
సాత్విక (ఫైల్)
సాక్షి, ములుగు: చదివేందుకు డబ్బుల్లేవనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేశ్–కవిత దంపతుల కుమార్తె సాత్విక (18)కు ఇంటర్ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సీటు వచ్చింది. తల్లిదండ్రులకు డబ్బులు కట్టే స్థోమత లేకపోవడంతో స్థానికంగా కాలేజీల్లో చేర్పించాలని యోచిస్తున్నారు.
మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి గడ్డి మందు తాగడంతో కుటుంబీకులు ములుగు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. తన కూతురు మృతిచెందినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశించిన తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు ఎస్సై తాజొద్దీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అమానుషం: చెరువులో చేపలు పట్టారని బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టి
Comments
Please login to add a commentAdd a comment