
ఇలాంటి విషయాల్లో గవర్నర్ అడ్డంకిగా మారకూడదు. దీన్ని ముందు క్లియర్ చేయమంటూ...
ఉపాధ్యాయుల శిక్షణ కోసం విదేశాలకు పంపాలన్న ప్రతిపాదనపై ఆప్ వర్సెస్ గవర్నర్ మధ్య రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వివాదం ముదురుతోందే తప్ప పుల్‌స్టాప్ పడటం లేదు. మరోవైపు ఆప్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకి ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్స్‌ని శుక్రవారం మళ్లీ పంపించింది.
ఉపాధ్యాయుల శిక్షణ విషయంలో ఒక గవర్నర్ అడ్డంకిగా మారకూడదని ఆప్ గట్టిగా వాదిస్తోంది. ఆయన వెంటనే ఈ ప్రతిపాదనను క్లియర్ చేయాల్సిందేనని ఆప్ పట్టుబడుతోంది. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఫైళ్లను గవర్నర్ అడిగే అవకాశం లేదని కౌంటర్ ఇచ్చింది. అంతేగాదు టీచర్ ట్రిప్‌కి సంబంధించిన ప్రతిపాదన ఫైల్‌ని క్లియర్ చేయమంటూ ఆప్ మళ్లీ గవర్నర్‌కి పంపించడం గమనార్హం.
(చదవండి: ప్రైమరీ టీచర్లకు ఫిన్‌లాండ్‌లో శిక్షణ: ఆప్ వర్సస్ గవర్నర్ మధ్య రగడ)