financial assistance
-
సాగు యోగ్యతతోనే ‘భరోసా’!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కొత్త పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’అని పేరుపెట్టినట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డు లేని పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూడు పథకాల అమలును ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలసి రేవంత్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వారికి రైతు భరోసా వర్తించదు.. రైతుభరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములంటే.. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ పొందిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా (లబ్ధిదారుల) సమాచారం సేకరించి గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో, ధరణిలో లోపాలతో గతంలో వ్యవసాయానికి యోగ్యంకాని భూములకూ రైతుబంధు వచ్చిందని.. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరిస్థితి, వెసులుబాటు మేరకు.. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తే తాము రూ.12 వేలకు పెంచామని సీఎం రేవంత్ బదులిచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెసులుబాటును బట్టి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఎంత వెసులుబాటు ఉంటే అంతగా రైతులకు మేలు చేయాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. భూమి లేని వారి ఆవేదన తీర్చడానికి.. ‘‘తమకు భూములు లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరో శాపమని గతంలో నేను, భట్టి విక్రమార్క, ఇతర సహచరులు నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా తండాల్లో, మారుమూల ప్రాంతాల్లోని భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాళ్లు కూడా సమాజంలో, మనలో భాగమని గుర్తించి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని తీసుకొచ్చాం. చాలా ఏళ్ల నుంచి రేషన్‌కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తోంది. రేషన్‌కార్డులు లేని వారందరికీ జనవరి 26 నుంచి కొత్త కార్డులు ఇస్తాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది రైతుబంధు కింద అనర్హులకు చెల్లించిన రూ.వేల కోట్లను తిరిగి వసూలు చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలు శిక్షకు వెళ్లాల్సి ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి విపక్షాలు శాయశక్తులా ఊహాగానాలు రేపాయి. ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలంటూ ప్రచారం చేసి రైతుల్లో గందరగోళం సృష్టించాయి. రైతులకు మేం శుభవార్త వినిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కొత్త సంవత్సరంలో మొదటిసారి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్లను అన్నిరకాలుగా ఆదుకోవాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఈ పథకాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.కేబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలివే..పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయంసింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ పేరు పెట్టేందుకు ఆమోదం.జూరాల జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాల పరిశీలన కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ నియామకం. ఎంత నీటి లభ్యత ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి ఎంతెంత నీటిని తీసుకునే వీలుంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలనే అంశాలతోపాటు ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా మరింత నీటిని తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీతో అధ్యయనం చేయించాలని నిర్ణయం.మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రతిపాదించిన గోదా వరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్–2,3లకు ఆమోదం. గతంలో 15 టీఎంసీల తరలింపునకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించగా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం. కొత్తగూడెం మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్‌గా హోదా పెంపు. -
నాలుగు రాష్ట్రాల్లో ‘మహిళా పథకాలు’.. ప్రయోజనాల్లో తేడాలివే
దేశరాజధాని డిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు తొలుత రూ. 1,000, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 2,100 ఇస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. ఎన్నికలకు ముందు మహిళలను ఆకట్టుకునేందుకు ఇలాంటి పథకాలను ప్రారంభించిన నాల్గవ రాష్ట్రం ఢిల్లీ. ప్రస్తుతం ఈ పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ఎన్నికల్లో విజయానికి..మహిళలకు ప్రతినెలా ఆర్థికసాయం(Financial assistance) అందించే పథకాలు ఇటీవలి కాలంలో ఎన్నికల్లో గెలుపొందడానికి ఉపకరిస్తున్నాయని నిరూపితమయ్యింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీజేపీ నేత శివరాజ్ ఈ పథకాన్ని ప్రారంభించి, బీజేపీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడంలో విజయం సాధించారు. ఇదేవిధంగా మహారాష్ట్రలోని ఏకనాథ్ షిండే ఇదే పథకం ఆధారంగా మహాయుతి కూటమికి మెజారిటీని అందించారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ కూడా మయ్యా సమ్మాన్ పథకం ఆధారంగా వరుసగా రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా..మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలలో మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పథకాలు ఒకేలా కనిపించినప్పటికీ వీటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. ప్రధాన వ్యత్యాసం ఆయా రాష్ట్రాల్లోని మహిళలు స్వీకరించే నగదు మొత్తం. మరొకటి వారి వయసు. ఈ నాలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలలో తేడాను ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బహన్ యోజన కింద తొలుత మహిళలకు ప్రతినెలా రూ.1,000 ఇవ్వగా, ఇప్పుడు రూ.1,250 అందజేస్తున్నారు. మహారాష్ట్రలో ఇదే పథకం కింద మహిళలకు రూ.1,500 ఇస్తున్నారు. జార్ఖండ్‌లో ఈ తరహా పథకంలో మహిళలకు తొలుత రూ.1,000, తర్వాత రూ.2,500 అందజేస్తున్నారు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్(Kejriwal) ఇదే హామీనిచ్చారు.ఏ రాష్ట్రంలో ఎంతమొత్తం?మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav) రాష్ట్రంలోని మహిళలకు ప్రతినెలా రూ.5,000 ఇస్తానని హామీ ఇచ్చారు. కాగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో మొదటి విడతగా రూ.1,000 అందించగా, మహారాష్ట్రలో మొదటి విడతగా రూ.1,500 అందించారు. ఢిల్లీలో ఈ పథకంపై ఇంకా చర్చ నడుస్తోంది. జార్ఖండ్‌లో ఎన్నికల అనంతరం ఈ మొత్తాన్ని రూ.2,500కు పెంచారు. మధ్యప్రదేశ్‌లో ఈ మొత్తాన్ని క్రమంగా పెంచుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో లాడ్లీ బహన్ యోజనలో మహిళల వయోపరిమితి 21 నుంచి 60 ఏళ్లుగా ఉంది. జార్ఖండ్‌లో 21నుంచి 49 ఏళ్ల వయస్సు గల మహిళలు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు.ఢిల్లీలో చర్చనీయాంశంగా..ఢిల్లీలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతినెలా ఆర్ధికసాయం అందజేయనున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలోని ప్రభుత్వ శాఖలు ఈ పథకాలను నోటిఫై చేశాయి. అర్హులైన మహిళలు ఇప్పటికీ ఈ పథకం అందించే ప్రయోజనాలను పొందుతున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అర్హులైన మహిళల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇంతలో ఈ పథకానికి సంబంధించి వెలువడిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా ప్రారంభించిన పథకాలు.. ప్రయోజనాలు ఇవే.. -
రూ.12వేల సాయానికి అర్హుల ఎంపిక ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూమిలేని ప్రతీ కుటుంబానికి ఏటా రూ.12వేల ఆర్థిక సాయాన్ని అందించే పథకానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన నేపథ్యంలో అర్హుల ఎంపికపై జోరుగా చర్చ సాగుతోంది. ఏడాదిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని, తొలి విడతగా ఈనెల 28న అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరాకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది.రైతులతోపాటు రైతు కూలీలకు కూడా సాయం అందజేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గత సెపె్టంబర్లో రూ.12వేల సాయం ప్రకటన చేసిన భట్టి ఆదివారం ఖమ్మంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 28న తొలివిడతగా రూ. 6వేలు ఇస్తామని ప్రకటించారు. సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో భూమిలేని పేదలను గుర్తించి, ఎంత మందికి పథకాన్ని అమలు చేయాలనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భూమిలేని పేదలు ఎందరు? రాష్ట్రంలో రైతు కుటుంబాలు 64 లక్షల వరకు ఉండగా, భూమిలేని కుటుంబాలు, కూలీ నాలీ చేసుకునే వారు కలిపి 50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. అయితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 53.06 లక్షల కుటుంబాల్లోని వారికి జాబ్‌కార్డులున్నాయి. వారిలో 34.52 లక్షల కుటుంబాల వారే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. జాబ్‌కార్డు ఉన్న వారిలో కూడా కొందరు చిన్న, సన్నకారు రైతులు ఉంటారు. అయితే, భూమిలేని కుటుంబాలను గుర్తించేందుకు ఇప్పటివరకు పూర్తిస్థాయి సర్వే ఏదీ జరగలేదు.2014లో జరిపిన సకుటుంబ సర్వే వివరాలు వెల్లడి కాకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనతో కూడిన కుటుంబసర్వే ఇంకా పూర్తికాలేదు. అయితే మండలాల స్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం సుమారు 40లక్షల కుటుంబాలను భూమిలేని కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఏ పథకానికైనా రేషన్‌కార్డును ప్రాథమిక అర్హతగా చెబుతున్న ప్రభుత్వం.. రైతు రుణమాఫీ తరహాలో కుటుంబంలో ఒక్కరినే ఇందుకు అర్హులుగా గుర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుభరోసా పథకాన్ని వర్తింపజేస్తున్న ప్రభుత్వం.. ఈ పథకంలో లబ్ధి పొందని వారందరినీ భూమిలేని కు టుంబాలుగా పరిగణనలోకి తీసుకుంటుందేమోన ని రైతు కూలీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 30 లక్షల కుటుంబాలకు ఇచ్చినా..భూమిలేని కుటుంబాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన గుర్తించినా... కనీసం 30 లక్షల కుటుంబాలను అర్హులుగా తేల్చే అవకాశం ఉందని సమాచారం. ఈలెక్కన ఒక్కో కుటుంబానికి తొలివిడత రూ. 6వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేస్తే రూ.1,800 కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఈలెక్కన సంవత్సరానికి రూ. 3,600 కోట్లు అవసరమవుతాయి. అర్హుల గుర్తింపుపై స్పష్టత వస్తే ఈ లెక్కల్లో తేడా ఉండే అవకాశం ఉంది.అర్హులందరికీ ఇవ్వాలిసారంపల్లి మల్లారెడ్డి, సీపీఎం నేత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని కుటుంబాలకు, రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతు రుణమాఫీలో కోతలు పెట్టినట్టుగా ఈ పథకం కింద పేదలకు అన్యాయం చేయొద్దు. రాష్ట్రంలో 60 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 40 లక్షల కుటుంబాలు భూమి లేని పేదలే. వీరందరికీ ఆర్థిక సాయాన్ని అందించాలి. -
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా, జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆ చెక్కు అందజేశారు.కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: వంగా గీతఅనంతరం పిఠాపురంలో జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వంగా గీతా మండిపడ్డారు. మహిళలకు భద్రత, ధైర్యం కల్పించాలని వంగా గీత అన్నారు. వైఎస్సార్సీపీని సంస్ధగతంగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇచ్చినా హమీలను అమలు చేయలేదు. ఇచ్చిన హమీలను నూరు శాతం వైఎస్ జగన్ అమలు చేశారు. కూటమి సర్కార్.. ప్రజలను నమ్మించి హమీలు అమలు చేయకపోవడం అన్యాయం’’ అని ఆమె దుయ్యబట్టారు.మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ: కురసాల కన్నబాబుప్రజలకు మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ. నేరుగా ప్రజలకు సేవలందించాలని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశమంతా చూసేలా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చంద్రబాబులా అబద్దపు హమీలు జగన్ ఇవ్వలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కులం, మతం చూడకుండా అర్హులకు పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీదే. చంద్రబాబూ.. రుషికొండ ప్యాలెస్ కాదు.. పలాసలో నిర్మించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ చూడండీ. పాడేరులో కట్టిన మెడికల్ కళాశాల.. ఉప్పాడలో కట్టిన ఫిషింగ్ హర్బర్‌ను కూడా చూడాలి...అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. పోలీసుల పని తీరు ఏలా ఉందో చెప్పారు. ఇసుక, శాంతి భద్రతల సమస్యలు నాకు సంబంధం లేదంటే కుదరదు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎక్కడపడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. అయినా పోలీసులు పని బాగోలేదని కూటమి నాయకులు చెబుతున్నారు. గోతులు పూడ్చడానికి కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు ప్రచారం పీక్‌లో ఉంటుంది. వాస్తవం కింద ఉంటుంది.ఇదీ చదవండి: నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా? -
Maharashtra Assembly Elections 2024: పోలీసు వాహనాల్లో డబ్బు మూటలు
బారామతి: పోలీసు వాహనాల్లో నగదును తరలించి అధికార మహాయుతి కూటమి అభ్యర్థులను అందజేస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. పవార్ శనివారం నాడిక్కడ తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నారనే అంశంపై తాను చాలా మాట్లాడాలని అనుకున్నా.. తనకు సమాచారమిచ్చిన అధికారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటిస్తున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల నుంచి డబ్బు తరలింపుపై అధికారులు సమాచారం అందించారని వివరించారు. అధికార మహాయుతి కూటమిలో శివసేన (షిండే), బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్)లు భాగస్వామ్యపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. లడ్కీ బహిన్ యోజన తదితర జనాకర్షక పథకాలు అధికార కూటమికి అనుకూలిస్తాయని అనుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఈ పథకం కింద నగదును అందుకున్నామని పలువురు మహిళలు చెబుతున్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. కిరోసిన్, వంటనూనెల ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేతితో ఇచ్చి మరో చేతితో లాక్కొంటున్నారని వాపోయారు’ అని శరద్ పవార్ బదులిచ్చారు. ఇలాంటి పథకాల్లో తర్కం లేదని, ఇవన్నీ వంచనతో కూడినవి పవార్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్ర ర్యాంకింగ్ పడిపోయిందని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వాన్ని మార్చడమొకటే పరిష్కారమని పేర్కొన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా బలోపేతం చేయగల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ... కాంగ్రెస్, ఎన్సీపీ– ఎస్పీ, శివసేన– యూబీటి)కి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రధాని, ఆయన సహచరులు దృష్టి పెట్టడం లేదని, రాజకీయాలతో సమస్యలకు పరిష్కారాలు లభించవని చురకలంటించారు. -
గిగ్ వర్కర్లకూ ‘ఈ–శ్రమ్’తో భద్రత
సాక్షి, అమరావతి: ‘విజయవాడకు చెందిన సంతోశ్‌కు తాను చేస్తున్న ఉద్యోగంలో వచ్చే నెల జీతం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రైడ్ యాప్‌ల గురించి తెలుసుకుని పార్ట్‌టైమ్‌గా పనిచేసేందుకు వాటిలో రిజిస్టర్ చేయించుకున్నాడు. సంతోశ్‌ను ఒక వ్యక్తి తనను ఎయిమ్స్ వరకు తీసుకెళ్లాలని యాప్ ద్వారా సంప్రదించాడు. సరేనని తీసుకెళ్లాక.. నిర్మానుష్య ప్రదేశంలో సంతోశ్‌పై దాడిచేసి సెల్‌ఫోన్, నగదు, బంగారం దోచుకెళ్లాడు. ఆ షాక్ నుంచి బయటపడటానికి సంతోశ్‌కు చాలా కాలం పట్టింది’.. ఇది కేవలం ఒక్క సంతోశ్ అనుభవం మాత్రమే కాదు.. వేలాది మంది గిగ్ వర్కర్లు నిత్యం ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వీరికి కూడా తగిన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమాతో పాటు ఎన్నో ప్రయోజనాలుమన దేశంలో ప్రస్తుతం 7.7 మిలియన్ల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 23.5 మిలియన్లకు పెరుగుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా. ఒక్కో కార్మికుడు వారానికి ఐదు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తే నెలకు దాదాపు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు సంపాదించవచ్చు. అయితే వీరికి సామాజిక భద్రత అనేది ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోంది. అందుకు సంబంధించిన ముసాయిదాను ప్రకటించింది. అందులో భాగంగా ముందుగా గిగ్ వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్య బీమా లభిస్తుంది. నిరుద్యోగ భృతి, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా వంటి ఇతర సౌకర్యాలూ లభిస్తాయని కేంద్రం చెబుతోంది. కార్మికుల వివరాలు నమోదు చేయాల్సిందిగా ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ తదితర యాప్ ఆధారిత ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలకు కేంద్రం సూచించింది. నమోదు ఇలా.. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డ్–2024ను ప్రారంభించింది. దరఖాస్తుదారులందరికీ రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ–శ్రమ్ కార్డు సహాయంతో 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.3,000 పెన్షన్ కూడా లభిస్తుంది. ఆన్లైన్లో eshram.gov.in ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, పాన్, రేషన్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, తాజా విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, ఐఎఫ్ఎస్సీ కోడ్‌తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దరఖాస్తుకు సంబంధించి ఏదైనా సహాయం కోసం ఫోన్ నంబర్ 011–23710704ను సంప్రదించవచ్చు. -
నిరుపేద మెడిసిన్ విద్యార్థికి దాతల ఆర్థికసాయం
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు దిద్దిపూడి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని పానెం శ్రీహర్షిత ఇటీవల ప్రకటించిన మెడిసిన్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించింది. ఆమె దీనస్థితిని గమనించి ‘సాక్షి’ ఈ నెల 3వ తేదీన ‘చదువుల తల్లిని కనికరించని లక్ష్మీదేవి’ అంటూ కథనాన్ని ప్రచురించింది. దీంతో దాతలు విరివిగా స్పందించారు. ఇప్పటివరకు రూ. 1,10,000 ఆర్థిక సాయాన్ని శ్రీహర్షిత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. ఆదివారం ఖమ్మంకు చెందిన సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎ.నర్సింహారావు, సభ్యులు నాగరాజు, సైదులు, సతీశ్‌లు రూ. 12 వేల ఆర్థిక సాయంతో పాటు రూ.30 వేలు విలువ చేసే వైద్యవిద్యకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. అంతేకాకుండా కొణిజర్ల, బోనకల్ హెల్త్ సూపర్వైజర్లు వి.భాస్కర్‌రావు, ఎం.దానయ్యలు రూ. 10 వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. విజయవాడకు చెందిన మరో వైద్యుడు నాలుగేళ్ల హాస్టల్ ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీహర్షిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహర్షిత ‘సాక్షి’తో మాట్లాడుతూ తన ఆర్థిక పరిస్థితిని గమనించి ముందుకు వచ్చిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. -
భర్త అంత్యక్రియలకు సాయం చేయండి..
హుజూరాబాద్ రూరల్: మృత్యువు హఠాత్తుగా భర్తను కబళించింది. అంత్యక్రియలకు పేదరికం ఆటంకంగా నిలిచింది. కన్నీళ్లు దిగమింగుకున్న ఆ ఇల్లాలు సాయం కోసం వేడుకోగా.. స్పందించిన మానవత్వం చివరి మజిలీకి అవసరమైన సాయం చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లిలో చోటుచేసుకుంది. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్–ప్రేమలత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. కూలినాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూతుళ్లకు ఉన్నంతలో వివాహం జరిపించారు. ఇక తమ బతుకు తాము బతుకుదామనుకునే సమయంలో లక్ష్మణ్ మంగళవారం ఇంటి వద్ద హఠాత్తుగా కిందపడిపోయాడు. ఆ సమయంలో అందుబాటులో ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలస్యమైంది. చివరకు కొందరు గ్రామస్తులు అక్కడకు రావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే చికిత్స అందిస్తుండగానే లక్ష్మణ్ మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు అద్దె ఇంటి యజమాని అడ్డు చెప్పాడు. దీంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం.. దుఃఖాన్ని దిగమింగుకుంది. ఊరు బయటనే ఓ డేరా వేయించి అక్కడే మృతదేహాన్ని ఉంచారు. అయితే, అంత్యక్రియలు పూర్తిచేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో మృతుడి భార్య కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని చూసేందుకు వచి్చన వారిని సాయం చేయాలని ప్రాధేయపడింది. తల్లీకూతుళ్లు చేతులు చాచి ఆర్థికసాయం కోసం విన్నవించడం గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. స్పందించిన వారు తలాకొంత పోగుచేసి రూ.80 వేలను మృతుడి కుటుంబానికి అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సూచన మేరకు ఆ పార్టీ నాయకులు కూడా కొంత నగదు అందజేయడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
సాయం పెంచండి.. ఖమ్మం ముంపు బాధితుల విజ్ఞప్తి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్నేరు ముంపు నష్టం లెక్క కట్టలేని స్థాయిలో ఉందని.. కానీ ప్రభుత్వం ఇస్తామంటున్న సాయం సరిపోయేలా లేదని వరద బాధితులు వాపోతున్నారు. నిత్యావసరాలు, దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్ సామగ్రిదాకా ఏదీ మిగల్లేదని.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పనికి వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితుల్లో ఉన్న తమ బతుకులు గాడిన పడాలంటే సర్కారు ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు. వరద ముంపునకు గురై ఎనిమిది రోజులు దాటినా ఇంకా ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు.సాయం కోసం ఎదురుచూస్తూనే..మున్నేరు ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా కొలిక్కిరాలేదు. ఇళ్లను, మిగిలిన సామగ్రిని శుభ్రం చేసుకునేందుకే బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎవరైనా వచ్చి ఏదైనా సాయం అందిస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. మున్నేరు, ఆకేరు ఇతర వాగులకు వచ్చిన వరదతో ఖమ్మం జిల్లాలో 15,201 ఇళ్లు నీట మునగగా.. 70 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఎవరిని కదిలించినా.. సర్వం కోల్పోయి, మళ్లీ మొదటి నుంచి జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇళ్లలోని ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్, టీవీ, మిక్సర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచాలు, టేబుల్స్, నిత్యావసరాలు అన్నీ పాడైపోయాయని అంటున్నారు. ఏళ్లకేళ్లుగా కూడబెట్టుకుని సమకూర్చుకున్న సామగ్రి అంతా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.16,500 సాయం అందిస్తే, తాత్కాలిక ఉపశమనమే ఉంటుందని.. ఇక తమ బతుకులు గాడినపడేది ఎలాగని వాపోతున్నారు.పొలాల పరిహారమూ పెంచాలి..వరదల వల్ల సాగుకోసం చేసిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోయామని.. ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు అవసరమని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్న పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటలు, రాళ్లు చేరాయని.. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు పరిహారం ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.పాలేరు వరదతో ఆరు ఎకరాల్లో వరి కొట్టుకుపోయింది. పొలం కోతకు గురై ఇసుక మేట వేసింది. కరెంటు మోటార్లు, స్తంభాలు కూడా కొట్టుకుపోయాయి. రూ.4 లక్షలకుపైనే నష్టం జరిగింది. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంతో ఇవన్నీ సరిచేసుకునేదెట్లాగో తెలియడం లేదు.– బీరెల్లి సుధాకర్‌రెడ్డి, మల్లాయిగూడెం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లాఈ సాయం సరిపోదు..ఖమ్మం ధంసలాపురానికి చెందిన నిడిగుండ నరేశ్–ఈశ్వరమ్మలకు ఇద్దరు పిల్లలు. రోజూ పనికి వెళ్తేనే కుటుంబం గడిచేది. మున్నేరు వరదతో ఇంటి పునాది కోతకు గురై గోడలు పడిపోయాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, గ్యాస్ సిలిండర్ అన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఇస్తామంటున్న ఆర్థిక సాయంతో కోలుకునేది ఎలాగని నరేశ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం దయ చూపితేనే..ఖమ్మం మోతీనగర్‌కు చెందిన కస్తూరి సంతోష–రమేశ్ కూలి పనులు వెళ్లి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంటి ప్రహరీ కూలిపోగా, తలుపులు ఊడిపోయి సామగ్రి కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని.. తమపై ప్రభుత్వం దయచూపితేనే కోలుకుంటామని వారు వాపోతున్నారు.ఆదుకుంటేనే మనుగడఖమ్మం వెంకటేశ్వర నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు తోపుడు బండిపై కూరగాయలు అమ్మడంతోపాటు చిన్న కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంట్లో సామాన్లతోపాటు కిరాణా షాపులోని సామగ్రి అంతా కొట్టుకుపోయాయి. «అధికారులు వచ్చి పేర్లు రాసుకెళ్లినా ఇంకా ప్రభుత్వ సాయం అందలేదని.. సర్వం కోల్పోయిన తాము సాధారణ స్థితికి వచ్చేలా ప్రభుత్వమే ఆదుకోవాలని వెంకటేశ్వర్లు కోరుతున్నాడు. -
ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం అందించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. చాలాచోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అంటూ బొత్స ప్రశ్నించారు.బాత్రూమ్లో కెమెరాలు కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారు. కెమెరాలు బాత్ రూమ్‌లో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు.. వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ అక్కడ ఏమి జరగలేదని చెప్పగలరా?. వైఎస్సార్సీపీ పాలనలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. విశాఖలో లోకేష్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. 47 వేల క్లాస్ రూమ్‌లను గత ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. 20 వేల క్లాస్ రూమ్‌ల్లో టీవీలు ఏర్పాటు చేశాం’’ అని బొత్స తెలిపారు.‘‘విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వసతులను చూసి లోకేష్ మెచ్చుకున్నారు. ఇది గత ప్రభుత్వ ఘనత. విద్యార్థుల చదువు కోసం వైఎస్ జగన్ సర్కార్ అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు వేశారు. ఈ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క విద్యార్థికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు.’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం: బొత్స
సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులను కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతతో మాట్లాడాలని బొత్స హితవు పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించుకోలేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. ‘‘విషాదం వేళ.. రాజకీయం ఎందుకు?. వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాము. తెల్లవారు జామున జరిగిన కూడా ఎక్కడ సహాయక చర్యలు ఆగలేదు. కరోనా సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదు. స్థాయి మరిచి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. గత ఐదేళ్లలో ఏమి జరగలేదని మాట్లాడుతున్నారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాత సీఎం కేజీహెచ్‌కు వచ్చారు. ఒక మంచి నీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే మృతిచెందిన వారికి కోటి రూపాయల చెక్కు అందించాము. అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశాము.’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. -
మరోసారి మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఈ నెల 6 తేదీన రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలిక హత్యకు గురవ్వగా, బాలిక కుటుంబాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. వైఎస్సార్సీపీ నేత సుకుమార్ వర్మ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెప్పారు.కాగా, సొంత జిల్లాలో బాలికను ఒక యువకుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె.. బాలిక కుటుంబ సభ్యులను కనీసం పరామర్శించలేదు. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పకపోవడంపట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.మరోవైపు, టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయి. అమానవీయ, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. -
చదువుల తల్లికి సీఎం చేయూత
వీర్నపల్లి (సిరిసిల్ల): ఐఐటీ పాట్నా లో సీటు సాధించిన పేద గిరిజన విద్యార్థి ని బదావత్ మధులత విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎంవో బుధవారం అధికారికంగా వెల్లడించింది. కోర్సు పూర్తయ్యేవరకు ఆర్థిక సహాయం కొనసాగుతుందని హైదరాబాద్‌కు వెళ్లిన విద్యారి్థనితోపాటు వారి కుటుంబీకులకు సీఎంవో హామీ ఇచి్చంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభచూపి 824వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. పాట్నా ఐఐటీలో చదవాలంటే దాదా పు రూ.3 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సోమవారం ‘సాక్షి’లో ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇది సీఎంవో దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ విద్యారి్థనిని హైదరాబాద్‌కు పిలిచారు. బుధవారం మధులత ఆమె తండ్రి రాములుతో కలిసి వెళ్లింది. చదువు పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని సీఎం ఆదేశించడంతో గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధుల మంజూరు ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయంలో రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శి శరత్ మధులతకు రూ.1,51,831 చెక్కును అందజేశారు. మధులత కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.70 వేలు ఇవ్వడంతో పాటు అదనంగా మరో రూ.30 వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని గిరిజన సంక్షేమ శాఖ మధులతకు భరోసా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ, మధులతను రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో అభినందించారు. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సాక్షితోపాటు తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధులత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం.. అండగా నిలిచిన వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ కార్యకర్తకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. విశాఖ తూర్పు నియోజకవర్గం తొమ్మిదో వార్డుకు చెందిన ఉమ్మడి అప్పారావుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం చేశారు. అప్పారావుకు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్, మేయర్ హరి వెంకటకుమారి చెక్కును అందజేశారు.కాగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి ఎన్టీఆర్ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మిద్దె బాబీ, అతని భార్యపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఇంట్లోని సామగ్రి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన బాబీ దంపతులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా టీడీపీ శ్రేణులు బెదిరించాయి. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి వివరించారు.పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిన రూ.50 వేల చెక్కును పేర్ని కిట్టు, నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ.. బాధితుడికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ శీలం భారతి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
వికలాంగులకు నాట్స్ చేయూత!
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా నిజామాబాద్‌లో ఓ దివ్యాంగుడు స్వశక్తితో ఎదిగేందుకు చేయూత అందించింది. హోప్ ఫర్ స్పందనతో కలిసి నాట్స్ దివ్యాంగుడు కిరణా దుకాణం పెట్టుకునేందుకు కావాల్సిన ఆర్ధిక సాయం చేసింది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఈ కిరణా దుకాణాన్ని ప్రారంభించి ఆ దివ్యాంగుడికి భరోసా ఇచ్చారు.తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన చేయూత ఈ సమాజం అందించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. హోప్ ఫర్ స్పందన దివ్యాంగుల కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఆ సంస్థతో కలిసి తాము కూడా చేతనైన సాయం చేస్తున్నామని బాపు నూతి తెలిపారు.. దివ్యాంగుల సమస్యలను తమ దృష్టికి తెచ్చి వారికి చేయూత అందించడంలో తమను భాగస్వాములు చేసిన హోప్ ఫర్ స్పందనకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!) -
AP: విరామ వేళ.. వలకు భరోసా
సాక్షి, మచిలీపట్నం: సముద్ర జలాలపై సాగించే చేపల వేటకు విరామం లభించింది. గంగపుత్రులు రెండు నెలల పాటు తమ వలలకు విశ్రాంతి ప్రకటించనున్నారు. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేపల వేట సాగించే మత్స్యకారులు నిషేధ కాలంలో ఇంటి పట్టునే ఉండనున్నారు. దీంతో వీరికి ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించి ఆ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. 61 రోజులు బ్రేక్.. సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బంగాళాఖాతంలో వేటకు విరామం ఇవ్వాలి. ఏటా ఏప్రిల్ 15వ నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలోని పశి్చమ బెంగాల్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధం ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ (61 రోజులు) ఇది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపల వేట నిషేధం అమలుకు పోలీసుల సహకారంతో మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేట ముగించుకుని తమ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు. వేట విరామ భృతి.. సముద్రంలో చేపల వేటపై నిషేధం కారణంగా ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేట విరామ భృతిని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ భృతి కేవలం రూ.4 వేలు మాత్రమే ఉండగా దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10వేలకు పెంచి, వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 2019 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది కూడా సాయం అందించేందుకు మత్స్యశాఖ అధికారులు చేపల వేట సాగించే బోట్లకు ఫొటోలు తీసుకుని, లబి్ధదారుల వివరాలు నమోదు చేసే చర్యలు చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా వివరాలు.. ♦ సముద్ర తీరప్రాంత మండలాలు: మచిలీపట్నం, నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు ♦ సముద్ర తీరం: సుమారు 111 కిలోమీటర్లు ♦ మత్స్యకార ఆవాసాలు : 64 ♦ మత్స్యకారుల జనాభా: 85వేలు ♦ సముద్రంలో చేపల వేట సాగిస్తున్న వారు: 12వేలు ♦మొత్తం బోట్లు : 2,256 ♦ వీటిలో మెకనైజ్డ్ బోట్లు : 92 ♦ మోటరైజ్డ్ బోట్లు: 2,091 ♦ సంప్రదాయ బోట్లు : 73 ♦ ఏటా మత్స్య సంపద టర్నోవర్: 40,600 టన్నులు చేపలు, 11,390 టన్నుల రొయ్యలు ♦ మత్స్య సంపద విలువ: సుమారు రూ.510కోట్లు సాయం చేసేందుకు గుర్తింపు.. వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట సాయం అందించేందుకు 18 మీటర్ల వరకూ పొడవు ఉన్న మెకనైజ్డ్ బోట్‌కు యజమాని మినహా 8 మందికి, మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురికి, సంప్రదాయ బోట్లకు ముగ్గురు చొప్పున మత్స్యకారులను అర్హులుగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వ సాయం పొందేందుకు బోట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సెల్ నంబర్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తించే చర్యలు చేపట్టాం.. నేటి నుంచి సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులోకి వచ్చింది. మత్స్యకార భరోసా సాయం అందించేందుకు లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. వేట నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ మెరైన్ రెగ్యులేషన్ చట్టం–1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం. చేపలు, పడవలు స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తాం. తీరంలో చేపలు అమ్మకాలు, ప్యాకింగ్ చేయరాదు. వేట నిషేధంపై మత్స్యకారులు, వ్యాపారులకు నోటీసులు అందించాం. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. – వి. శివ సాంబరాజ్యం, జిల్లా మత్స్యశాఖ అధికారి(జేడీఎఫ్), కృష్ణా జిల్లా -
ఊరూరా ఉపాధికి బాటలు
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థాయిలో సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తద్వారా ఊరూరా ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ.. పదిమందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. ఈ తరహా పరిశ్రమలు దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ఉంటే.. మన రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని ఆధునికీకరించేందుకు అవసరమైన తోడ్పాటు ఇవ్వడమే కాకుండా కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ‘వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రోడక్ట్’ కింద జిల్లాకో ఉత్పత్తిని ఎంపిక చేసి.. ఆ ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్‌ప్రైజస్ (పీఎం ఎఫ్ఎంఈ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో ఆర్థిక చేయూత ఇస్తున్నాయి. 2021లో ప్రారంభించిన ఈ పథకం కింద ఐదేళ్లలో రూ.460 కోట్ల ఆర్థిక చేయూతతో 10 వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. మూడేళ్లలో 3,843 పరిశ్రమలకు రూ.300 కోట్లకు పైగా ఆర్థిక చేయూత అందింది. రూ.10 లక్షల వరకు చేయూత వ్యక్తిగత కేటగిరీతో పాటు వ్యవసాయ సహకార సంఘాలు (ఎఫ్‌పీఓ), ఉత్పత్తిదారుల సంఘాలు (పీఓ), స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణ అనుసంధాన గ్రాంట్ మంజూరు చేశారు. పచ్చళ్లు, తినుబండారాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందే ఎస్‌హెచ్‌జీల్లోని çసభ్యులకు రూ.40 వేల వరకు సీడ్ క్యాపిటల్ కింద అందించారు. వ్యక్తిగత కేటగిరీలో ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు రుణ అనుసంధాన రాయితీ (క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ) గరిష్టంగా రూ.10 లక్షల వరకు అందించారు. ఇందులో 10 శాతం లబ్దిదారు భరిస్తే మిగిలిన 55 శాతం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో అందించారు. కల్పించిన సౌకర్యాలివే.. ఈ స్కీమ్ కింద పొందే రుణాలతో కామన్ ప్రోసెసింగ్ ఫెసిలిటీ కింద వ్యవసాయ ఉత్పత్తులను సారి్టంగ్, గ్రేడింగ్, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలతోపాటు ఉత్పత్తులను ప్రోసెస్ చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్, ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కెపాసిటీ బిల్డింగ్‌లో భాగంగా 9 కేటగిరీల్లో ఫుడ్ ప్రోసెసింగ్ టెక్నాలజీలు, తయారీ పద్ధతులు, ఆహార ప్రమాణాలు, నిబంధనలు, ఫుడ్ లైసెన్సింగ్ వంటి వాటిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. మనుగడలో ఉన్న పరిశ్రమల క్రమబద్దీకరణతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్‌లో శిక్షణ, రిటైల్ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో చేయూత ఇచ్చారు. బ్రాండింగ్ ఉత్పత్తుల ద్వారా మెరుగైన వాణిజ్యానికి సహకారం అందించారు. యంత్రాలు కొన్నాం మాది గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్. మసాలా దినుసులు తయారు చేస్తాం. పరిశ్రమను విస్తరించాలనుకున్నాం. కరోనా వల్ల వెనక్కి తగ్గాం. ఆ సమయంలో ఉద్యాన శాఖ అధికారులొచ్చి ఈ స్కీమ్ గురించి చెప్పారు. దగ్గరుండి దరఖాస్తు చేయించారు. 35 శాతం సబ్సిడీతో రూ.30 లక్షల రుణం తీసుకున్నాం. కొత్త యంత్రాలు కొనుగోలు చేశా. వ్యాపార విస్తరణకు ఇది ఎంతగానో దోహదపడింది. – బలుసు వీణ, గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్, కడప జీడిపప్పు వ్యాపారానికి చేయూత కొన్నేళ్లుగా జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాం. మెషినరీ కొనుగోలు కోసం ఆలోచిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో రూ.7.50 లక్షల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తం పరిశ్రమకు అవసరమైన మెషినరీ కొనుగోలుకు ఉపయోగపడింది. – మణిదేవి, వజ్జిలపేట, తూర్పు గోదావరి జిల్లా పప్పు పరిశ్రమకు విస్తరించాం పప్పు ప్రోసెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్తాం. వ్యాపారం విస్తరించుకోవాలని అనుకున్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. పీఎంఎఫ్ఎ స్కీమ్ కింద దరఖాస్తు చేశాం. రూ.28 లక్షల రుణమిచ్చారు. మెషినరీ కొనుగోలుతోపాటు వ్యాపారాన్ని మరింత విస్తరించుకోగలిగాం. – జోడు లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు -
పెళ్లి సాయంపైనా కుళ్లు రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద బిడ్డల పెళ్లికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపైనా రామోజీ కుళ్లు రాతలు మానలేదు. క్రిస్టియన్ మైనారిటీలకు అందించే ‘వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా’ పథకంపై ‘మేనిఫెస్టోలో ఆమెన్.. ఆనక మరిచెన్’ అనే తప్పుడు కథనంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే పేద బిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక ప్రోత్సాహం పెంచడంతో పాటు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం లబ్ధిదారులకు అందించిందనే విషయాన్ని ఈనాడు విస్మరించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన 56,194 జంటలకు రూ.427.27 కోట్ల ఆర్థిక సాయం అందించి వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోపణ: వాగ్దానాల అమలుకు ఒక్క రోజు కూడా చర్యలు తీసుకోలేదు వాస్తవం: గత ప్రభుత్వం హామీలను గుప్పించి అమలు చేయకపోగా అధికారిక వెబ్సైట్లోనూ మేనిఫెస్టో మాయం చేశారు. ఇది రామోజీ పచ్చ కళ్లకు కన్పించ లేదు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావించి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. మేనిఫెస్టోను కళ్ల ముందే కన్పించేలా డిస్ప్లే చేస్తూ అందులో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసేలా షెడ్యూల్ ప్రకటించి ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తున్నారు. అయినా సీఎం వైఎస్ జగన్‌పై విషం కక్కే రాతలు రాసింది. క్రైస్తవులకు టీడీపీ హయాంలో అమలు చేసిన పెళ్లి కానుక పథకాన్ని పక్కన పెట్టినట్టు అబద్ధాలు రాసింది. క్రిస్టియన్ మైనారిటీలకు ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ అదేం లేదంటూ అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఆరోపణ: పెళ్లి కానుక అటకెక్కించారు వాస్తవం: క్రైస్తవ యువతుల పెళ్లికి గత టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచినట్టు రామోజీ అడ్డగోలుగా అబద్ధాలు రాసేశారు. పేద బిడ్డల పెళ్లికి సాయం అందించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మాస్ మ్యారేజ్’ పేరుతో ఆర్థిక సాయాన్ని అందించారు. క్రైస్తవ ఆడ బిడ్డల పెళ్లికి రూ.25వేల ఆర్థిక సాయం, కొత్త బట్టలతోపాటు పెళ్లి వస్తువులు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ‘దుల్హాన్’ పథకంగా పేరు మార్చి అమలు చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా 2018లో రూ.25వేల సాయాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పెంచిన మొత్తాన్ని అందించకపోగా బకాయిలు పెట్టారు. 2018 నుంచి జరిగిన 43,490 జంటల(పెళ్లిళ్లు)కు రూ.177.96 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను సైతం విడుదల చేసింది. ఈ వాస్తవాన్ని ఈనాడు మరుగున పరిచింది. ఆరోపణ: పరిశీలన లేదు.. ఎంపిక లేదు వాస్తవం: గత ప్రభుత్వం గొప్పలను డబ్బా కొట్టిన ఈనాడుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా షాదీ తోపా పథకాన్ని అమలు చేయడం మింగుడు పడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు నెలలకు(త్రైమాసికం) ఒకసారి లబ్ధిదారులందరికీ సాయం విడుదల చేస్తోంది. గత ప్రభుత్వం వధువుకు సాయం అందిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వధువు తల్లికి అందజేస్తోంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఐకేపీల పరిధిలోని మండల సమాఖ్య ద్వారా ఎంపిక చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేస్తోంది. గత ప్రభుత్వంలో పట్టణ, గ్రామీణ లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలంటే అవస్థలు పడేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్థానికంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది. గత ప్రభుత్వంలో బకాయిలు కాలానుగుణంగా విడుదల చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో వివాహం జరిగిన తేదీ నుండి 30 రోజులలోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే మహోన్నత లక్ష్యంతో వివాహాలు చేసుకునే వారు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలని నిబంధన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టింది. దీని వల్ల పేద వర్గాలకు చెందిన ఆడపిల్లలందరూ పదవ తరగతికి తగ్గకుండా చదువుకున్నారు. ఉన్నత చదువులు చదివించాలనే సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి పథకాల ద్వారా ఉన్నత విద్యకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆరోపణ: ఇచ్చిన జీవోకే మళ్లీ జీవో వాస్తవం: పేద బిడ్డల పెళ్లికి గత ప్రభుత్వం ఏం చేసింది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతమేరకు సాయం అందిస్తోంది అనేది గమనిస్తే చాలు ఈనాడు రోత రాతల వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుస్తుంది. గత ప్రభుత్వం అరకొర సాయాన్ని కూడా సకాలంలో చెల్లించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాత బకాయిలు సైతం చెల్లించి ఆర్థిక సాయం పెంచి అందించింది. మైనారిటీలను ఆదుకున్నది జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మైనారిటీలను అదుకున్నది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేది గర్వంగా చెప్పగలం. ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,82,270 మందికి రూ.416.56 కోట్ల లబ్ధి చేకూర్చింది. నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ ద్వారా రూ.13,239.49 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 11,064.88కోట్ల లబ్ధిని అందించింది. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37కోట్లు చెల్లించింది. మైనారిటీ వర్గాలను రాజకీయ, సామాజిక, ఆర్థికంగా ముందుకు నడిపిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలుస్తున్నారు. – బొల్లవరపు జాన్ వెస్లీ, చైర్మన్, ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. బీకాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా.. సీఎం వెంటనే స్పందించారు. పైచదువులకు 15,000 రూపాయలు, జీవనోపాధికి మరో 15,000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 వేల రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్.. హరిజన గోరంట్లకు అందజేశారు. బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామ నివాసితుడు షేక్ అబ్దుల్ వజీద్ తన కుమారుడు కిడ్నీ సమస్యతో ఒకటిన్నర సంవత్సరం నుండి బాధపడుతున్నాడని.. నెలకు 5000 రూపాయలు వైద్యానికి ఖర్చవుతుందని తాను పేద వాడినని ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరగా.. వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ అబ్దుల్ వజీద్‌కు లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. అలాగే అవుకు మండలం వేములపాడు గ్రామ నివాసితుడు బి.మనురాహుల్ తాను 6 సంవత్సరాల నుంచి వికలాంగత్వంతో బాధపడుతున్నానని వ్యాధి చికిత్సకు తగిన ఆర్థిక స్తోమత తమ వద్ద లేదని, సహాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వ్యాధి చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా షేక్ లక్ష రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. బనగానపల్లె పట్టణ వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్ తనకు 20 సంవత్సరాల వయసు ఉందని ఇంటర్ ఫెయిల్ అయ్యానని.. నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తగిన ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డా. డా.కె.శ్రీనివాసులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వ్యాపారం చేసుకునేందుకు 2 లక్షల రూపాయల చెక్కును అబ్దుల్ హజీమ్‌కు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగవైకల్యం, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఇప్పటివరకు వారు సొంత నిధులతో ఖర్చుపెట్టిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తూ భవిష్యత్తులో జరిగే వైద్య ఖర్చులకు కూడ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సభా వేదిక, హెలిపాడు ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చిన 22 మంది అర్జీదారులకు ఆర్థిక సహాయం, పెన్షన్లతో పాటు వ్యాధిగ్రస్తులు ఇప్పటివరకు వారి సొంత నిధులతో వైద్యానికి ఖర్చు పెట్టుకున్న మొత్తానికి పూర్తిస్థాయి రీయింబర్స్‌మెంట్‌కు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌కు సంబంధిత అర్జీదారులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
బాధితులకు ముఖ్యమంత్రి ఆపన్నహస్తం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విజయవాడ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు ఆపన్నహస్తం అందించారు. ఆర్థిక సహాయం కోరుతూ బాధితులు వినతులు అందించగా.. వారికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాధితులు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించి తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. సమస్యలు విన్న సీఎం తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా, సీఎం చేసిన సహాయానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తమ కష్టాలను చెప్పుకున్న వెంటనే అర్థం చేసుకొని తక్షణమే స్పందించి సహాయం చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. సహాయం అందుకున్న వారు.. ► విస్సన్నపేట మండలం, నరసాపురం గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు భానుతేజ కేన్సర్‌తో బాధపడుతున్నాడని.. చికిత్స అవసరాల నిమిత్తం సాయం చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ. 2 లక్షలు సహాయాన్ని అందించారు. ► విజయవాడ, అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన 31 ఏళ్ల కంబా ఏడుకొండలు.. ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ.2 లక్షలు సహాయాన్ని అందించారు. -
మత్య్సకారుల ఖాతాల్లో రూ. 161.86 కోట్లు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది. 4:15PM, Mar 12th, 2024 మత్య్సకారులకు పరిహారం జమ చేసే కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ ప్రోయాక్టివ్‌గా పనిచేస్తోంది ఒక్కో మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం ఎమ్మెల్యే సతీష్ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు మత్స్యకారులకు అందించే ఈ సహాయం ఐదోవిడత సహాయం దాదాపు రూ.162 కోట్లు అందిస్తున్నాం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఇప్పటివరకూ రూ.644 కోట్లు ఇచ్చాం ఉపాధి కోల్పోయిన వీరందరికీ కూడా మంచి చేస్తున్నాం 2012కు సంబంధించి రూ.8 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు చేస్తూ 78 కోట్లు 16 వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించాం వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు మాత్రమే రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడం లేదు గతంలో డీజిలుపై లీటరు మీద రూ.6లు సబ్సిడీ ఇస్తే, మనం రూ.9లకు పెంచాం గతంలో ఆ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు ఇప్పుడు డీజిలు పోయించుకున్నప్పుడే సబ్సిడీ ఇస్తున్నాం ఈ విషయంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించాం దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోట్లుకు పైగా సబ్సిడీ ఇచ్చాం వేటకు వెళ్తే మత్స్యకారులు మరణిస్తే.. ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం గతంలో ఎక్స్‌గ్రేషియా ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు నిర్ణీత కాలంలో ఈ డబ్బు అందేలా చేస్తున్నాం 175 కుటుంబాలకు ఇప్పటివరకూ సహాయాన్ని అందించాం ఈమూడు కార్యక్రమాలే కాకుండా.. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి ఇస్తున్నాం అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నాం దాదాపుగా రూ.3500 కోట్లు సబ్సిడీగా ఇచ్చాం ఈ ఆరు పథకలు రూ.4913 కోట్లు అందించాం ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందిస్తున్న సహాయం అదనం తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం 10 హార్బర్లు, 6 ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం తీరంవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం ఇవాళ జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించాలని అనుకున్నాం వీసీ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్‌ను ప్రారంభిస్తాను దీంతో ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం 4:10PM, Mar 12th, 2024 జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్టీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ 3:30PM, Mar 12th, 2024 కాసేపట్లో జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభం క్యాంప్ ఆఫీసు నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం 1,250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్ధ్యం 25 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం ఏడాదికి 41,250 టన్నుల మత్స్య ఉత్పత్తికి అవకాశం ఓఎన్జీసీ పైప్‌లైన్‌తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.161.86 కోట్ల పరిహారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ సాక్షి, తాడేపల్లి:సముద్రాన్ని ఆధారంగా చేసుకొని చేపల వేట సాగించే రాష్ట్ర మత్స్యకారుల స్థితిగతులు పూర్తిగా మారిపోనున్నాయి. చేపల వేటకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట కొనసాగించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.3,793 కోట్లతో నిర్మిస్తున్న పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్సెంటర్లలో మొదటిది అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా ఈ హార్బర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్‌లోనే కోల్డ్ చైన్, ఐస్‌ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్‌షాపులు, గేర్‌షెడ్‌లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల పరిహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగా ఓఎన్జీసీ పైప్‌లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23,458 మత్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున పరిహారం ఇప్పించేలా ఓఎన్జీసీని ప్రభుత్వం ఒప్పించింది. ఐదో విడత నష్టపరిహారం విడుదలలో భాగంగా ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆరి్థక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని మత్స్యకారులకు ఈ ప్రభుత్వం అందజేసింది. ఈ 58 నెలల కాలంలో మత్స్యరంగానికి వివిధ పథకాల ద్వారా రూ.4,913 కోట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లబ్థి చేకూర్చింది. -
వేదన విన్నారు.. ఆదుకున్నారు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజన్ విశాఖ, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జిల్లాకు చెందిన ముగ్గురు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ ముగ్గురికీ తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులను సమకూర్చగా.. రెవెన్యూ అధికారులు బాధితుల ఇళ్లకు వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. ఎండాడకు చెందిన మద్దాల జ్యోతి సీఎంను కలిసి తన భర్త మద్దాల రాంబాబు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారని.. వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. పీఎం పాలెంకు చెందిన యు.ఉమాదేవి తన 15 ఏళ్ల కుమారుడు ప్రసన్నకుమార్ రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని.. సాయం చేయాలని సీఎంకు విన్నవించుకుంది. ఎండాడ సుభాష్ నగర్‌కు చెందిన బాసిత్తు వసంతకుమారి తన భర్త పెంటారావు బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారని మొరపెట్టుకుంది. అలాగే తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని ఆమె అభ్యర్థించింది. బాధితులందరికీ ఆర్థిక సాయం అందించటంతో పాటు మెరుగైన వైద్య చికిత్స చేయించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో కలెక్టర్ మల్లికార్జున తక్షణ చర్యలు చేపట్టారు. విశాఖ రూరల్ తహసీల్దార్, ఇతర అధికారులను బాధితుల ఇళ్ల వద్దకే పంపించి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేయించారు. -
సమస్య విన్నారు.. ఆదుకున్నారు
పెందుర్తి: ఆపన్నులను ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అందె వేసిన చేయి. ఎవరైనా పేదలు వారి బాధను చెప్పుకొన్న వెంటనే స్పందిస్తారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. బుధవారం విశాఖకు వచ్చిన సీఎం జగన్ ఇదే విధంగా మెదడులో గడ్డతో బాధ పడుతున్న ఓ బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలేనికి చెందిన సాలాపు నూకరాజు, సత్యకళ దంపతుల కుమారుడు లీలాధర్నాయుడు (10)కు చిన్న వయసులోనే మెదడులో క్యాన్సర్ గడ్డ ఏర్పడింది. వయసు పెరిగేకొద్దీ అది పెరిగి గొంతు వరకు వచ్చింది. స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో బెంగుళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ మందుల ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. బుధవారం చినముషిడివాడ వచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను నూకరాజు, సత్యకళ దంపతులు కలిశారు. వారి కుమారుడి పరిస్థితిని వివరించారు. సమస్యను సావధానంగా విన్న సీఎం వైఎస్ జగన్ తక్షణమే రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జునను ఆదేశించారు. అధికారులు వెంటనే చెక్‌ను సిద్ధం చేశారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జీవీఎంసీ ఏడీసీ సన్యాసిరావు ఆ చెక్‌ను బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. సీఎం ఎంతో మేలు చేశారు బాలుడి తల్లి సత్యకళ మా కుమారుడి పరిస్థితిని చెబుతుంటే సీఎం జగనన్న చలించిపోయారు. వెంటనే మాకు ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్‌కి చెప్పారు. తక్షణమే రూ.లక్ష మాకు ఎమ్మెల్యే అదీప్‌రాజ్ చేతుల మీదుగా ఇచ్చారు. సీఎం జగనన్న మాకు ఎంతో మేలు చేశారు. ఆయన మేలు ఎన్నటికీ మరచిపోలేం. -
సీఎం సాయం.. శరవేగం
అనంతపురం: మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్ధం సభ కోసం ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. ఈ క్రమంలో పలువురు బాధితులు సీఎంను కలిసి తమను ఆదుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. దీంతో బాధితులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ కలెక్టర్ గౌతమికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు 24 గంటలు గడవకముందే బాధితులకు చెక్కులు అందించారు. ► అనంతపురం నగరంలోని కమలానగర్‌కు చెందిన పర్లపాటి సుజాత తన భర్త చనిపోయాడని, తనకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సీఎం వైఎస్ జగన్ ఎదుట వాపోయింది. ఇద్దరు పిల్లలున్నారని, ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించింది. సమస్యను సావధానంగా విన్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ గౌతమిని పిలిచి వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్లో బాధితురాలు సుజాతకు రూ.2 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. బాధితురాలికి ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు, పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ► అనంతపురం రూరల్‌లోని విద్యారణ్య నగర్‌కు చెందిన దివ్యాంగురాలు రాచూరి ఝాన్సీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలికి రూ.లక్ష చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఆర్వో రామకృష్ణారెడ్డి అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తామని భరోసా ఇచ్చారు. సీఎంకు తమ సమస్యలను చెప్పుకుని 24 గంటలు గడవక ముందే ఆదుకోవడంపై బాధితురాలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
ఆపన్నులకు ప్రభుత్వం ఆర్థిక సాయం
గుంటూరు వెస్ట్: ఆపన్నుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో గురువారం జరిగిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో కొందరు బాధితులు ముఖ్యమంత్రికి తమ బాధలను చెప్పుకున్నారు. దీంతో వారిలో ఆరుగురికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను శనివారం గుంటూరు కలెక్టరేట్లో జేసీ జి.రాజకుమారితో కలిసి కలెక్టర్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ బాధితులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోపే చెక్కులను అందజేశామన్నారు. అలాగే వారికి కావాల్సిన వైద్య సేవలు కూడా అందిస్తామని తెలిపారు. పేదల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వంలో ప్రజలకు ఏ అవసరమొచ్చినా తక్షణ సాయం లభిస్తుందన్నారు. అలాగే తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఆరుగురు తమ చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మొత్తం రూ.9.90 లక్షలు మంజూరు చేస్తూ సీఎంవో కార్యాలయం చెక్కులు పంపింది. ఈ చెక్కులను కూడా ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, కలెక్టర్, జేసీలు అందజేశారు. మట్టుకొయ్య కోటేశ్వరరావుకు రూ.60 వేలు, నిలకుదిటి రఘుపతమ్మకు రూ.40 వేలు, మర్రి వెంకటేశ్వరరావుకు రూ.3 లక్షలు, ఇట్ల కుసుమసాయికి రూ.1.60 లక్షలు, అజీ్మర్ దివ్యకు రూ.4.30 లక్షల చొప్పున మొత్తం రూ.9.90 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా బాధితులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.