T.Harish rao
-
కాళేశ్వరం వృథా కాదు.. ఆదా!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయి, పల్లె పల్లెను సస్యశ్యామలం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును విఫలయత్నంగా చూపించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నా యని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా రూ.లక్ష కోట్లు వృధా కావడం కాదని.. మూడేళ్లలో వచ్చిన నీరు, నాలుగు మీటర్లు పెరిగిన భూగర్భ జలాలతో రూ. లక్ష కోట్ల పంట పండిందన్నా రు. మంగళవారం శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘రాష్ట్రంలో అతివృష్టి– గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలు’ అంశంపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వల్పకాలిక చర్చను ప్రా రంభించారు. హరీశ్‌తోపాటు మంత్రి పువ్వా డ అజయ్, మండలి సభ్యులు జాఫ్రి, తాతా మధు, కడియం శ్రీహరి, నర్సిరెడ్డి, బండారు ప్రకాశ్ మాట్లాడారు. అన్నారం పంప్‌హౌజ్ నుంచి ఈ నెలాఖరులో, మేడిగడ్డ నుంచి అక్టోబర్ నెలాఖరులో నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభిస్తామని హరీశ్ ప్రకటించారు. కాళేశ్వరం పెద్ద ఆస్తి ‘కాళేశ్వరం తెలంగాణకు పెద్ద ఆస్తి. మూడేళ్ల లోనే తక్కువ ఖర్చుతో పూర్తి చేశాం. స్టీల్, సిమెంట్, డీజిల్ ధరలు ఇప్పటికి 100 శాతం పెరిగాయి. స్వల్పకాలంలో నిర్మించడంతో లక్ష కోట్లకుపైగా ఆదా చేయగలిగాం’ అని హరీశ్ పేర్కొన్నారు. గోదావరికి గత 500 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది జూలై 8 –13 మధ్య 29లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని.. ఆ ధాటికి అన్నారం, మేడిగడ్డ 2 పంపుహౌజ్‌లలో నీరు చేరిందని చెప్పారు. ‘ప్రాజెక్టు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్’లో భాగంగా ప్రాజెక్టు నిర్మించిన ఏజెన్సీలే పంపుహౌజ్‌లకు మరమ్మతు చేస్తున్నాయన్నారు. వరదల్లో బురద రాజకీయాలా? ఉమ్మడి ఏపీలో 2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదలు వస్తే పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించామని.. కానీ ఇప్పు డు ప్రతిపక్షాలు వరదల్లో కూడా బురద రాజ కీయాలు చేస్తున్నాయని హరీశ్‌రావు మండిప డ్డారు. ‘‘ఓ కేంద్రమంత్రి కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరా పారలేదంటారు. మరో కేంద్రమంత్రి కాళేశ్వరం డీపీఆర్ ఏదని అంటరు. డీపీఆర్ లేదన్న కాళేశ్వరానికి సీడబ్ల్యూసీ 10 అనుమతులు ఎలా ఇచ్చింది? ఒక్క ఎకరానికీ నీరు రాకపోతే 2021–22లో 2.59 కోట్ల టన్నుల పంట ఎలా పండింది? తెలంగాణ రైతుల పంటను కొనలేమని కేంద్రం చేతులె త్తేసింది కూడా. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం.. ప్రతిపక్షాలు మాత్రం శనీశ్వరంలా దాపురించాయి’’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరానికి కేంద్రం ఇచ్చిన అను మతుల పత్రాలను మండలికి చూపించారు. వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్న సీఎం: పువ్వాడ అజయ్ భద్రాచలం చరిత్రలో ఎన్నడూ లేని గోదావరి వరద బీభత్సాన్ని ఈసారి చూసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సత్వర చర్యలు చేపట్టారని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో పోలవరం ప్రాజక్టు వల్ల భద్రాచలానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. గోదావరి వరదలను రాజకీయం చేసేందుకు కేంద్రం గవర్నర్‌ను కూడా వాడుకుందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వరద నష్టం పరిశీలనకు సీఎం వెళ్తుంటే.. గవర్నర్‌ను భద్రాచలం పంపించి బురద రాజకీయం చేశారే తప్ప రూపాయి సాయం చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఈ నెల 12కు వాయిదాపడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు -
అధికారులపై మంత్రి హరీష్ ఆగ్రహం
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శుక్రవారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాక కు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను హరీష్ పరిశీలించారు. దుబ్బాక నియోజక వర్గంలో దాదాపు 40 కిలోమీటర్ల మేర ఈ కాలువ ఉంది. ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పారుతున్న దారిని మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి హరీష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి లో ప్రధాన కాలువ పనులు అసంపూర్ణంగా ఉండటంతో మంత్రి హరీష్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరతిగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ('పదో తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపట్టండి') -
పోస్టాఫీసుల ద్వారా ఆర్థిక సాయం: మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 ఆర్థిక సాయం రెండో విడత పోస్టాఫీసుల ద్వారా సోమవారం నుంచి పంపిణీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో ఈ మేరకు సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘చాలామందికి రూ.1,500 సాయం గత వారమే బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలిన 5.38 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా సోమవారం నుంచి ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డబ్బులు డ్రా చేసుకునేందుకు అందరూ ఒకేసారి వెళ్లవద్దు. భౌతిక దూరాన్ని పాటించండి’ అని హరీశ్ ట్వీట్ చేశారు. -
రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ. 25 వేల లోపున్న రైతు రుణాలను ఆర్థిక శాఖ ఏకమొత్తం గా మాఫీ చేస్తూ రూ.1,200 కోట్లు విడుదల చేసింది. 6.10 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొతాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్యభవన్‌లో ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రులు సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.25 వేల లోపు రుణం ఉన్న వారికి వెనువెంటనే రుణ మొ త్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. రూ.25 వేల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల్లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణచెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఇందు కు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు తెలిపారు. వచ్చే సీజన్‌కు రైతుబంధుకు రూ.7వేల కోట్లు ఇటు వానాకాలం పంటకు రైతుబంధు సాయం పైనా మం త్రులు అధికారులతో సమీక్ష జరిపారు. జూన్‌లో వానాకాల పంటకు ఇవ్వాల్సిన రూ. 7 వేల కోట్ల రైతుబంధు నిధులను విడుదల చేసినట్లు ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు కింద డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం రైతుబంధు కింద రూ.7వేల కోట్లను ఈ నెల రోజుల్లో పంట సీజన్ ఆరంభమయ్యే నాటి కల్లా రైతులకు అందించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఇతర ఖర్చులు తగ్గించుకొనైనా రైతు లు పంటలువేసే సమయానికన్నా ముందే ఖాతాల్లో డబ్బు లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 1.40 కోట్ల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించడం జరిగిందన్నారు. 51 లక్షల మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే వెళ్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో కలసి పని చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులను హరీశ్‌రా వు, నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. రైతులకు అందించే రుణమా ఫీ మొత్తాలను వెంటనే వారి అకౌంట్లలో జమయ్యే విషయం లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని బ్యాంకు అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్థికశాఖ ము ఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మొబైల్ ఫోన్లో మంత్రి హరీశ్ వీడియో కాన్ఫరెన్స్
సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం తన సెల్‌ఫోన్ ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఒక అడుగు ముందే ఉండే హరీశ్‌రావు, లాక్డౌన్ నేపథ్యంలో సిద్దిపేట పట్టణ స్థితిగతులపై సెల్‌ఫోన్ నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులతో తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా లాక్డౌన్లో ప్రజల సహకారం, కరోనా నేపథ్యంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది విధులు, పట్టణంలో పెండింగ్‌లోని పనుల వివరాలు, కరోనా నివారణకు ప్రతిరోజూ హైపోక్లోరైడ్ స్ప్రే స్థితిగతులు, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెత్త సేకరణతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, పబ్లిక్‌హెల్త్ ఈఈ ప్రతాప్, మున్సిపల్ డీఈ లక్ష్మణ్, ఓఎస్డీ బాల్‌రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, సతీష్‌లు పాల్గొన్నారు. -
వలస కూలీలకు అండగా ఉంటాం
సాక్షి, సిద్దిపేట: వలస కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, నంగునూరు మండలాల్లో ధాన్యం, శనగల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేటలో వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర నిర్మాణ పనులతోపాటు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం కూలీలు మన రాష్ట్రానికి వచ్చారన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 వేలకు పైగా వలస కూలీలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీరందరూ ప్రస్తుతం పనులు లేక, కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారిందని అన్నారు. వీరిని ఆదుకునేందుకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 చొప్పున నగదు అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఇలా ప్రతీ ఒక్కరూ తమ దాతృత్వాన్ని చాటుకుంటూ కూలీలకు సహాయం అందజేస్తున్నారని అన్నారు. ఆహార పదార్థాలతో కూడిన కిట్స్‌ను అందజేసేందుకు వచ్చిన దాతలను మంత్రి అభినందించారు. అసత్యపు ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి ప్రజలను కోరారు. ప్రతీ గింజను కొంటాం గతంలో లేనివిధంగా ఈ ఏడాది గోదావరి, కృష్ణా జలాలు రాష్ట్రంలోని చెరువులకు మళ్లించామని, దీంతో ఎన్నడూ లేని విధంగా రబీ సాగు పెరిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ మూలంగా తమ పంటలను ఎలా అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎవరూ అధైర్య పడొద్దని, రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంగారెడ్డి : ఆరుగురికి కరోనా పాజిటివ్
సాక్షి, సంగారెడ్డి : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనకు వెళ్లినవారిలో సంగారెడ్డి నుంచి 28 మంది ఉన్నారని, అందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కరోనా వచ్చిన ఆరుగురితో పాటు వారి కుటుంబసభ్యులు, మరో 43 మందిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. వారి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపించామన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టులు శుక్రవారం సాయంత్రం వరకు రానున్నాయి. కాగా కరోనా సోకిన ఆరుగురు ఇంటి పక్కన ఉండేవారికి సెకండరీ కాంటాక్ట్‌తో వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయన్నారు. వీరిని చెక్ చేయడానికి 42 మెడికల్ టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి, అంగడి పేట, కొండాపూర్, జహీరాబాద్ నాలుగు ప్రాంతాలలో నలుగురు అధికారులను నియమించామని, మైనార్టీలు ఎవరు దీనిని నెగెటివ్‌గా తీసుకోవద్దని హితభోద చేశారు. అనవసరంగా భయపడకుండా డాక్టర్లకు సహకరిస్తూ పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఫైర్ ఇంజిన్, పురుగు మందులు పరికరాలు , డ్రోన్ ద్వారా స్ర్పేయింగ్ జరుగుతుందన్నారు. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 8 పాజిటివ్ కేసులు ఉన్నట్లు హరీశ్ తెలిపారు. (పౌరులకు వీడియో సందేశం ఇవ్వనున్న మోదీ) ('తక్కువ నష్టంతో సంక్షోభం నుంచి గట్టెక్కాలి') -
అండగా ఉంటాం
గజ్వేల్/జోగిపేట/సిద్దిపేటజోన్: రాష్ట్రంలో 4 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో వలస కార్మిక కుటుంబాలకు బియ్యం, రూ. 500 నగదు అందజేశారు. అలాగే జోగిపేటలో అధికారులతో సమీక్షించారు. సిద్దిపేటలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 100 నంబరుకు డయల్ చేస్తే అధికారులు సాయం చేస్తారని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి ప్రాజెక్టుల్లో పని చేస్తున్న వలస కార్మికులంతా తమ ఆత్మీయులేనని, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి చెప్పారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. సరుకుల పంపిణీ సందర్భంగా ‘భౌతిక దూరం’ పాటించిన వలస కార్మికులు -
త్వరలో రామప్ప, లక్నవరానికి గోదావరి నీళ్లు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనగానే ఎండిన మొక్కజొన్న జూళ్లు, ఎండిన వరి కంకులు, నీటి సమస్యకు చిహ్నంగా ఖాళీ బిందెలు, కరెంటు కోతలకు నిరసనగా కందిళ్ల ప్రదర్శనలు కనిపించేవి. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఇలాంటివి కన్పించట్లేదు. ప్రజారంజక పాలనకు ఇదే నిదర్శనం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ తరఫున నీటిపారుదల శాఖపై ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర చరిత్రలో యాసంగిలో ఏకంగా 38 లక్షల ఎకరాలు సాగుతో కళకళలాడటం తొలిసారి చూస్తున్నామని చెప్పారు. అద్భుతమైన రీతిలో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోటి ఎకరాలు సాగులోకి తెచ్చే దిశగా తెలంగాణ సాగుతోందన్నారు. ఇటీవల సీడబ్ల్యూసీ చైర్మన్ కూడా తెలంగాణ ప్రాజెక్టులపై ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. త్వరలో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప చెరువును గోదావరి నీటితో నింపుతామని, అక్కడి నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా అందిస్తామని తెలిపారు. వెరసి 8,700 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామని చెప్పారు. లక్ష కోట్ల అవినీతి: కోమటిరెడ్డి సాగునీటిపై హరీశ్‌రావు మాట్లాడుతుండ గా.. కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. భారీ అవినీతి జరిగినా, గొప్పగా పనులు జరిగాయంటూ చెప్పుకోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాంట్రాక్టర్ల బకాయిలు చాలావరకు తీర్చాం: ప్రశాంత్‌రెడ్డి రోడ్ల అభివృద్ధికి గతం కంటే ఈసారి ఎక్కువ నిధులే కేటాయించుకున్నామని రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు భారీగా బిల్లుల బకాయిలున్న మాట నిజం కాదన్నారు. గతంలో ఎక్కువే ఉండేవని, కానీ ఆర్డీఎఫ్ ద్వారా రుణం పొంది వాటిని చాలా వరకు తీర్చేశామని చెప్పారు. లుంబినీ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోనూ ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలన్న