మళ్లీ మంగళవారం అప్పుకు సిద్ధం
ఈసారి కూటమి ప్రభుత్వం అప్పు రూ. 4,000 కోట్లు
ఇప్పటికే రూ.15 వేల కోట్లు రుణం తీసుకున్న బాబు సర్కార్
కొత్త అప్పుతో రూ.19 వేల కోట్లకు చేరిన అప్పు
సాక్షి, అమరావతి: ‘అప్పు’డే మంగళవారం ఎప్పుడు వస్తుందా అని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లుగా ఉంది అప్పుల పరంపరను చూస్తుంటే. వచ్చే మంగళవారం కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 4,000 కోట్లు అప్పు చేయనుంది. గడిచిన మంగళవారమే రూ. 3,000 కోట్లు చంద్రబాబు సర్కారు అప్పు చేసిన విషయం తెలిసిందే. సెపె్టంబర్ 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 4,000 కోట్లు అప్పును సమీకరించనుంది.
ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం సెక్యూరిటీల వేలం వివరాలను వెల్లడించింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంగళవారాల్లో రూ. 15 వేల కోట్లు అప్పు చేసింది. కొత్తదానితో కలిపి అది రూ. 19 వేల కోట్లకు చేరనుంది. అప్పు చేయడమే తప్పుగా ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా దాటకుండానే ఏకంగా రూ. 19 వేల కోట్లు అప్పు చేశారు.
వచ్చే మంగళవారం 10 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 1,000 కోట్లు, 13 సంవత్సరాల కాల వ్యవధిలో మరో రూ. 1,000 కోట్లు, 20 సంవత్సరాల కాల వ్యవధిలో రూ. 1,000 కోట్లు, 23 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 1,000 కోట్లు చంద్రబాబు సర్కారు అప్పు చేయనున్నట్లు ఆర్‌బీఐ నోటిఫై చేసింది.
Comments
Please login to add a commentAdd a comment