swallowed
-
ప్రసవం ముందు కాళ్ల వాపులా..?
గర్భవతుల్లో కాళ్ల వాపులు కనిపించే ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో జెస్టెషనల్ ఎడిమా అంటారు. మామూలుగానైతే దీని గురించి ఆందోళన పడాల్సిందేమీ లేదు. అయితే ఇలా వాపు కనిపిస్తున్నప్పుడు గర్భవతుల్లో హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఉందేమో చూడాలి. కాళ్ల వాపునకు అదో కారణం కావచ్చు. ఇక మన భారతీయ మహిళల్లో రక్తహీనత చాలా ఎక్కువ. కాళ్ల వాపులకు ఈ అంశం కూడా ఒక కారణమే. మహిళల్లో హిమోగ్లోబిన్ మోతాదులు కనీసం 11 ఉండటాన్ని ఒక మోస్తరు సాధారణంగా పరిగణిస్తుంటారు. కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం మామూలే. ఇక కొందరు మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉండి, వాళ్లు గర్భం దాల్చినప్పుడు కూడా కాళ్లవాపులు కనిపించవచ్చు. వాళ్లు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. (చదవండి: ఫిట్నెస్ ఎలాస్టిక్ రోప్: దెబ్బకు కొవ్వు మాయం..!) -
హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!
పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంతవైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషయం గురించి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ తెలిపారు.“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన 52 ఏళ్ల ఉద్యోగి సుమారు రెండు మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. దంతవైద్యులు ఆయనకు ఎప్పటికీ అతుక్కునే ఉండే పళ్ల సెట్ అమర్చారు. అయితే, అవి కూడా అప్పుడప్పుడు ఊడే ప్రమాదం ఉంటుంది. ఈయన నిద్రలో ఉన్నప్పుడు అలాగే అది ఊడిపోయింది. అప్పుడు ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇది ఇరుక్కుంది. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో రోగి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ముందుగా ఎక్స్ రే, తర్వాత సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది. దాంతో ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాం. దానికి రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఒకవేళ అలా గాయమైతే అక్కడినుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యింది, దాన్ని కూడా వెంటనే సరిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కాలేదు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీ బాగా ఉపయోగపడుతుంది.సాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ భరత్ తెలిపారు.పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి(చదవండి: పెద్దపేగు కేన్సర్ నివారణకు...) -
ట్యాంకర్‌ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా..
రోడ్డుపైన గుంతల్లో వాహనాలు కూరుకుపోయిన దృశ్యాలు చాలానే చూసుంటారు. కానీ ఏకంగా వాహనం వాహనమే గుంతలో కూరుకుపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన ట్యాంకర్ వెళ్తుండగా రోడ్డుపై పెద్ద గుంత పడింది. మొదట ట్యాంకర్ వెనక టైర్లు కుంగగా.. ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ వెనక నుంచి అందులో పడిపోయింది. అందరూ చూస్తుండగానే వాహనం గుంతలోకి చేరిపోయింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగింది ఈ వింత ఘటన. బుద్వార్ పెత్ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ నిమిత్తం ట్యాంకర్ వచ్చింది.గుంతలో ట్యాంకర్ కూరుకుపోవడానికి కొన్ని క్షణాల ముందే అక్కడ నుంచి కొంత మంది నడుచుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తోంది. అకస్మాత్తుగా భారీ గొయ్యి ఏర్పడటం, ట్యాంకర్ అందులో కూరుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ గొయ్యిలో మురుగు నీరు ఉండగా.. దాదాపుగా ట్యాంకర్ క్యాబిన్ వరకు ఆ మురుగు నీటిలో మునిగిపోయింది.అయితే అది గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి.. బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఓ వ్యక్తి సాహసోపేతంగా గొయ్యి వద్దకు వెళ్లి, డ్రైవర్‌కు సాయం అందించాడు. ట్యాంకర్ క్యాబిన్ భాగం మునగిపోకపోవడంతోనే డ్రైవర్ సురక్షితంగా బయటపడగలిగాడు. అయితే, అక్కడ ఫ్లోర్ ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయింది అని ఆరా తీయగా.. గతంలో అక్కడ బావి ఉండేదని ఓ అధికారి వెల్లడించారు. పాత బావికి స్లాబ్ వేసి.. దానిపై పేవర్ బ్లాక్స్ వేశారని చెప్పారు. రెండు క్రేన్ల సాయంతో ట్యాంకర్‌ను బయటికి తీశామని తెలిపారు.Pune Municipal Corporation truck fell into a pothole on the road at Samadhan Chowk in Pune. pic.twitter.com/jJbpovSsMY— Mohammed Zubair (@zoo_bear) September 20, 2024 -
జైల్లో ఆకస్మిక తనిఖీలు.. మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ..
పాట్నా: బిహార్ గోపాల్‌గంజ్ జిల్లా జైల్లో ఓ ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఫోన్ విషయం బయటపడుతుందని భయపడి దాన్ని అమాంతం నోట్లో వేసుకున్నాడు. హమ్మయ్య ఇక ఎవరూ కనిపెట్టలేరని ఊపిరిపీల్చుకున్నాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అయితే ఆదివారం ఇతనికి అసలు సమస్య మొదలైంది. భరించలేని కడుపునొప్పి వచ్చింది. దీంతో అధికారులకు అసలు విషయం చెప్పేశాడు. తన పొట్టలో మొబైల్ ఉందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. దీంతో అధికారులు వెంటనే అతడ్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్-రే తీయగా అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు తేలింది. దాన్ని బయటకు తీసేందుకు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అనంతరం ఖైదీని పాట్నా మెడికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్ మింగేసిన ఈ ఖైదీ పేరు ఖైసర్ అలీ. 2020 జనవరి 17న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అయితే ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్ ఎలా చేరిందని ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. జైలు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిహార్ జైళ్లలో ఖైదీల వల్ల మొబైల్ ఫోన్లు బయటపడటం సాధారణమైపోయింది. 2021 మార్చి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 35 సెల్ఫోన్లు ఖైదీల వద్ద లభ్యమయ్యాయి. భారత్‌లోని జైళ్లలో మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయినా కొందరు ఖైదీలు వీటిని ఉపయోగిస్తున్నారు. చదవండి: దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్ -
Medak: నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు
సాక్షి, మెదక్: ఓ వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తూ చేప ముల్లును మింగేశాడు. అప్పటి నుంచి నరకయాతన అనుభవించిన సదరు వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు ముల్లును తొలగించాడు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన సాయిలు నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తుండగా రెండు అంగుళాల పొడవుగల చేప ముల్లును మింగేశాడు. దీంతో అప్పటి నుండి ఇబ్బంది పడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందాడు. 15 రోజులుగా భరించలేని కడుపు నొప్పి రావటంతో అతను మెదక్‌లోని సాయిచంద్ర నర్సింగ్‌హాం ఆస్పత్రిలో చూపించుకోగా సదరు వైద్యుడు సురేశ్ శస్త్రచికిత్స చేసి ఆ ముల్లును బయటకు తీశాడు. వైద్యవృత్తిలో ఇది చాలా అరుదైన అంశంగా పలువురు పేర్కొన్నారు. -
వామ్మో.. 8 నెలల చిన్నారి ఛాతి మధ్యలో ఏముందో తెలిస్తే షాకే..!
సాక్షి, కర్నూలు: మొనదేలిన పిన్నీసును 8 నెలల చిన్నారి మింగడంతో కర్నూలు వైద్యులు చాకచక్యంగా ఎండోస్కోపీ పరికరంతో దాన్ని తొలగించారు. శనివారం స్థానిక గాయత్రి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన చిన్నారి 8 నెలల నక్షత్ర శనివారం ఉదయం ఆడుకుంటూ పొరపాటును పిన్నీసును మింగేసిందన్నారు. చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం దీంతో తల్లిదండ్రులు పాపను తమ వద్దకు తీసుకు రాగా ఎక్స్‌రే తీసి చూడగా ఛాతి మధ్యలో ఊపిరితిత్తులకు దగ్గరగా ఉన్నట్లు గమనించామన్నారు. మొనదేలి ఉన్నందున లోపల గుచ్చుకోకుండా ఎండోస్కోపి పరికరంతో చాకచక్యంగా బయటకు తీశామన్నారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలని, వారికి సమీపంలో ఇలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. -
నోట్లో గుండుసూది వేసుకుని పొరపాటున మింగేసిన విద్యార్థి
సాక్షి, బెంగళూరు: ఓ విద్యార్థి నోటిలో గుండుసూది వేసుకుని పొరపాటును మింగేశాడు. హోసూరు సమీపంలోని మోర్నపల్లి గ్రామానికి చెందిన ఆనందన్, ధనలక్ష్మి దంపతుల కొడుకు యల్లేష్ (12). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తరగతి గదిలో గుండుసూదిని నోట్లో ఉంచుకొని అకస్మాత్తుగా మింగేశాడు. భయపడిన యల్లేష్ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు వెంటనే హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ చేయగా గుండుసూది కడుపులో ఉన్నట్లు తేలింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. చదవండి: Maharashtra: రాయ్‌గఢ్‌లో టెర్రర్ బోట్ కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా -
గోల్ఫ్ బంతులను మింగిన పాము: ఫోటోలు వైరల్
పాములు, మొసళ్లు, బల్లులు వంటి కొన్ని సరీసృపాలకు మానవుడి తప్పిదాలు వాటికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. బీచ్‌ల వద్ద, నదుల వద్ద పెద్ద ఎత్తున్న ప్లాస్టిక్ వంటి చెత్తచెదారాలను వేసేస్తాం. పాపం ఈ జంతువులు ఏదో ఆహారంగా బావించి తినడం వంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. ఇక్కడొక పాము కూడా అలానే చేసింది. ఏకంగా గోల్ఫ్ బంతులను కోడి గుడ్డుగా బావించి మింగి నరకయాతన అనుభవించింది. వివరాల్లోకెళ్తే....ఇక్కడొక పాము గోల్ఫ్ బంతులను కోడి గుడ్లనుకుని మింగేసేందుకు ప్రయత్నించింది. ఐతే అవి ఆ పాము శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. దీంతో పాము నరకయాతన అనుభవించింది. ఈ ఘటన నార్త్ కొలరాడో వైల్డ్ లైఫ్ సెంటర్లో చోటు చేసుకుంది. దీంతో ఆ వైల్డ్‌లైఫ్ సెంటర్ అధికారులు స్నేక్ రెస్క్యూ బృందాని పిలిపించారు. ఆ బృందం అసలు విషయం తెలుసుకుని ఆ స్నేక్‌కి సాయం చేశారు. ఆ పాముకి శస్త్ర చికిత్స చేయకుండానే ఆ బంతులను తీసేశారు. సుమారు 30 నిమిషాలు శ్రమించి ఆ పాము శరీరం నుంచి ఆ బంతులను వేరు చేశారు. ప్రస్తుతం ఆ పాము చిన్నపాటి గాయాలతో సురక్షితంగానే ఉంది. ఐతే ఈ పాము చాలా ఆకలిగా ఉండటంతో ఆ గోల్ఫ్ బంతులను చూసి కోడి గుడ్లుగా భ్రమపడి మింగేసిందని వైద్యులు చెబుతన్నారు. (చదవండి: ఆ వైద్యుడు ప్రసంగం ప్రారంభంకాగానే... లేచి వెళ్లిపోయిన విద్యార్థులు: వీడియో వైరల్) -
పామును మింగిన మరో పాము.. వైరలవుతోన్న వీడియో
సాక్షి, ములుగు: ఓ పాము మరో పామును మింగింది. ఆపసోపాలు పడ్డ ఆ పాము మింగిన పామును మళ్ళీ బయటికి వదిలింది. ఈ అరుదైన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గుట్టపై చోటుచేసుకుంది. గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయ ఆవరణలో తాచుపాము మరో పామును మింగి కలకలం సృష్టించింది. పామును మింగిన త్రాచుపాము కదలలేక అష్టకష్టాలు పడింది. చివరకు మింగిన పామును బయటకు వదలలేక తప్పలేదు. అప్పటికే ఆ పాము ప్రాణాలు కోల్పోగా, త్రాచుపాము బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్ళి పోయింది. గుడికి వచ్చిన భక్తులు అరుదైన సన్నివేశాన్ని తమ సెల్ ఫోన్లో బంధించారు. పామును మరో పాము మింగుతున్న దృశ్యాలు.. పూర్తిగా మింగేసి.. మళ్లీ బయటకు వదలడం దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చదవండి: ఆషాఢమాసం ఆరంభం.. శుభముహూర్తాలకు బ్రేక్.. అప్పటి వరకు ఆగాల్సిందే! -
ఆడుకుంటూ స్క్రూలు మింగిన బాలుడు.. ఎక్స్‌రే చూస్తే షాక్ అవ్వాల్సిందే..
వర్ధన్నపేట(వరంగల్ జిల్లా): బాలుడు ఆడుకుంటూ స్క్రూలు మింగిన ఘటన శనివారం మండలంలోని రామోజీ కుమ్మరిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రామోజీ కుమ్మరిగూడెంకు చెందిన రామ్మూర్తి దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు ఆయాన్ష్ (సంవత్సరంన్నర) ఆడుకుంటూ గురువారం సాయంత్రం మూడు స్క్రూలు మింగాడు. చదవండి: ఒకే మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే ఇది గమనించిన తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురై బాలుడి గొంతులోంచి ఒక స్క్రూ తీయగా మరొకటి బాలుడు గట్టిగ ఊయడంతో బయటపడింది. మరో స్క్రూ గొంతులోంచి కడుపులోకి వెళ్లింది. దీంతో బాలుడికి అవస్థ ఎక్కువగా కావడంతో శనివారం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా కడుపులో స్క్రూ ఉన్నట్లు తేలింది. అయితే భయపడాల్సిన అవసరం లేదని, మలవిసర్జన ద్వారా బయట పడుతుందని వైద్యుడు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఏకంగా మొబైల్ ఫోన్ మింగేశాడు.. 6 నెలల తర్వాత ఏమైందో తెలుసా?
సాధారణంగా చిన్నపిల్లలు పాకుతూ నాణేలను, చిన్న చిన్న వస్తువులను మింగడం తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మరీ వింత వింతగా ఏది పడితే అది తినేస్తున్నారు. ఇసుక, మట్టి, వెంట్రుకలు, రాళ్లను కరకరా నమిలేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా మొబైల్ ఫోన్ మింగేసాడు. ఈ విచిత్ర సంఘటన ఈజిప్ట్ దేశంలో చోటుచేసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పితో ఓ వ్యక్తి ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. అయితే వైద్యులు అతని కడుపుని ఎక్క్‌రే తీసి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పేషెండ్ కడుపులో మొబైల్ ఫోన్ కనిపించడంతో వైద్యులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. చదవండి: వైరల్: అభివృద్ధి అన్నందుకు యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే కాగా ఆరు నెలల క్రితం అతను పొరపాటున ఫోన్‌ను మింగిన్నట్లు వైద్యులకు తెలిసింది. అయితే కడపులో నుంచి ఫోన్ సహజంగా బయటకు వస్తుందని ఆ యువకుడు భావించాడు కానీ అది జరగలేదు. మొబైల్ కడుపులో ఇరుక్కొని ఆహారం జీర్ణం కాకుండా అడ్డుకుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈజిప్టులోని అస్వాన్ నగరంలోని ఆసుపత్రిలో అతనికి ఆపరేషన్ చేసి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. మింగేసిన ఫోన్ మూడు భాగాలుగా విడిపోగా.. బ్యాటరీ అతని కడుపులో పేలిపోతుందని వైద్యులు కంగారు పడ్డారు. కానీ చివరికి ఆపరేషన్ సక్సెస్ అయి సురక్షితంగా బయటపట్టాడు. చదవండి: వైరల్: ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ గర్భిణీ పరిస్థితి ఏమయ్యేదో ! -
దుప్పిని మింగిన కొండచిలువ
సాక్షి, ఎర్రావారి పాళెం: చిత్తూరు జిల్లా తలకోన అటవీ ప్రాంతంలోని మొదటి వంక సమీపంలో ఓ కొండచిలువ దుప్పిని మింగేసింది. తర్వాత కదల్లేని స్థితిలో అక్కడే ఉండిపోయింది. సోమవారం మధ్యాహ్నం అటుగా వెళుతున్న తలకోన పర్యాటకులు కొండచిలువను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. చదవండి: రిజర్వేషన్ లేకుండానే రైలు ప్రయాణం -
వైరల్: మేకను మింగిన కొండచిలువ
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని భరద్వాజ తీర్థంలో 13 అడుగుల కొండచిలువ ఆదివారం మేకను మింగేసింది. అది కదలలేని స్థితిలో ఉండగా ఆలయ ఉద్యోగులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు కొండచిలువను పట్టుకుని, మింగిన మేక పిల్లను కక్కించి, రామాపురం అటవీ ప్రాంతంలో వదిలివేశారు. కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. -
చాక్లెట్ అనుకుని గణేశ్ విగ్రహాన్ని మింగేసింది..
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): చాక్లెట్ అనుకుందో ఏమో ఓ చిన్నారి చిన్నపాటి గణేశ్ విగ్రహాన్ని మింగేసింది. తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారి ప్రాణపాయం నుంచి తప్పించుకుంది. బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ ప్రాంతంలో ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో చిన్నపాటి వినాయక విగ్రహం కనిపించకపోవడంతో అనుమానం తలెత్తింది. వెంటనే తమ మూడేళ్ల చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్సరే తీసి పొట్టలో లోహపు విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఎండోస్కోపి ద్వారా చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేకుండా విగ్రహాన్ని బయటికి తీశారు. తల్లిని తరిమేసిన కసాయి మండ్య: ఆస్తి కోసం తన రెండో కుమారుడు దౌర్జన్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని కేఆర్ పేట తాలూకా ఆనేగోళ గ్రామానికి చెందిన కమలమ్మ మీడియా ముందు మొరపెట్టుకుంది. తన భర్త బతికుండగా రెండో కుమారుడు మంజునాథ్‌కు ఇంటి ముందు ఉన్న స్థలాన్ని రాసిచ్చాడని, అయినా ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ఇవ్వాలని దౌర్జన్యం చేసి తనను గెంటేశాడని బోరున విలపించింది. -
చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. తిమింగలం నోటిలో 30 సెకన్ల పాటు
యముడి ఇంటి తలుపు తట్టి రావడం అంటే ఇదేనేమో..! అమెరికాలో ఓ గజ ఈతగాడు దాదాపు ఇదే పనిచేసి వచ్చాడు. చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. ఇంకా భూమిపై నూకలు తినే భాగ్యం ఉంది కాబట్టి బతికి బట్టకట్టాడు. ఇంతకీ ఏమైందంటే అమెరికాలోని కేప్ కాడ్ సముద్రతీర ప్రాంతంలో 56 ఏళ్ల మైఖేల్ పకార్డ్ ఈత కోసం వెళ్లాడు. 45 అడుగుల లోతులో ఉండగా, ఒక్కసారిగా తాను పెద్ద కుదుపునకు గురయ్యాడు. అంతలోనే చుట్టూ చిమ్మచీకటి కమ్ముకుంది. షార్క్ చేప మింగేసిందని మొదట అనుకున్నాడు. అయితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిమింగలం మింగిందని, ఇక తన పని అయిపోయినట్లేనని భావించాడు. హంప్‌బ్యాక్ తిమింగలం నోటిలో దాదాపు 30 సెకన్ల పాటు ఉన్నాడు. గాలి పీల్చుకునేందుకు అవసరమైన పరికరం ఉండటంతో గాలి పీల్చుకోగలిగాడు. చివరకు ఆ తిమింగలం సముద్రం ఉపరితలంపైకి వచ్చి దాని తలను విదిల్చి ఒక్కసారిగా మైఖేల్‌ను ఉమ్మేసింది. దీంతో అతడు బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. ఈ సంఘటన తర్వాత ఆస్పత్రిలో చేరిన మైఖేల్.. తిమింగలం తనను మింగిన విషయాన్ని చెప్పడంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా తిమింగలాలు చేపలను మింగేటప్పుడు నోరు తెరిచి చేపలతో పాటు నీటిని ఒక్కసారిగా మింగేస్తాయని తిమింగలాలపై అధ్యయనం చేసే జూకీ రాబిన్స్ వివరించారు. వీటి నోరు పెద్దగా ఉన్నప్పటికీ, గొంతు మాత్రం చిన్నగా ఉంటుందని, మనుషులను మింగేంత పెద్దగా ఉండకపోవడం వల్లే మైఖేల్‌ను మింగలేక ఉమ్మేసినట్లు తెలిపారు. -
ఈ కప్ప నిజంగా లక్కీఫెలో
సాధారణంగా కప్పలను పాములు మింగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కప్ప ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కోస్టల్ తైపన్ పామును మింగి కూడా ఎప్పటిలాగే ఉండడం విశేషం. అంతేగాక కప్ప పామును మింగేటప్పుడు పలుసార్లు కాటు వేసినా దానికి ఏ విధమైన హాని కలగకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వింత ఘటన ఫిబ్రవరి 4న చోటు చేసుకున్నప్పటికి టౌన్స్‌విల్లే అనే యనిమల్ స్వచ్చంద సంస్థ తన ఫేస్బుక్ పేజీలో ఆరోగ్యంగా ఉన్న కప్ప ఫోటోలను పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. 'ఇప్పటివరకు మేము చూడని ఒక వింత ఘటన మమ్మల్ని చాలా ఆశ్యర్యపరిచింది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కోస్టల్ తైపన్ను ఆకుపచ్చ రంగులో ఉన్న కప్ప మింగడం చూశాము. మేము పామునైతే కాపాడలేకపోయాం కానీ.. దానిని మింగేటప్పుడు ఆ పాము కప్పను పలుసార్లు కాటేయడం గమనించాము. అప్పటికే కప్ప వెనుక శరీర భాగంలో ఆకుపచ్చ రంగులో కొన్ని డాట్స్ కనిపించడంతో ఇక ఎక్కువసేపు బతకదనే భావించాము' అంటూ పోస్ట్ చేశారు. వెంటనే ఆ కప్పను స్వచ్చంద సంస్థకు తరలించి అబ్జర్వేషనలో పెట్టారు. తాజాగా కప్పకు సంబందించిన మరికొన్ని ఫోటోలను ఆ సంస్థ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది. 'పామును మింగినా కప్ప ఆరోగ్యంగానే ఉంది. అది పూర్తిగా కోలుకోగానే దానిని వదిలిపెడతాం' అని పేర్కొన్నారు. ఈ ఫోటోలకు 1.7 మిలియన్ లైకులు వచ్చాయి.' ఇది నిజంగా అద్భుతం. అంత విషపూరితమైన పామును తిని కూడా కప్ప బతికింది' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
గిఫ్ట్ ఇస్తే...మింగేశాడు
శాన్ఫ్రాన్సిస్కో: తల్లిదండ్రులు క్రిస్మస్ గిప్ట్గా ఇచ్చిన ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను ఓ ఏడేళ్ల బాలుడు పొరబాటున మింగేసిన ఘటన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లి భయంతో వణికిపోయారు. వెంటనే తమ కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నామని స్వయంగా బాలుడి తల్లి సోషల్ మీడియాలో వెల్లడించారు. కియారా స్ట్రౌడ్ ఫేస్బుక్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ఆమె తన ఏడేళ్ల కుమారుడు క్యూజెకు క్రిస్మస్ బహుమతిగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను కొనిచ్చారు. కేవలం మూడు రోజుల తరువాత, దాన్ని నోటితో పట్టుకొని పొరపాటున ఒకదాన్ని మింగేసాడు. ఈవిషయాన్ని వెంటనే గమనించిన కియారా బాలుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసిన డాక్టర్లు ఎయిర్‌పాడ్ పిల్లాడి పొట్టలోనే ఉన్నట్లు గుర్తించారు. అయితే దాన్ని బయటకు తీయడానికి శస్త్రచికిత్స అవసరం లేదని, కొన్ని రోజుల్లో అదే బయటపడుతుందని చెప్పారు. అది పక్కటెముకలకు కింది భాగంలో ఉండటం వల్ల ఆ బాలుడికి ఎటువంటి హానీ జరగదని హామీ ఇచ్చారు. -
కలను నిజం అనుకొని నిశ్చితార్థపు ఉంగరాన్ని..
-
కలను నిజం అనుకొని నిశ్చితార్థపు ఉంగరాన్ని..
కాలిఫోర్నియా : నిద్రలో వచ్చే కలలు ఉదయం లేచేసరికి గుర్తుండం చాలా అరుదు. అయితే అలా వచ్చిన కలలు వాస్తవంలో జరుగుతాయా లేదా అంటే చెప్పడం కష్టం. కానీ ఓ మహిళ మాత్రం తనకు నిద్రలో వచ్చిన కలను వాస్తవం అనుకొని నిద్రలోనే తన నిశ్చితార్థపు ఉంగరాన్ని మింగేసింది. ఈ విచిత్ర ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాలు.. కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోకు చెందిన జెన్నా ఎవాన్స్ అనే మహిళకు ఇటీవలే బాబీ హోవెల్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఓ రాత్రి జెన్నా నిద్రలో ఉండగా.. ఆమెకు ఓ విచిత్రమైన కల వచ్చింది. జెన్నా, బాబీతో కలిసి ఓ రైలులో ప్రయానిస్తుండగా వారిని దొంగలు వెంబడించినట్లు కల వచ్చింది. ఈ క్రమంలో వారి నుంచి రక్షించుకోవడానికి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి నోటిలో వేసుకొని మింగేయమని బాబీ సలహా ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు జరిగింది కలే కాబట్టి బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు విషయం దాగుంది. నిద్రలో వచ్చిన కలను వాస్తవం అనుకొని జెన్నా తన చేతికి ఉన్న ఉంగరాన్నినిజంగానే మింగేసింది. అనంతరం ఉదయం లేచిన ఆ మహిళ తన చేతిని చూసుకోగా ఉంగరం కనిపించలేదు. ఆ విషయాన్ని వెంటనే జెన్నా తనకు కాబోయే భర్తకు చెప్పింది. దీంతో డాక్టర్ వద్దకు వెళ్లి ఎక్స్‌రే తీయించుకున్నారు. ఎక్స్‌రే అనంతరం వైద్యుడు ఆ ఉంగరం కడుపులోనే ఉందని నిర్ధారించి చెప్పాడు. అప్పడు అసలు విషయం బయట పడింది. నిద్రలో వచ్చిన కలను నిజం అనుకొని ఉంగరాన్ని మింగేసినట్లు గుర్తించిన ఆ జంట చివరికి వైద్యుడి సహాయంతో ఎండోస్కోపి ద్వారా ఆ ఉంగరాన్ని బయటకు తీయించారు. ఉంగరం తిరిగి తన వద్దకు చేరుకున్నందుకు ఆనందంగా ఉందని, ఇదోక హాస్యాస్పదమైన కథ అంటూ ఈ విషయాన్నంతా జెన్ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. కాగా వీరిద్దరు వచ్చే నెలలో టెక్సాస్‌లో వివాహం చేసుకోనున్నారు. -
చుట్టేసి ఆరగిస్తాయ్.!
ఇటీవల ఇండోనేషియాలోని మకస్పర్లో తోటలో కూరగాయలు కోయడానికి వెళ్లిన ఓ మహిళను భారీ అనకొండ మింగేసింది. అలాగే రెండ్రోజుల కిందట అసోంలో జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను పట్టుకొన్న ఓ అటవీ అధికారి, దానితో సెల్ఫీ తీసుకుంటుండగా అది ఆయన మెడను చుట్టుకొని బిగించింది. చుట్టుపక్కల వారు వేగంగా స్పందించి దాని పట్టునుంచి అధికారిని విడిపించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో అనకొండ గురించి క్లుప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములున్నాయి. వీటిలో అతి పెద్దదే అనకొండ(పైథాన్). సరీసృపాల్లోని యునెక్ట్స్ ప్రజాతికి చెందిన ఇవి విషరహితం. యునెక్ట్స్ అంటే గ్రీకు భాషలో గుడ్ స్విమ్మర్(మంచి ఈతగాడు) అని అర్థం. అనకొండల రూపం, పరిమాణాన్ని బట్టి వీటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి.. గ్రీన్(ఆకుపచ్చ) అనకొండ, ఎల్లో(పసుపు) లేదా పరాగ్వేయన్ అనకొండ, బ్లాక్ స్పాటెడ్ (నల్లమచ్చల) అనకొండ, బేని లేదా బొలివియన్ అనకొండ. మనదేశంతోపాటు ఉపఖండంలో కనిపించే కొండచిలువ ఇందులో ఒకటి. దక్షిణ అమెరికాలో అత్యధికం ఒక్క అంటార్కిటాకాలో మినహా మిగిలిన అన్ని ఖండాల్లోనూ అనకొండలు ఉన్నాయి. అయితే, వీటి సంఖ్య దక్షిణ అమెరికాలో అత్యధికం. అక్కడి వాతావరణ పరిస్థితులు దీనికి కారణం. అనకొండల్లోని నాలుగు రకాలూ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి పురాణాల్లోనూ వీటి ప్రసక్తి ఉంది. వీటికి కొన్ని అతీత శక్తుల్ని ఆపాదిస్తూ రాసిన పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనుషుల్ని తినేవిగానూ వీటిని పేర్కొన్నారు. అనకొండ పేరు మీద వచ్చిన అనేక ఇంగ్లిష్ సినిమాలకు ఇవే ప్రేరణ. చిత్తడి నేలలు, తీరాల్లో ఆవాసం అనకొండలు అన్ని ప్రాంతాల్లోనూ నివసించగలిగినప్పటికీ ఇవి ఎక్కువగా నది, సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి నేలల్లో ఉండడానికి ఆసక్తి చూపుతాయి. ఇక్కడ ఇవి సంచరించడానికి అనుకూలంగా ఉండడంతోపాటు వీటి ఆహారమైన చిన్నచిన్న జంతువులు నీళ్లు తాగేందుకు రావడం మరో కారణం. బలమైన కండరాలతో ఏర్పడిన వీటి ఆకారం నేలమీద కంటే నీటిలో చురుగ్గా ప్రయాణించేందుకు వీలుగా ఉండడమూ చెప్పుకోవచ్చు. ఇవి నీళ్లలో ఈదుతూ లేదా దాక్కొని ఉంటూ ఎక్కువ సమయం గడుపుతాయి. ప్రవాహ వేగం తక్కువగా ఉండే నదులు, జలపాతాల సమీపంలో ఎత్తైన చెట్ల కొమ్మలను చుట్టుకొనీ ఉంటాయి. ఇవి గరిష్ఠంగా 100 అడుగుల వరకూ పెరుగుతాయని వాదనలు ఉన్నప్పటికీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ప్రకారం ఇప్పటివరకు 25 అడుగుల పొడవైన అనకొండే అతి పెద్దది. అలాగే వీటి బరువు 250 కిలోల వరకూ ఉంటుందని అంచనా. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం గరిష్టంగా 45–68 కిలోల వరకు ఉన్నవాటినే ఇప్పటిదాకా గుర్తించారు. ఊపిరి ఆడకుండా .. రక్తప్రసరణ జరగకుండా.. ఏటా వసంత కాలంలో అనకొండలు జతకూడతాయి. ఆడ అనకొండలు వదిలే ఒకరకమైన ద్రవం వాసనను బట్టి మగవి వెతుక్కుంటూ వస్తాయి. గర్భస్థ కాలం ఏడు నెలలు. ఈ కాలంలో పిల్లల్ని మోసే ఆడవి వేటాడవు. ఒక్కదఫా కనీసం 30 పిల్లల్ని కంటాయి. పుట్టగానే వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. అనకొండ గరిష్ఠ జీవిత కాలం 30 ఏళ్లు. జింకలు, కుందేళ్లు, చేపలు, మొసళ్లు, తదితర జంతువుల్ని ఆహారంగా తీసుకొనే అనకొండలు.. ఆకలేస్తే మనిషి మీద దాడి చేయడానికీ వెనకాడవు. ఈ క్రమంలో ఇవి తమ ఆహారాన్ని మొదట బలంగా చుట్టుకొని ఊపిరి ఆడకుండా, రక్తప్రసరణ జరగకుండా చేస్తాయి. అవి చనిపోయాక వాటిని మింగి ఆరగిస్తాయి. అడవుల నరికివేత.. ఆవాసం ధ్వంసం సాధారణంగా అడవుల్లోనే నివసించే అనకొండలు ఇటీవల తరచూ మానవ నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పెంపుడు జంతువులు, మనుషుల మీద దాడి చేస్తున్నాయి. కలప, వ్యవసాయం కోసం అడవులను నరికివేయడంతో ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. చిత్తడి నేలలు, నదీ తీర ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు ఎక్కువ అవడంతో వీటి ఆహారమైన ఇతర జంతువుల రాక తగ్గింది. దీంతో అనకొండలు ఆహారం వెతుక్కుంటూ జనావాసాల్లోకి చేరుతున్నాయని చెబుతున్నారు. -
ఆదమరిచి.. పాప ప్రాణాల మీదకి తెచ్చారు..!
సాక్షి, ముంబై : స్మార్ట్ ఫోన్ కాలం మొదలయ్యాక పక్కనున్న మనిషిని సైతం పట్టించుకునే తీరిక లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జనాలు సమాజంలో మాత్రం అలా ఉండలేక పోతున్నారు. అందర్నీ ఆదమరచి నెట్ ప్రపంచంతో దోస్తీ కడుతున్నారు. చంటి పాపల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండకపోతే కొన్నిసార్లు పరిస్థితి చేజారుతుంది. ముంబైలోని కుర్లాలో గతవారం చోటుచేసుకున్న ఓ ఘటన పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండొద్దనడానికి మంచి ఉదాహరణ. వివరాలు.. ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది పాప కుషీ సోనీ ప్రమాదవశాత్తు చెవిపోగు మింగేసింది. అయితే, స్మార్ట్ఫోన్లతో బిజీగా ఉండి ఇంట్లోవాళ్లు ఇది గమనించకపోవడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయింది. గొంతులో చెవిపోగు ఉండిపోవడంతో పాపకు ఇన్ఫెక్షన్తో దగ్గు, జ్వరం మొదలైంది. అంతా సాధారణ జ్వరమేనని భావించారు. జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ నయం కావడానికి మందులు వాడారు. కానీ, పాప ఆరోగ్యం కుదుటపడక పోగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.దాంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారి సోనీని లోకమాన్య తిలక్ మున్సిపల్ హాస్పిటల్‌కు తరలించారు.గొంతులో ఏదైనా అడ్డుపడొచ్చని భావించి ఎక్స్‌రే తీశారు. కానీ, లాభం లేకపోయింది. ఎక్స్‌రేలో అంతా బాగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. రెండుమూడు రోజుల్లో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన తమ బిడ్డ దక్కుతుందో లేదోనని ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సోనీని అక్కడి నుంచి బీజే వాడియా ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరోసారి అక్కడ ఎక్స్‌రే తీయడంతో పాప గొంతులో చెవిపోగు ఉందని వైద్యులు నిర్ధారించారు. వైద్యులు దాదాపు 30 నిమిషాలపాటు శ్రమించి ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండానే పాప గొంతులో ఇరుక్కున్న రెండంగుళాల చెవిపోగును తొలగించారు. వైద్యుల కృషితో ప్రాణాలతో భయటపడిన సోనీ ఆసుపత్రిలోనే గురువారం తన మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. -
బాలుడి మూత్రాశయంలో టూత్ బ్రెష్
రాయ్‌పుర్: టూత్ బ్రెష్ మింగి, ఆ విషయం గోప్యంగా ఉంచి ఏడాది తర్వాత ప్రాణాపాయస్థితి నుంచి బయపడ్డాడు ఓ బాలుడు. ఎంతో అవస్థను అనుభవించి సంవత్సరం తర్వాత ఆ బ్రెష్ నుంచి చివరికి విముక్తి పొందాడు. వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతరీకి చెందిన కేశవ్ సాహూ(5) అనే బాలుడు టూత్ బ్రెష్ మింగాడు. తల్లిదండ్రులు టూత్ బ్రెష్ మింగిన విషయం తెలిస్తే కొడతారేమో అని బయపడ్డ కేశవ్, ఆ విషయాన్ని వారికి చెప్పలేదు. గత 6 నెలల నుంచి మూత్రవిసర్జన సమయంలో, ఆహారం తీసుకునేప్పుడు నొప్పి ఎక్కువగా రావడం ప్రారంభమైంది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలున్ని రాయ్ పూర్ మెడికల్ కాలేజీ డాక్టర్లకు చూపించారు. అక్కడ బాలుడి శరీరంలో ఓ వస్తువుతోపాటూ, 5 సెంటీమీటర్ల రాయిని మూత్రాశయంలో డాక్టర్లు కనుగొన్నారు. 'ఎక్స్ రేలో ఆ వస్తువు సరిగా కనిపించలేదు. అయితే ఆపరేషన్ చేసి 5 సెం.మీ రాయిని తొలగిస్తున్నపుడు 15 సెం.మీ.ల పొడవున్న స్టిక్‌ను కనుగొన్నాం. తర్వాత దాన్ని టూత్ బ్రెష్గా గుర్తించాము' అని డాక్టర్లు తెలిపారు. అయితే ఎప్పుడు తాను ఆ బ్రెష్‌ను మింగాడు అనే విషయాన్ని ఆ బాలుడు కచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. కేశవ్ బ్రెష్ మింగి సంవత్సరం పైనే అయిఉండొచ్చని బాలిడి తండ్రి తెలిపారు. 'ఇది అసాధారణమైన కేసు. సాధరణంగా చిన్న పిల్లలు కాయిన్స్ మింగిన కేసులు ఎక్కువగా చూస్తుంటాము. ఆ టూత్ బ్రెష్ బాలుడి పేగులకు మూడు చోట్ల రంధ్రాలను చేసి చివరికి మూత్రాశయాన్ని చేరింది. ఇలాంటి సంఘటనల్లో సరైన సమయంలో చికిత్స అందించకపోతే పిల్లలు మరణించే అవకాశాలు ఎక్కువ. ఈ కేసులో బాలుడు కోలుకోవడం నిజంగానే ఓ అద్భుతం' అని ఆపరేషన్ చేసిన ఓ డాక్టర్ అన్నారు. బాలుడు మరో వారం రోజుల పాటూ తమ పర్యవేక్షణలోనే ఉంటాడని డాక్టర్లు తెలిపారు. -
దొంగ కడుపులోంచి బయటపడ్డ గొలుసు
-
ఆ గొలుసు బయటకొచ్చింది
‘ఎనిమా’ ఇచ్చి రప్పించిన వైద్యులు * ఊపిరి పీల్చుకున్న పోలీసులు హైదరాబాద్: వైద్యుల ‘ఎనిమా’ చికిత్స... పోలీసుల డబ్బా చిట్కా పని చేసింది.. దొంగ మింగిన బంగారు గొలుసు కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. నిందితుడి కడుపులో ఉన్న గొలుసు బయటపడటంతో ఐదు రోజులుగా హైరానా పడుతున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ మాణికేశ్వర్ నగర్‌కు చెందిన వికాస్ (22) ఈనెల 15 వ తేదీ రాత్రి చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన ప్రమీల మెడ నుంచి బంగారు మంగళసూత్రాన్ని తెంపుకొని పరారయ్యాడు. అయితే పోలీ సులు వెంటపడటంతో గొలుసును మింగేశాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఎక్స్‌రే తీయించగా నిందితుడి కడుపు దిగువ భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసును బయటకు తీయాలని పోలీసులు కోరగా, వైద్యులు నిరాకరించారు. శస్త్రచికిత్స చేస్తే ప్రాణాలకు ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా బయటకు వస్తుందని స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు చెప్పుకోలేని కష్టాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని ఈ నెల 18 న ‘గొలుసు రికవరీకి దారేది..?’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన విషయం తెలిసిందే. ఫలించిన పోలీసుల డబ్బా చిట్కా... నిందితుడు వికాస్ కడుపులోని గొలుసును బయటకు రప్పించేందుకు వైద్యులు ఎనిమా (ద్రావకం, మందులు ఇచ్చి కడుపును శుభ్రం చేయడం) ఇచ్చారు. నిందితుడు మలవిసర్జనకు వెళ్లినప్పుడు లెట్రిన్ కుండీ గుండా గొలుసు పోయే అవకాశం ఉంది. దీంతో పోలీసులు డబ్బా చిట్కాను ఉపయోగించారు. నిందితునికి ఓ డబ్బా ఇచ్చి అందులోనే మలవిసర్జన చేసి, అనంతరం గొలుసు ఉందా లేదా అనేది వెతకాలని చెప్పారు. రోజూ రెండు పూటల ఎక్స్‌రే తీయించి గొలుసు కడుపులో ఎక్కడ ఉందో పరిశీలించారు. బుధవారం ఉదయం తీసిన ఎక్స్‌రేలో కడుపులో ఉన్న గొలుసు పెద్ద పేగులోకి వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. మరోమారు ఎనిమా ఇవ్వడంతో మలవిసర్జన సమయంలో గొలుసు డబ్బాలో పడింది. శుభ్రం చేసిన ఆ గొలుసును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దొంగ కడుపులోంచి బయటపడ్డ గొలుసు
చిలకలగూడ (హైదరాబాద్): చోర కళలో ఆరితేరిన ఓ దొంగ.. పోలీసులకు పట్టుబడతాననే భయంతో తస్కరించిన బంగారు గొలుసును ఏకంగా మింగేశాడు. చివరికి అతడిని పోలీసులు పట్టుకొని గొలుసు తీసేందుకు నానా కష్టాలు పడ్డారు. కొట్టేసిన బంగారు గొలుసును దొంగ గుటుక్కున మింగేయగా... గాంధీ ఆస్పత్రి వైద్యులు దాన్ని బయటకు రప్పించారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రోజుల క్రితం సాయంత్రం వాకింగ్‌కు వెళుతున్న ఓ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును వికాస్ అనే దొంగ తెంపుకుని పరారయ్యాడు. వారాసిగూడ వద్ద పోలీసులు అదే రోజు రాత్రి గస్తీ నిర్వహిస్తుండగా... అనుమానాస్పదంగా తిరుగుతున్న వికాస్ పట్టుబడ్డాడు. విచారిస్తున్న సమయంలోనే జేబులో ఉన్న బంగారు గొలుసును గుటుక్కున మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు. కడుపు కింది భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసు తీయాలని పోలీసులు అక్కడి వైద్యులను కోరారు. అయితే, ఆపరేషన్ చేస్తే ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా గొలుసు బయటకు వస్తుందని వైద్యులు చెప్పారు. దాంతో వారాసిగూడ పోలీసులు వికాస్‌ను రైల్వే పోలీసులకు అప్పగించారు. వారు కోర్టు అనుమతి మేరకు వికాస్‌ను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు వికాస్‌కు ఎనీమా ఇవ్వగా బుధవారం అతడు బంగారు గొలుసును విసర్జించాడు. -
మంగళసూత్రం మింగేశాడు
-
మంగళసూత్రం మింగేశాడు..
మంగళసూత్రం మింగిన దొంగ బయటకి తీయలేమంటున్న వైద్యులు తలబాదుకుంటున్న పోలీసులు హైదరాబాద్: చోర కళలో ఆరితేరిన ఓ దొంగ.. పోలీసులకు పట్టుబడతాననే భయంతో తస్కరించిన బంగారు గొలుసును ఏకంగా మింగేశాడు. చివరికి అతడిని పోలీసులు పట్టుకొని గొలుసు తీసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన శంకరయ్య, ప్రమీల దంపతులు. శనివారం రాత్రి వారు సీతాఫల్మండి రైల్వేస్టేషన్ వైపునకు వాకింగ్ వచ్చారు. అక్కడే తచ్చాడుతున్న మాణికేశ్వరినగర్‌కు చెందిన వికాస్ (22) అనే దొంగ.. ప్రమీల మెడలోని నాలుగు తులాల మంగళసూత్రం తెంపుకొని పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి చిలకలగూడలో వికాస్‌ను గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా జేబులోంచి గొలుసు తీసి అమాంతం మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు. కడుపు కింది భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసు తీయాలని పోలీసులు అక్కడి వైద్యులను కోరారు. అయితే, ఆపరేషన్ చేస్తే ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా గొలుసు బయటకు వస్తుందని వైద్యులు చెప్పారు. దీంతో నిందితుడిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోవాలని పోలీసులు కోరగా అందుకు మొదట వైద్యులు నిరాకరించారు. గొలుసు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదని, నిందితుడు మలవిసర్జనకు వెళ్ల్లిన ప్రతిసారీ ఎవరు చెక్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో ఉంటే తాము కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు కూడా సమాధానమిచ్చారు. చివరికి నిందితుడిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు అంగీకరించారు. అయితే, దొంగ మింగిన బంగారం ఎప్పుడు బయటకు వస్తుందో... ఎలా రికవరీ చేయాలో తెలియక పోలీసులు తెగ హైరానా పడుతున్నారు. -
వినూత్న స్మగ్లింగ్ : బంగారాన్ని ట్యాబ్లెట్లలా!!
-
'భోజనం చేస్తూ పళ్లసెట్ మింగేసింది'
నంద్యాల : ఓ మహిళ భోజనం చేస్తూ అనుకోకుండా పెట్టుడు పళ్ల సెట్‌ను మింగేసింది. వైద్యులు చాకచక్యంగా సర్జరీ చేసి దానిని బయటకు తీశారు. పట్టణానికి చెందిన శ్రీలక్ష్మి (45) గురువారం రాత్రి భోజనం చేస్తుండగా నోటిలో బిగించిన పళ్ల సెట్‌ను మింగేసింది. దీంతో బంధువులు ఆమెను హుటాహుటీనా గాంధీచౌక్‌లోని నెరవాటి హాస్పటల్లో చేర్పించారు. వైద్యులు వినోద్ కుమార్, మధుసూదన్ రెడ్డి, అరుణకుమారి ఎండోస్కోప్ ద్వారా 30 నిమిషాల సేపు సర్జరీ నిర్వహించి ఎలాంటి కోత, కుట్టు లేకుండా పళ్లసెట్‌ను బయటకు తీశారు. ఈ సందర్భంగా వైద్యుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ పళ్లసెట్‌ను మింగటం ద్వారా రోగికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందన్నారు. కడుపులో పేగుకు పళ్లసెట్ తీగ తగిలి రంధ్రం పడి ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.