలో 1.6 శాతం) తగ్గే వీలుంది. ► తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణ భారాలు వరుసగా 55.7 లక్షల కోట్లు, రూ.64.2 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.71.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ► గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల ఆదాయాలు 3 శాతం పతనమైతే, 2021–22లో 15 శాతం పెరుగుతాయని భావిస్తున్నాం. ► ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో, మొత్తం పన్ను వసూళ్లలో ఆదాయంలో రెండు ప్రధాన భాగాలు– వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అలాగే పెట్రోలియం ఉత్పత్తులు– మద్యం మీద అమ్మకపు పన్ను వాటా 30 శాతంగా ఉంటుంది. ఈ విభాగాల నుంచి ఆదాయాలు పటిష్టంగా ఉండే వీలుంది. అధిక ద్రవ్యోల్బణం, బేస్ పెంపు ద్వారా జీఎస్టీ 20 శాతం వృద్ధి చెందే వీలుంది. ► అయితే పన్నులు పెరిగినప్పటికీ ఆదాయ వ్యయాలు 10 నుంచి 11 శాతం పెరగవచ్చు. రాష్ట్రాల ఆదాయ వ్యయాల్లో 75 నుంచి 80 శాతం వేతనాలు, పెన్షన్లు, వడ్డీ వ్యయాలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్, వైద్యం, కార్మిక సంక్షేమం వంటి కార్యక్రమాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ► రోడ్లు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వంటి మౌలిక రంగాలకు రుణ సమీకరణలు జరపాల్సిన పరిస్థితి ఉంది. ► ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంలో రాష్ట్రాలు 55 శాతం వృద్ధిని (రూ .5.6 లక్షల కోట్లు) అంచనావేస్తూ బడ్జెట్ ప్రకటించాయి. కానీ వృద్ధి 20 శాతం దాటబోదన్నది అంచనా. ఇప్పటికే 4 శాతంగా ఉన్న ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం) దీనికి ప్రధాన కారణం. పెరుగుతున్న రాష్ట్రాల రుణ వ్యయాలు: కేర్ రేటింగ్స్ ఇదిలావుండగా, రాష్ట్రాల రుణ వ్యయాలు పెరుగుతున్నాయని కేర్ రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. గడచిన ఐదు వారాలుగా రాష్ట్రాల మార్కెట్ రుణాలు దీనికి కారణమని వివరించింది. అన్ని మెచ్యూరిటీలపై సగటున వ్యయాలు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85 శాతానికి చేరినట్లు కేర్ రేటింగ్స్ పేర్కొంది. చదవండి: షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం -
షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం
ముంబై: భారత్‌లో ఇతర ప్రాంతాలతో పోల్చితే దక్షిణాది ప్రాంతాల కుటుంబాల రుణ భారాలు అధికంగా ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2013 నుంచి 2019 వరకూ దేశంలోని కుటుంబాల రుణ భారాలపై ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ఏఐడీఐఎస్) నిర్వహించిన సర్వే గణాంకాలను ఈ సందర్భంగా ఇండి యా రేటింగ్స్ ఉటంకించింది.దక్షిణాదిలో అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల కుటుంబాల రుణాలు దేశ ఇతర ప్రాంతాలతో పోల్చితే అధికంగా ఉన్నట్లు వివరించింది. 2019 లో తెలంగాణ 67.2 శాతంతో గ్రామీణ కుటుంబాలలో అత్యధిక శాతం అప్పులు కలిగి ఉంది. ఈ విషయంలో నాగాలాండ్ 6.6 శాతంతో కనిష్ట స్థాయిలో ఉంది. ఇందుకు సంబంధించి పట్టణ ప్రాం తాల విషయంలో 47.8 శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉంటే, మేఘాలయ 5.1 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఇక తలసరి ఆదాయం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకన్నా ముందున్నాయి. ఆస్తులు–అప్పుల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. కోవిడ్ నేపథ్యంలో గృహ రుణాలు భారీగా పెరిగాయి. 2020–21 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణ భారం జీడీపీలో 37.9 శాతం ఉంది. 2019–20లో నాల్గవ త్రైమాసికంలో ఈ నిష్పత్తి 33.8 శాతంమే కావడం గమనార్హం. చదవండి: ధనిక,పేదల మధ్య భారీ అంతరం -
బ్యాంకింగ్ రుణ వృద్ధి 6.7 శాతం
ముంబై: భారత్ బ్యాంకింగ్ రుణ వృద్ధి 2021 సెప్టెంబర్ 10వ తేదీతో ముగిసిన పక్షం రోజులకు (2020 ఇదే కాలం వద్ద ఉన్న విలువతో పోల్చి) 6.7 శాతం పెరిగి రూ.109.12 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇక డిపాజిట్ల విలువ 9.32 శాతం పెరిగి రూ.155.75 లక్షల కోట్లుగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2020 సెప్టెంబర్ 11తో ముగిసిన పక్షం రోజులకు బ్యాంకింగ్ రుణవిలువ రూ.102. 27 లక్షల కోట్లుకాగా, డిపాజిట్ల విలువ రూ.142.47 లక్షల కోట్లని ఆర్బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్స్ స్టేట్మెంట్ పేర్కొంది. కాగా 2021 ఆగస్టు 27తో ముగిసిన పక్షం రోజుల్లో రుణ వృద్ధి 6.67 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి 9.45 శాతం. అంటే సమీక్షించిన పక్షం రోజుల వ్యవధిలో రుణ వృద్ధి రేటు స్వల్పంగానై పెరగడం (6.67 శాతం నుంచి 6.7 శాతానికి) కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం. గత ఆర్థిక సంవత్సరం ఇలా... ఆర్బీఐ గణాంకాల ప్రకారం, 2020–21లో బ్యాంక్ రుణ వృద్ధి కేవలం 5.56 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 11.4 శాతం. కరెంట్, సేవింగ్స్ అకౌంట్స్ (కాసా) డిపాజిట్లు భారీగా పెరగడం వల్ల డిపాజిట్లలో భారీ వృద్ధి (2019–2020లో 8.8 శాతం వృద్ధి)కి కారణమని గణాంకాలు వెల్లడించాయి. ఒక్క 2021 మార్చిలోనే కాసా డిపాజిట్లు 43.7 శాతం పెరగడం గమనార్హం. డిపాజిట్లలో గృహ రంగం వాటా 64.1శాతం. ఇందులో వ్యక్తులు,హిందూ అవిభక్త కుటుంబాల వాటానే 55.8 శాతం. నాన్–ఫైనాన్షియల్ కార్పొరేషన్ల వాటా 18.8 శాతం. కేంద్రం ప్రత్యేక దృష్టి రుణ వృద్ధి, తద్వారా ఎకానమీ పురోగతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యయాల వల్ల 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ప్రభుత్వ వ్యయాలు ప్రత్యేకించి మౌలిక రంగంలోకి వెళుతున్న పెట్టుబడులు, రిటైల్ రుణాలకు డిమాండ్ పునరుద్దరణ వంటి అంశాలు దీనికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు. రుణ వృద్ధికి బ్యాంకింగ్ అక్టోబర్ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ‘‘మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అక్టోబర్ నుంచీ చేపట్టనున్న జిల్లాల వారీ చర్యలు రుణ వృద్ధికి ఊపునిస్తాయి’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో ‘‘రుణ మేళా’’లను నిర్వహించిన సంగతి తెలిసిందే. -
Statistics Survey: ధనిక, పేదల మధ్య భారీ అంతరం
న్యూఢిల్లీ: దేశంలో ధనిక, పేదల మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 10 శాతం పట్టణ వాసుల్లో సగటున ఒక్కో కుటుంబం వద్ద 1.5 కోట్ల మేర ఆస్తులు ఉండగా.. దిగువనున్న పేదల వద్ద రూ.2,000 (ఒక్కో కుటుంబం) మించి లేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన ‘ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే 2019’లో ఈ వివరాలు తెలిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి పట్టణాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. అగ్రస్థాయి 10 శాతం కుటుంబాల వద్ద సగటున రూ.81.17 లక్షల ఆస్తులు ఉంటే.. పేద కుటుంబాల సగటు ఆస్తి రూ.41,000గా ఉంది. ఈ విధంగా చూస్తే పట్టణాల కంటే పల్లెల్లోనే పెదల పరిస్థితి కాస్త మెర్గుగా ఉందని ఈ సర్వే పేర్కొంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య 77వ జాతీయ శాంపిల్ సర్వేలో భాగంగా ఎన్ఎస్వో ఈ వివరాలను సమీకరించింది. -
కార్వీ ఎండీ పార్థసారథి కేసులో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి కేసులో సీసీఎస్ పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. కార్వీ అక్రమాలను సీసీఎస్ పోలీసులు నిగ్గు తేల్చారు. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపి పెట్టినట్లు తేలింది. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం పొందినట్లు సమాచారం. అలా పార్థసారథి దాదాపు రూ. 1200 కోట్లు బ్యాంకులకు రుణం ఎగవేశారు. దీంతో పాటు కార్వీ తెలంగాణ లోని బ్యాంక్‌ల వద్దనే రూ. 3000 కోట్ల స్కాం చేసినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులు కలిపితే మరో నీరవ్, మాల్యాలా కార్వి ఫ్రాడ్ కూడా పెద్ద స్కాంగా పరిగణించవచ్చు. కాగా కార్వీ ఆస్తుల మొత్తాన్ని పార్థసారధి బ్యాంకుల్లో కుదువ పెట్టారు. దీనికి సంబంధించి బ్యాంక్ లాకర్లను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కార్వి సంస్థ రుణం పొందిన 6 అకౌంట్లు ను ఇప్పటికే ఫ్రీజ్ చేసిన అధికారులు.. అందులో దాదాపు రూ. 13 కోట్ల లిక్విడ్ క్యాష్‌ను గుర్తించారు. కాగా రెండు రోజుల క్రితం పార్థసారథి కస్టడీ ముగియగా.. విచారణ కోసం సీసీఎస్ పోలీసులు ఆయనను మరో రెండ్రోజలు పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. -
బంగారం రుణాల్లోకి షావోమీ !
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా భారత్‌లో మరిన్ని విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. బంగారంపై రుణాలు, బీమా పాలసీలు, క్రెడిట్ లైన్ కార్డులు మొదలైన ఆర్థిక సేవలను పూర్తి స్థాయిలో అందించడంపై దృష్టి పెడుతోంది. యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, స్టాష్‌ఫిన్, మనీ వ్యూ, ఎర్లీ శాలరీ, క్రెడిట్ విద్య వంటి దేశీ సంస్థలతో కలిసి ఈ సర్వీసులు అందించనున్నట్లు షావోమీ భారత విభాగం హెడ్ మను జైన్ వెల్లడించారు. వచ్చే కొన్ని వారాల్లో బంగారంపై రుణాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. రుణాలకు సంబంధించిన ’మి క్రెడిట్’ విభాగం ఇకపై 60 నెలల దాకా కాలావధితో రూ. 25 లక్షల దాకా (ఇప్పటిదాకా ఇది రూ. 1 లక్షకే పరిమితం) రుణాలను జారీ చేయనున్నట్లు జైన్ చెప్పారు. చదవండి: ఎస్బీఐ లైఫ్ నుంచి ఈషీల్డ్ నెక్ట్స్ పాలసీ -
రూ.7వేల అప్పు.. మనిషి ఉసురు తీసింది
సాక్షి, కంటోన్మెంట్: ఏడు వేల రపాయల బాకీ ఓ వ్యక్తి ఉసురు తీసింది. ఫైనాన్స్ డబ్బుల వసూలుకు వచ్చిన, వడ్డీ వ్యాపారి హత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డి పేట్‌కు చెందిన గంగారామ్ (44 ) బోయిన్పల్లి చిన్నతోకట్టాలో ఒంటరిగా నివాసముంటూ బోన్‌సెట్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న గంగారమ్ తాను అద్దెకు ఉండే ఇంటి ఆవరణలో పడిపోయి ఉండగా స్థానికుల సమాచారం మేరకు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి గొంతుపై చేతులతో నులిమినట్లు గాయాలు ఉండటంతో అనువనాస్పద మృతి కేసు నమోదు చేశారు. గంగారాం ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులు సాయిరాం, కమల్‌కిశోర్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. గంగారాం స్థానిక పాల వ్యాపారి గడ్డం సాయిరాం వద్ద తన ద్విచక్ర వాహనం తనఖా పెట్టి రూ.10వేలు అప్పుగా తీసుకున్నాడు. గత నెలలో రూ. 3వేలు చెల్లిం, మిగతా మొత్తం త్వరలోనే ఇస్తానని ద్విచక్ర వాహనాన్ని విడిపించుకున్నారు. ఈ క్రమంలో మిగతా సొమ్ము వసూలు కోసం సాయిరాం, గంగారాం ఇంటికెళ్లి తలుపుకొట్టగా ఎంతకీ బయటికి రాలేదు. దీంతో సంజీవయ్యనగర్‌కు చెందిన పెయింటర్ కమల్ కుమార్‌ను వెంటబెట్టుకుని మళ్లీ గంగారాం ఇంటికెళ్లి నిలదీశాడు. అప్పు చెల్లించే విషయంలో వాగ్వాదం మొదలైంది. నిందితులు ఇద్దరూ గంగారాం గొంతు నులిమి పట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. నిందితులు గంగారాంకు చెందిన ల్యాప్‌ట్యాప్, ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పారిపోయారు. -
మీరు అప్పులు చేస్తున్నారా? అవసరాల కోసం కాకుంటే మంచిదే!
అవసరాలు గట్టెక్కేందుకేనా అప్పు.. ఇలానే ఎందుకు ఆలోచించాలి..? కొంచెం భిన్నంగా ‘రుణంతో ఆస్తులను కూడబెట్టుకుందాం’ అని సంకల్పం చెప్పుకోవచ్చుగా..! ఇలా ఆలోచించే వారు రుణంతో నిజంగానే సంపదను సృష్టించుకోవచ్చు. అందుకు మార్గాలు కూడా ఉన్నాయి. అవసరాలు ఎదురై అప్పును ఆశ్రయించే వారే మన సమాజంలో ఎక్కువ. కానీ, కొందరు తెలివిగా అదే అప్పుతో ఆస్తులను సమకూర్చుకునే విధానాలను అనుసరిస్తుంటారు. ఇటువంటి వారు మిగిలిన వారికి భిన్నం. వడ్డీ రేట్లు కనిష్టాల్లో ఉన్నాయి. తక్కువ వడ్డీ వ్యయాలను అనుకూలంగా చేసుకుని రుణంతో ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మంచి మార్గం. కరోనా కారణంగా ఆర్థిక వృద్ధి కనిష్టాలకు చేరిన తరుణంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను సాధ్యమైనంత కనిష్టాలకు తీసుకొచ్చింది. దీనికితోడు ప్రాపర్టీల ధరలు కూడా దిగివచ్చాయి. పన్ను ప్రయోజనాల కోణం నుంచి చూసినా రుణంతో ఆస్తి ఏర్పాటుకు అనుకూల సమయం ఇదేనంటున్నారు నిపుణులు. రుణంతో ఆస్తిని సమకూర్చుకోవాలన్నా.. సంపద సృష్టికి అడ్డుగా ఉన్న రుణాల భారాన్ని దింపుకోవాలన్నా.. అందుకు ఏం చేయాలన్నది ప్రాఫిట్ ప్లస్ కథనంతో తెలుసుకుందాం.. వడ్డీ రేట్ల పరంగా చూస్తే రుణానికి ఇదే మంచి తరుణం. కానీ, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ అస్థిరతలను పరిశీలిస్తే రుణం తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు లేదా గృహ నవీకరణ తదితర వినియోగ రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇవి ఆస్తులను తెచ్చి పెట్టేవి కావు. దీనికి బదులు ఇల్లు సమకూర్చుకునేందుకు లేదా వాణిజ్య సముదాయం లేదా వాణిజ్య భవనాన్ని కొనుగోలు చేసేందుకు రుణం బాట పట్టడం అనుకూలమైనదే. ‘‘ఆదాయం విషయమై అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తుల ఆధారిత రుణాలు మరింత ఆర్థవంతమైనవి’’ అని మైలోన్‌కేర్ సీఈవో గౌరవ్ గుప్తా అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ వ్యయాలు వార్షికంగా 11–36 శాతం వరకు ఉన్నాయి. కానీ, గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.63 శాతం నుంచే అందుబాటులో ఉన్నాయి. ‘‘మొదటిసారి ఇంటిని సమకూర్చుకునే వారికి ఇది మంచి తరుణం. ఎందుకంటే ప్రాపర్టీల ధరలు, వడ్డీ రేట్లు ఇంత తక్కువ ఎప్పుడూ లేవు’’ అని మైమనీ మంత్ర ఎండీ రాజ్‌ఖోస్లా పేర్కొన్నారు. నాణేనికి మరో కోణం అన్నట్టు.. ఇతర అవసరాలకు కూడా రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితులు, అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం వంటి అంశాలు రుణం తీసుకునేందుకు దారితీయవచ్చు. ఒకవేళ ఇవే పరిస్థితులు ఎదురైతే వ్యక్తిగత రుణాలకు బదులు బంగారంపై రుణాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే రుణం పొందేందుకు ఇది సులభమార్గం. ‘‘బ్యాంకులు బంగారం విలువ లో 90% వరకు రుణంగా ఇస్తున్నాయి. అయితే బంగారం ఆభరణాల విలువలో 60–70 శాతానికి మించి రుణం తీసుకోకపోవడమే మంచిది’’ అని ఖోస్లా సూచించారు. మిగులు నిధులు ఉంటే..? అందుబాటులో ఉన్న మార్గాల్లో ఏది మెరుగైనదన్న పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారు.. తమ వద్ద మిగులు నిధులు ఉన్నాయని చెప్పి గృహ రుణాన్ని తీర్చేద్దామనుకుంటున్నారా..? దీనికంటే కూడా మెరుగైన రాబడులను ఇచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే గృహ రుణంపై వడ్డీ రేటు 7 శాతం స్థాయిలో ఉన్నప్పుడు.. దీన్ని తీర్చేయడానికి బదులు దీర్ఘకాలం కోసం ఈక్విటీలు లేదంటే మరో ప్రాపర్టీని సమకూర్చుకునే ఆలోచన చేయవచ్చు. పైగా గృహ రుణం వల్ల ఎంతో పన్ను ఆదా చేసుకునే చక్కని మార్గం కూడా ఉంది. తమవద్ద మిగులు నిల్వలతో గృహ రుణాన్ని తీర్చేద్దామని అనుకునేవారు దీనికి బదులు అధిక వడ్డీ భారంతో ఉన్న ఇతర రుణాలను తీర్చేసే ఆలోచన కూడా చేయవచ్చు. అధిక వడ్డీతో కూడిన రుణాలను వదిలించుకోవడం కూడా సంపద సృష్టించుకునే మార్గాల్లో ఒకటి. ‘‘రుణ గ్రహీత వద్ద మిగులు నిల్వలు ఉంటే వాటితో అధిక వడ్డీ పడే క్రెడిట్‌కార్డు, వ్యక్తిగత, ఆటో రుణాలను వదిలించుకోవడాన్ని పరిశీలించొచ్చు’’ అని ఖోస్లా సూచించారు. చెప్పడానికి, ఆచరించడానికి మధ్య ఎంతో అంతరం ఉంది. కనుక మిగులు నిధులు ఉన్న వారు దీర్ఘకాలంలో మెరుగైన విలువను తెచ్చిపెట్టే ఆస్తులపై ఇన్వెస్ట్ చేయలేక.. తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అవకాశం లేకపోలేదు. ఎఫ్డీపై వడ్డీ రేటు 6 శాతం వస్తుంది. దీనిపై ఆదాయపన్ను కూడా పడుతుంది. ద్రవ్యోల్బణ ప్రభావం తీసివేసి చూస్తే మిగిలేదేమీ ఉండదు. అందుకుని ఇటువంటి వారు ప్రస్తుత రుణాలను (గృహ రుణం అయినా సరే) తీర్చేయడానికి మిగులు నిధులను వినియోగించుకోవచ్చు. సంపద సృష్టికి రుణంతో ఆస్తిని సమకూర్చుకోవడం ఎంత ముఖ్యమో.. అధిక వడ్డీ భారంతో ఆదాయాన్ని మింగేస్తున్న రుణాలను వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. తమ వద్దనున్న నిధులపై కనీసం 10 శాతం పైన రాబడులు సమకూర్చుకునే మార్గం ఉంటే గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి దూరంగా ఉండొచ్చని మైలోన్‌కేర్ గుప్తా సూచించారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రుణాలకు చేసే చెల్లింపులు ఆదాయంలో 50 శాతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. పన్ను ప్రయోజనాలు.. రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే కాదు.. పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇంటి రుణ ఈఎంఐలో (నెలవారీ వాయిదా) వడ్డీ భాగంతోపాటు అసలు కూడా కొంత కలసి ఉంటుంది. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణానికి చేసే అసలు చెల్లింపులు గరిష్టంగా రూ.1.5 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను చెల్లించక్కర్లేదు. అదే విధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల మొత్తంపైనా సెక్షన్ 24(బి) కింద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా సెక్షన్ 80ఈఈఏ కింద అందుబాటు ధరల ఇంటికి తీసుకున్న రుణం అయితే మరో రూ.1.50లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే రుణాన్ని ముందుగానే తీర్చివేస్తే ఈ పన్ను ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. పన్ను ప్రయోజనం కోసమే ఇంటి గురించి ఆలోచిస్తున్నట్టు అయితే రూ.20 లక్షల గృహ రుణం తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఖోస్లా. 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులపై పన్ను ప్రయోజనాన్ని పొందేందుకు రూ.20 లక్షల రుణం చాలంటున్నారు. ఈ మొత్తంపై వార్షికంగా రూ.50,000–60,000 మేర పన్ను ఆదా చేసుకోవచ్చు. అధిక పన్ను పరిధిలో ఉన్న వారు అందుబాటు ధరల్లోని ఇంటిని రూ.20 లక్షల రుణంతో కొనుగోలు చేసుకోవచ్చని రిటైల్ లెండింగ్ సంస్థ వ్యవస్థాపకురాలు సుకన్యకుమార్ సైతం సూచించారు. టాపప్ లోన్ ఇప్పటికే గృహ రుణం తీసుకుని కొంత తీర్చేశారనుకుందాం. దీనిపై టాపప్ రుణాన్ని పొందే అర్హత పొందినట్టే. అంటే అదనంగా మరికొంత రుణాన్ని తీసుకోవచ్చు. అప్పటికే కొనసాగుతున్న గృహ రుణంపై రేటుతో పోలిస్తే కొంచెం ఎక్కువ రేటు టాపప్ లోన్‌పై అమలవుతుంది. అయినప్పటికీ వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలతో పోలిస్తే చాలా తక్కువే ఉంటుంది. అందుకుని టాపప్ లోన్ తీసుకుని ప్లాట్ కొనుగోలును పరిశీలించొచ్చు. కాకపోతే టాపప్ లోన్ విషయంలో బ్యాంకులు ప్రస్తుతం కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ‘‘ప్రాపర్టీల ధరలు తగ్గాయి. గతంలో రూ.కోటి విలువైన ఇంటి ధర ప్రస్తుతం రూ.80 లక్షలకు తగ్గిపోయింది. కనుక విలువ పరంగా చూస్తే ఇంటి రుణంపై టాపప్ లోన్‌ను ఇచ్చేందుకు క్రెడిట్ మేనేజర్లు సౌకర్యంగా భావించడం లేదు’’ అని సుకన్య కుమార్ వివరించారు. అయితే వ్యక్తిగత రుణ చరిత్ర, ఆదాయం ప్రకారం తగిన అర్హతలు ఉంటే టాపప్ లోన్‌ను సులభంగానే పొందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రుణంతో ఇంటిని కొనుగోలు చేసిన ఆ ఇంటి వ్యాల్యూషన్ పెరిగిపోయినట్టయితే మరింత అధికంగా టాపప్లోన్ను అర్హత లభించినట్టే. ఒక వేళ గతంలో రుణ చెల్లింపుల్లో విఫలమైన చరిత్ర ఉండి, రుణ మారటోరియాన్ని వినియోగించుకుని ఉంటే అప్పుడు బ్యాంకులు టాపప్‌లోన్ మంజూరు విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. పాత రుణంపై అధిక రేట్లు లోగడ ఎప్పుడో గృహ రుణం తీసుకున్నవారు ఇప్పటికీ అధిక వడ్డీ రేటే చెల్లిస్తుంటారు. ‘‘బేస్ రేటుతో అనుసంధానమైన గృహ రుణాలు తీసుకున్న వారికి ఇప్పటికీ అధిక వడ్డీ రేటే అమలవుతోంది. కస్టమర్లు అడగకుండా బ్యాంకులు సొంతంగా పాత రుణాలను కొత్త విధానంలోకి మార్చే చర్యలు తీసుకోవు’’ అని సుకన్య కుమార్ పేర్కొన్నారు. కనుక పాత విధానాల్లో గృహ రుణం తీసుకున్న వారు రెపో రేటు లేదా ట్రెజరీ బిల్లు ఆధారిత రేట్ల విధానానికి మారిపోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు నూతన విధానంలో బ్యాంకులు సైతం వేగంగా ఆ మేరకు రుణ రేట్లను సవరిస్తున్నాయి. ‘‘గృహ రుణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఉన్నట్టయితే అది ప్రైమ్ లెండింగ్ రేటు అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో రెపో రేటుకు ఆ రుణాన్ని మార్చుకోవా లనుకుంటే అందుకు బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ ఒక మార్గం’’ అని మైలోన్ కేర్‌కు చెందిన గుప్తా సూచించారు. రుణం బదిలీ ప్రస్తుతం గృహ రుణాలపై రేట్లు 6.63–7.25% మధ్య ఉన్నాయి. ‘‘ప్రస్తుత మీ గృహ రుణ రేటు ఈ రేట్ల కంటే 0.35 శాతం లేదా అంతకు మించిన వ్యత్యాసంతో ఉంటే తగ్గించాలని రుణదాతను కోరాలి. అది ఫలించకపోతే అప్పుడు మీ గృహ రుణం బ్యాలన్స్‌ను తక్కువ వడ్డీ రేటుతో ఆఫర్ చేస్తున్న సంస్థకు బదిలీ చేసుకోవాలి’’ అని మార్ట్గేజ్ వరల్డ్ వ్యవస్థాపకుడు విపుల్ పటేల్ సూచించారు. అయితే రుణాన్ని బదిలీ చేసుకోవడం ఎంత మేర ప్రయోజనం ఉంటుందన్నది ముందే అంచనాకు రావాలి. ఎందుకంటే రుణాన్ని బదిలీ చేసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలను భరించాల్సి రావచ్చు. మార్ట్గేజ్ ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ చార్జీలు మిగిలే ప్రయోజాన్ని హరించొచ్చు. ఈ చార్జీలు రూ.10,000–20,000 మధ్యన ఉండొచ్చు. న్యాయ, సాంకేతిక చార్జీల రూపంలో మరో రూ.2,500–10,000 వరకు చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇటువంటి చార్జీలన్నీ మినహాయించిన తర్వాత తగిన మిగులుంటుందని భావిస్తే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. -
అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దాడి
-
ఆర్థికసంఘం సిఫారసుల మేరకే ఏపీకి రుణాలు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఆంధ్రప్రదేశ్‌కు రుణాలు తీసుకునేలా అనుమతించామని కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో మంగళవారం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రతి రాష్ట్రానికి రుణ పరిమితి నిర్దేశించామని పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం జీఎస్డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికలు సూచనలు చేస్తోందని కేంద్రం వివరించింది. జీఎస్డీపీలో 4 శాతం వరకు రుణాలు తీసుకునేలా అనుమతించామని కేంద్రం వెల్లడించింది. -
లక్ష అప్పు: చంపి, ముక్కలు చేసి కాలువలో విసిరేసిన జంట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఒక వృద్ధురాలిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు ఒక జంట. కేవలం లక్ష రూపాయల కోసం 75 ఏళ్ల మహిళను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి స్థానిక కాలువలో విసిరి పారేశారు. తమ అఘాయిత్యం ఎవరికి తెలియదులే అనుకున్నారు. చివరికి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించి, కటాకటాల వెనక్కి వెళ్లకి తప్పలేదు. సీనియర్ పోలీసు అధికారి సంతోష్ మీనా అందించిన సమాచారం ప్రకారం అనిల్ ఆర్య, అతని భార్య తన్నూ ఆర్య ఢిల్లీలోని నజాఫ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అధికారిగా పనిచేస్తున్న అనిల్, మృతురాలి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవసరాల నిమిత్తం తీసుకున్న సొమ్మును చెల్లించమంటే మాత్రం నిర్లక్క్ష్యంగా వ్యవహరించేవారు. అయితే తన అప్పు తీర్చాల్సిందిగా పదే పదే నిలదీసేది. అది జీర్ణించుకోలేని అనిల్ దంపతులు ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో మరోసారి డబ్బులకోసం ఒత్తిడి చేయడంతో ఆమెపై దాడి చేసి వాటర్ పైప్‌తో గొంతుకు ఉరిబిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసిన స్థానిక కాలువలో పడేశారు. నిందితుల సమాచారం మేరకు మృతదేహ భాగాలను కాలువ నుంచి వెలికి తీశారు పోలీసులు. కేసు నమోదు చేసి అనిల్ దంపతులను అరెస్ట్ చేశారు. మృతురాలిని కవితా గ్రోవర్‌గా గుర్తించారు. కవిత కుమారుడు, స్థానిక రియల్టీ వ్యాపారి మనీష్ గ్రోవర్ ఫిర్యాదు మేరకు విచారణ పట్టిన పోలీసులు కేసును ఛేదించారు. -
అప్పు తీర్చలేక.. భార్యను అమ్మేశాడు
భోపాల్: భర్త అంటే జీవితాంతం తోడుగా ఉండే వాడంటారు. కానీ దీనికి భిన్నంగా ఓ భర్తే తన భార్యను అంగట్లో వస్తువులా భావించి అమ్మేసాడు. అందుకు నిరాకరించడంతో ఆమెను చంపాలని చూశాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గున ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అతను తన అవసరాల నిమిత్తం ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిళ్లు రావడం, ఇప్పట్లో అప్పు తీర్చే దారి లేక ఆ వ్యక్తి ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. ఈ క్రమంలో తన భార్యను లక్ష రుపాయలకు అమ్ముతున్నట్లు వాళ్లకే బేరం కుదుర్చుకున్నాడు. ఇక ఈ విషయాన్ని చెప్పడానికి పొలంలో పనిచేసుకుంటున్న తన భార్య దగ్గరికి వాళ్లని తీసుకెళ్లాడు. తన భార్యతో.. నిన్ను అమ్మేశానని, వాళ్లతో వెళ్లిపొవాల్సిందిగా చెప్పాడు. ఒక్కసారిగా భర్త నోటి నుంచి ఊహించని మాట వినేసరికి ఆమె షాక్ లో ఉండిపోయింది. కాగా ఇందుకు ఆమె నిరాకరిస్తూ... భర్తతో గొడవపడింది. దీంతో ఆ రాత్రి కోపంతో ఆ వ్యక్తి నిద్రపోతున్న తన భార్యను తీసుకెళ్లి బావిలో పడేశారు. ప్రాణాలతో బయటపడ్డ మహిళ తండ్రితో కలిసి పోలీసులకు ఆమె భర్త, అత్తపై ఫిర్యాదు చేసింది. -
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు, బెస్ట్‌పై డీజిల్ పిడుగు!
సాక్షి, ముంబై: తరుచూ పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల బెస్ట్ సంస్థ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. సంస్థపై నెలకు సుమారు రూ.40 లక్షల మేర అదనపు భారం పడుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ.. తమ ఉద్యోగులకు నెలవారీ వేతనాలు ఇవ్వడానికి కష్టపడుతోంది. దీనికి డీజిల్ ధరలు కూడా తోడవడంతో సంస్థ మరింత నష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదముంది. నెలకు 20 వేల లీటర్ల డీజిల్ బెస్ట్ సంస్థ ఆధీనంలో సొంత, అద్దెకు తీసుకున్న ఇలా 3,400 వరకు బస్సులున్నాయి. ఇందులో కొన్ని బస్సులు సీఎన్జీ, మరికొన్ని ఎలక్ట్రిక్, డీజిల్ ద్వారా నడుస్తున్నాయి. బెస్ట్‌కు సొంతంగా 1,900 బస్సులు ఉండగా వాటిలో 302 బస్సులు డీజిల్‌తో నడుస్తాయి. అదేవిధంగా అద్దెకు తీసుకున్న కొన్ని బస్సుల్లో డీజిల్‌తో నడిచే బస్సులున్నాయి. కొద్ది రోజులుగా పెట్రోల్‌తోపాటు డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా బెస్ట్ సంస్థ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతకుముందు ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.91.87 పైసలుండేది. ఇప్పుడు ధరలు పెరగడంతో రూ.96.16 పైసలకు చేరుకుంది. బెస్ట్‌కు నెలకు 20 వేల లీటర్ల డీజిల్ అవసరముంటుంది. అందుకు రూ.17 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడు నెలకు సుమారు రూ.40 లక్షల మేర అదనపు భారం పడుతోందని బెస్ట్ సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. తగ్గిన ప్రయాణికులు ఇప్పటికే లాక్‌డౌన్‌వల్ల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం లేక బెస్ట్ సంస్థ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. బీఎంసీ పరిపాలన విభాగం అడపాదడపా అందజేస్తున్న ఆర్థిక సాయంతో ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. బెస్ట్‌ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, నేటి పోటీ ప్రపంచంలో అనేక ప్రైవేట్ వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. లోకల్ రైల్వే స్టేషన్ల బయట షేర్ ఆటోలు, ట్యాక్సీలు బెస్ట్ బస్సుల కంటే ముందే ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోతున్నాయి. ఆ తరువాత వచ్చే బస్సుల్లో ఎక్కడానికి ప్రయాణికులే ఉండడం లేదు. బెస్ట్ నష్టాల్లో కూరుకుపోవడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి. -
అప్పుల చెల్లింపునకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సాయం
కాలక్రమంలో మీ జీవితంలో బాధ్యతలు హఠాత్తుగా పెరిగిపోతాయి. అద్దె, యుటిలిటిలు, ఇన్సురెన్స్, కారు చెల్లింపుల ఖర్చులతో పాటు స్కూల్ ఫీజులు, మెడికల్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి తోడు రకరకాల క్రెడిట్ కార్డులపై ఉన్న అప్పులు, దీర్ఘకాలిక రుణాలు, ఇవన్నీ మీ నెల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ ఖర్చులు పెరిగిపోతాయి. అవి మీ నెలవారీ బడ్జెటుకు లోబడి ఉన్నా వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారుతుంది. ఒక్క పేమెంట్ మిస్ అయిన అది మీ క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమయాల్లో ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సాయపడుతుంది. ఇన్స్టంట్ పర్సనల్ లోన్ అంటే ఏంటి? చాలా ఆర్థిక సంస్థలు ముందస్తు ఆమోదిత లోన్స్ అందిస్తుంటాయి. వీటికి డాక్యుమెంటేషన్ చాలా తక్కువుంటుంది, అప్రూవల్ కూడా 24 గంటల్లో వస్తుంది. ఆ రుణ మొత్తాలు గణనీయంగా ఉంటాయి, వాటి చెల్లింపు కూడా ఒక నిర్ణీత గడువులోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి లోన్ ను ఎంచుకోవడం ద్వారా స్వల్పకాలంలో మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని బకాయిలు సకాలంలో చెల్లించవచ్చు, ప్రతీ నెలా ఒక సింగిల్ ఈఎంఐ చెల్లింపుపై దృష్టి సారిస్తే సరిపోతుంది. పర్సనల్ లోన్ ఎటువంటి సమయాలలో తీసుకోవాలి? పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు క్రెడిట్ కార్డులతో పోల్చితే చాలా తక్కువుంటుంది. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకొని మీ క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించవచ్చు. తద్వారా వడ్డీ రూపంలో పెద్ద మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అంతే కాదు మీరు చెల్లిస్తున్న ఎక్కువ వడ్డీరేటు కలిగిన రుణాలను కూడా ఈ విధానంలో తిరిగి చెల్లించవచ్చు. అప్పులన్నీ తీర్చడానికి పర్సనల్ లోన్ బెస్ట్ అనేక ఈఎంఐలు చూసుకోవడం, వాటి వడ్డీ రేట్లు, పేమెంట్ చేయాల్సిన తేదీలు గుర్తుంచుకోవడం, పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. లెక్కల్లో చిన్న తప్పు పేమెంట్ డీఫాల్ట్కు దారి తీయడమే కాదు పెనాల్టీలు, చక్రవడ్డీల చెల్లింపుతో పాటు కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక ఇన్స్టంట్ పర్సనల్ లోన్ తీసుకొని మీ అప్పులన్నీ ఒకేసారి చెల్లించవచ్చు. తీసుకున్న పర్సనల్ లోన్ కు సంబంధించిన ఒక ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. భవిష్యత్ అప్పులను దూరం పెట్టేందుకు పర్సనల్ లోన్ తీసుకోండి వివాహలు, సెలవులు లేదా దేశంలో లేదా విదేశాల్లో చదువుతున్న మీ పిల్లల చదువుల ఖర్చులు, వీటి చెల్లింపులు సకాలంలో జరపకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి పెనాల్టీ బారిన పడవచ్చు. కొన్నిసార్లు లీగల్ నోటీసూ అందుకోవాల్సి రావచ్చు. అటువంటి సమయాలలో ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ద్వారా మీ చెల్లింపులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవచ్చు. ఆ లోన్ మొత్తాన్ని చిన్న మొత్తాల్లో మీరు భరించగలిగే స్థాయిలో ఈఎంఐల ద్వారా చెల్లించవచ్చు. బకాయిల చెల్లింపు కోసం పర్సనల్ లోన్ అప్లై చేసే ఆలోచన ఉంటే పర్సనల్ లోన్ ఆప్షన్స్ మార్కెట్లో అనేకం ఉన్నాయి. దీని కోసం బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టంట్ పర్సనల్ లోన్'ను పరిగణనలోకి తీసుకోండి. దీనికి అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం. ఆమోదం కూడా 5 నిమిషాల్లోనే లభిస్తుంది. మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ చెక్ చేసుకోండి, రూ.25 లక్షల వరకు రుణం పొందవచ్చు. దాన్ని 60 నెలల వరకు ఉండే వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. మీరు కావాలనుకుంటే ఫ్లెక్సి ఫెసిలిటీని కూడా ఎంచుకోవచ్చు. దీనిలో మీరు మీ రుణ పరిమితి నుంచి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మీ అవసరాన్ని బట్టి డబ్బు తీసుకోవచ్చు, మీరు వాడుకున్న మొత్తానికి వడ్డీ కడితే సరిపోతుంది. దీని ద్వారా మీరు ఎక్కువ ఆదా చేసుకోవడమే కాదు అనుకోని ఖర్చుల నుంచి సులభంగా గట్టెక్కవచ్చు. మీ వ్యవధి కాలానికి సంబంధించి తొలినాళ్లలో కేవలం వడ్డీని మాత్రమే ఈఎంఐగా చెల్లించుకునే వెసులుబాటూ ఉంది. దీని ద్వారా మీ ఈఎంఐ మొత్తాన్ని 45% వరకు తగ్గించుకోవచ్చు. దీన్ని ఎంచుకోవడం ద్వారా మీరు నగదును సక్రమంగా నిర్వహించుకోవచ్చు, మీ దగ్గర తగిన డబ్బు ఉన్నప్పుడు మీ లోన్(Loan) తిరిగి చెల్లించవచ్చు. మీ దగ్గర ఎక్కువ మొత్తం ఉన్నప్పుడు పాక్షిక ప్రీ-పేమేంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలు, ఇంకా ఇతర విలువ ఆధారిత ఫీచర్స్ పొందేందుకు ఇప్పుడే అప్లై చేయండి, మీ అప్పులను సౌకర్యవంతంగా తిరిగి చెల్లించండి. (Advertorial) -
తెలంగాణలో ప్రతి ఒక్కరి మీద ఎంత అప్పుందంటే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పద్దు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి యేటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్‌ను మించిపోయాయి. ఈ ఏడాది బడ్జెట్ రూ.2.30 లక్షల కోట్లు కాగా... మొత్తం అప్పులు రూ.2.86 లక్షల కోట్లకు చేరాయి. 2020–21 ఏడాదికి గాను సవరించిన అంచనాల ప్రకారం అప్పులు రూ.2.45 లక్షల కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది మరో 41 వేల కోట్లు పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే... రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.81,395 అప్పు ఉన్నట్లు. గత ఏడాది తలసరి అప్పు రూ.65,480 కాగామరో రూ.16 వేలు పెరిగింది. రూ.2.44 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం రుణాలను ఎక్కువగా బహిరంగ మార్కెట్ ద్వారానే సేకరిస్తోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ రుణాల చిట్టా రూ.2.44 లక్షల కోట్లకు (వచ్చే ఏడాది ప్రతిపాదనలతో కలిపి) చేరింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 7,852 కోట్లు, స్వయంప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 14,860 కోట్లు, బాండ్ల రూపంలో రూ.19,552 కోట్లు రుణాల రూపంలో సమీకరణ చేసినట్టు బడ్జెట్ గణాంకాలు చెపుతున్నాయి. గత ఆరేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పు ఉంటే 2021–22 ముగిసేనాటికి ఇది రూ.2.86 లక్షల కోట్లకు చేరనుంది. అంటే ఆరేళ్లలో రాష్ట్రంపై పెరిగిన అప్పుల భారం అక్షరాలా లక్షా యాభై ఏడు వేల కోట్ల రూపాయలన్న మాట. చదవండి: మందు బాబులపైనే సర్కారు ఆశలు..! -
అప్పుల ఊబిలో డొనాల్డ్ ట్రంప్..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి ఇటీవల దిగిపోయిన డొనాల్డ్ ట్రంప్ అప్పుల ఊబిలో కూరుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారాల్లో మునిగితేలిన ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఫక్తు వ్యాపారవేత్తగానే ప్రవర్తించారు. అయితే దాదాపు వంద కోట్ల డాలర్ల (సుమారు 7,300 కోట్ల రూపాయలు) మేర అప్పుల్లో ఉన్న ట్రంప్ వ్యాపార సామ్రాజ్యాన్ని రుణవిముక్తం చేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాపిటల్ హిల్‌పై దాడి అనంతరం ఆయనపై విత్త సంస్థల దృక్పథంలో వచ్చిన మార్పు కారణంగా రుణ విముక్తి అంత తేలిగ్గా జరగకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పలు పెద్ద, చిన్నా బ్యాంకులు ట్రంప్‌తో, ఆయన కంపెనీలతో సంబంధాలు తెంచుకున్నాయి, కానీ డాయిష్ బ్యాంకు మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా ఈ బ్యాంకు సైతం ట్రంప్‌తో వ్యాపారానికి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. చివరకు చిన్న సైజు బ్యాంకైన సిగ్నేచర్ బ్యాంకు సైతం ట్రంప్‌వి, ఆయన కంపెనీలవి అకౌంట్లను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆయనకు బ్యాంకుల నుంచి రుణాలు పుట్టే అవకాశాలు మూసుకుపోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఉన్న ఆస్తులు అమ్మి గట్టెక్కాలని భావించినా, కుష్మన్ అండ్ వాక్‌ఫీల్డ్, జేఎల్ఎల్ లాంటి పలు బ్రోకరింగ్ దిగ్గజాలు సైతం ట్రంప్‌తో వ్యాపార బంధాలు తెంచుకున్నాయి. అందువల్ల ఆస్తుల అమ్మకాలు కూడా కష్టంగా మారే ఛాన్సులున్నాయి. పైగా ఆయన ఆస్తుల్లో ఎక్కువ భాగం డెమొక్రాట్లు బలంగా ఉన్న రాష్ట్రా ల్లో ఉన్నాయి. అందుకే ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ వ్యవహారాలపై ఎలాం టి ప్రకటనలు చేయడం లేదు. విదేశీ సాయం సొంత దేశంలో ట్రంప్‌నకు సాయం లభించడం కల్ల అని ఎక్కువమంది భావిస్తుండగా, కొందరు మాత్రం అధ్యక్షుడిగా ఇన్నాళ్లు పని చేయడం వల్ల వ్యాపార విస్తరణ అవకాశాలు పెరిగాయని, అందువల్ల స్వదేశంలో ఇబ్బందులు ఎదురైనా విదేశాల్లో పెట్టుబడులు, వ్యాపారాలు బాగా కొనసాగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. బ్రెజిల్, టర్కీ, ఫిలిప్పీన్స్, ఇండియాలాంటి దేశాల్లో ట్రంప్‌నకు ఇంకా పాపులారిటీ ఉందని, ఆయా దేశాల నేతలతో సత్సంబంధాలే ఉన్నాయని వీరు గుర్తు చేస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో పలు అరబ్ దేశాలతో ట్రంప్ టీమ్ మంచి సంబంధాలు నెలకొల్పుకుంది. పైగా యూఏఈ, సౌదీల్లో ఆయన కంపెనీలకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఇందుకు నిదర్శనంగా ట్రంప్ కంపెనీలతో వ్యాపార విస్తరణకు ఆసక్తిగా ఉన్నామని దుబాయ్ డీఏఎంఏసీ ప్రాజెక్టు చైర్మన్ హస్సన్ వ్యాఖ్యలను నిపుణులు గుర్తు చేస్తున్నారు. విదేశీ వాణిజ్య సంబంధాలు బలంగా ట్రంప్ కంపెనీలు కొనసాగిస్తే రుణాల నుంచి విముక్తి పొందే ఛాన్సులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎలాగైనా ట్రంప్ గడుసుపిండమని, అప్పుల్లోంచి ఈజీగా బయటపడడం గతంలో కూడా చేశాడని వ్యాఖ్యానిస్తున్నారు. -
అప్పు పుట్టేదెట్లా?
శ్రీహరి.. ఆర్టీసీలో డ్రైవర్.. కూతురు పెళ్లి కోసం గతేడాది ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో పొదుపు చేసుకున్న మొత్తం నుంచి రుణం ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. సీసీఎస్‌లో నిధులు లేక రుణమివ్వలేదు. దీంతో గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారి వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. లోన్ సకాలంలో అందక అప్పు తీర్చకపోవటంతో వడ్డీ వ్యాపారి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో మధ్యవర్తి ద్వారా బ్యాంకులో రుణం తీసుకుని అప్పు తీర్చాడు. బ్యాంకు రుణం ఇప్పించిన పేరుతో మధ్యవర్తి లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్ వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాంకు అప్పు గొంతుమీద ఉంది. దాని కిస్తీలు కట్టేందుకు నానాఇబ్బంది పడాల్సి వస్తోంది. సురేందర్.. హైదరాబాద్‌లో కండక్టర్.. తన కుమారుడికి ఐఐటీ మద్రాస్‌లో సీటొచ్చింది. అందుకు వెంటనే రూ.లక్షన్నర చెల్లించాలి. విద్యా రుణం కోసం ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో దరఖాస్తు చేసుకుంటే డబ్బులు లేవన్నారు. దీంతో గత్యంతరం లేక వడ్డీవ్యాపారి నుంచి రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు. మూడు నెలల్లో తీర్చేస్తానన్న హామీతో అప్పు పుట్టింది. కానీ ఇప్పటికీ పరపతి సంఘం లోన్ రాకపోవటంతో ఆ అప్పు తీర్చలేక, వడ్డీ వ్యాపారి ఒత్తిడి భరించలేక సతమతమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఇదీ ప్రస్తుతం ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) పరిస్థితి. అందులో కార్మికులు పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకోవటంతో రెండేళ్లుగా నిధులు లేకుండా పోయాయి. కుటుంబ అత్యవసరాల కోసం ఉద్యోగులు రుణం పొందాలంటే వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం సీసీలో కుటుంబ అత్యవసరాలకు సంబంధించి రుణాల కోసం ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు ఏకంగా 11,800లకు చేరుకున్నాయి. ఈ దరఖాస్తులన్నింటికీ సంబంధించి రుణాలు ఇవ్వాలంటే రూ.300 కోట్లు కావాలి. సీసీఎస్‌కు ఆర్టీసీ బకాయిపడ్డ రూ.776 కోట్లలో భాగంగా వాటిని చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ ఆ నిధులను పెండింగులో పెట్టడం ఉద్యోగులకు శాపంగా మారింది. ఇదీ జరిగింది.. ఆర్థిక పరిస్థితి సరిగా లేక చాలాకాలంగా అందుబాటులో ఉన్న నిధులన్నింటినీ ఆర్టీసీ వాడుకుంటోంది. ఈ క్రమంలో ఉద్యోగుల (కార్మికుల)కు సంబంధించిన సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను కూడా వాడేసుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు వారి జీతాల నుంచి ప్రతినెలా సీసీఎస్‌కు 7.5 శాతం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మినహాయించిన తర్వాతే వారికి ఆర్టీసీ జీతాలు చెల్లిస్తుంది. అలా మినహాయించిన మొత్తాన్ని సీసీఎస్‌లో జమ చేయాలి. అలా పోగయ్యే మొత్తాన్ని సీసీఎస్ పాలకవర్గం కారి్మకుల కుటుంబ అవసరాలకు రుణాలు మంజూరు చేస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవటం, చదువులు, ఆరోగ్య సంబంధిత ఖర్చులకు వాడతారు. ఈ నిధులన్నింటినీ ఆర్టీసీ వాడేసుకోవటంతో సీసీఎస్ ఖజానా ఖాళీ అయింది. దీంతో గతేడాది జనవరి నుంచి ఆ రుణాలు ఇవ్వటం ఆపేశారు. తొలుత 18 వేల దరఖాస్తులు పేరుకుపోగా, ఇటీవల కొంత మందికి అతి కష్టమ్మీద రుణాలిచ్చారు. జూన్ నుంచి 11,800 దరఖాస్తులు పెండింగులో ఉండిపోయాయి. (చదవండి: ఆర్టీసీ నిధులన్నీ హాంఫట్! ) ఆదాయం పెరిగితేనే.. ఇటీవల కార్గో బస్సులు ప్రారంభించిన ఆరీ్టసీ.. సరుకు రవాణా ద్వారా నిత్యం రూ.10 లక్షలకు పైగా ఆదాయం పొందుతోంది. పెట్రోల్ బంకులు సొంతంగా ఏర్పాటు చేసి రూ.25 లక్షల ఆదాయం సమకూర్చుకుంటోంది. అయితే సీసీఎస్‌కు ఉన్న బకాయి పెద్దది కావటంతో ప్రభుత్వం సాయం చేస్తేనే తీరే పరిస్థితి కని్పస్తోంది. గత జనవరిలో ప్రభుత్వ పూచీకత్తుపై రూ.650 కోట్ల బ్యాంకు రుణం వచ్చినా అది కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలకే ఖర్చయింది. దీంతో సీసీఎస్ బకాయిలు ఉండిపోయాయి. సీసీఎస్ దాఖలు చేసిన కోర్టు కేసులో కంటెమ్ట్ రావటంతో ఇటీవల రెండు దశలుగా ఆర్టీసీ రూ.50 కోట్లు, రూ.85 కోట్లు సీసీఎస్‌కు చెల్లించి చేతులెత్తేసింది. పెండింగులో ఉన్న కోర్టు ధిక్కార కేసు కొట్టేయాల్సిందిగా హైకోర్టులో ఆర్టీసీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇంకా పెద్ద మొత్తం లో బకాయిలు పెండింగులో ఉన్నందున మిగతా మొత్తం చెల్లించే లా ఆదేశించాలంటూ సీసీఎస్ కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. మధ్యవర్తుల దందా.. సీసీఎస్‌లో నిధులు లేకపోవటంతో కొందరు దళారులు అక్కడే తిష్టవేసి దందాకు పాల్పడుతున్నారు. మధ్య వర్తిత్వం నెరిపి బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తూ లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్ దండుకుంటున్నారు. ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా వసూలు చేసుకుంటుండటం విశేషం. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ రవాణాకు వజ్ర?) చిల్లిగవ్వ లేదు ఆరీ్టసీ సీసీఎస్ పరిస్థితి దుర్భరంగా మారింది. నయా పైసా నిల్వ లేదు. రుణాల కోసం 11 వేలకు పైగా దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఉద్యోగులు నిత్యం మా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల కోసం మేం ఆర్టీసీ చుట్టూ తిరుగుతున్నాం. –బి.మహేశ్, ఆర్టీసీ సహకార పరపతి సంఘం కార్యదర్శి నిధులు రాగానే ఇస్తాం కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బస్సులు తిరుగుతూ క్రమంగా ఓఆర్ పెరుగుతోంది. దీంతో రోజువారీ ఆదాయం కూడా మెరుగవుతోంది. రుణం కోసం ప్రభుత్వాన్ని కూడా కోరాం. అవి రాగానే సీసీఎస్‌కు బకాయిలు చెల్లిస్తాం’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
నేరం నాది కాదు.. లాక్డౌన్ది
సేలం (తమిళనాడు) : కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి అప్పుల పాలయ్యారు. లాక్డౌన్లో ఉద్యోగం కోల్పోయి కుటుంబాన్ని పోషించేందుకు చేసిన అప్పులు తీర్చేందుకు కన్నకొడుకునే అమ్ముకున్న దీనగాథ తమిళనాడులోని సేలంలో వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఆరు నెలల పసికందుని లక్ష రుపాయలకు అప్పుతీర్చడం కోసం అమ్ముకున్నాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని, అతడికి సహాయం చేసిన స్నేహితుడిని, పిల్లాడిని కొన్నవారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లాలోని లైన్‌మెడు ప్రాంతంలో నివసిస్తున్న షౌకత్ అలీ భార్య షర్మిలా బానో ఆరు నెలల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. షర్మిల మామయ్య పిల్లాడిని చూడటానికి సోమవారం రాగా, వారితో అలీ వారం ముందే పిల్లాడు చనిపోయాడని చెప్పాడు. వారం రోజుల ముందే చిన్నారి చనిపోతే తమకు సమాచారం ఇవ్వకపోవడం, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఈ విషయం తెలియకపోవడంతో అనుమానం వచ్చి అతని మామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. షౌకత్, షర్మిలాను పోలీసులు గట్టిగా అడిగే సరికి ఇద్దరూ తమ బిడ్డను లక్ష రూపాయలకు అమ్మారని అంగీకరించారు. లాక్డౌన్ సమయంలో తాను ఉద్యోగం కోల్పోవడంతో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా లక్ష రూపాయల వరకు అప్పు చేశానని, రుణం తిరిగి చెల్లించలేక బిడ్డను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. -
అప్పులపాలై ఇంటికి తిరిగొచ్చిన పిల్లి!
బ్యాంకాక్ : మూడు రోజుల పాటు కనిపించకుండా పోయిన ఓ గండు పిల్లి అప్పులపాలై ఇంటికి చేరుకున్న వింత సంఘటన థాయ్‌లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి పెంచుకుంటున్న పిల్లి కొద్దిరోజుల క్రితం ఇంటినుంచి కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి తిరిగివచ్చింది. అయితే దాని మెడలో ఓ ట్యాగ్‌ను యజమాని గుర్తించాడు. ‘‘ మీ పిల్లి మా షాపు దగ్గరకి వచ్చి మాకెరల్స్(తినుబండారం)పై కన్నేసింది. దీంతో నేను దానికి ఓ మూడు మాకెరల్స్ ఇచ్చాను’’ అని రాసి ఉంది. ( పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే ) ‘ఆంటీ మే’ అనే వ్యక్తి ఆ ట్యాగ్‌ను తగిలించి దాని మీద తన అడ్రస్‌ను కూడా రాశాడు. పిల్లి అప్పు కథను ‘చంగుపుఆక్సియామ్’ అనే ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘మూడు రోజులు కనిపించకుండా పోయింది. అప్పుల్తో తిరిగొచ్చింది. ఎలా ఉంది?’ అనే శీర్షిక జోడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు పిచ్చ కామెడీగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
అప్పు తీర్చిన చీమ
జార్ఖండ్‌లో పాలము అనే జిల్లా ఉంది. పాలములో మెదినీనగర్ అనే బ్లాక్ ఉంది. మెదినీనగర్లో తన్వా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో హస్రత్ బానో అనే చీమ ఉంది. ఆ చీమ ఇప్పుడైతే బాగుంది కానీ, ఏడేళ్ల క్రితం అస్సలేం బాగోలేదు. చీమ భర్త కూలి పనికి వెళ్లేవాడు. చీమ ఇంట్లోనే ఉండేది. చీమ భర్త ఏదో అవసరం మీద ఓ ఏనుగు దగ్గర అప్పు చేస్తే ఆ అప్పు వడ్డీమీద వడ్డీగా పెరుగుతూ 10000 రూపాయలు అయింది! ఊళ్లో వాళ్లకు అప్పులిచ్చి, వడ్డీల వసూల కోసం రోజంతా ఘీంకరిస్తూ తిరుగుతుండే ఏనుగులలో ఓ ఏనుగు దగ్గర ఈ భర్త చీమ అప్పు చేసింది. తీర్చలేకపోయింది. పదివేలు అయిందంటే అది ఇక ఎప్పటికీ తీరే అప్పుకాదని భార్య చీమకు అర్థం అయింది. అదొక్కటే కాదు, వడ్డీ వసూలుకు ఏనుగు వచ్చిన ప్రతిసారీ భర్త చీమ తను ఇంట్లో లేనని భార్య చీమతో చెప్పిస్తోంది. ‘ఆయన ఇంట్లో లేరు’ అని భార్య చీమ తలువు చాటు నుంచి చెబుతున్న ప్రతిసారీ భార్య చీమను ఏనుగు అదోలా, ఏదోలా చూస్తోంది. ఆడవాళ్లు మాత్రమే గ్రహించగలిగే అదోలా లు, ఏదోలా లు అవి. భర్త చీమకు ఆ సంగతి చెప్పలేదు భార్య చీమ. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ల దగ్గర అప్పు తీసుకుని ఏనుగు అప్పు మొత్తం తీర్చేసింది. తీర్చాక, ‘ఆ అప్పులవాడు ఇక మన ఇంటికి రాడు’ అని భర్త చీమకు చెప్పింది. భర్త చీమ సంతోషించింది. ‘ఇక మీదట అప్పు చెయ్యను’ అని భార్య చీమ చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చింది. భర్త కళ్లల్లో ఆనందం చూసి భార్య చీమ కళ్లకు నీళ్లొచ్చాయి. తర్వాత భార్య చీమ అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూపు దగ్గర 80000 అప్పు చేసింది. మొదటి అప్పు తీర్చడానికి రోజుకు ఐదు రూపాయలు చొప్పున ఆరేళ్లు పట్టింది రెండు చీమలు. అప్పు కట్టినట్లే లేదు, అప్పంతా తీరిపోయింది. ఆ ధైర్యంతోనే భార్య చీమ ఈసారి ఎనభై వేలు అప్పు తీసుకుంది. ఆ డబ్బుతో ఒక పిండి మిల్లు పెట్టింది. చెప్పుల దుకాణం పెట్టుకుంది. నెలకు ఇప్పుడు 20 వేలు సంపాదిస్తోంది! జార్ఖండ్ లోని మారుమూల గ్రామాల్లో సొంత చేతులపై కుటుంబాన్ని నిలబెట్టిన ఇలాంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఉమన్ చీమలు 30 లక్షల వరకు ఉన్నాయి! ఆ చీమలదండుకు బాస్ లెవరూ లేరు. ‘అజ్విక’ అనే గ్రూప్ పేరుతో వాళ్లలో వాళ్లే ఎవరు దాచుకున్న డబ్బుతో వాళ్లు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. మెడలో తళతళ మెరిసే గోల్డ్ చైన్ వేసుకుని ధడ్ ధడ్ ధడ్ మని బులెట్ బండి మీద అప్పులు ఇవ్వడానికి వచ్చే ఏనుగులు ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. భర్త చీమలు ఇంటికి ఇచ్చిన దాంట్లోంచే కొంత తీసి కొండల్ని కూడబెట్టే భార్య చీమలకు ఇంటి బయటికి వచ్చి సంపాదించే సహకారాన్ని ఇంట్లోవాళ్లు మనస్ఫూర్తిగా అందిస్తే డబ్బుల కొండపై ఇల్లు కట్టుకున్నట్లేనని చెప్పే ఒకానొక చీమ కథ.. హస్రత్ బానో కథ ఇది. -
‘కార్పొరేషన్ పేరిట ప్రభుత్వం అప్పులు చేస్తోంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్ పెట్టి భారీగా రుణాలు తీసుకుంటుందని, 200 శాతం అదనంగా లోన్లు తీసుకోవడానికి తెర లేపిందని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘రుణాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేశారు. అప్పులను చూస్తుంటే రాష్ట్రం ఏమైపోతుందా అని భయమేస్తోంది. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్లింది. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.318918 కోట్ల అప్పు చేసింది. 70 ఏళ్లలో రూ.69000 కోట్ల అప్పు ఉంటే 6 ఏళ్లలో 3 లక్షల రూపాయల కోట్లు అప్పు చేశారు. అదనంగా అప్పులు చేసేందుకు ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేశారు. ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికే 3 లక్షల కోట్లు అప్పులకు 40వేల కోట్లు వడ్డీ చెల్లిస్తుంటే.. 6 లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారు? చివరికి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. అప్పులు తీర్చడానికి మళ్లీ ప్రజలపై భారం వేయక తప్పని పరిస్థితి. దీని గురించి ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఈ సీఎం చేస్తున్న అప్పులను ఆపకపోతే బతికే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ప్రభుత్వం అప్పులు చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ తరపున ప్రజల్లో చర్చ చేస్తాం. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైద్యానికి ఖర్చు భరించలేక పేద ప్రజలు అప్పుల పాలవుతున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులను కాంగ్రెస్ తరపున విజిట్ చేస్తాం. రేపటి నుంచి భద్రాచలం నుంచి విజిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం’ అని తెలిపారు. చదవండి: ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం -
దారుణం.. మూడున్నర రూపాయల కోసం
బెంగళూరు: వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి.. దేశాలు దాటి పోతున్న బడా బాబుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉండే బ్యాంకులు.. రైతుల విషయానికి వస్తే మాత్రం ఎక్కడా లేని రూల్స్ మాట్లాడతాయి. పాత బాకీ చెల్లించకపోతే.. కొత్తగా రుణం మంజూరు చేయవు. అప్పు వసూలు చేయడం కోసం నోటీసులు పంపడం.. చివరికి ఆస్తుల్ని వేలం వేయడం వంటి సంఘటనలు కోకొల్లలు. ఈ క్రమంలో వేల కోట్లు ఎగ్గొట్టిన వారిని వదిలేసి.. కేవలం మూడున్నర రూపాయల(3రూపాయల 46 పైసలు) అప్పు తీర్చడం కోసం ఓ రైతును ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారు బ్యాంకు అధికారులు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న బారువే గ్రామంలో జరిగింది. వివరాలు.. బారువే గ్రామానికి చెందిన అమాదే లక్ష్మీనారాయణ అనే రైతు వక్కలు పండిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సమీప పట్టణం నిత్తూరులో ఉన్న కెనరా బ్యాంక్‌లో రూ. 35 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రూ.32 వేలు మాఫీ అయ్యింది. మిగిలిన రూ.3 వేలు లక్ష్మీ నారాయణ చెల్లించాడు. రుణం మొత్తం తీరింది. మళ్ళీ అప్పు తీసుకోవచ్చు అనుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీ నారాయణకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అప్పు మొత్తం తీరలేదని వెంటనే బ్యాంక్‌కు రావాలని అధికారులు అతడికి ఫోన్ చేశారు. కంగారు పడిన లక్ష్మీ నారాయణ బ్యాంకుకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఆయన గ్రామానికి బస్సులు రావడం లేదు. దాంతో నడుచుకుంటూ 15కిలోమీటర్ల దూరానా ఉన్న బ్యాంకుకు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లాకా బ్యాంకు అధికారి లక్ష్మీ నారాయణ పేరు మీద రూ. 3.46 పైసల అప్పు ఉందని చెప్పడంతో షాక్ అయ్యాడు. ఈ మాత్రం అప్పు కోసం తనను ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బకాయి సొమ్ము చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ ఎల్ పింగ్వా స్పందిస్తూ.. కొత్తగా మళ్లీ అప్పు ఇవ్వడానికి వీలవుతుందనే ఉద్దేశంతోనే బ్యాలెన్స్ రూ.3.46 పైసలు అడిగినట్లు తెలిపాడు. అయితే బ్యాంకు అధికారుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల దగ్గర మాత్రమే కాక అందరి దగ్గర ఇలానే అప్పు వసూలు చేస్తే ఎంతో బాగుంటుందని అంటున్నారు. -
అప్పులు తీరిపోయాయ్..
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దూకుడుగా దూసుకెడుతోంది. నిర్దేశించుకున్న గడువులోగానే నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించింది. జియోలో వాటాల విక్రయాలు, రైట్స్ ఇష్యూ ద్వారా కేవలం రెండు నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో రూ. 1.69 లక్షల కోట్లు సమీకరించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సుసాధ్యం చేసుకుంది. గతేడాది బ్రిటన్ దిగ్గజం బీపీకి తమ ఇంధన రిటైల్ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ. 7,000 కోట్లు కూడా కలిపితే ఇప్పటిదాకా మొత్తం రూ. 1,75,000 కోట్లు పైగా సమీకరించినట్లయ్యింది. ‘2021 మార్చి 31 నాటికల్లా రిలయన్స్‌ను నికర రుణ రహిత కంపెనీగా చేస్తానంటూ షేర్హోల్డర్లకు మాటిచ్చాను. అంతకన్నా ముందుగానే సాధించాం. గడిచిన కొన్ని వారాలుగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను‘ అని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. 2020 మార్చి 31 నాటికి రిలయన్స్ నికర రుణం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. ‘తాజాగా సమీకరించిన పెట్టుబడులతో కంపెనీ నికర రుణ రహిత సంస్థగా ఆవిర్భవించింది‘ అని ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. సౌదీ అరేబియాకు చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ పీఐఎఫ్‌కు 2.32% వాటాల విక్ర యం (డీల్ విలువ రూ. 11,367 కోట్లు)తో ప్రస్తుతం జియోలో ఇన్వెస్టర్లను చేర్చుకునే ప్రక్రియకు సంబంధించి తొలి దశ పూర్తయినట్లేనని వివరించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల విక్రయం ద్వారా కేవలం రెండు నెలల కన్నా వ్యవధిలోనే రూ. 1,15,694 కోట్ల పెట్టుబడులు సమీకరించింది. ఏడాదిన్నర లక్ష్యం.. 2021 మార్చి 31 నాటికి రిలయన్స్ రుణ రహిత కంపెనీగా మార్చేందుకు మార్గదర్శ ప్రణాళికను అమల్లోకి తెస్తున్నట్లు గతేడాది ఆగస్టు 12న జరిగిన రిలయన్స్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ వెల్లడించారు. రిలయన్స్ రిటైల్, జియో, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ నిధుల ఊతంతో లక్ష్యాన్ని సాధించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ(ఆరామ్కో)కు 15 బిలియన్ డాలర్ల విలువ చేసే వాటాలను విక్రయించే ప్రక్రియ మొదలైంది. అయితే, పలు కారణాలతో ఆ డీల్ పూర్తి కావడంలో జాప్యం జరిగింది. ఇక రుణ రహిత సంస్థ లక్ష్య సాధనపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటిని పటాపంచలు చేస్తూ.. జియో మార్గంలో రిలయన్స్ లక్ష్యాన్ని సాధించుకుంది. ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో అంబానీ.. తాజా పరిణామాలతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచ టాప్–10 కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ రియల్–టైమ్ బిలియనీర్ లిస్టు ప్రకారం .. ఆయన సంపద నికర విలువ 5.3 బిలియన్ డాలర్లు పెరిగి ఏకంగా 64.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4.9 లక్షల కోట్లు) చేరింది. కంపెనీల షేర్ల ధరల్లో మార్పుల ప్రకారం సంపన్నుల సంపద విలువను ఫోర్బ్స్ లెక్కిస్తుంది. ఇక శుక్రవారం సాయంత్రం 7 గం.ల దాకా గణాంకాల ప్రకారం ప్రపంచ టాప్ 10 సంపన్నుల్లో అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. 64.5 బిలియన్ డాలర్ల సంపదతో గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ 10వ స్థానంలో ఉన్నారు. 158.9 బిలియన్ డాలర్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అగ్రస్థానంలోనూ, 109.4 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ రెండో స్థానం, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ 86.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. రిలయన్స్‌కి స్వర్ణ దశాబ్ది.. షేర్హోల్డర్లు, ఇతర వాటాదారుల అంచనాలకు మించిన పనితీరు పదే పదే సాధించడం రిలయన్స్ డీఎన్ఏలోనే ఉంది. రిలయన్స్ నికర రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించిన ఈ తరుణంలో నేనొక్క మాట చెప్పదల్చుకున్నాను. స్వర్ణ దశాబ్దిని చూస్తున్న రిలయన్స్ మరింత ఉన్నతమైన వృద్ధి లక్ష్యాలు నిర్దేశించుకుంటుందని, సాధిస్తుందని హామీ ఇవ్వ దల్చుకున్నాను. – ముకేశ్ అంబానీ, సీఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థలకు షాకిచ్చింది. తమకు భారీగా బకాయి పడ్డ సంస్థలకు ఇకపై అధికారికంగా ప్రయాణించేందుకు విమాన టికెట్లను ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఎయిరిండియా చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ. 10లక్షలకు పైగా బకాయి పడిన సంస్థలకు టికెట్లను ఎయిర్ ఇండియా నిరాకరించాలని నిర్ణయించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం బకాయిల ఎగవేతదారుల జాబితాను వైమానిక సంస్థ రూపొందించింది. ఈ జాబితాలో సీబీఐ, ఐబీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇండియన్ ఆడిట్ బోర్డ్, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ లేబర్ ఇనిస్టిట్యూట్ అండ్ స్టమ్స్ కమిషనర్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థల అధికారులు అధికారిక ప్రయాణాలకు ఎయిరిండియా టికెట్లు కొనుగోలు ద్వారా వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఎయిరిండియాకు రావాల్సిన మొత్తం బకాయిల విలువ రూ .268 కోట్లు. గత నెలలోఎయిరిండియా ఆర్థిక విభాగం ప్రభుత్వ సంస్థల బకాయిలపై ఒక డేటాను రూపొందించింది. ఈ నేపథ్యంలో రూ .10 లక్షలకు పైగా బకాయిలు ఉన్నవారిని 'క్యాష్ అండ్ క్యారీ' (నగదు చెల్లించినవారికి మాత్రమే) ద్వారా టికెట్లు జారీ చేయాని నిర్ణయించామని అని ఎయిరిండియా అధికారి ఒకరు వివరించారు. అయితే, లోక్‌సభ సహా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొన్ని మినహాయింపులు ఇచ్చామన్నారు. ఈక్ర మంలో గత కొన్నివారాల్లో సుమారు రూ. 50 కోట్లను రికవరీ చేశామని తెలిపారు. కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ రూ .5.4 కోట్లు, సీబీఐ రూ.95లక్షలు ఈడీ రూ.12.8 లక్షల, లోక్‌సభ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంఎస్‌ఏకు రూ .2.2 కోట్లు మేర ఎయిరిండియాకు బాకీ పడ్డాయి. -
ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు
న్యూఢిల్లీ: ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడం (డీలివరేజింగ్) ద్వారా లిక్విడిటీ మెరుగునకు కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ చర్యలు చేపట్టింది. ఇటీవలే కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (సీడీఈఎల్) దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘డి’ (ప్రతికూల దృక్పథానికి) ఇక్రా సంస్థ డౌన్ గ్రేడ్ చేసింది. అంతకుముందు వరకు బీబీ ప్లస్ నెగెటివ్ రేటింగ్ ఉండేది. రూ.315 కోట్ల దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఈ రేటింగ్‌ను ఇచ్చింది. సీడీఈఎల్ ఫ్లాగ్షిప్ సబ్సిడరీ అయిన కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్, సికాల్ గ్రూపు కంపెనీలకు సంబంధించి రుణ చెల్లింపులు ఆలస్యం అవడంతో రేటింగ్‌ను తగ్గించినట్టు స్వయంగా సీడీఈఎల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడంతోపాటు, నిధుల లభ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్టు సికాల్ లాజిస్టిక్స్ శుక్రవారం ప్రకటించింది. ఈ కంపెనీకి రూ.1,488 కోట్ల రుణభారం ఉంది. దీనికి కాఫీ డే గ్రూపు ప్రమోటర్, ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న వీజీ సిద్ధార్థ వ్యక్తిగత హామీదారుగా ఉన్నారు. సికాల్ లాజిస్టిక్స్ పోర్ట్ టెర్మినళ్లు, ఫ్రైట్ స్టేషన్లలను నిర్వహిస్తోంది. సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత... సీడీఈఎల్ తన రుణ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించడాన్ని గమనించొచ్చు. ఇందులో భాగంగానే బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్నాలజీ పార్క్‌ను సుమారు రూ.3,000 కోట్లకు బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. -
రూ. 200 అప్పు తీర్చడం కోసం 30 ఏళ్ల తర్వాత
ముంబై : వేల కోట్ల రూపాయలు అప్పు చేసి... ఆ తర్వాత ఎంచక్కా దేశం దాటి పోతున్న ఈ రోజుల్లో చేసిన అప్పు తీర్చడం కోసం ఓ వ్యక్తి ఏకంగా కెన్యా నుంచి 30 ఏళ్ల తర్వాత ఇండియా రావడం నిజంగా గ్రేటే. ఆ వచ్చిన వ్యక్తి ఎంపీ కావడం ఇక్కడ విశేషం. వివరాలు.. 79 ఏళ్ల కాశీనాథ్ గావ్లీ ఇంటికి రెండు రోజుల క్రితం ఓ అనుకోని అతిథి వచ్చాడు. తన పేరు రిచర్డ్ టోంగ్ అని.. కెన్యా దేశ ఎంపీనని చెప్పాడు. 30 ఏళ్ల క్రితం కాశీనాథ్ తనకు రూ. 200 సాయం చేశాడని.. ఆ సొమ్మును తిరిగి చెల్లించడానికి వచ్చానన్నాడు. ఆశ్చర్యపోవడం కాశీనాథ్ వంతయ్యింది. ఈ విషయం గురించి రిచర్డ్ మాట్లాడుతూ.. ‘1985-89 కాలంలో నేను మేనేజ్మెంట్ కోర్సు చడవడం కోసం ఇండియా వచ్చాను. అప్పుడు నేను వాంఖేడ్‌నగర్ ప్రాంతంలో ఉండేవాడిని. కాశీనాథ్ గారి కుటుంబం కూడా అదే ప్రాంతంలో కిరాణ షాపు నడుపుతుండేవారు. ఆ సమయంలో ఓ సారి డబ్బులు లేక నేను ఇబ్బంది పడుతుంటే కాశీనాథ్ గారు నాకు రూ. 200 సాయం చేశారు. అప్పుడు ఆ అప్పును తిరిగి చెల్లించే పరిస్థితిలో నేను లేను. కానీ ఆయన సాయాన్ని మాత్రం మర్చిపోలేకపోయాను. ఎప్పటికైనా కాశీనాథ్ గారి రుణాన్ని తీర్చుకోవాలని.. ఆయనకు కృతజ్ఞత తెలపాలని మనసులోనే అనుకునే వాడిని. ఇప్పటికి నాకు కుదిరింది’ అన్నారు రిచర్డ్. ‘నన్ను చూసి కాశీనాథ్ గారు చాలా ఆశ్చర్యపోయారు. నా రాక పట్ల ఎంతో సంతోషం వెలిబుచ్చారు. భోజనం నిమిత్తం నేను హోటల్‌కి వెళ్లాలని భావించాను. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. వారితో పాటు కలిసి భోంచేసేలా నన్ను బలవంతపెట్టారని తెలిపారు రిచర్డ్. ప్రస్తుతం తాను కెన్యాలో ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను’ అన్నారు రిచర్డ్. తిరిగి వెళ్లేటప్పుడు కాశీనాథ్‌ను తమ దేశం రావాల్సిందిగా ఆహ్వానించారు రిచర్డ్. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
బ్రిటీష్ స్టీల్ దివాలా
లండన్: రుణభారం పేరుకుపోయిన బ్రిటిష్ స్టీల్ సంస్థ దివాలా ఎట్టకేలకు ఖరారైంది. ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావటంతో దివాలా ఖరారయింది. బ్రిటిష్ స్టీల్ లిమిటెడ్‌ను మూసివేయాలని హైకోర్టు నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆస్తులు విక్రయించి రుణాలను తీర్చాల్సి రానుంది. సంక్షోభ పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా బ్రిటిష్ స్టీల్‌కు కొంత మేర నిధులు సమకూర్చింది. అలాగే, బ్రిటిష్ స్టీల్, దాని యాజమాన్య సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపింది. కానీ చివరికి చర్చలు విఫలం కావడంతో దివాలా తప్పలేదు. బ్రిటిష్ స్టీల్ దివాలాతో 5,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. అలాగే, సంస్థ సరఫరా వ్యవస్థతో ముడిపడి ఉన్న మరో 20,000 మందిపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. ఒకవేళ డీల్ గానీ సాకారమై ఉంటే బ్రిటన్‌లోని వేల్స్లో టాటా స్టీల్‌కు చెందిన టాల్బోట్ ప్లాంటు విషయంలోనూ కొంత ఆశలు సజీవంగా ఉండేవి. సంక్షోభంలో ఉన్న దీన్ని జర్మనీకి చెందిన థిస్సెన్క్రప్లో విలీనం చేయాలని టాటా స్టీల్ ప్రయత్నించినప్పటికీ.. డీల్ కుదరలేదు. -
కాలంతోపాటే ప్రణాళిక
రుణం తీసుకొని ఇన్వెస్ట్ చేయొద్దు. ఆర్జిస్తున్న దాని కంటే తక్కువే ఖర్చు పెట్టు. ఇవి తరచుగా వినిపించే మనీ సూత్రాలు. వీటికి కట్టుబడి నడుచుకుంటే ఆర్థిక వ్యవహారాలు తప్పుదోవలో వెళ్లకుండా చూసుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక విషయంలో ఇలాంటివే ఎన్నో సాధారణ సూత్రాలు ఉన్నాయి. వీటిని కాలంతోపాటే వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నతీకరించుకుని ఆచరణలో పెడితేనే ఆశించినంత ప్రయోజనం నెరవేరుతుందని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. ఆధునిక కాలంలో మార్చుకోదగిన సిద్ధాంతాల గురించి వారు ఇలా తెలియజేస్తున్నారు... వేతనంలో రిటైర్మెంట్కు పొదుపు నెలవారీ ఆర్జనలో 10 శాతాన్ని పెన్షన్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలన్నది గతంలోని సూత్రం. రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతమైన జీవనం కోసం ఈ మాత్రం పొదుపు చేసుకోవాలి. కానీ, పెరుగుతున్న జీవన ప్రమాణాలతో ఆయుర్దాయమూ అధిగమవుతోంది. కనుక వేతనంలో కనీసం 20 శాతాన్ని రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆప్టిమా మనీ మేనేజర్స్ వ్యవస్థాపకుడు మత్పాల్ తెలిపారు. జీవన వ్యయం పెరిగిపోతున్నందున, వైద్య వ్యయాలు కూడా భారమవుతుండడంతో రిటైర్మెంట్కు అధిక పొదుపు అవసరమని గుర్తించిన చరణ్ (35), వేతనం వచ్చిన వెంటనే 20 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈక్విటీల్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి? సాధారణంగా తమ పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కాకుండా డెట్, తదితర సాధనాల మధ్య కేటాయింపులు చేసుకోవాలని, తద్వారా రిస్క్‌ను సమతుల్యం చేసుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తుంటారు. మరి ఈక్విటీల్లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలన్న ప్రశ్న తలెత్తిత్తే... 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలే అంత శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది ఓ ప్రాథమిక సూత్రం. ఉదాహరణకు చరణ్ వయసు 35 ఏళ్లు. 100లో 35 తీసివేస్తే 65 వస్తుంది. కనుక తన మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే, కాలంతోపాటే ఇందులోనూ మార్పులు అవసరమన్నది నిపుణుల భావన. ఆర్జన ఆగిపోయిన తర్వాత కూడా 25 ఏళ్ల వరకు జీవించాల్సి వస్తున్న పరిస్థితుల్లో... ఈక్విటీలకు అధిక కేటాయింపులు అవసరమని సూచిస్తున్నారు. కనుక 100 కాకుండా 120 స్థాయిని నిర్ణయించుకోవాలన్నది వారి సూచన. ఈ నేపథ్యంలో 120 నుంచి తమ వయసును మినహాయించి మిగిలే అంత మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ముంబైకి చెందిన చేతన్ (39) ప్రస్తుతానికి పలు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ప్రతీ నెలా రూ.50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే మొత్తం పెట్టుబడుల్ని తీసుకెళ్లి ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాడు. దీనికి బదులు నూతన సూత్రం ప్రకారం 120 నుంచి చేతన్ వయసు 39ని తీసివేసి చూస్తే 81 వస్తుంది. కనుక పెట్టుబడిచేయదగిన మొత్తంలో 81 శాతం మాత్రమే.. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను రూ.40,000కు పరిమితం చేసుకోవాలి. మరింత చిన్న వయసుల్లో వారు (25–35 వయసు) ఈక్విటీలకు 85–90 శాతాన్ని, డెట్‌కు 10 శాతాన్ని కేటాయించుకోవచ్చని మనీ మ్యాటర్స్ సీఈవో తేజల్ గాంధీ సూచించారు. 60 ఏళ్ల తర్వాత కూడా ఈక్విటీలకు 25–30 శాతం కేటాయింపులు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 50–20–30 సూత్రం 50–20–30 సూత్రం తెలుసు కదా? పన్ను బాధ్యతలు పోను మిగిలే నెలవారీ ఆదాయంలో 50 శాతాన్ని కనీస అవసరాల కోసం వినియోగించుకోవాలి. 20 శాతాన్ని భవిష్యత్తు లక్ష్యాలు, అవసరాల కోసం కేటాయించుకోవాలి. మిగిలిన 30 శాతాన్ని తమ విచక్షణ అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చన్నది ఈ సూత్రం అంతరార్థం. అయితే, మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఇందులో భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం 20% చాలదని, కనీసం 30% అయినా కేటాయించుకోవాలని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. వీలయితే 40% కేటాయించుకోవడం మంచిదన్నది సలహా. మంచి వేతనాల్లో ఉన్న వారికి ఇది సాధ్యమే. జీవిత బీమా జీవిత బీమా అవసరాన్ని నేడు చాలా మంది గుర్తిస్తున్నారు. అయితే, పాలసీ తీసుకుంటున్నారు కానీ అవసరమైన మొత్తానికి బీమా రక్షణ ఉండేలా జాగ్రత్త వహిస్తున్న వారు కొద్ది మందే. నిజానికి ఆర్జించే వ్యక్తికి ఎంత మేర జీవిత రక్షణ ఉండాలి? అన్న సందేహం ఎదురైతే... వార్షిక వేతనానికి కనీసం 10 రెట్లు అయినా తీసుకోవాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తుంటారు. అయితే, అందరికీ వర్తించే ఉమ్మడి సూత్రం కాదిది. విడిగా వ్యక్తుల అవసరాలు, రుణాలు, వారిపై ఆధారపడిన వారు ఎంత మంది ఉన్నారు తదితర ఎన్నో అంశాలు జీవిత బీమా రక్షణ మొత్తాన్ని నిర్ణయిస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే ఆర్జన మొదలు పెట్టి, తక్కువ వేతనంలో ఉన్న యువకులకు జీవిత బీమా కొంచెం అధికంగానే ఉండాలంటున్నారు నిపుణులు. ‘‘చిన్న వయసులో బీమా పాలసీ తీసుకుంటుంటే... బీమా కవరేజీ వార్షిక వేతనానికి కనీసం 20 రెట్లు అయినా ఉండాలి. ఎందుకంటే చిన్న వయసులో ఉన్న వారికి వేతనంలో పెరుగుదల వేగంగా ఉంటుంది. దీనికి తగినట్టు జీవిత బీమా కవరేజీ పెంచుకుంటూ వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు’’ అని మత్పాల్ వివరించారు. అయితే 40 ఏళ్లకు పైగా వయసున్న వారు మాత్రం ఇంతకుముందు మాదిరే వార్షిక వేతనానికి పది రెట్ల మొత్తం బీమా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. హెల్త్ కవరేజీ వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక చికిత్సలు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడేస్తున్నాయి. వైద్య రంగంలో పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ, అత్యాధునిక చికిత్సా విధానాలు అమల్లోకి వస్తుండడంతో వాటి వ్యయాలు కొంచెం ఖరీదుగానే ఉంటున్నాయి. కనుక నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.3–5 లక్షల వైద్య బీమా అవసరం అని భావిస్తుండగా, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతంగా ఉంటుందన్న నేపథ్యంలో పట్టణాల్లో నివసించే వారికి ఇది చాలదంటున్నారు నిపుణులు. దీన్ని కనీసం రూ.10 లక్షలకు పెంచుకోవాలని సూచిస్తున్నారు. కిరణ్ కుమార్ తల్లికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. బీమా కవరేజీ రూ.3 లక్షలు ఏ మాత్రం సరిపోలేదు. దీంతో హెల్త్ కవరేజీ మరింత అవసరమని అర్థం చేసుకున్న అతడు రూ.25 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ కవరేజీని పెంచుకున్నాడు. ఇందులో తన తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజీ ఉండేలా చూసుకున్నాడు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీల ప్రాముఖ్యతనూ కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలం పాటు చికిత్స అవసరమైతే ఇవి ఆదుకుంటాయని, సంప్రదాయ పాలసీలు దీర్ఘకాలం పాటు చికిత్సా వ్యయాలను తీర్చలేవని గుర్తు చేస్తున్నారు. అత్యవసర నిధి ఎంత మొత్తం? ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు లేదా వైద్య పరమైన ఆకస్మిక చికిత్సలు అవసరం పడినప్పుడు లేదా ఇతర ఆర్థిక అత్యవసరాల్లో ఆదుకునేందుకు అత్యవసర నిధిని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలన్నది ఓ ఆర్థిక సూత్రం. కనీసం మూడు నుంచి ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో అత్యవసర నిధిగా ఉంచుకోవాలన్నది ఇప్పటి వరకు చెబుతున్న సూత్రం. కానీ, దీన్ని తొలి అడుగుగానే చూడాలంటున్నారు. ముందు ఆరు నెలల మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాత దానిని కనీసం 9 నెలల అవసరాలకు సరిపడా మొత్తానికి పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఫార్మా కంపెనీలో పనిచేసే వైభవ్ కుమార్ (36) నెలవారీ వేతనం రూ.50,000. కానీ, ఇతడు రూ.4.5 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచాడు. దీనికి అదనంగా అతడికి రూ.10 లక్షలకు హెల్త్ ప్లాన్ కూడా ఉంది. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడి తక్కువ కనుక ఒక నెల అవసరాలకు సరిపడా ఎఫ్డీగా ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది సూచన. -
‘4 నెలలుగా జీతాలు లేవు.. అమ్మ నగలు తాకట్టు పెట్టా’
ముంబై : మేం కూడా సాధరణ మనుషులమే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా ఒత్తిడికి గురవుతాం. కానీ ఒక్కసారి కాక్‌పిట్‌లో ప్రవేశించామంటే.. అన్ని సమస్యలను పక్కన పెట్టేస్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టిన వారిగా మిగిలిపోవాల్సి వస్తుందంటున్నారు జెట్ ఎయిర్వేస్ సీనియర్ కమాండర్ ఒకరు. దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక సంక్షభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని సమాచారం. ఈ విషయం గురించి గత 20 ఏళ్లుగా జెట్ ఎయిర్వేస్ సంస్థలో బోయింగ్ 7777 కమాండర్‌గా పనిచేస్తున్న కరణ్ చోప్రా మాట్లాడుతూ.. ‘మేం కూడా అందరి లాంటి వాళ్లమే. నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇల్లు గడవడం కోసం మా అమ్మ నగలను కుదవపెట్టాను. ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎంత కుంగదీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒత్తిడిని మేం కాక్‌పిట్ బయటే వదిలేసి వెళ్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసిన వారిగా మిగులుతాం’ అని తెలిపారు. అంతేకాక మిగితా ఉద్యోగాలతో పోలిస్తే.. దీనికి చాలా ఏకాగ్రత, ప్రశాంతమైన మనసు అవసరం అని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 1 లోగా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోయినా.. జీతాలు ఇవ్వకపోయిన నిరవధిక సమ్మెకు దిగుతాం అని తెలిపారు. మరో సీనియర్ కమాండర్ మాట్లాడుతూ.. ‘ఒక వేళ జెట్ ఎయిర్వేస్ ఈ సంక్షభం నుంచి బయటపడకపోతే.. దాదాపు 1500 మంది ఉద్యోగులు వీధిన పడాల్సి వస్తుంది. ప్రసుత్తం మార్కెట్లో ఇన్ని ఖాళీలు కూడా లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఎవరి మీద నిందలు వేయడం సరికాదు’ అని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతూ వస్తోంది. చాలా వరకు విమానాలను నడపకుండా నిలిపివేసింది. వేతనాల చెల్లింపుల్లోనూ జాప్యం అవుతోంది. కంపెనీలో ప్రధాన వాటాదారైన ఎతిహాద్ ఎయిర్వేస్ కూడా జెట్ ఎయిర్వేస్ నుంచి తప్పుకోవాలని చూస్తోంది. -
జెట్‌కు బ్యాంకుల బాసట
న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్వేస్ కుప్పకూలకుండా చూసేందుకు బ్యాంకర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మేనేజ్మెంట్ మార్పు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత మేనేజ్మెంట్తో కంపెనీ నిర్వహణ సాధ్యపడే అవకాశాలు లేనందున.. జెట్ ఎయిర్వేస్ను పునరుద్ధరించేందుకు బ్యాంకులు రూపొందించిన ప్రణాళికలో యాజమాన్య మార్పు ప్రతిపాదన ఉండొచ్చని వివరించారు. దివాలా కోడ్ పరిష్కారం కాదు.. జెట్ ఎయిర్వేస్ పరిస్థితుల గురించి ప్రభుత్వానికి వివరించేందుకే జైట్లీతో భేటీ అయినట్లు సమావేశం అనంతరం రజనీష్ కుమార్ చెప్పారు. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై బ్యాంకులు గత అయిదు నెలలుగా కసరత్తు చేస్తున్నాయని, ఇది దాదాపు సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. సర్వీసుల రంగంలో ఉన్న జెట్ లాంటి కంపెనీ నుంచి బకాయిలు రాబట్టుకునేందుకు దివాలా కోడ్‌ను తక్షణం ప్రయోగించడం పరిష్కారం కాదని, ఇది ఆఖరు అస్త్రం మాత్రమే కాగలదని కుమార్ చెప్పారు. ‘ఐబీసీని ప్రయోగించడమంటే కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడమే. అయితే, ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదనే మేం భావిస్తున్నాం. కాబట్టి జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. వీటిని.. ఒక వ్యక్తినో లేదా ప్రమోటరునో కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా భావించనక్కర్లేదు. బ్యాంకుల, దేశ, ఏవియేషన్ రంగ ప్రయోజనాలను కాపాడేందుకు జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే పునరుద్ధరణ ప్రణాళిక గురించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. జెట్ లో కొత్తగా మరో వాటాదారును తెస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. సంస్థలో 24% వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్ వాటి విక్రయం కోసం ఎస్బీఐ ని సంప్రతించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్‌లో ప్రమోటరు నరేష్ గోయల్‌కు 51% వాటాలు ఉన్నాయి. దాదాపు రూ. 8,200 కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే రుణదాతలకు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు నాటికి కంపెనీ రూ. 1,700 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. 119 విమానాలకు గాను.. ప్రస్తుతం కేవలం 41 ఎయిర్‌క్రాఫ్ట్స్ మాత్రమే నడుపుతోంది. జీతాలు బకాయిపడటంతో అటు ఉద్యోగులూ ఆందోళనకు దిగబోతున్నారు. తక్షణం జీతాలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విమానసేవలు నిలిపివేస్తామంటూ పైలట్ల యూనియన్ హెచ్చరించింది. కంపెనీ గానీ మూతబడితే దాదాపు 23,000 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. స్లాట్స్‌ను వేరే సంస్థలకు కేటాయించడంపై దృష్టి.. జెట్ ఎయిర్వేస్ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో నిరుపయోగంగా ఉంటున్న ఆ సంస్థ స్లాట్స్‌ను తాత్కాలికంగా ఇతర దేశీ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సమావేశమయ్యారు. ఎయిరిండియా, స్పైస్‌జెట్, గోఎయిర్, ఇండిగో ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం ఎన్ని స్లాట్స్ ఉపయోగిస్తోంది, ఎన్ని అవసరం ఉందన్న దానిపై జెట్ ఎయిర్‌వేస్‌తో చర్చించనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. రద్దీ సీజన్లో ఫ్లయిట్స్ రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడాలన్నది తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రధానికి పైలట్ల లేఖ.. జీతాల బకాయిల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ) తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసింది. 7 నెలలుగా కంపెనీ జీతాలను సక్రమంగా చెల్లించడం లేదని.. దీంతో పైలట్లు, ఇంజనీర్లు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. ‘జెట్ ఎయిర్వేస్ పతనం అంచున ఉందన్న భయాలు నెలకొన్నాయి. అదే జరిగితే వేల మంది సిబ్బంది ఉపాధి కోల్పోతారు. విమానాలు అందుబాటులో లేకపోవడం వల్ల చార్జీలు పెరిగిపోతాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది‘ అని వివరించింది. ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నందున.. భద్రతా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించింది. మార్చి నెలాఖరులోగా జీతాల బకాయిలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విమాన సేవలు పూర్తిగా ఆపేస్తామంటూ పైలట్లు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. జెట్ విమానాలపై స్పైస్‌జెట్ కన్ను.. మరోవైపు జెట్ ఎయిర్వేస్ కష్టాలు పోటీ సంస్థ స్పైస్‌జెట్‌కు వరంగా మారుతున్నాయి. పలు జెట్ ఫ్లయిట్స్ రద్దవుతుండటంతో.. ప్రయాణికులు స్పైస్‌జెట్ వైపు మళ్లుతారన్న అంచనాలతో ఆ సంస్థ షేరు బుధవారం పెరిగింది. జెట్ ఎయిర్వేస్కి చెందిన పలు విమానాలు నిల్చిపోవడంతో వాటిలో కొన్నింటిని తీసుకోవాలని పోటీ సంస్థ స్పైస్‌జెట్ యోచిస్తోంది. ఇటీవల నిషేధం వేటుపడిన బోయింగ్ 737 మ్యాక్స్ రకం 12 విమానాలను పక్కనపెట్టాల్సి రావడంతో స్పైస్‌జెట్ విమానాల కొరత ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే జెట్ ఎయిర్వేస్ విమానాలను తీసుకోవడంపై దృష్టి సారించింది. అటు జెట్ ఎయిర్వేస్ గానీ దివాలా తీస్తే.. తమ విమానాలు భారత్‌లోనే చిక్కుబడిపోతాయన్న భయంతో లీజుకిచ్చిన సంస్థలు (లెస్సర్లు) కూడా స్పైస్‌జెట్ వెంటపడుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 50 ఎయిర్‌క్రాఫ్ట్‌లను స్పైస్‌జెట్‌కు లెస్సర్లు ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాయి. -
డిపాజిట్లకోసం బ్యాంకుల మధ్య పోటీ!
న్యూఢిల్లీ: దేశంలో రుణ వృద్ధి అవకాశాల మెరుగుపడుతున్న నేపథ్యంలో... డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనావేస్తోంది. ఇదే జరిగితే డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపునకు ఈ పరిస్థితి దారితీస్తుందని విశ్లేషించింది. ముఖ్యంగా బల్క్ డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొంటుందని రేటింగ్ ఏజెన్సీ తాజా నివేదిక వివరించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, వ్యవస్థలో రుణ వృద్ధి 12.9 శాతం అయితే, అదే సమయంలో డిపాజిట్ల వృద్ధి రేటు 9.3 శాతం. డిపాజిట్ల సమీకరణకు పోటీ పరిస్థితి నెలకొనవచ్చని ఈ అంశం సూచిస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికాన్ని చూస్తే, మొత్తం బ్యాంకింగ్ రుణవృద్ధి రేటు 8.4 శాతం అయితే, ఇదే కాలంలో డిపాజిట్ వృద్ధి రేటు 4.9 శాతం. అయితే ఒక్క ప్రైవేటు బ్యాంకులు రుణ వృద్ధి భారీగా 22 శాతం నమోదవుతుండడం గమనార్హం. దీనితో ప్రైవేటు రంగ బ్యాంకులు నిధుల సమీకరణలో భాగంగా డిపాజిట్ రేట్లను పెంచే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. -
అప్పు చెల్లించలేదని హత్య
సాక్షి, వికారాబాద్ అర్బన్: మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే కోపంతో ఆమెను చంపేసి ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించాడు. ఇటీవల వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శిరీష రాఘవేంద్ర వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంట్లో ఏనుగు స్వరూప(30) కొంతకాలంగా అద్దెకు ఉంటుంది. కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉండేది. అయితే, ఆమె తన దూరపు బంధువైన పట్లోళ్ల మాధవరెడ్డి వద్ద నాలుగు నెలల క్రితం రూ. 40వేలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న డబ్బులను నెలరోజుల్లో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చింది. గడువు దాటినా స్వరూప డబ్బులు ఇవ్వకపోవడంతో మాధవరెడ్డి నిత్యం ఫోన్‌చేసి డబ్బులు ఇవ్వాలని అడిగేవాడు. ఈక్రమంలో ఈ నెల 4న స్వరూప మాధవరెడ్డికి ఫోన్‌చేసి డబ్బులు ఇస్తానని తన ఇంటికి రావాలని చెప్పింది. అనంతరం ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర అగ్రహానికి గురైన మాధవరెడ్డి ఇంట్లో కూరగాయలు కోసే కత్తిపీటను తీసుకొని స్వరూప మెడపై దాడి చేసి చంపేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న సుమారు రూ.1.2 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతోపాటు ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకొని పరారయ్యాడు. పోలీసులకు చిక్కకుండా నేరస్తుడు పలు జాగ్రతలు తీసుకున్నా ఆధునిక టెక్నాలజీతో తమ సిబ్బంది 48 గంటల్లో కేసును చేధించినట్లు డీఎస్పీ శిరీష రాఘవేందర్ తెలిపారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్వరూప ఒంటిపై నగలు కనిపించకపోవడంతో ముందుగా దొంగలు హత్య చేసి ఉండొచ్చని భావించారు. హతురాలి సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నిందితుడు మాధవరెడ్డిని గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు, ఇతర వస్తువులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో పట్టణ సీఐ సీతయ్య, ఎస్ఐ లక్ష్మణ్, కానిస్టేబుల్ శివకుమార్, బాలు తీవ్రంగా శ్రమించారని డీఎస్పీ వారిని అభినందించారు. నేరాలకు పాల్పడే నిందితులు ఎట్టి పరిస్థితిలోనూ పోలీసుల నుంచి తప్పించుకోరని డీఎస్పీ తెలిపారు. నేడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి పోయిందని, కొత్త టెక్నాలజీ సహకారంతో నేరస్తులను పట్టుకోవడం చాలా తేలికైందన్నారు. అనంతరం పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. -
ఉల్లి రైతు కుటుంబాన్ని ఆదుకునేదెప్పుడు?
మూడేళ్లుగా పంటలు సక్రమంగా పండక, గిట్టు బాటు ధర లేక, పొలానికి పెట్టిన పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో బోయ తలారి గిడ్డయ్య ఒకరు. అతనిది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రూరల్ మండల పరిధిలోని దైవందిన్నె గ్రామం. గిడ్డయ్య(42) అప్పుల బాధతో గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో రెండేళ్లు వరుసగా మిరప, ఉల్లి పంటల సాగు చేశారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటంతో అప్పులపాయ్యాడు. దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పు తేలింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావటంతో కృంగిపోయాడు. ఆ నేపథ్యంలో 2018 ఆగస్టు 11న ఉల్లి పంట కోసి పొలంలో కుప్ప వేశాడు. ఉల్లికి ధర మరీ తక్కువగా ఉండటంతో కోసిన పంటను పొలంలోనే వదిలేసి నిర్వేదంతో గిడ్డయ్య ఇంటికి వచ్చాడు. అదేరోజు ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య రామలక్ష్మి, కుమారులు చంద్రశేఖర్ నాయుడు(10 వ తరగతి), మల్లికార్జున(9వ తరగతి) ఉన్నారు. తండ్రి మరణించటంతో చదువు మానేసి పొట్ట కూటి కోసం పనులకు వెళ్తున్నారు. పెద్ద కుమారుడు చంద్రశేఖర్ ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తుంటే, చిన్నకుమారుడు మల్లికార్జున తల్లికి తోడుగా పనికి వెళ్తున్నాడు. గిడ్డయ్య ఆత్మహత్య చేసుకొని ఆరు నెలలైనప్పటికీ అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు. అప్పులిచ్చిన వారు డబ్బు కట్టమని గిడ్డయ్య భార్య, పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. పొలం అమ్మి అయినా అప్పులు తీర్చుదామనుకొని బేరం పెడితే.. కొనటానికి ఎవరూ ముందుకు రాలేదని రామలక్ష్మి వాపోయింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి తమ కుటుంబం వీధిన పడినా ప్రభుత్వం కనికరించడం లేదని కళ్ల నీరు కుక్కుకుంటున్నదామె. ఎప్పటికైనా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతోనే బతుకుతున్నామని తెలిపిందామె. – నాగరాజు సాక్షి, ఎమ్మిగనూరు రూరల్, కర్నూలు జిల్లా -
పన్ను చెల్లించలేదని కుక్కను వేలం వేశాడు
బెర్లిన్ : అప్పు చెల్లించకపోతే ఆస్తులను వేలం వేస్తారని తెలుసు కదా. ఇదే పద్దతిని ఫాలో అయ్యాడు ఓ పన్ను వసూలు అధికారి. అయితే ఇక్కడ అతడు వేలం వేసింది భూముల్ని, విలువైన ఆస్తుల్ని కాదు.. కుక్కను. అవును పెంపుడు కుక్కను వేలం వేసి వచ్చిన సొమ్మును పన్ను బకాయి కింద జమ చేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన జర్మనీలో చోటు చేసుకుంది. అయితే బాధిత కుటుంబం గురించి పూర్తి వివరాలు తెలియలేదు. పన్ను బకాయి పడ్డ సదరు యజమాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విధులకు కూడా హాజరు కాలేదట. ఈ క్రమంలో అతడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను సకాలంలో కట్టలేకపోయాడు. కుక్క పన్నుతో సహా పలు ఇతర పన్నులు బకాయిపడ్డాడు. ఈ నేపథ్యంలో పన్ను వసూలు అధికారి ఆ కుటుంబానికి చెందిన పలు విలువైన ఆస్తులతో పాటు వారికి బహుమతిగా లభించిన పెంపుడు కుక్కను కూడా వేలం వేశాడు. ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన కుక్క కాస్తా దాదాపు రూ. 60 వేలకు అమ్ముడయ్యింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. సదరు అధికారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం తగదు.. అతడు నిబంధనలను అతిక్రమించి మూగ జీవి పట్ల క్రూరంగా వ్యవహరించాడు. అతని మీద చర్యలు తీసుకోవాల’ని డిమాండ్ చేస్తున్నారు. పన్ను వసూలు కోసం కుక్కను అమ్మాడంటే.. మనుషుల్ని కూడా అమ్ముతాడనడంలో సందేహం లేదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.