- లీడ్ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం
వారం రోజుల్లో సమస్య పరిష్కారం
Published Fri, Dec 2 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
బాలాజీచెరువు(కాకినాడ):
మరో వారం రోజుల్లో నగదు సమస్య పరిష్కారమవుతుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నవంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల బ్రాంచీల ద్వారా దాదాపుగా ప్రజల నుంచి రూ.3,800 కోట్ల డిపాజిట్లు సేకరించగా రూ.1200 కోట్ల మార్పిడి చేశామని, వాటిలో ఆంధ్రాబ్యాంక్ బ్రాంచీల ద్వారా ఇప్పటి వరకూ రూ600 కోట్లకు పైగా నగదు మార్పిడి చేశామన్నారు. జిల్లాలో అన్ని ఏటీఎం బ్రాంచీలు కలిపి 931 ఉండగా వీటిలో దాదాపు 50 శాతం ఏటిఏంలు నిరంతరాయంగా 24 గంటలు పని చేస్తున్నాయని, వీటిలో అధికంగా ఎస్‌బీఐ ఏటీఎంలు ఉన్నాయన్నారు.ప్రభుత్వం నగదు రహిత విధానం ప్రవేశపెట్టిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా ప్రారంభించి రూపే కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు..ఖాతాల ప్రారంభానికి బ్యాంకులలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు అదేశాలు జారీ చేశామని, స్వచ్ఛంద సంస్థలతోపాటు విద్యార్థుల సహకారం తీసుకుంటున్నామన్నారు.
Advertisement
Advertisement