బుధవారం సీఎం వైఎస్ జగన్‌కు సమస్యను వివరిస్తున్న బాధితుడి తల్లి, గురువారం శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా లభించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడి కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఒంగోలులోని ప్రకాశం భవనంలో ప్రభుత్వం తరఫున గురువారం రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు వివిధ రూపాల్లో ఆదుకుంటామన్నారు.
ఈబీసీ నేస్తం రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మార్కాపురం వచ్చిన సందర్భంగా బాధితుడి తల్లి మారమ్మ ఆయనను కలిసి తన కుమారుడు శ్రీనివాసులు పరిస్థితిని వివరించింది. బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడని, తనొక్కడే కుటుంబానికి ఆధారమని తెలిపింది. కిడ్నీ చెడిపోయి ఆస్పత్రిలో ఉన్నాడని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారని సీఎంకు వివరించింది.
చదవండి: టిడ్కో ఇళ్లపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: సీఎం జగన్
స్పందించిన ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబానికి సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో బాధితుడి తల్లి మారమ్మను గురువారం కలెక్టరేట్‌కు పిలిపించి తక్షణ ఆరి్థక సహాయంగా రూ.లక్ష చెక్కు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.5 లక్షల సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బాధితుడి అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇడుపూరు లే–అవుట్‌లో ఇంటిస్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment