money problems
-
‘చేయిచాచి రూ. 500 సాయం అడిగితే రూ. 51 లక్షలు వచ్చాయి’
ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఓ మహిళకు కుంటుంబ పోషణ భారమైంది.. పూట గడవడమే కష్టంగా మారింది.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. తప్పని పరిస్థితుల్లో కొడుకుకు చదువు చెబుతున్న టీచర్‌ను సాయం కోసం అర్థించింది. పిల్లల కడుపు నింపడం కోసం రూ. 500 ఉంటే ఇవ్వాలని కోరింది.. ఊహించని విధంగా ఆమె ఆకౌంట్లోకి రూ. 51లక్షలు వచ్చి చేరాయి. దీంతో ఆశ్చర్యపోయిన మహిళ ఆనందంతో కంటతపడి పెట్టుకుంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన సుభద్ర అనే 46 ఏళ్ల మహిళకు ముగ్గురు కొడుకులు. ఆమె భర్త గత ఆగష్టులో మరణించాడు.. కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి మరణంతో వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మహిళ ఒక్కతే కాయాకష్టం చేసుకొని పిల్లలను సాకుతోంది. చిన్న కొడుకు రిబ్రల్ పాల్సి వ్యాధితో కదల్లేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబం గడవడానికి మరో దారి కనిపించకపోవడంతో రెండు కొడుకు అభిషేక్ చదువుతున్న పాఠశాలలోని హిందీ టీచర్‌ర్ రిగిజా హరికుమార్‌ను కొంత డబ్బు సాయం చేయాలని అడిగింది. తన ముగ్గురు పిల్లల ఆకలి తీర్చేందుకు ఓ 500 రూపాయలు ఉంటే ఇవ్వాలని దీనంగా వేడుకుంది. ఆ కుటుంబం పరిస్థితిని చూసి చలించిన ఉపాధ్యాయురాలు తన వంతు సాయంగా వెయ్యి రూపాయలు అందించింది. చదవండి: సిస్టర్హుడ్.. అత్యంత అవసరమైన బంధం అంతటితో ఆగకుండా సుభద్ర ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబాన్ని దగ్గరుండి పరిశీలించింది. ఈ క్రమంలో ఆ కుటుంబం పుట్టేడు పేదరికంలో మగ్గుతుండటం చూసింది. ఇల్లు సరిగా లేకపోవడం, పిల్లలు తినడానికి కూడా ఏం లేని స్థితిని చూసి వారికోసం ఇంకేమైనా చేయాలని ఆలోచించింది. దీంతో తన పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆదుకోవాలని కోరుతూ.. క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. దాతలు సాయంగా అందించే డబ్బు నేరుగా ఆమె అకౌంట్‌కు బదిలీ అయ్యేలా సుభద్ర బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది. టీచర్ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో రెండు రోజుల్లోనే వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి విరాళంగా రూ. 51 లక్షలు మహిళ బ్యాంక్ ఖాతాలోకి వచ్చాయి. దీంతో టీచర్ గొప్ప మనసును పలువురు అభినందిస్తున్నారు. ఈ విషయంపై ఉపాద్యాయురాలు గిరిజా మాట్లాడుతూ.. ‘వారి గురించి పోస్ట్ చేస్తున్నప్పుడు నా మనస్సులో రెండే ఆలోచనలు ఉన్నాయి. 1. అసంపూర్తిగా ఉన్న వారి ఇంటిని పూర్తిగా నిర్మించి మంచిగా జీవించాలి. 2. ఆ తల్లి తన పిల్లలకు ఆహారం చదువు కోసం ఎవరి ముందు చేయిచాచకూడదు. ఈ రెండింటి గురించే ఆలోచించి ఇలా చేశారు. వచ్చిన డబ్బుని ఇంటికోసం ఉపయోగించి, మిలిన దానిని వారి ఖర్చుల కోసం బ్యాంకులో జమ చేస్తాం. సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు’ అంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. చదవండి: Covid Alert: కరోనా ముప్పు ముగియలేదు.. మళ్లీ మాస్కులేద్దాం -
ఉన్నత చదువుకు డబ్బుల్లేవని ఉసురు తీసుకుంది!
సాక్షి, ములుగు: చదివేందుకు డబ్బుల్లేవనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేశ్–కవిత దంపతుల కుమార్తె సాత్విక (18)కు ఇంటర్ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సీటు వచ్చింది. తల్లిదండ్రులకు డబ్బులు కట్టే స్థోమత లేకపోవడంతో స్థానికంగా కాలేజీల్లో చేర్పించాలని యోచిస్తున్నారు. మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి గడ్డి మందు తాగడంతో కుటుంబీకులు ములుగు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. తన కూతురు మృతిచెందినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశించిన తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు ఎస్సై తాజొద్దీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమానుషం: చెరువులో చేపలు పట్టారని బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టి -
ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చలేక కుమార్తెను..
బొమ్మనహళ్లి : ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తన ఏడేళ్ల కుమార్తెను హత్య చేసి తాను కూడా బలవన్మరణం చెందిన ఘటన బెంగళూరు నగర జిల్లా ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బొమ్మసంద్రలో గురువారం చోటుచేసుకుంది. కోలారుకు చెందిన విజయ్ కుమార్ (37) భార్యతో కలిసి బొమ్మసంద్రలో నివాసం ఉంటున్నాడు. వీరికి కుమార్తె సమీక్ష(7) ఉంది. గురువారం ఉదయం భార్య గార్మెంట్స్‌లో పనికి వెళ్లిన సమయంలో కుమార్తెను గొంతు నులిమి హత్య చేసి తాను కూడా ఉరి వేసుకున్నాడు. సాయంత్రం భార్య వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
దేశవ్యాప్తంగా మళ్లీ నగదు కొరత
-
వేధిస్తున్న నగదు కొరత
సామాజిక పింఛ¯ŒSదారుల పడిగాపులు నాలుగు రోజులకు 43 శాతమే పంపిణీ ఇంకా రూ.20 కోట్ల సొమ్ము కోసం ఎదురుచూపులు ఐదు నెలలైనా వెంటాడుతున్న నోట్ల రద్దు ప్రభావం సమన్వయంలోపంతో చుక్కలు చూపిస్తున్న అధికారులు కాకినాడ సిటీ: నెల ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పేరుతో అందజేస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి నగదు కొరత తప్పడం లేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, అభయహస్తం లబ్ధిదారులు పింఛన్ల సొమ్ము కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 5,09,912 మంది సామాజిక భద్రతా పింఛ¯ŒS లబ్ధిదారులున్నారు. వీరిలో వృద్ధులు 1,97,295 మంది, వితంతువులు 1,93,851, దివ్యాంగులు 64,791, చేనేత 9.085, కల్లుగీత కార్మికులు 3,989 మంది, అభయహస్తం లబ్ధిదారులు 40,271 మంది ఉన్నారు. వీరందరూ ప్రతినెలా వచ్చే పింఛనే ఆధారంగా కాలం వెళ్లదీస్తున్న వారే. చేతిలో చిల్లిగవ్వ లేక ఇక్కట్ల పాలవ్వాల్సిన పరిస్థితి లబ్థిదారులకు ఎదురు కాకుండా నిర్ధేశించిన తేదీలోపు పంపిణీకి ముందస్తు చర్యలు తీసుకోవాలి్సఉంది. జిల్లా ఉన్నతాధికారులు నగదు కొరతపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోపాటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.. జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 5వ తేదీలోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు మండలాల వారీగా ఎంపీడీవోలు బ్యాంకుల నుంచి నగదును విత్‌డ్రా చేసి పంపిణీ ప్రారంభించేవారు. నోట్ల రద్దు తరువాత ఈ కష్టాలు ప్రారంభమయ్యాయి. మండలాల్లో ఎక్కడిక్కడ లబ్ధిదారులు పింఛను సొమ్ము కోసం పంపిణీ కేంద్రాలకు నాలుగు రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతున్నా చేతికి నోట్లు అందడం లేదు. చేతులెత్తేసిన బ్యాంకర్లు... నగదు కొరతతో వినియోగదారుల అవసరాలమేరకు ఏటీఎంలలో ఆయా బ్యాంకు శాఖలు నగదు పెట్టలేని దుస్థితి జిల్లాలో ఉంది. ఈ దశలో సామాజిక భద్రతా పింఛన్ల చెల్లింపులకు ఇవ్వాల్సిన రూ.55 కోట్లు సర్ధుబాటు చేయలేక బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో అధికారులు అన్నవరం దేవస్ధానం, మద్యం దుకాణాలు తదితర మార్గాల ద్వారా వచ్చిన నగదును ఆయా బ్యాంకుల నుంచి మంగళవారం నాటికి సుమారు రూ.35 కోట్ల మేర సర్దుబాటు చేయడంతో 43 శాతం మంది లబ్ధిదారులకు పింఛను సొమ్మును పంపిణీ చేయగలిగారు. ఇంకా బ్యాంకుల నుంచి రూ.20 కోట్లు వరకు రావాల్సి ఉంది. ఈ నగదు విడుదల కావాలంటే మూడు నాలుగు రోజులు పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 11 మండలాలకు ఒక్క రూపాయి విడుదల కాలేదు... జిల్లాలో 64 మండలాల్లో 11 మండలాలకు నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఆత్రేయపురం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, అదేవిధంగా యు.కొత్తపల్లి, కిర్లంపూడి, రంగంపేట, తాళ్ళరేవు, అంబాజీపేట, మల్కిపురం మండలాలకు ఆంధ్రాబ్యాంకు నుంచి విడుదల కావాల్సి ఉంది. పింఛన్ల పంపిణీ గడువు పొడిగించాం... బ్యాంకుల్లో నగదు కొరతతో ఇబ్బంది ఏర్పడింది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా వచ్చే నగదును బ్యాంకుల నుంచి తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. జిల్లాలో పింఛన్ల పంపిణీ గడువును 12వ తేదీ వరకూ పొడిగించాం. అవసరమైతే 15వ తేదీ వరకూ పంపిణీకి గడువు పెంచి లబ్ధిదారులందరికీ పింఛను సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటాం. – ఎస్.మలి్లబాబు, డీఆర్డీఏ పీడీ -
నాన్నా.. అమ్మని నిద్ర లేపు
ఆర్థిక ఇబ్బందులు.. అప్పుల బాధ.. ఓ కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేశాయి. తల్లి, కుమార్తె మృతిచెందగా, తండ్రి మృత్యువుతో పోరాడుతున్నాడు.. జరుగుతున్నదేమిటో అర్థంగాని వారి కుమారుడు అమ్మను కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు. ► అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య ► తల్లీ, కుమార్తె మృతి ► తండ్రికి వెంటిలేటర్‌పై చికిత్స ► ఒంటరిగా మిగిలిన చిన్నారి వర్ధన్ పట్నంబజారు(గుంటూరు): జాగ్రత్తగా ఉండాలి...బాగా చదువుకోవాలి నాన్నా..ఎప్పుడు ఏడవకూడదు...టిఫిన్ తిని నిద్రపో కన్నా...ఆఖరిగా ఆ కన్నతల్లి చెప్పిన మాటలివి...ఉదయాన్నే ఊరికి వెళ్దామని..అమ్మ చెప్పిన మాటలు...ఇంకా ఆ పసిమనసులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.. ఉదయాన్నే నిద్రలేచిన కుమారుడు..... అమ్మా... ఊరికి వెళ్దామన్నావు... త్వరగా నిద్రలేమ్మా.. నాన్నా.. నువై్వనా... అమ్మని.. అక్కని నిద్రలేపు.. అందుకే కదా...స్కూల్‌కు వెళ్లకుండా ఉన్నాను..అని చిన్నారి వర్ధన్ అమ్మ మృతదేహం వద్ద మాట్లాడిన మాటలివి. అంకుల్..నాన్న బాత్రూమ్లో కింద పడి కొట్టుకుంటున్నారు..అమ్మ..అక్కా..నిద్ర లేవటంలేదు...ఒక్కసారి మీరు రండి... అభంశుభం తెలియని వయస్సులో ఒక చిన్నారికి వచ్చిన కష్టం ఇదీ... తల్లి, అక్కా మరణించారన్న విషయం కూడా తెలియని వయస్సు...తండ్రి అపస్మారక స్థితిలో ఉన్నాడని గ్రహించలేని చిన్నారి..కానరాని లోకాలకు వెళ్లిన కన్నతల్లి..తోడబుట్టిన అక్కా ఇంకా నిద్రపోతున్నారనే అనుకుంటున్నాడు... తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు.... తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మట్టుపల్లి మురళీమోహన్ కుటుంబం ఉంది. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలు భరించలేక మురళీమోహన్ భార్య హరిత (33) తనువు చాలించాలని భావించింది. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోయాక కూల్‌డ్రింక్‌లో పురుగులు మందు కలిపి తన కుమార్తె వర్షిణి (13)కి తాగించి, హరిత కూడా తాగింది. రాత్రి అందరితో కలిసి భోజనం చేసి కుమారుడితో ముచ్చటించిన ఆమె తెల్లవారే సరికి కుమార్తెతో సహా మృత్యు ఒడిలోకి చేరింది. నెహ్రూనగర్‌లో నివాసం ఉండే మటుపల్లి మురళీమోహన్ క్లాత్ మార్కెట్లో వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో పూర్తిగా నష్టాలు రావటంతో...మురళీమోహన్ తల్లిదండ్రులు, బంధువులు ఒకసారి అప్పులు తీర్చారని చెబుతున్నారు. అయితే వ్యాపారాలు పూర్తిగా మం దగించటం.. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుం బంలో కల్లోల పరిస్థితులను తెచ్చాయి. ఒక్కసారిగా జరిగిన హఠాత్ పరిణామాన్ని చూసి తట్టుకోలేని..మురళీమోహన్ కుమారుడి ఎదుటే..బాత్రూమ్లోకి వెళ్లి పురుగుల మందు తాగడంతో పాటు, నరాలు తెగేలా..చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొన ఊపిరితో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన నగరవాసుల్లో విషాదం నింపింది. స్పందించని 108... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మురళీమోహన్ బాత్రూమ్లో కిందపడి కొట్టుకుంటున్న సమయంలో ఇంటి యజమానులు మూడు సార్లు 108కు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. అయితే ఎంతసేపటికి స్పందించలేదని యజమానులు చెబుతున్నారు. ఆఖరికి బంధువులు వచ్చిన తరువాత వారి వాహనాల్లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈస్ట్ డీఎస్పీ జేవీ సంతోష్, కొత్తపేట ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించటంతో పాటు, పురుగల మందు కలిపి ఉన్న కూల్‌డ్రింక్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనాథగా మిగిలిన వర్ధన్... నగరంలోని మాంటిస్సోరి పాఠశాలతో వర్షిణి 7వ తరగతి చదువుతుండగా..వర్ధన్ 2వ తరగతి చదువుతున్నాడు. ఊహించని పరిణామం..ఏ జరుగుతుందో తెలియక..పెద్ద ఎత్తున పోలీసు జీపులు..అంబులెన్స్ హడావుడితో . అమ్మా..నాన్నా..అక్కా ఏరంటూ..ఆ చిన్నారి అడుగుతున్న తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. జరిగిన సంఘటన గురించి తెలియని వర్ధన్..బంధువులు ఎవరూ ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. నిత్యం అమ్మతోనే ఆటలాడుకునే వర్ధన్ అమ్మ దూరమటంతో అనాథలా మిగిలిపోయాడు. -
ఖజానా ఖాళీ
ఎక్కడిబిల్లులు అక్కడే కోట్ల లావాదేవీలకు బ్రేక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు నిల్ మధ్యాహ్న భోజనానికి డబ్బుల్లేవు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కూ దిక్కులేదు జీతాల వరకు సర్ధుబాటు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎక్కడ బిల్లులు అక్కడే నిలిచిపోయాయి. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, పంచాయతీ రాజ్, ఆర్అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల పనులకు సంబంధించిన బిల్లులకు బ్రేక్ పడింది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో కేవలం జీతాలు, పింఛన్లకు మాత్రమే సర్ధుబాటు చేస్తున్నారు. మిగిలిన అన్ని బిల్లులూ బ్యాంకుల నుంచి వెనక్కు తిరిగి వచ్చేస్తున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడలోని జిల్లా ఖజానా అధికారి కార్యాలయం నుంచి ప్రతి నెలా సుమారు 200 విభాగాలకు వందల కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతాయి. కానీ గత నెలాఖరు నుంచి జిల్లాలో అన్ని రకాల బిల్లులు పాస్ కాక విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు, పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు వివాహ, కుటుంబ ఖర్చుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్న రుణాలు, మధ్యాహ్న భోజనం, మెడికల్ రీ ఇంబర్స్మెంట్...ఇలా దాదాపు అన్ని బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. జీతాల బిల్లులకు మాత్రమే గ్రీ¯ŒS సిగ్నల్... ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం జీతాల బిల్లులు మాత్రమే జిల్లాలో క్లియర్ చేస్తున్నారు. అది కూడా ఈ నెల (జనవరి) 21వ తేదీ నుంచి 30 తేదీ వరకు జీతాలతో సహా ఏ ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదు. పెద్ద నోట్లు రద్దు అనంతరం సాంకేతికంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ఖజానా శాఖలో ఎస్టీఓల పా¯ŒS నంబర్లు తప్పని సరిచేశారు. సొంత పా¯ŒS నంబర్లు ఇవ్వడం వల్ల తమకు ఐటి శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని గత వారం ఖజానా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి గతంలో మాదిరిగానే బిల్లులు మంజూరు చేయవచ్చునని, ఎస్టీఓల పా¯ŒS నంబర్లు అవసరం లేదని మంగళవారం రాత్రి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.అలాగే ఖజానా నుంచి జీతాలు బిల్లులు సర్థుబాటు చేయాలనే ఆదేశాలు కూడా రావడంతో బుధవారం ఒకటో తేదీకి జీతాలు, పింఛ¯ŒSదారులకు ఇబ్బందులు తొలగిపోయినట్టే. సుమారు 45 వేల మంది ఉద్యోగులకు జీతాలుగా రూ.191 కోట్లు, 40 వేల మంది పెన్షనర్లకు రూ.87 కోట్లు చెల్లింపులకు మార్గం సుగమమయింది. విద్యార్థుల ఉపకార వేతనాల మాటేమిటి...? మిగిలిన బిల్లులు ఎప్పటికి అనుమతిస్తారనే పరిస్థితి అర్థంకాక సంబంధిత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సుమారు లక్షన్నర మంది (బీసీ 60వేలు, ఎస్సీ 35వేలు, ఈబీసీ 25వేలు, ఎస్టీ 15వేలు నుంచి 20వేలు, మైనార్టీలు ఏడెనిమిది వేలు, వికలాంగులు ఐదువేలు)విద్యార్థులు ఉపకార వేతనాలు అందక నానా పాట్లుపడుతున్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు నెలనెలా ఠంఛ¯ŒSగా ఉపకారవేతనాలు (ఎంటీఎఫ్) ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ రెండు నెలలైనా ఉపకారవేతనాలు ఇవ్వలేని పరిస్థితి. రీ ఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూష¯ŒS ఫీజు (ఆర్టీఎఫ్)కు సంబంధించిన బిల్లులు కూడా నిలిచిపోయాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీ ఇంబర్స్మెంట్ అన్ని బిల్లులు కలిపి సుమారు రూ.35 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. జిల్లాలో కేవలం ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌పై ఆధారపడి నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీల పరిస్థితి అయోమయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 800 ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆర్టీఎఫ్ బిల్లులు మంజూరుకాక బ్యాంకుల నుంచి తిరిగి వచ్చేస్తుండటంతో నరకయాతన ఎదుర్కొంటున్నాయి. జీపీఎఫ్కూ ఇబ్బందులే... విద్యార్థుల ఫీజులతోపాటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) నుంచి కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులు రుణాలకు దరఖాస్తు చేసుకుని రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. జీపీఎఫ్‌కు సంబంధించి రూ.5 కోట్లు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం బిల్లు రూ.3 కోట్లు, మున్సిపాలిటీలకు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు తదితర శాఖలకు సం బంధించి రూ.380 కోట్లు (చెక్కుల రూపంలో) బిల్లులు ఖ జానా శాఖలో పేరుకుపోయాయి. మెడికల్ రీ యిం బర్స్మెంట్ రూ.50 లక్షలు, సరెండర్ లీవ్స్ రూ.8 కో ట్లు, రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రూ.3 కోట్లు మేర బిల్లుల కోసం గత నెల నుంచి ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా... బిల్లులు ఆపమని ప్రభు త్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పై నుంచి ఏ బిల్లులకు అనుమతి ఇవ్వమంటే వాటికే సర్థుబాటు చేస్తున్నాం. ఫ్రీజింగ్ అనే విషయం మా దృష్టికి రాలేదు.అనుమతి రాగానే మిగిలిన బిల్లులు కూడా క్లియర్ చేస్తాం. – పి.భోగారావు, జిల్లా ఖజానా అధికారి, కాకినాడ. -
అచ్చే దిన్.. ఎక్కడ?
జగిత్యాల: పెద్ద నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో అచ్చే దిన్ వస్తాయని ప్రధానమంత్రి మోదీ చెప్పినప్పటికీ అలాంటిదేమీ కనిపించడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది. ఏటీఎంలు పనిచేయక, డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుకు డబ్బులు వచ్చాయని తెలియగానే మల్లాపూర్ ప్రజలు ఆ బ్యాంకు ముందు బారులు తీరారు. ఆ దృశ్యం చూస్తుంటే నగదు కొరత ఎంత ఉందో అర్థమవుతోంది. మహిళలు, రైతులు ఎక్కువగా క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. -
పెద్దనోట్ల రద్దుపై శ్వేతపత్రం విడుదలచేయాలి
పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు అమలాపురం టౌన్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత నల్ల ధనాన్ని వెనక్కి తీసుకోగలిగింది...? తదితర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు డిమాండు చేశారు. నోట్ల రద్దు తర్వాత ప్రజల నగదు కష్టనష్టాలకు నిరసనగా ఈనెల 6 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ పార్టీ పలు రూపాల్లో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరినా ఇవ్వకుండా ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందన్నారు. ప్రజల ఇబ్బందులకు నిరసనగా కాంగ్రెస్ ఉద్యమం మాదిరిగా పలు దశల్లో పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టనుందన్నారు. ఈ నెల 6,7 తేదీల్లో ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఘెరావ్‌లు, ముట్టడి, ధర్నాలు వంటి నిరసనలు చేపట్టనున్నామన్నారు. అలాగే 9న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఖాళీ కంచాల ప్రదర్శనతో నిరసన తెలపనున్నారని వివరించారు. విత్ డ్రాలపై ఉన్న పరిమితులు తక్షణమే ఎత్తి వేయాలని రుద్రరాజు డిమాండు చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు, పీసీసీ కార్యదర్శి కల్వకొలను తాతాజీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నోట్ల కష్ట నష్టాలకు చంద్రబాబే బాధ్యత వహించాలి
వృద్ధాప్య పింఛన్లను ఇళ్లకు వెళ్లి నగదు రూపంలోనే చెల్లించాలి చంద్రన్న కానుక... అదో అవినీతి ప్యాకేజీ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు అమలాపురం టౌన్ : పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి నేనే లేఖ రాశానని, అది నా సూచనేనని పదే పదే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు నోట్ల రద్దుతో ఎదురవుతున్న ప్రజల కష్ట నష్టాలకు కూడా ఆయనే బాధ్యత వహించి ఆ సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. అమలాపురంలోని నల్లా గార్డె¯ŒSకు చెందిన టీడీపీ నాయకుడు నూకల షణ్ముఖరావు నివాసంలో కన్నబాబు పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయిలతో కలిసి గురువారం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన కమిటీకి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న చంద్రబాబు మన రాష్ట్రంలో నోట్ల రద్దు అనంతరం తలెత్తిన సమస్యలను పరిష్కరించటంలో పూర్తిగా విఫలమయ్యారని కన్నబాబు విమర్శించారు. చంద్రన్న కానుక... అదో అవినీతి ప్యాకేజీనని కన్నబాబు అభివర్ణించారు. చంద్రన్న పేరుతో ప్రజలకు కానుకలా లేదని.. అది చంద్రన్నకే కానుకగా ఉందన్నారు. సరుకుల సంఖ్య...ధరలు పెరగలేదు... గత ఏడాది చంద్రన్న కానుకల కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయిస్తే..అదే ఈ ఏడాది రూ.416 కోట్లు కేటాయించటంలోనే అవినీతి దాగి ఉందని ఆరోపించారు. పండుటాకులను ప్రభుత్వం బ్యాంకుల చుట్టూ తిప్పటం ఎంత వరకూ సమంజమని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న దాదాపు అయిదున్నర లక్షల సామాజిక పింఛన్లు ఈ నెల 23వ తేదీ వచ్చినా ఇంకా 50 శాతం మందికి కూడా పింఛ¯ŒS అందలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో వేయటం... అవి విత్ డ్రా ఆంక్షలతో అవసరాలకు అందకపోవటంతో జిల్లా రైతులునానా కష్టాలు పడుతున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు నూకల... అమలాపురానికి చెందిన టీడీపీ జిల్లా కమిటీ సభ్యుడు నూకల షణ్ముఖరావుతో పాటు దాదాపు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి సమక్షంలో స్థానిక నల్లా గార్డె¯ŒSలో గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి పార్టీ ముఖ్య నాయకులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజవర్గాల కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మిండగుదిటి మోహన్, బొమ్మి ఇజ్రాయిల్, దంగేటి రాంబాబు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 9వ వార్డులో జరిగిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో కన్నబాబు, రాజా పాల్గొన్నారు. -
ధనలోపం.. జనక్రోధం..
కష్టార్జితం చేతికి రాక కన్నెర్ర బ్యాంకుల వద్ద నిరసన కీలలు అమలాపురం టౌ¯ŒS : బ్యాంకుల్లో ఇప్పుడు కరెన్సీ నోట్ల రెపరెపల కన్నా.. కడుపు మండిన వారి నోటి వెంట ఆక్రోశపు మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. తాము దాచుకున్న డబ్బులను అవసరాలకు తీసుకునేందుకు లేకపోవడంతో బ్యాంకులు ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో, తహసీల్దార్, పోలీసు స్టేషన్ల ముందు ధర్నాలు చేసేవారు. ఇప్పుడు నోట్ల రద్దుతో ఎదురవుతున్న సమస్యలతో బ్యాంకుల ముందే ధర్నాలు చేసే పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. నగదు కోసం పడిగాపులు పడుతున్న వారు బ్యాంక్ అధికారులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. వేచి, వేచి, విసిగి, వేసారి.. జిల్లాలో గత 40 రోజులుగా నగదు బాధలను ప్రజలను ఎదుర్కొంటున్నప్పటికీ గత రెండు వారాలుగా బ్యాంకుల ముందు నగ దు కోసం పడిగాపులు, నో క్యాష్ బోర్డులు, పగలంతా బ్యాంకుల వద్దే సమయం కేటాయింపు వంటి సమస్యలతో విసిగి వేసారిన జనం అక్కడే నిరసన బాట పడుతున్నారు. జిల్లాలో గురువారం పలు చోట్ల బ్యాంకుల ముందు జరిగిన ధర్నాలే ఇందుకు సాక్ష్యం. పది రోజుల కిందట ఉప్పలగుప్తం మండలం మునిపల్లిలో ప్రజలు ఎస్బీఐ శాఖ అద్దాలు పగలగొట్టారు. బ్యాంక్‌ను ముట్టడించి బైఠాయించారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంక ఆంధ్రా బ్యాంక్ వద్ద ధర్నా చేశారు. ఇలా జిల్లాలో ప్రతి రోజూ పలు బ్యాంకులు జనాగ్రహాన్ని ఎదుర్కోక తప్పటం లేదు. ఒక్క గురువారం రోజే రాజమహేంద్రవరం, కాకినాడ, కడియం మండలం జేగురుపాడు, కొత్తపేట మండలం అవిడి బ్యాంకుల వద్ద నిరసలు, ఆందోళనలు జరిగాయి. జేగురుపాడు కెనరా బ్యాంక్ ఎదుట ప్రజలు వంటా వార్పు ఏర్పాటు చేసి రోజంతా తామంతా బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్నా నగదు ఉండటంలేదన్న నిరసనను వినూత్నంగా చాటారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనతో బ్యాంకు అధికారులు దిగివచ్చి సమస్యను కొంతలో కొంత పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కొత్తపేట మండలం అవిడి ఎస్బీఐపై రైతులు కన్నెర్ర చేశారు. ముందు రోజు 150 మంది రైతులకు నగదు విత్‌డ్రాకు టోకెన్లు ఇచ్చారు. తీరా బ్యాంక్‌కు వస్తే నో క్యాష్ బోర్డులు చూసి రైతులు కదం తొక్కారు. ధర్నాతో బ్యాంకు దద్దరిల్లేలా చేశారు. చివరకు తహసీల్దార్ రంగ ప్రవేశంలో సమస్య కొంత సద్దుమణిగింది. ఇక కాకినాడ సాంబమూర్తినగర్లోని ఎస్బీఐ వద్ద, రాజమహేంద్రవరం ఎస్బీఐ మెయి¯ŒS బ్రాంచి వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు కూడా పరాకాష్టకు చేరుకున్న ప్రజాగ్రహానికి అద్దం పట్టాయి. జిల్లాలో బ్యాంకుల వద్ద మొదలైన ఈ జనాగ్రహం ఇలానే కొనసాగితే పరిస్థితి పెడదోవ పట్టే అవకాశం ఉంది. బ్యాంకులపై దాడి చేసే పరిస్థితి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంక్‌ల అధికారులు çస్పందిస్తేనే ఈ ధర్నాలు, నిరసనలకు తెర పడే అవకాశం ఉంటుంది. -
కూలీ బతుకులపై ‘పెద్ద’ దెబ్బ
రోడ్డున పడిన రెండు లక్షల మంది కుదేలైన శ్రామిక జీవనం వలసబాటలో పలు గ్రామాలు నల్లధనమంటే తెలియదు...నల్ల కుబేరులంటేఅంతకన్నా తెలియదు...పెద్ద నోటు ఎందుకు రద్దు చేశారో... కూలీ డబ్బులు ఎందుకివ్వడం లేదో... పనిలోకి రావొద్దని ఎందుకంటున్నారో... ఉన్న ఉపాధి కాస్తా దూరమవుతున్నదెందుకో... పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిపోడానికి కారణాలేమిటో... ఆ బడుగు మనసుల్లో ఎన్నో ప్రశ్నలు... పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా ఎన్నాళ్లిలా... ఎన్నేళ్లిలా...దిన‘ధన’గండం... ఇదీ.. ‘తూర్పు’ శ్రామిక శక్తి.. భవన నిర్మాణ కార్మికులు లక్షా 10 వేల మంది ఒక్క రవాణా రంగంపై ఆధారపడి 75 వేల మంది ఆక్వా రంగంపై 35 వేల మంది హమాలీలు 30 వేల మంది జీడిపిక్కల ఫ్యాక్టరీల్లో 15 వేల మంది కాకినాడ పోర్టులో బోటు వర్కర్లు 10 వేల మంది 62 రూరల్ మండలాల్లోని 1,075 పంచాయ తీల పరిధిలో ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులున్నవారు 7,82,847 మంది నమోదైన 44,538 కూలీల గ్రూపుల్లో ఉన్న కూలీలు 7,54,230 మంది ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీలో పని పొందుతున్నవారు 30 వేల మంది మాత్రమే సాక్షి ప్రతినిధి, కాకినాడ : రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల బతుకుల్లో పెద్ద నోటు రద్దు పెద్ద దెబ్బే వేసింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి 40 రోజులు దాటుతున్నా వీరి జీవన విధానం కుదుటపడడం లేదు. ప్రధానంగా అసంఘటిత రంగంపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు పనుల్లేక నానా యాతనా పడుతున్నారు. తాపీ మేస్రీ్తలు, హమాలీలు, ఆక్వా, రవాణా, భవన నిర్మాణం, జీడి పిక్కలు, పోర్టు వర్కర్స్.. ఇలా జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న రెండు లక్షల మంది కార్మికులు పనులు లేక పొట్ట గడవని దీనావస్థలోకి వెళ్లిపోతున్నారు. జిల్లాలో నిర్మాణ రంగం దాదాపుగా చతికిలపడింది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు పొద్దస్తమానం కష్టపడితే ఉపాధికి ఢోకా ఉండేది కాదు. ఇప్పుడు కష్టపడదామంటే అసలు పనే ఉండటం లేదు. బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో యజమానులు నిర్మాణ రంగాన్ని దాదాపుగా నిలిపివేశారు. నిర్మాణ రంగంలో నిర్వాహకులకు బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉన్నప్పటికీ కరెన్సీ మారకం లేకపోవడంతో కిరాణా, ఆరోగ్యం వంటి వాటికి మాత్రమే పరిమితమవుతున్నారు.మరీ అత్యవసరమైన ఇంటి పనులు మాత్రమే చేయించుకుని మిగిలిన నిర్మాణ పనులను వాయిదా వేసుకుంటున్నారు. నిర్మాణ రంగం కుదేలు... ఈ పరిణామం నిర్మాణ రంగంలో ప్రత్యక్షంగా ఆధారపడ్డ తాపీ మేస్రీ్తలు, స్లాబ్‌లు వేసే జట్టు కూలీలు పనులు లేక మరో పని చేయలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజంతా కష్టపడితే నాలుగైదు వందలు చేతికి వచ్చే పరిస్థితి ఇప్పుడు దూరమైపోయింది. అలవాటు లేకున్నా గత్యంతరం లేక వ్యవసాయ పనుల్లోకి వెళుతున్నా అక్కడ కూడా రైతులు కూలి డబ్బులు వారానికి ఒకసారి కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు లక్షా 10వేల మంది వరకు ఉన్నారు. ఒక్క రవాణా రంగంపై ఆధారపడి జిల్లాలో 75 వేల మంది కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. ఆక్వా రంగంపై 35 వేల మంది, హామాలీలు 30వేల మంది, జీడిపిక్కల ఫ్యాక్టరీలలో 15 వేల మంది, కాకినాడ పోర్టులో 10వేల మంది బోటు వర్క్‌ర్స్ పనిచేస్తున్నారు. దాదాపు వీరందరి పరిస్థితీ అగమ్యగోచరంగా మారింది. నిత్యం పని ఉండే ఈ రంగాల్లో ప్రస్తుతం కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కలేక పనులను కట్టేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పనులు చేపడదామన్నా సొమ్ము సర్థుబాటు చేయలేక వదిలేయాల్సి వచ్చిందని భవన నిర్మాణ యజమాని పి వెంకటనారాయణ చెప్పుకొచ్చారు. ఉపాధి కూలీల దీనావస్థ ఇలా... వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఈ రకంగా ఉంటే ఉపాధి హామీ పథకంలో పనిచేస్తోన్న కూలీల దీనావస్థ మరో రకంగా ఉంది. అసలే ఉపాధి పనులకు అ¯ŒS సీజ¯ŒS. ఇందుకు కరెన్సీ కష్టాలు కూడా తోడవడంతో మొత్తం ఉపాధి కూలీలకు వేతనాలు అందక లబోదిబోమంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు సుమారు 30 వేల మందికి మాత్రమే ఉపాధి హామీ పనులు దొరుకుతున్నాయి. వ్యవసాయ సీజ¯ŒS ప్రారంభం కావడంతో ఈ పనులు మరింత మందగించాయి. ఉపాధి హామీలో పనిచేసిన వారికి నగదు పోస్టాఫీస్‌లు, బ్యాంకుల్లో జమవుతున్నా చేతికి అందకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జమ సరే... జిల్లాలోని 62 రూరల్ మండలాల్లో 1,075 పంచాయతీల పరిధిలో 7,82,847 మందికి జాబ్ కార్డులున్నాయి. నమోదైన 44,538 కూలీల గ్రూపుల్లో 7,54,230 మంది కూలీలున్నారు. కానీ ప్రస్తుతం జిల్లా అంతటా కలిపితే 30 వేల మందికి మాత్రమే ఉపాధి హామీలో పని లభిస్తోంది. చేసిన పనికి కూడా చేతికి సొమ్ము దక్కని పరిస్థితి. గత నవంబరు నెలనే తీసుకుంటే మైదాన ప్రాంతంలో బ్యాంకులు, ఏజెన్సీ ప్రాంతంలో పోస్టు ఆఫీస్‌లలో ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు సుమారు రూ.3 కోట్లు నగదు జమయింది.అదే డిసెంబరు నెలకు వచ్చేసరికి రెండు కోట్ల వరకు ఉంటుందని జాతీయ ఉపాధి హామీ పథక నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాంకులు, పోస్టు ఆఫీస్‌లో సొమ్ములు జమయినా చేతికి మాత్రం సొమ్ములు రావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏజెన్సీలో ఉపాధి పనులు లేక పలు మండలాల్లో గిరిజనులు ఖాళీ చేసి వలసలు కూడా వెళ్లిపోతున్నారు. రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో 3లక్షల 50 వేల మంది జనాభా ఉంటే 1లక్ష11 వేల285 మందికి జాబ్ కార్డులున్నాయి. ఈ కార్డులున్న వారిలో గిరిజనులు 78 వేల మంది వరకు ఉంటారు. పనులు చేసి సొమ్ముల కోసం వారాల తరబడి బ్రాంచి పోస్టు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదంటున్నారు. మరోపక్క ఉపాధి పనులు లేక రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి, చింతూరు, గంగవరం తదితర మండలాల నుంచి గిరిజనులు పనులు కోసం వలస పోతున్నారు. గంగవరం మండలం లక్కొండ, జడేరు, మర్రిపాలెం పంచాయతీలో 20 గ్రామాల నుంచి పనులు కోసం నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో సరుగుడు, చెన్నైలో జామాయిల్ తోటలు నరికేందుకు వలస పోతున్నారు. కార్మికులు, కూలీలపై పెద్ద నోట్లు రద్దు గట్టి దెబ్బతీసింది. పనులు లేక పస్తులుంటున్నాం పెద్ద నోట్ల రద్దుతో భవన నిర్మాణ పనులు చేసుకునే మాలాంటి వారి ఉపాధికి ఇబ్బందిగా మారింది. డబ్బులు లేవని మేస్రీ్తలు పనులు చెప్పడం లేదు. ఒకవేళ పని ఉన్నా డబ్బులు ఇచ్చే స్థితిలో మేస్రీ్తలు లేరు. దీంతో గత నెల రోజులగా ఒక పూట పనికి వెళ్తే వారం రోజులు ఇంటి వద్ద ఉంటున్నాం. డబ్బులు లేక కనీసం బియ్యం, కూరలు వంటివి తెచ్చుకోలేక పస్తులుండే పరిస్థితితో బాధపడుతున్నాం. పల్లెల్లో ఉంటున్నాం. బ్యాంకు కార్డుల ద్వారా లావాదేవీలు అంటున్నారు. వీటి వల్ల గ్రామీణులు ఆర్ధిక మోసాలకు లోనయ్యే అవకాశాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకుల ద్వారా ఎక్కువ నగదు ఇస్తేనే తమకు పనులు దొరుకుతాయి. – నున్న భీమశంకరరావు, భవన నిర్మాణ కార్మికుడు, కరప కార్మికుల జీవితాలతో ఆటలు పెద్దనోట్లు రద్దు చేసి నల్ల కుబేరుల భరతం పడతామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ అసంఘటిత రంగ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. నోట్ల రద్దుతో కార్మికులు ఉపాధి దొరక్క రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడింది. మరో పక్క నగదు రహితం పేరుతో చిరువ్యాపారుల జీవితాలను అథః పాతాళానికి తొక్కే చర్యలు చేపట్టారు. – ఎం.వేణుగోపాల్, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నెల రోజులుగా పనులు లేవు పెద్దనోట్లు రద్దు చేసిన దగ్గర నుంచి గడిచిన నెల రోజులుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నోట్ల రద్దుతో ఏర్పడ్డ సమస్యల కారణంగా యజమానులు నిర్మాణాలను ఆపి వేయడంతో పనులు దొరకడం లేదు. మేస్రి్తలు, కూలీలకు పూటగడవక ఇక్కట్లకు గురవుతున్నారు. – యాతం వెంకటరమణ, తాపీ మేస్త్రి -
సిరులు కురిసే వేళ కన్నీరు
అన్నదాతను కుదిపేస్తున్న కరెన్సీ కల్లోలం ఖరీఫ్ కరుణించిన వేళ.. దెబ్బ తీసిన పెద్ద నోట్ల రద్దు బ్యాంకు ఖాతాలకు జమవుతున్న ధాన్యం సొమ్ములు ఖాతాలో వేల రూపాయలున్నా చేతికి అందని వైనం తీరని పాత అప్పులు కొత్తగా పెట్టుబడి పెట్టలేని దుస్థితి రబీ సాగుపై పెను ప్రభావం నేలతల్లి పంటసిరులు కురిపిస్తున్న వేళ.. ఆ సిరులు చేతికి అందక అన్నదాత కంట కన్నీరు ఒలుకుతోంది. కోత కోసి, కుప్ప నూర్చిన కూలీలకు ఇవ్వాలన్నా.. రెండో పంట రబీకి పెట్టుబడి పెట్టాలన్నా.. అవసరాల మేరకు బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు తీసుకోలేని దైన్యంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్ సాగుకోసం అప్పులు తెచ్చి, పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోతున్నాయి. అటు దాళ్వాకు పెట్టుబడి పెట్టే దారి కానరావడంలేదు. రెండో పంట పనుల్లో ఈపాటికే బిజీగా ఉండాల్సిన వేళ.. బ్యాంకులవద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎదురైంది. పాత పెద్ద నోట్లను రద్దు చేయడం.. కొత్త పెద్ద నోటు రూ.2 వేలను చెలామణీలోకి తేవడం ద్వారా మోదీ ప్రభుత్వం సృష్టించిన కరెన్సీ కల్లోలం.. జిల్లా అన్నదాతలను కుదిపేస్తున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్.. మండపేట : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందిందన్న అన్నదాతల ఆనందాన్ని ప్రస్తుత కరెన్సీ సంక్షోభం ఆవిరి చేస్తోంది. పండిన పంటతో పెద్ద పండగకు సిద్ధమవ్వాల్సిన తరుణంలో పెద్ద నోట్ల రద్దు వారికి పెద్ద కష్టాలనే తెచ్చిపెట్టింది. మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా చేతికి చిల్లిగవ్వ కూడా చిక్కడం లేదు. ప్రతి రోజూ ఇచ్చే రూ.2 వేల కోసం రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి. అటు తొలకరి అప్పులు తీర్చలేక.. దాళ్వాకు కొత్త అప్పులు పుట్టక.. సమయం మించిపోతున్నా ఏరువాక సాగలేక అన్నదాతలు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నెల 15వ తేదీ నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉండగా.. చేతిలో డబ్బులు లేకపోవడంతో దాళ్వా సాగులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెలాఖరు వరకూ నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని దాదాపు 4.2 లక్షల ఎకరాలు, ఏలేరు పరిధిలో సుమారు 35 వేల ఎకరాల్లో రబీ సాగు జరుగుతుంది. తొలకరి కోతల అనంతరం నేల పదునుపై ఉండగానే రైతులు దాళ్వా పనులు చేపడుతుంటారు. మార్చి నెలాఖరు నాటికి గోదావరి నీటిలభ్యతను దృష్టిలో ఉంచుకొని, డిసెంబర్ 15వ తేదీ నాటికి నాట్లు పూర్తి చేసేవారు. కానీ, ఈసారి పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పెట్టుబడులు పెట్టేందుకు రైతులవద్ద డబ్బుల్లేక దాళ్వా పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని మండపేట, అనపర్తి, ఆలమూరు, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో ఖరీఫ్ కోతలు పూర్తయి, దాదాపు 20 రోజులు కావస్తున్నా ఇంకా దాళ్వా పనులు జోరందుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవసరానికి అందని డబ్బులు జిల్లాలోని 2.19 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగు చేయగా, సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. జిల్లావ్యాప్తంగా 275 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది 2.63 లక్షల హెక్టార్లలో 16.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా, 12.22 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుత సీజ¯ŒSలో ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 3.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి మొత్తం రూ.498 కోట్లకుగానూ ఇప్పటివరకూ రూ.410 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేస్తున్నారు. కామ¯ŒS వెరైటీ 75 కేజీల బస్తా ధాన్యానికి రూ.1,102.50 మద్దతు ధర కాగా, జిల్లాలోని పలుచోట్ల మిల్లర్లు దీనికంటే రూ.60 నుంచి రూ.100 వరకూ అధికంగా చెల్లిస్తున్నారు. దీంతో రైతులు నేరుగా మిల్లులకే ధాన్యాన్ని తరలిస్తున్నారు. బ్యాంకుల ద్వారానే చెల్లింపులు జరగాల్సి ఉండటంతో రైతులు తీసుకువచ్చిన ధాన్యానికి మిల్లర్లు చెక్కులు అందిస్తున్నారు. రబీలో ఎకరాకు సాగు ఖర్చు వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం రబీ సాగు కోసం ఎకరాకు రూ.30 వేల వరకూ ఖర్చవుతుంది. సాగు ప్రారంభించిన మొదటి నెల రోజుల్లో ఆయా రూపాల్లో పెట్టుబడులకు రూ.12 వేల వరకూ అవసరమవుతాయని అంచనా. రబీ సాగు వ్యయం ఈ విధంగా ఉంటుంది. దమ్ము, పట్టి లాగడానికి, పారలంక వేయడానికి : రూ.3,000 పంట కోత, నూర్పిడి : రూ.6,000 – రూ.8,000 పురుగు మందులు : రూ.4,500 – రూ.6,000 ఎరువులు : రూ.3,500 – రూ.4,000 ఊడ్పు : రూ.3,500 – రూ.5,000 నారుమడి ఖర్చు : రూ.1,500 విత్తనం ఖరీదు : రూ.900 కలుపు ఖర్చు : రూ.2,000 పెట్టుబడులకు దారేదీ..! జిల్లావ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల మంది రైతులుండగా వీరిలో అధిక శాతం మంది కౌలురైతులే ఉన్నారు. అప్పులు చేసి సాగుకు పెట్టుబడులు పెట్టడం వీరికి పరిపాటి. ఎరువులు, పురుగు మందులను దుకాణాల నుంచి అరువుపై తీసుకుని, సాగు అనంతరం పంట అమ్మగా వచ్చిన సొమ్ములతో అప్పులు తీరుస్తూంటారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో, ఖరీఫ్ ధాన్యం అమ్మగా వచ్చిన సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లోనే జమ కావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కోతలు కోసిన కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో.. కొత్తగా నాట్లు వేసే కూలీలకు సొమ్ములెక్కడ నుంచి తేవాలని ఆవేదన చెందుతున్నారు. ఎరువుల దుకాణాల్లో పాత అప్పులు చెల్లించకపోవడంతో, దాళ్వా సాగుకు ఎరువులు తెచ్చేందుకు అవసరమైన డబ్బులు ఎలా తేవాలని అయోమయానికి గురవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులకు నోట్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో వేలాది రూపాయలు ఖాతాల్లో ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నా రూ.2 వేల నుంచి రూ.4 వేలకు మించి ఇవ్వడం లేదు. ఓపక్క కుటుంబ పోషణ, మరోపక్క రబీ పెట్టుబడులకు ఈ సొమ్ములు చాలక ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పంట చేతికందిందన్న ఆనందాన్ని పెద్ద నోట్ల రద్దు ఆవిరి చేస్తోందని వాపోతున్నారు. పలుచోట్ల బ్యాంకుల్లో సొమ్ములు లేవని చెబుతుండటంతో ధర్నాలకు దిగుతున్నారు. బ్యాంకర్ల తీరును నిరసిస్తూ కపిలేశ్వరపురం మండలం అంగరలో రైతులు, స్థానికులు ఆందోళనకు దిగారు. చివరిలో ఇక్కట్లే.. కాలువల ఆధునికీకరణ పనులు, సాగునీటి లభ్యత దృష్ట్యా మార్చి నెలాఖరుకు రబీ సాగు పూర్తి చేయాలి. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉంది. దమ్ము, నారుమడులు, నాట్లు, ఎరువులు తదితర వాటి కోసం సాగు ప్రారంభంలో రూ.10 వేలు అవసరమవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అంత సొమ్ము చేతిలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత రబీ సాగులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. సాధారణంగా తూర్పు డెల్టాలోని మండపేట, అనపర్తి నియోజకవర్గాల పరిధిలో డిసెంబర్ 15వ తేదీకే నాట్లు పూర్తి చేస్తూంటారు. ఈసారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆయాచోట్ల ఈ నెలాఖరు వరకూ నాట్లు పడే పరిస్థితి ఉండగా, తూర్పు డెల్టాలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య డెల్టా పరిధిలో జనవరి నెలాఖరు వరకూ నాట్లు పడతాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో సాగు చివరిలో నీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్టుబడి పెట్టే దారి లేదు ఆరెకరాలు కౌలుకు చేస్తున్నాను. తొలకరి పంటలో ఎకరానికి 25 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. మొత్తం ధాన్యాన్ని మిల్లుకు తోలితే చెక్కు ఇచ్చారు. బ్యాంకులో వేసి అప్పుడే దాదాపు నెల రోజులవుతోంది. తొలకరి సాగు కోసం రూ.లక్ష వరకూ అప్పు చేశాను. బ్యాంకులోని డబ్బులు వస్తేనే కానీ అప్పు తీరే దారి లేదు. కొత్తగా రబీ సాగు చేయాలన్నా ఆ డబ్బులే దిక్కు. పాత అప్పు తీరిస్తేనే కానీ కొత్తగా అరువుపై ఎరువులు ఇవ్వరు. బ్యాంకుకు వెళ్తూంటే రోజుకు రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు. రోజూ బ్యాంకుల వద్ద పడిగాపులు పడలేకపోతున్నాం. – గుబ్బల శ్రీనివాస్, కౌలు రైతు, మండపేట 15 రోజులుగా ఎదురు చూస్తున్నాను నాలుగు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని కొంత కొనుగోలు కేంద్రాల్లో అమ్మాను. ఆ రెండుచోట్లా ధాన్యం డబ్బు బ్యాంక్ అకౌంట్లలోకి వేస్తామన్నారు. ధాన్యం అమ్మి 15 రోజులైంది. రబీ పనులు మొదలు పెడదామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. బ్యాంకుకు వెళితే రూ.4 వేలు వస్తుందంటున్నారు. – చిక్కం నాగ లక్ష్మణరావు, రైతు, సన్నవిల్లి, ఉప్పలగుప్తం మండలం కూలీలకు డబ్బులివ్వలేకపోతున్నాను నాలుగెకరాల్లో పండించిన ధాన్యాన్ని కమిష¯ŒS ఏజెంటు ద్వారా వారం రోజుల కిందట మిల్లరుకు అమ్మాను. డబ్బులు నా బ్యాంకు అకౌంట్లో వేశారు. ధాన్యం ఒబ్బిడి చేసిన కూలీలకు ఇంకా డబ్బులివ్వాలి. బ్యాంకులకు వెళ్లి డబ్బుల కోసం గంటల తరబడి నిలబడ్డాను. రబీ పనులు మొదలు పెట్టాను. ఆ పనులన్నీ పక్కన పెట్టి బ్యాంకుకు వెళ్లాలి. – కటికదల నాగేశ్వరరావు, రైతు, దేవగుప్తం, అల్లవరం మండలం ధాన్యం అమ్మినా ఆనందం లేదు పదెకరాలు కౌలుకు చేస్తున్నాను. పంట అమ్మగా వచ్చిన సొమ్ముకు చెక్కు ఇవ్వడంతో నగదంతా బ్యాంకు అకౌంట్లోనే జమైపోయింది. తొలకరి పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఇంకా తీర్చలేదు. దాళ్వాకు ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలో తెలీడం లేదు. – బొంతు సత్యనారాయణ, కౌలు రైతు, చెల్లూరు రూ.5 వేలలోపే ఇస్తామంటున్నారు ధాన్యం అమ్మిన సొమ్ము రూ.90 వేలు ఆంధ్రాబ్యాంకులో వేశారు. ఆ నగదు తీసుకునే అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అప్పులు, కుటుంబ అవసరాలు తీరని దుస్థితి. బ్యాంకుకు వెళ్తే రూ.5 వేల లోపే ఇస్తామంటున్నారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా పట్టుమని రూ.10 వేలు కూడా తీసుకోలేకపోయాను. – గుబ్బల అప్పారావు, రైతు, బాలవరం, రంగంపేట మండలం రూ.2 వేల కోసం నాలుగుసార్లు బ్యాంకుకు తిరిగా.. ధాన్యం అమ్మగా వచ్చిన రూ.10 వేల చెక్కు బ్యాంకులో వేశాను. ఇప్పటివరకూ రూ.2 వేలు తీసుకోవడానికి నాలుగుసార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చింది. కూలి పనులు మానుకుని, బ్యాంకు వద్ద పడిగాపులు పడితేనే కానీ నగదు చేతికి అందడం లేదు. – వెంగళపతి రాజారావు, రైతు, దొడ్డిగుంట, రంగంపేట మండలం పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలి? సార్వాలో పండించిన పంట ఒబ్బిడి చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాం. వాటికి సంబంధించిన డబ్బు బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. బ్యాంకులకు వెళ్తే డబ్బు లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో దాళ్వా సాగు చేయడానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకు రావాలో అర్థం కావడం లేదు. – గంధం శ్రీనివాస్, గెద్దాడ, మామిడికుదురు మండలం లైనులో నిలబడాల్సి వస్తోంది ఎనిమిదెకరాల్లో పండించిన ధాన్యం అయినవిల్లి సొసైటీ ద్వారా అమ్మాను. దీనికి సంబంధించి రూ.2.64 లక్షలు నా బ్యాంకు ఖాతాలో వేశారు. బ్యాంకుకు వెళ్తే రోజుకు రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. ధాన్యం డబ్బు ఒకేసారి ఇప్పించే ఏర్పాట్లు చేయాలి. – పొత్తూరి సత్యనారాయణరాజు, కౌలు రైతు, అయినవిల్లి -
కుటుంబం మొత్తం క్యూలోనే..
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు చిన్నమ్మ. ఫిలింనగర్ సైదప్ప బస్తీలో నివాసం. నోట్ల కష్టాలు ఈమె కుటుంబంతో ఎంతగా ఆడుకుంటున్నాయో నిరూపించే ఘటన ఇది. ప్రతిరోజూ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లోని ఫిలింనగర్ ఎస్బీఐ శాఖకు ముందు వచ్చిన 150 మందికి టోకెన్లు ఇస్తోంది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే ఖాతాదారులు లైన్లో నిలబడుతున్నారు. చిన్నమ్మ కుటుంబ సభ్యులు కూడా టోకెన్ కోసం వంతులు వారీగా క్యూలో నిలబడుతున్నారు. తెల్లవారుజామునే ఆమె మనవడు, పదో తరగతి చదువుతున్న రాము వచ్చి క్యూలైన్లో నిలబడ్డాడు. బడికి టైం కావడంతో 9.30 గంటలకు చిన్నమ్మ వచ్చి లైనులో నిలబడి మనవడిని పంపించింది. ఇళ్లల్లో పనిచేసే ఈమె కూతురు సంతీవమ్మ 11 గంటలకు ఇళ్లల్లో పనులు ముగించుకొని వచ్చి క్యూలో నిలబడి తల్లిని ఇంటికి పంపించింది. తీరా సంజీవమ్మ వంతు వచ్చేసరికి క్యూలైన్ టోకెన్లు అయిపోపవడంతో ‘రేపు రండి’ అంటూ బ్యాంకు సిబ్బంది వెనక్కి పంపారు. రూ.1000 కోసం తెల్లవారి నుంచి మనవడు, అవ్వ, ఆమె కూతురు లైన్లో నిలబడ్డా టోకెన్ దొరకలేని పరిస్థితి చేసేది లేక ఉస్సూరుమంటూ వెనుదిరిగింది. నగదు కోసం ప్రజలు పడుతున్న పాట్లకు నిదర్శనం ఈ ఉదంతం. -
మ‘నీరసం’
ఏటీఎంల వద్ద గడిచిపోతున్న కాలం నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడతున్న ప్రజలు జిల్లాకు నగదు సరఫరా అంతంత∙మాత్రమే తీరని చిల్లర కొరత సాక్షి, రాజమహేంద్రవరం : పెద్దనోట్లు రద్దు చేసి నెల రోజులు దాటుతున్నా నగదు కొరత సమస్య తీరడం లేదు. నెల రోజులుగా ప్రజలు జీవితంలో సగ భాగం బ్యాంకులు ఏటీఎంల వద్ద నిల్చోవడానికే సరిపోయింది. ఆర్బీఐ నుంచి జిల్లాకు అవసరమైన నగదు సరఫరా కాకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. ఇక మూడు రోజుల నుంచి బ్యాంకులకు సెలవులు కావడంతో సోమవారం కూడా ప్రజలు నగదు కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జిల్లాలోని 931 ఏటీఎంలలో ఐదు శాతం మాత్రమే పని చేశాయి. రాజమహేంద్రవరంలో మూ డు ఎస్బీఐ, ఒక హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో మాత్రమే నగదు లభిస్తుండడం నగదు కొరతకు తార్కాణం. ప్రజలు కాళ్లరిగేలా నగదు ఎక్కడ లభిస్తుందోనని వెతుకుతున్నారు. నగదు ఉన్న ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలుంటున్నాయి. చివరకు గంటల తరబడి క్యూలో నిల్చుంటే రూ.రెండు వేలు అందడం కూడా గగమనమవుతోంది. శనివారం జిల్లాకు వచ్చిన రూ.80 కోట్లలో రూ.500 నోట్లున్నాయి. ఎస్బీఐ ఏటీఎంలలో ఇవి లభిస్తున్నాయి. ఆ 80 కోట్లూ ఏ మూలకు? శనివారం జిల్లాకు రూ.80 కోట్లు రావడంతో ఈ మొత్తాన్ని ఆయా బ్యాంకులకు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 756 బ్యాంకులు ఉన్నాయి. రూ.80 కోట్లు ప్రస్తుతం అవసరాలకు ఏమాత్రం సరిపోవు. సాధారణంగా ఒక లీడ్ బ్యాంక్‌లో రోజుకు రూ.200 కోట్ల నగదు నిల్వలు ఉండాలని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. ఇలాంటి లీడ్ బ్యాంకులు జిల్లాలో 36 ఉన్నాయి. చేసేది లేక వచ్చిన నగదునే బ్యాంకులు అందరికీ సర్దుతున్నాయి. వారానికి రూ.24 వేలు తీసుకునే అవకాశం ఉన్నా ఆ మేరకు నగదు లేకపోవడంతో పరిమితులు విధించి ఇస్తున్నాయి. ఖాతాల్లో నగదు ఉన్నా తీసుకునే అవకాశం లేక ప్రజలు బ్యాంకు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. మరికొన్నిచోట్ల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేస్తున్నారు. 3 రోజుల సెలవుల తర్వాత బ్యాంకు లు మంగళవారం తెరచుకోనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని బ్యాంకు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిల్లర కష్టాలు ఇంకా తొలగలేదు. రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సినిమా థియేటర్లకు రూ.రెడు వేల నోట్ల సెగ తగులుతోంది. సోమవారం రాజమహేంద్రవరానికి చెందిన సురేష్ ఇటీవల విడుదలైన చిత్రం టికెట్ల కోసం లైన్లో నిల్చున్నారు. రూ.110 టిక్కెట్లు పది తీసుకుని రూ.2 వేల నోటు ఇచ్చాడు. అయితే రూ.900 చిల్లర లేదని, రూ.100 నో ట్లివ్వాలని థియేటర్ సిబ్బంది చెప్పారు. చేసే ది లేక బ్లాక్‌లో రూ.150 పెట్టి కొన్నానని సు రేష్ వాపోయాడు. పండ్లు, చిరు వ్యాపారులు చిల్లర లేక బేరాలు వదులుకుంటున్నారు. -
రూ.20వేలు..అన్నీ రూ.10 నాణేలే
జడ్చర్ల టౌన్: డబ్బుల కష్టాలు అన్నీఇన్నీ కావు. గురువారం డబ్బుల కోసం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి ఎస్‌బీహెచ్‌కు వెళ్లిన సంతోశ్ అనే ఖాతాదారుడికి దిమ్మ తిరిగేలా రూ.10 నాణేలతో కూడిన రూ.20వేల సంచిని అందించారు బ్యాంకు అధికారులు. గురువారం బ్యాంక్‌కు వెళ్లిన ఖాతాదారులకు నగదు ఇస్తున్నామని చెప్పారు. దీంతో ఖాతాదారులు పెద్ద క్యూ కట్టారు. దాదాపు 100 మందికిపైగా రూ.20 వేలు విలువ చేసే నాణేలను తీసుకెళ్లారు. కొందరికీ రూ.2 వేల నోట్లు వస్తే వాటిని మార్చుకుని చిల్లర తీసుకునేందుకు ఇబ్బంది రాగా, మరికొందరికి చిల్లర ఉండి నోట్లుగా మార్చుకునేందుకు ఇబ్బంది వచ్చింది. -
వారం రోజుల్లో సమస్య పరిష్కారం
లీడ్ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం బాలాజీచెరువు(కాకినాడ): మరో వారం రోజుల్లో నగదు సమస్య పరిష్కారమవుతుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నవంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల బ్రాంచీల ద్వారా దాదాపుగా ప్రజల నుంచి రూ.3,800 కోట్ల డిపాజిట్లు సేకరించగా రూ.1200 కోట్ల మార్పిడి చేశామని, వాటిలో ఆంధ్రాబ్యాంక్ బ్రాంచీల ద్వారా ఇప్పటి వరకూ రూ600 కోట్లకు పైగా నగదు మార్పిడి చేశామన్నారు. జిల్లాలో అన్ని ఏటీఎం బ్రాంచీలు కలిపి 931 ఉండగా వీటిలో దాదాపు 50 శాతం ఏటిఏంలు నిరంతరాయంగా 24 గంటలు పని చేస్తున్నాయని, వీటిలో అధికంగా ఎస్బీఐ ఏటీఎంలు ఉన్నాయన్నారు.ప్రభుత్వం నగదు రహిత విధానం ప్రవేశపెట్టిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా ప్రారంభించి రూపే కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు..ఖాతాల ప్రారంభానికి బ్యాంకులలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు అదేశాలు జారీ చేశామని, స్వచ్ఛంద సంస్థలతోపాటు విద్యార్థుల సహకారం తీసుకుంటున్నామన్నారు. -
ఖాతాలో జమ.. అంతా మమ
1.25 లక్షల మంది వేతన జీవులు, పింఛ¯ŒSదారుల ఇక్కట్లు రూ.1000 ఇస్తాం కానీ మరో వెయ్యి ఇస్తేనే రూ.2000. పింఛన్‌దారులకు బ్యాంకర్ల మెలిక 60 శాతం ఏటీఎంల తలుపులు మూతే కొత్తపేట ఎస్.బి.ఐ.లో రూ.500లే గతి ర్యాలి ఆంధ్రాబ్యాంకు ఎదుట ధర్నా నిర్దిష్ట తేదీ ప్రకటించకుండా పింఛన్లిస్తామని దండోరాలు పరిస్థితిదీ... జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, రిటైర్డ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్షా 25 వేలు పైనే ఉన్నారు. వీరందరికీ జీతాల బడ్జెట్ రూ.500 కోట్లు. కానీ బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లో నిలబడినా నాలుగు వేలు మించి చేతికి రాని వైనం. 761 బ్రాంచీల పరిధిలో 931 ఏటీఎంల ద్వారా రూ.5.30 కోట్లు మాత్రమే డ్రా అయింది. మధ్యాహ్నం తరువాత సుమారు 560 ఏటీఎంలలో నోక్యాష్ బోర్డులు కనిపించాయి. రూ.1000 డిపాజిట్ చేస్తే రూ.2000 నోటు ఇస్తామని రాజమండ్రి రూరల్‌లో బ్యాంకు సిబ్బంది రూ.1000 వృద్ధాప్య పింఛ¯ŒSదారుల జీవితాలతో ఆటలాడుకున్నారు. సాక్షిప్రతినిధి, కాకినాడ : డబ్బు లేదు. డబ్బు లేదు. డబ్బు లేదు..ఎక్కడ చూసినా...ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా ఇదే అంశం. జీతాలు ఖాతాలో పడ్డాయనే ఆశ క్షణాల్లో ఆవిరైపోతుంటే ఆగ్రహం కట్టలు తెంచుకునే పరిస్థితి జిల్లా అంతటా నెలకుంది. జీతం పడింది ... నెల అవసరాలకు డబ్బులు తీసుకుందామని శుక్రవారం బ్యాంకులకు వెళ్లేసరికి ఐదారు వేలు చేతిలో పెట్టి ‘మమ’ అనిపించి బ్యాంకర్లు చేతులు దులుపుకోవడంతో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక పింఛ¯ŒSదారులనే కనికరం లేకుండా మొండి చేయి చూపిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో అయితే సామాజిక పింఛ¯ŒS రూ.1000 ఇస్తాం, కానీ మరో రూ.1000 జమ చేస్తే రెండు వేలు నోటు ఇస్తామని పింఛ¯ŒSదారులకు బ్యాంకులు మెలికి పెట్టాయి. ఆ వచ్చే కొద్దిపాటి పింఛ¯ŒSతోనే పొట్టపోసుకునే తమబోటి వాళ్లు మరో వెయ్యి ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వగలమంటూ పింఛ¯ŒSదారులు బ్యాంకు అధికారులపై మండిపడటం కనిపించింది. రెండో తేదీ శుక్రవారం కూడా జీతాలు, పింఛన్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద పడిగాపులుపడ్డా పట్టుమని ఐదు వేలు కూడా చేతికి చిక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రూ.500లే గతి... గురువారం రూ.4 వేలు చెల్లించిన కొత్తపేట ఎస్.బి.ఐ. బ్రాంచిలో శుక్రవారం రూ.500 చేతిలో పెట్టి ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఆత్రేయపురం మండలం ర్యాలి ఆంధ్రాబ్యాంక్ విధులు ప్రారంభమైన అరగంటకే నో క్యాష్ బోర్డు పెట్టడంతో ప్రజలు ధర్నాకు దిగారు. రూ.1000 డిపాజిట్ చేస్తే రూ,2000 నోటు ఇస్తామని రాజమండ్రి రూరల్‌లో బ్యాంకు సిబ్బంది వృద్ధాప్య పింఛ¯ŒSదారుల జీవితాలతో ఆటలాడుకున్నారు.రామచంద్రపురం, కాకినాడ సిటీ, మండపేట, రాజోలు నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల నుంచీ ఏటీంలలో నగదు లేదనే బోర్డులు దర్శనమిచ్చాయి. జగ్గంపేట, పి గన్నవరం, పెద్దాపురం, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో సామాజిక పింఛన్లు అందకపోవడంతో బ్యాంకుల చుట్టూ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు కాళ్లరిగేలా తిరిగారు. ఆటోలకు రూ.20 చార్జీలు చెల్లించి బ్యాంకులకు వద్దకు వచ్చి పడిగాపులు పడి తీరా ఇవ్వడం లేదని చెప్పడంతో కంటతడి పెట్టుకుంటూ వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ అధికారులు పింఛన్లు ఇచ్చే తేదీన ప్రకటిస్తామని దండోరా వేయించారే తప్ప ఎప్పుడు ఇస్తామనేది ప్రకటించలేదు. రాజమండ్రి నగరంలో సేవింగ్ ఖాతాదారులకు రూ.4వేలు, కరెంటు ఖాతాదారులకు రూ.10 వేలు ఇచ్చారు. సగానికి పైగా ఏటీఎంలు మూతేశారు. రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లోని బ్యాంకుల్లో రూ.4 వేలు, రూ.6 వేలు మాత్రమే ఇచ్చారు. మధ్యాహ్నం తరువాత ఏటీఎంలో నగదు లేదంటూ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏటీఎంలు పని చేయలేదు. మోతుగూడెంలో ఆంధ్రాబ్యాంకులో డబ్బులు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇలా ఎన్ని రోజులు బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటారో తెలియడం లేదని, ఉద్యోగాలు మానేసి బ్యాంకుల చుట్టూ నెలంతా తిరిగినా జీతం మొత్తం చేతికొస్తుందనే గ్యారెంటీ లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 రోజులుగా బ్యాంకుల్లో నెలకొన్న పరిస్థితి వేరు, గడచిన రెండు రోజులుగా ఉత్పన్నమైన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దుచేసిన దగ్గర నుంచి ఇంతవరకు జిల్లాలో ప్రజలు డిపాజిట్లు చేసింది రూ.3,800 కోట్లు. రిజర్వు బ్యాంకు జిల్లాకు ఇచ్చింది రూ.1200 కోట్లు. వీటిలో రూ.410 కోట్లు ఆంధ్రాబ్యాంకు ఎక్కువగా మారకం చేసింది. శుక్రవారం రాత్రికి రూ.140 కోట్లు రానుంది. మరో రూ.600 కోట్లు ప్రతిపాదనలున్నాయి. అయినా సరే అవసరాలు తీర్చలేని పరిస్థితి కనిపిస్తోంది. నో క్యాష్తో కష్టాలు... జిలా ్లవ్యాప్తంగా ఉద్యోగులు, రిటైర్డ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లక్షా 25 వేల పైచిలుకుగానే ఉన్నారు. వీరందరికీ జీతాల బడ్జెట్ రూ.500 కోట్లు. కానీ బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లోల నిలబడినా నాలుగు వేలు మించి చేతికి రాని వైనం. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎవరికైనా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలో నాలుగు వేలు మించి ఇవ్వలేదు, రంపచోడవరం ఏజెన్సీలో మాత్రం రిటైర్డ్ ఉద్యోగులకు రూ.6000 వంతున ఇచ్చారు. రూ.35,000 జీతగాడికి నాలుగైదు వేలు చేతిలో పెట్టడంతో ‘ఇది ఏ మూలకు వస్తుంద’ని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. బ్యాంకుల్లో నగదు ఉదయానికే నిండుకోవడంతో నిలువుకాళ్ల జపం చేసినా అరకొరగానే అందడంతో ఈసురోమంటూ తిరిగి వెళ్లిపోయారు. మొత్తం జీతం నాలుగైదు దఫాలుగా డ్రా చేయాలంటే నెలంతా తిరగాల్సిందేననని, ఇదేమి శిక్షంటూ వాపోతున్నారు. పోనీ ఏటీఎంల వద్ద తీసుకుందామంటే విత్‌డ్రా పరిమితి రూ.2 వేలే. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 60 శాతం ఏటీఎంలు నగదు లేదనే బోర్డులతోనే దర్శనమిచ్చాయి. 761 బ్రాంచీల పరిధిలో 931 ఏటీఎంల ద్వారా రూ.5.30 కోట్లు మాత్రమే డ్రా అయింది. మధ్యాహ్నం తరువాత సుమారు 560 ఏటీఎంలలో నోక్యాష్ బోర్డులతో కనిపించాయి. 761 బ్యాంక్ బ్రాంచిలలో నగదు మార్పిడితో పాటు విత్‌డ్రాలు రూ.60 కోట్లయ్యాయి. శని, ఆదివారాల్లో జిల్లాలో అవసరాలు తీరాలంటే రూ.500 కోట్లు అవసరం. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు పంపించారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. -
నోట్ల చిక్కులు..జనానికి చుక్కలు
50 వేల మంది ఉద్యోగులకు నిరాశే వెనుతిరిగిన పింఛ¯ŒSదారులు పండుటాకులకూ పడరాని పాట్లు జనం శాపనార్థాలు అన్ని చర్యలూ తీసుకున్నామన్న పాలకుల మాటలు హుష్‌కాకి సాక్షి ప్రతినిధి, కాకినాడ : సామాన్య, మధ్య తరగతి, ఉద్యోగ వర్గాల జీవితాలు ఒకటో తేదీతో ముడిపడి ఉంటాయి. నెలంతా పడ్డ శ్రమకు ఆ రోజు జీతం రూపంలో వచ్చే ప్రతిఫలం కోసం గంపెడాశతో నిరీక్షిస్తుంటారు. అటువంటిది ఈసారి డిసెంబరు ఒకటో తేదీ అందరికీ చుక్కలు చూపించింది. ఒకటో తేదీ వచ్చిందంటే ఇంటి అద్దె మొదలుకుని కిరాణా, పాలు, పేపర్, కేబుల్... ఇలా అన్నింటికీ ఖర్చు చేయాలంటే జీతం చేతిలో పడాలి కదా. ప్రభుత్వం సామాజిక పింఛ¯ŒS పథకంలో ఇచ్చే వెయ్యి, రూ.1500 పైనే జీవితాలు వెళ్లదీసే పింఛ¯ŒSదారులదీ అదే పరిస్థితి. అటు ఉద్యోగులకు ఇటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, సామాజిక భద్రతా పింఛన్‌దారులు.. ఇలా ఒకరేమిటి అందరినీ ఒకటో తేదీ కంగారు పెట్టించింది. ఉద్యోగుల ఖాతాల్లో పడని జీతాలు.. జిల్లాలో ఉద్యోగులకు ఒకటో తేదీనాడే జీతాలు వారి ఖాతాలకు జమయ్యేవి. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో గురువారం రాత్రికి కూడా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడలేదు. కొన్నిచోట్ల ట్రెజరీల నుంచి బ్యాంకులకు జమ అయినా బ్యాంకుల్లో నగదు లేక ఇవ్వలేదు. జీతాలు జమవుతాయనడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూశారు. తీరా రాత్రికి పడతాయని నిరీక్షించినా నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఆర్.అండ్.బి, వైద్య ఆరోగ్యం, దేవాదాయశాఖ తదితర అన్ని శాఖల్లో కలిపి 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఫించ¯ŒSదారులు 40 వేల మంది ఉన్నారు. వీరితోపాటు 12,500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ నెలకు జీతాల బడ్జెట్ రూ.500 కోట్లు పైమాటే. అంతెందుకు స్వయంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సహా అధికారులెవరికీ జీతాలు పడలేదు. వీరందిరికీ నేరుగా ప్రతినెలా ఒకటో తేదీన వారి వారి ఖాతాల్లో వేతనాలు జమ య్యేవి. పరిస్థితి తారుమారవడంతో ఉద్యోగవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పింఛ¯ŒSదారులదీ అదే వ్యథ: ఉద్యోగులతోపాటు ఫించ¯ŒSదారులు కూడా జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు పడినా ఫలితం దక్కలేదు. జిల్లాలో 4 లక్షల 75 వేల 823 మంది పింఛ¯ŒSదారులకు ప్రతినెల రూ.48 కోట్లు ఒకటో తేదీ నుంచి ఐదో తేదిలోపు నగదు ఇచ్చేవారు.వీరందరికీ రూ.100లు నోట్లు ఇవ్వాలంటే 48 లక్షల రూ.100 నోట్లు అవసరమవుతాయని లెక్కలేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ బ్యాంకర్లకు సూచించారు. కానీ అన్ని నోట్లు తమ వల్ల కాదని బ్యాంకులు చేతెలెత్తేసింది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో 32 వేల మందికి నగదు రూపంలో చెల్లిస్తామన్నారు. అధికారులు చెప్పిన మాటలతో ఏజెన్సీలో పింఛ¯ŒSదారులంతా ఎదురుచూసినా ఒక్క రూపాయి కూడా వారి చేతిలో పడలేదు. మైదాన ప్రాంతంలో మిగిలిన 4 లక్షల 44 వేల మందికి వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తామన్నా గురువారం రాత్రికి కూడా జమకాలేదు. జిల్లా కేంద్రంలో: ఉదాహరణకు కాకినాడ సిటీలో 20,732 పింఛ¯ŒSదారులకు రూ.2.30 కోట్లు ఇవ్వాలి. నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద బారులుదీరారు. నగరంలో బ్యాంకులకు ఒక్కొక్క బ్యాంకుకు రూ.25 లక్షలు వంతున మాత్రమే ఇవ్వడంతో మధ్యాహ్నానికే నగదు నిండుకుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో 43 గ్రామ పంచాయతీల్లో పింఛ¯ŒSదారులు ఉదయం 6 గంటలకే కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. ఏజెన్సీలో ఖాతాల్లో పొదుపు చేసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం రూ.4 వేలు ఇచ్చారు. అంతటా ఇవే వెతలు... చింతూరు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో మధ్యాహ్నానికి సొమ్ములు నిండుకున్నాయి. కూలీలకు సొమ్ములు ఎలా చెల్లించాలంటూ రైతులు వాగ్వాదానికి దిగారు. పెదపూడి మండలంలో పింఛ¯ŒSదారులకు బ్యాంకుల నుంచి విడుదలైన నగదు విషయాన్ని పరిశీలిస్తే బ్యాంకుల్లో ఒకటోతేదీన నెలకున్న పరిస్థితి స్పష్టమవుతోంది. ఆ మండలంలో ఏడువేల మంది పింఛ¯ŒSదారులు ఉదయం నుంచి పడిగాపులుపడితే వీరిలో 5వేల 703 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అమలాపురంలో ఉన్న 23 బ్యాంకుల వద్ద ఉద్యోగులు బారులు తీరడంతో క్యూలైన్లు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విశ్రాంత ఉద్యోగులు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడలేక అష్టకష్టాలు పడ్డారు. మొదట రూ.10వేలు ఇస్తామని చెప్పి రూ.4 వేలు, రూ.6వేలు మాత్రమే ఇవ్వడంతోశాపనార్థాలు పెట్టడం కనిపించింది. రాజానగరంలో ఉదయం నుంచి బ్యాంకుల వద్ద ఉద్యోగులు, రైతులు, పింఛ¯ŒSదారులు క్యూలో నిలబడి పడిగాపులు పడ్డారు. తునిలో ఉద్యోగుల జీతాలకు రూ.10 వేలు ఇస్తామని రూ.5వేలు మాత్రమే ఇచ్చారు. జగ్గంపేట స్టేట్‌బ్యాంక్ పరిధిలో ఎవరికీ పింఛన్లు ఇవ్వలేదు. పెద్దాపురం నియోజకవర్గంలో పింఛ¯ŒSదారులకు స్టేట్ బ్యాంకులో రూ.4,500 మాత్రమే ఇస్తామని చివరకు ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. తాటిపాక ఆంధ్రా బ్యాంకు వద్దకు వచ్చిన ఒక వృద్దుడు సొమ్మసిల్లి పడి పోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఎటీఎంకార్డుల కోసం, అకౌంట్ల కోసం బ్యాంకుల క్యూ కట్టారు. నగదు లేక జీతాలు ఇవ్వలేదు. ఖాతాల్లో నిల్వ ఉన్న వారికి మాత్రమే మామిడికుదురు ఎస్బీఐ, నగరం కార్పొరేష¯ŒS బ్యాంకు, పి.గన్నవరం ఎస్బీఐలలో రెండు నుంచి నాలుగువేలు ఇచ్చారు. కొత్తపేట నియోజకవర్గంలో ఉద్యోగులు, పింఛ¯ŒSదారులకు కలిపి తొమ్మిదిన్నర కోట్లు వరకు బ్యాంకులకు అనుమతించారు. తీరా బ్యాంకులకు వెళ్ళినా నగదు లేక వెనుతిరిగారు. జిల్లా అంతటా ఉద్యోగులు, పింఛ¯ŒSదారులు, రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒకటో తేదీన ముచ్చెమటలెక్కించింది. ప్రతిపాదనలు : జిల్లాకు రూ.500 కోట్లు అవసరం. కానీ రిజర్వు బ్యాంకుకు కేవలం రూ.300 కోట్లకు మాత్రమే ప్రతిపాదనలను లీడ్ బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం పంపించారు. అంటే ఇవి ఉద్యోగులకు మాత్రమే సరిపోవచ్చు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటని పలువురి ప్రశ్న. -
చితుకుతున్న బతుకులు
కరెన్సీ కల్లోలం.. పెను సంక్షోభం వాయిదా పడుతున్న పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలదీ అదే దారి చితికిపోయిన చిన్నవ్యాపారాలు కొనేవారు లేక కళ తప్పిన పెద్ద వ్యాపారాలు సొమ్ములు లేక రైతుల ఇక్కట్లు పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట.. మామిడితోరణాలు కట్టాలా.. వద్దా.. అని ఆలోచిస్తున్నవారే కనిపిస్తున్నారు. ఒకవేళ అనుకున్న ముహూర్తానికే ఆ శుభకార్యం తలపెడితే.. డబ్బులు సర్దుబాటు చేయడమెలాగన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. కుటుంబ పరిస్థితులు అనుకూలించకో.. పెద్ద పెద్ద స్థానాలకు ఎదిగే శక్తి లేకో.. కాలం కలసిరాకో.. ఉన్నంతలోనే చిన్నచిన్న వ్యాపారాలతో బతుకుబండిని లాగిస్తున్నవారు.. పెద్ద నోట్ల రద్దుతో కొన్నాళ్లుగా బేరాలు లేక దారుణమైన నష్టాలు చవిచూస్తున్నారు. తెల్లవారితే చాలు.. ఆ రోజు ఎలా గడపాలో అర్థం కాక కలత చెందుతున్నారు. పండగలు వచ్చేస్తున్నవేళ.. కొనుగోలుదార్లతో కిటకిటలాడాల్సిన పెద్దపెద్ద షాపులు.. కనీస వ్యాపారం కూడా జరగక కళ తప్పుతున్నాయి. వ్యాపారం లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు తమవద్ద పని చేస్తున్న చిరుద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నేలతల్లిని తన చెమటతో తడిపి.. బంగారుపంటలు పండించి.. ప్రజలందరికీ తిండిగింజలను అందించే అన్నదాతలు.. ఖరీఫ్ వరి కోతల సమయాన.. చేతిలో సొమ్ములాడక.. రబీ పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాక బావురుమంటున్నారు. మరోపక్క పనులు లేక.. చేసినా చిల్లర నోట్లు రాక.. కొత్త రూ.2 వేల నోటుకు చిల్లర దొరకక రోజు కూలీలు నానా అవస్థలూ పడుతున్నారు. ఒకటో తేదీ వచ్చేస్తోంది. ఇంటద్దె, కిరాణా, పాలబాకీలు.. ఇతర ఖర్చులకు డబ్బులు అందుతాయో లేదో అర్థంకాక సగటు ఉద్యోగులు తల్లడిల్లుతున్నారు. పాత రూ.వెయ్యి, రూ.500 నోట్లు చిత్తు కాగితాలతో సమానమంటూ ప్రధాని ప్రకటించి ఇప్పటికి 22 రోజులు పూర్తయింది. ఇప్పటికీ కరెన్సీ కల్లోలం ప్రజాజీవితాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేసింది. మోదీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో తమ జీవితాలు చిత్తయ్యాయని.. తక్షణం ఈ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని అన్ని వర్గాల ప్రజలూ గళమెత్తుతున్నారు. చిల్లర ఎక్కడ నుంచి తేవాలి? నోట్ల రద్దుతో రూ.500, రూ.1000 తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో రూ.100 మిఠాయి కొనుగోలుకు కూడా రూ.2 వేల నోటు ఇస్తున్నారు. వారికి చిల్లర ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదు. దుకాణంలో మిఠాయి తయారు చేయడానికి కనీసం ముగ్గురు కూలీలు కావాలి. వారికి రోజువారీ జీతాలు ఇచ్చేంత స్థాయిలో కూడా అమ్మకాలు సాగడం లేదు. వారికివ్వడానికి చిల్లర ఉండటం లేదు. అలాగని సెలవు ఇస్తే వారు మరో పనిలోకి పోతారు. దీంతో అనుభవం కలిగిన పనివారిని వదులుకోలేకపోతున్నాం. పప్పుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యాపారం లేకపోయినా అద్దెలు, కరెంటు బిల్లులు, కార్మికుల కూలీలు చెల్లించకతప్పడం లేదు. నోట్ల రద్దుతో సామాన్యుల నోట్లో మట్టి పడింది. – మిత్తిపాటి మాధవరావు, చిరు మిఠాయి వ్యాపారి, సామర్లకోట డిసెంబరులో ముహూర్తమా? ‘మంచి ముహుర్తమైనా... బలమైన మూహూర్తమైనా ఈ రెండు నెలలూ పెళ్లిళ్లు చేయలేం. నోట్ల గందరగోళం తగ్గిన తరువాత చిన్న ముహూర్తమైనా పెళ్లి చేద్దాం. అంతవరకూ వాయిదానే’ పెద్దనోట్ల రద్దుతో చాలామంది పెళ్లి పెద్దలు, తల్లిదండ్రులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకుంటున్న నిర్ణయం ఇది. ఈ నెలలో పెట్టిన ముహూర్తాలు, వచ్చే నెలలో పెళ్లిళ్లు పెట్టుకుని, ఇప్పటికే బంధుమిత్రులకు శుభలేఖలు పంచినవారు మినహా తాజాగా పెళ్లిళ్లు కుదిరినవారంతా ఆ శుభకార్యాలను కాస్త ఆలస్యంగా జరుపుకోవాలని నిశ్చయించుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దుతో వంటవాళ్లు, పురోహితులు, విద్యుద్దీపాలు అలంకరించేవారు, కల్యాణ మండపాలవారు, డెకరేష¯ŒS చేసేవారిని ఏర్పాటు చేసుకోవడంతోపాటు.. చివరకు విందు భోజనాలకు అవసరమైన సరుకులు కొనేందుకు సహితం పెళ్లి నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. పెద్ద నోట్లు మారకపోవడం, చిన్న నోట్లు లక్షల్లో పోగు చేయలేక ముహూర్తాలను వాయిదాలు వేసుకుంటున్నారు. వచ్చే నెల 3, 4, 5, 7, 9 తేదీలతోపాటు 24న కూడా ముహూర్తాలున్నాయి. వీటిలో 3, 4, 5 తేదీల్లోవి భారీ ముహూర్తాలు. నోట్ల రద్దు గొడవ లేకుంటే ఈ మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా కనీసం 50 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగేవి. వీటితోపాటు గృహప్రవేశాలు, ఇతర శుభకార్యక్రమాలు జరగాల్సి ఉంది. కరెన్సీ సంక్షోభంతో ఈ కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. పుష్యమాసం కావడంతో జనవరి నెల 30 వరకూ ముహూర్తాలు లేవు. అదిగో ఇదిగో అంటే ఇక ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే పెళ్లిబాజా ఘనంగా మోగే అవకాశముంది. కొత్తగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసినవారు మాత్రం డిసెంబరు నెలలో పాలు పొంగించుకుని తరువాత ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంగా విందు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. – అమలాపురం డిసెంబరు వద్దంటున్నారు డిసెంబరు నెలలో బలమైన ముహూర్తాలున్నా చాలామంది ఫిబ్రవరిలో చూడమంటున్నారు. జనవరిలో ముహూర్తాలు లేనందున గతంలో పెళ్లిళ్లు కుదిరితే వారం రోజుల వ్యవధిలో కూడా ముహూర్తాలు పెట్టుకున్న సందర్భముంది. పెద్ద నోట్లు మారకపోవడంతో వారంతా ఫిబ్రవరిలో ముహూర్తాలకు మొగ్గు చూపుతున్నారు. – ఉపద్రష్ట నాగ ఆదిత్య, పురోహితుడు, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా శుభలేఖ చూపినా రూ.2వేలే ఇచ్చారు ఆమె పేరు ఎ¯ŒS.విజయలక్ష్మి, రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రిలో పని చేస్తూంటారు. తన కుమార్తెకు డిసెంబర్ ఒకటిన వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకోసం సమీపంలో ఉన్న ఆంధ్రాబ్యాంకులోని తన అకౌంటులో దాచుకున్న రూ.80 వేలు తీసుకునేందుకు వెడ్డింగ్ కార్డుతోపాటు బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. వివాహాది శుభకార్యాలకు తగిన ఆధారాలు చూపిస్తే రూ.2 లక్షల వరకూ నగదును పొందవచ్చని ఆదేశాలున్నాయి. కానీ, అందరితోపాటే ఆమెకు కూడా బ్యాంకు సిబ్బంది రూ.2 వేలే చెల్లించారు. కుమార్తె వివాహం కోసం సొమ్ములు కావాలని ప్రాధేయపడినా సిబ్బంది వినలేదు. ఈ రూ.2 వేలతో పెళ్లి ఏర్పాట్లు ఏవిధంగా చేసుకునేదంటూ నిలదీసినా వారు పట్టించుకోవడంలేదు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఆదేశాలనే తాము పాటిస్తున్నామని జీఎస్ఎల్ వైద్య కళాశాల క్యాంపస్‌లోని ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్ మేనేజర్ రాధాకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఆధారాలు చూపించినా కావలసినంత మేరకు నగదు ఇవ్వలేని స్థితిలో తమకు కేటాయింపులు ఉంటున్నాయన్నారు. రోజుకు రూ.4 లక్షలే తమకు కేటాయిస్తున్నారని, దీనిని ఎంతమందికి ఏవిధంగా చెల్లించగలమంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశారు. – రాజానగరం చిన్న వ్యాపారులకు పెద్ద కష్టం అమలాపురం : పెద్ద నోట్ల రద్దుతో చిన్నవ్యాపారులు విలవిలలాడుతున్నారు. అమలాపురం నియోజకవర్గంలో సుమారు వెయ్యిమంది చిరు వ్యాపారులున్నారు. ఒక్క అమలాపురం పట్టణంలోనే సుమారు 450 మంది వ్యాపారులున్నారని అంచనా. పెద్దనోట్ల రద్దుతో వారికి చిల్లర కష్టాలు మొదలయ్యాయి. పట్టణ పరిధిలో తోపుడుబళ్ల మీద కూరగాయలు అమ్ముకునేవారి వ్యాపారం సగానికి సగం తగ్గింది. ‘‘ఇంతకుముందు రోజుకు రూ.3,500కు పైగా పండ్ల అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు రూ.1,500 కూడా జరగడం లేదు’’ అని పట్టణానికి చెందిన పండ్ల వ్యాపారి రంకిరెడ్డి రామదేవుడు వాపోయారు. ‘‘రూ.100 నోట్లు దొరికితేనే మావద్ద ఎంతోకొంత కిరాణా కొంటున్నారు. లేకపోతే అత్యవసరమైతేనే కానీ కొనడం లేదు. పెద్దనోటు ఉంటే బజారుకు పోతున్నారు. మా దుకాణంలో రోజుకు రూ.2,500 పైబడి అమ్మకాలు సాగేవి. ఇప్పుడు రూ.వెయ్యి దాటితే గొప్పగా ఉంది’’ అని అమలాపురం మండలం రోళ్లపాలేనికి చెందిన కిరాణా వ్యాపారి ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో గోల్డ్ మార్కెట్‌కు కస్టమర్లు రాక.. దానిపై ఆధారపడిన పా¯ŒSషాపు, టీకొట్ల యాజమానుల వ్యాపారాలు సైతం సగానికి తగ్గాయి. వాయిదాల పద్ధతిలో సామాన్యులకు వస్రా్తలు అమ్మే వ్యాపారులదీ ఇదే పరిస్థితి. ‘‘మాకు ఇవ్వాల్సినవారు సమయానికి వాయిదా సొమ్ము ఇవ్వడం లేదు. షాపు యజమానులు మాత్రం వెంటనే సొమ్ములిమ్మంటున్నారు. అప్పులు చేయాల్సి వస్తోంది’’ అని ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన వస్త్ర వ్యాపారి సీహెచ్ నాగరాజు చెప్పాడు. గంటల తరబడి క్యూలో నిలబడితే.. రెండు మూడు వేలే ఇస్తారా? బోట్‌క్లబ్ (కాకినాడ) : పనులు మానుకొని గంటల తరబడి క్యూలో నిలబడితే రెండు, మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో బ్యాంకు సిబ్బందిపై ఖాతాదారులు మండిపడ్డారు. కాకినాడ సూర్యారావుపేట ఆంధ్రాబ్యాంకు వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ‘‘నాలుగు గంటలకు పైగా క్యూలో నిలబడితే రూ. 3 వేలు మాత్రమే ఇచ్చారు. ఉదయం 9 గంటలకే బ్యాంకుకు వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలకు కూడా నగదు ఇవ్వలేదు’’ అని మహాలక్ష్మి అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తమవద్ద పూర్తిస్థాయిలో నగదు లేనందువల్లనే పూర్తి స్థాయిలో చెల్లింపులు జరపలేకపోతున్నామని, ఉన్న నగదునే అందరికీ సర్దుతున్నామని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నెలాఖరు కావడంతో నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు అవసరమైన డబ్బుల కోసం మళ్లీ బ్యాంకులకు పరుగు తీస్తున్నారు. దీంతో బ్యాంకులవద్ద మళ్లీ రద్దీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో సూర్యారావుపేట ఆంధ్రాబ్యాంకు సిబ్బంది ఖాతాదార్లకు టోకెన్లు జారీ చేశారు. వీటిని తీసుకునేందుకు ఖాతాదారులు ఎగబడడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి, పలువురు గాయపడ్డారు. కడియపులంకలో వాడిపోతున్న ‘పూలు’ కడియం : పెద్ద నోట్ల రద్దు కడియపులంక పూల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిల్లర అమ్మకాలు 70 శాతం వరకూ తగ్గిపోయాయి. రోజూ రూ.2 వేల వరకూ పువ్వులు తీసుకువెళ్లి చిల్లరగా అమ్ముతానని, కానీ కొనుగోలుదారుల వద్ద తగిన నోట్లు లేకపోవడంతో అరువులు పెడుతున్నారని అనపర్తికి చెందిన పూల వ్యాపారి సుబ్బారావు తెలిపారు. నిత్యం తనవద్ద కొనేవారికి మాత్రమే పూలు ఇస్తున్నానని, ఇందుకోసం రూ.500 నుంచి రూ.800 వరకూ కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. చిల్లర నోట్లు లేకపోవడంతో పెద్ద నోట్లే ఇస్తామని వ్యాపారులు చెబుతూండగా, అందుకు మార్కెట్‌కు పువ్వులు తెచ్చిన రైతులు అంగీకరించడంలేదు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో పట్టీ (సరఫరా చేసిన పూలకు చెల్లింపు) పట్టుకెళ్లే రైతులు వారం రోజులపాటు వేచి చూడాల్సి వస్తోంది. మార్కెట్లోకి పువ్వులు విరివిగా వస్తున్న ప్రస్తుత తరుణంలో చిల్లర కష్టాలతో అమ్మకాలు పడిపోతున్నాయి. గత ఏడాది ఇదే రోజుల్లో కేజీ రూ.80 వరకూ పలికిన పలు రకాల పువ్వులు ఇప్పుడు రూ.25 నుంచి రూ.40 మధ్య మాత్రమే పలుకుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. -
నేటి హర్తాళ్‌కు సర్వం సిద్ధం
కరెన్సీ కష్టాలపై పోరుకు రాజకీయ పక్షాల ఏర్పాట్లు అత్యవసర సేవలకు మినహాయింపు కాకినాడలో ర్యాలీ.. కలెక్టరేట్ వద్ద ధర్నా నేడు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు రాజమహేంద్రవరంలో నిరసనలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు కాకినాడ : ముందస్తు ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసి, ప్రజలను కరెన్సీ కష్టాల్లోకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాలు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం జిల్లాలో హర్తాళ్ నిర్వహించనున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాలుసన్నద్ధమయ్యాయి. నల్లధనాన్ని వెలికి తీసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నామని, అయితే ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు మాత్ర మే ఈ హర్తాళ్ నిర్వహిస్తున్నామని విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పోరాటంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు సహా వివిధ ప్రజాసంఘాలను కూడా భాగస్వాముల్ని చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్నందున అత్యవసర సర్వీసులకు మినహాయింపునివ్వాలని నేతలు నిర్ణయించారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు నివాసం నుంచి భానుగుడి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ చేసి, అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నారు. వామపక్షాలు కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అమలాపురంలో అన్ని రాజకీయపక్షాలూ హర్తాళ్‌ను సక్సెస్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాజమహేంద్రవరం పరిధిలో ఆయా పార్టీల నేతలు హర్తాళ్‌కు సన్నాహాలు చేస్తూండగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు ప్రకటించింది. విజయవంతం చేయండి : కన్నబాబు హర్తాళ్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ ప్రజలను కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలనే తాము ఎండగడుతున్నామని చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందువల్లనే ఆయా రాజకీయ పక్షాలను సమన్వయం చేసుకుని జిల్లాలో హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు ముఖ్యనేతలంతా కలిసి వచ్చే పార్టీలు, నాయకులు, ప్రజాసంఘాలతో హర్తాళ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
నోట్ల కోసం నోళ్లొక్కటై..
బ్యాంకుల వద్ద గిరిజనుల నిరసన పెద్ద నోట్ల రద్దు పెద్దవారికేమో కానీ చిన్నవారికి పెద్ద కష్టాలు తెచ్చిపెడుతోంది. రద్దు అయిన నోట్ల మార్పిడికి వెళ్తుంటే అధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.. విసుక్కుంటున్నారు.. బయటకు పొమ్మంటున్నారు. ఈ చర్యలను వారినుంచి ఊహించని ప్రజలు వారి నిరసనను వివిధ రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. ఒకరు రాస్తారోకో చేస్తే మరొకరు ధర్నా చేస్తున్నారు. ఒకరు బ్యాంకులను ముట్టడిస్తే మరొకరు ప్రజా సంఘాల సహకారంతో నిరసనప్రదర్శనలు చేస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మిడివరం : రద్దయిన రూ.500, వెయ్యి నోట్లను డిసెంబర్ 30 వరకు కొనసాగించాలని కోరుతూ సీఐటీయూ, ఏఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మిడివరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బళ్ల గేటు సెంటర్ నుంచి స్టేట్‌బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించి బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. రదై్దన నోట్లను డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగించాలని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల సామాన్యులు, కార్మికులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పనులు మానుకుని బ్యాంకులు వద్ద పడి గాపులు పడుతున్నార న్నారు. రూ.2వేల నోటు వల్ల సామాన్యలకు ప్రయోజనం లేదన్నారు. నోట్ల మార్పిడి వల్ల చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సీఐటీయూ, ఏఐటీయూ నాయకులు జి.దుర్గాప్రసాద్, వనచర్ల వెంకట్రావు, బీ.మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. నగదు లేదు పొమ్మన్నారు మోతుగూడెం : మోతుగూడెం ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులకు అధికారులు రిక్త హస్తాలు చూపతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం బ్యాంకుకు వచ్చిన వారికి ఉదయం 11 గంట ల వరకు రూ.వెయ్యి ఇచ్చి, ఆ తర్వాత నగదు లేదు పొమ్మనారు. దీంతో ఖాతాదారులు అన్ని బ్యాంకుల్లో ఖాతాదారులు అడిగినంత నగదు ఇస్తుంటే ఈ బ్యాంకుకు ఏప్పుడూ వచ్చిన నగదు నిల్వలు లేవనే చెప్పుతున్నారు. అలాంటప్పుడు బ్యాంకును తెరవడం ఎందు కు? మూసేయాలని ఖాతాదారులు శుక్రవారం బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ బ్యాంకు అధికారులు నగదు నిల్వలు సరిపడే విధంగా తేకుండా, తక్కువ నగదు తెచ్చి వారం రోజులుపాటు సర్దుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇకనుంచైన అధికారులు ఖాతాదారులకు ప్రభుత్వ ఆదేశించిన మేర నగదు చెల్లింపులు చేయాలని వారు కోరుతున్నారు. -
అమ్మో ఒకటో తారీఖు
బ్యాంకు నిబంధనలతో ఆందోళనలో ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్బీఐ నిబంధనలు సడలించాలని డిమాండ్ జిల్లాలో 52 వేల మంది ఉద్యోగులు, 40 వేలమంది పెన్షనర్లు వెంకటేశ్వరరావు విద్యాశాఖ పరిధిలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. నెల నెలా వచ్చే జీతమే అతనికి ఆధారం. ఒకటో తేదీన జీతం రాగానే ఇంటి అద్దె, పాలబిల్లు, కిరాణా బకాయిలు, పిల్లల ఫీజులు, బ్యాంకులో రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించాల్సి ఉంది. మరో పది రోజుల్లో జీతం వస్తుందన్న ఆనందం కన్నా.. రాబోయే జీతం చేతికి ఎలా వస్తుందన్న ఆందోళనే అతడిలో నెలకొంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడమే ఇందుకు కారణం. ఈ ఆందోళన ఒక్క వెంకటేశ్వరరావుదే కాదు.. వేతన జీవులందరిదీ.. రాయవరం : పెద్ద నోట్ల రద్దు ప్రభావం అనంతరం బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన నిబంధనల నేపథ్యంలో నవంబర్ జీతం డిసెంబర్ నెలలో చేతికి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నెలనెలా వేతనాలు పొందే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. రూ.500, రూ.1,000 నోట్ల ప్రభావంతో గత 12 రోజులుగా తీవ్ర అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖాతాలో ఉన్న సొమ్ము విత్‌డ్రా చేయడానికి గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం, ఏటీఎంలలో డబ్బులు నిండుకోవడంవంటి పరిస్థితుల్లో సామాన్య, మ ధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితు ల్లో సగటు ఉద్యోగి నెలనెలా వేసుకునే బడ్జెట్ లెక్కలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు, ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో పని చేసే వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకటో తేదీనే జీతభత్యాలు అందుకుంటా రు. ప్రస్తుతం బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్న ఖాతాదారులకే రిజర్వ్ బ్యాంకు పంపిస్తున్న సొమ్ము సరి పోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒకటో తేదీన జీతాలు పొందే పరిస్థితి ఉంటుం దా? లేదా? అనే ప్రశ్నలు ఉద్యోగులను, పెన్షనర్లను వేధిస్తున్నాయి. విత్‌డ్రాయల్ పరిమితి రూ.24 వేలు రిజర్వ్‌బ్యాంక్ నిబంధనల ప్రకారం బ్యాంకుల నుంచి వారానికి రూ.24 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంది. అయినప్పటికీ బ్యాంకుల్లో తగినంత నగదు లేకపోవడంతో ఒక్కో ఖాతాదారుకు రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాము జీతభత్యాలు ఎలా పొందాలోనని ఉద్యోగులు, పెన్షనర్లు అయోమయానికి గురవుతున్నారు. ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ నుంచి జిల్లాకు పెద్ద మొత్తంలో నగదు వస్తేనే కానీ వారికి ఉపశమనం కలిగే పరిస్థితి కనిపించడంలేదు. ప్రతి ఉద్యోగికి జీతభత్యాలు వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. బ్యాంకు నుంచి పరిమితంగా డ్రా చేసే సొమ్ముతో నెలవారీ బడ్జెట్ ఎలా లాక్కురావాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. నెల జీతంతో ఇల్లు గడవని చిరుద్యోగులు డిసెంబరు నెలలో కళ్లముందు కనిపి స్తున్న భవిష్యత్తును తలచుకుని ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు సడలిస్తేనే.. జీతభత్యాల కింద జమయ్యే నగదును పూర్తి స్థాయిలో డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాం డ్ చేస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.52 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరో 40 వేల మంది ప్రభుత్వ పింఛన్ దారులు ఉన్నారు. ఉద్యోగులకు హోదానుబట్టి రూ.20 వేల నుంచి రూ.లక్ష పైబడి వేతనాలు వస్తున్నాయి. ఒక్కో ఉద్యోగికి సరాసరిన రూ.30 వేలు చూసినా కేవలం ఉద్యోగుల వేతనాల రూపేణా సుమారు రూ.150 కోట్లు అవసరమవుతాయి. ఉద్యోగుల వేతనాలు నగదు రూపంలోనే చెల్లించాలని ఇప్పటికే గోవా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. నగదు రూపంలో చెల్లించాలి ఉపాధ్యాయుల వేతనాలను ఎంఈవో కరెంట్ అకౌంట్‌కు వేసి దానినుంచి నగదు రూపంలో వేతనాలు చెల్లించాలి. లేకుంటే ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – టీవీ కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ గ్రూపు చెక్కు ద్వారా చెల్లించాలి గతంలో చెల్లించిన మాదిరిగా ఉపాధ్యాయులకు గ్రూపు చెక్కు రూపంలో వేతనాలు చెల్లించాలి. రోజుకు రూ.2 వేల చొప్పున ఏటీఎంల ద్వారా నగదు తీసుకోవడం ఇబ్బంది కలుగుతోంది. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ పరిస్థితిని చక్కదిద్దాలి బ్యాంకుల నుంచి వేతన సొమ్మును విత్‌డ్రా చేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టం. ప్రభుత్వం చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. లేకుంటే ఉద్యోగులకు కష్టాలు తప్పవు. – సీహెచ్ ప్రదీప్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ అవసరమైనంత నగదు పంపాలి ఉద్యోగులకు సరిపడినంత నగదును బ్యాంకులకు రిజర్వు బ్యాంకు పంపించాలి. ఉద్యోగుల వేతనాలను పూర్తిస్థాయిలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించాలి. నగదు రహిత లావాదేవీలు జరిపే పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. ఈ నెలకు మాత్రం వెసులుబాటు కల్పించాలి. – పితాని త్రినాథరావు, జేఏసీ జిల్లా కన్వీనర్, కాకినాడ -
ఆరో రోజూ అవే అవస్థలు
క్యూ లైన్లలో సామాన్యులు ఉదయం నుంచే ఏటీఎంల వద్ద పడిగాపులు నల్లధనం మార్పునకు పేదలే పావులు సాక్షి, రాజమహేంద్రవరం : వారం రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. వెయ్యి, రూ.500 నోట్లు మార్చుకునేందుకు, నగదు డిపాజిట్ చేసేం దుకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులుదీరుతున్నారు. చంటి బిడ్డలతో క్యూలైన్లలో నిలబడలేక అల్లాడిపోతున్నారు. ఉదయం వచ్చిన వారు నగదు మార్చుకునే సరికి సాయంత్రం అవుతోంది. మధ్యాహ్నం భోజనం మానుకుని క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఎక్కడ పక్కకు వెళితే తమ స్థానం పోతుందోననే భయంతో అక్కడే ఉండి పోతున్నారు. నల్లధనం బయటకు వస్తుందో రాదో తెలియదుకాని తమ రోజువారీ ఉపాధిని మానుకొని నగదులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. గం టల తరబడి నిలబడితే రూ.4500 ఇస్తున్నారని, ఇవి తీసుకున్నా చిల్లర కోసం మళ్లీ తిప్పలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తంలో కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు జమచేసిందే కావడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాలు కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ పెద్దనోట్ల చెలామణి రద్దు, పన్ను చెల్లిపుంపులపై ఏదైనా ఉపసమనం లభిస్తుందేమోనన్న ఆశాభావంతో ఉన్నారు. ఉదయం నుంచే ఏటీఎంల ముందు బారులు పెద్దనోట్లు చెలామణి లేకపోవడం..చేతిలో ఉన్న రెండు వేల నోటుతో చిన్నపాటి అవసరాలు తీర్చుకునే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు.జిల్లాలో ఉన్న 811 ఏటీఎంలలో కేవలం 30 శాతం ఏటీఎంలలో మాత్రమే సిబ్బంది నగదు పెడుతున్నారు. దీంతో ప్రజలు రూ.100 నోట్ల కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే నగదు అందుబాటులో ఉంచుతున్నారన్న సమాచారంతో ఆ వైపు పరుగులు తీస్తున్నారు. పేదలతో నగదు మార్చుతున్న పెద్దలు కొందరు రాజకీయ నేతలు తమ అనుచరులను ఉపయోగించి పేదల ద్వారా నగదు మార్చుతున్నారు. ఖాతా లేకపోయినా ఆధార్ కార్డు నకలు, బ్యాంకు ఫారం నింపి ప్రతి వ్యక్తి రూ.4500 విలువైన పెద్దనోట్లు మార్చుకునే వెలుసుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న నేతలు నగదు మార్చి ఇచ్చిన వారికి 10 శాతం కమిష¯ŒS ఇస్తున్నారు. నేతల అనుచరలు తమ వెంట తిరిగే కుర్రాళ్లకు నగదు ఇచ్చి మహిళలతో బ్యాంకుల వద్దకు పంపిస్తున్నారు. వారు ఎనాగ్జర్–5 ఫారం నింపి ప్రతి ఒక్కరికీ రూ.4,500 చొప్పున ఇస్తున్నారు. నగదు మార్చిన తర్వాత అక్కడే తిరిగి తీసుకుంటున్నారు. ఈ విధంగా జిల్లాలో ఫైనా¯Œ్స వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ప్రజా ప్రతినిధి తన వద్ద ఉన్న నగదు మొత్తాన్ని మార్చుకుంటున్నట్లు సమాచారం. ఉన్నోళ్లు లేనోళ్లు ఒకటేనా చేతిలో నగదు లేదు. పెద్దనోట్లు తీసుకోవడంలేదు. నగదు మార్చుకోవడానికి వచ్చాం. ఇంటి దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో బాబును కూడా తీసుకొచ్చాను. నల్లధనం బయటకు తీయడానికి నోట్ల రద్దు అని చెబుతున్నారు. ఉన్నోళ్లు లేనోళ్లు ఒకటేనా?. మాకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు. – డి.ధనమ్మ, రాజమహేంద్రవరం అనుమతి తీసుకుని వచ్చా మాది గుంటూరు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను. డబ్బులు అయిపోయాయి. ప్రిన్సిపాల్ అనుమతి తీసుకుని వచ్చాను. నిన్న మధ్యాహ్నం వచ్చి క్యూలో నిలబడ్డాను. గంట తర్వాత ఏటీఎంలో నగదు అయిపోయింది. తిరిగి ఈ రోజు వచ్చాను. క్లాసులు పోతున్నా తప్పడంలేదు. – వి.పావని, బీఎస్సీ -
తెర పడేదెప్పుడో?
తీరని పాత నోట్ల మార్పిడి కష్టాలు సెలవు రోజైనా బ్యాంకుల ముందు బారులు ఆదివారం మరింతగా పెరిగిన రద్దీ ఉదయం ఏడు గంటల నుంచే క్యూలు పని ఒత్తిడితో బ్యాంకు సిబ్బంది సతమతం పేదలతో నల్లధనం మార్పించుకుంటున్న పెద్దలు రూ.2 వేల నోటుకు చిల్లర దొరకక ప్రజల అవస్థలు సాక్షి, రాజమహేంద్రవరం : కరెన్సీ కష్టాలకు ఇప్పట్లో తెర పడే పరిస్థితి కనిపించడంలేదు. సెలవు రోజైన ఆదివారం కూడా రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ముందు ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు క్యూలు కట్టారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఆదివారం రద్దీ పెరిగిందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. పాత నోట్లు మార్చుకునేందుకు మహిళలు, కూలీలు, మధ్యతరగతి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని బ్యాంకులు లేకపోవడంతో ప్రజలు పట్టణాల బాట పడుతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్న బ్యాంకు సిబ్బంది ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతున్న బ్యాంకులు రాత్రి 8 గంటల వరకూ సేవలందిస్తున్నాయి. పాత నోట్ల మార్పిడి, జమ చేయడం కోసం వచ్చేవారితో సిబ్బంది క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రాత్రి 8 తర్వాత లావాదేవీలు నిలిచినా.. తరువాత అంతర్గతంగా జరిగే పనులు రాత్రి 2 వరకూ సాగుతున్నాయి. 4 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతూండడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రూ.100 నోట్లకు కొరత పాతనోట్లు మార్చుకుని రూ.2 వేల నోట్లు తీసుకున్న సంతోషంలో ఉన్న సామాన్యులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రూ.2 వేల నోటుకు చిల్లర లేకపోవడంతో చేతిలో నగదు ఉన్నా అవసరానికి ఉపయోగపడని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకే రూ.2 వేల నోట్లతోపాటు రూ.100 నోట్లు ఇస్తున్నాయి. బ్యాంకులో ఖాతా లేకుండా నగదు మార్చుకునేందుకు వస్తున్నవారికి రూ.2 వేల నోట్లు ఇస్తున్నారు. ఏటీఎంలలో పెడుతున్న రూ.100 నోట్లు రెండు మూడు గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. డిమాండుకు తగినట్టుగా రూ.100 నోట్ల సరఫరా లేకపోవడంతో బ్యాంకు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. వ్యాపారం కోసం పెద్ద నోట్ల స్వీకరణ తాజా పరిస్థితుల్లో వ్యాపారులు పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ నోట్లను డిసెంబర్ 31 వరకూ మార్చుకోవచ్చని అవగతమైన తర్వాత కొంతమంది రూ.500 నోట్లు స్వీకరిస్తున్నారు. నాలుగు రోజులుగా వ్యాపారం తగ్గిపోవడంతో గత్యంతరం లేక ఆదివారం మార్కెట్లో కొందరు చిరు వ్యాపారులు రూ.500 నోట్లు తీసుకుంటున్నారు. జోరుగా కమీషన్ల వ్యాపారం పేదలు, సామాన్యుల ద్వారా నల్లధనం మార్చుకునే ప్రణాళికలు పెద్దలు ఆచరణలో పెడుతున్నారు. అలాగే డ్వాక్రా సంఘాల మహిళలను కూడా పాత నోట్ల మార్పిడికి ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్కరు గరిష్టంగా రూ.4 వేలు మార్చుకోవచ్చు. ఇదే అదునుగా నల్ల కుబేరులు వారితో తమ డబ్బు మార్చుకునే పనిలో పడ్డారు. ఇందుకుగాను వారికి 10 శాతం కమీష¯ŒS ఇస్తున్నారు. డ్వాక్రా సంఘాల అధ్యక్షుల సహాయంతో కొందరు రాజకీయ నేతలు పెద్ద మొత్తంలో నల్లధనం మార్చుకుంటున్నట్లు సమాచారం. అందుకే నాలుగు రోజులైనా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గకపోగా పెరుగుతోందని అంటున్నారు.