
న్యూఢిల్లీ: జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జమ్ము కాశ్మీర్ లెఫ్టి నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ,కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం చైర్మన్ వీరిని కలసి మహాసంప్రోక్షణ ఆహ్వాన పత్రికను అందజేశారు.
జూన్ 3వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారికి వైవీ సుబ్బారెడ్డి వివరించారు. జూన్ 8వ తేదీ మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. చైర్మన్ వీరిద్దరినీ శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
చదవండి: సివిల్స్ ఫలితాల‍్లో ఇద్దరికి ఓకే ర్యాంకు, రోల్ నెంబర్.. నాదంటే.. నాది.. చివరికి!
Comments
Please login to add a commentAdd a comment