School Boy
-
శ్రీచైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి
-
ఆ జిల్లాకు ఏమైంది? విద్యార్థుల ప్రాణాల్ని తీస్తున్న గుండె పోటు.. తాజాగా
ఆ జిల్లాకు ఏమైందో ఏమో.. నెలల వ్యవధిలో హార్ట్ ఎటాక్‌తో విద్యార్థులు ప్రాణలు పోగొట్టుకున్నారు. నెలల వ్యవధిలో ముగ్గుర విద్యార్థుల్లో హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు పోగొట్టుకోగా.. ముగ్గురు అంతకంటే ఎక్కవమంది విద్యార్థులు కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. తాజాగా, స్కూల్లో ఆటల పోటీల కోసం ప్రాక్టీస్ చేస్తున్న 14ఏళ్ల బాలుడు హార్ట్ ఎటాక్ ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రతీ ఒక్కరిని కలచి వేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లా సిరౌలి గ్రామానికి చెందిన మోహిత్ చౌదరి (14) చదివే స్కూల్లో డిసెంబర్ 7న ఆటలు పోటీలు జరగనున్నాయి. ఈ ఆటల పోటీల్లో తన ప్రతిభను చాటుకునేందుకు మోహిత్ చౌదరి సిద్ధమయ్యాడు.ఇందులో భాగంగా తన తోటి స్నేహితులతో కలిసి పరుగు పందెం ప్రాక్టీస్ చేస్తుండగా.. హార్ట్ ఎటాక్‌తో స్కూల్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.కాగా, ఈ ఏడాది ఆగస్ట్ నెలలో బాలుడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా..ఇప్పుడు కుమారుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత నెలలో మమతమరోవైపు అలీఘర్ జిల్లాలో గుండె పోటుతో నెలల వ్యవధిలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నవంబర్ నెలలో అలీఘర్ జిల్లా అర్రానా గ్రామానికి మమత (20) గుండె పోటుతో మరణించింది. రన్నింగ్ తర్వాత హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలింది. అత్యవసర చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించినా..అప్పటికే జరగాల్సి నష్టం జరిగింది. మమత అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం అదే అలీఘర్ జిల్లా లోధి నగర్‌కు చెందిన ఏనిమిదేళ్ల బాలిక గుండె పోటుతో మరణించింది. 25రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం అలీఘర్ జిల్లాలో వరుస మరణాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. -
పొలం గట్టే.. బడికి దారి
కేసముద్రం: పొలాల మధ్యలో బడి.. ఆ బడికి పొలం గట్టే దారి. ప్రతీరోజు విద్యార్థులు ఆ దారి గుండానే పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండా జీపీలో ప్రాథమిక పాఠశాల భవ నాన్ని పంట పొలాల మధ్య నిర్మించారు. అయితే పాఠశాలకు వెళ్లేందుకు మాత్రం దారిని ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు పొలం గట్టుమీద నుంచే వెళ్లి వస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు విద్యార్థులు, టీచర్లు గట్టుమీద నుంచి జారి పడిన ఘటనలు ఉన్నాయి. అలాగే పాఠశాల భవనం పక్కనే ప్రమాద కరంగా రెండు వ్యవసాయ బావులు ఉన్నాయి. బడికి చుట్టూరా పొలాలు ఉండటంతో పాములు, విష పురుగుల భయం ఉంది. దీంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పాఠశాలలో మొత్తం 12 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికైనా పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆ పిల్లల ఆచూకీ కోసం 500 కెమెరాల్ని జల్లెడ పట్టిన పోలీసులు
పరీక్షల్లో తక్కువ మార్కులు.. తల్లిదండ్రులు తిడతారనే భయం. ఫలితం ఇద్దరు విద్యార్థులు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. చివరికిఢిల్లీ నోయిడా సెక్టార్-56లోని ఆర్యన్ చౌరాశ్యా, నితిన్ ద్యాన్‌లు ఉత్తరాఖండ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. అయితే గత వారం స్కూల్లో జరిగిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు మార్క్‌లు తక్కువ వచ్చాయి.‘ఇటీవల జరిగిన పరీక్షల్లో మీ ఇద్దరికి తక్కువ మార్కులు వచ్చాయి. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద మీ తల్లిదండ్రులతో సైన్ చేయించి.. రేపు ఉదయం స్కూల్‌కు రండి. మీ పేరెంట్స్‌ని వెంట తీసుకుని రండి. వారితో మాట్లాడాలి ’ అంటూ క్లాస్ టీచర్ ఆదేశాలతో ఇద్దరు విద్యార్ధులు బయపడిపోయారు. అదే రోజు సాయంత్రం తల్లిదండ్రులు తమని తిడతారేమోనని అటు స్కూల్.. దూరంగా పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం స్కూల్ ముగిసిన వెంటనే పారిపోయారు.ఇదీ చదవండి : రంగంలోకి ఇండియన్ జేమ్స్ బాండ్స్కూల్ వెళ్లిన పిల్లలు సమయం మించిపోతున్నా.. ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. ఏడు బృందాలుగా విడిపోయిన పోలీసులు పిల్లల కోసం గాలించారు. 500 సీసీ కెమెరాలను తనిఖీలు చేయగా.. వారి ఇంటి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఆచూకీ లభించింది. పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. -
బుడ్డోడు మిమిక్రీ అదరగొట్టాడు
-
కొడుక్కు తుపాకీ అందుబాటులో ఉంచారని... తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు
వాషింగ్టన్: కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. స్కూల్లో తుపాకీతో కాల్పులు జరిపిన నలుగురు పిల్లలను బలి తీసుకోవడంతో పాటు ఏడుగురిని గాయపర్చిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్ 30న మిషిగన్ రాష్ట్రంలోని ఆక్స్ఫర్డ్ హైసూ్కల్లో ఎథాన్ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్, జెన్నిఫర్ తప్పేనని కోర్టు తేల్చింది. -
US: పాఠశాలలో కాల్పుల కలకలం
న్యూయార్క్: అమెరికాలోని అయోవాలో పాఠశాలలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులతో సహా పాఠశాల నిర్వహకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. శీతాకాలం సెలవుల తర్వాత పాఠశాలలు మొదటిరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 7:30కి పిల్లలు బ్రేక్ ఫాస్ట్ కోసం తరగతి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ పిల్లాడు కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా పాఠశాల నిర్వహకుడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పులు జరిపిన విద్యార్థిని డైలాన్ బట్లర్(17 )గా అధికారులు గుర్తించారు. బట్లర్ కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్దం విన్న వెంటనే తరగతి గదిలోకి పారిపోయామని స్థానిక విద్యార్థులు తెలిపారు. అందరూ బయటకి రండి అని పిలుపు విన్న తర్వాతే బయటకు వచ్చానని ఓ విద్యార్థి పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణంలో నేలంతా రక్తసిక్తమైందని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అమెరికా గన్ కల్చర్ రోజురోజుకీ ఎక్కువవుతోంది. పాఠశాలల్లో కాల్పుల ఘటన ఈ ఏడాది రెండోది. వర్జీనియాలో స్కూల్ బయటే ఓ కాల్పులకు పాల్పడిన ఘటన తర్వాత రోజు ఇది జరిగింది. మొత్తంగా 2018 నుంచి అమెరికా స్కూళ్లలో కాల్పుల ఘటనల సంఖ్య 182కు చేరింది. ఇదీ చదవండి: సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్ -
షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి..
భోపాల్: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ భిండ్‌లో 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో(కార్డియాక్ అరెస్ట్) ప్రాణాలు కోల్పోయాడు. ఇంత చిన్న వయసులో ఈ కారణంగా చనిపోయిన ఘటన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు వెల్లడించారు. ఓ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలుడి పేరు మనీష్ జాతవ్. గురువారం మధ్యాహ్నం సోదరుడితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశాడు. అనంతరం 2:00 గంటలకు స్కూల్ బస్ ఎక్కాడు. క్షణాల్లోనే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. విద్యార్థిని గమనించిన బస్ డ్రైవర్ స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అప్రమత్తం చేశాడు.స్పృహకోల్పోయిన అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. బాలుడు అప్పటికే చనిపోయాడని వాళ్లు ప్రకటించారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని చెప్పారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్.. -
పీఈటీ సార్ కొడతారనే భయం.. సైకిల్‌పై 65 కిలోమీటర్లు వెళ్లి..
సాక్షి, వరంగల్, ఖమ్మం: పాఠశాలకు ఆలస్యంగా వెళ్తే పీఈటీ కొడతారనే భయంతో సైకిల్‌పై 65 కిలోమీటర్లు ప్రయాణించిన ఒక బాలుడిని పోలీసులు తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ గండ్రాతి సతీష్ తెలిపిన వివరాలివి. ఖమ్మానికి చెందిన 12 ఏళ్ల కుషాల్ రాజా అదే ప్రాంతంలోని వండర్ కిడ్స్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రోజూ సైకిల్‌పై పాఠశాలకు వెళ్లే రాజా బుధవారం ఆలస్యం అయ్యాడు. దీంతో పీఈటీ దండిస్తారని భయపడి పాఠశాలకు వెళ్లకుండా ఖమ్మం నుంచి సైకిల్ తొక్కుతూ 65 కిలోమీటర్లు ప్రయాణించి తొర్రూరు మండలం మాటేడుకు బుధవారం రాత్రి చేరుకున్నాడు. చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తున్న బాలుడిని చూసి స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. కానిస్టేబుల్ రాజు బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని వారికి సమాచారం అందించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్ బాలుడికి కౌన్సెలింగ్ చేసి అల్పాహారం పెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. -
మొబైల్ వాడొద్దంటే.. ఒడిశా నుంచి ఆంధ్రాకు పారిపోయాడు!
సాక్షి,మందస(శ్రీకాకుళం): మొబైల్ వాడొద్దని తల్లిదండ్రులు చెప్పినందుకు ఓ బాలుడు ఒడిశా నుంచి ఆంధ్రాకు సైకిల్‌పై పారిపోయి వచ్చేశాడు. ఆ బాలుడు మందస మండలంలోని మఖరజోల గ్రామం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మందస పోలీసులు గుర్తించారు. మందస ఎస్ఐ వి.సందీప్‌కుమార్ ఆధ్వర్వంలో బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వివరా లిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలో బరంపురానికి చెందిన ఆశి ష్‌కుమార్ ఆచార్య 9వ తరగతి చదువుతున్నాడు. తరచూ మొబైల్ వినియోగిస్తుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆశిష్ ఇంటి నుంచి పారిపోయి మందస చేరుకున్నాడు. మఖరజోల ప్రాంతంలో పోలీసులు గుర్తించి ఆరా తీసి కౌన్సెలింగ్ ఇవ్వడంతో వివరాలు చెప్పాడు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తల్లిదండ్రులు ఆనంద్‌కుమార్, కమలకాంత్‌మిశ్రో హుటాహుటిన మందస చేరుకున్నారు. ఆశిష్‌ను శనివారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఎస్ఐ సందీప్‌కుమార్‌తో పాటు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఛైల్డ్‌లైన్ సిబ్బంది సునీత, మహిళా పోలీసు హారతి కూడా ఉన్నారు. చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి... -
పోలీస్‌స్టేషన్‌కు యూకేజీ పిల్లోడు.. ‘మీరంతా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయండి’
పలమనేరు: తమ పాఠశాల వద్ద జేసీబీ, ఇతర వాహనాలను అడ్డుగా నిలపడంతో స్కూల్ బస్సులు ఆపాలన్నా, బడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ వల్ల ఇబ్బందిగా ఉందని ఓ యూకేజీ పిల్లోడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో యూకేజీ చదువుతున్న కార్తికేయ (06) నిత్యం బడి వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తడాన్ని గమనించాడు. ఈ సమస్య తీరాలంటే ఎవరితో చెప్పాలని తన తండ్రిని అడగ్గా పోలీసులకు చెప్పాలంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో శనివారం ఉదయం కార్తికేయ పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం నాన్నా.. అంటూ మారాం చేయడంతో తండ్రి స్టేషన్ వద్దకు తీసుకెళ్లాడు. వెంటనే లోనికెళ్లిన బుడతడు సీఐ భాస్కర్ వద్దకెళ్లి.. వెంటనే మీరంతా వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయండి అంటూ బుడిబుడిమాటలతో ధైర్యంగా అడిగాడు. ఓ కానిస్టేబుల్‌ను పంపుతామని సీఐ చెప్పడంతో వద్దు సార్.. మీరే రావాలని పట్టుబట్టాడు. ఆ పిల్లాడి ధైర్యానికి సంబరపడిపోయిన సీఐ ఓ మిఠాయి తినిపించి అభినందించాడు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు ఫోన్ చేయమంటూ సీఐ మాటవరసకు చెప్పగా.. ఆ బుడతడు వెంటనే ‘ఫోన్ నంబర్ ఇస్తే కదా’ అనడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. తర్వాత సీఐ ఓ పేపర్‌పై తన సెల్ నెంబరు రాసిచ్చి పంపాడు. అనంతరం ఓ కానిస్టేబుల్‌ను పంపి స్కూల్ వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉంచారు. దీన్నంతా సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడా వీడియో నెట్టింట హల్చల్ సృష్టిస్తోంది. -
ఆడుకుంటూ స్క్రూలు మింగిన బాలుడు.. ఎక్స్‌రే చూస్తే షాక్ అవ్వాల్సిందే..
వర్ధన్నపేట(వరంగల్ జిల్లా): బాలుడు ఆడుకుంటూ స్క్రూలు మింగిన ఘటన శనివారం మండలంలోని రామోజీ కుమ్మరిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రామోజీ కుమ్మరిగూడెంకు చెందిన రామ్మూర్తి దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు ఆయాన్ష్ (సంవత్సరంన్నర) ఆడుకుంటూ గురువారం సాయంత్రం మూడు స్క్రూలు మింగాడు. చదవండి: ఒకే మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే ఇది గమనించిన తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురై బాలుడి గొంతులోంచి ఒక స్క్రూ తీయగా మరొకటి బాలుడు గట్టిగ ఊయడంతో బయటపడింది. మరో స్క్రూ గొంతులోంచి కడుపులోకి వెళ్లింది. దీంతో బాలుడికి అవస్థ ఎక్కువగా కావడంతో శనివారం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా కడుపులో స్క్రూ ఉన్నట్లు తేలింది. అయితే భయపడాల్సిన అవసరం లేదని, మలవిసర్జన ద్వారా బయట పడుతుందని వైద్యుడు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
పసి ప్రాణం తల్లడిల్లిపోయింది
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం): చిన్ని ప్రాణం తల్లడిల్లిపోయింది. సూది గుచ్చుకుంటేనే తట్టుకోలేని వయసులో 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైరు తలగడంతో ఆ గుండె ఆగిపోయింది. మండలంలోని మారుమూల పొల్లగిరి జన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఐదో తర గతి చదువుతున్న మండంగి ప్రవీణ్‌కుమార్ (11) బుధవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. విద్యార్థి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆశ్రమ పాఠశాల నుంచి బయటకు వెళ్లా డు. అతడు నడుచుకుంటూ వెళ్తున్న దారిలో 11కేవీ హైటెన్షన్ వైరు తెగి పడి ఉంది. అది ఓ ఐరన్‌పోల్‌కు తాకి ఉండడం, విద్యార్థి ఆ స్తంభానికి సమీపంలోకి వెళ్లడంతో షాక్ తగిలిందని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థిది పాలకొండ మండలం వంతవాడ కాలనీ గ్రామం. తండ్రి సూర్యారా వు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తల్లి సత్య వతి కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా రు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నవాడు ప్రవీణ్ పొల్లలో తాత ఇంటి వ ద్ద ఉంటూ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నా డు. కొడుకు చనిపోయాడనే వార్త విని ఆమె గుండెలవిసేలా రోదించారు. పొల్ల సర్పంచ్ ఆరిక గంగారావుతో పాటు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీఓ నవ్య, గిరిజన సంక్షేమాధికారులకు స్థానికులు సమాచారం అందించారు. ఏటీడబ్ల్యూఓ వెంకటరమణ పొల్ల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థి దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించినట్టు గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమల తెలిపారు. దోనుబాయి ఎస్ఐ కిశోర్‌వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పబ్ జీ గేమ్‌కి బానిసగా మారి.. తల్లిదండ్రులనే మరచిపోయాడు!
సాక్షి, అనంతపురం: ఆన్లైన్ గేమ్ పబ్జీ అంటే యువతతో సహా పిల్లలకు ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆ గేమ్‌కి బానిసగా మారి ప్రాణలు మీదకు తెచ్చుకుట్టుంటే మరి కొందరు ప్రాణాలే పోగుట్టుకుంటున్నారు. తాజాగా పబ్ జీ గేమ్ ఆడుతూ ఓ బాలుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన సుబ్బారాయుడు 8 వతరగతి విద్యార్థి చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతను ఈ ఆటను ఆడటం ప్రారంభించాడు. అయితే మూడు నెలలుగా పబ్ జీ ఆట వ్యసనంగా మారి అదే పనిగా ఆడటంతో బాలుడు తల్లిదండ్రులను గుర్తించ లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం బాలుడి కర్నూలులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కొడుకు పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఏఎస్ఐని మాట్లాడుతున్న అర్జెంటుగా రూ.10వేలు పంపు.. -
ఆ పాఠశాలకు అందరూ స్కర్టుతోనే రావాలి.. ఎందుకో తెలుసా?
లింగ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో స్కాట్లాండ్లోని ఓ పాఠశాల వినూత్న ఆలోచన చేసింది. పాఠశాలలోని బాలురు, బాలికలతోపాటు టీచర్లు కూడా స్కర్ట్స్ ధరించి క్లాస్‌లోకి రావాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఎడిన్‌బర్గ్‌లోని కాసిల్‌వ్యూ ప్రైమరీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మొదటిసారిగా ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కర్ట్ ధరించి పాఠశాలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ టీచర్ తన ట్విటర్లో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. చదవండి: సమాజ్‌వాదీ అత్తర్‌పై మీమ్స్.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్లు స్కూల్ పిల్లలందరికి సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చామని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు రాసిన లేఖలో తెలిపారు. స్కర్ట్ లోపల లెగ్గిన్, ప్యాంట్ లాంటివి ధరించవచ్చని పేర్కొన్నారు. అంతేగాక ఒకవేళ స్కర్ట్ కొనలేని వారికి స్కూల్ యాజమాన్యమే పిల్లలకు వాటిని ఆఫర్ చేసిందన్నారు. బట్టలకు లింగ బేధం లేదనే సందేశాన్ని తెలియజేయడానికే తాము ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మనం ఎంచుకున్న విధంగా మన భావాలను వ్యక్తీకరించడానికి మనందరికీ స్వేచ్ఛ ఉందనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఇలా చేశామని పేర్కొన్నారు. చదవండి: తొలిసారి పిజ్జా రుచి చూసిన బామ్మ.. ఆమె చిరునవ్వుకు నెటిజన్ల ఫిదా కాగా ఇలా ధరించడం ఇష్టం లేని వారిని మేం ఏం బలవంతం చేయలేదని అంటున్నారు. ఇష్టం ఉన్న వారే ధరించాలని కోరినట్లు తెలిపారు. విద్యార్థులు తమ అభిప్రాయాన్ని స్వేచ్చగా చెప్పేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే సదరు పాఠశాల తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తుంటే మరికొందరు తప్పబడుతున్నారు.లింగ సమానత్వం అంటే ఒకే విధమైన దుస్తులు ధరించడం లేదా పంచుకోవడం కాదని, అందరికి సమాన అవకాశాలు, బాధ్యతలు, హక్కులు కల్పించడమని చెబుతున్నారు. P6 have been learning about the importance of breaking down gender stereotypes. We have organised a ‘Wear a Skirt to School Day’ to raise awareness of #LaRopaNoTieneGénero campaign. This will be on Thursday 4th November and we’d love everyone to get involved! 👗 @Castleview_PS pic.twitter.com/Bby6JKzUJz — Miss White (@MissWhiteCV) October 27, 2021 -
ఐస్‌క్రీం కోసం వెళ్లి, తిరిగి వస్తుంటే..
రాయగడ( భువనేశ్వర్): జిల్లా కేంద్రంలోని కొరాపుట్ మార్గం నువాసాహి రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. మృతుడు ఆర్కే నగర్ స్వీపర్ కాలనీలో నివసిస్తున్న సునీల్ సామల్ కుమారుడు సుధాంశుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ ఎస్కే సత్పతి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం సుధాంశు ఐస్‌క్రీం కొనుక్కునేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో చిన్నారి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని స్వీపర్ కాలనీవాసులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళన చేపట్టారు. చదవండి: వంద కోసం అటెండర్ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది -
సెలవు కావడంతో సైకిల్ తీసుకుని బయటకు వెళ్లాడు.. అంతలో..
సాక్షి,మద్దికెర( కర్నూలు): పెరవలి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, నరసయ్య దంపతులకు కురవ రంగస్వామి (13) ఒక్కగానొక్క కుమారుడు. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. సోమవారం భారత్ బంద్ కారణంగా పాఠశాలకు సెలవు కావడంతో గ్రామ శివారులో ఉన్న ఈద్గా వద్ద సైకిల్ తొక్కుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రంగస్వామిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. సమాచారం అందుకున్న ఎస్ఐ మమత సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. టిప్పర్ డ్రైవర్ రమేష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామ సమీపంలో జరుగుతున్న రైల్వే పనులకు మట్టి, కంకర తరలించే టిప్పర్లు అతి వేగంగా వెళ్తున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రేమ.. యువతి ఆత్మహత్యాయత్నం -
చదివింది తొమ్మిది.. పనులు చూస్తే..
సాక్షి, భైంసా: అసలే కరోనా కాలం.. బడులు మూతపడ్డాయి. పిల్లలంతా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సాయికృష్ణ మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. రోజూ తను చూసే సైకిల్‌కు ఎలక్ట్రికల్ పరికరాలు బిగించి.. రూ.8 వేలలోనే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి ఔరా అనిపించాడు. చూసినవాళ్లు అతడిని మెచ్చుకుంటున్నారు. సాయికృష్ణ తండ్రి పోతన్న గుమాస్తా. తల్లి సురేఖ బీడీ కార్మికురాలు. బడులు మూతపడడంతో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలని అనుకున్నాడు. తన వద్ద ఉన్న సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్చే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. వెంటనే తన సైకిల్‌కు రెండు బ్యాటరీలు, ఒక హెవీ మోటార్‌ను బిగించి వాటిని వైర్లతో అనుసంధానించాడు. ఈ రెండు బ్యాటరీలను ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. మోటార్ సాయంతో 50 కిలోమీటర్ల వరకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి రూ.8 వేల వరకు ఖర్చయిందని, ఆ డబ్బు తన తండ్రి ఇచ్చాడని తెలిపాడు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్నాడీ బాలుడు. ( చదవండి: యాక్టింగ్ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు.. ) -
చదువు ఇష్టంలేక ఆత్మహత్య!
మల్కాజిగిరి: చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. వసంతపురి కాలనీకి చెందిన కారింగుల విజయ్‌కుమార్ కారు డ్రైవర్. ఇతని పెద్ద కుమారుడు అర్జున్‌కుమార్(14) స్ధానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చదువుపై ఇష్టం లేకపోవడంతో పలుమార్లు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఈ నెల 6 వ తేదీ ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీలో ఉన్న విజయ్‌కుమార్‌కు ఫోన్‌చేసిన అర్జున్ సోదరి మీనాక్షి తమ్ముడు బాత్రూమ్లో టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. కాగా.. వెంటనే కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వారి సహకారంతో అర్జున్కుమార్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటన విజయ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శుభకార్యాలకు వస్తారు.. విలువైన వస్తువులు కొట్టేస్తారు -
ప్రాణం తీసిన పబ్జీ..
సాక్షి, కుల్కచర్ల: పబ్జీ గేమ్ కారణంగా ఓ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన అతడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని బండవెలికచర్లలో గురువారం చోటుచేసుకుంది. ఉప్పరి అనంతయ్య దంపతులు కుల్కచర్లలో పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి చిన్న కుమారుడు ఓంకార్ (15) స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. దీంతో అనంతయ్య అప్పు చేసి మరీ మూడు నెలల క్రితం కొడుకు కోసం సెల్‌ఫోన్ కొన్నాడు. బాలుడు నిత్యం ఆన్లైన్ తరగతుల పేరుతో పబ్జీ గేమ్ ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఈ విషయం గమనించిన అనంతయ్య గురువారం కుమారుడిని మందలించాడు. ఎప్పుడూ ఫోన్‌తోనే ఉంటున్నావని.. కేవలం ఆన్లైన్ క్లాసులున్నప్పుడే వినాలని చెప్పాడు. ఫోన్ ఎక్కువగా వాడితే ఆరోగ్యం పాడవుతుందన్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఓంకార్ ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు. -
కరోనా బారిన పడి 14 ఏళ్ల బాలుడి మృతి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ యువతీ యువకులను ఏమీ చేయలేదని, 50 ఏళ్లు దాటిన మధ్య వయస్కులకు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ప్రాణాంతకమని, అది కూడా ఊపిరితిత్తులు, క్యాన్సర్, మధుమేహం లాంటి జబ్బులతో బాధ పడుతున్న వారికేనంటూ ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ఇంతకాలం చెబుతూ వచ్చారు. అది ఒట్టి అపోహ మాత్రమేనని, కరోనా వైరస్ అన్ని వయస్కుల వారికి ప్రాణాంతకమని ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటోన్న మృతుల వివరాలను విశ్లేషిస్తే సులభంగానే అవగమవుతోంది. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం) పోర్చుగల్ దేశంలోని దక్షిణ పోర్టో ప్రాంతానికి చెందిన విటార్ గోడిన్హో అనే 14 ఏళ్ల బాలుడు కరోనా బారిన పడి ఆదివారం ఉదయం శాంటా మారియా డా ఫియెరా ఆస్పత్రిలో మరణించారు. ఆయన ఇంతకుముందే సొరియాసిస్‌తో బాధ పడుతున్నప్పటికీ అనారోగ్య సమస్యలేమీ లేవని డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రపంచంలో కరోనా బారిన పడి మరణించిన అత్యంత పిన్న వయస్కుడే ఆ బాలుడే కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. వారం రోజుల క్రితమే జూలి ఆలియట్ అనే 16 ఏళ్ల బాలిక కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఆమెకు గతంలో ఎలాంటి జబ్బులు లేవని, స్వల్ప దగ్గుతో బాధ పడుతున్న స్కూల్ గర్ల్ జూలి ఆలియట్ బుధవారం పారిస్ ఆస్పత్రులో మరణించారు. కరోనా వైరస్‌తో ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లండన్‌లో చెఫ్‌గా పని చేస్తోన్న 19 ఏళ్ల ఇటాలియన్ లుకా డీ నికోలా వైరస్ బారిన పడి మంగళవారం సాయంత్రం మరణించారు. అంతకుముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పైగా యువకుడని, ఆయనేం కాదంటూ డాక్టర్ బరోసా ఇచ్చినప్పటికీ ఆ యువకుడిని మృత్యువు కబళించింది. ఆయన లండన్‌లోని ఎన్ఫీల్డ్లో తల్లి క్లారిస్సా, పార్ట్నర్ విన్సెంజోతో కలిసి ఓ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం లుకా డీ నికోలా అంతకుముందు వారం రోజులుగా దగ్గూ జ్వరంతో బాధ పడుతున్నారు. స్థానిక డాక్టర్ వద్దకు వెళ్లగా ‘పారసిటమాల్’ ట్యాబెట్లు ఇచ్చి పంపించారు. దగ్గు తగ్గక పోవడంతో కరోనా వైరస్‌గా భావించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి మళ్లీ చూపించారు. యవ్వనంలో ఉండడం వల్ల, ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేదనందున కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ భరోసా ఇచ్చిన రోజు సాయంత్రమే ఆయన మరణించారు. ఆ తర్వాత కరోనాతోనే ఆయన మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. (చదవండి: కరోనా చికిత్సకు కొత్త పరికరం) -
నాన్న! బతకాలనిలేదు అందుకే దూకేస్తున్నా..
సాక్షి, సిర్పూర్ : ఒక్కగానొక్క కుమారుడు.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎప్పుడూ వెంటే పెట్టుకుని తిరిగారు. అంతలోనే ఆ బాలుడికి ఫిట్స్ ఉందని తెల్సింది. అప్పటినుంచి అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంతలో ఆ బాలుడికి ఏమనిపించిందో ఏమో.. తండ్రి ఎదుటే జలపాతంలో దూకాడు. ఈ సంఘటన సిర్పూర్ (యూ) మండలం పంగిడి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. 20 గంటల అనంతరం ఆ బాలుడు విగతజీవిగా కనిపించాడు. స్థానికులు, ఏఎస్సై అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేశ్ముఖ జైరాం, పార్వతికి దేశ్‌ముఖ్ శివ్‌దాస్(15) ఏకైక సంతానం. జైనూర్ మండలం పోచంలొద్ది ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా ఫిట్స్ వస్తుండడంతో ఇంటి వద్ద నుంచే పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం శివ్‌దాస్ పాఠశాలకు వెళ్లలేదు. దీంతో తండ్రి గ్రామ శివారులోని పంట చేనుకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో తండ్రి ఇంటికి అన్నం తినేందుకు వెళ్లగా.. శివ్‌దాస్ అక్కడే ఉండిపోయాడు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తండ్రికి ఫోన్ చేసి గ్రామ సమీపంలోని కుండై జలపాతం వద్ద ఉన్నానని, త్వరగా రావాలి అంటూ ఫోన్ పెట్టేశాడు. కంగారుపడిన తండ్రి తనతోపాటు మరో నలుగురు గ్రామస్తులను తీసుకుని వెంటనే జలపాతం వద్దకు బయల్దేరాడు. వారిని చూసిన శివ్‌దాస్ తనవద్ద ఉన్న సెల్‌ఫోన్ కిందపెట్టి జలపాతంలోకి దూకాడు. తండ్రి దూకొద్దంటూ కేకలు వేసినప్పటికీ వినిపించుకోలేదు. అప్పటికే చీకటి పడటంతో శివ్‌దాస్ ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం ఆసిఫాబాద్ నుంచి ఈతగాళ్లను రప్పించి వెతికించగా.. విగతజీవిగా కనిపించాడు. ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దివికేగిన బాలమేధావి
సాక్షి, తిరుపతి తుడా : అమ్మ ఆలన, నాన్న లాలన ఎరుగని వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు తిరుపతి ఎస్టీవి నగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి ఎం.లక్ష్మీపతి. కొన్నాళ్ల పాటు తన పెద్దమ్మ ఆలనాపాలనా చూసింది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఇబ్బందులు తప్పలేదు. అయితే లక్ష్మీపతి తెలివితేటలను గుర్తించి ఉపాధ్యాయులు అతడికి చేయూతనిచ్చారు. ఏలోటూ రానీయకుండా విద్యనందించడంతో పాటు అతని ప్రతిభకు పదును పెట్టారు. సరికొత్త ఆయుధాల సృష్టికర్త కావాలన్న అతని కలలను సాకారం చేసుకునే దిశగా ప్రోత్సహించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన ప్రతిభను చాటుతూ గురువులు మెచ్చే శిష్యుడిగా పేరుగడించాడు. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. అనారోగ్యంతో మృత్యువాడ పడ్డాడు. లక్ష్మీపతికి ఉపాధ్యాయులే తల్లిదండ్రులై దహన సంస్కారాలు నిర్వహించారు. తోటి విద్యార్థులే తోబుట్టువులై ఆఖరి ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ విషాద సంఘటన బుధవారం తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతిలోని శ్రీపండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న లక్ష్మీపతి అనారోగ్యంతో మృతి చెందాడు. చెన్నైలో జరుగుతున్న దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్ధమైన లక్ష్మీపతి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఉపాధ్యాయులు హుటాహుటిన అతడిని మంగళవారం స్విమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఊహించని రీతిలో అనారోగ్య సమస్యలు బైటపడటం టీచర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. లక్ష్మీపతి గుండెకు రెండు రంధ్రాలు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంతేకాకుండా లివర్ పూర్తిగా చెడిపోయిందని, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి తీవ్ర సమస్యలున్నట్లు తేలింది. చికిత్స ప్రారంభించినప్పటికీ అతని శరీరం సహకరించకపోవడంతో బుధవారం అతను కన్నుమూశాడు. అందుకున్న సర్టిఫికెట్లు, మెమెంటోలతో లక్ష్మీపతి ఉపాధ్యాయులే తల్లిదండ్రులై.. చిన్నప్పటి నుంచే లక్ష్మీపతి చూపుతున్న తెలివితేటలకు తోటి విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యచకితులయ్యేవారు. తల్లిదండ్రులు లేని అతనికి ఉపాధ్యాయులే తల్లిదండ్రులై అక్కున చేర్చుకున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయిని రేణుకాదేవి మూడో తరగతి నుంచి అన్నీ తానై లక్ష్మీపతికి అవసరమయ్యే అన్ని సదుపాయాలను సమకూర్చారు. ఆమెతో పాటు మరికొందరు టీచర్లు లక్ష్మీపతికి తోడుగా నిలిచి ప్రోత్సహించారు. సైన్స్‌పై ఆసక్తి చూపుతున్న లక్ష్మీపతికి అవసరమైన పరిశోధన సామగ్రిని ఉపాధ్యాయులు సమకూర్చారు. కన్నీటి సంద్రమైన పాఠశాల లక్ష్మీపతి ఇక లేడు– అని తెలుసుకున్న టీచర్లు, తోటి విద్యార్థులు తల్లడిల్లిపోయారు. లక్ష్మీపతి భౌతికకాయాన్ని పాఠశాలలోనే సందర్శనార్థం ఉంచడంతో నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు తరలివచ్చి నివాళులర్పించారు. తోటి విద్యార్థులు భోరుమంటూ విలపించడం అక్కడ ఉన్న టీచర్లను సైతం కంటతడి పెట్టించింది. సాయంత్రం పాఠశాల నుంచి గోవిందధామం వరకు అంతిమయాత్రగా లక్ష్మీపతి భౌతికకాయాన్ని తరలించగా ఎన్సీసీ క్యాడెట్లు గౌరవ వీడ్కోలు పలికారు. గోవిందధామం వద్ద ఎమ్మెల్యే యండపల్లి శ్రీనివాసులు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు తదితరులుæ నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో టీచర్లు, విద్యార్థులు వందలాదిగా పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. పరిశోధనలంటే ఆసక్తి చిన్నతనం నుంచే సైన్స్ అంటే అమితమైన ఆసక్తి కనబరిచే లక్ష్మీపతి ఎప్పుడూ ఏదో ఒక పరిశోధనలతో పాఠశాల ల్యాబ్‌లో గడిపేవా డు. వెపన్ సైంటిస్ట్‌గా రాణించి దేశానికి సేవలందించాలని కలలు కనేవాడు. యుద్ధంలో సైనిక నష్ట నివారణకు వినూత్న ఆవిష్కరణలు చేయాలని, అలాగే రైతులకు మేలు చేయాలని తపించేవాడు. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో బాల మేధావిగా, బాల శాస్త్రవేత్తగా పలువురి ప్రశంసలందుకున్నాడు. తాను ఆవిష్కరించిన పలు సైన్స్ నమూనాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తమ విద్యార్థిని కోల్పోయాం లక్ష్మీపతి చదువులో బాగా రాణించేవాడు. ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేస్తూ వినూత్న ఆవిష్కరణతో అబ్బురపరిచేవాడు. తన మేధాశక్తితో స్కూలుకు పేరుప్రతిష్టలు తెచ్చాడు. పెద్దయ్యాక దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అవుతాడని భావించాం. ఇలా చనిపోతాడని ఊహించనేలేదు. ఒక ఉత్తమ విద్యార్థిని మేమంతా కోల్పోయాం. –పి.వరలక్ష్మి, ప్రధానోపాధ్యాయిని, ఎస్పీజేఎన్ఎం ఉన్నత పాఠశాల కన్న బిడ్డలా చూసుకున్నా లక్ష్మీపతిని కన్నబిడ్డలా చూసుకున్నా. అతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో మూడో తరగతి నుంచి చదివిస్తూ నా చేతులతో పెంచాను. మిగిలిన ఉపాధ్యాయులు కూడా అదే స్థాయిలోనే వెన్నుతట్టి ప్రోత్సహించారు. అనారోగ్య సమస్యను ముందుగా గుర్తించి ఉంటే అతనిని కాపాడుకునేవాళ్లం. దేవుడు అన్యాయం చేసి మా నుంచి దూరం చేశాడు. –రేణుకాదేవి, ఉపాధ్యాయిని -
ఆడుకుంటూ.. అనంతలోకాలకు..
సాక్షి, పెందుర్తి: పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయి మృతి చెందిన ఘటన పెందుర్తి సమీపంలోని పాపయ్యరాజుపాలెంలో చోటుచేసుకుంది. ఫిట్స్ కారణంగా విద్యార్థి మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే అనారోగ్యానికి గురైన తమ బిడ్డను ఆసుప్రతికి తరలించడంతో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించగా... తాము సకాలంలోనే స్పందించి తల్లిదండ్రులకు సమాచారం అందించామని పాఠశాల యాజమన్యం చెబుతుంది. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాకు చెందిన పంచం సతీష్, సుమిత్ర దంపతులు 2002లో విశాఖ వచ్చి పాపయ్యరాజుపాలెంలో స్థిరపడి అక్కడే టైల్స్ వ్యాపారం చేసుకుంటున్నారు. వీరికి హితేష్(13), శుభం అనే ఇద్దరు కుమారులు. పిల్లలిద్దరూ ఇంటికి సమీపంలో ఉన్న ఆక్స్ఫర్డ్ పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం హితేష్ 8వ తరగతికి వచ్చాడు. కాగా సోమవారం ఆటల సమయంలో పాఠశాల ఆవరణలో హితేష్ తోటి పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడు. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పగా వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలుడిని గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే హితేష్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజుకున్న వివాదం మరోవైపు హితేష్ మరణంపై వివాదం రాజుకుంది. పాఠశాల యాజమాన్యం సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల వద్దకు విద్యార్థి మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెందుర్తి సీఐ వెంకునాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై పాఠశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్‌రెడ్డి స్పందిస్తూ విద్యార్థి మృతికి తమ నిర్లక్ష్యం కారణం కాదని స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
బాలుడు స్కూలుకు వేళ్లలేదని మేనమామ దాష్టికం