y v subba reddy
-
అవి జగన్ సొంత సంస్థలు
సాక్షి, అమరావతి: భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత సంస్థలని.. వాటిల్లో షర్మిల వాటాదారు కాదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తేల్చిచెప్పారు. సోదరి షర్మిలపై ప్రేమ, ఆప్యాయతతో తన స్వార్జితమైన నాలుగు సంస్థల్లో 40 శాతం వాటాను ఇస్తూ జగన్ ఒప్పందం రాసిచ్చారని.. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్), కోర్టు అనుమతి ఇచ్చాక వాటిని పూర్తి స్థాయిలో బదలాయిస్తానని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే ఈడీ జప్తు చేసిన సరస్వతీ పవర్ షేర్లను బదిలీ చేయించి జగన్ బెయిల్‌ను రద్దు చేయించాలన్న కుట్రలో షర్మిల పావుగా మారారని.. ఆ కుట్రను చిత్తు చేయడానికే ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారేగానీ ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. అవన్నీ జగన్ స్వార్జితం: వైవీ సుబ్బారెడ్డి షర్మిల బహిరంగ లేఖ చూశాక కుటుంబపరమైన కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నా. సరస్వతీ పవర్ షేర్ల అంశం హైకోర్టులో ఉంది. ఈడీ జప్తు చేసిన ఆ సంస్థ ఆస్తులపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. జగన్‌పై కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడంతో ఆయన సంస్థల ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లను బదిలీ చేయించుకున్నారు కాబట్టే దాన్ని ఆపాలని జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ ఇచ్చారు. అంతేగానీ ఆస్తులు వెనక్కు తీసుకోవాలని కాదు. » జగన్ తన స్వార్జిత ఆస్తిలో షర్మిలకు వాటా ఇస్తూ 2019 ఆగస్టులో ఒప్పందం రాసిచ్చారు. ఆ ఒప్పందంలో జగన్ స్వార్జిత ఆస్తులు అని చాలా స్పష్టంగా ఉంది. అది చూశాకే షర్మిలమ్మ, విజయమ్మ ఇద్దరూ సంతకం పెట్టారు. తన చెల్లిపై ప్రేమ, అభిమానంతో ఆస్తులు ఇస్తున్నట్లు జగన్ ఆ ఒప్పందంలో రాశారు. ఇవన్నీ వాస్తవాలు. వాటిని కప్పి పుచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు. » దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడే ఆయన ఆస్తులను పంచారు. షర్మిల ఈ ఆస్తులు కావాలని అని నిజంగా అనుకుంటే.. అవి ఇస్తానని జగన్ చెప్పినా.. ఆమె ఇప్పుడేం మాట్లాడుతున్నారో చూస్తుంటే.. ఆమె ఆస్తుల కోసం పోరాడుతున్నారా? లేక జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? అని అనిపిస్తోంది. » నాకు తెలిసినంతవరకు జగన్ స్వార్జిత ఆస్తిలో ఎక్కడా షర్మిలమ్మ ప్రమేయం లేదు. నిజంగా ఆ ఆస్తుల్లో షర్మిలమ్మకు వాటా ఉండి ఉంటే.. ఆమెపై ఆనాడు కేసులు ఎందుకు నమోదు కాలేదు? కేవలం జగన్ మాత్రమే ఎందుకు జైలుకు వెళ్లారు? జగన్ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టే ఆయనకు డివిడెండ్ వచ్చింది. దాన్నుంచే ఆయన తన చెల్లికి ఈ పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చారు. షర్మిల అందులో షేర్ హోల్డర్ కాదు. అవి జగన్ సొంత కంపెనీలు. అందుకే వాటికి భారతి సిమెంట్స్.. తన పేరు, భార్య పేరు కలిసొచ్చేలా జగతి పబ్లికేషన్స్ (సాక్షి గ్రూప్) అని పేరు పెట్టారు. » నలుగురు పిల్లలూ తనకు సమానం అని వైఎస్సార్ అన్నారని షర్మిల లేఖలో రాశారు. అది నిజమే. ప్రేమను పంచడంలో వైఎస్సార్ నలుగురు పిల్లలనూ సమానంగా చూశారు. అయితే వైఎస్సార్ బతికున్నప్పుడే జగన్ స్థాపించిన కంపెనీల్లో ఎక్కడా షర్మిల గానీ, అనిల్ గానీ షేర్‌హోల్డర్‌గా లేరు. అది వైఎస్సార్ కోరుకోలేదు. ఒకవేళ ఆయన కోరుకుంటే వారిని ఆ కంపెనీల్లో షేర్ హోల్డర్లుగా పెట్టి ఉండేవారు కదా? తండ్రి మరణం తర్వాత, ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు. 2014లోగానీ మొన్న 2024లోగానీ అబద్ధాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేవారు. అలాంటి మనిషే అయితే చెల్లి విషయంలో మాట తప్పరు కదా? బాబుతో కలసి రాజకీయం చేయడం వైఎస్ అభిమతమా?: పేర్ని నాని » గత మూడు నాలుగు రోజుల నుంచి టీడీపీ నానా హంగామా చేసి చెప్పిన బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. షర్మిలమ్మ తన ఆస్తుల పంపకం గురించి అన్నకు రాసిన ఉత్తరం. అది రాష్ట్రానికి, ప్రజలకు అంత ముఖ్యమా? షర్మిలమ్మ పీసీసీ అధ్యక్షురాలు. ఆమె అన్నకు రాసిన ఉత్తరం ఎన్డీఏ అఫీషియల్ వెబ్సైట్లో రావడం అంటే చంద్రబాబు ఎంత అనైతికంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడికక్కడ ఎవరెవరితో కలిసి పని చేస్తున్నారు? అనేది ఆలోచించండి. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కుస్తీ.. ఇక్కడ మాత్రం దోస్తీ! ఏ స్థాయిలో దిగజారి రాజకీయాలు చేస్తున్నాడో చూడండి. లేఖ రాసింది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలైతే టీడీపీ వెబ్సైట్లో ప్రచారం చేయడం ఏమిటి? » వైఎస్సార్ జీవించి ఉన్నప్పుడు మొదలుపెట్టిన కంపెనీల్లో కుటుంబ సభ్యులంతా వాటాదారులైతే.. భారతి సిమెంట్స్‌లో షర్మిల పేరు ఎందుకు పెట్టలేదు? షేర్ హోల్డర్లుగా ఎందుకు ప్రకటించలేదు? జగన్ ఆ కంపెనీలకు కేవలం కాపలాదారే అయితే వైఎస్సార్ మిమ్మల్ని కంపెనీల్లో డైరెక్టర్లుగా పెట్టేవారు కదా? అప్పట్లో మీరు విదేశాల్లో కూడా లేరు కదా? » వైఎస్సార్ అభిమతం, ఆశయాలను కొనసాగించాలన్న అంకితభావం ఉంటే.. చంద్రబాబుతో కలిసి ప్రయాణించడం, రాజకీయం చేయడాన్ని ఎవరైనా ఊహిస్తారా? వైఎస్సార్ అదే ఆశించారా? ఆయన్ను అణగదొక్కడానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలుసు కదా? రాజకీయాల్లో ఇద్దరూ బద్ధ శతృవులు. అలాంటి చంద్రబాబుతో కలిసి పని చేస్తారా? ఏబీఎన్ రాధాకృష్ణతో కూడా కలసి పోతారా? వైఎస్సార్ అభిమానుల్లో ఎవరైనా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారా? కానీ ఆ పని మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు కాంగ్రెస్‌లో ఉంటూ ఎన్డీఏ కూటమితో కలసి ఎలా పని చేస్తున్నారు? అదేనా వైఎస్సార్ అభిమతం? ఆశయం? » వైఎస్సార్ మరణించాక.. జగన్ 10 ఏళ్లు కష్టాలు పడితే.. తాను పార్టీ కోసం పాటుపడ్డాడని, కష్టపడి పని చేశానని షర్మిలమ్మ అంటున్నారు. జగన్ ఎప్పుడు సమస్యలు ఎదుర్కొన్నారో తెలియదా? ఆయన సోనియాను ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత అక్రమ కేసులు పెట్టారు. జైల్లో పెట్టారు. అప్పుడు 230 రోజులు షర్మిలమ్మ పాదయాత్ర చేశారు. అది కూడా 2014 ఎన్నికల ముందు మాత్రమే. 2014 తర్వాత ఆమె ఏనాడూ రాలేదు. పార్టీ జెండా మోయలేదు. » వైఎస్సార్సీపీకి 2012 నుంచి ఈరోజు వరకు కర్త, కర్మ, క్రియ, కష్టం నష్టం.. గెలుపు.. అన్నింటిలో పూర్తి భాగస్వామ్య హక్కు జగన్‌ది మాత్రమే. కేవలం ఆయన వల్లనే పార్టీ ఎదిగింది... నిల్చింది... గెల్చింది. ఆ ఘనత పార్టీది, కార్యకర్తలది. అంటే జగన్, పార్టీ కార్యకర్తలకే ఆ ఘనత దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే మాలాంటి వారు చాలా మంది పని చేశారు. పదవులు వదులుకుని వచ్చాం. టీడీపీ నుంచి కూడా పదవులు వీడి వచ్చిన వారు ఉన్నారు. అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వచ్చారు. కానీ ప్రధానంగా పని చేసింది లక్షలాది మంది కార్యకర్తలు, జగన్ మాత్రమే. వారి వల్లనే పార్టీ ఎదిగింది. నిలబడింది. ఇది వాస్తవం. దీన్ని షర్మిలమ్మ గుర్తించాలి. » ఇది చెప్పాలో వద్దో తెలియదు. షర్మిలమ్మ పాదయాత్ర సమయంలో జగన్ జైల్లో ఉంటే నేను స్వయంగా కలిశా. చెల్లితో పాదయాత్ర చేయించడం ఎంత వరకు కరెక్ట్? భవిష్యత్తులో సమస్యలు వస్తాయని చెబితే అలాంటి అవకాశం అసలు ఉండదని నాడు జగన్ అన్నారు. చెల్లిపై ఆయనకు అంత నమ్మకం. కానీ ఈ రోజు నేను అన్నదే జరుగుతోంది. » షర్మిలను పార్టీ కోసం వాడుకుని వదిలేశారని చంద్రబాబు అంటున్నారు. మరి నువ్వు జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీ కోసం ఎంతగా వాడుకున్నావ్ చంద్రబాబూ..? మీరు కనీసం సభ్యత్వం కూడా ఇవ్వలేదు. అందుకే ఆయన పార్టీని వీడారు కదా? మీరు మీ లాభం కోసం మనుషులను ఎలా వాడుకుంటారో.. స్వయంగా మీ తోడల్లుడు ఏకంగా పుస్తకమే రాశారు కదా! వాడుకోవడం, వదిలేయడం.. అదీ మీ నైజం! అలాంటి మీరు నీతులు చెబుతున్నారు. ఆస్తులు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. మరి మీ హెరిటేజ్‌లో మీ తోబుట్టువులకు ఎంత వాటా ఇచ్చారు? ఏమైనా రాసిచ్చారా? మీకు నిజాయితీ ఉంటే వెంటనే ఆ పని చేసి చూపండి. ఈ వయసులో ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి చంద్రబాబూ!! 40% వాటా కోసం మాట తప్పుతారా? » అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ కేవలం గార్డియన్ మాత్రమేనని, ఆస్తులను నలుగురికి (మనవళ్లు, మనవరాళ్లు) సమానంగా పంచడం, అది జగన్ బాధ్యత అని.. అది వైఎస్సార్ ఉద్దేశమని.. అది ఆయన సన్నిహితులైన కేవీపీ, సాయిరెడ్డి, సుబ్బారెడ్డికి కూడా తెలుసని షర్మిలమ్మ ఆ లేఖలో రాశారు. ఒకవేళ నిజంగా వైఎస్సార్ ఉద్దేశం అదే అయితే.. ఇంత మందికి ఆయన చెప్పి ఉంటే, జగన్‌కు కూడా చెప్పి ఉండాలి కదా? ఇద్దరు తల్లిదండ్రులను కూడా కంపెనీ డైరెక్టర్లుగా పెట్టి ఉండాలి కదా? ఇలాంటి మనస్తత్వమా షర్మిలది? »తండ్రి మరణం తర్వాత జగన్ ఓదార్పుయాత్ర చేస్తానంటే.. కాంగ్రెస్ వద్దనడంతో పార్టీని వీడారు. పదవులు ఇస్తామన్నా ఆశ పడలేదు. కేవలం మాట కోసం బయటకు వచ్చారు. రాజీ పడకుండా పోరాడారు. తండ్రి ఆశయం, జనం కోసం, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో పోరాడారు. 16 నెలలు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించారు. ఎంతో జీవితాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆశయాన్ని మాత్రం వీడలేదు. జగన్‌పై ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పటికీ వాటిని మోస్తూనే ఉన్నారు. పదవులు ఇస్తామన్నా కేవలం ఇచ్చిన మాట కోసం వదులుకున్నారు. » అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఏదో నాలుగు ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోరా? తనే స్వయంగా రాశారని మీరే చెబుతున్నారు కదా! నమ్మిన సిద్ధాంతం, ఆశయాల కోసం రాజీ పడకుండా అన్ని కష్టాలు అనుభవించిన వ్యక్తి 40 పైసల వాటా కోసం మాట తప్పుతారా? మరి ప్రజలు దీన్ని నమ్ముతారా? »గత పదేళ్లలో మీకు రూ.200 కోట్లు నగదు బదిలీ చేస్తే అది కంపెనీ డివిడెండ్ అని అంటారా? మీరు కంపెనీలో షేర్‌హోల్డర్ కానప్పుడు మీకు లాభం ఎలా పంచుతారు? అది వచ్చింది మీ అన్న, వదిన నుంచి కాదా? ఇంత దారుణంగా మాట్లాడడం, వ్యవహరించడం ఎంత వరకు సబబు? తండ్రి, అన్న శతృవుతో కలిసి పని చేయడం, ఆస్తుల కోసం జగన్ కోర్టుకు ఎక్కాడని టీడీపీ మీడియాతో కలసి దు్రష్పచారం చేయడాన్ని మీ విజ్ఞత, విచక్షణకే వదిలేస్తున్నాం.రెట్టింపు డబ్బులిస్తాం.. ఫిలిం సిటీ భూములు వదిలేస్తారా?వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఒంగోలు సిటీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి చట్ట ప్రకారం భూములు కొన్నారని, రామోజీరావు అండ్‌కో లా హైదరాబాద్‌లో ఫిలిం సిటీ కోసం పేదలను భయపెట్టి భూములు చవగ్గా కొల్లగొట్టలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు చెప్పారు. రామోజీ అండ్ కో ఫిలింసిటీ కోసం ఎంతో మంది పేదలను భయపెట్టి భూములు లాక్కొన్నారని, ఆరోజు కొన్న రేటుకు రెట్టింపు డబ్బులిస్తాం ఫిలిం సిటీ భూములను వదిలేస్తారా అని ప్రశ్నించారు. జూపూడి శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చట్టప్రకారం కొన్న భూములపైనా ఎల్లోమీడియా వక్రీకరించడం సమంజసం కాదని అన్నారు. చంద్రబాబుకు సిగ్గు ఉందో లేదో తెలియదు కానీ, రాష్ట్రం మొత్తం చంద్రబాబును చూసి సిగ్గుపడే అంశాలు చాలా ఉన్నాయని విమర్శించారు. జగన్ ఇంట్లో ఆస్తుల తగదాలతో ఆయనకేమిటి సంబంధం అని ప్రశ్నించారు. సంబంధం లేకపోతే షర్మిల లేఖ చంద్రబాబు దగ్గరకు ఎలా వచ్చిందని నిలదీశారు. ఆనాడు సోనియాగాంధీతో కుమ్మక్కైన చంద్రబాబు వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించారని, ఫలితంగా జగన్ ఆస్తులు సీబీఐ, ఈడీ అటాచ్‌లో ఉన్నాయన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే జగన్ ఎన్సీఎల్టీకి అర్జీ పెట్టుకున్నారని వివరించారు. అసలు చంద్రబాబు ఏనాడైనా తన ఆస్తులను తమ్ముళ్లు, చెల్లెమ్మలకు రాసిచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు తన ఉనికి కోసం సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడిని ఎదగకుండా చేశాడని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్, ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని, శాంతిభద్రతలను పూర్తిగా వదిలేశారని ధ్వజమెత్తారు.అనుబంధాల గురించి షర్మిల మాట్లాడటమా?వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డిప్రొద్దుటూరు: శత్రువులతో చేతులు కలిపిన షర్మిలమ్మ కుటుంబ అనుబంధాలు, ప్రేమల గురించి మాట్లాడటం విడ్డూరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. ఆమె ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై ఆస్తి కోసం సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బజారుకీడుస్తున్నారని ధ్వజమెత్తారు. శివప్రసాదరెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత షర్మిలమ్మపై ప్రేమతో జగన్ స్వార్జితంలో సుమారు రూ.200 కోట్లు నగదు చెల్లించారని చెప్పారు.ఇందుకు భారతమ్మ కూడా పూర్తి సహకారం అందించి గొప్పతనాన్ని చాటుకున్నారని తెలిపారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్, మిగతా ఆస్తులలో షర్మిలమ్మకు భాగం ఇవ్వాలనే ఎంఓయూ కుదుర్చుకున్నారన్నారు. అయితే ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉండటతో బదలాయించలేదన్నారు. కేసులు పరిష్కారమయ్యే వరకు, న్యాయ సంబంధమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఎంవోయూ ఇచ్చారన్నారు. షర్మిలకు చెందని ఆస్తి కోసం చంద్రబాబు అండ్ కో తో చేతులు కలిపి వైఎస్ జగన్‌ను మరో మారు జైలుకు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్‌కు రాష్ట్రంలో కోటి కుటుంబాలు అండగా ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలన్నారు. షర్మిలమ్మ అత్యాశతో అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసలు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదని అన్నారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడుకు ఆస్తిలో వాటా ఇవ్వకపోవడంవల్లే మతి స్థిమితం కోల్పోయారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వారసులకు ఆస్తి తగాదాలు లేవా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణులకు భాగ పరిష్కారాల సమస్య లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ వ్యతిరేకుల చేతుల్లో షర్మిల కీలుబొమ్మవైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై షర్మిల చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం లాజిక్లేదని, ఆమె వైఎస్సార్ కుటుంబ వ్యతిరేకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయారని వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై. ఈశ్వర ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని.. నిజానికి, మెజారిటీ షేర్ల బదిలీ అంటే భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానమని.. ఇది హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో షర్మిల, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన విధానాలను అనుసరించకుండా మెజారిటీ షేర్లను బదిలీ చేశారన్నారు. వాటా బదిలీ ఫారంలలో బదిలీదారుల సంతకాలు తీసుకోలేదని.. బదిలీ కోసం షేర్ సర్టిఫికెట్లు అందించలేదని ఆయన పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయించాలనే..ఇక జగన్ బెయిల్ రద్దు కావాలంటే ఎలా అని ఆలోచించి.. చివరకు పల్నాడులోని సరస్వతి పవర్ ప్రాజెక్టు ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన అంశాన్ని పట్టుకున్నారన్నారు. తద్వారా.. దాని షేర్లు బదిలీ చేశారని చూపుతూ జగన్ బెయిల్ రద్దు చేయించాలని కుట్ర పన్నినట్లు ఈశ్వర్ప్రసాద్ తెలిపారు. తన బెయిల్ రద్దుచేసి, తిరిగి జైలుకు పంపించే కుట్ర చేస్తుండడంతో జగన్ న్యాయబద్ధంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు అప్పీల్ చేశారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని.. షర్మిల ఇప్పటికైనా ఈ దుష్టశక్తుల కుట్రల నుంచి బయటపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
YSRCP మేనిఫెస్టో పై వైవీ సుబ్బా రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
ఈనెల 30 వరకు కొనసాగనున్న వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర
-
‘శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి’
న్యూఢిల్లీ: జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జమ్ము కాశ్మీర్ లెఫ్టి నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ,కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం చైర్మన్ వీరిని కలసి మహాసంప్రోక్షణ ఆహ్వాన పత్రికను అందజేశారు. జూన్ 3వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారికి వైవీ సుబ్బారెడ్డి వివరించారు. జూన్ 8వ తేదీ మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. చైర్మన్ వీరిద్దరినీ శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు, రోల్ నెంబర్.. నాదంటే.. నాది.. చివరికి! -
పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట రాములోరి కల్యాణం (ఫొటోలు)
-
తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం, రుచికర అన్నప్రసాదాలు అందించనున్నట్లు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని, పీఏసీ–4 (పాత అన్నప్రసాద భవనం)లోని లగేజి సెంటర్‌ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల తరువాత పదిరోజుల కిందట సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించటంతో రద్దీ పెరిగిందని చెప్పారు. అందుకు అనుగుణంగా ఇబ్బంది లేకుండా అల్పాహారం, అన్నప్రసాదాలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తులకు భోజనంతో పాటు రొట్టెలు, చపాతీలు అందిస్తామన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జితసేవలను ఏప్రిల్ నుంచి పునఃప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు సామాన్య భక్తులకు అందించే ఆర్జితసేవలు, దర్శనాల ధరలను టీటీడీ పెంచలేదని, ఆ ఆలోచన ఇప్పట్లో లేదని పేర్కొన్నారు. ధరల పెంపుపై పాలకమండలిలో చర్చ మాత్రమే జరిగిందన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టీటీడీ పాలకమండలి ముఖ్య ఉద్దేశమని, ఇందులో భాగంగా ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలను రద్దుచేశామని చెప్పారు. కొండమీద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, వీజీవో బాలిరెడ్డి తదితరులున్నారు. ఫిబ్రవరిలో 10,95,724 మంది భక్తులు తిరుమల శ్రీవారిని ఫిబ్రవరిలో 10,95,724 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.79.34 కోట్లు లభించాయి. 5.35 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 13.63 లక్షల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాలు స్వీకరించారు. దాదాపు 1.64 లక్షల గదులను భక్తులకు కేటాయించారు. 329.04 ఎంఎల్డి నీరు, 27.76 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగించారు. 64.90 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. 3,378 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. -
వైవీ సుబ్బారెడ్డిని కలిసిన ప్రముఖ గాయని శోభారాజు
సాక్షి, తిరుమల : ప్రముఖ గాయని పద్మశ్రీ శోభారాజు టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. టీటీడీలో పాటలు పాడే అవకాశాన్ని తనకు ఇవ్వాలని శోభారాజు కోరారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ)లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. నలభై ఏళ్లుగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నా.. టీటీడీ నుంచి సరైన గుర్తింపు లభించలేదని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ తనకు ప్రకటించిన ఆస్థాన విద్వాంసురాలు పదవి కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో తన సేవలను ఉపయోగించుకుంటామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు శోభారాజ్ తెలిపారు. -
ప్రకాశం జిల్లాలో భోగి సంబరాలు
-
'వచ్చే రెండేళ్లలో 5వేల ఉద్యోగాలు'
ఒంగోలు: ఏపీలో మొట్టమొదటి డీఎంకేఈవై ట్రైనింగ్ సెంటర్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు వైఎస్సార్ సీపీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలులో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ ను జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ అంశాల్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వచ్చే రెండేళ్లలో కనీసం 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం లక్షంగా పెట్టుకున్నామని ఆయన విరవించారు. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. -
మసకబారుతున్న 'రాజసం'
బ్రిటీషు వారు భారత్‌లో పాగా వేశారుదొరికినవన్నీ దోచుకుపోయూరు..విలువైన కోహినూర్, నెమలి సింహాసనాన్నీ విడవలేదు.. ... చలి దేశాల్లో ఉండే తెల్లదొరసానులు మళ్లీ భారత్‌వైపు చూశారు సరోగసీ.. అంటూ బేరాలు ఆడుతున్నారు విదేశీయుల కణాలను మన మహిళల గర్భాల్లో దాచి పిల్లలను ఎత్తుకుపోతున్నారు దీని వెనుక పెద్ద మాఫియూ కూడా నడిచేలా చేస్తున్నారు.. ... ఇప్పుడు మనుషులనే కాదు.. పశువులనూ వదలడంలేదు! ఎంతో విశిష్ట లక్షణాలున్న ఒంగోలు జాతి పశుసంపదపై కన్నేశారు ఈ జాతి కృత్రిమ పిండాలను ఎత్తుకెళ్లే పథకం రచించారు దీనికి భారత్‌తో బ్రెజిల్ ఒప్పందం చేసుకుంది.. మరి మనకు ఒంగోలు జాతి పశువులు అవసరంలేదా?..ఇంకా అవి కనిపించవా? ప్రపంచ వ్యాప్తంగా జిల్లాకు గుర్తింపు తెచ్చిన ఒంగోలు జాతి పశుసంపద అంతరించే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ విధానాల వల్ల నాటి ‘రాజసా’నికి గ్రహణం పట్టే గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నారుు. ఒంగోలు జాతి గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్‌కు ఎగుమతి చేసే ఒప్పందం జరగడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని పరిరక్షించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల పార్లమెంట్లో ప్రస్తావించారు. శనివారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిసి కృత్రిమ పిండాలను బ్రెజిల్‌కు ఎగుమతి చేయవద్దని కోరారు. దేశవాళీ గేదెల ప్రోత్సాహంతో.. పశుసంవర్థక శాఖ ముర్రా జాతి దున్నలతో దేశవాళీ గేదెల అభివృద్ధిని ప్రోత్సహించింది. 1975లో జిల్లాలో పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలు పెరిగాక పశుగ్రాసం సమస్య పెరిగింది. కొన్నేళ్లుగా పశుపోషణ వైపు రైతులు మొగ్గు చూపుతున్నప్పటికీ ఒంగోలు జాతి ఆవుల పోషణ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఒంగోలు జాతి గేదెల అభివృద్ధికి భారత పరిశోధనా మండలి, గుంటూరు లాం ఫారం, కేంద్రంగా 1987లో అనుబంధ పరీక్షా పథకం ఏర్పాటు చేశారు. రామతీర్థం (ప్రకాశం), చింతలదేవి (నెల్లూరు), మహానంది (కర్నూలు) ఈ పరిశోధనా కేంద్రానికి అనుబంధంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 1980లో ప్రారంభించిన రామతీర్థం క్షేత్రాన్ని చదలవాడకు మార్చారు. ఎగుమతులు ఎప్పుడో ఆరంభం.. కేవలం పాలు, వ్యవసాయ పనులకే కాదు.. చూడ్డానికి కూడా ఒంగోలు జాతి పశువులు ఎంతో అందంగా ఉంటారుు. 1875లో బ్రెజిల్ దేశస్తులు మొట్టమొదటిసారిగా కొన్ని పశువులను తీసుకెళ్లారు. 1900 నుంచి 1920 వరకు రెండు వేల పశువులను దిగుమతి చేసుకుంది. 1921లో పశువులకు పారుడు వ్యాధి రావడంతో 1930 వరకు దిగుమతి నిలిపివేశారు. 1962 నుంచి బ్రెజిల్.. భారత్ నుంచి 6 వేల వరకు ఒంగోలు జాతి పశువులను దిగుమతి చేసుకున్నారు. వీటి మాంసాన్ని విదేశీయులు ఇష్టపడేవాళ్లు. అమెరికా, మెక్సికో, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ పశు సంపద ఉంది. ఒంగోలు సమీపంలోని కరవదికి చెందిన ఎద్దు అఖిల భారత పశు ప్రదర్శనలో తొలిసారిగా షో ఛాంపియన్‌గా ఎన్నికైంది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ ఎద్దుల యజమానిని సత్కరించారు. బ్రెజిల్ దేశస్తులు రైతుకు లక్ష రూపాయలు ఇచ్చి తమ దేశానికి తీసుకెళ్లారు. అలా వాటి ఎగుమతి ప్రారంభమైంది. 1994లో గుంటూరు లాంఫారంలో రాష్ట్రస్థాయి పశు ప్రదర్శన ప్రారంభమైంది. పర్చూరు మండలం బోడవాడ రైతు ముప్పాళ్ల వెంకటేశ్వర్లుకు చెందిన ఆంబోతుకు ‘షో’ ఛాంపియన్ దక్కింది. ఇతర రాష్ట్రాల్లో కూడా మన కోడెలు సత్తా చాటారుు. ఇక్కడ ఆదరణ తగ్గినా బ్రెజిల్ దేశీయులు అధునాతన పద్ధతుల్లో పోషించి రికార్డులు సృష్టిస్తున్నారు. వారసత్వ సంపద ఒంగోలు జాతి గిత్తలు సేద్యానికి.. ఆవులు అధికపాల దిగుబడికి ప్రసిద్ధిగాంచాయి. నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పశువులు తెలుగు ప్రజల సంస్కృతీ వారసత్వ జీవనాన్ని ప్రతిబింబించాయి. మహారాజు ఠీవీ.. హుందాతనం, పౌరుషం ఉట్టిపడతూ రైతులకు కల్పతరువుగా సేవలందించారుు. బరువులు మోయడంలో ఏ జాతి పశువులు పోటీపడలేవు. ఒకప్పుడు టంగుటూరు మండలంలోని నాయుడుపాలెం చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ఇంటిలో చూసినా ఒంగోలు జాతి పశువులు కనపడేవి. కాలక్రమంలో కనుమరుగయ్యూరుు. బరువు చూస్తే దిమ్మతిరగాలి.. 1997లో ఒంగోలు దూడ ఏడాది వయసులోనే 645 కిలోల బరువుతో రికార్డు సృష్టించింది. ఒంగోలు ఆబోతు 52 నెలల సమయంలో 1325 కిలోల బరువుతో మరో రికార్డు సాధించింది. ఆవు 39 నెలలప్పుడు 858 కిలోల బరువు తూగి బ్రెజిల్లో జాతీయ రికార్డు సాధించింది. ఇన్ని రికార్డులున్న పశు సంపదను.. ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడంలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలి. నాటి మద్రాసుకు పాల భాండాగారంగా.. 1950 దశకంలో మద్రాసు నగరానికి పాలు అందించడంలో ఒంగోలు జాతి ఆవులు కీలకపాత్ర పోషించాయి. ఒక్కో ఆవు రోజుకు 7 నుంచి 8 లీటర్ల పాలు అందించేవి. 1966 నాటికి ఒక్కో ఈతకు పది నెలల్లో రెండువేల లీటర్ల పాలిచ్చే ఆవులుండేవని చెబుతారు. ఆ తరువాత ఒంగోలు జాతి పశువుల పోషణ భారమైంది. 1970 తరువాత పాల ఉత్పత్తుల్లో కొత్త శకం ఆరంభమైంది. వెన్న శాతం బట్టి ధర ఇవ్వడం మొదలుపెట్టాక పాల దిగుబడి ఎక్కువగా ఇచ్చే గేదెలు రావడంతో ఆవులను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒంగోలు గిత్త అంటే ప్రకాశం జిల్లాకే అంతర్జాతీయ గుర్తింపు. ఉట్టిపడిన రాజసం ... నడిస్తే ఠీవీ, గంభీరత, పౌరుషం కలిగలిపితే రంకెవేసే నిలువెత్తు గిత్త. విశిష్ట లక్షణాలతో వెలుగొందే ఒంగోలు పశు జాతి అంతరించనుందా? ప్రభుత్వాల విధానాలు, ఆ జాతి పట్ల చూపిస్తున్న నిర్లిప్తత చూస్తే అవుననే చెబుతున్నాయి. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల పార్లమెంట్లో కూడా తన వాణి వినిపించారు. శనివారం కూడా ఆయన కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్‌కు ఎగుమతి చేయవద్దని కోరారు. బ్రెజిల్ వ్యవసాయ శాఖా మంత్రిని అభ్యర్థించారు. -
సర్కారు మోసాలపై ఉద్యమం
మార్కాపురం: ఎన్నికల్లో గెలవడానికి రైతు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేసే రీతిలో వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా డిసెంబర్ 5న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు ఎవరి రుణాలు మాఫీ కాలేదన్నారు. దీంతో రైతులు, డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారని, రుణమాఫీ కోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నాయకులు, రైతులు, డ్వాక్రా మహిళలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24, 25తేదీల్లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒంగోలు వస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి సమస్యలపై చర్చిస్తారన్నారు. ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించేందుకు నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ప్రధాని పిలుపు మేరకు సన్సద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాష్ట్రంలో మొట్టమొదట తానే చొరవ చూపి గిద్దలూరు నియోజకవర్గంలోని దద్దవాడ గ్రామాన్ని ప్రకటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాబోయే నాలుగున్నర ఏళ్లలో మూడు గ్రామాలను దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎంపీ ప్రకటించారు. మార్కాపురం, కంభం, గిద్దలూరు, తర్లుపాడు, దొనకొండ రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని, రైల్వే ఉన్నతాధికారులను ఇక్కడికి పిలిపించి సమీక్ష నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారనే సాధ్యమవుతుందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. 25న మార్కాపురం నియోజకవర్గ సమీక్ష ఉంటుందని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తెలిపారు. ఎంపీగా ఎన్నికైన తరువాత మొదటి నిధులను మార్కాపురం నియోజకవర్గానికి కేటాయించటం మరచిపోలేమన్నారు. విలేకరుల సమావేశంలో మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షులు కె.వి.రమణారెడ్డి, మార్కాపురం, పొదిలి ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
మా గోడు తీర్చేదెవరు?
కంభం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం బంగారం పండే భూములను త్యాగం చేసిన మాకు గృహాలు నిర్మించుకునేందుకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎదుట పలువురు ముంపు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాకర్ల డ్యాం నిర్మాణ పనులు పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం వచ్చిన ఎంపీని ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, ముట్టుగుంది, సాయిరాంనగర్, కృష్ణానగర్ ప్రజలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డ్యాం నిర్మాణానికి తాము 3,600 ఎకరాల భూములు ఇచ్చామన్నారు. తమకు పునరావాసం కోసం 20 ఎకరాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు నేటికీ పట్టించుకోవడం లేదన్నారు. 3 వేల ఎకరాలకే నష్టపరిహారం ఇచ్చారని, మిగిలిన 600 ఎకరాలకు నేటికీ పరిహారం అందలేదన్నారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తమకు ఈ అన్యాయం జరిగేది కాదన్నారు. దేవరాజుగట్టు వద్ద ఉన్న వంద ఎకరాల్లో నివేశన స్థలం ఇప్పించాలని పెద్దారవీడు మండలం గుండంచర్ల వాసులు ఎంపీకి విన్నవించారు. దీనిపై స్పందించిన ఎంపీ ప్రాజెక్టు అధికారులు సుధాకర్, రమేష్‌బాబులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ వచ్చేనెల 11, 12 తేదీల్లో ఒంగోలులో అందుబాటులో ఉంటానని, మీ ప్రాంత శాసనసభ్యులతో కలిసి వస్తే సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. అర్థవీడు మండల కన్వీనర్ రంగారెడ్డి మాట్లాడుతూ కాకర్లలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మించాలని, సంగీత కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ సంగీత విద్వాంసుడు త్యాగరాజు జన్మస్థలమైన కాకర్లలో సంగీత కళాశాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ వెంట గిద్దలూరు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, డేవిడ్ రాజు, ఆదిమూలపు సురేష్, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు యేలం వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సూర స్వామిరంగారెడ్డి, అర్థవీడు ఎంపీపీ రవికుమార్ యాదవ్, జెడ్పీటీసీ కొడావత్ లక్ష్మీదేవి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్, మాజీ ఎంపీపీ గొటిక రాజేశ్వరరెడ్డి, కంభం, అర్థవీడు మండలాల కన్వీనర్లు సయ్యద్ మాబు, ఏరువ రంగారెడ్డి, కంభం మండల వైఎస్సార్ సీపీ నాయకులు చేగిరెడ్డి ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, టీడీపీలకు రాజకీయ సమాధే
శ్రీకాళహస్తి రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు రాజకీయు సవూధి కట్టడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకవుండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ పట్టణ కో కన్వీనర్ లోకేష్‌యూదవ్ శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన గురువారం విచ్చేశారు. డీడీఆర్ ఫ్యూయెల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం వై.వి.సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న ఏకైక డివూండ్‌తో వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జాతీయుస్థారుులో పోరాటం చేస్తూ రాజకీయు ప్రకంపనలు సృష్టిస్తున్నారన్నారు. సీవూంధ్రులు నట్టేట వుునిగిపోతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండడం దారుణవున్నారు. అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గ సవున్వయుకర్త బియ్యుపు వుధుసూదన్‌రెడ్డి వూట్లాడారు. సీవూంధ్ర కాంగ్రెస్ ఎంపీల చేతగానితనంతోనే రాష్ట్రం వుుక్కలవుతోందని విమర్శించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. వైవీకి ఘనస్వాగతం శ్రీకాళహస్తికి విచ్చేసిన వై.వి.సుబ్బారెడ్డికి వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సవున్వయుకర్త బియ్యుపు వుధుసూదన్‌రెడ్డి, పట్టణ కో కన్వీనర్ లోకేష్‌యూదవ్ ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి 500 మంది కార్యకర్తలతో స్కూటర్‌ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి, నగరి నియోజకవర్గాల సవున్వయుకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, స్థానిక నాయుకులు గువ్ముడి బాలకృష్ణయ్యు, మిద్దెలహరి, కొట్టెడి వుధుశేఖర్, సిరాజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.