health issues
-
వేళకాని వేళల్లో.. ఆహారంతో అనర్థం..
షిఫ్టుల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులూ, అడపాదడపా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారంతా వేళకాని వేళల్లో ఆహారం తీసుకోవడం చాలా సాధారణం. అయితే ఓ అధ్యయనం ప్రకారం ఇలాంటివారిలో ఊబకాయంతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది. జీర్ణాశయానికి, మెదడుకూ మధ్య సమాచార సమన్వయాలు జరుగుతున్న విషయాలు అనేక అధ్యయనాల్లో వెలుగు చూశాయి.కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా బయటకు కనపడని కమ్యూనికేషన్స్ ఉంటాయని ఈ సరికొత్త అధ్యయనం తేల్చిచెబుతోంది. యూఎస్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని పెరల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందాల పరిశోధనల్లో ఈ అంశాలు వెలుగుచూశాయి. – సాక్షి, హైదరాబాద్కాలేయానికి, మెదడుకు మధ్య కూడా ‘క్లాక్’లింకు పట్టపగలు పనిచేయడంతోపాటు రాత్రివేళల్లో నిద్రపోయేలా మెదడులోని బయలాజికల్ క్లాక్ నిర్దేశిస్తుందని, దీన్నే సర్కేడియన్ రిథమ్‌గా చెబుతారన్న విషయం తెలిసిందే. తాజాగా పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం.. కాలేయానికి, మెదడుకూ మధ్య కూడా ఓ బయలాజికల్ క్లాక్ ఉంటుంది. ఆకలి వేసినప్పుడూ, ఏం తినాలన్నది నిర్ణయం తీసుకునేటప్పుడూ వేగస్ నర్వ్ ద్వారా కాలేయం నుంచి మెదడుకూ, మెదడు నుంచి మళ్లీ కాలేయానికి సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది.దాన్నిబట్టే ఓ వ్యక్తి తానెప్పుడు తినాలి? తినేటప్పుడు ఎలాంటి ఆహారాలను ఎంపిక చేసుకోవాలి వంటివి జరుగుతుంటాయి. ఈ కాలే య, మెదడు క్లాక్ సమాచారాల రిథమ్‌లో ఏదైనా తేడా వస్తే.. అది జీవక్రియల్లో అంతరాయాలకు దారితీస్తుందని, దాంతో బరువు పెరగడం, అది అనేక ఆరోగ్య సమస్యలకు తావివ్వడం,అవి మరికొన్ని అనారోగ్యాలకు దారితీయ డం.. ఇలా ఒక దానివెంట మరొక సమస్యకు దారితీస్తుంటాయి. ఎలుకల కాలేయంలోని ‘రెవ్–ఎర్బ్స్’అనే కుటుంబానికి చెందిన జన్యువులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దేహంలోని సర్కేడియమ్ రిథమ్‌ను నిర్దేశించే బయలాజికల్ క్లాక్ నిర్వహణలో ఈ జన్యువులు కీలక భూమిక పోషిస్తాయి. రకరకాల జీవక్రియలు, హార్మోన్లు వెలువడేలా చూడటం వంటి అనేక వాటిలో అవి పాలు పంచుకుంటుంటాయి. ఎలుకలు, మనుషుల జీవక్రియల పరిశీలన ఈ అధ్యయనంలో పాల్గొన్న ముఖ్యుల్లో ఒకరూ అలాగే పెన్ మెడిసిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్, ఒబిసిటీ అండ్ మెటబాలిజమ్ డైరెక్టర్ డాక్టర్ మిచెల్ లాజర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలుకలూ, మనుషులూ మెలకువతో ఉన్నప్పుడు తినే జీవులు కాబట్టి ఈ రెండు శరీరాల్లో జీవక్రియల పనితీరు పరిశీలించినప్పుడు కాలేయానికి, మెదడుకూ మధ్య ఉండే నిర్దేశిత సమాచారాల గురించిన వివరాలు తెలిశాయి. ఎలుకల్లో ఉండే ‘రెవ్–ఎర్బ్స్’జన్యువులకు మెదడుతో ఉన్న కనెక్షన్ తొలగించినప్పుడు ఎలుకలు తాము చురుగ్గా లేని సమయంలోనూ ఇష్టం వచ్చినట్టుగాతినడం, అవసరమైన దానికంటే ఎక్కువగా తినేయడం మొదలుపెట్టాయి. ఈ తిండి ఎలా ఉందంటే... అచ్చం రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు ఆకలితో నిమిత్తం లేకుండా మామూలు కంటే ఎక్కువగానే తినేయడంలా అనిపించింది. ఇంకా ఇదెలా ఉందంటే.. జెట్లాగ్ తర్వాత బయలాజికల్ క్లాక్‌లో అంతరాయం కలగడంతో వేళాపాళా లేకుండా ఇష్టమొచ్చి నట్టు తినేయడంలా కనిపించింది. వేగస్ నర్వ్ ద్వారా సమాచార మార్పిడి ఎప్పుడు, ఎలా తినాలి అనే ఈ సమాచారాల ఇచ్చిపుచ్చుకోడాలు వేగస్ నర్వ్ అనే ఓ కీలక నరానికి చెందిన అత్యంత సంక్లిష్టమైన నర్వ్ ఫైబర్స్ ద్వారా జరుగుతుంటుంది. ఎప్పుడు ఆకలిగా అనిపించాలి, ఎప్పుడు ఎంత మొత్తంలో తినాలనే ఆదేశాలు కాలే యం ఈ నరం ద్వారానే మెదడుకు చేరవేస్తుంది. దాని ప్రకారమే మనుషులకూ లేదా జీవాలకు ఎప్పుడు ఆకలి వేయాలో అప్పుడు ఆకలిగా అనిపించడం, దాన్ని బట్టి ఎంత తినాలో అంత తినేశాక ఆకలి తీరడం వంటివన్నీ సర్కేడియన్ రిథమ్‌కు అనుగుణంగా జరుగుతుంటాయి. డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం ప్రస్తుతం పనివేళల్లో గణనీయమైన మార్పులు రావడం, అర్ధరాత్రి, అపరాత్రీ అనే తేడాలు లేకుండా పనులు చేయాల్సి రావడం దుష్ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అధిక రక్తపోటు, మధుమేహం, రక్తంలో కొలెస్టరాల్ మోతాదులు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. చివరకు ఇవన్నీ టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులూ, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తున్నాయని డాక్టర్ మిచెల్ లాజర్ చెబుతున్నారు. మనదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎమ్ఆర్–ఇండియాబ్) నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం భారత్‌లో 10.1 కోట్ల డయాబెటిస్ బాధితులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉండగా... అందులో 10.1 కోట్ల మంది కేవలం మన దేశం నుంచే ఉన్నారు. అంటే ప్రపంచంలోని ప్రతి 8 మంది డయాబెటిస్ బాధితుల్లో ఒకరు భారత్‌వాసి అన్నమాట. మన భారతీయ గణాంకాలను యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధనల ఫలితాలతో అనుసంధానించి చూస్తే నిద్రపోవాల్సిన సమయంలో పనిచేస్తూ, వేళగాని వేళల్లో భోజనం చేస్తున్నవారిలో ఈ జీవక్రియలకు సంబంధించిన జబ్బులైన డయాబెటిస్ వంటివి చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా... ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన చికిత్స ప్రణాళికల ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతోంది. ఉదాహరణకు చాలా ఊబకాయంతో ఉన్న ఎలుకల తాలూకు వేగస్ నర్వ్‌ను కట్ చేసినప్పుడు... మళ్లీ అవి నార్మల్ ఎలుకల్లాగే తినడం, మితంగానే ఆహారం తీసుకోవడం వంటివి చేశాయి.ఈ పరిశోధనతో ఎంతో మేలుదేహం తాలూకు ఓ పూర్తిస్థాయి సమన్వయ వ్యవస్థ (హోమియోస్టాటస్) అంతా చక్కగా కొనసాగుతూ జీవక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూడటానికి కాలేయం తాలూకు ఏఏ అంశాలు, ఏఏ జన్యువులు పాలుపంచుకుంటున్నాయో పరిశీలించి, ఆ వ్యవస్థల కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాలూ, దాంతో వచ్చే అనర్థాలూ, అనారోగ్యాలకు అవసరమైన చికిత్సలను తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఎంతగానో తోడ్పడుతుందన్నది పరిశోధకుల అభిప్రాయం. ఈ పరిశీలనల వెలుగులో ప్రజల ఆరోగ్య సంరక్షణలకు అసరమైన చర్యలూ, ప్రణాళికలు రూపొందింవచ్చన్నది అనేక ఆరోగ్య సంస్థలకు చెందిన అధికారులు, ప్రణాళికావేత్తల భావన. -
అన్నేసి గంటలు పనిచేస్తే జరిగేది ఇదే!
భారత్‌లో పనిగంటల అంశం మరోసారి చర్చ తెర మీదకు వచ్చింది. ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారం మొత్తం మీద ఏకంగా 90 గంటలు పని చేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. మొన్నీమధ్యే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 70 గంటలు పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యం ‘అంతకుమించి’ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ఈ దరిమిలా వీళ్లిద్దరి గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇంతకీ 70.. 90.. మనిషి శరీరం ఒక వారంలో అసలు ఎన్నేసి పనిగంటలను చేయగలదు?. ఏ మేర పని ఒత్తిడిని ఒక ఉద్యోగి భరించగలరు?. అలా గనుక పని చేస్తే.. శరీరంలో కలిగే మార్పులేంటి?. ఈ విషయంలో అసలు వైద్యులు ఏం చెబుతున్నారు?.. బిజినెస్ టైకూన్లు చెబుతున్న అంతటి పని భారం ఉద్యోగి మోయ తరమేనా?.. వారంలో 90 గంటలపని.. అంటే ఏడు రోజులపాటు 13 గంటల చొప్పున పని చేయాలన్నమాట. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, ఇతర పనులు, ప్రయాణాలు, ఆఖరికి కుటుంబ సభ్యులతో గడపడం లాంటి వాటితో సర్దుకుపోవాలన్నమాట. అయితే ఇది శారీరకంగానేకాదు.. మానసికంగానూ మనిషిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయం ప్రకారం.. వారంలో 55 గంటలకు మించి గనుక పని చేస్తే గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉంటుందట. అలా పనిచేసే ఉద్యోగుల్లో వందలో 35 మంది స్ట్రోక్ బారినపడే అవకాశం ఉంది. వందలో 17 మంది ప్రాణమే పొగొట్టుకునే అవకాశం ఉంది అని ఆ స్టడీ వెల్లడించింది. ‘‘ఎక్కువసేపు పని చేయడమంటే గుండె మీద ఒత్తిడి పెంచడమే. దీనివల్ల కోర్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. తద్వారా బీపీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. అలా హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌తో పాటు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడడమో లేదంటే కుంచిచుపోతాయి’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. ఉద్యోగుల పని గంటలు తగ్గాల్సిందే!.. ఇక ఎక్కువ గంటలు పని చేయడం డయాబెటిస్‌కు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఇది రక్తంలో షుగర్ స్థాయిపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతుంది. మహిళలు 45 గంటలకంటే ఎక్కువసేపు పని చేసినా.. పురుషులు 53 గంటలకు మించి పని చేసినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు తెలిపాయి కూడా. ఇక చాలాసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఇది ఒబెసిటీ(స్థూలకాయం)కి దారి తీయొచ్చు. అన్నింటికి మించి.. విపరీతమైన పనిభారం మానసిక ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. ఇది బంధాలకు బీటలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే.. విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. జీరో రెస్ట్ వర్క్.. నిద్రాహారాలను నిర్లక్ష్యం చేయిస్తుంది. పని ఒత్తిడి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతిమంగా.. అనారోగ్యకరమైన జీవనశైలి వైపునకు అడుగులు వేయిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో అధిక పని గంటల నిర్ణయాలతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వారానికి మొత్తం 40 గంటలే పని ఉండాలి!ఇన్ఫోసిస్ మూర్తి(78) ఏమన్నారంటే..ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలి.తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మరోసారి ఆయన స్పందిస్తూ..ఇన్ఫోసిస్(Infosys)ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?.ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం(64) ఏమన్నారంటే..ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను. అయినా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. అందుకోసం ఆదివారం సెలవులనూ వదిలేయాలి. ఇదీ చదవండి: 104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి -
పాదాల నొప్పి తగ్గడానికి పొట్టలోని కొవ్వును ఇంజెక్ట్ చేస్తే చాలు!!
తమను బాధించే పాదాల నొప్పికి తమ పొట్ట (లోవర్ అబ్డామెన్)లోని కొవ్వు విరుగుడుగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ప్లాంటార్ ఫేసిౖయెటిస్ వంటి కొన్ని రకాల పాదాల నొప్పికి కారణమయ్యే వ్యాధులకు తమ పొట్టలోని సొంత కొవ్వు కణాలనుంచి తీసిన ‘స్టెమ్ సెల్స్’ను పాదాల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనివల్ల చాలాకాలం నుంచి బాధిస్తున్న నొప్పి తగ్గడమే కాదు... కేవలం ఆరు నెలల వ్యవధిలోనే వారు మునుపటిలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వంటి ఆట పాటల్లో పాలుపంచుకునేంతగా సమస్య నయమవుతుందని ఈ పరిశోధన వల్ల తేలింది. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. శస్త్రచికిత్సే చివరి పరిష్కారంగా ఉన్న కొత్త పాదాల నొప్పులు కూడా ఈ చిన్నపాటి ఇంజెక్షన్ చికిత్సతో తగ్గి΄ోయినట్లుగా ఈ పరిశోధనలో తెలిసివచ్చింది. ఈ పరిశోధన వివరాలు ప్లాస్టిక్ అండ్ రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ’ అనే మెడికల్ జర్నల్‌లో నమోదు చేశారు. (చదవండి: ఎన్ని సౌందర్య సాధనాలు వచ్చినా ఇవే ఎవర్గ్రీన్..!) -
ఈ అలవాట్లు ఉంటే! 50లో హెల్దీ అండ్ హ్యాపీ..!
రొటీన్‌గా చేసే పనుల్లో చేసుకోదగిన చిన్న చిన్న మార్పులు న్యూ ఇయర్(New Year)తో 50 ఏళ్లు నిండుతాయా...ఎంతో హుషారుగా, మరెంతో శ్రమతో లేదంటే.. గడిచిన నాలుగు పదులనూఓ జ్ఞాపకంలా మార్చుకుంటూ ఐదు పదుల్లోకి అడుగుపెట్టి ఉంటారు. ఇప్పటివరకు ఒక లెక్క...ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు 50 ఏళ్ల నుంచి మహిళల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇంటా బయట ఎదురయ్యే ఒత్తిళ్లు, తమ పట్ల తాము పట్టించుకోని విధానం ఎప్పుడూ ఉంటుంది. పర్లేదు అని నిర్లక్ష్యం చేసే రోజువారీ అలవాట్లను వదిలేసికొత్తగా ఈ అలవాట్లను అలవరచుకోండి. 50 ఏళ్లలోనూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండండి.వ్యాయామాలు(Exercises)కార్డియో ఎక్సర్సైజులు చేయాలనుకోకండి. శరీరానికంతటికీ శక్తినిచ్చే వ్యాయామం కండర కణజాలాన్ని సంరక్షిస్తుంది. ఎముక నష్టం కాకుండా పోరాడుతుంది. సమతుల్యతను కాపాడుతుంది. సడెన్‌గా పడిపోయే ప్రమాదాలను నివారిస్తుంది. సెల్ఫ్‌కేర్(Self Care)ఎప్పుడూ తమ కన్నా ముందు ఇతరులకు ఇవ్వడానికే శక్తిని ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక నుంచి రోజులో కొంత సమయం ‘నా కోసం నేను’ అనేలా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునే మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించే అలవాట్లు, కార్యకలా΄ాలకు ప్రాధాన్యత ఇవ్వండి.చురుకుగా ఉండటానికి..50 లలో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. గంటల తరబడి కూర్చుంటే గుండె జబ్బుల రిస్క్ పెరగవచ్చు. ఊబకాయం వల్ల కీళ్లపై భారం పడి మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. అందుకని శరీరం, మైండ్ చురుకుదనానికి రెగ్యులర్ మూవ్మెంట్స్ ఉండేలా చూసుకోవాలి.నిల్వ పదార్థాలకు ‘నో’ఉప్పు, చక్కెర మోతాదు నిల్వ పదార్థాలలో ఎక్కువ. అంతేకాదు, వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకని మైదాతోపాటు ఇతర నిల్వ ఉండే పదార్థాలను పక్కనపెట్టండి.చర్మం పట్ల జాగ్రత్త! (Skin Care)చర్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. చర్మ కేన్సర్ ప్రమాదాన్నీ పెంచుతుంది. వయసుతోపాటు చర్మమూ పొడిబారుతుంటుంది. ఎండవేళలో బయటకు వెళ్లినప్పుడు ఈ సమస్య మరీ పెరుగుతుంది. అందుకని, ఎండ నేరుగా చర్మంపై పడకుండా ఎస్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉన్న క్రీమ్స్ ఉపయోగించాలి..ప్రోటీన్స్(Proteins)ఇన్నిరోజులు రుచిగా ఉండే ఆహారంపైన దృష్టి పెట్టి ఉంటారు. కానీ, తినే ఆహారంలో ప్రోటీన్ తక్కువ ఉంటే కండరాలకు వేగంగా నష్టం వాటిల్లడమే కాదు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకని నట్స్, గుడ్లు, మొక్కల నుంచి లభించే ప్రోటీన్లు గల ఆహారాన్ని భోజనంలో చేర్చండి.తరచూ నీళ్లుడీహైడ్రేషన్ ప్రభావాలు చర్మం సాగే గుణం, అజీర్తి, శక్తి స్థాయిలపై పడుతుంది. దాహం వేయడం అనే సంకేతాలు వయస్సుతోపాటు తగ్గుతుంటాయని గ్రహించి, తరచూ నీళ్లు తాగుతుండాలి.హాయిగొలిపే నిద్రనిద్రలేమి జీర్ణక్రియ, మానసిక స్థితి, జ్ఞాపశక్తిపైన ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో మొబైల్, టీవీ స్క్రీన్ల వల్ల అర్ధరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమించేవాళ్లే ఎక్కువ. ఈ జాబితాలో మీరుంటే, స్క్రీన్లను త్వరగా కట్టిపెట్టి రోజూ 6–8 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించండి. రాత్రివేళ కెఫీన్ వంటి పానీయాలకు దూరంగా ఉంటే నిద్ర లేమి సమస్య తలెత్తదు.అభిరుచులుఈ వయసులో తలెత్తే మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్‌ని విస్మరిస్తే అవి దీర్ఘకాలం నష్టం జరగవచ్చు. అందుకని మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే శ్రద్ధ, అభిరుచుల కోసం సమయం కేటాయించుకోవాలి. (చదవండి: 'యూపీఎస్సీ చాట్ భండార్'..నాటి స్వాతంత్య్ర సంగ్రామాన్ని..!) -
ఇలాంటి చెవి సమస్యలు కనిపించాయా? ఓ కన్నేయండి మరి!
కొందరిలో అకస్మాత్తుగా చెవులు వినపడకుండాపోయే సమస్య కనిపిస్తుంటుంది. అకస్మాత్తుగా కనిపించే ఈ వినికిడి సమస్యను ఇంగ్లిష్‌లో ‘సడెన్ డెఫ్నెస్’ అనీ, వైద్యపరిభాషలో ‘సడెన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్’ (సంక్షిప్తంగా ఎస్ఎస్ హెచ్ఎల్) అంటారు. అకస్మాత్తుగా వచ్చే ఈ సమస్య సాధారణంగా ఒక్క చెవినే ప్రభావితం చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, అప్పుడు ఏం చేయాలి, వైద్యులు ఎలాంటి చికిత్సలు అందిస్తారనే అంశాలను తెలుసుకుందాం. అకస్మాత్తు వినికిడి సమస్యను గుర్తించడం కాస్త విచిత్రంగానే జరుగుతుంది. ఉదాహరణకు పొద్దున్నే వాకింగ్‌కు వెళ్తున్నప్పుడు వినిపించే అలారం ఒకవైపే వినిపిస్తుండం లేదా ఫోన్ మాట్లాడుతుంటే ఒకవైపు చెవి వినిపించక... మరో చెవితో వినాల్సి రావడం వంటి అంశాలతో ఈ సమస్య తెలిసి వస్తుంది. లక్షణాలు... చెవి పూర్తిగా నిండిపోయినట్లు భావన కలుగుతుండటం తల తిరుగు తున్నట్లుగా (డిజ్జీనెస్) అనిపిస్తుండటం ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిల్చున్నప్పుడు వినిపిస్తున్నట్టుగా చెవిలో హోరుమనే శబ్దం వినిపిస్తుండటం (ఈ తరహా సమస్యను ‘టినైటస్’ అంటారు. ఇది విడిగా కూడా కనిపించే అవకాశముంది). గుర్తించడం / నిర్ధారణ ఎలా? ఈఎన్టీ డాక్టర్‌ను సంప్రదిస్తే... కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ‘కండక్టివ్ హియరింగ్ లాస్’ అనే వినికిడి సమస్య లేదనే అంశాన్ని నిర్ధారణ చేయడం కోసం ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. అంటే చెవిలో గులిమి గానీ లేదా ద్రవాలు గాని అడ్డుపడటం వల్ల వినికిడి సమస్య రావడాన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. ఆ అడ్డంకిని తొలగించగానే ఈ సమస్య తొలగిపోతుంది. కానీ ‘అకస్మాత్తుగా వచ్చే వినికిడి సమస్య’ (ఎస్ఎస్హెచ్ఎల్)లో అలా జరగదు. అటు తర్వాత ‘ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ’ అనే మరో వైద్య పరీక్షతో చెవి ఏయే ఫ్రీక్వెన్సీలలో, ఎంతెంత గట్టి శబ్దాలు వినగలుగుతోందనే విషయాన్ని తెలుసుకుంటారు. అకస్మాత్తుగా వినికిడి సమస్య వచ్చిన వారు కేవలం 72 గంటల్లోనే 30 డెసిబుల్స్ కంటే తక్కువ తీవ్రత ఉన్న శబ్దాలను వినగలిగే శక్తిని కోల్పోతారు. ఇలా అకస్మాత్తుగా వినికిడి సమస్య వచ్చిన వారికి ఎదుటివారు మామూలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ అవి గుసగుసల్లా అనిపిస్తుంటాయి. పైన పేర్కొన్న పరీక్షలతో పాటు మరికొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇమేజింగ్ పరీక్షలు, బ్యాలెన్స్ పరీక్షలూ బాధితుల్లో ఈ సమస్యకు కారణమేమిటో తెలుసుకోడానికి ఉపయోగపడతాయి. కోల్పోయిన వినికిడి శక్తి మళ్లీ వస్తుందా? వినికిడి శక్తి కోల్పోయిన వెంటనే ఎంత త్వరగా చికిత్సకోసం వస్తే అంతగా వినికిడిని మళ్లీ పొందడం సాధ్యమవుతుంది. అయితే... ఇందులో కొందరికి కోల్పోయిన వినికిడి శక్తి పూర్తిగా వస్తే మరికొందరికి కొద్దిగానే వస్తుంది. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి పొందడం అన్నది కూడా తగ్గుతూ పోతుంది. అందుకే వినికిడి కోల్పోయినట్లు అనిపించగానే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. చికిత్స : వినికిడి శక్తిని కోల్పోయిన సందర్భాల్లో అది ఏ కారణం వల్ల జరిగిందో తెలియనప్పుడు ప్రధానంగా కార్టికో స్టెరాయిడ్స్ సహాయంతో చికిత్స అందిస్తారు. అవి చెవిలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించి, వినికిడి శక్తిని పునరుద్ధరించడానికి తోడ్పడుతుంది. గతంలో ఈ స్టెరాయిడ్స్‌ను నోటి ద్వారా తీసుకునే మందుల రూపంలో ఇచ్చేవారు. అయితే ఇటీవల వీటిని చెవిలోపలికి ఇచ్చే ఇంజెక్షన్ల (ఇంట్రా టింపానిక్ ఇంజెక్షన్స్) రూపంలో ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల ఈ మందులు ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా, ఈ స్టెరాయిడ్స్ కారణంగా శరీరంలో కలిగే దుష్ప్రభావాలనూ (సైడ్ ఎఫెక్ట్స్) నివరించ వచ్చు. అంతేకాదు, ఇలా ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం వల్ల మందు చెవిలో లోపలి వరకు మందు చేరడం సులువవుతుంది. వీటిని ఔట్ పేషెంట్స్ విభాగంలోనే ఓటోలారింగాల జిస్టుల ఆధ్వర్యంలో ఇస్తుంటారు. ఫలితాలు ప్రభావ పూర్వకంగా ఉండాలంటే ఈ ఇంజెక్షన్లను సమస్య కనుగొన్న వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ అకస్మాత్తు వినికిడి సమస్యకు ఇంకేవైనా అంశాలు కారణమని తెలిస్తే... ముందుగా వాటికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఇన్షెక్షన్ వల్ల ఈ సమస్య వచ్చిందని తేలితే, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఏవైనా హానికరమైన మందుల వల్ల ఈ సమస్య వచ్చిందని తేలితే, ఆ మందుల్ని ఆపేసి, ప్రత్యామ్నాయ ఔషధాలను ప్రిస్క్రయిబ్ చేయడం, ఒకవేళ తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ సమస్యను తెచ్చిపెట్టిందని తేలినప్పుడు... ఆ వ్యవస్థను నెమ్మదింపజేసే మందులను వాడటం వంటి చికిత్సలను డాక్టర్లు సూచిస్తారు. ఒకవేళ వినికిడి లేమి సమస్య చాలా తీవ్రంగా ఉన్నా... లేదా సమస్య రెండువైపులా చెవులకూ వస్తే బయటి శబ్దాలను పెద్దగా వినిపింపజేసే ‘హియరింగ్ ఎయిడ్స్’ వాడటం లేదా నేరుగా చెవి నుంచి మెదడుకు శబ్దాలను వినిపించే ప్రక్రియను ప్రేరేపించే ‘కాక్లియార్ ఇంప్లాంట్స్’ అమర్చడం వంటి చికిత్సలు అవసరం కావచ్చు. విస్మరించే అవకాశాలు ఎక్కువ... అకస్మాత్తుగా తమకు ఒక చెవి వినిపించకుండా పోయిన ఈ సమస్యను కొందరు పూర్తిగా విస్మరిస్తుంటారు. దీనికి కారణం... తమకు ఏదో అలర్జీ కారణంగా చెవి దిబ్బెడ వేసినట్లు అనిపిస్తుందని అనుకుంటుంటారు లేదా తమకు సైనస్ వంటి ఇన్ఫెక్షన్ ఉన్నందున ఇలా జరుగుతుందని భావిస్తుంటారు. మరికొందరైతే చెవిలో గువిలి చేరిందనీ, అందువల్ల తమ చెవి నిండుగా అనిపిస్తుందనీ, దాన్ని శుభ్రం చేయిస్తే అంతా మామూలైపోతుందని భావిస్తుంటారు.-డా. మోగంటి అశోక్ పృథ్విరాజ్, సీనియర్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్ -
అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!
డాక్టరుగారూ! మా తమ్ముడు బయట అందరితో చాలా బాగా ఉంటాడు. ఇంట్లో మాత్రం ఎప్పుడూ భార్యతో కొట్లాటలే! భార్యను విపరీతంగా అనుమానిస్తాడు. చాలామందితో సంబంధాలున్నాయని తిట్టడం కొట్టడం కూడా చేశాడు. నిజానికి వాడి భార్య చాలా మంచి అమ్మాయి. ఈ బాధలు భరించలేక మూడేళ్ళ క్రిందట ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. సంవత్సరం కిందట మళ్ళీ మా పెద్దలు రెండో వివాహం చేశారు. మళ్ళీ అదే విధంగా ఈమెను కూడా అనుమానించి వేధిస్తున్నాడు. మావాడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో మాకర్థం కావడం లేదు. ఈమె కూడా వీడు పెట్టే బాధలు తట్టుకోలేక ఏమైనా చేసుకుంటుందేమోనని మాకు భయంగా ఉంది. మా తమ్ముడికి ఇలా మళ్ళీ పెళ్ళి చేయడం మా తప్పేనంటారా! అసలు మావాడెందుకు ఇలా చేస్తున్నాడో దయచేసి చెప్పండి.– పద్మావతి, గిద్దలూరుమీ తమ్ముడు ‘డెల్యూజనల్ డిసార్డర్’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు మీరు రాసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. దీనిని ‘ఒథెల్లో సిండ్రోమ్’ అని కూడా అంటారు. షేక్స్పియర్ రాసిన ‘ఒథెల్లో’ నాటకంలోని ఇతివృత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకున్నా, వాస్తవం కాకపోయినా జీవిత భాగస్వామి శీలాన్ని శంకించి ఇలా వేధించడం ఒక విధమైన మానసిక జబ్బే! మెదడులోని కొన్ని రసాయనిక చర్యలవల్ల, వారసత్వంగా వచ్చే జీన్స్ ప్రభావం వల్లనూ కొందరికి ఈ వ్యాధి వస్తుంది. ఇది కూడా ఒక మానసిక రుగ్మత అని తెలియక మీరు మీ తమ్ముడికి మళ్లీ వివాహం చేసి పెద్దపొరపాటు చేశారు. మీ మరదలు చాలా మంచిదని మీరే చెబుతున్నారు కదా... మొదట్లోనే మీవాడిని మానసిక వైద్యునికి చూపించి తగిన చికిత్స చేయించి ఉంటే, మీ మరదలు అలా ఆత్మహత్య చేసుకొని ఉండకపోవచ్చు. ఏమైనా, మీ తమ్ముడికి వచ్చే ఈ అనుమానాలను తగ్గించేందుకు, మంచి మందులు, ఇతర చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఇంకో అఘాయిత్యం జరగక ముందే వెంటనే మీ తమ్ముణ్ణి దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌కు చూపించి వైద్యం చేయిస్తే మీ వాడు పూర్తిగా ఆ భ్రమలు, భ్రాంతుల నుండి బయటపడి రెండో భార్యతో సంతోషంగా సంసారం చేయగలడు. ఆలస్యం చేయకుండా మానసిక వైద్య చికిత్స చేయించండి. (చదవండి: సూర్యరశ్మికి కొదువ లేదు..ఐనా ఆ విటమిన్ లోపమే ఎక్కువ ఎందుకు..?) -
Mohan Babu: మోహన్‌బాబు ఆరోగ్యంపై అప్డేట్
-
ఆ జిల్లాకు ఏమైంది? విద్యార్థుల ప్రాణాల్ని తీస్తున్న గుండె పోటు.. తాజాగా
ఆ జిల్లాకు ఏమైందో ఏమో.. నెలల వ్యవధిలో హార్ట్ ఎటాక్‌తో విద్యార్థులు ప్రాణలు పోగొట్టుకున్నారు. నెలల వ్యవధిలో ముగ్గుర విద్యార్థుల్లో హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు పోగొట్టుకోగా.. ముగ్గురు అంతకంటే ఎక్కవమంది విద్యార్థులు కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. తాజాగా, స్కూల్లో ఆటల పోటీల కోసం ప్రాక్టీస్ చేస్తున్న 14ఏళ్ల బాలుడు హార్ట్ ఎటాక్ ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రతీ ఒక్కరిని కలచి వేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లా సిరౌలి గ్రామానికి చెందిన మోహిత్ చౌదరి (14) చదివే స్కూల్లో డిసెంబర్ 7న ఆటలు పోటీలు జరగనున్నాయి. ఈ ఆటల పోటీల్లో తన ప్రతిభను చాటుకునేందుకు మోహిత్ చౌదరి సిద్ధమయ్యాడు.ఇందులో భాగంగా తన తోటి స్నేహితులతో కలిసి పరుగు పందెం ప్రాక్టీస్ చేస్తుండగా.. హార్ట్ ఎటాక్‌తో స్కూల్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.కాగా, ఈ ఏడాది ఆగస్ట్ నెలలో బాలుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా..ఇప్పుడు కుమారుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత నెలలో మమతమరోవైపు అలీఘర్ జిల్లాలో గుండె పోటుతో నెలల వ్యవధిలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నవంబర్ నెలలో అలీఘర్ జిల్లా అర్రానా గ్రామానికి మమత (20) గుండె పోటుతో మరణించింది. రన్నింగ్ తర్వాత హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలింది. అత్యవసర చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించినా..అప్పటికే జరగాల్సి నష్టం జరిగింది. మమత అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం అదే అలీఘర్ జిల్లా లోధి నగర్‌కు చెందిన ఏనిమిదేళ్ల బాలిక గుండె పోటుతో మరణించింది. 25రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం అలీఘర్ జిల్లాలో వరుస మరణాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. -
విరుగుడు లేని విషం!
⇒కాగజ్‌నగర్‌కు చెందిన యువకుడు (35) కుటుంబ గొడవలతో గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. అప్పటికే కిడ్నీలు దెబ్బతినడంతో ప్రత్యేక డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి విషమించి నాలుగు రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. ⇒ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన యువకుడు (21) స్నేహితుల మధ్య విభేదాలతో గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. పరిస్థితి చేయి దాటిపోయింది. చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆ యువకుడు బతకడం కష్టమని తేల్చి చెప్పారు. రెండు రోజులకే అతడి ప్రాణాలు పోయాయి.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంట చేన్లలో కలుపు నివారణకు వాడే గడ్డి మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకు రెండు, మూడు చోట్ల ‘పారాక్వాట్’ గడ్డి మందు తాగి మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో ఈ మందును తాగిన వారిని కాపాడుకునేందుకు విరుగుడు కూడా లేక నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అత్యంత విషపూరితమైన ఈ మందును పొలాల్లో పిచికారీ చేసే సమయంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు సమస్యలు వస్తున్నాయి. అది పర్యావరణానికి, జీవజాతులకూ ప్రమాదకరమని వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్సకు లొంగని మందు! పారాక్వాట్ గడ్డి మందు కేవలం పది మిల్లీలీటర్లు (ఎంఎల్) శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెప్తున్నారు. అది శ్వాస వ్యవస్థ, కిడ్నీలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని... గుండె, కాలేయం సహా అన్ని అవయవాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. గత ఏడాది ఈ గడ్డిమందు తాగిన ఓ యువకుడికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల మారి్పడి చేయాల్సి వచి్చందని గుర్తు చేస్తున్నారు. చాలా క్రిమిసంహాకర మందులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని.. వాటి తయారీ కంపెనీలే విరుగుడు ఫార్ములా ఇస్తుంటాయని చెబుతున్నారు. కానీ ఈ గడ్డి మందుకు మాత్రం ఇప్పటికీ సరైన విరుగుడు చికిత్స లేక.. ఎన్నో పేద, మధ్య తరగతి జీవితాలు అర్ధంతరంగా ముగుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఏమిటీ పారాక్వాట్? పారాక్వాట్ డైక్లోరైడ్గా పిలిచే గడ్డిమందు వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది అత్యంత విషపూరితమైనా.. కూలీల కొరత ఓవైపు, సులువుగా కలుపు నివారణ అవుతుందనే ఉద్దేశంతో మరోవైపు రైతులు ఈ మందును వాడుతున్నారు. కేవలం రూ.200 ఖర్చుతో ఎకరం చేనులో కలుపు నివారణ చేయవచ్చని.. అధిక గాఢత కారణంగా 24 గంటల్లోనే మొక్కలు మాడిపోతాయని అంటున్నారు. పిచికారీ చేసే సమయంలోనూ తలనొప్పి, వికారం, ఒంటిపై దద్దుర్లు వస్తుంటాయని చెబుతున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు సరైన చికిత్స లేని ఈ మందు దుష్ప్రభావాలపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని గమనించిన కొందరు వైద్యులు ప్రభుత్వానికి విన్నవించేందుకు ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మంచిర్యాల పరిధిలోని ప్రతినిధులు పారాక్వాట్ తీవ్రతపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం ఇచ్చారు కూడా. పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పారాక్వాట్ తీవ్రతపై పరిశోధనలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఆత్మహత్య నిరోధక కమిటీలు ఈ మందు విషయంలో అవగాహన కలి్పస్తున్నాయి. తయారు చేసే దేశంలోనే ఆంక్షలు పారాక్వాట్‌ను చాలా దేశాలు నిషేధించాయి. ఈ మందు తయారీ కంపెనీ ఉన్న స్విట్జర్లాండ్‌లో, ఉత్పత్తి చేసే చైనాలోనూ ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశాలోని బుర్లా జిల్లాలో రెండేళ్లలో 170 మంది వరకు ఈ గడ్డి మందు తాగి చనిపోవడంతో నిషేధించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి. అక్కడి సర్కారు పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలపై ఆంక్షలు విధించింది. కానీ రాష్ట్రాలకు 60రోజులు మాత్రమే అమ్మకాలను నిలిపేసే అధికారం ఉండటంతో.. శాశ్వతంగా నిషేధించాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో కలుపు గడ్డి నివారణ కోసం మరో మందును ప్రత్యామ్నాయంగా చూపాలనే డిమాండ్లు వస్తున్నాయి. కిడ్నీలపై తీవ్ర ప్రభావం ఎవరైనా పారాక్వాట్ తాగిన వెంటనే ఆస్పత్రికి వస్తే బతికే చాన్స్ ఉంటుంది. కిడ్నీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక డయాలసిస్ చేస్తాం. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే ప్రాణాలు కోల్పోయినట్టే. అందుకే ఈ మందు తీవ్రతను సర్కారుకు తెలియజేయాలని అనుకుంటున్నాం. – రాకేశ్ చెన్నా, నెఫ్రాలాజిస్టు, మంచిర్యాల నిషేధం విధించాలి గడ్డిమందుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిమోతాదులో శరీరంలోకి వెళ్లినా బతకడం కష్టమవుతోంది. చికిత్సకు కూడా లొంగకుండా ఉన్న ఈ మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాలి. సమాజ శ్రేయస్సు కోసం కొంతమంది వైద్యులం కలసి ప్రభుత్వానికి నివేదించనున్నాం. – సతీశ్ నారాయణ చౌదరి, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాక్టిషనర్, ఖమ్మంచాలా కేసుల్లో మరణాలే.. పారాక్వాట్‌కు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. మా వద్దకు వస్తున్న చాలా కేసుల్లో మరణాలే సంభవిస్తున్నాయి. ఈ మందు రోగి పెదవులు మొదలు శరీరంలో అన్ని అవయవాలను వేగంగా దెబ్బతిస్తుంది. తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం చాలా కష్టం. – ఆవునూరి పుష్పలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
కదలకపోతే కదల్లేరు
కూర్చుని కదలకుండా చేసే ఉద్యోగాలు (సిట్టింగ్ జాబ్స్) ప్రాణాంతకంగా మారుతున్నాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజూ కార్యాలయం లేదా ఇంట్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్్కటాప్ల ముందు ఐటీ ఉద్యోగులు కూర్చుని పనితో కుస్తీ పట్టడం సాధారణమైంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రభుత్వ కార్యాలయాలు మొదలు వివిధ ప్రైవేట్ ఉద్యోగులు కూడా అత్యధిక సమయం డెస్క్‌లు, ఫైళ్ల ముందు గడపడం తెలిసిందే. కార్యాలయ ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలతో అధిక శాతం ఉద్యోగులు టేబుళ్ల ముందు కూర్చుని నిర్వహిస్తున్న విధులతో ఈ ముప్పు పెరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఒకేచోట కొన్ని గంటల పాటు కదలకుండా కూర్చుంటే రక్తప్రసారం జరగక ‘డీప్ వీన్ త్రొంబోసిస్’(డీవీటీ)కు దారితీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.డీవీటీ వంటి పెను ఆరోగ్య సమస్యతో పాటు రక్తపోటు, మధుమేహం, వెన్నెముక, కీళ్ల నొప్పులు, మానసిక కుంగుబాటు, ఆందోళన, మెటబలైజ్ ఫ్యాట్ తదితర సమస్యలు తప్పవని వారు స్పష్టం చేస్తున్నారు. రోజంతా కార్యాలయం పనిలో, ఇతరత్రా ఎంతగా పని ఒత్తిళ్లను ఎదుర్కొన్నా.. రోజుకు కనీసం 40 నిమిషాల పాటు ఓ మోస్తరు వ్యాయామం, నడక లాంటి వ్యాపకాలతో మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. రోజులో ఎక్కువ గంటల పాటు ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల ఎదురయ్యే ప్రతికూల అంశాలు, సమస్యలను ఎదుర్కొనేందుకు వ్యాయామమే మంచి ఉపయోగమని సూచిస్తున్నారు. కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలు, అనారోగ్య సమస్యలకు సంబంధించి నిర్వహించిన వివిధ పరిశీలనను ‘మెటా అనాలిసిస్’చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలకు అనుగుణంగా.. మెరుగైన ఆరోగ్యం కోసం రోజువారీ జీవనవిధానాన్ని కొంత మార్చుకుని, దినచర్యలో వ్యాయామం (ఫిజికల్ యాక్టివిటీ) చేర్చితే మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా.. ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’ప్రచురితమైన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి.– సాక్షి, హైదరాబాద్ముఖ్యాంశాలు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని 45 వేల మందిపై ఆయా అంశాల వారీగా జరిపిన పరిశీలనలో వివిధ అంశాలపై స్పష్టత వచ్చింది, రోజులో ఒకేచోట కూర్చుని పనిచేసే ఉద్యోగుల్లో.. రోజుకు కనీ సం 40 నిమిషాల పాటు వ్యాయామం, ఇతర శారీరక శ్రమ వల్ల.. సుదీర్ఘగంటల పాటు కూర్చుని పనిచేయడంతో కలిగే దుష్ఫలితాలను అధిగమించవచ్చునని స్పష్టమైంది. రోజులో దాదాపు పది గంటల పాటు కూర్చుని పనిచేయడం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులను వ్యాయామంతో దూరం చేయొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (2020 గ్లోబల్ గైడ్‌లైన్స్).. వారానికి 150–300 నిమిషాలలోపు ఓ మోస్తరు, 75 నుంచి 150 నిమిషాల దాకా ఒకింత ఉధృతమైన వ్యాయామం (విగరస్–ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ) చేయాలని సిఫార్సు చేసింది. దైనందిన కార్యక్రమాల్లో మార్పులు చేసుకోవడం, స్వల్ప వ్యాయామం, లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించడం, ఇంట్లో పిల్లలతో ఆడుకోవడం వంటి వాటితో ఉపశమనం పొందవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. కార్యాలయం లేదా ఇళ్ల నుంచి పనిచేసేపుడు ఒకేచోట చైతన్యరహితంగా గడపకుండా చురుకుగా వ్యవహరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. వరుసగా ఎన్ని గంటల పాటు ఒకేచోట లేవకుండా పనిచేయడం వల్ల ఏయే రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయనే దానిపై మాత్రం మరింత లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని భావించడం గమనార్హం.సమస్యలివే.. ∙ఒకరోజులో ఎక్కువ గంటల పాటు కూర్చునే ఉండడం, కార్యాలయంలో పని చేయడం వల్ల కదలికలు లేని కారణంగా కాళ్లలో రక్తం, ద్రావకాలు ఒకేచోట చేరడం వల్ల గుండెజబ్బులకు కారణమౌతుంది. ∙ఇది రక్తప్రసారంలో మార్పులకు కారణమై రక్తపోటుకు దారితీయడంతో పాటు రక్తంలో చక్కెర నియంత్రణలు మారే అవకాశాలు పెరుగుతాయి.∙ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల మధుమేహ సమస్య పెరుగుదలకు దారితీస్తుంది. అధిక గంటలు కూర్చోవడం వంటి వాటి వల్ల కొన్నిరకాల కేన్సర్లకు కారణం కావొచ్చు. ∙రోజులో చాలాగంటలు కూర్చుని ఉండడం వల్ల మానసిక ఒత్తిళ్లు పెరగడంతో పాటు ఆందోళనలు, చిరాకు పెరిగే అవకాశాలున్నాయి. ∙అధిక సమయం సిట్టింగ్ వల్ల వాస్తవ వయసు కంటే ముందుగానే వయసు మీదపడిన భావనకు దారితీస్తుంది. ఏం చేయాలి? ∙పనిచేస్తున్నపుడు మధ్యమధ్యలో లేచి నిల్చోవాలి ∙కొంత దూరం అటు ఇటు నడవాలి.∙చేస్తున్న పని నుంచి కొంతసేపు విరామం తీసుకోవాలి. ∙కూర్చునే పనిచేయకుండా.. వీలును బట్టి నిల్చోవాలి. -
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్‌కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్‌గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
రతన్‌టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరం
టాటా సన్స్ ఛైర్మన్ రతన్‌టాటా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తీవ్ర ఆనారోగ్య పరిస్థితుల వల్ల రతన్‌టాటా ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో రతన్ టాటా స్పందించారు. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. జనరల్ చెక్-అప్ల కోసం హాస్పటల్‌కు వచ్చానని చెప్పారు. ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా ఉన్న టాటాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata) టాటా గ్రూప్‌ను 1868లో 'జమ్సెట్జీ నుస్సర్వాన్జీ టాటా' (జంషెడ్జీ) ప్రారంభించారు. ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ.30 లక్షల కోట్ల పైమాటే.రతన్ టాటా 1937 డిసెంబరు 28న జన్మించారు.ఆయనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు.రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌కు వెళ్లారు.ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా.రతన్ టాటా ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా అనే పుస్తకాలు రాశారు.86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. ప్రేమలో విఫలం అయ్యాక ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకు లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు.తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు.టాటాకు సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు.ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. దాంతో ధనవంతుల జాబితాలో ఉండలేకపోతున్నారు.ఇదీ చదవండి: ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!టాటా గ్రూప్ పేరు తెలియని భారతీయుడు దాదాపు ఉండరు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవితకాలంలో చాలాసార్లు టాటా ఉత్పత్తులు వాడుతుంటాం. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినిపిస్తోంది. దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. ఆయన గతకొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో సోమవారం ముంబయిలో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అందుకు సంబంధించిన వార్తలుకాస్తా వైరల్‌గా మారాయి. -
కాస్మటిక్స్తో అర్లీ ప్యూబర్టీ ..! బాల్యపు ఛాయ వీడక ముందే ఎందుకిలా..?
పిల్లలు బాల్యాన్ని ఆస్వాదించాలి. బాల్యపు ఛాయలు వీడకముందే పెద్దయితే ఎలా? ఈ అవాంచిత మార్పుకు కారణాలు అనేకం. అర్లీ ప్యూబర్టీలో సౌందర్య సాధనాల పాత్ర చాలా పెద్దదని చెబుతోంది యూఎస్‌లోని అధ్యయన సంస్థ. చిన్నప్పుడే పెద్దవుతున్నారు! బాలికల్లో అర్లీ ప్యూబర్టీకి దారి తీస్తున్న కారణాల మీద యూఎస్‌లో ఒక అధ్యయనం జరిగింది. 1990ల కాలంతో పోలిస్తే ఇటీవల బాలికలు చాలా త్వరగా యుక్తవయసులోకి వస్తున్నారు. పునరుత్పత్తి వ్యవస్థ పరిణతి చెంది రుతుక్రమం మొదలవుతోంది. యూఎస్‌లో ప్రతి పదిమంది బాలికల్లో ఎనిమిది మంది చాలా చిన్న వయసు నుంచే మేకప్ వేసుకుంటున్నట్లు వెల్లడైంది.అర్లీ ప్యూబర్టీకి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం కూడా ఒక కారణమే అయినప్పటికీ బాలురతో పోలిస్తే బాలికల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించడానికి కారణం సౌందర్య సాధనాలుగా గుర్తించారు. రోజువారీ డిటర్జెంట్లు, పెర్ఫ్యూమ్ల తోపాటు మేకప్ సాధనాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటోందని అంచనా. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇదే అంశం మీద నిర్వహించిన జీబ్రాఫిష్ పరిశోధన కూడా ఈ రసాయనాల ప్రభావాన్ని నిర్ధారించింది. అర్లీ ప్యూబర్టీ కారణంగా పదేళ్లలోపే రుతుక్రమం మొదలవడం ఒక సమస్య అయితే దీర్ఘకాలంలో స్థూలకాయం, గుండె సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ తోపాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని ఎండోక్రైనాలజీ జర్నల్ ప్రచురించింది. కేన్సర్ కూడా ముందుకొచ్చింది! అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కారణంగా పెరుగుతున్న క్యాన్సర్ల విషయానికి వస్తే... గతంలో క్యాన్సర్ బారిన పడడానికి సగటు వయసు 70 ఏళ్లుగా ఉండేది. ఇప్పుడు 35 ఏళ్ల లోపే క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ పరిశోధనల్లోనూ సౌందర్యసాధనాల పాత్రను ప్రధానంగా గుర్తిస్తున్నారు నిపుణులు. అల్ట్రా ప్రాసెస్డ్ కాస్మటిక్స్ స్కిన్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. ముఖం, జుట్టు, చర్మం అందంగా కనిపించడానికి వాడే సౌందర్యసాధనాల్లో ఉపయోగించే రసాయనాల కారణంగా ఎగ్జిమా, వెయిట్ గెయిన్ సమస్యలు కూడా వస్తున్నాయని అర్థమైంది. కొన్ని సందర్భాలో అర్లీ ప్యూబర్టీకి దారి తీసే పరిస్థితులు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మొదలవుతాయి. గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయితే ఆ ప్రభావం పుట్టే బిడ్డ మీద ఉంటుందని కొన్ని అధ్యయనాలు తెలియచేశాయి. నెయిల్ పాలిష్లలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని విషపూరిత రసాయనాలు కేన్సర్‌కు కారణమవుతున్నాయి. డిబ్యూటిల్ఫ్తాలేట్ పునరుత్పత్తి వ్యవస్థ మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. మూత తీయగానే ఘాటు వాసన వచ్చే నెయిల్ పాలిష్‌లు, గ్లిట్టర్ పాలిష్‌లు మరింత హానికరమని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.మన దేశంలో బాలికల్లో కాస్మటిక్స్ వాడకం అమెరికాతో పోలిస్తే అంత తీవ్రంగా లేకపోయినప్పటికీ స్థూలకాయం, దేహ కదలికలు తగినంతగా లేని జీవనశైలి, చదువు ఒత్తిడి బాలికల్లో అర్లీ ప్యూబర్టీకి కారణమవుతున్నాయి. కాబట్టి తోటి పిల్లలతో కలిగి దేహానికి శ్రమ కలిగించే ఆటలను ప్రోత్సహించాలని, పిల్లలను పిక్నిక్లకు తీసుకువెళ్లడం ద్వారా వాళ్ల దృష్టిని అనేక ఇతర సామాజికాంశాల మీదకు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. నాట్య ప్రదర్శనలు, ఇతర స్టేజ్ షోలలో పాల్గొనే పిల్లలకు మేకప్ తప్పని సరి అవుతుంది. అలాంటప్పుడు నిపుణుల సూచన మేరకు హానికరం కాని సౌందర్య సాధనాలను మాత్రమే ఉపయోగించాలి. మన దైనందిన జీవితంలో డిటర్జెంట్ల వాడకం తప్పదు, పైగా వాటి ప్రమాణాలను సంస్థాగతంగా తప్ప వ్యక్తులుగా నిర్దేశించలేం. మరో ముఖ్యమైన విషయం... రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగే అలవాటుంటే ఇక ముఖం మీద ఏ సౌందర్యసాధనమూ అవసరం లేదని కూడా అధ్యయనాలు సూచిస్తున్నాయి. మేకప్ అవసరం లేదు! అర్లీ ప్యూబర్టీ ఆందోళన కలిగించే విషయమే. రసాయనాల ప్రభావానికి సంబంధించిన పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి దేహ ఆరోగ్యాన్ని కచ్చితంగా కాపాడుకుంటే సన్‌స్రీన్, మాయిశ్చరైజర్ తప్ప ఇతర సౌందర్యసాధనాల అవసరమే ఉండదు. బాల్యంలోనే వీటి మాయలో పడుతున్నారంటే ప్రకటనల ప్రభావం తోపాటు అవి అందుబాటులో ఉండడం కూడా కారణమే. కొన్ని ప్రత్యేకమైన, అరుదైన సందర్భాల్లో మేకప్ తప్పనిసరి కావచ్చు. అలా ఉపయోగించేటప్పుడు కూడా ఆ బాలికలను డాక్టర్‌కు చూపించి వారి అభిప్రాయాన్ని తీసుకోవాలి. బాలిక చర్మతత్వాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేని మేకప్ తదితర సౌందర్యసాధనాలను సూచించగలుగుతారు. – డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్ (చదవండి: డాటర్ ఆట చూసి అమ్మ అంపైరయింది) -
ఫ్యాటీ లివర్ ఉంటే గుండెపోటు వస్తుందా?
టీవీ నటుడు మొహ్సిన్ ఖాన్ తాను నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కారణంగా గుండెపోటుకి గురైనట్లు వెల్లడించాడు. అది చాలా సివియర్‌గా వచ్చిందని, రెండు మూడు ఆస్పత్రుల మారినట్లు తెలిపారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చారు. బహుశా నిద్ర లేకపోవడం వల్ల ఇలా వచ్చి ఉండొచ్చని అన్నారు. అసలు ఆల్కహాల్ తాగకుండా ఎలా ఫ్యాటీ లివర్ వస్తుంది?. దీనికి గుండెపోటుకి సంబంధం ఏంటీ..?నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే..?నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ని NAFLD అని పిలుస్తారు. ఇది ఆల్కహాల్ తక్కువగా తాగే వ్యక్తులను ప్రభావితం చేసే కాలేయ సమస్య. NAFLDలో కాలేయంలో చాలా కొవ్వు పేరుకుపోతుంది. NAFLD తరచుగా లక్షణరహితంగా ఉంటుంది. అయితే ఇది నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH), ఫైబ్రోసిస్, సిర్రోసిస్‌తో సహా మరింత తీవ్రమైన పరిస్థితులకు పురోగమిస్తుంది.ఇది గుండెపోటుకి దారితీస్తుందా..?"కాలేయ సమస్యలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గుండెపోటు ముప్పు తీవ్రమవుతుంది. కొవ్వుల జీవక్రియ ప్రక్రియలో అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సమతుల్య హృదయనాళ వ్యవస్థను నిర్వహించడానికి చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా క్రానిక్ లివర్ డిసీజ్ లిపిడ్ మెటబాలిజానికి అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగేందుకు దారితీస్తుంది. ఈ లిపిడ్ అసమతుల్యత అథెరోస్ల్కెరోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ధమనులు సంకోచిస్తాయి. తద్వారా గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది."ని చెబుతున్నారు వైద్యలు. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ధూమపానం తదితరాలు జీవక్రియకు అంతరాయం కలిగించి ఫ్యాటీలివర్ బారినపడేలా చేస్తుంది. ఇది హృదయనాళ సమస్యలకు దారితీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించారు వైద్యులు.అలాగే గుండె సమస్యలు ఉన్న రోగులలో కాలేయ వ్యాధి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాలేయానికి తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. దీనిని కార్డియోజెనిక్ అంటారు. ఇస్కీమిక్ హెపటైటిస్, సిరల పీడనం కారణంగా దీర్ఘకాలిక గుండె వైఫల్య స్థితి ఏర్పడుతుంది. దీనిని కార్డియాక్ సిరోసిస్ అంటారు. కాబట్టి, కాలేయం, గుండె జబ్బుల మధ్య సహసంబంధం ఉంది నివారించడం ఎలా..చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహాదాని దూరంగా ఉండాలి. పుష్కలంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను కలిగి ఉన్న సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలిరెగ్యులర్ వ్యాయామం తోపాటు రోజులో కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమతో కూడిన వర్కౌట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.ఒత్తిడిని నిర్వహించడం, తగినంత నిద్ర పొందడం అత్యంత ముఖ్యంముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ..గిన్నిస్ రికార్డు!) -
కోవిడ్ మందుకు ఆయుష్ అనుమతి!
కొవిడ్ వైరస్ బారిన పడినవారిలో ఇప్పటికీ కొన్ని స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వారికోసం రెమిడియమ్ థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫార్మాసూటికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సంయక్తంగా ‘కోరోక్విల్-జెన్’ అనే ఔషధాన్ని తయారు చేశాయి. ఈమేరకు తాజాగా ఈ డ్రగ్ భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు కూడా పొందింది.ఈ సందర్భంగా రెమిడియమ్ థెరపెటిక్స్ సీఈఓ కృష్ణన్ మాట్లాడుతూ..‘కొవిడ్ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటికీ స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు రెమిడియం థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్-చెన్నై, ఢిల్లీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ యూనివర్శిటీ సహకారంతో ‘కోరోక్విల్-జెన్’ను అభివృద్ధి చేశాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలున్న జింక్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్ మిశ్రమం ఇందులో ఉంటుంది. దానివల్ల కొవిడ్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని వాడే రోగులు ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. ఈ డ్రగ్‌కు తాజాగా భారత ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు లభించాయి. కొవిడ్‌తో కలిగే అనారోగ్య సమస్యలతోపాటు క్షయ, ఆస్తమా, సీజనల్ అలర్జీలు, పల్మనరీ, ఇతర శ్వాసకోశ రుగ్మతల చికిత్సలో కోరోక్విల్-జెన్ ఉపయోగించేందుకు లైసెన్స్ లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..! -
రోజూ ఎనిమిది గ్లాసులు పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్! ఇలా తీసుకోవచ్చా..?
బాలీవుడ్ నటుడు, యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ ఒక ఇంటర్యూలో తన చిన్నప్పుడూ రోజుకి ఏకంగా ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు పాలు తాడేవాడినని చెప్పారు. అందదువల్లే తాను జీర్ణ సమస్యలు ఫేస్ చేస్తున్నానని తెలిసిందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తన నాన్న ధర్మేంద్రకి బహుమతిగా వచ్చిన ప్రత్యేక గాజు గ్లాస్ తన దగ్గర ఉండేదని, దానిలోనే పాలు తాగేవాడనని అన్నారు. ఇలా ఆ హీరోలా ప్రతి రోజూ అన్ని పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?. ఎదురయ్యే సమస్యలేంటీ తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బాబీ డియోల్ మాదిరిగా అంతలా పాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇలా పిల్లలు, పెద్దలు తీసుకుంటే చాలా సమస్యలు ఫేస్ చేస్తారని అన్నారు. పాలు కాల్షియం, విటమిన్ డీ,ప్రోటీన్ మూలం. ఇవి ఎముకల పెరుగుదలకి, అభివృద్ధికి తోడ్పతుంది. అయితే అధికంగా తీసుకుంటే మాత్రం అధిక బరువు, లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదుర్కొనవల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ఏంటి లాక్టోస్ అసహనం..?పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవడం వల్ల లాక్టోస్ ఎంజైమ్‌లు అధికంగా పని చేస్తాయి కాబట్టి శరీరంలో లాక్టోస్ ఎంజైమ్‌లలో క్షీణత ఏర్పడి ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ లాక్టోస్ అనేది పాలలో కనిపించే చక్కెర. ఇది లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా జీర్ణమవుతుంది. ఓ వయసు వచ్చేటప్పటికీ శరీరంలో లాక్టేజ్ కార్యకలాపాలు తగ్గుతాయి. దీంతో లాక్టోస్ అసహనం, జీర్ణ సమస్యలు ఎదురవ్వుతాయి. ఫలితంగా ఉబ్బరం, గ్యాస్, డయేరియా, పొత్తికడుపు తిమ్మిరికి కారణమవుతుంది. ఈ లక్షణాలు రోజూవారీ జీవితాన్ని, మొత్తం ఆరోగ్యాన్ని గణనీయం ప్రభావితం చేస్తాయని వెల్లడించారు నిపుణులు.వచ్చే ఆరోగ్య సమస్యలు..ఎక్కువ పాలు తాగే పెద్దల్లో అధిక సంతృప్త కొవ్వు పదార్ధం కారణంగా గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంటుంది. పాలు కేలరీలు కలిగిన పానీయం. పాలు, పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు, చక్కెరలు, సంతృప్త కొవ్వులు పిల్లలలో ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను కలుగజేసే అవకాశం ఉంది. కలిగిస్తుంది. ఇలా పాలు ఎక్కువగా తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేందుకు దారి తీస్తుంది.అలాగే దీనిలోని అధిక కాల్షియం ఇతర ముఖ్యమైన ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అదీగాక చాలా పాడి పశువులకు హార్మోన్ల కాక్టెయిల్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇది పశువులలో వేగవంతమైన పెరుగుదలను ప్రేరేపిస్తుంది. పైగా కృత్రిమంగా పాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఈ హార్మోన్లలో ఒకటి, IGF-1, అసాధారణ కణాల విభజన పెంచి, వివిధ కేన్సర్లు, మొటిమలు వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల ఇక్కడ అందరూ గుర్తించుకోవాల్సింది ఒక్కటే.. మితంగా పాలు తీసుకుంటే మంచి పోషకాలను, ప్రయోజనాలను పొందగలం. పోషకాల అసమతుల్యతను నివారించేలా పిల్లలు, పెద్దలు సమతుల్య ఆహారానికే ప్రాధాన్యతే ఇవ్వాలి. ముఖ్యంగా సంతృప్త కొవ్వును తగ్గించడం లేదా తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు తీసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా?
ఎవరైనా సరే, నోటిని సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడం సహజం.. అయితే చిగుళ్ల వాపు లేదా దంత సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా... సక్రమంగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి వాసన వస్తుంటే, దానిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని, కొన్ని రకాల ఇతర వ్యాధులకు సంకేతంగా భావించి దాని గురించి శ్రద్ధ వహించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.నోటి దుర్వాసన అనేది ఆహారపు అలవాట్లు, నోటి పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, దంతవైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని, భోజనం తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని పుక్కిలించి నోటిని శుభ్రం చేయమని చెబుతుంటారు. ఇవి పాటించిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే, అది శరీరంలో ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు..సైనసైటిస్, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు, ఈ ఇన్ఫెక్షన్లు సంభవించినప్పుడు, శ్వాసకోశంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా వాసన కలిగించే మూలకాలు ఏర్పడి ఇవి గాలి వదిలినప్పుడు దుర్వాసన వచ్చేలా చేస్తాయి.జీర్ణ సమస్యలు..కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీనివల్ల నోటిలో పుల్లని తేన్పులతోపాటు వాసన కూడా వస్తుంటుంది.కిడ్నీవ్యాధులు..మూత్రపిండాలనేవి శరీరంలోని మలినాలను వడపోసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు అవి వాటి పని సక్రమంగా చేయలేక శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోతాయి. ఈ విధంగా రక్తంలో చేరిన వ్యర్థాల వల్ల వారు ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఒక విధమైన దుర్వాసన వెలువడుతుంటుంది.బీపీ, షుగర్..మధుమేహం ఉన్నవారిలో ఇది చాలా సాధారణ సమస్య.. ఎందుకంటే వారి శ్వాసలో ఎక్కువ కీటోన్లు ఉంటాయి. ఇవి ఒకవిధమైన చెడు శ్వాసను వెలువరిస్తుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలికంగా బీపీ ఉన్న వారు వాడే కొన్ని రకాల మందులు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.కాలేయ సంబంధ వ్యాధులు..లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సమస్యల వల్ల శరీరంలోని వ్యర్థాల నిర్వహణ సరిగా జరగదు. అందువల్ల కాలేయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.అందువల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు దంత వైద్యుని సంప్రదించి, వారు సూచించిన మౌత్వాష్లను, ఇతర విధాలైన మౌత్ ఫ్రెష్నర్లను ఉపయోగించినా కూడా నోటి దుర్వాసన వదలకపోతుంటే మాత్రం అది ఇతర వ్యాధులకు సూచనగా భావించి ఫ్యామిలీ వైద్యుని సంప్రదించి వారి సూచన మేరకు తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది.ఇవి చదవండి: ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త! -
ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త!
ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం ముందుగా గుమ్మం దగ్గర ఉండే డోర్మ్యాట్ని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభించాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి, బయటకి తిరిగేటప్పుడు కాళ్లకు ఉండే మట్టి అంటేది డోర్ మ్యాట్కే కాబట్టి డోర్ మ్యాట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డోర్మ్యాట్ని మారుస్తుండాలి. అందుబాటులో ఉంచుకోవడం..– శుభ్రతకి కావాల్సిన వస్తువులన్నింటినీ మన చేతికి అందేలా ఉంచుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. పని కూడా సులువు అవుతుంది.– కిటికీలు తెరిస్తే వెలుతురుతోపాటు దుమ్ము కూడా వచ్చేస్తుంది. అందుకే కిటికీల రెక్కలను కొద్దిసేపు తెరిచి ఉంచిన తర్వాత మళ్లీ మూసేయాలి.– ఇక కిటికీ అద్దాలకీ దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా అంటి పెట్టుకుని ఉంటాయి. అందువల్ల కిటికీలను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటే సీజనల్ అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు.బూజు దులపటం..– ఇంటినంతా చక్కగా కడిగి శుభ్రంగా ఉంచడంతో పాటు గోడ మూలల్లో ఉన్న బూజును కూడా దులపాలి.– ఇంట్లో చెత్తని తొలగించడంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదు.– ముఖ్యంగా బాత్రూమ్లో, వంటగదుల్లోనూ సూక్ష్మజీవులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.– ఇంటి ముందు చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి వస్తుంది. తేమ శాతం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు.– ఇక ఇంటిని శుభ్రం చేయడమంటే చాలా పెద్ద సమస్య. వస్తువులను శుభ్రంగా కడిగే ముందు ఎక్కువగా దుమ్ము పేరుకునే వస్తువులను ముందుగా శుభ్రం చేసుకుంటే సగం పని అయిపోతుంది. దీనికి కింది సూచనలు పాటిస్తే సరిపోతుంది.సీలింగ్ ΄్యాన్స్..– సీలింగ్ ΄్యాన్లను తుడవకుండా ఉంటే వాటిపై దుమ్ము ఎక్కువగా చేరుతుంది. దానివల్ల ఇంట్లో ఉండే ఫర్నిచర్‌పై దుమ్ము పడుతుంది. కాబట్టి ఫ్యాన్‌ను మొదట శుభ్రం చేయాలి. కంప్యూటర్..– కంప్యూటర్, లాప్టాప్ కీబోర్డు ఎప్పటికప్పుడు శుభ్రం చే సుకోకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది.టీవీ..– టీవీ స్క్రీన్‌ను ఒక శుభ్రమైన మెత్తటి బట్టతో తుడవాలి. అలాగే టీవికి ముందు వైపు కన్నా వెనుక భాగంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది. దాన్ని దులపడటం చాలా అవసరం.అద్దాలు..– ఇంట్లో ఉండే అద్దాలను, గాజు పాత్రలను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టండి. ఇలా చేయటం వల్ల పాత్రలు కొత్తవిగా కనిపిస్తాయి.పక్కబట్టలు మడతపెట్టడం..– రోజంతా పని చేసిన తర్వాత వచ్చి సేదదీరేది బెడ్ మీదనే. మీ పడకగది మురిగ్గా ఉండటం చూస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. కాబట్టి నిద్ర లేవగానే దుప్పటిని దులిపి మడతబెట్టాలి. బెడ్‌షీట్‌ను నీట్‌గా సర్దాలి.దుస్తుల శుభ్రం..– ఒకేసారి మొత్తం బట్టలు ఉతకాలంటే అలసట రావడం సహజమే, పైగా అందుకు ఎక్కువ సమయం కూడా పడుతుంది.– ధరించే దుస్తులలో రకాన్ని బట్టి వేటికవి విడదీసి ఉతికితే సులభంగా ఉంటుంది.చెత్తను వదిలించుకోవడం..– ఇంటిలో అనవసరమైన వస్తువులు తీసి బయట పడేసి తర్వాత అన్నిటినీ సర్దటం మంచిది.– ఈ అలవాటును అందరూ తప్పక పాటించాలి.– వాడే వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా సర్దుకోవాలి.– టేబుల్స్ లేదా బల్లలపై తక్కువ వస్తువులుంటే వాటిని శుభ్రపర్చటం సులువవుతుంది.– ఇంటి వాకిలి దగ్గర ఉంచే షూ ర్యాక్ కూడా శుభ్రపర్చటం చాలా ముఖ్యం.– అలాగే మీకేదన్నా దాని స్థానంలో లేదు అన్పిస్తే, మళ్ళీ చేద్దాంలే అని వదిలేయకండి. అప్పటికప్పుడు చేయటం మంచిది.నిద్రించే ముందే..– మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు అన్నిటినీ శుభ్రం చేసే అలవాటు చేసుకోవాలి.– ముఖ్యంగా పిల్లలకు వాళ్ల వస్తువులను సర్దేసి, వారి గదులను శుభ్రం చేసుకుని పడుకునేలా తర్ఫీదు ఇవ్వండి.– వంటగదిని కూడా శుభ్రం చేసి పడుకోటం నేర్చుకోండి.పరిసరాల పరిశుభ్రత..మీ ఇంటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకోడానికి, పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యం. ఇది అందరి బాధ్యత. ఇంటి శుభ్రత కోసం మీరొక్కరే కాదు, కుటుంబసభ్యులు కూడా కృషి చేయాలి. అలా మీరే తర్ఫీదు ఇవ్వడం అవసరం. చిన్న పిల్లలు కదా, వాళ్లేమి చేయగలరులే అని వదిలేస్తే, తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చిన్నప్పటినుంచి పిల్లలకు కూడా ఎక్కడ తీసిన వస్తు సామగ్రిని అక్కడ పెట్టడం అలవాటు చేయడం అవసరం.ఇవి చదవండి: తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా? -
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్ పాన్, స్మోక్ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్ పాన్ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్‌ను వాడతారు. -
సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండాలనే తపన ..!
మాయ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రఖ్యాత ఎమ్మెన్సీలో పనిచేస్తోంది. ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆమె చలాకీతనం చూసి రవి ఇష్టపడ్డాడు, ప్రపోజ్ చేశాడు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉంది. ఇద్దరూ కలసి పార్టీలు, పబ్‌లంటూ తిరిగేవారు. పండంటి బిడ్డ పుట్టింది. ఆ తర్వాత మాయ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. బిడ్డను కూడా పట్టించుకోకుండా జిమ్, యోగా అంటూ తిరుగుతోంది. అందంగా కనిపించాలని, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని ఎక్స్పోజింగ్ డ్రెస్లేస్తోంది. కారణం లేకుండానే ఏడుస్తోంది, అరుస్తోంది, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తోంది. ఆవేశంలో ఆమె ఏమైనా చేసుకుంటే అది తన మెడకు చుట్టుకుంటుందని రవి హడలి పోతున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రుల సలహా మేరకు ఇద్దరూ కౌన్సెలింగ్‌కి వెళ్లారు. ఒక వ్యక్తి సమస్యను అర్థం చేసుకోవాలంటే వారి కుటుంబ, సాంస్కృతిక నేపథ్యం అవసరం. మాయ లేకలేక పుట్టిన పిల్ల. దాంతో ఆమె బాల్యం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆటలు, పాటలు, నాట్యంలో ముందుండేది. ఆమె ఏం చేసినా పేరెంట్స్ కాదనేవారు కాదు. తప్పు చేసినా సంబరంగా చప్పట్లు కొట్టేవారు. దాంతో ఇతరులు మెచ్చుకుంటేనే, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉంటేనే సెల్ఫ్ వాల్యూ ఉంటుందనే భావన ఆమెలో ఏర్పడింది. మాయతో ఓ గంట మాట్లాడాక ఆమె హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్(ఏ్కఈ)తో బాధపడుతున్నట్లు అర్థమయింది. సైకోడయాగ్నసిస్లోనూ అదే నిర్ధారణైంది. దీనికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ), సైకోడైనమిక్ టెక్నిక్స్ల కలయికగా చికిత్స ఉంటుంది. ఇది మాయ తన సెల్ఫ్ ఇమేజ్ను పెంచుకోవడంలో ఇవి సహాయపడతాయి. ప్రతికూల ఆలోచనా విధానాలను గుర్తించి, సవాలు చేస్తుంది. ఒత్తిడిని జయించడానికి ఆరోగ్యకరమైన కోపింగ్ మెకానిజమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ దంపతులు అంగీకారం మేరకు వారానికో సెషన్ షెడ్యూల్ అయింది. ఆరు నెలల్లో మాయ ప్రవర్తనలో ఆశించిన మార్పులు కనిపించాయి. అసలిదేమిటి? వ్యక్తిత్వ లోపాలుగా కనిపించే మానసిక రుగ్మతలను పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. ఇవి దాదాపు తొమ్మిదిశాతం మందిలో ఉంటాయి. ఒక శాతం ప్రజల్లో హెచ్పీడీ కనిపిస్తుంది. ఇందులో వ్యక్తి ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు నాటకీయంగా భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. ఇతరులను మానిప్యులేట్ చేసేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇది యుక్తవయస్సులో మొదలవుతుంది. ఎలాగైనా ఆకట్టుకోవాల్సిందే.. నిరంతరం ఇతరుల భరోసా లేదా ఆమోదం అవసరం కావడం ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రవర్తనల్లో మునిగిపోవడం ·అందుకోసం మితిమీరిన భావోద్వేగాలను ప్రదర్శించడం బలహీనత, అనారోగ్య లక్షణాలను ప్రదర్శించడం రూపంపై అతిగా శ్రద్ధ చూపడం, ఎక్స్‌పోజింగ్‌గా ఉండే దుస్తులు ధరించడం లైంగికంగా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం ఆత్మహత్య బెదిరింపులతో ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడటం అస్థిరమైన మనోభావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు ఎవరూ పట్టించుకోకపోతే నిరాశకు గురవడంమందుల్లేవు, థెరపీనే మార్గం..వ్యక్తిత్వ లోపాలను ఎవరూ గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. దీన్ని తగ్గించే మందులూ లేవు. ముందుగా రుగ్మతను గుర్తించడం, దానికి సైకోథెరపీ ద్వారా చికిత్స తీసుకోవడం అవసరం. దానికి ముందుగా జీవనశైలిలో మార్పుద్వారా.. కొంతవరకు సంస్కరించుకోవచ్చు. అతి గారాబమూ కారణమే..కొన్ని కుటుంబాలలో హెచ్పీడీ కొనసాగుతుంది. అందుకే దీనికి జన్యుపరమైన సంబంధం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బాల్యంలో కుటుంబ సభ్యుడి మరణం, లేదా హింసకు గురికావడం వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. వ్యక్తిత్వ లోపంలో భాగంగా మారవచ్చు. హద్దులు లేని, అతిగా ఆనందించే పేరెంటింగ్ స్టైల్లో పెరిగిన పిల్లల్లో ఈ డిజార్డర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నాటకీయ, అస్థిర, అనుచిత లైంగిక ప్రవర్తనను ప్రదర్శించే తల్లిదండ్రులు కూడా కారణం కావచ్చు. ఎలాగంటే..రోజూ వ్యాయామం చేయడం తిండి, నిద్ర షెడ్యూల్స్ చేసుకోవడం ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి మానుకోవడం మిమ్మల్ని ట్రాక్‌లో ఉంచడానికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహాయాన్ని పొందడం సైకోథెరపీ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది హెచ్పీడీకి ప్రత్యేకించి మందులు లేకపోయినా, దానివల్ల వచ్చే ఆందోళన, నిరాశలను తగ్గించేందుకు మందులు ఉపయోగ పడతాయి యోగా, బయో ఫీడ్‌బ్యాక్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు వ్యక్తిత్వ లోపాలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా సహాయ పడవచ్చు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వీలైనంత త్వరగా వ్యక్తిత్వ రుగ్మతల నుంచి బయటపడవచ్చు.సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!) -
ఉప్పు తగ్గించండిరా బాబోయ్! ఏటా 25 లక్షలమందికి ముప్పు
ప్రపంచవ్యాప్తంగా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటారు. హైబీపీ అనేది సెలంట్ కిల్లర్ లాంటిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఉప్పువల్లే ముప్పు ఏర్పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ ఉప్పు వాడకం కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే లక్షల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని కూడా పేర్కొంది.పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే ఇది రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దీని వల్ల హృదయ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, మెనియర్స్ వ్యాధి ,మూత్రపిండాల వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయని తెలిపింది. దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.డైనింగ్ టేబుల్ నుంచి ఉప్పు తీసేయండిప్రాసెస్ చేసిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనీ, తాజా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.నకు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని సూచించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అంతేకాదు డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది. కమర్షియల్ సాస్‌లు, ఫుడ్స్ తగ్గించాలని కూడా కోరింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు , బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది. -
ఆరోగ్యం విషయంలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త!
కూరలను బాగా నూనె పోసి వేయించి ఉప్పూకారం మసాలా దట్టించినందువల్ల నోటికి రుచిగా ఉండచ్చేమోగాని ఆ కూరలలోని పోషక విలువలన్నీ చచ్చిపోయి నిస్సారమవుతాయి. త్వరగా జీర్ణం కావు. నూనె ఎక్కువైనందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, శరీరంలో కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం రావటం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతంగా ఉడకబెట్టినా అంతే... సారం లేని పదార్థాన్ని తిన్నట్టే. అది తినడం వల్ల ఆ ఆహారం మన ఒంటికి పట్టదు. అసలు మనం ఎలాంటి కూరలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మనం తిన్న ఆహారం వంటబట్టాలంటే నూనెలో వేయించిన కూరలను తినే అలవాటును మానుకోవాలి. ఉడికించిన కూరలలో కొద్దిగా తాలింపు వేసుకుని తినే విధంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు అన్నింటిలోను అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. వాటి మోతాదుల్లో మాత్రమే తేడా ఉంటుంది. అందువల్ల మనకు అన్నీ అవసరమే. అయితే అన్నీ అందరికీ ఒకే రీతిలో అవసరం కావు. ఉదాహరణకు పాలు తాగే పసిపిల్లలకు ఒకరకమైన పోషకాలు కావాలి. చిన్న పిల్లలయితే మరొక రకమైన పోషకాలు కావాలి. యుక్తవయస్కులకు ఇంకొక రకం పోషకాలు కావాలి. అదేవిధంగా గర్భిణులకు ఒక రకమైన పోషకాలు, పెద్దవారికి, వృద్ధులకూ మరొక రకమైన పోషకాలూ కావాలి. అంటే అవసరాలనుబట్టి పోషకాలు మారతాయి. కాబట్టి తీసుకోవలసిన ఆహారం కూడా మారుతుంది. అదే విధంగా ఆహార చికిత్సా ప్రక్రియలో కూడా వ్యాధిని బట్టి, రోగిని బట్టి తీసుకోవలసిన ఆహారం మారుతుంది. ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అంటే ఇదే.నిజానికి ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అనుకున్నంత తేలికకాదు. పోషకాలను బట్టి పరిశీలిస్తే గింజధాన్యాలలో అన్ని రకాల పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయని, ఆకు కూరలు, పండ్లు, దుంపలతో సహా బాదం, ఖర్జూర మొదలైన ఎండు ఫలాలలో ఏదో ఒక పోషక విలువ లోపించి ఉండటాన్ని మనం గమనించవచ్చు. కేవలం ఈ కారణం వల్ల గింజధాన్యాలను మాత్రమే తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి.అవి త్వరగా జీర్ణంకావు. అందువల్ల, గింజధాన్యాలతోబాటు తప్పనిసరిగా త్వరగా జీర్ణం అయ్యే ఆకు కూరలు, పండ్లు కూడా అవసరం. ఇవి అన్నీ తెలిసినప్పుడే సమీకృత ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం సులభం అవుతుంది. ఈ విషయంలో మనలో చాలామందికి ఉన్న సాధారణ ఆహార విజ్ఞానం సరిపోదు. పోషకాహార నిపుణులతో లేదా ప్రకృతి వైద్యులతో సంప్రదించి, వారి సలహా తీసుకోవటం అవసరం.సమీకృత ఆహారం.. కొన్ని సూచనలు..ఎటువంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలన్న విషయాన్ని అలా ఉంచితే సాధారణ ఆరోగ్యం దృష్ట్యా ఈ కింది సూచనలను పాటించటం మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. రోజూ ఉదయం పచ్చికూర ముక్కలు (వెజిటబుల్ సలాడ్) తీసుకోవటం మంచి అలవాటు. దంతాల పటుత్వం లేని వారు కూర ముక్కలను మిక్సీలో వేసుకుని చిన్న చిన్న ముక్కల రూపంలోగాని, లేక జ్యూస్ రూపంలోగాని తీసుకోవచ్చు. అన్నిరకాల, అన్ని రంగుల పండ్లను లేదా పళ్లరసాలను తీసుకోవాలి. ఆ క్రమంలో కాలానుగుణంగా వచ్చే సీజనల్ ఫలాలను తప్పనిసరిగా తీసుకోవాలి. మనం తినే ఆహారంలో కనీసం 30 లేక 40 శాతం పండ్లు ఉంటే మంచిది. దంపుడు బియ్యం లేక మర పట్టని ముతకబియ్యం శ్రేష్ఠం. చిరుధాన్యాలు వాడటం మంచిది. మొలకెత్తిన గింజలు, కొబ్బరి, ఖర్జూర ప్రతిరోజూ తీసుకోవటం మంచిది.ఇలా తీసుకోవాలి..కనీసం వారానికి నాలుగు రోజులు ఆకుకూరలను ఇగురు లేదా పప్పు రూపంలో తీసుకోవాలి.కాఫీ, టీ తాగే అలవాటును నెమ్మదిగా మానుకోవటం మంచిది, అలా మానుకోవడం సాధ్యం కాకపోతే, కనీసం మోతాదును తగ్గించాలి. రోజుకి ఒకటి లేక రెండుసార్లకు మించి తీసుకోరాదు.పొగాకు, జర్దా, ధూమపానం, మత్తుపానీయాలను పూర్తిగా మానుకోవాలి.కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన, నిల్వ ఉన్న బేకరీ వస్తువులు, శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్), చాక్లెట్లు, ఫాస్ట్ఫుడ్స్, ఐస్ క్రీమ్ లాంటివి మన శరీరానికి హాని చేస్తాయి. అందువల్ల వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించటం మంచిది.ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఎందుకంటే, మన శరీరానికి అవసరమైనంత ఉప్పు మనం తీసుకునే పండ్లు, కూరగాయలలోనే ఉంటుంది.ఆహారం ఎంపికలో మరొక ప్రధాన సమస్య అమ్లయుతమైన ఆహారం, క్షార యుతమైన ఆహారం, ఆమ్లాలు, క్షారాలు రెండూ మనకు అవసరమే అయినా, వాటి నిష్పత్తిలో తేడా ఉంది. ఆమ్లాల కన్నా క్షారాలు మనకు అధికంగా కావాలి. మనం తీసుకునే ఆహారం కూడా అదేవిధంగా ఉండాలి. అంటే ఆమ్లయుతమైన పదార్థాలు తక్కువగా, క్షారయుతమైన పదార్థాలు. ఎక్కువగా ఉండే విధంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.అదేవిధంగా రోగగ్రస్థుల విషయంలో వ్యాధినిబట్టి ఆహార ఎంపిక ఉంటుంది. ఇది. అయితే ప్రధానంగా వైద్యుల పర్యవేక్షణలో జరగాలి.ఇవి చదవండి: మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్.. -
ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం కన్నుమూత
ప్రముఖ తెలుగు డబ్బింగ్ , వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అడ్వర్టైంజింగ్ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించిన అనంతరాం కొన్ని వందల యాడ్స్‌కు, కార్పోరేట్ ఫిల్మ్స్‌కు వాయిస్ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్ కూడా అందించారు. అమితాబ్, సచిన్,మహేశ్‌బాబు వంటి బిగ్ సెలబ్రెటీలతో పాటు అనేక బాలీవుడ్ స్టార్ల ప్రకటనలకు వాయిస్ అందించారు. 2012లో జరిగిన IPL మ్యాచ్‌కి సంబంధించిన పాటను తెలుగులో రాయడమే కాకుండా స్వయంగా తానే పాట పాడటం మరో విశేషం. నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజన్సీలన్నీ ఎక్కువశాతం ముంబయ్‌లో ఉంటాయి. అక్కడ తెలుగు వాయిస్‌లకు, రైటింగ్స్కు మంచి డిమాండ్. దీంతో స్వస్థలం హైదరాబాద్ నుంచి ముంబయ్ చేరుకుని 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉంటున్నారు. తెలుగుపై అత్యంత మక్కువ కలిగిన వ్యక్తి. హైదరాబాద్‌లో తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా తరచూ హాజరవుతూ ఉండేవారు. తెలుగు అడ్వర్టైజింగ్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అత్తిలి అనంతరాం దూరం కావడం తమకు తీరని లోటని పలు యాడ్ సంస్థలు తమ సంతాపాన్ని తెలిపాయి. -
మూవీ కోసం స్పీడ్‌గా బరువు తగ్గిన రణదీప్..తలెత్తుతున్న దుష్ప్రభావాలు!
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ కోసం విపరీతంగా బరువుత తగ్గిపోయాడు. అదికూడా తక్కువ వ్యవధిలోనే కిలోల కొద్ది బరువు తగ్గాడు. చూడటానికి కూడా గుర్తుపట్టలేనంతంగా అతడి శరీర ఆకృతి మారిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు కూడా. దీంతో అతడు వీలైనంత తొందరగా యథాస్థితికి వస్తానని వారికి హామీ ఇచ్చి మరీ ఇందుకు ఉపక్రమించాడు రణదీప్. అలా అతడు ఏకంగా 18 కిలోల వరకు తగ్గిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అతడు మళ్లీ యథాస్థితికి వచ్చే క్రమంలో శరీరం సహకరిచటం లేదు. పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఇలా వేగంగా బరువు తగ్గటం మంచిదేనా? తలెత్తే దుష్ప్రభావాలేంటీ..? పోషకాహార లోపాలు వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్లను అనుసరిస్తే, పోషకాహార లోపానికి దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. మరింత సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. జుట్టు రాలడం శరీరం స్పీడ్‌గా తగ్గే ప్రయత్నంలో విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. దీంతో జుట్టు రాలు సమస్యను ఎదుర్కొంటారు. బరువుతగ్గే క్రమంలో పోషకాలను అస్సలు పరిమితం చేయకూడదు. కండరాల నష్టం క్యాలరీ-నిరోధిత ఆహారంలో కొవ్వు తగ్గడం ఎలా ఉన్నా..కండరాలపై తీవ్ర ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇది నెమ్మదిగా కండరాలను తినడం ప్రారంభిస్తుంది.అంతేగాదు వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్లో మెటబాలిజం బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే.. చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్ బరువు తగ్గే క్రమంలో డీహెడ్రేషన్‌కు అనుమతించకూడదు. ఇలా ద్రవాలను తక్కువగా తీసుకునే యత్నం చేస్తే..ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు. ఇతర సమస్యలు.. శక్తి తగ్గడం పెళుసైన జుట్టు, గోర్ల పెరుగుదల లోపం విపరీతమైన అలసట రోగనిరోధక వ్యవస్థ బోలు ఎముకల వ్యాధి తలనొప్పి చిరాకు మలబద్ధకం ఇలాంటి భయానక దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయి. అందువల్ల మెల్లగా బరువు తగ్గడమే మంచిదని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలామంది మూవీ కోసం, అందం కోసం వేగంగా బరువుతగ్గి చేజేతులారా సమస్యలు కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!) -
లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!
సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువతీ యువకులు వరకు అందరూ అందం వెంట పరుగులు పెడుతున్నారు. అందుకోసం ఎలాంటి సర్జరీలైన చేయించుకునేందుకు అయినా వెనుకాడటం లేదు. తీరా అవి శరీరానికి పడక ఫైయిలై ప్రాణాల మీదకు తెచ్చకున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అచ్చం అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన 24 ఏళ్ల షౌన్నా హారిస్ అనే మహిళ తన పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ ట్రీట్మెంట్ని మొదటగా 18 ఏళ్ల వయసులో 0.51ఎంఎల్ లిప్ ఫిల్లర్ పొందింది. ఆ తర్వాత హారిస్ 24 ఏళ్ల వయసులో మరోక 1ఎంఎల్ ట్రీట్మెంట్ అందుకుంది. మొదటగా చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ రెండోసారి అది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసింది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ ఫెయిలైతే పెదాలు ఉబ్బడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమెకు పెదాలు ఒక విధమైన మంటతో లావుగా అయ్యిపోవడమేగాక శ్వాస సంబంధ సమస్యలు, ముఖమంతా మంట, దద్దర్లు వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. ఆ బాధ తాళ్లలేక చనిపోతానేమో అనేంత భయానక నరకాన్ని అనుభవించింది. ఓ మూడు రోజుల వరకు బయటకు రాలేకపోయింది. వైద్యులు వెంటనే ఆమె పరిస్థితిని గమనించి చికిత్స చేయగా శ్వాస పీల్చుకోగలిగింది. ఆ సమస్యలు తగ్గుతాయా లేదా అనేది వైద్యలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఏదీ ఏమైనా దేవుడిచ్చిన అందం చాలు అనుకుంటే సమస్యలు ఉండవు. ఇలా అందం కోసం ఆర్రులు చాచి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని పడరాని పాట్లు పడుతుంటారు చాలామంది. అందం మాట దేవుడెరుగు అస్సలు బతుకుతామా అనే సందేహాలు తెప్పించే ఈ కాస్మోటిక్ సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకు చేస్తారంటే.. పెదాలు బొద్దుగా కనిపించేందుకు ఈ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మొదటగా 0.5ఎంఎల్ డెర్మల్ ఫిల్లర్ (సగం సిరంజి) తో ప్రారంభిస్తారు. రెండువారాల తర్వాత ఇంకాస్త లావుగా కావాలనుకుంటే మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత పెదాల ఆకృతి శాశ్వతం ఉండిపోదు. ఆ లిప్ ఫిల్లర్లు సాధారణంగా 12 నుండి 18 నెలల వరకు ఉంటాయి. మన శరీరం శక్తి ఎంత వేగంగా బర్న్ చేసే దాన్న బట్టి వాటి సైజు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ట్రీటెమెంట్కు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే పెదాలు లావు తగ్గిపోయాక మళ్లీ వైద్యుడిని సంప్రదించి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో పెదాలకు ఇంజెక్షన్లు పడకపోతే శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు చూపించే ప్రమాదం కూడా ఉంది. ఈ కాస్మోటిక్ సర్జరీలు ఎంత లగ్జరీయస్తో కూడికున్నవైనా.. తేడా కొడితే ప్రాణం మీదకు వస్తుందనే విషయం మరువద్దు. ఇక ఇక్కడ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్లో ఇచ్చే హైలురోనిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ ప్రతిచర్య ఫలితంగానే ఒక్కోసారి ఫెయిలై శరీరంపై పలు దుష్పరిణామాలు చూపిస్తుంది. ఇది పెదవుల్లో సాధారణంగా ఉండే హైలురోనిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేసి కావల్సినంత ఆకృతిలో పెదవులు ఉండేలా చేసుకునేందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. గతంలో ఇలానే యూఎస్‌కి చెందిన మహిళ ఇలాంటి శస్త్ర చికిత్స చేయించుకుని కార్టూన్ క్యారెక్టర్ మాదిరిగా ఫేస్ మారిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ బాధను వెల్లబోసుకుంది. ఈ లిప్ ఇంజెక్షన్ పడకపోతే మనిషి కోలుకోలేనివిధంగా ఆరోగ్యం దెబ్బతినడం, ముఖం వికృతంగా మారిపోవడం వంటివి జరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు అవి పడతాయని నిర్థారించక గానీ ఆ ట్రీట్మెంట్ని చేయకూడదని చెబుతున్నారు. (చదవండి: ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?) -
స్మార్ట్ డివైసెస్ కంట్రోల్లో మనం చిక్కుకున్నామని.. తెలుసా!
ఇప్పుడన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఉన్నాయి.. ఇదివరకు ఫోన్.. కమ్యూనికేషన్ టూల్..! కానీ నేడు మనిషిని ఎంగేజ్ చేసే ఎంటర్టైన్మెంట్ వాల్.. అవసరమైనప్పుడు మాత్రమే కమ్యూనికేషన్.. ఎప్పుడూ ఎంటర్టైన్మెంటే!! మునుపు రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఒక తెరపిగానే వినోదం ఉండేది..! ఇప్పుడు వినోదమే రోజువారీ ఒత్తిడిగా మారింది! ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోని పలు ప్లాట్‌ఫామ్స్ మీద ప్లే అయిన జోక్సే.. స్మార్ట్‌ఫోన్‌కి మనం ఎంత అడిక్ట్ అయ్యామో చెబుతూ! వాటిని చూసి నవ్వుకుంటాం. కానీ అడిక్షన్ గురించి ఆలోచించం. ఎందుకంటే ఆ లిస్ట్‌లో మనం లేమని మన ధీమా! కానీ ఎవ్వరం ఈ అడిక్షన్కి అతీతులం కాదని ఒక్క క్షణం మనల్ని మనం తరచి చూసుకుంటే తెలిసిపోతుంది. ఈ కథనం చదవబోతున్న పాఠకులకు ఒక విజ్ఞప్తి.. ఒక్క అయిదు నిమిషాలు మీ స్మార్ట్‌ఫోన్‌ను మరచిపోండి.. నోటిఫికేషన్స్ టోన్ వినబడుతున్నా పట్టించుకోకుండా! వెల్కమ్ "బ్యాక్ టు దిస్ పేజ్.. " ఉండగలిగారా అయిదు నిమిషాలు.. స్మార్ట్‌ఫోన్‌ని పట్టించుకోకుండా! కాస్త కష్టమైంది కదా! ప్రపంచాన్నంతా ఇముడ్చుకుని మన అరచేతిలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్, లాప్టాప్స్ ఎట్సెట్రా స్మార్ట్ డివైసెస్ మన జీవితాలను ఎంతలా కంట్రోల్ చేస్తున్నాయో కదా... జెన్ జెడ్‌కి తెలీదు కానీ మిలేనియల్స్‌కి గుర్తుండే ఉంటుంది.. ప్రైవేట్ టీవీ చానెల్స్ వచ్చిన కొత్తలో.. ఎవరైనా ఎవరింటికైనా వెళితే.. ‘రండి.. రండి..’ అంటూ పలకరించి ఆ అతిథికి గ్లాసుడు మంచినీళ్లిచ్చేంత తీరిక ఆ ఇంట్లో వాళ్లకు ఉండేది కాదు. అందరూ టీవీకి అతుక్కుపోయి కూర్చునేవారు. అంతేకాదు ప్రైవేట్ చానెళ్లలో ప్రసారమయ్యే సీరియళ్ల మోహంలో పడి.. ఇంట్లో ఇల్లాళ్లు తిండి కూడా పెట్టట్లేదు.. కమర్షియల్ బ్రేక్స్‌లోనే వంట అయినా.. తిండి అయినా అంటూ వాపోయిన కుటుంబ సభ్యులూ ఉన్నారు. ఇవీ పైన ఉదహరించిన తీరులో వారపత్రికల్లో కార్టూన్లుగా.. సినిమాల్లో హాస్య సన్నివేశాలుగా కనిపించిన దాఖలాలున్నాయి. దాన్ని మించిన వ్యసనమైంది ఈ స్మార్ట్ ఫోన్ అండ్ స్మార్ట్ డివైసెస్ వాడకం. నిరంతర వీక్షణ స్రవంతి.. ఇదివరకు లేవగానే చాలామంది భగవంతుడి ఫొటోనో.. లేకపోతే తమకిష్టమైన కుటుంబ సభ్యుల మొహమో.. లేదంటే తమ అరచేతులను తామే చూసుకునేవారు. ఇప్పుడు లేవగానే కళ్లు మూసుకునే పడక మీద ఫోన్ వెదుక్కునే పరిస్థితి. కళ్లు తెరవగానే కుడిచేయి దంతధావనం కోసం బ్రష్ పట్టుకోవడానికి సిద్ధమవదు. చూపుడు వేలు స్మార్ట్ ఫోన్ మీద స్క్రోల్ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఇదివరకు న్యూస్ పేపర్ చదివితే కాని రోజు మొదలయ్యేది కాదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లోని వాట్సాప్ స్టేటస్‌ల నుంచి స్నాప్ చాట్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబుల్లోని అప్డేట్స్ చూస్తేగానీ డే స్టార్ట్ అవట్లేదు. చూశాక అక్కడితో ఆగదు.. ఆ వీక్షణ స్రవంతి నిర్విరామంగా.. రాత్రి పడుకునే వేళదాకా సాగుతూనే ఉంటుంది. అర్ధరాత్రి దాటినా.. ఇంకా ఫోన్ స్క్రీన్ వెలుగుతూనే ఉంటుంది. తెల్లవారి పనో.. ఆఫీస్ టాస్కో హఠాత్తుగా గుర్తొచ్చి.. బలవంతంగా నిద్రకు ఉపక్రమించాల్సిందే తప్ప ఫోన్లో వీక్షణలు చాలు అనిపించి మాత్రం కాదు. ‘డిన్నర్ రెడీ.. ’ అని అమ్మ పిలిస్తే ఎవరూ పట్టించుకోరు. అందరూ తమ సెల్‌ఫోన్ వాట్సాప్ చాట్స్‌లో నిమగ్నమై ఉంటారు. వాళ్ల వాలకం చూసి ‘డిన్నర్ రెడీ.. డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే తినొచ్చు’ అని వాట్సాప్‌లోని వాళ్ల ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టగానే అందరూ చూసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేస్తారు. ఒక అబ్బాయి రోడ్ మీద ఫోన్లో యూట్యూబ్ చూసుకుంటూ వెళ్తుంటాడు. వెనుక నుంచి బైక్ మీద వచ్చిన ఇంకో కుర్రాడు అమాంతం అతని ఫోన్ తీసుకుని ఉడాయిస్తాడు. హాల్లో కుటుంబ సభ్యులంతా కూర్చుని ఉంటారు. కలసి కబుర్లు చెప్పుకోకుండా.. ఎవరికి వారే అందరూ వాళ్ల వాళ్ల ఫోన్స్‌లో నిమగ్నమై ఉంటారు. ఇంకొక ఇంట్లో.. భోజనాల వేళ.. అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని.. అందరికీ ప్లేట్స్‌లో సెల్ ఫోన్స్ సర్వ్ చేస్తుంటుంది. ఇంకో చోట.. డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా.. టేబుల్ మీదున్న బౌల్లో ఫోన్స్ పెడితే గానీ వాళ్ల కంచాల్లో అమ్మ భోజనం వడ్డించదు. ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. స్పీకర్ మాట్లాడుతుంటాడు. మిగిలినవాళ్లంతా ఫోన్స్‌లో జోక్స్ షేర్ చేసుకుంటూనో.. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తూనో.. మీమ్స్ సెండ్ చేసుకుంటూనో.. చాట్ చదువుకుంటూనో.. యూట్యూబ్ షార్ట్స్ ఎంజాయ్ చేస్తూనో ఉంటారు! బ్రెడ్ అండ్ బటర్.. ‘ఒక్క అయిదు నిమిషాలు ఇన్‌స్టాలో రీల్స్ చూసి.. సీరియస్‌గా చదువుకుంటాను ఇక’.. ‘అబ్బ వర్క్‌తో తల వేడెక్కింది కాసేపు యూట్యూబ్ చూసి.. రిఫ్రెష్ అయితే మళ్లీ వర్క్‌లో పడొచ్చు’.. ‘పావు గంట నుంచి వాట్సాప్ చెక్ చేసుకోలేదు. ఒక్కసారి చెక్ చేసుకుని ఇంటి పనిలో పడిపోతా’ .. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఊరించేవే! ఆ అయిదు నిమిషాలు.. రిఫ్రెష్మెంట్.. చెక్ చేసుకోవడానికి అంతే లేకుండా చేస్తాయి. చూస్తున్న కొద్దీ పుట్టుకొస్తుంటాయి అక్షయ పాత్ర మాదిరి. తలాతోకా లేని విషయాల నుంచి తలలు పగలకొట్టుకునే చర్చల దాకా యూజర్స్‌ని అందులో ఎంగేజ్ చేస్తాయి. వాటి తీరే అది. అవి బతుకున్నదే వాటి మీద. ఎలాగైనా.. ఎక్కడిదాకా వెళ్లయినా సరే యూజర్స్‌ని నిమగ్నం చేయాలి. అందుకే అస్ట్రాలజీ నుంచి అంతరిక్షం దాకా.. వంటింటి చిట్కాల నుంచి పాలెస్తినా, ఇజ్రాయేల్ దాకా, రైమ్స్ అండ్ రిడిల్స్ నుంచి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం దాకా, కుల, మతాలు, కంట్రీ పాలిటిక్స్ నుంచి ఎన్ఆర్ఐ ఇంట్రెస్ట్‌ల దాకా.. కుట్లు, అల్లికలు, జడలు, మేకప్ నుంచి పారిస్ ఫ్యాషన్ దాకా.. లోకల్ స్ట్రీట్ సింగర్ నుంచి కొరియన్ పాప్ బాండ్స్ దాకా.. నెలల పిల్లల నుంచి సెంచరీకి దగ్గరగా ఉన్న వృద్ధుల దాకా.. డాన్స్, యాక్టింగ్, కామెడీ, సీరియస్, థియేటర్, సినిమా, ఫైన్ ఆర్ట్స్, స్పోర్ట్స్, మెన్, విమెన్, ఎల్జీబీటీక్యూ.. ఒక్కరేమిటీ.. ఒక్కటేమిటీ.. ఎన్నిటినో కలబెట్టడం.. ఎందరినో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మార్చి వీక్షకులను ఏమార్చడం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి బ్రెడ్ అండ్ బటర్..! 95% మంది తల్లిదండ్రులు తమ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కి అడిక్ట్ అయ్యారని ఆందోళన చెందుతున్నారు. 80 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు గేమింగ్ వ్యసనంగా మారిందని వాపోతున్నారు. 70 శాతం పేరెంట్సేమో తమ పిల్లలు అడల్ట్ కంటెంట్‌ను చూస్తున్నారని భయపడుతున్నారు. – ‘బాటు టెక్’ తాజా సర్వే. ఆ నెట్‌వర్క్‌లో.. మంచినీళ్ల వసతి ఉన్నా లేకపోయినా కూల్‌డ్రింక్ ఫెసిలిటీ లేని పల్లెలు ఎలా లేవో.. ఇంట్లో సరకులున్నా లేకపోయినా స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు లేదిప్పుడు. అంత ఎసెన్షియల్ కమొడిటీ అయిపోయింది అది. కమ్యూనికేషన్ నుంచి వాలెట్, నేవిగేటర్, న్యూస్ జర్నల్ వంటి అత్యవసరాలే కాక వినోదాన్ని పంచే సాధనంగా కూడా మారిపోయే! అలాంటప్పుడు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో చిక్కకుండా ఎలా ఉంటాడు మనిషి?! దైనందిన జీవితం నుంచి జ్ఞాన సముపార్జన వరకు అన్నీ.. అన్నిటికీ ఇంటర్నెట్.. దానితో అనుసంధానమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్సే సోర్స్ అయిపోయే! డిజిటల్ విప్లవం ప్రపంచాన్ని గ్రామం నుంచి ఇంకా సూక్ష్మంగా మార్చి అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో కూర్చింది. దానికి మనిషిని నిలువెత్తు బానిసను చేసింది. ఒక రోబోలా మార్చింది. దాంతో మనిషి ప్రాక్టికాలిటీలో కన్నా డిజిటల్ వరల్డ్‌లోనే ఎక్కువ గడుపుతున్నాడు. ప్రపంచంతో ఉన్న స్పర్శను కోల్పోయి.. డివైసెస్తో పెనవేసుకుపోతున్నాడు. ఒకరకంగా అవి మనిషికి అవిభక్త కవలలయ్యాయి. అవసరం కాదు వ్యసనం.. హఠాత్తుగా ఇంటర్నెట్ ట్రాఫిక్.. డిజిటల్ ట్రాఫిక్ జామ్ అయి ప్రపంచమంతా స్తంభించిపోయి.. డిజిటల్ డివైసెస్ అన్నీ స్క్రాప్‌గా మారిపోతే.. మనిషి పరిస్థితి ఏంటీ? మానసిక వైకల్యం వచ్చేస్తుందేమో! చూపుడు వేలిని గాల్లో స్క్రోల్ చేస్తూ నడుస్తాడేమో! చుట్టూ ఉన్న పరిసరాల పరిజ్ఞానం అప్పుడు మొదలవుతుందేమో! అతిశయోక్తేం కాదు.. ఆ స్థితీ ఎంతో దూరంలో లేదు అంటున్నారు మానసిక నిపుణులు. అంతేకదా.. దేన్నయినా అవసరాన్ని మించి వాడితే దేనిమీదైనా అవసరం కన్నా ఎక్కువ ఆధారపడితే.. అది వ్యసనమే అవుతుంది. ఇప్పుడు మనం ఆ దశలోనే ఉన్నాం. చంటి పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్ ముందుంటేనే ముద్ద మింగుతున్నారు. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి ఉండాలి. అయితే ఆ అప్డేట్ కాలాన్నే మరచిపోనివ్వవద్దు కదా! కానీ నేటి స్టేటస్ దీనికి భిన్నంగా ఉంది. డిజిటల్ డివైసెస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌కి ఎంతలా కండిషన్డ్ అయ్యామంటే మనం చేసే ప్రతి చిన్న పనికీ అవతలి వాళ్ల లైకులు, షేర్లు, కామెంట్లతో ఆమోదం కోరుకోనేంతలా! ఇది మన పని మీద.. నైపుణ్యం మీద.. ఇందాక చెప్పుకున్నట్టు మానసిక ఆరోగ్యం మీదా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఆందోళనకు కారణమవుతోంది. డిప్రెషన్‌కి దారితీస్తోంది. చుట్టూ ఉన్న ప్రపచంతో డిస్కనెక్ట్ చేస్తోంది. ఫాస్టింగ్.. అదే ఉపవాసం..! ఏదైనా వ్యసనంగా మారితే ఏం చేస్తాం.. డీఅడిక్షన్కి ట్రై చేస్తాం. తిండి కూడా వ్యసనమైతే కంట్రోల్ చేయడానికి మొదట డైట్ ప్లాన్ తీసుకుంటాం. అందులో ఫాస్టింగ్ని ఇన్క్లూడ్ చేస్తాం. అలాగే ఈ డిజిటల్ అడిక్షన్ని పోగొట్టుకోవడానికీ ఉపవాసం ఉంది. అదే డిజిటల్ ఫాస్టింగ్ లేదా డిజిటల్ డిటాక్స్. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, లాప్టాప్స్ను పక్కనపెట్టి.. సోషల్‌మీడియా యాప్స్ నుంచి వారంలో ఒకరోజో.. పక్షానికి ఒకరోజో.. లేదా నెలలోనో ఇలా వీలును బట్టి బ్రేక్ తీసుకోవడమన్నమాట. ఇప్పుడు అదే ట్రెండ్.. ఇప్పుడున్న ప్రపంచానికి ఏ మంచినైనా అలవాటు చేయాలంటే దాన్ని ముందు ట్రెండ్‌గా వైరల్ చేయాలి. డిజిటల్ స్లేవరీలో అదీ ఒక భాగమే. సరే విషయానికి వస్తే.. ఇప్పుడు డిజిటల్ డీఅడిక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అవసరానికి తప్ప మిగిలిన సమయాల్లో.. సందర్భాల్లో డిజిటల్ డివైసెస్‌ని దూరంగా ఉంచడం.. రియల్ వరల్డ్‌తో అంటే చుట్టూ ఉన్న మనుషులు.. పరిసరాలతో మమేకం అవడం.. ఇంటర్నెట్ హెల్ప్ తీసుకోకుండా.. స్వయంగా శోధించడం.. టెక్నికల్ సపోర్ట్‌తో కాకుండా సొంతంగా ప్రయత్నించడం.. సరికొత్త జీవన శైలిగా మారింది. ఇప్పుడు ఇదే వెల్నెస్ ట్రెండ్ అయింది. దీన్ని ప్రాక్టీస్ చేస్తోంది సెకండ్ యూత్ అనుకునేరు.. కాదు.. యువతే! ఒక పూటో.. ఒక రోజో భోజనం మానేయడానికి ఈ రోజుల్లో అంత విల్ పవర్ అక్కర్లేదు. కానీ డిజిటల్ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ కావడానికి చాలా విల్ పవర్ అవసరం. అదంత ఈజీ కాదు. కాసేపు ఫోన్ కనిపించకపోతేనే ఊపిరి ఆగిపోతుందేమో అని గాభరాపడే ప్రాణాలు మనవి! అలాంటిది ఒక పూటో.. ఒక రోజో ఆ డివైసెస్‌కి దూరంగా.. ఇంటర్నెట్ నుంచి లాగౌట్ అవడమంటే నిజంగా సాహసమే! అందుకే మొదట్లో మాటి మాటికీ ఫోన్‌ని వెదుక్కోవాలనిపిస్తుంది. విసుగు, చిరాకు కలుగుతుంది. ఒంటరైపోయామనే భావన వెంటాడుతుంది. వీటన్నిటినీ అధిగమించి ఉపవాస దీక్షను విజయవంతం చేసుకోవడమంటే విల్ పవర్‌కి పరీక్ష పెట్టడమే! డిజిటల్ ఫాస్టింగ్ వల్ల ప్రయోజనాలు.. చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. పనిలో నాణ్యతా పెరుగుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఇచ్చే విస్తృతమైన సమాచారం ఎనలేని ఆనందాన్నే ఇస్తుండొచ్చు. కానీ అవసరం లేని అదనపు సమాచారమేదైనా మెదడుకు భారమే తప్ప పనికొచ్చే వ్యవహారంగా ఉండదు. పైగా లేనిపోని కన్ఫ్యూజన్లోకీ నెడుతుంది. అందుకే అప్పుడప్పుడూ డిజిటల్ ఫాస్టింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మెదడు విశ్రాంతి పొంది రీచార్జ్ అవుతాం. రాత్రివేళల్లో స్మార్ట్ ఫోన్, ట్యాబ్, లాప్టాప్ వంటివి చూడటం వల్ల వాటి స్క్రీన్ లైట్స్ కళ్ల మీద పడి.. మెదడు ఇంకా రాత్రి కాలేదేమో అనే భావనలో ఉండిపోయి నిద్రను దూరం చేస్తుంది. దాంతో సహజంగా ఉండే స్లీప్ – వేకప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. నిద్రలేమి చెంత చేరుతుంది. డిజిటల్ డివైసెస్ వ్యసనం వల్ల గనక నిద్రలేమి దరి చేరితే దానికి ఒకటే మార్గం.. ఇంటర్మిటెంట్ డిజిటల్ ఫాస్టింగ్. దీనివల్ల మంచి నిద్ర కంటికి చేరి.. ఉదయాలు ఫ్రెష్‌గా మొదలవుతాయి. ఆ రోజంతా ఆహ్లాదంగా గడుస్తుంది. డిజిటల్ వరల్డ్‌కు దూరంగా ఉంటే మెదడు చురుగ్గా ఉంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్‌ను ఆలోచించడానికి మెదడు మొగ్గు చూపుతుంది. సృజన వికసిస్తుంది. ఈ రోజుల్లో.. బంధాలు, అనుబంధాలు బలహీన పడటంలో డిజిటల్ డివైసెస్దే ప్రధాన పాత్ర అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. మునుపటిలా బంధాలు బలపడి.. అనుబంధాలు వెల్లివిరిసి, స్నేహానురాగాలను ఆస్వాదించాలను కుంటే దానికి సింపుల్ వే.. డిజిటల్ డివైసెస్‌కి డైవోర్స్ ఇవ్వడమే అని చెబుతున్నారు. కుటుంబం, బంధుమిత్రులతో గడిపిన క్షణాలు.. సందర్భాలు.. ఏ డిజిటల్ మీడియం ఇవ్వలేని అసలైన వినోదాన్ని.. ఆనందాన్నిస్తాయి. ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా మలుస్తాయని చెబుతున్నారు మానసిక విశ్లేషకులు. మన దగ్గర 9 –17 ఏళ్లలోపు పిల్లల్లో 60 శాతం మంది రోజుకు మూడు గంటల కంటే ఎక్కువే సోషల్ మీడియా లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో గడుపుతున్నారని నిరుడు నవంబర్‌లో చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఎలా స్టార్ట్ చేయాలి.. ముందు ఈ డిజిటల్ వరల్డ్ నుంచి ఎందుకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారో నిర్ధారించుకోవాలి. పని మీదే ఫోకస్ చేసి.. నైపుణ్యం పెంచుకోవడానికా? ఆందోళన తగ్గించుకోవడానికా? లేదంటే కళ్లముందున్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడానికా? ఇలా దేనికోసం డిస్కనెక్ట్ కావాలనుకుంటున్నారో స్పష్టంగా తెలిస్తేనే ఫాస్టింగ్ ఈజీ అవుతుంది. అలాగే రోజంతా ఉండాలనుకుంటున్నారా? రోజులో కొన్ని గంటలు మాత్రమే చాలనుకుంటున్నారా? ముందు గంటల నుంచి మొదలుపెట్టి.. రోజులకు పెంచుదామనుకుంటున్నారా.. అనేదాన్ని డిజిటల్ డివైసెస్ యూసేజ్.. దానికి అలవాటుపడిన తీవ్రతను బట్టి నిర్ణయించుకోవాలి. థసౌకర్యాన్ని బట్టి ఫాస్టింగ్ టైమ్‌ని నిర్ధారించుకుని వారం.. వర్జ్యం.. మీనం.. మేషం లేక్కపెట్టకుండా తక్షణమే స్టార్ట్ చేయాలి. ఏరోజు.. ఏ పూట డిజిటల్ ఫాస్టింగ్ ఉండబోతున్నారో.. ఆ సమాచారాన్ని కుటుంబం, ఆప్తులు, సన్నిహితులు.. బాస్.. కొలీగ్స్ ఇలా మీ సర్కిల్లో ఉన్న వారందరికీ తెలియజేయాలి. మీ స్మార్ట్ ఫోన్, ఇతర డివైసెస్లోని నోటిఫికేషన్ ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేయడం.. వీలైతే సోషల్ మీడియాను అన్‌ఫ్రెండ్ చేయాలి. ఇంకా కుదిరితే ఫోన్‌తోపాటు మిగతా డివైసెస్లోని సోషల్ యాప్స్ అన్నిటినీ తాత్కాలికంగా అన్ఇన్స్టాల్ చేయడం మంచిది. భోజనం చేసేటప్పుడు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు.. రాత్రి పడుకునే ముందు.. పని వేళల్లో స్మార్ట్‌ఫోన్‌కి దూరంగా ఉండాలి. మాటి మాటికీ ఫోన్ చెక్ చేయాలనుకునే టెంప్టేషన్కి డిలిట్ ఫరెవర్ కొట్టేయాలి. అయినా టెంప్ట్ అవుతుంటే డిజిటల్ ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నామో పదే పదే గుర్తుతెచ్చుకోవాలి. సోషల్ మీడియా నుంచి డిస్కనెక్ట్ అవడం వల్ల దొరికిన విలువైన సమయాన్ని రీడింగ్.. ఎక్సర్సైజెస్.. లేదా చిరకాల అభిరుచుల కోసం వినియోగించుకోవాలి. చేయాలనుకుని చేయలేకపోయిన.. ఎంతోకాలంగా వాయిదా వేసుకుంటూ వస్తూన్న పనుల కోసమూ కేటాయించుకోవచ్చు. లేదా ఇతర ఆసక్తుల మీదా వెచ్చించొచ్చు. బిఫోర్ లాగౌట్.. కళ్లముందు మంచి నీటి ప్రవాహం ఉన్నా.. గుక్కెడు నీళ్లు మాత్రమే దాహాన్ని తీరుస్తాయి. వెల్లువ ఉంది కదాని దాన్ని పొట్టలో నింపేయలేం కదా! ఈ డిజిటల్ ఇన్ఫో కూడా అంతే! ఆ అజీర్తి నుంచి బయటపడేసే ఏకైక మెడిసన్ డిజిటల్ ఫాస్టింగ్. ఈ ఉపవాస దీక్షవల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. అన్నీ అనుకూల ప్రభావాలే! కాబట్టి.. మీ డిజిటల్ ఫాస్టింగ్ గోల్స్‌ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కూడా పంచుకుని.. ఫాస్టింగ్ వైపు వాళ్లనూ ప్రోత్సహించాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న సపోర్ట్సిస్టమ్ మీ ప్రయాణాన్ని మీరు ఆస్వాదించేలా చేస్తుంది. లక్ష్యానికీ త్వరగా చేరుస్తుంది. సెలబ్రిటీలు ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేఖ్, అమిత్ సాద్, ఇషా గుప్తా వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా డిజిటల్ ఫాస్టింగ్ చేస్తుంటారు. బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా డిజిటల్ ఫాస్టింగ్‌లో ఉంటుందని వెబ్‌సైట్స్ సోర్సెస్ చెబుతున్నాయి. ఈ ఊళ్లో.. మాహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా.. వడ్గాంలో ప్రతిరోజు సాయంకాలం ఏడు గంటలకు ఒక సైరన్ మోగుతుంది. అలా మోగగానే ఆ గ్రామస్థులంతా తమ ఇళ్లళ్లో టీవీలు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. తర్వాత గం.8.30 నిమిషాలకు మళ్లీ సైరన్ మోగుతుంది. అప్పుడు టీవీలు, ఫోన్లు స్విచాన్ చేసుకుంటారు. ఈ గంటన్నరపాటు వాళ్లంతా కుటుంబంతో.. ఇరుగుపొరుగుతో కబుర్లు చెప్పుకుంటూ.. పిల్లలను ఆడిస్తూ.. చదివిస్తూ కాలక్షేపం చేస్తారు. ఇది దాదాపు రెండేళ్ల నుంచి అమల్లో ఉంది. వడ్గాంను డిజిటల్ డీటాక్స్ విలేజ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ మూడు వేల వరకు జనాభా ఉంటుంది. అంతా రైతులు, సుగర్ ఫ్యాక్టరీ కార్మికులే! కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు తప్పనిసరై స్మార్ట్‌ఫోన్స్ వాడటంతో.. ఆ ఊరి విద్యార్థులంతా ఫోన్లకు అడిక్ట్ అయ్యారట. ఇరవైనాలుగ్గంటలూ ఫోన్లతోనే ఆడుకుంటుండంతో ఇటు చదువులోనూ.. అటు ఆటల్లోనూ చురుకుదనం తగ్గి బద్ధకంగా తయారయ్యాట. పెద్దవాళ్లూ ఇందుకు భిన్నంగా కనిపించక వాళ్లూ టీవీలకు అతుక్కుపోయారు. ఇలాగైతే కష్టమని.. పిల్లలు బాగుపడాలంటే ముందు పెద్దవాళ్లను దారిలో పెట్టాలని భావించిన స్కూల్ టీచర్లు.. గ్రామ పంచాయతీ సభ్యులతో మాట్లాడి ఈ డిజిటల్ డిటాక్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొదట్లో సైరన్ మోగగానే ఇంటింటికీ వెళ్లి చెక్ చేసేవారట.. ఫోన్లు, టీవీలు కట్టేశారా లేదా అని. గంటన్నర డిజిటల్ డీటాక్స్ మంచి ఫలితాలనివ్వడంతో.. గ్రామస్థులే స్వచ్ఛందంగా సైరన్ మోగగానే డివైసెస్‌ని కట్టేయసాగారని ఆ గ్రామ సర్పంచ్ విజయ్ మొహితే బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవి చదవండి: కిడ్నీ సమస్యలు ఈ కారణాలతో కూడా రావచ్చు.. జాగ్రత్త! -
కోహ్లీ భార్య అనుష్క శర్మకు ఏమైంది..?
బాలీవుడ్ నటి అనుష్కశర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మళ్లీ గర్భం దాల్చిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనికి తోడు స్టార్ ఆటగాడైన కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌ల్లో మూడు సిరీస్‌లకు దూరంగానే ఉన్నాడు. అదీగాక తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండటంతో ఆఖరి టెస్ట్ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడనే అంతా అనుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా లండన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల స్టార్ కపుల్ విరుష్కరెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే ఊహాగానాలొచ్చాయి. ఇంతలోనే అనుష్కకు ప్రెగ్నెన్సీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో అనుష్కకు ఏమైంది అంటూ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. నిజంగానే అనుష్క ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందా? అందుకే విదేశాలకు వెళ్లారా? అనే ఊహగానాలకు జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి ట్వీట్ మరింత ఊత మిచ్చింది. ఈ మేరకు ఆయన ట్విటర్లో వారితో సంభాషించిన ట్వీట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ విదేశాలకు వెళ్లినట్లు ఆ పోస్ట్ పేర్కొంది. విరాట్ తన కుటుంబంతో గడిపేందుకు వృత్తిపరమైన విరామం తీసుకున్నారనీ, ముఖ్యంగా అనుష్క ఆరోగ్య సమస్యల కారణంగా విదేశాల్లోని వైద్యుడిని సంప్రదించాలని అనుకున్నట్లు ఆ ట్వీట్లో ఉంది. అందువల్లే కోహ్లీ తన కుటుంబంతో ఉండేందుకు మ్యాచ్‌లకు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనుష్కాకు ఏమైందంటూ చర్చలు మొదలయ్యాయి. తొందరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు.అయితే తాజాగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు నాటికి కోహ్లి అందుబాటులోకి వస్తాడని, జట్టుతో తిరిగి చేరతాడనేవార్త వెలుగులోకి వచ్చింది. సెలబ్రెటీ విషయంలో ఏ చిన్న విషయం బయటకు పొక్కినా.. అదో పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఏం జరిగిందంటూ..సోషల్ మీడియాలో పోస్టుల హడావిడి అంత ఇంతాకాదు. వీటన్నింటికి చెక్ పడాలంటే..పూర్తి స్పష్టత రావాలంటే ఏం జరిగిందనేది విరుష్క అధికారంగా ప్రకటించాల్సి ఉంది. (చదవండి: స్లిమ్‌గా మారిన టాలీవుడ్ నటుడు సురేష్! ఆయన ఫాలో అయ్యే డైట్ ఇదే..!) -
హెల్త్ టిప్స్: మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
ప్రస్తుతం మనం జీవిస్తున్న శైలిలో.. ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మన శరీరంలో కూడా మార్పులు సహజమే. ఆహారపు అలవాట్ల వలన గానీ, విరామం లేకుండా శ్రమించడం వలన గానీ.. శరీరంలో బరువు పెరగడం, చర్మ సమస్యలు, గుండె జబ్బులు రావడం, రక్తపోటుతో బాధపడటం లాంటి సమస్యలను ఎదుర్కుంటున్నాం. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి ఈ చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటించడం తప్పనిసరి. బరువును అదుపులో ఉండాలంటే.. ప్రతిరోజూ రెండు చెంచాల మెంతులు రాత్రి నానబెట్టి.. తెల్లవారు జామున ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. పసుపును నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్టుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. బెణికినప్పుడు నొప్పికి, గాయాలకు, కీళ్లవద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది. పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. మినపప్పు వెన్నుపూసకు బలాన్నిస్తుంది. అంతేకాదు మినపప్పులో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వారానికి రెండుసార్లు వంటల్లో మినపప్పును చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆవాలు గుండెకు మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు అందిస్తాయి. ఇవి చదవండి: 'కంటిచూపు' ను ఈ జాగ్రత్తలతో కాపాడుకుందాం..! -
చలికాలంలో ఇలా ఎందుకవుతుందంటే..? కారణం ఇదే!
'చలికాలం కీళ్లనొప్పులతో బాధపడేవారికి ఓ పీడకల. కీళ్లలో ఇన్ఫ్లమేషన్ వచ్చి నొప్పి కలిగించే ‘ఆర్థరైటిస్’ సమస్య చలికాలంలో పెచ్చుమీరడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కారణాలవుతాయి. అవేమిటో, చలికాలంలో ఈ కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందడం ఎలా.. వంటి అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం.' చలికాలంలో ఆర్థరైటిస్‌తో బాధపడేవారి వెతలు మరింతగా పెరుగుతాయి. అందుకు కారణాలు ఈ కింది విధంగా ఉంటాయి. చలికాలంలో కీళ్లనొప్పులు పెరిగేదెందుకంటే.. మానవ శరీరంపై వాతావరణం ప్రభావం తప్పక ఉంటుంది. దేహంలో జరిగే చాలా జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థ వాతావరణంలోని తేడాలకు తగ్గట్లుగా మార్పులకు లోనవుతుంటాయి. దాంతో ఆర్థరైటిస్ కీళ్లనొప్పులతో బాధపడేవారి కండరాలు మరింతగా బిగుసుకుపోవడం, బాధలు పెరగడం జరుగుతాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ బాధలూ పెరుగుతాయి. ఇందుకు దోహదపడే అంశాలివి.. చలికాలంలో చేయి లేదా కాలి వేళ్లకు రక్తప్రసరణ కాస్త మందగిస్తుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘రెనాడ్స్ ఫినామినా’ అంటారు. అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో ఇది మరింత ఎక్కువ. ఇది మరింత తీవ్రతరం అయినప్పుడు కొందరిలో చేతివేళ్లు, కాలివేళ్లు కుళ్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’ అంటారు. ఆర్థరైటిస్ వల్ల లంగ్స్ ప్రభావితం అయినప్పుడు ఐఎల్‌డీ అనే జబ్బు వచ్చి, చలికాలంలో తీవ్రత మరింత పెరిగి బాధితుల్లో దగ్గు, ఆయాసం పెరుగుతాయి. మయోసైటిస్ అనే రకం కీళ్లవాతంతో బాధపడేవారిలో ఈ కాలంలో కండరాలకి రక్తప్రసరణ తగ్గడంతో వాటి కదలికలు మరింత తగ్గుతాయి. ఫలితంగా తగినంత వ్యాయామం సమకూరక.. వ్యాధి లక్షణాలు పెరిగి, ఇబ్బందికరంగా మారతాయి. అందుకే కీళ్లనొప్పులతో బాధపడుతుండేవారు చలికాలం వస్తుందంటేనే ఆందోళన చెందుతుంటారు. ఈ కాలంలో కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు కొన్ని చిన్న చిన్న సూచనలు పాటించడం ద్వారా చలికాలంలో పెరిగే తమ బాధలను చాలావరకు అధిగమించడం సాధ్యమే.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఉన్ని దుస్తులు, కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. వెచ్చదనం వల్ల నొప్పిని కలిగించే రసాయనాల తొలగింపు ప్రక్రియ, వాటిని బయటకు పంపడం మరింత వేగవంతమవుతుంది. వెచ్చదనం కారణంగా రక్తప్రవాహమూ మెరుగుపడుతుంది. కండరాలు బిగుసుకు పోవడమూ తగ్గుతుంది. చలికాలంలో కండరాల కదలికలు ఇబ్బందికరంగా మారడం, నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో బాధితులు తమ దేహ కదలికలను బాగా తగ్గిస్తారు. తగినంత వ్యాయామం సమకూరకపోవడంతో బాధలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వీరు తమకు శ్రమ కలగని రీతిలో ఎంతోకొంత వ్యాయామం చేయాలి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువ. ఫలితంగా ఒంట్లో విటమిన్–డి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా వ్యాధి లక్షణాల పెరిగి, బాధలు మరింత పెచ్చరిల్లుతాయి. అప్పటికే ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారు డాక్టర్లు నిర్ణయించిన మోతాదులో, వారు సూచించిన కాలానికి విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవాలి. ఈ కాలం వైరస్, బ్యాక్టీరియాల మనుగడకు అనుకూలంగా ఉండటంతో అంటువ్యాధులు పెరిగే ప్రమాదం ఉంటుంది. కీళ్లవాతాల తీవ్రతా పెరగవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు చలికాలం రాకముందే డాక్టర్లు సూచించిన వ్యాక్సిన్లు తీసుకోవాలి. అంటువ్యాధుల వల్ల వయోవృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తప్పనిసరిగా వ్యాక్సిన్లు తీసుకోవాలి. చలికాలంలో నీళ్లు, ద్రవాహారాలు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఒంట్లో ద్రవాలు తగ్గి, డీ–హైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో అందరూ తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థరైటిస్ కోసం వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తల ద్వారా ఆర్థరైటిస్ బాధితులు చలికాలంలో ఎదుర్కొనే బాధలను చాలావరకు నివారించవచ్చు. ఇవి చదవండి: వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి! -
ఉత్తరకాశీ: కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోవడంతో దాదాపు 40 మంది కూలీలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ కూలీలను రక్షించేందుకు నేషనల్, స్టేట్ డిజాస్టర్ బృందాల తోసహ అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు కూడా పాల్గొని సహాయక చర్యలు చేపట్టారు. తీరా కూలీలు బయటకు వచ్చేస్తారనే లోపలే ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ కాస్త పనిచేయకుండా మొరాయించింది. ఇక లాభం లేదనుకుని మరో ప్రణాళికతో సాగేందుకు సన్నద్ధమయ్యారు అధికారులు. అందులో భాగంగా కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులు ముమ్మరం చేశారు. అంటే..ఈ దురదృష్టకర ఘటన జరిగి నేటికి దాదాపు 15 రోజులు కావొస్తుంది. అందులో చిక్కుకున్న వారి కోసం ఆక్సిజన్, ఆహారం, నీళ్లు వంటి వాటిని పైపుల ద్వారా అందజేశారు కూడా అధికారులు. ఇప్పటి వరకు భయాందోళనల నడుమ గడిపిని ఆ కూలీలకు ఈ ఆహారం ఎంత వరకు సరిపోతుంది. వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తదితరాల గురించే ఈ కథనం!. మూడు.. నాలుగు.. రోజుల కాదు దాదాపు పదిరోజులపైనే ఆ సోరంగంలో చిక్కుకుపోయారు కార్మికులు. అధికారుల అందించే ఆహారం వారి ప్రాణాలను నిలబెడుతుందో లేదో చెప్పలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకుంటే మానసిక భయాందోళనకు మించిన భయానక వ్యాధి ఇంకొకటి ఉండదు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఆకలి అనేది పుట్టి తినగలడు. ఎప్పుడూ బయటపడతామన్నా ఆలోచన ప్రతి గడియా ఓ యుగంలా టెన్షతో ఉన్నవారికి పోషకవిలువతో కూడిన ఆహారం అయినా సహించదని అన్నారు. ముఖ్యంగా అన్ని రోజులు లోపలే ఉన్నారు కాబట్టి మనిషి రోజువారీ కాలకృత్యాలు సైతం తీర్చుకోవడానికి ఆస్కారం లేని ప్రాంతంలో ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణిస్తుందో చెప్పనవసరం లేదన్నారు.ఆ చీకటి ప్రదేశంలో బిక్కుబిక్కుమని ఉంటున్న వ్యక్తి మానసిక స్థితే సంఘర్షణలో ఉంటే మిగతా ఆరోగ్య వ్యసస్థలు సంక్రమంగా ఉండవని తేల్చి చెప్పారు. అదీగాక ఆ సొరంగంలోని సిలికా కారణంగా తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉందన్నారు. అధికారులు అందించే కృత్రిమ ఆక్సిజన్ ఎంతవరకు వారిని సంరక్షిస్తుందనేది కూడా చెప్పలేం. కొందరిలో హైపోక్సియా కారణంగా సాధారణ ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోయి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.కాగా, వైద్యులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో నేపథ్యంలో చిక్కుకున్న కార్మికులకు కావాల్సిన విటమిన్ సీ టాబ్లెట్లు, తలనొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు సంబంధించిన మందులను పంపించామని ఉత్తకాశీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చీకట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమని ఉన్న ఆ కార్మికుల మానసిక స్థితి ఎలా ఉంటుందనే దానిపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ కాంత్ రాఠీ మాట్లాడుతూ..ఒకే పరిస్థితికి వివిధ వ్యక్తులు భిన్నమైన మానసిక ప్రతిస్పందనలను ప్రదర్శిస్తారని, అందరి మానసిక స్థితి ఒకేలా ఉండదని అన్నారు. బయటపడిన వెంటనే ఆ కార్మికులకు కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షలో ఉండటం అత్యంత అవసరమని చెప్పారు. ఎందుకంటే..కొందరూ డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని అన్నారు. (చదవండి: పల్లీలు తింటే ఆ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువ! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
AP: ఇంటింటికీ ఆరోగ్య రక్ష
రాష్ట్రంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచే కార్యక్రమమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కరించే గొప్ప బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అమలు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం తరహాలోనే ఇప్పుడు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. మొత్తం ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని హెల్త్ క్యాంపులతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించామని, సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికెట్లను నెల రోజుల వ్యవధిలో అందించినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా ప్రభుత్వం మీకు అందుబాటులో, మీ గ్రామంలోనే ఉందనే భరోసా ఇవ్వగలిగామన్నారు. అదే మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కార్యక్రమం అమలుపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య పొందడంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్‌ను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెను మార్పులకు శ్రీకారం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటినీ సందర్శించి మ్యాపింగ్ చేస్తారు. ఏ ఇంట్లో ఎవరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారో గుర్తిస్తారు. గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ల ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు మందులు, కళ్లద్దాలు అందిస్తారు. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు లాంటి దీర్ఘకాలిక జబ్బుల బాధితులను (క్రానిక్ డీసీజెస్) గుర్తించడం, రెగ్యులర్‌గా చెకప్ చేయడం, డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించడం, మందులను అందించడం, అవసరమైతే ఆస్పత్రులకు పంపడం లాంటి జాగ్రత్తలతో అనారోగ్య బాధితులను పూర్తిగా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గ్రామం పూర్తి బాధ్యతను ఫ్యామిలీ డాక్టర్ తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఎక్కడా మందులు లేని పరిస్థితి ఉండకూడదు. ఇలా చాలా పెద్ద మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లూ కవర్ కావాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులున్న ఇళ్లను ప్రత్యేకంగా పరిగణించి కాలానుగుణంగా పరీక్షలు చేస్తూ మందులు, చికిత్స అందించాలి. సంపూర్ణ రక్తహీనత నివారణ రాష్ట్రంలో జీరో అనిమిక్ (రక్తహీనత) లక్ష్యంగా పని చేయాలి. ఆరోగ్య సురక్షలో గర్భిణులు, బాలింతలతో పాటు రక్తహీనత బాధితులను కూడా గుర్తించి మందులతో పాటు, పుడ్ సప్లిమెంటేషన్ అందచేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్ అండ్ ఇన్ఫాంట్ కేర్ (నవజాత శిశువులు, చిన్నారులు) కేసులను పరిగణలోకి తీసుకోవడంతో పాటు బీపీ, షుగర్ లాంటి సమస్యలున్న వారికి చికిత్స అందించాలి. ఒకవైపు సరైన సమయంలో చికిత్స అందిస్తూనే జీవన విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులు, ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై (ప్రివెంటివ్ కేర్) ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. దీన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాలి. 45 రోజుల తర్వాత కూడా.. మనం 45 రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా చేపట్టాలి. ప్రతి మండలంలోనూ నెలకు కనీసం 4 గ్రామాల్లో ఈ క్యాంపులను నిర్వహించాలి. దీంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు అవుతుంది. క్యాంప్‌లలో నలుగురు వైద్యులు హెల్త్ క్యాంప్‌లలో నలుగురు డాక్టర్లు పాల్గొంటారు. ఇందులో ఇద్దరు పీహెచ్సీ డాక్టర్లు, మరో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారు. స్పెషలిస్ట్ వైద్యుల్లో గైనిక్/పీడియాట్రిక్ స్పెషలిస్టు డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కంటి పరీక్షలను కూడా క్యాంపులో భాగంగా చేపట్టాలి. స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎంపీడీవో, ఎమ్మార్వోలు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి. హెల్త్ క్యాంపు నిర్వహణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అధికారులకు ఈ కార్యక్రమంపై ఎలాంటి సందేహాలున్నా సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)తో నివృత్తి చేసుకోవాలి. ప్రతి పేషెంట్‌కు ఉచిత వైద్యమే లక్ష్యం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందాలి. పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. ఆరోగ్య సురక్ష తొలి, రెండో దశల్లో వలంటీర్లు, సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు, ఆశాలు ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ బ్రోచర్లను ప్రజలకు అందజేయాలి. ఆరోగ్యశ్రీ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం, వినియోగంపై వివరించాలి. ఆరోగ్యశ్రీలో గతంలో 1,050 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే మనం 3,256కి పెంచాం. పథకం పరిధిని విస్తృతం చేశాం. ప్రతి పేషెంట్ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే మన లక్ష్యం. ఏ ఒక్కరూ వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితులు ఉండకూడదు. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం ఈ నాలుగేళ్లలో ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే 53,126 పోస్టులను భర్తీ చేశాం. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసేలా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. నాడు–నేడుతో అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలతోపాటు వీటికి అదనంగా 5 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏజెన్సీలో నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల పాత్ర ప్రివెంటివ్ కేర్‌లో ఒక కొత్త అధ్యాయం. ► సమీక్షలో వైద్య శాఖ మంత్రి మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సాయిప్రసాద్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ జానకి, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ వెంకట మురళీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు దశల్లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇలా... (( 1)) వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు.. ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు వివరిస్తారు. తేదీతో పాటు ఏయే సేవలు అందిస్తారో గ్రామం/పట్టణం వారీగా తెలియజేస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో నెట్వర్క్ ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయి? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా ఆ ఆస్పత్రులకు వెళ్లాలి? ఉచిత వైద్య సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల బృందం ఆయా కుటుంబాల వద్దకు వస్తుందని, ప్రతి ఇంట్లోనూ పౌరులందరితో మాట్లాడి 7 రకాల టెస్టులకు సంబంధించిన అంశాలను మీతో చర్చిస్తారని తెలియజేస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది. ((2)) సీహెచ్‌వో ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు అన్ని ఇళ్లను సందర్శిస్తారు. ప్రజలకు వారి ఇంటివద్దే బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్, స్పూటమ్ (కఫం) పరీక్షలతోపాటు జ్వరంతో బాధపడుతున్న వారికి మలేరియా, డెంగీ లాంటి మొత్తం ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల ఫలితం ఆధారంగా సేకరించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. అనంతరం ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్ షీట్ జనరేట్ అవుతుంది. ఈ డేటా వివరాలు హెల్త్ క్యాంపు జరిగే నాటికి ఉపయోగపడతాయి. ((3)) మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించటానికి మూడు రోజులు ముందుగానే వలంటీర్, గృహ సారధులు, ప్రజా ప్రతినిధులు ఆయా చోట్ల ప్రజలకు మరోసారి గుర్తు చేస్తారు. క్యాంప్ నిర్వహించే రోజు అందుబాటులో ఉండాలని సమాచారం ఇస్తారు. ((4)) గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. ఈ నెల 30వతేదీ నుంచి హెల్త్ క్యాంపులు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజూ ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామం/పట్టణంలో క్యాంపు నిర్వహిస్తారు. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్/పట్టణాల్లో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు జరుగుతాయి. ((5)) ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత ప్రజల ఆరోగ్య వివరాలు హ్యాండ్ హోల్డింగ్‌లో ఉండాలి. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించాక వారికి కాలానుగుణంగా టెస్టింగ్, కన్సల్టేషన్, మందులు ఇవ్వడం అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాటే వినిపించకుండా చర్యలు. -
‘చంద్రబాబును సాగనంపే దాకా నాకేం కాదు’
సాక్షి, కృష్ణా: తాను అనారోగ్యానికి గురయ్యానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదంటూ సోషల్ మీడియాలో తనపై నడుస్తున్న ప్రచారంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. శునకానందం కోసమే కొందరు ఇలా చేస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీని ఉద్దేశించి ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారాయన. మంగళవారం విజయవాడలో మీడియాకు ఎదురైన ఆయన స్పందిస్తూ.. నేను అనారోగ్యానికి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల నాకేం అవ్వదు. ఐటీడీపీ ద్వారా తెలుగు దేశం పార్టీ ఇలాంటి ప్రచారం చేయిస్తోంది. ఇది ఆ పార్టీ దిగజారుడు తననానికి నిదర్శనం. కానీ, చంద్రబాబు నాయుడ్ని రాజకీయాల నుంచి.. రాష్ట్రం నుంచి ఇంటికి సాగనంపే వరకు నేను ఈ భూమ్మీదే ఉంటా.. చంద్రబాబుకి రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ ఉంటా.. అంటూ ఘాటుగా స్పందించారాయన. ఇక.. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ వైఖరిపైనా కొడాలి నాని స్పందించారు. వాళ్లిద్దరూ మానసిక వికలాంగులని.. వాళ్లను మానసిక వైకల్య కేంద్రంలో చేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా. 2024 ఎన్నికల తర్వాత వాళ్లను ఆస్పత్రిలో చేరుస్తాం అంటూ సెటైర్ వేశారాయన. ఇక.. దమ్ముంటే తనపై పోటీకి దిగాలని నారా లోకేష్‌కు విసిరిన సవాల్‌ను ఆయన ప్రస్తావించారు. సవాల్ చేసి చాలారోజులైనా లోకేష్ మాత్రం స్పందించడం లేదని కొడాలి నాని అన్నారు. ఇదీ చదవండి: స్పృహ లేకుండా మాట్లాడడం.. పవన్‌కు అలవాటే కదా! -
చేసే పనీ.. చేటు చేయొచ్చు.. జలుబు నుంచి క్యాన్సర్ దాకా..
ఒక వ్యక్తి రోజులో ఎక్కువ భాగం గడిపే చోటు ఏదైనా ఉందంటే అది ఉద్యోగం/ వృత్తిపరమైన విధులు నిర్వర్తించే ప్రదేశమే. ఎవరికైనా ఇది తప్పనిసరే అయినా.. ఆయా ఉద్యోగాలు/వృత్తి ప్రదేశాలకు వ్యక్తుల అనారోగ్యాలకు సంబంధం ఏర్పడుతోంది. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే దాకా.. వివిధ ఉద్యోగాలు, వృత్తుల ప్రభావం పడుతోంది. ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యే వరకు కూడా చాలా మంది ఈ సమస్యను గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇటీవలికాలంలో వృత్తి వ్యాపకాల ప్రభావం గతంలో కంటే మరింత పెరిగిందని.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. వీటినే ఆక్యుపేషనల్ హజార్డ్స్గా చెప్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆక్యుపేషనల్ హెల్త్‌పై అవగాహన కలిగిస్తున్న పలు సంస్థల అధ్యయనాలు ఏయే రంగాల్లో పనిచేస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నది తేల్చి చెప్తున్నాయి. వాటి ప్రకారం.. – సాక్షి, హైదరాబాద్ అనారోగ్య ‘గనులు’.. గనులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారు పీల్చే కలుషిత గాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఎన్ని జాగ్రత్తలు, గట్టి టోపీలు, అగ్నిమాపక భద్రత పరికరాలు, గాగుల్స్ వంటివి వాడినా ప్రమాదం తప్పని పరిస్థితే ఉంటోందని నిపుణులు తేల్చారు. సమస్యల కర్మాగారాలు.. కర్మాగారాల్లో భారీ యంత్రాలు, ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. పెద్ద శబ్దాలు వెలువడతాయి. ఇవన్నీ వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమే. ఫ్యాక్టరీ కారి్మకులు, మేనేజర్లు లేదా ఫ్లోర్ వర్కర్లలో వినికిడి లోపం సాధారణంగా మారుతోంది. భవన నిర్మాణం.. ఆరోగ్య ధ్వంసం.. నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరికీ, వారు కార్మికులు, ఉద్యోగులు, డిజైనర్లు ఎవరైనా సరే.. ఎక్కువసేపు అక్కడే గడిపితే ప్రమాదకరమే. సిమెంట్, మట్టి, ఇసుక ధూళి, పెయింట్లు, మరికొన్ని నిర్మాణ ఉత్పత్తులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. బిపీఓలలో.. బాడీ క్లాక్‌కు బ్రేక్.. బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) సెంటర్లలో రాత్రి షిఫ్టులలో పనిచేయడం, నిరంతర రాత్రి షిఫ్టులు, తరచూ షిప్టులు మారడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పగటిపూట నిద్రపోతున్నా, షిఫ్టులు మారుతున్నా శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతోంది. రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్‌తోపాటు సెప్టిక్ అల్సర్లు, గ్యా్రస్టిక్ అల్సర్లు వస్తున్నాయి. శుభ్రత.. ఆరోగ్యానికి లేదు భద్రత.. విభిన్న రకాల ఆవరణలను శుభ్రపరిచే వారికీ ఆరోగ్యపు ముప్పు తప్పడం లేదు. టాయిలెట్, బాత్రూం, ఫ్లోర్ క్లీనర్లు వాడినప్పుడు విష వాయువులు వెలువడతాయి. అవి చాలా ప్రమాదకరం. కంప్యూటర్.. వెన్నెముక కష్టాలు.. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి వెన్ను భాగం, చేతులు, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఈ రకమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నవారు పెరిగారు. చాలా మంది వెన్నెముక సమస్యలు, స్లిప్డ్ డిస్క్, కండరాల ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూల డిజైనర్‌కూ డేంజర్.. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ పూల డిజైనర్ వృత్తి కూడా సమస్య రేపేదే. పూల డిజైనర్ కాండం నుంచి పూలను కత్తిరించి, అందంగా అమర్చే సమయంలో వాటికి దగ్గరగా ఉంటారు. ఆ పూల మొక్కల కోసం వినియోగించే బలమైన పురుగుమందుల ప్రభావానికి లోనవుతారు. వినికిడికి.. ‘ధ్వని’ దెబ్బ.. ఎక్కువ ధ్వని వెలువడే పరిశ్రమలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు వినికిడి సమస్యల బారినపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏవైనా పరిశ్రమల్లో ఒక ఉద్యోగి 8గంటల పాటు 90 డెసిబుల్స్ ధ్వనిలో పనిచేయవచ్చు. 95 డెసిబుల్స్ ఉంటే 4 గంటలు, 100 డెసిబుల్స్ ఉంటే 2 గంటలు మాత్రమే పనిచేయాలి. అదే 115 డెసిబుల్స్, ఆపైన తీవ్రతతో ధ్వని ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. అంతేకాదు.. ఇయర్ ప్లగ్స్, ఇయర్ కెనాల్స్ వంటివి వాడాలి. వృత్తికో వ్యాధి తప్పట్లేదు అనేక రకాల పరిశ్రమలు, రంగాలు, వృత్తులు, ఉద్యోగాలు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ►ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు, అతిగా నిలబడడం వల్ల వెరికోసిటీస్, వినికిడి సమస్యలు వస్తున్నాయి. ►పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. గట్టిగా మాట్లాడుతూ బోధించడం వల్ల గొంతు సమస్యలూ కనిపిస్తున్నాయని అంటున్నాయి. ► లారీలు, కంటైనర్లు వంటి భారీ వాహనాల డ్రైవర్లకు వెన్ను సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, వాహనాల వైబ్రేషన్ వల్ల రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. కన్నార్పకుండా రోడ్లను చూస్తూ ఉండటం వల్ల కళ్లు పొడిబారుతూ దృష్టి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ►సిలికా పరిశ్రమలో పనిచేసేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన సిలికోసిస్‌కు గురవుతారు. ఆస్బోస్టాస్ పరిశ్రమల్లో పనిచేసేవారు పలు రకాల కేన్సర్లకు, చక్కెర పరిశ్రమలో పనిచేసేవారు పెగసోసిస్ వంటివాటికి గురవుతారు. ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చేస్తున్న ఉద్యోగం/వృత్తి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గుర్తించి.. వాటి నుంచి తప్పించుకునే అంశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.. మధ్యలో కాసేపు లేచి నడవడం, దూరంగా ఉన్న వస్తువులను చూడటం, వీలైతే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదన్నారు. అపరిశుభ్ర, కాలుష్య పరిస్థితుల్లో పనిచేసేవారు మాస్కులు, గ్లౌజులు వంటివి కచ్చితంగా వాడాలన్నారు. వైద్యులను సంప్రదించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు తీసుకుని పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. వృత్తి, ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటి పై తరచుగా అవగాహన సద స్సులు నిర్వహిస్తున్నాం. గత వారం ట్రాఫిక్ పోలీసులకు వచ్చే సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశాం. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రొఫెషన్ల వల్ల కూడా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ తరహా ఆక్యుపేషనల్ హజార్డ్స్‌కు చికిత్సలు లేవు. అందువల్ల ఆయా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు అవగాహన పెంచుకుని, జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విజయ్‌రావు, జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ -
మీ బ్రెస్ట్ ఇలా ఉంటే మీరు చాలా డేంజర్ లో ఉన్నట్లే
-
పిల్లలు మానసికంగా ఎదగకపోవడానికి, అంగవైకల్యంతో పుట్టడానికి కారణాలు ఇవే
-
ఆరోగ్యాధారిత వ్యవస్థలు బలోపేతం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘రానున్న ఆరోగ్య విపత్తులను ఎదుర్కునేందుకు అంతర్జాతీయంగా ఆరోగ్యాధారిత వ్యవస్థలను ఏకీకృతం, బలోపేతం చేయడం తక్షణ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అభిప్రాయపడ్డారు. జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో జరిగిన 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ప్రాథమిక ఆరోగ్యాన్ని మూలస్తంభంగా ఉంచి, బలమైన ఆరోగ్య వ్యవస్థలను రూపొందించడంపై మనం దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా అనుసంధానించిన నెట్వర్క్, ఎకో సిస్టమ్‌ను సృష్టించే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆమె ఈ సందర్భంగా జీ 20 దేశాలను కోరారు. దానికి ఇది అనువైన సమయంగా పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ పై అంతర్జాతీయ కార్యక్రమ ఏర్పాటుకు భారత్ చేసిన ప్రతిపాదనను ఆమె ఈ సందర్భంగా ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఇది దేశాల మధ్య డిజిటల్ వైరుధ్యాలను తగ్గించడానికి సాంకేతికత ఫలాలు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు వీలు కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచపు ఫార్మసీ భారత్: కిషన్‌రెడ్డి కేంద్ర çపర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం, వెల్‌నెస్‌ల కోసం అత్యధికులు ఎంచుకుంటున్న 10 అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా ఉందన్నారు. ప్రపంచపు ఫార్మసీగా మన దేశాన్ని అభివరి్ణంచిన ఆయన...మొత్తం ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 33శాతం హైదరాబాద్‌లోని ఒక్క జీనోమ్ వ్యాలీ ద్వారానే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. వచ్చే 2030కల్లా అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మన దేశం కృత నిశ్చయంతో ఉందన్నారు. స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారానే బలమైన ఆర్థిక వ్యవస్థ: కేంద్రమంత్రి బాఘెల్ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ మాట్లాడుతూ స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించగలమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇటీవలి కోవిడ్ 19 మహమ్మారి నేరి్పందని గుర్తు చేశారు. అందరికీ అత్యుత్తమ ఆరోగ్య సౌకర్యాలు, వ్యాక్సిన్లు, థెరప్యూటిక్స్, డయాగ్నస్టిక్‌లను జీ20 వేదిక ద్వారా అందించడం భారత్ లక్ష్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి అయోగ్ సభ్యులు డా.వి.కె.పాల్, ఐసీఎంఆర్ డీజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ బహ్ల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అభయ్ ఠాకూర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి హెకాలీ జిమోమి, జీ20 దేశాల ప్రతినిధులు, వైద్యరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
రెండు మూడు రోజులకు ఒక పోలీసు మృతి.. ఐదేళ్లలో 821 మంది
తమ ప్రాణాలను పణంగా పెట్టి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులను వివిధ అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో ఒక్క ముంబైలోనే 821 మంది పోలీసులు మృతి చెందినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి సగటున రెండు, మూడు రోజులకు ఒక పోలీసు మృతి చెందుతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై నిత్యం వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంటుంది. ముంబైలో నివాసముంటున్న దాదాపు కోటిన్నర జనాభాకు రక్షణ కల్పించాలంటే పోలీసులకు ఒక సవాలుగా మారుతుంది. సాధారణంగా పోలీసులపై నేరాలను నియంత్రించడం, శాంతి, భద్రతలు కాపాడటం, ట్రాఫిక్ నియమాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి సారించడం తదితర కీలక బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలను నేరవేర్చే ప్రయత్నంలో పోలీసులు తమ ఆర్యోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అదనంగా కొన్ని గంటలు విధులు నిర్వహించడం, పై అధికారుల ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత విశ్రాంతి లభించకపోవడం వంటి కారణాలతో పోలీసులు వివిధ అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా గుండెపోటు, రక్తపోటు, మధుమేహం లాంటి అనారోగ్య సమస్యలతో ఐదేళ్లలో 821 మంది పోలీసులు మృత్యవాత పడ్డారు. ఇందులో అత్యధికంగా గుండెపోటుకు సంబంధించిన వేర్వేరు సమస్యలతో 168 మంది మృతి చెందారు. అదేవిధంగా కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ ముంబై పోలీసు శాఖకు చెందిన 123 మంది చనిపోయారు. ఇదే ఐదేళ్ల కాలవ్యవధిలో 31 మంది పోలీసులు ఆత్యహత్య చేసుకున్నారు. అందుకు కుటుంబ కలహాలే ప్రధాన కారణం కాగా.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రెండో స్థానంలో ఉన్నాయి. ఇందులో కేన్సర్, కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులున్నాయి. ఆత్మహత్యల్లో ఉరేసుకోవడం, భవనం పైనుంచి దూకడం, సరీ్వసు రివాల్వర్‌తో కాల్చుకోవడం, రైలు కింద పడటం లాంటి సంఘటనలున్నాయి. చదవండి: డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. తెర వెనక సోనియా గాంధీ! ఎప్పుడూ చర్చల్లోనే పోలీసులు.. ముంబై పోలీసుల ఆరోగ్య సమస్య అంశం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. అయినప్పటికీ నిర్లక్ష్యం జరుగుతోంది. 2018 నుంచి 2023 ఏప్రిల్ వరకు ఏకంగా 821 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడినట్లు అధికారికంగా లభించిన గుణంకాలు చెబుతున్నాయి. ముంబై నగరం ఎప్పుడు ఏదో కారణంతో బిజీగా ఉంటుంది. ఒకపక్క దేశ ఆర్థిక రాజధాని, మరోపక్క రాష్ట్ర రాజకీయాలకు ప్రధాన నిలయం కావడంతో తరుచూ వీఐపీల రాకపోకలు, రాజకీయ సభలు, సమావేశాలు, ప్రముఖుల భేటీ వల్ల వారికి బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత ముంబై పోలీసులపై ఉంది. అంతేగాకండా వివిధ మతాల పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఉంటాయి. దీంతో శాంతి, భద్రతలు అదుపు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసుల వారాంతపు, దీర్ఘకాలిక సెలవులు రద్దు చేస్తారు. అలాగే పోలీసులకు రోజుకు ఎనిమిది గంటలు విధులు నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. కానీ ప్రత్యక్షంగా అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. దీనికి తోడు ముంబై జనాభాతో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో పోలీసులపై అదనపు భారం పడుతుంది. ఫలితంగా వారి ఆర్యోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మండే ఎండలూ కారణమే.. గత రెండు నెలల నుంచి ముంబైలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీని ప్రభావం కూడా పోలీసుల ఆరోగ్యంపై పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 43 మంది పోలీసులు వేర్వేరు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఇందులో ఏడుగురు పోలీసులు డ్యూటీలో ఉండగానే మృత్యువాత పడ్డారు. పోలీసులు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు పోలీసు సంక్షేమ శాఖ తరఫున అనేక సేవా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలు, వర్క్‌షాపులు జరుగుతుంటాయి. కానీ అడపాదడపా చేపట్టడం వల్ల అనుకున్నంతమేర స్పందన రావడం లేదు. 2020–2022 కాలవ్యవధిలో ముంబైలోని ప్రముఖ టాటా కేన్సర్ ఆస్పత్రి 2,738 మంది పోలీసులకు కేన్సర్ పరీక్షలు నిర్వహించింది. 2023, ఫిబ్రవరిలో 15 రోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయగా అందులో కేవలం 325 మంది పోలీసులు పాల్గొన్నారు. అదే నెలలో యునైటెడ్ వే తరఫున ఫస్ట్ ఎయిడ్ అంశంపై శిక్షణ శిబిరం జరిగింది. సుమారు 45 వేల మంది ముంబై పోలీసుల కోసం చేపట్టిన ఈ శిబిరం సఫలీకృతం కాలేదు. -
విరాట్ కోహ్లీకి అనారోగ్యమా? మైదానంలో ఇబ్బంది పడ్డాడా? రోహిత్ క్లారిటీ..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో అద్భుత శతకంతో టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపాడు కింగ్ విరాట్ కోహ్లీ. 186 పరుగులు చేసి కెరీర్లో 75 శతకం నమోదు చేశాడు. అయితే కోహ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, మైదానంలో కాస్త ఇబ్బందిపడుతున్నాడని వార్తలొచ్చాయి. నాలుగో రోజు కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అక్షర్ పటేల్ ఈ విషయంపై స్పందించాడు. కోహ్లీ అనారోగ్యం విషయం గురించి తనకు తెలియదని చెప్పాడు. అయితే అతను ఇబ్బంది పడుతున్నట్లు తనకు అన్పించలేదని, వికెట్ల మధ్య పరుగెడుతున్నప్పుడు ఎలాంటి అసౌకర్యంగా కూడా కన్పించలేదని చెప్పుకొచ్చాడు. ఎండను కూడా తట్టుకుని గంటలపాటు క్రీజులో ఉండి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పుకొచ్చాడు. తనకైతే కోహ్లీ అనారోగ్యంగా ఉన్నట్లు అస్సలు అన్పించలేదని పేర్కొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్ చివరి రోజు కోహ్లీ రోజంతా ఫీల్డింగ్ చేశాడు. దీంతో అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు అర్థమైంది. కానీ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ ఆరోగ్యం ఎలా ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. కోహ్లీ కాస్త దగ్గుతున్నాడని రోహిత్ వెల్లడించాడు. కానీ అంతమాత్రానికే అనారోగ్యంగా ఉన్నట్లు కాదు కదా అని బదులిచ్చాడు. కోహ్లీ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తనకు అన్పించిందని చెప్పుకొచ్చాడు. నాలుగో టెస్టులో టీమిండియా పటిష్ఠ స్థితిలో ఉండటానికి కోహ్లీనే ప్రధాన కారణమని కొనియాడాడు. ఈ మ్యాచ్ డ్రా కావడం వల్లే సిరీస్ మనం కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశాడు. చదవండి: Rahul Dravid: అటొక కన్ను.. ఇటొక కన్ను -
షాకింగ్ విషయం బయటపెట్టిన పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్
తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు ఈమధ్య కాలంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలె సమంత మయోసైటిస్ బారిన పడగా, మమతామోహన్ దాస్ విటిలిగో అనే చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. తాజాగా మరో నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించింది. ''నన్ను దగ్గర్నుంచి చూస్తున్న వాళ్లకి తెలుసు గత కొన్నాళ్లుగా నేను గుండె, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నాను. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ పోస్ట్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మన కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్ప్రైజ్లను ప్లాన్ చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా. త్వరలోనే దీన్నుంచి కోలుకుని షూటింగ్లో పాల్గొంటాను'' అంటూ రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కానీ తనకున్న అనారోగ్యం ఏంటన్నది మాత్రం ఆమె పూర్తిగా రివీల్ చేయలేదు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
సోషల్ మీడియా ఎఫెక్ట్: మెదడులో డోపమైన్ హార్మోన్ రిలీజ్.. అనర్ధాలు ఇవే..
హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుకు రిప్లయ్ ఇవ్వలేదని తను ప్రేమించిన యువతిపైనే బహిరంగంగా దాడి చేశాడు. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. రోజుకు 2.30 గంటలకు మించి సోషల్ మీడియా సైట్లలో గడిపేవారిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, వారు మరో పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతున్నారని చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు తమ చదువు, వృత్తి కోసం కేటాయించిన సమయాన్ని కూడా వృథా చేసుకుంటున్నట్టు గుర్తించారు. సాక్షి, అమరావతి: స్మార్ట్‌ఫోన్‌లో నెట్ రాకుంటే చిరాకు.. గంటపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటే విసుగు.. పోస్టులకు లైక్‌లు, షేర్లు చేస్తూ కామెంట్లకు రిప్లయ్ ఇవ్వాలన్న కోరిక.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే అదో మానసిక వ్యసనమే అంటున్నారు మానసిక వైద్యులు. ఇది మద్యపాన, మత్తు పదార్థాలు తీసుకోవడం వంటిదేనంటున్నా రు. ఈ వ్యసనంపై చికాగో యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. మన దేశంలోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నట్టు తేల్చింది. ఆన్లైన్లో విహరించేవారి మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదలవుతుందని, చేస్తున్న పని పదేపదే చేసేలే ఆ హార్మోన్ ఉత్తేజపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్లనే ఒక్కసారి సో షల్ మీడియా సైట్లకు అలవాటుపడ్డవారు వదలలేకపోతున్నారు. ఇది ఒకస్థాయి వరకు ఇబ్బంది లేకున్నా పరిమితి మించినప్పుడు అనర్థాలకు దారితీస్తున్నట్టు గుర్తించిన సైంటిస్టులు.. అలాంటివారు మానసిక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వెనకకు వెళ్తేనే.. ముందుకు ఆన్లైన్ సెర్చింగ్ వ్యసనం మానసిక రోగమని ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరూ ప్రకటించకున్నా వీరికి చికిత్స అందించే థెరపిస్టులు మాత్రం పెరుగుతున్నారు. అమెరికాలో సోషల్ మీడియా వ్యసనం 20 శాతానికి పెరిగినట్టు గుర్తించారు. మన దేశంలోనూ ఈ సంఖ్య 4.7 శాతంగా ఉండగా, ఇది వచ్చే రెండేళ్లలో మూడింతలవుతుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ తర్వాత పిల్లల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం అధికమైంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్న ఇలాంటి పిల్లలను తల్లిదండ్రులు సైకియాట్రిస్టులకు చూపిస్తున్నారు. సామాజిక మాధ్యమం వ్యసనానికి చికిత్స కోసం అమెరికా, యూకేల్లో డి–అడిక్షన్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. కాలిఫోర్నియా న్యూపోర్టు బీచ్‌లోని మీడియా సైకాలజీ రీసెర్చ్ సెంటర్లో డ్రైవింగ్, స్విమ్మింగ్‌తో చికిత్స అందిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సోషల్ మీడియాకు ముందున్న పరిస్థితికి వెళ్లాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఫోన్ ను పక్కనబెట్టి మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం, సన్నిహితులతో ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకోవాలంటున్నారు. ప్రత్యేక కోర్సు డిజైన్ చేశాం.. స్మార్ట్‌ఫోన్ వ్యసనం టీనేజ్ పిల్లల్లో అధికంగా కనిపిస్తోంది. అదికూడా ఇంట్లో పెద్దవారే అలవాటు చేస్తున్నారు. లాక్డౌన్ నుంచి మరీ ఎక్కువైంది. చాలామంది పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడే అవకాశం ఉండదని స్కూళ్లకు కూడా వెళ్లడం లేదు. నావద్దకు వచ్చే పిల్లల్లో కొందరు 7 గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారున్నారు. పిల్లల్లో కార్పెల్ టెన్నల్ సిండ్రోమ్‌తో మణికట్టు దెబ్బతింటుంది. అధిక సమయం తలను వంచి ఉంచడం వల్ల డ్రూపింగ్ హెడ్ సిండ్రోమ్ వస్తోంది. ఇటీవల పిల్లల్లో కొత్తగా వర్చువల్ ఆటిజం గుర్తించారు. గత పదేళ్లలో అమెరికాలో ఏడీహెచ్‌డీ బారిన పడుతున్న పిల్లలు పెరుగుతున్నారు. అంటే ఏకాగ్రత తగ్గిపోతోంది. హింసాతత్వం పెరుగుతోంది. భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోతున్నారు. స్కూల్ పిల్లలను స్మార్ట్‌ఫోన్ నుంచి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పిల్లలకు చూపిస్తున్నాం. దీనివల్ల ప్రైమరీ పిల్లల్లో నూరు శాతం మార్పు వచ్చింది. హైస్కూల్ స్థాయి పిల్లల్లో కొందరు తీవ్రంగా ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు. అలాంటి వారిని సైకియాట్రిస్టులకు చూపించాలని తల్లిదండ్రులకు సిఫారసు చేస్తున్నాం. – వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త. తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్ వ్యక్తిగత, మానసిక ఆరోగ్యం మీద, మానవ సంబంధాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని సులువుగా తగ్గించుకోవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. - మొదట మన స్మార్ట్ ఫోన్లో అతిగా వినియోగిస్తున్న యాప్స్‌ను డిలీట్ చేయడం ఉత్తమ మార్గం. - పని సమయంలో, భోజనం, వినోద కార్యక్రమాల సమయాల్లో ఫోన్‌ను ఆఫ్ చేయాలి. - సోషల్ మీడియా యాప్స్‌లోని నోటిఫికేషన్ సెట్టింగ్స్‌ను ఆఫ్ చేయాలి. - పడకగదిలో ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను ఉంచకూడదు. - సాంకేతికతతో సంబంధం లేని కొత్త అభిరుచిని అలవాటు చేసుకోవాలి. - సాధ్యమైనప్పుడుల్లా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. -
సినిమాకు ఆభరణం: శ్రుతి లయలే జననీ జనకులు కాగా
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడిన శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన ఆ మహా దర్శకుడు తరలి వెళ్లిపోయాడు. మావి చిగురు తినగానే పలికే కోయిలను కోయిల గొంతు వినగానే తొడిగే మావిచిగురును చూపిన కళాహృదయుడు తన శకాన్ని ముగించాడు. తెలుగు ముగ్గు తెలుగు సిగ్గు తెలుగు కట్టు తెలుగు బొట్టు తెలిసిన తెలుగింటి వనితలు అతను లేక మరి తెరపైకి రారు. ఒక కీర్తన, తిల్లాన, జావళి, జానపదం గుండె ఝల్లుమనేలా గజ్జె ఘల్లుమనిపించడం మళ్లీ చూడగలమా అతడు చూపినట్టుగా! ఆకలేసినవాడు అమ్మా అని ఎలా అంటాడో దెబ్బ తగిలినవాడు అమ్మా అని ఎలా అంటాడో తెలియడం చేతనే భావాల లోతును మనసుకు తాకించాడు. నరుడి బతుకు నటనే కావచ్చు. కాని అతణ్ణి తీసుకెళ్లిపోవాలనే ఈశ్వరుడి ఘటన మాత్రం రస హృదయుడైన తెలుగు ప్రేక్షకుడికి బాధాకరం. క్లేశమయం. ► టికెట్లకూ సంతకానికీ లింకు మద్రాసులో ఒక గవర్నమెంట్ ఆఫీసు. ఎవరిదో ఫైల్‌ను ఎవరో ఆఫీసరు సంతకం పెట్టాలి. ఎంతకీ పెట్టడు. ‘ఎంత కావాలో చెప్పమనండీ’ అన్నాడు బాధితుడు. ప్యూన్ పక్కకు తీసుకెళ్లి చెప్పాడు ‘ఆయన డబ్బు తీసుకోడు. స్ట్రిక్టు. శంకరాభరణం టికెట్లు సంపాదించి ఇవ్వగలిగితే ఇవ్వు. పనైపోతుంది’ అప్పటికి నాలుగు వారాలుగా శంకరాభరణం మద్రాసులో తండోపతండాల జనంతో కిటకిటలాడుతోంది. ఆ టికెట్లు దొరికేవి కావు. ఆ ఫైల్ సంతకం జరిగేదీ లేదు. ► చంద్రమోహన్‌కు ఆ ప్రాప్తం లేదు ప్రాప్తం కూడా ఒక మంచిమాటే. శంకరాభరణంలో నటించినందుకు నిర్మాత ఏడిద నాగేశ్వర రావు నటుడు చంద్రమోహన్ కు 50 వేలు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. సినిమా బిజినెస్ అయితే ఇస్తాడు. బిజినెస్ కాదు. షోల మీద షోలు పడుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు. బాగుంది అంటున్నారు. ఎవరూ కొనడం లేదు. ఈ సినిమా రిలీజైతే తప్ప గడ్డం తీయను అని కె.విశ్వనాథ్ గడ్డం పెంచుతున్నాడు. గడ్డం పెరుగుతున్నది తప్ప సినిమా రిలీజ్ కావడం లేదు. ఈలోపు ఏడిదకు ఒక ఆలోచన వచ్చింది. చంద్రమోహన్ ను పిలిచి ‘నీ రెమ్యూనరేషన్ బదులు తమిళనాడు రైట్స్ ఇస్తాను తీసుకో’ అన్నాడు. చంద్రమోహన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ‘రిలీజ్ కాని సినిమా నాకు అంటగడతావా. నా డబ్బు నాకు ఇవ్వు’ అన్నాడు. కొన్ని రోజులకు తమిళ నటి మనోరమ, తమిళనటుడు సౌందరరాజన్ తో శంకరాభరణం ప్రివ్యూ చూసింది. సినిమా అయ్యాక ఉద్వేగంతో విశ్వనాథ్ కాళ్ల మీద పడబోయింది. ‘ఈ సినిమా ఒక్కరు చూడకపోయినా పర్వాలేదు. నేను కొంటాను’ అంది. కొన్నది. చంద్రమోహన్ కు ప్రాప్తం లేదు. ► తపస్సు అలా మొదలైంది 1955లో సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ తీశాడు. భారతదేశంలో పార్లల్ సినిమాకు అంకురార్పణ చేశాడు. సత్యజిత్ రేకు గొప్ప పేరు, ఖ్యాతి దక్కాయి. కాని అది బెంగాలి వాళ్లకు చెల్లింది. హిందీలో కాని, సౌత్‌లో కాని సినిమా వ్యాపార కళ. వ్యాపారం ఎక్కువ, కళ తక్కువ అనుకునే సినిమాలు తీశారు. వినోదం చూపి డబ్బు సంపాదించడమే లక్ష్యం. ఆలోచన, అనుభూతి కృత్రిమ స్థాయి వరకే అంగీకారం. వాస్తవిక వాదంతో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల సత్యజిత్ రే వేసిన అడుగు పదేళ్ల పాటు బెంగాల్ దాటలేదు. కాని 1973లో ఎం.ఎస్.సత్యు తీసిన ‘గరం హవా’ వచ్చింది. అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఆ సినిమాకు జేజేలు పలికారు. శ్యాం బెనగళ్ ఆ మరుసటి సంవత్సరమే ‘అంకుర్’ తీశాడు. ఇంకోవైపు తమిళంలో కె.బాలచందర్, తెలుగులో దాసరి నారాయణరావు మిడిల్ క్లాస్ డ్రామాను గట్టిగా పట్టుకున్నారు. 1976లో బాలచందర్ ‘అంతులేని కథ’ వచ్చింది. అదే సంవత్సరం దాసరి ‘ఓ మనిషి తిరిగి చూడు’ లాంటి ప్రయోగాత్మక సినిమా తీశారు. అంత వరకు ‘శారద’, ‘జీవన జ్యోతి’ వంటి స్త్రీ కథాంశాలపై దృష్టి పెట్టిన కె.విశ్వనాథ్ అంతకు కాస్త అటు ఇటుగా దారి వెతుక్కునే క్రమంలో పడ్డారు. అదే సమయంలో దేశ సంస్కృతిలో వస్తున్న మార్పును చూసి మొత్తుకునే దర్శకులు కూడా వచ్చారు. 1971 లో దేవ్ ఆనంద్ హిప్పీల వేలంవెర్రిని ‘హరే రామా హరే కృష్ణ’గా తీశాడు. తెలుగునాట చూస్తే వర్తమానంలో సాంస్కృతిక అకాడెమీలు నామ్ కే వాస్తేగా మారాయి. తెలుగువాడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ మద్రాసులో అస్థిత్వం పొందాల్సి వచ్చింది. వీటన్నింటి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం కె.విశ్వనాథ్ మీద ఉంది. 1976 నాటికి తీసిన ‘సిరి సిరి మువ్వ’ ఆయనకు దారి చూపింది. 1980లో తీసిన ‘శంకరాభరణం’ ఏ పునాది మీద తాను సినిమా తీయాలో, ఏ సంస్కృతి పట్ల తనకు అనురక్తి ఉందో, ఏ ప్రాభవాల కోసం తన గుండె కొట్టుకులాడుతుందో ఆయన తెలుసుకున్నారు. ఇంతవరకూ చేసింది సినిమా రూపకల్పన. ఇక మీదట చేయాల్సింది తపస్సు. ► ఆ ముగ్గుర్ని నమ్ముకునే... ‘శంకరాభరణం’ ముహూర్తం రోజున కె.వి.మహదేవన్, పుహళేంది, వేటూరి సుందరరామమూర్తిలను పిలిచి కొత్త బట్టలు పెట్టి ‘మిమ్మల్ని నమ్ముకునే ఈ సినిమా తీస్తున్నాను’ అన్నాడు విశ్వనాథ్. నిజమే. అంతకు మించి నమ్ముకోవడానికి సినిమాలో హీరో లేడు. హీరోయినూ లేదు. శంకరశాస్త్రి పాత్రను వేస్తున్నది నాటకాలు వేసుకునే గవర్నమెంట్ ఆఫీసరు జె.వి.సోమయాజులు. తులసి పాత్రను వేస్తున్నది వేంప్‌గా ముద్రపడిన మంజుభార్గవి. చంద్రమోహన్ ది సపోర్టింగ్ రోల్. ఎవరిని చూసి ఈ సినిమా కొనాలి? ఎవరిని చూసి ఈ సినిమా ఆడాలి? పై ముగ్గురినే. కె.వి.మహదేవన్, పుహళేంది, వేటూరి సుందరరామమూర్తి... వీరు విశ్వనాథ్ అంచనాని వమ్ము చేయలేదు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము’ అని వేటూరి రాస్తే రిక్షా లాగే కార్మికుడు కూడా శాస్త్రీయ సంగీతం ఆస్వాదించేలా కె.వి.మహదేవన్, పుహళేంది పాటలు చేశారు. శాస్త్రీయ సంగీతం పాడాలంటే శాస్త్రీయ సంగీతం తెలిసిన ఏ మంగళంపల్లో కావాలి. కాని స..ప..స..లు నేర్వలేదని చెప్పుకునే బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. భారతీయ కళలు మరపున పడవచ్చు, మసి బారవచ్చు కాని వాటి తేజస్సు జాజ్వల్యమైనది... వాటి ఆధారంగా ఏర్పడిన పరంపరలు, వ్యక్తిత్వాలు, అహంభావాలు ఎవరికీ తల వంచనివి.. ఎవరు ఏం చేసినా అవి ఒక తరం నుంచి మరో తరానికి ఏదో ఒక మూల కొనసాగుతూనే ఉంటాయి... అని ‘శంకరాభరణం’లో కె.విశ్వనాథ్ చెప్పారు. మరి జనం చూస్తారా? ► మొదట ఖాళీ... ఆ తర్వాత కిటకిట 1980 ఫిబ్రవరి 2. అతి కష్టమ్మీద అతి కొద్ది థియేటర్లలో ‘శంకరాభరణం’ రిలీజ్ అయ్యింది. నేల, బెంచి, కుర్చీ... ఖాళీ. ఒక దిక్కూ మొక్కూ లేని అమ్మాయి కోసం ఒక మహా విద్వాంసుడు నిలబడ్డాడు. అయినవారు అతణ్ణి వెలి వేశారు. ఈ కథేదో కొత్తగా ఉందే అనుకున్నారు కొందరు. కాలగమనంలో చితికిపోయిన ఒక గొప్ప కళాకారుడు తన అభిజాత్యం కోల్పోకుండా పోరాడుతున్నాడే... ఇదీ బాగుందనుకున్నారు మరి కొందరు. ‘మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు సిరిసిరి మువ్వలు కాబోలు’ శివుని ఎదుట నర్తిస్తున్న ఈ నిష్కళంకుడు ఇంతకు ముందు ఏ కథలోనూ కనిపించలేదే. మొదట కుర్చీ నిండింది. తర్వాత బెంచీ నిండింది. తర్వాత నేల కిటకిటలాడింది. ఆ తర్వాతదంతా చరిత్ర. ‘ఎంటర్ ది డ్రాగన్ ’ వచ్చి దేశంలో కరాటే స్కూల్స్ తెరిచింది. ‘శంకరాభరణం’ వచ్చి తెలుగునాట సంగీత పాఠాలను, నృత్యపాఠశాలలను పునరుద్ధరించింది. ► దొరకునా ఇటువంటి సేవ! ‘శంకరాభరణం’లో శంకరాభరణ రాగమే లేదు అని విమర్శించాడు మంగళంపల్లి. కె.విశ్వనాథ్ భావధార పట్ల ఇలాంటివే కొన్ని అభ్యంతరాలు కొందరికి ఉండవచ్చు. కాని సినిమాను ఒక కళగా, దృశ్య శ్రవణ మాధ్యమంగా, రసస్పందన కలిగించే స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు చూపినవాడు కె.విశ్వనాథ్. సినిమాను తపస్సుగా భావించాడు. నిర్వాణ సోపానంగా కూడా. నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రాల్లో కొన్ని టైటిల్స్‌తో ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు ఈ విధంగా... శంకరాభరణం శంకరుడు అంటే శివుడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశ్వనాథ్ సినిమాల్లో దాదాపు శివుడి మీద ఏదో ఒక పాట ఉంటుంది. మరి.. విశ్వ నాథుడు శివభక్తుడా? అంటే... ఆయనకు దైవభక్తి ఎక్కువే. ఏదో ఒక పవర్ ఉంటుందనే నమ్మకం ఆయనది. విశ్వనాథ్ సినిమాల్లోకి వచ్చాక శివుడి పాట ఉండటం అనేది యాదృచ్ఛికంగా జరిగినదే. అనుకోకుండా ఆ సినిమాలో శివుడికి సంబంధించిన పదమో, సందర్భమో రావడం అనేది భగవదేచ్ఛ అని, కావాలని ప్రయత్నించినది కాదని విశ్వనాథ్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. అంతెందుకు ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో మొట్టమొదటి పాటను ‘శ్రీ’తో మొదలుపెట్టమని దేవులపల్లి కృష్ణశాస్త్రిని విశ్వనాథ్ అడిగారు. దేవులపల్లి ఏమో ‘శ్రీశైలం మల్లన్న, శిరసొంచెనా, చేనంతాగంగమ్మ వాన’ అని రాశారు. విశ్వనాథ్ ‘శ్రీ’తో రాయమని అడిగారే తప్ప శివుడి మీద రాయమని అడగలేదు. అయినా శివుడి మీద పాట వచ్చేసింది. ఇక చిన్నప్పుడు శివాలయానికి వెళ్లేవారు విశ్వనాథ్. ఆ సమయంలో ఒక వ్యక్తి మాస్కు వేసుకుని జడిపిస్తే, మూడు రోజులు జ్వరంతో పడుకున్నారు. అలా తెలిసీ తెలియని వయసు నుంచీ సినిమాల్లోకి వచ్చాక, ఆ తర్వాత కూడా విశ్వనాథ్ జీవితంలో శివుడు ఉన్నాడని అర్థమవుతోంది. అమ్మ మనసు తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. విశ్వనాథ్‌ది కూడా సేమ్ ఫీలింగ్. ఇష్ట దైవం ఎవరంటే తన తల్లిదండ్రుల గురించి చెప్పేవారు. అమ్మానాన్నలు చేసిన పుణ్యం, పూజలే ఫలించాయని, కాపాడాయన్నది విశ్వనాథ్ నమ్మకం. కళాతపస్వి తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యంకు జ్యోతిష్యం బాగా వచ్చు. అయితే కొడుకు తీసిన ఏ సినిమాకీ ముహూర్తం పెట్టలేదాయన. సినిమా అనేది ఊహకందని వ్యాపారం కాబట్టి తానో ముహూర్తం పెట్టించి, సినిమా ఆడకపోతే ‘ఆయన అనవసరంగా చెప్పారు’ అంటారనే మాట అనిపించుకోవడం ఇష్టంలేక కొడుకు సినిమాలకు ముహూర్తం పెట్టలేదు. స్వతహాగా మితభాషి అయిన సుబ్రహ్మణ్యం తనయుడి విజయాలకు లోలోపల ఆనందించేవారు. తన పుస్తకాల్లో ‘శంకరాభరణం ఈరోజున ఈ నక్షత్రం, ఈ ఘడియల్లో రష్ చూశాను. దీనికి ఈ యోగం ఉంది’ అని రాసుకున్నారు. ఇలా తనయుడి సినిమాల గురించి రాసుకున్నారు. ఇక విశ్వనాథ్ తల్లి సరస్వతి అయితే తనయుడి విజయాలను ఆస్వాదించేవారు. సాధారణంగా కోడలు ఇంటికొచ్చాక ఇంటి పరిస్థితి కాస్త మారుతుంది. అయితే కొడుకు మనసు ఎరిగిన తల్లిగా సరస్వతి కోడలిని బాగా చూసుకున్నారు. చెల్లెలి కాపురం విశ్వనాథ్‌కి ఇద్దరు చెల్లెళ్లు. పెళ్లయి, చెన్నై వడపళనికి మకాం మార్చినప్పుడు తన తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లను కూడా తీసుకెళ్లారు విశ్వనాథ్. ఆ చెల్లెళ్లు తమకు పెళ్లయ్యేంతవరకూ అన్నా వదిన దగ్గరే ఉన్నారు. తోడబుట్టినవాళ్లను అత్తగారింటికి పంపించాక కూడా వారి బాగోగులను చూసుకున్నారు. వాళ్ల శ్రీమంతాలు, కాన్పులు కూడా చెన్నైలోనే. సోదరుడు తండ్రితో సమానం అంటారు. విశ్వనాథ్ తన చెల్లెళ్లకు ఒక తండ్రిలానే ఉన్నారు. అయితే ఆయన సతీమణి జయలక్ష్మి సహకారం లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. విశ్వనాథ్ తన సినిమాలతో తీరిక లేకుండా ఉంటే.. ఆడపడుచులను చూసుకున్నారు జయలక్ష్మి. అలాగే చెల్లెళ్లనే కాదు.. తన మేనల్లుళ్లు, మేనకోడళ్లను కూడా బాగా చూసుకున్నారు విశ్వనాథ్. చివరికి వాళ్ల పిల్లలు కూడా వీళ్ల ఇంట్లోనే ఉండి, చదువుకోవడం విశేషం. స్వాతిముత్యం ‘స్వాతిముత్యం’లో శివయ్య (కమల్‌హాసన్ పాత్ర పేరు) అమాయకుడు. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవాడు. మరి.. చిన్నప్పుడు విశ్వనాథ్ ఎలా ఉండేవారు అంటే.. మహా అల్లరి. విజయవాడలో చదువుతుండగా కాలువ దాటి స్కూల్‌కి వెళ్లాల్సి వచ్చేది. వీళ్ల ఇంటి ఎదురుగానే కాలువ ఉండేది. వేసవికాలం వచ్చేటప్పుడు కొంచెం నీళ్లే ఉండటంతో బ్రిడ్జి మీద నుంచి కాకుండా ఫ్రెండ్స్‌తో కలిసి, కాలువలోంచే నడుచుకుంటూ వెళ్లేవారు. అయితే ఇంట్లోవాళ్లకి చెబితే తిడతారని భయం. నిక్కర్లు పైకి మడుచుకుని కాలువలో దిగిన విశ్వనాథ్‌ని చూసిన ఆయన మేనమామ కూతురు ఇంట్లో విషయం చెప్పేసింది. అంతే.. విశ్వనాథ్ తండ్రి అక్కడికి వెళ్లి ‘రేయ్’ అని అరిచారు. ఆ భయానికి విశ్వనాథ్ చేసిన పనులన్నీ నీళ్లలోనే కలిసిపోయాయి (ఓ సందర్భంలో విశ్వనాథ్ నవ్వుతూ చెప్పిన విషయం). అంతే.. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లిన కొడుకుని ‘రాస్కెల్’ అని, బట్టలు మార్చుకోమన్నారు విశ్వనాథ్ తండ్రి. ఇక ఆ తర్వాత ఆ కాలువ వైపు వెళ్లలేదు. అలాగే చిన్నప్పుడు తండ్రి మూడు చక్రాల సైకిలు కొనిపెడితే, దాన్నే మెర్సిడెస్ బెంజ్‌గా ఫీలయి, టింగుటింగుమంటూ బెల్లుకొట్టుకుంటూ వెళ్లేవారు విశ్వనాథ్. స్వయంకృషి కె. విశ్వనాథ్‌ను ఇంజినీర్ చేయాలనుకున్నారు ఆయన తల్లిదండ్రులు. ఆయనకు మాత్రం సంగీతం పై మక్కువ ఎక్కువ. బీఎస్సీ పూర్తి చేశాక తండ్రి అనుమతితో చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా చేరారు. ఇప్పటిలా అప్పట్లో ఎక్కువగా డబ్బింగ్ స్టూడియోలు ఉండేవి కావు. దీంతో లొకేషన్లోనే ఆర్టిస్టుల మాటలను రికార్డ్ చేయవలసి వచ్చేది. సంభాషణలు సరిగ్గా పలకడం తెలియని నటీనటులకు దగ్గరుండి డైలాగులు నేర్పించారు విశ్వనాథ్. ‘సౌండ్ రికార్డిస్ట్’గా నిజాయతీగా చేసిన పని ఆయన్ను సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా ఎదిగేలా చేసింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకత్వ శాఖలో చేసినప్పుడు విశ్వనాథ్ పని తీరు చాలామంది దృష్టిలో పడింది. అలా అక్కినేని నాగేశ్వరరావు ‘ఆత్మగౌరవం’తో దర్శకుణ్ణి చేశారు. అప్పట్నుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ వరకూ రాత్రీ పగలూ తేడా లేకుండా పని చేసిన రోజులే ఎక్కువ. ఆయన స్వయంకృషియే విశ్వనాథ్‌ని తెలుగు పరిశ్రమ శిఖరాగ్రాన నిలిచేలా చేసింది. శుభప్రదం దాదాపు 75 సంవత్సరాలు సినిమాలే లోకంగా జీవించారు విశ్వనాథ్. ఇక కుటుంబానికి సమయం కేటాయించాలని దర్శకుడిగా సినిమాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అప్పుడప్పుడూ నటుడిగా మాత్రం చేశారు. సినిమాలు తగ్గించాక ఆయన లైఫ్‌స్టయిల్ ఎలా సాగిందంటే.. ఉదయాన్నే నిద్ర లేవడం.. అల్పాహారం, భార్యతో కబుర్లు చెప్పుకోవడం, గడిచిన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఓసారి స్ఫురణకు తెచ్చుకుని హ్యాపీగా ఫీలవ్వడం... ఇలానే విశ్వనాథ్ దినచర్య సాగుతుండేది. టీవీల్లో వచ్చే వంటల కార్యక్రమాలను చూసేందుకు ఇష్టపడేవారు విశ్వనాథ్. జయలక్ష్మికి ఏమో ప్రవచనాలు వినడం ఇష్టం. ఉదయం పదకొండు గంటలవరకూ ఆవిడ ఆ కార్యక్రమాలు చూసేవారు. ఆ తర్వాత రిమోట్ విశ్వనాథ్ చేతికి దక్కేది. ఇక అప్పుడు ఆయన వంటల ప్రోగ్రామ్స్ చూసేవారు. ఇలా కాలక్షేపం చేశారు. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు కాగా, చిన్న కుమారుడికి ఇద్దరు అమ్మాయిలు. ఆయన అల్లుడు, కుమార్తె చెన్నైలో ఉంటారు. వీరికి ఓ పాప. మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా గడిపారు విశ్వనాథ్. వయోభారం కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా ఆయన పెద్దగా ఇబ్బంది పడిందిలేదు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘శుభప్రదం’. ఆయన వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం కూడా సంపూర్ణం.. శుభప్రదమే. ప్రశాంతంగా వెళ్లిపోయారు కళాతపస్వి. శుభలేఖ పందొమ్మిదేళ్లకే విశ్వనాథ్‌కి పెళ్లయింది. రెండు పెళ్లి చూపులకు వెళ్లారు. ఒకటి ఆయన మేనమామ తెచ్చిన పెళ్లి సంబంధం. అప్పటికే చెన్నైలో ఉంటున్న విశ్వనాథ్ ఆ సంబంధం కోసం తెనాలి వెళ్లారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత రెండో పెళ్లి సంబంధం కోసం చెన్నై వెళ్లి, అక్కడ జయలక్ష్మిని చూశారాయన. ఆ సంబంధం ఖాయం అయింది. అప్పటికి జయలక్ష్మికి 14 సంవత్సరాలు. చిన్న వయసులో అత్తింట్లో అడుగుపెట్టిన జయలక్ష్మి ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఇద్దరు ఆడపడుచులు, అత్తమామలు, వచ్చే పోయే బంధువులతో జయలక్ష్మికి క్షణం తీరిక ఉండేది కాదు. పైగా విశ్వనాథ్ చేసినవి ఎక్కువగా రిస్కీ ప్రాజెక్ట్స్ కాబట్టి నిర్మాతల దగ్గర పారితోషికం ఇంత కావాలని డిమాండ్ చేయలేకపోయారు. పెద్ద స్థాయిలో పారితోషికం కూడా వచ్చేది కాదు. దీంతో దర్శకుడిగా మారిన పదేళ్ల తర్వాతే కారు కొనగలిగారు. అలాగే ఫలానా నగ బాగుందని భర్తతో జస్ట్ అనేవారు కానీ ఏనాడూ నాకిది కావాలని జయలక్ష్మి అడిగింది లేదు. ‘ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటుటారు. నా విజయం వెనక నా భార్య జయలక్ష్మి ఉంది. సినిమా పనులతో నేను బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నా తరఫు బంధువులందరూ నాకన్నా ఎక్కువగా తననే అభిమానిస్తుంటారు. అంత ఆప్యాయంగా జయలక్ష్మి వారిని చూసుకుంటుంది’ అని భార్య గొప్పతనం గురించి పలు సందర్భాల్లో చెప్పారు విశ్వనాథ్. భర్తని అర్థం చేసుకున్న జయలక్ష్మి, భార్యని అర్థం చేసుకున్న భర్తగా ఈ దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా సాగింది. బాలూ అలిగితే నటుడయ్యాడు కె.విశ్వనాథ్ ప్రాథమికంగా నటుడు. కాని దాసరిలాగా విశ్వనాథ్ తన సినిమాల్లో పాత్రలు చేయలేదు. బాలూ వల్ల చేయాల్సి వచ్చింది. ‘శుభ సంకల్పం’ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిర్మాత. గొల్లపూడి, విశ్వనాథ్ కలిసి స్క్రిప్ట్ తయారు చేశారు. కమల హాసన్ హీరో. హీరోయిన్గా ఆమని. స్క్రిప్ట్ రాసేటప్పుడే ఫలానా పాత్రకు ఫలానా అని రఫ్‌గా భావిస్తూ రాసుకున్నారు– ఒక్క రాయుడు పాత్రకు తప్ప. అది సినిమాలో కమలహాసన్‌కు యజమాని పాత్ర. సరే... స్క్రిప్ట్‌ను బాలూకు చదివి వినిపించే రోజు వచ్చింది. విశ్వనాథ్ స్వయంగా చదివి వినిపిస్తూ ఒక సన్నివేశంలో రాయుడు ఎలా ఆవేదన చెందుతాడో గాద్గదికంగా చదివి వినిపించారు. బాలూకు ఆ పాత్రలో విశ్వనాథే కనిపించారు. గొల్లపూడికి చెప్తే ఆయన కూడా వత్తాసు పలికాడు. అదే ప్రస్తావన విశ్వనాథ్ దగ్గర తెస్తే ‘నేనేమిటి... నటించడం ఏమిటి’ అని తిరస్కరించారు. నటించాల్సిందే అని బాలు పట్టుపట్టాడు. నటించను అని విశ్వనాథ్ గట్టిగా చెప్పేశారు. బాలు అలిగి స్క్రిప్ట్ ఫైల్ విసిరి కొట్టి అలా అయితే సినిమానే చేయను అని వెళ్లిపోయాడు. చివరకు విశ్వనాథ్ బాలు కోరికను మన్నించారు. ‘శుభ సంకల్పం’ విడుదల తర్వాత హఠాత్తుగా తెలుగు వెండితెరకు మరో కేరెక్టర్ ఆర్టిస్టు దొరికినట్టయ్యింది. -
చెడు కొవ్వుతో చేటు.. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం అవే..
చెడు కొవ్వుతో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ (టీఎఫ్ఏ) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వినియోగం వల్ల గుండె రక్తనాళాల్లో చెడు కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం గుండెపోటు మరణాలేనని స్పష్టం చేసింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యకర ఆహారం వల్ల 80 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. భారత్‌లో 2019లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆ ఏడాది 1.44 లక్షల మంది టీఎఫ్ఏ అధిక వాడకం వల్ల చనిపోయారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో టీఎఫ్ఏ అధిక వినియోగం వల్ల జరిగిన 1.78 లక్షల మరణాల్లో 80 శాతం భారత్‌లోనే సంభవించాయి. యూరప్‌లో 1.25 లక్షల మంది టీఎఫ్ఏ అధిక వినియోగం వల్ల చనిపోయారు. 2022లో నిర్వహించిన పరిశోధనలో ఉజ్బెకిస్తాన్ జనాభాలో 12 శాతం మందికి గుండె జబ్బులు ఉన్నాయని తేలింది. ప్రపంచంలో టీఎఫ్ఏ కారణంగా సంభవించే గుండెపోటు మరణాల్లో ఈజిప్ట్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ 11వ స్థానంలో ఉంది. సాక్షి, హైదరాబాద్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ (టీఎఫ్ఏ) అంటే మనం తీసుకునే ఆహారం వల్ల ఏర్పడే కొవ్వు ఆమ్లాలు. ఇది చెడు కొవ్వు. అంటే ఇది ఆరోగ్యానికి హానికరమన్నమాట. గ్రాము ట్రాన్స్ ఫ్యాట్లో 9 కేలరీలుంటాయి. ఆహారంలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బులు సంభవిస్తాయి. వంటనూనెలు, వేపుళ్లు, ప్యాక్ చేసిన లేదా శుద్ధి చేసిన ఆహారాల్లో టీఎఫ్ఏ ఉంటుంది. కేకులు, కుకీలు, కూల్‌డ్రింక్స్ వంటి వాటిల్లోనూ ఉంటుంది. బరువు పెరుగుతారు. గుండె జబ్బులతో పాటు మధుమేహం, రక్తపోటు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరానికి ట్రాన్స్ ఫ్యాట్ అవసరం లేదు. దాన్ని నివారించాల్సిందే. ప్రతి వంద గ్రాముల ఫ్యాట్లో రెండు శాతానికి మించి, కేలరీల్లో 0.5 శాతానికి మించి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండకూడదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరకు టీఎఫ్‌ఏను పూర్తిగా నియంత్రించాలి ప్రపంచలో 60 దేశాలు టీఎఫ్ఏ నియంత్రణ పరిధిలోకి వచ్చాయి. గతేడాది జనవరిలో భారతదేశం టీఎఫ్ఏ నియంత్రణను అమలులోకి తీసుకొచ్చింది. అన్ని దేశాల్లోనూ ఈ ఏడాది చివరికల్లా టీఎఫ్‌ఏను నియంత్రించాలని డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రకారం పాక్షికంగా శుద్ధిచేసిన వంట నూనెలను నిషేధించాలి. పూర్తిగా శుద్ధి చేసిన నూనెలను వాడాలి. ఆహార పదార్థాల్లో టీఎఫ్ఏ ఎంత శాతం ఉందో ప్యాకెట్లపై ముద్రించాలి. నూనె, కొవ్వు వినియోగాన్ని తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో ఇప్పటికీ 32 కోట్ల మంది టీఎఫ్ఏ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. 2019 లెక్కల ప్రకారం గుండెపోటు మరణాల్లో టీఎఫ్ఏ అధిక వాడకం వల్ల ఏఏ దేశాల్లో ఎంత శాతం మరణాలు సంభవిస్తున్నాయంటే.. నివేదికలోని ముఖ్యాంశాలు.. ►మెక్సికోలో కంపెనీలు టీఎఫ్ఏ నియంత్రణ సరిగా చేయకపోతే 40 వేల డాలర్లు జరిమానాగా నిర్ణయించారు. ►ఉజ్బెకిస్తాన్‌లో పామాయిల్ వినియోగం ఎక్కువగా ఉంది. 2000 సంవత్సరంలో ఆ దేశంలో ఏడాదికి 5 వేల టన్నులు వినియోగం ఉంటే, 2019 నాటికి అది పదిరెట్లకు అంటే 50 వేల టన్నులకు చేరింది. ►ప్రపంచంలోని 500 కోట్ల మంది జనాభా టీఎఫ్ఏ నియంత్రణ అమలు చేయని దేశాల్లో ఉన్నారు. తద్వారా వాళ్లు ప్రమాదంలో ఉన్నారు. ►మన దేశంలో 2013లో టీఎఫ్‌ఏపై పాక్షిక నియంత్రణ మొదలైంది. 2020 డిసెంబర్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) టీఎఫ్‌ఏను ఐదు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. 2022 జనవరి నుంచి పూర్తిస్థాయి నియంత్రణ చేపట్టింది. ►ఎఫ్ఎస్ఎస్ఏఐ 2020 డిసెంబర్ నుంచి లేబొరేటరీల్లో టెస్టులు మొదలుపెట్టింది. ఇది ఆయిల్ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. ►అంతర్జాతీయంగా లేబొరేటరీలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై డబ్ల్యూహెచ్ఓ 2021లో ఒక అధ్యయనం చేసింది. మన దేశం సహా కెనడా, బ్రెజిల్, టర్కీ, పాకిస్తాన్, పోర్చుగల్, నైజీరియా, శ్రీలంక, చైనా, ఫిజీ, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే లేబొరేటరీలను పరిశీలించింది. ప్రతి లేబొరేటరీలో ఒకే విధమైన ఆహారపదార్థాలను పరీక్షించినా, వాటి ఫలితాలు మాత్రం ఒకేవిధంగా లేవని గుర్తించింది. దీంతో ఆహార పదార్థాలను పరిశీలించే లేబొరేటరీలపై అనుమానాలు నెలకొన్నాయి. నూనె తగ్గించాలి..పండ్లు, కూరగాయలు తినాలి వంటనూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉపయోగపడతాయి. అందుకే వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి సగటున మనిషి ఏ రూపంలోనైనా సరే రోజుకు 30 గ్రాములకు మించి వంటనూనెలను వాడకూడదు. ఆవిధంగా టీఎఫ్ఏ వినియోగం తగ్గించాలి. జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తగ్గించాలి. సహజ సిద్ధమైన తాజా ఆహారం తీసుకుంటే కూడా మనం ఈ సమస్య నుండి బయటపడొచ్చు. రోజూ 400 గ్రాములకు తగ్గకుండా కూరగాయలు, పండ్లు తినాలి. నూనె వేపుడులకు దూరంగా ఉండాలి. ఎక్కువసార్లు వేడిచేసిన నూనెలు వాడకూడదు. లేనిపక్షంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి గుండె జబ్బు వస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. – డాక్టర్ గుత్తా సురేష్, ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు -
సైలెంట్ కిల్లర్.. పోస్టు కోవిడ్ బాధితుల్లో వెంటాడుతున్న దుష్ఫలితాలు
సాక్షి, విజయవాడ: కరోనా వచ్చి తగ్గిన తర్వాత బాధితుల్లో దుష్ఫలితాలు వెంటాడుతూనే ఉన్నాయి. సైలెంట్ కిల్లర్‌లా ప్రాణాపాయం సృష్టిస్తున్నాయి. కరోనా వచ్చిన వాళ్లలో ఆ వ్యాధి ప్రభావం శరీరంలోని మెదడు, గుండె, కాలేయం, కిడ్నీ, ఎముకలు, చర్మం ఇతర అవయవాలపై మిగిలే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే కరోనాకు గురైన యువతలో అకస్మాత్తుగా గుండెపోటు రావడమో, పక్షవాతానికి గురవడమో, కిడ్నీలు ఫెయిలవడం ఉంటుందని వైద్యులు అంటున్నారు. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై, దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. కరోనాకి గురైన వాళ్లు పూర్తిగా కోలుకున్నామని భావించకుండా ఆరోగ్యరీత్యా ఏమైనా తేడాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. నాడీ మండల వ్యాధులు.. కరోనా వచ్చిన వారిలో మెదడు, నాడీ మండల వ్యాధులు కలగడం సహజమని వైద్యులు అంటున్నారు. పోస్టు కోవిడ్ రోగుల్లో ఎక్కువ మందిలో తలనొప్పి నెలలు తరబడి ఉండటం అతి సాధారణ విషయమంటున్నారు. ముక్కుకి ఎలాంటి వాసన తెలియక పోవడం, నోరు రుచి తెలియక పోవడం కూడా కరోనాలో నాడీ వ్యవస్థకి సంబంధించిన జబ్బేనంటున్నారు. మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు పగిలిపోవడం, పక్షవాతం రావడం, నరాల తిమ్మిర్లు, మంటలు కలగడం అతి సాధారణంగా చెబుతున్నారు. సైకోసిస్, డెలీరియం వంటి మానసిక వ్యాధులు కూడా కలగడం ఎక్కువ అంటున్నారు. శ్యాసకోశ , ఇతర సమస్యలు.. పోస్టు కోవిడ్ రోగుల్లో శ్యాసకోశ వ్యాధుల విషయానికొస్తే వారాలు, నెలలు తరబడి దగ్గు, ఆయాసం ఉంటుందని అంటున్నారు. జీర్ణకోశ సంబంధిత బాధల్లో వికారం, నీళ్ల విరోచనాలు వారాలు, నెలల తరబడి ఉండొచ్చు. కీళ్లనొప్పుల బాధ ఎక్కువుగా ఉండటం, అంతుబట్టని స్కిన్‌రాష్ రావడం జరుగుతుంది. గుండెనాడీ వేగంగా కొట్టుకోవడం, గుండెదడ, ఛాతీలో నొప్పి, చిన్నపాటి పనికే ఆయాసం రావడం, పనిచేయలేక పోవడం వంటి సమస్యలు ఉంటున్న వారిని చూస్తున్నామని వైద్యలు అంటున్నారు. కొందరు అకస్మిక గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నట్లు చెపుతున్నారు. ఇమ్యునిటీ మెకానిజం దెబ్బతినడంతోనే కరోనా వలన ఇమ్యునిటీ మెకానిజం దెబ్బతినడమే దుష్ఫలితాలన్నింటికీ మూలకారణం. కరోనా వచ్చి తగ్గిన వారు ఆరోగ్య నియమాలు పాటించాలి. ఆహార నియమాలు సక్రమంగా పాటించడం అత్యంత అవసరం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఆరోగ్యరీత్యా ఏమైనా తేడాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నాడీ మండల వ్యాధులు ఇంకా పోస్టుకోవిడ్ రోగులకు వెంటాడుతూనే ఉన్నాయి. – డాక్టర్ డి.సుధీర్ చక్రవర్తి, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్టు -
Amarnath Vasireddy: మూడు వారాలుగా దగ్గు, జలుబు ఆగకుండా వస్తున్నాయా?
గత మూడు వారాలుగా మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ జలుబు- దగ్గు ఆగకుండా వస్తోందా? ఒక వేళ తగ్గినా మళ్ళీ తిరగపెడుతోందా..? భయపడకండి. ఇది కరోనా కాదు. ఇప్పుడు లక్షలాది మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మరో వారం పది రోజుల్లో సమస్య దానంత అదే పరిష్కారమైపోతుంది. ఎందుకిలా..? రెండు రకాలు: ►ఎలర్జీలు ►శక్తివంతమయిన బాక్టీరియా వైరస్లు. గమనించారా ? ఒక రోజు విపరీతమయిన చలి. పొగ మంచు. ఉన్నట్టుండి ఇంకో రోజు ఫ్యాన్ వేసుకోకపోతే నిద్రపట్టనంత ఉక్కపోత. వాతావరణంలో విపరీత మార్పులు. పొగ మంచు. దీనికి తోడు వాతావరణ కాలుష్యం. ఫాగ్.. స్మోక్.. రెండూ కలిసి స్మోగ్. దీనివల్ల చాలా మందిలో ఎలర్జీ లు వస్తున్నాయి. జలుబు అయితే తుమ్ములు నెమ్మదిగా వస్తాయి. అదే ఎలర్జీ అయితే ఒక్కో సారి ఆగకుండా వస్తాయి. ఎలర్జీ కి మందు లేదు. బయట మంచు ఉన్నా బెడ్ రూమ్ లో ఉన్న మీకు పచక్ పచక్ అని తుమ్ములొస్తున్నాయా ? అయితే ఎలర్జీ. జస్ట్ రిలాక్స్. మరో వారం లో వాతావరణం సెట్ అయిపోతుంది. అప్పుడు పోతుంది. కాకపోతే ప్రతి వింటర్ లో మీకు ఈ బాధ తప్పదు. వీలైనంతవరకు మంచు అదే స్మోగ్ లో బయటకు పోవద్దు. ఎండ వచ్చి పొగ మంచు తగ్గాక బయటకు వెళ్ళండి. కర్టైన్స్ తో కిటికీలు మూసి ఉంచండి. ఇక రెండో ది మొండి వైరస్ బాక్టీరియాలు. నిజానికి అవి మొండి కావు. అవి వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం.. బయట + మీ శరీరం లోపల.. రెండు చోట్లా ! బయటేమో స్మోగ్. లోపల మీ ఇమ్మ్యూనిటి వీక్. రెండేళ్లుగా మాస్క్‌లు వేసుకొని మీ ఇమ్మ్యూనిటీని బజ్జో పెట్టేశారు. తక్కువ మొత్తంలో వైరస్లు బాక్టీరియాలు సోకాలి. ఇమ్యూనిటీ కణాలు వాటిని చంపాలి. అదే దానికి బాటింగ్ ప్రాక్టీస్. రెండేళ్లు నెట్ ప్రాక్టీస్ లేకుండా బాట్స్మన్ పిచ్‌పైకి దిగితే ? ఇంకేముంది..? బాతే. అదే డక్ అవుట్. ఇప్పుడు అదే జరుగుతోంది. పోనీ లెండి. ఇప్పుడైనా బాటింగ్ ప్రాక్టీస్ అవుతోంది. ఇలా చేయండి. ►దగ్గుమందు తాగొద్దు. దాని వల్ల నష్టం తప్ప లాభం ఉండదు. ►వేడి నీరు తాగాలి. పురుషులు నాలుగు లీటర్లు. స్రీలు మూడు. పిల్లలు వయసు బట్టి ఒకటి నుంచి రేండు లీటర్ లు. వేడి నీటిలో ఉప్పు వేసుకొని నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి. ►అవసరం అయితే అల్లం పసుపు కాషాయం చేసి తాగండి. జస్ట్ టీ కప్పులో కొద్దిగా. రోజుకు ఒక సారి. మూడు నాలుగు రోజులు మాత్రం. ►శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. బాగా నిద్ర పోవాలి. స్ట్రెస్ కి దూరంగా ఉండాలి. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు -
మత్తుగా...మాయాలోకంలో!
►బెంగళూరుకు చెందిన ఇరవై రెండేళ్ల ఐఐటీయన్ శ్రీలత పాతికేళ్లలోపే ఐఏఎస్ అధికారి కావాలన్న కలను గంజాయి కారణంగా భగ్నం చేసుకుంది. ►చండీగఢ్‌కు చెందిన 43 ఏళ్ల ప్రభుత్వరంగ బ్యాంక్ సీనియర్ మేనేజర్ సుస్మిత చౌధురి గంజాయికి అలవాటుపడ్డ తన 12 ఏళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ►గాంధీనగర్‌కు చెందిన 48 ఏళ్ల గృహిణి అనామిక పటేల్ తన 17 ఏళ్ల కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న విషయం తెలుసుకుని పార్టీల్లో తప్ప ఎక్కడా గంజాయి సేవించకూడదని ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. కంచర్ల యాదగిరిరెడ్డి మత్తులో గమ్మత్తుగా దొరికే అనందాన్ని వెతుక్కుంటూ దేశవ్యాప్తంగా గంజాయికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కళాశాల క్యాంపస్‌లు, నైట్ క్లబ్‌లు, పబ్‌లు, పేరు గాంచిన రెస్టారెంట్లు, విశ్వవిద్యాలయాలు, ప్రీమియర్ విద్యాసంస్థల హాస్టళ్లలో గంజాయి సేవించడం సర్వసాధారణంగా మారిపోయింది. అమ్‌స్టర్‌డ్యామ్ డ్రీమ్, మౌలానా క్రీమ్, బాంబే బ్లాక్ లాంటి గంజాయి రకాలు ఇప్పుడు యువత సంభాషణల్లో క్రేజీగా మారాయి. ‘గంజాయి అనేది మింట్, చాక్లెట్ లాగా సాధారణమైపోయింది, తక్షణ ఉల్లాసం కలిగించే మాదకద్రవ్యంగా 12 ఏళ్ల పిల్లలు సైతం దీనిని వాడుతున్నారు’అని అమృత్‌సర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సవీందర్ సింగ్ చెప్పారు. ఢిల్లీని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో గంజాయి వినియోగం శరవేగంగా విస్తరిస్తోందన్నారు, హ్యాష్ అని ముద్దుపేరు గంజాయిని హ్యాష్, హ్యాషిన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఢిల్లీలోని పహర్‌గంజ్ ‘హ్యాషెర్ప్ స్ట్రీట్’గా గంజాయి సేవించే వారికి సుపరిచితమైన స్థలం. గొట్టాల సాయంతో గానీ, సిగరెట్ల మాదిరిగా కాగితంతో చుట్టి గానీ గంజాయిని పీలుస్తుంటారు. దేశవ్యాప్తంగా హ్యాషెర్ స్ట్రీట్ లాంటి కేంద్రాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వేలాదిమంది యువతీ యువకులు గంజాయి సేవించడానికి ఆ సెంటర్లకు వెళ్తుంటారు. ఐఏఎస్ హోదా సాధించాలని కలలు కన్న శ్రీలత వారాంతంలో స్నేహితులతో కలిసి ఢిల్లీలోని హ్యాషెర్స్ స్ట్రీట్‌కు వెళ్లడం ప్రారంభమైన తరువాత తన జీవన సరళి మారిపోయింది. ‘ఖరగ్‌పూర్‌లో ఐఐటీ పూర్తి చేసి సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఢిల్లీ వచ్చి నా కూతురు హ్యాష్‌కు బానిసైంది. బంగారు భవిష్యత్‌ను పాడుచేసుకుంది’అని శ్రీలత తండ్రి గోపాలకృష్ణ హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి నిషేధాన్ని పాలనా యంత్రాంగం సరిగ్గా అమలు చేయడం లేదంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకా పెండింగ్‌లో ఉంది. గంజాయికి విపరీతమైన డిమాండ్ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా గంజాయికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ‘గంజాయి అమ్మకాల గురించి తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు, పోలీసులతో స్మగ్లర్లకు సంబంధాల వల్ల ఏమీ చేయలేకపోతున్నామని’ఆయన అన్నారు. పంజాబ్‌లోని అమృత్సర్, జలంధర్ ప్రాంతాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరూ గంజాయిని నిత్యావసర వస్తువుగా వినియోగిస్తున్నారట. అక్కడ భయానక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్థానిక పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సాయంతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆయన తెలిపారు. గడచిన పదేళ్లతో పోల్చి చూస్తే ఢిల్లీ మాత్రమే కాదు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో దీని వాడకం పాతిక రెట్లు పెరిగిందని ఎన్సీబీ రికార్డులు చెపుతున్నాయి. ఇటీవల నూతన సంవత్సర వేడుకలకు దేశవ్యాప్తంగా కొన్ని వందల టన్నుల గంజాయిని వాడి ఉంటారని అంచనా. న్యూఇయర్ కోసం సిద్ధం చేసి ఉంచిన 2.5 క్వింటాళ్ల గంజాయిని ఒడిశాలో, 3.5 క్వింటాళ్ల గంజాయిని కేరళలో సీజ్ చేశారు. ఒక్క 2022లో ఎన్సీబీ దేశవ్యాప్తంగా 5.5 టన్నుల గంజాయిని ధ్వంసం చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాదక ద్రవ్యాలు, నియంత్రణ విభాగం 2022లో విడుదల చేసిన ఓ నివేదికలో 2010–2020మధ్య భారత్‌లో గంజాయి స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ధర తక్కువ ఉండటమూ ఓ కారణమే సులువుగా దొరకడం, ధర తక్కువగా ఉండటమూ గంజాయి విస్తరించడానికి ప్రధాన కారణమని ఎన్సీబీ అధికారి ఒకరు విశ్లేషించారు. రూ.300 నుంచి రూ.1200 వరకు గంజాయి లభిస్తోందని చెప్పారు. ‘గతంలో 18–20 ఏళ్ల మధ్య యువత దీనికి బానిస అవుతున్నారని అనుకుంటే ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. ఇటీవల కొన్ని కేసులను పరిశీలించినప్పుడు ముంబైలో స్కూల్ పిల్లలు గంజాయిని వాడుతున్నట్లు మాకు తెలిసింది. గంజాయిని సేవిస్తున్న ఓ 13 ఏళ్ల కుర్రాడిని మా టీమ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. గంజాయి తాగితే తప్పేమిటని ఆ బాలుడు ప్రశ్నించాడ’ని ఆ అధికారివాపోయారు. ముంబై. ఢిల్లీ, కోల్‌కతాలో విద్యాసంస్థల సమీపంలోనే ఉన్న పాన్ దుకాణాలు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్నాయి. ముంబైలో ఇటీవల కొన్ని పాన్ షాపుల మీద దాడి చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పబ్‌లలో వెయిటర్లు దీనినే ప్రధాన వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఢిల్లీలోని సాకేత్, వసంత్ కుంజ్, ముంబైలోని కొలాబా, బాంద్రా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, గచ్చిబౌలి, చెన్నైలోని తేనాంపేట, గోపాలపురం, బెంగళూరులోని చిక్‌పేట, జయానగర్ ప్రాంతాల్లో గంజాయి వాడకం విపరీతంగా ఉంది. హైదరాబాద్‌లో వందలాదిగా ఏజెంట్లు హైదరాబాద్‌లో గంజాయి సరఫరా వ్యవస్థ పకడ్బందీగా ఉంది. సరైన వ్యక్తిని సంప్రదిస్తే నిమిషాల్లోనే కావాల్సిన వారి చేతికి అందుతుంది. గంజాయి కొనుగోలు చేయడం ఎంత సులువో.. ఓ ఏజెంట్‌ను పరిచయం చేసుకున్న ఈ ప్రతినిధికి అర్థమైంది. ఇటీవల ఓ పోలీసు అధికారి సాయంతో సాక్షి ప్రతినిధికి ఓ గంజాయి సరఫరా ఏజెంట్‌తో పరిచయమైంది. బాగా నమ్మకం కుదిరిన తరువాత ‘సాక్షి’ప్రతినిధి తనకు గంజాయి కావాలని అడిగితే ఆ ఏజెంట్ చేసిన సూచన ఇలా ఉంది.... ‘ఒంటరిగా కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నడుస్తూ వెళ్లండి అయితే, మీరు అనుమానాస్పదంగా వ్యవహరించవద్దు. గంజాయి కోసం తహతహలాడుతున్నట్లు మీ ఫీలింగ్ ఉండాలి. అప్పుడు మా ఏజెంట్ మీ దగ్గరకు వస్తాడు. నేను ఇప్పుడు చెబుతున్న కోడ్ అతనికి వినిపించేలా చెప్పండి. తక్షణమే మీ చేతిలో ఒక పాకెట్ పెడతాడు’. ఈ ఉదంతం శాంపిల్ మాత్రమే. గంజాయి సరఫరా చేయడానికి నగరంలో ఎన్నో మార్గాలు ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ‘గంజాయి వినియోగాన్ని అరికట్టాలంటే, పాఠశాలలు, కళాశాలలు, ఐటీ పని ప్రదేశాల్లో పరీక్షలను తప్పనిసరి చేయాలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లోని పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ దేశంలో ఇలాంటి పరీక్షలను నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది’అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మెదడు, కాలేయంపై ప్రభావం కొకైన్ వంటి మాదకద్రవ్యాల కంటే గంజాయి సురక్షితమని కొందరు వాదిస్తున్నారు. అయితే, అది ఎంత మాత్రం నిజం కాదని వైద్యులు తేల్చిచెబుతున్నారు. గంజాయిని వినియోగిస్తున్న వారి సంఖ్య ఎలా పెరుగుతుందో దాని మూలంగా మానసిక సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా అంతే పెరుగుతుందని మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ ముంబైకి చెందిన కన్సల్టెంట్ డాక్టర్ ఫెబియన్ ఆల్మెదా అన్నారు. గంజాయి దినచర్యగా మారితే మెదడు, కాలేయం దెబ్బతింటాయని, మానసిక భ్రాంతులు ఏర్పడతాయని చెప్పారు. ఇటీవల కాలంలో మానసిక సమస్యలతో వస్తున్న పిల్లల్లో 50 శాతానికి పైగా మాదకద్రవ్యాల బారిన పడ్డవారేనని ఆయన వివరించారు. -
Anusha: ఇప్పటికే మూడు సర్జరీలు.. బాధను తట్టుకోలేక..
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య సమస్యలతో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డి న ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్ వివ రాల ప్రకారం.. కూకట్పల్లి మైత్రినగర్‌లో నివాసముంటున్న ప్రకాశం జిల్లా తాండూరుకు చెందిన శివారెడ్డి, రాయచూర్‌కు చెందిన హులిగమ్మ అలియాస్ అనూష (27)తో పరిచయం ఏర్పడి ప్రేమ గా మారింది. 2018లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. హులిగమ్మ ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యో గం చేస్తోంది. కాగా శివారెడ్డి ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఓ శుభకార్యం నేపథ్యంలో శివారెడ్డి వెళ్లగా హులిగమ్మ శివారెడ్డికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడగగా అతడు రాలేదు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన శివారెడ్డి గడియ కొట్టగా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి గడియ పగల గొట్టి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే శివారెడ్డి కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారణాలు సేకరించగా ఆమెకు ఇప్పటికే మూడు సర్జరీలు జరిగాయని, బాధను తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని శివారెడ్డి పోలీసులకు తెలిపాడు. మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తల్లి వివాహేతర సంబంధం.. సమాజంలో తలెత్తుకుని తిరగలేమని..) -
పాత వ్యాధులు.. కొత్త సవాళ్లు! మన దేశంలో పంజా విసురుతున్న మీజిల్స్..
కంచర్ల యాదగిరిరెడ్డి ముంబై, రాంచీ, అహ్మదాబాద్, మళ్లప్పురం, హైదరాబాద్.. ఈ ప్రాంతాలన్నింటా ఇటీవల కొత్తగా కలకలం మొదలైంది. దానికి కారణం తట్టు (మీజిల్స్) వ్యాధి మళ్లీ విజృంభించడమే.. ఈ ఏడాది ఏకంగా 16వేల మంది పిల్లలకు తట్టు వ్యాధి సోకడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. టీకాలు వేసుకోకపోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నా.. కేవలం ఒక్కసీజన్‌లో దేశంలో ఇంతమందికి మీజిల్స్ సోకడం అసాధారణమని వైద్య నిపుణులు అంటున్నారు. ఒక్క మన దేశంలోనేకాదు.. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాల్లోనూ కొద్దినెలలుగా వైరల్, బ్యాక్టీరియల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అందులోనూ బాధితులు ఎక్కువగా పిల్లలే. వరుస కోవిడ్ వేవ్‌ల తర్వాత పరిస్థితి చక్కబడుతున్న సమయంలో (చైనా, మరికొన్ని దేశాలు మినహా) ఇతర వైరల్ వ్యాధుల దాడి పెరగడంపై నిపుణులు అనుమానాస్పదంగానే స్పందిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణాలేమైనా ఉన్నాయా అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ముంబైలో మొదలై.. ఈ ఏడాది అక్టోబర్‌లో ముంబైలో పెద్ద సంఖ్యలో తట్టు కేసులు నమోదయ్యాయి. ఆ నెల 26వ తేదీ నాటికి ఇరవై మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు కూడా. తర్వాత రాంచీ, అహ్మదాబాద్, మళ్లప్పురంలో..తాజాగా తెలంగాణలోనూ వందల సంఖ్యలో ఈ వ్యాధి కేసులు నమోదవడం గమనార్హం. ముంబైలో మరణించిన పిల్లల్లో ఒక్కరు మాత్రమే తట్టు నిరోధక టీకా వేసుకున్నట్టు పరీక్షల ద్వారా తెలిసింది. కాకపోతే రెండు డోసులు వేసుకోవాల్సిన టీకా ఒక డోసు మాత్రమే వేసుకున్నట్టు గుర్తించారు. అమెరికాలో పదిరెట్లు ఎక్కువగా.. అమెరికాలో గత మూడు నెలల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అదుపు చేయలేనంతగా తీవ్రమయ్యాయి. చాలామంది పిల్లలు రెస్పిరేటరీ సైనిటికల్ వైరస్ బారిన పడుతున్నారు. పెద్దల్లో సాధారణ జలుబు మాదిరి లక్షణాలతో కనిపించే ఈ వ్యాధి.. పిల్లల్లో మాత్రం ఆందోళనకర స్థాయికి చేరుతుంది. గత ఏడాది కాలంలో ఈ వ్యాధి కనీసం మూడు సార్లు ప్రభావం చూపిందని న్యూయార్క్‌లోని మైమోనైడ్స్ పీడియాట్రిక్ సీనియర్ వైద్యులు రబియా ఆఘా తెలిపారు. రోగుల తాకిడిని తట్టుకునేందుకు ఐసీయూ వార్డు సామర్థ్యాన్ని రెట్టింపు చేశామని పేర్కొన్నారు. మూడు, నాలుగేళ్ల పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధి మామూలుగా తట్టుకోగలిగిన స్థాయిలోనే ఉంటుందని.. ఈసారి మాత్రం లక్షణాలు బాగా తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆమె వివరించారు. ఇక గత నెలలో అమెరికాలో ఇన్ఫ్లూయెంజాతో ఆస్పత్రుల్లో చేరినవారి సంఖ్య గత పదేళ్లలోనే అత్యధికమని అక్కడి వైద్య నిపుణులు చెప్తున్నారు. బ్రిటన్‌లో బ్యాక్టీరియా దాడి.. బ్రిటన్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా కారణంగా 16 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌కు ముందు అంటే 2017 –18 సీజన్లో మాత్రమే ఈస్థాయి ఇన్ఫెక్షన్లు, మరణాలు సంభవించాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియాతో గొంతునొప్పి, టాన్సిలైటిస్ వంటి లక్షణాలు ఉంటాయి. అరుదుగా మాత్రం మెనింజైటిస్ వంటి ప్రాణాలమీదికి వచ్చే ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ ఏడాది మరణాల సంఖ్య మాత్రం అసాధారణంగా పెరిగిందని లండన్‌లోని పిల్లల వైద్యుడు రోని చుంగ్ అంటున్నారు. కోవిడ్ లాక్డౌన్లు కారణమా? పిల్లల్లో ఈ ఏడాది వైరల్ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుండటం వెనుక కోవిడ్ సమయంలో విధించిన లాక్డౌన్లు కారణం కావచ్చని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్డౌన్లు విధించాయి. చాలా దేశాల్లో పిల్లలను పాఠశాలలకు, నర్సరీలకు పంపలేదు. వారంతా ఈ ఏడాది మళ్లీ పాఠశాలలకు, నర్సరీలకు వెళుతున్నారు. ఇది ఆర్ఎస్వీ, జలుబు, స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా సమస్యలు విజృంభించేందుకు కారణమవుతోందని అంచనా. ఇక కోవిడ్ సోకిన పిల్లల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల కూడా ఈ ఏడాది వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణం కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ►కోవిడ్ వచ్చిన తొలి ఏడాది బ్రిటన్‌తోపాటు అమెరికా, జర్మనీ ఆస్ట్రేలియాల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు బాగా తగ్గిపోయాయని.. ఈ ఏడాది మళ్లీ అధిక సంఖ్యలో నమోదవడం చూస్తే కోవిడ్ లాక్డౌన్లను అనుమానించాల్సి వస్తోందని క్వీన్స్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ కానర్ బామ్ఫర్డ్ తెలిపారు. జర్మనీలో 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆర్ఎస్వీ వ్యాధి 2017–2019 మధ్యకాలం కంటే యాభై రెట్లు ఎక్కువగా నమోదైనట్లు.. న్యూజిలాండ్‌లో 2021లోనే ఆర్ఎస్వీ కేసులు ఎక్కువైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్‌తో బలహీనతకు రుజువులు లేవు కోవిడ్ సోకితే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందని, తర్వాతి కాలంలో వైరల్ సమస్యలు పెరుగుతాయని చెప్పేందుకు ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పిల్లల వైద్య నిపుణురాలు రబియా ఆఘా తెలిపారు. ఈ ఏడాది వ్యాధుల బారినపడ్డ పిల్లలు ఎక్కువగానే ఉన్నా.. వచ్చే ఏడాదికల్లా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఏదేమైనా వ్యాధుల నుంచి పిల్లలను రక్షించుకునేందుకు భౌతిక దూరాన్ని పాటించడం, రద్దీ ప్రాంతాల్లో తిరగకపోవడం, మాస్కులు ధరించడం, గాలి, వెలుతురు బాగా ఆడేలా చూడటం అవసరమని అమెరికాకు చెందిన సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) మళ్లీ హెచ్చరికలు చేయడం మొదలుపెట్టింది. మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. పొంచి ఉన్న టైఫాయిడ్ ముప్పు భారత్‌లో సమీప భవిష్యత్తులో టైఫాయిడ్ జ్వరాలు విరుచుకుపడే అవకాశమున్నట్టు ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ ఇటీవల హెచ్చరించారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.28 – 1.61 లక్షల మందిని బలితీసుకుంటుండగా.. ఇందులో 40శాతం మరణాలు భారత్‌లో సంభవిస్తున్నవే. ఈ వ్యాధి రక్షణకు టీకా ఉన్నప్పటికీ ఖరీదు ఎక్కువ కావడంతో చాలామంది తీసుకోవడం లేదని.. ఫలితంగా రానున్న పదేళ్లలో మరణాల సంఖ్య రెట్టింపు అవుతుందని, వ్యాధి బారినపడే వారి సంఖ్య ఏకంగా 4.6 కోట్లకు చేరుతుందని ఆమె హెచ్చరించారు. టైఫాయిడ్ టీకాను కూడా సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చడం ద్వారా మాత్రమే ఈ ముప్పును ఎదుర్కొనగలమని స్పష్టం చేశారు. టీకా కార్యక్రమాన్ని పటిష్టం చేస్తాం దేశవ్యాప్తంగా తట్టు, ఇతర వ్యాధులు పెరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇవి సీజనల్ వ్యాధులైనప్పటికీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఆయన ఇటీవల హైదరాబాద్‌లో చెప్పారు. టీకాలపై అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా తీసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. -
పోప్‌గా ఎన్నికవగానే... రాజీనామా లేఖ రాసిచ్చా
రోమ్: ఆనారోగ్య కారణాలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే ఏం చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడో వచ్చిందని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ‘‘అందుకే పోప్‌గా ఎన్నికైన వెంటనే త్యాగపత్రం (రాజీనామా లేఖ) రాశా. దాన్ని కార్డినల్ టార్సిసియో బెర్టోనే చేతికిచ్చా. నేను విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే పనికొస్తుందని చెప్పా’’ అని చెప్పారు. ఆయన తాజాగా ఓ వార్తా పత్రికతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తదితరాల వల్ల పోప్ విధులు నిర్వర్తించలేకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా ఈ మేరకు వెల్లడించారు. అలాంటప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పే నిబంధన ఉందని బదులిచ్చారు. రహస్యం బయట పెట్టాను గనుక ఎవరైనా బెర్టోనే దగ్గరికెళ్లి పోప్ రాజీనామా లేఖ చూపించమని అడగవచ్చంటూ చమత్కరించారు. శనివారం 86వ ఏట అడుగు పెట్టిన పోప్ ఫ్రాన్సిస్ కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం తెలిసిందే. ఆయనకు 2021లో పేగు శస్త్రచికిత్స జరిగింది. మోకాలి నొప్పి తీవ్రంగా బాధించడంతో కొద్ది నెలలు వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. ఇప్పుడు చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. మోకాలి నొప్పి బాధ్యతల నిర్వహణకు అడ్డంకిగా మారిందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. మనం తలతో పని చేస్తాం తప్ప మోకాలితో కాదంటూ ఛలోక్తి విసిరారు. వృద్ధాప్య కారణాలతో గతంలో పోప్ బెనెడిక్ట్ రాజీనామా ఫ్రాన్సిస్‌కు ముందు పోప్‌గా ఉన్న బెనెడిక్ట్–16 రాజీనామా చేయడం తెలిసిందే. వృద్ధాప్యం వల్ల బాధ్యతలను సరిగా నిర్వర్తించ లేకపోతున్నానంటూ ఆయన 2013లో రాజీనామా చేసి తప్పుకున్నారు. గత 600 ఏళ్లలో ఇలా బాధ్యతల నుంచి తప్పుకున్న తొలి పోప్‌గా రికార్డు సృష్టించారు. అనంతరం ఫ్రాన్సిస్ పోప్‌గా ఎన్నికయ్యారు. -
జబర్దస్త్ వినోద్‌కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?
జబర్దస్ధ్ షో ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో వినోద్ ఒకరు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌తో పాపులర్ అయిన వినోద్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం బాలేక బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనారోగ్యం వెనకున్న కారణాన్ని బయటపెట్టాడు. 'నాకు లంగ్స్(ఊపిరితిత్తులు)లో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీనివల్లే ఇలా వీక్ అయ్యాను. ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఏసీలో ఎక్కువసేపు ఉండటం, చల్లటీ నీళ్లు తాగడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఇలా అయ్యింది. ఈ సమస్య వచ్చిన కొత్తలో నడవడం కూడా కష్టమైపోయింది. ఆ సమయంలో నాకు ఫ్యామిలీ అండగా నిలబడింది. మెడిసిన్స్ వల్ల హెయిర్ లాస్ కూడా అయ్యిందని, అయితే ప్రస్తుతం తాను కోలుకుంటున్నాను' అని పేర్కొన్నాడు. -
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రసవం సమయంలో మాతా, శిశు మరణాలకు హైరిస్క్ ప్రెగ్నెన్సీయే ప్రధాన కారణమవుతోంది. ఈ క్రమంలో మాతా, శిశు మరణాల కట్టడికి ఇప్పటికే వివిధ చర్యలు చేపడుతున్న సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. హైరిస్క్ గర్భిణులను ప్రసవానికి మూడు, నాలుగు రోజుల ముందే ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలించడం ద్వారా వారికి మెరుగైన ఆరోగ్య రక్షణ కల్పించాలని నిర్ణయించింది. హైరిస్క్ గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలింపునకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటికే పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులకు ప్రభుత్వం 108 అంబులెన్స్‌ల ద్వారా నిమిషాల్లో ఆస్పత్రులకు తరలిస్తూ అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. 2020 నుంచి ఇప్పటివరకూ 108 అంబులెన్స్‌లు 10 లక్షలకు పైగా ఎమర్జెన్సీ కేసులకు హాజరవగా.. ఇందులో అత్యధికంగా 19 శాతం మంది గర్భిణులు ఉండటం గమనార్హం. ఏటా రూ.12 కోట్ల వరకు.. హైరిస్క్ గర్భిణులను ప్రసవానికి ముందే పెద్దాస్పత్రులకు తరలించడం కోసం నెలకు రూ.కోటి చొప్పున ఏడాదికి రూ.12 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని వైద్య శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షల మందికిపైగా గర్భిణులు ఆర్సీహెచ్ పోర్టల్‌లో రిజిస్టర్ అవుతుంటారు. కాగా, వీరిలో 10 శాతం మంది హైరిస్క్‌లో ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 5 వేల వరకూ హైరిస్క్ గర్భిణుల ప్రసవాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అన్ని పీహెచ్‌సీలకు రాబోయే వారం రోజుల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న హైరిస్క్ గర్భిణుల సమాచారం రాష్ట్రస్థాయి నుంచి అందజేస్తారు. సమాచారం ఆధారంగా పీహెచ్సీ సిబ్బంది హైరిస్క్ గర్భిణులను డెలివరీ తేదీకి మూడు నుంచి నాలుగు రోజుల ముందే దగ్గరలోని ఏరియా, జిల్లా, అవసరాన్ని బట్టి బోధనాస్పత్రులకు తరలిస్తారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా యాప్‌ను సిద్ధం చేశారు. హైరిస్క్ గర్భిణి వాహనంలో పెద్దాస్పత్రికి తరలింపు, పెద్దాస్పత్రిలో అడ్మిట్ చేయడం, ప్రసవానంతరం ఫొటోలను యాప్‌లో సిబ్బంది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే యాప్ ట్రయల్ రన్ సైతం పూర్తయింది. చిన్నచిన్న మార్పు చేర్పులను చేస్తున్నారు. అందుబాటులోకి కాల్ సెంటర్ మరోవైపు గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై వాకబు చేయడం కోసం వైద్య శాఖ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ సేవలు ప్రారంభమయ్యాయి. రెండు షిఫ్టుల్లో 80 మంది సిబ్బంది కాల్సెంటర్లో పనిచేస్తున్నారు. రాత్రివేళల్లో అత్యవసర సేవల కోసం కొందరు సిబ్బంది కాల్సెంటర్లో ఉంటున్నారు. గర్భిణులు, బాలింతలకు ఏఎన్సీ, పీఎన్సీ, ఇతర వైద్యసేవల కల్పన, చిన్నారులకు ఇమ్యునైజేషన్ వంటి ఇతర అంశాలను కాల్‌సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు. రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హైరిస్క్ గర్భిణులపై కాల్ సెంటర్ ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మాత, శిశు మరణాల కట్టడి కోసమే మాతా, శిశు మరణాల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో హైరిస్క్ గర్భిణులపై ఫోకస్ పెంచుతున్నాం. వారికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రసవానికి ముందే వారిని పెద్దాస్పత్రులకు తరలించడం కోసం పీహెచ్‌సీలకు నిధులు మంజూరు చేయనున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
Hyderabad: వహ్వా.. జావ!.. అంబలి కేంద్రాలకు క్యూ కడుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: మన ఆరోగ్యం తనం తీసుకునే ఆహార అలవాట్లలో ముడిపడి ఉంటుందన్నది జగ మెరిగి న సత్యం. గతంలో మంచి ఆహారపు అలవాట్లకు దూరంగా ఉన్న నగర వాసులు కరోనా మహమ్మా రి పుణ్యమాని తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా ఏదైనా పార్కులో వాకింగ్, వ్యాయామం చేయడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇలా నగర వ్యాప్తంగా ఏ పార్కులు, కాలనీల్లోని రోడ్లపై ఉదయం వేళల్లో చూస్తే వేలాది మంది జాగింగ్, వాకింగ్, వ్యాయామాలు చేస్తూ కనిపిస్తుంటారు. వీటితో పాటు తినే ఆహారంపై సైతం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నడక ముగిసిన తరువాత జావ(అంబలి)ని తీసుకుంటున్నారు. అంబలి తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తోందని వైద్యులు సైతం సలహాలు ఇవ్వడంతో ఆ దిశగా అలవాటు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరాశ, బడలిక నుంచి విముక్తి పొందేందుకు జావ తాగుతూ సేద తీరుతున్నారు. వీరి కోసం వాకింగ్ సెంటర్లు, పార్కుల వద్ద రాగి, జొన్నలతో తయారు చేస్తున్న జావ సెంటర్లు వెలుస్తున్నాయి. నిజాంపేట్ పరిధిలో పదుల సంఖ్యలో.. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు పార్కు లు, చెరువుల వద్ద జావ విక్రమ కేంద్రాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లోని ఉదయం, సాయంత్రం వేళల్లో జాగింగ్, ఓపెన్ జిమ్‌లలో వ్యాయామం చేసే వారు ఎక్కువగా జావను తీసుకుంటున్నారు. వీటితో పాటు జ్యూస్‌లు, గ్రీన్ టీలను సైతం నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు. ఓపెన్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారం.. జొన్న జావ డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రాగి, జొన్న వంటివి తినడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు శక్తిని ఇస్తా యి. పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఇందులో కాల్షియం తదితర పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఆహారంగా పేర్కొనవచ్చు. పోషక విలువలుండే ఆహారం ఎంతో అవసరం జావ, జ్యూస్‌లు, గ్రీన్ టీ వంటివి వాకర్లకు ఎంతో అవసరం. పురాతన కాలంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించిన ఆ హార పదార్థాలనే నేడు అందరూ ఉపయోగిస్తున్నారు. అత్యధిక పోషక విలువలుండే రాగులు, జొన్నలు మన శరీరానికి ఎంతో అవసరం. నేడు చాలా మంది మధుమేహం వ్యాధిన పడుతున్నారు. రోజు వాకింగ్ చేసిన తరువాత ఒక గ్లాస్ జావ తాగితే దాన్ని నివారించవచ్చు. – చంద్రయ్య, బాచుపల్లి జొన్న, రాగి జావలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి జావను ఒక రోజు తాగా, మంచి రుచిగా అనిపించడంతో ప్రతి రోజు అల్లం టీ తాగే అలవాటును మానుకుని జావ తాగుతున్నాను. వాకింగ్ తరువాత జావ తాగితే శరీరం అంతగా అలసట అనిపించడం లేదు. శరీరానికి శక్తిని ఇచ్చే జొన్న, రాగి జావలను ప్రతి ఒక్కరూ సేవించాలి. – సుధాకర్, ప్రగతినగర్ నిత్యం జావ తాగే వారు పెరుగుతున్నారు జొన్న, రాగులతో చేసిన జావను వాకింగ్ చేసిన తరువాత తాగాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసిన అనంతరం తాగితే మంచిది. తాను తయారు చేస్తున్న జావతో పాటు సజ్జ లడ్డూలను సైతం ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ప్రగతినగర్ ప్రాంతంలో గత ఐదేళుŠాల్గ జావ విక్రయాలు చేపడుతున్నాను. నిత్యం జావ తాగే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. – శ్రీరాములు, జొన్న, రాగి జావ విక్రయదారుడు -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమమ్ డైరెక్టర్
మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం ప్రేమమ్. నివీన్ పౌలీ, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ వంటి నటులను తెలుగు వాళ్లకు దగ్గరయ్యేలా చేసింది ఈ చిత్రమే. 2015లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఇక డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రిన్ వర్క్ కి ప్రతి ఒక్కరూ అలా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన గోల్డ్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇదిలా ఉండగా లేటెస్ట్గా డైరెక్టర్ అల్పోన్స్ లుక్ ప్రేక్షకులను షాక్‌కి గురి చేస్తుంది. ప్రేమమ్ షూటింగ్ సమయంలోనే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన పూర్తిగా బక్కచిక్కిపోయి నెరిసిన గడ్డంతో కనిపిస్తున్నారు. దీంతో ఈయన ఏంటి ఇలా అయిపోయారు అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. తన హెల్త్ గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు అంటూ డైరెక్టర్ అల్పోన్స్ రిప్లై ఇచ్చాడు. కానీ తనకు ఏమైందన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. -
మనోళ్ల బీపీ హై
సాక్షి, హైదరాబాద్: మనవాళ్లను రక్తపోటు సమస్య పట్టి పీడిస్తోంది. దేశంలోని 50 శాతానికి పైగా జనం తమకు అధిక రక్తపోటు ఉన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. బీపీ పేషెంట్లలో 75 శాతం కంటే ఎక్కువ మందికి రక్తపోటు నియంత్రణలో ఉండడం లేదు. ఈ బీపీ స్థాయిలతో వారి రోజువారీ జీవనం అతలాకుతలం అవుతోంది. ఈ సమస్య పేదవర్గాల్లోనూ ఉంది. యువజనుల్లోనూ బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బీపీ గుండెసంబంధిత జబ్బుల్లో ప్రమాదకారిగా, ప్రాణాంతకంగా మారుతోంది. 2001–2022ల మధ్య భారత్‌లోని పెషేంట్లపై నిర్వహించిన ‘సిస్టమాటిక్ రివ్యూ అండ్ మెటా అనాలిసిస్ ఆఫ్ పాపులేషన్ లెవల్ నాన్–ఇంటర్వెన్షనల్ స్టడీస్’లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కేరళలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ–మంజేరీ, కిమ్స్ అల్–షిఫా స్పెషాలిటీ హాస్పిటల్–పెరింతల్మన్న సహా వివిధ బృందాలు జరిపిన పరిశోధనలను, 51 అధ్యయనాలను సమీక్ష నిర్వహించారు. ఈ పరిశీలనలో భాగంగా దాదాపు 15 లక్షల మంది బీపీ పేషెంట్లను పరిశీలించారు. ఈ అధ్యయానికి సంబంధించిన తాజా నివేదిక లాన్సెట్ రీజనల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైంది. అధ్యయనంలోని ముఖ్యాంశాలు.. ►ఇండియాలోని 15–49 ఏళ్ల మధ్యలోని 50 శాతం మందికి తమ బీపీ గురించి తెలియదు ►22.5 శాతం పేషెంట్లలో మాత్రమే బీపీ నియంత్రణలో ఉంటోంది ►భారత్‌లో దక్షిణాదితో పోల్చితే ఉత్తరాదిలో ఈ సమస్యపై తక్కువ అధ్యయనం ►దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో మెరుగైన రీతిలో నియంత్రణ ►పురుషుల్లో నియంత్రణ శాతం తక్కువే ►జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన అలవాట్లతో బీపీ నియంత్రణలో ఉండటం లేదు. నియంత్రణ కోసం.. ►బీపీ నియంత్రణ శాతాన్ని పెంచేందుకు భారత్‌లో సుస్థిర కమ్యూనిటీ ఆధారిత వ్యూహాలు అనుసరించాలి ►సమస్య తీవ్రత గుర్తించేందుకు మరింత మెరుగైన కమ్యూనిటీ స్థాయి డేటా అవసరం ‘సైలెంట్కిల్లర్’గా మారింది... బీపీ పట్ల అప్రమత్తత అవసరం. గతంలో 50, 60 ఏళ్లు దాటితేనే బీపీ, షుగర్ వస్తాయని భావించేవారు. జీవనశైలి మారడం, పాశ్చాత్య పోకడలకు అనుగుణంగా మారిన ఆహార అలవాట్లతో 20–25 ఏళ్ల యువతలో బీపీ కేసులు పెరుగుతున్నాయి. జంక్‌ఫుడ్, అధిక ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్, సోడియం మోతాదు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తెలియకుండానే బీపీ పేషెంట్లుగా మారుతున్నారు. బీపీ నియంత్రణలో లేని వారు డయాబెటిస్, హైపర్టెన్సివ్ రెటినోపతి, కిడ్నీ ఫెయిల్యూర్స్, గుండెపోటు బారిన పడుతున్నారు. విదేశాల్లో అయితే క్రమం తప్పకుండా ఆయా వయసుల వారికి వివిధరకాల పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ పౌరుల ఆరోగ్యం గురించిన వివరాలు, మెడికల్ రికార్డ్స్‌ను భద్రపరుస్తారు. మన దగ్గరా ఆ పద్ధతులు రావాలి. ప్రతి ఒక్కరూ బీపీని తరచూ పరీక్షించుకోవాలి. – డా.ఎ.నవీన్‌రెడ్డి, క్రిటికల్‌కేర్ నిపుణుడు, నవీన్‌రెడ్డి హాస్పిటల్ బీపీ ఉన్నా తెలియడం లేదు.. తెలంగాణలో, హైదరాబాద్‌లో రక్తపోటుల్లో వచ్చే తేడాల గురించి ఎక్కువమందికి అవగాహన ఉండడం లేదు. గ్రామీణప్రాంతాల్లోని 60 శాతం మందికి తమకు బీపీ, షుగర్ ఉన్న విషయమే తెలియడం లేదు. తల కింది భాగంలో నొప్పి, మెడ భారంగా ఉండడం, నిద్రపోయినపుడు ఆక్సిజన్ సరిగా అందక స్లీప్ అప్నీయా, ఉదయం నిద్ర లేచాక కూడా ఫ్రెష్‌గా అనిపించకపోవడం వంటివి బీపీకి కారణాలుగా తెలుసుకోవాలి. బీపీ పెరిగి రక్తనాళాలు చిట్లి, పక్షవాతం బారిన పడే దాకా కూడా కొందరు గ్రహించలేకపోతున్నారు. మద్యం, సిగరెట్లు, మసాలాలతో కూడిన ఆహారం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఇతర చెడు వ్యసనాలు దీనికి కారణం అవుతున్నాయి. బీపీకి సంబంధించి 120/80 సాధారణంగా, 140/90 మధ్యతరహా, 150/100 తీవ్రమైనదిగా పరిగణిస్తాం. చిన్న విషయానికే ఆవేశపడటాన్ని ఆగ్జిలేటరీ హైపర్ టెన్షన్‌గా చూడాలి. – డా. ప్రభుకుమార్ చల్లగాలి, సీనియర్ ఫిజీషియన్, లైఫ్ స్పెషాలిటీస్ నర్సింగ్‌హోం -
భగవంతుడా.. బిడ్డ కోసమైనా బతికించు
17 ఏళ్ల వయసు నిండకముందే పెళ్లి.. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అంతలోనే ఆ ఇల్లాలికి తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి.. భార్య అనారోగ్య విషయం తెలుసుకున్న భర్త కనికరం లేకుండా ఆమెపై దాడి చేసి వెళ్లిపోయాడు. గుండెకు మూడు రంధ్రాలతోపాటు, ముక్కుకు సంబంధించి ఇంకో సమస్య. నిరుపేదరాలైన గృహిణి తల్లిదండ్రుల వద్దకు చేరింది. ప్రాణాపాయ స్థితిలో మంచానికే పరిమితమై వైద్యం చేయించుకునేందుకు దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. సాక్షి, నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని భక్తవత్సలనగర్‌లో నివాసం ఉంటున్న మరియమ్మ, సుబ్బారావు దంపతులు నిరుపేదలు. వారికి ఐదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. వారిలో ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా.. సుభాషిణి ఐదో సంతానం. ఆరో సంతానమైన కుమారుడు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. సుబ్బారావు కూలి పనులు చేస్తుంటాడు. ఏమైందంటే.. సుభాషిణికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఆమెకు ముక్కుల నుంచి రక్తస్రావం జరిగింది. నెల్లూరు ప్రభుత్వ పెద్దాస్పత్రి, కిమ్స్‌లో వైద్యపరీక్షలు చేయించగా గుండెకు రంధ్రాలున్నట్టు తేలింది. దీంతో భర్త భార్యతో గొడవ పెట్టుకుని రోకలి బండతో తల పగులగొట్టి మరో మహిళ వద్దకు వెళ్లిపోయాడు. సుభాషిణికి తీవ్రమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ రావడంతో చెన్నైలో చికిత్స చేయించుకున్నారు. అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి భర్త చేసిన దాడి కారణంగా మెదడు నుంచి ముక్కుకు వచ్చే నరాలు దెబ్బతిన్నాయని తేల్చారు. వారి సూచన మేరకు చెన్నై పూనమలై కేకేఆర్ ఆస్పత్రికి సుభాషిణిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అప్పులు చేసి రూ.3.80 లక్షలతో ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత గుండె వైద్యం కోసం మద్రాస్ మెడికల్ మిషన్ ఆస్పత్రికి వెళ్లగా వారు సీటీ, ఎంఆర్ఐ పరీక్షలు చేసి గుండె సాగిందని (ప్రొలాప్స్), 3 రంధ్రాలున్నట్లు తెలిపారు. వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక మందులు రాయించుకుని నెల్లూరుకు వచ్చారు. అంతలోనే శరీరం మొత్తం అలర్జీ వచ్చింది. తర్వాత సుభాషిణికి మరో అనారోగ్య సమస్య వచ్చింది. ఉన్నట్టుండి ఫిట్స్ రావడం మొదలైంది. మరో వైపు సరైన తిండి లేక మంచానికే పరిమితమైంది. ఆపరేషన్ ఒక్కటే మార్గం సుభాషిణికి వైద్యం చేయించేందుకు తల్లి మరియమ్మ కనిపించిన వారందరిని సాయం అడిగింది. ఎవరైనా నగదు ఇస్తే వైద్యం చేయించింది. రెడ్‌క్రాస్ వారు రూ.5 వేలు సాయం చేశారు. కలెక్టర్ చక్రధర్‌బాబు దృష్టికి విషయం రాగా నారాయణ ఆస్పత్రి వారితో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయాలన్నారు. సుభాషిణిని నారాయణ ఆస్పత్రిలో రెండువారాల పాటు వైద్యం చేశారు. రకరకాల పరీక్షలు చేశారు. స్కిన్ సమస్య తగ్గించారు. అయితే అప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి దాటిపోయింది. కాగా నరాల సమస్యకు, పరీక్షలకు ఆస్పత్రిలో రూ.5 వేల వరకు డబ్బు తీసుకున్నారు. ఫిట్స్ రావడానికి కారణం మెదడులోని ఒక రక్తనాళంలో రక్తం గడ్డ కట్టిందని తెలిపారు. దానిని కరిగించాలని మరో వైపు గుండెకు కూడా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు పేర్కొన్నారు. గుండె ఆపరేషన్‌కు రూ.3.50 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. గుండెకు స్టంట్ వేయడం సాధ్యం కాదని, ఆపరేషన్ ఒక్కటే మార్గమన్నారు. డబ్బుల్లేక.. ప్రస్తుతం సుభాషిణి తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. రోజుకు నాలుగైదు సార్లు ఫిట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మందులు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బుల్లేవు. ఇప్పుడు మందులు వాడడం లేదు. నారాయణ ఆస్పత్రిలో ఐదు నెలల క్రితం చేసిన పరీక్షల్లో కేవలం 40 శాతం మాత్రమే రక్తం శరీరంలో ఉంది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయి శరీరం పాలిపోయింది. మరియమ్మ కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. అయితే కుమార్తె ఆరోగ్య ముఖ్యమని చెబుతోంది. సుభాషిణి తన కుమార్తె ఐశ్వర్య జీవితం గురించి ఆలోచిస్తూ కన్నీరుమున్నీరవుతోంది. సుభాషిణి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అకౌంట్ నంబర్ 911020 42915 ఎస్ఎంబీ బ్రాంచ్, బీవీనగర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏపీజీబీ 0004114 బాధితురాలి తల్లి ఫోన్ నంబర్ : 72889 03283 నా ఆపరేషన్ వాయిదా వేసుకున్నా నాకు కడుపునొప్పి వస్తోంది. పెద్దాస్పత్రిలో చూపించాను. గర్భసంచిలో గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు. నేను ఆపరేషన్ చేయించుకుంటే సుభాషిణి, మనుమరాలు ఐశ్వర్యను చూసే దిక్కులేక కడుపు నొప్పి భరిస్తున్నా. ఆపరేషన్ వాయిదా వేసుకుస్తున్నా. దాతలు స్పందించి సాయం చేస్తే నా బిడ్డకు వైద్యం చేయించుకుని ప్రాణాలు కాపాడుకుంటాను. – మరియమ్మ, సుభాషిణి తల్లి -
ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో..
తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజ జీవితంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఎంటో కూడా తెలియని స్థితితో బాధపడుతున్నారు. కాగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో ప్రసాద్ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. తనదైన స్పాంటేనిటి పంచ్‌లతో ‘పంచ్’ ప్రసాద్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా ఆయన కిడ్నీ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకున్న వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్లో వాడి అందరిని నవ్వించాడు. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ఎప్పుడు ఏ షోలో కనిపించినా ఫుల్ కామెడీ చేస్తూ కడుబ్బా నవ్వించే ప్రసాద్‌ను గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య వేధిస్తోంది. అయినా సరే షోల్లో యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్నాడు. ప్రతివారం డయాలసిస్ చేసుకుంటున్నా సరే తన బాధను బయటకు చెప్పకుండా నవ్వించాడు. అలాంటి పంచ్ ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం దారణంగా మారింది. కనీసం నడలేవని స్థితిలో అతడు ఉన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానల్ షేర్ చేసిన వీడియోలో పంచ్ ప్రసాద్ తీవ్ర నొప్పితో బాధపడుతూ కనీసం లేవలేని స్థితిలో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ చానల్లో కమెడియన్ జోడీ నూకరాజు వ్లాక్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశాడు. చదవండి: నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్న రష్మిక మూవీ! అప్పటి నుంచి స్ట్రీమింగ్? ఇందులో తన ఆరోగ్య పరిస్థితిని బయటకు చెప్పేందుకు పంచ్ ప్రసాద్ ఇష్టం చూపించలేదు. అయినా చాటుగా ఈ వీడియో తీసి ఆయన ఆరోగ్య పరిస్థిని చూపించాడు నూకరాజు. ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్‌గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డాడు. అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రసాద్‌కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్లు నూకరాజు చెప్పుకొచ్చాడు. అభిమానులు కూడా ప్రసాద్‌కి సపోర్ట్ చేయాలని కోరాడు. -
చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. ఉన్నట్టుండి కిందపడిపోయి
చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తూ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్లుండి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండటం మనలో చాలా మంది గమనించి ఉంటాం. ఇలా కింద పడి ఉన్న వ్యక్తుల చేతిలో తాళం చెవులు పెడితే కాసేపటికి తేరుకుని మళ్లీ ఏమీ జరగనట్లు వెళ్లిపోతూ ఉంటారు. దీనినే వాడుకభాషలో వాయి అని పిలుస్తారు. వ్యవహారికభాషలో మాత్రం మూర్చగా పేర్కొంటారు. వైద్యపరిభాషలో ఫిట్స్ లేదా ఎపిలెప్సీగా చెబుతారు. నవంబర్ 17న జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజీ విభాగానికి ప్రతి వారంలో సోమ, గురువారాల్లో రెండు రోజులు ఓపీ నిర్వహిస్తారు. ఇక్కడికి ప్రతి ఓపీ రోజున 250 మంది దాకా చికిత్స కోసం వస్తారు. ఈ లెక్కన నెలకు సగటున 2వేల మంది, ఏడాదికి 24వేల మంది ఓపీలో వైద్యం తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒక ప్రొఫెసర్ డాక్టర్ సి. శ్రీనివాసులు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సౌజన్య, డాక్టర్ శ్యామసుందర్ సేవలందిస్తున్నారు. వచ్చిన రోగుల్లో 20 శాతానికి పైగా మూర్ఛవ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. జనాభాలో ఒక శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల అంచనా. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 45 వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు అంచనా. ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ప్రస్తుతం ఐపీ సేవలతో పాటు ఈఈజీ మిషన్ సేవలు కూడా లభిస్తున్నాయి. ఏడాదికి 15 వేల మందికి ఈఈజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటుగా ఈ పరీక్ష చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి రూ.2వేలు ఖర్చవుతుంది. అవసరమైన వారికి ఎంఆర్ఐ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా ఈఎంజీ, ఐసీయూ ఏర్పాటైతే ఈ విభాగానికి అవసరమైన పీజీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోని న్యూరాలజిస్టులు మరో 15 మంది దాకా ఉన్నారు. వీరి వద్ద కూడా నెలకు మరో 900 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. ఇక నాటు మందులను ఆశ్రయించే వారు వీరికి రెట్టింపు సంఖ్యలో ఉంటారు. మూర్ఛల్లో రకాలు–లక్షణాలు సాధారణ మూర్చలో మొత్తం మెదడు చాలా వరకు దెబ్బతింటుంది. టానిక్ క్లోనిక్‌లో ఆకస్మికంగా స్పృహ కోల్పోవచ్చు. రోగిపడిపోవడం, దీంతో పాటు చేతులు, కాళ్లు కొట్టుకోవడం చేస్తారు. అబ్సెన్స్ లేక సెటిల్ మాలో మూర్ఛలో స్పృహ స్వల్పకాలంపాటు కోల్పోతారు. ఈ దశలో రోగి కొంత కాలం పాటు శూన్యంలోకి చూస్తూ ఉంటారు. మయోక్లోనిక్ మూర్ఛలో ఆకస్మిక, సంక్లిప్త కండరాలు సంకోచాలు సంభవిస్తాయి. ఇవి మొత్తం శరీరమంతా లేదా కొన్ని భాగాలకు సంభవిస్తాయి. అటోనిక్ మూర్ఛలో ఆకస్మిక విచి్ఛన్నం సంభవిస్తుంది. ఆ తర్వాత తక్షణమే కోలుకుంటారు. సరళమైన ఫోకల్ మూర్ఛలో రోగికి చేతులలో, కాళ్లలో కండరాల లాగుట కనిపిస్తుంది. లేదా వినికిడి, దృశ్యం, వాసన, రుచిలో ఆటంకం కలగవచ్చు. సంక్లిష్ట ఫోకల్ మూర్ఛలో రోగి స్పృహ కోల్పోతాడు. రోగికి విచిత్రమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపిస్తాడు. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ప్రతిస్పందన లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. సూక్ష్మ ముడతలు, లేదా ముఖంలో, చేతుల్లో, కాళ్లలో తరచూ లాగుతుంది. మూర్ఛ వ్యాధికి కారణాలు వంశపారంపర్యం, మెనింజైటిస్, రక్తంలో షుగర్ శాతం పెరగడం, తగ్గడం, మెదడుకు గాయాలైనప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు, రక్తంలోని కొన్ని ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మూర్ఛ వస్తుంది. మూర్చ(ఫిట్స్) అంటే.. మూర్చ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ రుగ్మతల సమూహం. మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటీ అసాధారణ పగుళ్ల వల్ల సంభవిస్తుంది. మూర్చలు వాటి కారణం, కేంద్ర స్థానాన్ని బట్టి వర్గీకరించవచ్చు. మూర్చలు తరచుగా కన్వల్షన్స్ లేదా ఎపిలెప్టిక్ ఫిట్స్‌గా సూచిస్తారు. ఇది సున్నా నుంచి 10 ఏళ్లలోపు, 50 నుంచి 70 ఏళ్లలోపు వారికి కలుగుతుంది. ఒక్కోసారి ఏ వయస్సులో వారికైనా రావచ్చు. మూర్ఛవ్యాధి నిర్ధారణ మూర్ఛకు గురైన వారు వైద్యుని వద్దకు వచ్చిన వెంటనే అతని పక్కన ఉన్న వ్యక్తితో జరిగిన సంఘటన గురించి వైద్యులు ఆరా తీసి అది మూర్ఛనా కాదా తెలుసుకుంటారు. నిర్ధారణ కోసం అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఈఈజీ పరీక్షలు చేయిస్తారు. కొన్నిసార్లు వీడియో ఈఈజీ పరీక్ష కూడా చేయాల్సి రావచ్చు. వీటి ద్వారా మెదడులోని ఏ భాగంలో దెబ్బతినడం వల్ల మూర్చ వస్తుందో గుర్తిస్తారు. మందులు వాడితే తగ్గిపోతుంది మూర్ఛ వ్యాధిగ్రస్తులను దాదాపు 75 శాతం మందిని మందులతోనే పూర్తిగా నయం చేయవచ్చు. కేవలం 25 శాతం మందికి మాత్రమే ఆపరేషన్ అవసరమవుతుంది. ఇలాంటి ఆపరేషన్లకు ఎక్కువగా కేరళలోని శ్రీ చిత్ర ఆసుపత్రికి వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం మూర్ఛ వ్యాధికి 25 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. మా విభాగానికి వచ్చిన మూర్ఛ రోగులకు ఉచితంగా మందులు, చికిత్స, వైద్యపరీక్షలు చేయిస్తున్నాం. అయితే వైద్యుల సూచన మేరకు ఇంటి వద్ద మందులు వాడితేనే చికిత్సకు వ్యాధి లొంగుతుంది. – డాక్టర్ సి.శ్రీనివాసులు, న్యూరాలజీ విభాగం హెచ్ఓడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
గతి తప్పితే మతి తప్పినట్టే!
ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు రోజుల తరబడి ముభావంగా మారిపోయారనుకోండి.. అతడు లేదా ఆమె మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు లెక్క! అంతేకాదు.. మామూలు రోజుల్లో ఆడుతూ పాడుతూ చేసే పనులను కూడా అయిష్టంగానో, తప్పదన్న ట్టుగానో చేస్తున్నా, అవసరానికి మించి లేదా చాలా తక్కువగా నిద్రపోతున్నా, బకాసురుడి పెద్దన్నలా అతిగా తింటున్నా, 2,3 ముద్దలతోనే ఇక చాలు అనేస్తున్నా.. ఏవో మానసిక సమస్యలే ఉన్నట్లు భావించాలని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లక్షణాలే కాదు.. ఇంకా బోలెడన్ని ఉన్నాయి. మద్యం, ధూమపానాలను మొదలుపెట్టినా, ఎక్కువ చేసినా, రోజువారీ పనులు పూర్తి చేసుకోవడంలో విపరీతమైన బద్దకం ప్రదర్శిస్తున్నా, అయిష్టత చూపినా మానసిక సమస్యల బాధితులే. ఈ లక్షణాలన్నీ పెద్దగా హాని కరం కాకపోవచ్చు. కానీ ఇతరులను గాయపరచడం లేదా తనను తాను గాయపరచు కోవడం వంటివి తీవ్రమైన మానసిక సమస్యలకు సూచికగా భావించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికీ వినిపించని శబ్ధాలు తమకే వినిపిస్తున్నాయని ఎవరైనా చెబుతున్నా, లేదా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయని చెబుతున్నా, భ్రాంతికి గురవుతు న్నామన్నా అనుమానించాల్సిందేనని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైద్యులతో సంప్రదింపుల తర్వాతే నిర్ధారణ మనిషన్నాక కష్టసుఖాలు ఉండవా? వాటికి స్పందించకుండా ఎలా ఉండటం? అని అనుకుంటున్నారా? అది కూడా నిజమే. అందుకే కేవలం భౌతికపరమైన లక్షణాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తికి మానసిక సమస్య ఉన్నట్లు నిర్ధారణకు రాలేం. శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షలు జరపాల్సి ఉంటుంది. అయితే ఇవి, కనిపించే లక్షణాలకు ఇతర కార ణాలు ఏవీ లేవని నిర్ధారించుకునేందుకు మాత్ర మే చేస్తారు. ఇంకోలా చెప్పాలంటే మానసిక సమస్యలను నిర్ధారించేందుకు నిర్దిష్ట పరీక్షలేవీ లేవు. మానసిక వైద్యులతో సంప్రదింపులు జరిపిన తరువాత మాత్రమే ఈ విషయంలో కచ్చితమైన నిర్ధారణకు రాగలమంటున్నారు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ గౌరవ్ గుప్తా. అలాగే వారి మానసిక స్థితిని, ఆలోచనల తీరు తెన్నులను అర్థం చేసుకునేందుకు సైకలాజికల్ ఎవాల్యుయేషన్ (మానసిక స్థితిని అంచనా వేయడం) చేపడతామని, రకరకాల ప్రశ్నలు వేసి వాటి సమాధానాలను విశ్లేషించడం ద్వారా ఏ రకమైన చికిత్చ చేయవచ్చన్న నిర్ధారణకు వస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మనో సమస్యల నిర్ధారణ కోసం అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ రూపొందించిన ‘డయాగ్నస్టిక్ అండ్ స్టాటస్టికల్ మాన్యు వల్ ఆఫ్ మెంటల్ హెల్త్ (డీఎస్ఎం–5)ను సంబంధిత నిపుణులు ఉపయోగిస్తుంటారు. మంత్రాలతో అయ్యే పనికాదు.. మానసిక సమస్యల చికిత్సకు మంచి మాట ఎంత ఉపయోగ పడుతుందో, మందులూ అంతే బాగా పనికొస్తాయి. కాకపోతే ఏది ఎప్పుడు వాడాలన్న విచక్షణ ఉండాలి. మందులు, మాటలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలను సరి చేసుకునేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. అయితే ఈ అంశాల విషయంలో చికిత్స ఎవరికి వారికే ప్రత్యేకం. ఒకరికి వాడిన పద్ధతి ఇంకొకరికి పనిచేస్తుందన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను కలిపి వాడటం మరింత ప్రభావశీలిగా పనిచేస్తుంది. మంత్రాలు, తంత్రాలతోనో, తాయత్తులు తావీదులతోనో అయ్యే పని అస్సలు కాదు. మాటలతో పరిష్కరించే సైకాలజిస్టులు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, సైకోథెరపిస్టులు ముగ్గురూ మానసిక సమస్యల వైద్యులే. ముగ్గురూ మానసిక సమస్యల పరిష్కారం కోసమే పనిచేçస్తుంటారు. కానీ విధివిధానాలు పూర్తిగా వేర్వేరు.మందులు కాకుండా కేవలం మాటల ద్వారా, కొన్ని ప్రత్యేక పద్ధతుల సాయంతో మానసిక సమస్యలను పరిష్కరించేవారు సైకాలజిస్టులు. కౌన్సెలింగ్, హిప్నాసిస్, ఎన్ఎల్పీ వంటి వాటి ద్వారా చికిత్స అందిస్తారు. మందులు అస్సలు ఇవ్వరు. చట్టం ప్రకారం ఇవ్వకూడదు కూడా. థెరపీలతోనూ సత్ఫలితాలు కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ వంటి పద్ధతులను సైకోథెరపిస్టుల ఉపయోగిస్తుంటారు. మన ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చి, మన ప్రవర్తనను సరిచేసి సమస్యను పరిష్కరించడం కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ. ఇందులోనే కొంచెం భిన్నమైన పద్ధతులను ఉపయోగించే ఇంకో చికిత్సా పద్ధతి డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ. ఇక ఎక్స్పోజర్ థెరపీ విషయానికి వస్తే, ఇందులో సమస్యకు అసలు కారణాన్ని దశలవారీగా పరిచయం చేస్తూ పరిష్కారం వెతకడం. ఉదాహరణకు బల్లి అంటే భయముంటే, ముందుగా బల్లి బొమ్మను చూపి ఆ తరువాత రబ్బరు బల్లిని ముట్టు కోమని, ఆ తరువాత అసలు బల్లిని చూపడం చేస్తారు. ఈ క్రమంలో బల్లి అంటే ఉండే భయం తొలగిపోతుంది. డ్రగ్స్, మద్యం, ధూమపానంతోనూ సమస్యలు మన తల్లిదండ్రులు, ముందుతరాల నుంచి మనకు వచ్చే జన్యువులు, బాహ్య ప్రపంచంలో ప్రభావం చూపే అంశాలు మానసిక వ్యాధులకు ప్రధాన కారణం. జీవనశైలి అలవాట్లు వంటివి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. డ్రగ్స్, మద్యం, పొగ తాగడం, ఇతర అలవాట్లు ఇందులో ముఖ్యమైనవి. కుటుంబంలో లేదా ఉద్యోగం చేస్తున్న చోట పరిస్థితులు, పరిణామాలపై ఎలా స్పందిస్తున్నారన్న దాన్నిబట్టి మానసిక ఒత్తిడిని అంచనా వేయొచ్చు. ఏదైనా సమస్య తలెత్తిన ప్రతిసారీ భయపడి వెనుకంజ వేయడం, లేక ఆవేశంగా స్పందించడం వంటివి ప్రతికూల అంశాలే. నేటి జీవన విధానంలో ఒత్తిడిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది నేర్చుకోవాలి. ఎవరైనా ఎప్పటిలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుసుకుని మానసిక నిపుణుడి దగ్గరకు తీసుకువెళితే వారు తిరిగి సాధారణ జీవనం సాగించే అవకాశం ఉంటుంది. స్వసహాయం కూడా.. మానసిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉన్న ఇంకో పద్ధతి స్వసహాయం.అంటే మనకు మనమే సాయం చేసుకోవడం. సమస్యకు కారణాలను గుర్తించడం, పరిష్కారానికి ఉన్న మార్గాలను చిత్తశుద్ధితో అమలు చేయడం, అవసరమైనప్పుడు ఇతరుల సాయం తీసుకోవడం వంటివి ఈ స్వసహాయ పద్ధతిలో చేసే పనులు. మందులిచ్చేది సైకియాట్రిస్టులే మానసిక సమస్యలకు మందులు ఇవ్వగలిగిన వారు సైకియాట్రిస్టులు మాత్రమే. మనోవ్యాకులతను దూరం చేసేందుకు వీరు యాంటీ సైకాటిక్స్, ఆంగ్జియోలిటిక్ మందులను వాడతారు వీరు. ఆసక్తికరంగా ఇవేవీ సమస్యకు చికిత్స అందించవు. కాకపోతే లక్షణాలు మెరుగుపడేందుకు ఉపయోగపడతాయి అంతే. మనకు ఆనందాన్ని కలుగజేసే సెరటోనిన్ వంటి రసాయనాలు శరీరానికి బాగా ఒంటబట్టేలా చేస్తాయి ఈ మందుల్లో కొన్ని. సకాలంలో స్పందించకపోతే సమస్య తీవ్రం చేస్తున్న పనులను ఇష్టపూర్వకంగా చేయకపోవడం, కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయా లేదా అని సరిచూసుకోలేకపోవడం, ఆలోచనలు భావోద్వేగంతో కూడుకున్నవి కావడం.. ఇలాంటివి ఎవరిలో ఉన్నా వారికి మానసిక నిపుణుల చేత చికిత్స చేయించాలి. ఇతరులతో పోల్చి చూసుకుని బాధపడడం, తమ జీవితం ఏమై పోతుందోననే అనవసర ఆందోళన, ఆదుర్దా పడుతున్న వారు మానసిక అనారోగ్యానికి గురైనట్టు లెక్క. ఇలాంటి వారు మానసిక ఒత్తిళ్ల బారిన పడుతున్నారని గుర్తించి, వాటి పరిష్కార మార్గాలు అన్వేషించకపోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఏ వ్యక్తి అయినా ఒత్తిళ్లతో ఎక్కువ రోజులు ఉంటే మెదడులోని కెమికల్ కాంపోజిషన్ దెబ్బతిని, న్యూరో ట్రాన్స్మీటర్ల పనితీరుపై ప్రభావం చూపి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి వారికి సకాలంలో చికిత్స అందించగలిగితే తేలిగ్గా బయటపడుతారు. -కంచర్ల యాదగిరిరెడ్డి -
ఒత్తిడే శత్రువు.. స్థూలంగా మూడే రకాలు.. ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’
కంచర్ల యాదగిరిరెడ్డి వెర్రి వేయి విధాలు అంటుంటారు. అది ఇది ఒకటి కాకపోయినా మానసిక సమస్యల్లోనూ బోలెడన్ని రకాలున్నాయి. అంతేకాదు మానసిక సమస్యలు ఫలానా వారికే వస్తాయి. ఫలానా వారికి రావన్న మాటే ఉండదని.. ప్రాంతం, జాతి, స్త్రీ, పురుషులు, వయసు, ఆదాయం వంటి వాటన్నింటికీ అతీతంగా ఎవరికైనా రావొచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని.. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం చెడిపోయేందుకు దోహదపడే అంశాల్లో.. మొట్టమొదట చెప్పుకోవాల్సింది సామాజిక, ఆర్థికపరమైన ఒత్తిళ్లు! మార్కులు బాగా రావాలని పిల్లలను డిమాండ్ చేయడం, మిత్రుడిలా విలాసవంతమైన కారు కొనుక్కోవాలన్న విపరీతమైన తపన వంటివి సామాజిక ఒత్తిళ్ల కోవకు వస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. అవసరానికి తగిన డబ్బులు ఉండటం బాగుంటుందిగానీ లేనప్పుడే సమస్య. సమాజంలో ఆర్థికంగా అడుగున ఉన్నవారు మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. 2015లో ఇరాన్లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. పేదరికంలో, వెలివాడలు లేదా ఊరికి దూరంగా ఉండటం వంటివి మానసిక ఆరోగ్యం దెబ్బతినేందుకు అవకాశం కల్పిస్తాయి. మరో అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. బాల్యంలోని అనుభవాలతో.. వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో బాల్యానిది కీలకమైన పాత్ర అని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు విస్పష్టంగా చెప్పాయి. చిన్నతనంలో శారీరక, మానసిక, లైంగిక హింసను ఎదుర్కోవడం. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోవడం లేదా విడిపోవడం, తల్లిదండ్రుల్లో ఎవరైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటం వంటివి పిల్లల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ అంశాలు కొన్నిసార్లు సైకోటిక్ సమస్యలకు దారితీస్తే.. మరికొన్నిసార్లు పీటీఎస్డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్)కు కారణం కావచ్చని పేర్కొంటున్నాయి. జన్యువుల పాత్ర కూడా.. మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. కుటుంబంలో నిర్దిష్ట జన్యువుల్లో మార్పులు కొనసాగుతూంటే వారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జన్యుమార్పులకు మరికొన్ని అంశాలు కూడా తోడైనప్పుడు అవి వ్యాధులుగా పరిణమించే అవకాశం ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే.. ఏదైనా మానసిక సమస్యకు కారణమయ్యే జన్యువులు మనలో ఉన్నా అది తీవ్రమైన సమస్యగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సామాజిక శాస్త్రాల విభాగం 2019 నాటి అధ్యయనంలో పేర్కొంది. ఇక ఇలాంటి నిర్దిష్ట జన్యువులు ఉన్నా, లేకున్నా మానసిక సమస్యలు తలెత్తవచ్చని తెలిపింది. ఇదే సమయంలో కేన్సర్, మధుమేహం, తీవ్రమైన నొప్పి వంటి శారీరక సమస్యలు మనోవ్యాకులత, ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చని వివరించింది. స్థూలంగా మూడే.. ముందుగా చెప్పుకున్నట్టు మానసిక సమస్యల సంఖ్య పెద్దదే అయినా.. కొన్ని సాధారణ లక్షణాలున్న వాటన్నింటినీ కలిపి ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’ డిజార్డర్లు అనే మూడు రకాలుగా విభజించారు. ►ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణమైన మానసిక సమస్య యాంగ్జైటీ డిజార్డర్. దీనికి లోనైన బాధితుల్లో కొన్ని పరిస్థితులు, కొన్ని వస్తువుల విషయంలో విపరీతమైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ పరిస్థితి తప్పించుకునేందుకు వారు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. యాంగ్జైటీ డిజార్డర్‌లో.. సాధారణ యాంగ్జైటీ డిజార్డర్తోపాటు ప్యానిక్ డిజార్డర్, ఫోబియాలు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ), పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) వంటివి ఉంటాయి. ►మూడ్ డిజార్డర్ల విషయానికి వస్తే.. వీటిని డిప్రెసివ్ లేదా అఫెక్టివ్ వ్యాధులని కూడా పిలుస్తారు. వీటిలో బాధితుల మనోస్థితి తీవ్రమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. విపరీతమైన ఆనందం లేదా దుఖం, కోపం వంటి ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. మూడ్ డిజార్డర్లలో.. మనోవ్యాకులత, బైపోలార్ డిజార్డర్, సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్లు ఉంటాయి. ►స్కీజోఫ్రీనియా డిజార్డర్ల గురించి చెప్పాలంటే.. కొంచెం సంక్లిష్టమైన మానసిక సమస్యలన్నీ ఈ కోవకు చెందినవని చెప్పొచ్చు. సాధారణంగా ఈ రకమైన మానసిక సమస్యలు 16– 30 ఏళ్ల మధ్య వయసు లోనే వృద్ధి చెందుతాయి. ఆలోచనలు కుదురుగా ఉండకపోవడం స్కీజోఫ్రీనియా లక్షణాల్లో ఒకటి. చిత్త భ్రమ, పలవరింత, నిస్పృహ వంటివీ దీని లక్షణాలే. -
సిరప్లు తాగి కిడ్నీ సమస్యలతో చిన్నారులు మృతి.. టానిక్లపై బ్యాన్!
ఇటీవలే దగ్గు మందు తాగి చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారు. కాగా, ఈ ఘటన మరువక ముందే ఇండోనేషియాలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిరప్లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఇండోనేషియాలో అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నెల రోజుల వ్యవధిలో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, మృతిచెందిన పిల్లలు.. ఆయా సిరప్లు తీసుకున్న తర్వాతే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, పిల్లలకు సంబంధించిన అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహ్మద్ సయారిల్ మన్సూర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. ఇండోనేషియాలో ఈ ఏడాది ప్రారంభం నుంచి పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. The Indonesian government has announced a ban on all syrup and liquid medicine prescription and over-the-counter sales, after the deaths of nearly 100 children from acute kidney injury this year https://t.co/0rVL5yYGwg — RTÉ News (@rtenews) October 19, 2022 -
అసలే వర్షాకాలం.. లొట్టలేసుకుని పానీపూరి తింటున్నారా?.. జాగ్రత్త!
సాక్షి, మెదక్: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ పానీపూరిని ఇష్టపడతారు. స్పైసీగా ఉండటంతో దీన్ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే చాలా బండ్ల యజమానులు కలుషిత నీటిని వినియోగిస్తుండటంతో ప్రజలు టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతూ విషజ్వరాలతో మంచం ఎక్కుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వెలసిన పానీపూరి బండ్లపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తుండటంతో పలువురు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వర్షాకాలంలో పానీపూరీ తినవద్దని గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్ ప్రకటన ఇవ్వడంతో అందరి దృష్టి పానీపూరిపై పడింది. ఊసేలేని అధికారుల తనిఖీలు ►ఆహారభద్రత చట్టం కింద జిల్లాలో ఫుడ్ సేప్టీ అధికారులు హోటళ్లు, ఇతర తినుబండారాలు అందించే ఏ దుకాణాన్ని అయినా తనిఖీ చేసే అధికారం ఉంది. పురపాలికల్లో వైద్యాధికారులు, గ్రామాల్లో పంచాయతీ అధికారులు తనిఖీ చేయొచ్చు. పెద్దపెద్ద హోటళ్లపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నప్పటికీ తోపుడు బండ్లపై తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ►సిబ్బంది కొరత.. చిరు వ్యాపారుల పొట్టగొట్టడం ఎందుకన్న మానవతా దృక్పథంతో అధికారులు పానీపూరీ, చాట్ బండారాల దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పలు దుకాణాల వారు, తోపుడు బండ్ల వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ►జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ సేప్టీ అధికారులు పానీపూరి బండ్లతో పాటు వీధుల్లో తినుబండారాల దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి యువత, చిన్నపిల్లలకు పానీపూరీ తినడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దుకాణం వద్ద అపరిశుభ్రంగా ఉన్నా రోజూ సాయంత్రం తినడం రివాజుగా మారింది. వర్షాకాలంలో పానీపూరి తినకపోవడమే మంచిది. యజమానులు షాపుల వద్ద పరిశుభ్రంగా ఉంచాలి. శుద్ధమైన నీటినే వినియోగించాలి. ప్రజలు సైతం వారి ఆరోగ్యంపై వారే బాధ్యత తీసుకొని మెలగాలి. – సత్యనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్, సదాశివపేట -
బొద్దు..వద్దమ్మా..! మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం
అందానికి, ఆకృతికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే జీవన శైలిలో వచ్చిన మార్పులతో మగువలు బొద్దుగా మారుతున్నారు. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 29 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలు(హాస్పిటల్): ఇంటి పనితోపాటు పిల్లల బాధ్యత చూస్తూ మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వంట చేసే సమయం లేక కొందరు బయట నుంచి ఆహారాన్ని తెచ్చుకుని ఆరగిస్తున్నారు. కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత అంచనాల ప్రకారం 48 లక్షల జనాభా ఉంది. అందులో మహిళలు 23 లక్షలకు పైగా ఉన్నారు. వీరిలో 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు 16 లక్షల వరకు ఉన్నారు. మొత్తం మహిళా జనాభాలో 29 శాతం అంటే 6.67లక్షల దాకా స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు ఐదో జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడవుతోంది. పట్టణాల్లోనే అధికం.. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లోని మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 32.6 శాతం స్థూలకాయులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేసే వారు అధికం. దీంతో పల్లెల్లో ఊబకాయుల సంఖ్య తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు విరుద్దంగా పట్టణాల్లో పరిస్థితి ఉండడంతో లావైపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ మంది ఇంటి పనిలో యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఒక వైపు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడం, మరోవైపు ఉద్యోగ బాధ్యతలతో కొందరు కొన్నిసార్లు ఒకపూట ఆహారం తీసుకోకపోవడం, తర్వాత తీసుకున్నా ఒకేసారి ఎక్కువ తినడం చేస్తున్నారు. ఫలితంగా వారిలో స్థూలకాయ సమస్య తలెత్తుతోంది. గృహిణిలైతే ఇంట్లో ఒక్కరే ఉండటం, అత్తా, తోడి కోడళ్లు ఉంటే వారితో పొసగకపోవడం వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ఊబకాయం పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జంక్‌ఫుడ్‌తో అసలు సమస్య కార్పొరేట్ కంపెనీలు నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్‌క్రీమ్‌లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్‌గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోనే జొమాటో, స్విగ్గీల ద్వారా జంక్‌ఫుడ్‌ను ఆర్డర్ పెట్టేసి మరీ తెప్పించుకుని తింటున్నారు. దీనికితోడు రెస్టారెంట్లలో విక్రయించి ఆహారాల్లో బిర్యానీదే మొదటి స్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండటం, వీటికితోడు కూల్‌డ్రింక్‌లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మహిళల్లో ఊబకాయం వచ్చేస్తోంది. క్యాన్సర్ వచ్చే అవకాశం సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. బరువు పెరిగితే గర్భాశయంలో నీటి బుడగలు వచ్చి సంతానలేమి సమస్య ఎదురవుతుంది. వీరికి భవిష్యత్‌లో టైప్–2 డయాబెటీస్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యకు హార్మోన్ మాత్రలు ఇవ్వడం వల్ల మరింత ఊబకాయం వస్తుంది. అధిక బరువు వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు సైతం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్లకు కూడా ఊబకాయం దారి తీస్తుంది. –డాక్టర్ కె. కావ్య, గైనకాలజిస్టు, కర్నూలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి తినే ఆహారానికి సరిపడా వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తోంది. ఈ సమస్య నివారణకు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు తగ్గించాలి. ఐస్‌క్రీమ్‌లు, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ మానేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్నే తినేందుకు సుముఖత చూపాలి. ఆహారంలో అధికంగా కూరగాయలు, పండ్లు, నట్స్ ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు, కార్పొహైడ్రేట్లు తగ్గించుకోవాలి. వేళకు భోజనం చేయడం, నియమిత వ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండడం వల్ల ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. –డాక్టర్ జి. రమాదేవి, పోషకాహార నిపుణురాలు, కర్నూలు వ్యాయామం తప్పనిసరి ఎంతైనా తిను...తిన్న దానిని అరిగించు అనేది నేటి తరం వైద్యుల మాట. కానీ తిన్న తర్వాత కూర్చోవడమే పనిగా చాలా మంది మహిళలు ఉంటున్నారు. తినడం ఆ తర్వాత మొబైల్, టీవీలు చూస్తూ కూర్చోవడం వల్ల ఊబకాయం పెరిగిపోతోంది. ఉదయం లేవగానే ఓ గంటపాటు వ్యాయామం చేసే ఓపిక చాలా మందిలో ఉండటం లేదు. కేవలం ఒకటి నుంచి నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే యోగాశ్రమాలు, జిమ్‌లు, వాకింగ్‌కు వెళ్లి శారీరక శ్రమ చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థినులకు ఆటలే ఉండటం లేదు. వీరే అధికంగా ఆహారాన్ని తింటూ ఎక్కువ సేపు తరగతుల్లో గడుపుతున్నారు. వీరిలోనూ సమస్య అధికమవుతోంది. ఇదీ చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సాంకేతికత
‘‘కర్నూలు సిటీలోని గణేశ్‌నగర్ వాసి మహ్మద్ రిజ్వాన్ వెన్నునొప్పితో గాయత్రి ఎస్టేట్‌లోని ఓ న్యూరోఫిజిషియన్ వద్దకు వెళ్లారు. డాక్టర్ ఆరాతీస్తే రోజూ అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మేల్కొని సెల్‌ఫోన్ చూస్తుంటారని తేలింది. ఇతనికి ఇదొక్కటే సమస్య కాదు కంటిచూపు తగ్గడం, విపరీతమైన తలనొప్పి కూడా ఉన్నాయి.’’ ‘‘మనస్విని అనే ఐదోతరగతి చదువుతోన్న చిన్నారి ఏక్యాంపులో నివాసం ఉంటోంది. ఈ వయస్సుకే దృష్టిలోపం వచ్చింది. ఆస్పత్రికి వెళితే కంటిచూపు ‘మైనస్ వన్’ ఉందని అద్దాలు ఇచ్చారు. స్కూలు నుంచి రాగానే సెల్‌ఫోన్, టీవీకి అతుక్కుపోతుందని, గట్టిగా మందలిస్తే భోజనం చేయకుండా మారం చేస్తుందని, తాము ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు’’ సాక్షిప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. 30 ఏళ్ల కిందటతో పోలిస్తే టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా జనజీవనానికి జరిగిన మేలు ఊహలకందనిది. చావు కబురు పంపాలంటే గతంలో టెలిగ్రాం చేయాల్సి వచ్చేది. బంధువులను పండుగల్లోనే, వేసవి కాలం సెలవుల్లోనూ చూడాల్సి వచ్చేది. మధ్యలో మంచిచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలు దిక్కయ్యేవి. ఈ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటోంది! ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్తో ఇంటి నుంచే ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాం. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో దొరుకుతోంది. కావాల్సిన బ్రాండ్ దుస్తులు, వస్తువులు ఏది కావాలన్నా ఆన్లైన్లో షాపింప్ చేస్తున్నాం. వ్యాపార రంగంలో ఆన్లైన్ బిజినెస్ వాటా ఏకంగా 37 శాతం ఉందంటే టెక్నాలజీ ప్రభావం ఏవిధంగా ఉందో స్పష్టమవుతోంది. ఇదే రకంగా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ లేకుంటే రోజువారీ జీవితం నడవని పరిస్థితి నెలకొంది. మనకు తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే అడ్రస్ కోసం ‘గూగుల్’ మ్యాప్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. మరోవైపు నిశితంగా పరిశీలిస్తే టెక్నాలజీని అతిగా వినియోగిస్తూ ఆరోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో 15–32 ఏళ్ల వయస్సున్న యువతీ, యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. పెరుగుతున్న ఒత్తిడి టెక్నాలజీలో ఎక్కువ సమస్యలు వస్తోంది స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్తోనే అని ‘యూరోపియన్ స్పైన్ జర్నల్’ ప్రచురించింది. చిన్న పిల్లలు, టీనేజర్ల మానసిక వికాసంపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వయస్సు వారిలోనే మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటైనవారిలో సాధారణ కంటే ఐదు రెట్లు ఒత్తిడి ఉంటోంది. మొబైల్ఫోన్లను తక్కువగా వాడేవారు సానుకూల ఆలోచనా ధోరణితో ఒత్తిడికి దూరంగా ఉంటే, ఎక్కువగా ఆధారపడే వారు నెగిటివ్ ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లపై ఎక్కువ సమయం గడిపేవారు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందికి తలనొప్పి, మెడ, భుజాల నొప్పి వస్తున్నాయి. ఈ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లేవారు గత నాలుగేళ్లలో ఏకంగా ఐదురెట్లు పెరిగారు. దీంతో ‘అమెరికా ఆప్తాల్మజీ అసోసియేషన్’ ఓ రూల్ ప్రవేశపెట్టింది. కంప్యూటర్లు, సెల్ఫోన్లు వాడేవారు ప్రతీ 20 నిమిషాలకొకసారి కనీసం 20 సెకండ్లు దృష్టి మరల్చాలి. 20 అడుగుల దూరం నడక సాగించాలి. డేంజర్ జోన్లో చిన్నపిల్లలు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ చేసిన ఓ సర్వేలో చిన్నపిల్లలపై టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తేలింది. స్కూలు నుంచి ఇంటికి రాగానే ఫోన్, టీవీకి అతుక్కుపోతున్నారు. దీంతో చదువులో వెనుకబడటం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా సరైన ఫోకస్ లేకపోవడం, వ్యక్తులతో మాట్లాడటం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోయి ఊబకాయం పెరగడం, నిద్రలేమి సమస్య, అగ్రెసివ్ బిహేవియర్‌కు గురవుతున్నారు. ఇవి చిన్న సమస్యలు కాదని, అత్యంత ప్రమాదకరమైనవని ఆ అకాడమీ తల్లిదండ్రులను హెచ్చరించింది. అందుకే 18 నెలల వయస్సు పిల్లలకు టీవీ, ఫోన్ చూపించకూడదు. 2–5 ఏళ్ల పిల్లలు గంటకు మించి టీవీ చూడకూడదు. మరిన్ని అనారోగ్య సమస్యలు.. పరిష్కారాలు ► ఒకే ప్రదేశంలో కూర్చుని కంప్యూటర్ చూస్తూ గడిపేవారికి వెన్ను సమస్యలు అధికమవుతున్నాయి.ఈ నొప్పితో మనిషి ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. చురుకుదనం తగ్గిపోయి పురోగతి సాధించలేకపోతున్నారు. వీరు కనీసం గంటకోసారి లేచి నడవాలి. ► ఫోన్లతో జ్ఞాపకశక్తి క్లీణించింది. గతంలో పదుల సంఖ్యలో ఫోన్ నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ల నంబర్లు కూడా గుర్తులేని పరిస్థితి. లావాదేవీల్లో గతంలో ‘నోటిలెక్కల’తో తేల్చేసేవారు. ఇప్పుడు ఫోన్లో ‘కాలిక్యులేటర్’పై ఆధారపడాల్సిందే! ► మొబైల్‌ఫోన్ ఎక్కువగా వాడటం, సరిగా కూర్చోకుండా టీవీలు చూడటంతో మెడ వెనుక అప్పర్ బ్యాక్‌పెయిన్ వస్తోంది. ► 2019 నుంచి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా పెరిగాయి. రోజూ అర్ధరాత్రి 12 గంటలు, ఒంటిగంట వరకూ నిద్ర మేల్కొని ఉంటున్నారు. జనాభాలో 32 శాతం మంది అర్ధరాత్రి వరకూ ఫోన్లలో గడుపుతున్నారు. ► అనవసర సోషల్ మీడియా యాప్స్ మొబైల్స్‌లో పెట్టుకోకూడదు. ► సెల్‌ఫోన్, టీవీలు ఎక్కువ సమయం, ఎక్కువ లైటింగ్‌లో చూడటం, అతిదగ్గరగా, అతి దూరంగా చూడటం, సరిగా కూర్చోకుండా చూడటం చాలా ప్రమాదకరం. ► నిద్రకు కనీసం గంట ముందు టీవీ, ఫోన్ చూడటం ఆపేయాలి. ► పుస్తకాలు, న్యూస్‌పేపర్ చదవడం తగ్గింది. దీన్ని అలవాటు చేయాలి. బంధువులు, స్నేహితులతో ఎక్కువగా గడపాలి, మాట్లాడాలి. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండేలా ఆటలు ఆడాలి. వ్యాయామాలు చేయాలి. సోమరితనం పెరుగుతోంది ‘టెక్నాలజీ’ అవసరం కోసమే. కానీ బానిసలవుతున్నాం. దీంతో వెన్ను, మెడ నొప్పితో పాటు ‘నిద్ర’ టైంటేబుల్ మారిపోయింది. గతంలో 9 నుంచి 10 గంటల వరకు నిద్రపోయేవాళ్లు. ఇప్పుడు ఫోన్, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. దీంతో శరీరంలో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ అవుతోంది. సోమరితనం ఎక్కువగా వస్తోంది. జ్ఞాపకశక్తిని కోల్పోయి మొద డు మొద్దుబారుతోంది. ఫోన్ నంబర్లతో పాటు కొత్తగా పరిచయమయ్యేవారి పేర్లను కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. పిల్లలు ఆహారం తినాలన్నా ఫోన్లు, టీవీలు చూపించే పరిస్థితి. ప్రస్తుతం ‘డిప్రెషన్ ట్రెండ్’ నడుస్తోంది. చాలామందికి వారు డిప్రెషన్లో ఉన్న సంగతే తెలీడం లేదు. – డాక్టర్ కె. హేమంత్‌కుమార్‌రెడ్డి, న్యూరోఫిజీషియన్ జాగ్రత్త లేకపోతే భవిష్యత్తు ఛిన్నాభిన్నమే టెక్నాలజీ అతి వినియోగంతో ఎక్కువ మానసిక సమస్యలు వస్తున్నాయి. 15–25 ఏళ్ల వయస్సున్న వారికి లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. చదవడం, నేర్చుకోవడంతో నాలెడ్ట్ వస్తుంది. ఇప్పటి పిల్లలు వినోదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చదువులో క్వాలిటీ ఉండటం లేదు. సొసైటీపై కూడా బాధ్యత ఉండటం లేదు. ఉద్యోగాలు సాధించలేని పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్లి ఆల్కాహాల్, సిగరెట్లు, డ్రగ్స్‌కు బానిసయ్యే ప్రమాదం ఉంది. చెడు, మంచి రెండూ నేర్చుకునే అవకాశాలు ప్రస్తుత సొసైటీలో ఉన్నాయి. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తతో ఉండాలి. గారాబాలతో ఏమాత్రం అలసత్వం చేసినా భవిష్యత్‌ను ఛిన్నాభిన్నం చేసినట్లే. డాక్టర్ ఇక్రముల్లా, సైక్రియాట్రిస్ట్, కర్నూలు. -
Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం, శారీరక సమస్యల కారణంగా విధులకు హాజరుకాలేని ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇచ్చేందుకు ఆర్టీసీ ఓకే చెప్పింది. ఈ మేరకు సదరు ఉద్యోగి భార్య/భర్త/పిల్లలకు ఉద్యోగం కల్పించే ‘మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్’ను పునరుద్ధరించింది. అయితే తొలి మూడేళ్ల పాటు తాత్కాలిక పద్ధతిన నియమించి, నిర్ణీత వేతనం (కన్సాలిడేటెడ్ పే) ఇస్తామని.. పనితీరు బాగుంటే ఆ తర్వాత పూర్తి స్థాయి నియామకం చేస్తామని ప్రకటించింది. మూడేళ్ల కింద ఆగిపోయి.. ఆర్టీసీలో 2019కి ముందు వరకు ‘మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్’ అమల్లో ఉండేది. కోవిడ్, ఆర్థిక ఇబ్బందులు, నష్టాల నేపథ్యంలో ఆర్టీసీ దాన్ని నిలిపేసింది. ఇటీవల డీజిల్ సెస్, ఇతర మార్గాల్లో ఆదాయం పెరగడంతో ఈ పథకాన్ని పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆర్టీసీలో ఇలా ఉద్యోగాల కోసం 255 మంది ఎదురుచూస్తున్నారు. మరోవైపు విధుల్లో ఉండగా చనిపోయిన ఉద్యోగుల స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగమిచ్చే కారుణ్య నియామకాల పథకానికి (బ్రెడ్ విన్నర్ స్కీం) కూడా ఆర్టీసీ ఇటీవలే అవకాశం కల్పించింది. అయితే గతంలో ఈ రెండు స్కీముల కింద నేరుగా నియామకాలు చేపట్టేవారు. కానీ ఇప్పుడు తాత్కాలిక, కన్సాలిడేటెడ్ పే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మూడేళ్ల తర్వాత పనితీరు బాగుంటుంటేనే.. అన్‌ఫిట్, కారుణ్య నియామకాలకు సంబంధించి తొలి మూడేళ్ల పాటు తాత్కాలిక నియామకాలు, కన్సాలిడేటెడ్ పే (స్థిరమైన మొత్తం చెల్లింపు) పద్ధతిలో జీతం చెల్లింపు విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తెచ్చింది. ఈ మూడేళ్లలో వారి పనితీరుకు సంబంధించి 38 అంశాలను పరిశీలిస్తారు. వీటిలో సానుకూలత పొంది, మూడేళ్లపాటు ఏటా కనీసం 240 పనిదినాలు విధులకు హాజరైన వారిని మా త్రమే పూర్తిస్థాయి నియమకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. వారి అర్హతలను బట్టి గ్రేడ్–2 డ్రైవర్, గ్రేడ్–2 కండక్టర్, శ్రామిక్, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టుల్లో నియమిస్తారు. గ్రేడ్–2 డ్రైవర్‌కు నెలకు రూ.19 వేలు, గ్రేడ్–2 కండక్టర్‌కు రూ.17 వేలు, మిగతా రెండు పోస్టులకు రూ.15 వేల చొప్పున కన్సాలిడేటెడ్ పేను ఖరారు చేశారు. సీనియారిటీ ప్రకారం ఉద్యోగం సంస్థలో రిటైర్మెంట్ల ఆధారంగా ఖాళీలు ఏర్పడే కొద్దీ వీరికి పోస్టింగ్ ఇస్తారు. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వారిని ముందుగా నియమిస్తారు. మిగతావారిలో ముందు అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ముందు పద్ధతిలో ఎంపిక చేస్తారు. అయితే విధి నిర్వహణలో ఉండి యాక్సిడెంట్లలో గాయపడి, అన్‌ఫిట్ అయినవారి కుటుంబ సభ్యులకు మాత్రం సీనియారిటీతో సంబంధం లేకుండా తొలుత పోస్టింగ్ ఇవ్వనున్నారు. -
కాంగ్రెస్ గడ్డి అంటే తెలుసా? దీనితో అలర్ట్‌గా ఉండకపోతే ఆగమే..
జగిత్యాల అగ్రికల్చర్: పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్న వయ్యారి భామ మొక్కలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి మనుషుల అనారోగ్యానికి కూడా కారణమవుతున్నాయి. పార్థీనియం.. వయ్యారిభామ.. కాంగ్రెస్ గడ్డి.. క్యారెట్ గడ్డి.. నక్షత్ర గడ్డి.. ఇలా రక రకాల పేర్లతో పిలిచే ఈ మొక్కను శాశ్వతంగా నిర్మూలించాలని శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా ఈ మొక్కలే కనిపిస్తున్నాయి. 1950లో మన దేశంలోకి.. 1950లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలతో ఈ విత్తనం మన దేశంలోకి ప్రవేశించింది. అనతికాలంలోనే అంతటా విస్తరించింది. బంజరు, పంట భూములు, జనవాసాలు, రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, పెట్రోల్ బంకులు, కాల్వలు, పొలాల గట్లపైన, బీడు భూములు, బస్ స్టాపులు, పాడుబడ్డ ప్రదేశాల్లో వయ్యారిభామ మొక్కలు పెరుగుతాయి. ఇది ఏకవార్షిక మొక్క. 90 నుంచి 150 సెం.మీ. ఎత్తు ఉంటుంది. ఒక్కో మొక్క 50 నుంచి 80 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. వైరస్‌లకు ఆశ్రయం వయ్యారిభామ ఒక్క పంటలకే కాదు మనుషులకు, జంతువులకు ఎంతో హాని చేస్తుంది. పంటల దిగుబడిని 40 శాతం, పశుగ్రాస దిగుబడిని 90 శాతం వరకు తగ్గిస్తుంది. ఇది ఉత్పత్తి చేసే పుప్పొడి రేణువులు టమాట, మిరప, మొక్కజొన్న, వంగ పూతలపై పడినప్పుడు వాటిలో ఫలదీకరణం నిలిచిపోతుంది. కొన్ని రకాల వైరస్‌లకు ఆశ్రయమిస్తూ పంట మొక్కల్లో వివిధ రకాల చీడపీడల వ్యాప్తికి కారణమవుతుంది. పార్థీనియం ద్వారా మనుషులకు చర్మవ్యాధులు, కళ్లు ఎర్రబడటం, జలుబు, తీవ్ర జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పీకిన వెంటనే తగులబెట్టాలి పార్టీనియం మొక్కను పూతకు రాకముందే పీకి, వెంటనే తగులబెట్టాలి. పూతకు వచ్చిన తర్వాత చేస్తే వాటి నుంచి విత్తనాలు రాలి, మళ్లీ కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. తాత్కాలిక నివారణ ఇలా.. రోడ్ల పక్కన, ఇంటి పరిసరాల్లో లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలుపు మందును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పార్థీనియం మొక్క మొలకెత్తితే 15 నుంచి 20 రోజుల తర్వాత లీటర్ నీటికి 5 నుంచి 7 మి.లీ. పారాక్వాట్ కలిపి, పిచికారీ చేయాలి. వర్షాలతో ఎక్కువవుతున్నాయి ఎన్నిసార్లు దున్నినా వయ్యారిభామ మొక్కలు శాశ్వతంగా పోవడం లేదు. వర్షాలతో ఎక్కువవుతున్నాయి. రసాయన మందు పిచికారీ చేస్తే, 2, 3 నెలల్లోనే మళ్లీ పెరుగుతున్నాయి. – ఏలేటి జలంధర్ రెడ్డి, ఇటిక్యాల, రాయికల్ మండలం పూతకు వచ్చే ముందే దున్నేయండి వయ్యారిభామ మొక్కలను పూత వచ్చే ముందే దున్నేయాలి. తర్వాత ఆ మొక్కలను ఏరి, కాల్చివేయాలి. వేసవిలో లోతు దుక్కులు చేస్తే కొంత వరకు వీటిని నివారించవచ్చు. – డాక్టర్ పద్మజ, వ్యవసాయ శాస్త్రవేత్త, పొలాస -
మందులు విఫలమైతే కొత్త సమస్యలు
రోగకారక బ్యాక్టీరియాను నిర్మూలించే యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోవడం అతిపెద్ద ఉత్పాతానికి దారితీయనుంది. అవసరానికి మించి యాంటీబయాటిక్స్ ఉపయోగించడం కారణంగా బ్యాక్టీరియాపై వాటి ప్రభావం సన్నగిల్లిపోతోందని రెండు అంతర్జాతీయ అధ్యయనాలు బయట పెట్టాయి. కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో వీటిని ఎవరూ పట్టించుకోలేదు. 2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో దాదాపు 50 లక్షలు ఏఎంఆర్ (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సంబంధిత మరణాలే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయవలసిన సాంక్రమిక వ్యాధుల నియంత్రణ వ్యూహాల్లో మార్పులు తప్పనిసరి. యాంటీబయాటిక్స్‌ను హేతుపూర్వకంగా వాడేలా బలమైన క్రమబద్ధీరణ వ్యవస్థలు అవసరం. అంతర్జాతీయ వైద్య పత్రికల్లో ఈ సంవ త్సరం రెండు ప్రమాదకరమైన కథనాలు ప్రచురితమయ్యాయి. సూక్ష్మజీవులు నిరోధకత పెంచుకుంటున్న విషయాన్ని అవి ఎత్తి చూపాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి వాటి కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి వాడే మందులు పనిచేయడం లేదని తెలిపాయి. టైఫాయిడ్ జ్వరానికి కారణమయ్యే బ్యాక్టీరియా అయిన సాల్మోనెల్లా టైఫీకి వాడే మందులు పనిచేయక పోవడం గురించి ‘లాన్సెట్’ తాజా అధ్యయనం చర్చించింది. జనవరి మొదట్లో లాన్సెట్ ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ బ్యాక్టీరియల్ యాంటీమై క్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ 2019’ అనే మరొక అధ్యయనం కూడా చేసింది. సూక్ష్మజీవుల ఏజెంట్లలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు వాటిపై వాడే మందులు పనిచేయడం లేదని కూడా ఈ అధ్యయనం తెలిపింది. పొంచి ఉన్న విపత్తు గురించి ఈ రెండు అధ్యయనాలు వెల్లడించిన అంశాలను కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, భారతదేశం నుంచి 2016–19 మధ్య టైఫాయిడ్ బ్యాక్టీరియాకు సంబంధించిన జీనోమ్ స్వీక్వెన్స్ను పరిశీలించినందున టైఫాయిడ్‌పై చేసిన తాజా అధ్యయనం చాలా పెద్దదనే చెప్పాలి. 1905 నుంచి 2018 వరకు 70కి పైగా దేశాలనుంచి 4,000 సూక్ష్మజీవి రకాలను పరిశీలించగా, పై నాలుగు దేశాలనుంచి వేరుపర్చిన 3,489 కొత్త సీక్వెన్స్ రకాలను పరిశోధకులు తాజాగా ఆవిష్కరించారు. సూక్ష్మజీవి సంహారకాలకు తట్టుకుని, వివిధ భౌగో ళిక ప్రాంతాలకు బ్యాక్టీరియా వ్యాప్తి చెందిన విధాన్ని వీరు పరిశీలిం చారు. బ్యాక్టీరియా జన్యు ఉత్పరివర్తనాలు సిప్రోఫ్లాక్సాసిన్, ఎరిత్రో మైసిన్ వంటి సాధారణంగా ఉపయోగించే యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్నాయి. గత 30 సంవత్సరాల్లో ఒక ఖండంలో కానీ, ఇతర ఖండాల్లో కానీ యాంటీబయాటిక్స్‌కి నిరోధకత దాదాపు 200 రెట్లు పెరిగిందని గుర్తించారు. జన్యు ఉత్పరివర్తనాలు, వ్యాప్తి మూలాలకు సంబంధించి చూస్తే దక్షిణాసియా 90 శాతం మ్యుటే షన్లతో అతిపెద్ద ప్రాంతంగా నిలిచింది. అలాగే దక్షిణాసియా నుంచి అగ్నేయాసియాకు, దక్షిణాఫ్రికాకు ఈ మ్యుటేషన్లు విస్తరించాయిని తాజా అధ్యయనం తెలిపింది. పైగా యూరప్‌కూ, రెండు అమెరికన్ భూఖండాలకూ ఇవి వ్యాపించాయని కనుగొన్నారు. దీనివల్ల రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టసాధ్యమైపోయింది. చికిత్స చేస్తున్నప్పుడు వైఫల్యాల సంఖ్య పెరిగింది. రోగులు ఆసుపత్రుల్లో గడపాల్సిన వ్యవధి పెరగడంతో ఖర్చు పెరిగింది. మరణాల రేటు కూడా పెరిగింది. నిరోధకత పెంచుకున్న బ్యాక్టీరియా రకాలు వివిధ దేశాలకే కాకుండా వివిధ ఖండాలకు కూడా వ్యాపిం చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయవలసిన సాంక్రమిక వ్యాధుల నియంత్రణ వ్యూహాల్లో మార్పు చేయడం తప్పనిసరి. యాంటీబయాటిక్స్‌కి ఏమాత్రం లొంగని బ్యాక్టీరియా రకాల ఆవి ర్భావం కారణంగా, వ్యాధి నిరోధక పద్ధతులను కూడా మార్చు కోవాలి. టైఫాయిడ్ సాంక్రమికంగా వచ్చే దేశాల్లో టైఫాయిడ్ వ్యాక్సిన్లను కూడా మార్చవలసి ఉంటుంది. ఈ సంవత్సరం మొదట్లో ప్రచురితమైన అధ్యయనం సూక్ష్మజీవి సంహారకాలకు నిరోధకత (ఏఎంఆర్) అంతర్జాతీయ తలనొప్పిగా మారినట్లు పేర్కొంది. దాదాపు 200 దేశాల్లో ఇది పొడసూపటమే కాదు, 20 పైగా బ్యాక్టీరియా వ్యాధికారకాలు కూడా బయటపడ్డాయి. 2019లో చేసిన ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభ వించిన మరణాల్లో దాదాపు 50 లక్షల మరణాలు ఏఎమ్ఆర్ (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సంబంధిత మరణాలే. అంటే బ్యాక్టీరియాను సంహరించే మందులు పనిచేయక ఇన్ని మరణాలు సంభవించాయన్నమాట. వీటిలో నాలుగింట మూడొంతుల మర ణాలు ప్రధానంగా ఆరు బ్యాక్టీరియా రకాల వల్లే సంభవించాయి. ఈ ఆరింటిలో ఈష్చెరిషియా కోలి అనేది ప్రమాదకరమైనదిగా పరిణ మించింది. శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకాయని ఈ అధ్య యనం తెలిపింది. దీన్నే సాధారణ పరిభాషలో నిమోనియా అని పిలుస్తుంటారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆరు కీలక బ్యాక్టీరియాలు అత్యధికంగా మందులకు నిరోధకతను సాధించడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియా నిరోధక యాంటీబయాటిక్స్‌ను డాక్టర్లు అతిగా సిఫార్సు చేయడం లేదా దుర్వినియోగం చేయడం వల్ల సమస్య తీవ్రమైంది. 2016లో అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం అమెరికాలో డాక్టర్లు సిఫార్సు చేసిన యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్లలో 30 శాతం వరకు అనవసరమని తేలింది. జ్వరం, గొంతు నొప్పి, సైనస్ వంటి సాధారణ సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్‌ను సిఫార్సు చేశారని తేలింది. భారతదేశం విషయంలో ఇది మరింత ఎక్కువగానే ఉంటుందనడంలో సందేహమే లేదు. మన దేశంలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో పనిలేకుండా, ఫార్మసిస్టులు, అనధికారిక వ్యక్తులు కూడా వీటిని నేరుగా రోగులకు ఇచ్చేయడం రివాజు. దగ్గు, డయే రియా, పొత్తికడుపు నొప్పి వంటి అతి సాధారణ జబ్బులకు కూడా వీటిని సిఫార్సు చేస్తున్నారు. చెప్పాలంటే ఆసుపత్రుల్లో చేరే ప్రతి వాళ్లకూ వేగంగా ఉపశమించేలా బ్యాక్టీరియా సంహారక మందులను రాసిపడేస్తున్నారు. నాణ్యత లేని మందులు కూడా బ్యాక్టీరియా విస్తరణకు కారణం అవుతున్నాయి. అవసరం లేని చోట వాడుతున్న యాంటీబయాటిక్స్ జన్యు ఉత్పరిపర్తనాలకు దారి తీస్తోంది. దీనివల్ల ఒక ప్రత్యేక ఏజెంట్ కంటే మొత్తం డ్రగ్స్‌కే బ్యాక్టీరియా అలవాటుపడుతోంది. కొన్నేళ్ల క్రితం చేసిన ఒక అధ్యయనంలో, పేదదేశాల్లో వాడే యాంటీబయా టిక్స్‌లో ఎనిమిదింట ఒకటి, మలేరియా మందుల్లో ఐదింట ఒకటి నాణ్యత లేకుండా ఉన్నాయని బయటపడింది. నాణ్యత లేని లేబ రేటరీ పరీక్షలు, డాక్టర్లు సూచించిన చికిత్సను రోగి చివరివరకూ పాటించకపోవడం, యాంటీబయాటిక్స్ని ఇష్టానుసారం మార్చడం కూడా పరిస్థితిని దిగజార్చుతున్నాయి. కోళ్ల పరిశ్రమలో, జంతువుల్లో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం భయానక పరిస్థితిని సృష్టిస్తోంది. మందులను, ఆసుపత్రుల్లో వ్యర్థాలను డిస్పోజ్ చేయడంలో లోపాలతో పాటు కొన్ని పరిశ్రమల వల్ల పర్యావరణం నేరుగా కాలుష్యానికి గురవుతోంది. వాతావరణంలో మానవ, జంతు సూక్ష్మజీవికణాలు కలగలిసిపోతున్నాయి. దీంతో మానవులు, జంతువులలో కూడా బ్యాక్టీరియా వ్యతిరేక నిరోధకత తగ్గిపోతోంది. యాంటీబయాటిక్ మందు అయిన కోలిస్టిన్‌ను దశాబ్దాలుగా పశువులకు ఇస్తూ రావడం వల్ల అవి నేరుగా మానవుల్లో ఇన్ఫెక్షన్లకు దారితీసి బీభత్సం సృష్టించింది. ఇన్ఫెక్షన్కు చివరి ప్రయత్నంగా మాత్రమే కోలిస్టిన్ వాడాల్సి ఉంటుంది. కానీ ఆ అంశానికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రోగక్రిమి నాశకాల శక్తి తగ్గిపోవడానికి సంబంధించి భారత్ మేలుకోవలసిన తరుణం ఆసన్నమైంది. యాంటీబయాటిక్స్‌ను హేతుపూర్వకంగా రాసే, ఉపయోగించే బలమైన క్రమబద్ధీరణ వ్యవస్థలు అవసరం. వీటి ఉత్పత్తిలో నాణ్యతను తప్పక పాటించేలా చూడాలి. ‘ఏఎంఆర్’ను కనుగొని పర్యవేక్షించే పద్ధతులను ప్రారంభిం చాలి. యూరప్, అమెరికాల్లో లాగా మన ఆసుపత్రుల్లో సాంక్రమిక వ్యాధుల విభాగాల ప్రత్యేక వ్యవస్థను తప్పక ఏర్పాటుచేయాలి. అప్పుడే అధికంగా యాంటీబయాటిక్స్ ఉపయోగించడాన్ని నియంత్రించడం, పర్యవేక్షించడం సాధ్యపడుతుంది. రాకేశ్ కోచర్ వ్యాసకర్త మాజీ అధ్యక్షుడు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విషాదం.. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత..
Gudipudi Srihari Passed Away: ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (జులై 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గతేడాది నవంబర్‌లో శ్రీహరి భార్య లక్ష్మీ మరణించారు. అయితే భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన ఆయన ఇంట్లో జారి పడటంతో తొంటి వెముక విరిగింది. దీంతో నిమ్స్ ఆస్పత్రిలో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అయితే ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. శ్రీహరి కుమారుడు స్వదేశానికి వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం. గుడిపూడి శ్రీహరి 1968లో 'ది హిందూ'కు కంట్రిబ్యూటర్‌గా పాత్రికేయ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అనంతరం ఈనాడు, ఫిల్మ్ ఫేర్ వంటి పత్రికలలో పనిచేశారు. హైదరాబాద్ ఆల్ ఇండియఆ రేడియోలోనూ న్యూస్ బ్రాడ్ కాస్టర్‌గా రాణించారు. సుమారు 55 ఏళ్లపాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా చిత్ర పరిశ్రమకు సెవలందించారు. 1969 నుంచి ది హిందూ పత్రికలో రివ్యూలు రాయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక తెలుకు సినిమాలకు రివ్యూలు రాశారు. 1985లో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు అందుకున్న 'మాకూ స్వాతంత్య్రం కావాలి' సినిమాకు శ్రీహరి మాటలు రాశారు. 2013 సంవత్సరానికి గానూ ఆయనకు తెలుగు విశ్వవిద్యాలయం 'పత్రికా రచన'లో 'కీర్తి పురస్కారాన్ని' ప్రకటించింది. గుడిపూడి శ్రీహరి మృతిపట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ? హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. -
పన్నేండేళ్ల బాలుడికి మాయదారి రోగం.. కుమారుడిని బతికించాలని వేడుకోలు
సహచర మిత్రులతో సరదాగా గడపాల్సిన ఆ బాలుడిని మాయదారి రోగం (లుకేమియా) దహిస్తోంది. రోజురోజుకూ ఒంట్లోని రక్తం తగ్గుతుండడంతో పసివాడు నరకయాతన అనుభవిస్తున్నాడు. వైద్యం చేయించే స్థోమత తండ్రికి లేకపోవడంతో మనసున్న మారాజులు ముందుకు వచ్చి కుమారుడిని బతికించాలని వేడుకుంటున్నాడు. సాక్షి, కోదాడ(నల్గొండ): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన చేకూరి రమేష్‌కు కుమార్తె శ్రీవల్లి (14), కుమారుడు సాగర్ ఉన్నారు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది, ఏడవ తరగతి చదుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రమేష్ భార్య కొన్నేళ్ల క్రితం విడిపోయి వేరేగా ఉంటోంది. రమేష్ లారీడ్రైవర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. సాగర్ అనారోగ్యం బారిన పడడంతో.. కొంతకాలంగా సాగర్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. వంట్లో నలతగా భావించి తండ్రి స్థానికంగా వైద్యం చేయించేవాడు. అయితే, ఏప్రిల్ సాగర్ ఆరోగ్యం పూర్తిగా క్షణించిడంతో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించడంతో లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)గా వైద్యులు నిర్ధారించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా 45రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. చదవండి: రంగారెడ్డి: టీఆర్ఎస్ నేతల్లో పీకే ఫీవర్! వైద్య పరీక్షలకే అప్పుచేసి.. రమేష్‌ది పేద కుటుంబం. అతడికి ఇతడి ఉండేందుకు ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు లేవు. లారీ డ్రైవర్‌గా వెళ్లిన క్రమంలో సోదరుడి ఇంట్లో పిల్లలను ఉంచి జీవనం సాగిస్తున్నాడు. ఉన్నపలంగా కుమారుడు అనారోగ్యం బారిన పడడంతో డ్రైవర్ విధులకు వెళ్లకుండా బాలుడి బాగోగులు చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సాగర్ వైదానికి తన వద్ద ఉన్న కొద్ది మొత్తంతో పాటు అప్పు చేసి నెట్టుకొచ్చాడు. 9నెలల పాటు వైద్యం అందితేనే.. లుకేమియా(బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్న సాగర్‌కు రెండు రోజులకు ఒకమారు పరీక్షలు నిర్వహించి అవరం మేరకు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అలా తొమ్మిది నెలల పాటు చికిత్స అందితేనే మహమ్మారి బారి నుంచి బయటపడతానని పేర్కొంటున్నారు. అందుకు రూ. 5లక్షల వరకు ఖర్చు అవుతాయని తెలిపారు. అంతపెద్ద మొత్తం తన వద్ద లేదని ఓ వైపు కుమారుడి వేదన చూడలేకపోతున్నానని, రోదించడం తప్ప మరే దారి కనిపించడం లేదని వాపోతున్నాడు. దయార్థ హృదయం కల వారెవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తే తన కొడుకు ప్రాణాలు దక్కుతాయని రమేష్ ప్రాథేయపడుతున్నాడు. కొడుకు ప్రాణాలు కాపాడాలి ఒక్కగానొక్క కొడుకు మాయదారి జబ్బు బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నాది నిరుపేద కుటుంబం. పూర్తిస్థాయిలో వైద్యం అందించే స్థోమత నాకు లేదు. దానగుణం గల వ్యక్తులు స్పందించి తన కుమారుడి ప్రాణాలు కాపాడాలి. పూర్తిస్థాయిలో వైద్యం అందాలంటే రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. – చేకూరి సాగర్, చిన్నారి తండ్రి, ఆకుపాముల సాయం చేయాలనుకుంటే.. సాగర్ సోదరుడు బాలాజీ బ్యాంకు ఖాతా : 30543275599 ఎస్బీఐ, ఆకుపాముల బ్రాంచి ఐఎఫ్ఎస్సి కోడ్ : ఎస్బీఐయన్0002562 ఫోన్‌పే, గూగుల్‌పే నెం : 96761 37554 -
పోస్ట్ కోవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
పోస్ట్ కోవిడ్ సమస్యలు (లాంగ్ హాలర్స్ సిండ్రోమ్) ఇప్పటికీ చాలామందిని వేధిస్తూనే ఉన్నాయి. ఇందులో ఇతరత్రా సమస్యలతో పాటు నరాలకు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చేతులు, కాళ్లు లాగడం వంటివి కొనసాగడంతో పాటు కళ్లు తిరగడం ప్రధాన సమస్యగా మారింది. పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత కూడా కొందరిలో కళ్లు తిరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలపై సిటీ న్యూరో ఆసుపత్రికి చెందిన ఈఎన్టీ న్యూరో ఆటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ డాక్టర్ లాస్య సాయి సింధు కరోనా వైరస్ నేరుగా మన శరీర సమతుల్యతను నియంత్రించే పలు రకాల నరాలను కూడా దెబ్బతీస్తోంది. దానివల్ల మన మెదడులోని ఎమోషనల్ సెంటర్ (మెదడు అంతర్భాగంలోని వ్యవస్థ) అనేది ప్రభావితం అవుతుంది. ఈ సెంటర్‌కు మన శరీర సమతుల్యతను నియంత్రించే నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. మెదడులోని ఒకటో నరం వాసనకు సంబంధించినది, ఎనిమిదో నరం (వెస్టిబిలో కాక్లియర్ నర్వ్) వినికిడికి సంబంధించినది అయితే ఏడోది పేషియల్ (ముఖం) నర్వ్. ఈ నరాలు ప్రభావితం అయినప్పుడు వాసన కోల్పోవడం, వినికిడి శక్తిని కోల్పోవడం, మూతి వంకర పోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్నాక ఎనిమిది నెలలు గడిచినా వాసన తిరిగి రానివారున్నారు. కొందరికి చెడు వాసన రావడం. కిరోసి, డిటర్జెంట్ వాసనలు వచ్చినవారున్నారు. కొందరిలో ఒక చెవి వినికిడి శక్తి పూర్తిగా (సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్) పోతుంది. చాలామంది చెవిలో కుయ్ మనే శబ్దం వస్తుంటుంది. కొందరిలో తట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. 22.3 శాతం మందికి వర్టిగో సమస్యలు... పోస్ట్ కోవిడ్ సమస్యల్లో ప్రధానమైనది శరీరం స్థిరత్వాన్ని కోల్పోవడం. కళ్లు తిరగడం ఇందులో ముఖ్యమైనది. తలనొప్పి, తల దిమ్ముగా ఉండటం, బరువుగా అన్పించడం, పడుకోవాలనిపించడం ఇతర లక్షణాలు. కొందరికి పడుకున్నా నిద్రరాదు. నీరసంగా అనిపిస్తుంది. కొందరు నడుస్తూ నడుస్తూ తూలిపోతారు. కొందరికి వాంతులవడం జరుగుతుంది. ఈ విధమైన పోస్ట్ కోవిడ్ సమస్యలపై మన దేశంలో ఒక సర్వే జరిగింది. దాని వివరాలు ఈ ఏడాది ఇండియన్ జర్నల్ ఆఫ్ ఓటోలారింగాలజీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జరీలో ప్రచురితమయ్యాయి. 18–60 వయస్సు వారిపై సర్వే జరగ్గా, అందులో 22.3 శాతం మందికి వర్టిగో సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. కుటుంబసభ్యులపైనా ప్రభావం.. కోవిడ్‌తో దేశంలో అనేకమంది చనిపోయారు. అలా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు మానసికంగా దెబ్బతిన్నారు. మెదడుపై ప్రభావం చూపడం వల్ల కొందరిలో కళ్లు తిరుగుతుంటాయి. కింద పడిపోతారు. కొందరు బయటకు వెళ్లడానికి భయపడతారు. కొందరు సెన్సిటివ్‌గా మారిపోతారు. చిన్న చిన్నవాటికే కోపం, ఏడుపు వస్తాయి. కొందరిలో ఏదో భయం.. నేను చనిపోతానా? నా మెదడులో ఏమైనా సమస్య ఉందా అన్న భావన ఏర్పడుతుంది. పడిపోతామా అన్న భయంతో చాలామంది ఇంట్లో పడుకుంటారు. వయస్సు మళ్లినవారు మంచానికే పరిమితం అవుతారు. సరైన ఎక్సర్సైజులే మందు వర్టిగో సమస్యలను గుర్తించేందుకు డాక్టర్ చేసే శారీరక పరీక్ష కీలకం. వీహిట్, వీఎన్‌జీ పరీక్షల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. బీపీపీవీ (బినైన్ పారాక్సిస్మల్ పొజిషినల్ వర్టిగో) అనేది చాలా సాధారణంగా కనిపిస్తుంది. బీపీపీవీలో బ్యాలెన్స్‌కు సంబంధించిన నరం ప్రభావితం అవుతుంది. చెవి లోపల కొన్ని కాల్షియం కణాలు అతుక్కొని ఉండా ల్సినవి విడిపోతాయి. దీనివల్లనే కళ్లు తిరుగుతుం టాయి. బీపీపీవీ అనగానే ఎప్లీ మానోవర్ ఎక్సర్ సైజ్ అనే ఒకే రకమైన పద్ధతిలో చికిత్స చేస్తారు. ఇది సరిగ్గా చేయకుంటే సమస్య మరింత పెరుగుతుంది. చికిత్సలో ప్రధానంగా ఏ వైపున సమస్య ఉందో తెలుసుకోవాలి. దాని తర్వాత ఏ కెనాల్ ప్రభావితం అయిందో తెలుసుకోవాలి. దానికి సంబంధించిన సరైన ఎక్సర్సైజ్ చేయించాలి. మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు వేరే చికిత్సలు ఉంటాయి. ఎక్సర్సైజులు ఉంటాయి. మాత్రలతో అవసరం ఉండదు. సరైన ఎక్సర్‌సైజ్‌తో సెట్ అవుతుంది. -
నొప్పిలోనూ చిన్న చూపా?!
అన్నింటా వివక్ష ఉన్నట్టే.. ఆరోగ్య చికిత్సలోనూ స్త్రీల పట్ల వివక్ష ఉందా?! ఎందుకంటే, పురుషుల కంటే స్త్రీల నొప్పిని వైద్యులు తక్కువ అంచనా వేస్తారని ఇటీవల జరిగిన పరిశోధనలు సూచిస్తున్నాయి. నొప్పితో బాధపడుతున్న పురుషుడిని వాస్తవికవాదిగా చూస్తే, స్త్రీని హిస్టీరికల్, భావోద్వేగాలకు లోనయ్యేవారిలా చూస్తారని ప్రపంచవ్యాప్తంగా జరిగిన 77 అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీల ఆరోగ్యం విషయంలో ఇంటి నుంచి ఆసుపత్రుల దాకా ప్రపంచవ్యాప్తంగా ఎందుకీ వివక్ష?! తలనొప్పి, కడుపునొప్పి, కాలు, చెయ్యి, మెడ, నడుము నొప్పి.. బాధిస్తోందని హాస్పిటల్‌కి వెళితే అక్కడ అవసరానికి సరైన చికిత్స లభిస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ చాలా మంది మహిళలు కొత్తరకమైన హింసను ఎదుర్కొంటున్నారని, ఆరోగ్య రక్షణ అందించేవారు పురుషుల కంటే స్త్రీలలో నొప్పిని తక్కువ అంచనా వేస్తున్నారని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలియజేసింది. ఈ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీనా దోషి ‘స్త్రీ, పురుష తేడా లేకుండా అందరిలోనూ తలనొప్పి, న డుము, మెడ నొప్పి, కడుపునొప్పి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నాయి. అయితే, పురుషుల కన్నా స్త్రీలలో వచ్చే నొప్పుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు కూడా పరిశోధనలు ఉన్నాయి. దీని వల్ల కూడా ఇలాంటి ఒక అభిప్రాయం కలగచ్చు’ అంటారు ఆమె. పరీక్షా గదిలోనూ... మియామీ న్యూరోసైన్స్ లేబొరేటరీలో జరిపిన ఒక అధ్యయనంలో దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న రోగుల వీడియోలను చూసినప్పుడు అందులోని వైద్య విద్యార్థులు, వైద్యులు స్త్రీల నొప్పిని పురుషుల కంటే తక్కువ అంచనా వేసినట్టు గుర్తించారు. ‘చేయి విరిగిందని ఎక్స్ రే చూపిస్తే వైద్యుడికి ఒక స్పష్టమైన భావం ఉంటుంది. అదే కడుపునొప్పి లేదా తెలియని ఏదైనా రుగ్మత ఉందని సంప్రదిస్తే అంటే నిర్ధారణ పరీక్షల ద్వారా ఇంకా గుర్తించలేని సమస్య అయితే అప్పుడు నొప్పి తాలూకు అంచనా స్త్రీలో మానసికపరమైనదిగా చూడచ్చు’ అంటారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా ఉన్న జానిస్ సబిన్. నొప్పి తాలూకు సమస్యను అనుభవించే వ్యక్తికి మాత్రమే నిజంగా ఎలా అనిపిస్తుందో తెలుస్తుంది. వాస్తవమా, కాదా అనే విషయాల్లో బేరీజు వేయడంలో కొంచెం తేడా అయితే ఉండొచ్చు’ అని వివరిస్తారాయన. అనుకోని పక్షపాతం వాస్తవానికి డాక్టర్లు ఉన్నదే రోగులకు సాయం చేయడానికి. ‘కానీ, ప్రపంచవ్యాప్తంగా 77 ‘పెయిన్ స్టడీస్’ పరిశీలిస్తే పురుషులను వాస్తవాలు చెప్పేవారిగా చూసే అవకాశం ఉంది. స్త్రీలలో భావోద్వేగాలకు లోన య్యారేమో అని చూసే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో వర్ణవివక్ష కారణంగా ఆడవారిలోనే పక్షపాతం చూపే అవకాశాలూ లేకపోలేదు’ అంటారు టీనా. ఇంటిలోనే వివక్ష.. ‘వైద్యులదాకా వెళ్లడానికి ముందు మన ఇంటి వాతావరణంలోనే చూద్దాం. పురుషుల నొప్పి కన్నా స్త్రీ నొప్పిని ఇంటిలోనే తక్కువ అంచనా వేస్తారు. స్త్రీ నొప్పి అంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని సర్దుబాటు చేస్తారు. అదే మగవారు ‘నొప్పి’ అంటే కొంత అలెర్ట్ అవుతారు. అలాగే, ఇతర ఆరోగ్య నిపుణులు కూడా పురుషులతో పోల్చితే వ్యాయామాలు చేయడం, ఆహార జాగ్రత్తలు పాటించడం.. వంటివి స్త్రీలలో తక్కువ స్థాయిలో ఉన్నాయని నివేదికలు ఇచ్చారు. మానసిక చికిత్స ద్వారా స్త్రీ నొప్పి నుంచి కోలుకోవడానికి ఎక్కువ ప్రయోజనం పొందితే, పురుషులకు మందులు ఎక్కువ అవసరమవుతున్నాయ’ని అంటారు మియామీ విశ్వవిద్యాలయ డైరెక్టర్ ఎలిజబెత్ లోసెన్. అయితే, ఇప్పటికీ పాత మూస పద్ధతుల ఆధారంగానే మహిళల నొప్పి గురించి విశ్లేషిస్తున్నారని, వారి వాస్తవిక దృక్కోణంలోనూ, ఆధునిక జీవన విధానంలోనూ చాలా తేడా వచ్చిదంటున్నారు పరిశోధకులు. చికిత్సలో వివక్ష ఉండదని, వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉండేవారిలో శారీరక నొప్పుల సంఖ్య తక్కువనేది నిపుణుల అభిప్రాయం. ఒత్తిడిని బట్టి చికిత్స బయటకు చెప్పుకోలేని మానసిక సమస్యల ప్రభావం శరీరం మీద పడుతుంది. అలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. మగవారితో పోల్చితే మహిళల్లో యాంగై్జటీ పర్సంటెజీ ఎక్కువ ఉంటుంది. మహిళ మానసిక స్థితిపై ఆమె చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంటి విషయాలు, రిలేషన్స్, పిల్లలకు సంబంధించినవాటిలో ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు సైకోసోమాటిక్ సమస్యలు వస్తుంటాయి. చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళితే ‘ఏమీ లేదు స్ట్రెస్ అయ్యారు’ అని డాక్టర్ చెబితే ఇంట్లోవాళ్లే ‘నొప్పి ఏమీ లేదు, నువ్వు అనవసరంగా డబ్బులన్నీ ఖర్చుపెట్టిస్తావ్...’ అని కోప్పడేవారుంటారు. ఇది కూడా స్త్రీలలో ఒకరకమైన ఒత్తిడిని పెంచుతుంది. మగవారిలో అయితే ఇంటి బయటి విషయాలమీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పొగతాగడం, మద్యం సేవించడం, వ్యసనాలు.. వీటికి సంబంధించిన సమస్యల వల్ల బాడీ పెయిన్స్ రావడం ఎక్కువ గమనిస్తుంటాం. ఇద్దరిలోనూ సమస్య మూలాలను కనుక్కొని చికిత్స చేస్తాం. – డాక్టర్ కె. హరిణి, సైకియాట్రిస్ట్ తేడా లేదు... చికిత్సలో ఆడ–మగ ఇద్దరినీ ఒకే విధంగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఆడ–మగ సమస్యల్లో కారణాలు వేరు వేరుగా ఉంటాయి. అవి హార్మోన్లలో తేడాల వల్ల వస్తాయి. పేషెంట్లో ఉండే సమస్యను బట్టి చికిత్స ఉంటుంది తప్పితే ఎక్కువ–తక్కువ అంచనా వేయడం ఏమీ ఉండదు. – డాక్టర్. జి.నవోదయ, జనరల్ మెడిసిన్ – నిర్మలారెడ్డి -
ష్.. ఆ ఫిష్ తిన్నారో.. ఆరోగ్య సమస్యలు వద్దన్నా వస్తాయ్!
కొందరి స్వార్థం సమాజానికి హానికరంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో హానికరమైన క్యాట్ ఫిష్‌ను ప్రభుత్వం నిషేధించినా.. చాటు మాటుగా పెంపకాలు జరుగుతూనే ఉన్నాయి. కొర్రమీను పేరుతో హోటల్స్‌లో ఆహార పదార్థాల విక్రయాలు చేస్తున్నారు. వీటికి ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తుండటం అనేక అనార్థాలకు దారి తీస్తోంది. మరో వైపు చెరువు పరిసర ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువుల గట్లపై పడిన చికెన్ వ్యర్థాలను పక్షులు తీసుకెళ్లడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు లేకపోలేదు. సాక్షి, నెల్లూరు: క్యాట్ ఫిష్.. ఇది కుళ్లిన మాంసాన్ని తిని పెరిగే చేప. కేవలం ఆరు నెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్ధం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. చేపల చెరువుల మధ్యలో చిన్న చిన్న చెరువుల్లో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. చేపల్లో బాగా డిమాండ్ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్ ఫిష్‌ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోనే.. జిల్లాలోని పెన్నాపరీవాహక ప్రాంతంలోని కోవూరు నియోజకవర్గంలో నిషేధిత క్యాట్‌ఫిష్ పెంపకం చేస్తోన్నారు. కోవూరు, ఇనమడుగు, దామరమడుగు, బుచ్చిరెడ్డిపాళెం, పెనుబల్లి ప్రాంతాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో మంచినీటి చేపల పేరుతో క్యాట్‌ఫిష్ పెంపకం చేస్తున్నట్లు తెలిసింది. వీటిని దొడ్డిదారిన జిల్లాతో పాటు చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా చేస్తున్నారు. కొర్రమీను పేరుతో.. క్యాట్ ఫిష్ చూసేందుకు కొర్రమీనును పొలి ఉంటుంది. కొర్రమీనులో ఒకే ముల్లు ఉంటుంది. కానీ క్యాట్ ఫిష్‌లో ముళ్లే ఉండవు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయిస్తున్నారు. ఖర్చు తగ్గుతుందని.. చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్ తదితర వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఇది కిలో ధర రూ.28 నుంచి రూ.30 వరకు మధ్య ఉంటుంది. మేత ద్వారా కిలో చేపను పెంచడానికి సుమారు రూ.55 వెచ్చించాల్సి ఉంటుంది. అదే కోళ్ల వ్యర్థాలు చికెన్ సెంటర్ల నుంచి కిలో రూ.10 వంతున కోనుగోలు చేసి వీటి ద్వారా చేప పెంచడానికి రూ.25 సరిపోతుండడంతో కోళ్ల వ్యర్థాలను వాడుతున్నారు. ముఖ్యంగా క్యాట్ ఫిష్‌లు త్వరగా పెరగాలన్నా.. బరువు రావాలన్నా.. మాంసం వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. మాంసం వ్యర్థాలనే క్యాట్ ఫిష్‌లు బాగా తింటాయి కాబట్టి ఆహారంగా వేస్తున్నారు. వ్యర్థాలే మేత ఈ చేపలకు కోళ్ల వ్యర్థాలే మేతగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో లభించే వ్యర్థాలతో పాటు చిత్తూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వ్యర్థాలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాస్టిక్ డమ్ముల్లో నింపి ఆటోలు, లారీల్లో చేపల గుంతల వద్దకు తరలించి మేతగా వేస్తున్నారు. కిలో వ్యర్థాన్ని రూ.8 నుంచి రూ.10 వంతున కొనుగోలు చేసి మేతగా వినియోగిస్తున్నారు. 2016 లో రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ ఫిషతో అనర్థాలు ఈ చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్‌లో ఉండే ఒమేగా ఫ్యాట్ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ రకం చేప దవడ కింద ఉండే ముల్లు తింటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటి పెంపకం, అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు చేపలను తినాలని వైద్యులు చెబుతుండగా ఇలా కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయాలు భారీగా పెరిగాయి. అధికారులకు తెలిసినా నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని, కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు తరచూ పోలీసు దాడులు ద్వారా తెలిసినా మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కోవూరు ప్రాంతంలో జరుగుతున్న క్యాట్ ఫిష్ సాగు పక్కా సమాచారం ఉన్నా.. వారు తెలియనట్లు నటి స్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాట్ ఫిష్ సాగుదారులు అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. చర్యలు తీసుకుంటాం క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు వాడకూడదనే ఆదేశాలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోళ్ల వ్యర్థాలు వాడితే గరిష్టంగా రూ. 50 వేలు వరకు జరిమానా విధించే అధికారం మత్స్యశాఖ అధికారులకు ఉంది. రెండో సారి పునరావృతం చేస్తే సాగుదారుల లైసెన్స్ రద్దు చేసి సరుకు స్వాధీనం చేసుకుంటారు. ఎక్కడైనా క్యాట్ ఫిష్ సాగవుతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..! -
రోజుకో నువ్వుల ఉండ, బియ్యం కడిగిన నీళ్లు..
-
నోరూరించే మామిడిపండ్లు.. తీపి వెనుక దాగున్న చేదు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
సాక్షి,ఆమదాలవలస రూరల్: వేసవి సీజన్ కావడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా మామిడిపండ్లే. ఎటువంటి మచ్చలు లేకుండా, చూడటానికి ఎంతో నాణ్యంగా ఉన్నా చాలావరకు అవి కృత్రిమంగా మగ్గబెట్టినవే. సహజసిద్ధంగా పండిన ఫలాల్లో మాత్రమే పోషకాలు ఉంటాయని, పక్వానికి రాని పండ్లను కృత్రిమ పద్ధతుల్లో రసాయనాలను వినియోగించి మగ్గబెట్టిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు వ్యాపారులు లాభార్జనే ద్యేయంగా ఆరోగ్యానిచ్చే పండ్లలో రసాయనాలు వినియోగించి ప్రజలకు అమ్మేస్తున్నారు. పైకి నిగనిగలాడుతూ చూడగానే నోరూరించే ఈ పండ్లను కొనుగోలు చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజారోగ్యం గురించి కనీసం పట్టించుకోని అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలతోనే అడ్డుకట్ట.. మధురానుభూతిని కలిగించే మధుర ఫలాల వెనుక దాగి ఉన్న చేదు నిజాన్ని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లపై కార్బైడ్ వాడకాన్ని ప్రభు త్వం నిషేధించినా, కోర్టు లు ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో వాటిని అమ లు చేసేవారే లేరు. దీంతో కొందరు వ్యాపా రులు పక్వానికి రాక ముందే పచ్చికాయలు కోసేసి వాటికి రసాయనా లు వినియోగించి పండ్లుగా మారుస్తున్నారు. గదిలో కార్సైడ్ వేసి మగ్గ పెట్టడం లేదా పొగపెట్టి మగ్గపెట్టడం, ఇథనాల్ వంటి రసాయనాల్లో ముంచి పచ్చికాయలను పండ్లుగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మామిడి సీజన్ కావడంతో వాటిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు తోటల్లోనే కార్బైడ్, ఇథనాల్ వంటి రసాయనాలతో మాగబెట్టి రంగు తేలిన పండ్లను బహిరంగ మార్కెట్లో విచ్చ లవిడిగా విక్రయిస్తు న్నారు. రసాయనాలతో వినియోగించి మాగబెడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా రు. అధికారులు స్పందించి గోదాములు, తోటల్లోని గదుల్లో తనిఖీలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. రసాయనాలతో మాగబట్టిన పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. స్వచ్ఛమైన పండ్లు తింటే ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. పండ్లు త్వరగా పక్వానికి రావడం కోసం రకరకాల రసాయనాలను వినియోగిస్తుంటారు. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రసాయనాలు కలిపిన ఎటువంటి పదార్థాలూ తీసుకోకపోవడం ఉత్తమం. – పేడాడ రాజశేఖర్, వైద్యాధికారి, అక్కులపేట పీహెచ్సీ, ఆమదాలవలస మండలం చదవండి: Cholesterol: శరీరంలో కొవ్వు ఎంత అవసరం? ఎంతకు మించితే ముప్పు? -
డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారా? జర జాగ్రత్త!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని పొందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి రుచిగా ఉంటాయి కదా... ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం? డ్రైఫ్రూట్స్ తినడం వల్ల కలిగే లాభాలేంటి..? అనే విషయాలను తెలుసుకుందాం... డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలి అనేది ఇప్పుడు చూద్దాం.. బాదం బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్‌లో విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పు తినడం వల్ల వీటిని నుంచి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వాల్ నట్స్ వాల్ నట్స్ పైన ఉండే పెంకు తీయగానే.. ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్లోనే ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు. కర్జూరం ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్‌గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. పిస్తా పిస్తా వెల్నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్ లో కంటే ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. జీడిపప్పు కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండుద్రాక్ష తియ తియ్యగా పుల్లపుల్లగా ఉండే ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. 50 ఎండుద్రాక్షలు తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. -
శరీరంలో కొవ్వు ఎంత అవసరం? ఎంతకు మించితే ముప్పు?
ఆధునిక కాలంలో అనుసరిస్తున్న జీవన శైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువ ఉండటం కూడా ఒక కారణమే. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం. శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతి 1 మిల్లీ గ్రాము/డి.ఎల్ ఎల్డిఎల్ పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒకశాతం పెరుగుతుంది. అయితే ఎల్డి ఎల్‌కు ‘సాధారణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్డిఎల్ స్థాయి 100 మిల్లీ గ్రాము/డిఎల్‌కు పెరిగినప్పుడు గుండె పోటు ప్రమాదం అధికమవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్డిఎల్ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. హెడీఎల్ కొలెస్ట్రాల్ దీనినే మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. హెచ్‌డిఎల్ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం అవుతుంది. ‘అథిరొస్లె్కరొసిన్’ అనే సమస్య ఉత్పన్నం కాకుండా హెచ్‌డిఎల్ రక్షణగా ఉంటుంది. హెచ్‌డిఎల్ స్థాయి తక్కువ గా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె పోటుకు బలమైన కారణం ఎల్డిఎల్ పెరగడం కన్నా హెచ్‌డిఎల్ తగ్గడమే. హెచ్‌డిఎల్ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార జాగ్రత్తలు ►అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. ►అలాగే గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు హెచ్‌డీఎల్ స్థాయిని కూడా పెంచుకునే వీలుంది. ►ఇక దనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ►మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరుచేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది. ►చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చని కూడా చెబుతున్నారు. ►మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారం లో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం. ►వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. ►అలాగే పళ్ళు, పచ్చికూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోస, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్‌లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే చాలా మంచిది. ►పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటిబెల్లం, బెల్లం లేదా తేనె కొంచెం కొంచెం తీసుకోండి. ►ప్రతిరోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోవాలి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ప్రాణాయామం చేయండి. చెడు కొవ్వు తగ్గడానికి... ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి.ఎల్డీఎల్ అనే చెడు కొవ్వులు.. డెసీలీటర్‌కు 70 మిల్లీగ్రాములకు మించకూడదు. ఎంత తక్కువ గా ఉంటే అంత మంచిది. ∙మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. ►మంచి కొలెస్ట్రాల్ డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి. ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తపడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ►తిండిని అదుపులో ఉంచుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.? శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్డీఎల్(ఔఈఔ) అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్(ఏఈఔ) అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. -
విధి వైపరీత్యం అంటే ఇదేనేమో.. కళ్ల ముందే నలుగురు కొడుకులు
సాక్షి, చిలుకూరు (నల్గొండ): విధి వైపరీత్యం అంటే ఇదేనేమో. భర్తతో పాటు నలుగురు కుమారులు ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా లోకాన్ని విడిచారు. అవసాన దశలో మనువళ్లు, మనవరాళ్లతో శేష జీవితాన్ని గడపాల్సిన తరుణంలో ఆ వృద్ధురాలిని విధి వెక్కిరించింది. అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల రూపంలో నలుగురు కొడుకులను కోల్పోయిన ఆ వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతోంది. తాజాగా గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. చివరకు దహన సంస్కారాలు నిర్వహించే స్థోమత కూడా లేకపోవడంతో గ్రామస్తులు ముందుకొచ్చి ఆ తంతు పూర్తి చేయించిన ఓ తల్లి దీనగాథ ఇదీ. 25ఏళ్ల క్రితం భర్త.. చిలుకూరు మండల కేంద్రానికి చెందిన దాసోజు మోహన్‌రావు, రామనర్సమ్మ దంపతులది పేద కుటుంబం. వీరికి నలుగురు కొడుకులు, కూతురు సంతానం.మోహనరావు అనారోగ్య సమస్యతో సుమారుగా 25ఏళ్ల క్రితమే కనుమూశారు. అప్పటికే కూతురుతో పాటు నలుగురు కుమారుల్లో ముగ్గురికి వివాహాలు జరిగాయి. అయితే రెండో కుమారుడు శ్రీనివాస్‌రావు తండ్రి చనిపోయిన కొన్నేళ్లకే అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అ తర్వాత ముడో కుమారుడు రామారావు 14 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు బస్సులో వెళ్తూ బీపీ డౌన్ అయి అక్కడికక్కడే మృతిచెందాడు. వీరికి పిల్లలు లేరు. ఆ ఘటన మరుకముందే కొన్నాళ్లకు పెద్ద కుమారుడు బాబురావు అనారోగ్య సమస్యలతో మృతిచెందాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి👉🏼 (Hyderabad: మద్యం తాగిస్తూ మత్తులో ఉంచి.. అతి కిరాతకంగా..) రోడ్డు ప్రమాదంలో నాలుగో కుమారుడు.. కాగా, ఆ కుటుంబానికి వరుసగా ఏదో ఒక ఘటన జరుగుతూ వృద్ధురాలి కుమారులు చనిపోతున్నారు. నాలుగో కుమారుడు మధవరావుకి కుమార్తె రాజేశ్వరి కూతురు నాగశ్రీని ఇచ్చి వివాహం జరిపించారు. అయితే, గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగో కుమారుడు మాధవరావు దుర్మరణం చెందాడు. ఇతడికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. నలుగురు కొడుకులు ఉన్నా ఆ వృద్ధురాలు చివరకు అనాథగా మిగిలిపోయింది. కళ్ల ముందే నాలుగు కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో అ వృద్ధురాలు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. చివరకు అ కుటుంబాలకు మగదిక్కు లేకుండా పోయింది. మాధవరావు దహన సంస్కరాలను సోదరుల కుమారులు జరిపించారు. ఆ కుటుంబంలో జరుగుతున్న వరుస ఘటనలను చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. -
స్మార్ట్‌గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు
స్మార్ట్ ఫోన్ల వాడకం పతాకస్థాయికి చేరింది. మొబైల్ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అవసరానికి వాడుకోవడం మంచిదే. కానీ దానికి బానిసలవుతున్న వారు కెరీర్‌ను పాడు చేసుకుంటున్నారు. అపరిమిత వాడకం.. జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నెముక, కంటి తదితర సమస్యల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్మార్ట్ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లా చిరునామాతో సిమ్ కార్డులు తీసుకున్న 8,01,456 మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నట్లు తేలింది. ఏటా 10 నుంచి 15 శాతం వరకు మొబైల్ఫోన్ల సంఖ్య పెరుగుతోంది. ఇవి కాకుండా సాధారణ (కీప్యాడ్) ఫోన్లు మరో 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. నెలకు రూ.16 కోట్లు పైనే స్మార్ట్‌ఫోన్ వినియోగదారు నెలకు సగటున రూ.200 వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన వినియోగదారులు వివిధ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు నెలకు కనిష్టంగా రూ.16 కోట్లు, ఏడాదికి రూ.192 కోట్లకు పైగా చెల్లిస్తున్నారని తెలుస్తోంది. మిగతా సాధారణ ఫోన్లు కూడా కలిపితే ఏడాదికి రూ.250 కోట్లకు పైగా చార్జీల రూపంలో ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నట్టు సమాచారం. సగటున 2 గంటల సమయం వృథా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న వారికి సగటున రోజుకు రెండు గంటల సమయం వృథా అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా ఏదో ఒక యాప్ నుంచి ప్రయోజనం లేకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా యువకులు, పనిచేసే వారు ఇలా చేయడం వల్ల ఉత్పాదక రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. చాలామంది విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. సెల్‌ఫోన్ కొనివ్వలేదని.. గత ఏడాది డిసెంబర్లో ఉరవకొండ పట్టణంలో రవినాయక్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతకీ కారణమేంటంటే తల్లిదండ్రులు తనకు సెల్‌ఫోన్ కొనివ్వలేదని. తన కొడుకు సెల్‌ఫోన్‌కు బానిస అయ్యాడని తల్లి కుళ్లాయమ్మ కన్నీరుమున్నీరవుతోంది. అలవాటు చేసినందుకు.. అనంతపురం నగరానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసులు, తనూష దంపతులకు మూడేళ్ల తేజాస్ అనే కుమారుడు ఉన్నాడు. అన్నం తినడం లేదని కుమారుడికి సెల్‌ఫోన్ అలవాటు చేశారు. చివరకు ఆ సెల్‌ఫోన్‌కు బానిసైన చిన్నారి.. ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)కు గురయ్యాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్న వారిలో టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ (మెడ నొప్పి) లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సేపు మెడ వంచి మొబైల్ ఫోన్ మెసేజ్‌లు చదువుతున్నారు. గంటల తరబడి మెడ వంచి చూడటం వల్ల వెన్నెముక సమస్యలు కూడా వస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మితిమీరి మొబైల్‌ఫోన్‌కు అలవాటు పడిన చిన్నారులకు రెటీనా (కంటి) సమస్యలు వస్తున్నట్టు అధ్యయనాలు తేల్చాయి. అనర్థాలకు మూలం సెల్‌ఫోన్ అనేక అనర్థాలకు సెల్‌ఫోన్ వినియోగమే మూలం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెల్‌ఫోన్, వాట్సాప్, ఇంటర్నెట్ వినియోగాన్ని కూడా ఒక బానిసత్వంగా పరిగణించింది. వీటి వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ప్రధానంగా నిద్ర వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. నిద్ర లేకపోవడంతో కోపతాపాలకు గురికావడం, ధ్యాస లోపించడం తోపాటు కంటి చూపు పూర్తిగా మందగిస్తోంది. చిన్న వయస్సులో నిషేధిత వెబ్సైట్లలోకి ప్రవేశించి పోర్న్ సైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. సర్వ అనర్థాలకు కారణం సెల్‌ఫోన్ అని ప్రధానంగా చెప్పవచ్చు. –యండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం అధికమవుతున్న అనారోగ్య సమస్యలు (చదవండి: ప్రశాంత్ నీల్.. మన బంగారమే) -
కాఫీ ఎక్కువైతే.. కంగారే!
పొద్దున లేవగానే కాఫీ చుక్క గొంతులో పడనిదే రోజు గడవదు చాలామందికి. కానీ అదే కాఫీ పరిమితి మించితే మాత్రం కంగారు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి కంటి దాకా ఎన్నో సమస్యలనూ కాఫీ తెచ్చిపెడుతుందని ఈ అంశంపై పరిశోధనలు చేసిన ఈస్తటిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ అహ్మద్ ఎల్ మాంటసర్ హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటి.. వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగంటే.. వయసు పెరిగిపోద్ది.. బాగా వర్క్ ప్రెషర్తోనో, ఇంకేదో ఒత్తిడితోనో కాఫీ తెగ తాగేస్తూ ఉంటాం. చిత్రమేంటంటే.. కాఫీ ఎక్కువైతే కిడ్నీలు కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. మరి ఈ కార్టిసాల్‌తో మన చర్మంలోని గ్రంధుల నుంచి నూనె స్రావాలు పెరుగుతాయని.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. మొటిమలు, ఇతర సమస్యలు వస్తాయని మాంటసర్ చెప్తున్నారు. దీనికితోడు ఆల్కహాల్ తరహాలోనే కెఫీన్ అధికంగా తీసుకుంటే.. డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని, చర్మం పొడిబారి కాంతివిహీనంగా మారుతుందని అంటున్నారు. అంటే.. ఈ సమస్యలతో ఎవరైనా వారి వయసుకు మించి కనబడతారని వివరిస్తున్నారు. – సాధారణంగా రోజూ తాగే నీటితోపాటు.. ప్రతి కప్పు కాఫీకి మరో గ్లాసు నీళ్లు అదనంగా తాగాలని హార్మోన్ స్పెషలిస్టు సోఫీ షాటర్ సూచిస్తున్నారు. దానివల్ల సమస్య కొంత ఉపశమిస్తుందని అంటున్నారు. రిలీఫ్ కాదు.. చిరాకు.. కాఫీ ఎక్కువైతే శరీరంలో అడ్రినల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందని.. దీనితో రక్తపోటు పెరిగి, నిద్రలేమికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సరిగా నిద్ర లేకపోవడం వల్ల మానసిక సమస్యలకు కారణమవుతుంది. కాఫీ అలవాటు ఎక్కువగా ఉన్నవారిలో 33శాతం మందికి నిద్ర సమస్య వస్తోందని పరిశోధనల్లో వెల్లడైంది కూడా. ఇక అధిక కెఫీన్ వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గి.. మానసిక ఆందోళన పెరుగుతుందని, ఏకాగ్రత తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. – కాఫీ అలవాటును నియంత్రించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోవడానికి రెండు, మూడు గంటల ముందు నుంచీ కాఫీకి దూరంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. స్ట్రోక్.. మైగ్రేన్ ప్రమాదం కూడా.. కాఫీలోని కెఫీన్‌కు వ్యసనంగా మారే లక్షణం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. కాఫీ తీసుకున్నప్పుడు మెదడు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రక్తనాళాలు సంకోచానికి గురవుతాయని.. తాగడం ఆపేసినప్పుడు వ్యాకోచించి తలనొప్పి వస్తుందని అంటున్నారు. ఇది కొందరిలో మైగ్రేన్‌కు దారితీస్తుందని వివరిస్తున్నారు. అందువల్లే తలనొప్పి అనిపించినప్పుడల్లా కాఫీ తాగుతూ.. అదో అలవాటుగా మారుతుందని పేర్కొంటున్నారు. కొందరిలో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం, కండరాలు మెలితిప్పినట్టు, తిమ్మిరిగా అనిపించడం, చేతులు వణకడం..వంటివీ తలెత్తుతాయని అంటున్నారు. – ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు కాఫీ వినియోగాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. కంటి సమస్యలకూ దారి.. అధిక కెఫీన్ రక్తపోటును పెంచడం వల్ల.. కళ్లకు రక్తాన్ని సరఫరా చేసే సన్నని రక్తనాళాలు దెబ్బతిని, కంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో రెటీనా దెబ్బతినే ప్రమాదమూ ఉంటుందని అంటున్నారు. – రోజుకు మూడు కప్పులకు మించి కాఫీ తాగితే.. కంటి సమస్యలను కొని తెచ్చుకోవడమేనని, తగ్గిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
పిల్లల ఆరోగ్యానికీ భరోసా
సాక్షి, అమరావతి: చిన్నారుల్లో శారీరక లోపాలు, అ నారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి భరోసా ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి.. వారిలో ఆరోగ్య సమస్యలు గుర్తించి, ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ చేపడుతోంది. ఇందులో భాగంగా పిల్లల వైద్య పరీక్షలకు గత నెలలో శ్రీకారం చుట్టింది. తొలుత అంగన్వాడీల్లోని చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెల మొదటి వారంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వైద్య పరీక్షలు చేయడం మొదలుపెట్టింది. కానీ, కరోనా వ్యాప్తి ఈ వైద్య పరీక్షలపై ప్రభావం చూపింది. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 6,124 కేంద్రాల్లో 1,62,069 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు చేశారు. 796 మందికి సమస్యలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి 580 మందికి జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాల్లో (డీఈఐసీ) చికిత్స అందించారు. శస్త్రచికిత్స అవసరమైన 23 మంది చిన్నారులను పెద్దాసుపత్రులకు సిఫార్సు చేశారు. 193 మందికి మెరుగైన వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోంది. మార్చిలోగా పాఠశాల పిల్లలకూ.. ఇక ఈ నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా 55,605 అంగన్వాడీల్లో 28,18,368 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తిచేయాలని కార్యాచరణ రూపొందించారు. అలాగే, వచ్చే మార్చి నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని పిల్లలందరికీ వైద్య పరీక్షలు పూర్తిచేయాలని వైద్యశాఖ అధికారులు లక్ష్యం నిర్ధేశించుకున్నారు. వైద్య పరీక్షలు వేగవంతం కరోనా వ్యాప్తి కారణంగా వైద్య పరీక్షలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో.. జాగ్రత్తలు పాటిస్తూ వైద్య పరీక్షలు వేగవంతం చేస్తున్నాం. నెలాఖరులోగా అంగన్వాడీల్లో చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తిచేస్తాం. చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీనివాస రెడ్డి, ఆర్బీఎస్కే రాష్ట్ర ప్రత్యేక అధికారి 30 రకాల సమస్యలకు ఉచిత పరీక్షలు న్యూరల్ ట్యూబ్ లోపం, డౌన్స్ సిండ్రోమ్, గ్రహణ మొర్రి, పెదవి చీలిక, వంకర పాదాలు, నడుం భాగం వృద్ధి లోపం, సంక్రమిక కంటిపొర, గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చే చెవుడు, రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ, రక్తహీనత, విటమిన్ల లోపం, మేధోపరమైన అసమానత, వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవటం, ఆటిజమ్, అభ్యసనా సమస్యలు, తలసీమియా సహా ఇతర 30 రకాల ఆరోగ్య సమస్యలు, లోపాలు గుర్తించడానికి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. -
అలాగే కూర్చుని ఉంటే..!
మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం ఎంత అవసరమో, అలాగే తిన్న ఆహారం జీర్ణమై వ్యర్థాలు విసర్జితం కావడం కూడా అంతే ముఖ్యం. ఈ ప్రక్రియకు ఇరవై నాలుగ్గంటలకంటే ఎక్కువ విరామం రావడం ఆరోగ్యకరం కాదు. రోజంతా ఒళ్లు వంచి పని చేసే వాళ్లకు ఇది అసలు సమస్యకానే కాదు. కానీ రోజంతా కూర్చుని ఉద్యోగం చేసే వాళ్లకు ఇదే పెద్ద సమస్య. దేహానికి శ్రమలేకుండా కూర్చుని చేసే ఉద్యోగం తెచ్చే అనేక సమస్యల్లో ఇది ప్రధానమైనది. జీర్ణక్రియలు మందగించడం, పెద్దపేగు కదలికలు తగ్గిపోవడంతో క్రమంగా తీవ్రమైన మలబద్దకానికి దారి తీస్తుంది. నిజానికి ఇది అనారోగ్యం కారణంగా ఎదురయ్యే మలబద్దకం కాదు. కేవలం లైఫ్‌స్టైల్ సమస్య మాత్రమే. ఈ తరహా మలబద్దకానికి మందుల వాడకంకంటే జీవనశైలిని మార్చుకోవడమే సరైన మందు. కదలికలు సరిగ్గా ఉండాలంటే... ఆహారంలో పీచు సమృద్ధిగా ఉన్న పదార్థాలను తీసుకోవడంతోపాటు నిద్రలేచిన తర్వాత అరగంట సేపు నడవడం, వేడి నీరు తాగడం మంచిది. అలాగే... టాయిలెట్ సీట్ ఎత్తు తక్కువగా ఉండాలి. హిప్స్ కంటే మోకాళ్లు ఎక్కువ ఎత్తులో ఉండాలి. మోచేతులు మోకాళ్ల మీద పెట్టుకోగలగాలి. కూర్చున్న భంగిమ బవెల్ మీద తగినంత ఒత్తిడి పడే విధంగా ఉండాలి. సులువుగా చెప్పాలంటే వెస్ట్రన్ కమోడ్ కంటే ఇండియన్ టైప్ అన్ని రకాలుగా మంచిది. అయితే... మోకాళ్ల నొప్పులు ఉన్న వాళ్లకు ఇండియన్ టైప్ టాయిలెట్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్లు వెస్ట్రన్ టైప్ కమోడ్నే తక్కువ ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. అది సాధ్యం కానప్పుడు పాదాల కింద చిన్న మెట్టును అమర్చుకోవాలి. మద్యపానం, ధూమపానం చేసే వారికి కూడా బవెల్ కదలికలు మందగిస్తాయి. అలాంటి వాళ్లు ఆ అలవాట్లను మానుకోవడం లేదా బాగా తగ్గించడమే పరిష్కారం. -
ఆరోగ్యం ‘దుమ్ము’కొట్టుకుపోతోంది.. తాండూరులో రోజూ 100 మంది..
Unhygienic Hotels And Roadside Foods: హోటల్ ఫుడ్ తింటున్నారా.. అయితే అంతే సంగతి.. ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రిలో చేరాల్సిందే. ఇటీవలి కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ఆహార భద్రతాప్రమాణాలను పాటించకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలను, రోడ్డుపై చేసిన పదార్థాలను తిని జనాలు రోగాలబారిన పడుతున్నారు. హోటళ్ల నిర్వాహకులు కుళ్లిన, కలుషిత ఆహారాన్ని రుచికరంగా అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సెఫ్టీ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీలోని హోటళ్లు, రోడ్‌సైడ్ ఫుడ్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, వికారాబాద్: జిల్లాలోనే పారిశ్రామిక పట్టణంగా పేరున్న తాండూరు మున్సిపాలిటీలో హోటళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యాపార పరంగా ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి పట్టణానికి వస్తుంటారు. వచ్చిన వారు తాండూరు ప్రాంతంలోని ఏదో ఒక హోటల్లో కడుపు నింపుకోవాలి. అయితే హోటల్ నిర్వాహకులు వారికి పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడంలేదంటూ విమర్శలు ఉన్నాయి. కలుషిత ఆహారం తిన్న ఎంతోమంది ఫుడ్ పాయిజన్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. తాండూరు పట్టణంలోని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో ఉన్న హోటళ్లలో కలుషిత ఆహారం అందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు హోటళ్లను తనిఖీ చేయగా కుళ్లిన పదార్థాలతో పాటు కుళ్లిపోయిన చికెన్, మటన్‌ను గుర్తించారు. అప్పట్లో పలు హోటళ్లను సీజ్ చేశారు. అలాగే రోడ్‌సైడ్ ఉండే టిఫిన్ సెంటర్లు, చాట్ భండార్లలో సైతం నాణ్యమైన పదార్థాలను అందించడం లేదనే విమర్శలున్నాయి. ( చదవండి: తవ్వకాల్లో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం.. ఎక్కడంటే? ) రెండేళ్లుగా పర్యవేక్షణ కరువు జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లాకు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలి. అయితే జిల్లా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఫుడ్ సెఫ్టీ అధికారిని నియమించలేదు. దీంతో తాండూరు పట్టణంలో మున్సిపల్ అధికారులే హోటళ్లలో తనిఖీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రెండేళ్లుగా మున్సిపల్ అధికారులు కూడా హోటళ్లను తనిఖీ చేయడం లేదు. మున్సిపాలిటీలో ఇన్చార్జి కమిషనర్ ఉండటంతో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. రోగాలబారిన పడుతున్న ప్రజలు తాండూరు ప్రాంతంలో ఉన్న హోటళ్లలో కలుషిత ఆహారం తిని ప్రతిరోజు 100 మందికి పైగా అనారోగ్యానికి గురవుతున్నారు. పట్టణంలో అధికంగా రోడ్లపైనే టిఫిన్ సెంటర్లు, చాట్ బంఢార్లను నిర్వహిస్తున్నారు. పట్టణంలో దుమ్ము, కాలుష్యం అధికంగా ఉంది. గాలిలో ఉన్న దుమ్ము మొత్తం ఆహార పదార్థాలపై పడి కలుషితం అవుతోంది. అది తిన్నవారు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. అధికారులు ఆహార భద్రతపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇప్పటికైనా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు హోటళ్లపై దాడులు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’