ఆ జిల్లాకు ఏమైందో ఏమో.. నెలల వ్యవధిలో హార్ట్ ఎటాక్‌తో విద్యార్థులు ప్రాణలు పోగొట్టుకున్నారు. నెలల వ్యవధిలో ముగ్గుర విద్యార్థుల్లో హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు పోగొట్టుకోగా.. ముగ్గురు అంతకంటే ఎక్కవమంది విద్యార్థులు కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. తాజాగా, స్కూల్లో ఆటల పోటీల కోసం ప్రాక్టీస్ చేస్తున్న 14ఏళ్ల బాలుడు హార్ట్ ఎటాక్ ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రతీ ఒక్కరిని కలచి వేస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లా సిరౌలి గ్రామానికి చెందిన మోహిత్ చౌదరి (14) చదివే స్కూల్లో డిసెంబర్ 7న ఆటలు పోటీలు జరగనున్నాయి. ఈ ఆటల పోటీల్లో తన ప్రతిభను చాటుకునేందుకు మోహిత్ చౌదరి సిద్ధమయ్యాడు.
ఇందులో భాగంగా తన తోటి స్నేహితులతో కలిసి పరుగు పందెం ప్రాక్టీస్ చేస్తుండగా.. హార్ట్ ఎటాక్‌తో స్కూల్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా, ఈ ఏడాది ఆగస్ట్ నెలలో బాలుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా..ఇప్పుడు కుమారుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గత నెలలో మమత
మరోవైపు అలీఘర్ జిల్లాలో గుండె పోటుతో నెలల వ్యవధిలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నవంబర్ నెలలో అలీఘర్ జిల్లా అర్రానా గ్రామానికి మమత (20) గుండె పోటుతో మరణించింది. రన్నింగ్ తర్వాత హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలింది. అత్యవసర చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించినా..అప్పటికే జరగాల్సి నష్టం జరిగింది. మమత అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
అంతేకాదు, కొద్ది రోజుల క్రితం అదే అలీఘర్ జిల్లా లోధి నగర్‌కు చెందిన ఏనిమిదేళ్ల బాలిక గుండె పోటుతో మరణించింది. 25రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం అలీఘర్ జిల్లాలో వరుస మరణాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment