ఆర్థిక ఇబ్బందులో ఉన్న ఓ మహిళకు కుంటుంబ పోషణ భారమైంది.. పూట గడవడమే కష్టంగా మారింది.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. తప్పని పరిస్థితుల్లో కొడుకుకు చదువు చెబుతున్న టీచర్‌ను సాయం కోసం అర్థించింది. పిల్లల కడుపు నింపడం కోసం రూ. 500 ఉంటే ఇవ్వాలని కోరింది.. ఊహించని విధంగా ఆమె ఆకౌంట్‌లోకి రూ. 51లక్షలు వచ్చి చేరాయి. దీంతో ఆశ్చర్యపోయిన మహిళ ఆనందంతో కంటతపడి పెట్టుకుంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన సుభద్ర అనే 46 ఏళ్ల మహిళకు ముగ్గురు కొడుకులు. ఆమె భర్త గత ఆగష్టులో మరణించాడు.. కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి మరణంతో వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మహిళ ఒక్కతే కాయాకష్టం చేసుకొని పిల్లలను సాకుతోంది. చిన్న కొడుకు రిబ్రల్ పాల్సి వ్యాధితో కదల్లేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు.
కుటుంబం గడవడానికి మరో దారి కనిపించకపోవడంతో రెండు కొడుకు అభిషేక్ చదువుతున్న పాఠశాలలోని హిందీ టీచర్‌ర్ రిగిజా హరికుమార్‌ను కొంత డబ్బు సాయం చేయాలని అడిగింది. తన ముగ్గురు పిల్లల ఆకలి తీర్చేందుకు ఓ 500 రూపాయలు ఉంటే ఇవ్వాలని దీనంగా వేడుకుంది. ఆ కుటుంబం పరిస్థితిని చూసి చలించిన ఉపాధ్యాయురాలు తన వంతు సాయంగా వెయ్యి రూపాయలు అందించింది.
చదవండి: సిస్టర్‌హుడ్.. అత్యంత అవసరమైన బంధం
అంతటితో ఆగకుండా సుభద్ర ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబాన్ని దగ్గరుండి పరిశీలించింది. ఈ క్రమంలో ఆ కుటుంబం పుట్టేడు పేదరికంలో మగ్గుతుండటం చూసింది. ఇల్లు సరిగా లేకపోవడం, పిల్లలు తినడానికి కూడా ఏం లేని స్థితిని చూసి వారికోసం ఇంకేమైనా చేయాలని ఆలోచించింది. దీంతో తన పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆదుకోవాలని కోరుతూ.. క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. దాతలు సాయంగా అందించే డబ్బు నేరుగా ఆమె అకౌంట్‌కు బదిలీ అయ్యేలా సుభద్ర బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది.
టీచర్ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో రెండు రోజుల్లోనే వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి విరాళంగా రూ. 51 లక్షలు మహిళ బ్యాంక్ ఖాతాలోకి వచ్చాయి. దీంతో టీచర్ గొప్ప మనసును పలువురు అభినందిస్తున్నారు. ఈ విషయంపై ఉపాద్యాయురాలు గిరిజా మాట్లాడుతూ.. ‘వారి గురించి పోస్ట్ చేస్తున్నప్పుడు నా మనస్సులో రెండే ఆలోచనలు ఉన్నాయి. 1. అసంపూర్తిగా ఉన్న వారి ఇంటిని పూర్తిగా నిర్మించి మంచిగా జీవించాలి. 2. ఆ తల్లి తన పిల్లలకు ఆహారం చదువు కోసం ఎవరి ముందు చేయిచాచకూడదు. ఈ రెండింటి గురించే ఆలోచించి ఇలా చేశారు. వచ్చిన డబ్బుని ఇంటికోసం ఉపయోగించి, మిలిన దానిని వారి ఖర్చుల కోసం బ్యాంకులో జమ చేస్తాం. సాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు’ అంటూ ఓ ఫోటోను పంచుకున్నారు.
చదవండి: Covid Alert: కరోనా ముప్పు ముగియలేదు.. మళ్లీ మాస్కులేద్దాం
Comments
Please login to add a commentAdd a comment