media channels
-
మీడియా చానెల్స్ కి నారాయణ స్వామి కూతురు వార్నింగ్
-
అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనే!
‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియాను సభా కార్యక్రమాలను కవర్ చేయడానికి అను మతించకపోవడం అప్రజాస్వామికం. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియజేయడంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ సమస్యలపై ప్రజల వాణిని ప్రదర్శిస్తుంది’.‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం లేదా ప్రసారం చేయకుండా మీడియాను నిరోధించాలని గతంలో ప్రభుత్వాలు చేసిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. నేడు, అసెంబ్లీ దగ్గర మీడియా పాయింట్‌ని నిరోధించడం అత్యంత గర్హనీయం! ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించేందుకు, అవసరమైతే సూచనలు చేసేందుకు ప్రతిపక్షాలకు పూర్తి హక్కు ఉంది.’ ‘మీడియా మాత్రమే అధికార, ప్రతిపక్షాల వైఖరిని నిష్పక్షపాతంగా ప్రొజెక్ట్ చేయగలదు. మీడియా విధినిర్వహణకు అనుమతించకపోవడం అంటే హక్కుల ఉల్లంఘన’. ఈ మాటలు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి అనుకుంటారు. కానీ, ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడే అంటే కించిత్ ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ? అయితే ఈ మాటలు అన్నది ‘నిన్న!’ అదే తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అని చదువు కోవాలి. ఇప్పుడు మాత్రం ఆయన తెలుగు నాట నాలుగు ప్రముఖ టీవీ చానళ్ళ (సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ)ను అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయడానికి కూడా వీలు లేకుండా అనుమతి నిరాకరించారు.గతంలో అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌ని శీతకాల సమావేశాలలో దూరం జరిపినప్పుడు (అసెంబ్లీలో వార్తలు కవర్ చేసే వారికి అడ్డంకులు లేక పోయినా) అసలు అసెంబ్లీ కవరేజ్‌నే అనుమతించలేద న్నట్టు హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సరిగ్గా అదే పని చేశారు. అంటే ‘అధికారంలో ఉంటే ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా’ అనే తన సహజ సిద్ధ శైలిని మీడియా మీద కూడా ప్రదర్శించారు.పాలనా వైఫల్యాలతో తీవ్ర అసహనంలో ఉన్న బాబు కూటమి తన అణచివేత ధోరణిని మీడియా మీద కూడా ప్రదర్శిస్తోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించింది. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల కార్యకలాపాలను నివేదించే హక్కు పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటుంది. ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్) చట్టం ఇచ్చిన హక్కు. 1977లో కూడా మరొక సారి ఈ హక్కు స్పష్టమైంది. భారత నలభై నాల్గవ రాజ్యాంగ సవరణ తర్వాత మీడియా స్వేచ్ఛ హక్కును కాలరాస్తోంది బహుశా చంద్ర బాబు ప్రభుత్వమేనేమో?!మీడియాపై ఆంక్షలు అంటే, భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే! స్పీకర్ తనే సర్వాధికారి అన్నట్టు వ్యవహరించడం ఒంటెద్దు పోకడ తప్ప మరొకటి కాదు. ఈ తరహా శైలిపై భారత అత్యున్నత న్యాయస్థానం చాలా తీర్పులు ఇచ్చింది. భారతదేశంలో మీడియా హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ నుంచి ఉద్భవించాయి. పత్రికలకు ప్రచురించే హక్కు, సర్క్యులేట్ చేసే హక్కు, సమాచా రాన్ని స్వీకరించే హక్కు, ప్రకటన హక్కు, అసమ్మతి తెలిపే హక్కు వంటి అనేక రకాల హక్కులున్నాయి. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక విప్లవం పురోగతి మిలియన్ల మందికి రాతపూర్వక, మౌఖిక, దృశ్య మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తిని సులభతరం చేసింది. ప్రెస్, మీడియా సమాచారాన్ని రాయడానికి, ప్రచు రించడానికి, ప్రసారం చేయడానికి ఏ వ్యక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు. భారత రాజ్యాంగం, 1950లోని ఆర్టికల్ 19(1)(ఎ)లోని వాక్, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు నుంచి పత్రికలూ, మీడియా ఈ హక్కును పొందాయి. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, మర్యాద, నైతికత లేదా కోర్టు ధిక్కారానికి సంబంధించి, ఈ హక్కుపై రాజ్యాంగం కింద విధించే పరిమితులు మాత్రమే ఆర్టికల్ 19(2) ప్రకారం సహేతుకమైన పరిమితులను ఏర్పరుస్తాయి.‘రొమేశ్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్’ (1950)తో సహా అనేక కేసుల్లో ప్రసార స్వేచ్ఛ ఎంత అవసరమో, ప్రచురణ స్వేచ్ఛ కూడా అంతే అవసరమని కోర్టు చెప్పింది. ‘బెన్నెట్ కోల్మన్ అండ్ కో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1972) కేసులో సుప్రీం కోర్ట్ పేజీలను, సర్క్యులేషన్‌ను నిర్ణయించే అధికారాన్ని వార్తా పత్రికలకే వదిలి వేయాలని పేర్కొంది. వాక్, భావప్రకటనా స్వేచ్ఛ అనేది సర్క్యులేషన్ ద్వారా సమాచారాన్ని వ్యక్తీకరించడం, ప్రచురించడం, ప్రచారం చేయడం మాత్రమే కాకుండా సమాచారాన్ని స్వీకరించే హక్కును కలిగి ఉంటుంది. సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రభుత్వ సంస్థల నుండి సమా చారాన్ని అడిగే హక్కు పత్రికలతో సహా భారతీయ పౌరులకు ఉంది. కొసమెరుపు ఏమిటంటే... ఆత్యయిక స్థితి నాటి ఆంక్షలు ఎత్తి వేసి మీడియా స్వేచ్ఛ పునరుద్ధరించిన నాటి బీజేపీ నేడు ఈ అంక్షల ప్రభుత్వంలో భాగ స్వామి కావడం! మార్చి 21 వరకూ జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూసి ప్రజలకు నివేదించే హక్కును పైన పేర్కొన్న నాలుగు టీవీ ప్రతినిధులకూ నిరాకరించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే సుమా!పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ పత్రికా సంపాదకుడు -
మీడియాపైనా ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాకముందే రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని 9 నెలలుగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, తప్పులను ప్రశ్నించే గొంతులను నిరంకుశంగా నొక్కేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టులు చేయించి, జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా నాలుగు ప్రధాన టెలివిజన్ చానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాల కవరేజీకి రాకుండా చేసింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విశేషాలను ప్రజలకు అందించేందుకు టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ రిపోర్టర్లను, కెమెరామెన్లను ప్రభుత్వం అనుమతించలేదు. ఎంట్రీ పాసులు ఇవ్వకుండా ఇలా ఎందుకు బహిష్కరించారనేది కూడా చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చానళ్లుగానీ, పత్రికలుగానీ వ్యవహరిస్తే వివరణ కోరుతూ ముందస్తు నోటీసులు ఇవ్వడం పరిపాటి. ఆ తరువాతే ఏవైనా చర్యలు తీసుకోవడం అనేది నిబంధనల ప్రకారం జరగాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా కేవలం రాజకీయ కారణాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా గతంలో మీడియాకు ప్రవేశం ఉన్న మార్గాల్లోనూ అనేక ఆంక్షలు విధించింది. అసెంబ్లీ గేటు నుంచి మీడియాను అనుమతించలేదు. పాసులు ఉన్నప్పటికీ వెనుక నుంచే రావాలని చెప్పి అధికారులు పంపించేశారు. దీంతో అసెంబ్లీ బయట మండుటెండలోనే మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. వారికి కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిస్థితులను మీడియా గతంలో ఏనాడూ ఎదుర్కోలేదని, తమ విధులను మాత్రమే తాము నిర్వర్తిస్తున్నామని, తమపైనా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పక్షపాత ధోరణి తగదు: ఏపీయూడబ్ల్యూజేరాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజీ కోసం కొందరికి పాసులు ఇచ్చి, కొన్ని పత్రికలు, చానళ్ల రిపోర్టర్లను అనుమతించకపోవడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఏచూరి, ‘సామ్నా’ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా పట్ల పక్షపాత ధోరణులు కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధికారిక సమావేశాలకు కూడా కొన్ని పత్రికలు, చానల్స్‌ను పిలవకపోవడం తగదన్నారు. శాసనసభ స్పీకర్, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి, ప్రభుత్వ కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీతో పాటు మిగిలిన అన్ని చానల్స్, పత్రికలకు అనుమతి ఇచ్చి, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు.ఈ వైఖరి మంచిదికాదు: ఏపీడబ్ల్యూజేఎఫ్అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కొన్ని మీడియా సంస్థలకు పాసులు నిరాకరించడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వీసం శ్రీనివాసరావు, కె.మునిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన ప్రభుత్వం, అసెంబ్లీ అధికారులు మీడియా విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి మీడియా సంస్థలకు మీడియా పాసులు నిరాకరించడం సరైన విధానం కాదన్నారు. ఈ విషయంపై స్పీకర్ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించి మీడియా సంస్థలన్నిటికీ పాసులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
‘ ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయం?’
కాకినాడ: ఏపీ అసెంబ్లీ సమావేశా(AP Assembly Sessions)ల్లో భాగంగా కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీతో పాటు కొన్ని ఇతర మీడియా చానెళ్లను అడ్డుకోవడంపై ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ సీపీ ఇంచార్జి కురసాల కన్నబాబు(Kurasala Kannababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు.‘నోటీసులు ఇవ్వకుండా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయ్యడం లేదు. ఆయన కుమారుడు లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) కు ప్రతిపక్ష హోదా ఇవ్వనంటారు. కూటమీలో భాగస్వాములైన పార్టీకి పబ్లిక్ ఎకౌంట్స్ ఛైర్మన్ పదవి ఇస్తారు. చంద్రబాబుకు అనుకూల ఎల్లో మీడియా ఉన్నప్పుడు..ప్రశ్నించే మీడియా అంటే ఎందుకు భయం?, ఎంతకాలం మీడియా గొంతు నొక్కుతారు. చేతకాని అసమర్ధ ప్రభుత్వం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ‘సాక్షి’తో సహా నాలుగ చానెళ్లపై ఆంక్షలువిజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో నూ ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలను కవరేజ్ అంశానికి సంబంధించి ‘సాక్షి’తో సహా నాలుగు చానెళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో ఏ అసెంబ్లీ చరిత్రలో లేని మీడియాపై నిషేధ ఆజ్ఞలు అములు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియాపై ఆంక్షలు విధించింది. కూటమి కుట్రలు బయటపడతాయని ‘సాక్షి’తో పాటు నాలుగు చానెళ్లను నిషేధించింది. అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కుట్రలు తెరలేపింది. చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుంది! -
దేశ చరిత్రలో ఏ అసెంబ్లీలో లేని విధంగా మీడియాపై నిషేధం
-
అసెంబ్లీ సమావేశాల కవరేజీలోనూ రెడ్ బుక్ రాజ్యాంగం
-
అసెంబ్లీ సమావేశాల్లో సాక్షిపై ఆంక్షలు
సాక్షి, అమరావతి: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. ఆ రాజ్యాంగం ఇప్పుడు అసెంబ్లీని సైతం తాకింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల కవరేజీ విషయంలో టీవీ చానల్స్‌పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించింది.తమ అనుకూల మీడియాతో ఇష్టానుసారం కథనాలు ఇచ్చుకుంటున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మీడియా స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు తొలిసారి మీడియా కవరేజీపై ఆంక్షలు విధించింది చంద్రబాబు సర్కార్. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ దూరంగా ఉండాలని నాలుగు టీవీ చానెల్స్‌పై ఆంక్షలు విధించారు. అందులో సాక్షినే ప్రముఖంగా ఉండడం ఎందుకో తెలిసిందే. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇలా మీడియాపై నిషేధం విధించగా, ఈ చర్యను పలువురు జర్నలిస్టులు ఖండిస్తున్నారు. -
అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా.. : ఎమ్మెల్యే గుమ్మనూరు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/గుంతకల్లు: పత్రికల్లో ఇష్టమొచ్చినట్టు రాసుకుంటూ వెళితే రైలు పట్టాలపై పడుకోబెడతానని అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పాత్రికేయులను హెచ్చరించారు. గుంతకల్లులో టీడీపీ ప్రతినిధుల సమక్షంలో ఆయన మాట్లాడిన వీడియో టేపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక టీవీ చానల్ (సాక్షి టీవీ కాదు)లో గుమ్మనూరు జయరాం సోదరులు రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతున్నారన్నట్టుగా వార్తలొచ్చాయని, వాటిని నిరూపించాలని అన్నారు. తనకు మీడియా అంటే లెక్కలేదని, ఏదైనా అతిగా రాస్తే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ‘నేను అన్నీ చేసి వచ్చాను. ఇది నాకు పెద్ద లెక్క కాదు’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తన సోదరులు రాజకీయ పెత్తనం చేస్తున్నారని చాలామంది అంటున్నారని, అవసరమైతే వారిని పక్కనపెట్టి తానే రాజకీయం చేస్తానని అన్నారు. తనపై వార్తలు రాస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనపై కొంతమంది పనిగట్టుకుని వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, వాటిని నిరూపించలేకపోతే నిజంగానే రైలు పట్టాలపై పడుకోబెడతానని అన్నారు. తాను ఫ్రెండ్లీగానే అడుగుతున్నానని, ఏదైనా రాసేట్టయితే చెప్పండని, తాను వెళ్లిపోయాక ఏవేవో రాయొద్దని అన్నారు. బుధవారం సాయంత్రం గుంతకల్లులో మీడియాతో మాట్లాడుతూ.. తనపై మీడియా చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని, రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానంటూ ప్రసారాలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఇలాంటి ప్రసారాలను చేస్తే ఇదే తరహాలో ప్రవర్తించాల్సి వస్తుందని మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. -
మీడియాపై చిందులేసిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
-
మీడియాపై చిందులేసిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
-
మంచు మనోజ్ ను ప్రశ్నించిన రాచకొండ సీపీ
-
మీడియాపై రెచ్చిపోయిన మోహన్ బాబు
-
జైశంకర్ ఇంటర్వ్యూ.. మీడియా సంస్థపై కెనడా నిషేధం
ఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌లతో కలిసి ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే.. ఈ ఇంటర్వ్యూ విషయంలో కెనడా మరోసారి దూకుడుగా వ్యవహరించింది. ఇంటర్య్వూ ప్రసారం చేసిన.. ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్ , ఆస్ట్రేలియన్ న్యూస్ అవుట్లెట్ పేజీలు బ్లాక్ చేసింది. అక్కడితో ఆగకుండా కొన్ని గంటల్లోనే సదరు మీడియా సంస్థపై కెనడా నిషేధం విధించింది. దీంతో కెనడా వ్యహరించిన తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇటువంటి చర్యలు వాక్ స్వాతంత్రాన్ని కెనడా వంచిస్తోందని మండిపడింది. కెనడాలో ఆస్ట్రేలియా టుడే సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను బ్లాక్ చేయటంపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ‘‘ఆస్ట్రేలియా టుడే మీడియా అవుట్లెట్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పేజీలు బ్లాక్ చేయబడ్డాయి. కెనడాలోని వీక్షకులకు అవి అందుబాటులో లేవు. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్.. పెన్నీ వాంగ్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కొన్ని గంటల తర్వాత జరిగింది. కెనడా తీరుపై మేం ఆశ్చర్యపోయాం. చాలా వింతగా అనిపించింది. అయితే, ఇవి కెనడా కపటత్వాన్ని మరోసారి ఎత్తి చూపే చర్యలు. ..వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించి విదేశాంగ మంత్రి మూడు విషయాల గురించి మాట్లాడారు. కెనడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోంది. భారత దౌత్యవేత్తలపై నిఘా కెనాడా నిఘా పెట్టడం ఆమోదయోగ్యం కాదు. కెనడాలో వేర్పాటువాదులకు రాజకీయంగా చోటు ఇస్తోంది. భారతదేశ అంశాలు మాట్లాడితే.. ఆస్ట్రేలియా టుడే ఛానెల్‌ను కెనడా ఎందుకు బ్లాక్ చేసింది’’ అని అన్నారు.చదవండి: ‘ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం.. భారత్‌కు అనుకూలం’ -
మీడియా ముసుగు.. డ్రగ్స్ మాఫియా చేసే వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? అని కూటమి సర్కార్‌ను వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. ఈ క్రమంలో డ్రగ్స్ దందాలో కేసులకు సంబంధించి సాక్ష్యాలను, కీలక విషయాలను వెల్లడించింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ వివరాలను వెల్లడించింది.💣 Exposed 💣మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!#YellowMediaDrugsMafia pic.twitter.com/1TDPqGtjsS— YSR Congress Party (@YSRCParty) October 24, 2024 💣 Truth Bomb 💣దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. గుట్టు చప్పుడు కాకుండా 13 ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్ని భ్రష్టుపట్టిస్తున్న ఎల్లో డ్రగ్స్ మాఫియా#YellowMediaDrugsMafia pic.twitter.com/Ye7WqRehBY— YSR Congress Party (@YSRCParty) October 24, 2024 గత కొన్నేళ్లుగా 15 మందితో వందలాది డ్రగ్స్ సంబంధిత చర్చలు.. ఇలాంటి వాడికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడితే.. తిరుమల పవిత్రతని కాపాడతాడా?#YellowMediaDrugsMafia pic.twitter.com/zzMtTBPZMn— YSR Congress Party (@YSRCParty) October 24, 2024అయితే, రాష్ట్ర పోలీసు విభాగం కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకప్పుడు ఏదైనా కేసులో దొరికిన డ్రగ్ పెడ్లర్ వద్దే దర్యాప్తు, విచారణ ఆగిపోయేది. తద్వారా మాదకద్రవ్యాల దందాకు కళ్లెం పడట్లేదని భావించిన పోలీసు విభాగం కొత్త పంథా అనుసరించడం మొదలెట్టింది. డ్రగ్స్ విక్రేతలు, ఖరీదు చేసే వారితో పాటు అనుమానితులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సైతం సమకూర్చుకుంది.ఏదైనా ఓ కేసులో డ్రగ్ సప్లయర్, పెడ్లర్, కన్జ్యూమర్లతో పాటు వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను ఆద్యంతం పరిశీలిస్తోంది. ఆయా వివరాలతో ప్రత్యేకంగా డేటాబేస్ సైతం రూపొందిస్తోంది. దాన్ని కేంద్రం ఆ«దీనంలోని క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ అండ్ ట్రాకింగ్ సిస్టంతో (సీసీటీఎన్ఎస్) అనుసంధానించింది. ఓ కేసు దర్యాప్తులో దొరికిన తీగ పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్ వినియోగదారుడికి సంబంధించిన కాల్‌డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరికొంత లోతుగా ఆరా తీశారు.దీంతో ఆయనకు ఈ డ్రగ్ వినియోగదారుడితో పాటు మరో రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న 14 మందితో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో డ్రగ్స్ వినియోగదారులతో పాటు ఆ కేసుల్లో అనుమానితులు సైతం ఉన్నారు. కొందరితో చాలా కాలంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారని తెలిసింది. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు సైతం ఉండటం గమనార్హం. కదలికలపై కన్ను డ్రగ్స్ దందా చేస్తున్న వారితో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఉన్నత కుటుంబాల్లో ఈ జాఢ్యం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఈ వర్గాల్లో పెరిగిన డిమాండ్‌తోనే సింథటిక్ డ్రగ్స్ దందా జోరందుకుంటోంది.ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఇటీవలి కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ మీడియా సంస్థ అధినేతకే మాదకద్రవ్యాల వినియోగదారుడు, ఆ కేసుల్లో అనుమానితులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు ఆ జాబితాలోని వారిపై నిఘా ఉంచడంతో పాటు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 2011 నుంచి సంబంధాలు మీడియా ఛానల్ అధినేతకు, మాదకద్రవ్యాల కేసుల్లో అనుమానితులు, వినియోగదారులుగా ఉన్న వారి మధ్య జరిగిన సంప్రదింపులు భారీ స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మందితో 2,500 కాల్స్ ఉన్నట్లు తెలిసింది. వీటిలో అత్యధికం ఇన్కమింగ్ కాల్స్ కాగా ఎస్సెమ్మెస్‌ల్లో మాత్రం ఎక్కువగా ఔట్ గోయింగ్ ఉన్నాయి. వీరిలో కొందరితో ఆయన 2011 నుంచి సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం. వారి మధ్య వందల నిమిషాల సేపు సంప్రదింపులు జరిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండటంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. -
డ్రగ్స్ దందాలో టీవీ చానల్ అధినేత
సాక్షి, హైదరాబాద్: ఆయనో మీడియా అధినేత.. తండ్రి స్థాపించిన టీవీ చానల్ నిర్వహణ పగ్గాలు వారసత్వంగా పొందారు. గతంలోనే పలు వివాదాలు ఆయన్ను చుట్టుముట్టగా, ఇటీవల ఓ ‘సొసైటీ’ వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర వివాదాస్పదమైంది. తాజాగా ఆయనకు సంబంధించిన మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు, అనుమానితులతో సదరు న్యూస్ చానల్ యజమానికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 మంది డ్రగ్స్ వినియోగదారులు, అనుమానితులతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో పటిష్ట నిఘా వేసి ఉంచారు. కొన్నాళ్లుగా పరిశీలిస్తున్న పోలీసులు రాష్ట్ర పోలీసు విభాగం కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకప్పుడు ఏదైనా కేసులో దొరికిన డ్రగ్ పెడ్లర్ వద్దే దర్యాప్తు, విచారణ ఆగిపోయేది. తద్వారా మాదకద్రవ్యాల దందాకు కళ్లెం పడట్లేదని భావించిన పోలీసు విభాగం కొత్త పంథా అనుసరించడం మొదలెట్టింది. డ్రగ్స్ విక్రేతలు, ఖరీదు చేసే వారితో పాటు అనుమానితులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సైతం సమకూర్చుకుంది. ఏదైనా ఓ కేసులో డ్రగ్ సప్లయర్, పెడ్లర్, కన్జ్యూమర్లతో పాటు వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను ఆద్యంతం పరిశీలిస్తోంది. ఆయా వివరాలతో ప్రత్యేకంగా డేటాబేస్ సైతం రూపొందిస్తోంది. దాన్ని కేంద్రం ఆ«దీనంలోని క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ అండ్ ట్రాకింగ్ సిస్టంతో (సీసీటీఎన్ఎస్) అనుసంధానించింది. ఓ కేసు దర్యాప్తులో దొరికిన తీగ పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్ వినియోగదారుడికి సంబంధించిన కాల్‌డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరికొంత లోతుగా ఆరా తీశారు. దీంతో ఆయనకు ఈ డ్రగ్ వినియోగదారుడితో పాటు మరో రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న 14 మందితో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో డ్రగ్స్ వినియోగదారులతో పాటు ఆ కేసుల్లో అనుమానితులు సైతం ఉన్నారు. కొందరితో చాలా కాలంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారని తెలిసింది. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు సైతం ఉండటం గమనార్హం. కదలికలపై కన్ను డ్రగ్స్ దందా చేస్తున్న వారితో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఉన్నత కుటుంబాల్లో ఈ జాఢ్యం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఈ వర్గాల్లో పెరిగిన డిమాండ్‌తోనే సింథటిక్ డ్రగ్స్ దందా జోరందుకుంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఇటీవలి కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ మీడియా సంస్థ అధినేతకే మాదకద్రవ్యాల వినియోగదారుడు, ఆ కేసుల్లో అనుమానితులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు ఆ జాబితాలోని వారిపై నిఘా ఉంచడంతో పాటు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 2011 నుంచి సంబంధాలు మీడియా ఛానల్ అధినేతకు, మాదకద్రవ్యాల కేసుల్లో అనుమానితులు, వినియోగదారులుగా ఉన్న వారి మధ్య జరిగిన సంప్రదింపులు భారీ స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మందితో 2,500 కాల్స్ ఉన్నట్లు తెలిసింది. వీటిలో అత్యధికం ఇన్కమింగ్ కాల్స్ కాగా ఎస్సెమ్మెస్‌ల్లో మాత్రం ఎక్కువగా ఔట్ గోయింగ్ ఉన్నాయి. వీరిలో కొందరితో ఆయన 2011 నుంచి సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం. వారి మధ్య వందల నిమిషాల సేపు సంప్రదింపులు జరిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉండటంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. -
మీడియా ముందుకు కొత్త జంట కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ (ఫొటోలు)
-
మీడియా స్వేచ్ఛకు కళ్లెమా!
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయకతప్పని పక్షం రోజుల్లోనే ప్రస్తుతం భిన్నవర్గాల పరిశీలనలో ఉన్నదని చెబుతున్న బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ముసాయిదాను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వెనక్కి తీసుకుంది. కారణమేదైనా ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ బిల్లు తొలి ముసాయిదా నిరుడు నవంబర్‌లో విడుదల చేయగా దానిపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ గత నెల రెండో ముసాయిదా తీసుకొచ్చారు. తాజాగా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. వచ్చే అక్టోబర్ 15 వరకూ ముసా యిదా బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. బహుశా శీతా కాల సమావేశాలనాటికి దీనికి తుదిరూపం ఇవ్వాలన్నది పాలకుల ఉద్దేశం కావొచ్చు. డిజిటల్ మీడియా ప్రస్తుతం ఊహకందని రీతిలో విస్తరించింది. 1959లో ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించిన టెలివిజన్ ప్రసారసేవలు 80వ దశకం చివరినాటికి కొత్త పుంతలు తొక్కాయి. స్టార్ టీవీ, ఎంటీవీ, బీబీసీ, సీఎన్ఎన్ వగైరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్వంటి సామాజిక మాధ్యమాలతోపాటు ఓటీటీలు వచ్చాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి సరేసరి. అన్నింటా మంచీ చెడూ ఉన్నట్టే వీటివల్ల కూడా సమస్యలు ఎదురువుతూ ఉండొచ్చు. అవి దుష్పరిణామాలకు దారితీయటం నిజమే కావొచ్చు. అందుకు తగిన చట్టాలు తీసుకు రావటం కూడా తప్పేమీ కాదు. కానీ ఈ మాధ్యమాలను నియంత్రించే పేరిట భావప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేయాలనుకోవటం, అసమ్మతిని అణిచేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ ముసాయిదా బిల్లు చేస్తున్నది అదే. గతంలో కేబుల్ రంగం హవా నడిచినప్పుడు వీక్షకులకు ఇష్టం ఉన్నా లేకున్నా అనేక చానెళ్లు వచ్చిపడేవి. వర్తమానంలో అలా కాదు. ఏం చూడాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీక్షకులకు ఉంటుంది. పార్టీలకు అమ్ముడుపోయిన చానెళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అర్థమయ్యాక జనం వాటిని చూడటం మానుకుంటున్నారు. ఆన్లైన్లో ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు. తమకు నచ్చిన, తాము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఉన్నదనుకుంటేనే ఆన్లైన్లో లభ్య మయ్యే వీడియోలను వీక్షిస్తారు. వార్తా విశ్లేషణలను చదువుతారు. ఒక అంశంపై ఎవరెవరి అభిప్రా యాలు ఎలావున్నాయో తెలుసుకుంటారు. ఈ క్రమంలో సహజంగానే ప్రజలను పక్కదోవపట్టించేవాళ్లు ఉంటారు. అశ్లీలతనూ, దుర్భాషలనూ గుప్పించేవారుంటారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసేవారూ ఉంటారు. అలాంటివారిపై తగిన చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ కాదనరు. కానీ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారిని కూడా వారితో సమంచేసి శిక్షించే ధోరణి ఎంతవరకూ సబబు? అత్యధిక వీక్షకుల్ని రాబట్టుకుంటున్న ఆన్లైన్ మాధ్యమాలకు సైతం ముసా యిదాలో ఏముందో అధికారికంగా తెలియదు. అనేకానేక ఆన్లైన్ చానెళ్లు, ఇతర ప్రచురణ మాధ్య మాలూ సభ్యులుగా ఉన్న డిజిపబ్ వంటి స్వయంనియంత్రణ సంస్థలకే ఈ ముసాయిదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. మరి కేంద్రం ఇంతవరకూ సాగించామంటున్న సంప్రదింపులు ఎవరితో జరిగినట్టు? రెండు మూడు ఓటీటీ యాజమాన్యాలనో, కార్పొరేట్ రంగ ఆధిపత్యంలో సాగుతున్న ఇతర మాధ్యమాలనో, తాము నిపుణులుగా భావించేవారినో సంప్రదిస్తే సరిపోతుందా? సాగు చట్టాల విషయంలోనూ లక్షలాదిమంది రైతులతో, వేలాది సంఘాలతో చర్చించామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. చివరకు ఏమైంది? రైతులు పట్టుదలగా పోరాడాక వెనక్కు తీసుకోకతప్పలేదు. సమస్యేమంటే...ట్విటర్లో లక్షల్లో అనుయాయులున్న రాజకీయ నాయకులు మొదలుకొని ధ్రువ్రాఠివంటి పాపులర్ యూట్యూబర్ల వరకూ... ఎంతో నిబద్ధతతో సీనియర్ జర్నలిస్టులు నడిపే మాధ్యమాలవరకూ అందరినీ ముసాయిదా బిల్లు ఒకే గాటన కడు తోంది. ఆఖరికి పత్రికలూ, చానెళ్లూ అనుబంధంగా నడుపుతున్న డిజిటల్ మాధ్యమాలు సైతం ఈ పరిధిలోకొస్తాయి. పైగా ఈ కార్యకలాపాలు క్రిమినల్ చట్టాల పరిధిలోకి కూడా వెళ్లి అనేక కేసులు దాఖలవుతాయి. అరెస్టయితే బెయిల్ దుర్లభమవుతుంది. తటస్థంగా విశ్లేషణలందిస్తూ వేలల్లోనో, లక్షల్లోనో వీక్షకుల్ని సంపాదించుకుంటున్న వ్యక్తులు కూడా ఈ బిల్లు చట్టమైతే అనేకానేక పత్రాలు దాఖలుచేయాల్సివస్తుంది. అంతేకాదు...ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవటం, స్వీయ మదింపు కమిటీని ఏర్పాటుచేసుకోవటం తప్పనిసరవుతుంది. ఈ వ్యయాన్నంతా వీక్షకులనుంచి వసూలు చేయటం సాధ్యమేనా? అసలు వచ్చే ఆదాయం ఎంత? పైగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారనుకుంటే వారెంట్ లేకుండా దాడులు చేసి పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభు త్వాలకు వస్తుందంటున్నారు.ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి విపక్షాలను జైళ్లలో కుక్కి అసమ్మతిని అణి చేశారని బీజేపీ తరచు చెబుతుంటుంది. రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రతియేటా జూన్ 25ను పాటించాలని కూడా పిలుపునిచ్చింది. అలాంటి పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ముసాయిదాను తీసుకురావటం, దాన్ని బహిరంగపరచకపోవటం వింత కాదా? మన పొరుగు నున్న బంగ్లాదేశ్‌లో హసీనా హయాంలో ఇలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు. కానీ అక్కడ నిరసన వెల్లువ ఆగిందా? తమ నిర్ణయాలపై సామాన్యులు ఏమనుకుంటున్నారో, వారిలోవున్న అసంతృప్తి ఏమిటో తెలుసుకోవటానికి డిజిటల్ మీడియా తోడ్పడుతుంది. అది పాలకులకే మంచిది. మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టయిన ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవటం ఉత్తమం. -
మీడియాతో AAY టీమ్ ఇంటరాక్షన్
-
సాక్షి వద్దు..మీడియాపై ఆంక్షలు
-
అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరికలపై స్పందించిన జైశంకర్
కోల్‌కతా: భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల గురించి విదేశీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికల గురించి వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోందన్నారు. తాను రాసిన ‘‘వై భారత్ మాటర్స్’’ బుక్ బంగ్లా ఎడిషన్‌ను జైశంకర్.. కోల్‌కతాలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడారు.‘‘విదేశీ మీడియా మన దేశాన్ని ప్రభావితం చేయాలనుకుంటోంది. ఎందుకుంటే ఈ ప్రపంచాన్ని వాల్లు గత 70-80 ఏళ్ల నుంచి ప్రభావం చేస్తున్నామని భావిస్తున్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాలు సైతం వాళ్లు ప్రపంచాన్ని 200 ఏళ్ల నుంచి ప్రభావితం చేస్తున్నామని భావిస్తున్నాయి. వాళ్లు తమ అలవాట్లను మార్చుకోవటం అంత సులువైన పని కాదు...విదేశీ మీడియా ఎందుకు భారత్‌కు వ్యతిరేకంగ కథనాలు ప్రచురిస్తోంది?. ఎందుకంటే దేశంలో ఒక వర్గం వారు పాలించాలని ఆరాటపడుతోంది. అందుకే ప్రభావితం చేయలానుకుంటోంది. కానీ, భారతీయ ప్రజలంతా అలా భావించటం లేదు. అదీకాక విదేశీ మీడియా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సైతం బహిరంగంగా ఆమోదం తెలుపుతోంది. వారు తమ ప్రాధాన్యతను దాచుకోవటం లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. కొంతమంది ఇలానే 300 ఏళ్ల నుంచి ప్రవర్తిస్తూ చాలా అనుభవం పొందారు. ..కొన్ని న్యూస్‌పేపర్లు తరచూ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. పలు ఇండెక్స్‌ల్లో తక్కువగా చూపుతారు. తమ ఎన్నికల ఫలితాలను నిర్ణయించుకోవడానికి కోర్టుకు వెళ్లే దేశాలు సైతం.. మనకు ఎన్నికలు నిర్వహించటం గురించి తెలియజేయటం చాలా విడ్డూరం’’ అని జైశంకర్ అన్నారు.ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై అమెరికా చేసిన ఆంక్షల హెచ్చరికలపై మంత్రి శంకర్ స్పందించారు.‘ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ విషయంలో సంకుచితంగా ప్రవర్తించటం మానుకోవాలి. గతంలో ఇదే చాబహార్ పోర్టు గురించి అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇది అందరీ ప్రయోజనం కోసం చేపట్టిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా సంకుచితం స్వభావంతో చూడవద్దు’ అని జైశంక్ అన్నారు. -
Rahul Gandhi: బీజేపీని విమర్శిస్తే దూషిస్తారా?
కన్నూర్: కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలను, సిద్ధాంతాలను విమర్శించినందుకు కొన్ని మీడియా సంస్థలు నిత్యం తనను దూషిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. గురువారం కేరళలోని కన్నూర్, పాలక్కాడ్, కొట్టాయంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ విధానాలు దేశ ప్రజలకు శాపంగా మారాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తాను పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. అందుకు దూషణలు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన మీడియా చానళ్లు తనను లక్ష్యంగా చేసుకొని రోజంతా తిట్లదండకం వల్లిస్తున్నాయని ఆక్షేపించారు. బీజేపీతో పినరయి విజయన్ లాలూచీ భారతదేశం ఇప్పుడున్నంత అస్తవ్యస్తంగా గతంలో ఎన్నడూ లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సంపద పంపిణీలో ఇప్పుడున్న అసమానతలు గతంలో లేవని గుర్తుచేశారు. అందుకే రాబోయే తమ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్ మండిపడ్డారు. బీజేపీతో విజయన్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయన్ ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. దేశ ప్రజలపై ఒకే భాష, ఒకే చరిత్రను రుద్దడానికి కమల దళం కుట్రలు పన్నుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే ఎన్నికలివి ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు జరుగుతున్న ఎన్నికలు అని రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు వీడియో సందేశం ఇచ్చారు. భారతదేశం అనే భావనను నిరీ్వర్యం చేసేందుకు బీజేపీ సాగిస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే వెన్నుముక అని, వారిపై పెద్ద బాధ్యత ఉందని చెప్పారు. స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థలపై, న్యాయ వ్యవస్థపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడికి దిగుతున్నాయని ఆరోపించారు. -
‘అంతా దైవ నిర్ణయమే’..83 వేల కోట్ల డీల్ రద్దుపై జీ సీఈఓ
జీ-సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాల మధ్య కుదుర్చుకున్న భారీ ఒప్పందం రద్దయింది. అయితే, దీనిపై జీ సీఈఓ పునీత్ గోయెంకా తనదైన శైలిలో స్పందించారు. అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. అనంతరం ఎక్స్.కామ్‌లో అయోద్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక ఫోటోల్ని జత చేస్తూ.. ఈ రోజు ఉదయం ఎంతో ముఖ్యమైన అయోద్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యాను. As I arrived at Ayodhya early this morning for the auspicious occasion of Pran Pratishtha, I received a message that the deal that I have spent 2 years envisioning and working towards had fallen through, despite my best and most honest efforts. I believe this to be a sign from… pic.twitter.com/gASsM4NdKq — Punit Goenka (@punitgoenka) January 22, 2024 గత రెండేళ్లుగా నేను ఎంతగానో అత్యంత నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ సోనీ పిక్చర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినట్లు మెసేజ్ వచ్చింది. ఈ విలీన ప్రక్రియ ఆగిపోవడం దైవ నిర్ణయంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నేను సానుకూలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. భారత్ మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ వాటాదారులందరిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ట్వీట్లో పేర్కొన్నారు. -
మరో మీడియా సంస్థను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను కొనుగోలు చేశారు. ఇప్పటికే పలు మీడియా సంస్థల కొనుగోళ్లు,పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాని చేజిక్కించుకున్నారు. ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 50.50 శాతం మెజారిటీ వాటాను తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) కొనుగోలు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. గత ఏడాది మార్చిలో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బీక్యూ ప్రైమ్‌ను నిర్వహించే క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాను టేకోవర్ చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డిసెంబర్లో న్యూస్ టెలివిజన్ చానల్ ఎన్డీటీవీలో 65 శాతం వాటాను కొన్నది. ఇప్పుడు ఐఏఎన్ఎస్లో వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
మీడియాకు ముప్పుగా మారిన దేశమేది? 17 నెలల్లో ఎంతమంది బలయ్యారు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరులతో పాటు, కొందరు జర్నలిస్టులు కూడా మృతిచెందారు. అయితే ఇలాంటి పరిస్థితులు లేనప్పటికీ ఫిలిప్పీన్స్‌లో పలువురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఈ దేశంలో హత్యకు గురైన జర్నలిస్టుల జాబితాలోకి మరో పేరు చేరింది. తాజాగా రేడియో బ్రాడ్‌కాస్టర్ ఒకరు స్టూడియోలో తుపాకీ కాల్పులకు బలయ్యారు. గడచిన 17 నెలల్లో ఫిలిప్పీన్స్‌లో నలుగురు మీడియా సిబ్బంది హత్యకు గురయ్యారు. కాలాంబా మునిసిపాలిటీ ప్రతినిధి కెప్టెన్ డియోర్ రాగోనియా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 57 ఏళ్ల రేడియో బ్రాడ్‌కాస్టర్ జువాన్ జుమలోన్‌కు చెందిన స్టూడియోలోకి చొరబడిన సాయుధ దుండగుడు అతని తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జుమాలోన్ మృతి చెందాడు. ‘డీజే జానీ వాకర్’గా పేరొందిన జుమాలోన్.. మిండానావోలోని తన నివాసంలోని స్టూడియోలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం ఆగంతకుడు పరారయ్యాడు. ఈ ఘటన స్టూడియోలోని సీసీ కెమెరాలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ హత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఈ కేసులో నేరస్తులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులపై దాడులను సహించబోమని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారి చర్యలు తీసుకుంటామని మార్కోస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్(ఎన్‌యుజేపీ) తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది జూన్‌లో ఫెర్డినాండ్ మార్కోస్ అధికారం చేపట్టిన తర్వాత ఫిలిప్పీన్స్‌లో నలుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఫిలిప్పీన్స్ మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు -
సీజేఐకి మీడియా సంస్థల లేఖ
ఢిల్లీ: న్యూస్‌క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థను అరెస్టు కూడా చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్నలిస్టులను విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక విధివిధానాలు ఉండాలని కోరుతూ 18 మీడియా సంస్థలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. 'దేశంలో తమపై ప్రతీకార దాడులు జరుగుతాయని జర్నలిస్టులు భయంతో పనిచేస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదు. వీరిపై ప్రతికారంతో లక్షిత ప్రతీకార దాడులు జరుగుతాయనే భయభ్రాంతులకు గురిచేస్తోంది. చట్టం నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని కోరుకోవడం లేదు. కానీ పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య లక్ష్యాలు దెబ్బతింటాయి. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉంటాం.' అని సీజేఐ చంద్రచూడ్‌కు మీడియా సంస్థలు లేఖ రాశాయి. న్యూస్‌క్లిక్ ఆన్లైన్ పోర్టల్ విదేశాల నుంచి నిధులను అక్రమంగా పొందిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ల్యాప్‌ట్యాప్, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల జాబితాలో ఆప్! -
'కాళేశ్వరం అవినీతిపై యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైంది..'
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి మీద యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ అన్నారు. తొందరలోనే బీజేపీ అభ్యర్థుల లిస్టు వస్తుందని చెప్పారు. తమ పార్టీలోకి వచ్చే వాళ్ళే తప్ప.. వెళ్ళే వారు లేరని అన్నారు. బీజేపీలో చేరేవారిని ఈ నెల 27న అందరూ చూస్తారని పేర్కొన్నారు. నేటి ప్రెస్ మీట్ ట్రైలర్ మాత్రమే.. మూవీ త్వరలో చూపిస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్.. 9 ఏళ్లలో టీచర్, యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్ చేయలేదని మండిపడ్డారు. ఇచ్చిన నోటిఫికేషన్ లోనూ పేపర్ లీకేజీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసిఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత , సంతోష్, హరీష్ రావు లకు మాత్రమే ఎంప్లాయిమెంట్ దొరికిందని అన్నారు. కేసిఆర్ పర్యటన ఉన్న ప్రాంతాల్లో ప్రతిపక్షాల ముందస్తు అరెస్టు చేస్తున్నారని ప్రకాష్ జవదేకర్ దుయ్యబట్టారు. మాజీ మంత్రి, మహిళ అని చూడకుండా డీకే అరుణను అడ్డుకుని అరెస్ట్ చేయడం ఎంటని మండిపడ్డారు. తాము తెలంగాణ ప్రజల కోసం పోరాడతామని అన్నారు. బీజేపీకి భయపడే తమ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Hanumanth Rao Warns Harish Rao: సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా... మైనంపల్లి హనుమంత రావు -
మీడియా రంగంలోకి అడుగు పెట్టిన ‘AI’.. భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్! గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగి పోతున్న టెక్నాలజీ. ఈ అధునాతమైన సాంకేతికత కారణంగా టెక్నాలజీతో పాటు ఇతర రంగాలకు చెందిన కోట్లాది ఉద్యోగాలు పోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఆధారిత సేవల్ని ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా, మీడియా రంగంపై ఏఐ ప్రభావం భారీ స్థాయిలో ఉంటుందని తేలింది. ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్ రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించి, కొంతమంది ఉద్యోగులను కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్ స్నేహితుడిగా పేరొందిన కంపెనీ సీఈఓ మథియాస్ డోఫ్నర్ ఓన్లీ డిజిటల్ విధానం వైపు మళ్లినట్లు సీఎన్ఎన్ తెలిపింది. పలు నివేదికల ప్రకారం. ఆక్సెల్ స్ప్రింగర్ ప్రింట్ ప్రొడక్షన్లో పాల్గొనే ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్లు, ఇతర విభాగాల్లో ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేయడమో లేదంటే దశల వారీగా తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా,యూరప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వార్తాపత్రికల్లో ఆక్సెల్ స్ప్రింగర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. -
ఛానల్ బ్యాన్.. కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. మలయాళం న్యూస్ ఛానల్ ‘మీడియావన్’పై కేంద్రం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మీడియావన్ ఛానల్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉన్నట్లు సీల్డ్ కవర్లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. జాతీయ భద్రత పేరుతో పౌరుల హక్కులను హరించరాదని స్పష్టం చేసింది. మీడియా వన్ ఛానెల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ లైసెన్స్‌ను నాలుగు వారాల్లో పునరుద్ధరించాలని ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా మీడియావన్ ప్రసారాలను నిలిపివేస్తూ, ఆ ఛానెల్ లైసెన్సును రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరి 31 ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కూడా సమర్థించింది. కాగా ఛానల్‌పై విధించిన నిషేధంపై మధ్యమం బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చేంతవరకు ప్రసార లైసెన్స్‌ను పునరుద్ధరించకూడదన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గతేడాది మార్చిలో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఛానల్ నిషేధంపై స్టే విధించింది. తాజాగా దీనిపై మరోసారి విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం మీడియా స్వతంత్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది. విమర్శనాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రభుత్వ వ్యతిరేకత కాదని తెలిపింది. ఈ కేసులో మీడియా సంస్థకు ఉగ్రవాదులతో సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కేవలం ఊహాగానాలను ఆధారంగా చేసుకుని పత్రికా రంగంపై అసమంజసమైన ఆంక్షలను విధించకూడదని, దీనివల్ల పత్రికా స్వేచ్ఛపై ప్రభావం పడుతుందని పేర్కొంది. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం పత్రికల కర్తవ్యమని గుర్తు చేసింది. ఛానల్ ప్రసారాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని గాలి మాటలతో చెప్పలేమని, దానికి సరైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మీడియావన్ లైసెన్సులను పునరుద్ధరించకుండా కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో హోం మంత్రిత్వ శాఖ సీల్డ్ కవర్లో డాక్యుమెంట్లు కేరళ హైకోర్టుకు సమర్పించడంపై సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఇతర పక్షాలకు సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ప్రభుత్వానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, అన్ని దర్యాప్తు నివేదికలను రహస్యంగా ఉంచడం కుదరదని తెలిపింది. ఇది పౌరుల హక్కులు, స్వేచ్ఛను ప్రభావితం చేసే అంశాలను బయటకు వెల్లడించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. -
ఏ మీడియా ప్రభుత్వాన్ని శాసించలేదు : రేవంత్ రెడ్డి
-
మీడియా, వినోదం ఆదాయం 1.6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: భారత్ మీడియా, వినోద రంగం ఆదాయాలు మార్చితో ప్రారంభమయ్యే 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 నుంచి 14 శాతం వృద్ధితో రూ. 1.6 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. ఆదాయాల వృద్ధి స్పీడ్ విషయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ తొలి వరుసలో నిలిస్తే, టీవీ, ప్రింట్లు వరుసలో తరువాత ఉండనున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►మీడియా, వినోద రంగం ఆదాయంలో 55 శాతం వాటా ప్రకటన విభాగం నుంచి రాబడికి సంబంధించినదే. ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉండడంతో ఈ విభాగంలో ఆదాయాలు 14 శాతం వృద్ధి చెందుతాయని అంచనా. అలాగే, 2024 మధ్యలో జరిగే సాధారణ ఎన్నికలు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రకటన వ్యయంలో పెరుగుదలను పెంచుతాయి. ► మిగిలిన 45 శాతం చందాల రూపంలో ఉంటుంది. ఈ విభాగంలో వృద్ధి 12 శాతం వరకూ నమోదుకావచ్చు. ►వేర్వేరుగా చూస్తే, ప్రింట్ మీడియాలో ఆదాయాలు 15 శాతం పెరిగే వీలుంది. అయితే ఈ విభాగంలో ఆదాయాలు ఇంకా కరోనా ముందస్తు స్థాయికి చేరలేదు. ఇంకా ఈ విషయంలో ఆదాయాలు ఇంకా 8 నుంచి 10 శాతం వరకూ వెనుకబడి ఉన్నాయి. ఆంగ్ల ఎడిషన్ల విషయంలో ఆదాయాల రికవరీ నెమ్మదిగా ఉండడం దీనికి కారణం. అయితే రేడియో, అవుట్డోర్ వంటి ఇతర హైపర్‌లోకల్ మీడియా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరోనా ముందస్తు స్థాయిలను చేరుకోవచ్చు. ఈ విభాగాలకు కీలకమైన వనరుగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల కోసం అధిక యాడ్ బడ్జెట్ కేటాయింపులు దీనికి కారణం. ►ఫిల్మ్ ఎగ్జిబిషన్ విషయానికి వస్తే, థియేటర్ వసూళ్లు కోవిడ్–19 వల్ల తీవ్రంగా నష్టపోయాయి. అయితే 2023–24లో పటిష్టంగా ఆయా ఆదాయాఉల రికవరీ సాధించవచ్చు.30 శాతం వరకూ గణనీయమైన వృద్ధి రేటు నమోదవుతుందని భావిస్తున్నాం. స్క్రీన్లు, ఆక్యుపెన్సీ రేటు పెరిగే అవకాశాలు ఉండడం మా అంచనాలకు కారణం. ►టీవీ, ప్రింట్ మీడియాల్లో రాబడుల్లో వృద్ధి స్పీడ్ మామూలుగా నమోదుకావచ్చు. దీర్ఘకాలికంగా డిజిటల్ మాధ్యమానికి ప్రాధాన్యత పెరుగుతుండడమే దీనికి కారణం. -
అప్పుడు పొగిడిన మీడియానే... నన్నిప్పుడు తిడుతోంది: రాహుల్
ఝలావార్: తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో 2004–08 కాలంలో పొగడ్తలతో ముంచెత్తిన మీడియా ఇప్పుడు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘భూ సేకరణకు సంబంధించిన అంశాలపై మాట్లాడినందుకే మీడియా ఒక్కసారిగా రూటు మార్చి నాపై దాడికి దిగింది. పేదలకు భూమి దక్కాలన్నందుకు నాపై భగ్గుమంది. మోదీ సర్కారు ప్రజల నుంచి భూములను లాగేసుకుంటోంది. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బీజేపీ నేతలు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయితే నిజాన్నెవరూ అణచలేరు, దాచలేరు. బీజేపీ కుటిల ప్రయత్నాలు నాకు బలాన్నిచ్చాయి. మంచి పని చేసిన ప్రతిసారీ నాపై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయి. అయినా నా మార్గాన్ని వదలలేదు. పోరాటాన్ని ఆపలేదు. ముందుకు సాగుతున్నా’’ అన్నారు. రాజస్తాన్‌లోకి జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో 12 రోజులు సాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర ఆదివారం కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లోకి ప్రవేశించింది. సరిహద్దుల్లోని ఝాలావాడ్ జిల్లాలో సీఎం అశోక్ గెహ్లోట్, ఆయన ప్రత్యర్థి సచిల్ పైలట్ ఇద్దరూ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో 17 రోజులు, 500 కిలోమీటర్ల దూరం యాత్ర కొనసాగనుంది. యాత్రతో ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయనన్నారు. -
భారీ షాక్, మరో రంగానికి చెందిన వేలాది మంది ఉద్యోగుల తొలగింపు
కోవిడ్-19, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వంటి వివిధ కారణాలతో ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో కేవలం రెండు నెలలో ఒక్క టెక్నాలజీ రంగంలో 1.25లక్షల మంది ఉపాది కోల్పోగా..ఈ తొలగింపులు ఇప్పుడు మీడియా రంగాన్ని సైతం కుదిపేస్తున్నాయి. యాక్సియోస్ నివేదిక ప్రకారం..ప్రపంచ ఆర్థిక మందగమనంతో సంస్థలు ప్రకటనలపై చేసే ఖర్చును తగ్గించాయి. వెరసి మీడియా రంగంలో ఉద్యోగాల తొలగింపు షురూ అయినట్లు తెలిపింది. ► గత నెలలో మీడియా ఇండస్ట్రీలో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. వార్న్‌ర్ బ్రదర్స్‌కు చెందిన డిస్కవరీలో ఉద్యోగాల కోత కొనసాగుతుండగా.. రానున్న రోజుల్లో సిబ్బందిని ఇంటికి పంపేందుకు మీడియా యాజమాన్యాలు సిద్ధమైనట్లు సీఎన్ఎన్ చీఫ్ క్రిస్ లిచ్ట్ తెలిపారు. ►పారామామౌంట్ గ్లోబల్ నుంచి వాల్ట్ డిస్నీ కంపెనీలు, ఇతర మీడియా సంస్థలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయడం, నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ►కామ్‌క్యాస్ట్ కేబుల్ యూనిట్ గత నెలలో ఉద్యోగుల్ని తొలగించింది. ఆ సంస్థ ఎంటర్టైన్మెంట్ విభాగం, ఎన్బీసీ యూనివర్సల్‌లో సైతం తొలగింపులు ఉంటాయని నివేదికలు పేర్కొన్నాయి. ►ప్రోటోకాల్, పొలిటికో నుండి 2020లో టెక్ న్యూస్ వెబ్సైట్ ప్రారంభమైంది. ఆ వెబ్ సైట్ ఈ ఏడాది చివరి నాటికి షట్‌డౌన్ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. తద్వారా యాక్సియోస్ ప్రకారం, దాదాపు 60 మంది ఉద్యోగులు ఉద్యోగులు కోల్పోనున్నారు. ►వైస్ మీడియా సీఈవో నాన్సీ డుబాక్ ఈ నెల ప్రారంభంలో చిన్న కోతల తర్వాత 15 శాతం వరకు ఖర్చులను తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు సిబ్బందికి తెలిపారు. ►నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కోవిడ్ కారణంగా మీడియా నిర్వాహణ ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో యుఎస్ఎ టుడే మాతృ సంస్థ గానెట్, ఆగస్ట్‌లో 400 మందిని తొలగించింది. మరో సారి ఉద్యోగుల్ని ఫైర్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. చదవండి👉 ‘ట్విటర్లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు -
ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారంపై నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా, పౌరుల మధ్య విద్వేషం పెంచేలా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారం వెంటనే ఆపేయాలని టీవీ చానళ్లను దేశ ఎలక్ట్రానిక్ మీడియా, రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) ఆదేశించింది. వీటిని ఉల్లంఘిస్తే షోకాజ్ కూడా ఇవ్వకుండా నేరుగా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. ‘లాంగ్ మార్చ్ పేరిట ఇమ్రాన్ చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఇటీవల చేసిన పలు ప్రసంగాల్లో.. తన హత్యకు కుట్ర పన్నాయంటూ సైన్యంసహా దేశ అత్యున్నత విభాగాలపై నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ప్రసంగాలు ప్రజల మధ్య విద్వేషం పెంచే ప్రమాదముంది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ఇలాంటి ప్రసంగాల ప్రసారం ఆపేయండి’ అని పేర్కొంది. -
Zee-Sony merger: మూడు ఛానెళ్లు అమ్మకానికి..
న్యూఢిల్లీ: ప్రతిపాదిత మెగా విలీన ప్రతిపాదనకు సంబంధించి మూడు చానెళ్ల విక్రయంపై సీసీఐ విధించిన నిబంధనలకు మీడియా గ్రూప్‌లు సోనీ, జీ అంగీకరించాయి. హిందీ చానెళ్లయిన బిగ్ మ్యాజిక్, జీ యాక్షన్, జీ క్లాసిక్‌లను విక్రయించేలా విలీన ఒప్పందానికి స్వచ్ఛందంగా మార్పులు చేస్తూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి ప్రతిపాదన సమర్పించాయి. బుధవారం విడుదల చేసిన 58 పేజీల ఉత్తర్వుల్లో సీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. సీఎంఈ (గతంలో సోనీ పిక్చర్స్ – ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), బంగ్లా ఎంటర్టైన్మెంట్ (బీఈపీఎల్) విలీనానికి అక్టోబర్ 4న సీసీఐ కొన్ని షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఆయా విభాగాల్లో పోటీపై ప్రతికూల ప్రభావం పడకుండా మూడు హిందీ చానెళ్ల విక్రయానికి కొన్ని నిబంధనలు విధించింది. వీటి ప్రకారం సదరు చానెళ్లను స్టార్ ఇండియా లేదా వయాకామ్18కి విక్రయించకూడదు. వాటిని నడిపే ఆర్థిక సత్తా, అనుభవం ఉన్న కొనుగోలుదారులకే అమ్మాలి. ఈ మేరకు విలీన ఒప్పందంలో స్వచ్చందంగా మార్పులు చేసి సమర్పించాలని సీసీఐ సూచించింది. దానికి అనుగుణంగానే జీ, సోనీ తమ ప్రతిపాదనలను సమర్పించాయి. -
జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?
ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండటంలో పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో మీడియా స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి. ప్రజల పట్ల కడు గౌరవంతో, అణకువతో ప్రవర్తించాలి. కానీ ఒకనాటి విశిష్ట పాత్రికేయ ప్రమాణాలన్నీ క్రమంగా పతనమవడం చూస్తున్నాం. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నిశితమైన విమర్శలు చేశారు. నిజాయితీ గల పాత్రికేయులందరూ వీటికి జవాబులు వెతకాలి. అయితే పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి స్వార్థపర రాజకీయాలేనని మరవరాదు. ‘‘వార్తా పత్రికలు అనేవి సమాజంలో అంతర్భాగం. అంతమాత్రాన్నే తాము మొత్తం సమాజానికే ‘శిష్టాది గురువు’లమనీ, లోకంలోని జ్ఞానమంతా తమ సొత్తనీ భావించి విర్రవీగరాదు. బుద్ధిగల ఏ వార్తాపత్రికైనా చారిత్రక పరిణామంలో తనవంతు కీలకమైన పాత్ర నిర్వహిం చాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాధ్యత గల ఏ పత్రికైనా సమాజం కోసం, తాను సేవలందించే ప్రజల కోసం వారి పట్ల కడు గౌరవంతో, అణ కువతో ప్రవర్తించాలి. ఆరోగ్యవంతమైన పత్రికలకు జాతీయ, సామాజిక బాధ్యత అనివార్యం. ఈ క్రమంలోనే సమాజం పట్ల పత్రికల బాధ్యతను ఏరోజుకారోజు తాత్కాలిక రాజకీయ పార్టీలు లేదా ఆనాటి ప్రభుత్వాల బాధ్యతతో పోల్చుకోరాదు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి చేదోడు వాదోడు కావడంలో పత్రికలు పాలనాశక్తుల కన్నా ముందుగా జాగరూకులవడంలో స్వతంత్ర హోదాలో వ్యవహరించాలి.’’ – సుప్రసిద్ధ జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ 1978 సెప్టెంబరు 5న తన నూరు సంవత్సరాల చరిత్రను (1878–1978) సమీక్షిస్తూ రాసిన సంపాదకీయం. ఒకనాటి ఇలాంటి విశిష్ట పత్రికా (పాత్రికేయ) ప్రమాణాలన్నీ కొలది సంవత్సరాలుగా ఎలా పతనమవుతూ వస్తున్నాయో చూస్తూనేవున్నాం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు న్యాయ మూర్తులలో విశిష్టమైన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఈ విషయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భావాలతో న్యాయస్థానాల ద్వారా, సభల ద్వారా ప్రజా బాహుళ్యంలో ఆధునిక వైజ్ఞా నిక దృష్టిని పెంపొందించడానికి కృషి చేస్తూ వచ్చిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. తెలంగాణా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో నేటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సామాజిక, నైతిక ప్రమాణాల గురించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించి, నిశితమైన విమర్శలు చేశారు. ఈనాటి కొందరు జర్నలిస్టులు పత్రికా యాజమాన్యాల సాయంతో పాలకుల్ని ఒప్పించడం సబబైన మార్గమని భావిస్తూండడాన్ని జస్టిస్ సుదర్శన్ విమర్శించారు. ఈ ధోరణి నేటి మీడియాలో పెరిగి పోతుండడాన్ని ఆయన నిరసించారు. వేలాది వార్తా పత్రికలు, వెయ్యి ఉపగ్రహాల సహాయంతో నడుస్తున్న న్యూస్ చానల్స్, 600 ఎఫ్.ఎం. స్టేషన్స్‌తో దేశంలోని బహు కొలదిమంది సంçపన్నులు లాభాల వేటలో పడి సొమ్ము చేసు కుంటున్నారు. ఇలాంటి వాతావరణంలోనే ఒక నటుడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని మీడియా ఓ పెద్ద ఘటనగా చూపింది. అందుకు దోహదం చేసినవాళ్లు వెంటనే దాన్ని రాజకీయ పోరాటంగా మలిచేశారు. కానీ అదే సమయంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కేవలం ఏడు నిమిషాల ప్రాధాన్యం కల్పించారు. ఎందు కని? వార్తలు పత్రికా ఆఫీసుల నుంచి కాకుండా ఎక్కడో బయట ‘అల్లి’ పత్రికలకు చేరుతున్నాయి! అయినా నిజాయితీ గల జర్నలిస్టులు, ప్రజా సమస్యల పట్ల ఆవేదన చెందగల పాత్రికేయులు కూడా మనకు లేకపోలేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తించగలిగారు. అంతేగాదు, మరొక వాస్తవాన్ని కూడా జస్టిస్ సుదర్శన్ బహిర్గతం చేశారు. వార్తా పత్రికలు నిర్వహించే యాజమాన్య సంస్థల్లో పెక్కింటికి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నందున నిర్ణయాలు త్వరగా తీసుకోలేని దుఃస్థితిని కూడా ఆయన వివరించారు. అందుకే దేశంలో ప్రజాస్వామ్యాన్ని, దాని విలువల్ని కాపాడేందుకుగానూ పూర్తిగా ప్రయివేట్ పత్రికా యాజమాన్యాల మీడియా సంస్థలపై సరైన అదుపాజ్ఞలు విధించడం అవసర మన్న సుప్రీంకోర్టు ప్రకటనను కూడా జస్టిస్ సుద ర్శన్ గుర్తు చేయవలసి వచ్చింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్ట్ ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ – ప్రతీ పాత్రి కేయ విలువనూ, గత ప్రమాణాలనూ ధ్వంసం చేసి నేరస్థ రాజకీయ విలువల్ని చొప్పించేశారనీ, అదే జర్నలిజంగా ప్రమోట్ అవుతోందనీ ఆవేదన చెందారు. ధనార్జనలో భాగంగా అమెరికన్ కోటీశ్వరుడు రూపర్ట్ మర్డోక్ ‘ఫాక్స్’ న్యూస్ చానల్ పెట్టి ఎలా అనైతిక ప్రమాణాలను ప్రవేశపెట్టాడో లోకానికి తెలుసు. ఎక్కడో అమెరికా, ఇతర దేశాల సంగతి కాదు... ఆ మాటకొస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నట్టింటనే ఇలాంటివి జరిగాయి. ‘‘సీనియర్ జర్నలిస్టుల’’ పేరిట చలామణీ అవు తున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని ఒక ముఖ్యమంత్రి సాకడం జరిగింది. వారికి ఇంటర్– స్టేట్ వాహనాల లైసెన్సులు ఇప్పించడమే గాకుండా హౌసింగ్ బోర్డు యాజమాన్యంలో కూడా చోటు కల్పించారు. దాన్ని స్వప్రయోజనాలకు వినియో గించుకుని బ్యాంకుల్ని దివాళా తీయించిన ఉదా హరణలూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరవరాదు! అంతేగాదు, అనైతిక మీడియా సోదరుడే ‘‘ముందు వాడి (ఎన్.టి.ఆర్.) ఫొటోను తీసి అవ తల పారేస్తావా, లేదా?’’ అని స్వయంగా చంద్ర బాబు ముఖం మీదనే ‘ఉరిమాడా,’ లేదా? ఎన్టీఆర్ ఫొటో తీసేస్తే కథ అడ్డం తిరుగుతుందని తెలిసిన చంద్రబాబు ‘అలాగే తీసేద్దాంలే, ఇప్పుడు కాదు’ అని చెప్పి... ‘ఫొటో నాటకం’ కోసం కొన్నాళ్లు ఎన్టీఆర్ అవసరమని తెలిసి తన తైనాతీ జర్న లిస్టును కాపాడుకున్నాడా, లేదా? ఇప్పటికీ ఆ నాటకం ఎన్టీఆర్ బొమ్మతోనే కొనసాగిస్తున్నారా, లేదా? చివరికి అమరావతి రైతాంగాన్ని మోస గించిన వైనాన్ని గురించి సీనియర్ జర్నలిస్టుగా హైకోర్టులో నేను రిట్ వేసినా, దాన్ని కనీసం చర్చకు కూడా రానివ్వకుండా తొక్కిపెట్టించిన ఖ్యాతిని మూటగట్టుకున్నవాడు చంద్రబాబే! అంతే గాదు, అమరావతి రైతాంగానికి జరిగిన అన్యాయం గురించి సుప్రీంకోర్టులో నేను రిట్ వేసినప్పుడు, ఆగమేఘాల మీద ఢిల్లీ చేరుకుని, ఆ కేసును కూడా తొక్కిపట్టేట్టు చేసినవాడూ చంద్ర బాబే కదా? ఆ కేసు అప్పటికీ ఇప్పటికీ అక్కడే ఉండిపోయింది. ముక్కారు పంటలు పండే అమ రావతి ప్రాంత భూములను తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన మంత్రివర్గంలోని ధనాఢ్యుడైన విద్యాశాఖామంత్రికి ధారాదత్తం చేయడమే కాక... ఎదురు తిరిగిన రైతుల భూముల్ని తగలబెట్టించి, ఆ దుర్మార్గాన్ని దళితు డైన నందిగం సురేష్‌పై (నేటి పార్లమెంట్ సభ్యుడు) నెట్టి, వేధింపులకు గురిచేసిన వాళ్లెవరు? కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. పత్రికా విలేకర్లు, ఎడిటర్లు అంటే నేడు చులకన భావన ప్రజల మనసుల్లో నాటుకుపోవడానికి దోహదపడినవి పాలకుల స్వార్థపర రాజకీయా లేనని మరవరాదు. కనుకనే గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మన మీడియా నిర్వాహకులకు (కోట్లకు పడగలెత్తిన యాజమాన్యాలకు, బతుకు బాటలో లొంగిపోయే కొందరు మీడియా మిత్రు లకు) చురకలు వేయడం సకాలంలో సబబైన స్పందనగా నేను భావిస్తున్నాను. అమెరికాలో వాల్టర్ లిప్మన్, ప్రొఫెసర్ నోమ్ చామ్స్కీ నిర్వ హించిన పాత్రను ఇక్కడ మన కాలంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోషిస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాజాలదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వివిధ దేశాల మీడియాలను లొంగదీసుకుంటున్న చైనా!
...వివిధ దేశాల మీడియాలను లొంగదీసుకుంటున్న చైనా! -
స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు
న్యూఢిల్లీ: దేశంలో స్వతంత్ర మీడియాని అణచివేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రముఖ మీడియా కంపెనీ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)ను పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బలవంతపు కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రధాని మోదీ ‘‘ఖాస్ దోస్త్’’ (ఆప్త మిత్రుడు) స్వతంత్ర మీడియాని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేష్, కపిల్ సిబల్ ఈ కొనుగోలు వ్యవహారాన్ని తప్పు పట్టారు. ‘అదానీ గ్రూప్ ఎన్డీటీవీని బలవంతంగా కొనుగోలు చేయడం అంటే వారి రాజకీయ, ఆర్థిక అధికారాలను కేంద్రీకరించుకోవడం, స్వతంత్ర మీడియా గొంతు అణిచివేయడమే’ అని జైరామ్ దుయ్యబట్టారు. స్వతంత్ర జర్నలిజంను పారిశ్రామికవేత్తలు తమ గుప్పిట్లోకి తీసుకోవడం ఆందోళనకరమని సిబల్ అన్నారు. ఎన్డీటీవీ షేర్లు 29.18% ఇప్పటికే పరోక్ష పద్ధతిలో దక్కించుకున్న అదానీ గ్రూపు అదనంగా మరో 26% కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో ఈ విషయం బయటకి వచ్చింది. ఇదీ చదవండి: మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం -
అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు!
అటు సంపదలోనూ, ఇటు విభిన్న వ్యాపార విస్తరణలోనూ పోటీ పడుతున్న కార్పొరేట్ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తాజాగా మీడియా విభాగంలోనూ సై అంటున్నారు. రుణాలను ఈక్విటీగా మార్పు చేసుకోవడం ద్వారా ఎన్డీటీవీలో 29 శాతానికిపైగా వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. మెజారిటీ వాటాపై కన్నేసింది. ఇప్పటికే బ్రాడ్‌క్యాస్టింగ్ సంస్థ నెట్వర్క్ 18ను ముకేశ్ అంబానీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే!! న్యూఢిల్లీ: వార్తా చానళ్ల మీడియా సంస్థ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్(ఎన్డీటీవీ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా సాధారణ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 4 ముఖ విలువగల దాదాపు 1.68 కోట్ల షేర్లను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకంటే ఆఫర్ ధర అధికమని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ఎన్ఎస్ఈలో ఎన్డీటీవీ షేరు సోమవారం ముగింపు ధర రూ. 359కాగా.. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం షేరుకి భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి (రూ. 18 లాభపడి) రూ. 377 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఓపెన్ ఆఫర్ ధర కంటే 28% అధికం! 55 శాతానికి ఎన్డీటీవీలో వారంట్ల మార్పిడి ద్వారా అదానీ గ్రూప్ దాదాపు 30% వాటాను సొంతం చేసుకుంది. దీంతో పబ్లిక్ నుంచి మరో 26% వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ విజయవంతమైతే ఎన్డీటీవీలో 55%పైగా వాటాను అదానీ గ్రూప్ పొందే వీలుంది. ఏఎంజీ మీడియా నెట్వర్క్స్కు పూర్తి అనుబంధ సంస్థ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రయివేట్ లిమిటెడ్(వీసీపీఎల్) వారంట్లను మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రయివేట్‌లో 99.5% వాటాను చేజిక్కించుకుంది. దీంతో ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కు గల 29.18% వాటాను పొందింది. ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ ఆర్ఆర్పీఆర్. వెరసి వీసీపీఎల్‌తో పాటు అదానీ మీడియా నెట్వర్క్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఉమ్మడిగా ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాయి. 26% వాటాకు సమానమైన 1,67,62,530 షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలు చేయనున్నాయి. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకు సంస్థలో సంయుక్తంగా 32.26% వాటా ఉంది. కాగా.. అదానీ గ్రూప్ రూ. 114 కోట్లకు కొనుగోలు చేసిన వీసీపీఎల్ గతంలో ముకేశ్ అంబానీ గ్రూప్ సంస్థ కావడం కొసమెరుపు! మాతో చర్చించ లేదు వారంట్ల మార్పిడి ద్వారా ఆర్ఆర్పీఆర్లో వాటా చేజిక్కించుకున్న విషయంపై ప్రమోటర్లతో వీసీపీఎల్ చర్చించలేదు. అనుమతి కోరలేదు. ఈ విషయం వీసీపీఎల్ జారీ నోటీసు ద్వారా ఈరోజే ప్రమోటర్లకు తెలిసింది. వాటా విక్రయించేందుకు ప్రమోటర్లు ఎవరితోనూ చర్చించడంలేదు’. – ఎన్డీటీవీ -
సివిల్స్ ర్యాంకర్‌కు సన్మానం.. అంతలోనే ఆవిరైన ఆనందం
ఒక క్రేన్ ఆపరేటర్ కూతురు.. రోజుకు 18 గంటలపాటు కష్టపడింది. స్మార్ట్‌ఫోన్ ప్రిపరేషన్, అరకోర పుస్తకాలతో.. అందునా తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్ కొట్టింది. పైగా ఆల్ ఇండియాలో 323వ ర్యాంక్ సాధించింది. ఈ కథ స్ఫూర్తిని ఇచ్చేదే. కానీ, ఇక్కడో ట్విస్ట్ ఆ అమ్మాయి ఆనందాన్ని ఆవిరి చేసింది. జార్ఖండ్ రామ్‌గడ్‌కు చెందిన దివ్య పాండే(24).. 2017లో రాంచీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ర్యాంక్ సాధించడంతో ఆమెను మెచ్చుకోని వాళ్లంటూ లేరు. ఆమె తండ్రి సెంట్రల్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. కోచింగ్ లేకుండానే ఆమె ఈ ఘనత సాధించడంతో.. మీడియా కూడా జోరుగా కథనాలు వచ్చాయి. అయితే.. ఆమె ఆనందం ఇప్పుడు ఆవిరైంది. ర్యాంక్ వచ్చింది ఆమెకు కాదని స్పష్టత వచ్చింది. దివ్య పాండే అక్క ప్రియదర్శిని పాండేకు యూపీకి చెందిన ఓ స్నేహితురాలు.. ఫోన్ చేసి ఫలానా దివ్య పాండేకు సివిల్స్ ర్యాంక్ వచ్చిందని చెప్పిందట. దీంతో ఆ దివ్య తన సోదరే అనుకుంది ఆమె. ఈ క్రమంలో ఇంటర్నెట్లో ఫలితాల కోసం సెర్చ్చేయగా.. ఆ టైంకి ఇంటర్నెట్ పని చేయలేదని చెబుతోంది ఆ కుటుంబం. అయినా ఆలోచించకుండా ర్యాంక్ వచ్చింది తమ బిడ్డకే అనుకుని ఆ కుటుంబం సంబురాలు చేసుకుంది. స్థానికులకు స్వీట్లు పంచుకుంది. ఈ విషయం మీడియాకు సైతం చేరింది. దివ్య పాండే తండ్రి జగదీశ్ ప్రసాద్ పాండే 2016లో సెంట్రల్ కోలార్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) నుంచి క్రేన్ ఆపరేటర్‌గా రిటైర్ అయ్యాడు. దీంతో ఆ తండ్రి కష్టం ఫలించిందని అంతా అనుకున్నారు. విషయం తెలిసిన సీసీఎల్ అధికారులు, జిల్లా పాలనా సిబ్బంది దివ్య పాండేను పిలిపించుకుని ఘనంగా సత్కారం చేశారు. అయితే ర్యాంకు వచ్చిన ఆనందంలో ఢిల్లీకి చేరిన ఆ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాంక్ వచ్చింది జార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లా చిట్టాపూర్‌లోని రాజ్రప్ప కాలనీకి చెందిన దివ్య పాండేకి కాదని అధికారులు చెప్పారు. ఆ ర్యాంక్ దక్షిణ భారత్‌కు చెందిన దివ్య పీ అనే అమ్మాయిది అని చెప్పడంతో ఆ కుటుంబం నిరాశగా వెనుదిగింది. అంతేకాదు ఈ పొరపాటుకు అందరికీ క్షమాపణలు చెబుతోంది. మరోవైపు ఈ తప్పిదం ఆధారంగా ఆ కుటుంబంపై ఎలాంటి చర్యలు ఉండబోవని అధికారులు చెప్తున్నారు. -
Afghanistan: తాలిబన్ల షాకింగ్ నిర్ణయం
కాబూల్: అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అప్ఘన్లో మహిళల ఉన్నత విద్యపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు అక్కడి మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు మీడియా తెలిపింది. ముఖ్యంగా తాలిబన్లు.. మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అంతకుముందు కూడా బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించలేదు. పాఠశాలలు ఓపెన్ చేసిన వెంటనే అమ్మాయిలను ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉన్నత విద్యకు అక్కడి యువతులు దూరమయ్యారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌లో రష్యాకు షాకులు.. పుతిన్ ఏం చేస్తారోనన్న టెన్షన్..? -
KGF 2: కేజీయఫ్ 2 మీద నెగెటివ్ రివ్యూలు!
భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కె.జి.యఫ్ ఛాప్టర్ 2.. ప్రేక్షకులకు ఎలివేషన్ ఫీస్ట్‌ను అందించింది. కథ విషయంలో పెద్దగా మలుపులు లేకపోయినా.. మిగతా ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో మెప్పించగలిగాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. యశ్ స్క్రీన్ ప్రజెన్స్ రెండో భాగానికీ మేజర్ హైలెట్ అయ్యింది. ఓవరాల్‌గా.. సినిమా చాలా మందికే నచ్చేసింది. అయితే బాలీవుడ్ మీడియా మాత్రం నెగెటివ్ రివ్యూలతో విరుచుకుపడింది. కె.జి.యఫ్ ఛాప్టర్ 2కు మాతృక కన్నడతో సహా దాదాపు అన్ని భాషల్లోనూ బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. మొదటి ఆట నుంచే యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకుంది ఈ చిత్రం. తమిళనాడులో అయితే విజయ్ బీస్ట్ చిత్రం థియేటర్ల దగ్గర ఆడియొన్స్ బాగా తగ్గిపోగా.. రాఖీబాయ్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపించడం విశేషం. ఇక తెలుగు ఆడియొన్స్ ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా దాదాపుగా సౌత్‌లోని అన్ని భాషల్లోనూ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు దక్కాయి. అయితే.. రిలీజ్‌కు ముందు సైతం పెద్దగా హడావిడి చేయని హిందీ మీడియా.. రిలీజ్ తర్వాత కూడా కేజీయఫ్ ఛాప్టర్ 2కి దాదాపుగా నెగెటివ్ రివ్యూలే ఇచ్చాయి. పైగా సినిమాలోని మైనస్‌లనే హైలైట్ చేస్తూ రివ్యూలు ఇచ్చాయి. హిందీ మీడియాలో సినిమాను పొగుడుతూ రివ్యూలు ఇచ్చిన వెబ్సైట్లు ఒకటో రెండో ఉండగా, ఒకరిద్దరు విశ్లేషకులు మాత్రమే పాజిటివ్‌గా రాశారు. కేజీయఫ్ ఛాప్టర్ 2 విషయంలోనే కాదు.. మొన్న పుష్ప, ఆర్ఆర్ఆర్ విషయంలోనూ కొన్ని మెయిన్ మీడియా హౌజ్‌లు దాదాపుగా ఇదే రీతిలో వ్యవహరించాయి. ఏది ఏమైనా ఈ తీరుతో బాలీవుడ్ మీడియా మరోసారి సౌత్ సినిమాల మీద అక్కసు వెల్లగక్కినట్లయ్యింది. కానీ.. సినిమాను ఆదరించేది అంతిమంగా ఆడియొన్స్. కాబట్టి, ఇలాంటి చేష్టల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక కే.జి.యఫ్ 2కు నార్త్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ దక్కుతోంది. ఒక్క హిందీ బెల్ట్‌లోనే తొలిరోజు రూ. 50 కోట్లు వసూలు చేయొచ్చని అంచనా. చదవండి: కేజీయఫ్ 2 రివ్యూ -
ఒక వినూత్న కార్యక్రమం
మన దేశంలో ఫోర్త్ ఎస్టేట్ మీడియా! దీనికున్న బలం గురించీ, అది చూపిన, చూపిస్తున్న ప్రభావం గురించీ అందరికీ తెలి సిందే. కానీ ఈ దేశంలోని దళితులు, అంటరాని కులా లుగా భావించే జన సమూహాలకు అందులో ఎంత భాగస్వామ్యం ఉంది? ఇదే ప్రశ్న 1996లో కాన్షీరాం వేసినప్పుడు... దానికి సమాధానం దొరక లేదు. ఇది నాడు, నేడు దేశవ్యాప్తంగా ఉన్న పరి స్థితి. కానీ తెలంగాణ దీనికి భిన్నం. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... మార్చి 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ మీడియా అకా డమీ, ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిం చిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులకు ఊహిం చలేనంత స్పందన వచ్చింది. బహుశా దేశంలోనే 16 వందల మందికి పైగా దళిత జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఉండటం గుర్తిం చాల్సిన ముఖ్యాంశం. మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ చొరవ వల్లనే ఇది సాధ్యమైంది. నిజంగానే ఇంత మంది జర్నలిస్టులు పేపర్, టీవీ, డిజిటల్ మీడియాల నుండి వచ్చారా అంటే... వచ్చారు! వందల సంఖ్యలో శిక్షణా తరగ తులకు హాజరు కావడమే దీనికి నిదర్శనం. ఇది పెద్ద విప్లవంగానే చెప్పాలి. తెలంగాణ... దళిత చైతన్యానికి ఎత్తిన పతాక వంటిది. మొదటగా 1888లో ‘విఠల్ విధ్వంసక్’ అనే పేపర్ దళితుల కోసం ఏర్పాటయింది. దీన్ని ఏర్పాటు చేసింది అంబేడ్కర్‌కు స్ఫూర్తినిచ్చినవారిలో ఒకరైన గోపాల్ బాబా వాలంగ్ కర్. ఆటు ఆంధ్ర ఏరియా నుండి కుసుమ ధర్మన్న లాంటి వాళ్లు ఏర్పాటు చేసినవి కొన్ని పత్రికలు ఉన్నాయి. ఈ చైతన్య ప్రవాహం తెలంగాణలో ఆంధ్రమహాసభ ఏర్పడేంత వరకు ఉన్నది. ఆ తర్వాత వచ్చిన పలు రకాల ఉద్యమాలు, వాటి ప్రభావాలు యావత్ తెలం గాణపై ఉన్నాయి. ఆ తర్వాత ఈ పరంపర కాస్త ఆగిపోయింది. మళ్లీ ఉమ్మడి రా్రçష్టంలో కంచిక చెర్ల కోటేశు హత్యోదంతం, కారంచేడు, నీరుకొండ ఘటనలు కొత్త తరం దళితులను సరికొత్త ఎజెండాతో కార్యోన్ముఖులను చేశాయి. మీడియాలో 1985ల నాటికి పేరు పొందిన దళిత జర్నలిస్టులు లేరు. కానీ 1996ల తర్వాత దళి తులు పేపర్ మీడియాలోకి ఒకరిద్దరు రావడం షురూ అయింది. ఆ తర్వాత 2000 సంవత్సర ఆరంభంలో తెలుగు నాట ప్రయివేటు ఛానళ్లు వచ్చాయి. అందులో ఇప్పటి ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలంగాణలోనే సుపరిచిత రిపోర్టర్‌గా ఎదిగారు. ఆ తర్వాత జై తెలంగాణ ఛానల్‌కు ఎడి టర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రభా వంతో చాలామంది సొంత పేపర్లు ఏర్పాటు చేసు కున్నారు. పలు మీడియా సంస్థల్లో కొంత మంది దళితులకు అవకాశం దొరికింది. 2014 తర్వాత డిజిటల్ మీడియాతో పాటు, చిన్న పేపర్ల సంఖ్య కూడా పెరిగింది. ఇందులో బీసీలు, దళితులే పెద్ద భాగం. వీరికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా భరోసానిస్తోంది. దళిత జర్నలిస్టులను గుర్తించి... వారి కోసం శిక్షణ ఇవ్వడమంటే గత చైతన్యానికి మరింత పదును పెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికేనని చెప్పొచ్చు. ఈ చైతన్య ఒరవడి మరింత ముందుకు సాగాలంటే కేసీఆర్ ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘దళిత బంధు’తో పాటు సబ్ ప్లాన్ నిధులలో జర్నలి స్టులకు కొంత శాతం ఇచ్చి, ఆర్థిక స్వయం వృద్ధి సాధించేందుకు చేయూతనిస్తే వారు బాగుపడటమే కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పించిన వారవుతారు. అస్కాని మారుతీ సాగర్ వ్యాసకర్త టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మొబైల్ : 90107 56666 -
మీడియా కమిషన్ ఏర్పాటు ఆలోచన లేదు: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: దేశంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలేదీ లేదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం రాజ్యసభలో తేల్చిచెప్పారు. మీడియాలో అవకతవకల విషయంలో ప్రభుత్వం తరచుగా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని, వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని ఉపయోగించుకుంటోందని వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో కమ్యూనికేషన్లు, ఐటీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికను గతంలో సమర్పించింది. మీడియాలో అవకతవకలను అరికట్టడానికి మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. భారత్‌లో మీడియా విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా రంగంలో పెడ ధోరణులను నియంత్రించడానికి మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సిన అససరం ఉందని ప్రతిపాదించింది. -
నూతన చట్టంతో మీడియా పై ఉక్కుపాదం మోపిన రష్యా
డస్సెల్‌డోర్ఫ్: ఇప్పటికే బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా, డూషెవెల్లి, మెడుజా సంస్థలను నిషేధించిన రష్యా, తాజాగా ఫేస్బుక్, ట్విట్టర్‌ను కూడా నిలిపివేసింది. రష్యాపై తప్పుడు వార్తలు ప్రసారం చేసే సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వీలు కల్పించేలా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఉక్రెయిన్ దాడిపై తమ దేశస్థులకు అందే వార్తలను నియంత్రించే క్రమంలో రష్యా విదేశీ మీడియాపై ఉక్కుపాదం మోపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం నిర్ణయం ఆధారంగానే ఫేస్బుక్, ట్విట్టర్‌ను నిషేధించామని రష్యా మీడియా నియంత్రణ సంస్థ రోస్కోమ్నజార్ తెలిపింది. మీడియాపై నియంత్రణకు ఉద్దేశించిన బిల్లును రష్యా చట్టసభలు వెనువెంటనే ఆమోదించగా, అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్ యుద్ధంపై తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తే ఇకపై 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. తప్పుకుంటున్న సంస్థలు మీడియాపై నియంత్రణ పెరగడంతో పలు విదేశీ మీడియా సంస్థలు రష్యాలో కార్యకలాపాలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నాయి. రష్యాల ప్రసారాలు తాత్కాలికంగా నిలిపివేస్తామని సీఎన్ఎన్, బ్లూమ్‌బర్గ్ లాంటి సంస్థలు ప్రకటించాయి. బిల్లుకు ఆమోదం లభించడంతో తమ ప్రసారాలు నిలిపివేస్తున్నామని న్యూస్ వెబ్సైట్ జ్నాక్ ప్రకటించింది. ఇప్పటికే ఎకో రేడియో స్టేషన్, డోజ్ టీవీ చానెల్‌పై రష్యా నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై దాడిలో తమకు ఎదురుదెబ్బలు తగిలాయని, ఉక్రెయిన్ పౌరులను చంపేస్తున్నామనే వార్తలన్నీ తప్పుడు వార్తలని రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడిని రష్యా మీడియా సంస్థలు ‘ప్రత్యేక మిలటరీ యాక్షన్’గా పిలుస్తున్నాయి. తమ సైనికులను రక్షించుకునేందుకు, నిజాన్ని కాపాడేందుకే మీడియా నియంత్రణ బిల్లును తెచ్చామని రష్యా చట్టసభ స్పీకర్ వోలోడిన్ చెప్పారు. ప్రభుత్వ చర్యతో కోట్లాది రష్యన్లకు నమ్మకమైన నిజం తెలియకుండా పోతోందని ఫేస్బుక్ ప్రతినిధి నిక్ క్లెగ్ విమర్శించారు. ఈ బిల్లు పాత్రికేయ స్వాతంత్య్రాన్ని హరిస్తుందని బీబీసీ డీజీ టిమ్ డేవ్ అభిప్రాయపడ్డారు. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ డిజిటల్ వార్) -
తాలిబన్లకు కొత్త తలనొప్పులు
ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న తాలిబన్ ప్రభుత్వానికి రోజుకో కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే వైద్య సిబ్బంది జీతాల్లేక ఇళ్లకే పరిమితం కాగా, జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు కరెన్సీ నిల్వలు లేక బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలై.. బ్యాంకులూ మూతపడ్డాయి. చాలా రంగాలు ఇదే బాట పడుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా మీడియా రంగం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఆరు నెలలపాటు అఫ్గనిస్థాన్‌లో మీడియా ఛానెల్స్ ఏవీ పని చేయబోవని హెచ్చరికలు జారీ చేసింది అఫ్గనిస్థాన్ జర్నలిస్ట్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ ఫెడరేషన్. తక్షణమే మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించింది AJMOF. ఇందుకోసం వారం వ్యవధిని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. కిందటి ఏడాది ఆగష్టులో తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. చాలా రంగాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మీడియా ఆర్థికంతో పాటు సమాచార సేకరణలోనూ ఇబ్బందులు పడుతోంది. ‘‘చాలావరకు చానెళ్లు, పేపర్లు, వెబ్సైట్లు మూతపడ్డాయి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని స్థితికి చేరుకున్నాం. కొందరు వేరే ఉద్యోగాలకు తరలిపోతున్నారు. కవరేజ్ సంగతి ఏమోగానీ.. జర్నలిస్టులు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి దాపురించింది’’ అని ఫెడరేషన్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తాలిబన్ ప్రభుత్వానికి సరైనరీతిలో స్పందించి ఉంటే.. ఇప్పుడు ఈ మీడియా రంగం సంక్షోభం ఎదుర్కొనేది కాదని ఫెడరేషన్ అభిప్రాయపడుతోంది. నిధుల అవకతవకలతో పాటు కమ్యూనికేషన్ రంగం కుదేలు కావడానికి తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపిస్తున్నారు జర్నలిస్టులు. పనిలో పనిగా ఈయూ మానవతా దృక్ఫథంతో అందించబోయే సాయం నుంచి తమకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు. -
మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. మీ ప్రియమైన వారికి ఇలా చేయరుగా
Jacqueline Fernandez Request To Media Not Circulate Her Private Photos: శ్రీలంక బ్యూటీ, బీటౌన్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్ హీరోయిన్స్‌తోపాటు జాక్వెలిన్‌కు సుకేష్ ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో ఈడీ ఆమెను విచారించింది. అప్పటినుంచి ఫిల్మ్ దునియాలో తరచుగా, వార్తల్లో అప్పుడప్పుడూ జాక్వెలిన్ పేరు వింటూనే ఉన్నాం. తాజాగా జాక్వెలిన్ మీడియాకు విన్నవించుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సుకేష్ చంద్రశేఖర్‌తో లీక్ అయిన తన ఫొటోను ప్రసారం చేయొద్దని మీడియాను అభ్యర్థించింది. తన గోపత్యకు భంగం కలిగిస్తోందని పేర్కొంది జాక్వెలిన్. 'ఈ దేశం, ఈ ప్రజలు నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం నేను కఠినమైన పరిస్థితిలో ఉన్నాను. అది నా స్నేహితులు, అభిమానులు గమనిస్తూనే ఉన్నారని తెలుసు. ఈ నమ్మకంతోనే నా వ్యక్తిగత చిత్రాలను ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రియమైన వారికి ఇలా చేయరు కదా. అలాగే నాకు కూడా ఇలా చేయరని నమ్ముతున్నా. న్యాయం, మంచి గెలుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అని పోస్ట్‌లో రాసుకొచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) ఇదీ చదవండి: జాక్వెలిన్‌ను సుకేష్ ఇలా ముగ్గులోకి దింపాడట.. -
మీడియా ప్రచారంలోనూ రిలయన్సే నంబర్1
న్యూఢిల్లీ: ఆదాయం, లాభం, మార్కెట్ విలువ పరంగా దేశంలోనే నంబర్–1 కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. మీడియా ప్రచారంలో ఎక్కువగా కనిపించే కార్పొరేట్ సంస్థగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత మీడియా ప్రాచుర్యాన్ని పొందడంలో ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ ఉంది. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు విజికీ న్యూస్ స్కోర్ రిపోర్ట్ 2021 విడుదలైంది. వార్తల్లో ప్రాధాన్యం మేరకు కంపెనీలకు విజికీ ర్యాంకులను కేటాయిస్తుంది. ప్రధాన వార్తల్లో చోటు, మొత్తం మీద ఎన్ని వార్తల్లో కనిపించాయి, ఎంతమందికి చేరువ అయింది తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తుంది. 5,000కు పైగా ప్రచురణలను పరిశీలించి.. సంస్థలకు 0 నుంచి 100 వరకు స్కోర్ కేటాయిస్తుంది. మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్‌కు 2021 సంవత్సరానికి కేటాయించిన స్కోరు 84.9 కావడం గమనార్హం. అంతర్జాతీయంగా చూస్తే ఫేస్బుక్ మొదటి స్థానంలో ఉంది. ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, యాపిల్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా 8వ స్థానం రిలయన్స్ దేశీయంగా మొదటి స్థానంలో ఉంటే, అంతర్జాతీయంగా 8వ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ 6వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టీసీఎస్, మారుతి సుజుకీ ఇండియా, వొడాఫోన్ ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు వరుసగా ఉన్నాయి. ఎన్టీపీసీ 13వ ర్యాంకును సొంతం చేసుకుంది. అత్యధిక ర్యాంకును దక్కించుకున్న ప్రభుత్వరంగ సంస్థగా నిలిచింది. మీడియాలో చక్కని ప్రాధాన్యం, కవరేజీ లభించేందుకు శక్తిమంతమైన, అవగాహన కలిగిన కార్పొరేట్ కమ్యూనికేషన్ బృందం కీలకమని విజికీ పేర్కొంది. హాటెస్ట్ స్టార్టప్‌లు.. ‘హాటెస్ట్ స్టార్టప్‌లు 2021’ పేరుతో విజికీ మరో నివేదికనూ విడుదల చేసింది. భారత్‌లో వివిధ రంగాల్లో ప్రభావం చూపించిన టాప్–200 స్టార్టప్‌లకు ఇందులో చోటు కల్పించింది. ఓలా, డ్రీమ్11, స్విగ్గీ, ఓయో, ఓలా ఎలక్ట్రిక్, భారత్‌పే, బైజూస్, క్రెడ్, మొబిక్విక్, అన్అకాడమీ టాప్–10 హాటెస్ట్ స్టార్టప్‌లుగా విజికీ తెలిపింది. ఈ బ్రాండ్లకు వార్తల్లో వచ్చిన ప్రాధాన్యం ఆధారంగానే ఈ స్కోరు ఇచ్చింది. ప్రచారం విషయంలో బ్రాండ్లు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి ప్రజా సంబంధాలు, కార్పొరేట్ సమాచారం బలాన్ని తెలియజయడమే తమ నివేదిక లక్ష్యమని విజీకీ సీఈవో అన్షుల్ తెలిపారు. -
వాటిని పోస్ట్ చేయనందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పిన అనుష్క శర్మ
సాధారణంగా సెలబ్రిటీలలో కొందరి పిల్లలకు పుట్టగానే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది. ఇక అప్పటి నుంచి ఆ చిన్నారులు ఏం చేసిన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. దీనికి భిన్నంగా టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికా కోహ్లీ అసలు ఎలా ఉంటుందని కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పైగా ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి వామికాకు సంబందించిన ఏ ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు విరుష్క జంట. తాజాగా ఇందుకు సంబంధించి బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన కుమార్తె వామిక ఫోటోలను ప్రచురించనందుకు మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కోహ్లీ, అనుష్క, వామికాతో కలిసి బయటకు రాగా వామిక ఫోటోని తీశారన్న వార్తలు వచ్చాయి. దీంతో వామిక ఫోటోలను పోస్ట్ చేయకండని ఈ జంట మీడియాని అభ్యర్థించారు. దీనిపై స్పందిస్తే అనుష్క తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో .. వామికా ఫోటోలు/వీడియోలను పోస్ట్ చేయనందుకు మీడియా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపూతూ.. మేము మా చిన్నారి గోప్యతను కాపాడాలనుకుంటున్నాము. ఎందుకుంటే భవిష్యత్తులో ఆమె జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికే మేము మీడియాకు దూరంగా ఉంచుతున్నాము. అందుకు మా వంతు కృషి చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ విషయంలో సంయమనం పాటించాలని అనుష్క ఆ పోస్ట్‌లో తెలిపింది. అంతకుముందు, ముంబై నుంచి దక్షిణాఫ్రికాకు జట్టు బయలుదేరే సమయంలో వామికా ఫోటోలు తీయవద్దని విరాట్ కోహ్లీ ఫోటోగ్రాఫర్లను అభ్యర్థించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. "బేబీ కా ఫోటో మాట్ లీనా (దయచేసి పాప ఫోటోలు క్లిక్ చేయకండి)" అని కోహ్లి ఆ వీడియోలో చెప్పాడు. ఏదైమైనా వామిక ప్రైవసీ విషయంలో విరుష్క జంట చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చదవండి: Sushmita Sen: సుస్మితా సేన్ ఎమోషనల్ పోస్ట్.. అందుకు 27 ఏళ్లు పట్టిందట -
భారత్‌లో గూగుల్, ఫేస్బుక్ ఆదాయం ఎంతో తెలుసా?
Google Facebook Income In India: సంప్రదాయ మీడియా సంస్థల్లో వచ్చే వార్తలను హోస్ట్ చేయడం ద్వారా ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ సంస్థలకు వస్తున్న ఆదాయం ఎంతో తెలుసా? ఈ మేరకు పార్లమెంట్ సాక్షిగా సమాధానం దొరికింది. ‘భారత్‌లో డిజిటల్ ప్రకటనల విపణిలో 75 శాతం వాటాను గూగుల్, ఫేస్బుక్ హస్తగతం చేసుకున్నాయి. ఏడాదికి గూగుల్ ఏకంగా రూ.13,887 కోట్లు, ఫేస్బుక్ రూ.9,326 కోట్లు పొందుతున్నాయి. అంటే మొత్తంగా రూ.23,313 కోట్లు. ఇది దేశంలోని టాప్–10 సంప్రదాయక మీడియా సంస్థల మొత్తం ఆదాయం(కేవలం రూ.8,396 కోట్లు) కంటే చాలా ఎక్కువ’ అని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ వివరించారు. ఈ మేరకు పలు కీలక అంశాలను మంగళవారం రాజ్యసభలో జీరో అవర్‌లో సుశీల్ మోదీ ప్రస్తావించారు. ఇక్కడ మూటకట్టిన ఆదాయంలో 90శాతం మొత్తాలను తన అంతర్జాతీయ అనుబంధ సంస్థకు ఫేస్బుక్ పంపుతోందని, గూగుల్ ఇండియా తన 87 శాతం రాబడిని మాతృసంస్థకు బదలాయిస్తోందని సుశీల్ వెల్లడించారు. కొంత భాగం.. సంప్రదాయక మీడియాకూ దక్కాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ అభిప్రాయపడ్డారు. సంప్రదాయ మీడియా కంటెంట్ మూలంగా ప్రకటనల ద్వారా వేలకోట్ల ఆదాయం పొందుతున్న టెక్ సంస్థలపై, ఈ వ్యవస్థపై పర్యవేక్షణకు కొత్తగా స్వతంత్య్ర నియంత్రణ మండలిని నెలకొల్పాలని ఆయన సూచించారు. చదవండి: దిగ్గజ టెక్ కంపెనీలను వణికిస్తున్న "లాగ్4జే" లోపం -
పొగడ్తలతో ముంచెత్తే వార్తలొద్దు.. విమర్శించండి సరి చేసుకుంటాం
సాక్షి, చెన్నై: ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే విధంగా వార్తలు, కథనాలు ప్రచురించాలని తాను ఎన్నడూ ఆదేశించలేదని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లు, విమర్శలు ఉంటే ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నేతృత్వంలో ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. చదవండి: (ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి డీఎంకే మోడల్ అని, ఆ దిశగానే తమ పయనం సాగుతోందని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చామని, పారిశ్రామిక రంగానికి పునర్జీవం పోశామ ని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని పారిశ్రామిక ఎగుమతుల్లో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్టు గుర్తు చేశారు. తమిళనాడు పారిశ్రామిక పెట్టుబడులకు నెలవు అని, ఇక్కడ అన్ని రకాల వసతులు, అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. చదవండి: (నేనొస్తున్నా.. అన్నాడీఎంకే అందరిదీ అందరూ సమానమే: శశికళ) ప్రభుత్వ పథకాలను, తమ పనితీరును పొగడ్తలతో ముంచెత్తాలని తాను ఎన్నడూ మీడియాను ఆదేశించ లేదన్నారు. విమర్శలు ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. అలాగే, రూ. 2 లక్షల కోట్లు పబ్లిక్ రంగ సంస్థలు సైతం అప్పుల్లో ఉన్నట్టు వివరించారు. నిధుల సమీకరణకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, జీఎస్టీ రూపంలో రాష్ట్రాల హక్కుల్ని యూనియన్ ప్రభుత్వం కాల రాసి, ఆ నిధుల్ని తన్నుకెళ్తోందని ధ్వజమెత్తారు. -
రుధిరం, టాల్కం పౌడర్, పోస్కో.. నావల్ల కాదు
AI Usage In Media: రుధిరం మనపైన పగబట్టిందా? రుధిరం చేస్తున్న రణాన్ని మనం ఆపలేమా? రుధిరం ఊడిపడుతుందా? పళ్లు తోముకునే టాల్కం పౌడర్‌లో.. పోస్కో చట్టం.. అఫ్కోర్స్.. ఇలాంటి పొరపాట్లు మానవ సహజం. కానీ, ఇదే తప్పులు చేయడం నా వల్ల కాదు బాబోయ్. నిజం.. నమ్మండి. ఎందుకంటే నేను మనిషిని కాను.. టెక్నాలజీని. నా పేరు అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ. కృత్రిమ మేధస్సు(AI).. నా గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. అయినా ఓసారి నా గురించి మళ్లీ పరిచయం చేసుకుంటా. మనిషికి శారీరక శ్రమ, ఖర్చులను తగ్గిస్తూ.. బోలెడంత సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో తయారు చేసిన టెక్నాలజీని నేను. ఒక ప్రాజెక్టులో డిజైన్ దగ్గరి నుంచి దాని పనితీరును పర్యవేక్షించడం దాకా ప్రతీది నా పనే. ఇప్పటికే చాలా రంగాలు నామీద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వాడేసుకుంటున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావడంతో అందరి ఆసక్తి ఇప్పుడు నా మీదే ఉంటోంది. పెట్టిన ఖర్చుకు మూడు, నాలుగు రెట్లు ఆదాయాన్ని వెనకేసుకుంటున్నాయి. అయితే మీడియా రంగంలోనూ నన్ను విస్తృత స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అది ఎలాగో మీకు చెప్పాలన్నదే నా ప్రయత్నం. రైటింగ్ మీడియా హౌజ్‌ల కంటే పర్సనల్ బ్లాగులు నడిపించేవాళ్లే నన్ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు. హెడ్ లైన్స్ రాయడం దగ్గరి నుంచి మొదలుపెట్టి.. టోటల్ స్క్రిప్ట్ రాయడం దాకా అంతా నేనే చూసుకుంటా. తప్పులు లేకుండా అక్షరాల్ని అందించడం, పదాల ఫ్రేమింగ్, ‘సెన్సేషన్’ హెడ్డింగ్‌లకు బదులు ఆ కథనాలకు సరిపోయే అందమైన హెడ్డింగులు అందించడం నా పనే ఇంక. అయితే అంతకంటే ముందు అవతలి వాళ్లు తమకు ఏం కావాలో అనే ఆలోచనలను నాతో పంచుకోవాల్సి ఉంటుంది(కమాండింగ్ రూపంలో). అప్పుడే అందుకు తగ్గ రీసెర్చ్, సెర్చ్ చేసి కావాల్సిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేయగలను నేను. ఏఐ యాంకర్స్ రోబోలకు అడ్వాన్స్డ్ వెర్షన్.. మా ఏఐ రూపాలు. అంటే రోబోటిక్ టెక్నాలజీతో సంబంధం లేకుండా మా ప్రతిరూపాల్ని తయారు చేస్తారన్నమాట. అచ్చం మనుషుల్లాగా అవతలి వాళ్లను భ్రమింపజేస్తూ ఎలాంటి తప్పులు లేకుండా వార్తలను చదివి వినిపిస్తాం. ఇప్పటికే చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాలు ప్రైమ్ టైం న్యూస్ యాంకర్లుగా మా సాంకేతికతను వాడేసుకుంటున్నాయి. ఇంతేకాదు టెక్నికల్ డిపార్ట్మెంట్స్లోనూ నెమ్మదిగా మా హవా మొదలవుతోంది ఇప్పుడు. స్టూడియో సెట్స్ గ్రాఫిక్స్‌లో ఇప్పుడు మాకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. టెక్నాలజీని ఆదరించే భారత్‌లో అతితొందర్లోనే మమ్మల్ని కాస్తో కూస్తో ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అయితే మేం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా.. మమ్మల్ని రూపొందించిన మనుషుల మేధస్సుకే మొత్తం గొప్పదనం దక్కాలని మేమూ కోరుకుంటున్నాం. - ఇట్లు మీ AI రాబోయే రోజుల్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు త్వరలో ఫుల్ డిమాండ్ ఉంటుందనేది నిపుణులు చెప్తున్న మాట. కానీ, ఆటోమేషన్ వల్ల మీడియా రంగంలోనే కాదు.. దాదాపు అన్ని రంగాల్లో ఉద్యోగ భద్రత ఉండదనేది ఒప్పుకోవాల్సిన చేదు నిజం. -
మీడియాపై తాలిబన్ల ఉక్కుపాదం.. కొత్తగా 11 నియమాలు
కాబూల్: అప్గనిస్తాన్‌లో పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే లక్ష్యంగా తాలిబన్ పాలకులు కఠిన చర్యలు ప్రారంభించారు. వార్తా సంస్థలపై ఆంక్షలు విధిస్తూ కొత్తగా 11 నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇస్లాం మతాన్ని, దేశంలోని ప్రముఖ నాయకులను కించపర్చేలా ఎలాంటి సమాచారం ప్రచురించిన కఠినా దండన తప్పదని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ మీడియా కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ పత్రికల్లో వార్తలు, వ్యాసాలు ప్రచురించాలని జర్నలిస్టులకు తాలిబన్లు హుకుం జారీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అఫ్గాన్‌లో పని చేస్తున్న పాత్రికేయులు తీవ్ర భయాందోళనకు గురవుతు న్నారని అమెరికాకు చెందిన ప్రెస్ ఫ్రీడమ్ ఆర్గనైజేషన్ సభ్యుడు స్టీవెన్ బట్లర్ చెప్పారు. తమకు సాయం చేయాలంటూ అఫ్గాన్ జర్నలిస్టుల నుంచి తనకు వందలాది ఈ–మెయిళ్లు వస్తున్నా యని తెలిపారు. అఫ్గానిస్తాన్‌ను ఆగస్టులో తాలిబన్లు మళ్లీ ఆక్రమించిన తర్వాత 150కిపైగా మీడియా సంస్థలు మూతపడినట్లు సమాచారం. దేశంలోని ప్రముఖ పత్రికలు ప్రింటింగ్ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఆన్లైన్ ఎడిషన్‌కు పరిమితం అవుతున్నాయి. తాలిబన్ల నుంచి ముప్పు తప్పదన్న భయంతోపాటు ఆర్థిక పరిస్థితి దిగజారడం కూడా ఇందుకు కారణం. తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలన్న డిమాండ్‌తో జనం వీధుల్లోకి వచ్చారు. ఈ నిరనస కార్యక్రమాలను, ప్రజల ఆగ్రహాన్ని ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టులపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. చాలామందిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ టీవీ చానళ్ల తీరు మారిపోయింది. టీవీల్లో న్యూస్ బులెటిన్లు, రాజకీయ చర్చలు, వినోదం, సంగీతం, విదేశీ నాటికలు తెరమరుగయ్యాయి. వాటి స్థానంలో తాలిబన్ ప్రభుత్వానికి అనుకూలమైన కార్యక్రమాలే ప్రసారమవుతున్నాయి. విలేకరులను నిర్బంధిం చడం తక్షణమే నిలిపివేయాలని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(సీపీజే) తాలిబన్ సర్కారును డిమాండ్ చేసింది. మీడియా కార్యకలాపాలు స్వేచ్ఛగా కొనసాగే వాతావరణం కల్పించాలని పేర్కొంది. శవాలను వేలాడదీసిన తాలిబన్లు అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక శిక్షలు ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. శనివారం ఓ వ్యక్తి శవాన్ని హెరాత్ నగరంలోని ప్రధాన కూడలిలో వేలాడదీశారని ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. మొత్తం నాలుగు శవాలను తాలిబన్లు తీసుకొచ్చారని, అందులో మూడు శవాలను వేరే చోటకు తీసుకెళ్లారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయా మృతదేహాలను వేలాడదీసేందుకే తీసుకెళ్లారని చెప్పారు. హెరాత్ నగరంలోని ప్రధాన కూడలి వద్ద ఓ శవాన్ని క్రేన్ సాయంతో వేలాడదీశారని, ఆ ప్రదేశానికి దగ్గర్లోనే తనకు ఓ ఫార్మసీ షాపు ఉందని వాజిర్ అహ్మద్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారి మౌలావి షీర్ అహ్మద్ స్పందించారు. నిందితులు ఓ వ్యాపార వేత్త కుమారుడిని కిడ్నాప్ చేశారని, వారిని భద్రతా బలగాలు ఆపడంతో కాల్పులు జరిపారని అన్నారు. దీంతో భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో నలుగురు కిడ్నాపర్లు మరణించారన్నారు. అనంతరం నలుగురి శవాలను వివిధ ప్రాంతాల్లో వేలాడదీశారు. ‘కిడ్నాప్‌కు పాల్పడే వారికి ఇలాంటి శిక్షే పడుతుంది’ అని రాసి ఉన్న బోర్డులను మృత దేహాలకు తగిలించారు. ఎవరూ కిడ్నాప్ కావడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. చదవండి: Afghanistan: కాళ్లు, చేతులు నరకడం శిక్షలు ఆపేదిలేదు: తాలిబన్లు -
అది చంద్రబాబు ఇంటిపై దాడి కాదు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినట్టు గత శుక్రవారం కొన్ని మీడియా చానళ్లు కథనాలు ప్రసారం చేశాయని.. నిజానికి ఆ ఘటన జరిగింది ప్రజలు రాకపోకలు చేసే కరకట్టపై అని గుం టూరు రేంజ్ డీఐజీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ స్పష్టం చేశారు. తన కార్యాలయంలో అర్బన్ ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, ఏఎస్పీ చక్రవర్తితో కలిసి డీఐజీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆ రోజు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కరకట్ట ప్రాంతానికి వెళ్లారని.. ఆ ప్రాంతానికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి 300 నుంచి 350 మీటర్ల దూరం ఉందని చెప్పారు. ఇంత దూరంలో ఉండగా, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందని ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించారు. ఆ రోజు పెడన ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వాహనాలపై దాడి జరిగిందని డీఐజీ చెప్పారు. ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగారనే తప్పుడు కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సబబు కాదని అన్నారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును పగులకొట్టడం, చెప్పుతో కొట్టడంతోపాటు డ్రైవర్‌ను కూడా చెప్పుతో కొట్టేందుకు టీడీపీ వారు ప్రయత్నించారని చెప్పారు. మరో వాహనాన్ని బండ రాయితో వెనుక అద్దం పగులకొట్టడం ఎం తవరకు సమంజసమని అన్నారు. వీటన్నింటిపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆ రోజు కరకట్టపై జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలను ల్యాప్‌టాప్ ద్వారా డీఐజీ మీ డియాకు చూపించారు. అదే రోజు సాయంత్రం డీజీపీ ప్రధాన కార్యాలయానికి గుంపుగా వెళ్లి గం దరగోళం చేయడం అవసరమా అని ప్రశ్నించారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు 75 మంది వెళ్తారా, అంతమందితో వచ్చి ఎలా ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు. గతంలో అనేక ఘటనలపై ఎన్నో పార్టీలు ఫిర్యాదులు చేసేందుకు వచ్చాయని, కానీ గేట్ దాటుకుని గందరగోళం స్పష్టించ లేదని అన్నారు. వినతిపత్రం ఎవరైనా ఇవ్వవచ్చని, అయితే అలా వెళ్లడం పద్ధతి కాదని అల్లర్లు, గందరగోళం స్పష్టించడం సరికాదని స్పష్టం చేశారు. ► అర్బన్ ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్ మాట్లాడుతూ గత శుక్రవారం కరకట్టపై ఉన్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూరల్ ఎస్పీ విశాల్‌గున్ని మాట్లాడుతూ.. పోలీసులు డ్యూటీ వదిలేసి స్పష్టతలు ఇవ్వడమే డ్యూటీగా ఉందని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏవైనా ప్రసారం చేసేప్పుడు ఒకసారి నిజ నిర్ధారణ చేసుకోవాలని కోరారు. -
మీడియా ‘దర్యాప్తు’ మాకొద్దు: శిల్పాశెట్టి
ముంబై: నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన వ్యాపారి రాజ్‌కుంద్రాపై దేశంలోని ప్రసార మాధ్యమాలన్నీ కోర్టుతో పాటు సమాంతర దర్యాప్తు కొనసాగిస్తున్నాయని రాజ్‌కుంద్రా భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కుటుంబ గోపత్యకూ ప్రజలు గౌరవం ఇవ్వాలని, ముఖ్యంగా పిల్లలున్న కుటుంబాల ప్రైవసీకి భంగం కల్గించొద్దని ఆమె హితవు పలికారు. మీడియా సొంత ‘దర్యాప్తు’కు స్వస్తి పలకాలని, చట్టం తన పని తాను చేయనివ్వండని ఆమె మీడియాను కోరారు. నీలి చిత్రాలను నిర్మించి, వాటిని ‘హాట్ షాట్స్’ తదితర యాప్‌ల ద్వారా ప్రచారంలోకి తెచ్చారనే ఆరోపణలపై జూలై 19వ తేదీన ముంబై నేరవిభాగ పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బుధవారం ఆయన చేసిన బెయిల్ అభ్యర్థనను దిగువ కోర్టు కొట్టేయడం విదితమే. కుంద్రా అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరెస్టు, అరెస్ట్‌కు కారణాలు, కుంద్రా చట్టవ్యతిరేక చర్యలు అంటూ పలు మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని, దీంతో తన కుటుంబానికి ప్రైవసీ లేకుండా పోయిందంటూ శిల్పా శెట్టి సోమవారం ‘ఇన్స్టాగ్రామ్’లో వివరణ ఇచ్చారు. ముంబై పోలీసులపై, భారత శాసన వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ‘ఆరోపణల నుంచి కుంద్రాను విముక్తుణ్ణి చేసేందుకు, శాసనవ్యవస్థ ద్వారా మాకున్న అన్ని సహాయ అవకాశాలను మేం అన్వేషిస్తున్నాం. నా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తల్లిగా నేను కోరేది ఒక్కటే. అసంపూర్ణ సమాచారంతో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం ఆపండి. మా కుటుంబం ప్రైవసీకి భంగం కల్గించొద్దు. సమాంతర దర్యాప్తు చేయకండి. సత్యమేవ జయతే’ అని శిల్ప పోస్ట్ చేశారు. -
ఒకే కాన్పులో పది మంది: అసలు బిడ్డలెక్కడ?
దక్షిణాఫ్రికాలో ఒకే కాన్పులో పది మంది బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిందన్న ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. పుట్టిన బిడ్డలతో సహా ఆ తల్లి ఫొటోలను ఇంతవరకు బయటకు రిలీజ్ చేయకపోగా, ఆ తల్లీబిడ్డల ఆచూకీని ఇప్పటికీ గోప్యంగా ఉంచడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ వ్యహారంలో ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ పెయిట్ ర్యామ్‌పెడి అత్యుత్సాహం ప్రదర్శించాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిటోరియా: టెంబిసా పట్టణంలో గోసియామె తమార సిత్హోల్ అనే 37 ఏళ్ల మహిళ.. నెలలు నిండకముందే పది మంది పిల్లలకు జన్మనిచ్చిందన్నది ప్రిటోరియా న్యూస్ కథనం. ఈ రికార్డు జననాల కథనం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా హౌజ్‌లన్నీ ఆ కథనాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే అధికారికంగా ఈ విషయాన్ని టెంబిసా అధికారులుగానీ, ఏ ఆస్పత్రి వర్గాలుగానీ ప్రకటించలేదు. ఇక వారం గడుస్తున్నా ఆ తల్లీబిడ్డలు మీడియా ముందుకు రాకపోవడంతో ఇది అసలు ఉత్త కథే అని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. దీనికితోడు ఆమె స్వయంగా మీడియాకు వెల్లడించిన స్టేట్మెంట్ ప్రకారం చేపట్టిన విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. స్టీవ్ బికో అకాడమిక్ హస్పిటల్లో తాను పది మందికి జన్మనిచ్చానని సిత్హోల్, ‘క్లెమెంట్ మన్యాతెల షో’లో ఆమె స్వయంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆ హాస్పిటల్ సీఈవో మథాబో మాథ్యుబెలా స్పందించారు. అసలు అలాంటి డెలివరీ కేసు తమ హాస్పిటల్ రికార్డుల్లో నమోదుకాలేదని ఆయన తేల్చేశారు. స్టీవ్ బికో ఆస్పత్రిపాటుతో పాటు ఇలాంటి సంక్లిష్టమైన ప్రసవాల కేసును డీల్ చేసే లూయిస్ పాస్టూర్, మెడిక్లినిక్ మెడ్‌ఫోరం హాస్పిటల్స్ కూడా అలాంటి డెలివరీ తమ దగ్గర రికార్డు కాలేదని వెల్లడించాయి. దీంతో ఈ వ్యవహారంలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆ బిడ్డల తండ్రి టెబెహో సోటెట్సి తాజా స్టేట్మెంట్తో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎక్కడున్నారో తెలియదు తాను చాలా పేదరికంలో ఉన్నానని, బిడ్డలకు సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని గోసియామె సిత్హోల్ ప్రజలను కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు దక్షిణాప్రికా దేశవ్యాప్తంగా విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో విరాళాల్ని ఇవ్వొద్దంటూ ఇప్పుడు స్వయంగా టెబెహో కోరుతున్నాడు. అసలు పిల్లలెక్కడ ఉన్నారో? నాక్కుడా తెలియదు. వాళ్లు ఇంటికి వచ్చేదాకా ఎవరూవిరాళాలు ఇవ్వకండి అంటూ ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ముందుగా ప్రిటోరియా న్యూస్‌కి సమాచారం అందించింది టెబెహోనే కావడం విశేషం. మరోవైపు సోటెట్సి కుటుంబ సభ్యులు గోసియామో సిత్‌హోల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2018లో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిందని ఆమె ప్రకటించుకుందని, ఆ బిడ్డలు మాత్రం జాడలేరని వాళ్లు మీడియాకు తెలిపారు. నన్ను బద్నాం చేయొద్దు కాగా, పది మంది పిల్లల వ్యవహారంలో దక్షిణాఫ్రికా మీడియా నైతికతపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పేద మహిళ జీవితంలోకి తొంగిచూసి.. అనుమానాలు, ఆరోపణలు చేయడం సరికాదని మీడియాను హెచ్చరించారు కొందరు. అయితే ఆ కొందరే ఇప్పుడు అనుమానాల నేపథ్యంలో ఫేక్ కథనాలతో ప్రజల్ని తప్పుబట్టారంటూ మీడియాపై విరుచుకుపడుతున్నారు. ఇక మంగళవారం ప్రిటోరియా న్యూస్ రూంలో ప్రత్యక్షమైన గోసియామో సిత్హోల్.. తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని, టెబెహో ఫ్యామిలీకి తన మీద మొదటి నుంచి ప్రేమ లేదని, అందుకే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే బిడ్డల ఐడెంటిటీని పబ్లిక్‌గా ఎప్పుడు చూపిస్తారనే ప్రశ్నకు ఆమె దాటవేత ధోరణిని ప్రదర్శించడంతో అనుమానాలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. #Tembisa10 Two babies: twins Three babies: triplets Four babies: quadruplets Ten babies: missing pic.twitter.com/cEYbrtX81L — Birthmark Pearson ⛴ (@Kai_WithNoX) June 15, 2021 Piet, trying to sort out the Tembisa 10 equation in front of during South Africans. 🙆🏽♂️ 😂😂😂#Tembisa10 pic.twitter.com/wTaZxANKmM — MOSS™🇿🇦🏳️🌈 (@_officialMoss) June 15, 2021 -
ఈసీకి సుప్రీం షాక్.. మీడియాకు అడ్డు చెప్పలేం
న్యూఢిల్లీ: కేసుల విచారణ సమయంలో ప్రజాప్రయోజనం లక్ష్యంగా వ్యాఖ్యలు చేసే హక్కు మీడియాకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, హైకోర్టుల నైతికస్థైర్యం దెబ్బతీయాలన్న ఆలోచన కూడా తమకు లేదని స్పష్టంచేసింది. హైకోర్టులు ప్రజాస్వామ్యంలో కీలకమైన వ్యవస్థలని వ్యాఖ్యానించింది. మద్రాసు హైకోర్టు తమపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్నికల సంఘం వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య సమన్వయం, సమతౌల్యం కోసం ప్రయత్నిస్తామని పేర్కొంది. విచారణ సందర్భంగా కోర్టులు చేసే వ్యాఖ్యలను రిపోర్ట్ చేయకుండా మీడియాను నియంత్రించాలన్న ఈసీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఎన్నికల సంఘమే కారణమని, ఎన్నికల సంఘం అధికారులపై హత్య అభియోగాలు నమోదు చేయాలని ఇటీవల మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈసీని కించపర్చే ఉద్దేశంతో హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్లుగా తాము భావించడం లేదని, విచారణలో భాగంగా చేసిన భావవ్యక్తీకరణగా ఆ వ్యాఖ్యలను తాము భావిస్తున్నామని పేర్కొంది. అందువల్లనే ఆ వ్యాఖ్యలు హైకోర్టు ఉత్తర్వుల్లో లేవని తెలిపింది. కోర్టుల్లో విచారణ సందర్భంగా జరిగే సంభాషణలు, కామెంట్లను రిపోర్ట్ చేయవద్దని మీడియాను కోరలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరినైనా కోర్టు ప్రశ్నిస్తుందంటే, వారికి కోర్టు వ్యతిరేకమని అర్థం కాదని వ్యాఖ్యానించింది. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కోర్టులు వ్యాఖ్యలు చేస్తుంటాయని, వ్యవస్థలను ప్రశ్నించకూడదని ఆదేశించి హైకోర్టుల నైతిక స్థైర్యాన్ని తాము దెబ్బతీయలేమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా లాయర్లు, జడ్జీల మధ్య ఎలాంటి అవరోధాలు లేని చర్చ జరగడం అవసరమని పేర్కొంది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని వ్యాఖ్యానించింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది ద్వివేదీ వాదిస్తూ.. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై హత్యాభియోగాలు నమోదు చేయాలంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. -
మీడియా పూర్తిగా రిపోర్ట్ చేయొచ్చు: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు విచారణ సందర్భంగా న్యాయస్థానంలో ఏం జరుగుతుంతో.. న్యాయవాదులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రజలకు తెలియజయడం కోసం మీడియాను తప్పనిసరిగా అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, వారిపై హత్యానేరం కింద విచారణ చేపట్టవచ్చని మద్రాస్ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఈసీ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టుల్లో జరిగే విచారణను నివేదించకుడా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మీడియా చాలా శక్తిమంతమైందని.. న్యాయస్థానంలో ఏం జరుగుతుందో దాన్ని బయటకు తెలియజేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పులే కాకుండా విచారణలో భాగంగా లేవనెత్తే ప్రశ్నలు, సమాధానాలు, వాదనలపై కూడా జనాలకు పట్టింపు ఉంటుందని సుప్రీం కోర్టు ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనల్ని మీడియా ప్రచురించకపోవడం అనేది ఆచరణకు చాలా దూరమైన అంశమన్నది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ.. కోవిడ్ విజృంభణకు సంబంధించి ఈసీకి కనీసం ఒక అవకాశం ఇవ్వకుండానే నిందిస్తున్నారని తెలిపింది. మద్రాస్ కోర్టు వ్యాఖ్యల అనంతరం ఎలాక్ట్రానిక్ మీడియాలో తన పని తీరును విమర్శిస్తూ.. వాదనలు నడుస్తున్నాయని ఈసీ కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు స్పందిస్తూ ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని పేర్కొంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కోర్టులు కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటాయని తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మాట్లాడుతూ.. హైకోర్టులను తక్కువ చేయడం తమకు ఇష్టం లేదని తెలిపారు. న్యాయవ్యవస్థకు అవి మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. విచారణలో భాగంగా కొన్నిసార్లు న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారని.. కోర్టును ఎలా నిర్వహించాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. చదవండి: ధర్మాగ్రహం -
వీడియో సీడీలంటేనే వణికిపోతున్న మంత్రులు
సాక్షి, మైసూరు: కర్ణాటకలో వీడియో సీడీలంటేనే మంత్రులు వణికిపోతున్నారు. తమకు చెందిన సీడీలు ఏవైనా ఉంటే వాటిపై పత్రికలు, టీవీ చానెళ్లలో వార్తా ప్రసారాలు రాకుండా చూడాలని పలువురు అమాత్యులు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్లను వేశారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలుపుతూ తాత్కాలిక అనుమతి ఇచ్చింది. ఇటీవల జలవనరుల మంత్రి రమేశ్ జార్కిహొళి అశ్లీల వీడియో బయటకు రావడం, ఆయన పదవి పోవడం తెలిసిందే. సిటీ సివిల్ కోర్టు వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం శివరాం హెబ్బార్, బీసీ పాటిల్, హెచ్‌టీ సోమేశేఖర్, కె.సుధాకర్, నారాయణగౌడ, బైరతి బసవరాజు ఉన్నట్లు తెలిసింది. భగ్గుమంటున్న విపక్ష నేతలు మంత్రుల పిటిషన్లపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. అలా పిటిషన్లను వేసిన ఆరుమంది మంత్రులను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని జేడీఎస్ ఎమ్మెల్యే. సా.రా. మహేష్ డిమాండు చేశారు. శనివారం మైసూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఉంటే వాటిని మీడియాలో ప్రసారం చేయకుండా ఆదేశాలను జారీ చేయాలని ఆరుమంది మంత్రులు కోర్టును ఆశ్రయించారని, వారిపై కఠిన చర్యల తీసుకోవాలని అన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ వీడియోల గురించి డిమాండ్లు చేయడం అసెంబ్లీని అవమానపర్చడమేనని ధ్వజమెత్తారు. మీరు తప్పు చేయకుంటే కోర్టును ఎందుకు ఆశ్రయించారని మహేశ్ ప్రశ్నించారు. అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఆ వీడియోలు బయటకి వస్తే మీ బండారం మొత్తం బయట పడుతుంది, అలా జరగకుండా కోర్టుకెళ్లారు అని ఆరోపించారు. ముంబైకి వెళ్ళిన మంత్రులు అక్కడ చేసిన ఘనకార్యాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఎద్దేవా చేశారు. పలువురు ప్రతిపక్ష నేతలు ఇదే తరహాలో ఆరోపణలు సంధించారు. చదవండి: (రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ?) వారు కోర్టుకెళ్లడం సరికాదు: సదానందగౌడ యశవంతపుర: తమ సీడీలను విడుదల చేయరాదని కొందరు కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా కోర్టుకెళ్లడం సరికాదని కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ అన్నారు. ఆయన శనివారం బెంగళూరు కేసీ జనరల్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకొని విలేకర్లతో మాట్లాడారు. రాసలీలల సీడీపై పార్టీ జాతీయ అధ్యక్షునికి పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సమాచారం పంపించారు. మీడియాలో వచ్చిన వార్తలనూ నాయకత్వానికి పంపారు. ఇలాంటి ఘటనల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేరళ సీఎంపై బంగారం స్మగ్లింగ్ వంటి బలమైన ఆరోపణలు వచ్చినందున ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
గూగుల్, ఫేస్బుక్ వార్తల్ని వాడుకుంటే.. మీడియా సంస్థలకి డబ్బు చెల్లించాలి
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో ఫేస్బుక్, గూగుల్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌లు ఏదైనా మీడియా సంస్థకి చెందిన వార్తల్ని వాడుకుంటే వాటికి డబ్బు చెల్లిం చాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా పార్ల మెంటు ఒక కీలక బిల్లుకు ఆమోదం వేసింది. న్యూస్ మీడియా చట్టానికి చేసిన సవరణల్ని గురువారం ఆస్ట్రేలియా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆస్ట్రేలియా ట్రెజరర్ జోష్ ఫ్రైడెన్ బెర్గ్, ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. మొదట్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఫేస్బుక్ తమ ప్లాట్‌ఫారమ్‌పై ఆస్ట్రేలియా వాసులు వార్తల్ని షేర్ చేయడంపై నిషేధాన్ని విధించింది. అయితే ప్రభుత్వం చట్ట సవరణల్లో మార్పులకు అంగీకరించడంతో ఫేస్ బుక్ వార్తల షేరింగ్‌పై నిషే«ధం ఎత్తి వేసింది. మరోవైపు ఫేస్బుక్, గూగుల్ సంస్థలు మీడియా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి. -
టూల్‌కిట్ కేసు: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టూల్‌కిట్ కేసుకు సంబంధించి దిశ రవి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘టూల్‌కిట్ కేసు దర్యాప్తులో భాగంగా.. ఢిల్లీ పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం లీక్ చేయలేదు’’ అనే అంశానికి కట్టుబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ‘‘టూల్‌కిట్ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, మీడియా హౌస్‌లు తన వ్యక్తిగత వాట్సాప్ చాట్లను బహిర్గతం చేశారు. ఇక మీదట ఇలా జరగకుండా పోలీసులను ఆదేశించండి’’ అంటూ దిశ రవి ఢిల్లీ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం ఢిల్లీ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు, మీడియా అత్యుత్సాహం వల్ల పిటిషనర్ గోప్యత హక్కు, కీర్తి హక్కు, న్యాయమైన విచారణ హక్కులకు తీవ్రమైన భంగం వాటిల్లినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒక జర్నలిస్టును వారి సోర్స్ గురించి వెల్లడించమని ఎలా ఒత్తిడి చేయలేమో.. దర్యాప్తు కొనసాగుతున్న కేసు విషయంలో కూడా ఇలాగే ఉండాలి. టూల్‌కిట్ కేసులో పోలీసులు తాము ఎలాంటి సమాచారం లీక్ చేయలేదని చెబుతుండగా.. మీడియాలో ఇందుకు విరుద్ధమైన కథనాలు ప్రసారం అవుతున్నాయి’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టూల్‌కిట్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున.. దీనికి సంబంధించి పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం లీక్ చేయవద్దని ఢిల్లీ హై కోర్టు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే.. దాని గురించి సగంసగం, ఊహాజనిత సమాచారం ప్రచారం చేయబడుతోంది అని దిశ రవి తరఫు న్యాయవాది అఖిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. "గోప్యత హక్కు, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, వాక్ స్వాతంత్ర హక్కుల మధ్య సమతుల్యత అవసరం. ఇటీవలి టూల్కేట్ కేసుకు సంబంధించి ప్రసారమైన కథనాలు చూస్తే.. ఖచ్చితంగా మీడియా సంచలనాత్మక రిపోర్టింగ్ చేసిందని అర్థం అవుతోంది. ఏదైనా అంశం గురించి మీడియా సమావేశాలు జరగడం సాధారంణం. అలాంటి సమయంలో మీడియా సంచలనాత్మమైన పద్దతిలో సమాచారాన్ని వ్యాప్తి చేయడం తగదు’’ అని కోర్టు అభిప్రాయ పడింది. "దర్యాప్తుకు ఆటంకం కలగకుండా సమాచారాన్ని ప్రసారం చేసే సమయంలో సరైన సంపాదకీయ నియంత్రణ ఉండేలా చూసుకోండి" అని కోర్టు న్యూస్ ఛానెల్స్‌కు సూచించింది. "ప్రతివాదులు అందరికీ వివరణాత్మక సమాధానాలు దాఖలు చేయడానికి సమయం అవసరం" అని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఎ.ఎస్.జి) సూర్యప్రకాష్ వీ రాజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘దిశ రవి పోలీసులపై ఒత్తిడి తెవడమే కాక వారిని అపఖ్యాతి పాలు చేస్తున్నారు.. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటువంటి పిటిషన్ దాఖలు చేశారు’’ అని ఆరోపించారు. చదవండి: అణచేస్తే అణగని జనగళం -
ఆస్ట్రేలియాకు గూగుల్ బెదిరింపులు
వెల్లింగ్టన్: ‘బెదిరింపులపై మేం స్పందించం. కానీ మీరు చేయగలిగే స్థాయిలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాలు చేస్తుంది’.. ఇదీ గూగుల్ బెదిరింపులకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇచ్చిన సమాధానం. వివరాల్లోకెల్తే.. ఆస్ట్రేలియాలోని మీడియా సంస్థలకు చెందిన వార్తలను గూగుల్ ఉపయోగించు కుంటున్నందుకుగానూ ఆయా మీడియా సంస్థలకు డబ్బు చెల్లించేలా ఆస్ట్రేలియా ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ చట్టాలపై గూగుల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ల గూగుల్ డైరెక్టర్ మెల్ సిల్వా మాట్లాడుతూ.. ‘ఈ కోడ్ గనక చట్టంగా మారితే, గూగుల్ సెర్చ్‌ను ఆస్ట్రేలియాలో లేకుండా చేయడం తప్ప ఇంకేమీ చేయలేం. అప్పుడు మా ప్రొడక్ట్‌లను ఉపయోగించే దేశ ప్రజలకు అది బ్యాడ్ న్యూస్’ అంటూ ఆ దేశ సెనెటర్లకు చెప్పారు. మీడియా సంస్థలకు డబ్బు చెల్లించడానికి తాము సిద్ధమేనని, అయితే చట్టంలో ఉన్న నియమాల ప్రకారం కాదని చెప్పారు. -
విద్వేషకారులను వదలొద్దు.. కఠినంగా శిక్షించాలి
రాజకీయ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు జరుగుతున్నాయి. ఎవరూ లేని ప్రదేశాల్లో, అర్ధరాత్రి పూట, అందరూ పడుకున్నాక, తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లోని గుడులపై దాడులు చేస్తున్నారు. వాటిలోని విగ్రహాలను పగలగొడుతున్నారు. ఆ మర్నాడు వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి మీడియా సంస్థలు వాటిని అదే పనిగా ప్రసారం చేస్తున్నాయి. దాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. విగ్రహాల విధ్వంసం ఘటనలను లోతుగా దర్యాప్తు చేయండి. ఆ ఘటనలకు బాధ్యులైన వారెవరో అందరికీ తెలిసేలా ప్రదర్శించండి. ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అన్యాయమైన పనులు చేసే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్న సందేశం స్పష్టంగా ఇవ్వాలి. వారి పట్ల కఠినాతికఠినంగా వ్యవహరించాలి. సాక్షి, అమరావతి: కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచుతూ, విగ్రహాలను ధ్వంసం చేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయొద్దని, ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏవైనా ఘటనలు జరిగితే ఖండించాలని, మత సామరస్యం కోసం పాటుపడే వారికి సహకరించాలన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆదేశించారు. విగ్రహాలను ధ్వంసం చేసే పనులను చేపడితే మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలని పునరుద్ఘాటించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన స్పందన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు ► సోమవారం పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడాను. మనం డీల్ చేయాల్సిన పరిస్థితుల గురించి కూడా వివరంగా మాట్లాడాను. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ జరుగుతోంది. ఇది చాలా కొత్త అంశం. ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు పట్టుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పోయి కొత్త ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ► ఇంటింటికీ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే.. జీర్ణించుకోలేక, తట్టుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలందుతున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక, అలాంటి పనులకు ఒడిగడుతున్నారు. ► దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలనుకుంటున్నారు. ఇలాంటి నేరాలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టాలి. కఠినంగా వ్యవహరించాలి ► వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఇప్పటికే గుళ్లలో 36 వేల సీసీ కెమెరాలు పెట్టాం. ఆ విధంగా గుడులు, గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. నిజానికి గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ► ఈ రాజకీయ గెరిల్లా వార్ ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు ప్రచారం కావాలి. మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు పెంచే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. -
యూట్యూబ్ చానల్ ప్రతినిధుల నిర్వాకం
సాక్షి, భవానీపురం(విజయవాడ): ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వస్తున్న యూట్యూబ్ చానల్స్‌లో పనిచేస్తున్న కొందరు వ్యవహరిస్తున్న తీరు జర్నలిజానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇది జర్నలిజం పట్ల నిబద్ధత కలిగి నిజాలను వెలికి తీస్తూ నిజాయతీగా వ్యవహరించే పాత్రికేయులకు తలవంపులుగా మారింది. సేకరించిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగరోజు శనివారం భవానీపురం బ్యాంక్ సెంటర్లోని సుధాకర్ మెడికల్ షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తాము వన్ టీవీ న్యూస్ ప్రతినిధులమని, యాడ్ ఇవ్వాలని అడిగారు. తమది చిన్న మెడికల్ షాపని, యాడ్ ఇచ్చే పరిస్థితిలో లేమని, షాప్‌వారు తెలపడంతో తమకు టార్గెట్లు ఉంటాయని, కనీసం రూ.5వేల యాడ్ ఇవ్వాలని వారు అడిగారు. ఇవ్వలేమని, తమకు ఆ అవసరంకూడా లేదని నిర్వాహకులు తేల్చి చెబుతూ ఐడీ కార్డు చూపమని అడిగారు. ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రమే తన ఐడీ కార్డ్ బయటపెట్టారు. దానిపై మట్టా రవికుమార్, కంట్రిబ్యూటర్, మైలవరం అని ఉంది. రెండవ వ్యక్తి తన ఐడీకార్డు ఆఫీస్‌లో ఉందని చెప్పారు. తమకు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు తెలుసునని, వారితో చెప్పి మీపై ఏదో ఒక కేసు బనాయిస్తామని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. దీనిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తుండగా మరో వ్యక్తి సంస్థకు చెందిన లోగో బయటకు తీసి హడావుడి చేశారు. దీంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరి మెడికల్ షాపు నిర్వాహకులకు మద్దతుగా నిలబడటంతో వారు నెమ్మదిగా జారుకున్నారు. దీనిపై భవానీపురం ఇన్చార్జి సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వన్ టీవీ ప్రతినిధి ఐడీ కార్డు, కారు ∙ఇదే యూట్యూబ్ చానల్‌కు చెందిన పి.సురేష్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులను వెంటేసుకుని గత ఏడాది సెప్టెంబర్ 13న విజయవాడ ఊర్మిళానగర్‌లో బడ్డీ కొట్టు నడుపుకుంటున్న ఒక దివ్యాంగురాలిని బ్లాక్ మెయిల్ చేసి రూ.1000 వసూలు చేశారు. దీనిపై ఆమె భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిటీ ఎస్ఐ పేరుతో నకిలీ ఐడీ కార్డు సృష్టించిన గుత్తుల ప్రశాంత్ అనే వ్యక్తి కారులో వస్తుండగా ఈ ఏడాది జూన్ 25న భవానీపురం పోలీసులు గొల్లపూడిలో పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తాను వీ వన్ చానల్ రిపోర్టర్నని ఐడీ కార్డ్ చూపించాడు. కారు నంబర్ ప్లేట్లుకూడా మార్చిన అతన్ని విడిపించేందుకు అప్పట్లో కొందరు పెద్దఎత్తున లాబీయింగ్ చేశారని వినికిడి. -
హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నిర్మాతలు
ఢిల్లీ : వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించాయంటూ రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తూ ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా ఈ మీడియా సంస్థలు బాధ్యతా రహితమైన, అవమానకర వ్యాఖ్యలు చేశాయంటూ ఆరోపించాయి. ఈ మేరకు బాలీవుడ్‌లోని నాలుగు అసోషియేషన్స్, 34 ప్రముఖ నిర్మాణ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి, రిపోర్టర్ ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ శివశంకర్ గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్ పేర్లను పిటిషన్లో చేర్చారు. (పొరుగింటామెను అరెస్ట్ చేయండి: రియా) చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా వీరిని నివారించాలంటూ నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై పోలీసులపై ఈ న్యూస్ చానల్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో డ్రగ్స్ వాడకం చాలా సర్వసాధారణమని, ఇది ఓ చెత్త పరిశ్రమ అంటూ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. (ముంబైలో టీఆర్పీ స్కామ్) -
దిగజారుతున్న మీడియా విలువలను కాపాడాలి
-
ఆ మాటలను మీడియా ఆపాదించింది
సాక్షి, హైదరాబాద్: ‘నవంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలుంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్టు ప్రకారం నవంబర్ రెండోవారం తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది’అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ట్వీట్ చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో బల్దియా ఎన్నికలపై కేటీఆర్ సంకేతాలిచ్చినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. -
జాతీయ భద్రతా చట్టం : మీడియా మొఘల్ అరెస్ట్
హాంకాంగ్ : కొత్త భద్రతా చట్టం ప్రకారం హాంకాంగ్ ప్రభుత్వం మీడియా మొఘల్ ను అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. జాతీయ భద్రతా చట్టం కింద హాంకాంగ్ దిగ్గజ వ్యాపారవేత్త, నెక్ట్స్ డిజిటల్ మీడియా అధినేత జిమ్మీ లై (71), ఇతర ముఖ్యులను అరెస్టు చేసింది. భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఏడుగురిని అరెస్టు చేసినట్లు హాంకాంగ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య అనుకూల విధానాలతో హాంకాంగ్‌లో జరిగిన అల్లర్లకు జిమ్మీ మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ విదేశీ శక్తులతో జతకట్టాడన్నఆరోపణలపై జిమ్మీని అరెస్టు చేశారు. దాదాపు 200 మందికి పైగా పోలీసులు మీడియా సంస్థలోకి ప్రవేశించి గందరగోళ సృష్టించారని లై ప్రధాన వారసుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్క్ సైమన్ ట్వీట్ చేశారు. ఈ రోజు వస్తుందని ముందే ఊహించానని, ఆపిల్ డైలీ జర్నలిస్టు ఒకరు ఆందోళనవ్యక్తం చేశారు. హాంకాంగ్ ప్రభుత్వానికి, బీజింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడే మీడియాను టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రధానంగా ఆపిల్ డైలీని మూసి వేయడం, ఇతర మీడియా సంస్థలను బెదిరించడం లక్ష్యంగానే ఈ దాడి అని మండిపడ్డారు. ఇది పత్రికా స్వేచ్ఛకు ముగింపు అని వ్యాఖ్యానించారు. జూలై 1 నుండి అమల్లోకి వచ్చేలా చైనా వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం దోషులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. అలాగే మీడియా సంస్థల ఎలక్ట్రానిక్ పరికరాలను శోధించడం, మీడియా సంస్థలతో సహా సర్వర్లను స్వాధీనం చేసుకునే విస్తృత అధికారాలను ఇస్తుంది. కాగా 1995లో జిమ్మీ లై స్థాపించిన నెక్స్ట్ డిజిటల్ మీడియాకు ఆపిల్ డైలీ మాతృ సంస్థ. తొలుత వస్త్ర వ్యాపారం నిర్వహించిన ఆయన ఆ తరువాత ఆపిల్ డైలీ అనే పత్రికతో మీడియా రంగంలోకి ప్రవేశించారు. కాలక్రమంలో ఇది హాంకాంగ్, చైనా ఆధిపత్యాన్ని విమర్శించే ప్రజాస్వామ్య అనుకూల వార్తా సంస్థగా ఖ్యాతి గడించింది. సుమారు వంద కోట్ల డాలర్లు ఆస్తి ఆయన సొంతం. ఉగ్రవాదం, విదేశీ శక్తులతో కలిసి పని చేయడం లాంటి అనేక ఇతర ఆరోపణలను ఇప్పటికే లై ఎదుర్కొంటున్నారు. తాజాగా అతని కుమారులు, ప్రచురణ బృందంలోని పలువురు ముఖ్యులను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. -
ఎమ్మెల్యే రాచమల్లుపై దుష్ప్రచారం
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిపై ఉద్దేశ పూర్వకంగానే కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఓ మీడియాలో కథనం ప్రసారం చేశారని టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్ అన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లుకు సత్సంబంధాలు లేవని చెప్పడం వాస్తవం కాదన్నారు. సీఎంతో ఉన్న సన్నిహిత సంబంధంతోనే ఎమ్మెల్యే తనలాంటి సాధారణ వ్యక్తికి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పదవి ఇప్పించారన్నారు. సీఎంతో చర్చించిన తర్వాతే ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్లను రద్దు చేసి, ప్రస్తుతం లబ్ధిదారులకు స్థలాలు ఇస్తున్నారన్నారు. కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్పడంలో అర్థం లేదన్నారు. తనలాంటి కార్యకర్తకు చాలా కాలం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్ష పదవి ఇచ్చారని పేర్కొన్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి చెందిన శేఖర్ యాదవ్‌కు ఎంపీపీ పదవికి ప్రతిపాదన చేశారని, నంగనూరుపల్లెకు చెందిన యాలం తులశమ్మకు మార్కెట్ చైర్పర్సన్, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డికి వైస్ చైర్మన్, ఎస్ఏ నారాయణరెడ్డికి రాజుపాళెం మండల బాధ్యునిగా పదవులు ఇచ్చారన్నారు. వరదరాజులరెడ్డి వస్తారనేది అవాస్తవం 1996 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్న బంగారురెడ్డి చొరవతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తొలి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆయన కార్యకర్తలా శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని గత ఎన్నికల సమయంలోనే ప్రకటించారన్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ప్రచారం చేయడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఎంపీపీ అభ్యర్థి శేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లు పనితీరును సీఎం జగన్మోహన్రెడ్డి సైతం ప్రశంసించారన్నారు. మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ నారాయణరెడ్డి, హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ ద్వార్శల భాస్కర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్‌యాదవ్ పాల్గొన్నారు. -
సమీప భవనాల్లోకి మీడియాను అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: సచివాలయం సమీపంలోని ప్రైవేటు భవనాల్లోకి మీడియాను అనుమతించరాదంటూ సదరు భవనాల యజమానులను పోలీసులు బెదిరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారాలు చట్టబద్ధమైనప్పుడు ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించింది. ప్రైవేటు భవనాల యజమానులు మీడియాను అనుమతించేందుకు సిద్ధంగా ఉంటే పోలీసులు గానీ, ప్రభుత్వంగానీ అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం భవనాల కూల్చివేతకు మీడియాను అనుమతించడం లేదంటూ వీఐఎల్ మీడియా లిమిటెడ్ తరఫున జి.సంపత్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మరోసారి విచారించారు. కూల్చివేత ప్రాంతానికి మీడియాను అనుమతించేందుకు సిద్ధంగా లేమని, అవసరమైతే కోవిడ్ కేసుల బులెటిన్ ఇస్తున్న తరహాలో మీడియా బులెటిన్ ఇస్తామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. జీవో 69 ప్రకారం కూల్చివేత ప్రాంతానికి ఎవరినీ అనుమతించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను దురుద్దేశంతో వేశారని, దీనికి విచారణార్హత లేదని వాదించారు. కూల్చివేతల సమయంలో ప్రమాదం జరగకూడదనే మీడియాను అనుమతించడం లేదన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాసిరెడ్డి నవీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోవిడ్ కేసులకు సంబంధించి కీలక సమాచారాన్ని దాచిపెట్టి బులెటిన్ విడుదల చేస్తున్నారని, ఇదే తరహాలో కూల్చివేతలకు సంబంధించిన బులెటిన్ ఉంటుందని, ఇందుకు తాము అంగీకరించమని తెలిపారు. ప్రతిరోజూ మీడియాను ఏదో ఒక నిర్దిష్ట సమయంలో సచివాలయం ప్రాంగణంలోకి తీసుకెళ్లేలా ఆదేశించాలని కోరారు. ‘మీడియా ప్రతినిధులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మావోయిస్టు పార్టీ నేతలను ఇంటర్వ్యూ చేస్తారు. రిస్క్ చేయడం వారి విధి నిర్వహణలోనే ఉంది..’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికిది మంచిది కాదు.. ‘సచివాలయం కూల్చివేతకు హైకోర్టు, సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతించాయి. కూల్చివేతలకు అనుమతి అవసరం లేదని, నూతన భవనాల నిర్మాణానికి మాత్రమే అనుమతి అవసరమని స్పష్టం చేశాయి. ఈ తరుణంలో శిథిలాలను చూడటానికి మీడియాను అనుమతించడానికి అభ్యంతరం ఏమిటి? జాతీయ మీడియా సైతం ఆసక్తిగా ఈ అంశాన్ని ప్రచురిస్తోంది. మీడియాను నియంత్రించి అనవసరమైన అపోహలకు ఆస్కారం ఇస్తున్నారు. గుప్తనిధులున్నాయి కాబట్టే మీడియాను అనుమతించడం లేదని భావిస్తున్నారు. మంచి భవిష్యత్ ఉన్న ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. పారదర్శకంగా ఉండాలి. ఏదో ఒక సమయంలో మీడియాను ఒక వ్యాన్‌లో తీసుకెళ్లి చూపిస్తారని భావించాను. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేమని చెబుతోంది కాబట్టి దీనిపై ఇరు వర్గాల వాదనలు విని తీర్పు వెలువరిస్తాం..’అంటూ న్యాయమూర్తి విచారణను శనివారానికి వాయిదా వేశారు. -
గోతిలో పడుతున్న రాజకీయ మీడియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా వాలకం చూస్తే కొత్త కొత్త పుంతలు, సరికొత్త నిర్వచనాలు స్ఫురిస్తున్నాయి. నేడు మీడియా అంటే రాజకీయాల కోసం, రాజకీయాలు నడిపే రాజకీయం– అని చెప్పుకోవడం సబబేమో! సరిగ్గా సంవత్సరం క్రితం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత– పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత మీడియా ఎలా ప్రవర్తించిందో అందరికీ గుర్తుంది. లేని విషయాలు ఉన్నట్టు, నెలన్నరపాటు ఊకలా దంచి, ఎన్నికల ఫలితాలు రాగానే ఆంధ్రప్రదే శ్లో ప్రజాభిప్రాయ ధోరణి గురించి మాట్లాడకుండా ఇతర రాష్ట్రాల ఫలి తాల తీరు సంబంధించి చర్చించడం ప్రారంభిం చారు. నిజానికి ఇతర రాష్ట్రాల పోకడల మీద ఆసక్తి ఉంటే ప్రచారం సమయంలో కూడా అలాగే సాగి ఉండాలి కదా! అభూతకల్పనలకు వ్యతి రేకంగా ప్రజలు గట్టిగానే తీర్పు ఇచ్చారు. ఈ మీడియా ధోరణిని మొత్తం దేశం గుర్తించినా అంగీకరించడానికి వీరు సిద్ధంగా లేరు. ప్రజల స్థాయిలో ఏమి జరుగుతుందో అసలు పట్టించుకోకుండా తమకు ‘అవసరమైన విషయాలు’ మాత్రమే ప్రముఖమైన వార్తలుగా వండి వార్చడం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ చరి త్రలో అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పనితనం, ప్రణాళికలు, ఫలితాల గురించి కాకుండా వేరే అంశాలు వార్తలుగా చేస్తున్నారు. తొలి సంవత్సరం ముగిసి, రెండో సంవత్సరంలో ప్రవేశిస్తున్న వేళ–సంబంధంలేని సంచలనంతో దృష్టి మళ్ళించే ప్రయత్నం పుష్కలంగా చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 1,088 అంబులెన్స్‌లు విజయవాడలో బయలుదేరే ముహూర్తానికి కొన్ని గంటల ముందు ఏమి వార్త ప్రచురించారు? ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం అంటూ పత్రికా శీర్షికగా ఎందుకు వస్తుంది? రెండు రాష్ట్రాలలో రెండు రకాలుగా వార్తలు వార్చాల్సిన అవసరం ఏమిటి? ఏ లక్ష్యంతో వార్తలు ఇలా రాసుకున్నా– ఆ రోజు టెలివిజన్‌లో బారులుగా నడుస్తున్న ఆంబులెన్స్ వాహనాల దృశ్యాల ప్రభావం విశేషం. కాకతాళీయంగా ఆంబులెన్స్ వాహనాలు బయలుదేరిన రోజు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం అంటూ ఏపీలోని పెద్దపత్రిక వార్తలు రాసిన రోజున తెలంగాణ హైకోర్టు కరోనా గురించి ఆ రాష్ట్రాన్ని చాలా వివరాలను అడిగింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆంగ్ల దినపత్రిక జూలై 2వ తేదీన తొలి పేజీలో ప్రధానంగా ఈ వార్తను ప్రచురిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఆంబులెన్స్ సేవల ప్రస్తావన కూడా తెచ్చింది. కరోనా పెచ్చరిల్లే సమయాన అమరావతి ఉద్యమం, ఆ ఉద్యమానికి వంద రోజులు వంటి వార్తలు ఇచ్చారు. ఇప్పుడు కరోనా నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నపుడు మరోరకమైన వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో వివిధ అంగాల మధ్య కనబడే పనితనం గురించి కూడా మీడియాతో సహా అందరూ గమనించాలి. ఎన్నికైన ప్రభుత్వం చెప్పే మాటలనూ, ప్రభుత్వ యంత్రాంగం చేసే పనులను కూడా ప్రజలు పోల్చుకునే వెసులుబాటు ప్రజాస్వామ్యంలో ఉంది. ప్రజల విషయాన్ని మీడియా పూర్తిగా విస్మరించడం.. సోషల్ మీడియా వ్యాప్తి కాని రోజుల్లో బోధపడటానికి చాలాకాలం పట్టేది. ఇప్పుడు వార్తలను మీడియా ఎలా వక్రీకరి స్తుందో ప్రజలు సులువుగా తెలుసుకుంటున్నారు. ఏ మీడియా సంస్థకు ఎంత మినహా యింపు ఇవ్వాలో కూడా పాఠకులకూ, వీక్షకులకూ బాగా తెలుసు. ప్రజలనూ, ప్రజల అవసరాలనూ పూర్తిగా విస్మరించిన మీడియా దిగజారిన విశ్వసనీయత వారి వాణిజ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందన్న స్పృహను కోల్పోతుంది. కరోనా కారణంగా కుదేలైన మీడియా ఉద్యోగులను తగ్గించుకుంటూ సాయంకోసం అర్రులు చాస్తోంది. ఇలాంటి సమయంలోనూ ప్రజామోదాన్ని సైతం ఖాతరు చేయకపోవడం వెనుక వీరి అంతర్గత వ్యూహం ఏమిటో? స్వల్పకాలిక ప్రయోజనాలు కాదు కదా, దీర్ఘకాలిక నష్టాలవైపు ఈ రాజకీయ మీడియా సాగడం ఎవరికీ మంచిది కాదు, వారికి అసలే మంచిది కాదు! వ్యాసకర్త: డా‘‘ నాగసూరి వేణుగోపాల్ సైన్స్ రచయిత, వర్తమాన అంశాల వ్యాఖ్యాత మొబైల్ : 94407 32392 -
మీడియా షేర్ల లాభాల 'షో'
లాభాలతో కదులుతున్న మార్కెట్లలో మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. దీంతో ఎన్ఎస్ఈలో మీడియా ఇండెక్స్ 2.5 శాతం పుంజుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో పలు కౌంటర్లు 7-2 శాతం మధ్య ఎగశాయి. దేశవ్యాప్తంగా లాక్‌డవున్ ఎత్తివేయనున్న నేపథ్యంలో తిరిగి మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగ బిజినెస్‌లు ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం.. డీబీ కార్ప్ జోరు మీడియా రంగ షేర్లలో ప్రధానంగా డీబీ కార్ప్ 7.2 శాతం ఎగసింది. రూ. 78 వద్ద ట్రేడవుతోంది. గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 17500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా మూడు రెట్లు అధికంగా 50,000 షేర్లు చేతులు మారాయి. ఇతర కౌంటర్లలో నెట్వర్క్ 18, డిష్ టీవీ, టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్, ఐనాక్స్ లీజర్, పీవీఆర్, జీ, సన్ టీవీ, జాగరణ్ ప్రకాశన్ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఐనాక్స్ లీజర్ ఈ నెల 26 నుంచి నిఫ్టీ స్మాల్ క్యాప్- 100లో చోటు సాధించనుంది. -
మీడియాకు భారీగా ప్రభుత్వ బకాయిలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రకటనల విభాగం, పలు రాష్ట్రాల ప్రకటనల విభాగాలు మీడియా సంస్థలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉన్నాయని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ బకాయిలు వారు ఇప్పట్లో చెల్లించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఒక అఫిడవిట్లో ఐఎన్ఎస్ సుప్రీంకోర్టు ముందు ఉంచింది. ‘మీడియా ఇండస్ట్రీ అంచనాల ప్రకారం..వివిధ మీడియా సంస్థలకు డీఏవీపీ(డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ విజువల్ పబ్లిసిటీ) సుమారు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో రూ. 800 కోట్ల నుంచి రూ. 900 కోట్ల వరకు ప్రింట్ మీడియా వాటా’ అని వివరించింది. -
'కరోనాపై పోరులో మీడియా ప్రముఖ పాత్ర'
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. ఈ సందర్భంగా మీడియాలోకేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటంలో వైద్యులు, నర్సులు, పోలీస్ సిబ్బంది మాదిరిగానే మీడియాలో పనిచేసే వారు కూడా ముందు వరుసలో ఉన్నారన్నారు. కరోనాపై పోరులో పాత్రికేయులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే సంబంధిత శాఖల నుంచి సరైన సమాచారం లేకుండా కరోనా వైరస్‌కు సంబంధించిన వార్తలను ప్రచురించడం కానీ, టీవీలలో చూపించడం కానీ చేయొద్దని సూచించారు. ఇక తాజాగా ప్రధాని దేశ ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా.. ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశం ఆర్థిక వ్యవస్థ ముఖ్యమే అని సూచించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్రమంత్రులంతా సోమవారం రోజున తమ కార్యాలయాలకు వచ్చి వారి పనుల్లో నిమగ్నమవ్వడం విశేషం. కాగా.. భారత్‌లో ఇప్పటిదాకా 9,152 కేసులు నమోదుకాగా, గడిచిన 24 గంటల్లో 796 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. చదవండి: పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్ -
మీడియాసంస్థల అధినేతలతో ప్రధాని మోదీ
-
‘ఈనాడు’పై రూ.వెయ్యి కోట్ల దావా వేస్తాం
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖపై నిరాధార కథనం ప్రచురించిన ‘ఈనాడు’పత్రిక బేషరతుగా పోలీసు శాఖకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.వెయ్యి కోట్లకు కోర్టులో దావా వేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ అనేక సంస్కరణలతో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచివేసి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, అలాంటి శాఖపై నిరాధార కథనాలతో బురదజల్లడం సబబు కాదన్నారు. అధికారుల పోస్టింగులు, బదిలీలపై కథనంలో పేర్కొన్నట్లుగా ఎవరెవరు ఎంత తీసుకున్నారో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. శనివారం లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. తెలంగాణ పురోగతిని జీర్ణించుకోలేని కొన్ని మీడియా సంస్థలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటివరకు ఓపిక పట్టామని, ఇకపై కఠినంగా ఉంటామని చెప్పారు. అసత్య ప్రచారాలు చేస్తున్న పత్రికలు, చానళ్లను ఉపేక్షించబోమని ప్రకటించారు. హుస్నాబాద్ ఏకే47 మిస్సింగ్ కేసు విచారణ జరుగుతోందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. సివిల్ తగాదాల్లో పోలీసులు నేరుగా తలదూర్చట్లేదని స్పష్టం చేశారు. డిపార్ట్మెంట్ పూర్తి పారదర్శకంగా పనిచేస్తోంది: ఏడీజీ పోలీసుశాఖ పూర్తి పారదర్శకంగా, విధుల్లో రాజీపడకుండా 24 గంటలపాటు ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతోందని అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) జితేంద్ర అన్నారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖలో అవినీతి అంటూ ఓ పత్రిక (సాక్షి కాదు)లో ప్రచురితమైన కథనం నిరాధారమని ఖండించారు. తమ శాఖపై ఎలాంటి అవినీతి, రాజకీయ ఒత్తిళ్లులేవని స్పష్టంచేశారు. డిపార్ట్మెంట్లో పోస్టింగులు, ట్రాన్స్ఫర్లు పూర్తి పారదర్శకంగా అధికారి ట్రాక్ రికార్డుపై ఆధారపడి జరుగుతున్నాయన్నా రు. ఆ కథనం పూర్తి నిరాధారమని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. -
మీడియా తంత్రం–బాబు కుతంత్రం
అసలే చిన్నగా ఉండే గురివింద గింజ ప్రతిపక్ష నేత చంద్రబాబును చూసి మరింత చిన్నబోతోంది. గురివింద నీతి కూడా చంద్రబాబు దుర్నీతి ముందు పనికిరాకుండాపోతోంది. అధికారం కోల్పోగానే ప్రతిపక్ష నేతకు హఠాత్తుగా మీడియా స్వేచ్ఛ గుర్తుకు వచ్చింది. పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ గగ్గోలు మొదలుపెట్టారు. ఆయన రాద్ధాంతం చూస్తేంటే... వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీడియా నియంత్రణకు కొత్తగా చట్టం ఏమైనా చేసిందా అనే సందేహం కలుగుతుంది. తీరా చూస్తే కొత్తగా ఎలాంటి చట్టం చేయలేదు... పోనీ చంద్రబాబు తాను సీఎంగా ఉండగా ఏం చేశారో ఓసారి చూస్తే... ఆయన హయాంలో అంతా పత్రికలపై కక్ష సాధింపులు... పాత్రికేయులపై వేధింపులే కనిపిస్తున్నాయి. ఆధారసహితంగా తన ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసిన పత్రికలు, పాత్రికేయుల మీద ఏకంగా క్రిమినల్ కేసులు పెట్టాలని జారీ చేసిన జీవోలు ఆయన నిజస్వరూపాన్ని నిగ్గు తేలుస్తున్నాయి. మీడియా గొంతు నొక్కుతున్నారని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లేందుకు నానాపాట్లు పడుతున్నారు. వాస్తవం ఏమిటంటే.. మీడియాపై ఆంక్షలు విధిస్తూ కొత్తగా ఎలాంటి చట్టమూ రాలేదు. రాజ్యాంగం దేశ ప్రజలు అంద రికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. దానికిందే స్వేచ్ఛగా, నిర్భీతిగా నిజాలు చెప్పేందుకు పత్రి కలు, టీవీ చానళ్లకు రాజ్యాంగపరమైన హక్కు కల్పించింది. కానీ అదే సమయంలో అసత్య వార్తలు, నిరాధార కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా ఆ మీడియా సంస్థలపై చట్టప రమైన చర్యలు తీసుకునే అవకాశం, అధికారం ప్రభుత్వాలకైనా, ప్రైవేటు వ్యక్తులకైనా, సంస్థల కైనా ఉంటుంది. లేనట్టయితే ఎవరైనా ఇష్టాను సారం అసత్య వార్తలు ప్రచురించి, ప్రసారం చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ప్రజల్లో భయాం దోళనలు సృష్టించడం రివాజుగా మారుతుంది. అందుకే ఆ జాగ్రత్త తీసుకున్నారు. ఆ ప్రకారమే తప్పుడు వార్తలు, కథనాల విషయంలో చట్టప రంగా తగిన చర్యలు తీసుకునే అధికారం ప్రభు త్వానికి మొదటి నుంచీ ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కూడా అదే చెబు తోంది. నిరాధార వార్తలు ప్రచురించి, ప్రసారం చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినా, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇదేమీ కొత్త విషయం కాదు. గతంలో చంద్ర బాబు ప్రభుత్వంతోసహా అన్ని ప్రభుత్వాలు అను సరించిన విధానమే. అంతేగానీ కొత్తగా ఎలాంటి చట్టం లేదా జీవో తీసుకురాలేదు. అసత్య వార్తలు, కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని చెబుతోంది. అంతేగానీ విలేకరుల మీద పోలీసు కేసులు పెడతా మనిగానీ, వేధిస్తామనిగానీ ఎక్కడా చెప్పలేదు. తాము ప్రచురించిన, ప్రసారం చేసిన వార్తలు, కథ నాలు నిజాలేనని న్యాయస్థానంలో ఆధారాలు చూపించి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ పత్రి కలు, చానళ్లపై ఉంటుంది. ఆధారాలు చూపితే న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు చెబు తుంది. చూపించలేకపోతే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలు ప్రచురించారని, ప్రసారం చేశారని నిర్ధారిస్తుంది. ఇందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలే దన్నది సుస్పష్టం. ప్రభుత్వం పూర్తిగా నిబంధన లకు కట్టుబడి, న్యాయసూత్రాలకు అనుగుణంగానే వ్యవహరిస్తోందన్నది ప్రాతికేయ ప్రముఖులు, ప్రజలూ అంగీకరిస్తున్న వాస్తవం. చంద్రబాబూ...! ఎందుకీ గగ్గోలు?! ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన భజన మీడియా మాత్రం గగ్గోలు పెట్టి ప్రజలను తప్పు దారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందంటూ అసత్య ఆరోప ణలతో రాద్ధాంతం చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక మీడియా సంస్థలు చంద్రబాబు గుప్పిట్లో ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులుతీస్తున్నట్లు తప్పుడు గణాం కాలు, గ్రాఫిక్‌లతో తమ పత్రికల్లో పేజీలకు పేజీలు అసత్య కథనాలు వండి వార్చడం... టీవీ చానళ్లలో గంటల తరబడి ప్రసారం చేయడం ఆ మీడియా నైజం. బాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రభు త్వంలో అవినీతి, అరాచకం పెట్రేగిపోతోందని అవాస్తవ కథనాలను రోజూ వండివారుస్తూ పత్రి కలను నింపడం, టీవీ చానళ్లలో రాద్ధాంతం చేయడం కూడా వారికి అలవాటే. గతంలో దివం గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు టీడీపీ అనుకూల మీడియా ఎంతగా విషం కక్కిందో అందరికీ తెలి సిందే. కానీ విజ్ఞులైన ప్రజలు ఆ ప్రభావానికి లోను కాకుండా వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు జైకొట్టి 2009లో రెండోసారి గెలిపించారు. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా మళ్లీ అదే పాట అందుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం నిత్యకృత్యమైంది. ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే... పేపర్ లీక్ చేశారంటూ టీడీపీ అను కూల మీడియా అసత్య కథనాన్ని రాసింది. ప్రభుత్వ అధికారుల బదిలీలు సాధారణమేనని తెలిసినా ... ఆర్టీసీ ఎండీ బదిలీపై మరో అసత్య కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టిం చేందుకు యత్నించింది. ఇక వరదల సమయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగం పెయిడ్ ఆర్టిస్టు లతో అసత్య ప్రచారం చేయడం అందరికీ తెలి సిందే. తిరుమలలో చర్చి కడుతున్నారంటూ టీడీపీ నేతలు మరో అసత్య ప్రచారం తెరపైకి తెచ్చి రాష్ట్రంలో ఉద్రిక్తలు సృష్టించేందుకు కుట్ర పన్నారు. ఇలా టీడీపీ అనుకూల మీడియా బాబు ప్రయో జనాలు నెరవేర్చేందుకు అసత్యాలను ప్రచారం చేస్తోంది. వాటిపై ప్రభుత్వం న్యాయపరంగా వ్యవహరిస్తామంటే బాబు, ఆయన భజన మీడియా గగ్గోలు పెడుతున్నారు. వారికి నిజంగా నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే అంత రాద్ధాంతం అవసరం లేదు. వారు సచ్చీలురైతే ప్రభుత్వ నిర్ణ యాన్ని స్వాగతించేవారు. తమ కథనాలపై ప్రభుత్వం కేసు వేస్తే న్యాయస్థానంలో రుజువులు సమర్పించి నిజాయతీ, నిబద్ధత నిరూపించుకుం టామని ప్రకటించేవారు. కానీ బాబుగానీ, ఆయన అనుకూల మీడియాగానీ ఆ మాటే అనడం లేదెం దుకు అన్నది కీలక ప్రశ్న. అంటే ఆ మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. కాబట్టే తమ నిజాయతీని నిరూపించుకునేందుకు సంసిద్ధంగా లేవు. పైగా తాము ఏం రాసినా, ఏం ప్రసారం చేసినా సరే తమను ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదని, కేసులు వేయకూడదని వాదిస్తున్నాయి. అంటే తాము బట్ట కాల్చి మీద వేస్తాం... అంతా మా ఇష్టం అన్నట్లుగా ఉంది వారి తీరు. మరి ఇదేం పత్రికా స్వేచ్ఛో అన్నది వారికే తెలియాలి. పత్రికా స్వేచ్ఛ ముసుగులో అసత్య ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించడం, బాబు రాజకీయ ప్రయోజ నాలకు కోసం పని చేయడమే వారి విధానంగా ఉంది. ఈ దుర్నీతిని ప్రభుత్వం సహించాలా...?! ప్రజలు భరించాలా...?! బాబు హయాంలోనే వేధింపులు అధికారం కోల్పోగానే మీడియా స్వేచ్ఛను కాపా డాలి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న చంద్ర బాబు తాను సీఎంగా ఉండగా ఏం చేశారన్నది అందరికీ తెలుసు. తమ ప్రభుత్వం ఇష్టాను సారం చేస్తున్న అవినీతిని ఆధారాలతోసహా వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ పత్రిక, చానళ్లు, సోషల్ మీడియాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ చానెల్‌పై ఏకంగా అయిదు జీవోలు జారీ చేశారు. ప్రస్తుతం రాద్ధాంతం చేస్తున్న సంఘాలు గానీ, వ్యక్తులుగానీ అప్పుడు నోరు మెదపలేదు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాబు ఆదేశిం చడం పత్రికా స్వేచ్ఛను ఆయన ఎంతగా హరించా రన్నదానికి నిదర్శనం. అందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో మూడు జీవోలు జారీ అయ్యాయి. అదే విధంగా సాధారణ పరిపా లన(రాజకీయ) కార్యదర్శి పేరుతో మరో రెండు వచ్చాయి. బాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సహాయ, పునరావాస చర్యల్లో యదేచ్ఛగా అవి నీతికి పాల్పడింది. ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆధారాలు సేకరించి మరీ కథనాలు ప్రచురించింది. సర్వే నంబర్లతోసహా గిరిజనుల పరిహారాన్ని ఎలా కొల్లగొట్టారో వెలుగులోకి తీసు కువచ్చింది. ఈ కథనాలపై బాబు సర్కారు కనీసం ఖండన కూడా ఇవ్వలేకపోయింది. కానీ కక్షసాధింపు చర్యలకు మాత్రం పాల్పడింది. అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమ నేని భాస్కర్, సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఎం ఆఫీసుకు పిలిపించి మరీ ‘సాక్షి’పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఒత్తిడి చేశారు. క్రిమినల్ కేసులు పెట్టేందుకు శ్రీధర్‌కు అనుమతిస్తూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ పేరుతో జీవో ఆర్టీ 868 జారీ చేయించారు. అదే విధంగా జగతి పబ్లికేషన్స్ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్లపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసులు నమోదుకు కాటమనేని భాస్కర్‌కు అను మతించారు. ఈమేరకు అప్పటి సాధారణ పరిపా లన (రాజకీయ ) కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ పేరుతో జీవో ఆర్టీ 1689 జారీ చేయించారు. అలాగే క్రిమినల్ కేసుల నమోదుకు చెరు కూరి శ్రీధర్‌కు అనుమతిస్తూ అప్పటి సాధారణ పరిపాలన(రాజకీయ) కార్యదర్శి నాగులపల్లి శ్రీకారం పేరుతో జీవో ఆర్టీ 2151 జారీ చేయించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపక్షంపై నిఘా పెట్టిన తీరును ఆధారాలతోసహా వెలుగు లోకి తెస్తూ ‘ప్రతిపక్షంపై రియల్ టైం నిఘా’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై కూడా అప్పటి ప్రభుత్వం ఖండన ఇవ్వలేదు. కానీ ‘సాక్షి’పై క్రిమినల్ కేసుల నమోదుకు అప్పటి రియల్‌టైమ్ గవర్నెన్స్ సీఈవోకు అనుమతి చ్చింది. ఈమేరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి అనిల్ చంద్ర పుణేఠా పేరుతో జీవో ఆర్టీ 733 జారీ చేయించింది. నిజాలు మాట్లాడే జర్నలిస్టులపై వేధింపులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పత్రికాల్లో అంతా తనకు అనుకూలంగా రాయాలి... టీవీ చానళ్లలో అంతా తనకు అనుకూలంగానే మాట్లా డాలి అన్న అనధికార శాసనాన్ని అమలు చేశారు. ప్రధానంగా టీవీ చానళ్లు ప్రసారం చేసే చర్చా గోష్టులపై టీడీపీ ప్రభుత్వం అనధికారింగా సెన్సా ర్షిప్ అమలు చేసింది. విలేకరులు నిజాలు చెప్పినా, ప్రభుత్వ అవినీతి, అసమర్థతపై ఎవరూ మాట్లాడినా సహించేవారు కాదు. ప్రముఖ పాత్రి కేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు దశాబ్దన్నరగా పలు టీవీ చానళ్లలో చర్చా వేదికలు నిర్వహిస్తు న్నారు. ఈ పదేహేనేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి... రాష్ట్ర విభజన వంటి సున్నితమైన అంశాలు చర్చకు వచ్చాయి. కానీ ఏ ప్రభుత్వం లోనూ ఎదురుకాని చేదు అనుభవం బాబు హయాంలో ఆయనకు ఎదురైంది. ఎన్టీవీలో చర్చా వేదికలో కొమ్మినేని శ్రీనివాసరావు వాస్త వాలు మాట్లాడుతుంటే చంద్రబాబు, లోకేశ్ సహిం చలేకపోయారు. తమకు అనుకూలంగా మాట్లా డాలని హుకుం జారీ చేశారు. తాను వాస్తవాలే మాట్లాడతానని ఆయన చెప్పడంతో బాబు సహిం చలేకపోయారు. ఎన్ టీవీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి మరీ కొమ్మినేని శ్రీనివాసరావును ఆ చానల్ నుంచి బయటకువెళ్లిపోయేలా చేశారు. అప్పట్లో దీనిపై ఏ పాత్రికేయ సంఘాలుగానీ మీడియా ప్రముఖులుగానీ కనీసం స్పందించనే లేదు. చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే మీడియా సమావేశాల్లో ఆయన భజన బృందానికిచెందిన పాత్రికేయులకు తప్ప మరెవరికీ కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. ప్రభుత్వ నిర్ణయంపై ఎవరైనా ప్రశ్నిస్తే బాబు శివాలెత్తిపోయి వారిపై చిందులు తొక్కి అవమానించిన ఉదంతాలు కోకొల్లలు. ప్రభుత్వం అంటే తన ప్రైవేటు కంపెనీగా ఆయన ప్రవర్తించేవారు. పత్రికా స్వేచ్ఛపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో పత్రికలు, టీవీ చానళ్లు ప్రధానభూమిక పోషించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వాసం. చిన్నా, పెద్ద పత్రికలు, అన్ని టీవీ చానళ్లు మనుగడ సాగిం చేందుకు ప్రభుత్వపరంగా సహకరించాలన్నది ఆయన విధానం. అందుకే పత్రికలకు ఇచ్చే ప్రకటనల టారిఫ్‌ను పెంచుతూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమా వేశంలో నిర్ణ యించారు. 40ఏళ్ల అనుభజ్జుడినని చెప్పుకునే చంద్రబాబు మీడియాను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తప్ప గౌరవించి ఎరుగరు. కానీ జగన్ మోహన్‌రెడ్డి అన్ని మీడియా సంస్థల ప్రతినిధులను ఒకే రీతిలో గౌరవిస్తుండటం అందర్నీ ఆకట్టుకుంటోంది. అది కదా పత్రికా స్వేచ్ఛను గౌరవించడం అంటే అని అంతా ఆయన్ని కొనియాడుతున్నారు. – సాక్షి, అమరావతి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం మీడియా కట్టడికి జగన్ ప్రభుత్వం చట్టమేమీ చేయలేదు... జీవో ఇవ్వలేదు అసత్య కథనాలు వద్దన్నందుకే టీడీపీ అనుకూల మీడియా ఆక్రోశం బాబు ప్రభుత్వంలో మీడియాపై బరితెగించి వేధింపులు నిజాలు చెప్పిన మీడియా సంస్థలపై కక్ష సాధింపులు జీవోలు జారీచేసి మరీ పాత్రికేయుల వేధింపులు పత్రికా స్వేచ్ఛపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పూర్తి గౌరవం -
మీడియా చేతికి ‘టాప్ సీక్రెట్’
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేపట్టింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం పార్లమెంటు వద్దకు చేరుకున్న అమిత్ షా, మీడియాకు నమస్కారం పెట్టి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా షా చేతిలో ‘టాప్ సీక్రెట్’పేరుతో ఉన్న పత్రాలు మీడియా కంటపడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను.. రాజ్యాంగపరమైన, రాజకీయం, శాంతిభద్రతలు అనే మూడు అంశాలుగా వర్గీకరించారు. మొదటి విభాగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ విషయాన్ని నివేదించినట్లు అమిత్ షా నోట్ చేసుకున్నారు. సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహించాక పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలనీ, అదే సమయంలో రాష్ట్రపతి కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని అందులో ఉంది. అలాగే రాజ్యసభలో భద్రత విషయంలో ప్రధాని మోదీ సభ చైర్మన్ వెంకయ్యనాయుడితో చర్చిస్తారని ఉంది. ఇక రాజకీయ విభాగంలో అఖిలపక్ష భేటీ నిర్వహణకు పిలుపునివ్వడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని ఎన్డీయే కూటమి ఎంపీలకు వివరించాలని అమిత్ షా నిర్ణయించారు. ప్రధాని మోదీ ఆగస్టు 7న జాతినుద్దేశించి ప్రసంగిస్తారని జాబితాలో ఉంది. జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ గవర్నర్ మాలిక్‌తో పాటు యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడుతారని ఈ నోట్లో ఉంది. మరోవైపు శాంతిభద్రతల అంశానికి సంబంధించి హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాను జమ్మూకశ్మీర్‌కు పంపాలని నిర్ణయించారు. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా కల్పించేలా ఆయా ప్రభుత్వాలను ఆదేశించాలని జాబితాలో చేర్చారు. -
ఎవరితోనూ విభేదాలు లేవు
సాక్షి, గద్వాల: పార్టీలో కానీ, మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం అన్నారు. గత రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న విషయాలను ఎమ్మెల్యేలు ఇరువురూ ఖండించారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ, మంత్రి, మా మధ్య కానీ బేధాభిప్రాయాలు లేవన్నారు. వ్యక్తిగత కారణాలతోనే గన్మెన్లను సరెండర్ చేశానని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో భద్రత అవసరం లేదని భావించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీకి, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీని, సీఎం కేసీఆర్, పార్టీ అధ్యక్షులు కేటీఆర్‌ను గౌరవిస్తామని, వారి ఆదేశానుసారం నడిగడ్డ అభివృద్ధికి పని చేస్తామన్నారు. నడిగడ్డపై అభిమానంతో సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సుమారు కోట్లాది నిధులు ఇచ్చారని తెలిపారు. సాంకేతిక కారణాలు, పరిపాలన పరమైన కారణాలతోనే సీఈఓ మార్పు జరిగిందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌లు మాపై గురుత్వర బాధ్యతలు పెట్టారని అన్నారు. పార్టీ భీ–ఫామ్‌లు ఇచ్చిన కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గద్వాల, అలంపూర్ ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగురవేసేలా చేశారన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నడిగడ్డకు ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు కళ్లలాగా ఉండి పని చేస్తామని చెప్పారు. మాలో గ్రూపులు లేవు, తగాదాలు అసలే లేవన్నారు. మమ్మల్ని నమ్మి నడిగడ్డ ప్రజలు అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ సీఎం కేసీఆర్ కలలు గంటున్న బంగారు తెలంగాణ దిశగా పని చేస్తామన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు బీఎస్.కేశవ్, ఎంపీపీలు తిరుమల్‌రెడ్డి, విజయ్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
-
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు..!
సాక్షి, గుంటూరు: ‘నా తర్వాత ఉపద్రవం’ అని ఫ్రాన్స్ దేశంలో లూయీ ప్రభువు చెప్పినట్టు గత ఐదేళ్ల చంద్రబాబు పాలన ఉందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలోని మౌర్య ఫంక్షన్ హాల్లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో ఐవైఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఐవైఆర్ మాట్లాడుతూ జాతీయోత్పత్తి ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తూ పోతే చేసిన అప్పు తక్కువగా కనిపిస్తుందని, గత ఐదేళ్లలో ప్రభుత్వం ఇదే పద్ధతిని పాటించిందన్నారు. ఇటీవల రెండు టీడీపీ అనుకూల పత్రికల్లో ‘అప్పుల అంచులో ఆంధ్రప్రదేశ్’ అనే కథనాలు వచ్చాయని, అది నిజం కాదని రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయం భారీగా చూపారని, రూ.10వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారని, వాస్తవానికి అంత మొత్తంలో కేంద్రం నిధులు వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఎప్పుడైతే పన్నుల్లో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం 32 నుంచి 42 శాతానికి పెంచిందో అప్పుడే పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలను సైతం తగ్గించారన్నారు. రూ.30 వేల కోట్ల వరకూ అప్పులు చేస్తామని బడ్జెట్లో చూపారని, అంత మొత్తంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా అప్పులు ఇస్తారా అన్నది అనుమానమేనన్నారు. అప్పు చేయడం తప్పు కాదని, కానీ ఆ అప్పు దేనికోసం చేస్తున్నామనేది ముఖ్యమని ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.సి.రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 11.5 శాతం అభివృద్ధి రేటు ఉందంటున్నారని, అందుకు సరిపడా పన్ను వసూళ్లు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు మాత్రం పెరగడం లేదన్నారు. దీనికి తోడు గత రెండేళ్లలో అప్పులు గణనీయంగా పెరిగాయన్నారు. 3 లక్షల కోట్లకు చేరిన రుణభారం 2014లో రాష్ట్ర విభజన సమయంలో రూ.85వేల కోట్లుగా ఉన్న రుణ భారం గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.3.05లక్షల కోట్లకు చేరిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. ఈ రుణానికి తోడు ప్రభుత్వ ఏజెన్సీలు, కార్పొరేషన్లు రూ.లక్ష కోట్లు అప్పుగా పొందడానికి సైతం ప్రభుత్వం గ్యారంటీగా ఉందన్నారు. ఇవి కాకుండా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.30వేల కోట్ల పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు కార్పొరేషన్లు, సంస్థలకు పీడీ అకౌంట్ ఉండేదని, ఆ అకౌంట్ ఆధారంగా ఆయా కార్పొరేషన్లు, సంస్థ అవసరాలు తీర్చుకోడానికి డబ్బును ఉపయోగించుకునేవారని, ఆ పీడీ అకౌంట్లలో డబ్బు లేకుండా చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. భారత్‌లోకెల్లా అత్యధికంగా దుబారా వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరొందిందన్నారు. కాంగ్రెస్‌ను తిట్టడానికి నవనిర్మాణ దీక్షలు, బీజేపీని తిట్టడానికి «ధర్మపోరాట దీక్షలు అని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఒక ముఖ్యమంత్రికి ఒక ఇల్లు, ఒక క్యాంప్ ఆఫీస్ ఉంటుందని కానీ, చంద్రబాబుకు మాత్రం నాలుగు క్యాంప్ ఆఫీస్‌లు ఉన్నాయన్నారు. సమాజానికి, ప్రజలకు, అభివృద్ధికి ఉపయోగపడని వాటి కోసం ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు డీఎల్ సుబ్రహ్మణ్యం, బాలభారతి సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీకి కొమ్ముకాసిన మీడియా సంస్థలు రాష్ట్రాన్ని, సమాజాన్ని, ప్రజలను చైతన్యపరిచి అభివృద్ధి వైపు నడపడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, అయితే కొన్ని మీడియా సంస్థలు టీడీపీకి కొమ్ము కాస్తూ ప్రజలకు వాస్తవాలను చూపించడం లేదని ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయబాబు విమర్శించారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, నిర్మాణాల పేరుతో ప్రజాధనాన్ని బొక్కేశారన్నారు. విదేశీ పర్యటనల పేరుతో 25 మంది వెళ్తారని, స్పెషల్ ఫ్లైట్లు, స్టార్ హోటళ్లలో జల్సాలు చేసి డబ్బు వృథా చేశారన్నారు. నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అమరావతి, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో అంచనాలను అంతకంతకూ పెంచుతూ టీడీపీ నాయకులు కమీషన్లు బొక్కేశారని దుయ్యబట్టారు. ఉన్న ప్రాజెక్టులను పునరుద్ధరించి, మౌలిక వసతుల కల్పనకు టీడీపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఉంటే రాష్ట్రం గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు.