prakash javadekar
-
కాళేశ్వరం కంటే ధరణి పెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధరణి పోర్టల్ పేరుతో భారీ భూ కుంభకోణ జరిగిందని, ఇది కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి భూ యజమానులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ సర్కార్ ధరణిని సర్వరోగ నివారిణి అని గొప్పగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సిన వీఆర్వోల వ్యవస్థను లేకుండా చేసి, ఆ భూ రికార్డులను ప్రభుత్వం తీసేసుకుని వాటిని ఎవరికీ అందకుండా చేశారని ఆరోపించారు. ధరణిలో రెవెన్యూ రికార్డులను మార్చేసి.. పట్టేదార్, పొసెషన్ (అనుభవదారు)ల స్థానంలో బినామీ, అక్రమ చొరబాటుదారు అని పేర్లు చేర్చారన్నారు. భూ రికార్డులను పూర్తిగా గందరగోళం చేశాక కేంద్రం ఇచ్చిన నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చారని ఆరోపించారు. దీంతో భారీమొత్తంలో భూ రికార్డులు తారుమారయ్యాయని ఆరోపణలు వచ్చాయన్నారు. విదేశీ కంపెనీ చేతిలోకి ధరణి వివరాలు విశ్వసనీయ వర్గాలు, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఓ విదేశీ కంపెనీ రూపొందించిన యాప్ (మొబైల్ అప్లికేషన్) ధరణిలోని డిజిటల్ డాక్యుమెంట్స్‌ను యాక్సెస్ చేసినట్లు తెలుస్తోందని జవదేకర్ అన్నారు. ప్రభుత్వ డేటాను ఓ ప్రైవేటు కంపెనీ పరిశీలించడం సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే తెలంగాణలో మాత్రం దీనికి విరుద్ధంగా ప్రభుత్వ కీలక డేటా ఓ ప్రైవేటు కంపెనీకి అందుబాటులో ఉందని ఆరోపించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, గ్రామసభలను నిర్వహించకుండా భూ రికార్డుల వ్యవస్థను తారుమారు చేశారని ధ్వజమెత్తారు. దీంతో భూములకు సంబంధించిన చాలా సర్వే నంబర్లు గల్లంతయ్యాయని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లక్షల ఎకరాలను నిషేధిత విభాగంలో చూపిస్తున్నారన్నారు. -
బీజేపీ నాలుగో జాబితాపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికి మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ నాయకత్వం మిగిలిన 31 సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ భేటీ అయ్యారు. జనసేన పొత్తు ప్రకటన దరిమిలా పార్టీలో వస్తున్న వ్యతిరేకతపై చర్చించినట్టు సమాచారం. జనసేనకు కూకట్పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు సీట్లు, వేములవాడ, హుస్నాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో ఏర్పడిన చిక్కుముడిని విప్పడం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా శనివారం సాయంత్రం కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండిసంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లనున్నట్టు చెబుతున్నారు. జనసేనకు కేటాయించే సీట్లతో పాటు మిగిలిన సీట్లపై అక్కడ పెద్దలతో చర్చించనున్నారని అంటున్నారు. ఏదేమైనా రెండు రోజుల్లో నాలుగో జాబితా వెలువడవచ్చునని తెలుస్తోంది. ఆరేడు సీట్లలో పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత వీటిని ప్రకటించవచ్చునని అంటున్నారు. నేడు మేడిగడ్డకు కిషన్‌రెడ్డి, ఈటల బృందం.... కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీలోనూ సమస్యలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో శనివారం పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డా.కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్‌రావు అక్కడకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు అంబట్పల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి గంట పాటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడి పరిస్థితులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 నిముషాలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. -
60 సీట్లపై బీజేపీ కసరత్తు కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అభ్యర్థుల ఖరారు కసరత్తు కొలిక్కి వస్తోంది. శుక్రవారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో 60 స్థానాల్లో అభ్యర్థులపై (19 ఎస్సీ, 12 ఎస్టీ సీట్లు మినహాయించి) ఒక అభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సీట్లకు సంబంధించి మరోసారి చర్చించి, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని జాబితాల ను పంపాలని నిర్ణయించినట్టు వివరిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆయా స్థానాల్లో ప్రాధాన్యతలు, ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను కీలక నేతలు అందజేయడంతో.. భేటీలో అన్నింటినీ సరిచూసి, కామన్‌గా ఉన్న పేర్లను ముసాయిదా జాబితా కోసం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘ్‌పరివార్ క్షేత్రంలోని వారితోనూ పార్టీ నేతలు సమావేశమై, ఆయా సీట్లకు పేర్లపై స్పష్టత తీసుకున్నట్టు తెలిసింది. కసరత్తు పూర్తయ్యాక 40–45 మందితో తొలిజాబితాను ఢిల్లీలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీనేతలు చెప్తున్నారు. పలు స్థానాలపై స్పష్టత శుక్రవారం జరిగిన భేటీలో హైదరాబాద్ నగరంలోని రెండు ముఖ్యమైన స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. అంబర్‌పేట నుంచి పోటీకి కిషన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయగా.. ముషీరాబాద్ నుంచి బరిలో ఉండేందుకు కె.లక్ష్మణ్ విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు పలువురు ముందుకొచ్చినట్టు తెలిసింది. ఈ నియోజకవర్గంలో ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా.. ఒకరు బీఆర్ఎస్లోకి వెళ్లారు. మిగతా నలుగురు కూడా తమకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుతున్నారు. దీంతో ఈసారి కార్పొరేటర్లకు టికెట్ అవకాశం కల్పించరాదని నిర్ణయించినట్టు తెలిసింది. అందరూ కలసికట్టుగా పనిచేస్తే పార్టీ విజయానికి మార్గం సుగమం అవుతుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు టికెట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. -
85 సీట్లతో అధికారం మాదే
సాక్షి, హైదరాబాద్: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 85 సీట్ల దాకా గెలుపొంది బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకుని బీజేపీ సంచలనం సృష్టించబోతోందన్నారు. రాబోయే 50, 55 రోజుల్లో ఇది వాస్తవరూపం దాల్చడాన్ని అందరూ చూస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, త్యాగాలను కేసీఆర్ సర్కార్ విస్మరించి విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. సకల జనులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అవినీతి మయం చేయడంతో పాటు, పూర్తిగా కుటుంబ స్వామ్యంగా మార్చివేయడాన్ని ఇక్కడి ప్రజలు అస్సలు ఊహించలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ సరిగా లేదని, తెలంగాణ ఏర్పడ్డాక మండలి చైర్మన్‌తో సహా ఎమ్మెల్సీలందరూ టీఆర్ఎస్లో విలీనం కావడం, 2014లో ఆరుగురు ఎమ్మెల్యేలు, 2018లో 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం ద్వారా ఆ రెండు పార్టీలూ ఒక్కటే అన్న విషయం స్పష్టమైందని చెప్పారు. దీనికి పూర్తి భిన్నంగా బీజేపీ ఎమ్మెల్యేలెవరూ బీఆర్ఎస్లోకి వెళ్లలేదని, ఇతర పార్టీల్లోంచే బీజేపీలోకి వస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వహించకపోవడం గర్హనీయమన్నారు. ఈ విషయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని వారు నమ్ముతున్నారని చెప్పారు. జవదేకర్ గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. వైఎస్ విజయం సాధిస్తారని ముందే చెప్పా 2004 ఎన్నికలకు ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన పాదయాత్రను, దానికి వచ్చిన స్పందనను నేను స్వయంగా గమనించా. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పా. నేను చెప్పినట్టే ఆయన అధికారంలోకి వచ్చారు. అదే విధంగా ఇప్పుడు కూడా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వస్తుందనే నా జోస్యం నిజం అవుతుంది. అది పూర్తిగా అబద్ధం బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అ న్నారన్నది పూర్తిగా అబద్ధం. ఈ వార్త మీడియాలో వచ్చాక కూడా దానిని ఖండిం చకపోవడంపై నేను పార్టీ అధికార ప్రతినిధులను మందలించా. తెలంగాణలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమని ఆ అంతర్గత సమావేశంలో సంతోష్ చెప్పారు. అయితే హంగ్ అని అన్నట్టుగా వార్త వచ్చినందుకు నేను జర్నలిస్టులను కూడా తప్పుబట్టను. ఎందుకంటే ఇందుకు సంబంధించి ఎలాంటి వీడియో, ఆడియో రికార్డ్ లేదు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్‌లో ప్రస్తుతం అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల అది అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కర్ణాటకలో గెలుపు ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశముంది. అయితే కాంగ్రెస్ తమను మోసం చేసిందనే భావనలో ఉన్న తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ వేరు, రాహుల్‌గాంధీ కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ నేత రాహుల్ జేఎన్‌యూ గాంధీ. ఆయన లెఫ్టిస్ట్ల భాష మాట్లాడుతున్నారు. అందువల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయింది. మోదీ మ్యాజిక్ పనిచేస్తుంది తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ పాపులారిటీ అత్యు న్నత స్థాయికి చేరుకుంది. ఒక్క అవినీతి మర కలేదు. పదేళ్ల యూపీఏ పాలనలో లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగు చూడగా, తొమ్మిదేళ్ల ఎన్డీఏ ఆధ్వర్యంలోని మోదీ పాలనలో ప్రధాని మోదీ లేదా మంత్రులపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం ముఖ్య మైన సానుకూల అంశం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాజకీయాలు, కులం, మతం, వర్గాలకు అతీతంగా ప్రజలకు చేరవేయడంతో ..మోదీని వారు పూర్తి స్థాయిలో విశ్వసించే పరిస్థితి ఏర్పడింది. ఆ మ్యాజిక్ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్పష్టంగా పనిచేయబోతోంది. బీజేపీని గెలిపించబోతోంది. బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల్లో బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ప్రభుత్వంపై విశ్వసనీయత అనేది అత్యంత అధమ స్థాయిలో ఉంది. ఓటమిపై భయంతోనే కొన్ని మినహా అన్ని సీట్లకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే నామినేషన్ల చివరినాటికి ఆ అభ్యర్థుల్లో కనీసం 20 మందిని మార్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరే కతను మాకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్పటికే ప్రజల వద్దకు వెళుతున్నాం. మా వద్ద ఉన్న ఏకైక మార్గం ప్రజలను కలుసుకోవడం, బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు తెలియజేసి వారి మద్దతు సాధించడం. మేం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుస్తోంది. మరోవైపు ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. -
ఎలాగైనా గెలవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నందున వీటిని ఉపయోగించుకుని విజయం సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. విజయం దిశగా కట్టుదిట్ట మైన కార్యాచరణను, ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలను ఆయన ఆదేశించారు. ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున దానిని బీజేపీకి అనుకూలంగా ఓట్లుగా మార్చేకునే దిశగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పార్టీకి, నేతలకు అవసరమైన సహాయ, సహకారాలు, తోడ్పాటును అందించేందుకు జాతీ య నాయకత్వం సిద్ధం ఉందని హామీ నిచ్చారు. మంగళవారం రాత్రి బేగంపేటకు సమీపంలోని ఓ స్టార్ హోటల్లో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, ఎన్నికల మేనిఫెస్టో తయారీ, అభ్యర్థులకు సంబంధించి రెండు, మూడు జాబితాల తయారీపై కసరత్తు, ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలు, ప్రచార సరళి తదితర అంశాలన్నింటిపైనా సమీక్ష నిర్వహించినట్టు సమాచారం.గ్రేటర్‌పై ఫోకస్ పెంచండిజీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచి అనూహ్య ఫలితాలు సాధించినందున, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, చుట్టుపక్కల జిల్లాలపై ఫోకస్ పెట్టి అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీకి బలమున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌లతో పాటు మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలిసింది. ఇక పార్టీపరంగా అంతగా బలం లేని ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌తో పాటు నల్లగొండ జిల్లా పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారవేగం ముమ్మరం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం అమిత్ షాను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక బేగంపేట విమానాశ్రయంలో అమిత్‌షాను బీజేపీ జాతీయకార్యవర్గసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కలుసుకున్నారు. తొలి జాబితాలోని 38 మంది అభ్యర్థుల బలాబలాలపై ఆరా ఇక ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఖరారు చేయబోతున్న 38 మంది అభ్యర్థుల తొలి జాబితాపై చర్చించారు. వీరి విజయావకాశాలు, బలాబలాలు తదితర అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. ప్రస్తుతం పార్టీలో వివిధ స్థానాల్లో (తొలిజాబితా మినహాయించి) పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారు, పార్టీ పరంగా బలమైన అభ్యర్థులుగా పరిగణిస్తున్న వారు ఎవరెవరు ఉన్నారన్న అంశాలపైనా ఆరా తీసినట్టు సమాచారం. బీజేపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న వాళ్లెవరు, ఏ స్థానంలోనైనా సీటు కావాలని కోరుకుంటున్న వారెవరు, చేరేందుకు ఏదైనా కమిట్ మెంట్, హామీ కోరుకుంటున్నారా అన్న విషయాలపై రాష్ట్ర పార్టీ నేతలను అమిత్‌షా ప్రశ్నించినట్టు తెలిసింది. -
‘వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ నాయకుల మధ్య ఐక్యత, ఎన్నికల ప్రచార వ్యూహంపై దృష్టి సారించింది. ఇందుకోసం కోసం ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో వారం రోజుల్లో బీజేపీ మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి తెలంగాణలో బీజేపీ వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృత ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తమ దగ్గర అనేక అస్త్రాలు, వ్యూహాలు ఉన్నాయని అన్నారు. ఎంపీ బండి సంజయ్‌కు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించామన్నారు ప్రకాష్ జవదేకర్. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏదో అవగాహన ఉందని కాంగ్రెస్ కుట్రపూరిత ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయకారిగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. చదవండి: తెలంగాణలో మాకు విజయావకాశాలు: రాహుల్ గాంధీ -
దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి..
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ముగిసింది. బీజేపీ కార్యాలయంలో స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి నిరాహార దీక్షను విరమించారు. కిషన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి ప్రకాశ్ జవదేకర్ దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు కిషన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి. మరోవైపు.. కేసీఆర్ సర్కార్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే చిత్తుకాగితం కాదు. 17పేపర్లు లీక్ చేసి.. తెలంగాణ విద్యార్థులకు విషాదం మిగిల్చారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేలను కూడా రానివ్వడం లేదు. కేసీఆర్ పాలన కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అని తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆరు కమిటీలు -
నేడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణా మాలు, సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన, ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, రాష్ట్ర పార్టీ సన్నద్ధమవుతున్న తీరు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనేతలు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. -
‘భారత్’గా పేరు మార్పు రాజ్యాంగబద్ధమే!
సాక్షి, హైదరాబాద్: దేశం పేరును ‘భారత్’గా మార్చడమనేది రాజ్యాంగబద్ధమేనని రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యా నించారు. భారత్ అనేది ఈ దేశం అసలు (ఒరిజినల్) పేరు అని స్పష్టం చేశారు. బుధవారం జవదేకర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోనూ ఇదే రాసి ఉందని దానికి లోబడే పేరు మార్పు జరుగుతోందన్నారు. శతాబ్దాలుగా ఎవరు ముందుగా దేశాలను ఆక్రమించినా వాటి పేర్లను మార్చడం జరిగిందనీ, సుదీర్ఘ చరిత్ర ఉన్న అమెరికాలోనూ ఇది చోటుచేసుకుందని చెప్పారు. ఇక్కడికి బ్రిటీషర్లు వచ్చాక తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు...కోల్‌కతా పేరును కలకత్తాగా, చెన్నైను మద్రాస్‌గా, తిరువనంతరం పేరును ట్రివేండ్రం, ముంబైను బాంబేగా మార్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు గతంలోని వలసవాద భావజాలం నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పేరు మార్పునకు, ఎన్నికలకు సంబంధం లేదు దేశం పేరుమార్పు అంశానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని జవదేకర్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో సనాతన ధర్మాన్నే కాకుండా దేశ ప్రజలను, అన్ని ధర్మాలను అవమానించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని జవదేకర్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కూడా ఎందుకు మౌనం వహించారో చెప్పాలని నిలదీశారు. ఈ విధంగా సనాతన ధర్మాన్ని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి ఆమోదమేనా అని ప్రశ్నించారు. -
'కాళేశ్వరం అవినీతిపై యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైంది..'
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి మీద యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ అన్నారు. తొందరలోనే బీజేపీ అభ్యర్థుల లిస్టు వస్తుందని చెప్పారు. తమ పార్టీలోకి వచ్చే వాళ్ళే తప్ప.. వెళ్ళే వారు లేరని అన్నారు. బీజేపీలో చేరేవారిని ఈ నెల 27న అందరూ చూస్తారని పేర్కొన్నారు. నేటి ప్రెస్ మీట్ ట్రైలర్ మాత్రమే.. మూవీ త్వరలో చూపిస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్.. 9 ఏళ్లలో టీచర్, యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్ చేయలేదని మండిపడ్డారు. ఇచ్చిన నోటిఫికేషన్ లోనూ పేపర్ లీకేజీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసిఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత , సంతోష్, హరీష్ రావు లకు మాత్రమే ఎంప్లాయిమెంట్ దొరికిందని అన్నారు. కేసిఆర్ పర్యటన ఉన్న ప్రాంతాల్లో ప్రతిపక్షాల ముందస్తు అరెస్టు చేస్తున్నారని ప్రకాష్ జవదేకర్ దుయ్యబట్టారు. మాజీ మంత్రి, మహిళ అని చూడకుండా డీకే అరుణను అడ్డుకుని అరెస్ట్ చేయడం ఎంటని మండిపడ్డారు. తాము తెలంగాణ ప్రజల కోసం పోరాడతామని అన్నారు. బీజేపీకి భయపడే తమ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Hanumanth Rao Warns Harish Rao: సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా... మైనంపల్లి హనుమంత రావు -
వందరోజుల్లో ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారుపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అందరి అభి ప్రాయాలను పరిగణనలోకి తీసుకోను న్నట్టు పార్టీ నాయకత్వం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రాబోయే వంద రోజుల్లో ఎలాంటి వ్యూహాలు, కార్యాచరణ చేపడితే బావుంటుందనే దానిపై అభిప్రాయసేకరణ చేపట్టింది. గత 2, 3 ఏళ్లలో పార్టీలో చేరిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మె ల్యేలు, మాజీ చైర్ పర్సన్లు, ఇతర నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ శనివారం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. పార్టీపరంగా చేపట్టాల్సిన కార్య క్రమాలు, ముఖ్యమైన సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సూచించాలని వీరు కోరినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి వెలమ, కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నందున, రాష్ట్రంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేలా బీసీ నేతను బీజేపీ సీఎం అభ్యర్థిగా ముందుగానే ప్రకటించాలని కొందరు సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పలు సందర్భాల్లో కేసీఆర్ సర్కార్ అవినీతిపై, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంపై బీజేపీ అగ్ర త్రయం మోదీ, అమిత్ షా, నడ్డా తీవ్ర విమర్శలు చేసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తప్పుడు సంకేతాలిస్తున్నట్టు కొందరు నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ విషయంపైనే కిందిస్థాయిలో ఎక్కువగా తమను ప్రశ్నిస్తున్నారని చెప్పినట్లు సమాచారం. దీనిపై చర్యలు ఉండాలంటూ సూచించగా, వారు చేసిన సూచనలను ముఖ్యనేతలు పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏ పని బాగా చేస్తారో చెప్పండి... తాము ఇక్కడే అందుబాటులో ఉంటామని, వ్యక్తిగతంగా ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పవచ్చని జవదేకర్, బన్సల్ పేర్కొన్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పోటీకి ఆసక్తిలేని వారు పార్టీ కోసం తాము ఏయే రంగాల్లో, విధుల్లో బాగా పనిచేయగలరో చెబితే వారికి ఆయా బాధ్యతలు అప్పగిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను అందుబాటులో లేకపోతే కార్యాలయంలోనే ఉండే సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి చెప్పొచ్చన్నారు. పార్టీ గ్రాఫ్ పడిపోయిందని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, నేటికి కూడా బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పినట్టు తెలిసింది. తాను పార్టీలో చేరాక మూడేళ్లకు ఇలాంటి సమావేశానికి తొలిసారి పిలిచారని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, గరికపాటి మోహన్‌రావు, డా.జి.విజయరామారావు, మర్రి శశిధర్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్, కుంజా సత్యవతి, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకాష్ జవదేకర్
సాక్షి, ఢిల్లీ: ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాషాయం పార్టీ భారీ మార్పులకు.. చేర్పులకు దిగుతోంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్లను ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా జాతీయస్థాయి సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్(72)ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేసింది. అలాగే సహాయ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌ను నియమించింది. ఇక రాజస్థాన్ బీజేపీ ఎన్నిలక ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, మధ్యప్రదేశ్ ఇన్చార్జ్గా భూపేంద్ర యాదవ్, ఛత్తీస్‌గఢ్‌కు ఓం ప్రకాశ్ మాథూర్ లను నియమించింది. ప్రకాశ్ జవదేకర్ గురించి.. ప్రకాశ్ జవదేకర్ గతంలో కేంద్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ పని చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా 2008 నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. పార్లమెంట్లో పలు కమిటీలకు ఆయన చైర్మన్‌గా వ్యవహరిచారు. 2021లో కేంద్ర మంత్రి పదవికి దూరమైన ఆయన.. అప్పటి నుంచి పార్టీ అధికార ప్రతినిధిగానూ కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో పుట్టి, పెరిగిన ప్రకాశ్ కేశవ్ జవదేకర్.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఏబీవీపీ అటుపై బీజేపీ యువ మోర్చాతో ఆయన అనుబంధం కొనసాగింది. ఆయనకు భార్య ప్రాచీ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదీ చదవండి: టీడీపీ ఆశలపై నీళ్లు -
తెలంగాణలో ఇచ్చేవి మోదీ బియ్యమే..
మల్యాల(చొప్పదండి): ‘వన్ నేషన్ – వన్ రేషన్’ ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ విధానమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసేవి కేసీఆర్ బియ్యం కాద ని.. నరేంద్రమోదీ బియ్యమన్నారు. మూడేళ్లుగా 80 కోట్ల కుటుంబాలకు మోదీ ప్రభుత్వం ఉచితంగా బి య్యం పంపిణీ చేస్తోందని వెల్లడించారు. మోదీ దేశప్రజలే తన కుటుంబంగా భావిస్తారని తెలిపారు. సీ ఎం కేసీఆర్ తన కుటుంబమే పరీవారంగా భావిస్తారని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా మల్యా ల మండలం ముత్యంపేట రెడ్డిఫంక్షన్ హాల్లో సోమవారం మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన సమావేశానికి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. తొలు త మల్యాలలోని రేషన్ దుకాణాన్ని సందర్శించి, బి య్యం తీసుకుంటున్న వృద్ధురాలితో మాట్లాడారు. బియ్యాన్ని డబ్బులు ఇస్తున్నావా? అని అడుగగా.. మూడేళ్లుగా పైసా ఇవ్వకుండా ప్రతినెలా 6 కిలోల బి య్యం తీసుకుంటున్నానని వృద్ధురాలు సమాధానం ఇచ్చింది. బియ్యం మూటగట్టి వృద్ధురాలి తలపై పెట్టిన ప్రకాశ్ జవదేకర్, బండి సంజయ్.. అనంత రం ముత్యంపేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో లక్షలాది మందికి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.6వేల చొప్పున అందిస్తున్నామన్నారు. తెలంగాణలో 11లక్షల మందికి ఉజ్వ ల పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని చెప్పారు. 40 లక్షల మందికి ప్రధానమంత్రి జీవన్జీవన్ జ్యోతి బీమా అమలవుతోందని తెలి పారు. మోదీ పథకాలతో లబ్ధిపొందిన వారంతా 89198 47687 ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి, బీ జేపీకి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ప్రతీఒక్క కార్యకర్త మూడు కుటుంబాలను కలిసి, లబ్ధిదారుల వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయాలని నిర్దేశించారు. పేదలతోపాటు కరీంనగర్ డెయిరీ కి నరేంద్రమోదీ రూ.10కోట్ల లబ్ధి చేకూర్చారని అ న్నారు. దేశవ్యాప్తంగా మోదీ ఉచితంగా కరోనా వ్యా క్సిన్ పంపిణీ చేశారని, కేసీఆర్ వ్యాక్సిన్ అంటే మ ద్యం అని ఎద్దేవా చేశారు. మోదీ కేబినేట్లో ఏఒక్క మంత్రిపైనా అవినీతి ఆరోపణలు లేవని, కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు లేనిమంత్రులు లేరన్నారు. 2024లో బీజేపీ 14 ఎంపీ సీట్లు గెలుసుకోవడం ఖాయమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమించి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ దానిని విస్మరించా రని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనా రాయణరావు, నేరెళ్ల శ్రావణ్ పాల్గొన్నారు. -
Parliament Monsoon Session: ప్రజల ఇక్కట్లు చూడండి
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై రాజ్యసభలో ఎట్టకేలకు చర్చ మొదలయ్యింది. ధరాఘాతంతో జనం అష్టకష్టాలు పడుతున్నారని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించాయి. నిత్యావసరాల ధరల అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ధరల పెరుగుదల వల్ల ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని చెప్పారు. ధరలను అదుపుచేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ద్రవ్యోల్బణం ఇప్పుడు 7 శాతంగా ఉందని, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగినట్లుగా రెండంకెలకు చేరుకోలేదని అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చమురు మంట కొనసాగుతోందని, తద్వారా ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు నియంత్రణలోకి తీసుకురావడం ఏ దేశం చేతుల్లోనూ లేదని తేల్చిచెప్పారు. ప్రజలు విసుగెత్తిపోయారు ధరల అంశంపై చర్చను సీపీఎం సభ్యుడు ఎళమారమ్ కరీం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదని ఆక్షేపించారు. గత ఎనిమిదేళ్లుగా ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, జీఎస్టీ మోత, రూపాయి విలువ పతనం వంటివి పేదలను కుంగదీస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ వాపోయారు. సమస్యలను ఇప్పటికైనా గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారని కాంగ్రెస్ సభ్యుడు శక్తిసింహ్ గోహిల్ అన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా చెప్పారు. ఆహార ఉత్పత్తి వ్యయం గత ఏడాది కాలంలో 21 శాతం పెరిగిందని వివరించారు. రైతుల ఆదాయం పెరగడం లేదన్నారు. గిరిజనుల సమస్యలను జేఎంఎం ఎంపీ మహువా రాజ్యసభలో ప్రస్తావించారు. ధరల మంట కారణంగా మహిళల కష్టాలు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ అశోక్‌రావు ఉద్ఘాటించారు. పన్నుల భారం పెరగలేదు: నిర్మల ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించామని వివరించారు. జీఎస్టీ వల్ల కుటుంబాలపై పన్నుల భారం పెరగలేదన్నారు. బియ్యం, గోధుమ పిండి, పెరుగు వంటి వాటిపై అన్ని రాష్ట్రాల అంగీకారంతోనే జీఎస్టీ విధించినట్లు గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ధరలు అధికంగా ఉండేవని అన్నారు. అప్పట్లో కిలో ఉల్లిపాయల ధర రూ.100 మార్కును దాటిందని వెల్లడించారు. -
కేంద్ర మంత్రి, సీనియర్లకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ
సీనియర్ నేతలు, కేంద్ర మంత్రి, మాజీ మంత్రులకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తాజాగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసిన విషయం తెలిసిందే. 18 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌కు అవకాశం కల్పించారు. ఇక, జూన్ 10న మొత్తం 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా.. బీజేపీ కొంత మంది సీనియర్లుకు షాక్ ఇచ్చింది. జార్ఖండ్ ప్రతినిధిగా రాజ్యసభలో ఉన్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. వీరితో పాటు ఓపీ మాథుర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, వినయ్ సహస్త్రబుద్ధే వంటి సీనియర్లకు రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఇక, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం గోరఖ్‌పూర్ సీటును వదులుకున్న రాధా మోహన్ అగర్వాల్‌ను రాజ్యసభకు ఎంపికయ్యారు. బీజేపీ అభ్యర్థులు వీరే: నిర్మల సీతారామన్, జగ్గేశ్- కర్ణాటక పీయూష్, అనిల్ సుఖ్‌దేవ్-మహారాష్ట్ర సతీష్ చంద్ర, శంభు శరణ్-బిహార్ కృష్ణలాల్-హర్యానా కవితా పటిదార్-మధ్య ప్రదేశ్ గణశ్యామ్-రాజస్థాన్ లక్ష్మికాంత్ వాజ్‌పేయి, రాధామోహన్, సురేంద్రసింగ్, బాబురామ్, దర్శణ సింగ్, సింగీత యాదవ్, లక్ష్మణ్- ఉత్తరప్రదేశ్ కల్పన సైని- ఉత్తరాఖండ్. ఇది కూడా చదవండి: యూపీ నుంచి నామినేషన్ వేయనున్న బీజేపీ నేత -
కేసీఆర్ పాలనకు చరమగీతం
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో ప్రజాపాలనకు బదులు కేసీఆర్ కుటుంబపాలన నడుస్తోందని, దీనికి చరమగీతం పాడాలని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రలో భాగంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గత ఏడేళ్లలో లక్ష మంది ఉద్యోగులు రిటైర్‌కాగా, టీఆర్ఎస్ ప్రభు త్వం మాత్రం ఆ ఖాళీలను భర్తీ చేయలేదని ఆరో పించారు. సీఎం కేసీఆర్ మాయమాటలతో, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిం చారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని, 2023 ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. సంజయ్ మాట్లాడుతూ కేంద్రం 2.91 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే సీఎం కేసీఆర్ 12 వేల ఇళ్లు మాత్రమే నిర్మించి ఇచ్చారని ఆరోపించారు. మక్కలు కొనకుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 300 కి.మీ. దాటిన ‘బండి’ సంజయ్ పాదయాత్ర మంగళవారం(25వ రోజు) నిజాంసాగర్ చౌరస్తాకు చేరుకోగానే 300 కి.మీ. పూర్తయినట్టు నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు నినాదాలు, చప్పట్లతో సంజయ్‌ను అభినందించారు. -
సీమ ఎత్తిపోతల.. పాత ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణకే
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని తోడేస్తుండటం వల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరు, చెన్నైకి తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిని అధిగమించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేడబ్ల్యూడీటీ–1, విభజన చట్టం 11వ షెడ్యూలు ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు 111 టీఎంసీల నీటి కేటాయింపు ఉందని, ఆ ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణ మండల బెంచ్ (చెన్నై) ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేశామని వెల్లడించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నేతృత్వంలోని ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) గత నెల 17న నిర్వహించిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి అడిగిన అదనపు సమాచారాన్ని గత నెల 30న అందజేశామని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి జారీ చేయడానికి సంబంధించి ఈనెల 7న ఈఏసీ సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు సీమ ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను గత నెల 30న సమర్పించామన్నారు. సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి జారీ చేయాలని గత నెల 10న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శికి లేఖ రాశామని తెలియచేశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని సీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా పర్యావరణ అనుమతి ఇచ్చేలా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయాలని అభ్యర్థించారు. అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తే రాష్ట్ర ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు ప్రకాశ్ జవదేకర్‌కు సీఎం జగన్ సోమవారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► కృష్ణా బోర్డు ఉత్తర్వులు, ప్రాజెక్టుల నిర్వహణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ అక్రమంగా నీటిని వాడుకుంటూ హక్కుగా మాకు దక్కిన వాటా నీళ్లను మాకు అందకుండా చేస్తోంది. ► శ్రీశైలంలో 854 అడుగులకు నీటి మట్టం చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గ్రావిటీపై సాగు, తాగునీరు అందించవచ్చు. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయవచ్చు. శ్రీశైలంలో 796 అడుగుల నీటి మట్టం నుంచే విద్యుదుత్పత్తి చేస్తూ జూన్ 1 నుంచి ఇప్పటిదాకా ప్రాజెక్టులోకి వచ్చిన 26 టీఎంసీల్లో 19 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంది. దీంతో నీటి మట్టం 854 అడుగులకు చేరుకోలేకపోయింది. దీనివల్ల దుర్భిక్ష ప్రాంతాలకు, చెన్నైకి నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ► శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించేలా ఎలాంటి అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టింది. ఈ అక్రమ ప్రాజెక్టులు కూడా పూర్తయితే శ్రీశైలంలో 854 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం దుర్లభం. ► ఈ నేపథ్యంలో గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించేందుకు తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడం మినహా మాకు మరో మార్గం లేదు. ఈ పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించాం. ► ఎన్జీటీ ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేశాం. ఈ ఎత్తిపోతల పథకం కోసం కొత్తగా భూ సేకరణ చేయడం లేదు. అటవీ భూమి, అభయారణ్యంలో ఎత్తిపోతల పనులు చేయడం లేదు. ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్) నుంచి 10 కి.మీ. అవతల ఈ ఎత్తిపోతల పథకం ఉంటుంది. -
కేంద్రమంత్రులు షెకావత్, ప్రకాష్ జవదేకర్‌కు సీఎం జగన్ లేఖ
-
కేంద్రమంత్రులు షెకావత్, ప్రకాష్ జవదేకర్‌కు సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్, ప్రకాష్ జవదేకర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే.. రాయలసీమ లిఫ్ట్ సందర్శించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని ఆదేశించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు సీఎం జగన్ లేఖ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ లిఫ్ట్‌ను పరిశీలిస్తామని పదేపదే కేఆర్ఎంబీ కోరుతోంది. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే రాయలసీమ లిఫ్ట్ సందర్శించేలా కేఆర్ఎంబీని ఆదేశించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, కేంద్ర జలశక్తి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అనేక ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఏపీ పట్ల కేఆర్ఎంబీ వివక్షతో వ్యవహరిస్తోందని, తెలంగాణ తప్పుడు ఫిర్యాదుల పట్ల మాత్రం కేఆర్ఎంబీ వేగంగా స్పందిస్తోందన్నారు. ఏపీ ఇచ్చిన ధర్మబద్ధమైన ఫిర్యాదులను కేఆర్ఎంబీ పట్టించుకోవడంలేదని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోంది. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు సీఎం వైఎస్ జగన్ లేఖ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ‘‘జూన్ 1 నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్ అవసరాలు లేకుండా తెలంగాణ నీటిని వినియోగిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించింది. 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదని’’ లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల కమిషనర్‌కు పూర్తి డీపీఆర్‌ను అందజేశామని.. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. అలాగే 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. అలాగే దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయిందని తెలిపారు. 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు భరత్నెట్ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) మోడ్ కింద రూ .19,041 కోట్లతో సాధ్యమయ్యే గ్యాప్ నిధులతో కేబినెట్ ఆమోదించినట్లు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు పవర్ డిస్కంల సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం డిస్కంల సామర్థ్యాన్ని పనితీరును మెరుగు పరచుకునేందుకు షరతులతో కూడిన ఆర్థిక సహాయం కొత్త పథకం కోసం 3,03,758 కోట్ల రూపాయల అంచనా వ్యయం 97,631 కోట్లు రూపాయలు కేటాయింపు ప్రభుత్వం కేంద్రం విధించిన షరతులకు అంగీకరిస్తే పెద్దఎత్తున డిస్కంలకు ఆర్థిక సహాయం భారత్ నెట్ ద్వారా 16 రాష్ట్రాల్లో ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు భారత్ నెట్‌కు రూ.19,041 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం పవర్ డిస్కమ్ సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం డిస్కమ్‌ల సామర్థ్యం పెంపునకు షరతులతో కూడిన ఆర్థిక సాయం షరతులకు అంగీకరిస్తే డిస్కమ్‌లకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయం -
కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
న్యూ ఢిల్లీ\అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎం జగన్ వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. షెకావత్‌తో సీఎం జగన్ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. కాగా, రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం సీఎం జగన్.. ఈ రోజు(గురువారం) గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌లను కూడా సీఎం జగన్ కలవనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకొని తిరిగి శుక్రవారం తాడేపల్లి చేరుకుంటారు. చదవండి: ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ -
Family Man 2: ఫ్యామిలీ మ్యాన్ 2 బ్యాన్?!
సాక్షి, చెన్నై: ఫ్యామిలీమ్యాన్ సిరీస్ విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కాకుండా బ్యాన్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈలం తమిళ్స్‌ను అత్యంత అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని తమిళనాడు ప్రభుత్వం ఆ విజ్ఞప్తిలో పేర్కొంది. గతంలో బ్యాన్ చేసిన డిజిటల్ కంటెంట్‌ను ప్రస్తావిస్తూ.. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ను బ్యాన్ చేయడంగానీ, అసలు రిలీజ్ కాకుండా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఫ్యామిలీమ్యాన్ 2లో ‘అభ్యంతరకరం, అవసరం, అప్రస్తుతమైన కంటెంట్ ఉంద’ని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఇదివరకే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తంగరాజ్ ఒక లేఖ రాశాడు. ఇది ఈలం తమిళ్స్ సెంటిమెంట్స్‌తో పాటు తమిళనాడు ప్రజల భావాలను కూడా దెబ్బతీస్తుందని లేఖలో తంగరాజ్ పేర్కొన్నారు. తమిళ నటిని సమంతను టెర్రరిస్టుగా చూపించడం.. తమిళుల ఆత్మగౌరవంపై జరిగే దాడేనని, దీనిని ఎవరూ భరించలేరని తంగరాజ్ అభివర్ణించాడు. ఇలాంటి చర్యలను, తప్పుడుదారి పట్టించే ప్రయత్నాలు ఎవరూ చేసినా భరించలేమని తంగరాజ్ తెలిపాడు. తమిళ సంప్రదాయాన్ని దెబ్బతీసేలా ఉందని, అలాంటి కంటెంట్‌ను అనుమతించకపోవడమే మంచిదని లేఖలో విజ్ఞప్తి చేశాడు. కాగా, ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ నుంచి బదులు వచ్చింది. కాగా, తమిళ ప్రజల సెంటిమెంట్స్‌ను గుర్తించకుండా ఈ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైకో కూడా ప్రకాశ్ జవదేరకర్కు ఒక లేఖ రాశారు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీలో సమంతతో పాటు మనోజ్ వాజ్‌పాయి, ప్రియమణి తదితరులు నటించారు. స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఫ్యామిలీమ్యాన్ 2 ట్రైలర్‌తోనే కాంట్రవర్సీని నెత్తినేసుకుంది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఈ సీజన్లో చూపించడమే అసలు అభ్యంతరం. “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హాష్ ట్యాగ్‌ను కూడా వైరల్ చేశారు. దీంతో రీఎడిట్ చేసిన ట్రైలర్‌ను అమెజాన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ కాన్సెప్ట్‌తో ముడిపడిన సీన్లకు సెన్సార్ పడే ఛాన్స్ ఉంది. -
మహారాష్ట్ర, ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌లోనే 60శాతం కరోనా కేసులు
-
బాబోయ్ పైరసీ.. వేల కోట్లు ఉఫ్!
సాక్షి, న్యూఢిల్లీ: పైరసీ కారణంగా మీడియా, వినోద పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని, ఏటా సగటున రూ.2,100 కోట్ల మేర పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పైరసీని కట్టడి చేయడం కోసం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిందని, సినిమా హాళ్లలో పైరసీకి పాల్పడేవారికి భారీ జరిమానాలు విధించేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయని ఎంపీలు సుకాంత మజుందార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం పైరసీ కట్టడికి కొన్ని సిఫార్సులు చేసిందని, వాటిని పరిశీలించి సినిమాటోగ్రఫీ బిల్లు –2021లో చేర్చుతామన్నారు. వీటితో పాటు కాపీరైట్ చట్టం–1957 ప్రకారం పైరసీపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా పైరసీకి పాల్పడితే ఐటీ యాక్ట్ –2000లోని సెక్షన్ 79 ద్వారా చర్యలు తీసుకోవచ్చని జవడేకర్ పేర్కొన్నారు. చదవండి: ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరో.. వీడియో వైరల్ హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు -
ఆర్ఎస్ఎస్ అర్థం కావాలంటే చాన్నాళ్లు పడుతుంది
న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోనే అతిపెద్ద దేశభక్తియుత పాఠశాల ఆర్ఎస్ఎస్’అని బీజేపీ కొనియాడింది. హిందూత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను రాహుల్ గాంధీ పాకిస్తాన్‌లోని రాడికల్ ఇస్లామిక్ వ్యవస్థతో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా దుయ్యబట్టింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ అధికార బీజేపీకి సైద్ధాంతిక భూమికనిచ్చిన ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి చాలా సమయం పడుతుందని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘ఆర్ఎస్ఎస్.. ప్రపంచంలోనే అతిపెద్ద దేశభక్తియుత పాఠశాల. అందుకే అది అత్యున్నత స్థానంలో ఉంది’ అని జవదేకర్ అన్నారు. ప్రజల్లో మంచి మార్పు తీసుకురావడమూ, వారిలో దేశభక్తిని పెంపొందించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని జవదేకర్ అన్నారు. పాకిస్తాన్‌లోని ఇస్లామిస్ట్‌లు నిర్వహిస్తోన్న మదర్సాల మాదిరిగా భారత్‌లో ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తోన్న పాఠశాలలున్నాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా, జవదేకర్ స్పందించారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌషిక్ బసుతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, 1975లో మాజీప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం తప్పు అని వ్యాఖ్యానించారు. అయితే ఆనాడు వ్యవస్థలను టార్గెట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదని రాహుల్ స్పష్టం చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలు హస్యాస్పదం అని జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థల స్వాతంత్య్రాన్ని ఆనాడే కాలరాసిందని, పత్రికా స్వేచ్ఛను హరించిందని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారి గొంతు నులిమి వేసిందనీ జవదేకర్ విమర్శించారు. ఎంపీలూ, ఎమ్మెల్యలేతో సహా లక్షలాది మంది ప్రజలను ఎమర్జెన్సీలో అరెస్టు చేశారని, సంస్థల స్వాతంత్య్రాన్ని హరించివేశారని జవదేకర్ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన బెంగాలీ హిందువులు, బుద్ధిస్టులకు పౌరసత్వం ఇవ్వాలని 2015లో డిమాండ్ చేసిన కాంగ్రెస్, అస్సాంలో తమని గెలిపిస్తే సీఏఏని రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ జనరల్సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానించడం ఎన్నికల అవకాశవాదమని జవదేకర్ ట్వీట్ చేశారు. -
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. సీఎం నారాయణ స్వామి రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రపతి అనుమతి తరువాత అసెంబ్లీ రద్దవుతుందన్నారు. 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాక ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. గురువారం పుదుచ్చేరిలో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రూ.కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభించనున్నారు. పుదుచ్చేరిని తమిళనాడులో చేర్చేందుకు బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నారాయణస్వామి బుధవారం ఆరోపించారు. -
వ్యాక్సినేషన్: ఒకటి నుంచి 60 ఏళ్లపైవారికి..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌కు విరుగుడుగా భారతదేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ శరవేగంగా సాగుతోంది. కరోనా వారియర్స్‌గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవకులుగా ఉన్న అధికార యంత్రాంగానికి ఇన్నాళ్లు వ్యాక్సినేషన్ వేసిన తెలిసిందే. ఇక మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరితో పాటు రెండు అంతకన్నా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైవయస్కులకు కూడా వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ వేస్తామని మంత్రి వివరించారు. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా అందిస్తున్నట్లు, ప్రైవేటు కేంద్రాల్లో వేసుకోవాలని భావించేవారు రుసుము చెల్లించాలని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలనే విషయమై రెండు రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిస్తుందని చెప్పారు. ఈ రెండో దశలో దాదాపు 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ప్రకాశ్ వెల్లడించారు. 60 ఏళ్ల పైబడిన వారు 10 కోట్ల మంది ఉంటారని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మొదటి దశలో 1,07,67,000 మందికి వ్యాక్సినేషన్ వేసిన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత వ్యాక్సిన్ అత్యధిక మందికి వేసిన దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. -
పూర్తి సామర్థ్యంతో సినిమా హాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంద శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లలో ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఇటీవల జారీ చేసిన నూతన కోవిడ్–19 మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ప్రామాణిక నియమావళిని విడుదల చేశారు. కోవిడ్–10 ప్రోటోకాల్స్ పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటించాలని చెప్పారు. శానిటైజేషన్ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంలో సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఏఐ) స్వాగతించాయి. డిజిటల్‌కి గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తాం.. ఓటీటీల్లో విడుదలవుతున్న పలు వెబ్ సిరీస్‌లు, షోలు వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ వేదికలపై విడుదలయ్యే వెబ్‌సిరీస్‌లు, షోల నియంత్రణకు గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ‘‘ఓటీటీల్లో విడుదలవుతున్న కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. త్వరలోనే గైడ్‌లైన్స్ తీసుకొస్తాం’’ అని వెల్లడించారు. నియమావళిలోని ముఖ్యాంశాలు ► కంటైన్మెంట్ జోన్లలోని థియేటర్లలో చలనచిత్రాల ప్రదర్శనకు అనుమతి లేదు. ► క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు చర్యలకు సిఫార్సు చేయొచ్చు. ► థియేటర్లలో సీట్ల సామర్థ్యం వందశాతానికి పెంచుకోవచ్చు. ► సినిమా హాళ్లు, థియేటర్లలో కోవిడ్–19 సంబంధిత భద్రతా చర్యలను అమలు చేయాలి. ► ఫేస్ మాస్కుల వినియోగం తప్పనిసరి. ► థియేటర్ల బయట, కామన్ ప్రాంతాలు, వేచిఉండే ప్రాంతాల్లో కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం పాటించేలా చూడాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ► ఆరోగ్యసేతు యాప్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ► ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో రద్దీ లేకుండా ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ► సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో సినిమాల ప్రదర్శనల మధ్య తగినంత విరామం ఇవ్వాలి. ► టికెట్లు, ఆహారం, పానీయాల కొనుగోలులో చెల్లింపుల నిమిత్తం కాంటాక్ట్‌లెస్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి. ► టికెట్ల కొనుగోలు నిమిత్తం రోజంతా తెరచి ఉండేలా తగిన సంఖ్యలో బాక్సాఫీస్ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా ముందస్తు బుకింగ్‌ను అనుమతించాలి. ► థియేటర్ల ప్రాంగణంలో శానిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► మానవ సంచారం ఉండే అన్ని చోట్లా హ్యాండిల్స్, రెయిలింగ్స్ తరచుగా శానిటైజ్ చేయాలి. ► థియేటర్లలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై ప్రకటనలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. -
థియేటర్లలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతి
సినిమా థియేటర్ల ఓనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవచ్చని పచ్చజెండా ఊపింది. అయితే కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నొక్కి చెప్పింది. ఈ మేరకు ఆదివారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది. థియేటర్లలో భౌతిక దూరం, మాస్కులు ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ వంటివి తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. షో ముగిసిన ప్రతిసారి శానిటైజ్ చేయాలని తెలిపింది. (చదవండి: సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్) కాంట్రాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వారి ఫోన్ నెంబర్లను కూడా తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. రేపటి(ఫిబ్రవరి 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కేంద్రం తాజా నిర్ణయంతో సుమారు ఏడు నెలలుగా మూతపడిన సినిమాహాళ్ల ఓనర్లకు ఉపశమనం లభించినట్లైంది. కాగా గతేడాది అక్టోబర్‌లో 50 శాతం ప్రేక్షకులతో థియేటర్లు నడిపించుకోవచ్చన్న కేంద్రం తాజాగా దాన్ని 100 శాతానికి పెంచడంతో సినీరంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి త్వరలోనే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డు కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. (చదవండి: 30 రోజుల్లో..ఫస్ట్‌డే కలెక్షన్లు.. ప్రదీప్ ఎమోషనల్ ట్వీట్) Good news for Cinema lovers: Today, Issued the revised SOP for the film exhibition, 100% occupancy will be allowed in theatres from 1st February, but all @MoHFW_INDIA #COVID19 guidelines will have to be followed.https://t.co/5vfZtAoHXW@MIB_India pic.twitter.com/89qZpSiMhq — Prakash Javadekar (@PrakashJavdekar) January 31, 2021 -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటక తూముకూరులో పారిశ్రామిక కారిడార్లతో పాటు గ్రేటర్ నోయిడాలోని మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ & మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ లకు కేంద్రం అనుమతి తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. మూడు పారిశ్రామిక కారిడార్లకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ. 7,725 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక కారిడార్లను నిర్మించడం ద్వారా 2.8 లక్షల మందికి ఉపాది లభించనున్నట్లు అంచనా వేసినట్లుగా పేర్కొన్నారు. కాగా కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం రూ.2,139 కోట్లుగా ఉందని తెలిపారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ వల్ల లాజిస్టిక్ ఖర్చు తగ్గింపుతో పాటు, నిర్వహణ సామర్థ్యం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వీటితో పాటు భారత్, భూటాన్ దేశాల మధ్య శాంతి భద్రతలకు సంబంధించి ఎంవోయూకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
డీటీహెచ్ సంస్థలకు ఇకపై 20 ఏళ్ల లైసెన్స్
న్యూఢిల్లీ: డీటీహెచ్ (ఇళ్లకు నేరుగా ప్రసారాలు అందించే) సేవలు దేశంలో మరింత బలపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేసేందుకు వీలుగా నిబంధనల సవరణకు.. అదేవిధంగా డీటీహెచ్ బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆరు కోట్ల ఇళ్లకు డీటీహెచ్ ‘‘భారత్‌లో ఆరు కోట్లకు పైగా ఇళ్లకు డీటీహెచ్ సేవలు అందుతున్నాయి. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతించాలని వాణిజ్య శాఖ లోగడ నిర్ణయించింది. అయితే, సమాచార, ప్రసార శాఖ నిబంధనల కారణంగా ఈ ప్రయోజనం డీటీహెచ్ రంగానికి ఇంతకాలం లభించలేదు. నూతన నిబంధనలు వాణిజ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ నిబంధనల కింద 49 శాతం ఎఫ్‌డీఐకే అనుమతి ఉంది’’ అని మంత్రి మీడియాకు వివరించారు. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేస్తామని, తర్వాత నుంచి ప్రతీ పదేళ్ల కాలానికి పునరుద్ధరించుకోవచ్చని వివరించారు. లైసెన్స్ ఫీజును ప్రస్తుతం ఏడాదికోసారి వసూలు చేస్తుండగా, ఇక మీదట త్రైమాసికానికి ఓసారి వసూలు చేస్తామన్నారు. ‘ఎఫ్‌డీఐ నిబంధనల సవరణతో ఈ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఫలితంగా నూతన పెట్టుబడులు రావడంతోపాటు, నూతన ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. 8 శాతానికి తగ్గింపు నూతన నిబంధనల కింద లైసెన్స్ ఫీజును స్థూల ఆదాయంలో 10 శాతం కాకుండా.. సవరించిన స్థూల ఆదాయం (జీఎస్టీని మినహాయించిన తర్వాత)లో 8 శాతంగా మార్పు చేయనున్నారు. దీంతో టెలికం శాఖ మాదిరే లైసెన్స్ ఫీజు అమలు కానుంది. ఇలా ఆదా అయిన నిధులను సేవల విస్తరణకు వెచ్చించడం ద్వారా ఈ రంగం మరింత వృద్ధిని సాధించొచ్చన్నది సమాచార, ప్రసార శాఖ అంచనా. ‘‘డీటీహెచ్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా డీటీహెచ్ వేదికలను, టీవీ చానళ్ల ట్రాన్స్పోర్ట్ స్ట్రీమ్‌లను పంచుకోవచ్చు. అదే విధంగా టీవీ చానళ్ల పంపిణీదారులు సైతం తమ సబ్‌స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎస్ఎమ్ఎస్), కండీషనల్ యాక్సెస్ సిస్టమ్ (సీఏఎస్) అప్లికేషన్ల కోసం ఉమ్మడి హార్డ్‌వేర్‌ను పంచుకోవడానికి అనుమతిస్తాము. సదుపాయాలు పంచుకోవడం వల్ల శాటిలైట్ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు’’ అని సమాచార శాఖ ప్రకటన తెలియజేసింది. సంతోషం.. ఫీజులు కూడా తగ్గించాలి ‘‘మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మా కృతజ్ఞతలు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న లైసెన్స్ పాలసీని పరిష్కరించారు. ఇది అనిశ్చితిని తొలగిస్తుంది’’ అని టాటా స్కై ఎండీ, సీఈవో హరీత్ నాగ్‌పాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలని, అప్పుడు తాము మరింత పోటీపడగలమన్నారు. ‘‘కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజును నిర్ణయించడం ద్వారా మాకూ సమాన అవకాశం కల్పించాలి. కేబుల్ టీవీ కూడా సమాచార, ప్రసార శాఖ లైసెన్స్ పరిధిలోనే, ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ధరలు, మార్జిన్లను పాటిస్తోంది’’ అని నాగ్‌పాల్ చెప్పారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం మార్చి చివరికి డీటీహెచ్ పరిశ్రమకు 7.24 కోట్ల మంది చెల్లింపుల చందాదారులు ఉన్నారు. -
జంతు ప్రేమికులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: జంతు ప్రేమికులకు సంతోషం కలిగించే వార్త. దేశంలో చిరుత పులుల సంఖ్య గత నాలుగేళ్లలో 62 శాతం పెరిగింది. భారత్‌లో చిరుత పులుల జనాభా క్రమంగా పెరుగుతోందని పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. 2014లో 8 వేలున్న చిరుతలు, 2018కి 12వేలను దాటాయని తెలిపారు. కెమెరా ట్రాపింగ్ పద్ధతిలో చిరుతల జనాభాను లెక్కించినట్లు ‘‘స్టేటస్ ఆఫ్ లియోపార్డ్స్ ఇన్ ఇండియా 2018’’ నివేదిక విడుదల సందర్భంగా ఆయన వెల్లడించారు. పులులు, ఆసియా సింహాల బాటలోనే చిరుతల సంఖ్య కూడా పురోగమన దిశగా పయనిస్తోందన్నారు. భారత్ పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్య పెంపుదలకు చేస్తున్న కృషికి వన జంతువుల జనాభా పెరగడమే నిదర్శమని చెప్పారు. నివేదిక ప్రకారం 2018లో మధ్యప్రదేశ్‌లో 3421, కర్ణాటకలో 1783, మహారాష్ట్రలో 1690తో పాటు ఇతర రాష్ట్రాల్లోని చిరుతల మొత్తం సంఖ్య 12852కు చేరింది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే తూర్పు కనుమలు, మధ్య భారతంలో 8071, పశ్చిమ కనుమల్లో 3387, శివాలిక్ మరియు గంగా మైదాన ప్రాంతంలో 1253, ఈశాన్య పర్వతాల్లో 141 చిరుతలున్నాయి. సగానికి పైగా చిరుతలు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. జనారణ్యంలో మనుషుల చేతికి చిక్కి, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ చిరుత పులుల సంఖ్య పెరగడం గమనార్హం. (చదవండి: భారత్‌లో కొత్త రకం కరోనా ఎంట్రీ!) -
ఈసారి ఇఫీలో గతం
గోవాలో జరగనున్న 51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫీ) ఇటీవల విడుదలైన చిన్న చిత్రం ‘గతం’కి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ పనోరమా విభాగంలో ‘గతం’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ విభాగంలో ఈ ఏడాది ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమా ఇది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న సినిమాల జాబితాను శనివారం ప్రకటించారు. వచ్చే జనవరి 16 నుంచి 24 వరకు జరగనున్న ఈ చలనచిత్రోత్సవాలలో భాగంగా ఇండియన్ పనోరమా విభాగం కింద భారత్ నుంచి హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళ సహా ఇతర భాషల చిత్రాలు 23 ఎంపికయ్యాయి. ఇక, మెయిన్ స్ట్రీమ్ విభాగంలో తమిళ చిత్రం ‘అసురన్’ (తెలుగులో వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’కు మూలం), మలయాళ చిత్రం ‘కప్పేలా’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన హిందీ చిత్రం ‘ఛిఛోరే’ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇక ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపికైన ‘గతం’ విషయానికి వస్తే... భార్గవ పోలుదాసు, రాకేష్ గలేభే, పూజిత ముఖ్య పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కిరణ్ కొండమడుగుల తెరకెక్కించారు. భార్గవ పోలుదాసు, సృజన్ ఎర్రబోలు, హర్షవర్థన్ ప్రతాప్ నిర్మించారు. మొత్తం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఈ నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయింది. ఇండియన్ పనోరమాకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రం -
టీఆర్ఎస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్‌షీట్
-
టీఆర్ఎస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ దీనిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మేయర్ కావాలా.. ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. హైద్రాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్, ఓవైసీ కుటుంబ పార్టీల నుంచి హైద్రాబాద్‌ను కాపడుకోవాలని హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లే అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, హరీష్, కేసీఆర్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న దుబ్బాకను గెలిచామని, దుబ్బాక ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని ధీమా వ్యకం చేశారు. (హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీది కాదు: కేటీఆర్) ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించిన జవదేకర్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘కేసీఆర్ ఆరేళ్ళల్లో పాలన అవినీతికి చిరునామా. హైద్రాబాద్‌ను డల్లాస్ నగరం చేస్తామని.. కేటీఆర్ వరదల నగరంగా మార్చారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం. మోదీ రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తే.. కేసీఆర్ రెండు వందల ఇళ్ళు కూడా నిర్మించలేదు. హుస్సేస్ సాగర్‌లో ఉన్న కొబ్బరినీళ్ళు కేసీఆర్ తాగుతున్నారా?. కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేది. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర కీలకం.. సుష్మా స్వరాజ్ లేకోయినా ఆమె పోరాటం మర్చిపోలేం. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో అందరకీ తెలుసు’అని అన్నారు. -
దివాళి బొనాంజా : కేంద్రం ప్రోత్సాహకాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ 2 లక్షల కోట్ల విలువైన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలకు బుధవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశీ తయారీరంగాన్ని ప్రోత్సహించేందుకు పది రంగాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్టు కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఫార్మా, ఆటో, స్టీల్, టెలికాం, జౌళి, ఆహోరోత్పత్తులు, సోలార్ ఫోటోవోల్టిక్, సెల్ బ్యాటరీ వంటి పది రంగాలకు వర్తింపచేసినట్టు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పథకాలకు మరింత ఊతమిస్తామని, వయబులిటి గ్యాప్ ఫండింగ్ కింద 8100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తెలిపారు. దేశీ తయారీరంగాన్ని అంతర్జాతీయ స్ధాయిలో దీటుగా మలిచేందుకు చర్యలు చేపడతామని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారు. చదవండి : జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు -
జౌళి సంచుల్లోనే ఆహార ధాన్యాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జౌళి పరిశ్రమకు ఊతమిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జనపనార బస్తాల్లోనే నిల్వ చేయాలనే నిబంధనను పొడగించే ప్రతిపాదనకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘100 శాతం ఆహార ధాన్యాలను, 20% పంచదారను కచ్చితంగా జనపనార సంచుల్లోనే నిలువ చేసే నిబంధనను పొడగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది’ అని ఆ భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన వెలువడింది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులకు ఈ నిర్ణయం లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. రూ. 7500 కోట్ల విలువైన జౌళి సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. జౌళి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ‘జ్యూట్ ఐకేర్’ ద్వారా రైతులకు ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలనే భారత జౌళి కార్పొరేషన్ 10 వేల క్వింటాళ్లæ విత్తనాల పంపిణీ కోసం నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్యామ్‌ల నిర్వహణకు ఆమోదం రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, మరో సంస్థ 80% నిధులు సమకూర్చాయని వెల్లడించారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు. -
అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, అనంతపురం : అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 11న ‘బాలికే భవిష్యత్’ పేరుతో జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నుంచి ప్రశంసలు దక్కాయి. కలెక్టర్ గంధం చంద్రుడు ఆ రోజు జిల్లా కార్యాలయ అధికారులుగా బాలికలకు అవకాశం కల్పించడంపై కేంద్ర మంత్రి స్పందించారు. ఒక రోజు కలెక్టర్‌గా ఇంటర్ విద్యార్థిని ఎం.శ్రావణితో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఒక రోజు అధికారులుగా బాలికలు పనిచేశారు. దీనిపై కేంద్ర మంత్రి ట్విటర్ వేదికగా అభినందించారు. బాలికలకు ఇలాంటి అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించడం స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 16-year old M. Sravani, brave daughter of a farm labourer of Anantapur AP, assumed office of Anantapur Dist. Collector on 11th Oct. for one day. District Administration had decided to give an opportunity to one girl each as head of all govt. offices in the district.#NewIndia pic.twitter.com/zNCv7pqEzg — Prakash Javadekar (@PrakashJavdekar) October 20, 2020 -
దిగజారుతున్న మీడియా విలువలను కాపాడాలి
-
కొత్తతరహాలో పంట వ్యర్థాల డీకంపోజ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఇరుగుపొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట కోత తర్వాత పొలంలో మిగిలిన పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఆయా రాష్ట్రాలు దట్టమైన కాలుష్యంతో నిండిపోయేవి. పూసా అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ ఈ ఏడాది, మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే డీకొంపోజ్ చేయడానికి నూతన సాంకేతికతని అభివృద్ధిపరిచిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు, ఈ సీజన్లో మిగిలిపోయిన పంటవ్యర్థాలను తగులబెడితే వచ్చే కాలుష్యాన్ని ఎదుర్కొనే సంసిద్ధత గురించి ఈ సమావేశంలో చర్చించారు. గత మూడు సంవత్సరాలుగా వ్యర్థాల దహనం తగ్గినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి మున్ముందు మరిన్ని చర్యలు అవసరమని జవదేకర్ అన్నారు. ఈ వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,700 కోట్లు కేటాయించింది.వీటిలో వ్యర్థాల అదుపు చేయడానికి ప్రస్తుతం, వ్యక్తులకు 50 శాతం, సహకార సంఘాలకు 80 శాతం ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. -
అందాల పోటీలో ఆంధ్రా సీతాకోకచిలుకలు
బుట్టాయగూడెం: జాతీయ స్థాయి ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేయడానికి జరుగుతోన్న ఫైనల్ పోటీలో మొత్తం 7 రకాలు ఎంపిక కాగా, వాటిలో పాపికొండల అభయారణ్యంలో ఉండే మూడు రకాల సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి. 2021 సంవత్సరానికి కొనసాగుతోన్న ఈ పోటీలో పశ్చిమగోదావరి జిల్లా పాపికొండల అభయారణ్యంలోని కామన్ జేజేబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఉత్తమ సీతాకోకచిలుకను ఎంపిక చేసేందుకు ఆన్లైన్ ఓటింగ్ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 8 వరకూ ఆన్లైన్ ఓటింగ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని వైల్డ్‌లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సి.సెల్వమ్ తెలిపారు. ► పాపికొండల అభయారణ్యంలో సుమారు 130 రకాల రంగురంగుల సీతాకోకచిలుకలు ఉన్నాయి. ముఖ్యంగా కొలనులు, చెరువులు, వాగుల సమీపాల్లో రకరకాల సీతాకోకచిలుకలు గుంపులుగా ఏర్పడి అలికిడైన సమయంలో ఒక్కసారిగా ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. ► ఇక్కడున్న వాటిల్లో తుది జాబితాకు ఎంపికైనవి అరుదైన రకాలని వైల్డ్‌లైఫ్ శాస్త్రవేత్త కె.బాలాజీ తెలిపారు. దాదాపు 9 నెలలపాటు కష్టపడి ఫోటోలు సేకరించి పోటీల్లో వాటిని పెట్టినట్లు చెప్పారు. ఇక్కడి సీతాకోకచిలుక జాతీయ స్థాయిలో ఎంపికైతే ఈ ప్రాంతానికి మరింత పేరు వస్తుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ► ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత జాతీయ సీతాకోకచిలుకను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటిస్తారని వైల్డ్‌లైఫ్ అధికారులు తెలిపారు. -
ఆటోమొబైల్ పరిశ్రమకు త్వరలో శుభవార్త
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ త్వరలో శుభవార్త విననుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. జవదేకర్ శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడారు. జవదేకర్ మాట్లాడుతూ ఆటో పాలసీల విధానాన్ని సమీక్షించనున్నామని, షేర్హోల్డర్లు ఆటో పరిశ్రమ నిపుణుల సూచనలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆటోమొబైల్ పరిశ్రమలో జీఎస్టీ(వస్తు సేవల పన్ను) ద్విచక్రవాహనాలు(బైక్) తదితర ప్రజా రవాణా వాహనాలకు జీఎస్టీ పన్నుల విధానంలో సానుకూల నిర్ణయాలు ఉంటాయని కేంద్ర వర్గాలు తెలిపాయి. అయితే తుది నిర్ణయం ఆర్థిక శాఖ అధ్యయనం చేసిన తర్వాతే ఉంటుందని అన్నారు. ప్రస్తుతం జీఎస్టీ వాహనాలకు 28శాతం జీఎస్టీ పన్నులు విదిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ఉదృతి నేపథ్యంలో అన్ని రంగాలను ఆదుకోవాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్లు జవదేకర్ పేర్కొన్నారు. -
షూటింగ్స్ ప్రారంభించుకోండి!
కరోనా వల్ల ఏర్పడ్డ అనిశ్చితి అలానే ఉంది. సినిమా షూటింగ్స్ పరిస్థితి అయోమయంగా మారింది. ఒకటీ అరా తప్పిస్తే పెద్దగా షూటింగ్స్ జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ చాలా వరకూ సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతి ప్రకటించాయి. తాజాగా కేంద్రప్రభుత్వం కూడా సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆరోగ్య శాఖ సూచనల మేరకు కొన్ని గైడ్ లైన్స్ కూడా తయారు చేసింది. ఆ గైడ్ లైన్స్ ఈ విధంగా.. ► కెమెరా ముందు ఉన్నప్పుడు తప్ప నటీనటులతో సహా సెట్లో ఉండే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ► కాస్ట్యూమ్స్, విగ్, మేకప్ సామాన్లు ఒకరివి ఒకరికి వాడటం వీలైనంత తగ్గించేయాలి. ► చిత్రీకరణకు సంబంధించిన ప్రదేశాల్లో (కెమెరా ముందు కాకుండా) ఆరు అడుగులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ► సెట్లో వీలైనన్ని చోట్ల హ్యాండ్ వాష్ చేసుకునే ఏర్పాటు చేయాలి. పని ప్రదేశాల్లో ఉమ్మేయడం నిషేధం. ► ఆరోగ్య సేతు యాప్‌ను (కోవిడ్ సోకిన వారికి మనం ఎంత దగ్గర/దూరంలో ఉన్నామో తెలియజేసే ప్రభుత్వం యాప్) అందరూ ఉపయోగించేలా చేయాలి. ► మెడికల్ టీమ్‌ను అందుబాటులో ఉంచాలి. మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్స్, బాత్రూమ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► సెట్లో అడుగుపెట్టే చోట థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. కోవిడ్ లక్షణాలున్న వారిని అనుమతించకూడదు. ► పార్కింగ్ ప్రదేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడ కూడా వీలైనంత దూరం పాటించగలిగేలా చూసుకోవాలి. ► వీలైతే కోవిడ్ జాగ్రత్తలను తెలిపే పోస్టర్లు, వీడియోలను ఏవీలు రూపంలో ప్రదర్శించగలగాలి. ► పని చేసిన ప్రదేశంలో ఎవరికైనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే వెంటనే శానిటైజ్ చేయాలి. ► అనారోగ్యం అనిపిస్తే వెంటనే టీమ్‌కు త్వరగా రిపోర్ట్ చేయాలి. అశ్రద్ధ చేయకూడదు. ► లొకేషన్లో తక్కువ మంది ఉండేలా చూసుకోవాలి. విజిటర్స్‌ను, ఆడియన్స్‌ను లొకేషన్లోకి అనుమతించకూడదు. ► స్టూడియోల్లో ఒకేసారి రెండు మూడు సినిమా యూనిట్లు ప్యాకప్ చెప్పకుండా టైమింగ్స్ విషయంలో జాగ్రత్తలుపడాలి. ► సినిమా పరికరాల్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ గ్లౌజ్ ధరించాలి. మేకప్ ఆర్టిస్ట్‌లు, హైయిర్ డ్రెస్సర్లు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలి. ‘‘ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని, ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వాళ్లు హర్షిస్తారని అనుకుంటున్నాం. సినిమా అనేది ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనది. అలానే సినిమా ఎంతో మందికి ఉపాధి కలిగిస్తుంది. సినిమా నిర్మాణం అనేది పెద్ద వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ తిరిగి పుంజుకోవాలి, ఎప్పటిలానే మళ్లీ పరిగెత్తాలని షూటింగులకు ప్రభుత్వం అనుమతించింది’’ అన్నారు సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. -
అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు బుధవారం ఆమోదం తెలియజేసింది. ఈ మూడు.. జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్ప్రైజెస్ బిడ్ రూపంలో గతేడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ వివరాలను కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలియజేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్ సొంతం చేసుకున్న ఆరు విమానాశ్రయాలు ప్రస్తుతం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ తొలుత ఆమోదం తెలిపిన లక్నో, మంగళూరు, అహ్మదాబాద్ విమానాశ్రయాల నిర్వహణ, కార్యకలాపాలు, అభివృద్ధి కి సంబంధించి రాయితీ ఒప్పందాన్ని ఈ ఏడాది ఫి బ్రవరి 14న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అదానీ కుదుర్చుకుంది. వాస్తవానికి వీటిని ఆగస్ట్ 12 నాటికే అదానీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ 12 వరకు గడువును ఏఏఐ పొడిగించింది. తాజాగా లీజునకు ఆమోదం తెలియజేసిన వాటిల్లో గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాల ప్రైవేటీకరణపై కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. కాగా, కోర్టు నుంచి ఎటువంటి స్టే ఆదేశాలు లేనందున, వీటి లీజు విషయంలో ముందుకు వెళ్లొచ్చని కేంద్రం భావించింది. ‘‘ఈ విమానాశ్రయాలను పీపీపీ కిందకు బదిలీ చేయ డం అంటే సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను ప్రయాణికులకు అందించేందుకు వీలు కల్పించడం. ఏఏఐ ఆదా యం పెరగడమే కాకుండా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరిన్ని విమానాశ్రయాల అభివద్ధిపై ఏఏఐ దృష్టిసారించేందుకు అవకాశం లభిస్తుంది’’ అంటూ పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. ‘‘జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను శాశ్వతం గా ప్రైవేటు ఆపరేటర్‌కు ఇవ్వడం లేదు. 50 ఏళ్ల నిర్వహణ తర్వాత ఆయా విమానాశ్రయాలను ఏఏఐకి తిరిగి ఇచ్చేయాలి. ఈ లీజు వల్ల ఏఏఐకి ప్రారంభంలోనే రూ.1,070 కోట్లు లభిస్తాయి. ప్రయాణికులకు మంచి సేవలు లభిస్తాయి‘‘అని ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. -
పక్కాగా పులుల లెక్క
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పులుల సంఖ్య పెరగడానికి చేసిన కృషి ఫలిస్తోంది. నాలుగేళ్లలో వాటి సంఖ్య బాగా పెరిగింది. జూలై 29న గ్లోబల్ టైగర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని గత ఏడాది చేపట్టిన పులుల గణన ఆధారంగా కేంద్రం మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 50 టైగర్ రిజర్వ్‌లలో ఉత్తరాఖండ్‌లో కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అత్యధికంగా 231 పులులు, ఆ తర్వాత కర్ణాటకలోని నాగర్‌హోల్‌లో 127, బందీపూర్లో 127 పులులు ఉన్నట్టు వెల్లడించింది. మిజోరంలోని డంపా, బెంగాల్‌లోని బుక్సా, జార్ఖండ్‌లో పాలమూ రిజర్వ్‌లలో ఒక్క పులీ మిగల్లేదు. ఏపీలో 48, తెలంగాణలో 26 2018 పులుల గణన ప్రకారం దేశవ్యాప్తంగా 2,967 పులులు ఉండగా.. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నట్టు తాజా నివేదిక అంచనావేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 68 పులులు ఉండగా.. అప్పటికీ ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో 6 పులులు పెరిగాయి. నాగార్జునసాగర్(ఏపీ) టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 43 పులులు సంచరిస్తుండగా.. ఇందులో టైగర్ రిజర్వ్‌లోపలే 38 ఉన్నట్టు నివేదిక తెలిపింది. తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 9 ఉండగా.. రిజర్వ్ లోపలి ప్రాంతంలో 7 ఉన్నట్టు నివేదిక తెలిపింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 1 ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న పులుల వయస్సు తక్కువని వివరించింది. 75% పులులు భారత్‌లోనే.. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో పులులు ఉన్నాయి. ఈ దేశాల్లోని మొత్తం పులుల్లో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్ వంటి దేశాల్లో పులులు బాగా కనిపిస్తాయి. 2018లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పులుల గణన గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. కెమెరాల ద్వారా అతి పెద్ద వన్యప్రాణి సర్వేగా దీనిని గుర్తిస్తూ గిన్నిస్‌బుక్ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. పులుల సంరక్షణకు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తాం: జవదేకర్ 1973లో కేవలం తొమ్మిది మాత్రమే టైగర్ రిజర్వ్‌లు ఉన్న మన దేశంలో ఇప్పుడు వాటి సంఖ్య 50కి చేరుకుంది. దేశంలో ఉన్న అన్ని టైగర్ రిజర్వ్‌లూ నాణ్యతాపరంగా బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ పులుల సంరక్షణ కోసం ఇతర దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ ఈ సంరక్షణ చర్యలకు నేతృత్వం కూడా వహిస్తుందన్నారు. అడవుల కొరత, సమృద్ధిగా వర్షపాతం లేకపోయినప్పటికీ భారత్ పులుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యలతో ప్రపంచ జీవవైవిధ్యంలో 8% పెరిగిందన్నారు. దేశంలో పులులు పెరిగింది ఇలా... 2006 1,411 2010 1,706 2014 2,226 2018 2,967 -
‘ఆరు నెలల్లో మీరు సాధించినవి ఇవే’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, కేంద్రం మధ్యన పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాహుల్.. గడిచిన ఆరు నెలల్లో కేంద్రం కరోనా మీద కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అలజడి సృష్టించి.. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిందంటూ ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. ఇది ఇలానే కొనసాగితే చివరకు కాంగ్రెస్.. ట్వీట్స్ పార్టీగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సరిగా పనిచేయకపోవడం వల్లనే ఒక రాష్ట్రం తర్వాత మరోరాష్ట్రంలో అధికారం కోల్పోతుందన్నారు. ప్రజల నుంచి తిరస్కరణకు గురైన ఆ పార్టీ కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని, అయితే ఇందులోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదన్నారు ప్రకాశ్ జవదేకర్. (కరోనాపై పోరు : రాహుల్ సెటైర్లు) గత ఆరు నెలలుగా రాహుల్ గాంధీ సాధించిన అంశాలు తమకు తెలుసని అన్నారు ప్రకాశ్ జవదేకర్. గత ఆరు నెలల్లో రాహుల్ సాధించినవి.. ‘ఫిబ్రవరిలో ఢిల్లీ, షహీన్ బాగ్ అల్లర్లు.. మార్చిలో సింధియాతోపాటు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కోల్పోవడం.. ఏప్రిల్‌లో వలస కార్మికులను రెచ్చగొట్టడం.. మే నెలలో ఆ పార్టీ చారిత్రక ఓటమికి గురై ఆరో ఏట అడుగుపెట్టడం.. జూన్‌లో చైనాకు మద్దతివ్వడం.. జూలైలో రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ నాశనం కావడం’ అని జవదేకర్ ఎద్దేవా చేశారు. -
గిన్నిస్‌లోకి ‘టైగర్ సర్వే’
న్యూఢిల్లీ: భారత్‌లో పులుల సంఖ్యను లెక్కించేందుకు 2018–19లో నిర్వహించిన సర్వే.. గిన్నిస్ ప్రపంచరికార్డు సృష్టించింది. ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్‌లైఫ్ సర్వేగా ఇది రికార్డుకెక్కింది. దేశంలో 2,967 పులులు ఉన్నట్లు సర్వే తేల్చింది. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం పులులు భారత్‌లో ఉన్నాయి. సర్వే గిన్నిస్ రికార్డు పొందడంపై పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది అరుదైన ఘనత అని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక గొప్ప ఉదాహరణ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పులుల గణన సర్వేలో భాగంగా 1,21,337 చదరపు కిలోమీటర్ల (46,848 చదరపు మైళ్లు) విస్తీర్ణంలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 34,858,623 ఫొటోలను చిత్రీకరించాయి. ఇందులో 76,651 ఫొటోలు పులులకు సంబంధించినవి. పులి పిల్లలు మినహా దేశంలో మొత్తం 2,461 పులులు ఉన్నట్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫొటోలను విశ్లేషించి గుర్తించారు. పిల్లలతో కలిపితే 2,967 పులులు ఉన్నట్లు తేల్చారు. -
హైటెక్ వ్యవ‘సాయం’!
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలకు, టెక్నాలజీని ప్రవేశపెట్టేవారికి, స్టార్టప్‌లకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ముందుకు వచ్చే వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర సర్కారు రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాలు, రవాణా వసతుల కోసం ఏర్పాటయ్యే రైతు గ్రూపులకు కూడా ఈ నిధి కింద రుణ సాయం అందుతుంది. కరోనా వైరస్ తర్వాత కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి తాజాగా ప్రకటించిన రూ.లక్ష కోట్ల నిధి అదనం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ థోమర్ మీడియాకు తెలిపారు. చరిత్రాత్మకమైన ఈ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ పదేళ్ల పాటు 2029 వరకు అమల్లో ఉంటుంది. సాగు అనంతరం పంట ఉత్పత్తుల విక్రయం వరకు వసతుల నిర్వహణ (శీతల గోదాములు, గోదాములు, గ్రేడింగ్, ప్యాకేజింగ్ యూనిట్లు, ఈ మార్కెటింగ్, ఈ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు తదితర), సామాజిక సాగు తదితరాలకు దీర్ఘకాల రుణ సాయం పొందొచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఈ రుణాలను మంజూరు చేస్తారు. రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కేంద్రం రూ.10,000 కోట్లను సమకూరుస్తుంది. తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.30,000 కోట్ల చొప్పున ఏర్పాటు చేస్తుంది. గరిష్టంగా రూ.2 కోట్ల రుణానికి 3 శాతం వడ్డీ రాయితీని ఇవ్వనున్నట్టు మంత్రి తోమర్ చెప్పారు. ఈపీఎఫ్ చెల్లింపుల పథకం ఆగస్టు వరకు చిన్న సంస్థల తరఫున ఈపీఎఫ్ చెల్లింపుల పథకాన్ని ఆగస్టు వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. 100 వరకు ఉద్యోగులు కలిగిన సంస్థల్లో 90 శాతం మంది రూ.15,000లోపు వేతనం కలిగి ఉంటే.. ఉద్యోగుల చందాతోపాటు, వారి తరఫున ఆయా సంస్థల చందా (చెరో 12 శాతం)ను కేంద్రమే చెల్లించనుంది. లాక్డౌన్ కారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థలు చాలా వరకు మూతపడడంతో.. వాటికి వెసులుబాటునిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద ఈ భారాన్ని తాను భరించనున్నట్టు కేంద్రం లోగడ ప్రకటించింది. తొలుత మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన చందాలను చెల్లించాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకూ ఈపీఎఫ్ చందాలను తానే చెల్లించాలని కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు మరింత వేతనాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చని, సంస్థలపైనా భారం తగ్గుతుందని కేంద్ర మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. మూడు బీమా సంస్థలకు రూ.12,450 కోట్లు ప్రభుత్వరంగంలోని మూడు సాధారణ బీమా సంస్థ లు.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.12,450 కోట్ల మూలధనసాయాన్ని అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో 2019–20లో అందించిన రూ.2,500 కోట్లు కలసి ఉంటుందని మంత్రి జవదేకర్ తెలిపారు. ఈ మూడు కంపెనీలను విలీనం చేసి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్నది కేంద్రం ప్రణాళికగా ఉంది. -
షూటింగులకు మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ దాని నుంచి తప్పించుకుంటూనే సినిమాలను చిత్రీకరించేందుకు అవసరమైన ప్రత్యేక మార్గదర్శకాలను (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రభుత్వం తీసుకురానుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. ఎఫ్ఐసీసీఐ ఫ్రేమ్స్ 2020 కార్యక్రమాన్ని మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన ఈ విషయం తెలిపారు. షూటింగులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో ప్రభుత్వం ముందుకు రానుందని చెప్పారు. టీవీ సీరియళ్లు, సినిమాలు, కో ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వెల్లడించారు. దేశంలో చిత్రీకరిస్తున్న సినిమాలను 150 దేశాల్లో చూస్తున్నారన్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, సీనియర్లు తమ ఆలోచనలు పంచుకునేందుకు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఎఫ్ఐసీసీఐ ఫ్రేమ్స్ 2020 వేదిక కానుంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించనున్నారు. -
సినిమా షూటింగ్‌లకు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ : సినిమా ఇండస్ట్రీకి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిలిచిన పోయిన సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. కేంద్ర మంత్రి మంగళవారం ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)2020’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సినిమా, టీవీ, గేమింగ్ వంటి వివిధ విభాగాలకు వేర్వేరు మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. కాగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల సడలింపులిచ్చినా.. సినీ పరిశ్రమకు మాత్రం అందులో ఊరట దక్కలేదు.(ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు) ‘మహమ్మారి కారణంగా నిలిచిపోయిన షూటింగ్‌లను తిరిగి ప్రారంభించడానికి కావాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది. టీవీ సీరియల్, ఫిల్మ్ మేకింగ్, కో-ప్రోడక్షన్, యానిమేషన్, గేమింగ్‌తో సహా అన్ని ప్రొడక్షన్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో ముందుకు రాబోతుంది. దీని గురించి త్వరలో ప్రకటిస్తాం’. అని పేర్కొన్నారు. అలాగే సినిమా రంగంలో వ్యాపారవేత్తలు మరింత పెట్టుబడులు పెట్టి పరిశ్రమను ముందుకు తీసుకు పోవాలని కోరారు. 80 మందికి పైగా విదేశీ చిత్ర నిర్మాతలు తమ సినిమాలను భారత్‌లో చిత్రీకరించేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ లభించిందని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. (షూటింగ్‌లు ఇలా.. మార్గదర్శకాలు విడుదల) -
ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
న్యూఢిల్లీ: సహకార బ్యాంకుల్లో పాలన మెరుగుపడనుంది. డిపాజిట్‌దారుల ప్రయోజనాలకు రక్షణ లభించనుంది. ఇందుకుగాను అన్ని పట్టణ, బహుళ రాష్ట్రాల్లో పనిచేసే సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) వైఫల్యం తరహా సంక్షోభాలకు చోటివ్వకుండా ఈ నిర్ణయానికి వచ్చింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ భేటీ అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా వాణిజ్య బ్యాంకుల మాదిరే ఇకమీదట ఆర్బీఐ పర్యవేక్షణ కిందకు 1,540 పట్టణ కోపరేటివ్, మల్టీ స్టేట్ కోపరేటివ్ (ఒకటికి మించి రాష్ట్రాల్లో పనిచేసేవి) బ్యాంకులు రానున్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 1,482 అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీస్టేట్ కోపరేటివ్ బ్యాంకులు పనిచేస్తుండగా.. వీటి పరిధిలో 8.6 కోట్ల డిపాజిటర్లకు సంబంధించి రూ. 4.85 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎంసీ బ్యాంకులో రుణాల స్కామ్ వెలుగు చూడడంతో ఆర్బీఐ 2019 సెప్టెంబర్ 23న నిషేధం విధించడం తెలిసిందే. దీంతో డిపాజిట్ల ఉపసంహరణపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అదే విధంగా కాన్పూర్‌కు చెందిన పీపుల్స్ కోపరేటివ్ బ్యాంకు డిపాజిట్ల ఉపసంహరణపైనా ఆంక్షలు విధిస్తూ ఆర్బీఐ ఈ నెల మొదట్లో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చిన్న రుణాలపై తగ్గనున్న వడ్డీ భారం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం (పీఎంఎంవై) కింద శిశు రుణ ఖాతాలపై 2% వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది . లాక్‌డౌన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారస్తులకు ఈ నిర్ణయం మేలు చేయనుంది. ముద్రా యోజన పథకం కింద శిశు రుణాల విభాగంలో ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను రూ.50,000 వరకు బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. ఈ రుణాలు తీసుకున్న వారికి వడ్డీలో 2% మేర ఏడాది వరకు రాయితీ లభించనుందని.. దీని కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.1,542 కోట్ల భారం పడుతుందని జవదేకర్ తెలిపారు. 2020 మార్చి నాటికి బకాయిలు చెల్లించాల్సి, నిరర్థక ఆస్తుల(ఎన్పీఏలు) జాబితాలో లేని రుణ ఖాతాలకు ఇది అమలుకానుంది. ఈ పథకం ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు అమల్లో ఉంటుంది. ఆర్బీఐ మారటోరియం (రుణ చెల్లింపుల విరామం) కింద ఉన్న ఖాతాలకు.. మారటోరియం నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి 12 నెలల పాటు (2020 సెప్టెంబర్ 1 నుంచి 2021 ఆగస్ట్ 31 వరకు) వడ్డీ రాయితీ లభిస్తుంది. 2020 మార్చి నాటికి పీఎంఎంవై çపరిధిలోని శిశు విభాగంలో రూ.9.37 కోట్ల రుణ ఖాతాలున్నాయి. దీని కింద విడుదల చేసిన రుణాల మొత్తం రూ.1.62 లక్షల కోట్లుగా ఉంది. రూ. 15 వేల కోట్లతో ‘పశుసంవర్ధక మౌలిక’ నిధి సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీని అనుసరించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ. 15,000 కోట్లతో పశుసంవర్థక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఏహెచ్ఐడీఎఫ్)కి బుధవారం ఆమోదం తెలిపింది. పాడి, మాంసం ప్రాసెసింగ్, విలువ పెంచే మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేటు రంగంలో పశుగ్రాస కర్మాగారాల స్థాపన వంటి మౌలిక సదుపాయాల స్థాపనలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఏహెచ్ఐడీఎఫ్ వీలు కల్పిస్తుంది. ఈ పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారులు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లు, ఎంఎస్ఎంఈలు, సెక్షన్ 8 కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు కనీసం 10% మార్జిన్ మనీతో పెట్టుబడి పెడితే మిగిలిన 90% షెడ్యూల్డ్ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అర్హతగల లబ్ధిదారులకు భారత ప్రభుత్వం 3% వడ్డీ రాయితీని కల్పిస్తుంది. ప్రధాన రుణ మొత్తానికి 2 సంవత్సరాల మారటోరియం ఉంటుంది. నాబార్డ్ నిర్వహించేలా రూ. 750 కోట్లతో మరొక క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎంఎస్ఎంఈ పరిధిలో మంజూరైన ప్రాజెక్టులకు క్రెడిట్ గ్యారంటీ కోసం ఈ నిధిని ఉపయోగిస్తారు. -
ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. దేశంలో అర్బన్ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. అన్ని కో ఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయంతో 1,482 కో ఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రానున్నట్టు చెప్పారు. ఆర్బీఐ పరిధిలోకి తేవడం వల్ల ఆ బ్యాంకుల్లోని 8.6 కోట్ల మంది ఖాతాదారులకు సొమ్ముకు భద్రత కల్పించినట్టు అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మరోవైపు పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ మరింత సులభతరం కానుందని మంత్రి చెప్పారు. ధ్రువీకరణ పత్రాల జాబితాను కుదించినట్టు తెలిపారు. పాస్‌పోర్ట్ జారీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఓబీసీ కులాల వర్గీకరణ కమిటీ గడువు మరో 6 నెలలు పొడిగింపు జనవరి 31, 2021 కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశం పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు ఆమోదం -
‘ఇలా చేయడం మన సంస్కృతి కాదు’
తిరువనంతపురం: కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పేలుడు పదార్థాలు ఉన్న పైనాపిల్‌ను తినిపించి మరణానికి కారణమైన ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ దారుణానికి బాధ్యులైన వారిని ఎవరిని వదలమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించారు. మూగ జీవిని ఇంత దారుణంగా చంపడం భారతీయ సంస్కృతి కాదని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటన మలప్పురంలో జరిగిందని.. ఏనుగు పాలక్కడ్‌లో మృతి చెందిందని జవదేకర్ తెలిపారు. Central Government has taken a very serious note of the killing of an elephant in Mallapuram, #Kerala. We will not leave any stone unturned to investigate properly and nab the culprit(s). This is not an Indian culture to feed fire crackers and kill.@moefcc @PIB_India @PIBHindi — Prakash Javadekar (@PrakashJavdekar) June 4, 2020 ఇదిలా ఉండగా అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేసిన ఓ ఎమోషనల్ నోట్ నెటిజనులను కదిలిస్తోంది. ‘మేము చూసినప్పుడు ఆ ఏనుగు తలను నీటిలో ముంచి నిలబడి ఉంది. చనిపోతున్నట్లు దానికి అర్థమైనట్లుంది. అందుకే నదిలో నిలబడి జలసమాధి అయ్యింది’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాక నొప్పికి తాళలేక వీధుల వెంట పరిగెడుతున్నప్పుడు ఆ ఏనుగు ఒక్కరికి కూడా హానీ చేయలేదని తెలిపారు.(ఇంత ఆటవికమా: రోహిత్ శర్మ) ఏనుగు మృతికి కారణమైన వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్పందిస్తూ.. అమాయక ఏనుగును క్రూరంగా అంతమొందించిన ఘటన తనని కలచివేసిందన్నారు. అమాయక జంతువుల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, శ్రద్ధాకపూర్, రణ్‌దీప్ హుడా డిమాండ్ చేశారు. -
విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కల్లోలంతో ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు చైనా నుంచి పెట్టుబడులను తరలిస్తున్నాయని, ఇన్వెస్ట్మెంట్ విధానాలను పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయని వస్తున్న వార్తలు తాజా నిర్ణయాలకు నేపథ్యం. వాణిజ్య శాఖ ప్రకటన ప్రకారం క్యాబినెట్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలివీ... ► సెక్రటరీలతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాధికార గ్రూప్ (ఈజీవోఎస్) ఏర్పాటు. దీనికి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. ► మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్లలో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విభాగాలు (పీడీసీ)లు ఏర్పాటవుతాయి. పెట్టుబడుల ప్రతిపాదనల అమలు దిశలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆయా అంశాలను సాధికార గ్రూప్ ముందు ఉంచుతాయి. ► ఉన్నతస్థాయి సాధికార గ్రూప్‌లో నీతి ఆయోగ్ సీఈఓ, డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్), వాణిజ్యం, రెవెన్యూ, ఆర్థిక శాఖల కార్యదర్శులు, ఆయా డిపార్ట్మెంట్ల చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఉంటే, డీపీఐఐటీ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ► పెట్టుబడుల ఆకర్షణకు విధానాలు, వ్యూహాల రూపకల్పన, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి విభిన్న మంత్రిత్వశాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి సత్వర, సకాల ఆమోదాలు వచ్చేట్లు చూడ్డం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లకు తగిన ఇన్ఫ్రా ఏర్పాటు సాధికార గ్రూప్ ప్రధాన విధానాలు. ► వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులు, నిర్వహణ విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం నెలకొల్పడం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ (పీడీసీ) ఏర్పాటు ప్రధాన లక్ష్యం. ఒక మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి పీడీసీ ఇన్చార్జ్గా ఉంటారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చేలా చూడ్డం, భూ లభ్యత సమస్యల పరిష్కారం, ఆయా అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సాధికార కమిటీ దృష్టికి తీసుకువెళ్లడం పీసీడీ విధివిధానాలు. పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం భారత్‌లో పెట్టుబడులకు మరింత స్నేహపూర్వక వాతావరణం సృష్టించడానికి తాజా నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని వాణిజ్యశాఖ పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌ను మరింత పటిష్టం చేస్తుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెంచే దిశలో ఈ నిర్ణయం కీలకమైనదని విశ్లేషించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడానికి ఇది ఒక కొత్త యంత్రాంగమనీ అభివర్ణించింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా పలు కంపెనీలు తమ పెట్టుబడుల వ్యూహాలను పునర్వ్యవస్థీకరించుకునే పనిలో ఉన్నాయని సూచించింది. ► డిఫాల్టర్లకు ఊరట... ఐబీసీ సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ (ఐబీసీ) సవరణకు వీలుగా ఒక కీలక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోవిడ్–19 మహమ్మారి కష్టనష్టాల నేపథ్యంలో బకాయిలు చెల్లించలేని వారిపై ఎటువంటి ఇన్సాల్వెన్సీ చర్యలు తీసుకోకుండా వీలుకల్పిస్తూ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసినట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. లాక్డౌన్ విధించిన మార్చి 25 తర్వాత పరిస్థితుల నేపథ్యంలో మొండిబకాయిల (ఎన్పీఏ)పై ఐబీసీ ప్రొసీడింగ్స్‌ను చేపట్టకుండా ఆర్డినెన్స్ తగిన రక్షణను కల్పిస్తుంది. ఇందుకు అనుగుణంగా కోడ్‌లోని 7, 9, 10 సెక్షన్లను సస్పెండ్ చేసినట్లు, సెక్షన్ 10ఏను కొత్తగా ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆరు నెలల పాటు డిఫాల్టర్లపై తాజాగా ఎటువంటి దివాలా ప్రొసీడింగ్స్‌ను చేపట్టడం సాధ్యం కాదు. ఏడాది పాటు దీనిని పొడిగించడానికి సైతం ఆర్డినెన్స్ వీలు కల్పిస్తోంది. -
కరోనా: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను మంత్రి ప్రకాశ్ జవడేకర్ మీడియా ముందు వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకానికి రోడ్ మ్యాప్ రూపొందించామని తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైతులు, ఎంఎస్ఎంఈలను ఆదుకునేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో రైతులు, ఎంఎస్ఎంఈలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. (కరోనా సామర్థ్యం తగ్గిపోయింది) మీడియా సమావేశంలో జవడేకర్ వివరాలను వెల్లడిస్తూ.. ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సరికొత్త అర్థాన్ని ఇచ్చాం. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రూ.50వేలకోట్లు ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాం. ఎంఎస్ఎంఈ రంగానికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు మార్కెట్లో లిస్టింగ్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వీధి వ్యాపారులను ఆదుకునేందుకు సత్వరమే రూ.10 వేలు రుణం ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. రైతులను ఆదుకునేందుకు కిసాన్ క్రెడిట్ కార్డుల పథకం అమల్లోకి తెస్తాం. ఇప్పటికే 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాం’ అని పేర్కొన్నారు. (సీనియర్లకు షాకివ్వనున్న ఇన్ఫోసిస్) ఈ సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘దేశ జీడీపీలో 29% సూక్ష్మ చిన్న పరిశ్రమలదే. ఆరు కోట్ల చిన్న పరిశ్రమలు 11 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాయి. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న చిన్న పరిశ్రమలను స్టాక్ మార్కెట్లో పెడతాం. వాటిలో కొన్ని షేర్లను ప్రభుత్వం కొని వారికి మద్దతు ఇస్తుంది’ అని తెలిపారు. ఇక రైతులు తమ రుణాలను చెల్లించే గడువును ఆగస్ట్ వరకు పొడించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. అలాగే 14 రకాల పంటలకు కనీస ధర కేంద్రం పెంచింది. క్వింటాల్ వరి ధాన్యంపై రూ.53 పెంపుతో.. తాజా ధర రూ.1,868కి చేరింది. పత్తి మద్దతు ధర రూ.260 పెంపుతో క్వింటాల్ పత్తి మద్దతు ధర రూ.5,515కి చేరింది. 2020-21 పంటకు ఇది వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. -
చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
-
ఒక్క ఏడాది.. పెక్కు విజయాలు
గత ఆరేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని విజయవంతమైన మార్గంలో ముందుకు నడిపిస్తున్నారు. వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సరం ఎంతో క్రియాశీలకంగా గడిచింది. ఈ ఏడాదిలో ఆయన పనితీరును మూడు భాగాలుగా విభజించి చూడవచ్చు. మొదటిది దేశాభివృద్ధి దిశగా చారిత్రక జాతీయ కార్యక్రమాలు, రెండవది కోవిడ్ మహమ్మారితో అలుపెరుగని పోరాటం, మూడవది ఆత్మనిర్భర్ భారత్ రూపంలో దేశ భవిష్యత్తుకు పునాది వేయడం. ఆర్టికల్ 370ను రద్దు చేయడం, లడఖ్, జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత భూభాగాల ఏర్పాటు, పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామ మందిరం నిర్మాణం అంశాన్ని వివాదరహితంగా పరిష్కరించడం లాంటి వాటిని జాతీయ, చారిత్రక రాజకీయ విజయాలుగా అభివర్ణించవచ్చు. ఈ నిర్ణయాల తర్వాత కశ్మీర్ పరిస్థితి మెరుగుపడింది. 50 సంవత్సరాల నుంచి మండుతున్న బోడో సంక్షోభాన్ని అంతం చేసే దిశగా జరిగిన సమగ్ర ఒప్పందం దేశ చరిత్రలో మేలి మలుపు. ఫలితంగా సమాజంలో అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నాయి. అదే విధంగా త్రిపుర, భారత ప్రభుత్వం, మిజోరం మధ్య త్రైపాక్షిక ఒప్పందం ద్వారా బ్రూ రియాంగ్ శరణార్థుల సంక్షోభం విజయవంతంగా పరిష్కరించారు. అలాగే ఒక్క సంవత్సరంలో గర్భిణులకు ఆరు నెలల సెలవు లాంటి అతి పెద్ద నిర్ణయాలు సామాజిక సంస్కరణల దిశగా బాటలు వేశాయి. కోవిడ్ మహమ్మారితో పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దీని ద్వారా కలిగే నష్టాన్ని మరింత తగ్గించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్–19తో పోరాటం చేసే విషయంలో అప్పట్లో చాలా విభాగాల్లో మన సామర్థ్యం తక్కువగా ఉండేది. కోవిడ్ మహమ్మారికి ఆస్పత్రులు లేవు. ఇప్పుడు 800 కు మించి ఆస్పత్రులను కలిగి ఉన్నాము. పరీక్షల కోసం ఒకే ల్యాబ్ మాత్రమే ఉండే పరిస్థితి నుంచి 300కు మించి పరీక్ష కేంద్రాలను అభివృద్ధి చేశాం. వ్యక్తిగత రక్షణ దుస్తులు, మాస్క్‌లు, స్వాబ్ స్టిక్‌లు కూడా దిగుమతి అవుతున్నాయి. ఫలితంగా మనందరం ఆత్మనిర్భర్ అవ్వగలిగాం. అంతే కాదు ప్రస్తుతం ఇది మేక్ ఇన్ ఇండియా విజయవంతమైన గాథగా చెప్పుకోవాలి. దేశీయ సామర్థ్యాన్ని మరింత పెంచగలిగాం. ఇప్పుడు భారతదేశంలో వెంటిలేటర్లు ఉత్పత్తి అవుతున్నాయి. 165 డిస్టిలరీ మరియు 962 మంది తయారీ దారులకు హ్యాండ్ శానిటైజర్లను ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్‌లు ఇవ్వడం జరిగింది. ఫలితంగా 87 లక్షల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తి జరిగింది. కరోనా సవాళ్ళను ఎదుర్కొనే పోరాటంలో రాష్ట్రాలు రుణాల బారిన పడకుండా 15 వేల కోట్ల రూపాయల ఆరోగ్య ప్యాకేజీ, రాష్ట్రాల విపత్తు ఉపశమన నిధికి 11 వేల కోట్లు కేటాయించడం జరిగింది. కోవిడ్ పోరాటంలో భాగంగా 3 వేల రైళ్ళు 45 లక్షల మంది వలస కార్మికులను సురక్షితంగా వారి సొంత ప్రాంతాలకు చేర్చాయి. విదేశాల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను విజయవంతంగా తీసుకురాగలిగాం. ప్రధాని మోదీ తమ తొలి ప్రాధాన్యతను పేద ప్రజలకే ఇచ్చారు. తమ మొట్టమొదటి ప్యాకేజీలో 25 కిలోల బియ్యం / గోధుమలు, 5 కిలోల పప్పులు ఉచితంగా (5 నెలలు) అందిస్తూ 80 కోట్ల కుటుంబాలకు ఆహార భద్రత కల్పించారు. ఇప్పటికే ఉన్న నెలకు 5 కిలోల బియ్యం/గోధుమలను అధిక రాయితీతో కిలోకు 2 నుంచి 3 రూపాయలకు అందించే పథకానికి ఇది కొనసాగింపు. అదే విధంగా 5 కోట్ల మంది రేషన్ కార్డులు లేని వారికి ప్రభుత్వం 10 కిలోల బియ్యం/ గోధుమలను, 2 కిలోల పప్పులను 2 నెలల పాటు ఉచితంగా అందించింది. 20 కోట్ల మహిళల జన్‌ధన్ ఖాతాల్లో ఒక్కొక్కరికి 1500 రూపాయల (500 చొప్పున 3 నెలలు) చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో మొత్తం 30 వేల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. 8 కోట్ల కుటుంబాలకు 2 వేల రూపాయల విలువైన 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరిగింది. దాదాపు 9 కోట్ల మంది రైతులకు 2 వేల రూపాయల చొప్పన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 50 లక్షల మంది చిన్న వర్తకులు 10 వేల చొప్పున పొందారు. నిర్మాణ కార్మికుల నిధి నుంచి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు నిధులు అందాయి. వీటన్నింటినీ ఎవరైనా లెక్కిస్తే మన సమాజంలో 10 శాతం మేర ఉన్న అట్టడుగు వర్గాలకు కుటుంబానికి 10 వేల చొప్పున లబ్ధి చేకూరింది. ఈ అభివృద్ధిలో మూడో భాగం ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా ఉన్నతమైన సంస్కరణలు. ఆర్థిక రంగం, మౌలిక వసతులు, వ్యవస్థ, క్రియాశీల జనశక్తి, డిమాండ్ పెంపు అనేవి భారత ఆర్థిక వ్యవస్థకు చెందిన 5 స్తంభాలు. 20 లక్షల కోట్ల రూపాయలతో ప్రకటించిన ఈ ప్యాకేజీ భారతదేశ స్థూల జాతీయోత్పత్తి(జి.డి.పి)లో 10 శాతానికి సమానం. ఇది సమాజంలోని ప్రతి వర్గం మీద దృష్టి పెట్టింది. చిన్న, మధ్యతరహా రుణాలపై 2 శాతం వడ్డీ ఉపసంహరించడం జరిగింది. 63 లక్షల స్వయం సహాయక బృందాలకు 20 లక్షల రూపాయల వరకూ అనుషంగిక ఉచిత రుణాలు లభిస్తాయి. ఈ మొత్తం గతంలో 10 లక్షలకు మాత్రమే పరిమితమై ఉండేది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వచనం కంపెనీలకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా మార్చడం జరిగింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ఎన్.బి.ఎఫ్.సి.లకు కలిపి 4,45,000 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు లక్ష కోట్లు, అదనంగా మత్స్య సంపద అభివృద్ధికి 20 వేల కోట్లు, పశు సంపద సంరక్షణలో భాగంగా టీకాలతో పాటు పాదాలు మరియు నోటి వ్యాధుల చికిత్సల కోసం 15 వేల కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఇందులో మరింత ముఖ్యంగా చెప్పుకోవలసింది 70 వేల కోట్ల రూపాయల క్రెడిట్ లింక్ సబ్సిడీ. ఈ ప్యాకేజీలో అతి పెద్ద సంస్కరణలకు బీజం వేశారు. రక్షణలో స్వావలంబన అనేది ఒక చారిత్రక చొరవగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకూ 100 శాతం ఆయుధ సామగ్రిని దిగుమతి చేసుకుంటున్నాము. కానీ రక్షణ రంగంలో ఎఫ్.డి.ఐ.ని అనుమతించలేదు. కపట సూత్రాల నుంచి శ్రీ నరేంద్ర మోదీ దేశాన్ని బయటకు తీసుకురావడమే గాక, 74 శాతం ఎఫ్.డి.ఐలను రక్షణ ఉత్పత్తుల దిశగా అనుమతి అందించారు. ఏకకాలంలో భారతదేశంలో తయారైన ఆయుధాలకు సంబంధించి రక్షణ విడిభాగాల దిగుమతిని నిషేధించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి లక్ష కోట్ల రూపాయల కల్పన అతి గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఇది నిరుపేదలకు ఉపాధిని కల్పిస్తుంది. వలస కార్మికులు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు అధిక డిమాండ్ ఉంటుంది. గత యు.పి.ఎ. ప్రభుత్వం ఎం.ఎం.ఆర్.ఈ.జి.ఏ. మీద చేసిన ఖర్చు 37 వేల కోట్లు కాగా, గత ఐదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ రికార్డు స్థాయిలో సగటున 55 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు దానిని దాదాపు రెట్టింపు చేసి లక్ష కోట్లకు పెంచడం జరిగింది. పేదలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదే సమయంలో పరిశ్రమలు మరియు పన్ను చెల్లింపు దారులకు లబ్ధి చేకూర్చే దిశగా అనేక రాయితీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. చివరగా ఈ ప్యాకేజీలో మరింత కీలకమైన అంశం వ్యవసాయ రంగంలో చారిత్రక సంస్కరణలు. రైతులకు ఎ.పి.ఎం.సి.ల నుంచి స్వేచ్ఛ కల్పించారు. వారు తాము పండించిన పంట, తమ ఇష్టానుసారంగా ఎక్కడైనా అమ్మే అవకాశం కల్పించారు. వారి పంటను మార్కెట్ చేసుకునేందుకు వారు ఎవరితోనైనా ఒప్పందం కుదుర్చుకోవచ్చు. అత్యవసర వస్తువుల చట్టం అనే రైతు వ్యతిరేక నిబంధనల నుంచి వారికి ఉపశమనం లభించింది. మార్కెట్లో రైతులకు ఎక్కువ ధర లభిస్తున్న నేపథ్యంలో వారి మీద ఎలాంటి పరిమితులు, ఆంక్షలు ఉండవు. ఆత్మ నిర్భర్ ప్యాకేజీ భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇది దూరదృష్టి కలిగిన ఆలోచన. చారిత్రకమైన కేటాయింపు. వివేకవంతమైన నిర్ణయం. ( ఈ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి) వ్యాసకర్త : ప్రకాశ్ జావడేకర్, కేంద్ర పర్యావరణం, అడవులు–సమాచార ప్రసార శాఖల మంత్రి -
రేడియో పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలి
న్యూఢిల్లీ: కోరోనా దెబ్బకు అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేడియో పరిశ్రమ ప్రతినిధులు సమస్యలను ప్రభుత్వానికి నివేదించారు. రేడియో ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, ఎఫ్ఎమ్ చానెల్స్ ప్రతినిధులు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర సమాచార మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖలో వివరించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులను సంవత్సరం పాటు మినహాయించాలని లేఖలో ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ లేఖపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులను వడ్డీ లేకుండా మూడు నెలలు పొడిగించనున్నట్లు తెలిపింది. కోరోనా కారణంగా రేడియా పరిశ్రమ ఏప్రిల్‌లో 80శాతం నష్టపోగా.. మే నెలలో 90శాతం నష్టపోయిందని ప్రతినిధులు వాపోయారు. లక్షలాది మందికి ఉపాధి కల్సిస్తున్న రంగంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం పరిశ్రమ 200కోట్ల నష్టాలను చవిచూసిందని.. సెప్టెంబర్ నాటికి 600 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చదవండి: జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలి : కేంద్ర మంత్రి -
‘కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనం’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తీరుపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మరోసారి విమర్శలు గుప్పించారు. భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ విఫలమైందన్న రాహుల్ గాంధీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. యావత్ దేశం ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సరైన సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారని ప్రపంచ దేశాలు మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించాయని గుర్తు చేశారు. కరోనా తొలినాళ్లలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో మూడు రోజులుగా ఉన్న కేసుల డబ్లింగ్ రేటు.. 13 రోజులకు పెరిగిందని వెల్లడించారు. ఇది భారత్ విజయమని అన్నారు. (చదవండి: లాక్డౌన్ విఫలం: ప్లాన్ బి ఏంటి..!) ‘తొలుత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని వ్యాఖ్యానించింది. ఇప్పుడేమో లాక్డౌన్ సడలింపులు ఇస్తే.. ఆ నిర్ణయం సరైంది కాదని చెప్తోంది. ఇక్కడే తెలుస్తోంది. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి’ అని జవదేకర్ విమర్శించారు. ‘అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఇరాన్, బ్రెజిల్, చైనాతో పోలిస్తే భారత్‌లో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉంది. సరైన సమయంలో లాక్డౌన్ విధించారని ఆయా దేశాలు కేంద్రం నిర్ణయాన్ని కొనియాడారు’ అని పేర్కొన్నారు. వలస కార్మికుల తరలింపునకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని జవదేకర్ తెలిపారు. ఇప్పటికే మూడు వేళ ప్రత్యేక రైళ్లలో మూడు లక్షల మందిని స్వస్థలాలకు చేర్చామని చెప్పారు. (సోనియాజీ..చిల్లర రాజకీయాలు తగదు..) -
‘విపత్తు వేళ చౌకబారు రాజకీయాలు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక వైరస్‌పై పోరాడాల్సిన సమయంలో మత విద్రోహ వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలను పాలక బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడరాదని హితవు పలికింది. తాము మతపరమైన విభజనలను సృస్టించలేదని..కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుతున్నామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడరాని విజ్ఞప్తి చేస్తున్నామని, విపత్తు వేళ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడరాదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వైరస్‌పై పోరాడాల్సిన సమయంలో బీజేపీ మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మన సామాజిక సామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని..ఈ నష్టాన్ని పూడ్చేందుకు తమ పార్టీ కష్టించి పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు పార్టీ అగ్రనేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చదవండి : 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.. -
ఏడేళ్ల జైలు.. 5 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. కోవిడ్‌పై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, ఇతర పారామెడికల్ సిబ్బందిపై దాడులు చేస్తే తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని జవదేకర్ వివరించారు. ఆస్తి నష్టం జరిగితే, ఆ ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు వసూలు చేస్తామన్నారు. కోవిడ్–19కు చికిత్స అందించే లేదా కరోనా వ్యాప్తిని నిర్ధారించే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది తమతో పాటు కరోనా వైరస్‌ను తీసుకువస్తున్నారనే అనుమానంతో వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానులు, స్థానికులు ఆయా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా ఈ చట్టం కింద కఠిన చర్యలుంటాయన్నారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎపిడమిక్ డిసీజెస్ చట్టం, 1897కు సవరణలు చేస్తామన్నారు. కరోనా విపత్తు ముగిసిన అనంతరం కూడా ఈ చట్టంలోని నిబంధనలను కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు పూర్తి వివరణ ఇవ్వకుండా.. ‘ఎపిడమిక్ చట్టానికి సవరణ చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ ఇది, అయితే, ఇది మంచి ప్రారంభం’అని మాత్రం వ్యాఖ్యానించారు. కోవిడ్–19పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ. 50 లక్షల బీమా కల్పిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని జవదేకర్ గుర్తు చేశారు. కరోనా పేషెంట్ల కోసం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.86 లక్షల బెడ్స్, 24 వేల ఐసీయూ బెడ్స్‌తో 723 కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామన్నారు. రూ. 15 వేల కోట్ల ప్యాకేజీ కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం రూ. 15 వేల కోట్లతో ‘ఇండియా కోవిడ్–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజ్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ మొత్తంలో రూ. 7,774 కోట్లను ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ కింద వినియోగించాలని, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి నాలుగేళ్లలో ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. కోవిడ్‌చికిత్సకు వాడే వైద్య పరికరాలు, ఔషధాలను సమకూర్చుకోవడంతో ఇతర అత్యవసరాల కోసం, ప్రత్యేక లాబొరేటరీలు, పరిశోధనశాలల ఏర్పాటుకూ నిధులు వాడతారు. ప్యాకేజీ కింద అదనంగా, రూ. 3 వేల కోట్లను ప్రస్తుతమున్న వైద్య సదుపాయాలను కోవిడ్ వైద్య కేంద్రాలుగా ఆధునీకరించడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే అందజేశారు. ‘ల్యాబొరేటరీ నెట్‌వర్క్‌ను విస్తరించాం. రోజువారీ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. 13 లక్షల టెస్టింగ్ కిట్స్ కోసం ఆర్డర్ పెట్టాం’ అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భద్రతలో రాజీలేదు: మోదీ కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందికి భద్రత కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తాజాగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్పష్టం చేస్తుందన్నారు. ప్రతీ ఆరోగ్య కార్యకర్తకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ట్వీట్ చేశారు. -
వైద్యులపై దాడిచేస్తే ఏడేళ్ల జైలు
-
వైద్యుల రక్షణకు ఆర్డినెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను బుధవారం కేంద్ర కేబినెట్ తీవ్రంగా పరిగణించింది.వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. 1897 ఎపిడెమిక్ చట్టంలో మార్పులు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్ అమల్లో ఉండనుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ అనంతరం మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాడులకు పాల్పడితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని, నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వైద్యులపై దాడులకు పాల్పడేవారికి రూ లక్ష నుంచి రూ ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తామని చెప్పారు. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్ విలువ కంటే రెండింతలు వసూలు చేస్తామని అన్నారు.డాక్టర్లు, వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బందికి రూ 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. 50 లక్షల మాస్క్‌లకు ఆర్డరిచ్చామని, వైద్య పరికరాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మే 3 వరకూ విధించిన లాక్డౌన్ అమలు తీరుతెన్నులను కేంద్ర మంత్రివర్గం సమీక్షించిందని చెప్పారు. లాక్డౌన్ నియమ నిబంధనలు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును పర్యవేక్షించామని తెలిపారు. చదవండి : 'కరోనాపై పోరులో మీడియా ప్రముఖ పాత్ర' -
జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలి : కేంద్ర మంత్రి
ముంబై : దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ర్టలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా 50 మంది జర్నలిస్టులకు కూడా వైరస్ సోకిన నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. ‘‘50 మంది జర్నలిస్టులు, ముఖ్యంగా కెమెరామెన్ లు ముంబైలో కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించడం ఆశ్చర్యకరం. విధినిర్వహణలో ప్రతీ జర్నలిస్ట్ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి’’అని కేంద్రమంత్రి జవదేకర్ అన్నారు.అత్యవసర విభాగంలాంటి మీడియాలో పనిచేస్తున్న వారు నిర్విరామంగా ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. అంతేకాకుండా రెడ్‌జోన్లలాంటి ప్రాంతాల్లో ఫీల్డ్ రిపోర్టింగ్ చేస్తూ ప్రజలకు సమాచారం అందించడంలో ముందుంటారు. ఈ నేపథ్యంలో మహారాష్ర్టలో 50 మంది జర్నలిస్టులకు కరోనా సో్కింది. దీంతో వారు సన్నిహితంగా మెలిగిన మిగతావారిని కూడా క్వారంటైన్లో ఉంచారు. -
రేపటి ప్రకటనలో మోదీ వెల్లడిస్తారు: జవదేకర్
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరులో లాక్డౌన్ పొడిగింపు గేమ్ ఛేంజర్ వంటిదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మార్చి 24 అర్ధరాత్రి విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా లాక్డౌన్ అమలుకు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈరోజు ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం... కరోనా వైరస్ నుంచి దేశాన్ని కాపాడేందుకు శ్రమిస్తున్న నాయకుడి అంకిత భావాన్ని ప్రతిబింబించింది. ప్రతీ పౌరుడి పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ, సున్నిత అంశాల్లో వ్యవహరించే తీరు నాయకత్వ ప్రతిభకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు. (మే 3 వరకు లాక్డౌన్ : మోదీ) ఇక లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత అనుసరించాల్సిన విధానాలపై ప్రధాని మోదీ ప్రణాళిక సిద్ధం చేశారని.. ఈ అంశాల గురించి బుధవారం కీలక ప్రకటన చేస్తారని జవదేకర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు విధిగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే కరోనాపై యుద్ధంలో గెలుస్తామని పేర్కొన్నారు. ఎన్నో దేశాలు కరోనాను జయించలేకపోయాయని.. అయితే ప్రజల మద్దతుతో భారత్ ఈ పోరులో విజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా మహమ్మారి కరోనాకు త్వరగా విరుగుడు కనిపెట్టాలని జవదేవర్ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు విజ్ఞప్తి చేశారు. కాగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏప్రిల్ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలించి.. తదనుగుణంగా బుధవారం నిబంధనలు జారీ చేస్తామని వెల్లడించారు.(కరోనా కట్టడికి 7 సూత్రాలు చెప్పిన మోదీ) -
ఇంట్లోనే సులువుగా మాస్కు తయారీ
-
'కరోనాపై పోరులో మీడియా ప్రముఖ పాత్ర'
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. ఈ సందర్భంగా మీడియాలోకేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటంలో వైద్యులు, నర్సులు, పోలీస్ సిబ్బంది మాదిరిగానే మీడియాలో పనిచేసే వారు కూడా ముందు వరుసలో ఉన్నారన్నారు. కరోనాపై పోరులో పాత్రికేయులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే సంబంధిత శాఖల నుంచి సరైన సమాచారం లేకుండా కరోనా వైరస్‌కు సంబంధించిన వార్తలను ప్రచురించడం కానీ, టీవీలలో చూపించడం కానీ చేయొద్దని సూచించారు. ఇక తాజాగా ప్రధాని దేశ ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా.. ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశం ఆర్థిక వ్యవస్థ ముఖ్యమే అని సూచించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్రమంత్రులంతా సోమవారం రోజున తమ కార్యాలయాలకు వచ్చి వారి పనుల్లో నిమగ్నమవ్వడం విశేషం. కాగా.. భారత్‌లో ఇప్పటిదాకా 9,152 కేసులు నమోదుకాగా, గడిచిన 24 గంటల్లో 796 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. చదవండి: పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్ -
ఎంపీల వేతనాల్లో 30% కోత
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30% కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్–1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా, తమ వేతనాల్లో కొంత భాగాన్ని కరోనాపై పోరుకు వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. సాయం అందించడం మన నుంచే ప్రారంభం కావాలన్న నానుడిని ఈ సందర్భంగా జవదేకర్ ఉటంకించారు. ఎంపీల వేతనానికి, ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల వేతనాలకు తేడా ఉంటుంది. ఎంపీలు నెలకు సుమారు రూ. లక్ష వేతనంతో పాటు, రూ. 70 వేలను నియోజకవర్గ అలవెన్స్‌గా పొందుతారు. మంత్రుల వేతనం కూడా దాదాపు అంతే ఉంటుంది కానీ వారికి వేరే అలవెన్సులు కూడా ఉంటాయి. అయితే, ఈ కోత వేతనానికే అని, పెన్షన్, ఇతర అలవెన్సుల్లో ఈ కోత ఉండబోదని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఆ తరువాత వివరణ ఇచ్చారు. ఎంపీల్యాడ్(ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్) ఫండ్ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల(2020–21, 2021–22) పాటు నిలిపివేయనున్నారు. ఈ మొత్తాన్ని కూడా కోవిడ్–19పై పోరుకు వినియోగిస్తారు. లోక్‌సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. ఈ మొత్తం 788 మంది ఎంపీలకు ఎంపీల్యాడ్స్ కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఇస్తారు. రెండేళ్లకు గానూ ఈ మొత్తం దాదాపు రూ. 7,880 కోట్లు అవుతుంది. అలాగే, ఎంపీల వేతనాల్లో కోత ద్వారా ఏటా రూ. 29 కోట్లు కరోనాపై పోరాటానికి జమ అవుతాయి. వేతనాల్లో కోత ద్వారా కోల్పోయే మొత్తం ఎంపీలకు పెద్ద సమస్య కాబోదు కానీ, ఎంపీల్యాడ్స్‌ను కోల్పోవడంతో నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎంపీల వేతనాల్లో కోత నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. అయితే, ఎంపీల్యాడ్స్‌పై నిర్ణయానికి సంబంధించి పునరాలోచించాలని కోరింది. -
మరోసారి ‘రామాయణ్’
న్యూఢిల్లీ: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జీవితగాథ ఆధారంగా తీసిన రామాయణ్ ధారావాహిక మరోసారి దేశవ్యాప్తంగా ప్రజలను అలరించనుంది. ఈ సీరియల్‌ను ఈనెల 28వ తేదీ నుంచి దూరదర్శన్ డీడీ నేషనల్ చానెల్లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దేశమంతా కరోనా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించామన్నారు. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను దూరదర్శన్‌లో చూడొచ్చని శుక్రవారం ట్విట్టర్లో ప్రకటించారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్‌లో రామాయణ్ ప్రసారమైంది. -
బారులు తీరిన పౌరులు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇచ్చిన మూడు వారాల దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన కొన్నిచోట్ల ప్రజలు కిరాణా కొట్ల ముందు బారులు తీరేలా చేసింది. దేశం మొత్తమ్మీద కోవిడ్ బాధితుల సంఖ్య బుధవారానికి 612 దాటిపోగా, పది మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 40 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో మరో వ్యక్తి కోవిడ్‌కు బలికాగా, తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం నమోదైంది. మంగళవారం ఢిల్లీలో ఒక వ్యక్తి ఇతర కారణాల వల్ల మరణించినా కోవిడ్ మరణాల జాబితాలో చేర్చారు. తాజాగా ఈ తప్పును సవరించడంతో మొత్తం మరణాల సంఖ్య పది అయ్యింది. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేయగా.. మందులు, నిత్యావసరాలను అమ్మే దుకాణాలు లాక్డౌన్ సమయంలోనూ తెరిచే ఉంటాయని మంత్రి జవడేకర్ తెలిపారు. మిలటరీ ఆసుపత్రులు సిద్ధం ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతోపాటు కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన 32 ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం కేంద్రం సిద్ధంచేస్తోంది. వీటిద్వారా సుమారు 2000 వరకూ పడకలు అందుబాటులోకి రానుండగా హిమాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు వేల గదులను ఐసోలేషన్ కేంద్రంగా మార్చేందుకు హమీర్పూర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రులు గ్రేటర్ నోయిడా, హైదరాబాద్, గువాహటి, జమ్మూ, గ్వాలియర్‌లోని టేకన్పూర్, డిమాపూర్, ఇంఫాల్, నాగ్‌పూర్, సిల్చార్, భోపాల్, అవడి, జోధ్‌పూర్, కోల్‌కతా, పుణె, బెంగళూరులతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర రోగాలతో వచ్చే రోగులను చేర్చుకోవడాన్ని నిలిపివేయగా పరిస్థితి చక్కబడ్డ వారిని డిశ్చార్జ్ చేస్తూ ఐసోలేషన్ కేంద్రం కోసం వీలైనన్ని పడకలను అందుబాటులోకి తెస్తున్నారు. మందులు నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి : జవదేకర్ మూడు వారాల లాక్డౌన్ సమయంలోనూ దేశం మొత్తమ్మీద నిత్యావసర, మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, బ్లాక్‌మార్కెటింగ్ చేసేవారిపై, అక్రమంగా నిల్వ చేసే వారిని కట్టడి చేసేందుకు తగిన చట్టాలు ఉన్నాయని అన్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. హౌసింగ్ సొసైటీలు కొన్ని వైద్యులను, జర్నలిస్టులను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా చెప్పడం ఏమాత్రం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమాజం పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. స్వస్థత చేకూరిన వారికి స్వాగతం పుణేలో బుధవారం ఒక హృద్యమైన సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తరువాత స్వస్థత చేకూరిన దంపతులను వారు నివాసముండే హౌసింగ్ సొసైటీ సాదరంగా స్వాగతం పలికింది. సిన్హ్గఢ్ రోడ్డులో ఉండే ఈ సొసైటీలోని కుటుంబాలన్నీ బాల్కనీల్లో నుంచుని చప్పట్లతో ప్లేట్లతో శబ్దాలు చేస్తూ 51 ఏళ్ల పురుషుడు, 43 ఏళ్ల మహిళకు స్వాగతం పలికారు. కోవిడ్ పరిస్థితి స్థూలంగా.. దేశం మొత్తమ్మీద బుధవారం ఉదయం నాటికి మొత్తం 612 కోవిడ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 109 కేసులు ఉండగా ఇందులో ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో ముగ్గురు విదేశీయులు సహా 116 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 41 మంది కోవిడ్ బాధితులు ఉంటే. తెలంగాణలో ఈ సంఖ్య 35 (10 మంది విదేశీయులు)గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 35 మంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 31 కాగా. తమిళనాడులో 18, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది చొప్పున కోవిడ్ బారిన పడ్డారు. -
ప్రత్యేక రేషన్ అందిస్తాం: జవదేకర్
-
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టిందని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. లాక్డౌన్ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా త్వరలో జిల్లాల వారీగా హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. 80 కోట్ల మందికి ప్రత్యేక రేషన్ ద్వారా రూ 3 కే కిలో బియ్యం, రూ 2 కే కిలో గోధుమలు సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయని, పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచిఉంటాయని తెలిపారు. ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ భరోసా ఇచ్చారు. ఇక మహమ్మారి వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు మూడు వారాల పాటు దేశమంతటా లాక్డౌన్ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకూ దేశమంతటా లాక్డౌన్ అమల్లో ఉంటుంది. దీంతో అత్యవసర సేవలు మినహా దేశమంతా షట్‌డౌన్‌లోకి వెళ్లింది. చదవండి : ఐదు రోజులుగా హౌరా స్టేషన్లోనే.. -
అద్దె గర్భానికి ఆమోదం
-
అద్దె గర్భాల బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు–2020పై బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లు స్పష్టం చేసింది. సరోగసీపై గతంలోని ముసాయిదా బిల్లులన్నింటినీ అధ్యయనం చేసి రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన సూచనలు అన్నింటినీ తాజా బిల్లులో పొందుపరిచినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో చెప్పారు. సరోగసీని వాణిజ్యానికి వాడకుండా నిరోధించడం, మంచి ఉద్దేశమైతే సరొగసీకి సహకరించడం ఈ కొత్త బిల్లు లక్ష్యాలని మంత్రి చెప్పారు. కొత్త బిల్లు ప్రకారం.. దేశంలో భారత్‌కు చెందిన దంపతులు మాత్రమే సరోగసి చేపట్టేందుకు వీలుంటుందని మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అబార్షన్ మొదలుకొని సరోగసి వరకూ వేర్వేరు అంశాల్లో మహిళల హక్కులపై ప్రధాని మోదీ విశాల దృక్పథంతో వ్యవహరిస్తున్నారని ఆమె చెప్పారు. సరోగసీ చట్టాలను సవరిస్తూ గత ఆగస్టులో లోక్‌సభ ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. అయితే దగ్గరి బంధువులే అద్దెకు గర్భాన్ని ఇవ్వొచ్చనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీంతో బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని కమిటీ సరోగసీకి సంబంధించి అన్ని వర్గాల వారితోనూ చర్చించి బిల్లులో సవరణలను ప్రతిపాదించింది. సూచనలు చేసింది. వీటిని పొందుపరిచిన బిల్లును బుధవారం కేబినెట్ ఆమోదించగా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే వీలుంది. కశ్మీర్లో కేంద్ర చట్టాల అమలుకు ఆదేశాలు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉమ్మడి జాబితాలోని 37 కేంద్ర చట్టాలు అమలు చేసే ఆదేశాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత ఆగస్టులో అవిభక్త కశ్మీర్ రాష్ట్రానికున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదా(ఆర్టికల్ 370)ను రద్దుచేసి రాష్ట్రాన్ని ‘జమ్మూకశ్మీర్’, ‘లడాక్’ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే. దేశం మొత్తానికి అన్వయించే కేంద్ర చట్టాలు (జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి) ఇకపై ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకూ వర్తిస్తాయని అప్పట్లో ఒక ప్రకటన వెలువడింది. కేంద్రం ఆమోదంతో జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. బుధవారం నాటి కేంద్ర కేబినెట్ సమావేశంలో హరియాణా, తమిళనాడుల్లో రెండు ఆహార సంబంధిత సంస్థలకు జాతీయ స్థాయి కల్పిస్తూ నిర్ణయం జరిగింది. ఇందుకు అనుగుణంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్,మేనేజ్మెంట్ చట్టానికి సవరణలు చేశామని జవదేకర్ తెలిపారు. జాతీయ స్థాయి గుర్తింపు తర్వాత ఆ సంస్థలు విదేశీ సంస్థల నుంచి నేరుగా సాయం పొందొచ్చు. బిల్లులోని ముఖ్యాంశాలు కేంద్రం, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిల్లో జాతీయ సరోగసీ బోర్డుల ఏర్పాటు ► అద్దెకు గర్భాన్ని ఇచ్చే మహిళకు చేసే బీమా మొత్తాన్ని 36 నెలలకు పెంచారు. ► మానవ పిండాలు, గామేట్స్ (బీజం) కొనుగోలు, విక్రయాలపై నిషేధం. నైతిక సరోగసికి మాత్రమే అనుమతి. భారతీయ దంపతులు, భారతీయ సంతతి దంపతులు, 35–45 ఏళ్ల వితంతు మహిళ లేదా విడాకులు పొందిన మహిళలకే సరోగసి అనుమతి లభిస్తుంది. -
సోనియాగాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరం
-
పన్నుల పరిష్కార పథకం పరిధి పెంపు...
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ’వివాద్ సే విశ్వాస్’ పథకం పరిధిని విస్తరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్టీ) ఉన్న పెండింగ్ కేసులను కూడా ఇందులోకి చేర్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2019 నవంబర్ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి. సంబంధిత వర్గాల సిఫార్సులకు అనుగుణంగా వివాద్ సే విశ్వాస్ బిల్లుకు కొత్త సవరణలను ప్రస్తుత పార్లమెంటు సెషన్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఈ బిల్లు ప్రకారం పథకాన్ని ఎంచుకున్న వారు.. మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. మరోవైపు, 12 ప్రధాన పోర్టులకు స్వయంప్రతిపత్తినిచ్చే దిశగా 1963 నాటి చట్టం స్థానంలో కొత్త మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు 2020కి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాన పోర్టుల సామర్థ్యాన్ని, పోటీతత్వా న్ని పెంచేందుకు ఇది తోడ్పడనుంది. ప్రస్తుత పార్ల మెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. -
రిషికొండ బీచ్‌కు మహర్దశ.. 'బీమ్స్' ప్రాజెక్టులో చోటు
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నంలోని రిషికొండ బీచ్‌కు మహర్దశ పట్టబోతోంది. దేశంలోని 13 బీచ్‌లను అంతర్జాతీయ స్థాయి బీచ్‌లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘బీచ్ ఎన్విరాన్మెంట్ & ఈస్థటిక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్’ (బీమ్స్) ప్రాజెక్ట్‌లో రిషికొండ బీచ్‌కు చోటు దక్కినట్లు పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ప్రాచీన కోస్తా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణహిత బీచ్‌లుగా పర్యాటకలను ఆకర్షించే బీచ్‌లను రూపొందించడం బీమ్స్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. దేశంలోని కోస్తా తీరం కలిగిన రాష్ట్రాలలోని 13 బీచ్‌లను ఈ కార్యక్రమం కోసం గుర్తించినట్లు ఆయన చెప్పారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని రిషికొండ బీచ్ ఒకటి అని అన్నారు. బీమ్స్ కార్యక్రమం కింద చేపట్టే బీచ్‌ల అభివృద్ధిలో భాగంగా బీచ్ పర్యాటకుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తారన్నారు. పర్యాటకుల కోసం బీచ్‌లో పర్యావరణహితమైన బయో టాయిలెట్ల నిర్మాణం, ఆధునిక స్నానాల గదులు, శుద్ధి చేసిన తాగు నీరు, పాత్‌వేస్, సీటింగ్ సౌకర్యాలు, గొడుగుల కింద కూర్చోవడానికి వీలుగా చెక్క కుర్చీలు, పిల్లల ఆట స్థలాలు, ఫిట్నెస్ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, క్లాక్ రూమ్ సౌకర్యం, వాహనాల పార్కింగ్ స్థలం, బీచ్ లేఔట్, సైనేజ్‌లు వంటి సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే బీచ్‌లో గార్డెనింగ్, టాయిలెట్లలో ఫషింగ్ కోసం నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడానికి వీలుగా గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నెలకొల్పుతారు. బయో-వేస్ట్‌ను శుద్ధిచేయడానికి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ను, విద్యుత్ అవసరాల కోసం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే బీచ్ ప్రాంతమంతా సీసీటీవీ నిఘాలో ఉంటుందని, బీచ్ పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా గార్డులు ఉంటారన్నారు. వీటికి తోడు భద్రత కోసం వాచ్ టవర్లు, తగినంత భద్రతా సామాగ్రితో లైఫ్ గార్డులను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని మంత్రి చెప్పారు. -
అలీ @ కలామ్
భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ బయోపిక్ హాలీవుడ్లో తెరకెక్కుతోంది. కలామ్ పాత్రను నటుడు అలీ పోషిస్తున్నారు. పప్పు సువర్ణ నిర్మాణంలో జగదీష్ దానేటి, జానీ మార్టిన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆదివారం ఢిల్లీలో విడుదల చేశారు. ‘‘సినీ జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. కలామ్గారితో ఫొటో దిగితే చాలనుకున్నాను. ఆయన బయోపిక్‌లో నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు అలీ. ‘‘అలీగారికి ఇది 1,111వ చిత్రం. ఈ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు’’ అన్నారు జగదీష్ దానేటి. -
‘కేజ్రీవాల్ ఓ టెర్రరిస్ట్’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అని నిరూపించేందుకు పలు ఆధారాలున్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. తాను టెర్రరిస్టునా అంటూ కేజ్రీవాల్ అమాయకుడిలా ఢిల్లీ ప్రజలను అడుగుతున్నారని, అందుకు సమాధానం ఆయన టెర్రరిస్టేనని అన్నారు. గతంలో తాను అరాచకవాదినని కేజ్రీవాల్ స్వయంగా చెప్పుకున్నారని, అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్ద వ్యత్యాసమేమీ లేదని జవదేకర్ అన్నారు. కాగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ఈ తరహా భాషను వాడిన జవదేకర్‌పై చర్యలు చేపట్టాలని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈసీని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అయితే ఆయనను అరెస్ట్ చేయాలని సంజయ్ సింగ్ బీజేపీని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో ఈసీ కొలువుతీరిన ప్రాంతంలోనే కేంద్ర మంత్రి ఇలాంటి భాషను వాడటాన్ని ఎలా అనుమతిస్తారని సింగ్ ప్రశ్నించారు. కాగా ఆప్ తన పార్టీని ముస్లిం లీగ్ అని మార్చుకుంటే మంచిదని అంతకుముందు బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆప్‌కు హితవు పలికారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం ఆప్ టెర్రరిస్టులను వెనకేసుకొస్తోందని ఆరోపించారు. చదవండి : ఏపీకి తప్పకుండా న్యాయం జరుగుతుంది -
ఏపీకి తప్పకుండా న్యాయం జరుగుతుంది
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రెండూ వేరువేరు అంశాలన్నారు. ఆర్టికల్ 371 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ను యూటిగా చేశామని పేర్కొన్నారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చాలా బాగుందన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ దశబ్దానికి తొలి బడ్జెట్ అంటూ కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే భీమాను రూ. 5లక్షలకి పెంచడం సామాన్యులకు ఇచ్చిన బహుమతిగా పేర్కొన్నారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) చదవండి : కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి