
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. ఈ సందర్భంగా మీడియాలోకేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటంలో వైద్యులు, నర్సులు, పోలీస్ సిబ్బంది మాదిరిగానే మీడియాలో పనిచేసే వారు కూడా ముందు వరుసలో ఉన్నారన్నారు. కరోనాపై పోరులో పాత్రికేయులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
అయితే సంబంధిత శాఖల నుంచి సరైన సమాచారం లేకుండా కరోనా వైరస్‌కు సంబంధించిన వార్తలను ప్రచురించడం కానీ, టీవీలలో చూపించడం కానీ చేయొద్దని సూచించారు. ఇక తాజాగా ప్రధాని దేశ ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా.. ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశం ఆర్థిక వ్యవస్థ ముఖ్యమే అని సూచించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్రమంత్రులంతా సోమవారం రోజున తమ కార్యాలయాలకు వచ్చి వారి పనుల్లో నిమగ్నమవ్వడం విశేషం. కాగా.. భారత్‌లో ఇప్పటిదాకా 9,152 కేసులు నమోదుకాగా, గడిచిన 24 గంటల్లో 796 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. చదవండి: పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్
Comments
Please login to add a commentAdd a comment