
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 ఆర్థిక సాయం రెండో విడత పోస్టాఫీసుల ద్వారా సోమవారం నుంచి పంపిణీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో ఈ మేరకు సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘చాలామందికి రూ.1,500 సాయం గత వారమే బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలిన 5.38 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా సోమవారం నుంచి ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డబ్బులు డ్రా చేసుకునేందుకు అందరూ ఒకేసారి వెళ్లవద్దు. భౌతిక దూరాన్ని పాటించండి’ అని హరీశ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment