![Using New Technology To Decompose The Remaining Waste In The Fields - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/2/Using.jpg.webp?itok=_0KbSdHJ)
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఇరుగుపొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట కోత తర్వాత పొలంలో మిగిలిన పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఆయా రాష్ట్రాలు దట్టమైన కాలుష్యంతో నిండిపోయేవి. పూసా అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ ఈ ఏడాది, మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే డీకొంపోజ్ చేయడానికి నూతన సాంకేతికతని అభివృద్ధిపరిచిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు, ఈ సీజన్‌లో మిగిలిపోయిన పంటవ్యర్థాలను తగులబెడితే వచ్చే కాలుష్యాన్ని ఎదుర్కొనే సంసిద్ధత గురించి ఈ సమావేశంలో చర్చించారు. గత మూడు సంవత్సరాలుగా వ్యర్థాల దహనం తగ్గినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి మున్ముందు మరిన్ని చర్యలు అవసరమని జవదేకర్ అన్నారు. ఈ వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,700 కోట్లు కేటాయించింది.వీటిలో వ్యర్థాల అదుపు చేయడానికి ప్రస్తుతం, వ్యక్తులకు 50 శాతం, సహకార సంఘాలకు 80 శాతం ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment