టీవీ నటుడు మొహ్సిన్ ఖాన్ తాను నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కారణంగా గుండెపోటుకి గురైనట్లు వెల్లడించాడు. అది చాలా సివియర్‌గా వచ్చిందని, రెండు మూడు ఆస్పత్రుల మారినట్లు తెలిపారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చారు. బహుశా నిద్ర లేకపోవడం వల్ల ఇలా వచ్చి ఉండొచ్చని అన్నారు. అసలు ఆల్కహాల్ తాగకుండా ఎలా ఫ్యాటీ లివర్ వస్తుంది?. దీనికి గుండెపోటుకి సంబంధం ఏంటీ..?
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే..?
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ని NAFLD అని పిలుస్తారు. ఇది ఆల్కహాల్ తక్కువగా తాగే వ్యక్తులను ప్రభావితం చేసే కాలేయ సమస్య. NAFLDలో కాలేయంలో చాలా కొవ్వు పేరుకుపోతుంది. NAFLD తరచుగా లక్షణరహితంగా ఉంటుంది. అయితే ఇది నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH), ఫైబ్రోసిస్, సిర్రోసిస్‌తో సహా మరింత తీవ్రమైన పరిస్థితులకు పురోగమిస్తుంది.
ఇది గుండెపోటుకి దారితీస్తుందా..?
"కాలేయ సమస్యలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గుండెపోటు ముప్పు తీవ్రమవుతుంది. కొవ్వుల జీవక్రియ ప్రక్రియలో అవసరమైన ప్రోటీన్‌లను ఉత్పత్తి చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సమతుల్య హృదయనాళ వ్యవస్థను నిర్వహించడానికి చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా క్రానిక్ లివర్ డిసీజ్ లిపిడ్ మెటబాలిజానికి అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగేందుకు దారితీస్తుంది.
ఈ లిపిడ్ అసమతుల్యత అథెరోస్ల్కెరోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ధమనులు సంకోచిస్తాయి. తద్వారా గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది."ని చెబుతున్నారు వైద్యలు. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ధూమపానం తదితరాలు జీవక్రియకు అంతరాయం కలిగించి ఫ్యాటీలివర్ బారినపడేలా చేస్తుంది. ఇది హృదయనాళ సమస్యలకు దారితీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించారు వైద్యులు.
అలాగే గుండె సమస్యలు ఉన్న రోగులలో కాలేయ వ్యాధి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాలేయానికి తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. దీనిని కార్డియోజెనిక్ అంటారు. ఇస్కీమిక్ హెపటైటిస్, సిరల పీడనం కారణంగా దీర్ఘకాలిక గుండె వైఫల్య స్థితి ఏర్పడుతుంది. దీనిని కార్డియాక్ సిరోసిస్ అంటారు. కాబట్టి, కాలేయం, గుండె జబ్బుల మధ్య సహసంబంధం ఉంది
నివారించడం ఎలా..
చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహాదాని దూరంగా ఉండాలి.
పుష్కలంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌లను కలిగి ఉన్న సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
రెగ్యులర్ వ్యాయామం తోపాటు రోజులో కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమతో కూడిన వర్కౌట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
ఒత్తిడిని నిర్వహించడం, తగినంత నిద్ర పొందడం అత్యంత ముఖ్యం
ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ..గిన్నిస్ రికార్డు!)
Comments
Please login to add a commentAdd a comment