తిరువనంతపురం: కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పేలుడు పదార్థాలు ఉన్న పైనాపిల్‌ను తినిపించి మరణానికి కారణమైన ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ దారుణానికి బాధ్యులైన వారిని ఎవరిని వదలమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించారు. మూగ జీవిని ఇంత దారుణంగా చంపడం భారతీయ సంస్కృతి కాదని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటన మలప్పురంలో జరిగిందని.. ఏనుగు పాలక్కడ్‌లో మృతి చెందిందని జవదేకర్ తెలిపారు.
Central Government has taken a very serious note of the killing of an elephant in Mallapuram, #Kerala. We will not leave any stone unturned to investigate properly and nab the culprit(s). This is not an Indian culture to feed fire crackers and kill.@moefcc @PIB_India @PIBHindi
— Prakash Javadekar (@PrakashJavdekar) June 4, 2020
ఇదిలా ఉండగా అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసిన ఓ ఎమోషనల్ నోట్ నెటిజనులను కదిలిస్తోంది. ‘మేము చూసినప్పుడు ఆ ఏనుగు తలను నీటిలో ముంచి నిలబడి ఉంది. చనిపోతున్నట్లు దానికి అర్థమైనట్లుంది. అందుకే నదిలో నిలబడి జలసమాధి అయ్యింది’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాక నొప్పికి తాళలేక వీధుల వెంట పరిగెడుతున్నప్పుడు ఆ ఏనుగు ఒక్కరికి కూడా హానీ చేయలేదని తెలిపారు.(ఇంత ఆటవికమా: రోహిత్ శర్మ)
ఏనుగు మృతికి కారణమైన వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్పందిస్తూ.. అమాయక ఏనుగును క్రూరంగా అంతమొందించిన ఘటన తనని కలచివేసిందన్నారు. అమాయక జంతువుల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, శ్రద్ధాకపూర్, రణ్‌దీప్ హుడా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment