
సాక్షి,అమరావతి : రాష్ట్ర అప్పులపై నారా లోకేష్ కాకిలెక్కలు చెప్పారు. కళ్లార్పకుండా అబద్దాలను చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా చెలామణి అవుతున్నారు. నారా లోకేష్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే అని చూపుతూ ట్వీట్‌లో పేర్కొన్నారు. విభజన సమయానికి ఏపీ వాటా అప్పుల వడ్డీ రూ.7,488 కోట్లు ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్ర అప్పులు బాగా పెరిగాయి.
ఇదే అంశాన్ని వైఎస్సార్‌సీపీ ఆధారాలతో సహా నిరూపించింది. వైఎస్సార్‌సీపీ రీట్వీట్‌తో లోకేష్ నీళ్లు నమిలారు. ఆర్థిక విధ్వంసుడు తన తండ్రేనని తేలడంతో కిక్కురుమనకుండా లోకేష్ సైలెంట్ అయ్యారు. ఈ తొమ్మిది నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు.. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. మరి ఆ లక్షన్నర కోట్లకు లెక్కలు చెప్పమంటే చంద్రబాబు,లోకేష్ నోరెత్తకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
.@naralokesh.. నీ ట్వీట్ చూస్తుంటే పబ్లిక్ ఫైనాన్స్‌పై నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని అర్థమవుతోంది
మార్కెట్ రుణాలపై వడ్డీ చెల్లింపునకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అనుకోవడం నీ అవివేకం
రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో 75% మార్కెట్ రుణాలే కాదు..ఇంకా మిగతా వాటిల్లో కూడా చాలా… https://t.co/ZTVFSAL3IP— YSR Congress Party (@YSRCParty) February 17, 2025
Comments
Please login to add a commentAdd a comment