
సాక్షి, ములుగు: ఓ పాము మరో పామును మింగింది. ఆపసోపాలు పడ్డ ఆ పాము మింగిన పామును మళ్ళీ బయటికి వదిలింది. ఈ అరుదైన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గుట్టపై చోటుచేసుకుంది. గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయ ఆవరణలో తాచుపాము మరో పామును మింగి కలకలం సృష్టించింది. పామును మింగిన త్రాచుపాము కదలలేక అష్టకష్టాలు పడింది.
చివరకు మింగిన పామును బయటకు వదలలేక తప్పలేదు. అప్పటికే ఆ పాము ప్రాణాలు కోల్పోగా, త్రాచుపాము బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్ళి పోయింది. గుడికి వచ్చిన భక్తులు అరుదైన సన్నివేశాన్ని తమ సెల్ ఫోన్‌లో బంధించారు. పామును మరో పాము మింగుతున్న దృశ్యాలు.. పూర్తిగా మింగేసి.. మళ్లీ బయటకు వదలడం దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
చదవండి: ఆషాఢమాసం ఆరంభం.. శుభముహూర్తాలకు బ్రేక్.. అప్పటి వరకు ఆగాల్సిందే!