teachers issues
-
టీచర్లను బేషరతుగా విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: అరెస్ట్ చేసిన టీచర్లను బేషరతుగా విడుదల చేయడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఉందని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘కేసీఆర్... పసిపిల్లలు ఏడుస్తున్నా నీ మనసు కరగడం లేదా? తల్లులను, పిల్లలను వేరుచేసి అరెస్ట్ చేస్తారా? ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప మానవ సంబంధాలు, భావోద్వేగాలు నీకు పట్టవా? మానవత్వం లేదా’అని ప్రశ్నించారు. భార్యభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని అడగడమే నేరమా అని నిలదీశారు. కనీసం ఈ అంశంపై వారితో చర్చించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం సిగ్గు చేటన్నారు. 317 జీవోను సవరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న టీచర్లపట్ల పోలీసులు అనుసరించిన వైఖరి అత్యంత అమానుషంగా ఉందన్నారు. భార్యను ఒక దగ్గర, భర్తను మరోచోట బదిలీ చేయడం అన్యాయమని, దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చాక 317 జీవోను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. -
టీచర్స్ ట్రిప్ ఫైల్ని క్లియర్ చేయాల్సిందే! వెనక్కి తగ్గని ఆప్
ఉపాధ్యాయుల శిక్షణ కోసం విదేశాలకు పంపాలన్న ప్రతిపాదనపై ఆప్ వర్సెస్ గవర్నర్ మధ్య రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వివాదం ముదురుతోందే తప్ప పుల్‌స్టాప్ పడటం లేదు. మరోవైపు ఆప్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకి ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్స్‌ని శుక్రవారం మళ్లీ పంపించింది. ఉపాధ్యాయుల శిక్షణ విషయంలో ఒక గవర్నర్ అడ్డంకిగా మారకూడదని ఆప్ గట్టిగా వాదిస్తోంది. ఆయన వెంటనే ఈ ప్రతిపాదనను క్లియర్ చేయాల్సిందేనని ఆప్ పట్టుబడుతోంది. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఫైళ్లను గవర్నర్ అడిగే అవకాశం లేదని కౌంటర్ ఇచ్చింది. అంతేగాదు టీచర్ ట్రిప్‌కి సంబంధించిన ప్రతిపాదన ఫైల్ని క్లియర్ చేయమంటూ ఆప్ మళ్లీ గవర్నర్‌కి పంపించడం గమనార్హం. (చదవండి: ప్రైమరీ టీచర్లకు ఫిన్లాండ్లో శిక్షణ: ఆప్ వర్సస్ గవర్నర్ మధ్య రగడ) -
టీచర్ల సమస్యలపై రాజీలేని పోరాటం
అభినందనసభలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల, అధ్యాపకుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. స్థానిక రాయల్ ఫంక్షన్ హాలులో ఆదివారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో కత్తి నరసింహారెడ్డిని సన్మానించారు. వక్తలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ని బద్ధతతో పనిచేస్తే ఆదరిస్తారనేందుకు కత్తి నరసింహారెడ్డి విజయమే నిదర్శనమన్నారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ సామాన్య టీచరు, కార్పొరేట్ శక్తుల మధ్య జరిగిన ఎన్నికల్లో చివరకు సామాన్య టీచరువైపే తీర్పు ఇచ్చారన్నారు. తనను ఓడించేందుకు కొందరు కుట్రపన్ని చివరకు తనపేరు ఉన్న వ్యక్తిని వెతికి తీసుకొచ్చి డబ్బులిచ్చి డమ్మీగా నిలబెట్టారన్నారు. ఓటర్లలో గందరగోళం సృష్టించాలని చూశారన్నారు. మే«థావులైన టీచర్లు, అధ్యాపకులు ఇలాంటి కుయక్తులను తిప్పి కొట్టారన్నారు. 28 ఏళ్ల పాటు ఉద్యమానికి ఎంతో నీతి నిజాయితీగా పని చేశానని, అంతే నీతి నిజాయితీగా భవిష్యత్తులోనూ పని చేస్తానన్నారు. తనకు మద్ధతిచ్చిన అన్ని సంఘాల నాయకులు, టీచర్లు, అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుధీర్‌బాబు, ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, ఆర్‌యూపీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రవిచంద్ర, స్కూల్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్యారుఖాన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జిలాన్, వివిధ సంఘాల జిల్లా నేతలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.