శ్రీహర్షిత బ్యాంకు ఖాతాకు రూ. 1.10 లక్షలు బదిలీ
దాతలకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు దిద్దిపూడి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని పానెం శ్రీహర్షిత ఇటీవల ప్రకటించిన మెడిసిన్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించింది. ఆమె దీనస్థితిని గమనించి ‘సాక్షి’ ఈ నెల 3వ తేదీన ‘చదువుల తల్లిని కనికరించని లక్ష్మీదేవి’ అంటూ కథనాన్ని ప్రచురించింది. దీంతో దాతలు విరివిగా స్పందించారు. ఇప్పటివరకు రూ. 1,10,000 ఆర్థిక సాయాన్ని శ్రీహర్షిత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు.
ఆదివారం ఖమ్మంకు చెందిన సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎ.నర్సింహారావు, సభ్యులు నాగరాజు, సైదులు, సతీశ్‌లు రూ. 12 వేల ఆర్థిక సాయంతో పాటు రూ.30 వేలు విలువ చేసే వైద్యవిద్యకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. అంతేకాకుండా కొణిజర్ల, బోనకల్ హెల్త్ సూపర్‌వైజర్లు వి.భాస్కర్‌రావు, ఎం.దానయ్యలు రూ. 10 వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.
విజయవాడకు చెందిన మరో వైద్యుడు నాలుగేళ్ల హాస్టల్ ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీహర్షిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహర్షిత ‘సాక్షి’తో మాట్లాడుతూ తన ఆర్థిక పరిస్థితిని గమనించి ముందుకు వచ్చిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment