
సాక్షి, అమరావతి: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. ఆ రాజ్యాంగం ఇప్పుడు అసెంబ్లీని సైతం తాకింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల కవరేజీ విషయంలో టీవీ చానల్స్‌పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించింది.
తమ అనుకూల మీడియాతో ఇష్టానుసారం కథనాలు ఇచ్చుకుంటున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మీడియా స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు తొలిసారి మీడియా కవరేజీపై ఆంక్షలు విధించింది చంద్రబాబు సర్కార్.
అసెంబ్లీ సమావేశాల కవరేజ్ దూరంగా ఉండాలని నాలుగు టీవీ చానెల్స్‌పై ఆంక్షలు విధించారు. అందులో సాక్షినే ప్రముఖంగా ఉండడం ఎందుకో తెలిసిందే. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇలా మీడియాపై నిషేధం విధించగా, ఈ చర్యను పలువురు జర్నలిస్టులు ఖండిస్తున్నారు.
