
వర్ధన్నపేట(వరంగల్ జిల్లా): బాలుడు ఆడుకుంటూ స్క్రూలు మింగిన ఘటన శనివారం మండలంలోని రామోజీ కుమ్మరిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రామోజీ కుమ్మరిగూడెంకు చెందిన రామ్మూర్తి దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు ఆయాన్ష్ (సంవత్సరంన్నర) ఆడుకుంటూ గురువారం సాయంత్రం మూడు స్క్రూలు మింగాడు.
చదవండి: ఒకే మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే
ఇది గమనించిన తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురై బాలుడి గొంతులోంచి ఒక స్క్రూ తీయగా మరొకటి బాలుడు గట్టిగ ఊయడంతో బయటపడింది. మరో స్క్రూ గొంతులోంచి కడుపులోకి వెళ్లింది. దీంతో బాలుడికి అవస్థ ఎక్కువగా కావడంతో శనివారం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా కడుపులో స్క్రూ ఉన్నట్లు తేలింది. అయితే భయపడాల్సిన అవసరం లేదని, మలవిసర్జన ద్వారా బయట పడుతుందని వైద్యుడు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment