గర్భవతుల్లో కాళ్ల వాపులు కనిపించే ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో జెస్టెషనల్ ఎడిమా అంటారు. మామూలుగానైతే దీని గురించి ఆందోళన పడాల్సిందేమీ లేదు. అయితే ఇలా వాపు కనిపిస్తున్నప్పుడు గర్భవతుల్లో హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఉందేమో చూడాలి. కాళ్ల వాపునకు అదో కారణం కావచ్చు.
ఇక మన భారతీయ మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. కాళ్ల వాపులకు ఈ అంశం కూడా ఒక కారణమే. మహిళల్లో హిమోగ్లోబిన్ మోతాదులు కనీసం 11 ఉండటాన్ని ఒక మోస్తరు సాధారణంగా పరిగణిస్తుంటారు. కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం మామూలే.
ఇక కొందరు మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉండి, వాళ్లు గర్భం దాల్చినప్పుడు కూడా కాళ్లవాపులు కనిపించవచ్చు. వాళ్లు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.
(చదవండి: ఫిట్‌నెస్ ఎలాస్టిక్ రోప్: దెబ్బకు కొవ్వు మాయం..!)
Comments
Please login to add a commentAdd a comment