wastage
-
‘అమ్మో’ అన్నవారే ‘ఆహా’ అంటున్నారు! ఇతిషా మహిమే!
అస్సాంలోని గౌహతికి చెందిన ఇతిషా సారా పుణెలోని ‘సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో చదువుకుంది. దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ‘సోషల్ డిజైన్’ కోర్సు చేసింది. ‘ఈ కోర్సు వల్ల తరగతి బయట అడుగు పెట్టడానికి, ప్రజలతో నేరుగా మాట్లాడడానికి, రోజువారీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి నాకు అవకాశం వచ్చింది’... గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఇతిషా.తన పరిశోధన అంశానికి ఈ–వ్యర్థాలను ఎంచుకుంది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై పరిశోధనలు చేసిన వారు తక్కువ. ఈ–వ్యర్థాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవడంతో పాటు దిల్లీ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైకిలింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి పరిశీలించేది. ఈ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఎన్నో విషయాల గురించి అవగాహన చేసుకుంది. ‘రీసైకిలింగ్’పై ఇతిషాకు ఉన్న అవగాహన సాంగ్టీని మార్చడానికి ఉపయోగపడింది.అరుణాచల్‌ప్రదేశ్‌లోని సాంగ్టీలో అద్దె ఇంట్లో ఉంటూ, హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణ స్పృహను రేకెత్తించ డానికి గ్రామస్తులతో కలిసి పనిచేసింది. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండకుండా ఒకేచోట ఉండేలా వెదురుతో ప్రత్యేక నిర్మాణాలు చేయించింది.కమ్యూనిటీల నిర్వహణలోని ‘వేస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్’ లతో సాంగ్టీ ప్రాంతంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ గ్రూప్‌లు స్థానిక సంస్కృతి, సాహిత్యాలను ప్రతిబింబించే మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న కాలంలో కోవిడ్ దెబ్బతో పరిసరాల పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్ మూలన పడ్డాయి. లాక్డౌన్ తరువాత ఈ ప్రాంతానికి తిరిగి వచ్చిన ఇతిషా వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో కమ్యూనిటీ గ్రూప్‌లలో ఉత్సాహవంతులైన కొత్త సభ్యులను చేర్చుకున్నారు.ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణను పర్యవేక్షించేందుకు నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వంతుల వారీగా వ్యర్థాలను సేకరించి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ(ఎంఆర్ఎఫ్) సెంటర్లకు తరలిస్తారు. ఒకప్పుడు సాంగ్టీ పేరు వినబడగానే ‘బాబోయ్’ అనుకునేవారు. ఇప్పుడు అలాంటి గ్రామం ‘జీరో వేస్ట్ విలేజ్’గా మారి ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిని ఇస్తోంది. వారిలో ఒకరిగా...అప్పుడప్పుడూ వస్తూ, పోతూ పని చేయడం కంటే సాంగ్టీలోనే ఉండి పనిచేయాలనుకున్నాను. ఆ గ్రామస్థులలో ఒకరిగా కలిసి పనిచేయడం వల్ల అందరూ సహకరించారు. నన్ను వారిలో ఒకరిగా చూసుకున్నారు. ‘జీరో వస్ట్ విలేజ్’గా సాంగ్టీని నిలబెట్టే క్రమంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనకడుగు వేయలేదు. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రతి ఇంటిలో అవగాహన కలిగించడంలో విజయం సాధించాం. - ఇతిషా సారా View this post on Instagram A post shared by Northeast Waste Collective (@northeastwastecollective) -
తక్కువ ధరకు ఫుడ్.. జొమాటో కొత్త ఫీచర్
ఆహార వృధాను పూర్తిగా అరికట్టడానికి ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పూనుకుంది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృధా సమస్య పరిష్కారానికి ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో కోఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటించారు.కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఆ ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు 4 లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ ఫుడ్ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఈ కొత్త చొరవను ప్రారంభించేలా ప్రేరేపించింది."జొమాటోలో ఆర్డర్ క్యాన్సిల్‌ను ప్రోత్సహించము. ఎందుకంటే ఇది విపరీతమైన ఆహార వృధాకి దారి తీస్తుంది. కఠినమైన విధానాలు, క్యాన్సిల్ కోసం నో-రీఫండ్ పాలసీ ఉన్నప్పటికీ, పలు కారణాలతో కస్టమర్లు 4 లక్షలకు పైగా ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారు" అని గోయల్ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేశారు.కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..ఒక కస్టమర్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసిన తర్వాత, ఆ ఆర్డర్‌ను తీసుకెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు అది యాప్‌లో పాప్ అప్ అవుతుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఫుడ్‌ను తక్కువ ధరకు తీసుకోవచ్చు. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన కస్టమర్‌కు, రెస్టారెంట్ పార్టనర్‌కు షేర్ చేస్తారు. ఇందులో జొమాటో ఎలాంటి ఆదాయాన్ని తీసుకోదు. అయితే, ఐస్‌క్రీమ్‌లు, షేక్‌లు, స్మూతీస్ వంటి కొన్ని పదార్థాలకు మాత్రం కొత్త ఫీచర్ వర్తించదు. ఆహార వృధా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జొమాటోకు, దీపిందర్ గోయల్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిశాయి. ఫుడ్ రెస్క్యూ అనేది గొప్ప చొరవ, వినూత్న ఆలోచన అంటూ పలువురు మెచ్చుకున్నారు.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024 -
ఆభరణాల ఎగుమతులకు కొత్త ప్రమాణాలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులకు సంబంధించి సవరించిన వేస్టేజీ (తరుగు/వృధా) నిబంధనలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆభరణాల తయారీ సమయంలో కొంత లోహం వృధా అవుతుందని తెలిసిందే. ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ఈ వేస్టేజీ పరంగా పరిమితులు ఉన్నాయి. ఈ వేస్టేజీని తగ్గిస్తూ ఈ ఏడాది మే 27న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిపట్ల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడంతో 2024 డిసెంబర్ చివరి వరకు అమలును వాయిదా వేసింది. కొంత వెసులుబాటుతో సవరించిన నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ‘‘ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ప్రామాణిక ఇన్పుట్–అవుట్‌పుట్, అనుమతించిన వేస్టేజీ నిబంధనలను సవరించడమైనది’’అంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ప్రకటించింది. ఆభరణాల తయారీ ప్రక్రియకు తగ్గట్టు వేస్టేజీని వాస్తవికంగా నిర్ణయించాలని ప్రరిశ్రమ కోరడం గమనార్హం. అలాగే, కొత్త నిబంధనల అమలుకు తగినంత సమయం ఇవ్వాలని కూడా కోరింది. సాధారణ బంగారం, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 2.5 శాతం నుంచి 0.5 శాతానికి, వెండి ఆభరణాలకు వేస్టేజీని 3.2 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గిస్తూ మే నెలలో ప్రకటించిన నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. అదే స్టడెడ్ జ్యుయలరీ విషయంలో బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 0.75 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 5 శాతంగా ఉండేది. కొంత వెసులుబాటు..: తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. చేతితో తయారు చేసిన బంగారం, ప్లాటినం ఆభరణాలకు సంబంధించి గరిష్ట వేస్టేజీని 2.5% వరకు అనుమతించనున్నారు. చేతితో చేసిన వెండి ఆభరణాలకు 3.2 % వేస్టేజీ అమలు కానుంది. మెషిన్లపై చేసిన బంగారం ఆభరణాలకు 0.45% వేస్టేజీ, వెండికి 0.5% అమలు కానుంది. చేతితో చేసిన బంగారం, వెండి, ప్లాటినం స్టడెడ్ ఆభరణాలకు 4 శాతం, మెషిన్‌పై చేసిన స్టడెడ్ ఆభరణాలు అయితే 2.8% మేర వేస్టేజీని అనుమతించనున్నారు. ఆభరణాలతోపాటు విగ్రహాలు, కాయిన్లు, పతకాలు, ఇతర వస్తువులకు సైతం ఇవే వేస్టేజీ నిబంధనలు అమలవుతాయి. -
ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త!
ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం ముందుగా గుమ్మం దగ్గర ఉండే డోర్మ్యాట్ని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభించాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి, బయటకి తిరిగేటప్పుడు కాళ్లకు ఉండే మట్టి అంటేది డోర్ మ్యాట్కే కాబట్టి డోర్ మ్యాట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డోర్మ్యాట్ని మారుస్తుండాలి. అందుబాటులో ఉంచుకోవడం..– శుభ్రతకి కావాల్సిన వస్తువులన్నింటినీ మన చేతికి అందేలా ఉంచుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. పని కూడా సులువు అవుతుంది.– కిటికీలు తెరిస్తే వెలుతురుతోపాటు దుమ్ము కూడా వచ్చేస్తుంది. అందుకే కిటికీల రెక్కలను కొద్దిసేపు తెరిచి ఉంచిన తర్వాత మళ్లీ మూసేయాలి.– ఇక కిటికీ అద్దాలకీ దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా అంటి పెట్టుకుని ఉంటాయి. అందువల్ల కిటికీలను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటే సీజనల్ అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు.బూజు దులపటం..– ఇంటినంతా చక్కగా కడిగి శుభ్రంగా ఉంచడంతో పాటు గోడ మూలల్లో ఉన్న బూజును కూడా దులపాలి.– ఇంట్లో చెత్తని తొలగించడంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదు.– ముఖ్యంగా బాత్రూమ్లో, వంటగదుల్లోనూ సూక్ష్మజీవులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.– ఇంటి ముందు చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి వస్తుంది. తేమ శాతం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు.– ఇక ఇంటిని శుభ్రం చేయడమంటే చాలా పెద్ద సమస్య. వస్తువులను శుభ్రంగా కడిగే ముందు ఎక్కువగా దుమ్ము పేరుకునే వస్తువులను ముందుగా శుభ్రం చేసుకుంటే సగం పని అయిపోతుంది. దీనికి కింది సూచనలు పాటిస్తే సరిపోతుంది.సీలింగ్ ΄్యాన్స్..– సీలింగ్ ΄్యాన్లను తుడవకుండా ఉంటే వాటిపై దుమ్ము ఎక్కువగా చేరుతుంది. దానివల్ల ఇంట్లో ఉండే ఫర్నిచర్‌పై దుమ్ము పడుతుంది. కాబట్టి ఫ్యాన్‌ను మొదట శుభ్రం చేయాలి. కంప్యూటర్..– కంప్యూటర్, లాప్టాప్ కీబోర్డు ఎప్పటికప్పుడు శుభ్రం చే సుకోకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది.టీవీ..– టీవీ స్క్రీన్‌ను ఒక శుభ్రమైన మెత్తటి బట్టతో తుడవాలి. అలాగే టీవికి ముందు వైపు కన్నా వెనుక భాగంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది. దాన్ని దులపడటం చాలా అవసరం.అద్దాలు..– ఇంట్లో ఉండే అద్దాలను, గాజు పాత్రలను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టండి. ఇలా చేయటం వల్ల పాత్రలు కొత్తవిగా కనిపిస్తాయి.పక్కబట్టలు మడతపెట్టడం..– రోజంతా పని చేసిన తర్వాత వచ్చి సేదదీరేది బెడ్ మీదనే. మీ పడకగది మురిగ్గా ఉండటం చూస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. కాబట్టి నిద్ర లేవగానే దుప్పటిని దులిపి మడతబెట్టాలి. బెడ్‌షీట్‌ను నీట్‌గా సర్దాలి.దుస్తుల శుభ్రం..– ఒకేసారి మొత్తం బట్టలు ఉతకాలంటే అలసట రావడం సహజమే, పైగా అందుకు ఎక్కువ సమయం కూడా పడుతుంది.– ధరించే దుస్తులలో రకాన్ని బట్టి వేటికవి విడదీసి ఉతికితే సులభంగా ఉంటుంది.చెత్తను వదిలించుకోవడం..– ఇంటిలో అనవసరమైన వస్తువులు తీసి బయట పడేసి తర్వాత అన్నిటినీ సర్దటం మంచిది.– ఈ అలవాటును అందరూ తప్పక పాటించాలి.– వాడే వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా సర్దుకోవాలి.– టేబుల్స్ లేదా బల్లలపై తక్కువ వస్తువులుంటే వాటిని శుభ్రపర్చటం సులువవుతుంది.– ఇంటి వాకిలి దగ్గర ఉంచే షూ ర్యాక్ కూడా శుభ్రపర్చటం చాలా ముఖ్యం.– అలాగే మీకేదన్నా దాని స్థానంలో లేదు అన్పిస్తే, మళ్ళీ చేద్దాంలే అని వదిలేయకండి. అప్పటికప్పుడు చేయటం మంచిది.నిద్రించే ముందే..– మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు అన్నిటినీ శుభ్రం చేసే అలవాటు చేసుకోవాలి.– ముఖ్యంగా పిల్లలకు వాళ్ల వస్తువులను సర్దేసి, వారి గదులను శుభ్రం చేసుకుని పడుకునేలా తర్ఫీదు ఇవ్వండి.– వంటగదిని కూడా శుభ్రం చేసి పడుకోటం నేర్చుకోండి.పరిసరాల పరిశుభ్రత..మీ ఇంటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకోడానికి, పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యం. ఇది అందరి బాధ్యత. ఇంటి శుభ్రత కోసం మీరొక్కరే కాదు, కుటుంబసభ్యులు కూడా కృషి చేయాలి. అలా మీరే తర్ఫీదు ఇవ్వడం అవసరం. చిన్న పిల్లలు కదా, వాళ్లేమి చేయగలరులే అని వదిలేస్తే, తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చిన్నప్పటినుంచి పిల్లలకు కూడా ఎక్కడ తీసిన వస్తు సామగ్రిని అక్కడ పెట్టడం అలవాటు చేయడం అవసరం.ఇవి చదవండి: తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా? -
ఈగలతో ప్రొటీన్ల సేద్యం!
సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తిని పెరిగే బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగు(లార్వా)లు కోళ్లతో పాటు చేపలు, రొయ్యలకు మంచి ప్రొటీన్లతో కూడిన మేతగా ఉపయోగపడుతున్నాయి. విదేశాల్లో విస్తారంగా జరుగుతున్న బిఎస్ఎఫ్ లార్వా సాగు ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ వ్యాపిస్తోంది. కుళ్లిన పండ్లు, కూరగాయలు, వంటింట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలను తిని ఈ పిల్ల పురుగులు దాదాపు నెల రోజుల్లోనే పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బిఎస్‌ఎఫ్‌పై పరిశోధనలు మన దేశంలో శైశవ దశలో ఉన్నాయి. ఐసిఎఆర్ గ్రాంటుతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పిజెటిఎస్ఎయు) ఏడాది క్రితమే వేస్ట్2వెల్త్ ప్రాజెక్టులో భాగంగా దీనిపై పరిశోధనలు చేపట్టింది. అంతేకాదు, శాస్త్రవేత్తలు, ఎంటర్ప్రెన్యూర్లు, రైతుల శిక్షణకు ఇటీవలే శ్రీకారం చుట్టింది. ఇన్నోవేటివ్ ఇన్సెక్ట్ ఫార్మింగ్ వివరాలతో ఆసక్తికర కథనం... ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన శాకాహార, మాంసాహారోత్పత్తుల్లో 60% మాత్రమే వినియోగమవుతోంది. పొలంలో 8%, మార్కెట్‌కు వెళ్లే దారిలో 14%, రిటైల్ అమ్మకందారుల వద్ద 7%, ఇళ్లలో వినియోగానికి ముందు 11% మేరకు ఆహారం వృథా అవుతోంది. 2021 యుఎన్ఇపి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ప్రకారం మన దేశంలో ఏటా 6.88 కోట్ల టన్నుల ఆహార వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ సేంద్రియ వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేసే కంటే పునర్వినియోగించి ప్రయోజనం పొందటం తెలివైన పని. ఈ పనిని ఇతర పురుగుల కన్నా బ్లాక్ సోల్జర్ ఈగలు (బిఎస్ఎఫ్) సమర్థవంతంగా చేయగలవన్నది నిపుణుల మాట. పురుగుల సేద్యం చాలా వినూత్నమైనది, పర్యావరణ హితమైనది, ఆదాయాన్ని అందించేది కూడా. మన దేశంలో కొందరు వ్యాపారవేత్తలు, కోళ్ల రైతులు బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగుల(లార్వా) ను సాగు చేయటం ఇటీవల ప్రారంభించారు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల ఉత్పతి కాలం వాటికి వేసే ఆహారాన్ని బట్టి మారుతుంది. ఒక బ్యాచ్ 20 రోజుల నుంచి 40 రోజుల వరకు పడుతుంది. ఆహారం మెత్తగా, త్వరగా జీర్ణించుకునే విధంగా ఉండి ప్రొటీన్లతో కూడి ఉన్నప్పుడు తక్కువ రోజుల్లోనే పురుగులు పెరుగుతాయి. లేయర్ కోళ్ల ఫారాల్లో ఇనుప కేజ్‌ల కింద పోగుపడే కోళ్ల పెంటపై బిఎస్ఎఫ్ ఈగల 5 రోజుల పిల్లలను వదిలితే చాలు.. ఆ వ్యర్థాలనే ఆహారంగా తింటూ 25–30 రోజుల్లోనే పిల్ల పురుగులు వృద్ధి చెందుతాయి. బిఎస్ఎఫ్ పెంపకం ద్వారా సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లో 70–80% మేరకు కుదించవచ్చు. అందువల్లనే నగరాలు, పట్టణాల్లో పోగుపడే సేంద్రియ వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణకు ఇవి ఉపయోగపడుతున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) చెబుతోంది. బిఎస్ఎఫ్ లార్వా(పిల్ల పురుగులు) బరువులో 40–45% వరకు ప్రొటీన్లు ఉన్నాయి. అందువల్ల కోళ్ల మేతలో, ఆక్వా మేతల తయారీలో సోయా చిక్కుళ్లు, ఫిష్ మీల్‌తో పాటుగా 10 శాతం వరకు బిఎస్ఎఫ్ పురుగుల పొడిని కలుపుతున్నారు. బతికి ఉన్న పిల్ల పురుగుల (వెట్ లార్వా)ను కోళ్లకు నేరుగా మేతగా వేస్తున్నారు. రోజువారీ మేతలో పది శాతం వరకు ఈ పిల్ల పురుగులను అందిస్తూ సత్ఫలితాలు పొందుతున్న కోళ్ల ఫారాలు తెలుగునాట ఇప్పటికే అనేకం ఉన్నాయి. పిజెటిఎస్‌ఎయులో పైలెట్ ప్రాజెక్టు అయితే, మన దేశంలో దీనిపై పరిశోధనలు ఇంకా శైశవ దశలోనే ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు) ఈ దిశగా ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిగా బిఎస్ఎఫ్ పెంపకంపై పరిశోధన చేపట్టింది. నేషనల్ అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ‘వేస్ట్2వెల్త్’ ప్రాజెక్టును మంజూరు పిజెటిఎస్ఎయుకు గత ఏడాది చేసింది. పిజెటిఎస్ఎయు పీజీ స్టడీస్ డీన్, కీటక శాస్త్ర ఆచార్యులు డా. వి. అనిత ఈ ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆవరణలో బ్లాక్ సోల్జర్ ఫ్లైల పెంపకం కమ్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, మెస్‌లో మిగిలిన అన్నం, గోధుమ తవుడు మిశ్రమంతో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు పెంచుతున్నారు. పరిశోధక విద్యార్థులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కృషి విజ్ఞాన కేంద్రాల్లోని శాస్త్రవేత్తల మొదటి బ్యాచ్‌కు డా. అనిత ఇటీవలే శిక్షణ ఇచ్చారు. ఎంటర్ప్రెన్యూర్లు, రైతులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు డా. అనిత ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. నగరాలు, పట్టణాల్లో వెలువడే సేంద్రియ ఆహార వ్యర్థాల కాలుష్యాన్ని తగ్గించడానికి, పనిలో పనిగా మంచి ప్రొటీన్‌ను అందుబాటులోకి తెచ్చుకోవడానికి బిఎస్ఎఫ్ లార్వాల పెంపకం ఉపయోగకరం. అన్నిటికీ మించి, సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లోనే 70–80% మేరకు తగ్గించేంత ఆబగా తినగల శక్తి బిఎస్ఎఫ్ జాతికి వుంది. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి మన దేశపు వాతావరణం చాలా అనువైనదంటున్నారు డా.అనిత. ఎంటర్ప్రెన్యూర్లకు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం! బ్లాక్ సోల్జర్ ఈగలు మనకు కొత్తవి కావు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 20వ శతాబ్దం నుంచి ఉన్నదే ఈ జాతి. కొత్త తెగుళ్లు వ్యాప్తి చెందుతాయన్న భయం లేదు. ఆహార వ్యర్థాలు, పశువుల విసర్జితాలను సాధ్యమైనంత మెత్తగా చేసి, సులభంగా జీర్ణించుకునేలా మార్చి ఈ పురుగులకు వేయాలి. అందులో ప్రొటీన్లు ఉండాలి. చిన్న పిల్లల ఆహారం లాగా ఉండాలి. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను సేకరించి, మెత్తగా రుబ్బి.. దానితో పాటు మెస్‌లో మిగిలిపోయిన అన్నం, గోధుమ తవుడు కొంచెం కలిపి మా ప్రయోగశాలలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను పెంచుతున్నాం. వాటికి వేసే ఆహారాన్ని బట్టి, దానిలో పోషక విలువలను బట్టి, వాతావరణంలో వేడి, గాలిలో తేమను బట్టి.. అవి ఎన్ని రోజుల్లో, ఎంత బరువు పెరుగుతాయన్న విషయం ఆధారపడి ఉంటుంది. సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చుకునే మార్గం ఇది. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి ఆదాయమూ సమకూరుతుంది. రైతులకు, ఎంటర్ప్రెన్యూర్లకు శిక్షణ ఇస్తున్నాం. సేంద్రియ వ్యర్థాలను తినే అనేక జీవులుండగా బ్లాక్ సోల్జర్ ఫ్లైలనే ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇదే ప్రశ్న డా. అనితను అడిగితే ఇలా బదులిచ్చారు... రోజుకు తన బరువుకు రెట్టింపు సేంద్రియ వ్యర్థాలను తిని, సేంద్రియ ఎరువును విసర్జించగల శక్తి బిఎస్ఎఫ్ పిల్ల పురుగులకు ఉంది. దీని అర్థం ఏమిటంటే.. చెత్త కుప్పలకు తరలివెళ్లే సేంద్రియ వ్యర్థాలు తగ్గిపోతాయి. మిథేన్ ఉద్గారాలు ఆ మేరకు తగ్గుతాయి. కుళ్లిన పండ్లు/కూరగాయలు,హోటళ్లు/ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలు వంటి సేంద్రియ వ్యర్థాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి వాడొచ్చు. బిఎస్ఎఫ్ జీవిత చక్రం మొత్తం 42–55 రోజులు. గుడ్లు పెట్టిన 4–5 రోజులకు పిగులుతాయి. అవి 15–25 రోజుల్లో పిల్ల పురుగులా(లార్వా)గా ఎదుగుతాయి. ఈ దశలోనే వాటిని సేకరించి కోళ్లు, ఆక్వా మేతల్లో వాడుతున్నారు. అలాగే ఉంచితే, ప్యూపాగా రూపాంతరం చెంది, 17 రోజుల తర్వాత బ్లాక్ సోల్జర్ ఈగలు పుడతాయి. మగ ఈగ 4 రోజుల్లో ఆడ ఈగను కలిసిన తర్వాత చనిపోతుంది. ఆడ ఈగ 5–8 రోజుల్లో గుడ్లు పెట్టి చనిపోతుంది. గుడ్లను సేకరించి, అతి చిన్న పురుగులను తయారు చేయట కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. 5 రోజుల పిల్లలకు తగిన సేంద్రియ ఆహారం అందిస్తే 15–25 రోజుల్లో పిల్ల పురుగులు(లార్వా)గా పెరుగుతాయి. ఆ దశలో చక్కని ప్రొటీన్లతో కూడిన ఆ పిల్ల పురుగులు కోళ్లు, చేపలు, రొయ్యలకు మేతగా వాడుకోవచ్చు. 5 రోజుల పిల్లలను కొనుక్కొని రైతులు 15–25 రోజుల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను లార్వా దశకు పెంచి, కోళ్లకు, చేపలు, రొయ్యలకు మేతగా వేసుకోవచ్చు లేదా కొనుగోలుదారులకు అమ్ముకోవచ్చు. స్వయం ఉపాధిగా యువకులు బిఎస్ఎఫ్ లార్వా సాగు చేపట్టవచ్చు. ఈ లార్వాను దాణా తయారీ కంపెనీలు, సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. లార్వా దశ దాటి ప్యూపా దశకు పెరిగితే దాణాల్లో వాడకానికి పనికిరాదు. సోయా చిక్కుళ్ల సాగులో సమస్యలు, సముద్రాల్లో చేపల సంతతి తగ్గిపోతుండటం వల్ల కోళ్లు, ఆక్వా మేతలతో పాటు, పెంపకపు కుక్కల మేతల్లో కూడా బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను ప్రొటీన్ సప్లిమెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. దీంతో బిఎస్ఎఫ్ లార్వా సాగుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పిల్ల పురుగులే అధిక నాణ్యత గల ప్రొటీన్లతో కూడిన దాణాకు ముడి పదార్థం. కోళ్లు, చేపలు, రొయ్యలు, పందులు, పెంపుడు కుక్కలకు వేసే మేతలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని కలపవచ్చు. పిల్ల పురుగుల బరువులో 40–45% ప్రొటీన్‌తో పాటు ఎసెన్షియల్ అమినో యాసిడ్లు ఉంటాయి. సాధారణంగా మేతల్లో ప్రొటీన్లుగా వాడే సోయా చిక్కుడు గింజలు, ఫిష్మీల్ను కొంత తగ్గించి దీన్ని వాడుతున్నారు. కోళ్లకు రోజువారీ మేతలో పది శాతం మేరకు దీన్ని వాడుతున్నారు. పిల్ల పురుగులను బతికి ఉన్నప్పుడే ఫారం కోళ్లకు మేపవచ్చు. నాటు కోళ్లకూ ఇది మంచి ఆహారం. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకం క్రమంలో వెలువడే విసర్జితాలే(ఫ్రాస్) పంటలకు అత్యంత విలువైన సేంద్రియ ఎరువుగా పనికి వస్తుంది. వర్మీకంపోస్టు, పశువుల ఎరువుల్లో కంటే అధిక పోషక విలువలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. విదేశాల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని బర్గర్లు, షేక్‌లలో కలుపుతున్నారు. దీని నుంచి వెలికితీసే నూనెను బయో ఇంధనంగా వాహనాలు, జనరేటర్లలో వాడుతున్నారు. బిఎస్ఎఫ్ లార్వా నుంచి వెలువడే పొలుసులు(కూటిన్) బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ ప్లాస్టిక్ తయారీకి వాడుతున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలున్నందున వైద్య అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. వర్షాకాలంలో దీపం చుట్టూ చేరే ఉసుళ్లను వేపుకొని శనగపప్పుతో కలుపుకొని తినే అలవాటు మన దేశంలోనూ ఉంది. బిఎస్‌ఎఫ్‌తో పాటు మిడతలు, మీల్ వార్మ్స్, గొల్లభామలు, వంటి 1,900 జాతుల పురుగులను 113 దేశాల్లో 200 కోట్ల మంది తింటున్నారని ఎఫ్ఎఓ చెబుతోంది. --పతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్) -
ఇంటర్నేషనల్ ఫుడ్ డే: ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతోందో తెలుసా?
World Food Day 2023: ప్రపంచ ఆహార దినోత్సవం 2023: సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు సరైన పోషకాహారంలేక, పరిశుభ్రమైననీరు అందుబాటులో లేక నానా కష్టాలుపడుతున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ భూమ్మీద ప్రతి వ్యక్తికి సరైన పోషకాహారం, సరైన ఆహారం లభించేలా అవగాహన పెంచడం, సంబంధిత చర్యలు తీసుకోవడంపై ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు మీకోసం.. 1979లో, FAO సమావేశంలో, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచ సెలవుదినంగా ఆమోదించారు. ఆ తర్వాత, 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి. 2023 వరల్డ్ ఫుడ్ డే ధీమ్ ఏంటంటే ‘‘నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’ భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం, మన శరీరాల్లో 50శాతం పైగా నీరే ఉంటుంది. అసలు ఈ ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా సాధ్య పడుతుందా? అలాంటి అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రపంచ జనాభాలో ఎంతమందికి కడుపునిండా భోజనం దొరుకుతోంది? అసలు ఎంత ఆహారం వృథా అవుతోంది మీకు తెలుసా? మీకు తెలుసా... ►ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 16వ తేదీని ఇంటర్నేషనల్ ఫుడ్ డేను ఆచరిస్తున్నాం. ► ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా... ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత కూడా లేదు. ►ఇజ్రాయెల్ - పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్ల మాదిరిగా యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత తగ్గిపోతోంది. ►అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది. ► కోవిడ్-19 పుణ్యమా అని పేదల ఆర్థిక స్తోమత మరింత దిగజారిపోయింది. ఫలితంగా చాలామందికి ప్రతి రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టమవుతోంది. Water is not an infinite resource. We need to stop taking it for granted. What we eat and how that food is produced all affect water. On #WorldFoodDay @FAO calls on countries to take greater #WaterAction for food.https://t.co/DKBqAUky9y pic.twitter.com/I3TYWf4LrL — UN Environment Programme (@UNEP) October 16, 2023 ► ఆకలి మనిషి శరీరాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వాటిల్లో ఒకటి మాత్రమే. భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మంది వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు. ►ఆకలి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. రక్తహీనత, విటమిన్ లోపాలు వాటిల్లో కొన్ని మాత్రమే. ►మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కూడా ఆకలి కారణమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. మనోవ్యాకులత (డిప్రెషన్) యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతారు. ఇవీ చదవండి: ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు ఆకలి సూచీలో అధోగతి -
ఎక్స్‌ట్రూజన్‌పై హిందాల్కో దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్‌ల తయారీకి వీలుగా ఎక్స్‌ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్‌లకోసం ఎక్స్‌ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్‌కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్‌ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్‌క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు. -
మిస్ థాయ్‌లాండ్ ధరించిన ఈ డ్రెస్ వేటితో తయారు చేశారో తెలుసా..?
అందాల పోటీ అంటేనే గుర్తొచ్చేది వారు ధరించే దుస్తులు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో మోడల్స్ రకరకాల దుస్తులు ధరిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనే యువతులు అందం, ప్రతిభ ఎంత ముఖ్యమో వస్త్రధారణ కూడా అంతే ముఖ్యం. జడ్జిలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా వీరి వస్త్రధారణ ఉంటుంది. కళ్లు చెదిరే డ్రెస్‌లతో సాక్షాత్తు దేవకన్యే దిగివచ్చిందా? అనేలా క్యాట్ చేస్తూ మైమరిపిస్తుంటారు. మిస్ యూనివర్స్ 2022 పోటీలు తాజాగా న్యూజెర్సీలో జరిగాయి. ఈ పోటీల్లో థాయ్‌లాండ్ తరపున పోటీలో నిలిచిన అన్నాసుయాంగమ్-ఐయామ్ (Anna Sueangam-Iam) పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇటీవల జరిగిన ప్రాథమిక పోటీలో ఆమె ధరించిన వెరైటీ గౌను అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె కాస్టూమ్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. టైటిల్ గెలవకుండానే అందరి దృష్టిని ఆకర్షించిన అన్నా గౌను అంత పాపులర్ కావడం వెనక ఓ బాధాకరమైన గతం ఉంది. వాడిపడేసిన కోక్ డబ్బా మూతలతో.. చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపించిన ఈ గౌను వాస్తవానికి వాడిపడేసిన డ్రింక్ డబ్బాల మూతలతో తయారు చేశారు. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ ఇన్‌స్ట్రాగ్రామ్ పేజ్‌లో అన్నా గౌనుకి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రఖ్యాత థాయ్ డిజైనర్ అరిఫ్ జహవాంగ్ ఈ డ్రెస్సును రూపొందించాడు. అన్నా తన బాల్యం, గత జీవితాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఈ డ్రెస్సును తయారు చేయించింది ఈ క్రమంలో ఉపయోగించిన డ్రింక్ క్యాన్స్ మూతలతో (రిసైకిల్ వ్యర్థాలతో) దీనిని తీర్చిదిద్దేలా జాగ్రత్త పడింది. లుక్ కోసం ఆ మూతల మధ్యలో స్వరోవ్స్కీ డైమండ్స్ వచ్చేలా రెడీ చేసుకుంది. ఈ గౌనుతోనే అన్నా ప్రాథమిక పోటీల్లో పాల్గొంది. బాల్యమంతా చెత్తలోనే కాగా థాయ్‌లాండ్‌కు చెందిన అన్నా తండ్రి చెత్త సేకరిస్తూ, తల్లి వీదుల్లో చెత్త ఊడుస్తూ జీవనం సాగిస్తుంటారు. దీంతో ఆమె బాల్యమంతా చెత్తకుప్పలు, వాడి పడేసిన వస్తువుల మధ్యే సాగింది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటే ఎక్కువ గడపడంతో అన్నా తన నానన్మ దగ్గరే పెరిగింది. తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి కూతుర్ని చదివించారు. అందుకు తగ్గట్టే అన్నా కష్టపడి చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. చదువుకునే రోజుల్లో కొందరు ఆమెను గార్బెజ్ బ్యూటీ క్వీన్‌గా ఎగతాళి చేసేవారు. అయినా అన్నా అవన్నీ పట్టించుకునేది కాదు. ఓవైపు చదువులో రాణిస్తూ మరోవైపు అందాల పోటీల్లో పాల్గొనేది. అలా మిస్ థాయ్‌లాండ్ 2020’ పోటీల్లో పాల్గొని ‘టాప్ 16’లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత జరిగిన ‘మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2022’ పోటీల్లో టైటిల్ సంపాదించి తన కలను సాకారం చేసుకుంది. తనను విమర్శించిన నోళ్లను మూయిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. గతం ఎలా ఉన్నా కృషి పట్టుదల, నమ్మకంతో గొప్ప విజయాలను సాధించవచ్చని నిరూపించింది. View this post on Instagram A post shared by Miss Universe Thailand (@missuniverse.in.th) View this post on Instagram A post shared by Miss Universe Thailand (@missuniverse.in.th) తన డ్రెస్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఈ గౌనులో నా బాల్యం దాగుంది. నా తల్లిదండ్రులు చెత్తను సేకరించేవారు. నా బాల్యమంతా చెత్తకుప్పల మధ్యే సాగింది. అందుకే అందరూ వాడి పడేసిన కూల్‌డ్రింగ్ మూతలతో ఈ గౌన్‌ను డిజైన్ చేయించాను. పనికిరాని వస్తువులకు కూడా అందం, విలువ ఉంటాయని దీని ద్వారా ప్రపంచానికి చూపించాలనుకున్నాం. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది. మిస్ యూనివర్స్ 2022 టైటిల్ గెలుచుకున్న అమెరికా భామ మిస్ యూనివర్స్ 2021 కీరిటాన్ని భారతీయ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా 2022గానూ పోటీలు న్యూజెర్సీలో (జనవరి 14న) జరిగాయి. ఈ ఏడాది భారత్ తరపున కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల దివితా రాయ్ ప్రాతినిథ్యం వహించారు. గతేడాది మిస్ దివా యునివర్స్ టైటిల్‌ను ఈమె సొంతం చేసుకొని మిస్ యూనివర్స్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అయితే అమెరికాకు చెందిన ఆర్ బోనీ గాబ్రియేల్ మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని దక్కించుకుంది. The new Miss Universe is USA!!! #MISSUNIVERSE pic.twitter.com/7vryvLV92Y — Miss Universe (@MissUniverse) January 15, 2023 -
Hyderabad: పరిశ్రమల నిర్వాకం.. గుంతలు తీసి.. రసాయనాలు దాచి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న పలు రెడ్, ఆరెంజ్ కేటగిరీ బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేయకుండా నిల్వ చేస్తుండటంతో పర్యావరణ హననం జరుగుతోంది. ఇటీవల పీసీబీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. పర్యావరణ నిబంధనలు పాటించనివి, పీసీబీ నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే ఉత్పత్తులు చేస్తున్న ఆరు కంపెనీలను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి తాజాగా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిబంధనలకు నీళ్లు... పలు ఫార్మా, బల్క్ డ్రగ్, కంపెనీల్లో ఉత్పత్తులు తయారు చేస్తున్న క్రమంలో ఉత్పన్నమయ్యే ఫార్మా వ్యర్థ జలాలను జీడిమెట్లలోని ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించకుండా రోజుల తరబడి కంపెనీల ఆవరణలోనే భారీ గుంతలు తీసి వాటిల్లో నిల్వ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినపుడు వరద నీటితోపాటు ఈ వ్యర్థాలను బయటకు వదలిపెడుతుండడంతో సమీప చెరువులు, కుంటలు కాలుష్య కాసారమవుతున్నాయి. మరికొందరు అక్రమార్కులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు ట్యాంకర్లలో ఈ వ్యర్థాలను తరలించి ఔటర్ పరిసరాల్లో ఉన్న పలు చెరువులతో పాటు మూసీలోకి యథేచ్ఛగా డంపింగ్ చేస్తున్నారు. అంతుచిక్కని లోగుట్టు.. నగరంలో పదికిపైగానే పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో సుమారు మూడువేలకు పైగా పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఇందులో బల్క్‌డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. పాశమైలారం, జీడిమెట్ల, చర్లపల్లి, కాటేదాన్, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లోని అధిక శాతం పరిశ్రమల్లో ఎలాంటి ఉత్పత్తులు తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదే తరుణంలో కొందరు అక్రమార్కులు పరిశ్రమ ముసుగులో నిషేధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పారిశ్రామిక వాడల్లో చాలా పరిశ్రమలకు కనీసం బోర్డు కూడా లేదు. గేట్ల దగ్గర సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్య క్తులు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపల ఏమి జరుగుతోందో స్థానికులకు కూడా తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడటం గమనార్హం. కాగితాలకే పరిమితం.. వాయు, జల కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీల్లోకి వచ్చే అన్ని పరిశ్రమలు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇప్పటివరకు పీసీబీ నుంచి అనుమతులు తీసుకున్న పరిశ్రమల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల వరకు ఉంటే అందులో నగరం చుట్టు పక్కల 3 వేల వరకు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే ముందు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ), పూర్తైన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్ఓ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పీసీబీ అనుమతి పొందిన ప్రతి పరిశ్రమ కచ్చితంగా 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉన్న బ్లాక్ బోర్డును ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. దానిపై తెల్లటి రంగుతో ఏ సంస్థ పేరుతో.. ఏయే ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు అనుమతి పొందారు.. ప్రతిరోజూ వెలువడుతున్న వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాల (హజార్డస్ వేస్టేజ్) పరిమాణం.. వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే తదితర వివరాలను పేర్కొనాలి. కానీ పారిశ్రామిక వాడల్లో ఈ నిబంధన అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. -
దడ పుట్టిస్తున్న ఈ–వేస్ట్
శ్రీకాంత్‌రావు.కె, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్ధాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలపై (ఈ–వేస్ట్ (వ్యర్థ్ధాలు) పలు దేశాలు చట్టాలు చేసినా వాటి అమలుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ–వ్యర్థాలు భూమిలో కలిసిపోయేవి కాకపోవడంతో విషపూరితంగా మారి గాలిలో, భూమిలో, నీటిలోనూ కలుస్తూ ప్రాణకోణిపై ప్రభావం చూపెడుతున్నాయి. సరైన విధానంలో వీటిని ధ్వంసం చేయకపోవడం, అవగాహన లేక తగలపెట్టడం వల్ల వాటిని నుంచి విష వాయువులు వాతావరణంలో కలుస్తున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా.. వీటిని ఉత్పత్తి చేస్తున్న సంస్థలు కానీ, వినియోగదారులు కానీ, చివరకు పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోక పోవడం వల్ల ఏటేటా ఈ–వ్యర్థ్ధాలు లక్షల మెట్రిక్ టన్నుల మేర పేరుకుపోతున్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థ్ధాలున్నాయి. అయితే అందులో కొంతమేరకు రీసైక్లింగ్ జరిగాయి. ఏతావాతా గడచిన సెప్టెంబర్ చివరి నాటికి నికరంగా 34.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థ్ధాలు భూమిపై ఉన్నాయి. ఒక్క ఏడాదిలో 5.7 కోట్ల టన్నుల వ్యర్థ్ధాలు ఒక్క 2021 సంవత్సరంలోనే 5.7 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జమ అయినట్లు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. వాస్తవంగా ఈ–వ్యర్థ్ధాల ముప్పును గుర్తించిన తరువాత.. 2014 నుంచి ప్రతియేటా ఏ మేరకు ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అంశంపై వివిధ సంస్థలు సీరియస్‌గా దృష్టి సారించాయి. 2014 ముందు ఎలక్ట్రానిక్ వ్యర్థ్ధాలకు సంబంధించి పూర్తి సమాచారం లేకున్నా అంచనాలు మాత్రం వేయగలిగారు. రీసైక్లింగ్‌లో నిర్లక్ష్యం తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఆధునికత పేరిట ప్రపంచం ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగం వైపు పరుగులు పెడుతోంది. ఆధునిక వస్తువులు మార్కెట్లోకి వస్తున్న కొద్దీ.. అప్పటివరకు వినియోగించిన వస్తువులను పక్కన పడేస్తున్నారు. మార్కెట్లోకి కొత్తది వస్తేచాలు పాతది ఇక పనిచేయదన్న భావనలో పడిపోతున్నారు. మరింత సౌకర్యవంతమైన వాటి వెంట పడుతున్నారు. దీంతో ప్రతి సంవత్సరం 20 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉన్న దేశాలు వీటిని రీసైకిల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పాతవాటిని సక్రమంగా డిస్పోజ్ చేయకుండా బాహ్య ప్రపంచంలో పారేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పువాటిల్లుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఈ–వ్యర్థ్ధాల్లో 17.4% మాత్రమే రీ సైకిల్ అవుతున్నట్లు సమాచారం. 78 దేశాల్లో చట్టాలున్నా.. ప్రపంచ వ్యాప్తంగా 71 శాతం జనాభా కలిగిన మొత్తం 78 దేశాలు ఈ–వ్యర్థ్ధాలపై చట్టాలు, నియంత్రణ, విధానాలు తీసుకునివచ్చాయి. కానీ వాటి అమలు అంతంత మాత్రంగానే ఉంది. విచిత్రంగా అమెరికాలోని దాదాపు 25 రాష్ట్రాల్లో ఈ–వ్యర్థ్ధాలు రీసైక్లింగ్‌కు సంబంధించి ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. టాప్ త్రీలో చైనా, అమెరికా, భారత్ ఈ–వ్యర్థ్ధాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చైనా, అమెరికా, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏటా ఆసియాలో 2.4 కోట్ల మెట్రిక్ టన్నులు, అమెరికాలో 1.3 కోట్ల మెట్రిక్ టన్నులు, యూరోప్‌లో 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తలసరి ఉత్పత్తి యూరోప్‌లో 16.2 కిలోలు, ఓషియానియా దేశాల్లో 16.1 కిలోలు, అమెరికాలో 13.3 కిలోలుగా ఉంది. ఆఫ్రికా దేశస్తుల తలసరి ఈ–వ్యర్థ్ధాలు ఉత్పత్తి అతితక్కువగా ఉంది. ఈ–వ్యర్థాల్లో ఏది ఎంత? ఈ వ్యర్థాల్లో మైక్రోవేవ్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, టోస్టర్స్, ఏవర్స్, హెయిర్ డ్రయ్యర్స్ (17.4 ఎంటీ), వాషింగ్ మెషీన్స్, టంబుల్ డ్రయ్యర్స్, స్టవ్స్, డిష్‌వాషర్స్, కుక్కర్స్ (13.4 ఎంటీ), రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండీషనర్స్, హీట్‌పంప్స్ (10.8ఎంటీ), స్క్రీన్స్,మానిటర్స్, టెలివిజన్స్, నోట్‌బుక్స్, టాబ్లెట్స్ (6.7ఎంటీ), ఐటీ, టెలీఎక్విప్‌మెంట్, సెల్‌ఫోన్స్, వైర్లెస్ రూటర్స్, జీపీఎస్, కాలుక్యులేటర్స్ (4.7ఎంటీ), బల్బులు, ఎల్ఈడీ (0.9ఎంటీ)లు ఉన్నాయి. ప్రజలు ఏంచేయాలి.. ►ప్రతి వ్యక్తీ తన స్థాయిలో ఈ–వ్యర్థ్ధాలను అరికట్టేందుకు సిద్ధం కావాలి. సరిగా డిస్పోజ్ చేయాలి. పర్యావరణహిత జీవనశైలి అలవర్చుకుంటే చాలా మార్పు వస్తుంది. ►వస్తువు కొనుగోలు చేసేటప్పుడే ఆలోచించాలి. దాని వినియోగం ఎలా..?దాని కాలపరిమితి తీరిన తరువాత ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసుకోవాలి. ►పాత టెక్నాలజీతో కూడిన వాటిని తొందరపడి పారేయకూడదు. పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం కంటే వాటి మరమ్మతులు చేసేలా చూసుకోవాలి. విలువైన ముడి పదార్థాలు వ్యర్థంగా.. ఈ–వ్యర్థ్ధాలను రీసైక్లింగ్ చేయకుండా భూమిపై వదిలేయడంతో.. వాటిలో విలువైన ముడి పదార్థాలు ఎందుకు కొరగాకుండా పోతోంది. 2019 సంవత్సరంలో ఉత్పత్తి అయిన ఈ–వ్యర్థ్ధాలు 5.3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే.. అందులో వినియోగించిన విలువైన బంగారం, వెండి, రాగి, ఇనుము తదితర లోహాల విలువ దాదాపు 57 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. పది లక్షల సెల్ఫోన్లలోని సర్క్యూట్లను రీసైకిల్ చేయడం ద్వారా సుమారు 34 కిలోల బంగారం, 336 కిలోల వెండి, 17వేల కిలోల కాపర్, 17 కిలోల పల్లాడియం మెటల్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవన్నీ రీసైకిల్ కాకపోవడంతో సాధారణ వ్యర్థ్ధాలతో కలిసి భూమిలోనే ఇమిడిపోతున్నాయి. ఇవి కాకుండా హానికారక సీసం, జింక్, నికెల్, క్రోమియం, బేరియం లాంటివి భూమిలో కలవడంతో పర్యావరణానికి నష్టం చేకూరుతోంది. వీటివల్ల ప్రజల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. రెండేళ్లకే గాడ్జెట్స్ మార్చేస్తున్నారు.... ఎలక్ట్రానిక్ పరికరాలు నిత్యజీవితంలో భాగమయ్యాయి. ఆధునిక సాంకేతికతల్లో వేగంగా వస్తున్న మార్పులతో ఒకటి, రెండేళ్లకే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మార్చేస్తున్నారు. కంప్యూటర్లు, టీవీలు, సెల్ఫోన్లు, చార్జర్లు, ఇతర ఆక్సెసరీల వాడకం పెరిగింది. అదే సమయంలో మన దగ్గర ఈ–వేస్ట్ రీసైకిల్ చేస్తున్న ఏజెన్సీలు తక్కువ ఉన్నాయి. జనరల్ వేస్ట్‌తో కలిపి ఈ–వేస్ట్‌ను పడేస్తుండడంతో ప ర్యావరణం కలుషితమౌతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కంటే ఉత్పత్తిదారుడు, వినియోగదారులే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. – పి.రఘువీర్, విశ్రాంత ఐఎఫ్ఎస్, మాజీ పీసీసీఎఫ్ టేక్ బ్యాక్ పాలసీ ముఖ్యం.. ఈ–వేస్ట్‌ను సరైన పద్ధతుల్లో పడేయడం లేదా రీసైకిల్ చేయకపోతే ఎదురయ్యే సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. నగరాలు, ముఖ్య పట్టణాల్లో కాలంచెల్లిన, పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలను వినియోగదారుల నుంచి వెనక్కు తీసుకునే ఏర్పా టు జరగలేదు. అందువల్ల వీటి టేక్ బ్యాక్ పాలసీ (వెనక్కి తీసుకునే విధానం) ముఖ్యం. మొబైళ్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి వాటిలో సూక్ష్మ స్థాయిలో గోల్డ్, కాపర్ వంటివి ఉంటాయి. వీటి కోసం వస్తువలు కాల్చేయడం వల్ల కేన్సర్ కారక విష వాయువులు విడుదలవుతున్నాయి. – మురళీకృష్ణ, ఈ–వేస్ట్ నిర్వహణ నిపుణులు -
తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,825 కోట్ల జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ఘన, ద్రవ వ్యర్థాలు శుద్ధిచేయడంలో విఫలమైందంటూ తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రధాన ధర్మాసనం రూ.3,825 కోట్ల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1996లో దేశంలోని పలు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణ సరిగాలేదంటూ పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటీకి బదిలీ చేసింది. 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాలు, 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య కారకాలు, ఇసుక అక్రమ మైనింగ్‌లపై చర్యలు తీసుకోవాలని సంస్థ కోరింది. జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయడంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను వివరణ కోరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణకు సంతృప్తి చెందని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘1824 ఎంఎల్డీ లిక్విడ్ వేస్ట్/సీవేజీ నిర్వహణలో అంతరాలకు గానూ రూ.3,648 కోట్లు, సాలిడ్ వేస్ట్ నిర్వహణలో వైఫల్యానికి గానూ రూ.177 కోట్లు కలిపి మొత్తం రూ.3,825 కోట్లు పరిహారంగా చెల్లించాలి. రెండు నెలల్లో ప్రత్యేక ఖాతాలో ఆ మొత్తం డిపాజిట్ చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం పునరుద్ధరణ చర్యలకు వినియోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాముల నుంచి నిధుల సేకరణ చేసుకోవచ్చు. పునరుద్ధరణ ప్రణాళికలు అన్ని జిల్లాలు/నగరాలు/పట్టణాలు/ గ్రామాల్లో మరింత సమయానుకూలంగా ఒకేసారి అమలు చేయాలి. ఉల్లంఘనలు కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అమలు పర్యవేక్షణ నిమిత్తం సాంకేతిక నిపుణుల బృందంతో సీనియర్ నోడల్ స్థాయి సెక్రటరీని వెంటనే నియమించాలి. ఆరునెలల తర్వాత పురోగతిని ఎన్జీటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ ద్వారా పంపాలి. సీపీసీబీ ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలి’’ అని ఎన్జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదీ చదవండి: జేఈఈ పేపర్ లీక్ కేసు: రష్యన్ వ్యక్తి అరెస్టు -
పోస్ట్ కోవిడ్ .. పావురం!
సాక్షి, హైదరాబాద్: మూడు దశల కరోనా కాలంలో వైరస్ బారిన పడిన కొందరు ఇప్పటికీ ఇతరత్రా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏడాది, రెండేళ్ళు గడిచిన తర్వాత కూడా గుండె, ఊపిరితిత్తులు సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ నటి మీనా భర్త కోవిడ్ అనంతరం (పోస్ట్ కోవిడ్) ఊపిరితిత్తులు పాడవ డం కారణంగా చనిపోయినట్లు వార్తలు రావడంతో ఇది మరోసారి చర్చనీయాంశమైంది. పోస్ట్ కోవిడ్ సమస్యలున్న వారు పావురాల వ్యర్థాల నుంచి విడుదలయ్యే వాయువులు, ధూళిని పీల్చడం వల్ల మరింత హాని జరుగుతుందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. పావురాల వ్యర్ధాల నుంచి విడుదలయ్యే వాయువులు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయనే అభిప్రాయం ముందు నుంచే ఉంది. పావురాలకు ఫీడింగ్ పేరిట వాటికి దగ్గరగా వెళ్లడం వల్ల బ్రాంకై ఆస్థమా, క్రానిక్ బ్రాంకైటీస్, హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటీస్, హిస్టోప్లా స్మాసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకా శం ఉందని కూడా చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్‌లో ప్రధానంగా వస్తున్న సమస్యలు ►పోస్ట్ కోవిడ్‌లో ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ►కొందరిలో ఇన్ఫెక్షన్లు, టీబీ వంటివి వస్తున్నాయి. పక్షవాతం కేసులు కూడా భారీగా పెరుగు తున్నాయి. ►మానసిక సమస్యలు, ఒత్తిడి, నిద్రపట్టక పోవడం, ఏకాగ్రత లోపించడం, నీరసం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఎముకలకు రక్త సరఫరా తగ్గిపోతోంది. ►హెపటైటిస్, వర్టిగో, ఇతర సమస్యలు వస్తున్నాయి. ఆలస్యం వల్లే అనర్ధం కరోనా వచ్చాక ఆలస్యంగా డాక్టర్ వద్దకు రావడం, చికిత్స తీసుకో వడం వల్ల ఇలా జరుగుతుంది. డయాబెటిస్, ఆర్థరైటీస్, హెచ్ఐవీ ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల సమస్య తలెత్తే అవకాశం ఉంది. – డాక్టర్ సీహెచ్ రాజు, పల్మనాలజిస్ట్ సోరియాసిస్ సమస్యలు వస్తున్నాయి కోవిడ్ సమయంలో అనేక మం దులు వాడి ఆపేస్తారు. తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలు వస్తున్నా యి. కొందరిలో చర్మంపై సోరియా సిస్ (బొల్లి), బొబ్బలు, మొటి మలు వంటివి వస్తాయి. వెంట్రుకలు కూడా ఊడి పోతాయి. చర్మం పొడిబారుతుంది. – డాక్టర్ రవళి యలమంచిలి, హైదరాబాద్ -
శారీ బ్యాంక్!
ఒకసారి కట్టిన చీరను మరోసారి కట్టుకోవడానికి ఇష్టపడరు చాలా మంది. దీంతో కొత్త చీరలు కొనే కొద్దీ పాత చీరలు కుప్పలు కుప్పలుగా బీరువాల్లో్ల మూలుగుతుంటాయి. వాటిని ఏళ్ల తరబడి కట్టకుండా అలాగే ఉంచెయ్యడం వల్ల ఎలుకలు కొట్టి కొన్ని, చెదలు పట్టి ఇంకొన్నీ చిరిగిపోవడం, అసలు కట్టకుండా మడతల్లోనే ఉండడం వల్ల చీకిపోయి మసి బట్టకు కూడా పనికి రాకుండా పోతాయి. ఇలా వృథాగా పోతున్న చీరలను నిరుపేదలకు అందించి ఉపయోగకరంగా మారుస్తోంది ఆర్తి శ్యామల్ జోషి. ఔరంగాబాద్‌కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. రోజూ కట్టుకునే చీరలు కాకుండా ఇంట్లో పాడైపోకుండా ఉన్న చీరలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుత ట్రెండ్‌కు అవి నప్పవని కట్టుకోకుండా నెలల తరబడి అలానే ఉంచేసింది. అవి చూసిన ప్రతిసారి వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తుండేది ఆర్తి. ఒకరోజు నిరుపేద మహిళలకు ఇవి ఇస్తే వారికి ఉపయోగపడతాయి కదా! అనిపించింది ఆర్తికి. అనుకున్న వెంటనే తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. చీరలు తీసుకున్న మహిళలు ఎంతో సంతోషంగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పడంతో ఆర్తికి ప్రోత్సాహం లభించినట్లయింది. దీంతో ఇంట్లో తను కట్టని చీరలు మొత్తం పేదలకు ఇచ్చేసింది. ఆర్తి పనిచేసే చోట చక్కగా ఉన్న కొన్ని బట్టలు, చీరలు చెత్త డబ్బాలో వేయడం గమనించింది. ఇవన్నీ వృథాగా పోతున్నాయి. వీటిని కట్టుకునే నిరుపేదలకు ఇస్తే వేస్ట్ కావు కదా... అనిపించింది. దీంతో 2016లో ఆస్థాజనవికాస్ అనే ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ‘శారీబ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ ద్వారా ఆసక్తి ఉన్న మహిళల దగ్గర నుంచి చీరలు సేకరించి ఇప్పటి దాకా పాతికవేలకు పైగా చీరలను పంచిపెట్టింది. చీరలు పంచిపెట్టడం గురించి తెలిసి చాలామంది మహిళలు ఇంట్లో మూలుగుతోన్న మంచి మంచి చీరలను బ్యాంక్‌కు తెచ్చి ఇచ్చేవారు. ఇలా అందరూ ఇచ్చిన చీరలేగాకుండా సోషల్ మీడియాలో శారీ బ్యాంక్ గురించి ప్రచారం కల్పించి ఇతర నగరాల నుంచి కూడా చీరలను సేకరించి పేదవారికి ఇస్తోంది. నిజంగా ప్రతి మహిళా ఇలా ఆలోచిస్తే, అటు పర్యావరణానికి హానీ కలగదు. అటు నిరుపేదలను ఆదుకున్న వారూ అవుతారు. -
జీరో కోవిడ్ వ్యూహం తెచ్చిన తంటా...
Covid Mass Testing Mantra: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న చైనా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే జీరో కోవిడ్ పాలసీని అనుసరించాల్సిందే అంటూ ప్రజలపై కఠినతర ఆంక్షలు విధించి నిర్బంధించింది. ఓ పక్క చైనా జీరో కోవిడ్ పాలసీ అట్టర్ ప్లాప్ అయ్యి కేసులు పెరిగిపోతున్నా చైనా అధికారులు మాత్రం జీరో కోవిడ్ వ్యూహం అంటూ పట్టుకుని వేళాడారు. ప్రపంచ దేశాలన్ని విమర్శిస్తున్న తన మాటే శాసనం అంటూ మూర్ఖంగా వ్యవహారించింది చైనా. ఈ జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రజలందరికి పెద్ద ఎత్తున మాస్ కరోనా టెస్ట్‌లు నిర్వహించింది. దీంతో ఇప్పుడూ చైనాలో పెద్ద కొండలా వైద్య వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రస్తుతం చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘై, షెన్జెన్, టియాంజిన్‌లో ఇప్పుడు టెస్టింగ్ కియోస్క్‌ల వంటి వైద్య వ్యర్థాల నిలయంగా మారాయి. అదీగాక ఈ వ్యర్థాలను తొలగించాలంటే చైనా ప్రభుత్వం పై సుమారు పది బిలయన్ల డాలర్ల పైనే పెనుభారం పడుతుందని అధికారులు చెబుతున్నారు అసలే వరుస లాక్‌డౌన్‌తో దారుణమైన స్థితిలో ఉన్న చైనా ఆర్థిక పరిస్థితికి ఇదొక పెద్ద సవాలు అని అంటున్నారు. పైగా ఈ వైద్యవ్యర్థాలు తొలగించలేని విధంగా అసాధారణ రీతిలో పెరిగిపోతున్నాయని షాంఘైలోని న్యూయార్క్ పర్యావరణ నిపుణుడు యిఫీ లీ అన్నారు. అదీగాక చైనా 2060 నాటికల్లా కార్బన్ న్యూట్రల్‌గా మార్చాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడమే కాకుండా వాయు, జల కాలుష్యాన్ని సైతం అరికట్టే చర్యలు చేపట్టింది కూడా. కానీ ఇపుడూ ఈ కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వైద్యవ్యర్థాలను చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం అంటున్నారు చైనా అధికారులు. -
ఈ విషయంలో మన వంతు బాధ్యత నెరవేర్చాల్సిందే
ఇటీవల ఇంటర్నెట్లో ఓ ఫోటో బాగా పాపులర్ అయ్యింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యాంటీన్లో ఏర్పాటు చేసిన ఈ బోర్డు ఎంతో మందిని ఆలోచనలో పడేంది. అలాంటి వారిలో సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే హర్ష్ గోయెంకా కూడా ఉన్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఆ ఫోటోకు తనవంతు సమాచారం జోడించి మరింత అర్థవంతంగా మార్చారు. అంతేకాదు ఆ సబ్జెక్టుపై మనం నిర్వర్తితంచాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఇంతకీ నెట్టింట వైరల్‌గా మారిన టీసీఎస్ క్యాంటీన్‌కి సంబంధించిన సదరు ఫోటోలో.. తినడానికి ఎన్ని ఐటమ్స్ కావాలో అన్ని తీసుకోండి. కానీ తీసుకున్న ఐటమ్స్‌ని పూర్తిగా తినండి. వృధా చేయకండి. క్రితం రోజు ఇలా వృధా అయిన ఆహారం 45 కేజీలు. దీంతో ఒక 180 మందికి భోజనం పెట్టవచ్చంటూ వివరించారు. In industrialised regions, almost half of the total food squandered, around 300 million tonnes annually, occurs because producers, retailers and consumers discard food that is still fit for consumption. Let’s all do something about it…. pic.twitter.com/TJEqI5jr0z — Harsh Goenka (@hvgoenka) June 7, 2022 ఈ ఫోటోకు హార్ష్ గోయెంకా మరింత సమాచారం అందిస్తూ ... హోటల్ ఇండస్ట్రీలో ఏటా 3000 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతోందంటూ తెలిపారు. ఆహారం తయారీదారు నుంచి అమ్మకందారు తినేవాళ్ల వరకు అందరూ ఎంతో కొంత తినదగిన పదార్థాలను చెత్తకుండీ పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది తిండికి అల్లల్లాడుతుంటే మరోవైపు ఇంత వృధా చేయడం సరైన పనా అని ప్రశ్నించారు. ఈ విషయంలో మనమంతా ఏదో ఒకటి చేయాలంటూ సూచించారు హార్ష్ గోయెంకా. చదవండి: బిల్‌గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా? -
బాక్స్ కథా చిత్రం: ఈ కథేంటో.. ఇందులో మతలబు ఏంటో..
అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు దూరం.. 63 కిలోమీటర్లు మధురవాడ నుంచి కాపులుప్పాడకు దూరం.. 8 కిలోమీటర్లు ఇందులో ఏది దగ్గరని ఒకటో తరగతి పిల్లాడిని అడిగినా ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఘనత వహించిన జీవీఎంసీలోని కాంట్రాక్టర్లు మాత్రం మధురవాడ నుంచి కాపులుప్పాడకే దూరం ఎక్కువ అని చెబుతున్నారు. జీవీఎంసీలోని ప్రజారోగ్యశాఖ అధికారులు సైతం అవునంటూ తాళం వేస్తున్నారు. అంతేకాదు మీరు చెప్పిన సమాధానమే కరెక్టేనంటూ బహుమతి కింద కాంట్రాక్ట్‌ను సైతం అప్పగించారు. ఈ కథేంటో.. ఇందులో మతలబు ఏంటో.. ఈ బాక్సు టెండర్ల వ్యవహారమెంటో తెలుసుకుంటే మతిపోతోంది. సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు బాక్సు టెండర్లు పిలిచారు. ఓ నెలలో ఒక షాపు నుంచి వచ్చే చికెన్/మటన్ వ్యర్థాలను మధురవాడ నుంచి కాపులుప్పాడకు తరలించేందుకు రూ.110కు కాంట్రాక్టర్లు కోట్ చేసి పనులను దక్కించుకున్నారు. అయితే, అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు ఇవే వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.100 మాత్రమే కోట్ చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు సైతం గుడ్డిగా తలూపి పనులను అప్పగించారు. ఈ లెక్కన అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు అయ్యే వ్యయం కంటే.. మధురవాడ నుంచి కాపులుప్పాడకు అయ్యే వ్యయమే ఎక్కువని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు కూడా అవునంటూ పనులను అప్పగించారు. అయితే, ఈ వ్యవహారంలో అసలు ‘చేపల’ కథ వేరే ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వద్దు.. బాక్సులే ముద్దు...! వాస్తవానికి జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల్లో వ్యర్థాలను తరలించేందుకు టెండర్లను గత ఏడాది జూన్‌లోనే పిలిచారు. కరోనా నేపథ్యంలో దీనిని రద్దు చేశారు. తాజాగా తిరిగి టెండర్లను పిలిచారు. అయితే ఆన్లైన్ టెండర్లు కాకుండా బాక్సు టెండర్లను ఆహ్వానించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్లైన్ టెండర్లను ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారానే చేపడుతున్నారు. అయితే, జీవీఎంసీలో మాత్రం బాక్సులను వదలడం లేదు. అందులోనూ ప్రజారోగ్య విభాగంలోనే అధికంగా బాక్సు టెండర్లను ఆశ్రయించడంలో ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నకు సమాధానం అంతుచిక్కడం లేదు. అక్కడ రూ.100.. ఇక్కడ రూ.110 జీవీఎంసీ పరిధిలో 2019 లెక్కల ప్రకారం 1,600 చికెన్, మటన్ షాపులున్నాయి. రోజూ ఈ షాపుల నుంచి వచ్చే 60 టన్నుల వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించాల్సి ఉంటుంది. ఇందుకు టెండర్లు ఆహ్వానించగా పలు విచిత్రాలు చోటుచేసుకున్నాయి. అనకాపల్లిలో సేకరించిన వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించేందుకు షాపునకు రూ.100 అయితే, మధురవాడలోని షాపుల నుంచి సేకరించిన వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.110 లెక్క టెండర్లను దక్కించుకోవడం గమనార్హం. వాస్తవానికి అనకాపల్లితో పోల్చుకుంటే మధురవాడ చాలా దగ్గర. అయినా ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీస్తే.. చేపల యజమానుల చేతివాటమని తెలుస్తోంది. అనకాపల్లి నుంచి సేకరించిన వాటిని యలమంచిలి, పెందుర్తిలోని చేపల చెరువులకు తరలించవచ్చనేది వారి ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇది చట్టరీత్యానేరం. దీనిపై జీవీఎంసీతో పాటు మత్స్యశాఖ అధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. -
ఆస్పత్రుల్లో మురుగుశుద్ధి కేంద్రాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో జీవ వైద్యవ్యర్థాల నిర్వహణలో భాగంగా వ్యర్థజలాలను శుద్ధి చేయడానికి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, టిమ్స్ సహా రాష్ట్రవ్యాప్తంగా 20 ఆస్పత్రుల్లో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందు కోసం రూ.68.31 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు. ఆస్పత్రుల్లోని ద్రవవ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల్సి ఉందని, లేనట్లయితే పరిసరాలు, సమీప నీటివనరులు కాలుష్యం బారిన పడే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, సూర్యాపేట, నల్లగొండ, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, సిద్దిపేట మెడికల్ కాలేజీ, ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వాస్పత్రుల్లో కూడా మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రూ.52.59 కోట్లను ప్లాంట్ల ఏర్పాటుకు, మరో రూ.15.72 కోట్లు మూడేళ్లపాటు ఈ ప్లాంట్ల నిర్వహణకు ఖర్చు చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీల నుంచి వెలువడే వ్యర్థాలతోపాటు పేషెంట్ల బెడ్లను, బెడ్ షీట్లను, వార్డులను శుభ్రం చేసే సమయంలో వెలువడే వ్యర్థాల్లోని వైరస్లు పలు ఇన్ఫెక్షన్లు, కాలుష్యానికి కారకమవుతాయని హరీశ్ చెప్పారు. -
అమిత్ షా సవాల్‌కి సై.. బీజేపీతో పొత్తుపై ‘మహా’ సీఎం సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సవాలును స్వీకరిస్తున్నట్లు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే జన్మదిన వేడుకల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల శివసేనకు 25 సంవత్సరాలు వృధాగా పోయాయనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. మహారాష్ట్రకు బయటకూడా శివసేన కార్యకలాపాలను విస్తరిస్తామని, జాతీయస్థాయికి ఎదుగుతామని చెప్పారు. బీజేపీ ఎదుగుదలలో సేనలాంటి పలు ప్రాంతీయ పార్టీల సహకారం ఉందని, ఆసమయంలో చాలాచోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవికాదని గుర్తు చేశారు. హిందుత్వకు అధికారమివ్వాలనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, అంతేకానీ అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వను వాడుకోలేదని ఉద్దవ్ చెప్పారు. బీజేపీ అనుకూలవాద హిందుత్వ చేస్తుందని ఆయన విమర్శించారు. రాజకీయ అధికారం కోసమే బీజేపీ కాశ్మీర్లో పీడీపీతో, బీహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకుందన్నారు. సేన, అకాలీదళ్ లాంటి పాత మిత్రులు పోవడంతో ఎన్డీఏ పరిధి తగ్గిందన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో తమ పొత్తును ఆయన సమర్ధించుకున్నారు. బీజేపీ మిత్రపక్షాలను వాడుకొని వదిలేస్తుందన్నారు. తాము బీజేపీని వదిలేశాము కానీ హిందుత్వను కాదని చెప్పారు. ఎప్పటికైనా ఢిల్లీ గద్దెను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీలాగా కాదని, వ్యవస్థలను గౌరవిస్తాయని చెప్పారు. బాల్ ధాకరే జన్మదినోత్సవం రోజునే శివసేన ఆవిర్భవించింది. దీంతో పార్టీ, పార్టీ వ్యవస్థాపకుడి జన్మదిన వేడుకలను కలిపిజరుపుతారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని శివసైనికులకు ఉద్దవ్ పిలుపునిచ్చారు. ఇటీవలే ఉద్దవ్ వెనుముక సర్జరీ చేయించుకున్నారు. తన ఆరోగ్యంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. -
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. వ్యర్ధాలపై తస్మాత్ జాగ్రత్త..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడం.. వైరస్ బారిన పడి పొరుగు రాష్ట్రాలకు చెందిన రోగులు సిటీకి వచ్చి ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండడంతో రోగులు వాడిపడేసిన వ్యర్థాలపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీటి సేకరణ శాస్త్రీయంగా జరగని పక్షంలో ముప్పు తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం సుమారు 23 వేల కిలోల జీవ వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్, పరిసర ప్రాంతాలనుంచే కావడం గమనార్హం. ఈ వ్యర్థాల్లోనే కోవిడ్ వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. సాధారణ చెత్తతో పాటు.. రోగులు వాడి పడేసిన మాస్కులు, గ్లౌజులు, సిరంజిలు, ఇతర వ్యర్థాలను తరలిస్తే పారిశుద్ధ్య సిబ్బంది, స్థానికులు కూడా కోవిడ్ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిస్థితి విషమించకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పీసీబీ.. అటు ఆస్పత్రులు.. సిటీజన్లు వ్యర్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: భార్యభర్తల మధ్య గొడవ.. భర్త అదృశ్యం శాస్త్రీయ పద్ధతుల్లోనే.. ► ఓమిక్రాన్ వైరస్ త్వరితంగా వ్యాపించే అవకాశం ఉండడంతో.. రోగులు వాడిపడేసిన వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించడంతో పాటు.. జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ కేంద్రాలకు తరలించాలి. ► పలు ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, ఇంజెక్షన్లు, ప్లాస్టిక్ వస్తువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలు, కవర్లలో వేసి సీల్ చేసిన అనంతరమే శుద్ధి కేంద్రాలకు తరలించాలి. వీటిని ఎవరూ తాకే పరిస్థితి ఉండరాదు. వ్యర్థాలను ఆరుబయట గాలికి ఉంచరాదు. ► ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో వ్యర్థాల నిల్వ, సేకరణ, తరలించే సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనివ్వాలి. చదవండి: Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు! ► ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీగా వెలువడుతున్న జీవవ్యర్థాలను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. ► కోవిడ్ రోగులు వాడిపడేసిన మాస్క్‌లు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు, సిరంజిలు తదితరాలను తరలిస్తున్న సిబ్బంది తాకితే వారు కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉంది. ► వ్యర్థాలను నిర్లక్ష్యంగా నిల్వచేయడం, తరలించే ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయా లి. ఆస్పత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పౌరులకు పీసీబీ విస్తృత అవగాహన కల్పించాలి. -
చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు... వీటిని మనుషులు తింటే భయంకరమైన వ్యాధులు
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురుపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. ఏడాదంతా ఇదే దందా. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా పొరుగు జిల్లా మంచిర్యాలలోని చేపల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను తిన్న చేపలను మనుషులు తింటే క్యానర్స్వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ‘సాక్షి’ చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో మాఫియా దందా బయటపడింది. నమ్మలేని నిజాలు అనేకం వెలుగు చూశాయి. ఈ మాఫియా దందా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫిషరీష్ తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతినెలా మాఫియా ముట్టజెప్పే కాసులకు కక్కుర్తిపడి ఈ దందాపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్న యువకులు మాఫియాకు చికెన్ మార్కెట్ల అడ్డా... రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం, ఎఫ్‌సీఐ తదితర ప్రాంతాల్లోని చికెన్ మార్కెట్లు మాఫియాకు అడ్డాగా మారుతున్నాయి. పక్క జిల్లాకు సంబంధించిన ముఠా బహిరంగంగా ఈ దందా నిర్వహిస్తోంది. ఈ ముఠాకు బల్దియా అధికారులతోపాటు చికెన్ మార్కెట్ వ్యాపారులు సహకరిస్తున్నారు. చికెన్ వ్యర్థాల సేకరణే టార్గెట్.. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొందరు ముఠా సభ్యులు ప్రత్యేక వాహనాల్లో చికెన్ మార్కెట్లకు చేరుకుంటారు. వాహనంలో ముందుగానే ఏర్పాటు చేసుకున్న భారీ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కోళ్ల నుంచి తీసిన పేగులు, తల, కాళ్లు, చర్మం, ఈకలు సేకరిస్తారు. ఇలా ఒక్కో ట్రిప్పుకు సుమారు నాలుగు టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారు. పక్కా రూట్ మ్యాప్ ద్వారా సేకరణ చికెన్ వ్యర్థాలను సేకరించడానికి ఈ మాఫియా పక్కా రూట్ మ్యాప్ అమలు చేస్తోంది. ముందుగా గోదావరిఖని చికెన్మార్కెట్కు చేరుకుని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున వ్యర్థాలను సేకరించిన అనంతరం ఎల్బీనగర్, తిలక్‌నగర్, మార్కండేయకాలనీ, ఫైవింక్లయిన్ మీదుగా యైటింక్లయిన్‌కాలనీ చేరుకుంటుంది. ఈరూట్ మ్యాప్‌లోని అన్ని చికెన్‌సెంటర్ల నుంచి వ్యర్థాలను ముఠా సేకరిస్తుంది. మాఫియాకు సహకరిస్తున్న వ్యాపారులు చికెన్ వ్యర్థాలను సేకరించే మాఫియాకు పారిశ్రామిక ప్రాంతంలోని చికెన్ సెంటర్ల వ్యాపారులు, అసోసియేషన్ నాయకులు సహకరిస్తున్నారని తెలుస్తోంది. గతంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేవారు. అయితే ఈ మాఫియా క్యాట్‌ఫిష్ పెంపకానికి సేకరించడంపై దృష్టి పెట్టడంతో వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి వ్యర్థాలను ఇచ్చేందుకు నిరాకరించారు. వ్యర్థాలను తరలించడానికి ఈ మాఫియా బడా వ్యాపారులు, నాయకులు, అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యర్థాల అక్రమమార్గంతో ఆదాయానికి గండి రామగుండం నగరపాలక సంస్థకు వ్యర్థాలు కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా గతంలో నిబంధనలు రూపొందించారు. టన్ను వ్యర్థానికి రూ.వెయ్యి ఆదాయం వస్తుందని అంచనా వేసి వరంగల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు చికెన్ వ్యర్థాలను సేకరించే పనిని అప్పగించారు. ఇందుకు సదరు కాంట్రాక్టర్ రూ.5వేలు బల్దియాకు ఫీజు రూపంలో చెల్లించారు. ఇలా సేకరించిన వ్యర్థాలను సదరు కాంట్రాక్టర్ రంగారెడ్డి జిల్లాలోని ఓ కంపెనీకి తరలిస్తామనేది ఒప్పందం. ఇలా కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు సుమారు 2 మెట్రిక్ టన్నులకు పైగా కోళ్ల వ్యర్థాలు వెలువడుతాయి. ఈలెక్కన బల్దియాకు రోజుకు రూ.2వేల చొప్పున ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సదరు కాంట్రాక్టర్‌కు వ్యర్థాలను మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. పైగా కొందరు అధికారుల అండదండలతో ఈ వ్యర్థాలను కాంట్రాక్టర్‌కు కాకుండా అక్రమ మార్గాల్లో చేపల చెరువులకు తరలించడం వివాదాస్పదంగా మారుతోంది. -
లాక్డౌన్లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!
మనం చాలా రకాలుగా చిత్రాలను గీయడం చూశాం. కానీ జుట్టుతో చిత్రాలను రూపొందించడం తెలుసా? అది కూడా యూకే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చిత్రాన్ని రూపొందించింది. అసలు ఎవరు ఈ చిత్రాన్ని రూపొందించారు ఎక్కడ ఏంటో చూద్దాం రండి. (చదవండి: ప్లీజ్ అంకుల్ నన్ను కూడా టెస్ట్ చేయండి) వివరాల్లోకెళ్లితే.....కోవిడ్ 19 విపత్కర సమయాల్లో తనదైన వ్యూహంతో దేశాన్ని సమర్ధవంతంగా నడిపించిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కృతజ్ఞతలు తెలిపే నిమిత్తం డేవినియా ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ మేరకు సోమర్సెట్లో సెలూన్‌ను నడుపుతున్న డావినియా సెలూన్లో సేకరించిన జుట్టు వ్యర్థాలతో 5 అడుగుల బోరిస్ జాన్సన్ చిత్రాన్ని రూపొందించింది. అయితే ఆమె ఈ పనిని కేవలం రెండు రోజుల్లో పూర్తి చేసింది. ఈ మేరకు డేవినియా మాట్లాడుతూ.... లాక్డౌన్లలో ప్రజల జుట్టు ఎంత పెరిగిందో చెప్పేందుకు ఈ చిత్రం ఒకరకరంగా దోహదపడుతుంది. అంతేకాదు ఈ లాక్డౌన్ వేళ సెలున్ల ప్రాముఖ్యతను ప్రజలందరు గుర్తించారు. ఈ కుడ్యచిత్రాన్ని బోరిస్ వ్యక్తిగతంగా వీక్షించాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది. (చదవండి: కుక్కతో చిరుత స్నేహం.. వీడియో వైరల్) -
ఓల్డ్ కార్ సీట్ బెల్ట్‌తో బ్యాగ్‌లు
చాలామంది ఉపయోగ పడని వస్తువులను, వ్యర్థాలను రీసైకిల్ చేసి వాటితో రకరకాలు వస్తువులను తయారు చేసే స్టార్ట్ప్ బిజినెస్‌లను మనం చాలానే చూశాం. ప్రస్తుతం యువత కొంగొత్త ఆవిష్కరణలతో చెత్తను తొలగించి పర్యావరణాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అదే కోవకు చెందినవారు గుర్గావ్కి చెందిన గౌతమ్ మాలిక్. ఆయన పేరుకుపోతున్న పారిశ్రామిక వ్యర్థాలకు అడ్డుకట్ట వేసేలా పర్యావరణ రహిత జాగ్గరీ బ్యాగ్‌లు తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆయన ఎవరు? జాగ్గరీ బ్యాగ్‌లు ఏంటి అనే కదా సందేహం అసలు విషయం ఏమిటో చూద్దాం. హర్యానా: గుర్గావ్ హర్యానాలో అతిపెద్ద నగరం, ఇది హర్యానా ఆర్ధిక, పారిశ్రామిక రాజధానిగా పరిగణిస్తారు. ఈ గుర్గావ్కి చెందిన ఒక స్టార్ట్ప్ కంపెనీ పాత కార్ల సీట్ బెల్ట్, మాజీ ఆర్మీ అధికారుల కాన్వాస్(జనపనారతో తయారు చేసిన గట్టి వస్రం (గుడారాలు(టెంట్లకు ఉపయోగించేది), సరకులు రవాణ చేయడానికీ ఉపయోగించే కార్గో కాన్వాస్ వంటి మెటీరియల్స్ సాయంతో ఈ జీరో వేస్ట్ జాగ్గరీ ఫ్యాన్సీ బ్యాగులు తయారు చేశాడు. ఈ స్టార్ట్ప్ కంపెనీ వ్యవస్థాపకులు గౌతమ్ మాలిక్, అతని భార్య భావన దండోనా, తల్లి డాక్టర్ ఉషా మాలిక్‌లు. (చదవండి: స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్) కార్యరూపం దాల్చేలా చేసిన ప్రయత్నాలు..... మొదట్లో ట్రక్‌లో వాడే టార్సాలిన్(సరకు తడి అవ్వకుండా అల్లిన వస్త్రం) , పాతకాలంలో వాడే నులక మంచం నవారు, టీపాయ్ తదితర వస్తువులతో ప్రారంభించనప్పుడు అంతగా ఫలితానివ్వలేదన్నారు గౌతమ్. ప్లాస్టిక్ రహిత బ్యాగ్‌లు తయారు చేయడమేకాక గుట్టగుట్టలుగా పేరుకుపోతున్న పారిశ్రామిక వ్యర్థాలను నివారించాలనేది ఆలోచన కానీ కార్యరూపం దాల్చడానికీ చాలా శ్రమపడవలసి వచ్చిందని గౌతమ్ చెప్పారు. ఏవిధంగా తయారుచేయాలి అనుకుంటూ ఉండగా పాత కార్లలో ఉండే సీట్ బెల్ట్‌తోపాటు హైవేలపై భారీ కంటైనర్‌లోని సరుకును కట్టడానికీ వాడే కార్గో బెల్టలు 4వేల పౌండ్ల బరువును మోయగల సామర్థ్యం గల బెల్ట్‌లపై దృష్టి సారించడంతో మంచి ఫలితాన్ని సాధించగలిగానన్నారు. అంతే కాదు ఈ జాగ్గరీ బ్యాగ్‌లు చాలా ఏళ్ల వరకు మన్నికగా ఉంటాయని అందుకు తాను ఆరేళ్లుగా వాడుతున్న వాలెట్టే(పర్సు) నిదర్శనం అన్నారు. ఎందుకు ఆ పేరు పెట్టారంటే ? గౌతమ్ కుటుంబంతో సహా 2010తో అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత ఈ కామర్స్ కంపెనీలో క్రియోటివ్ హెడ్‌గా పనిచేశారు. ఈ అనుభవం ఈ స్టార్టప్ కంపెనీ ఆవిష్కరణకు ఉపకరించింది. దీంతో వస్తువుల తయారీదారులకు మార్కెట్‌కి మధ్య అంతర్యాన్ని తగ్గించేలాకృషి చేశాడు. భారతీయులు చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యం కోసం బెల్లాన్ని ఏవిధంగా వినియోగిస్తారో అలా పర్యావరణానికి హాని కలిగించే బ్యాగ్‌ల స్థానంలో ఈ బ్యాగ్‌లు వచ్చాయి కాబట్టి జాగ్గరీ బ్యాగ్ అని పేరు పెట్టామని గౌతమ్ వివరించారు. (చదవండి: రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది) -
ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్... ఇప్పుడేమో..
నేహా బగోరియా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకప్పుడు. ఇప్పుడామె పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను తలకెత్తుకున్న ఓ సంస్కర్త. నిజమే... కార్యకర్త బాధ్యత సమస్య పట్ల సమాజానికి అవగాహన కల్పించడం తో పూర్తవుతుంది. సంస్కర్త మీద సమస్యకు పరిష్కారాన్ని సూచించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆమె నీటి సంరక్షణ కోసం ఓ వినూత్నమైన పరిష్కారమార్గాన్ని చూపించింది. ఆలోచన మంచిదే వెస్టర్న్ టాయిలెట్‌ను ఒకసారి ఫ్లష్ చేస్తే, టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు విడుదలవుతుంది. నేహ రూపొందించిన సాధనం ఉపయోగిస్తే ఒక్క చుక్క నీరు కూడా అవసరం ఉండదు. రోజంతా వాడినా సరే టాయిలెట్ల నుంచి దుర్వాసన రాదు. ఈ సాధనం పేరు ఎకో ట్రాప్లిన్. ఇది సెన్సర్ ఆధారంగా పని చేస్తుంది. సెన్సర్ యాక్టివేట్ అవగానే, ఎకో ట్రాప్లిన్ సాధనంలో నింపిన రసాయన ద్రవం విడుదలవుతుంది. టాయిలెట్ దుర్వాసనను ఈ రసాయన ద్రవం తుడిచి పెట్టినట్లే తీసుకుపోతుంది. టాయిలెట్ వాడటం ఆగిపోగానే ఈ ద్రవం విడుదల కూడా ఆగిపోతుంది. బాల్యంలో ఓ సంఘటన ముంబయిలో పెరిగిన నేహ సొంతూరు రాజస్థాన్ రాష్ట్రం, బీవార్ సమీపంలోని ఓ కుగ్రామం. నేహ తాత, నానమ్మ అక్కడే ఉండేవారు. ఆమె చిన్నప్పుడు నానమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి విచిత్రమైన జీవనశైలి ఆమెను ఆశ్చర్యపరిచింది. నీటి వృథాను అరికట్టడానికి తనకు తెలిసిన, అప్పటికి తన ఊహకు తట్టిన ఉపాయాలన్నింటినీ అక్కడి వాళ్లకు వివరించింది. నీటి వినియోగం అవసరతను, దుర్వినియోగం అయితే ఎదురయ్యే కష్టాలను తెలియచెప్పింది. సెలవుల తర్వాత నేహ తిరిగి ముంబయి వచ్చేసింది. చదువుల్లో పడి నీటి సంరక్షణ ఆలోచన పక్కన పెట్టింది. నచ్చని ఉద్యోగం కాలం గడిచింది. నేహ చదువు పూర్తయింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరింది. నాలుగేళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత ఆమెలో అంతర్యానం మొదలైంది. ‘జీవితం అంటే ఇది కాదు’ అనిపించసాగింది. అప్పుడు ఆమె దృష్టి కంప్యూటర్ మీద నుంచి సమాజం మీదకు మళ్లింది. ఈ సారి ఆమెకు గమనింపులో ఒక్కోచోట అవసరానికి మించిన నీటి వాడకం, ఒక్కో చోట కనీస అవసరాలకు కూడా నీరు లభించకపోవడం వంటి వైరుధ్యాలు కూడా అర్థమయ్యాయి. నీరు సమృద్ధిగా వాడే వాళ్ల దగ్గరకు వెళ్లి ‘నీటి వనరును పరిమితంగా వాడండి’ అని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని కూడా అనుకుందామె. వేదికలెక్కి ఉపన్యాసాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద పోస్టులతో సమస్య తీవ్రతను పదిమందికి తెలియచేయడం వరకే సాధ్యం, మరి పరిష్కారం కోసం ఏమి చేయాలి? ఏదో ఒకటి చేయాలనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన రూపమే ఈ ఎకో ట్రాప్లిన్ సాధనం. నేహా తన ఆవిష్కరణతో 2013లో ‘టాపు సస్టెయినబుల్ సొల్యూషన్స్’ పేరుతో ‘ఎకో ట్రాప్లిన్’ సాధనాల తయారీ కంపెనీ స్థాపించింది. నేహ తొలిదశలో ఎనిమిది వందల సాధనాలను తయారు చేసింది. వాటన్నింటినీ ప్రయోగాత్మకంగా ఉపయోగించి పరీక్షించింది. అవన్నీ విజయవంతంగా పని చేస్తున్నాయి. ఒక మంచి ఆలోచన ఒక కొత్త ఆవిష్కరణకు కారకం అవుతుందని నేహ నిరూపించింది. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
చెత్త ఏరుకునే వ్యక్తులు చితక్కొట్టుకున్నారు.. కారణం తెలిస్తే షాక్!
సాక్షి, చిక్కడపల్లి: చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పాత గొడవలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శివశంకర్‌రావు కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన భీమ్‌రెడ్డి(30), ముషీరాబాద్‌కు చెందిన సాయిప్రశాంత్(31), గురుమూర్తి(30)లు చెత్తకాగితాలు ఏరుకుంటూ ఫుట్‌పాత్‌లపై నివసిస్తున్నారు. తరచూ మద్యం తాగడంతో పాటు వైట్నర్ సేవిస్తుంటారు. ఇదిలా ఉండగా, భీమ్‌రెడ్డి, సాయిప్రశాంత్‌లకు గురుమూర్తితో పాతగొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఫుట్‌పాత్‌పై మళ్లీ గొడవపడ్డారు. భీమ్‌రెడ్డి, సాయిప్రశాంత్‌లు పక్కనే ఉన్న రాయితో గురుమూర్తి తలపై బాదడంతో తీవ్రగాయమైంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమోటోగా కేసు నమోదు చేసి భీమ్‌రెడ్డి, సాయిప్రశాంత్‌లను అదుపులోకి తీసుకున్నారు. గురుమూర్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ దాడికి ఓ అమ్మాయి కారణమని తెలుస్తోంది. నిందితులు భీమ్‌రెడ్డి, సాయి ప్రశాంత్‌లను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం గురుమూర్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని ఎస్ఐ వెల్లడించారు. -
కరోనా వ్యాక్సిన్ వృథాలో తెలంగాణ నంబర్ వన్
న్యూఢిల్లీ: మహమ్మారి వైరస్ నిరోధానికి తీసుకువచ్చిన వ్యాక్సిన్ వృథా అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ తర్వాతి స్థానంలో ఉందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ నిల్వ చేయడంలో.. భద్రపర్చడంలో.. టీకా వేసే సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వ్యాక్సిన్ వృథా అవుతోందని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా వ్యాక్సిన్ వృథా వివరాలను పట్టిక రూపంలో ప్రదర్శించింది. వాస్తవంగా వ్యాక్సిన్ వృథాను పది శాతంలోపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే పది శాతానికి కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణ 17.6 శాతం వ్యాక్సిన్ వృథా చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ 11.6 శాతం వృథా చేసి రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 9.4 శాతం వృథా చేసి మూడో స్థానంలో ఉంది. కర్నాటక మాత్రం జాతీయ రేటు 6.5 శాతం సమీపంలో 6.9 శాతంగా ఉంది. ఇదే నేపథ్యంలో కరోనా తీవ్రరూపంలో వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలకు కొన్ని సలహాలు ఇచ్చింది. రాష్ట్రాలకు మొత్తం 7.54 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ పంపిణీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి 16వ తేదీన భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్ ఇప్పటివరకు 3.58 కోట్ల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మార్చి 15 వరకు 8 మిలియన్ల డోస్‌లు పంపిణీ చేయాలని లక్ష్యం విధించుకున్నట్లు పేర్కొంది. -
కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ
సాక్షి, హైదరాబాద్ : పౌల్ట్రీఫారమ్‌లోని కోళ్ల వ్యర్థాల ఆధారంగా పనిచేసే తొలి బయోగ్యాస్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఏర్పాటైంది. హైదరాబాద్ శివారులోని ఉడిత్యాల్ గ్రామంలో సోలికా ఎనర్జీ, శ్రీనివాస హ్యచరీస్, ఎక్స్‌ఈఎంఎక్స్ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ ప్రాజెక్ట్ గురువారం ప్రారంభమైంది. భారతదేశ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేశారు. రోజుకు 2.4 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓఎల్) ఈడీ ఆర్ఎస్ఎస్ రావు ప్రారంభించారు. 4.50 లక్షల కోళ్లు కలిగిన అతిపెద్ద కోళ్ల ఫారమ్ పక్కన దీనిని ఏర్పాటుచేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని చౌకైన రవాణా పథకం కింద సోలికా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను అత్తాపూర్‌లోని ఐఓఎల్ ఔట్‌లెట్‌కు సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో 3.6 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రెండో బయోగ్యాస్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సోలికా ప్రమోటర్ హిమదీప్ నల్లవడ్ల తెలిపారు. -
కొత్తతరహాలో పంట వ్యర్థాల డీకంపోజ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఇరుగుపొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట కోత తర్వాత పొలంలో మిగిలిన పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఆయా రాష్ట్రాలు దట్టమైన కాలుష్యంతో నిండిపోయేవి. పూసా అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ ఈ ఏడాది, మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే డీకొంపోజ్ చేయడానికి నూతన సాంకేతికతని అభివృద్ధిపరిచిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు, ఈ సీజన్లో మిగిలిపోయిన పంటవ్యర్థాలను తగులబెడితే వచ్చే కాలుష్యాన్ని ఎదుర్కొనే సంసిద్ధత గురించి ఈ సమావేశంలో చర్చించారు. గత మూడు సంవత్సరాలుగా వ్యర్థాల దహనం తగ్గినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి మున్ముందు మరిన్ని చర్యలు అవసరమని జవదేకర్ అన్నారు. ఈ వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.1,700 కోట్లు కేటాయించింది.వీటిలో వ్యర్థాల అదుపు చేయడానికి ప్రస్తుతం, వ్యక్తులకు 50 శాతం, సహకార సంఘాలకు 80 శాతం ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. -
భో‘జనం’ వృథా తగ్గించారు!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విస్తృతి పెరుగుతున్న కొద్దీ ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. దీంతో ఆహార వృథా కూడా తగ్గుతోంది. బయట అడుగు పెట్టేందుకు జంకడం, ఇంటి భోజనానికే పరిమితం కావడం.. ఆర్థిక పరిస్థితులు తలకిందులవ్వడంతో ఆచితూచి ఖర్చు చేస్తుండటం.. విందులు, వినోదాలు తగ్గించి, ఆరోగ్య సంరక్షణకై పోషక ఆహారానికి ప్రాధాన్యం పెరగడం.. తదితరాలు ఆహార వృథా తగ్గడానికి కారణాలు. లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితులతో పోలిస్తే 40 నుంచి 18 శాతానికి ఆహార వృ«థా తగ్గిందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఎన్నిమార్పులు తెచ్చిందో.. అధిక తిండితో ఊబకాయం, డయాబెటిస్, గ్యాస్ట్రిక్ వంటి రోగాలు వస్తాయని, వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న వైద్యుల సూచనల మేరకు ప్రజలు బయటి ఆహారాన్ని పూర్తిగా తగ్గించారు. తృణధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, చికెన్, బ్రౌన్‌రైస్ వంటి ఆహారపు అలవాట్లు పెంచుకున్నారు. నూనె వంటకాలను తగ్గించారు. సాధారణంగా గృహాల్లో 23 శాతం ఆహారం వృథా ఉంటే అది ఇప్పుడు 15 శాతానికి తగ్గింది. ముఖ్యంగా గ్రామాల కంటే పట్టణాల్లో ఆహార వృథా ధోరణి ఎక్కువ. ఎక్కువ వంటకాలు, రాత్రి మిగిలిన వంటకాలను మరుసటి రోజు పారేయడం, బయటి ఆహారాన్ని తెచ్చుకోవడం వంటి అలవాట్లతో పట్టణాల్లో వృథా 50–55 శాతం ఉంటుంది. అది గ్రామాల్లో 30–35 శాతమే. పట్టణాల్లోని ఎగువ, మధ్య తరగతి ప్రజల ఆర్థిక మూలాల్ని కోవిడ్ చిన్నాభిన్నం చేసింది. వ్యాపారాలు, జీతభత్యాలు, ఉద్యోగాల్లో కోతలు, పెరుగుతున్న ధరల నేపథ్యంలో పట్టణ ప్రజల ఆదాయం సుమారు 40 శాతం మేర తగ్గింది. నెల చివరికొచ్చే సరికి చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి. దీనికి తోడు కూరగాయల ధరలు 30 నుంచి 35 శాతం, ఇతర నిత్యావసరాల ధరలు 20–25 శాతం పెరిగాయి. దీంతో పొదుపు తగ్గింది. ఫలితంగా అవసరమైన మేరకు, తాజాగా ఉండే ఆహారాన్నే స్వయంగా వండుకునే అలవాట్లు పెరిగాయి. భిన్న రకాలైన వంటకాలు చేసినప్పుడు 67 శాతం ఆహారం వృథా అవుతుండగా, ప్రస్తుతం ఇది తగ్గింది. పెళ్లిళ్లు, పేరంటాలు లేకపోవడమూ కారణమే... అన్నింటికన్నా ముఖ్యంగా పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టినరోజు వేడుకలు, ఇతర సామూహిక కార్యక్రమాలు పూర్తిగా తగ్గాయి. వివాహాది కార్యాల్లో ఆహారపు వృథా 40–45 శాతం ఉంటుండగా, ప్రస్తుతం ఇలాంటి కార్యక్రమాలకు హాజరు తగ్గడం, ఎక్కువ రకాలైన వంటకాలకు ఫుల్స్టాప్ పడటం వంటి కారణాలతో ఈ వృథా 25 శాతానికి తగ్గినట్లు జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో అతిథులు హాజరైన సమయంలో వృథా 74 శాతం వరకు ఉండేది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ఆహారపు వృథా సుమారుగా 40 శాతం వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లోనే 75 శాతానికి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. చాలా రెస్టారెంట్లు తమ మెనూ తగ్గించాయి. డిమాండ్ ఉన్న కొద్ది వంటకాలనే అందుబాటులో ఉంచాయి. దీంతో వృథా చాలా మేరకు తగ్గింది. దేశవ్యాప్తంగా ఏటా 40 శాతం మేర వృథా ఉండగా, అది లాక్డౌన్ తర్వాత 18 శాతం మేర తగ్గిందని ఇటీవలి పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అవలంబిస్తున్న ఆహార ధోరణినే మున్ముందూ కొనసాగిస్తామని 80 వాతం మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
కోవిడ్ బయో మెడికల్ వ్యర్థాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో భాగంగా పకడ్బందీ చర్యలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టి నిలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు దాదాపు రెండు టన్నుల బయో మెడికల్ వ్యర్థాలు పోగవుతున్నాయి. వీటిని రాష్ట్రంలోని 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ సెంటర్ల ద్వారా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్నారు. గత మార్చి 19 నుంచి ఇప్పటివరకు 281.8 టన్నుల వేస్టేజ్‌ను సేకరించి, నిర్వీర్యం చేసినట్లు పీసీబీ అధికారులు వెల్లడించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ సందర్భంగా పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్–19 బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు అనుగుణంగా కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలను పీసీబీ సిద్ధం చేస్తోంది. అన్ని రకాల కాలుష్య సమస్యలనూ అధిగమించేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను కాల్చి వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భారీగా జరిమానాలను విధించే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. (కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి రూ.25 లక్షలు) -
అక్షరాలా లక్ష టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఎంతోమంది ముఖ్యమంత్రుల అధికారిక కార్యకలాపాలకు వేదిక. ఎన్నో కీలక నిర్ణయాలకు సాక్షి. పాలనాపరమైన సంస్కరణలకు కేంద్ర బిందువు, ఎంతోమంది సమస్యల పరిష్కారానికి నెలవు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉండగా ప్రధాన పరిపాలన కేంద్రం. అదే సచివాలయం. కొత్త సచివాలయాన్ని వాగ్దానం చేస్తూ ఇటీవల కాలగర్భంలో కలిసిపోయింది. హుస్సేన్‌సాగర్ తీరంలో ప్రశాంతంగా కనిపించే సచివాలయ భవన సముదాయం ఇప్పుడు మట్టిదిబ్బగా మారింది. కొత్త భవనం కోసం నెల క్రితం ప్రభుత్వం పాత భవనాల సముదాయాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. కూల్చి వేతలు చాలా వేగంగానే సాగాయి. మధ్యలో భారీ వర్షాల వల్ల కొంత ఇబ్బంది కలిగింది. వ్యర్థాల తరలింపు గత నెలరోజులుగా సాగుతోంది. తరలింపు మరో పక్షం రోజులు పట్టే అవకాశముంది. కూల్చివేతతో ఏర్పడ్డ వ్యర్థాల పరిమాణం ఏకంగా లక్ష టన్నులు ఉండటమే దీనికి కారణం. ఇంతవరకు నగరంలో ఒకచోట లక్ష టన్నుల పరిమాణంలో కూల్చివేత వ్యర్థాలు ఏర్పడటం ఇదే ప్రథమం. ఆ వ్యర్ధాలను తొలుత నగర శివారులోని క్రషర్ల వల్ల ఏర్పడ్డ భారీ గోతులలో వేయాలని భావించారు. క్రషర్ల గోతులతో ఎన్నో ఇబ్బందులు రావటమే కాకుండా పర్యావరణం పరంగానూ అవి సమస్యలకు కారణమవుతున్నాయి. వాటిని పూడ్చాలంటే భారీ పరిమాణంలో మట్టి అవసరం. అంత మట్టి దొరకక గోతులు అలాగే ఉన్నాయి. సచివాలయ కూల్చివేత వ్యర్థాలతో వాటిని పూడ్చాలని భావించినా.. ఆ తర్వాత అధికారులు మనసు మార్చుకున్నారు. వ్యర్థాలను పునర్వినియోగంలోకి తేవాలని నిర్ణయించి, నగర శివారులో ఉన్న రాంకీ సంస్థ ఆధ్వర్యంలోని రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. 60 వేల ట్రక్కుల లోడ్..: ఏకంగా లక్ష టన్నుల వ్యర్థాలు ఏర్పడటంతో వాటి తరలింపు పెద్ద సమస్యగా మారింది. ఆ వ్యర్థాలు ఏకంగా 60 వేల ట్రక్ లోడ్ల పరిమాణంలో ఉండటమే దీనికి కారణం. నెల రోజులుగా నిత్యం వంద ట్రక్కులతో దీన్ని రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం రాంకీ సంస్థకు ఒక టన్నుకు రూ.91 చొప్పున ఛార్జీ కూడా చెల్లిస్తోంది. ఆ వ్యర్థాల నుంచి మళ్లీ వినియోగించే సామగ్రిని రాంకీ సంస్థ రూపొందిస్తోంది. వాటిని కొత్త సచివాలయ నిర్మాణంలో వినియోగించాలా వద్దా అన్న విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. నగరంలో ప్రస్తుతం ఇసుక లభించటం కష్టంగా మారింది. దీంతో కూల్చివేత వ్యర్థాల నుంచి భారీ మొత్తంలో పునర్వినియో గించేలా ఇసుకను రూపొందిస్తున్నారు. దాన్ని ప్రధాన నిర్మాణాల్లో కాకుండా అనుబంధ నిర్మాణాలకు వినియోగిస్తారు. ప్రధాన నిర్మాణాలకు కూడా ప్లాస్టరింగ్‌కు వినియోగిస్తారు. వ్యర్థాలలోని ఇనుము, ప్లాస్టిక్‌ను కూడా పునర్వినియోగించేలా మారుస్తున్నారు. ప్రహరీలు, ఇతర నిర్మాణాలకు కావాల్సిన భారీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బ్లాక్‌లను కూడా రూపొందిస్తున్నారు. ఇక ఫుట్‌పాత్‌లు, ఫ్లోరింగ్‌కు వాడుకునేలా జీఎస్బీ మెటీరియల్, ఫుట్‌పాతలపై పరిచే ఇంటర్‌లాకింగ్ టైల్స్ తయారు చేస్తున్నారు. 95 శాతం వ్యర్థాలు పునర్వినియోగం.. కూల్చివేత వ్యర్థాల్లో 95 శాతం వరకు మెటీరియల్ పునర్వినియోగానికి వీలుగా ఉంటుంది. ఐదు శాతం మాత్రం సిల్ట్‌గా వృథా అవుతుంది. ఇక నిర్మాణంలో మంచి నాణ్యమైన మెటీరియల్ ఉంటే పునర్వినియోగ మెటీరియల్ 98 శాతం వరకు ఉంటుందని రాంకీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సచివాలయ వ్యర్థాలS నుంచి 98 శాతం వరకు రీసైక్లింగ్ మెటీరియల్ ఉంటుందన్నారు. -
రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా!
సాక్షి, హైదరాబాద్: పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ పాలకవర్గాలు కఠినంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త పారవేస్తే.. బాధ్యులకు రూ.500 జరిమానా విధించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా గ్రామీణులకు అవగాహన కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి శనివారం పిలుపునిచ్చారు.పల్లె ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా.. పంచాయతీల పాలనా సామర్థ్యాలను మెరుగుపరచడమే ధ్యేయంగా.. పల్లె ప్రగతి స్ఫూర్తితో జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా.. కరోనా మహ మ్మారి పల్లె గడప తొక్కకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చదనం–పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులను కూడా ఈ డ్రైవ్‌లో భాగస్వాములను చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో తొలి రోజు సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించాలని, నీరు నిలిచి ఉన్న గుంతలను మూసివేయాలని సూచించారు. ఆ తర్వాత సమావేశం నిర్వహించి.. 8 రోజులపాటు చేయాల్సిన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని పిలుపునిచ్చారు. డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, దిగువ ప్రాంతంలోకి వర్షపు నీరు ప్రవహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత ఉండేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. రక్షిత నీటి పథకాలను ప్రతీ నెలా 1,11,21వ తేదీల్లో విధిగా శుభ్రపరచాలని, లీకేజీలు అరికట్టాలన్నారు. -
కరోనా వేస్ట్ ట్రాకింగ్‌కు యాప్!
కరోనా పాజిటివ్ రోగులు, అనుమానితులకు సంబంధించిన వైద్య వ్యర్థాల సేకరణ, నిర్వహణ, రవాణా, శుద్ధి ప్రక్రియలు, నిర్మూలన వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధమైంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ రోగులు, అనుమానితుల జీవ వ్యర్థాల నుంచి కూడా వైరస్ సోకుతుందే మోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. దీంతో ఈ వ్యర్థాల సురక్షిత నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఈ యాప్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) రూపొందించింది. ప్రస్తుతం కరోనా విస్తృతి కొనసాగుతున్నం దున, ఈ బయో మెడికల్ వేస్ట్ పర్యవేక్షణ పకడ్బందీగా చేసేందుకు త్వరలోనే ఈ యాప్‌ను ఉపయోగంలోకి తీసుకు రానున్నారు. ఈ జీవ వ్యర్థాల సేకరణ మొదలు, వేరు చేయడం, రవాణా, నిర్మూలన వరకు సురక్షితంగా చేపట్టేలా ఈ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. దీనికి సంబంధించి ప్రతి ప్రక్రియను జియో ట్యాగింగ్ చేయ డంతో, ఈ వివరాలను కామన్ ఫ్లాట్‌ఫారంలో సబ్మిట్ చేస్తారు. ఇప్పటివరకు రోజూ రాష్ట్రంలో సేకరించే జీవ వ్యర్థాల పరిమాణం లెక్కింపు నకు బార్‌కోడింగ్ వ్యవస్థ ఉపయోగిస్తూ వచ్చారు. ఇకపై ఈ యాప్ ద్వారా కేంద్రీకృత పర్యవేక్షక వ్యవస్థలో భాగంగా ట్రాకింగ్ చేస్తారు. ఇందుకు ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ను విని యోగించడంలో భాగంగా ఈ యాప్‌లో వ్యర్థాల ఉత్పత్తిదారులు, దీన్ని రవాణా చేసే వారు, ట్రీట్మెంట్ చేసేవారు రిజిస్టర్ చేసుకుని, పసుపు, ఎరుపు బ్యాగుల్లోని చెత్త ఎంత పరిమాణంలో ఉందో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కరోనా వేస్ట్‌పై పీసీబీ మార్గదర్శకాలు.. ► వార్డుల్లో చెత్తబుట్టలు/ సంచులు/ కంటైనర్లను ఉంచి జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు వాటిని వేరు చేసి నిర్వహించాలి. ► ఎర్ర రంగు సంచిలో వాడిన గాగుల్స్, ఫేస్ షీల్డ్, యాప్రాన్, ప్లాస్టిక్ కవర్లు, హాజ్మెట్ సూట్, గ్లోవ్స్ వంటి వస్తువులు వేయాలి. ► పసుపు రంగు సంచిలో వాడిన మాస్క్ లను, హెడ్–కవర్/క్యాప్, షూ కవర్, డిస్పో జబుల్ లైనిన్ గ్లోవ్స్, నాన్–ప్లాస్టిక్ లేదా సెమీ ప్లాస్టిక్ కవర్లు వేయాలి. ► కరోనా వార్డులకు సంబంధించిన జీవ, వైద్య వ్యర్థాలను తరలించే సంచులు, కంటై నర్లపై ‘కరోనా వ్యర్థాలు’ అని పేర్కొనాలి. వీటికి ప్రాధాన్యం ఇచ్చి, వెంటనే తరలించేందుకు.. చూడగానే గుర్తు పట్టడానికి వీలుగా ఏర్పాటు చేయాలి. ► పట్టణ, స్థానిక సంస్థలు అందచేసే పసుపు రంగు సంచుల్లో క్వారంటైన్ కేంద్రాల నుంచి లేదా వైద్య శిబిరాల నుంచి జీవ వైద్య వ్యర్థాలను విడిగా తరలించాలి. ► స్వీయ నిర్బంధం పాటిస్తున్న ఇళ్లు లేదా ఇతరత్రా ఇళ్ల నుంచి వాడేసిన మాస్కులు, గ్లోవ్స్‌ను సాధారణ చెత్తలాగా నిర్మూలించేం దుకు ముందు కనీసం 72 గంటల పాటు కాగితపు సంచుల్లో ఉంచాలి. ► ఎర్ర రంగు సంచులను.. కరోనా సోకినవారి నుంచి నమూనాలు సేకరించే కేంద్రాలు, ప్రయోగశాలలు, నమూనాలను సేకరించేం దుకు, తరలించేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ సీసాలను, ట్యూబ్‌లను, పిప్పెట్లను ఉంచడానికి వాడాలి. చేయకూడని పనులు.. ► కరోనా వ్యర్థాలను ఇతర వ్యర్థాలతో కలపకూడదు. తగినంత వ్యక్తిగత రక్షణ ఏర్పాట్లు లేకుండా కరోనా వ్యర్థాల దగ్గరకు వెళ్లకూడదు. వ్యర్థాలను 24 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు. ► అనారోగ్య లక్షణాలున్న ఏ ఒక్క కార్మికుడిని విధి నిర్వహణకు అనుమతించొద్దు. -
నో ఫుడ్ వేస్ట్ ప్లీజ్
దేశంలో ఆహారం కొరత..ఆహార పదార్థాల వృథా దాదాపు సమాన స్థాయిలో ఉందని ఇటీవలి ఓ కమిటీ నివేదికలో వెల్లడైంది. అన్నం ఎక్కువైపారవేస్తుండగా..ఆహారం లభించక అల్లాడుతున్న వారూ ఎక్కువే ఉన్నారు. ముఖ్యంగా వివాహం, వార్షికోత్సవం, పుట్టినరోజు...ఇలా వేడుక ఏదైనా 25 శాతం మేర ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అతిథ్య రంగ సంస్థలు ఏర్పాటుచేసేకార్యక్రమాల్లో 15 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతున్నట్లు తేల్చారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఓ సంస్థ ఆహారం వృథా కానీయకుండా పేదల ఆకలి తీర్చేందుకు కంకణం కట్టుకుంది. ఏదైనా వేడుకలో చేసిన వంటకాలు మిగిలిపోతే సాధారణంగా డస్ట్‌బిన్‌లోకి వేస్తారు. అలా కాకుండా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు..ఆ సంస్థ ప్రతినిధులు అక్కడ వాలిపోయి ఆ ఆహారాన్ని అన్నార్తుల చెంతకు చేర్చి కడుపునింపుతారు. ఔను..ఆహార కొరత ఎదుర్కొంటున్న ఎందరికో ‘నో ఫుడ్ వేస్ట్’ సంస్థ ఒక వరంగా మారిందనే చెప్పాలి. తమిళనాడులోనికోయంబత్తూర్లో వెలిసిన ఈ సంస్థ ఇప్పుడు నగరంలోనూ సేవలందిస్తోంది. దాదాపు 100 మందివాలంటీర్లు స్వచ్ఛందంగా ‘నో ఫుడ్ వేస్ట్’ సంస్థలో సభ్యులుగా చేరి ఎక్కడ ఆహారం మిగిలినా అక్కడ నుంచి బస్తీలకు చేర్చి పేదోళ్ల ఆకలి తీరుస్తున్నారు. సనత్‌నగర్: కోయంబత్తూర్‌లో ప్రారంభమైన ‘నో ఫుడ్ వేస్ట్’ సేవలను స్ఫూర్తిగా తీసుకుని యూసుఫ్‌గూడ గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఉండే మురళి కలిగొట్ల తానొక్కడే నగరంలో ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన మురళి తనకు తెలిసిన చోట ఫుడ్ మిగిలిపోయి ఉందంటే దానిని తీసుకుని అన్నార్తులకు వడ్డించేవాడు. ఇలా రెండున్నర ఏళ్లుగా సేవలందిస్తూ వస్తున్నారు. మురళి అందిస్తున్న సేవలు సోషల్ మీడియా కేంద్రంగా కోయంబత్తూర్‌లోని ‘నో ఫుడ్ వేస్ట్’ సంస్థ ప్రతినిధులకు తెలిసి..వారు మురళిని సంప్రదించారు. ఆయనకు సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి నో ఫుడ్ వేస్ట్ సంస్థ కేంద్రంగా చేసుకుని మురళి తన సేవా యజ్ఞాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్ళారు. నగరానికి చెందిన దాదాపు 100 మంది వలంటీర్లుగా చేరిపోయారు. ఎనిమిదేళ్ల నుంచి 80 ఏళ్ళ ప్రాయం వరకు నో ఫుడ్ వేస్ట్ సంస్థ సభ్యులు చేరి ఆహారం వృథా కానీయకుండా అన్నార్తుల చెంతకు చేరుస్తున్నారు. వలంటీర్లు ఏం చేస్తారంటే... నో ఫుడ్ వేస్ట్ సంస్థకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎక్కడైనా ఫంక్షన్ జరిగి అక్కడ ఆహారం మిగిలిపోయి ఉందంటే నో ఫుడ్ వేస్ట్‌కు కాల్ చేస్తే వెనువెంటనే ఆ సమాచారం గ్రూప్‌లో ప్రత్యక్షమవుతుంది. ఎంతమందికి ఆహారం మిగిలి ఉంది, ఏయే రకాల వంటకాలు ఉన్నాయనే వివరాలు కూడా గ్రూప్‌లో ఉంచుతారు. తదనంతరం ఆ ఫంక్షన్ జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఉండే వాలంటీర్లు అక్కడకు వెళ్తారు. ఆహారం ఎప్పుడు వండింది, క్వాలిటీ ఏవిధంగా ఉంది, భుజించడానికి వీలుగా ఉందా? లేదా అని ముందుగా పరీక్షలు చేస్తారు. వారే స్వయంగా తిని చూస్తారు. అక్కడి నుంచి ఆహారాన్ని తీసుకెళ్లి పేదల ఆకలి తీరుస్తారు. 50 హంగర్ స్పాట్స్ గుర్తింపు... ♦ సంస్థ ప్రతినిధులు 50 హంగర్ స్పాట్స్‌ను గుర్తించారు. నిమ్స్, గాంధీ ఆస్పత్రి, బేగంపేటలోని నైట్ షెల్టర్స్, అమీర్‌పేట ప్రభుత్వ బాలికల హాస్టల్, నాంపల్లి డాన్‌బాస్కో, ఎల్బీనగర్, కార్వాన్, మల్కాజ్గిరి తదితర ఏరియాల్లో స్పాట్స్‌ను గుర్తించారు. ♦ నో ఫుడ్ వేస్ట్ సంస్థ అక్టోబర్ 7 నుంచి ఇప్పటివరకు 15 వేల మంది ఆకలిని తీర్చారు. ప్రతిరోజూ సగటున 20–30 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ♦ పది మందికి లోపు సరిపడా ఆహారం ఉంటే పికప్ డెలివరీ యాప్ ప్రతినిధులను పంపించి వారి చేతనే పేదల ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ♦ ఇతరులు కూడా సంస్థతో కలిసివచ్చేందుకు వీరి సేవల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. దాతల సహకారంతో మినీ వ్యాన్.. పెద్ద మొత్తంలో ఆహారం మిగిలిపోయి ఉన్న సందర్భాల్లో వాలంటీర్లు బైక్‌పై గానీ, లేదా కిరాయి వాహనంలో గానీ తీసుకువెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పలువురు దాతలు ఈ సంస్థ ప్రతినిధులకు మారుతి ఈకో వ్యాన్‌ను బహుమతిగా అందించారు. తమకు దగ్గరలోని ప్రాంతానికి వాలంటీర్లు మినీ వ్యాన్‌ను తీసుకువెళ్లి ఆహారాన్ని సేకరించి పేదలకు చేర్చుతారు. ఈ వాహనాన్ని అందరికీ మధ్యలో ఉండేలా అమీర్‌పేటలో ఉంచుతారు. భవిష్యత్తులో మరో వ్యాన్‌తో పాటు ఆహారం నిల్వ ఉండేలా ఫ్రిడ్జ్‌ను కూడా సమకూర్చుకోవాలనే ఆశయంతో ముందుకుసాగుతున్నారు. ఆ సంతృప్తి మాటల్లోచెప్పలేం.. ఆహారం వేస్ట్ చేయకుండా పేదల కడుపు నింపినప్పుడు పేదల ముఖాల్లో కనిపించే ఆ ఆనందం ఎనలేనిది. ఒక్కోసారి ‘రెండు మూడు రోజులైంది బాబూ..అన్నం తిని.. దేవుడిలా వచ్చి ఆకలి తీర్చారంటూ’ చెబుతుంటే మనసు కలచివేస్తోంది. అదే క్రమంలో ఆకలి తీర్చామన్న ఆత్మసంతృప్తి మాటల్లో చెప్పలేం. తమ సేవలతో కలసివచ్చేలా మరింత మంది వాలంటీర్‌గా ముందుకు వస్తే బాగుంటుంది. ఎవరైనా సరే ఆహారం మిగిలితే పడేయకుండా మాకు సమాచారం అందించండి. మా వలంటీర్లు వచ్చి సేకరించి పేదల కడుపు నింపుతారు.– మురళి, నో ఫుడ్ వేస్ట్ సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆహారం మిగిలితే ఫోన్ చేయండి నంబర్లు: 98660 06269 కాల్‌సెంటర్: 90877 90877 -
వద్దనుకుంటే వదిలేద్దాం
సాక్షి,సిటీబ్యూరో: ఇళ్లల్లోని పనికిరాని వస్తువుల సేకరణ కోసం జీహెచ్ఎంసీ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తమ ఇళ్లలో ఉన్న నిరుపయోగ వస్తువులను ఎక్కడ వేయాలో తెలియక, ఇంట్లో ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్న నగరవాసులు ఈ కార్యక్రమానికి జైకొడుతున్నారు. ఇంటికే వచ్చి ఆయా వస్తువులను బల్దియా సేకరిస్తుండడంతో ఎన్నో ఏళ్ల నుండి తమ ఇళ్లలో ఉన్న నిరుపయోగ వస్తువులను పెద్ద ఎత్తున అందజేస్తున్నారు. ఈనెల 12వ తేదీ వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఇళ్లలో వృథాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, మెత్తలు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు పనికిరాని ఏ వస్తువునైనా ఇచ్చేయవచ్చు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి దాకా మొత్తం 42.336 మెట్రిక్ టన్నుల వ్యర్థ వస్తువులను సేకరించారు. సోమవారం ఒక్కరోజే 1.883 ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, 7.821 మెట్రిక్ టన్నుల విరిగిన ఫర్నిచర్, 4.073 మెట్రిక్ టన్నుల పనికిరాని పరుపులు, మెత్తలు, 1.651 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సామగ్రి, 0.005 మెట్రిక్ టన్నుల హానికర వస్తువులు, 5.245 మెట్రిక్ టన్నుల ఇతర వస్తువులను జీహెచ్ఎంసీ సేకరించింది. సోమవారం ఖైరతాబాద్ సర్కిల్ సోమాజిగూడలోని దుర్గానగర్‌లో నిర్వహించిన నిరుపయోగ వస్తువుల సేకరణను మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. తమ ఇళ్లలోని పనికిరాని వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా జీహెచ్ఎంసీకి అందజేయాలని ఆయన నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగే స్పెషల్ డ్రైవ్‌లో ఆయా కాలనీలకు తమ వాహనాలు వస్తాయని, లేదా ఎంపిక చేసిన స్థలాల్లోనూ ఈ అనవసర వస్తువులను వదిలివెళ్లాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.నగరంలో ఈ పనికిరాని వస్తువులన్నింటినీ రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారని, తద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు పూడుకుపోయి మురుగు పొంగి రోడ్లను ముంచెత్తుతోందని పేర్కొన్నారు. రెండు రోజుల్లో సేకరించిన వ్యర్థాలు (మెట్రిక్ టన్నుల్లో) .. ఎలక్ట్రానిక్: 2.027 ఎం.టీ విరిగిన ఫర్నిచర్: 14.485 పాత పరుపులు, మెత్తలు: 11.281 ప్లాస్టిక్: 3.329 హానికర వస్తువులు: 0.010 ఇతర వస్తువులు: 11.399 ఎం.టీ -
పనికిరాని వస్తువులుంటే ఇవ్వండి..
సాక్షి, సిటీబ్యూరో: మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా...ఉంటే వాటిని రోడ్లపై, చెత్తకుప్పల్లో , నాలాల్లో వేయవద్దు. వీటిని మీ ఇంటి వద్దనుంచే జీహెచ్ఎంసీ సేకరించనున్నది. ఈ నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. నవంబర్ 3 నుంచి 12వ తేదీ వరకు పది రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లలో వృథాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, మెత్తలు, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇతర నిరుపయోగ వస్తువులను ఈ ప్రత్యేక డ్రైవ్లోసేకరించాలని నిర్ణయించారు. నగరంలోఈ పనికిరాని వస్తువులన్నింటినీ రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారు. తద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు జామ్ కావడంతో రోడ్లపై మురుగునీరు పొంగడం, నాలాల ద్వారా నీరు సక్రమంగా ప్రవహించకుండా రహదారులు జలమయం కావడం నగరంలో సాధారణంగా మారింది. ఇటీవల నగరంలోని ఖాళీ స్థలాలు, పార్కులు, రహదారులవెంట ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్లాస్టిక్ డ్రైవ్ ద్వారా 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను జీహెచ్ఎంసీ సేకరించింది. తద్వారా ఇటీవలి కాలంలో వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల నాలాలు, డ్రెయిన్లు, మ్యాన్‌హోళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు తక్కువగా ఉండడంతో వరదనీరు సక్రమంగా పారేందుకు అవకాశం ఏర్పడింది. ఇదేమాదిరిగా ప్లాస్టిక్ ఏరివేత వల్ల వచ్చిన సత్ఫలితాల దృష్ట్యా ఇళ్లలోని వృథా వస్తువులను కూడా సేకరించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. దాదాపు 10 రోజుల పాటు కొనసాగే ఈ డ్రైవ్‌లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయా లని నిర్ణయించింది. ఇందుకుగాను ఆర్డబ్య్లూఏలు, ఎన్జీఓలు, మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి నిరుపయోగ వస్తువులన్నింటిని జీహెచ్ఎంసికీ అందజేయాలని విజ్ఞప్తి చేయనుంది. కాగా ఈ నిరుపయోగవస్తువుల సేకరణకు ప్రతి డివిజన్లో ఒక స్థలాన్ని ఎంపిక చేసి ఆయా స్థలాలకు ఈ వస్తువులను తెచ్చి వేయవచ్చని కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తోంది. -
‘చెత్త’ రికార్డు మనదే..
సాక్షి, హైదరాబాద్ : పేరుకే మనది అందాల ‘భాగ్య’నగరం... కానీ పరిశుభ్రతలో మాత్రం దుర్భరం...! పాలకులు పిలుపునిచ్చిన స్వచ్ఛ హైదరాబాద్... సాఫ్, షాన్‌దార్ హైదరాబాద్ లక్ష్యాలు నేటికీ అందనంత దూరం! ప్రభుత్వం తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు నగరంలో ఇంటింటికీ ఉచితంగా రెండేసి డస్ట్బిన్లు అందించినా గ్రేటర్‌వాసులు మాత్రం ఇంకా ఎక్కడికక్కడ రోడ్లపైనే చెత్త పారబోస్తున్నారు. దీంతో ఓ ‘చెత్త’రికార్డును సిటీ మూటగట్టుకుంది. తలసరి చెత్త ఉత్పత్తిలో దేశంలోకెల్లా హైదరాబాద్ నగరమే తొలి స్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 570 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తున్నట్లు నాగ్‌పూర్‌కు చెందిన జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరి) చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 510 గ్రాముల తలసరి చెత్త ఉత్పత్తితో చెన్నై రెండోస్థానంలో ఉండగా, 410 గ్రాములతో ఢిల్లీ మూడో స్థానంలో, 360 గ్రాములతో అహ్మదాబాద్ నాలుగో స్థానంలో, 300 గ్రాములతో ముంబై ఐదో స్థానంలో నిలిచాయి. కోల్‌కతాలో కేవలం 260 గ్రాముల చెత్త ఉత్పత్తితో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు వ్యర్థాల ఉత్పత్తి ఇతర పెద్ద నగరాల స్థాయిలోనే ఉందని సర్వే తేల్చింది. నగరంలో రోజుకు 4,500 టన్నుల వ్యర్థాలను సేకరిస్తుండగా అహ్మదాబాద్‌లో 2,300 టన్నులు, బెంగళూరులో 3,700 టన్నులు, చెన్నైలో 4,500 టన్నులు, కోల్‌కతాలో 3,670 టన్నులు, ఢిల్లీలో 5,800 టన్నులు, ముంబైలో 6,500 టన్నుల చొప్పున నిత్యం వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రజలు భారీగా చెత్తను పడేస్తుండటంతో వ్యర్థాలను వేరు చేయడం నగరపాలక సంస్థకు తలకు మించిన భారం అవుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. వ్యర్థాల్లో అత్యధికం ఇవే.. ప్లాస్టిక్ కవర్లు, వాడి పడేసిన పాదరక్షలు, బ్యాగులు, గృహ వినియోగ వస్తువులు, పండ్లు, కూరగాయల వ్యర్థాలు, పాత దుస్తులు, ఇళ్లలో వినియోగించే ప్లాస్టిక్ వస్తువులు, ప్యాకింగ్ కాటన్లు, పేపర్లు, నీళ్ల సీసాలు, కిచెన్ వేస్ట్, కుళ్లిన ఆహార పదార్థాలు, శానిటరీ న్యాప్కిన్స్ తదితరాలున్నాయి. ఈ వ్యర్థాల్లో ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, ఈ–వేస్ట్, సాఫ్ట్ సెల్స్, బ్యాటరీ సెల్స్ వంటి వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. పలు మెట్రో నగరాల్లో తలసరి వ్యర్థాల ఉత్పత్తి ఇలా.. స్థానం నగరం తలసరి వ్యర్థాల ఉత్పత్తి (గ్రాముల్లో) 1. హైదరాబాద్ 570 2. చెన్నై 520 3. ఢిల్లీ 410 4. అహ్మదాబాద్ 360 5. ముంబై 300 6. కోల్‌కతా 260 కోరలు చాస్తున్న ప్లాస్టిక్ భూతం... గ్రేటర్లో ప్లాస్టిక్ భూతం కోరలు చాస్తోంది. పేరుకు నిషేధం అమల్లో ఉన్నా బహిరంగ ప్రదేశాలు, నివాస సముదాయాలు, మార్కెట్లు, మాల్స్.. ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. ఇవి క్రమంగా మహానగరంలోని ప్రధాన నాలాలు, వరద, మురుగునీటి పైపులైన్లలోకి చేరుతుండటంతో మురుగునీటి ప్రవాహానికి తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు ఇటీవల పలు ప్రాంతాల్లో చేపట్టిన డీ సిల్టింగ్ ప్రక్రియలో పలు పైపులైన్లు, వరదనీటి కాల్వల్లో వెలికితీస్తున్న ఘన వ్యర్థాల్లో 30 శాతం ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తుండటం గమనార్హం. అంతేకాదు మురుగు ప్రవాహానికి పలు చోట్ల ఆటంకాలు ఎదురై ప్రధాన రహదారులు, వీధులు మురికికూపాలుగా మారుతున్నాయి. నిషేధం అమలుపై జీహెచ్ఎంసీ, పరిశ్రమలశాఖ, పీసీబీ తదితర విభాగాలు దృష్టిసారించకపోవడం, ప్రజలు, వ్యాపారుల్లో అవగాహనలేమి నగరంపాలిట శాపంగా మారుతోంది. నిత్యం 2 కోట్ల ప్లాస్టిక్ కవర్ల వినియోగం... నగరంలో ప్రతి వ్యక్తి నిత్యం సరాసరిన రెండు చొప్పున వివిధ మందాలతో కూడిన ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నట్లు పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నగరవ్యాప్తంగా రోజుకు సుమారు 2 కోట్ల ప్లాస్టిక్ కవర్లు వాడకంలో ఉంటున్నట్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వాటి వినియోగం రోజుకు 1.40 కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. వినియోగిస్తున్న కవర్లలోనూ 50 మైక్రాన్ల కంటే తక్కువ మందంగల కవర్లే ఎక్కువగా ఉంటున్నాయని, వాటిపై నిషేధం అమల్లో ఉన్నా ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కడా తగ్గకపోగా పెరుగుతోందని చెబుతున్నారు. తూతూమంత్రంగానే నిషేధం.. గ్రేటర్ పరిధిలో 50 మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించినా పూర్తిస్థాయిలో అమలవుతున్న దాఖలాలు కనిపించట్లేదు. బల్దియా అధికారులు దాడులు చేసి అక్రమార్కులపై జరిమానాలు విధిస్తున్నప్పటికీ వారిలో మార్పు కనిపించడంలేదు. ఇక మహానగరం పరిధిలో సుమారు వెయ్యి వరకు ప్లాస్టిక్ కవర్ల తయారీ సంస్థలుండగా..వీటిలో నిబంధనల ప్రకారం అనుమతి పొందిన కంపెనీలు సగమైనా లేవన్నది పరిశ్రమలశాఖ వర్గాలు చెబుతున్నాయి. జనచేతనే కీలకం.. ప్లాస్టిక్ వినియోగం విషయంలో చట్టాలెన్ని ఉన్న ప్రజల్లో అవగాహన, చైతన్యమే కీలకమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇంటి నుంచి మార్కెట్లు, షాపింగ్‌కు వెళ్లే సమయంలో పేపర్ బ్యాగులు, గోనె సంచులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయాలు, మాంసం సహా ఇతర నిత్యావసరాల కోసం కవర్లు వాడొద్దని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు వాటి మందాన్నిబట్టి విఛ్చిన్నమై పర్యావరణంలో కలిసేందుకు 200 ఏళ్ల నుంచి వెయ్యేళ్లు పడుతుందని, భూగర్భ జలాలు సైతం విషతుల్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వారి పెళ్లి మా చావుకొచ్చింది
డెహ్రడూన్ : వారం రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రం ఔలీ ప్రాంతంలో జరిగిన ఓ కుబేరుడి వివాహ వేడుక మున్సిపాలిటీ అధికారులకు సమస్యలు తెచ్చి పెట్టింది. భారీ ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో చెత్త కూడా అంతే మొత్తంలో పొగయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చెత్తను తొలగించలేక మున్సిపాలిటీ సిబ్బంది తల పట్టుకుంటున్నారు. వివరాలు.. భారత్‌కు చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితమే దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. అనేక వ్యాపారాలు చేస్తూ సంపన్న కుటుంబంగా ఎదిగింది. ఈ ఏడాది గుప్తాల ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో బిలియనీర్ అజయ్ గుప్తా కుమారుడు సూర్యకాంత్ వివాహం జూన్ 18-20 మధ్య, అజయ్ సోదరుడు అతుల్ గుప్తా కుమారుడు శశాంక్ వివాహం జూన్ 20-22 మధ్య జరిగింది. గ్రాండ్‌గా నిర్వహించిన ఈ వేడుకలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ నటులు, యోగా గురు బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి వేడుకల కోసం గుప్తా కుటుంబం ఔలీలోని హోటళ్లు, రిసార్టులను బుక్ చేసుకుంది. దాదాపు రూ. 200కోట్లు ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా వివాహాం జరిపించారు. అయితే, ఈ వేడుకల తర్వాత ఔలీలో ఎక్కడ చూసినా చెత్తే కన్పిస్తోందట. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు ఎక్కడపడితే అక్కడ పడేశారట. గుప్తాల వివాహం వల్ల దాదాపు 40 క్వింటాళ్ల చెత్త పోగైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ చెత్తను శుభ్రం చేసేందుకు 20 మందితో ఓ బృందాన్ని నియమించినట్లు పేర్కొన్నారు. ‘ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు కన్పిస్తున్నాయి. పశువులు మేత కోసం ప్రతి రోజు ఇక్కడ సంచరిస్తుంటాయి. ఒకవేళ అవి ఈ ప్లాస్టిక్‌ను తింటే ఏంటి పరిస్థితి.. దీనికి ఎవరూ బాధ్యత వహిస్తార’ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆకలి తీర్చడమే పరమార్థం
ఆహార అన్వేషణే మనిషి మనుగడను సమున్నతమైన మలుపులు తిప్పింది. నేడు అదే ఆహారం మనుషులను విడ గొడుతోంది. ఆహారాన్ని అలక్ష్యం చేసే వారుగా, ఆహారం అందనివారుగా మనుషులు విడిపోయారు. ఆహారం లేమితో బాధపడేవారిలో ఎటువంటి వర్గీకరణలు లేవు. సమాజంలో ఆర్థిక పరంగా వున్న వర్గీకరణలేవీ ఆహా రాన్ని అలక్ష్యం చేసేవారికి వర్తించవు. తెలిసి, తెలిసీ ధనిక, ఎగువ మధ్య తరగతివారు ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే; దిగువ మధ్యతరగతి వారు తెలియకుండానే ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఆమధ్య వరకూ ఎయిడ్స్ కారణంగా, ఆ తర్వాత క్యాన్సర్ వల్ల ప్రపంచంలో అత్యధికులు మరణిస్తు న్నట్టు చాలా చదువుకున్నవారు సైతం విశ్వసిస్తారు. కానీ, ఆకలితో చనిపో యేవారి సంఖ్యే చాలా ఎక్కువ అని తక్కువమందికి తెలియడం విషాదం. ఆహారాన్ని వృధా చేయకూడదని చాలామంది అనుకుంటారు. కానీ, అందుకు చేయాల్సిందేమిటనే దానిపై ఎవరికీ సరైన అవగాహన ఉండదు. వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌లను మొక్కు బడిగా ఫార్వర్డ్ చేసేసి చేతులు దులు పుకుంటారు. అందుకే ఐక్యరాజ్య సమి తికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ ‘జీరో హంగర్’ను ఇంటి నుంచే ప్రారంభించమని చెబుతుంది. అది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేలు చేయడంతోపాటు ప్రపంచంలోని అన్నార్తుల ఆకలి తీరుస్తుంది. తక్కువ పదార్థాలతో రుచికరమైన వంట చేయ డం; మిగిలిపోయిన అన్నం, రొట్టె లతో కొత్త ఆహారాన్ని తయారుచేసు కోవడం; అవసరమైన మేరకే సరు కులు కొనుగోలు చేయడం; ఎక్స్పె యిరీ తేదీల విషయంలో జాగరూక తతో ఉండటం వంటి పలు చర్యలను ఎవరికివారు అలవర్చుకోవాలి. పండిన కూరగాయల్లో 40 శాతం, ఆహారధాన్యాలు 30 శాతం పూర్తిగా వృధా అవుతున్నాయని ఒక అంచనా. కడుపునిండా తిని ‘బ్రేవ్’మని తేన్చేలోపు ఆ ఊహకు సైతం నోచు కోని సుమారు 20 కోట్ల మంది మన దేశ పౌరులు ఆకలితో నిద్రిస్తున్నారని మర్చిపోవద్దు. చేతి నుంచి ఓ అన్నం మెతుకు వృధాగా నేలరాలిపోతున్న ప్పుడల్లా.. ప్రతిరోజూ 7,000 మంది భారతీయులు ఆకలితో అసువులు బాస్తున్నారని విస్మరించొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడం కాదు, ఆకలి తీర్చడమే ఆహారం పర మార్థం అని మరోసారి గుర్తుచేసు కుందాం. (నేడు ప్రపంచ ఆహార దినోత్సవం) – అక్షర, హైదరాబాద్ -
మెరుగైన ర్యాంకు సాధ్యమేనా?
వినాయక్‌నగర్ : స్వచ్ఛసర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు గత కొన్ని నెలలుగా నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి పకడ్బందీగా చెత్త తరలించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. ఎప్పటికప్పుడు చెత్త తరలించకపోవడంతో కూడళ్లలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో నగరానికి 178వ ర్యాంకు రాగా ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంకుకు నగర పాలకసంస్థ అధికారులు, సిబ్బంది చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. కాగా సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నగరంలో పర్యటించి పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, పారిశుధ్యానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. కాగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో చెత్త పాయింట్ల వద్ద భారీ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల చెత్త వేస్తే రూ.500 జరిమానా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చోట చెత్త పేరుకుపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రారంభంకాని అద్దెవాహనాలు చెత్త సేకరణ కోసం కార్పొరేషన్‌కు మొత్తం 64 వాహనాలుండగా అందులో 16 వాహనాలు అద్దెప్రాతిపదికన నడుపుతున్నారు. ఇందులో 10ట్రాక్టర్లు, 6లారీలు ఉన్నాయి. అద్దె చెల్లించడం లేదని వాహనాల యజమానులు తమ వాహనాలను నిలిపివేశారు. వాహనాల అద్దె బకాయిలు మొత్తం రూ.64 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ విషయంలో అధికారులు చొరవ చూపలేదు. దీంతో చెత్త సేకరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది. తమ కాలనీల్లో చెత్త తొలగించడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు స్పందించి తమ కాలనీల్లో నుంచి ఎప్పటికప్పుడు చెత్త తరలించాలని కోరుతున్నారు. కేంద్రబృందం సభ్యుడి పర్యటన స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ బృంద సభ్యుడు జోసెఫ్ పర్యటించారు. గతంలో నగర పాలక సంస్థలో డాక్యుమెంటేషన్‌ను పరిశీలించిన ఆయన సోమవారం నగరంలో పర్యటించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ తీరును, పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. కాగా నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోయి ఉండటంతో మెరుగైన ర్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
కంపుకొడుతోంది..
మందమర్రి : పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతం కంపుకొడుతోంది. ఇష్టారా జ్యంగా నిర్వాహకులు చికెన్, చేపల వ్యర్థాలు మురుగుకాల్వల్లో పడేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ వ్యాప్తంగా ఒకే ఒక కూరగాయల మార్కెట్ ఉంది. ప్రధాన మార్కెట్‌కు ఓ వైపు కూరగాయలు విక్రయిస్తుంటారు. మరోవైపు చికెన్ సెంటర్, అదేవిధంగా చేపల దుకాణాలు సైతం ఉన్నాయి. చికెన్ సెంటర్, చేపల నుంచి, మార్కెట్ సెంటర్లోని టిఫిన్ సెంటర్ల వచ్చే వ్యర్థాలను మురుగుకాల్వల్లో పడేస్తున్నారు. దిగువ ప్రాంతంలో మురుగుకాల్వల్లో నీరు నిలిచి పోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. అయినా మున్సిపాలిటీ సిబ్బంది మురుగు కాల్వలను శుభ్రం చేయడం లేదు. డ్రెయినేజీల్లో మురుగు శుభ్రం చేయకపోతే అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతీరోజు చెత్త తొలగించడంతోపాటు డ్రెయినేజీ కాల్వల్లోని మురుగు తీసివేయాలని పలువురు కోరుతున్నారు. పట్టించుకునే వారు కరువు కూరగాయల మార్కెట్ శుభ్రతపై మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విక్రయదారులు ఆరోపిస్తున్నారు. ప్రతీరోజు వీరి నుంచి తైబజార్ రుసుం వసూలు చేస్తారు. ఒక్కో దుకాణానికి రూ.10ల చొప్పున తీసుకుంటున్నారు. కానీ మార్కెట్ నిర్వహణ గాలికొదిలేస్తున్నారు. మార్కెట్లో పశువులు సంచరిస్తున్న పట్టించుకునేవారే కరువయ్యారు. మరుగుదొడ్ల కోసం కేటాయించినా స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నిస్తే అడ్డుకున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా మార్కెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ఎలా ఉండేది కూరగాయలు అమ్ముకోవడానికి గ్రామాల నుంచి వస్తున్నాం. కొన్ని రోజులుగా మార్కెట్లో భరించలేని వాసన వల్ల ఉండలేక పోతున్నాం. ఏ సార్లకు చెప్పినా ఎవరూ పట్టించుకుంట లేరు. చికెన్ సెంటర్లను, చేపల దుకాణాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. లేదంటే ఎప్పటికప్పుడు మురుగుకాల్వలు శుభ్రం చేయాలి. – శ్రీనివాస్, బార్బర్ షాపు నిర్వాహకుడు, మందమర్రి వ్యర్థాలు కాల్వల్లో వేయొద్దు చికెన్, చేపల దుకాణాల యజమానులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలి. ఆయా దుకాణాల నుంచి వెలువడే వ్యర్థాలను కాల్వల్లో వేయకుండా చూడాలి. లేకుంటే ఈ వాసనతో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. – సంతోష్, మార్కెట్ సెంటర్, మందమర్రి -
రూ. కోటి ‘చెత్త’పాలు
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చెత్త సేకరణకు ఒక్కో పంచాయతీకి రెండు రిక్షాలను అందజేసింది. ఇవి కొన్ని పంచాయతీల్లో మినహాయిస్తే జిల్లాలోని దాదాపు 70శాతం గ్రామాల్లో మూలకు చేరాయి. ఈనేపథ్యంలో రిక్షాల కొనుగోలు కోసం కేటాయించిన రూ. కోట్ల నిధులు ‘చెత్త’ పాలయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ పథకం లక్ష్యం మరింత దూరమవుతోంది. రిక్షాల నిర్వహణ భారం కావడంతోనే అవి నిరుపయోగంగా మారాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాక్షి, వికారాబాద్: జిల్లా పరిధిలో మొత్తం 367 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుల్లో వేయాలని సూచించింది. అయితే, రిక్షాల నిర్వహణ భారం కావడంతో వీటిని దాదాపు 30 శాతం గ్రామపంచాయతీలు మాత్రమే వినియోగిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికగా పంచాయతీకి రెండు చొప్పున కేంద్ర ప్రభుత్వం మొత్తం 734 చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం పంపిణీ చేసింది. ప్రస్తుతం చాలా పంచాయతీల్లో ఇవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీలు రిక్షాల నిర్వహణకు ఒకో కార్మికుడికి నెలకు రూ. 2 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూ చించింది. అయితే, పంచాయతీల్లో నిధు ల లేమితో రిక్షాల నిర్వహణ భారంగా మారింది. దీంతో వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పంచాయతీల్లో నిధుల కొరత కనిపిస్తున్నది. అభివృద్ధి పనుల కోసం 14వ ఆర్థిక సం ఘం నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. 2017 జూలై నెలలో రూ.14కోట్ల 50 లక్షలను ప్రభు త్వం పంచాయతీలకు విడుదల చేసింది. గ్రామాల్లో మురుగుకాలువలు, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించారు. ఈనేపథ్యంలో డబ్బు ల కొరత ఏర్పడింది. చెత్త తరలించే రిక్షాలను నడిపే కూలీలకు జీతాలివ్వడం, రిక్షాలు మరమ్మతులు తదితరాలు పంచాయతీలు భారంగా పరిణమిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ప్రత్యేకంగా కొన్ని నెలలుగా నిధులు అందకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కేంద్ర సర్కార్ పంపిణీ చేసిన చెత్త రిక్షాలను వినియోగించడం లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఒక్కో రిక్షాకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు వెచ్చించింది. ఈలెక్కన రూ. కోటి నిధు లు ‘చెత్త’పాలయ్యాయనే విమర్శలు వినపడుతున్నాయి. కేంద్ర సర్కార్ ఉద్దే శం బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో ఇబ్బందులు తలె త్తుతున్నాయని చెప్పవచ్చు. పంచా యతీ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. నైపుణ్యమున్న కార్మికులు ఏరీ..? స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమం కింద పంపిణీ చేసిన రిక్షాలను నడపాలంటే నైపుణ్యమున్న (స్కిల్డ్) కార్మికులు అవసరం. వీరు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు తరలించాలి. డంపింగ్‌యార్డులు లేనిచోట గ్రామానికి దూరంగా వ్యర్థాలను పారబోయాల్సి ఉంటుంది. దీంతో పాటు రోడ్లను శుభ్రంచేయాలి. గ్రామంలోని వీధుల్లోని చెత్తను సైతం సేకరించాలి. ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న కార్మికులు రిక్షాలను నడపడం లేదు. కొత్తవారిని పెట్టుకుంటే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీలు 14వ ఆర్థికసంఘం నిధులపై ఆధారపడ్డాయి. పంచాయతీలలో నిధుల లేమికి తోడు తక్కువ వేతనానికి చెత్త రిక్షాలను తోలడానికి కార్మికులు ముందుకు రాకపోవడం కూడా రిక్షాల నిరుపయోగానికి కారణంగా చెప్పుకోవచ్చు. రిక్షాలను వినియోగంలోకి తెస్తాం.. స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త తరలించేందుకు కేంద్ర సర్కార్ రిక్షాలను అందజేసింది. చాలావరకు రిక్షాలను వినియోగిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఎక్కడైనా వీటిని ఉపయోగించకుంటే చర్యలు తీసుకుంటాం. చెత్త తరలించే రిక్షాలను వినియోగంలోకి తీసుకొస్తాం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతాం. –మాజిద్, జిల్లా పంచాయతీ అధికారి -
వేస్ట్ టు క్రాఫ్ట్..
భద్రాచలంటౌన్ : పర్యావరణానికి ప్రమాదకారిగా మారిన వ్యర్థాలతో స్థానిక క్రాంతి విద్యాలయం విద్యార్థులు ‘వేస్ట్ టూ క్రాఫ్ట్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం పాఠశాలలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమలోని సృజనాత్మకతతో వ్యర్థాలతో అందమైన వస్తువులను తయారు చేశారు. ఖాళీ కప్పులతో తయారు చేసిన టవర్, గిఫ్ట్ పేపర్స్‌తో చేసిన రోజాపూలు, అట్టముక్కలతో తయారు చేసిన నగలపెట్టె, చిత్తు కాగితాలతో చేసిన ఇంటి నమూనా, వాల్ హ్యంగ్స్, వివిధ రకాల వస్తువులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సమతా శ్రీనివాస్, హెచ్ఎం అనురాధలు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యం వెలికి తీసేందుకు 5ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా వారిని తీర్చిదిద్ధటమే లక్ష్యంగా సాగుతున్నాట్లు వారు పేర్కొన్నారు. -
కుళ్లబెట్టి..ఉడకబెట్టి!
చేపలు మంచి పోషకాహారం. వైద్యులు సైతం చేపలు తినాలని సూచిస్తుంటారు. మాంసాహారులు చేపలను ఇష్టంగా తింటారు. అదే కొల్లేరు చేపలంటే మరింత మక్కువ చూపుతారు. అయితే కొందరు ఆక్వా రైతులు సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు తక్కువ ధరకు లభించే కోళ్ల వ్యర్థాలను చేపలకు మేతగా వాడుతున్నారు. ఆ చేపలను తింటే పోషకాల మాట అటుంచి అనారోగ్యం తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కైకలూరు: చేపల సాగుకు కైకలూరు నియోజకవర్గం పెట్టింది పేరు. ఆ పేరుకు కొంత మంది రైతులు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. సాగు ఖర్చును తగ్గించుకునేందుకు పిల్లెట్ మేతకు బదులు, కోళ్ల వ్యర్థాలను అందిస్తున్నారు. జిల్లాలో లక్షా 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. అత్యధికంగా కొల్లేరు ప్రాంతంలో 80 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. అనధికారికంగా ఇంకా ఎక్కువ విస్తీర్ణంలోనే ఆక్వా సాగవుతోంది. నిత్యం రోజు కొల్లేరు ప్రాంతం నుంచి 30 లారీల చేపలు పశ్చిమబెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు.. కైకలూరు నియోజకవర్గంలో బొచ్చ, శీలావతి వంటి తెల్లజాతి చేపలు కాకుండా ఫంగేషియన్ (ఫంగస్) చేపల సాగు 1100 ఎకరాల్లో జరుగుతోంది. ఈ రకం చేపలు ఎటువంటి ఆహారమైనా జీర్ణించుకుంటాయి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు ఫంగస్ చేపలకు కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతున్నారు. గతంలో క్యాట్‌ఫిష్ చేపలకు మాత్రమే కుళ్లిన మాంసం వ్యర్ధాలను వినియోగించేవారు. ఇప్పుడు క్యాట్‌ఫిష్ సాగు జరగడం లేదు. దీంతో ఫంగస్ చేపలను సాగు చేసే చిన్నచిన్న చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను మేతగా అందిసున్నారు. సాధారణంగా నీటిలో తేలియాడే పిల్లెట్ మేత కిలో రూ.35 నుంచి రూ.40 ధర పలుకుతోంది. ఎకరా చెరువులో 7 వేల చేప పిల్లలను వదిలి ఆరు నెలలు సాగు చేసేందుకు పిల్లెట్మేత వాడితే రూ.3.05 లక్షల ఖర్చువుతుంది. అదే కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తే రూ.లక్ష లోపే ఖర్చవుతుంది. 30 కిలోల వ్యర్థాల టిన్ను రూ.300లకే లభిస్తుంది. పట్టుబడికి కొన్ని రోజుల ముందు తువడును మేతగా అందిస్తారు. దీంతో చేపలు మంచి సైజుకు పెరుగుతాయి. కాసులు కురిపిస్తున్న కోళ్ల వ్యర్థాల రవాణా కోళ్ల వ్యర్థాల రవాణా అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. వ్యర్థాలు రవాణాచేసే వారు కొల్లేరుతోపాటు గుడివాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లోని మాంసం విక్రేతలకు నెలకు రూ.5 వేల చొప్పున ముందుగానే చెల్లిస్తారు. మాంసం దుకాణాల్లో మిగిలే వ్యర్థాలను అర్ధరాత్రివేళ ఆటోలు, ట్రక్కుల్లో చెరువుల వద్దకు చేరుస్తారు. టిన్ను రూ.300 చొప్పున విక్రయిస్తారు. ఆటోలు రాగానే చేపల రైతులు వ్యర్థాలను చెరువులో విసేరిస్తున్నారు. మరికొందరు ఉడకబెట్టిన తరువాత చెరువుల్లో మేతగా వాడుతున్నారు. విజయవాడ నుంచి గుడివాడ, కైకలూరు మీదుగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు కోళ్లు వ్యర్థపదార్థాల రవాణా జరుగుతోంది. గత శనివారం రాత్రి మండవల్లి మండలం ప్రత్తిపాడులో ఫింగేషియన్ చేపల చెరువు వద్ద కోళ్లు వ్యర్థాలతో వచ్చిన ఆటో మీడియాకు చిక్కింది. జీఓ అమలు ప్రశ్నార్థకం.. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి చేటుచేస్తున్న వ్యర్థాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేస్తూ 2016 డిసెంబర్ 4న జీఓ 56ను ప్రభుత్వం విడుదల చేసింది. మండల స్థాయిలో తహసీల్దారు చైర్మన్‌గా, వీఆర్వో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, పోలీసు అధికారి సభ్యులుగా, మెంబరు కన్వీనరుగా ఫిషరీస్ అధికారి వ్యవహరిస్తారు. ఈ కమిటీలపై పర్యవేక్షణ అధికారం కలెక్టరుకు ఉంటుంది. వ్యర్థాలు రవాణాచేస్తూ వాహనాలు పట్టుబడితే డ్రైవర్ల లైసెన్సు, రవాణా పర్మిట్లు రద్దు చేసి, వాహన యజమాని, డ్రైవర్లపై ఐపీసీ కేసులు నమోదుచేస్తారు. చేపల చెరువు లైసెన్సు రద్దు, రూ.10 వేల జరిమానా విధించొచ్చు. మండవల్లి మండలం ప్రత్తిపాడులో శనివారం రాత్రి వ్యర్థాలతో ఆటో దొరికినా ఇప్పటి వరకు చర్యలు లేవు. తహసీల్దార్ మధుసూదనరావును వివరణ కోరగా విచారణ చేస్తున్నామని సమాధానం చెప్పారు. ఆరోగ్యానికి చేటు కుళ్లిన మాంసం వ్యర్థాలు అత్యంత ప్రమాదకరం. వ్యర్థాలను ఆహారంగా తీసుకున్న చేపలను తినకూడదు. ఆ చేపలను తిన్న వారికి ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలుషిత ఆహారం వల్ల నులుపురుగులు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు వహించాలి. – డాక్టరు కె.శ్రీలత, మండవల్లి పరిశ్రమను పాడుచేయొద్దు చేపల పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొందరు రైతులు చేసే తప్పు మొత్తం పరిశ్రమపైనే పడుతుంది. వ్యర్థాల నియంత్రణకు మా పోరాటం ఫలితంగా ప్రభుత్వం జీఓ 56 విడుదల చేసింది. వ్యర్థాలను ఉపయోగించే రైతులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – ముదునూరి సీతారామరాజు,రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు, భుజబలపట్నం -
నా తోటే నాకు ముఖ్యం!
సంతమాగులూరు: ఎవరేమైపోతే మాకేంటి.. మా తోటలకు నీరు కట్టుకుంటే చాలు అన్న చందంగా ఉంది కొందరు రైతుల పరిస్థితి. కాలువ తూముల ద్వారా పొలాలకు, నీరు కడితే ఆలస్యం అవుతుందనుకున్నారేమో ఏమో, ఏకంగా ఫత్తేపురం సమీపంలోని సంతమాగులూరు మేజరుకు గండి కొట్టి సుబాబుల్ తోటలకు నీరు కడుతున్నారు. దీంతో నీటి కోసం ఎదురు చూస్తున్న కంది, శనగ, మిరప, పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. ఫత్తేపురం సమీపంలోని సంతమాగులూరు మేజరుకు ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు గండి కొట్టి సుబాబుల్ తోటలకు నీరు తరలిస్తున్నాడు. దీంతో మేజరు నుంచి వెళ్లే నీరు రహదారిపైగా ప్రవహిస్తుండడంతో, రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అధికారుల అండదండలతోనే? ఏకంగా సాగరు మేజరు కాలువకు గండి కొట్టి, సుబాబుల్ తోటలకు నీరు కడుతున్నరంటే, దాని వెనుక అధికారుల అండదండలు లేకుండా ఉన్నాయా? అని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకుని మేజరుకు కొట్టిన గండిని పూడ్పించాలని కోరుతున్నారు. దీనిపై ఎన్‌స్పీ జేఈ తేజశ్వనిని వివరణ కోరగా ఈ విషయం తనకు తెలియదని వెంటనే సిబ్బందిని పంపించి గండిని పూడ్చుతామని వివరించారు. -
ఆక్వాప్లాంట్ అరాచకాలు
-
ఇక ప్లాస్టిక్ రోడ్లు
– ప్రయోగాత్మకంగా జాతీయ రహదారి 44 నుంచి మల్లేపల్లి వరకు – త్వరలో ఎమ్మిగనూరు – వెంకటగిరి, కడిమెట్ల – సిరాళ్లదొడ్డి రోడ్లు కర్నూలు(అర్బన్): ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు వేసే ప్రక్రియకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు శ్రీకారం చుట్టారు. సాధారణంగా కంకర, తారు మిశ్రమంతో వేసే రోడ్ల కంటే.. కంకర, తారు మిశ్రమంలోకి వ్యర్థ ప్లాస్టిక్‌ను మిక్స్ చేసి రోడ్లకు వాడితే నాణ్యత కూడా అధికంగా ఉంటుందని శాస్త్రీయంగా తేలడంతో జిల్లాలో ప్లాస్టిక్ రోడ్డు వేసేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో అర కిలోమీటర్ వరకు ప్లాస్టిక్ మిశ్రమంతో రోడ్డును వేశారు. మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో తొలిసారి ట్రయల్ చేసినా, కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటి సారిగా ఈ రోడ్లను వేస్తున్నారు. వెల్దుర్తి మండలం 44వ నెంబర్ జాతీయ రహదారి నుంచి మల్లెపల్లి వరకు 2 కిలోమీటర్ల రోడ్డును రూ.1.25 కోట్లతో ఈ నెల 26, 27 తేదీల్లో వేశారు. ఈ మిశ్రమంతో వేస్తున్న రోడ్డును సోమవారం పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరాయుడు, కర్నూలు ఈఈ వెంకటరమణారెడ్డి పర్యవేక్షించారు. ఆలూరు సమీపంలోని హాట్ మిక్సింగ్ ప్లాంట్ నుంచి తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా నుంచి కిలో రూ.45 ప్రకారం 2 టన్నులను దిగుమతి చేసుకున్న వ్యర్థ ప్లాస్టిక్ మిశ్రమాన్ని కలిపి రోడ్లు వేసే ప్రాంతానికి తీసుకువెళ్తున్నారు. త్వరలో మరో రెండు రోడ్లు ఎమ్మిగనూరు-ఆదోని మెయిన్ రోడ్డు నుంచి వెంకటగిరి వరకు రూ.72 లక్షలతో 1.4 కిలోమీటరు, ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల నుంచి సిరాళ్లదొడ్డి వరకు రూ.1.10 కోట్లతో 3.5 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్డు వేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించినట్లు కర్నూలు డివిజన్ పీఐయూ ఈఈ వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారి ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు వేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలసిపోయేందుకు దాదాపు 200 సంవత్సరాలు పడుతుందన్నారు. భూమి మీద ఉన్న వ్యర్థ ప్లాస్టిక్‌ను రోడ్లకు ఉపయోగిస్తే వేస్ట్ ప్లాస్టిక్ తగ్గిపోతుందన్నారు. డిజైన్ ప్రకారం సాధారణంగా తారు, కంకర మిశ్రమంతో వేసిన రోడ్లు 5 సంవత్సరాలు మన్నికగా ఉంటే.. ప్లాస్టిక్ మిశ్రమంతో వేసిన రోడ్డు దాదాపు 8 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయన్నారు. డీఈఈ కేఈ సుధాకర్‌గౌడ్, ఏఈ కేవీ రమణ రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. -
బెంగళూరు సరస్సులో భారీ మంటలు
బెంగళూరు: ఇండియా సిలికాన్ వ్యాలీగా పేర్గాంచిన బెంగళూరులో తిరిగి గతంలో జరిగిన సంఘటన పునరావృతం అయింది. విపరీతంగా వ్యర్థాలు పడేయడంతోపాటు, జలాలన్నీ కూడా తీవ్ర కలుషితం కావడంతో మరోసారి బెల్లందూర్ సరస్సులో మంటలు చెలరేగాయి. అయితే, ఈసారి గతంలోకంటే కూడా నగర వాసులు భయపడేంత భయంకరంగా వ్యాపించాయి. దట్టమైన పొగలతో ఓ భారీ బాంబు దాడి జరిగితే ఎలాంటి పొగలు వస్తాయో అంతకుమించిన పొగలు ఆ సరస్సు నుంచి వెళువడుతుండటంతో నగర వాసులంతా వణికి పోతున్నారు. గురువారం సాయంత్రం చెలరేగిన మంటలు ఇప్పటికీ తగ్గకపోగా ఫైర్ సిబ్బందికి కూడా ఇబ్బందిని కలిగిస్తూ చుట్టుపక్కల ఉన్న ఎండుగడ్డిని అంటూకుంటూ తీవ్ర కలవరం పెట్టిస్తున్నాయి. సరస్సులో తీవ్ర కాలుష్యంతోపాటు ఈ సరస్సు ఒడ్డునే పడేస్తున్న వ్యర్థాలు, సరస్సు నీటిలో కలుస్తున్న రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇది నగరవాసులు తిరిగే పెద్ద పెద్ద రహదారుల పక్కనే ఉన్న కారణంగా ఆ పక్కగా వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులుపడటంతోపాటు వణికిపోతున్నారు. పెద్దఎత్తున వ్యాపించిన ఈ పొగల్లో దీర్ఘకాలంలో ఇబ్బందులు పెట్టే విషవాయువులు కూడా ఉండొచ్చని వారు ఆందోళనకు గురి అవుతున్నారు. బెంగళూరులో ఉన్న సరస్సుల్లో బెల్లందూర్, వర్తూర్‌లు అతి పెద్దవి. అయితే ఇవి చెత్త, పరిశ్రమల వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పరిశుభ్రం చేసే ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఆ పనులు ముందుకు వెళ్లడం లేదు. దీంతో ప్రస్తుతం పరిస్థితి ఏర్పడింది. దీనిపట్ల సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల నగర నిర్వాహక అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తిట్టి పోస్తున్నారు. -
పర్యావరణానికి హాని కలిగిస్తే జరిమానా
- ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రాజేంద్రనాథ్‌రెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వ్యర్థాలను ఉత్పత్తి చేసి పర్యావరణానికి హాని కలిగిస్తే యూజర్ ఫీ పేరుతో భారీ ఎత్తున జరిమానా విధించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీసర్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సవరించిన వ్యర్థాల నిర్వహణపై బుధవారం సస్యప్రైడ్ హోటల్లో రాయలసీమ జిల్లాలోని మునిసిపాలిటీలు, పరిశ్రమల యజమానులకు రెండు రోజుల శిక్షణ తరగతులను కర్నూలు మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబుతో కలసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కొత్త నియమాలు పురపాలక, నగర, పట్టణ, పారిశ్రామిక వాడలకే కాక ప్రత్యేక ఆర్థిక మండళ్లకు వర్తిస్తాయన్నారు. చెత్తను బయట పడవేస్తే రూ.10 వేలను జరిమానా విధించే అధికారాన్ని జాతీయ హరిత ధర్మాసనం(ఎన్జీటీ) స్థానిక సంస్థలకు అప్పగించినట్లు తెలిపారు. క్యారీ బ్యాగుల మందాన్ని 40 మైక్రాన్ల నుంచి 50 మైక్రాన్లకు పెంచినట్లు తెలిపారు. నగర, పట్టణ, గ్రామస్థాయి వరకు ఇవే నియమాలు అమల్లో ఉంటాయన్నారు. జీవ–వైద్య వ్యర్థాలను సమర్థంగా నియంత్రించడానికి బార్ కోడ్ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ..వ్యర్థాల నిర్వహణ విధానంపై మునిసిపల్ కార్మికులకు కూడా అవగాహన లేదన్నారు. పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థ ప్రత్యేకంగా పరిగణించే చట్టాలను తేవాలన్నారు. ప్రస్తుతం రోడ్లను శుభ్రం చేసే కార్మికులు, కాలువలను శుభ్రం చేసే వారు ఇలా వేర్వేరుగా ఉన్నారని, దీనివల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఒక కార్మికుడు ఓ ప్రాంతాన్ని కేటాయించి రోడ్లను ఊడ్చడం, కాలువలను ఎత్తివేయడం, ఇలా రకాల వ్యర్థాల నిర్వహణను చూసుకునే బాధ్యతను అతనికే అప్పగించాలన్నారు. మరోవైపు వ్యర్థాల నిర్వహణపై పరిశోధనలు జరగాలని సూచించారు. కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉదయ్ భాస్కరరెడ్డి, రాంకీ గ్రూపు అధికారి తోట కృష్ణారావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్లు శివరామిరెడ్డి, కృష్ణ, ప్రసాదరావు పాల్గొన్నారు. -
కోట్లల్లో చెత్త వ్యాపారం–వేలాదిమందికి ఉపాధి
భీమవరం : చెత్తే కదా అని చిన్నచూపు చూపతున్న చిత్తు కాగితాలు, పాతసీసాల వ్యాపారం వేలాదిమందికి ఉపాధి చూపుతోంది. నిత్యం కోట్లాది రూపాయల టర్నోవర్ సాగుతున్న ఈ వ్యాపారం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిపెడుతోంది. జిల్లాలోని వివిధ పట్టణాలు, మేజర్ గ్రామాల్లో పాత పేపర్లు, ఇనుము, సీసాల వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో సుమారు 150 పాత ఇనుము, పాత పేపర్లు, సీసాలు వంటివి కోనుగోలుచేసే పెద్దపెద్ద షాపులున్నాయి. వీటి ద్వారా జిల్లాలో ఏడాదికి సుమారు రూ.800 కోట్లు వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. వీటిలో సుమారు పది వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా వీటిపై ఆధారపడి పరోక్షంగా మరొక 25వేల మంది జీవిస్తున్నారు. ప్రతిరోజు రూ.రెండు కోట్లు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. ప్రధానంగా భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు,పాలకొల్లు, ఆకివీడు, పెనుగొండ, కొవ్వూరు, నరసాపురం, మార్టేరు తదితర ప్రాంతాల్లో పాత చిత్తుకాగితాలు, సీసాలు, ఇనుము కొనుగోలుచేసే పెద్దపెద్ద షాపులున్నాయి. ఇవి గాకుండా అనేక గ్రామాల్లో సైతం చిత్తుకాగితాలు, అట్టపెట్టెలు, పాతసీసాలు, ఇనుము కొనుగోలు చేసే చిన్నచిన్న షాపులున్నాయి. –వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున వ్యాపారం.... చిత్తుకాగితాలే కదా అంటూ చిన్నచూపు చూసే పాత పేపర్లు, అట్టలు, ఇనుము, సీసాలు వ్యాపారం జిల్లాలో వేలాదిమందికి జీవనోపాధి కల్పిస్తోంది. నిత్యం రోడ్లు వెంబడి ఉండే చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, సీసాలు ఏరుకుంటు వందలమంది కన్పిస్తారు.అలాగే సైకిళ్లుపై తిరిగి అట్టపెట్టెలు, మద్యం సీసాలు, పాత ఇనుము కొనుగోలు చేసుకుని కొంతమంది జీవనోపాధి పొందుతున్నారు. ఇంకా అనేకమంది వీటిని కొనుగోలుచేసే షాపుల్లో పనిచేస్తున్నారు. వీరు షాపులకు వచ్చే మద్యం సీసాలను శుభ్రం చేయడం, కేటాయించడం, కాగితాలు, అట్టపెట్టెలు వేరుచేయడం వంటివి చేస్తుంటారు. అంతేగాకుండా షాపుల యజమానులు కొనుగోలుచేసిన వీటిని హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కడియం, తణుకు వంటి ప్రాంతాలకు పంపించిడానికి లారీలోఎగుమతులుచేయడానికి జట్టు కూలీలు పెద్దసంఖ్యలోనే పనిచేస్తున్నారు. –రోజుకు రూ. రెండు కోట్లు వ్యాపారం.... జిల్లాలో చిత్తుకాగితాలు,అట్టపెట్టెలు, పాత ఇనుము, మద్యం సీసాలు వంటివి కోనుగోలు వ్యాపారం రోజుకు రూ.రెండు కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఒక్క భీమవరం పరిసర ప్రాంతాల్లో సుమారు 25 షాపుల ద్వారా రోజుకు 30 టన్నుల వరకు కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో పాత ఇనుము మూడు లారీలు, సీసాలు అయిదు లారీలు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వీటి కొనుగోలు,అమ్మకాలు ద్వారా రూ.రెండు కోట్లుకు పైగానే లావాదేవిలు జరుతున్నట్లు చెబుతున్నారు. –ధరలో ఇలా ఉన్నాయి... చెత్త కాగితాలు, అట్టపెట్టెలు, మద్యం సీసాల ధరలు దాదాపు అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటున్న కొంతమంది అవకాశాన్ని బట్టి ధరలను పెంచడం, తగ్గిస్తుంటారు. గతంలో మద్యం సీసాలు చిన్నవి రెండు రూపాయలు, పెద్దవి రూ. అయిదుకు కొనుగోలు చేయగా ప్రస్తుతం బీరు సీసాలు వంటివాటిని కేవలం రూపాయిన్నరకే కొనుగోలు చేస్తుండగా చిన్నసీసాలను రూపాయికి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.పండ్లు, మద్యం సీపాలు వంటివాటి ప్యాకింగ్‌కు ఉపయోగించే అట్టపెట్టెలను కిలో రూ. 7, పాత పేపర్లు కిలో రూ.8 కొనుగోలు చేస్తున్నారు. ప్లాస్టిక్ సీసాలు ఇతర ప్లాస్టిక్ వస్తువులను కిలో రూ.10 కొనుగోలుచేస్తున్నారు. –స్త్రీ, పురుషులకు పనే.... చిత్తుకాగితాలు, పాత ఇనుము వంటి వ్యాపారంలో స్త్రీ,పురుషులకు ఉపాధి అవకాశాలున్నాయి. చిత్తు కాగితాలను ఏరడంతో స్త్రీ, పురుషులు కలిసి పనిచేస్తుండగా పురుషులు సైకిల్‌పై తిరిగి వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే షాపుల్లో వీటిని వేరుచేయడానికి, సీసాలు శుభ్రంచేయడానికి పెద్ద సంఖ్యలో మహిళలు పనిచేస్తుండగా ఇతర ప్రాంతాలకు పంపించడానికి లారీల్లో ఎగుమతి చేయడానికి జట్టు కార్మికులు పనిచేస్తున్నారు. –ఎక్కడికి వెళుతున్నాయంటే..... చిత్తుకాగితాలు,సీసాలు వంటివి కొనుగోలుచేసే వ్యాపారులు వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సీసాలను రణస్థలం, సంగారెడ్డి వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా పాత ఇనుము హైదరాబాద్, విజయవాడ, అట్టలను రాజమండ్రి ఎగుమతి చేస్తున్నారు. –ప్రత్యక్షంగా 50 మందికి ఉపాధి కల్పిస్తున్నా... ఫొటోఫైల్:27బీవీఆర్‌ఎమ్37–30080012: గొలగాని సత్యనారాయణ, నవుడూరు.... మాకుటుంబం మొత్తం పాత ఇనుము, చిత్తుకాగితాలు కొనుగోలు చేసే వ్యాపారంలోస్ధిరపడ్డాం, భీమవరం, నవుడూరు, ఆకివీడు ప్రాంతాల్లో షాపులు ఏర్పాటుచేశాం.వీటిల్లో సుమారు 50మంది ప్రతిరోజు పనిచేస్తున్నారు. ఇంకా అనేకమంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. మా వ్యాపారానికి పూర్తిస్ధాయిలో లైసెన్సులు కలిగి ఉన్నాం.ముందుగా చిన్నపాటి వ్యాపారం చేసే నేను ఇప్పుడు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉంది. -
పుష్కరాల్లో ప్రజాధనం దుబారా: నాగం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉంటే పుష్కరాల పేరుతో వందలాది కోట్లు దుబారాగా ఖర్చుచేశారని, నిధుల వినియోగంపై సమగ్రంగా విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు మూడోవిడత రుణమాఫీ నిధులు ఇప్పటివరకు అందలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసినా ఇప్పటివరకు వారి ఖాతాల్లో జమచేయలేదన్నారు. మంగళవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కోర్‌కమిటీ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రధాన చెరువులను నాలుగు ప్రాజెక్టుల నీళ్లద్వారా నింపాలని, రెయిన్ గన్స్ ఏర్పాటుచేసి రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధమైన పనులు మానుకొని ప్రజాసమస్యలపై దృష్టిసారించాలని హితవుపలికారు. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తిరంగాయాత్ర సెప్టెంబర్ 17వరకు కొనసాగుతుందన్నారు. సెప్టెంబర్ 3వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బైక్‌ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. జిల్లాకేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభకు కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారం అహైర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. జిల్లాల పునర్విభజన లోపభూయిష్టం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లాల పునర్విభజన పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 30 మండలాలున్న చోట మూడు జిల్లాలను ఏర్పాటుచేశారని, పాలమూరు జిల్లాలో మాత్రం 64 మండలాలు ఉండగా మూడుజిల్లాలను మాత్రమే ఏర్పాటు చేయడం సరికాదన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని శంషాబాద్‌లో కలపడం సరికాదన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లో ఉంచి నాలుగు జిల్లాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కల్వకుర్తి, కొడంగల్ నియోజకవర్గాలను రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పుష్కరాలకు రూ. కోట్లు వృథా
వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున కొల్లూరు: పుష్కరాల పనుల్లో ప్రభుత్వం రూ. కోట్లు వృథా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున విమర్శించారు. గురువారం కొల్లూరు మండలంలోని పోతార్లంకలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన పుష్కర స్నానమాచరించి పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గ పరిధిలో నిర్మించిన 12 పుష్కర ఘాట్లలో రెండు మూడు మినహా మిగిలిన ఘాట్లు నిరుపయోగంగా మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి అభివృద్ధిని విస్మరించడం హేయమని ధ్వజమెత్తారు. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ వేల కోట్లు స్వాహా చేయడం బాధాకరమన్నారు. ప్రణాళికేతర వ్యయం కారణంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.80 వేలSకోట్లు అప్పులు చేసిందని గుర్తుచేశారు. పుష్కర పనుల్లో వందల కోట్లు అవినీతి జరిగిందని ప్రభుత్వ అవినీతిపై సరైన విచారణ జరిపితే టీడీపీ ప్రభుత్వంలోని అవినీతి పరుల జాబితా బయటకి వస్తుందన్నారు. ఆయన వెంట కొల్లూరు ఉప సర్పంచి కఠెవరపు జేసుదాసు, దుగ్గిరాల మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్ బిట్రగుంట సత్యనారాయణ, మండల ఎస్సీ సెల్ ప్రదాన కార్యదర్శి కాలం రాజేంద్ర, స్థానిక నాయకులు పరిశ రంగారావు తదితరులున్నారు. -
వంటనూనె ప్యాకెట్లో మాంస వ్యర్థాలు!
గాదేపూడి (గుడ్లవల్లేరు) : ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే జంతువులు, పక్షుల కళేబరాల వ్యర్థాలతో తయారు చేస్తున్న నకిలీ వంటనూనె, నెయ్యి ముఠాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీ పేరిట మార్కెట్లోకి విడుదలైన పొద్దుతిరుగుడు నూనె ప్యాకెట్లో పేగులు, కొవ్వు వ్యర్థాలు వచ్చిన సంఘటన కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం గాదేపూడి గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన అప్పినీడి భాస్కరరావు చెబుతున్న మేరకు ఆయన కొనుగోలు చేసిన కిలో వంట నూనె ప్యాకెట్లో ఈ వ్యర్థాలు వచ్చాయి. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. వడ్లమన్నాడులో ఓ దుకాణంలో కొని తెచ్చానన్నారు. ఇంటికొచ్చి కత్తిరించగా ఆయిల్ బాగా దుర్వాసన వచ్చిందని, దానిలో నుంచి పేగులు, కొవ్వు ముక్కలు పడ్డాయని తెలిపారు. నూనె రక్తం రంగులో ఎర్రగా ఉందన్నారు. ఆ వంటనూనెను వాడలేక పక్కన పెట్టేశామన్నారు. ఒక ప్రముఖ కంపెనీ పేరిట ముద్రించిన ఆయిల్ కవర్లను కల్తీ ముఠాలు ఉపయోగించుకున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రముఖ కంపెనీ అయితే వినియోగదారులకు అనుమానం లేకుండా నమ్మకంతో కొనుగోలు చేస్తారని ఇలా అక్రమార్కులు తెగబడ్డారని చెబుతున్నారు. ఇంకా ఎన్ని బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ సంస్థలు ఇలాంటి ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసే కల్తీరాయుళ్ల గుట్టు బయటపడుతుందని కోరుతున్నారు. -
గ్యారేజీ పాలైన ‘ఆరాధన’
l మూటల్లో మూలుగుతున్న 3 వేల సంచికలు l అన్నవరం దేవస్థానం సిబ్బంది నిర్వాకం అన్నవరం : దేవాదాయ శాఖ 2015 జూలైలో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక కథనాలతో ప్రచురించిన ‘ఆరాధన’ ప్రత్యేక సంచిక ప్రతులు దేవస్థానం కారు గ్యారేజీలో పడి ఉన్నాయి. ఏకంగా 30 బస్తాలలో మూడువేల పుస్తకాలను మూటలు కట్టి ఎందుకూ పనికిరాని పుస్తకాలలా మూలన పడేశారు. దేవాదాయశాఖ ప్రతి నెలా ‘ఆరాధన’ ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రచురిస్తుంది. ఒక్కో సంచిక వెల రూ.25 కాగాఅన్నవరం దేవస్థానానికి ప్రతినెలా ఐదు వేల ప్రతులు పంపిస్తారు. ప్రతి నెలా వచ్చే పుస్తకాలను దేవస్థానం రూ.1,500 వ్రతాలు చేయించుకునే భక్తులకు, నిత్యకల్యాణం భక్తులకు ఉచితంగా ఇచ్చి. మిగిలిన ప్రతుల్ని విక్రయిస్తోంది. ప్రతి నెలా ఎన్నో కొన్ని పుస్తకాలు మిగిలిపోతున్నా వాటితో నిమిత్తం లేకుండా దేవస్థానానికి పంపించిన మొత్తం పుస్తకాలకు సొమ్ము చెల్లిస్తున్నారు. కాగా, 2015 జూలైలో పుష్కరాలకు సంబంధించి ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు, కమిషనర్ అనూరాధ సందేశాలతో, గోదావరి జిల్లాల్లోని ఆలయాల వివరాలతో రూపొందించిన ఆ సంచిక ప్రతులను గ్యారేజీకి తరలించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంత్య పుష్కరాల్లో పంపిణీ: ఈఓ కాగా ఆరాధన ప్రత్యేక సంచికలు దేవస్థానానికి పంపించినవి కాదని, పుష్కరాల్లో రాజమండ్రిలో విక్రయించగా మిగిలిన వాటిని గత ఆగస్టులో దేవస్థానానికి పంపివిక్రయించమన్నారని ఈఓ నాగేశ్వరరావు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. అప్పటికే ఆగస్టు నెల ఆరాధన మార్కెట్లోకి రావడంతో ఈ పుస్తకాలను ఎవరూ కొనలేదని, ఈ పుస్తకాలకు దేవస్థానం నగదు చెల్లించలేదని వివరించారు. ఈ నెల 31న ప్రారంభం కానున్న అంత్యపుష్కరాలలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు వీటిని పంపిణీ చేయిస్తామన్నారు. -
హోలీపండుగలో నీటిని వృధా చేయొద్దు!
థానెః ముంబై మెట్రోపాలిటన్ డివిజన్ లోని థానే ప్రజలు నీరు అనవసరంగా వృధా చేయవద్దని స్థానిక కలెక్టర్ అశ్విని జోషి పిలుపునిచ్చారు. భారత సంప్రదాయ పండుగల్లో ఒకటైన హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలోఆమె ప్రజలకు నీటిని వృధా చేయవద్దని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా జనం వారంపాటు జరుపుకునే అనేక సంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా రైన్ డ్యాన్స్ లు వంటివి చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందని, అటువంటి వాటితో నీరు భారీగా వృధా అయ్యే అవకాశం ఉందని థానె కలెక్టర్ అశ్విని జోషి అన్నారు. జిల్లాలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, నీటి వృధాని అరికట్టడంలో భాగంగా జలపూజలు చేపట్టి జలజాగృతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అవగాహన పెంచుకొని వృధాని అరికట్టాలని కోరారు. ముఖ్యంగా స్థానిక హౌసింగ్ సొసైటీలు, గృహ సముదాయాలు వాటర్ హార్వెస్టింగ్, రైసైక్లింగ్ పథకాలను ఆచరణలో పెట్టి , నీటి నిల్వలు పెంచేందుకు తోడ్పడాలని, అటువంటి ప్రాజెక్టులను జిల్లా ప్లానింగ్ కమిటి ముందుంచాలని జోషి కోరారు. జిల్లా షాపూర్ తాలూకాలోని ఆనకట్టలు, నదులు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని జోషి పేర్కొన్నారు. జిల్లాలోని ఆరు నదుల్లోని నీటితో కలెక్టర్ జలపూజ కార్యక్రమాన్ని చేపట్టి, దీంతోపాటు జలరథ్ యాత్రను కూడ ప్రారంభించారు. యాత్రలో భాగంగా అన్ని తాలూకాల్లో ప్రజలకు నీటివృధా అరికట్టడంతోపాటు, వాడకంలో జాగ్రత్తలపై అవగాహన పెంచనున్నారు. -
ఓ పక్క నీటి కష్టాలు.. మరోపక్క వృథా!
-
ఈ యాప్‌తో ఆహార వృధాకు అడ్డుకట్ట...
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అందరికీ ఈ సంగతి తెలిసినా చాలాసార్లు ఆహారాన్ని మాత్రం వ్యర్థం చేస్తుంటారు. ఇళ్లలో, హోటళ్లలో, పెళ్లిళ్లు, ఇతర వేడుకల సందర్భంగా ఎన్నో రకాలుగా ఆహారం పెద్ద ఎత్తున వృథా అవుతుంటుంది. అందుకే ఆహారం వృథా కాకుండా నివారించాలని ఆలోచించిన భారత సంతతి ఆవిష్కర్త ఒకరు దీనికి ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆకలితో ఉన్న వినియోగదారులకు, రెస్టారెంట్లు, హోటళ్లలో మిగిలిపోయే ఆహారాన్ని చౌకగానే అందించేందుకు వీలుగా ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్(యాప్)ను రూపొందించారు. ఒక్క అమెరికాలోనే ఏటా 16,500 కోట్ల డాలర్ల విలువైన ఆహారం చెత్తకుప్పల పాలు అవుతోందని తెలుసుకున్న తాను మరో ఇద్దరితో కలసి ‘పేర్అప్’ అనే ఈ యాప్‌ను అభివృద్ధిపర్చినట్లు న్యూయార్క్‌కు చెందిన అనూజ్ ఝంఝన్‌వాలా తెలిపారు. ఏ హోటల్లో ఎంత ఆహారం మిగిలిపోయి ఉంది? అది ఎంత చౌక ధరకు లభిస్తుంది? అన్నది ప్రతిరోజూ వినియోగదారులు ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. వినియోగదారులకు, హోటళ్ల నిర్వాహకులకు ఉపయోగకరమైన ఈ ఉచిత యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.