mulugu district
-
మినీ మేడారం జాతర మూడో రోజు భక్తుల రద్దీ (ఫోటోలు)
-
ములుగు జిల్లా : మేడారం మినీ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
అడవి అలుగు పెంకు కోటిన్నరా..? అంతా అబద్ధం
ఏటూరునాగారం: అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉన్న అడవి అలుగు (ఇండియన్ పాంగోలిన్)కు అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.5 కోట్ల ధర ఉందన్న ప్రచారం అంతా అబద్ధమని ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు కొట్టిపారేశారు. కొందరు జంతు స్మగ్లర్లు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. అరుదైన ఈ జంతువును వేటాడినా, స్మగ్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.వేటగాళ్లకు ఆశచూపి..భూపాలపల్లికి చెందిన చిదం రవి అనే వ్యక్తి ఇటీవల అడవి అలుగుకు అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.5 కోట్ల ధర పలుకుతుందని, చైనాలో మందుల తయారీలో దీని పెంకులు వాడుతారని ప్రచారం చేశాడు. అడవి అలుగును వేటాడి తీసుకొస్తే భారీగా డబ్బు ఇస్తానని భూపతిపూర్‌కు చెందిన కోరం నాగయ్య, కోరం పెంటయ్య, కోరం కృష్ణమూర్తి అనే వేటగాళ్లకు ఆశ చూపాడు. దీంతో భూపతిపూర్ అడవుల్లో ఆ జంతువును పట్టుకొన్న వారు.. రవికి అందజేశారు. ఈ నెల 20వ తేదీన దానిని భూపాలపల్లికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఏటూరునాగారం నార్త్ అటవీశాఖ అధికారులు పట్టుకొన్నారు. అడవి ఎలుగుతో చిదం రవి పట్టుబడ్డాడు. జీవితకాలం 20 ఏళ్లు అంతరించిపోతున్న అరుదైన జీవి ఇండియన్ పాంగోలిన్. దీని జీవితకాలం 20 ఏళ్లు. సింహం కూడా తినలేనంత గట్టిగా అలుగు పెంకులు ఉంటాయి. అత్యధిక వర్షపాతం, పురుగులు, చీమల పుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇవి జీవిస్తుంటాయి. ఎడారి అడవుల్లోనూ ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ జంతువు పెంకులను చైనాలో మందుల తయారీలో వాడుతారని స్మగ్లర్లు ప్రచారం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మధ్యవర్తులకు భారీ ధరకు విక్రయిస్తున్నారు. అలుగు పెంకులు ఏ మందుల్లోనూ వాడరు అడవి అలుగు పెంకులను ఎలాంటి మందుల తయారీకి వాడరు. అదంతా అపోహ మాత్రమే. స్మగ్లర్లు సొమ్ము చేసుకునేందుకే అమాయకులకు ఇలా మాయమాటలు చెబుతున్నారు. – అబ్దుల్ రెహమాన్, సౌత్ రేంజ్ అధికారి, ఏటూరునాగారం.చదవండి: కోతులతో భయం.. కొండముచ్చులతో ఉపాయం -
ఆడపులి కోసం అడవులన్నీ..
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని అడవుల్లో బెంగాల్ టైగర్ సంచారం కొనసాగుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఒకరిని చంపడంతోపాటు మరొకరిపై దాడి చేసిన పెద్దపులి.. తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మీదుగా గోదావరి తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకొని అక్కడి నుంచి తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో తిష్టవేసింది. ఈ విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించింది. ‘తాడ్వాయి మండలం బందాల అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆధారాలు దొరికాయి.వారం క్రితం పంబాపురం, నర్సాపురం అడవుల్లో తిరిగిన పులి.. బందాల అడవుల్లో జంతువులను వేటాడిన ఆనవాళ్లున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య హెచ్చరించారు. దీంతో గిరిజన గూడేల్లో మళ్లీ పులి కలకలం మొదలైంది. తోడు కోసం గాలిస్తూ..: ఇరవై రోజులకుపైగా అటవీ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మగ పులి.. ఆడపులి తోడు కోసం అడవులన్నీ తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్.. చెన్నూరు, భూపాలపల్లి, ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం.. ఇంద్రావతి నుంచి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు అటవీ ప్రాంతం... ఇలా పులి సుమారు 10 జిల్లాల్లో చాలా దూరం నడిచినట్లు పాదముద్రల ద్వారా తెలుస్తోందని అటవీశాఖ ప్రకటించింది.అయితే 2021లో ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి ములుగు అడవులకు మేటింగ్ కోసం వచ్చిన పులే మరోసారి వచ్చి ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి నాలుగైదేళ్ల నాటి పులుల సంచార రికార్డులు, కెమెరా ట్రాప్‌లు, వాటి ఫొటోలు పరిశీలించాల్సి ఉందంటున్నారు. ఆ తర్వాతే ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్నది కచ్చితంగా చెప్పగలమంటున్నారు. మూడేళ్ల కిందట ఇలాగే..: మూడేళ్ల క్రితం పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ములుగు, తాడ్వాయి, మంగపేట, కరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి పర్యటించిందని అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో ఒక ఆవును కూడా పులి చంపితిందని, ఆ తర్వాత నుంచి దాని జాడ లేదని.. తిరిగి 10 రోజులుగా పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయిల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం వరకు పులి కారిడార్‌ను ఏర్పాటు చేసుకుందని అధికారులు అంటున్నారు. -
ములుగు కేంద్రంగా భారీ భూకంపం
-
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య
-
ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
-
ములుగు జిల్లాలో మావోల ఘాతుకం
-
83,64,331 నివాసాల్లో సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 83,64,331 నివాసాల్లో సర్వే పూర్తయ్యింది. సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,16,14,349 నివాసాలకుగాను ఇప్పటి వరకు 72 శాతం సర్వే పూర్తయినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. జాప్యం లేకుండా సకాలంలో సర్వే పూర్తి చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును కూడా వదలకుండా ప్రతీ ఇంటిలో సమగ్రంగా సర్వే నిర్వహించాలని సీఎస్ స్పష్టం చేశారు.మంగళవారం నాటికి రాష్ట్రంలో ములుగు జిల్లా 98.9శాతం పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలవగా, నల్లగొండ జిల్లా 95 శాతంతో ద్వితీయ స్థానంలో, జనగాం జిల్లా 93.3 శాతంతో తృతీయ స్థానంలో నిలిచాయి. గ్రేటర్ హైదరాబాద్ 50.3 శాతం సర్వేతో చివరిస్థానంలో నిలిచింది. ఈ సర్వేలో 87,807 మంది సిబ్బంది, 8,788 పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాల వారీ గా పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారు లను నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే తీరును సమీక్షిస్తున్నారు. -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్‌టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్‌ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్‌టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్‌తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారా.. సరికొత్త హంగులతో లక్నవరం తప్పక చూడాల్సిందే (ఫొటోలు)
-
గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య
కన్నాయిగూడెం: దట్టమైన అడవుల్లో జీవిస్తూ విద్య కు దూరంగా ఉంటున్న గిరిజన పిల్లలకు నాణ్య మైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధి బంగారుపల్లి గ్రామంలో రూ.13.50 లక్షలతో నిర్మించిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంగళవారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు.అనంతరం సీతక్క మాట్లాడుతూ, అటవీ గ్రామాల్లో పాఠశాలలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ అభ్యంతరాలతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కన్నాయిగూడెం మండలంలో కంటైనర్ భవనం నిర్మించినట్లు తెలిపారు. గత పదేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నాశనం చేసిందని ఆమె ఆరోపించారు. -
ఇది ప్రకృతి వైపరీత్యం
సాక్షి, హైదరాబాద్ : వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల చేర్పులతోపాటు అరుదైన ప్రకృతి వైపరీత్యం కారణంగా ములుగు అడవుల్లో చెట్లకు భారీగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదిక సమర్పించింది. దీనిని ‘ఎకోలాజికల్ డిజాస్టర్’గానే పరిగణించాల్సి ఉంటుందని ఇందులో సూచించినట్టు సమాచారం. మొత్తంగా 204 హెక్టార్లలో (500 నుంచి 600 ఎకరాల్లో) దాదాపు 70 వేల దాకా వివిధ జాతుల చెట్లకు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. అటవీ పునరుద్ధరణతోపాటు, భూసార పరిరక్షణ చర్యలు, గ్యాప్ ఏర్పడిన చోట్ల వాటిని నింపేలా పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, వంటివి చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఇంకా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతోపాటు, కొండ ప్రాంతాలు వంటివి ఉండడంతో జరిగిన నష్టం, కూలిన చెట్ల వివరాల సేకరణ అంత వేగంగా సాగడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.వివిధ రూపాల్లో వాటిల్లిన నష్టంపై వారంరోజుల్లో క్షేత్రస్థాయి నుంచి ఒక స్పష్టమైన అంచనాకు వచ్చాక పర్యావరణం, అడవులతో సంబంధమున్న నిపుణులతో అధ్యయనం జరిపించాలని అటవీశాఖ నిర్ణయించింది. దేశంలోనే అత్యంత అరుదైన రీతిలో ములుగు అటవీప్రాంతంలో చెట్లకు నష్టం జరిగినందున, పూర్తి సమాచారం అందిన తర్వాతే అటవీ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన నివేదిక అందజేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ములు గులో సుడిగాలుల బీభత్సం సమయంలోనే ఆదిలా బాద్ జిల్లా ఉట్నూరులో, ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోనూ స్వల్పస్థాయిలో చెట్లకు నష్టం జరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు వస్తేనే...హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రాలను సేకరించడం ద్వారా ములుగు అటవీ విధ్వంసం కారణాలు వెల్లడి కాగలవని అటవీశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అవసరమైన డేటాను ఉపగ్రహం నుంచి సేకరిస్తున్నామని, రెండురోజుల్లో దీనిపై వివరాలు అందజేస్తామని ఎన్ఆర్ఎస్సీ అధికారులు చెప్పారు. ఈ సమాచారాన్ని తమ ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్ ఏరియా డివిజన్ క్రోడీకరించి అందజేస్తామని అటవీ అధికారులకు చెప్పారు. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎండీ)పై అటవీ అధికారులు పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరలేదు.ములుగు పరిసర ప్రాంతాల్లో తమ అబ్జర్వేటరీ లేనందువల్ల, ఈ బీభత్సం చోటుచేసుకున్న రోజునాటి వివరాలు ఇవ్వలేకపోతున్నామని అధికారులకు ఐఎండీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఐఎండీనే చేతులెత్తేస్తే ఇంకా తమకు ఎవరు వాతావరణ సాంకేతిక విషయాలు అందించగలరని అటవీ అధికారులు విస్తుపో తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తయి, ఎన్ఆర్ఎస్సీ నుంచి సాంకేతిక సమాచారం అందాక 2,3 రోజుల్లో ములుగు జిల్లా అటవీ అధికారులు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి. -
కొండాయి.. కష్టం కొండంత
గత ఏడాది జూలై 27న వాన.. వరదై.. జలప్రళయంగా మారి రెండు గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా కొండాయిలో బ్రిడ్జి దాటుతున్న ఎనిమిది మందిని బలితీసుకుంది. అదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. ఐదుగురు గల్లంతు కాగా, వారిలో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఆ కుటుంబాలు వారి చివరి చూపునకు నోచుకోకుండా పోయాయి. ఇప్పటికీ ఆయా గ్రామాల్లో పరిస్థితులు ఏమీ మారలేదు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి బృందం ఆ రెండు గ్రామాలను సందర్శించింది.ఏటూరునాగారం/భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి రూరల్⇒ ఏడాది కాలంగా బ్రిడ్జి నిర్మించని కారణంగా వానొస్తే.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామస్తులు ఏది కావాలన్నా.. 42 కిలోమీటర్ల దూరంలోని ఏటూరునాగారానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొత్త బ్రిడ్జి నిర్మాణం జరిగి ఉంటే..12 కిలోమీటర్లు ప్రయా ణించి ఏటూరునాగారం చేరుకునేవారు. ప్రస్తుతం చుట్టూ తిరగలేక ఇంటి వద్దనే కలోగంజి తాగుతున్నారు. ఊరంతా దోమల బెడద. వర్షాలు వస్తే...వాగు దాటలేక గ్రామంలోనే మగ్గిపోతున్నారు. 2023 జూలై 27వ తేదీ సాయంత్రం 4 తర్వాత భారీ వర్షాలు కొండాయి, మల్యాల గ్రామాలను అతలాకుతలం చేశాయి.ఈ క్రమంలోనే బ్రిడ్జి కూలడంతో దానిపై నడుచుకుంటూ వెళుతున్న 8 మంది (రషీద్, కరింబీ, మజీద్, బీబీ, నజీర్‌ఖాన్, షరీఫ్, మహబూబ్‌ఖాన్, దబ్బగట్ల సమ్మక్క) అసువులు బాశారు. ఏడాది గడిచినా, ఆ విషాదచాయలు అలానే ఉన్నాయి. కొండాయి– దొడ్ల గ్రామాల మధ్య గల జంపన్నవాగుపై నిర్మించి ఉన్న హైలెవల్ బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఎలాంటి బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. ఇటీవల ఐటీడీఏ అధికా రులు రూ.35 లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్న ఫుట్ ఓవర్ ఐరన్ బ్రిడ్జి సైతం ఇటీవల వరదలకు కూలిపోయింది.వెల్డింగ్, పిల్లర్లు సైతం ఊడిపోయి వాగులో కలిసిపోయాయి. బ్రిడ్జిని అమర్చే క్రేన్ సైతం వాగులో కూరుకుపోయింది. దీంతో అధికారులు పడవ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలోనే ఈ పడవను నడుపుతు న్నారు. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీల్లో ఆకలికేకలు మొదలయ్యాయి. ప్రజలు పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి సీతక్క రూ. 9.50 కోట్లు మంజూరు చేయించింది. కానీ టెండర్లు కాక పనులు మొదలు కాలేదు. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. బ్రిడ్జి నిర్మిస్తే గానీ తమ బతుకులు బాగుపడవని కన్నీటిపర్యంతమవుతున్నారు.ఇప్పుడు ఇలా వెళ్తున్నారు..కొండాయి నుంచి పది కిలోమీటర్ల దూరంలోని ఊరట్టం నుంచి మేడారం మీదుగా రెండు కిలోమీటర్లు ప్రయాణించి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయికి చేరుకోవాలి. అక్కడి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరునాగారం రావాలి. దీంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ ప్రజలు నరకయాతన పడుతూ ప్రయాణిస్తున్నారు. అదే కొండాయి వద్ద బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కేవలం 12 కిలోమీటర్లు ప్రయాణించి ఏటూరునాగారం చేరుకుంటారు. పచ్చడి మెతుకులతో..కొండాయికి సరైన రోడ్డుమార్గం లేక నిత్యావసర సరుకులు నిండుకొని పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీస్తున్నాం, ఎలాంటి పనులు లేవు. వ్యవసాయం లేదు, కూలీకి పోయేందుకు దారిలేదు. రేషన్ షాపులో ఇచ్చిన దొడ్డుబియ్యం వండుకొని పచ్చడి వేసుకొని ఇంటిల్లిపాది పూట గడుపుతున్నాం. – కాక ఫణిచందర్, కొండాయి‘మోరంచ’.. మొర ఆలకించేదెవరు?వాగులో ఐదుగురు గల్లంతు.. ఇప్పటికీ దొరకని ఇద్దరి ఆచూకీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగు పక్కనే ఉన్న మోరంచపల్లి గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. గ్రామస్తులందరూ ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడాలంటూ వేడుకున్నారు. ఐదుగురు వరదలో కొట్టుకుపోగా, ముగ్గురి మృతదేహాలు పంట పొలాల్లో లభించాయి. ఒక మహిళ, యాచకుడి మృతదేహం జాడ ఇప్పటికీ దొరకలేదు. గ్రామంలో ఎవరిని కదిలించినా వరద ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ సాయం నామమాత్రమే..గ్రామంలోని 20 చెంచు కుటుంబాలు సర్వం కోల్పోగా, ప్రభుత్వం సాయం అంతంత మాత్రమే అందింది. ఆ సమయంలో తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి కేవలం రూ.10వేల నగదు, నిత్యావసర వస్తువులు, పాడి గేదెలు ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన, ఇతర వస్తువులు, పంటలు నష్టపోయిన, వాహనాలు కొట్టుకుపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందలేదు. మరణించిన ముగ్గురి కుటుంబాలకు పరిహారం రాగా, ఇప్పటికి ఆచూకీ లభించని గడ్డం మహాలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. ఏడాదైనా నా భార్య ఆచూకీ లేదు.. గత ఏడాది తెల్లవారు జూమున వచ్చిన వరదలో కొట్టుకుపోయిన నా భార్య ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. గుర్తు తెలి యని మహిళలు ఎక్కడ చనిపోయి కనిపించినా అక్కడకు వెళ్లి చూశాం. ఇటీవలే నా భార్య సంవత్సరీకం చేశాను. ఒంటరిగా ఉండలేక నా కూతుళ్ల వద్ద ఉంటున్నా. – గడ్డం శ్రీనివాస్, మృతురాలు మహాలక్ష్మి భర్తతాతయ్య, నానమ్మలను కోల్పోయాం తాత మజీద్, నానమ్మ బీబీతో పాటు కొండాయిలో ఉండే వాళ్లం. గత ఏడాది మా కుటుంబంలో మజీద్, బీబీని వాగు మింగేసింది. ఆ భయంతో ఇప్పుడు ఏటూరు నాగారంలో ఉంటున్నాం. చిన్నషాపు పెట్టు కొని జీవిస్తున్నాం. వర్షాకాలం వచ్చిందంటే ఆ దుర్ఘటన గుర్తుకొస్తుంది. – రియాజ్ , కొండాయికాలు జారితే ఖతం..హనుమకొండలోని నయీంనగర్ వంతెన నిర్మాణ పనులు కొనసాగు తుండడంతో వాహనదారులు, కాలినడకన వెళ్లేవారికి కష్టాలు తప్పడం లేదు. నయీంనగర్‌లో కళాశాలలు, పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, బాలికలు, బాలుర వసతి గృహాలతో చాలా రద్దీగా ఉంటుంది. వంతెన చుట్టూ తిరిగి వెళ్లడానికి 2 కిలోమీటర్ల దూరం ఉండటంతో.. విద్యార్థులు, ప్రజలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రమాదకర మైన కట్టెల నిచ్చెనపై నుంచి నాలా దాటుతున్నారు. వర్షా నికి నిచ్చెన తడిసి విరిగిపోయినా, కాలు జారినా నాలాలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండవాగులు దాటి వైద్యం..కన్నాయిగూడెం: ములుగు జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా జ్వరాలు, ఇతర వ్యాధులు ఎక్కువగా ఉండటంతో వైద్య సిబ్బంది రోగులకు చికిత్స అందించడానికి ఏజెన్సీ గ్రామాల బాటపట్టారు. ఈ క్రమంలో కొండాయి సబ్‌సెంటర్ పరిధి వైద్యు డు ప్రణీత్ కుమార్ తమ సిబ్బందితో కలసి ఏటూరునాగారం నుంచి సర్వాయిరోడ్డు మార్గాన 40కి.మీ. ప్రయాణించి అడవి, వాగులు దాటుకుంటూ మారు మూలన ఉన్న కన్నాయి గూడెం మండలం ఐలాపుర్ గ్రామానికి శుక్రవారం చేరుకున్నారు. స్థానిక ప్రజలకు వైద్యం అందించారు. వారు వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో చంటిపిల్లతో వస్తున్న వారికి అడవిలోనే వైద్యం చేశారు.మందుకొట్టి.. చావగొట్టిఎల్లారెడ్డి: డ్రిల్ పీరియడ్‌లో ఆటలాడుకుంటున్న విద్యార్థులను.. మద్యం మత్తులో ఉన్న అటెండర్ చితకబాదడంతో గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. పాఠశాల డ్రిల్ పీరియడ్‌లో ఆరో తరగతి విద్యార్థులు ఆడుకుంటున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న అటెండర్.. వారి వద్దకు వెళ్లి ఎందుకు అల్లరి చేస్తున్నారంటూ కర్రతో ఇష్టమొచ్చి నట్లు కొట్టాడు.దీంతో విద్యార్థులు రామ్, లక్ష్మ ణ్, అజయ్లతో పాటు మరికొందరి ఒంటిపై వాతలు తేలాయి. తీవ్ర నొప్పి తో బాధపడుతున్న రామ్, లక్ష్మణ్, అజయ్‌లను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. తరచూ విధుల్లో మద్యం తాగుతున్న అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. -
వాగులూ... వంకలూ..
సాక్షి, నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి 14.38 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 ఫీట్లు కాగా ప్రస్తుతం 19 ఫీట్ల నీటిమట్టం ఉంది.వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో 163 నంబరు జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లిలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ⇒ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు 30.3 ఫీట్లకు 21.9 అడుగులకు నీటిమట్టం చేరింది. ⇒ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 15.2ఫీట్లకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు తగ్గడం లేదు. వర్షాలతో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రాణహితకు భారీగా వరద పోటెత్తడంతో వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవలను నిలిపివేశారు.వాగులో ఇద్దరు గల్లంతుచెట్టు కొమ్మ పట్టుకొని ఒకరు బయటకు..జాడ తెలియని మరొకరు ఉట్నూర్ రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఒకరు గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చోటు చేసుకుంది. బొప్పరికుంట గ్రామానికి చెందిన టేకం రాజు, టేకం లక్ష్మణ్(28) సొంత పనులపై ఉట్నూ ర్కు సాయంత్రం వచ్చారు.పని ముగించుకొని తిరిగి రాత్రి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. గంగాపూ ర్ వద్ద వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు కొట్టుకుపోయారు. రాజు చెట్టు కొమ్మ పట్టుకొని బయటకు వచ్చాడు. లక్ష్మణ్ వాగులో గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు అంతరాయం కలిగింది. -
బొగత జలపాతం..చూడతరమా (ఫొటోలు)
-
ఆగస్టు నుంచి ట్రైబల్ వర్సిటీలో క్లాసులు
ములుగు, రాయదుర్గం: సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో తొలి ఏడాది బీఏ (ఇంగ్లిష్), బీఏ (సోషల్ సైన్స్) కోర్సులను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా జాకారం సమీపంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క, ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీశాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిన 50 ఎకరాల స్థలాన్ని త్వరితగతిన అప్పగించినట్లయితే పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆ లస్యమైనప్పటికీ 337 ఎకరాలను రాష్ట్రం కేటాయించిందని చెప్పారు. అన్ని రకాల క్లియరెన్స్ వస్తే కాంపౌండ్ వాల్, డీపీఆర్, టెండర్ ప్రక్రియలను ప్రారంభిస్తామని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యువతలో గేమ్ చేంజర్‌గా మారనుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో 33 శాతం రిజర్వేషన్లను గిరిజనులకే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతి, వైద్యపరమైన మూలికలు, అడవి జీవన విధానాలు రీసెర్చ్‌లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మెంటార్ యూనివర్సిటీగా గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు. యూజీసీ అ«దీనంలోని వెళ్లేంతవరకు హెచ్‌సీయూ అసోసియే ట్ ప్రొఫెసర్ వంశీ కృష్ణారెడ్డిని ఓఎస్డీగా నియమించినట్టు వివరించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, కంట్రోలర్ ఎగ్జామినేషన్ పోరిక తుకారాం తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి హనుమకొండ కల్చరల్: పవిత్రమైన మహాశివరాత్రి రోజున వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని మహాశివుడికి అంకితం చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో కల్యాణమండపాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా శ్రీరుద్రేశ్వరశివలింగానికి అభిõÙకం నిర్వ హించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నేడు రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంక
సాక్షి, హైదరాబాద్/వెంకటాపురం(ఎం): మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్న ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాకు చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్, ప్రియాంక పాలంపేటకు చేరుకుంటారన్నారు. అక్కడినుంచి కాన్వాయ్‌లో 4:15 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను వారు రామలింగేశ్వరుడి ముందు పెట్టి పూజలు చేస్తారని తెలిపారు. శివుడిపై రాహుల్, ప్రియాంకతోపాటు తనకూ విశ్వాసం ఉందన్నారు. అనంతరం 4:45 గంటలకు ఆలయం నుంచి బస్సుయాత్ర ద్వారా రామాంజాపూర్‌లో ఏర్పాటుచేసిన మహిళా విజయభేరి సభా ప్రాంగణానికి బయలుదేరుతారు. అక్కడ రాహుల్, ప్రియాంక మహిళలను ఉద్దేశించి ప్రసంగించి, మహిళా డిక్లరేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారు. సభ అనంతరం ప్రియాంక ఢిల్లీకి పయనం కానుండగా, రాహుల్ బుధవారం రాత్రి భూపాలపల్లిలో బస చేస్తారు. రాహుల్ గురువారం ఉమ్మడి కరీంనగర్, శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో బస్సుయాత్ర సాగించనున్నారు. దసరా సెలవుల తరువాత రాహుల్ మలి దశ బస్సుయాత్ర ఉంటుంది. కాగా, రాహుల్, ప్రియాంక పర్యటన సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగళవారం రామాంజాపూర్ సభాస్థలిని పరిశీలించారు. మహిళా విజయభేరికి పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
తెలంగాణకు మోదీ వరాలు.. పసుపు బోర్డు, సమ్మక్క యూనివర్సిటీ
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రధాని మోదీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు పలు వరాలను ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు, సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. కాగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని తెలుగులో మాట్లాడారు. పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అని ప్రసంగించారు. ఈ క్రమంలోనే కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పాలమూరు సభ సాక్షిగా రాష్ట్రంలో పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు చేస్తున్నామన్నారు. తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతోంది. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇదే సమయంలో ములుగు జిల్లాలో సమక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రూ.900 కోట్లతో సమ్మక-సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పాలుమూరు సభలో రాజకీయాల గురించి మాట్లాడతానని హింట్ ఇచ్చారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. నేడు అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లు ప్రారంభించుకున్నాం. రోడ్డు, రైలు కనెక్టివిటీతోనే అభివృద్ధి ముడిపడి ఉంది. ర్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదించుకున్నాం. పార్లమెంట్లో నారీ శక్తి బిల్లును ఆమోదించుకున్నాం. దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించుకున్నాం. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. రవాణా సదుపాయాలు మెరుగవుతాయి అని తెలిపారు. -
నిత్యం కాల్పులతో ములుగు ప్రాంతం వణికిపోయేది: హరీష్ రావు
సాక్షి, ములుగు: తెలంగాణ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. రూ.183 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు నియోజకవర్గంలోనే 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోనే నక్సలైట్ల ఉద్యమం పుట్టింది. నిత్యం కాల్పులతో ములుగు ప్రాంతం వణికిపోయేది అభివృద్ధి ఫలాలను సీఎం కేసీఆర్ ప్రతీ ఒక్కరికీ అందిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కాల్పులు, ఎన్కౌంటర్లు, రైతులకు అప్పులు కరెంట్ బాధలు, ఎరువుల కొరతలు, తాగు నీటి కష్టాలు ఉండేవి. కేసీఆర్ లేకుంటే ములుగు జిల్లా ఏర్పడేదా?. కల్యాణ లక్ష్మి పథకానికి ములుగు జిల్లా స్ఫూర్తినిస్తోంది. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. కేసీఆర్ హయాంలో పోడు భూములకు పట్టాలు, ప్రతి గ్రామానికి రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ప్రతి బిడ్డకు కేసిఆర్ కిట్టు, ప్రతి రైతుకు 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక కల్యాణ లక్ష్మి పథకం. రాజకీయాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గత ప్రభుత్వం మూడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తే కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చింది. ములుగు నియోజకవర్గంలోనే 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. 76.8% ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అవుతున్నాయి. ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత బాగుపడిందో అనడానికి ఇది నిదర్శనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 87% డెలివరీలతో రాష్ట్రంలోనే ములుగు జిల్లా రెండవ స్థానంలో ఉంది. గిరిజనేతరుల పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’ -
ములుగులో ఢీ అంటే ఢీ అంటున్న ఆదివాసీ మహిళా నేతలు
-
డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు
ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
టైరును తెప్పలా చేసి.. గర్భిణిని వాగు దాటించి..
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగా రం మండలం ఎలిశెట్టిపల్లి వద్ద ఏటా వర్షాకాలంలో జంపన్నవాగు ప్రవాహంతో బానాజీబంధం, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతు న్నాయి. ఎలిశెట్టిపల్లికి చెందిన దబ్బకట్ల సునీత ఏడు నెలల గర్భిణి. ఆమెకు శుక్రవారం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడే ఉన్న కొందరు గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో ట్రాక్టర్ వెనుక టైరును తెప్పలా మార్చారు. దానిపై గర్భిణిని కూర్చోబెట్టి వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి సాధారణమైన నొప్పులేనని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వాగుపై వంతెన నిర్మిస్తే తమ కష్టాలు తొలగిపోతాయని, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తాత్కాలిక బోటు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు... రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్ వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్‌ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. -
వరద బీభత్సం: ములుగు జిల్లాలో 8 మంది మృతి
సాక్షి, ములుగు జిల్లా: వరదలతో ములుగు జిల్లాలో 8 మంది మృతి చెందగా, మరో 8 మంది గల్లంతయ్యారు. జంపన్న వాగు వరద ఉధృతితో కొండాయి గ్రామం జల దిగ్భంధంలో చిక్కుకుంది. గ్రామంలోని 150 మందికి హెలికాఫ్టర్ ద్వారా ఆహారం, మెడిసిన్ సరఫరా చేశారు. వరద ఉధృతితో కొండాయి గ్రామానికి ప్రత్యేక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. గుండ్లవాగు వద్ద జాతీయ రహదారిపై బిడ్జ్రి కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రికార్డు స్థాయిలో వెంకటాపూర్ మండలంలో 70 సెం.మీ వర్షపాతం నమోదైంది. జంపన్న వాగు దాటే క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ కాపాడారు. వర్షం, వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అపారనష్టం మిగిల్చింది. 14 మంది మృతి చెందగా మరో 8 మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 40 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వర్షం, వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. గ్రేటర్ వరంగల్ లో పలు కాలనీలు నీటమునగడానికి కబ్జాలు అక్రమ నిర్మాణాలే కారణమని మంత్రి అన్నారు. చదవండి: ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉధృతంగా నీరు రావడంతో ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని సూచిస్తున్నారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చెయొద్దని, అత్యవసరమైతే కంట్రోల్ రూంలకు కాల్ చేయాలన్నారు. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలని, జలాశయాల వద్దకు ప్రజలు రావద్దని సూచించారు. వరద నిలిచిన రహదారుల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లను అడ్డు పెట్టాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ప్రియాంక. -
తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం హడలెత్తిస్తోంది. అన్ని జిల్లాలలోని మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలపై పై వరుణుడు పగబట్టాడు. వర్షాలు, వరదల ధాటికి మ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయి. తెలంగాణ చరిత్రలోనే అత్యంత రికార్డు వర్షపాతం ములుగు జిల్లాలో నమోదైంది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8 మిల్లీ మీటర్లు..అంటే 64 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదవడం గమనార్హం. లక్ష్మీదేవ్ పేట్ వద్ద 533.5 మిల్లీ మీటర్లు అంటే 53 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. గత 24 గంటల్లో ములుగు జిల్లాలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల పైన వర్షం పడింది. చదవండి: పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ మునిగిన మేడారం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాడ్వాయి మండలంలోని మేడారం నీటమునిగింది. జంపన్న వాగు రెండు వంతెనల పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. మేడారం జాతర ప్రాంగణంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను జంపన్న వాగు తాకింది. 2 అడుగుల లోతు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో సాయం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మేడారం దగ్గర్లోని పడిగాపురం గ్రామాన్ని జంపన్న వాగు చుట్టుముట్టింది, దీంతో పడిగాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. #Telangana #Medaram 27-07-2023 pic.twitter.com/yPl9LzySXP — S Ramesh (@RameshTSIND) July 27, 2023 జలదిగ్భంధంలో గ్రామాలు ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా జులై 27వ తేదీ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రమణక్కపేట గ్రామంలో పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో వరదలో చిక్కుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అటు జీవంతరావు పల్లి, పాలసావు పల్లి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజన్సీ గ్రామాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి మత్తడి పోతున్నాయి. దీంతో వరంగల్ నుంచి ఏటూరునాగారం 163 ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి గుండ్ల వాగు పొంగి పస్రా తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై గండి పడింది. దీంతో వరంగల్ వైపుకు వెళ్లే పరిస్థితి లేదు. ఏ క్షణమైనా రోడ్డు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఏటూరు నాగారం మండలంలోని జీడి వాగు పొంగి పార్లడంతో ఏటూరు నాగారం, బుర్గం పాడు జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట మండలంలో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువలు మత్తడి పోస్తున్నాయి. మంగపేట మండలంలో పంటపొలాలు నీట మునిగాయి. శనిగాకుంట వద్ద వాగు పొంగి పొర్లడం తో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుండటంతో అటవీశాఖ అధికారులు సందర్శన నిలిపివేపారు. #TelanganaRains Heartbreaking video of situation at #Medaram. Medaram hosts the sacred Sammakka &Saralamma Jatara. At least 1.5 crore ppl attend this annual fest -the BIGGEST tribal festival in the country! Today it is stranded in flood water. Video shared by temple priest pic.twitter.com/gju1f7rOkI — Revathi (@revathitweets) July 27, 2023 -
ములుగు జిల్లా అడవుల్లో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం
-
ములుగు జిల్లాలో కలకలం సృష్టిస్తున్న విద్యార్థులు
-
75 ఏళ్ల తర్వాత తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్ కిందకే వస్తాయని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బుధవారం తీర్పు ప్రకటించారు. 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడింది. ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే, ఆ 23 గ్రామాలు రాజ్యాంగ పరిధిలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి రావనీ ఆదివాసీయేతర నేతలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించినదని తెలిసిందే. చదవండి: బీజేపీ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ స్థానంలో భూపేంద్రయాదవ్? -
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్ హఠాన్మరణం
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతిచెందారు. హనుమకొండలోని తన నివాసంలో జగదీష్ గుండెపోటుకు గురికాగా, వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించేలోపే జగదీష్ తుదిశ్వాస విడిచారు. జగదీష్.. ఏప్రిల్ 1న తొలిసారి గుండెపొటుకు గురికాగా భార్య రమాదేవి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల అప్పుడు ప్రాణాపాయం తప్పినా సరిగ్గా 51 రోజుల వ్యవధిలోనే మరోసారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. జగదీష్ ఇకలేరనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం ములుగు జిల్లా మల్లంపల్లికి తరలించారు. మల్లంపల్లికి చెందిన జగదీష్ ఏటూరునాగారం నుంచి జెడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. ఇటీవల ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను సైతం పార్టీ అధినేత కేసిఆర్ జగదీష్‌కు అప్పగించారు. నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో జగదీష్ చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధిగా పార్టీ అధ్యక్షులుగా ములుగు జిల్లాలో జగదీష్ చేసిన సేవలు స్మరిస్తూ అభిమానులు పార్టీ నేతలు నివాళులర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జగదీష్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలిపారు. చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి పొంచిఉన్న ముప్పు
-
రోడ్డు ప్రమాదంలో టీవీ సీరియల్ నటుడి మృతి
ఏటూరు నాగారం(ములుగు జిల్లా): ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన కుమ్మరి బాలు(32) బుల్లితెర నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రొయ్యూర్ గ్రామానికి చెందిన బాలుకు ఎవరు లేకపోవడంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. టీవీ సీరియల్స్‌లో చిన్న పాత్రంల్లో నటిస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈనెల 18న కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామానికి చెందిన తన స్నేహితుడి వివాహానికి బైక్‌పై హైదరాబాద్ నుంచి వచ్చారు. వివాహం అనంతరం ఈనెల 19 అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండా యాదాద్రి సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలు బుల్లితెరలో నటిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతుండగా విధి వక్రించి ఈ కానరాని లోకాలకు తీసుకెళ్లిందని స్నేహితులు, గ్రామస్తులు వాపోతున్నారు. మృతుడికి భార్య ఉంది. చదవండి: అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి: తమన్నా -
మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర తేదీలివే!
సాక్షి, ములుగు: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి ఆదివాసీ, గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే జాతరను ఈసారి 2024 ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాలని పూజారుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి బుధవారం రోజున మండెమెలగడం, గుడి శుద్ధీకరణతో జాతర ప్రక్రియను ప్రారంభిస్తారు. దాదాపు పది నెలల ముందే జాతర తేదీలు.. మేడారం మహాజాతర తేదీలను పూజారులు ఈ సారి దాదాపు 10 నెలల ముందుగానే ప్రకటించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత అనుభవాల దృష్ట్యాఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సమ్మక్క–సారలమ్మ పూజారులు కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకటనకు ముందు పూజలు.. మేడారం మహాజాతర తేదీల ఖరారు కోసం బుధవారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షుడు కాక సారయ్య, ప్రధాన కార్యదర్శి చందా గోపాల్, పూజారులు సిద్దబోయిన మునేందర్, సిద్దబోయిన మహేశ్, లక్ష్మణ్‌రావు, కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావు, చందా రఘుపతి, కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేశ్, భోజారావు, జనార్దన్, అరుణ్‌కుమార్‌లు సమావేశం అయ్యారు. కాగా, సమ్మక్క–సారలమ్మ మహాజాతర తేదీలను ప్రకటించే ముందు పూజారులు ఆనవాయితీగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఏడాది మహాజాతర విజయవంతంగా సాగాలని అమ్మవార్లను వేడుకున్నారు. జాతర తేదీలు ఇవే.. ఫిబ్రవరి 21: మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గద్దెల మీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఫిబ్రవరి 22: చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత రాక. ఫిబ్రవరి 23: సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు మొక్కుల సమర్పణ. ఫిబ్రవరి 24: మాఘశుద్ధ పౌర్ణమి శనివారం అమ్మవార్ల వన ప్రవేశం, మహా జాతర ముగింపు. ఫిబ్రవరి 28: మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజున తిరుగువారం పండుగ. చదవండి: ఢిల్లీ సిగలో ‘గులాబీ’.. -
రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం..
ఏటూరునాగారం: పోలీస్ వాహనం అదుపుతప్పి ఎస్సైతోపాటు ప్రైవేట్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు, ఐజీ రవివర్మలు ములుగు జిల్లా వెంకటాపురం(కె) పోలీస్‌స్టేషన్ తనిఖీ చేశారు. అనంతరం భద్రాచలం వైపు వెళ్తుండగా ఏటూరునాగారం సెకండ్ ఎస్సై ఇంద్రయ్య(59).. ప్రైవేటు డ్రైవర్ రాజు(23), కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను తీసుకొని ఎస్కార్ట్‌గా వెళ్లారు. వాహనం అతివేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడి, పల్టీలు కొట్టింది. ముందు కూర్చున్న ఎస్సై, డ్రైవర్ వాహనంలోంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఎస్సై ఇంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందారు. రాజు చెట్లపొదల్లో పడి మృతిచెందాడు. కానిస్టేబుల్ మెట్టు శ్రీనివాస్ వాహనంలో సీటును గట్టిగా పట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన తేరుకుని స్థానిక ఎస్సై రమే‹Ùకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శ్రీనివాస్‌ను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: సర్పంచ్ కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం -
తెలంగాణలో మావోయిస్టు పోస్టర్లు కలకలం
-
దేశాన్ని దోచుకునేందుకు బయలుదేరారు
ములుగు/వెంకటాపురం(ఎం): 2001లో రబ్బరు చెప్పులకు కూడా గతిలేని కేసీఆర్ కుటుంబం నేడు రాష్ట్రాన్ని దోచుకుని రూ.లక్షల కోట్లకు పడగలెత్తిందని, అది చాలదన్నట్లు ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి ముఖ్యమంత్రి బయలుదేరారని టీపీపీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. డ్రామారావు (కేటీఆర్‌నుద్దేశించి) రాష్ట్ర ప్రజలు తమ కుటుంబ సభ్యులని, కుటుంబ పాలన ఉంటుందని అనడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ద్రోహులు ఎర్రబెల్లి, తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డిని చుట్టూ చేర్చుకొని దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర రెండో రోజు మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రేవంత్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ముందు విలేకరుల సమావేశంలో, రాత్రి 8 గంటలకు పాదయాత్ర ములుగుకు చేరుకున్నాక గ్రామ పంచాయతీ ఎదుట ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే సమ్మక్క–సారలమ్మ జిల్లా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు సరైన ఇల్లు లేక రోడ్లపై అవస్థలు పడుతుంటే 160 పడక గదుల భవనంలో దొర దర్జాగా గడుపుతున్నారని విమర్శించారు. ములుగు ప్రజల ఆదరణ, పౌరుషాన్ని పుణికి పుచ్చుకొని రాష్ట్ర మంతటా సీతక్కతో కలిసి యాత్ర కొనసాగించి అధికారంలోకి వస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే ములుగు జిల్లాను సమ్మక్క–సారలమ్మల పేరు మీద మారుస్తూ తొలి సంతకం పెడతామని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని పునరుద్ఘాటించారు. భోజనం పెట్టిన కూలీలు ములుగు జిల్లా కేశవాపూర్ రోడ్డు మీదుగా యాత్ర సాగుతుండగా మధ్యాహ్నం సమయంలో పక్కనే పత్తి, మిర్చి ఏరుతున్న కూలీలను రేవంత్ పలకరించారు. ఇప్పటి ప్రభుత్వం బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? అని అడగడంతో ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నట్లు కూలీలు తెలిపారు. తాము తెచ్చుకున్న టిఫిన్ బాక్సులను తెరిచి రేవంత్‌రెడ్డి, సీతక్కలకు భోజనం పెట్టారు. -
మేడారానికి పోటెత్తిన భక్తులు
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలో మినీజాతర ముగిసినప్పటికీ భక్తుల రాక కొనసాగుతూనే ఉంది. ఆదివారం 1.50 లక్షల మందికిపైగా భక్తులు తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం కిటకిటలాడింది. మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది. రద్దీని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఏర్పాట్లను ఈవో రాజేంద్రం పర్యవేక్షించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో
ములుగు రూరల్(గోవిందరావుపేట)/ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లాపూర్ వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనపై వివరాలివి. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 18 మంది రోజువారీ పనులకు ఆటోలో నార్లాపూర్ బయలుదేరారు. ఆటోలో పరిమితికి మించి కూలీలను ఎక్కించుకోవడం.. డ్రైవర్ నిర్లక్ష్యం.. అతి వేగంతో నడపడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆటో బోల్తాపడింది. దీంతో మల్లబోయిన సునీత (30) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీసీఎస్ సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షల అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న రుద్రారపు స్వర్ణలత, తొడుసు యాకమ్మ, మల్లబోయిన స్వాతి, బానోతు జ్యోతి, కామసాని బుగ్గమ్మ, రసపుత్ మల్లమ్మ, రసపుత్ విజయ, కుంట బుచ్చక్కలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బానోతు జ్యోతి (45)ని ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగితా వారికి స్వల్ప గాయాలు కావడంలో ములుగు ఆస్పత్రిలో చికిత్స అందించారు. క్షతగాత్రులను ములుగు ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. -
మేడారంలో ప్రత్యేక పూజలు
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ మినీ జాతర గురువారం రెండో రోజుకు చేరింది. బుధవారం మండమెలిగె పండుగతో జాతర ప్రారంభం కాగా.. రెండో రోజు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మేడారం, కన్నెపల్లి ఆదివాసీలు, గ్రామస్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ పూజారులు వారి ఇళ్లలో కూడా అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి జంపన్నవాగు వద్ద స్నానాలు ఆచరించారు. గద్దెల ప్రాంగణంలో మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి మొదలైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. -
పోరాటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు
వెంకటాపురం(ఎం): ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాటం.. స్థానిక ప్రజల పోరాటంతోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అదివారం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి ఆమె సందర్శించారు. రామప్ప ఆలయ ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. తర్వాత వారు ఆలయంలో రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప గార్డెన్లో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రామప్ప ఆలయం ఉన్నందున గుడికి సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదని, ఆలయ పరిసరాల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’.. ములుగు జిల్లాలో ఉండడం గర్వకారణమన్నారు. ఈ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం 334 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించారు. ములుగు జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటైందని, వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. కాగా, రూ.1,800 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క బ్యారేజీని నిర్మించినట్లు పేర్కొన్నారు. గోదావరి పరీవాహక కోత ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం రూ.130 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
గుండెపోటుతో కూడా బస్సును అదుపు చేసి
వెంకటాపురం(కె): టూరిస్ట్ బస్సుడ్రైవర్‌కు గుండెపోటు వచ్చినా.. బస్సుకు బ్రేక్ వేయడంతో తక్కువ వేగంతో పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఏమీ కాలేదు కానీ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం అంకన్నగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రయాణీకుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 45మంది శక్తి మాలలు ధరించి తీర్థ యాత్రల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భద్రాచలం పర్ణశాల నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి బయలుదేరారు. బస్‌డ్రైవర్ దేవ ఇరక్కమ్ (49) పర్ణశాల వద్ద నుంచే తనకు గుండె వద్ద నొప్పి వస్తోందని ఇబ్బందిగా ఉందని తెలిపాడు. దీంతో వేరే డ్రైవర్‌ను పిలిపించాలని ప్రయాణికులు సూచించారు. మరో డ్రైవర్ రావడానికి రెండు రోజులు పడుతుందని, అప్పటివరకు తానే బస్సు నడుపుతానని చెప్పి యాదాద్రికి బయలుదేరాడు. అంకన్నగూడెం గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్‌కు గుండెనొప్పి తీవ్రమై ఒక్కసారిగా కుప్పకూలాడు. బస్సు నెమ్మదిగా ఉండడం, డ్రైవర్ నొప్పితో ఉన్నా బ్రేక్ వేయడంతో బస్సు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి ఆగింది. అపస్మారకస్థితిలో ఉన్న డ్రైవర్‌ను వెంటనే 108లో వెంకటాపురం వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయాడు. బస్సులోని 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ నొప్పి ఉన్నా సమయస్ఫూర్తితో బ్రేక్ వేశాడని, లేదంటే పెనుప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
Mulugu: డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. బస్సులో 40 మంది భక్తులు
ములుగు: జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో యాత్రికుల బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. అయితే బస్సులో 40 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. గుండెపోటుకు గురైన డ్రైవర్ మాత్రం ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి ప్రైవేటు బస్సులో బయలుదేరిన భవాని దీక్ష భక్తులు.. భద్రాచలం మీదుగా యాదగిరిగుట్ట వెళ్తుండగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రపురం వద్ద డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. -
మాములోడు కాదు.. ఎస్ఐ డేంజర్ ప్లాన్ తెలిసి పోలీసు శాఖ అలర్ట్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతుండగా.. అదేశాఖలో పనిచేసే ఓ అధికారి మావోయిస్టుల తరహాలో దళాన్ని ఏర్పాటు చేసేందుకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. తాడ్వాయి అడవుల్లో ట్రయల్ కూడా నిర్వహించినట్లు సమాచారం. సదరు వ్యక్తులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. వరంగల్‌లో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపించి మావోయిస్టులు ఉన్నారనే భ్రమ కల్పించాలని పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ కుట్ర వెనుక ములుగు జిల్లాలో పనిచేసే ఓ ఏఆర్ ఎస్ఐ కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పకడ్బందీగా జరిగిన ఈ కుట్రకోణాన్ని పసిగట్టిన హైదరాబాద్‌లోని పోలీస్ నిఘా విభాగం.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారాలతో కూడిన కొన్ని వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు ములుగు పోలీస్ అధికారుల సహకారంతో రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ బృందం.. సదరు ఏఆర్ ఎస్ఐతో పాటు మరో ఇద్దరిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఈ విచారణలో సాయుధ దళం ఏర్పాటుతోపాటు వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన వివరాలను సేకరించి.. సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను సైతం అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా ఈ కుట్రకోణం వెనుక భారీ ప్రణాళిక దాగి ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. సాయుధ దళం ఏర్పాటు చేసి.. ఆ సభ్యులతో యాక్షన్లు చేయించి.. తిరిగి వారిని ఎన్కౌంటర్ పేరిట హతమార్చి పోలీస్‌శాఖలోనూ పేరు తెచ్చుకోవాలన్న మరో కోణం దాగి ఉన్నట్లు కూడా ప్రచారంలో ఉంది. వరంగల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపే యాక్షన్‌టీమ్ తనను కలిసేందుకు ములుగు ప్రాంతానికి వచ్చే క్రమంలో ఎన్కౌంటర్ చేయాలన్న కుట్ర పన్నినట్లు సమాచారం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. ఇటు హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపి మావోయిస్టులు ఉన్నట్లు భ్రమలు కల్పించడంతోపాటు మరోవైపు ఎన్కౌంటర్ చేసి పోలీసు అధికారులు మెప్పు పొందవచ్చని భావించి ఈ కుట్రకు తెర లేపినట్లు సమాచారం. ముందే ఈ వివరాలన్నీ సేకరించి విచారిస్తున్న ప్రత్యేక నిఘా విభాగం.. వీటన్నింటిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
ఇంటి కుళాయికి బిరడా
మంగపేట: రోడ్డువెంట మొక్కల్ని పశువులు ధ్వంసం చేస్తున్నాయంటూ పశువుల కాపరికి రూ.7,500 జరిమానా విధించిన అధికారులు.. తాజాగా సదరు కాపరి ఇంటి కుళాయికి బిరడా బిగించడం వివాదాస్పదమైంది. ములుగు జిల్లా మంగపేటలో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేయడానికి కారకుడంటూ పశువుల కాపరి గంపోనిగూడెంకు చెందిన బోయిన యాకయ్యకు పంచాయతీ అధికారులు రూ.7500 జరిమానా విధించడం తెలిసిందే. తాజాగా యాకయ్య ఇంటి కుళాయి (నల్లా)ను సైతం పంచాయతీ అధికారులు సీజ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనానికి పశువులు అడ్డం వచ్చాయి. ఎంత హారన్ కొట్టినా వాటిని పక్కకు అదిలించకుండా పశువుల కాపరి యాకయ్య ఫోన్ మాట్లాడుతుండడంతో కలెక్టర్ అసహనానికి గురయ్యారు. దీంతో తన గన్‌మెన్‌ను పంపి కాపరి ఫోన్‌ను లాక్కున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనికి పశువులు మొక్కలను ధ్వంసం చేస్తున్నాయన్న సాకుతో జరిమానా విధించినట్లు చెబుతున్నారు. నల్లాకు బిరడా బిగింపుపై పశువుల కాపరి యాకయ్య మాట్లాడుతూ రూ.7,500 జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని చెప్పి ఫోన్ ఇచ్చారని తెలిపాడు. ఇంటికి వచ్చి చూడగా పంచాయతీ సిబ్బంది తన ఇంటి నల్లాకు బిరడా వేసి సీజ్ చేశారని పేర్కొన్నాడు. సాయంత్రం ఎంపీడీవో ఫోన్ చేసి నల్లా బిరడా తొలగించుకోమన్నారని, తనకు తెలియదని చెబి తే.. పంచాయతీ సిబ్బంది వచ్చి తొలగించి వెళ్లారని వివరించాడు. తనకు విధించిన జరిమానాపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు. నిర్లక్ష్యానికే జరిమానా: ఎంపీడీవో మండలంలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకిరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకే పశువుల కాపరికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరిమానా విధించామని ఎంపీడీవో శ్రీధర్ ఓ వీడియోలో వివ రణ ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమా ల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎంపీడీవోకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వస్తోంది. -
రాష్ట్రపతి పర్యటన భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు
వెంకటాపురం (ఎం): రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో పాల్గొనే భద్రతా సిబ్బందికి సోమవారం పాలంపేట గ్రామపంచాయతీ ఆవరణలో కరోనా పరీక్షలు నిర్వహించారు. బుధవారం రాష్ట్రపతి ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండలంలోని చారిత్రక రామప్ప ఆలయానికి రానున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేశారు. దేశంలో నాలుగో వేవ్ బీఎఫ్–7 వేరియెంట్ ప్రారంభం కావడంతో వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా రామప్పలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు? ఎమైనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయా? అనే విషయమై వైద్యాధికారులు ప్రకటించలేదు. -
జవాన్‌కు జన్మ‘భూమి’!
ములుగు(గజ్వేల్): దేశరక్షణకు అంకితమైన ఆ సైనికుడికి ఇంటి స్థలం లేదు. ఆ విషయాన్ని స్వగ్రామం గుర్తించింది. వంద గజాల స్థలాన్ని అందజేసి ఆ సైనికుడిపై తమ గౌరవాన్ని చాటుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం సింగన్నగూడ గ్రామానికి చెందిన తాళ్ల వెంకటేష్ సైనికుడిగా జమ్ముకశ్మీర్‌లో సేవలందిస్తున్నాడు. అతనికి స్వగ్రామంలో ఇంటి స్థలం లేదు. దీంతో గ్రామస్తులు రామాలయం వెనుక ప్రాంతంలో గ్రామకంఠానికి చెందిన సుమారు రూ.6 లక్షల విలువైన వంద గజాల స్థలాన్ని వెంకటేశ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం పంచాయతీ, గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అతని పేరిట స్థలం హక్కు పత్రాన్ని రాసి అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి, ఎస్ఐ రంగకృష్ణ, సర్పంచ్ బాలకృష్ణ, ఉపసర్పంచ్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. -
రామప్పలో గుప్తనిధుల వేట
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా లభించి తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వపడుతుంటే, మరోపక్క దుండగులు రామప్ప ఉప ఆలయాల్లో గుప్తనిధుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేట శివారులో రామప్ప ప్రధాన ఆలయంతోపాటు పది ఉప ఆలయాలు ఉన్నాయి. వారం క్రితం రామప్ప ఆలయానికి పడమర దిశలో ఉన్న జామాయిల్ తోటలోని శివాలయం (ఉప ఆలయం) వద్ద గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపినట్లు సమాచారం. నెలరోజులుగా ఉప ఆలయాల పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఒక ముఠా రాత్రివేళల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో సరస్సుకట్టపై ఉన్న ఉపఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి శివలింగాలను ధ్వంసం చేశారు. బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న శివాలయంలో నంది మెడను ధ్వంసం చేశారు. 20 రోజుల క్రితం పాలంపేట నాగబ్రహ్మక్షేత్రం వద్ద తవ్వకాలు జరపగా, ఏమీ లభించకపోవడంతో దానిని పూడ్చివేసినట్లు తెలిసింది. జామాయిల్ తోటలోని శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపినట్లు అక్కడ ఉన్న పూజా సామగ్రిని పట్టి తెలుస్తోంది. తవ్వకాల్లో విగ్రహంతోపాటు బంగారం లభ్యమైనట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినప్పటికీ రక్షణ కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలంపేట ఉప ఆలయాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, రాత్రివేళల్లో పోలీసులు భద్రతాచర్యలు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. -
ఫిబ్రవరి 1 నుంచి మినీ మేడారం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ మండమెలిగె పండుగ (మినీ మేడారం జాతర) తేదీలను ఖరారు చేశారు. 2023, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 4 వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు వెల్లడించారు. ఈమేరకు మంగళవారం మేడారంలో సమావేశమైన సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. కాగా, ఖరారు తేదీల పత్రాలను కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ అధికారులకు అందజేశారు. మహా జాతర సమయంలో మొక్కులు తీర్చుకున్నవారితోపాటు ఇతర ప్రాంతాలనుంచి కూడా మినీ మేడారంజాతరకు భారీగా భక్తులు రానున్నారు. -
దొంగిలించిన కారులో వెళ్తుండగా ప్రమాదం.. చికిత్స పొందుతూ మరో బైక్ చోరీ
సాక్షి, ములుగు: కారును దొంగిలించి సొమ్ము చేసుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. తప్పించుకునే తొందరలో వేగంగా వెళ్లిన దొంగలకారు విద్యుత్ స్థంభానికి ఢీ కొట్టడంతో ఆస్పత్రిపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ అప్సర్ కారు తన ఇంటి వద్ద నిలిపి ఉండగా ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించి, కారును వేగంగా నడుపుతూ తీసుకెళ్తుండగా మంగపేట మండలం గంపోనిగూడెం వద్ద విద్యుత్ స్తంభానికి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు గాయపడడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు తాడ్వాయి మండలం వీరాపురం గ్రామానికి చెందిన చీరల సందీప్ కాగా.. మరొకరు రాజ్‌కుమార్‌గా గు ర్తించారు. మంగపేట పోలీస్‌స్టేషన్‌లో రోడ్డు ప్రమా దం కేసు నమోదు కాగా, ఏటూరునాగారంలో కారు అపహరణ కేసు నమోదైంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఆ ఇద్దరిలో రాజ్‌కుమార్ ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సామాజిక ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తిస్తున్న గడ్డం దశరథం 108 డ్రైవర్ బైక్‌ను తీసుకొని ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది, బైక్ యజమాని తలలు పట్టుకుంటున్నారు. ఒక కారుతో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి దొంగతనం బయటపడి పోలీసులకు చిక్కగా చికిత్స పొందుతూ మరో బైక్‌ను దొంగలించడం హాట్ టాపింగ్ మారింది. అంతేకాకుండా పోలీసులకు చిక్కినట్లే చిక్కి ఒక దొంగ పారిపోవడం గమనార్హం. ఇద్దరు దొంగలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కానీ, సోమవారం రాత్రి వరకు కూడా బైక్‌పై పారిపోయిన వ్యక్తి వివరాలు తెలియలేదు. చదవండి: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి -
మావోయిస్టుల ఘాతుకం.. హత్య చేసి టీఆర్ఎస్పై షాకింగ్ వ్యాఖ్యలు
సాక్షి, ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వెంకటాపురం మండలంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలోనే ఇన్ఫార్మర్గా వ్యవహరించే వారు పద్దతి మార్చకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. ఈ మేరకు వాజేడు ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు. వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గోపాల్ ఇంట్లో ఉన్న సమయంలో ఐదుగురు అనుమానితులు రావడంతో వారిని గమనించిన గోపాల్ బయటికి పరుగెత్తగా వెంబడించి పట్టుకున్నారు. గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి చంపేశారు. రక్తపుమడుగులో పడి ఉన్న గోపాల్ మృతి చెందినట్లు నిర్ధారించుకుని లాల్‌సలామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. మరోవైపు.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో చాలా మందిని కాల్చి చంపారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఇన్ఫార్మర్గా వ్యవహరించే వారు పద్దతి మార్చకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 20 రోజుల క్రితం మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పర్యటించి పోలీసులను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ ఇలా హత్య జరగడం ఏజెన్సీలో కలకలం సృష్టించింది. -
ఉన్నత చదువుకు డబ్బుల్లేవని ఉసురు తీసుకుంది!
సాక్షి, ములుగు: చదివేందుకు డబ్బుల్లేవనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేశ్–కవిత దంపతుల కుమార్తె సాత్విక (18)కు ఇంటర్ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సీటు వచ్చింది. తల్లిదండ్రులకు డబ్బులు కట్టే స్థోమత లేకపోవడంతో స్థానికంగా కాలేజీల్లో చేర్పించాలని యోచిస్తున్నారు. మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి గడ్డి మందు తాగడంతో కుటుంబీకులు ములుగు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. తన కూతురు మృతిచెందినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశించిన తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు ఎస్సై తాజొద్దీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమానుషం: చెరువులో చేపలు పట్టారని బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టి -
హడలెత్తించిన మొసళ్లు
కడెం(ఖానాపూర్)/ఏటూరునాగారం: వేర్వేరు చోట్ల రెండు మొసళ్లు హడలెత్తించాయి. నిర్మల్ జిల్లా ఎలగడప గ్రామంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఓ మొసలి ప్రవేశించి.. గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గ్రామస్తుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది మొసలిని చాకచక్యంగా తాళ్లతో బంధించి తీసుకెళ్లి కడెం ప్రాజెక్టులో వదిలారు. అలాగే, ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం జాలర్ల వలకు ఓ మొసలి చిక్కింది. భయాందోళనకు గురైన జాలర్లు వెంటనే దానిని తిరిగి గోదావరి నదిలోకి వదిలేశారు. గోదావరిలోకి మొసళ్లు వచ్చాయని, స్నానాలకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు హెచ్చరించారు. -
డాడీ నొప్పిగా ఉంది.. బయటికి తియ్యి! గంటన్నర పాటు నరక యాతన
మంగపేట (ములుగు జిల్లా): నిండా కలప లోడుతో వెళ్తున్న లారీ.. అదుపు తప్పి రోడ్డు పక్కన వెళ్తున్న బాలురపై బోల్తా పడింది.. ఇద్దరు బాలురపై కలప దుంగలు పడగా.. మరో బాలుడు లారీ క్యాబిన్ కింద చిక్కు కుపోయాడు. సమీపంలోనే ఉన్నవారు పరుగెత్తు కొచ్చేటప్పటికి బాలురు బాధతో రోదిస్తున్నారు. కాసేపటికే లారీ క్యాబిన్ కింద చిక్కుకున్న బాలుడి తండ్రి అక్కడికి వచ్చాడు. బాలుడు తండ్రిని చూసి ‘డా డీ.. నొప్పిగా ఉంది.. నన్ను బయటికి తియ్యండి డాడీ..’అంటూ ఏడ్చాడు. కొడుకును బయటికి తీయలేక.. అతడి బాధను చూడలేక తండ్రి కన్నీళ్లు పెడుతూ విలవిల్లాడిపోయాడు. అక్కడికి వచ్చిన వారంతా అది చూసి కన్నీళ్లు పెట్టారు. గురువారం సాయంత్రం ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి పీహెచ్సీ ఎదుట ఈ ఘటన జరిగింది. మూల మలుపు వద్ద అదుపు తప్పి.. కలప లోడుతో మంగపేట వైపు నుంచి మణుగూరు వైపు వెళ్తున్న లారీ చుంచుపల్లి పీహెచ్సీ ముందు మలుపు వద్ద అదుపుతప్పింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గ్రామ బాలురు పోలెబోయిన సాయి, కల్తీ దిలీప్, చింతకుంటకు చెందిన కొమరం చందులపై బోల్తా పడింది. చందు, దిలీప్‌పై కలప దుంగలు పడగా.. సాయి లారీ క్యాబిన్ కింద ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కలప కింద ఉన్న ఇద్దరిని బయటికి తీశారు. ఈ ఇద్దరికీ కాళ్లు విరగడం, ఇతర గాయాలూ కావడంతో 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక సాయికి కుడికాలు, కుడిచేయి ఓ కర్రకు, లారీ క్యాబిన్‌కు మధ్య ఇరుక్కుపోవడంతో అతడిని బయటికి లాగడం వీలుకాలేదు. పోలీసులు స్థానికుల సహకారంతో ప్రొక్లెయిన్, రెండు జేసీబీలను తెప్పించి బాలుడిని సుమారు గంటన్నర తర్వాత బయటికి తీశారు. బాలుడు బాధను తట్టుకోలేక ఏడవడం, అక్కడికి చేరుకున్న తన తండ్రి ఆదినారాయణను చూసి ‘డాడీ నొప్పిగా ఉంది.. బయటికి తియ్యండి’అంటూ రోదించడం అందరినీ కలచివేసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య.. బాలుడిని వైద్యం కోసం తన వాహనంలో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కారుతో ఢీకొట్టి.. కత్తులతో పొడిచి..
ములుగు రూరల్: మైనింగ్ వ్యాపారం చేసే ఓ న్యాయవాది దారుణంగా హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు నడిరోడ్డుపై వెంబడించి మరీ కత్తులతో పొడిచి చంపేశారు. ములుగు జిల్లా భూపాల్‌నగర్ (పందికుంట) స్టేజీ వద్ద సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. మైనింగ్‌కు సంబంధించిన భూ వివాదాలే ఈ హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారును వెనుక నుంచి ఢీకొట్టి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన మాడగుండ్ల మల్లారెడ్డి (54) కొన్నేళ్లుగా హనుమకొండ బాల సముద్రం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ములుగు జిల్లా మల్లంపల్లిలో పెట్రోల్ బంక్, మైనింగ్ వ్యాపారం ఉన్నాయి. వ్యాపార పనుల నిమిత్తం ఆయన తరచూ మల్లంపల్లికి వచ్చి వెళ్తుంటారు. సోమవారం సాయంత్రం ఆయన ఇన్నోవా వాహనంలో ములుగుకు వచ్చి తిరిగి హనుమకొండకు బయల్దేరారు. పందికుంట స్టేజీ వద్ద ఆయన వాహనాన్ని వెనుక నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన దుండగులు ఢీకొట్టారు. దీంతో మల్లారెడ్డి తన వాహనం దిగి ఆ కారులోని వ్యక్తులతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే కారులోని ఐదుగురు వ్యక్తులు మల్లారెడ్డిపై కత్తులతో దాడికి దిగారు. అది చూసి మల్లారెడ్డి పరుగుపెట్టినా దుండగులు వెంబడించి మరీ కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. ఈ ఘటనలో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత దుండగులు వచ్చిన కారులోనే పరారయ్యారని మల్లారెడ్డి వాహన డ్రైవర్ సారంగం వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భూవివాదాలే కారణం! మల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్లారెడ్డికి అక్కడి భూముల విషయంగా కొందరితో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి హత్యకు పాత కక్షలు, మైనింగ్‌కు సంబంధించి భూవివాదాలే కారణమై ఉండవచ్చని మల్లంపల్లి వాసులు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు. -
కుక్కను తప్పించబోయి కాల్వలోపడ్డ కారు
వాజేడు: కుక్కను తప్పించబోయి కారు కాల్వలో పడటంతో ఐదుగురు పర్యాటకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బొగత జలపాతం చూడటానికి హైదరాబాద్ నుంచి కారులో పర్యాటకులు వచ్చారు. బొగత జలపాతాన్ని చూసి తిరిగి వెళ్తుండగా మండల పరిధిలోని దూలాపురం గ్రామం వద్ద వారి కారుకు కుక్క ఎదురొచ్చింది. దీంతో దాన్ని తప్పించడానికి కారును పక్కకు తిప్పడంతో అదుపుతప్పి సమీపంలోని కాల్వలో బోల్తాపడింది. స్థానికులు గమనించి బోల్తాపడిన కారులో ఉన్నవారిని బయటకు తీశారు. -
ములుగు జిల్లా: ముత్తారం వాగులో చిక్కుకున్న ట్రాక్టర్
-
ములుగు జిల్లా: వరదల్లో చిక్కుకున్న కారు
-
Godavari Floods 2022: ఇళ్లన్నీ నీళ్లలోనే..
ఏటూరునాగారం/మంగపేట/ఎస్ఎస్ తాడ్వాయి/మహాముత్తారం/కాళేశ్వరం: గోదావరి క్రమంగా శాంతిస్తున్నా పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాల్లోని పలు గ్రామాల్లో వరద ఉండిపోగా.. కొన్ని గ్రామాల్లో తగ్గుముఖం పట్టింది. ఏటూరునాగారం మండల కేంద్రంలోని పలు కాలనీలు, రామన్నగూడెం, రాంనగర్, లంబాడీతండా, రొయ్యూరు గ్రామాలు ఇంకా ముంపులో ఉన్నాయి. మిగతా గ్రామాల్లో వరద తగ్గడంతో జనం పునరావాస శిబిరాల నుంచి ఇంటిముఖం పడుతున్నారు. తడిసిన వస్తువులు, మంచాలు, వంట సామగ్రిని శుభ్రం చేసుకుంటున్నారు. భారీ వర్షాలు, వరదతో ఏటూరునాగారం మండలంలో 48 ఇళ్లు కూలిపోయాయి. నీట మునిగిన గ్రామాల్లో ఇళ్లు, వీధులు, రోడ్లన్నీ బురదతో నిండిపోయాయి. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జంపన్నవాగు రెండు బ్రిడ్జీలపై నుంచి వచ్చిన వరద వ్యాపారుల దుకాణాలను ముంచెత్తింది. మినరల్ వాటర్ ప్లాంట్ మోటార్లు. వంట సామగ్రి పాడైపోయాయి. కొన్ని సామాన్లు వరదలో కొట్టుకుపోయాయని వ్యాపారులు తెలిపారు. మంగపేట మండలంలోని కమలాపురం, మంగపేట, తిమ్మంపేట, మల్లూరు, చుంచుపల్లి, కత్తిగూడెం, రాజుపేట, అకినేపల్లి మల్లారంలో గోదావరి తీరం వెంట లోతట్టు ప్రాంతాలను వరద వీడలేదు. మంగపేటలోని వడ్డెర కాలనీలో ఇళ్లు బయటపడ్డాయి. భారీగా రోడ్లు ధ్వంసం జంపన్నవాగు వరదకు కొత్తూరు నుంచి రెడ్డిగూడెంకు వచ్చే దారిలో కల్వర్టు, సీసీ రోడ్డు కోతకు గుర య్యాయి. తూములవాగు వరద తాకిడికి ఊరట్టం సీసీ రోడ్డు కింది భాగం కోతకు గురై పెద్ద గొయ్యి ఏర్పడింది. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవాపూర్ సమీపంలోని మేడారం వెళ్లే డబుల్ రోడ్డు వందమీటర్ల పొడవు నా తెగిపోయింది. కొంచెం దూరంలో డబుల్ రోడ్డు ఓవైపు యాభై మీటర్ల పొడవున కోతకు గురైంది. ఈ మండలంలోని 24 గ్రామపంచాయతీల పరిధిలో 80 శాతం రహదారులు తెగిపోవడంతో.. గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాళేశ్వరం పరిధిలోని అన్నారం కెనాల్ కట్టపై వరదకు బీటీ రోడ్ కనిపించకుండా ఇసుక మేటలు వేసింది. కాళేశ్వరం నుంచి సిరొంచ వెళ్లే జాతీయ రహదారి పెద్ద మొత్తంలో కొట్టుకుపోయింది. -
ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే సీతక్క
-
పామును మింగిన మరో పాము.. వైరలవుతోన్న వీడియో
సాక్షి, ములుగు: ఓ పాము మరో పామును మింగింది. ఆపసోపాలు పడ్డ ఆ పాము మింగిన పామును మళ్ళీ బయటికి వదిలింది. ఈ అరుదైన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గుట్టపై చోటుచేసుకుంది. గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయ ఆవరణలో తాచుపాము మరో పామును మింగి కలకలం సృష్టించింది. పామును మింగిన త్రాచుపాము కదలలేక అష్టకష్టాలు పడింది. చివరకు మింగిన పామును బయటకు వదలలేక తప్పలేదు. అప్పటికే ఆ పాము ప్రాణాలు కోల్పోగా, త్రాచుపాము బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్ళి పోయింది. గుడికి వచ్చిన భక్తులు అరుదైన సన్నివేశాన్ని తమ సెల్ ఫోన్లో బంధించారు. పామును మరో పాము మింగుతున్న దృశ్యాలు.. పూర్తిగా మింగేసి.. మళ్లీ బయటకు వదలడం దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చదవండి: ఆషాఢమాసం ఆరంభం.. శుభముహూర్తాలకు బ్రేక్.. అప్పటి వరకు ఆగాల్సిందే! -
బెటాలియన్‌ను సీఎం ఫామ్‌హౌస్‌లో నిర్మించాలి: ఆర్ఎస్పీ
గోవిందరావుపేట: 5వ బెటాలియన్ ఏర్పాటుకు పేదల భూములే దొరికా యా? సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నిర్మించవచ్చు కదా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. బహుజన రాజ్యాధి కార యాత్ర సోమ వారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో సాగింది. ఈ సందర్భంగా బెటాలియన్ ఏర్పాటులో భూములు పోతున్న చల్వాయి రైతులతో ప్రవీణ్ మాట్లాడారు. పేదలకు చెందిన 105 ఎకరాల భూమిని 5వ బెటాలియన్ కోసం కేటాయించారని, నిర్వాసితులకు ఉద్యోగం, నివాస స్థలం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. పేదల తరపున మాట్లాడే వారేలేరని, వారికి నోరులేదని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా అడిగిన వారిని జైలుకు పంపుతున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తుందని హామీ ఇచ్చారు. -
Mulugu: లక్నవరం చెరువులో మునిగి యువతీ, యువకుడు మృతి
సాక్షి, ములుగు : జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లక్నవరం చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, వారిద్దరూ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) చెందినవారు. వివరాల ప్రకారం.. ఐఎస్బీకి చెందిన ఆరుగురు(నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు) విద్యార్థుల బృందం లక్నవరం చెరువును చూసేందుకు వచ్చారు. అనంతరం సరదాగా సరస్సులోకి దిగారు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు యువతీ, యువకుడు నీటిలో మునిగిపోయారు. తోటి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. వారిద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను సాయి ప్రీతమ్ (24), తరుణి (20)గా గుర్తించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ములుగు జిల్లాలో దారుణం..సొంత చిన్నాన్న కూతురిపైనే అత్యాచారం
-
ములుగు జిల్లాలో దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి
సాక్షి, ములుగు(వరంగల్): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవులలో దారుణం జరిగింది. వావివరసలు మరిచి ఓ కామాంధుడు సొంత చిన్నాన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. మైనర్ అని చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో బాలిక ఎవరికి చెప్పలేదు. అయితే కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళితే గర్భవతిగా వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: రెండ్రోజుల్లో యువకుడు పెళ్లి.. పత్రికలు పంచుతూ -
భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త ఏం చేశాడంటే..?
సాక్షి, ములుగు జిల్లా: ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం రీత్యా వేర్వేరుగా ఉంటున్నారు. ఆ ఎడబాటు కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. భార్యపై అనుమానంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అనుమానం కాదు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని భార్య, ఆమె తల్లితో పాటు పెద్ద మనుషులు సూచించారు. దీంతో భర్త నిఘా పెట్టి భార్య బండారాన్ని బయట పెట్టాడు. చదవండి: హాస్టల్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం ములుగు జిల్లాలోని దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చీమల సుమలత, చర్ల కార్యదర్శిగా పనిచేసే పాయం పురుషోత్తం ప్రేమించుకున్నారు. గత 8 ఏళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగాల రిత్యా సుమలత చిన్నబోయినపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుండగా.. పురుషోత్తం చర్లలో ఉంటున్నాడు. అయితే.. ఇటీవల భార్య-భర్తల మధ్య ఏర్పడిన అనుమానం.. గొడవలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తన ఇంటర్ క్లాస్మెంట్ లింగరాజుతో సుమలత సన్నిహితం పెంచుకుంది. దీంతో భర్త పురుషోత్తం అనుమానం మరింత పెరిగింది. ప్రవర్తన మార్చుకోవాలని.. పలు మార్లు భార్యను హెచ్చరించాడు.. భర్త పురుషోత్తం. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలోనే పంచాయితీ పెట్టించాడు. ఆ సమయంలో సుమలత తల్లి సూటిపోటి మాటలతో పురుషోత్తంని నిందించి, అనుమానం కాదు అవసరమైతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని సూచించింది. పురుషొత్తం భార్యపై నిఘా పెట్టి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపూర్‌లోని ఓ ఇంట్లో సుమలత, లింగరాజుతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలు, సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని పోలీసులకు అప్పగించిన్నట్లు భర్త పురుషోత్తం తెలిపారు. -
దారుణం..మరణానికి ముందే శ్మశానవాటికకు..
వెంకటాపురం(ఎం): బతికి ఉండగానే ఓ వ్యక్తిని శ్మశానవాటికకు తరలించారు. విషయం తెలుసు కున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ఆస్పత్రికి తరలించాలనుకునేలోపే మృతిచెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం)లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కేసోజు సోమయ్యచారి, సరోజనలు స్థానికంగా ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి రెండవ సంతానమైన లక్ష్మణాచారి మద్యానికి బానిసయ్యాడు. విసుగు చెందిన అతని భార్య రెండేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి పోయింది. 6 నెలల క్రితం లక్ష్మణాచారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా అతని ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి లక్ష్మణాచారి మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇంట్లో మృతి చెందితే యజమాని ఏమైనా అంటాడనే భయంతో తల్లిదండ్రులు బుధవారం తెల్లవారుజామున శ్మశానవాటికకు తరలించారు. సమాచారం అందుకున్న వెంకటాపురం ఎస్సై రాధిక, సర్పంచ్ మేడబోయిన అశోక్‌లు శ్మశానవాటికకు చేరుకొని లక్ష్మణాచారిని ఆస్పత్రికి తరలించాలనుకున్నారు. అయితే ఈలోపే అతడు మృతి చెందాడు. అద్దె ఇంట్లో కొడుకు చనిపోతే ఇంటి యజమానితో ఇబ్బందులు ఉంటాయనే శ్మశానవాటికకు తరలించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. -
గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
సాక్షి, వరంగల్: ఉగాది పండుగ రోజున ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం రోహీర్ గ్రామ సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రోహీర్ గ్రామానికి చెందిన డోంగిరి సందీప్, ఆకుదారి సాయివర్దన్, సతీష్ బెడిక ముగ్గురు విద్యార్ధులు ఉగాది పండుగ రోజున గోదావరిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీటిలో దిగి ఈత కొడుతుండగా ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు గల్లంతైన వారి గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: అలాంటి వారు వెంటనే అన్‌ఫాలో కండి: కేటీఆర్ -
అడవిని చేరిన అక్షరం
ఎస్ఎస్ తాడ్వాయి: ఆ యువకులిద్దరూ అడవిలోనే పుట్టారు. ఆ ప్రాంత పిల్లలకు చదువు ఎంత దూరమో, చదువుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలో వారికి తెలుసు. విద్యతోనే తమవారి జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుందని గట్టిగా నమ్మారు. గిరిజన గూడేల్లోనే పెరిగి ఇప్పుడు ఉన్నత చదువుల్లో ఉన్న ఆ ఇద్దరు.. తామే చదువును ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. గిరిజన గూడేలను దత్తత తీసుకుని సొంతంగా పాఠశాలలను నడిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ పిల్లలకు ఉచితంగా అక్షరాలు నేర్పిస్తున్నారు. వీరికి కొందరు దాతలు చేయూతనిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన ఇస్రం సంతోష్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదువుతున్నాడు. అదే యూనివర్సిటీలో జర్నలిజం పూర్తిచేసిన రేగొండ మండలం చల్లగరిగే గ్రామానికి చెందిన దూడపాక నరేష్‌లు కలిసి గొత్తికోయగూడేల్లోని పిల్లల్లో అక్షరజ్ఞానం పెంపొందించేందుకు ముందడుగు వేశారు. చదువుతో పాటు ఆట పాటలు అటవీ ప్రాంతంలోని నీలంతోగు, ముసులమ్మపేట, సారలమ్మ గుంపు, కాల్వపల్లి గొత్తికోయ గూడేల్లో ‘భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్’ పేరుతో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెంకటాపురం మండలం బడ్లపాడు గొత్తికోయగూడెంలో మరో పాఠశాల నడుపుతున్నారు. పిల్లలకు చదువు చెప్పేందుకు ప్రైవేటు టీచర్లతో పాటు వారి బాగోగులు చూసేందుకు ఆయాలను నియమించారు. ఒక్కో టీచర్‌కు నెలకు రూ.7 వేల వేతనంగా చెల్లిస్తుండగా, ఆయాలకు రూ.1,000 ఇస్తున్నారు. ఆరు పాఠశాలల్లో మొత్తం 170 మంది పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలకు చదువుతోపాటు ఆరోగ్య సూత్రాలను నేర్పిస్తున్నారు. పాఠశాలకు రాని ఆదివాసీ గొత్తికోయ పిల్లలను చదువు వైపు మళ్లించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు ఆటపాటలను కూడా నేర్పిస్తున్నారు. అండగా నిలుస్తున్న దాతలు ఆదివాసీ గూడేల్లో శుభ్రత ఉండదు. తరచూ రోగాలపాలవుతుంటారు. దీనికితోడు పోషకాహార లోపం. దీనిని దృష్టిలో పెట్టుకుని పిల్లల పరిశుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లలకు చేతులు ఎలా కడుక్కోవాలో కూడా నేర్పిస్తున్నారు. పోషకాహార లోపం ఉండకూడదని ప్రతిరోజూ కోడిగుడ్డు, గ్లాస్ పాలు అందిస్తున్నారు. రెండు రోజులకోసారి పల్లీ పట్టీలను స్నాక్‌గా ఇస్తున్నారు. ఇవన్నీ వీరు ఉచితంగానే చేస్తుండటం గమనార్హం. ఇస్రం సంతోష్, నరేష్‌లు గొత్తికోయగూడేల్లో పాఠశాలలను నడుతుపుతున్న విషయం తెలుసుకుని ఇద్దరు దాతలు ముందుకు వచ్చి చేయూతనిస్తున్నారు. ఎస్సీఈ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గోపాలకృష్ణ, అస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తరుణ్‌లు ప్రతినెలా సాయం అందజేస్తున్నారు. విద్యతోనే జీవితాల్లో మార్పు విద్యతోనే జీవితాలు మారతాయి. ఎక్కడో అడవిలో ఉండే గూడేల్లో చదువు ఇప్పటికీ అందని ద్రాక్షే. మాలా ఇబ్బందులు పడకూడదని, ఆదివాసీ గొత్తికోయ పిల్లలకు గూడేల్లో విద్య నేర్పించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాం. తొలుత ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని గొత్తికోయగూడేల్ని సందర్శించి అధ్యయనం చేశాం. మొదట్లో ఒకటి, రెండు పాఠశాలలను నడిపించాం. ప్రస్తుతం ఆరు గూడేల్లో నడుపుతున్నాం. మారుతున్న సమాజంలో పోటీ ఇవ్వాలంటే చదువుతోనే సా«ధ్యమతుంది. టీచర్ల బృందం సమన్వయంతో పాఠశాలలను నడిపిస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే మరిన్ని పాఠశాలలతో మరింత మంది గొత్తికోయ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం. – ఇస్రం సంతోష్ -
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రారంభం
-
ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం
మంగపేట/ములుగు రూరల్: కుటుంబీకులంతా కలిసి అన్నారం షరీఫ్ దర్గాకు దైవ దర్శనానికి వెళ్లారు. దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలోనే మృత్యువు డీసీఎం రూపంలో వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ములుగు జిల్లా ఇంచర్ల శివారు ఎర్రిగట్టమ్మ వద్ద హరితా హోటల్ సమీపంలో జరిగింది. మృతులందరూ గ్రామంలోని ఒకే కాలనీ ఎదురెదురు, పక్కింటివారు కావడంతో కాలనీలో విషాదం అలుముకుంది. ఆటో మాట్లాడుకొని.. అన్నారం షరీఫ్‌కు.. ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లిలోని కేసీఆర్ కాలనీకి చెందిన బొల్లెబోయిన రసూల్ తన కుటుంబంతో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గా వెళ్లడానికి అదే కాలనీకి చెందిన తునికి జానీ ఆటోను కిరాయికి మాట్లాడుకున్నాడు. రసూల్ దంపతులతో పాటు పిల్లలు అజయ్, వెన్నెల, అతని తల్లి వసంత, ఏటూ రు నాగారం మండలం రామన్నగూడేనికి చెందిన తన పిన్ని గాదం కౌసల్యతో పాటు ఎదురింటి చెలమల్ల కిరణ్, డ్రైవర్ జానీతో కలిపి 8 మంది ఆటోలో శుక్రవారం సాయంత్రం దర్గాకు వెళ్లారు. మొక్కులు తీర్చుకు ని రాత్రి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో ఇంచర్ల సమీపంలో ఆటోను పశువుల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఆటో డ్రైవర్ జానీ (23), కిరణ్ (15), కౌసల్య (60), అజయ్ (11) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రసూల్, అతని భార్య పద్మ, కుమార్తె వెన్నెల, తల్లి వసంతను పోలీసులు ఎంజీఎంకు తరలించారు. వైద్యం పొందుతూ వెన్నెల (09), వసంత (65) మృతిచెందగా తీవ్రంగా గాయపడిన రసూల్, పద్మ దంపతులు చికిత్స పొందుతున్నారు. ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీస్తున్న క్రమంలో తీవ్ర గాయాల బాధను తట్టుకోలేక వాళ్లు రోదించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిద్రలోనే మృత్యుఒడిలోకి బాగా రాత్రి కావడం.. అందరూ నిద్రలోకి జారుకుంటుండటంతో పద్మ మధ్య మధ్యలో డ్రైవర్‌తో మాట్లాడింది. ‘నిద్ర వస్తున్నట్లుంది. మార్గమధ్యలో ఎక్కడైనా ఆగి నిద్రపోదాం, ఉదయం తిరిగి వెళ్దాం’అని చెప్పినట్లు ప్రమాదం జరిగాక వసంత తనతో వీడియోలో మాట్లాడిన వారికి రోదిస్తూ చెప్పింది. సంఘటన జరిగిన తీరును బట్టి ఆటోలోని వారు నిద్రలోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. నుజ్జునుజ్జయిన ఆటో, రక్తం, చెల్లా చెదురుగా పడి ఉన్న దేవుడి ప్రసాదాలతో సంఘటనా స్థలం భీతావహంగా కనిపించింది. రసూల్ కుటుంబంలో తీరని విషాదం ఒకే కుటుంబలో నలుగురిని కోల్పోయిన రసూల్, పద్మ దంపతులకు సెంటు భూమీ లేదు. రసూల్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా భార్య పద్య రోజువారి కూలీ పనులకు వెళ్తూ కొడుకు అజయ్, కుమార్తె వెన్నెలను చదివించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఇంట్లో తల్లి వసంతతో కలిసి ఉంటున్నారు. స్నేహితుడితో వెళ్లి శవమై వచ్చావా బిడ్డా రసూల్ కుమారుడు అజయ్, వారి ఇంటి ఎదుటి ఇంట్లో ఉండే కిరణ్ చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. అజయ్ కుటుంబీకులతో అన్నారం వెలుతుండటంతో కిరణ్ కూడా వెళ్లాడు. కిరణ్ మృతదేహం శనివారం సాయం త్రం ఇంటికి చేరగా.. ‘స్నేహితుడితో దేవుడి దర్శనానికి వెళ్లి శవమై తిరిగొచ్చావా బిడ్డా’అంటూ కిరణ్ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. ఆటో డ్రైవర్ జానీ కూడా కొద్దినెలల క్రితమే ఆటో కొని నడుపుతున్నాడు. అంతకుముందు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయామని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
ములుగు జిల్లాలో గిరిజనుల ఆందోళన
-
మేడారం: అవ్వాబిడ్డలోయ్.. అడవిలోకి మళ్లెనోయ్
సాక్షి, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసింది. నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగిన మేడారం జాతర.. అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త పడిగిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను తరలించారు. కరోనా వైరస్ విజృంభన తర్వాత జరిగిన ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. మరోవైపు లక్షల మంది భక్తులు వన దేవతాలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. -
జగ్గారెడ్డి అలక టీ కప్పులో తుఫాన్: రేవంత్‌రెడ్డి
ములుగు జిల్లా: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారన్న విషయంపై తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను శనివారం దర్శించుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయం టీ కప్పులో తుఫాన్ లాంటిదని అన్నారు. భేదాభిప్రాయాలే తప్ప విభేదాలు కావుని స్పష్టం చేశారు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో బేధాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది భిన్నత్వంలో ఏకత్వమని, ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువని, అన్ని పరిస్థితులు సర్థుకుంటాయని పేర్కొన్నారు. పోలీసులపై మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ఆవేశంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. -
ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలి: రేవంత్‌రెడ్డి
సాక్షి, ములుగు జిల్లా: కాలాంతకులైన పాలకులు నుంచి విముక్తి కోసం మేడారం సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను శనివారం దర్శించుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేడారం జాతర కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, చంద్రబాబు,రోశయ్య మేడారం జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించారని తెలిపారు. వందల కోట్లు కేటాయించిన చరిత్ర కూడా ఉందని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ మేడారాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా, పుణ్యస్థలంగా మార్చుతామని హామి ఇచ్చారని, సమ్మక్క సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తామని చేయలేదని మండిపడ్డారు. మేడారంపై వివక్ష చూపుతూ.. ఆటవికమైన ఆలోచనతో కేసిఆర్ కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరాట స్ఫూర్తి ఇలానే ఉంటే తిరుగుబాటు వస్తుందని మేడారంకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది కుంభమేళా మేడారాన్ని ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసిఆర్ గుర్తించడం లేదని ధ్వజమెత్తారు. మచ్చింతల్లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రియల్టర్ నిర్మిస్తే, దానికి ఇచ్చిన విలువ కొట్లాది మంది ఆరాధించే సమ్మక్క సారలమ్మ పై పాలకులు ఇవ్వలేదని మండిపడ్డారు. ధనవంతులు, శ్రీమంతులకు ఇచ్చే విలువ మేడారానికి ఇవ్వడంలేదని అన్నారు.ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.ఆదివాసి గిరిజనుల ఓట్లే కావాలి తప్ప వారి అభివృద్ది పట్టదని ఫైర్ అయ్యారు. జాతీయ పండుగగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో దాని గురించి తాము మాట్లాడుతామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేడారానికి రూ.వెయ్యి కోట్లు కెటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేసిఆర్ చేసిన కొత్త జిల్లాలను సవరించి సమ్మక్క సారలమ్మ జిల్లా ఏర్పాటు చేస్తామని అన్నారు. 12 నెలలు ఓపిక పట్టండి సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ పండుగగా గుర్తింపు ఇస్తామని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో మేడారం జాతరకు తీసుకువస్తామని తెలిపారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోడం వల్లే రాలేదని కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు.ఇప్పటికైనా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
మేడారం వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం. నలుగురు మృత్యువాత
సాక్షి, ములుగు: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీటీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ములుగు శివారులోని గట్టమ్మ ఆలయం మూల మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. పలువురికి గాయాలవ్వగా ములుగు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా.. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. బస్సు ముందు భాగం కూడా కొంత దెబ్బతింది. ఆర్టీసీ బస్సు హన్మకొండ నుంచి మేడారం వస్తుండగా.. కారు హన్మకొండ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మేడారం వెళ్లే మార్గం కావడంతో ఘట్టమ్మ ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులువెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ములుగు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు శ్రీనివాస్, సుజాత, రమేష్, జ్యోతిగా గుర్తించిన పోలీసులు వారంతా ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామస్తులుగా తెలిపారు. కళ్యాణ్ అనే వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా మేడారం జాతర జరుగుతుండటంతో గత మూడు రోజుల నుంచి వరంగల్- మేడారం దారులు భక్తుల వాహనాలతో మరింత రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో చిన్నచిన్న ప్రమాదాలు చోటుచేసుకోగా ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. చదవండి: నల్లకుంటలో విద్యార్థి అదృశ్యం.. తండ్రి మందలించడంతో పాల ప్యాకెట్ కోసమని వెళ్లి.. -
మేడారం జాతరలో ఆసక్తికర సన్నివేశం.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను..
సాక్షి, వరంగల్: మేడారం మహా జాతరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నీ తానై వ్యవహరించారు. అధికారులను ఎక్కడికక్కడ సమన్వయపరుస్తూ.. సలహాలు ఇస్తూ జాతర సజావుగా సాగేందుకు తనదైన తీరును ప్రదర్శించారు. జాతరకు వచ్చే భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఎదురెళ్లి అమ్మవారి దర్శనం చేయించారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి, మంచెపై నుంచి జాతర తీరును పరిశీలిస్తూ.. మైకులో అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు. భక్తులు క్యూ పద్ధతి పాటించాలని, బంగారం, కొబ్బరి కాయలు విసిరేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కాగా.. సీఎం కేసీఆర్ రాక కోసం ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్‌తో కలిసి మంత్రి రెండు రోజులపాటు హెలిపాడ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించగా.. చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. చదవండి: వనదేవతలకు జన హారతి ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను.. జాతరకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ మీడియా పాయింట్ నుంచి ఎదురుపడిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి ఎరబ్రెల్లి ఎదురుపడగానే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రేణుక సింగ్‌కు ఎరబ్రెల్లిని పరిచయం చేస్తూ.. తెలంగాణలో గట్టి మంత్రి అంటూ.. చేతులతో గట్టి అనే అర్థం స్ఫురించేలా ఊపారు. అలాగే పంచాయతీ మంత్రి అంటూ కిషన్‌రెడ్డి చెప్పగానే.. మంత్రి ఎరబ్రెల్లి స్పందిస్తూ.. పంచాయితీలు పెట్టే మంత్రిని కాను, పరిష్కరించే మంత్రిని అని రేణుక సింగ్‌తో అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. చదవండి: మేడారానికి జాతీయ హోదా.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని కౌంటర్ -
Medaram Jatara: వన దేవతలకు ‘కోటి’ మొక్కులు
సాక్షి, వరంగల్: వరాలు ఇచ్చే తల్లులు.. వనదేవతలు.. మేడారం సమ్మక్క సారలమ్మ జనజాతర వైభవోపేతంగా జరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారులను కోటి మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండురోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. గద్దెలపై ప్రాంగణంలో జలప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. సీఎం రాకపోయినప్పటికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారులకు ఎత్తు బంగారం( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించారు. సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని వనదేవత లను వేడుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వీఐపీల తాకిడి, భక్తుల రద్దీతో పోలీసులు హడాహుడి చేశారు. భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. కేంద్ర మంత్రులు వచ్చిన సమయంలో పోలీసులు మీడియా వారిని నెట్టివేయడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
మేడారంలో భక్తజన సందడి
సాక్షి, ములుగు: ములుగు జిల్లా మేడారం జాతరకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వాహనాల ద్వారా చేరుకుని.. జంపన్న వాగులో స్నానాలు చేసి.. గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు కట్టారు. సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. వాహనాలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై రాకపోకలను పునరుద్ధరించారు. – ఎస్ఎస్ తాడ్వాయి -
యూకే నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
సాక్షి, మల్కాజిగిరి/ఏటూరునాగారం : ఉన్నత విద్య కోసం యూకే వెళ్లిన ఆ యువకుడు సెలవులకు ఇంటికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి(26) యూకేలో ఎంఎస్ చేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అక్కడ సెలవులు ఇవ్వడంతో సొంతవూరికి వచ్చాడు. వచ్చే నెలలో తిరిగి యూకేకు వెళ్లాల్సివుంది. మల్కాజిగిరిలో ఉంటున్న తన స్నేహితుడు రాహుల్‌ను కలవడానికి బుధవారం తన బైక్ మీద మల్కాజిగిరికి వస్తుండగా ఆర్.కె.నగర్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో హర్షవర్ధన్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన పై అతని సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన దురదృష్టకరం.. : ఎమ్మెల్యే మైనంపల్లి ఉన్నత చదువు చదువుకుంటున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలిచివేసిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గతంలో కూడా అదే ప్రాంతంలో జరిగిన ప్రమాదాల్లో మరి కొందరు మృతి చెందినట్లు తెలిసిందన్నారు. ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
ములుగు జిల్లాలో శిలాజాల గుర్తింపు
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రం పరిధిలో శిలాజాలు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఇటీవల గోదావరి నది తీరప్రాంతాల్లో పరిశోధనలు జరిపి ఈ శిలాజాలను గుర్తించారు. శనివారం వాటి వివరాలను వెల్లడించారు. ప్రాచీన కాలంలో భూమిలోపల పొరల్లో కూరుకుపోయిన జంతు కళేబరాలు జల ప్రవాహాల సమయంలో శిలాజాల రూపంలో బయట పడుతుంటాయని తెలిపారు. వీటిని స్ట్రోమాటోలైట్స్ అంటారన్నారు. స్థానికులు గెర్రా అని పిలిచే ఈ ప్రాంతం ప్రాచీనకాలంలో సరస్సుగా ఉండేదని తెలిపారు. వివిధ చారలతో కలిగి ఉన్న రాళ్లు ఆదిమమానవులు వాడిన పరికరాలుగా, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తులను బట్టి పురాతన సరస్సుగా చెప్పవచ్చన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపితే మరిన్నో విషయాలు వెలుగు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శిలాజాలు, వివిధ చారలతో ఉన్న శిలాజం -
పునర్నిర్మాణంతో పునరుజ్జీవం!
సాక్షి, హైదరాబాద్: దేవునిగుట్ట ఆలయం.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఆంగ్‌కోర్‌వాట్ (ఆంకోర్‌వాట్) కంటే ముందు ఆ తరహా నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న దేవాలయం. ఇసుక రాతి బిల్లలపై ముందుగానే దేవతామూర్తుల భాగాలను చెక్కి పూర్తిరూపం వచ్చేలా క్రమపద్ధతిలో పేర్చిన గొప్ప నిర్మాణం. ఈ తరహా నిర్మాణం దేశంలో ఇదొక్కటే అనే అభిప్రాయం ఉంది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం నిర్మితమైనట్లు భావిస్తున్న ఈ ఆలయం ఎప్పు డు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇంతకాలం తర్వాత దీని పునరుద్ధరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని పూర్తిగా విప్పదీసి తిరిగి నిర్మించబోతున్నారు. త్వరలో టెండర్లు పిలిచి ఏడాదిలో పునర్నిర్మాణాన్ని పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య చొరవతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో, తెలంగాణ వారసత్వ శాఖ పర్యవేక్షణలో పనులు జరగనున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 20 కి.మీ. దూరంలోని కొత్తూరు గ్రామ శివారులోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై ఈ ఆలయం ఉంది. ఆరో శతాబ్దంలో వాకాట రాజు హరిసేన హయాంలో మందిరాన్ని నిర్మించి ఉంటారని అంచనా. పద్మపాణిగా భావిస్తున్న శిల్పం ఏం చేస్తారు? దేవునిగుట్ట ఆలయం దాదాపు 24 అడుగుల ఎత్తుంది. దేవతామూర్తుల ఆకృతులను ఒకే రాయిపై కాకుండా, చిన్నచిన్న రాళ్లపై చెక్కి, వాటిని క్రమపద్ధతిలో పేర్చటం ద్వారా మూర్తు లకు పూర్తి రూపమిచ్చారు. ముందుగా ఈ రాళ్లపై నంబర్లు రాసి విప్పదీస్తారు. నిర్మాణాన్ని పూర్తిగా విప్పిన తర్వాత పునాదిని పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న ఆలోచన ప్రకారం.. డంగు సున్నంతో పునాదిని నిర్మిస్తారు. దానిమీద, నంబర్ల ప్రకారం రాళ్లను పేర్చి పాత రూపమిస్తారు. రాయిరాయికి మధ్య డంగుసున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి తదితర మిశ్రమంతో బైండింగ్ పొర ఏర్పాటు చేస్తారు. ఇలా పిరమిడ్ తరహాలో పైకి పేర్చుకుంటూ వెళ్తారు. పైభాగంలో ప్రస్తుతం పెద్ద రంధ్రం ఉంది. అం దులోంచి వాననీరు లోనికి చేరుతోంది. కొత్త నిర్మాణంలో ఇలాంటి లోపాలను సరిదిద్దుతా రు. రాళ్లు మళ్లీ కదిలిపోకుండా స్టెయిన్లెస్ స్టీల్ పట్టీలను బిగించే యోచనలో ఉన్నారు. రూ.2 కోట్లతోనే పనులు.. ములుగు జిల్లా కలెక్టర్ అందజేసిన రూ.1.8 కోట్ల నిధులకు కాస్త జోడించి రూ.2 కోట్లలోనే పనులు పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు. ఈ మేరకే టెండర్లు పిలువబోతున్నారు. కాకతీయ నిర్మాణాల పునరుద్ధరణ పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకే అవకాశం ఇవ్వనున్నారు. 6 నెలల నుంచి ఏడాదిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రేన్ లేకుండా.. ఈ ఆలయం గుట్టపైన ఉంది. రోడ్డు మార్గం లేకపోవడంతో క్రేన్‌ను పైభాగానికి తరలించే వీలు లేదు. క్రేన్ లేకుండా గొలుసులు ఏర్పాటు చేసి వాటితో రాళ్లను ఎత్తే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆలయానికి వినియోగించిన రాళ్లు కదిలాయే తప్ప, విరగలేదని గుర్తించారు. ఇటీవల డాక్యుమెంటేషన్ చేసే క్రమంలో త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించి లేజర్ చిత్రాలు తీసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడెక్కడ పగుళ్లున్నాయి.. బేస్మెట్ ఎలా ఉంది.. తదితర వివరాలు గుర్తించారు. ప్రత్యేకంగా కొత్తగా రాళ్లను చెక్కాల్సిన అవసరం లేదని గుర్తించారు. -
ములుగు జిల్లాలో కాల్పుల కలకలం..
-
ములుగు జిల్లాలో కాల్పుల కలకలం.. కానిస్టేబుల్ తూటాలకు ఎస్ఐ బలి
సాక్షి, ములుగు(ఏటూరునాగారం): మెస్ బిల్లుల లెక్కల్లో హెచ్చు తగ్గుల విషయంలో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, ఎస్సై మధ్య జరిగిన గొడవ కాల్పుల వరకు దారితీసింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) పోలీస్ స్టేషన్ ఆవరణలోని సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ క్యాంప్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాంప్‌లో ఉదయం 8.30 సమయంలో టిఫిన్ చేసే క్రమంలో ఎస్సై ఉమేశ్చం ద్ర, మెస్ ఇన్చార్జిగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్‌ను మెనూ (సమ్మరీ)లో వివరాలు, బిల్లు ల గురించి ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన స్టీఫెన్ ఏకే 47 గన్‌తో ఎస్సై ఉమేశ్‌చంద్రపై 4 రౌండ్ల కాల్పులు జరపగా.. ఛాతీ భాగంలో రెండు, పొట్ట భాగంలో రెండు బుల్లెట్లు దిగా యి. చదవండి: బాత్రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య దీంతో ఉమేశ్‌చంద్ర రక్తపు మడుగులో కుప్పకూలాడు. సహచరులు దగ్గరకు వచ్చేసరి కి స్టీఫెన్ కూడా అదే తుపాకీతో తన దవడ కిం ద కాల్చుకోగా.. అతని ఎడమ కణత నుంచి బుల్లెట్ బయటకు వెళ్లింది. దాదాపు 25 నిమిషాల్లోనే ఇదంతా జరిగిపోయింది. ఈ ఘటన తో షాక్‌కు గురైన సీఆర్పీఎఫ్ అధికారులు అప్రమత్తమై సివిల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిద్దరినీ హుటాహుటిన ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఎస్సై ఉమేశ్‌చంద్రను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్‌కు ప్రాథమిక చికిత్స అందించి మొదట వరంగల్‌కు, ఆపై విషమం గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మృతి చెందిన ఎస్సై ఉమేశ్చంద్రది బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా ఇన్వత్పూర్ గ్రామం కాగా, గాయపడిన హెడ్‌కానిస్టేబుల్ స్టీఫెన్‌ది తమిళనాడు రాష్ట్రం అని తెలిసింది. ఆస్పత్రిని సందర్శించిన ఎస్పీ సీఆర్పీఎఫ్ ఎస్సై ఉమేశ్‌చంద్ర మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ములుగు ఎస్పీ సం గ్రామ్సింగ్ పాటిల్ ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహంపై బుల్లెట్ గాయాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్, సీఐ కిరణ్‌కుమార్, వెంకటాపురం(కె) సీఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతి.. ఉమేశ్‌చంద్ర మృతదేహాన్ని వరంగల్‌కు తరలించారు. చదవండి: నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు.. -
ములుగులో మావోయిస్టుల ఘాతుకం.. మాజీ సర్పంచ్ హత్య
సాక్షి, వరంగల్: ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కిడ్నాప్‌కు గురైన మాజీ సర్పంచ్ కురుసం రమేష్‌ను చంపేశామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. రమేష్ స్వగ్రామం ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు పంచాయతీ పరిధిలోని కే కొండాపురం. 2014లో సర్పంచ్‌గా ఎన్నికైన రమేష్.. ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. రమేశ్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో ఖాళీ సమయంలో ఎవరికైనా డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లిన రమేష్ కిడ్నాప్‌కు గురయ్యాడు. చదవండి: ఒమిక్రాన్ దడ, థర్డ్‌వేవ్ హెచ్చరిక.. ‘బూస్టర్’ వైపు పరుగులు.. కాగా 2019లో రమేష్ పోలీస్ ఇన్ఫార్మర్గా మారి పాలపొడిలో విషం కలిపి ఇచ్చాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. విషం కలిపిన పాలపొడితో కామ్రేడ్ బిక్షపతి అలియాస్ విజేందర్ అమరుడయ్యాని పేర్కొన్నారు. అదే విధంగా రమేష్ ఒక ఎన్కౌంటర్ చేయించి రెండు లక్షలు తీసుకున్నాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. పార్టీకి, ప్రజలకు ద్రోహం తలపెట్టడంతోనే ప్రజాభిప్రాయం మేరకు రమేష్‌ను హత్య చేశామని తెలిపారు. పోలీసులు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇన్ఫార్మర్గా మారితే రమేష్‌కు పట్టిన గతే పడుతుందని మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత హెచ్చరించారు. చదవండి: క్రికెట్ టోర్నీలో చాన్స్ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను.. -
పులి చర్మం అమ్మేందుకు వచ్చి..
ములుగు: ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలో అమ్మేందుకు తీసుకొస్తున్న పులి చర్మాన్ని ములుగు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్ నుంచి కొందరు వ్యక్తులు పులి చర్మంతో రాష్ట్రానికి వస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అటవీ సిబ్బందితో కలసి జగన్నాథపురం వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న సంచిని విప్పి చూడగా అందులో పులి చర్మం కనిపించింది. దీంతో వారు దూలాపురం ఎఫ్ఆర్వోకు సమాచారం అందించగా..పరిశీలించిన ఆయన దాన్ని పులి చర్మంగా నిర్ధారించారు. వెంకటాపురం(కె) మండలం కొండాపురం గ్రామానికి చెందిన పూనెం విగ్నేష్, సోది చంటి, సోయం రమేశ్, ఏటూర్‌నాగారం మండలం గోగుపల్లికి చెందిన చీరా శ్రీను, టేకులపల్లికి చెందిన చింతల బాలకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. పులి చర్మం, 3 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
పూజలు చేసి..ప్రతి శిల్పమూ చూసి..
వెంకటాపురం(ఎం): రామప్ప కళాసంపదకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఫిదా అయ్యారు. ఆలయంలో శిల్పాల సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని శనివారం సాయంత్రం ఆయన కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో భారత ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి జస్టిస్ రమణ దంపతులతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టూరిజం గైడ్ విజయ్‌కుమార్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావులు ఆలయ చరిత్ర, శిల్పాకళా విశిష్టతను వివరించారు. గర్భగుడి ముందు ఉన్న సప్తస్వరాలు పలికే పొన్నచెట్టు శిల్పాన్ని సుప్రీం చీఫ్ జస్టిస్ స్వయంగా మీటారు. ఒకే శిల్పంలో వివిధ చోట్ల వేర్వేరు శబ్దాలు వస్తాయని గైడ్ వివరించారు. రామప్ప ఆలయాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారని, అదే తరహాలో ప్రస్తుతం అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తున్నారని ప్రొఫెసర్ పాండురంగారావు వెల్లడించారు. ఆలయంలో గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన పర్యటనలో ప్రతి శిల్పం గురించి జస్టిస్ ఎన్వీ రమణ అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 6.30 గంటల తరువాత ఆయన హనుమకొండకు బయలుదేరారు. ఆయన వెంట ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన జడ్జి నరసింగరావు, అదనపు జడ్జి అనిల్‌కుమార్, ములుగు సివిల్ జడ్జి రాంచందర్‌రావు, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ మహేశ్‌నాథ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు ఉన్నారు. రాత్రి వరంగల్‌లోని నిట్‌లో సీజేఐ రమణ బస చేశారు. ఆదివారం ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన భవన సముదాయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న..
సాక్షి,వెంకటాపురం(వరంగల్): పసిప్రాయంలోనే తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న.. ఇలా అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన వారంతా ఒక్కొక్కరిగా దూరమవుతుంటే ఆమె ఏడ్చిన తీరు వర్ణణాతీతం. పాలుతాగే వయస్సులో అనారోగ్యంతో తల్లి.. బడికి వెళ్లే వయస్సులో తండ్రి ఆత్మహత్య.. అండగా ఉంటాడనుకున్న అన్న రోడ్డు ప్రమాదంలో అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల వద్దకు చేరింది మండల కేంద్రానికి చెందిన మెట్టు కావేరి.. మెట్టు కవిత–సాంబయ్య దంపతులకు 2003లో కుమారుడు రాజ్‌కుమార్, 2005లో కావేరి జన్మించింది. కావేరికి 8నెలల వయస్సు ఉన్నపుడే తల్లి కవిత అనారోగ్యంతో మృతిచెందింది. బడికి వెళ్లే వయస్సులో 2013లో తండ్రి సాంబయ్య ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో రాజ్‌కుమార్, కావేరిలు అమ్మమ్మ, తాతయ్య అయిన మంద సమ్మక్క, రాంచెంద్రుల వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో రాజ్‌కుమార్ పదో తరగతి తర్వాత చదువు మానేసి, ఏడాది కాలంగా ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ( చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. ) కావేరి ప్రభుత్వ జూనియార్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఈక్రమంలో ఈనెల 24న దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లిలో శుభకార్యాక్రమానికి హాజరయ్యేందుకు రాజ్‌కుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తుంగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన కావేరి అండగా ఉంటాడనుకున్న అన్న అకాలమరణంతో అనాథగా మారింది. సోదరుడి అంత్యక్రియలు తానే స్వయంగా నిర్వహించిన దృశ్యం చూసి కంటతడి పెట్టనివారుండరు. అయితే వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలతో ఉన్న కావేరిని ఆదుకునేందుకు దాతలు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. (చదవండి: వీడు మామూలోడు కాదు.. నాలుగు పెళ్లిళ్లు.. జల్సాలు.. చివరికి ) వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు మండల కేంద్రంలో అందరికీ సుపరిచితుడిగా ఉంటూ.. ఎవరు ఏ పనిచెప్పినా ఓపికతో చేస్తూ అందరితో కలివిడిగా ఉంటే రాజ్‌కుమార్ చెల్లెలికి ఆర్థికంగా చేయూతనందించేందుకు మండల కేంద్రంలోని కొంతమంది యువకులు ‘రాజ్‌కుమార్ సహాయనిధి’ అనే వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. తద్వారా వచ్చిన విరాళాలు కావేరి ఉన్నత చదువులకు, మరికొంత కావేరి భవిష్యత్ అవసరాలకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. సహాయనిధి గ్రూపు ద్వారా ఇప్పటివరకు రూ.60వేలు జమ అయినట్లు పేర్కొన్నారు. కావేరికి సహకారం అందించాలనుకున్న దాతలు 96400 66420, 97044 33991, 98484 39390 నెంబర్లకు ఫోన్ పే లేదా గూగూల్ పే చేయాలని తెలిపారు. చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. -
15 కిలోమీటర్ల నడక.. కొండలు, గుట్టలెక్కి.. అనుకున్నది సాధించారు
సాక్షి,ములుగు(వాజేడు): వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గుట్టలెక్కి వెళ్లి గిరిజనులకు శనివారం కరోనా టీకాలను వేశారు. మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని పెనుగోలు కుగ్రామం గుట్టలపై ఉంది. ఏటూరునాగారం ఐటీడిఏ అడిషనల్ డీఎం హెచ్ఓ మంకిడి వెంకటేశ్వర్లు, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది చిన్న వెంకటేశ్వర్లు, అరుణ కుమారి పెనుగోలు గిరిజనుల సహకారంతో కిట్లను మోసుకుంటూ 15 కిలో మీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్లారు. దారిలో కలిసిన ఒక్కరిద్దరికి టీకాలను సైతం వేసి గ్రామానికి చేరుకుని టీకాలను వేశారు. అనంతరం అందరి నుంచి రక్త నమూనాలను సేకరించారు. చదవండి: హాస్టల్లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని.. -
డబ్బులు జేబులో పెట్టుకొని సామాను సర్దుకోమన్నారు.. కిందకు వంగడంతో..
లింగాలఘణపురం (ములుగు): లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన కిరాణ వ్యాపారిని తనిఖీ చేస్తున్నట్లు చేసి రూ.2 లక్షలు మాయం చేసి ఉడాయించారు. ఈ ఘటన వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై జెర్సీ పాలకేంద్రం సమీపంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. ఘటనకు సంబంధించి బాధితుడు కొడితాల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. జెర్సీ పాలకేంద్రం సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో శేఖర్ బంధువు ప్లాటు కొనుగోలు చేయగా అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలతో పాటు కిరాణం సామాను కోసం మరో రూ.7వేలు తీసుకుని ఎక్సెల్ వాహనంపై జనగామకు బయలు దేరాడు. (చదవండి: వైరల్: యమ ‘స్పీడ్’గా వెళ్తున్న కామారెడ్డి కలెక్టర్ వాహనం.. ఏకంగా రూ.27,580 చలాన్లు!) నెల్లుట్ల బైపాస్ నుంచి సదరు వెంచర్ వద్దకు వెళ్లేందుకు యశ్వంతాపూర్ సమీపంలో ఉన్న బస్టాప్ వద్ద ఆగి బంధువుకు ఫోన్ చేశాడు. అతను కూడా వస్తున్నానని చెప్పడంతో వెంచర్ వద్దకు వెళ్తున్నాడు. అప్పటికే బస్టాప్ వద్ద బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని ముందుకు వెళ్లి అడ్డంగా బైక్ ఆపారు. వెంటనే ఒకరు దిగి ఫోన్ తీసుకుని, ఎక్సెల్ తాళం చెవి తీసుకున్నాడు. పెట్రోల్ పంపులో ఎవరిని కలిశావు.. ఏదో ఇచ్చావంటూ బుకాయించారు. నేను బంక్‌లోకి వెళ్లలేదని, ఎవరిని కలువలేదని చెబుతుండగానే సంచిలో ఏం ఉన్నాయి బయటకు తీయాలని ఆదేశించారు. సంచి తీయగానే జేబులో ఏం ఉన్నాయని గద్దించారు. డబ్బులు ఉన్నాయని చెప్పి చూపించగా డబ్బులు జేబులో పెట్టుకొని సంచిలో సామాను సర్దుకోమని చెప్పారు. వంగి సామాను సర్దుకుంటుండగానే జేబులోని డబ్బులు మాయం చేసి ఎక్సెల్ తాళం చెవితో బైక్‌పై పరారయ్యారు. సంచి సర్దుకుని జేబులో డబ్బులు చూసుకోగానే లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్పటికే తన బంధువు అక్కడికి రావడంతో ఇద్దరూ కలిసి సదరు వ్యక్తులను వెంబడించే ప్రయత్నం చేశారు. నిడిగొండ వరకు వెళ్లి రఘునాథపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిధి తమకు లేదని, జనగామకు వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ బాలాజీవరప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. (చదవండి: కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి) -
2 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్‌ప్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న హెల్త్ ప్రొఫైల్ వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందుకోసం అవసరమైన నిర్ధారణ పరీక్షల పరికరాలను, ఇతర వస్తువులను కొనడానికి తొలి దశలో రూ. 9.15 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గడువు నాటికి అవసరమైన పరికరాల కొనుగోలుపై అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా వైద్య ఆరోగ్యశాఖ రూపొందిస్తున్నది. పల్లెల్లో ప్రతీ ఇంటికీ తిరుగుతూ 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. జ్వరం, రక్తపోటు, షుగర్ తదితర పరీక్షలన్నింటినీ ఇంటి వద్ద, ఈసీజీ వంటి పరీక్షలను ప్రాథమిక కేంద్రాల వద్ద నిర్వహిస్తారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక యూనిక్ ఐడీని అందజేస్తారు. ఈ ఐడీ ప్రాతిపదికన ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చుతారు. యూనిక్ ఐడీ అందుబాటులో ఉండడం వల్ల వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందడానికి అవకాశం ఉంటుందని వైద్య వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఎవరికైనా, ఏదైనా జబ్బు చేస్తే వారి ఆరోగ్య చరిత్రను ఆన్లైన్లో డాక్టర్లు చూడడానికి వీలుపడుతుంది. -
ఉచ్చులు అమర్చిన వారిపై కఠిన చర్యలు
ములుగు: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఉచ్చులు అమర్చే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ హెచ్చరించారు. జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో అమర్చిన ఉచ్చుకు పులి బలి అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్‌తో కలసి మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఆగస్టు 1న పులి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చినట్లు పాదముద్రల ద్వారా గుర్తించామన్నారు. ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాల ద్వారా పులి కదలికలను పరిశీలించామని తెలిపారు. ఎస్ఎస్ తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కుకొని పులి మృతి చెందిందనే సమాచారం మేరకు అప్రమత్తం అయ్యామన్నారు. వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి మృతిచెందిన పులి గోర్లను, చర్మాన్ని అమ్మడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్లు తెలియడంతో ఆదివారం కాటాపురం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టామని చెప్పారు. ఒక వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి వద్ద పులి గోర్లు, చర్మం లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలగుంపునకు చెందిన మడవి నరేశ్, మడవి ఇరుమయ్య, మడకం ముఖేశ్, మడవి దేవ, మడవి గంగయ్య ఉన్నారని వివరించారు. కూలీ డబ్బులు చాలకపోవడంతో అటవీ జంతువులను వేటాడే దురాలోచనకు పూనుకొని ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. పులి తిరుగుతుందనే సమాచారంతో ఉచ్చులు ఏర్పాటు చేయగా.. గత నెల 21న ఉచ్చులో పడి పులి మృతి చెందిందని శోభ చెప్పారు. పులి శరీర భాగాలను స్థానికులు మడకం రామ, మడకం ఉందయ్య, కోవాసి ఇడుము అడవిలో దాచిపెట్టారని.. విచారణలో ప్రశ్నించగా వాటిని చూపించారని తెలిపారు. స్థానిక వెటర్నరీ వైద్యుడు, ఎఫ్డీఓ వీటిని నిర్ధారించారని పేర్కొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న పీసీసీఎఫ్ శోభ పులుల సంరక్షణ అందరి బాధ్యత... అంతరించిపోయే స్థితిలో ఉన్న పులుల సంరక్షణ బాధ్యత సమాజంలోని అందరిపై ఉందని సీసీఎఫ్ శోభ చెప్పారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ జీ పాటిల్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, వరంగల్ సర్కిల్ సీసీఎఫ్ ఆశ, డీఎఫ్ఓ శివఆశీష్, ఎస్ఎస్ తాడ్వాయి ఎఫ్డీఓ ప్రశాంత్ పాటిల్, ములుగు ఎఫ్డీఓ జోగేంద్ర, పస్రా ఇన్స్పెక్టర్ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్రావు, వెటర్నరీ డాక్టర్ కరుణాకర్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి!
ములుగు: కొడిశాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాట్లు చేసిన ఉచ్చుకు పులి బలైంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలకు చెందిన ఐదుగురు వేటగాళ్లు అటవీప్రాంతంలో ఉచ్చులను ఏర్పాటు చేశారు. రెండువారాల క్రితం ఏర్పాటు చేసిన ఉచ్చుకు చిక్కుకొని గేదె మృతి చెందింది. అయినా అటవీ అధికారులు స్పందించలేదు. అదే ఉచ్చుకు తాజాగా పులి బలి అయినట్లుగా సమాచారం. రెండురోజుల క్రితం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులకు పులి కళేబరం కనిపించింది. దీంతో కూపీ లాగిన పోలీసులు వేటగాళ్లను గుర్తించడంతోపాటు వారి నుంచి పులిచర్మం, ఎనిమిది గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో సంచరించిన పులి ఇదేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు ఉచ్చులు వేసిన వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించినా అటవీ, పోలీస్ అధికారులు స్పందించలేదు. -
కోవిడ్ నిబంధనలు పాటించకుండా పాఠశాల ఆవరణలో గ్రామసభ
-
పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు
ములుగు రూరల్/లోకేశ్వరం(ముధోల్)/కురవి/అమరచింత: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ములుగు, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పాఠశాలలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం నలుగురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాఠశాలలో మంగళవారం వైద్యసిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా మరో ఉపాధ్యాయురాలికి, ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం 63 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం జెడ్పీ హైస్కూల్లో ఓ ఉపాధ్యాయుడు సోమవారం కరోనా బారిన పడ్డారు. దీంతో స్కూల్లో ఇతర ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు మంగళవారం పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ కేసులు నమోదైన పాఠశాలల్లో పంచాయతీ సిబ్బంది శానిటైజేషన్ పనులు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిందని వదంతులు వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 190 మంది విద్యార్థులకు కరోనా ర్యాపిడ్ టెస్టులు చేశారు. అయితే వారిలో ఆరుగురికి పాజిటివ్‌గా వచ్చిందని, విషయాన్ని విద్యాశాఖ, ఆరోగ్యశాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే వదంతులను సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేశారు. అవి వైరల్ కావడంతో మిగతా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. కలెక్టర్ షేక్ యాస్మిన్‌భాష ఆదేశాలతో డీఈఓ రవీందర్ మంగళవారం పాఠశాలకు చేరుకుని ఆ విద్యార్థులకు మరోసారి ర్యాపిడ్ టెస్టులతో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించారు. వారికి నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఏటూరునాగారంలో ముగ్గురు టీచర్లకు కరోనా
ఏటూరునాగారం/కోస్గి: ములుగు జిల్లా ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే అధికారులు వారికి సెలవు ప్రకటించారు. బుధవారంనుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏటూరునాగారంలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో గురువారం రాత్రి ఇద్దరు పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. మరో ఉపాధ్యాయుడికి శుక్రవారం పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్చార్జి ఎంఈఓ సురేందర్ వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో ఆ ముగ్గురు ఉపాధ్యాయులకు సెలవు ఇచ్చి, తరగతి గదులను శానిటైజ్ చేయించారు. మీర్జాపూర్లో ఇద్దరు విద్యార్థినులకు కరోనా నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని మీర్జాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కరోనా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలో ఒకరు పదోతరగతి చదువుతుండగా..మరొకరు అదే పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటోంది. బాధిత విద్యార్థినుల నాయనమ్మ కొద్దిరోజులుగా అనారోగ్యం బారిన పడటంతో ఆమెకు రెండు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో శుక్రవారం కుటుంబసభ్యులందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా ఇద్దరు అక్కచెల్లెళ్లకు కరోనా వచ్చినట్లు తేలింది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతప్ప పైఅధికారులకు సమాచారం అందించగా..పాఠశాలకు తాత్కాలిక సెలవు ప్రకటించి శానిటైజ్ చేయించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
1922లో రామప్ప ఆలయం.. వైరలవుతున్న ఫోటో
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి సంబంధించిన పురాతన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 1922లో తీసిన రామప్ప ఆలయం ఫొటోను మండలంలోని నల్లగుంటకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి డిలీట్ చేశాడు. ఆలయానికి సంబంధించిన వివరాలను కనుక్కునేందుకు ప్రయత్నించగా తాను పురావస్తుశాఖలో పనిచేస్తున్నానని, 1922లో రామప్ప ఆలయాన్ని తీసిన ఫోటో అని మాత్రమే పేర్కొన్నారు. మిగిలిన వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు. ఇటీవల ఎనిమిదొందల ఏళ్ళ నాటి కాకతీయుల శిల్పకళావైభవ ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయం ‘ప్రపంచ వారసత్వ కట్టడం’గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో చారిత్రక కట్టడాలకు పేరున్న తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ స్థాయిలో ఈ రకమైన గుర్తింపు సాధించిన తొలి నిర్మాణంగా రామప్ప చరిత్ర సృష్టించింది. -
తల్లి మరణం తట్టుకోలేక.. కూతురు ఆత్మహత్య
సాక్షి, చిట్యాల: నెల రోజుల క్రితం తల్లి కరోనాతో మృతి చెందగా, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితలలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టెం వరలక్ష్మి కరోనాతో నెల రోజుల క్రితం మృతి చెందింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు పట్టెం భవాని(17)శనివారం పురుగుల మందు తాగింది. గమనించిన తండ్రి వీరస్వామి మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. -
ములుగు జిల్లా అటవీప్రాంతంలో డైనోసార్ల చరిత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపురాతన వృక్ష శిలాజాలతో కూడిన ప్రాంతం వెలుగుచూసింది. కోట్ల సంవత్సరాల క్రితం అలరారిన వృక్షాలు కాలక్రమంలో శిలాజాలుగా మారి భూమి పైపొరల్లో రాళ్లలా నిక్షిప్తమైపోయాయి. గతంలో ఇలాంటి శిలాజాలు కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూసినా.. ఇప్పుడు కొత్తగా బయటపడ్డ ప్రాంతంలో దాదాపు 40 అడుగుల పొడవు వరకు ఉన్న వృక్ష శిలాజాలు కనిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. ములుగు జిల్లా కన్నాయెగూడెం మండలంలోని భూపతిపూర్‌కు నాలుగు కి.మీ. దూరంలోని దట్టమైన అటవీప్రాంతంలో ఇవి ఉన్నాయి. దాదాపు ఐదు కి.మీ. పరిధిలో ఈ శిలాజాలు కనిపిస్తుండటంతో, దేశంలో మరో విశాలమైన శిలాజవనం (ఫాజిల్ పార్కు) ఏర్పాటుకు అనువైన ప్రాంతం వెలుగుచూసినట్టయింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహ్మద్ నజీర్, మహేశ్ తదితరులు స్థానిక కేసం రవితో కలిసి పరిశీలించి వీటిని గుర్తించారు. అలనాటి భారీ వృక్షాలే.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాక్షసబల్లులు (డైనోసార్లు) తిరిగిన జాడలున్నాయి. పూర్వపు ఆదిలాబాద్ బెజ్జూరు మండలం కొండపల్లి ప్రాంతం, ఖమ్మం జిల్లాలోని కిష్టారం ఓపెన్ కాస్ట్ ఏరియా దగ్గరి చెరుకుపల్లి అటవీ ప్రాంతం, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం, మంచిర్యాల సమీపంలోని భీమారం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీప్రాంతం, పాల్వంచ నల్లముడి గ్రామ సమీపంలో వృక్ష శిలాజాలు గతంలో కనిపించాయి. తాజాగా వెలుగుచూసిన ప్రాంతం వాటికంటే విశాలమైంది కావటంతోపాటు పొడవాటి వృక్షాల శిలాజాలు పెద్దగా చెదిరిపోకుండా కనిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో డైనోసార్ల శిలాజాలు కూడా కనిపించాయి. ఇక్కడి డైనోసార్ శిలాజాలు బిర్లా సైన్స్ మ్యూజియం, కోల్‌కతా మ్యూజియంలలో ఉన్నాయి. కొన్ని స్మగ్లర్ల బారిన పడ్డాయి. ఇప్పుడు వెలుగుచూసిన వృక్ష శిలాజాలు కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధిస్తే ఇక్కడ కూడా డైనోసార్ల శిలాజాలు వెలుగుచూసే అవకాశం ఉందని చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇప్పుడు శిలాజాలుగా మారిన వృక్షాలు కోనిఫర్ రకానికి చెందినవై ఉంటాయని ఆయన చెప్పారు. అవి రాక్షసబల్లుల్లో కొన్ని రకాలు ఇష్టంగా తినేవే. ఆ వృక్ష శిలాజాలున్నాయంటే, వాటి చెంత రాక్షసబల్లి శిలాజాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి వృక్ష శిలాజాలు విరివిగా ఉన్న ప్రాంతాలు ఏడెనిమిది మాత్రమే ఉన్నాయి. అందులో మహారాష్ట్రలోని సిరోంచా దగ్గర ఉన్న వడధామ్ ఫాజిల్ పార్కు ముఖ్యమైంది. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించి భూపతిపూర్ ప్రాంతాన్ని కూడా ఫాజిల్ పార్కుగా మా ఇక్కడి భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న శిలాజాలు ఎంతో ఉన్నతమైన చరిత్రను వెలుగులోకి తేవటానికి దోహదపడుతుంది. లేదంటే స్మగ్లర్లు ఈ శిలాజాలను తస్కరించే ప్రమాదం ఉంది. ఇది రాతిపొరల సమూహం.. కానీ కోట్ల సంవత్సరాల క్రితం ఓ వృక్షం. నిటారుగా ఉండాల్సిన చెట్టు కూలిపడిపోయి రసాయన చర్యతో ఇదిగో ఇలా రాతిపొరలా మారింది. అంటే ఇది ఓ వృక్ష శిలాజం (ఫాజిల్) అన్నమాట. దీని పొడవు 25 అడుగులపైమాటే. -
డ్యూటీ డాక్టర్ నిర్వాకం.. ఫోన్ చేయడానికి మీరెవ్వర్రా?
సాక్షి, ములుగు: వైద్యో నారాయణో హరి అంటారు. ఎలాంటి ఆపద వచ్చినా, తీవ్ర అనారోగ్యానికి గురైనా.. ప్రేమతో చూడాల్సిన వైద్యుడు చిన్నారి కుటుంబ సభ్యులను తీవ్ర దుర్భాషలాడిన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన మాట్ల రవిరాజ్ కుమార్తె ఆక్సకు రాత్రి ఏదో పురుగుకుట్టినట్లుగా అనిపించింది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో కుటుంబ సభ్యులు వెతకగా పాము కనిపించింది. దీంతో తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పట్టాభి పరిశీలించి చిన్నారిని ఎంజీఎంకు తరలించాలని సూచించారు. లేదు ఇప్పటికే ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఇక్కడే వైద్యం అందించాలని కోరారు. అయినా డ్యూటీ డాక్టర్ వినకపోవడంతో సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆగ్రహానికి గురయిన డ్యూటీ డాక్టర్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేయడానికి మీరెవ్వర్రా అంటూ తీవ్రంగా దర్భాషలాడారు. ఈ ఆసుపత్రికి నేనే సూపరింటెండెంట్, నేను చెప్పిందే మీరు వినాలి, నేను మీ మాట వినాలా అంటూ కుటుంబసభ్యులపై దూసుకొచ్చే ప్రయత్నం చేయగా, పలువురు తీసిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. చివరికి చిన్నారి తండ్రి రవిరాజ్ దండం పెడుతున్న వీడియోలు చూసిన వారు ఏరియా ఆస్పత్రి వర్గాలపై తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా, చివరకు కుటుంబ సభ్యులు చిన్నారి ఆక్సను ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతుంది. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్‌ను వివరణ కోరగా సంబంధిత వీడియోలను చూశానని, ఇలాంటి సంఘటనలు ఇకముందు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. చదవండి: కరోనా టెస్ట్ చేయలేదని వ్యక్తి హల్చల్! -
జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్ జీ
వెంకటాపురం(కె): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో పోలీసులు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రతిరోజూ ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్న వారిపై రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి ఫొటోలను తీసుకొని ఆన్లైన్లో కూడా జరిమానా రశీదును అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండల కేంద్రంలో అధికారులు బుధవారం తనిఖీ చేస్తుండగా, మాస్క్ లేకుండా బయటకు ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. పోలీసులు తనీఖీలు చేస్తున్నారని గమనించి జరిమానా తప్పించుకునేందుకు దుకాణంలోని ప్లాస్టిక్ కవర్ తీసుకుని మాస్క్‌లా కట్టుకున్నాడు. ( చదవండి: వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి? ) -
వెన్నుపోటుకు గురైన సమ్మక్క సారలమ్మ
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇటీవల ప్రవీణ్‌కుమార్‌ను ఉరి తీస్తామని ఒకరు, ఖతం చేయాలని మరొకరు అంటున్నారని, అయితే, సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, గట్టమ్మ తల్లి తన వెంట ఉన్నందున ఎవరూ ఏమీ చేయలేరని స్వేరోస్ ఫౌండర్, గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం రాత్రి నిర్వహించిన స్వేరోస్ జ్ఞాన గర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమ్మక్క సారలమ్మల చరిత్రను భావితరాలకు తెలియకుండా చేయడంతో పాటు, చరిత్రలో లేకుండా వారికి వెన్నుపోటు పొడిచారని, వారి అంశగా ఉన్న ములుగు ప్రాంతబిడ్డలు గొప్పగా చదువుకుంటుంటే మళ్లీ వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రవీణ్‌కుమార్ మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. వనదేవతలకు ఎత్తు బంగారం సమర్పించి, గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. ( చదవండి: వెలుగులు నింపే ‘చెత్త’.. ఛీ అని తీసిపారేయకండి.. ) -
అడవికి వెళ్లిన యువజంట.. యువతి కిడ్నాప్; ఆపై అత్యాచారం
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి: పర్యాటక ప్రాంతం చూసేందుకు ఓ జంట బైక్‌పై వెళ్లింది. దీనిని గమనించిన ఇద్దరు వ్యక్తులు యువకుడిని బెదిరించి ఫోన్ లాక్కోవడమే కాకుండా యువతిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతికి తీవ్ర రక్తస్రావం అవడంతో తిరిగి ఇంటి వద్ద దిగబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి యువతి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీ సులు శనివారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ములుగు జిల్లా ఎస్ఎస్.తాడ్వాయి మండలంలోని పర్యాటక స్థలమైన బ్లాక్‌బెర్రీ ఐలాండ్ అటవీ ప్రాంతానికి గతనెల 30న ఓ జంట బైక్‌పై వచ్చారు. వీరిని గమనించిన బొట్టాయిగూడెంకు చెందిన కోల సాత్విక్ అలియాస్ సైదులు, జనగామ ఆనందరావు అటకాయించి యువకుడిని కొట్టి సెల్‌ఫోన్ లాక్కున్నారు. ద్విచక్రవాహనం టైర్లలో గాలి కూడా తీసేశారు. యువతిని బలవంతంగా బైక్‌పై మణుగురు తీసుకెళ్లారు. అక్కడ నిందితుడు సాత్విక్ యువతిని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. దీనికి ఆనందరావు సహకరించాడు. అయితే, యువతికి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆనందరావు బైక్‌పై ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లి వదిలేశాడు. అత్యాచారం వీడియో తీశామని, విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని బెదిరించడంతో ఆమె భయప డింది. చివరకు ఆమె స్నేహితుడు ఫిర్యాదు చేయ డంతో సీఐ శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై వెంక టేశ్వరరావు రంగంలోకి దిగి, నిందితులని కాటా పూర్ క్రాస్ వద్ద శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
సరుకులు మోసుకెళ్లి, ధైర్యం చెప్పి.. సలాం సీతక్క!
సాక్షి, గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్ సమీపంలోని గొత్తికోయగూడెంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వారు కట్టుబట్టలతో మిగిలిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం అక్కడకు వెళ్లారు. రహదారి లేకపోవడంతో తలపై నిత్యావసర సరుకులు మోసుకుంటూ తీసుకెళ్లారు. బాధితులకు బియ్యం, దుప్పట్లు, వంట పాత్రలు అందజేసి భరోసా ఇచ్చారు. -
ములుగు జిల్లాలో మరో అంతుచిక్కని వ్యాధి
సాక్షి, ములుగు: అంతుచిక్కని ఆరోగ్య సమస్యతో జనాలు మరణిస్తున్న సంఘటన ములుగు జిల్లాలో కలకలం రేపుతోంది. అసలేంటో తెలియని ఈ రోగం ఇప్పటికే ఒకే కాలనీకి చెందిన ఆరుగురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం విస్మయపరుస్తోంది. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో 70 కుటుంబాలు ఉండగా, 20 రోజుల వ్యవధిలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ముందు రోజు జ్వరానికి గురైన వీరంతా కేవలం రెండ్రోజుల్లోనే కడుపు ఉబ్బి చనిపోయారు. ఇప్పటి వరకూ వీరి మరణాలకు కారణాలేంటో తెలియరావట్లేదు. కాలనీకి చెందిన వారు ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతుండటంతో మిగతా కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే, కలుషిత నీరే కారణమై ఉండొచ్చని డీఎంహెచ్ఓ అప్పయ్య అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, 72 మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
ములుగులో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోలు హతం
సాక్షి, ములుగు : జిల్లాలోని మంగపేట మండలంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది.రామచంద్రునిపేట అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను ఇటీవల టీఆర్ఎస్ నేత భీమేశ్వరావును హతమార్చిన మావోయిస్టులుగా గుర్తించారు. కాగా, ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘూతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును ప్రేస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు గస్తీ పెంచారు. ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. (చదవండి : ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ఎస్ నేత హత్య) -
ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
-
టీఆర్ఎస్ నేతను హతమార్చిన మావోలు
సాక్షి, ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండంలోని అలుబాక గ్రామంలో శనివారం అర్ధరాత్రి టీఆర్ఎస్ నేత భీమేశ్వర్‌రావును మావోయిస్టులు హతమార్చారు. అర్థరాత్రి ఇంట్లో నుంచి ఆయన్ని బయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. ఈ హత్యలో ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు కూబింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి ఉనికి తెలిపేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులు వదిలివెళ్లిన లేఖ, దాడికి ఉపయోగించిన కత్తి -
పెళ్లికి అనుకోని అతిథి, ఒక్కసారిగా షాక్!
-
పెళ్లికి అనుకోని అతిథి, అంతా షాక్!
సాక్షి, ములుగు: కరోనా మహమ్మారి తోటి మనుషుల మద్య ‘దూరం’ పెంచింది. మొహానికి మాస్కు అంటించింది. వైరస్ భయాలు, ప్రభుత్వ నిబంధనలతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. ఎంతటి వారి పెళ్లిళ్లలోనైనా అతిథులే కరువయ్యారు. ఈ సమయంలో తానే విషిష్ట అతిథై ఓ వానరం (కోతి) ఈ నూతన జంటకు ఆశీస్సులు అందించింది. తలంబ్రాల సందర్భంలో తాను చెయ్యి కలిపి మనసార ఆశీర్వదించింది. ఈ అరుదైన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఓ వివాహ సమయంలో చోటు చేసుకుంది. వధూవరులు నూగురు వెంకటాపురానికి చెందినవారు. ఈ అద్భుత సంఘటనతో బంధువుల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం ఆనందం ఉరకలేసింది. -
ములుగు వద్ద గోదావరి ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాగులు, వంకలూ, గోదావరి నది పొంగి పొర్లుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కృష్ణాపురం వద్ద 163వ జాతీయ రహదారిపై చేరిన వరద నీరు చేరింది. చత్తీస్‌గఢ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. పేరూరు వద్ద వరద నీటి మట్టం 15 మీటర్లకు చేడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలు వరదలతో ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట మద్యలో ఉన్న జీడి వాగు ఉప్పొంగుతోంది. (జల దిగ్బంధంలో మేడారం) కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క జీడి వాగు ఉదృతిని వీక్షించారు. వాగు పొంగుపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయని ప్రజలంతా ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ములుగు జిల్లా పాలంపేట గ్రామం రామప్ప తూర్పు ముఖద్వారం రోడ్డు పై నుంచి వరద నీరు భారీగా కిందకు ప్రవహిస్తోంది. మరి కొద్ది గంటలల్లో గణపురం, ములుగు, వెంకటపూర్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. (జలదిగ్బంధంలో ఓరుగల్లు) -
జల దిగ్బంధంలో మేడారం
-
జల దిగ్బంధంలో మేడారం
సాక్షి, ములుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా పొంగిపొర్లుతుంది. వర్షపు నీరు మేడారం గ్రామాన్ని పూర్తిగా చుట్టేశాయి. ఓ గ్రామాన్ని వర్షపు నీరు పూర్తిగా ఇలా గ్రామాన్ని చుట్టేయడం చరిత్రలో మొదటిసారి. ప్రస్తుతం జంపన్న వాగు నీరు మేడారం గద్దెల సమీపంలోని ఐటీడీఏ కార్యాలయానికి తాకాయి. ఇప్పటికే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. దీంతో పోలీసులు పస్రా నుంచి మేడారానికి రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలిపివేశారు. ఊరట్టం వద్ద భారీగా జంపన్న వాగు భారీగా ప్రవహిస్తోంది. మేడారం గ్రామం బ్రిడ్జీపై నుంచి ప్రవహిస్తూ గ్రామంలోకి వరద నీరు చేరుతోంది. వరద ఉధృతితో మేడారం అమ్మవార్ల గద్దెలను జంపన్న వాగు నీరు తాకనుంది. వర్షపు నీరు ఇప్పటికే చిలుకల గుట్టను తాకి మేడారం గద్దెల వైపు భారీగా ప్రవహిస్తోంది. -
ఉసురు తీసిన ఊర కుక్కలు
-
దారుణం: ఉసురు తీసిన ఊర కుక్కలు
సాక్షి, ములుగు: జిల్లాలోని ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో ఘోరం జరిగింది. ఊర కుక్కలు బీభత్సం సృష్టిoచాయి. ఓ చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. కర్ణాటకలోకి గుల్బార్గాకు చెందిన వలస కార్మిక కుటుంబ రామప్ప-పాకాల పైపులైన్ పనులు చేస్తోంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు కంపెనీలో పనికి వెళ్లడంతో వారికోసం ఆడుకుంటూ గుట్ట పైకి వెళ్లిన ఐదేళ్ల బాలుడి చిరంజీవిపై కుక్కలు దాడికి దిగాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కార్మిక కుటుంబం 2 నెలలుగా పైపులైన్ పనులో చేస్టున్నట్టు తెలిసింది. ఇక్కడే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
ఫొటో జర్నలిస్ట్ దారుణ హత్య
సాక్షి, ములుగు: అప్పుగా ఇచ్చిన డబ్బులు అడగడానికి వెళ్లినవారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వరంగల్‌కు చెందిన దేవేందర్‌రెడ్డి పస్రాలోని బేకరీ నిర్వహిస్తున్న ప్రభు, దయాలకు రూ.6లక్షల వరకు అప్పు ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి అడిగేందుకు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం హవేలీ గ్రామానికి ఫ్రీలాన్సర్ ఫొటో జర్నలిస్ట్, వరంగల్ ప్రెస్‌క్లబ్ కోశాధికారి బొమ్మినేని సునీల్‌రెడ్డి (40)తో కలిసి సోమవారం పస్రాకు వెళ్లారు. తన డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలంటూ అడిగారు. స్థానిక వ్యాపారి ఒకరు తనకు డబ్బులు ఇవ్వాలని.. అతను ఇచ్చాక చెల్లిస్తానని దయ బదులిచ్చాడు. దీంతో దేవేందర్‌రెడ్డి, సునీల్‌రెడ్డి కలిసి సదరు వ్యాపారి వద్దకు వెళ్లి డబ్బుల విషయమై అడిగారు. అయితే, తాను బేకరీవారికి డబ్బులు ఇవ్వాల్సిందేమీ లేదని చెప్పడంతో ఇరువురూ తిరిగి బేకరీ వద్దకు వచ్చారు. దయాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అతడు దేవేందర్‌రెడ్డి తలపై సీసాతో దాడి చేశాడు. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు వచ్చి దేవేందర్‌ను ములుగు ఆస్పత్రికి తరలించారు. సునీల్‌రెడ్డిని దయ ఉంటున్న గది వద్దకు తీసుకెళ్లి అతడిపై దాడి చేసి హత్యచేశాడు. దయాతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
అమ్మలు అడవిలోకి
-
ముగిసిన మేడారం మహా జాతర
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. నాలుగు రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న వనదేవతలు సమ్మక్క–సారలమ్మ శనివారం సాయంత్రం తిరిగి అడవిలోకి ప్రవేశించారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు, వడ్డెలు వనదేవతలను వనంలోకి తీసుకెళ్లారు. మేడారం గద్దెలపై కొలువుదీరిన నలుగురు దేవతల వనప్రవేశం ఉద్విఘ్నంగా సాగింది. ఆ దృశ్యం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. జాతర చివరి రోజున సుమారు 15 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. శనివారం మేడారంలో భారీ వర్షం కురవడం, ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో సొంతూళ్లకు తిరుగు పయనమైన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక పూజలతో వనంలోకి... దేవతల వనప్రవేశ ఘట్టం శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. మొదట గోవిందరాజును దబ్బగట్ల గోవర్దన్, పోదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి .. గంటలకు కదిలించి ఏటూరునాగారం మండలం కొండాయికి తరలించింది. అనంతరం ... గంటలకు సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్లతో కూడిన మరో బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించాక సమ్మక్కను అక్కడి నుంచి కదిలించి చిలుకలగుట్టకు చేర్చింది. ఇక సమ్మక్క భర్త పగిడిద్దరాజున.. గంటలకు పెనక మురళీధర్, పూజారుల బృందం తరలించి కొత్తగూడ మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రంలోగా వారు గమ్యాన్ని చేరుకుంటారు. ఇక సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లతో కూడిన పూజారుల బృందం గద్దెపై ప్రతిష్టించిన ముట్టె (వెదురుబుట్ట)ను.. గంటలకు తీసుకొని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చింది. భక్తులు ఈ సమయంలో పూజారులను తాకి, మొక్కుకోవడానికి ప్రయత్నించారు. దేవతల వనప్రవేశంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసింది. బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగతో మహా జాతర పరిసమాప్తమవుతుంది. అప్పటిదాకా భక్తులు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు. నాలుగోరోజు వీఐపీల తాకిడి మేడారం జాతర చివరి రోజూ వీఐపీల తాకిడి కొనసాగింది. కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. తులాభారంతో నిలువెత్తు (75 కిలోలు) బంగారాన్ని తల్లులకు సమర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తల్లులను దర్శించుకున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్‌రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, షేరి సుభాశ్‌రెడ్డి, నవీన్‌రావు అమ్మలను దర్శించుకున్న వారిలో ఉన్నారు. వారితోపాటు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి, ఆ రాష్ట్ర సీఎస్ ఆర్.పి. మండల్, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. సీఎం అభినందనలు... మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతంగా ముగించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జాతరను విజయవంతం చేసేందుకు అహర్నిశలు పనిచేసిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయపరిచి జాతరను అద్భుతంగా జరిగేందుకు కృషి చేసిన మంత్రులు, ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా సమ్మక్క–సారలమ్మ దీవిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేడారం జాతర విజయవంతం మేడారం జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించగలిగాం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు సహచర మంత్రులు, ప్రజాప్రతిని«ధులు, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు మొదటి నుంచి ప్రణాళికతో సాగారు. తద్వారా జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం కనిపించలేదు. శనివారం మేడారాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండాను కూడా ఈ విషయమై కోరాం. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి -
మేడారం జాతరలో కీలక ఘట్టం
సాక్షి, ములుగు : మేడారం జాతరలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాల మధ్య చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారంకు బయల్దేరింది. దీంతో ములుగు జిల్లా మేడారం వనాలు సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి. అడవి అంతా జనాలతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క రాకకు సూచనగా దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ ఏకే 47 తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ శబ్దం విన్నవెంటనే ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క నామస్మరణతో చిలుకల గుట్ట ప్రాంతం మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల రోప్‌పార్టీ నడుమ పూజారులు, వడ్డెలు సమ్మక్క కుంకుమ భరిణె రూపంతో మేడారంవైపు బయలుదేరారు. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంచనాలు, పోలీసు ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల స్వాగతం, భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఆదివాసీలు, సమ్మక్క పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. ఆదివాసీ జాతరలో పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సమ్మక్క ఉండే చిలకలగుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడి నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా జనంతో నిండిపోయింది. సమ్మక్క స్వాగత కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య పాల్గొన్నారు. దారి పొడవునా సమ్మక్కకు లక్షలాది భక్తులు సమ్మక్కకు ఎదురేగి..కోళ్లు, మేకలు బలి ఇస్తూ స్వాగతం పలికారు. (మేడారం.. అన్నీ ‘ప్రత్యేకం’) కాగా బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడడారం గద్దెపై కొలువుదీరారు. అలాగే కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు సైతం సారలమ్మతోటే మేడరం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నంటింది. ఈ అద్భుత సన్నివేశాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి -
మన అంకోర్వాట్ కూలుతోంది..
సాక్షి, హైదరాబాద్: అంకోర్వాట్ (ఆంగ్‌కోర్‌వాట్)... ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న కంబోడియాలోని అద్భుత హిందూ దేవాలయం. 12వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని గతేడాది దాదాపు 26 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ కట్టడాన్ని పునరుద్ధరించటంలో కీలక పాత్ర భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) దే. మన సాయంతోనే దాన్ని పునరుద్ధరించి ప్రపంచపటంలో ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిపారు. అయితే మన దేశంలో అంకోర్వాట్ తరహా శైలిలో నిర్మించిన మందిరం ఒక్కటే ఉంది. ఇది చిన్న నిర్మాణమే అయినా, నిర్మాణశైలి అంకోర్‌వాట్‌దే. ఆ ఒక్క నిర్మాణం మన తెలంగాణలోనే ఉంది. విశేషమేంటంటే.. అంకోర్‌వాట్‌కు ఈ చిన్న నిర్మాణమే స్ఫూర్తి అన్నది చరిత్రకారుల మాట. ఎందుకంటే అంకోర్వాట్ కంటే దాదాపు 550 ఏళ్ల క్రితమే దీన్ని నిర్మించారని చెబుతారు. ఆ తరహా నమూనాలో నిర్మించిన దేశంలోనే ఏకైక ఈ చిన్న గుడిని పరిరక్షించటం ఇప్పుడు అదే ఏఎస్ఐకి సాధ్యం కావటం లేదు. ఎందుకంటే స్థానిక యంత్రాంగం ఎన్ఓసీ ఇవ్వకపోవటమే. కళ్ల ముందే ఆ అద్భుత నిర్మాణం కూలిపోతున్నా.. యంత్రాంగం దాని పరిరక్షణకు ముందుకు రావటం లేదు. స్వచ్ఛందంగా అడుగు ముందుకేసి పూర్తిస్థాయిలో పూర్వ రూపు కల్పిస్తామన్న ఏఎస్ఐకి సహకరించటం లేదు. ఆరో శతాబ్దంలో నిర్మాణం! ములుగు జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు గ్రామ శివారులోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై కొలువుదీరింది ఈ ఆలయం. మూడేళ్ల క్రితమే దేవునిగుట్ట ఆలయం బయటి ప్రపంచానికి తెలిసింది. అప్పటివరకు స్థానికులే అక్కడ ఉత్సవాలు నిర్వహించుకునేవారు. దాన్ని ఎవరు నిర్మిం చారో ఇదమిత్థంగా ధ్రువీకరించేందుకు అక్కడ శాసనాలు లభించలేదు. దాని శైలి ఆధారంగా వాకాటకుల హయాంలో నిర్మితమైనట్టు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆరో శతాబ్దంలో వాకాట రాజు హరిసేన హయాంలో నిర్మించి ఉంటారని అంచనా. అప్పట్లో మహాయానబుద్ధిజం ప్రభావం ఎక్కువ. ఆలయం దక్షిణం వైపు అజంతాలో ఉండే బోధిసత్వ పద్మపాణి తరహాలో భారీ శిల్పం ఉంటుంది. కానీ అది మహాశివుడి రూపమైన దక్షిణామూర్తి విగ్రహమని, హరిసేన హయాంలోనే హిందూయిజం విస్తరించటం బాగా ఉండేదని కొందరి వాద న. ఆలయంలో ఎలాంటి విగ్రహాలు లేవు. ఇసుక రాళ్లే ఇటుకలుగా.... చాలా తేలికగా ఉండే ఇసుక రాళ్లను పేర్చి దేవునిగుట్ట గుడిగా మలిచారు. ఆ రాళ్లపై మానవ, జంతు ఆకృతులను తీర్చిదిద్దారు. ఆ ఆకారాలను వరసగా పేరిస్తే పూర్తి రూపమొస్తుంది. అంటే.. ముందుగానే రాళ్లపై శిల్పంలోని భాగాలు చెక్కి పేర్చి పూర్తి ఆకృతినిచ్చారు. ఇది కంబోడియాలో ఉండే నిర్మాణాలశైలి. ఒక గర్భగుడి మాత్రమే నిర్మించారు. ముందు ఎలాంటి మండపాలు లేవు. గర్భాలయం లోపల నిలబడి చూస్తే శిఖరం చివర వరకు కనిపిస్తుంది. ఆలయం వెలుపల, లోపల రాళ్లపై చిత్రా లు కనిపిస్తాయి. దట్టమైన అడవిలో ఉండటం, బయటి ప్రపంచానికి తెలియకపోవటంతో ఇంతకాలం దాన్ని పట్టించుకోలేదు. ఫలి తంగా రాళ్లు కదిలిపోయి ఆలయం కూలేదశకు చేరింది. దీన్ని గుర్తించిన తర్వాత మూడేళ్ల క్రితం ఏఎస్ఐ అధికారులు పరిశీలించారు. అది హెరిటేజ్ తెలంగాణ రక్షిత కట్టడం జాబితాలో లేకపోవటంతో పరిరక్షణకు సిద్ధమయ్యారు. వెంటనే స్థానిక గ్రామపంచాయతీ ప్రతినిధులను కలిసి లిఖితపూర్వకంగా విన్నవించారు. దీనికి స్పందించిన నాటి గ్రామ పంచాయతీ ఎన్ఓసీ ఇచ్చింది. వెంటనే నాటి భూపాలపల్లి (ప్రస్తుత ములుగు జిల్లా) కలెక్టర్‌కు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసింది. అప్పట్నుంచి అది పెండింగులోనే ఉంది. తరచూ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని వాకబు చేస్తున్నా ఫలితముండటం లేదు. ఇటీవలి భారీ వర్షాలకు ఆలయం రాళ్లు బాగా కదిలిపోయాయి. వచ్చే వానాకాలం నాటికి మొత్తం నేలమట్టమయ్యే ప్రమాదం నెలకొంది. ఇక్కడికి తరచూ విదేశీ నిపుణులు అధ్యయనంలో భాగంగా వచ్చి అబ్బురపడుతున్నారు. అంకోర్వాట్ తరహాలోనే నిర్మాణం ఉందని తేల్చి చెబుతున్నారు. కానీ దాన్ని పరిరక్షించాలన్న ఆలోచన మాత్రం మన యంత్రాంగానికి రావటం లేదు. -
ప్లాస్టిక్‌పై యుద్ధం
సాక్షి, ములుగు: ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే రాజ్యమేలు తోంది. పల్లె లేదు.. పట్నం లేదు.. ఇల్లు లేదు.. వాకిలి లేదు.. ఎక్కడ చూసినా ఈ మహమ్మారే కనిపిస్తోంది. చివరకు పచ్చని అడవులు, ఆహ్లాదపరిచే పర్యాటక ప్రాంతాలు, భక్తి తన్మయత్వాన్ని పంచే ఆలయాలకు నెలవైన ములుగు ఏజెన్సీ జిల్లాలో సైతం ప్లాస్టిక్ భూతం బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఈ మహమ్మారిని అరికట్టాలని నిర్ణయించారు. అయితే, ప్లాస్టిక్ వస్తువు లను ఇవ్వాలని అడిగితే ప్రజలు ముందుకురారని భావించిన ఆయన.. ఇందుకు ఓ ఉపాయం కని పెట్టారు. కేజీ ప్లాస్టిక్ అందించేవారికి కేజీ ఫైన్ రైస్ ఇస్తామని ప్రకటించారు. దీంతో భారీగా స్పందన వచ్చింది. జిల్లాలో గతనెల 16 నుంచి 26 వరకు చేపట్టిన కార్యక్రమం ద్వారా తొమ్మిది మండలాల్లోని 174 గ్రామపంచాయతీల పరిధిలో ఏకంగా 48,849 కేజీల ప్లాస్టిక్ సేకరణ జరగడం విశేషం. పైగా వరుస వర్షాలతో పనిలేక ఇబ్బందులు పడిన వారికి దీనివల్ల ఉపాధి కూడా కలిగినట్లయింది. ఇప్పటి వరకు సేకరించిన ఈ ప్లాస్టిక్‌ను డిస్పోజ్ చేయడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లను సిమెంట్ ఫ్టాక్టరీలకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో మేడారం జాతర వరకు దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. జాకారం నుంచి మొదలు... 30 రోజుల ప్రణాళిక పనుల్లో భాగంగా ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్ ములుగు మండలంలోని జాకారం గ్రామాన్ని పరిశీలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో చిన్నారులు అక్కడ తిరుగుతూ కనిపించారు. దీంతో ఎస్పీ సంగ్రాంసింగ్ వారికి సరదాగా ప్లాస్టిక్ సేకరణ టాస్క్ ఇచ్చారు. దీంతో వారు మూడు బృందాలుగా విడిపోయి గంట సమయంలోనే ఏకంగా 996 ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. వాటిని చూసిన నారాయణరెడ్డి.. ఒక్క గ్రామంలోనే ఇన్ని బాటిళ్లు ఉంటే జిల్లాలో ఎన్ని ఉంటాయో అని భావించి ప్లాస్టిక్‌పై సమరభేరి పూరించాలని నిర్ణయం తీసుకుని, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బియ్యం కొనుగోలుకు విరాళాలు... ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది తరపున ప్రతీ గ్రామం నుంచి పాత, కొత్త బట్ట సంచులను సేకరించారు. స్థానిక టైలర్ల సహాయంతో సుమారు 40వేల బట్ట సంచులను సేకరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఇక ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా వెదురు బొంగులతో తయారు చేయించిన కప్పుల వాడకంపై జిల్లా సంక్షేమ శాఖ అవగాహన కల్పించింది. ప్లాస్టిక్‌కి అడ్డుకట్టగా మంగపేట మండల కేంద్రానికి చెందిన చికెన్ వ్యాపారి ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తీసుకొస్తే కేజీకి రూ.10 తక్కువ తీసుకుంటానని ప్రకటించాడు. ఇక ఫైన్ రైస్ కొనుగోలుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ వంతుగా విరాళాలు అందించారు. ఇలా అన్ని రంగాల ప్రజల చేయూతతో ఇతర జిల్లాలకు ఆదర్శంగా ములుగులో ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలవుతోంది. ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రకటించారు. ప్లాస్టిక్ వాడితే రూ.5వేల జరిమానా... జిల్లా యంత్రాంగం ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలకు వచ్చే వారు బయటి ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వస్తువులు, గ్లాసులు, ప్లేట్లు తీసుకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ములుగు మండలం గట్టమ్మ ఆలయంతో పాటు జిల్లా సరిహద్దుల్లో నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేసి వారి దగ్గర ఉన్న ప్లాస్టిక్‌ని తీసుకొని ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, ప్లాస్టిక్ రహిత గ్లాసులు, పేపర్ ప్లేట్లు అందిస్తారు. ఇందుకయ్యే ఖర్చును భక్తులు, పర్యాటకుల నుంచి వసూలు చేస్తారు. మేడారంపై ప్రత్యేక దృష్టి కోటిమందికి పైగా హాజరయ్యే మేడారం మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరలో ప్లాస్టిక్‌ని పకడ్బందీగా నిషేధించేందుకు జిల్లా యంత్రాంగం సమయత్తమవుతోంది. జాతర జరిగే సమయంలో వెయ్యి మంది వలంటీర్లను ప్రత్యేకంగా నియమిస్తారు. వీరంతా భక్తులను పరిశీలించి ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకుంటారు. ప్లాస్టిక్ నియంత్రణ కొనసాగుతుంది జిల్లాలో చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయం అందించారు. ప్లాస్టిక్ నియంత్రణ నిత్యం కొనసాగుతుంది. గ్రామాల్లో ప్లాస్టిక్ సేకరణ దాదాపుగా పూర్తిచేశాం. అలాగే ప్లాస్టిక్ వస్తువులు విక్రయించకుండా నోటీసులిచ్చాం. జిల్లాలోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లోనూ అమలు చేస్తున్నాం. బయటి నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకు రాకుండా ములుగు మండలం గట్టమ్మ ఆలయం వద్దే కాకుండా నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తాం. ముఖ్యంగా మేడారం మహా జారతను ప్లాస్టిక్ ప్రీ జాతరగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. – చింతకుంట నారాయణరెడ్డి, కలెక్టర్, ములుగు జిల్లా -
ఆర్టీసీ సమ్మె : బస్సు దూసుకెళ్లడంతో..
సాక్షి, ములుగు : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జేఏసీ నాయకులు, ప్రభుత్వం మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆర్టీసీ బస్సును ప్రైవేటు డ్రైవర్ నడిపిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ములుగు జిల్లా గోవిందారావుపేట మండలం పసర గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వడ్డే జ్యోతి (29) అనే మహిళ పై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. జ్యోతి పసర గ్రామంలోని ఒక హోటల్లో దినసరి కూలీగా పనిచేస్తోంది. ఆమె స్వగ్రామం ఏటూరునాగారం మండలం రొయ్యూరు అని తెలిసింది. కాగా, నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 16వ రోజుకుచేరింది. -
రోడ్డు ప్రమాదం.. పాపం చిన్నారి..
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ములుగు జిల్లా ములుగు మండలం మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలో కారు-అంబులెన్స్ ఢీకొన్న దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన కారు(ఏపీ 20ఏయూ 2198) అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఎనిమిది నెలల పసికందు ఉంది. సీటు మధ్యలో ఇర్కుపోయి చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వాజేడు వెంకటపూర్‌కు చెందిన బానోతు సోనాల్, అతని భార్య రజిత, వీరి చిన్న పాప, మరో వ్యక్తి మృతి చెందారు. వీరు కారులో వెంకటపూర్ నుండి హైదరాబాద్‌కు వెళుతున్న క్రమంలో మొదట వరంగల్ నుండి ములుగు వెళుతున్న తిరుపతి రెడ్డి కారును ఢీకొట్టి తర్వాత ఎదురుగా వస్తున్న పోలీస్ అంబులెన్స్ వ్యాన్‌ను గుద్దుకుంది. ప్రమాద సమయంలో చిన్నారితో సహా కారులో ఏడుగురు ఉన్నారు. వీరిలో పాపతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్న మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వెల్లడి కావాల్సివుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులు జనగామ ప్రాంత వాసులుగా గుర్తించారు. పెద్దామడుర్ వాసి కృష్ణ, జనగామకు చెందిన మందిప్, సోమా నర్సయ్య ప్రాణాలు కోల్పోయారు. పెద్దమడుర్ గ్రామానికి చెందిన వారు పండుగ షాపింగ్ కోసం జనగామకు వెళ్తుండగా, మరో కారులోని వారు బర్త్ డే పార్టీ కోసం దేవురుప్పుల వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. -
ఘణపురంలో మావోయిస్టుల కరపత్రాలు
సాక్షి, ములుగు: జిల్లాలోని వాజేడు మండలం ఘణపురం గ్రామ శివారులో గురువారం మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. ఈ నెల 21 నుంచి నవంబర్ 8 వరకు మావోయిస్టుల 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని మావోలు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కరపత్రాలు సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో వెలిశాయి. -
‘రాష్ట్రం జ్వరాలమయంగా మారింది’
సాక్షి, ములుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విషజ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ములుగు ఏరియా ఆస్పత్రిని జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ప్రభుత్వం ప్రకటించిందని కానీ, అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి అంటే 250 పడకలు ఉండాలి. అయితే ఇక్కడ కేవలం వంద పడకలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాక మందులు సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మాత్రం ములుగు ఆస్పత్రి 50 పడకల ఆస్పత్రి మాత్రమే అని, ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నారని ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి మీడియాకు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖకు, డ్రగ్ కంట్రోల్ శాఖకు మధ్య సమన్వయం లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.రాష్ట్రం జ్వరాలమయంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిపాలన లేదు అని చెప్పడానికి ఇంతకంటే మించి ఇంకేమి కావాలి అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టించిన ఈ ఆస్పత్రికి రాష్ట్రం ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వసతులు ఎక్కడ? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముందుచూపుతో ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరేళ్లలో ఇప్పటివరకు కూడా కనీసం ఎక్విప్మెంట్లు సమకూర్చలేదని ఎద్దేవా చేశారు. ఎంఆర్ఐ, ఈసీజీలతో పాటు బ్లడ్ సేపరేటర్, డయాలసిస్ సెంటర్ సౌకర్యం కూడా లేదని మండిపడ్డారు. డాక్టర్లు ఎక్కడ? ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పదిమంది సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరని ప్రశ్నించారు. అలాగే ఏడుగురు డిప్యూటీ సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా.. ఒకరు కూడా లేరన్నారు. అంతేకాక సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 27 మంది ఉండాల్సి ఉండగా.. 11 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఈ సందర్బంగా భట్టీ పేర్కొన్నారు. నర్సింగ్ విభాగానికి వస్తే.. గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు రెండు ఉండగా.. రెండూ ఖాళీగానే ఉన్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సు పోస్టులు 25 ఉండగా, అందులో 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు భట్టి మీడియాకు వివరించారు. -
విద్యార్థులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే సీతక్క
సాక్షి, వరంగల్ : సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేసే ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా కబడ్డీ ఆడారు. ములుగు మండలం జాకారంలోని బాలికల మినీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ‘ఎంటర్టైన్మెంట్ డే’ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టుదలతో విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఆకాక్షించారు. చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని అన్నారు. ఇక ఎమ్మెల్యే కబడ్డీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఆదివాసీ వేడుకలు; ఎమ్మెల్యే సీతక్క సందడి..!
సాక్షి, ములుగు : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో ఏటూరునాగారంలో వేడుకలు నిర్వహించారు. వై జంక్షన్ నుంచి ఐటీడీఏ వరకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో గిరిజన సంఘాల నేతలు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని సందడి చేశారు. ఆమెతోపాటు కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రామసింగ్ పాటిల్, ఐటీడీఏ పీఓ పాల్గొన్నారు. -
వరదలో చిక్కుకున్న 40 మంది కూలీలు
సాక్షి, ములుగు: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు, వంకలు వరదలతో ఉప్పొంగుతున్నాయి. బుధవారం జిల్లాలోని మండపేట మండలంలో తిమ్మాపూర్ వద్ద ముసలమ్మ వాగు వరద నీటితో ఉదృతంగా పారుతోంది. కూలీ పనులకు వెళ్లిన 40 మంది వాగు దాటుతూ.. వారదలో చిక్కుకొని ఆరు గంటలపాటు వరద నీటిలో నరకయాతన అనుభవించారు. దీంతో తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనతో మండలంలో ఆందోళన వాతావరణం నెలకొంది. కాగా సమాచారం అందుకున్న పిసా చట్టం కోఆర్డినేటర్, స్థానిక గ్రామస్తులు బాధితులను రక్షించేందుకు సాహసం చేసి తాళ్ల సాయంతో వాగును దాటించారు. దీంతో వరద నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డ కూలీలు ఊపిరి పిల్చుకున్నారు. -
‘భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, ములుగు: భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా.. డీజీపీ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉదయం నుంచి ఏడు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై పోలీసులు, నిఘావ్యవస్థను అప్రమత్తం చేస్తూ సూచనలు ఇచ్చారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 2020లో మేడారం జాతర ఏర్పాట్లు, వీఐపీల భద్రతపై డీజీపీ ఈ అంతర్గత సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో వరంగల్ పోలీస్ కమిషనర్, మూడు జిల్లాల ఎస్పీలు, ఆరు జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
బీట్.. బహు బాగు
సాక్షి, భూపాలపల్లి: హలో.. హలో బీట్ ఆఫీసరేనా ఇక్కడ దుప్పిని చంపారు సార్. మీరు తొందరగా వచ్చి వేటగాళ్లను పట్టుకోండి అని ఓ బీట్ పరిధిలోని గూడెం నుంచి బీట్ ఆఫీసర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ ఆగమేగాలతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కొంత దూరం వెళ్లాకా.. మరో ఫోన్ కాల్ వచ్చింది.. సార్ ఇక్కడ పెద్ద ఎత్తున టేకు చెట్లను నరికి దుంగలను తరలించడానికి దుండగులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే రండి.. లేకుంటే వారు వెళ్లిపోతారని ఈ కాల్ సారాంశం. దీంతో ఆ బీట్ ఆఫీసర్ ఎటు వెళ్లాలో తేల్చుకోలేని çపరిస్థితి. దుప్పి మాంసాన్ని కాపాడలేదు.. కలప స్మగ్లింగ్ ఆగలేదు. ఒక ఆఫీసర్ రెండు నుంచి ఐదు బీట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు అటవీ శాఖలో ఉంది. ప్రస్తుతం బీట్ ఆఫీసర్ల నియామకంతో కొంతలో కొంతైనా వారిపై భారం తగ్గనుంది. అడవి సంరక్షణలో బీట్ ఆఫీసర్లే కీలకం. క్షేత్రస్థాయిలో వన్య ప్రాణులు, కలప, అటవీ ఉత్పత్తుల కంటికి రెప్పలా కాపాడడంలో వీరిది అందవేసిన చేయి. అయితే కొంతకాలంగా వీరి కొతర అటవీశాఖను తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది లేక తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు కొత్తగా బీట్ ఆఫీసర్ల నియామకంతో కాస్త భారం దిగనుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గత కొన్నేళ్లుగా తగినంత మంది బీట్ ఆఫీసర్లు లేక ఉన్నవారిపైనే అదనపు భారం పడేది. దీంతో ఒక్కో బీట్ అధికారి ఒకటి కంటే ఎక్కువ అటవీ బీట్ల విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కొత్త బీట్ ఆఫీసర్లు వస్తుండడంతో అటవీ పరిరక్షణ మరింతగా పెరుగనుంది. పెరిగిన ఆఫీసర్లు.. కొత్తగా బీట్ ఆఫీసర్లు వస్తుండడంతో జిల్లాలో అటవీ శాఖపై పనిభారం తగ్గనుంది. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కరీంనగర్ తూర్పు డివిజన్‌తో పాటు వరంగల్ నార్త్ డివిజన్ పరిధిలో ఉంది. భూపాలపల్లి జిల్లాకు కరీంనగర్ తూర్పు డివిజన్ నుంచి 80 మంది, వరంగల్ నార్త్ డివిజన్ నుంచి 24 మందిని కేటాయించారు. మొత్తంగా జిల్లాకు 104 మంది కొత్త బీట్ అధికారులు రానున్నారు. అదే విధంగా ములుగు జిల్లా పూర్తిగా వరంగల్ నార్త్ డివిజన్ పరిధిలో ఉంది. ములుగులోని ఎస్ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, ములుగు సబ్డివిజన్లకు 35 మంది చొప్పున 105 మంది బీట్ ఆఫీసర్లను కేటాయించారు. త్వరలో వీరు నియామకం కానున్నారు. అలాగే 80 పోస్టులు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. వీటికి ఎస్టీ ట్రైబ్స్ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 13 మండలాలకు కేటాయించనున్నారు. స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట దట్టమైన అడవులు, పర్యాటక కేంద్రాలు ఉన్న ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బీట్ అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఇన్నాళ్లు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వన్య ప్రాణుల వేట, కలప అక్రమ రవాణా, అడవిలో లభించి విలువైన వన మూలికలు, ఇతర సరుకులు అక్రమాలకు కాసులకు కురిపించేవి. స్మగ్లర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా బీట్ ఆఫీసర్లు వస్తుండడంతో ఇకపై అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే కొత్తగా పోడును నిలువరించడంతో పాటు హరితహారంలో మొక్కులు పెంచి అటవీని పచ్చగా మార్చుకోవచ్చు. ఖాళీగా కొన్ని బీట్లు తాజాగా జరిగిన నియామకాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో బీట్ ఆఫీసర్లు ఖాళీల నియామకాలు జరిగాయి. ఇన్ని నియామకాలు జరిగినా రెండు జిల్లాల్లోని కొన్ని బీట్లు ఖాళీగానే ఉన్నాయి. మొన్నటి వరకు రెండు జిల్లాలో 532 బీట్లు ఉంటే కేవలం 110 మంది బీట్ ఆఫీసర్లు ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో మొన్నటి వరకు 190 బీట్లకు గానూ 32 మంది, ములుగులో 342 బీట్లకు గానూ 78 మంది మాత్రమే బీట్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించారు. సగటున ఒక బీటు చూసే అధికారి ఐదారు బీట్లు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కొత్తగా నియమించే సిబ్బందితో ఈ సమస్యలను అధిగమించవచ్చని అటవీశాఖ భావిస్తోంది. ప్రస్తుతం భూపాలపలి జిల్లాకు కొత్తగా 104 మంది, ములుగు జిల్లాకు 105 మంది రానుండటంతో ఖాళీల సంఖ్య తగ్గింది. కొత్తగా వచ్చిన బీట్ ఆఫీసర్ల నియామకం జరిగిన తర్వాత భూపాలపల్లిలో 54 ఖాళీలు ఉంటాయి. ఆదే విధంగా ములుగులో 159 ఖాళీలు ఉంటాయి. అయితే మరో 80 ఏజెన్సీ పోస్టుల నియామకం ఉండటంతో ములుగు జిల్లా కూడా ఖాళీల సంఖ్య 80కి తగ్గే అవకాశం ఉంది. -
ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని చిన్నారి మృతి
-
బైక్‌ను ఢీకొన్న ఎమ్మెల్యే సీతక్క కారు, పాప మృతి
సాక్షి, వరంగల్ : ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దంపతులు తమ చిన్నారిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా జీడివాగు సమీపంలో ఎదురుగా దూసుకొచ్చిన ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, దంపతులు గాయపడ్డారు. అయితే పాప తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. దంపతులను చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని చిన్నారి మృతి -
ములుగు జిల్లా కోస్టల్ కంపేనీలో అగ్ని ప్రమాదం
-
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
సాక్షి, మహబూబాబాద్ రూరల్: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ శనివారం దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి నిర్వహించే నైవేధ్య పూజా సమయంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఎమ్మెల్సీకి ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు. తనకు తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని కోరినట్లు తెలిపారు. -
గుర్తింపు దక్కేనా..!
సాక్షి, ములుగు: కాకతీయుల అద్భుత శిల్పకళా సంపదకు నిలువుటద్దం రామప్ప దేవాలయం. ప్రపం చ వ్యాప్తంగా కీర్తిని పొందాయి ఇక్కడి శిల్పాలు. విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దిన కళాఖండాలను తనివితీరా చూడాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. 806 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి విభిన్నమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి ఇటుకలు నీటిలో వేస్తే తేలియాడుతూ ఉంటాయి. ఇది ఇప్పటికీ అం తుపట్టని అద్భుతమని చెప్పుకోవచ్చు. ఆలయం ఎదుట ఉండే నందీశ్వరుడు ఏకశిలతో ఏర్పాటు చేయడంతో పాటు శివలింగానికి ఎదురుగా ఉండడం మరో ప్రత్యేకత. సూర్యకాంతి నేరుగా గర్భగుడిలో పడి ప్రకాశవంతమైన వెలుతురును ప్రసరింపజేయడం శిల్పి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆలయం ముచ్చటగా మూడోసారి 2019 సంవత్సరానికి గాను వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున యునెస్కోకు నామినేట్ అయింది. ఇప్పటికే రెండుసార్లు (2017, 2018) రాష్ట్రం నుంచి అందించిన ప్రతిపాదనలో వివరాలు సరిగా లేవని తిరస్కరించబడింది. దేశం నుంచి ఒక చారిత్రక ప్రదేశానికి మాత్రమే అవకాశం ఉండడంతో ఈ రెండు సార్లు రాజస్థాన్ రాష్ట్రం యునెస్కో గుర్తింపు పొందింది. పకడ్బందీగా ప్రతిపాదనలు.. రామప్ప ఆలయాన్ని ఇప్పటికే రెండు సార్లు యు నెస్కో తిరస్కరించడంతో పర్యాటక శాఖ అన్ని రకాల జాగ్రత్తలతో పకడ్బందీగా ప్రతిపాదనలు చేసింది. వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ ప్రతిపాదన యునెస్కో బెంచ్ ముందుకు వెళ్లనుంది. కాగా, ఈ దఫా రామప్ప ఆలయం మాత్రమే నా మినేట్ కావడంతో కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని, వారసత్వ సంపదకు తగిన గౌరవం దక్కుతుందని భక్తులు, స్థానికులు ఆశిస్తున్నారు. ప్రతిపాదనలు.. జిలాల్లోని వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజు గణపతిదేవుడి కాలంలో సామంత రాజు రేచర్లరుద్రడు నిర్మించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా బేస్‌మెంట్‌గా అరుదైన సాండ్ బాక్స్ టెక్నాలజీని వినియోగించారు. దీంతో పాటు ఆలయ పైభాగం నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించారు. అలాగే సరిగమపలు పలికే మ్యూజికల్ పిల్లర్, చిపురుపుల్ల దూరే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాలు, ఆ కాలంలో మహిళ హై హిల్స్ చెప్పులు, పేరిణీ నత్య భంగిమలు, రకరకాల రాళ్లను వినియోగించి, నృత్య భంగిమలతో కూడిన శిల్పాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రతిపాదనలో పొందుపర్చారు. సమీప రాజ్యాలతో వ్యాపార సంబంధాలు భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఆలయ గోడలపై శిల్పాలను చెక్కించడం, బెల్లం, కరక్కాయలతో కూడిన మిశ్రమంతో ఆలయాన్ని నిర్మించినట్లు ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు చేశారు. పరిశీలన.. రామప్పకు యునెస్కో జాబితాలో చోటుదక్కడంలో భాగంగా ప్రతిపాదనల కోసం ఇటీవల ఆర్కాలజీ డైరెక్టర్ విశాలాక్షి, ఇంటాక్ట్ కన్వీనర్ పాండురంగారావుతో కూడిన బృందం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షించారు. ప్రతిపాదన యునెస్కో పరిశీలనలోకి వెళ్లిన అనంతరం మరోసారి ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కేంద్ర బృంద సభ్యులు ఆలయాన్ని సందర్శించనున్నారు. మెరుగపడనున్న సౌకర్యాలు.. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఆలయానికి చోటు దక్కితే టూరిజం పరంగా ప్రపంచ దేశాల చూపు రామప్పవైపు మరలుతుంది. నిధుల కేటాయింపు నేరుగా జరుగుతుంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే అన్ని రకాల వసతులు, సౌకర్యాలు మెరుగుపడుతాయి. షాపులను తొలగిస్తేనే.. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందాలంటే ఆలయ చుట్టు పక్కల 100మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. దీంతో పాటు మరో 200 మీటర్ల పరిధిలో అనుమతులు లేకుండా భవనాలు, ఇతర గృహాల నిర్మాణం చేపట్టకూడదు. అయితే ఆలయానికి వెళ్లే మార్గంలో ఇరువైపులా దుకాణాలు వెలిశాయి. గత రెండు సంవత్సరాలుగా షాపులను తొలగించే విషయంలో రెవెన్యూ, సంభందిత అధికారులు విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది. యునెస్కో బృందం పరిశీలనకు వచ్చే సమయంలో దుకాణాలు ఇలాగే కొనసాగినట్లయితే ప్రతిపాదనలు తిరస్కరించబడే అవకాశం ఉంది. -
కొత్త జిల్లాలకు కలెక్టర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణపేట జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లా కలెక్టర్‌గా సి. నారాయణరెడ్డి, నారాయణపేట్ జిల్లా కలెక్టర్‌గా ఎస్.వెంకట్రావును నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన బీ జనార్థన్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శిగా, మస్రద్‌ఖాన్ అయేషా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వెంకట్రావ్ ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో ఆయన జిల్లా పాలనాధికారిగా నియమితులైనారు. కాగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీ మేరకు రెండు నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ఇక 33 జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భౌగోళిక స్వరూపం 33 జిల్లాలుగా విడిపోయింది. ప్రస్తుతమున్న 31 జిల్లాలకు తోడు ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ములుగు, నారాయణపేట జిల్లాలు నేటి నుంచి మనుగడలోకి రానున్నాయి. ములుగు జిల్లాలో 9 మండలాలు, 336 గ్రామాలుండగా... 11 మండలాలు, 246 గ్రామాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది. ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్ 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ కాగా, నెల రోజుల పాటు అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. ఈ అభ్యంతరాలు, వినతులను పరిశీలించిన అనంతరం తెలంగాణ జిల్లాల (ఏర్పాటు) చట్టం 1974, సెక్షన్ 3 ప్రకారం ఆదివారం నుంచి ఈ జిల్లాలు మనుగడలోకి వస్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు... నారాయణపేట జిల్లాలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలు ఉన్నాయి. కొత్త కలెక్టర్ల నియామకం.. రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం శనివారమే ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లుకు ములుగు జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ డి.రోనాల్డ్రాస్కు నారాయణపేట జిల్లా కలెక్టర్లుగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ఉత్తర్వులు జారీ చేశారు. -
ములుగు జిల్లా ఏర్పాటుకు అంతా ఓకే
సాక్షి, భూపాలపల్లి: ములుగు జిల్లా ఏర్పాటుకు అందరూ సమ్మతమే తెలిపారు. ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. కొన్ని మండలాలను కలపాలని ప్రజలు ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఇదిలా ఉంటే కొంత మంది భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని వినతుల్లో సూచించారు. ములుగు జిల్లా ఏర్పాటుకు సంబం«ధించి అభ్యంతరాలు, సూచనలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు జనవరి 30తో ముగిసింది. ములుగు, ఏటూరునాగరం, మంగపేట, కన్నాయిగూడెం, ములుగు, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపూర్(ము), వాజేడు, వెంకటాపూర్(నూ) మండలాలతో ములుగు జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి జిల్లా ప్రజల నుంచి అభ్యంతరాలు ఏమీ రాలేదు. అయితే సూచనలు మాత్రం ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కొత్తగూడ, గంగారం మండలాలను ములుగు జిల్లాలో చేర్చాలంటూ 10 వరకు వినతులు వచ్చాయి. దూరభారమే కారణం.. ములుగు జిల్లా ఏర్పాటు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి కొత్తగూడ, గంగారం మండలాలను కలపాలని స్థానిక ప్రజలుడిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్న ఈ రెండు మండలాలకు జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకు ముందు ములుగు నుంచి కొత్తగూడ, గంగారం వెళ్లాలంటే మల్లంపల్లి మీదుగా వరంగల్ రూరల్‌లోని నర్సంపేట, ఖానాపూర్ మీదుగా సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం మలుగు జిల్లా పొట్లాపూర్ నుంచి కొత్తగూడ మండలం వరకు కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారు. దీంతో ములుగు నుంచి కొత్తగూడ, గంగారం మండలాల మధ్య దూరం 14 నుంచి 20 కిలోమీటర్లే ఉంటుంది. దీంతో మెజారిటీ ప్రజలు ములుగులో కలిసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ములుగు నియోజకవర్గంలో ఉండి భూపాలపల్లి పరిధి కిందకు వచ్చే పెద్దాపూర్, గుర్రంపేట, సుబ్బక్కపల్లి, రామనాయక్ తండా, బహుసింగ్‌పల్లి గ్రామాలను ములుగు జిల్లాలో ఉంచాలనే వినతులు వచ్చాయి. మల్లంపల్లి మండలం ఊసే లేదు.. ములుగు జిల్లా గెజిట్‌లో మల్లంపల్లి మండల ఏర్పాటు ప్రస్తావన లేదు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం మల్లంపల్లి, రాంచంద్రాపూర్ రెవెన్యూ గ్రామాల నుంచి 10 గ్రామ పంచాయతీలతో మల్లంపల్లి మండలం ఏర్పాటు కోసం కలెక్టర్ కార్యాలయానికి నివేదిక అందించారు. వీటిలో రామచంద్రాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని కొడిశలకుంట, పందికుంట, ముద్దునూర్‌తండా, రామచంద్రాపూర్, గుర్తూర్‌తండా, శివతండాలతో పాటు మల్లంపల్లి రెవెన్యూ పంచాయతీ పరిధి మల్లంపల్లి, శ్రీనగర్, దేవనగర్, మహ్మద్‌గౌస్‌పల్లి ఉన్నాయి. అలాగే శాయంపేట మండలంలోని రాజుపల్లి ప్రజలు సైతం కొత్తగా ఏర్పడే మల్లంపల్లి మండలంలో తమను కలపాలని కోరారు. పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు సూచనలు పనిలో పనిగా ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని 130 మందికి పైగా సూచించినట్లు తెలిసింది. ములుగు జిల్లా ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి జిల్లా కేంద్రం పరకాలకు తరలించాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. అభ్యంతరాలు, సూచనల రూపంలో అవకాశం రావడంతో పలువురు ఈ విధంగా స్పందించారు. అయితే జిల్లా అధికారులు సైతం కొన్నాళ్ల నుంచి పరకాల, శాయంపేట మండలాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ములుగు జిల్లా గురించి స్పష్టత వచ్చిన తర్వాత పరకాల, శాయంపేట మండలాలను భూపాలపల్లిలో చేర్చాలా వద్దా అనేది తెలుస్తుంది. -
ఆగని ఆందోళనలు
బస్సు అద్దాలను పగులగొట్టిన ఆందోళనకారులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో ములుగు : ములుగు జిల్లా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, జిల్లా సాధన సమితి «నాయకులు మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమ్మక్క–సారలమ్మ తల్లులు కేసీఆర్ కళ్లు తెరిపించండి అంటూ వేడుకున్నా రు. ఆందోళనకారులు ఆగిఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలు పగులకొట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి, సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్సై మల్లేశ్‌యాదవ్‌లు బస్సు ను పరిశీలించారు. కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం నాయకులు చేతి లో మందు డబ్బాలు పట్టుకొని నిరసన తెలి పారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క మాట్లాడుతూ తలనైనా నరుక్కుంటాను తప్పా మాట తప్పనని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ 2014 మేడారం జాతర సమయంలో అమ్మవార్ల సాక్షి గా ములుగు జిల్లా చేస్తానని హామీ ఇచ్చి ప్రస్తు తం మాట తప్పారని ఆరోపించారు. ప్రజల్లో లేనిపోని ఆశలు రేపి నేడు వీలు కాదు అంటూ సున్నితంగా అంశాన్ని పక్కకబెట్టడం సరికాద న్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నియోజకవర్గం నుంచి వెళ్తున్న గోదావరి జలాలు, ఇసుక సంపదను అడుగుకూడా కదలనివ్వబోమని హెచ్చరించారు. టీఆర్ఎస్ జెడ్పీఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్మాట్లాడుతూ అన్ని రకాలుగా అర్హతలు ఉన్నా ములుగును జిల్లా చేయకపోవడం సరికాదన్నారు. ప్రాంత ప్రజల మనోభావాల ను సీఎం కేసీఆర్ గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజకీయ జేఏసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి, టీడీపీ, టీఆర్ఎస్ మండల పార్టీ ల అధ్యక్షులు పల్లె జయపాల్‌రెడ్డి, గట్టు మహేందర్, పీఏసీఎస్ చైర్మన్ గుగులోతు కిషన్, నాయకులు కుమార్, భిక్షపతి, చంద్రమౌళి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు -
ములుగు జిల్లా కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ములుగు: ములుగును జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. అఖిల పక్షాల ఆధ్వర్యంలో గతరెండు రోజులుగా ములుగులో రాస్తారోకోలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా సాధన సమితి అధ్యక్షుడు మంజల బిక్షపతి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆగని ఆందోళనలు
వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలకు తోడు పక్క జిల్లాల మండలాలను కలిపి ఐదు జిల్లాలుగా ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినా జిల్లాలో ఇంకా ఆందోళనలు ఆగడం లేదు. ములుగును జిల్లాగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో అక్కడి వివిధ సంఘాలు, పార్టీల నాయకులు బుధవారం భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించడంతో పాటు మేడారంలో సమ్మక్క తల్లి గద్దె వద్ద వినతిపత్రం సమర్పించారు. ఇక స్టేషన్ ఘన్పూర్, చిల్పూరు, జఫర్‌గఢ్ మండలాలను జనగామ జిల్లాలో చేర్చాలన్న ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ స్థానికులు బంద్, వంటావార్పుతో నిరసన తెలిపారు. అలాగే, గూడూరు మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం నర్సంపేటలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. -
నేడు ములుగు బంద్
ములుగు : ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా సాధన సమితి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతి, నాయకులు మాట్లాడారు. ములుగు జిల్లా కాకుంటే మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఆయా పార్టీల నాయకులు వేముల భిక్షపతి, చింతలపూడి నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, స్వామి, నూనె శ్రీనివాస్, మహేందర్, పైడిమల్ల శత్రజ్ఞుడు, చెట్టబోయిన సారంగం, వెంకట్, గుగులోతు సమ్మయ్య, కనకం దేవదాసు, హరి, లియాఖత్‌అలీ పాల్గొన్నారు. కాగా మంగళవారం జరిగే ములుగు బంద్‌కు టీడీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సీతక్క ఓ ప్రకటనలో తెలిపారు. -
సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి
హన్మకొండ అర్బన్ : ఆదివాసీ ప్రాంతాల తో ములుగు జిల్లా కేంద్రంగా సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ కాకతీయ కళాపీఠం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో డీఆర్వోకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు, వనరుల విభజనకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ప్రజా సంఘాలు మే«ధావులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో పీఠం వ్యవస్థాపక అ««దl్యక్షులు శ్రీధర్‌రాజు, కొమురం ప్రభాకర్, చందా మహేష్, తదితరులు ఉన్నారు. -
ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళన
ములుగు : ములుగు డివిజన్‌ను సమ్మక్క, సారల మ్మ పేరిట జిల్లా చేయాలని కోరుతూ అఖిల పక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శని వారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా నాయకులు స్థానిక జాతీయ 163 రహదారిపై టైర్లు దహనం చేసి, ధర్నా, రాస్తారోకో, మానవహారం చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్సై మల్లేశ్‌యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతిపజేశారు. అనంతరం అఖిలపక్షం, జిల్లా సాధన సమితి అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, ముంజాల భిక్షపతిగౌడ్, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, బీజే పీ మండల అధ్యక్షుడు బాణాల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల భిక్షపతి మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ములుగును మేడారం సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయాలు సేకరించకుండా ఇష్టం వచ్చినట్లు జిల్లాలను విభజిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోమన్నారు. ములుగును కాదని భూపాలపల్లిని జిల్లా చేసినట్లయితే ములుగును అగ్ని గుండంగా మారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ములుగు జిల్లా కాకుంటే అందుకు మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌లు పూర్తి బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో కుల సంఘాల నాయకుల జేఏసీ చైర్మన్ గండి కుమార్, టీడీపీ జిల్లా కార్యదర్శి ముసినేపల్లి కుమార్, నాయకులు కారుపోతుల యాదగిరి, కోగిల రాంబాబు, బొమ్మకంటి రమేశ్, వంగ రవియాదవ్, శత్రజ్ఞుడు, కనకం దేవదాస్, కోరె రవియాదవ్, సంపత్, ఎల్కతుర్తి శ్రీహరి, మునీంఖాన్, రవిపాల్, బాబాఖాన్ పాల్గొన్నారు. -
ములుగు జిల్లా సాధనకు నిరవధిక నిరాహార దీక్ష
ములుగు : ములుగును జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాస్ మండల కేంద్రంలోని గాంధీచౌక్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల బిక్షపతి పూల మాల వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్, బిక్షపతి మాట్లాడుతూ జిల్లా సాధనకు ప్రాణాలను లెక్కచేయకుండా దీక్షకు కూర్చోవడం అభినందనీయమన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సమ్మక్క–సారలమ్మ గిరిజన జిల్లా ప్రకటించాలని కోరారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీక్ష విరమించేది లేదని శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, నాయకులు దూడబోయిన శ్రీనివాస్, బాబాఖాన్, గుండెమీది వెంకటేశ్వర్లు, దేవదాసు, శ్యాం, ప్రవీణ్, హరి, బాబి, షర్పోద్దీన్, అజయ్, రవిపాల్, వంగ రవియాదవ్ పాల్గొన్నారు. -
‘ములుగు’ను పరిగణనలోకి తీసుకోవాలి
సీఎస్ రాజీవ్‌శర్మకు మంత్రి చందూలాల్ వినతి ములుగు : నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ములుగు జిల్లా అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు వినతిపత్రం అందించారు. గురువారం హైద్రాబాద్‌లోని సీఎస్ కార్యాలయంలో ఆయనను కలిసి ములుగు జిల్లా మ్యాప్‌ను వివరించారు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాలు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. ములుగును సమ్మక్క–సారలమ్మ దేవతల పేరిట జిల్లా కేంద్రంగా చేయాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. గిరిజన ఆదివాసీల మనోభావాలకు అనుగుణంగా ములుగు, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, భద్రాచలం నియోజకవర్గాల్లోని 21 మండలాలను కలుపుతూ ములుగు కే ంద్రంగా జిల్లాగా చేస్తే ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. త్వరలో కేసీఆర్‌కు కూడా వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు బండారి మోహన్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.