ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం ముందుగా గుమ్మం దగ్గర ఉండే డోర్‌మ్యాట్‌ని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభించాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి, బయటకి తిరిగేటప్పుడు కాళ్లకు ఉండే మట్టి అంటేది డోర్ మ్యాట్‌కే కాబట్టి డోర్ మ్యాట్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డోర్‌మ్యాట్‌ని మారుస్తుండాలి.
అందుబాటులో ఉంచుకోవడం..
– శుభ్రతకి కావాల్సిన వస్తువులన్నింటినీ మన చేతికి అందేలా ఉంచుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. పని కూడా సులువు అవుతుంది.
– కిటికీలు తెరిస్తే వెలుతురుతోపాటు దుమ్ము కూడా వచ్చేస్తుంది. అందుకే కిటికీల రెక్కలను కొద్దిసేపు తెరిచి ఉంచిన తర్వాత మళ్లీ మూసేయాలి.
– ఇక కిటికీ అద్దాలకీ దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా అంటి పెట్టుకుని ఉంటాయి. అందువల్ల కిటికీలను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటే సీజనల్ అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు.
బూజు దులపటం..
– ఇంటినంతా చక్కగా కడిగి శుభ్రంగా ఉంచడంతో పాటు గోడ మూలల్లో ఉన్న బూజును కూడా దులపాలి.
– ఇంట్లో చెత్తని తొలగించడంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదు.
– ముఖ్యంగా బాత్రూమ్‌లో, వంటగదుల్లోనూ సూక్ష్మజీవులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.
– ఇంటి ముందు చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి వస్తుంది. తేమ శాతం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు.
– ఇక ఇంటిని శుభ్రం చేయడమంటే చాలా పెద్ద సమస్య. వస్తువులను శుభ్రంగా కడిగే ముందు ఎక్కువగా దుమ్ము పేరుకునే వస్తువులను ముందుగా శుభ్రం చేసుకుంటే సగం పని అయిపోతుంది. దీనికి కింది సూచనలు పాటిస్తే సరిపోతుంది.
సీలింగ్ ΄్యాన్స్..
– సీలింగ్ ΄్యాన్‌లను తుడవకుండా ఉంటే వాటిపై దుమ్ము ఎక్కువగా చేరుతుంది. దానివల్ల ఇంట్లో ఉండే ఫర్నిచర్‌పై దుమ్ము పడుతుంది. కాబట్టి ఫ్యాన్‌ను మొదట శుభ్రం చేయాలి.
కంప్యూటర్..
– కంప్యూటర్, లాప్‌టాప్ కీబోర్డు ఎప్పటికప్పుడు శుభ్రం చే సుకోకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది.
టీవీ..
– టీవీ స్క్రీన్‌ను ఒక శుభ్రమైన మెత్తటి బట్టతో తుడవాలి. అలాగే టీవికి ముందు వైపు కన్నా వెనుక భాగంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది. దాన్ని దులపడటం చాలా అవసరం.
అద్దాలు..
– ఇంట్లో ఉండే అద్దాలను, గాజు పాత్రలను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టండి. ఇలా చేయటం వల్ల పాత్రలు కొత్తవిగా కనిపిస్తాయి.
పక్కబట్టలు మడతపెట్టడం..
– రోజంతా పని చేసిన తర్వాత వచ్చి సేదదీరేది బెడ్ మీదనే. మీ పడకగది మురిగ్గా ఉండటం చూస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. కాబట్టి నిద్ర లేవగానే దుప్పటిని దులిపి మడతబెట్టాలి. బెడ్‌షీట్‌ను నీట్‌గా సర్దాలి.
దుస్తుల శుభ్రం..
– ఒకేసారి మొత్తం బట్టలు ఉతకాలంటే అలసట రావడం సహజమే, పైగా అందుకు ఎక్కువ సమయం కూడా పడుతుంది.
– ధరించే దుస్తులలో రకాన్ని బట్టి వేటికవి విడదీసి ఉతికితే సులభంగా ఉంటుంది.
చెత్తను వదిలించుకోవడం..
– ఇంటిలో అనవసరమైన వస్తువులు తీసి బయట పడేసి తర్వాత అన్నిటినీ సర్దటం మంచిది.
– ఈ అలవాటును అందరూ తప్పక పాటించాలి.
– వాడే వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా సర్దుకోవాలి.
– టేబుల్స్ లేదా బల్లలపై తక్కువ వస్తువులుంటే వాటిని శుభ్రపర్చటం సులువవుతుంది.
– ఇంటి వాకిలి దగ్గర ఉంచే షూ ర్యాక్ కూడా శుభ్రపర్చటం చాలా ముఖ్యం.
– అలాగే మీకేదన్నా దాని స్థానంలో లేదు అన్పిస్తే, మళ్ళీ చేద్దాంలే అని వదిలేయకండి. అప్పటికప్పుడు చేయటం మంచిది.
నిద్రించే ముందే..
– మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు అన్నిటినీ శుభ్రం చేసే అలవాటు చేసుకోవాలి.
– ముఖ్యంగా పిల్లలకు వాళ్ల వస్తువులను సర్దేసి, వారి గదులను శుభ్రం చేసుకుని పడుకునేలా తర్ఫీదు ఇవ్వండి.
– వంటగదిని కూడా శుభ్రం చేసి పడుకోటం నేర్చుకోండి.
పరిసరాల పరిశుభ్రత..
మీ ఇంటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకోడానికి, పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యం. ఇది అందరి బాధ్యత. ఇంటి శుభ్రత కోసం మీరొక్కరే కాదు, కుటుంబసభ్యులు కూడా కృషి చేయాలి. అలా మీరే తర్ఫీదు ఇవ్వడం అవసరం. చిన్న పిల్లలు కదా, వాళ్లేమి చేయగలరులే అని వదిలేస్తే, తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చిన్నప్పటినుంచి పిల్లలకు కూడా ఎక్కడ తీసిన వస్తు సామగ్రిని అక్కడ పెట్టడం అలవాటు చేయడం అవసరం.
ఇవి చదవండి: తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్‌సైజ్.. ఏంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment