Lt Governor
-
ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం.. అతిషి Vs ఎల్జీ సక్సేనా
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఢిల్లీ లెఫ్లినెంట్ గవర్నర్‌పై ముఖ్యమంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, ఆమెకు వ్యాఖ్యలపై రాజ్‌భవన్ వర్గాలు స్పందిస్తూ ఆప్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.ముఖ్యమంత్రి అతిషి తాజా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఢిల్లీలో మతపరమైన కట్టడాలను కూల్చివేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. సక్సేనా ఆదేశాల మేరకు ప్యానెల్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆదేశాలపై తమకు సమాచారం ఉందని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో అతిషి కామెంట్స్‌పై గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఆప్ సర్కార్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో మతపరమైన స్థలాలను కూల్చివేసేందుకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒకవేళ.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వక విధ్వంసానికి పాల్పడే శక్తులు ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీలో మరింత నిఘా పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.Delhi CM Atishi's big allegation against the L-G:- 'L-G orders the demolition of temples'- 'Mandirs and religious places targeted'- 'Hindu and Buddhist temples targeted'However, the Delhi L-G has dismissed all allegations of 'temple demolition' & accused Atishi of… pic.twitter.com/66WTV5Lpvj— TIMES NOW (@TimesNow) January 1, 2025 ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆప్ నేతలు ప్లాన్ చేస్తున్నాయి. ఇక, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన విజయంతో అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అటు, కాంగ్రెస్ కూడా ఢిల్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. -
కేజ్రీవాల్‌కు షాక్..! లిక్కర్ కేసుపై ఎల్జీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత,ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది.లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకుగాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనుమతిచ్చినట్లు సమాచారం. దీంతో లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ప్రత్యేక కోర్టు విచారణకు ఇక లైన్ క్లియరవనుంది. సీఆర్పీసీ ప్రకారం పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా కావాలి అయితే ఈడీ కేసుల్లో మాత్రం ఈ అనుమతి గతంలో అవసరం లేదు. తాజాగా నవంబర్ 6వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈడీ కేసుల్లో కూడా పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమైంది. దీంతో ఈడీ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి కోరింది.కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. బయటికి వచ్చిన తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలుండడంతో ప్రస్తుతం ఆయన వాటిపైనే ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎన్నికల కోసం ఆప్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. -
జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదా తీర్మానానికి ఎల్జీ ఓకే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదముద్రవేశారు. గురువారం సమావేశమై కేబినెట్ ఆమోదించిన తీర్మానానికి ఎల్జీ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపు, రాజ్యాంగబద్ధ హక్కులను తిరిగి పొందేందుకు పాత గాయాలను మాన్పే పూర్తిరాష్ట్ర హోదా పొందే ప్రక్రియలో ఈ తీర్మానం తొలి అడుగు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీరీల ప్రత్యేక గుర్తింపే నూతన ప్రభుత్వం అనుసరించనున్న విధాననిర్ణయాలకు భూమిక అని ఆయన అన్నారు. నవంబర్ నాలుగోతేదీన అసెంబ్లీ సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం ఒమర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే రద్దయిన 370 ఆరి్టకల్‌ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి తీర్మానాలు జరగకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కొలువుతీరిన కొద్దిరోజులకే ఒమర్ సర్కార్ అప్పుడే కేంద్రప్రభుత్వానికి లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి. -
సీఎం సామాన్లనే బయటపడేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం వేదికగా ఆప్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి అధికార ఆధిపత్యపోరు కనిపించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకు రాలు అతిశికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడం ఈ వివాదానికి ఆజ్యంపోసింది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిశి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిశికి సంబంధించిన సామగ్రిని బయట పడేశా రని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో మీడి యా సమావేశంలో మాట్లాడారు. ‘‘ సీఎం అతిశికి అధికారిక బంగ్లాను కేటాయించలేదు. అందుకే ఇ న్నాళ్లూ సీఎంగా ఉన్నపుడు వినియోగించి, కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకే అతిశి మారారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా ఆ బంగ్లాను బీజేపీ అగ్రనేతకు కేటాయించాలని కుట్ర పన్నింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను అడ్డుపెట్టుకుని అతిశికి చెందిన సామగ్రిని బయట పడేశారు. అంతకుముందు అదే బంగ్లాలోని క్యాంప్ ఆఫీస్‌లో అతిశి ఒక సమావేశం కూనిర్వహించారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయిన బీజేపీ ఇలా చవకబారు బంగ్లా రాజకీయాలు చేస్తోంది’’ అని సంజయ్ వివరించారు.బంగ్లాకు సీలు వేయాల్సిందే: బీజేపీవివాదంపై బీజేపీ దీటుగా స్పందించింది. ఢిల్లీ శాసనసభలో విపక్షనేత, బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ‘‘ గత ఏడాది కేజ్రీవాల్ మంత్రివర్గంలోకి అతిశి చేరినప్పుడే కేబినెట్ మంత్రి హోదాలో ఆమెకు మథుర రోడ్డులోని ఏబీ–17 బంగ్లాను ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) గతంలోనే కేటాయించింది. ఆ బంగ్లా ఉండగా ఈ బంగ్లాతో సీఎంకు పనేంటి?. కేజ్రీవాల్ వెళ్లిపోయినా సీఎం బంగ్లా తాళాలు పీడబ్ల్యూడీకి అప్పజెప్పలేదు. ఇప్పుడు అతిశి అక్రమంగా ప్రవేశించిన ఈ బంగ్లాకు సీలు వేయాల్సిందే’’ అని గుప్తా డిమాండ్‌చేశారు.అక్రమంగా తరలించారు: సీఎం కార్యాలయం‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ ఆదేశాలను శిరసావహిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. అతిశి వస్తువులను బయట పడేయించారు. బీజేపీ బడా నేతకు ఈ బంగ్లాను కేటాయించాలను ఎల్జీ ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారాన్ని అందుకోలేని బీజేపీ ఇప్పుడు సీఎం బంగ్లాను ఆక్రమించాలని చూస్తోంది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.అది అధికారిక బంగ్లా కాదు: ఎల్జీ వర్గాలుసీఎంఓ ప్రకటన తర్వాత ఎల్జీ కార్యాలయం వర్గాలు స్పందించాయి. ‘‘ సీఎం హోదాలో అతిశికి ఆ బంగ్లాను కేటాయించలేదు. అనుమతి లేకుండా అతిశి ఆమె సామగ్రిని బంగ్లాలోకి తరలించారు. తర్వాత ఆమెనే వాటిని బయటకు తరలించారు. ప్రస్తుతా నికి ఆ బంగ్లా పీడబ్ల్యూడీ అధీనంలోనే ఉంటుంది. గతంలో సమకూర్చిన వస్తువులను సరిచూసు కున్నాకే కేటాయిస్తారు’’ అని ఎల్జీ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. -
నేడే కేజ్రీవాల్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4.30కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్ రాజీనామా లేఖ సమరి్పస్తారని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని, ప్రజలు గెలిపించాకే తిరిగి సీఎం కురీ్చలో కూర్చుంటానని కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీకి నవంబర్లోనే ముందస్తు ఎన్నికలు పెట్టాలని కూడా ఆ సందర్భంగా ఆయన ఈసీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజంతా ఆప్ నేతలతో కేజ్రీ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన ప్రకటనపై స్పందన ఎలా ఉందని పార్టీ అత్యున్నత నిర్ణాయక విబాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఆరా తీశారు. సీఎం అభ్యర్థిపై ఒక్కక్కరి నుంచీ వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. అంతకుముందు ఉదయం కీలక నేతలు మనీశ్ సిసోడియా, రాఘవ్ ఛద్దా తదితరులతోనూ ఈ అంశంపై లోతుగా చర్చలు జరిపారు. సీఎం పదవికి మంత్రులు ఆతిశి, గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ తదితరుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు స్పీకర్ రాంనివాస్ గోయల్, కేజ్రీవాల్ భార్య సునీత పేర్లపైనా లోతుగా చర్చ జరుగుతున్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో 12 ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానాలున్నాయి. కనీసం మరో ఆరు స్థానాల్లో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, లేదా మైనారిటీ నేతకు చాన్స్ దక్కొచ్చన్న వాదనా ఉంది. దాంతో ఎస్సీ, మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఆప్ ఎమ్మెల్యేల పేర్లు కూడా కొత్తగా తెరపైకి వస్తున్నాయి! మంగళవారం కేజ్రీవాల్ రాజీనామాకు ముందు ఉదయం 11.30కు ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగనుంది. సీఎం అభ్యర్థిపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే ఇమ్రాన్ హుసేన్ పేరు ఖరారైనా ఆశ్చర్యం లేదని ఆప్ ముఖ్య నేత ఒకరు చెప్పడం విశేషం!హరియాణాలో సుడిగాలి ప్రచారం! రాజీనామా అనంతరం కేజ్రీవాల్ హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. హరియాణలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్కడ కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకోలేదు. మొత్తం 90 స్థానాల్లో ఒంటరిగానే అభ్యర్థులను బరిలోకి దింపింది. జమ్మూకశ్మీర్‌లో కూడా కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని సమాచారం. -
సుప్రీం కోర్టులో ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు(ఎల్జీ) ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎల్జీకి నామినేట్ చేసే అధికారం వచ్చిందని తెలిపింది. ఎంసీడీలో 10 మంది కౌన్సిలర్లను మంత్రి మండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇది చట్టబద్ధమైన అధికారమని, కార్యనిర్వాహక అధికారం కాదని స్పష్టం చేసింది. కార్పొరేషన్ సభ్యుల నామినేషన్‌కు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సలహా తీసుకోవాల్సిన అవసరం ఎల్జీకి లేదని పేర్కొంది.2022 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ గెలుపొందింది. కాగా, మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి ఆప్ 134 స్థానానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్ చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఎల్జీకి కౌన్సిర్లను నియమించే అధికారం లేదని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అనంతరం ఈ వ్యవహారంపై ఆప్ సుప్రీం కోర్టును అశ్రయించింది. -
తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారు
న్యూఢిల్లీ: తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. వైద్యులు సూచించిన మందులను కూడా ఆయన వాడకపోవచ్చని పేర్కొన్నారు. తీహార్ జైలు సూపరింటెండెంట్ నివేదికను ప్రస్తావిస్తూ ఎల్జీ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌కు లేఖ రాసినట్లు రాజ్‌భవన్ వర్గాలు శనివారం తెలిపాయి. కేజ్రీవాల్‌కు ఇంటి వద్ద నుంచి వచ్చిన ఆహారాన్ని సరిపోను అందజేస్తున్నా కూడా ఆయన కావాలనే తక్కువ కేలరీలున్న ఆహారం తింటున్నట్లుగా ఆధారాలున్నాయన్నారు. గ్లూకో మీటర్ టెస్ట్ రీడింగ్‌కు, కంటిన్యువస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టం రీడింగ్‌కు మధ్య కనిపిస్తున్న భారీ వ్యత్యాసంపై అధికారులు పరిశీలన జరపాలని సూచించారు.ఎల్జీ వైద్యుడనే విషయం తెలియదుఎల్జీ వీకే సక్సేనా రాసిన లేఖపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. నాకు తెలిసినంత మటుకు ఆయన గతంలో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారు. వీకే సక్సేనా డాక్టర్ అని, ఆరోగ్య అంశాల్లో మంచి నిపుణుడనే విషయం నాకు తెలియదు. ఎప్పుడైనా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌ను చదివి ఉండేవాళ్లం’ అంటూ ఎద్దేవా చేశారు. తమ నేతను చంపేందుకు బీజేపీ దుర్మార్గపు పథకం పన్నిందని ఆరోపించారు. -
ఢిల్లీ చట్టంపై మళ్లీ రగడ
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మళ్లీ గ్యాప్‌ను పెంచుతోంది. దేశ రాజధానిలో పోస్టింగ్‌లు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పక్కకు పెడుతూ కేంద్రం కొత్త చట్టాన్ని తెచచింది. దీనిపై చర్చించడానికి సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీ సెషన్‌ను ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం కొత్త చట్టాలను తీసుకురావడంపై ఆప్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేశాయి. ఈ బిల్లును సుప్రీంకోర్టులోనూ సవాలు చేసింది ఆప్. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సెషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్జీ సక్సేనా ఆగష్టు 11నే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖను పంపించారు. ఈ లేఖకు సంబంధించిన ఓ కాపీని ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అసెంబ్లీకి సమర్పించారు. అసెంబ్లీ సమావేశాలు నియమాలకు అనుగణంగానే జరుగుతన్నాయని రాఖీ బిర్లా తెలిపారు. ఎప్పుడు సమావేశం కావాలనేది పూర్తిగా విధాన సభ విశేషాధికారమని పేర్కొన్నారు. క్యాబినెట్ పిలుపు మేరకే చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఎల్జీ సక్సేనా ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం పాలసీపై కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేసిన సందర్భంలోనూ గత ఏప్రిల్‌లో అసెంబ్లీ సమావేశం అయింది. అప్పుడు కూడా ఎల్జీ సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు. ఇదీ చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. -
సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట..
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్‌కు ఊరట లభించింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చైర్మన్ నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై తుది విచారణను జూలై 11న చేపడతామని పేర్కొంది. అప్పటి వరకు డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్(రిటైర్డ్) ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఢిల్లీ స్పీకర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జీగా పనిచేసిన జస్టిస్ ఉమేష్ కుమార్ జూన్ 21న డీఈఆర్సీ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ఆరోజు ఢిల్లీ విద్యుత్‌శాఖ మంత్రి అతిషి అనారోగ్యానికి గురవ్వడంతో.. జస్టిస్ కుమార్ ప్రమాణా స్వీకారం జూలై 6కు వాయిదా పడింది. అయితే ఈ ఉమేష్ కుమార్ నియమాకాన్ని(గవర్నర్ ఆదేశాలను) వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆదేశించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది. అదే విధంగా డీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ ఉమేష్ కుమార్ స్వీకారోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాక జస్టిస్ కుమార్ ప్రమాణ స్వీకారం గురించి ఢిల్లీ స్పీకర్ వీకే సక్సేనా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరరాదని సూచించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తదుపరి విచారణ 11న చేపడతామని చెప్పడంతో.. ఉమేష్ కుమార్ నియామకం జూలై 11కు వరకు వాయిదా పడినట్లే. అయితే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్ జస్టిస్(రిటైర్డ్) సంగీత్ రాజ్ లోధా పేరును జూన్ 21న ప్రతిపాదించింది. అయితే ఆప్ ప్రభుత్వ విజ్ఞప్తిని పక్కన పెడుతూ జస్టిస్ కుమార్ పేరును ప్రకటిస్తూ కేంద్రం అదే రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై నియంత్రణకు సంబంధించి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సైతం ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో పోరాడుతోంది. తాజాగా డీఈఆర్సీ చైర్మన్ వివాదంతో వీరి మధ్య వైర్యం మరింత పెరిగినట్లైంది. చదవండి: పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు -
‘శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి’
న్యూఢిల్లీ: జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జమ్ము కాశ్మీర్ లెఫ్టి నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ,కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం చైర్మన్ వీరిని కలసి మహాసంప్రోక్షణ ఆహ్వాన పత్రికను అందజేశారు. జూన్ 3వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారికి వైవీ సుబ్బారెడ్డి వివరించారు. జూన్ 8వ తేదీ మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. చైర్మన్ వీరిద్దరినీ శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు, రోల్ నెంబర్.. నాదంటే.. నాది.. చివరికి! -
టీచర్స్ ట్రిప్ ఫైల్ని క్లియర్ చేయాల్సిందే! వెనక్కి తగ్గని ఆప్
ఉపాధ్యాయుల శిక్షణ కోసం విదేశాలకు పంపాలన్న ప్రతిపాదనపై ఆప్ వర్సెస్ గవర్నర్ మధ్య రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వివాదం ముదురుతోందే తప్ప పుల్‌స్టాప్ పడటం లేదు. మరోవైపు ఆప్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకి ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్స్‌ని శుక్రవారం మళ్లీ పంపించింది. ఉపాధ్యాయుల శిక్షణ విషయంలో ఒక గవర్నర్ అడ్డంకిగా మారకూడదని ఆప్ గట్టిగా వాదిస్తోంది. ఆయన వెంటనే ఈ ప్రతిపాదనను క్లియర్ చేయాల్సిందేనని ఆప్ పట్టుబడుతోంది. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఫైళ్లను గవర్నర్ అడిగే అవకాశం లేదని కౌంటర్ ఇచ్చింది. అంతేగాదు టీచర్ ట్రిప్‌కి సంబంధించిన ప్రతిపాదన ఫైల్ని క్లియర్ చేయమంటూ ఆప్ మళ్లీ గవర్నర్‌కి పంపించడం గమనార్హం. (చదవండి: ప్రైమరీ టీచర్లకు ఫిన్లాండ్లో శిక్షణ: ఆప్ వర్సస్ గవర్నర్ మధ్య రగడ) -
ఆప్ Vs గవర్నర్ల మధ్య చిచ్చురేపిన టీచర్ల ఫిన్లాండ్ పర్యటన!
ఆప్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య మళ్లీ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దాదాపు 30 మంది ప్రైమరీ టీచర్లను ఫిన్లాండ్కి శిక్షణ నిమిత్తం పంపాలన్న ప్రణాళిక నేపథ్యంలో ఇరువురు మధ్య మాటల ఘటర్షణకు దారితీసింది. ఐతే లెఫ్టినెంట్ గర్నర్ టీచర్ల పర్యటనను రద్దు చేసేలా ప్రశ్నలు సంధించారంటూ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు సిసోడియా ట్విట్టర్లో..."ప్రైమరీ టీచర్ల శిక్షణ కోసం విదేశాలకు పంపించే తొలి ప్రభుత్వం ఇది. గవర్నర్ దేశంలోనే టీచర్లకు శిక్షణ ఎందుకు ఇవ్వకూడదంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా పిల్లల భవిష్యత్తుకు ఖరీదు కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీని టార్గెట్ చేస్తూ..దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలకు వెళ్లే మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..కుటుంబాలతో సహా వెళ్లే మంత్రుల గురించి ప్రశ్నించారు. అప్పుడూ ఖర్చు, ప్రయోజనాల గురించి ఆలోచించారా! అని నిలదీశారు. పిల్లల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యంగ విరుద్ధంగా భావిస్తున్నారు. మీకు ముకుళిత హస్తలతో జోడించి మరీ చెబుతున్న ఢిల్లీ విద్యాభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకునే కుట్రలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీకి సాయం చేయొద్దు" అని ట్విటర్లో విజ్ఞప్తి చేశారు సిసోడియా. ఐతే లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఇది సరికాదని తాము ఫిన్లాండ్లో ప్రైమరీ టీచర్లకు శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ప్రతిపాదనను తిరస్కరించలేదని గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ...ఆప్ తన అహం కోసం ఏదిపడితే అది చేయడం మానుకోవాలి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆ వివరాలు అడిగే హక్కు ఆయనకు ఉంది. అయినా ఖర్చుల వివరాల గురించి వివరణ ఇవ్వడంలో సమస్య ఏమిటి ?. ఉపాధ్యాయుల గురించి ఇంత ఆందోళన చెందుతున్నప్పుడూ..ఇంకా నలుగురు ఉపాధ్యాయులకు ఎందుకు జీతాలను చెల్లించలేకపోయారు అని బీజేపీ పార్టీ నాయకుడు హరీష్ ఖురానా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉండగా, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రభత్వ సందేశాలుగా ఇచ్చే రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేసిన సుమారు రూ. 163.62 కోట్లను దాదాపు 10 రోజుల్లో చెల్లించాలని ఆప్‌ని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో ఢిల్లీలోని దాని కార్యాలయం, ఇతర ఆస్తులను సీలు చేస్తామని గవర్నర్ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది కూడా. (చదవండి: పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్! మేడమ్ అని పిలవకూడదు! విద్యాశాఖకు కీలక ఆదేశాలు) -
ఆరోపణలు మాని మీ పని మీరు చూసుకోండి!: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ ఆప్‌ల మధ్య స్కామ్ వర్సస్ స్కామ్ పోరు హోరాహోరిగా సాగుతుంది. ఈమేరకు ఢిల్లీలోని లెప్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్ బీజేపీ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలకితీసే ఎత్తుగడకు పూనుకుంది. అందులో భాగంలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ సంస్థలు టోల్‌టాక్స్ వసూళ్లలో రూ. 6 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయని, దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపముఖ్యముంత్రి మనీష్ సిసోడియాకు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన లేఖలో... "బీజేపీ ఆధ్వర్యంలోని ఎంసీడీలో జరిగిన సుమారు రూ. 6 వేల కోట్ల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రెండునెలల క్రితమే లేఖ రాశానని గుర్తు చేశారు. అంతేగాదు ప్రతిరోజూ ఢిల్లీలోకి ప్రవేశించే దాదాపు 10 లక్షల వాణిజ్య వాహనాల నుంచి టోల్ టాక్స్ వసూలు చేసే రెండు కంపెనీలతో ఎంసీడీ కుమ్మక్కయ్యిందని, అయితే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరదని ఆరోపించారు. ఐతే మీరు ఆ స్కామ్‌పై దృష్టి పెట్టలేకపోయారు. ఎందుకంటే అది బీజేపీ హయాంలో జరిగింది కాబట్టి వదిలేశారు. దాని బదులుగా నా ఇంటిపై సీబీఐ దాడులు జరిపించారు. లిక్కర్ స్కామ్‌లో బీజేపీ రూ. 10 వేల కోట్లు స్కామ్ జరిగిందంటే, మీరు రూ. 144 కోట్లు అన్నారు. ఆఖరికి సీబీఐ కోటీ రూపాయల స్కామ్ అంది. చివరికి మీరు జరిపించిన సీబీఐ దాడుల్లో ఏమి దొరకలేదు. కేవలం మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంపై ప్రతిరోజు కొత్త ఆరోపణలతో సీబీఐ దాడుల జరిపించే పనిలో బిజీగా ఉన్నారు. అయినా మీరు ముందు ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేసే బదులు మీరు నిర్వహించే శాఖలపై దృష్టి సారించండి. పెరిగిపోతున్న నేరాలను కట్టడి చేయండని, ఆక్రమణకు గురవుతున్న భూములను విముక్తి చేయమని కోరుతూ వస్తున్న లేఖలపై దృష్టి సారించండి" అని ఘటూగా విమర్శిసిస్తూ లేఖ రాశారు. అయినా 17 ఏళ్లుగా ఎంసీడీని పాలుస్తన్న బీజేపీ నగరాన్ని చెత్తకుప్పగా చేసిందని దుయ్యబట్టారు. (చదవండి: చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు) -
ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా తనకు నివేదిక అందజేయాలని చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత్ విద్యుత్ పథకంలో అక్రమాలు జరిగాయని, ఇందులో లోపాలున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌కు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించాయి. ఈ పథకం వెనుక భారీ కుంభకోణం ఉందంటూ న్యాయవాద వర్గాల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నాయి. ఉచిత విద్యుత్‌ను అడ్డుకొనే కుట్ర: కేజ్రీవాల్ తాము ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం పట్ల గుజరాత్ ప్రజలు ఆకర్శితులు అవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అందుకే ఢిల్లీలో ఉచిత్ విద్యుత్‌కు అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గుజరాత్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరిట ప్రజల రక్తం పీల్చేస్తోందని, వారికి కొంత ఊరటనివ్వాలని తాము సంకల్పిస్తే బీజేపీ సహించలేకపోతోందని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయాన్ని అడ్డుకోవడానికి కేంద్ర సర్కారు కుతంత్రాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. ఢిల్లీలో ఉచిత విద్యుత్ పథకంపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. -
ఏకకాల ఎన్నికలే ఉత్తమం
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్లడం భారత్ ముందున్న ప్రధాన సవాలని, అందుకోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నీతిఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ భేటీకి 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ హాజరయ్యారు. సమావేశంలో సీఎంలు వెలిబుచ్చిన అభిప్రాయాల్ని, సలహాల్ని విధాన నిర్ణయాల అమలులో పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని హామీనిచ్చారు. ముఖ్యమంత్రుల ప్రసంగం అనంతరం మోదీ ముగింపు ఉపన్యాసం చేస్తూ.. ‘లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలి. దీనివల్ల ఖర్చును ఆదా చేయవచ్చు. అదే సమయంలో వనరుల్ని సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏకకాలంలో ఎన్నికల అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. నీతి ఆయోగ్ భేటీలో పునరుద్ఘాటించారు. విధానాల రూపకల్పనలో సీఎంల పాత్ర కీలకమని ఆయన ప్రశంసించారు. ఫలితం ఆధారంగా కేటాయింపులు జరిగేలా, ఖర్చుల్లో సవరణల కోసం 15వ ఆర్థిక సంఘానికి సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రుల్ని కోరారు. ‘భారత్‌లో సామర్థ్యం, వనరుల కొరత లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. కేంద్రం నుంచి రాష్ట్రాలు రూ. 11 లక్షల కోట్లు అందుకుంటాయి. గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఇచ్చిన దానికంటే రూ. 6 లక్షల కోట్లు ఎక్కువ ఇస్తున్నాం’ అని మోదీ చెప్పారు. వరద పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అన్ని రకాల సాయాన్ని అందచేస్తామని భరోసా నిచ్చారు. అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ మంచి వేదిక 2017–18 నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.7 శాతంగా ఉందని, ఈ వృద్ధి రేటును రెండంకెల స్థాయికి తీసుకెళ్లడం మన ముందున్న సవాలని, అందుకోసం అనేక చర్యల్ని చేపట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 3.4 కోట్ల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని ప్రపంచం ఆశిస్తుందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వెనకబడ్డ జిల్లాల (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్) అభివృద్ధి, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, పౌష్టికాహార మిషన్, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు తదితర అంశాల్ని మోదీ ప్రస్తావించారు. ‘2020 నాటికి నవభారత లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన చర్యలు తప్పనిసరి’ అని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో చారిత్రక మార్పులు తీసుకువచ్చేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి మంచి వేదిక అని కితాబునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును ప్రస్తావించిన ప్రధాని స్వచ్ఛ్ భారత్ మిషన్, డిజిటల్ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై విధానాల రూపకల్పనలో సబ్ గ్రూపులు, కమిటీల ద్వారా ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారని మోదీ గుర్తుచేశారు. ఈ సబ్ గ్రూపులు చేసిన సిఫార్సుల్ని కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు పరిగణనలోకి తీసుకున్నాయని ఆయన చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్’ కింద దేశంలో 1.5 లక్షల వైద్య, సంరక్షణ కేంద్రాల్ని నిర్మిస్తున్నాం. ఈ పథకంలో 10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమాను అందిస్తాం. విద్య కోసం ‘సమగ్ర శిక్షా అభియాన్’ కింద సమగ్ర విధానాన్ని అమలుచేస్తున్నాం. ముద్రా యోజన, జన్‌ధన్ యోజన, స్టాండప్ ఇండియాలు ప్రజల ఆర్థిక అవసరాలకు చేయూతగా ఉంటున్నాయి’ అని ప్రధాని చెప్పారు. దేశంలో అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న(ఆస్పిరేషనల్) 115 జిల్లాల్లో అన్ని విధాల అభివృద్ధి సాధించాల్సిన అవసరముందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, పెట్టుబడిని తగ్గించి పంటల దిగుబడిని పెంచే విధంగా సూచనలు చేయాలని బిహార్, ఆంధ్రప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని సూచించారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్‌కు సూచన సమావేశంలో వ్యక్తమైన సలహాల్ని విధానపర నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటామని మోదీ హామీనిచ్చారు. అమలు చేయదగ్గ సలహాలు, సూచలనపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని నీతి ఆయోగ్‌కు ఆయన సూచించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఒడిశా, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ తదితర రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. సమావేశం అనంతరం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. బిహార్, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారన్నారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం 7.7 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిందని, మహాత్మా గాంధీ 150 వ జయంతి వేడుకల నాటికి దేశంలో 100 శాతం పారిశుధ్యం సాధించాలని ఆకాంక్షించారన్నారు. ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించండి ప్రధానికి నలుగురు సీఎంల విజ్ఞప్తి ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గొడవలో జోక్యం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్ పరిపాలక మండలి సమావేశం వేదికగా.. మమతా బెనర్జీ, చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్లు ఢిల్లీ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు. ‘నాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సీఎంలు ఢిల్లీ ప్రభుత్వ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని ప్రధానిని కోరాం. అయితే ప్రధాని మోదీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆ విషయాన్ని పరిశీలిస్తానని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు’ అని సమావేశం అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. శనివారం ఈ నలుగురు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు తెలపడంతో పాటు.. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావిస్తామని విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. నెలరోజుల్లో ‘నవభారత’ పత్రం న్యూఢిల్లీ: ‘నవభారతం 2022’ నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి ఎజెండా పత్రాన్ని నెలరోజుల్లో సిద్ధం చేయనున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ పత్రానికి తుదిరూపునిచ్చాక.. అభిప్రాయాలు, స్పందనల కోసం రాష్ట్రాలకు పంపిస్తామని సమావేశంలో వెల్లడించింది. గత సమావేశంలో పేర్కొన్నదాని ప్రకారం ఈ భేటీలో ఈ పత్రాన్ని రాష్ట్రాలకు అభిప్రాయాల కోసం ఇవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో నెలరోజులు ఆలస్యం కానుందని నీతి ఆయోగ్ అధికారులు తెలిపారు. ‘నవభారతం 2022 అభివృద్ధి ఎజెండా రూపకల్పన చివరి దశలో ఉంది. అందువల్లే నేటి సమావేశంలో దీన్ని ఇవ్వలేకపోతున్నాం. క్షేత్రస్థాయిలో జరగాల్సిన మార్పులను ఈ ప్రతిపాదన ప్రతిబింబించాలని కోరుకుంటున్నాం. ఇది దాదాపుగా సిద్ధమైనట్లే. త్వరలోనే అభిప్రాయాల కోసం ఈ డాక్యుమెంటును రాష్ట్రాలకు పంపిస్తాం. ఆ తర్వాత విస్తృతమైన చర్చలు జరుగుతాయి. నెల, నెలన్నరలో ఇది అంతా పూర్తవుతుంది’ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. మూడేళ్లు, ఏడేళ్లు, 15 ఏళ్ల లక్ష్యాలను ఏర్పర్చుకుని వీటిని చేరుకునేందుకు దార్శనిక పత్రాల (విజన్ డాక్యుమెంట్) రూపకల్పన ప్రణాళికలను నీతి ఆయోగ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 2022 నాటికి (దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు) దేశం ఆరు ప్రధాన సమస్యల (పేదరికం, చెత్త, అవినీతి, ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం) నుంచి విముక్తమయ్యేలా పనిచేయాలని గతేడాది ప్రజెంటేషన్‌లో నీతి ఆయోగ్ పేర్కొంది. మీడియాతో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌కాంత్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ -
ఎన్నాళ్లీ ఘర్షణ వాతావరణం?
మూడేళ్లక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతూనే ఉన్నారు. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నివాసంలో ఆయన, ఆయన సహచర మంత్రులు మానిష్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్‌లు మూడు రోజులనుంచి ధర్నా చేస్తున్నారు. వీరిలో సత్యేందర్ జైన్ నిరశన దీక్షలో కూడా ఉన్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు సాగిస్తున్న సమ్మెను విరమింపజేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఆప్ నేతలకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు బైజాల్ నివాసం వెలుపల ధర్నా చేస్తు న్నారు. ఈ మొత్తం వివాదంలో దోషమెవరిదన్న సంగతలా ఉంచి ఆ ధర్నా విషయంలో ఏదో ఒకటి చేసి పరిస్థితిని చక్కదిద్దాలన్న స్పృహ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు తోచకపోతే కనీసం కేంద్రమైనా జోక్యం చేసుకుని ఉంటే బాగుండేది. ఢిల్లీకిS దేశం నలుమూలలనుంచి నిత్యం ఎందరో వస్తుంటారు. విదేశీ నేతలు, వాణిజ్య ప్రతినిధులు పర్యటిస్తుం టారు. అలాంటిచోట ఈమాదిరి ఉదంతాలు చోటు చేసుకోవడం వల్ల మన ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులపాలవడం మినహా మరే ప్రయోజనమూ కలగదు. తనను ముఖ్యమంత్రి బెదిరించారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ విడుదల చేసిన ప్రకటన గమనిస్తే ఇది ఉన్నకొద్దీ మరింత ముదిరేలా కన బడుతోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 70 స్థానాలకూ 67 గెల్చుకుంది. ఇంత మెజారిటీతో ఏర్పడిన సర్కారుకు నిజానికి సమస్యలుండ కూడదు. కానీ అది ఢిల్లీ కావడం, వేరే రాష్ట్రాలతో పోలిస్తే అక్కడి ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలుండటం, దూకుడుగా ఉండే కేజ్రీవాల్ వంటి వ్యక్తి సీఎం స్థానంలో ఉండటం వగైరాలవల్ల్ల సమస్యలు తప్పడం లేదు. వీటి పరిష్కారానికి కేజ్రీవాల్, ఆయన సహచరులు అనుసరిస్తున్న విధానాలు ఆ సమస్యల్ని మరింత జటిలం చేస్తున్నాయి. కొత్త సమస్యలకు దారి తీస్తున్నాయి. ఆప్ ప్రభుత్వం విడుదల చేయదల్చుకున్న ఒక వాణిజ్య ప్రకటన విషయంలో అధికారులు అడ్డు చెప్పడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో మొన్న ఫిబ్రవరిలో కేజ్రీవాల్, ఆయన సహ చరులు సమావేశమైనప్పుడు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలో తనపై ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేశారని అన్షు ప్రకాష్ ఆరోపించగా, తనను ఆయన కులం పేరుతో దూషిం చారని ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ప్రత్యారోపణ చేశారు. ఆ కేసుల దర్యాప్తు కొనసాగుతుండగా, తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌లు కోరుతున్నారు. క్షమాపణ చెప్పలేదన్న కార ణంతో వారు సమ్మె చేస్తున్నారన్నది కేజ్రీవాల్ తాజా ఫిర్యాదు. ఈ సమ్మె వెనక కేంద్రమూ, లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారని ఆయన ఆరోపణ. విధులు నిర్వర్తిస్తూనే ఉన్నామని ఐఏఎస్‌లు చెబుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక 2014లో అఖిల భారత సర్వీసులకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని సవరించారు. ఈ సర్వీసుల్లోనివారి పని విధానంలో పారదర్శకత, జవాబు దారీతనం ఉండాలని... వారు నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండా లని... నైతికంగా ఉన్నత ప్రమాణాలు పాటించాలని ఆ నియమావళి నిర్దేశిస్తోంది. వారు క్రమశిక్ష ణతో మెలగాలని చెబుతోంది. సాధారణ సిబ్బంది తరహాలో సమ్మెలు, నిరసనల వంటి చర్యలకు వారు దిగకూడదు. ఆ సర్వీసుల్లో పనిచేసేవారు ఎన్నో ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తించాల్సి ఉంటుం దన్నది నిజం. ఇప్పుడు అన్షుప్రకాష్‌పై జరిగిందంటున్న దాడిపై కేసు నమోదైంది. అరెస్టులు జరి గాయి. అటు అన్షుప్రకాష్‌పై ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో సభా హక్కుల కమిటీ విచారణ జరుగుతోంది. వీటిని సవ్యంగా జరగనిస్తే ఎవరి తప్పొప్పులేమిటో తేలుతాయి. కానీ ఈలోగానే ఈ వివాదాన్ని ఇక్కడి వరకూ తీసుకురావడం ఇరుపక్షాల అపరిపక్వతనూ పట్టిచూపు తుంది. తాము సమ్మె చేయడం లేదని చెబుతూనే ముఖ్యమంత్రి, ఆయన సహచరులు నిర్వహించే ‘రొటీన్ సమావేశాలకు’ మాత్రం హాజరుకావడం లేదని ఐఏఎస్‌లు అంగీకరిస్తున్నారు. తమ ఫోన్లకూ, ఎస్సెమ్మెస్‌లకూ ఐఏఎస్‌లు జవాబివ్వడంలేదని మంత్రులు చెబుతుంటే... తాము వారి నుంచి వచ్చే లిఖితపూర్వక ఆదేశాలకు మాత్రమే జవాబిస్తున్నామని అధికారులంటున్నారు. కేజ్రీ వాల్ చెబుతున్నట్టు అధికారులు సమ్మెలో లేకపోవచ్చుగానీ సహాయ నిరాకరణ చేస్తున్నారని దీన్ని బట్టే అర్ధమవుతుంది. సకల అధికారాలూ గల ప్రభుత్వాలున్నచోట లేదా కేంద్రంలోని పాలక పక్షమే రాష్ట్రంలో కూడా అధికారం చలాయిస్తున్నచోట ముఖ్యమంత్రితో, మంత్రులతో అధికారులు ఇలా వ్యవహరించగలరా? అటు పాలకపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దౌర్జన్యానికి దిగడమైనా, ఇటు ఐఏఎస్‌లు సహాయ నిరాకరణ కొనసాగిస్తుండటమైనా ఊహకందనిది. ఈ వివాదం నాలుగు నెలలుగా కొనసాగడం అంతకన్నా విడ్డూరమైనది. కేజ్రీవాల్‌కు ముందు పనిచేసిన షీలా దీక్షిత్ కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. తమ పార్టీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా ఆమెకు ఇవి తప్పలేదు. కాకపోతే ఆమె లౌక్యంతో వ్యవహరించి వాటి నుంచి బయటపడ్డారు. కేజ్రీవాల్‌కు అలాంటి నైపుణ్యం లేదు. ఏతావాతా ఢిల్లీలో ఇప్పుడు తలెత్తిన ఘర్షణ వాతావరణం పర్యవసానంగా పాలన కుంటుబడింది. విద్యుత్, మంచినీరు సక్రమంగా అందడం లేదని, పారిశుద్ధ్యం దెబ్బతిన్నదని ఫిర్యాదులు ముమ్మరమయ్యాయి. ఢిల్లీ విస్తృతి రీత్యా దానికొక రాష్ట్ర ప్రభుత్వం అవసరమని గుర్తించి, అధికారాలు మాత్రం పరిమితంగా ఇచ్చినప్పుడు పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉండదు. తమ నిర్వా్యపకత్వం కారణంగా జనం ఇబ్బందులు పడు తున్నారని కేంద్రమూ, లెఫ్టినెంట్ గవర్నర్, అధికారులు, కేజ్రీవాల్ గుర్తించినప్పుడే ఇదంతా ఓ కొలిక్కి వస్తుంది. -
ఏమో... ఎవరికి తెలుసు?
పుదుచెర్రీ : మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచెర్రీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనను కలిసేందుకు వచ్చిన ఓ బాలుడికి అప్యాయ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా గవర్నర్ కుర్చీలోనే అతన్ని కూర్చోబెట్టారు. రాజ్ నివాస్(పుదుచ్చేరి రాజ్ భవన్)కు ప్రజల సందర్శనార్థం అనుమతి ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఓ కుటుంబం అక్కడికి రాగా.. అదే సమయంలో కిరణ్ బేడీ కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆ కుటుంబసభ్యులతో వెళ్లి ఆమెను కలిశారు. వారితో కాసేపు మాట్లాడిన బేడీ, బాలుడిని ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే ఆ బాలుడితో అన్నారు. దీంతో, ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు. ఈ విషయాన్ని కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సందర్శనార్థం వచ్చే చిన్నారులను కొంచెం సేపు లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చోబెడతానని ఆమె ట్విట్టర్లో తెలిపారు. ‘‘ఏమో దీనిని స్ఫూర్తి పొంది.. ఏదో ఓ రోజున వాళ్లే ఈ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారేమో, ఎవరికి తెలుసు?’’అని ఆ ట్వీట్ లో స్ఫూర్తిదాయక ట్వీట్ ను బేడీ చేశారు. Our youngest visitor for today received a pleasant surprise when HLG @thekiranbedi asked him to sit in her chair! ☺ pic.twitter.com/7tjKE2YvMb — Lt. Gov. Puducherry (@LGov_Puducherry) October 28, 2017 -
షీలాకు కష్టాలు
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత షీలా దీక్షిత్ కష్టాలు ఎదురవనున్నాయి. ఆమె అతి త్వరలో ఏసీబీ దర్యాప్తును ఎదుర్కోనున్నారు. ట్యాంకర్ స్కాంకు సంబంధించి ఆమెపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫిర్యాదును లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అవినీతి కేసుల విచారణ సంస్థ ఏసీబీకి పంపించారు. ఈ కేసుపై విచారణ చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. దీంతో ఆమెపై విచారణ ప్రారంభంకానుంది. 2012లో ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం 385 ట్యాంకర్లను అద్దెకు తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా ఉన్న నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కమిటీని వేసి ఆమెపై దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ కు నాడు ఫిర్యాదు చేయగా ఆయన ఇప్పుడు స్పందించాడు. -
గవర్నర్‌ను కలుసుకున్న కేజ్రీవాల్
-
మా మార్గదర్శకాలు మంచివే!
సాక్షి, న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి తాను జారీ చేసిన మార్గదర్శకాలను లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్‌జంగ్ సమర్థించుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నర్సరీ అడ్మిషన్లలో మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయడం సరైందేనని స్పష్టీకరిం చారు. విద్యను వాణిజ్యపరం చేయడాన్ని అనుమతించదరాదని పేర్కొన్నారు. నర్సరీ అడ్మిషన్లపై లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరుతూ యాక్షన్ కమిటీ ఆఫ్ అన్ఎయిడెడ్ రికగ్నైజ్డ్ పబ్లిక్ స్కూల్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై హైకోర్టు జారీచేసిన నోటీసుకు లెఫ్టినెంట్ గవర్నర్ సమాధానమిచ్చారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చ్ 25న నిర్వహిస్తామని ఉన్నతన్యాయస్థానం తెలిపింది. తాను జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ న్యాయస్థానాన్ని కోరారు. ‘విద్యను వ్యాపారంగా మార్చడం నిషిద్ధం. విద్యాసంస్థలను బోధన దుకాణాలుగా కొనసాగనివ్వరాదు. అది పిల్లలకు సమాన అవకాశాలను అందించకుండా చేస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిలో నర్సరీ అడ్మిషన్ల జారీకి డిసెంబర్ 18న లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాలను జారీ చేశారు. మేనేజ్మెంట్ కోటాను రద్దు చేయడంతోపాటు పాయింట్ల విధానానికి మార్గదర్శకాలు ప్రాధాన్యం ఇచ్చాయి. స్థానిక బాలలకు (నేబర్హుడ్) అడ్మిషన్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాయి. నేబర్హుడ్ కేటగిరీ కింద పాఠశాలకు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నివసించేవారికి అత్యధిక పాయింట్లను కేటాయించారు. వాటిని రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు మార్గదర్శకాల ప్రకారమే జరగాలని హైకోర్టు ఆదేశించింది. కేసుపై తరువాత విచారణ జరుపుతానని పేర్కొంది.