ఒంగోలు: ఏపీలో మొట్టమొదటి డీఎంకేఈవై ట్రైనింగ్ సెంటర్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు వైఎస్సార్ సీపీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలులో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ ను జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ అంశాల్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వచ్చే రెండేళ్లలో కనీసం 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం లక్షంగా పెట్టుకున్నామని ఆయన విరవించారు. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.