సభ్యుల సూచనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 80 శాతం పూర్తయిన ‘భగీరథ’ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం 80% పూర్తయిందని, త్వరలో మిగతా పనులు పూర్తి చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. మిషన్ భగీరథ పుణ్యాన ఇప్పుడు వేసవిలోనూ రాష్ట్రంలో తాగు నీటి సమస్య లు లేవన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే గోదావరి జలం ఇంటిలో నల్లా తిప్పగానే వస్తున్నందుకు అభినందించాల్సింది పో యి కాంగ్రెస్ నేతలు అనవసర ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలో రాజగోపాల్ ను ఉద్దేశించి మంత్రి వాడిన ఓ పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిం చారు. అందుకు సారీ కూడా చెప్పారు. -
చెక్‌డ్యామ్‌లతో 15 టీఎంసీల నిల్వ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టే లక్ష్యంతో అన్ని వాగులు, వంకలపై రూ.3,825 కోట్లతో 1,200ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తొలి విడతగా 600 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించా రు. ఈ చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో 15 టీఎంసీ నీటి నిల్వ పెరగనుందని, 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని తెలిపారు. శనివారం టీఆర్ఎస్ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, సంకె రవిశంకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, అవసరమైన ప్రతిచోటా వీటి నిర్మాణాలు జరుగుతాయన్నారు. 6.62 లక్షల మందికి పింఛన్లు: ఎర్రబెల్లి ఆసరా పింఛన్లపై ప్రభుత్వం రూ.11,758 కోట్లు ఖర్చు చేయనుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రస్తుత వార్షిక ఏడాదిలో ఖర్చు చేస్తున్న దానికంటే వచ్చే ఏడాది రూ.2,355 కోట్లు అదనంగా ఖర్చు చేస్తామని వెల్లడించారు. 57 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ నుంచి పింఛన్లు అమలు ఇస్తామన్నా రు. ఇప్పటికే కొత్తగా 6.62 లక్షల లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఆ పింఛన్లలో కేంద్రం వాటా కేవలం రూ.203 కోట్లుగా ఉందనిన్నారు. దివ్యాంగులకు ధ్రువపత్రాలు ఇచ్చేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గంలో సదరన్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సభ్యులు చల్ల ధర్మారెడ్డి, కోరుకంటి చంద్రు లు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. దోమలు ప్రబలకుండా చర్యలు: ఈటల జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ జ్వరంతో 7 మంది మాత్రమే చనిపోయారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మూసీ నది పరీవాహకంలోంచే దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా, ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టమన్నారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిం చిందన్నారు. బీజేపీ సభ్యుడు రాజాసింగ్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, నగరంలో 350 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ఇప్పటికే 122 దవాఖానాలు పనిచేస్తున్నాయన్నారు. ఇక హరిప్రియ నాయక్ అడిగిన మరో ప్రశ్నకు.. కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటికే 6.47లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు. -
‘అప్పుడు కరెంట్ బందు.. ఇప్పుడు రైతు బంధు’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు తిప్పికొట్టారు. కాంగ్రెస్ వద్దుల పార్టీ అని అందుకే ప్రజలు కూడా వద్దని ఆ పార్టీని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై ప్రజలకు నిరాశ లేదని.. కాంగ్రెస్ పార్టీ నాయకులే నిరాశ చెందుతున్నారని విమర్శించారు. సంక్షేమ రంగానికి బడ్జెట్లో నిధులు పెంచామని ఆయన గుర్తు చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్‌రావు శాసనసభలో గురువారం మాట్లాడారు. (చదవండి: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు) కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలు, వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేదని.. తమ ప్రభుత్వం విద్యుత్ సమస్యలు పూర్తిగా పరిష్కరించిందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు, రైతులకు, గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని హరీష్‌రావు తెలిపారు. రైతాంగానికి 24 గంటల కరెంటుతోపాటు పెట్టుబడి సాయంగా రూ.10 వేలు అందిస్తున్నామన్నారు. ‘కరెంటు బందు ప్రభుత్వం మీది.. రైతు బంధు ప్రభుత్వం మాది’ అని మంత్రి వ్యాఖ్యానించారు. (శాసనసభ: కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ క్లాస్!) ఐటీ రంగంలో కూడా మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ గొప్ప అభివృద్ధి సాధించిందని ఆయన కొనియాడారు. ప్రపంచ వేదికలపై హైదరాబాద్ ఐటీ పరిశ్రమ గురించి మాట్లాడటం మన రాష్ట్రానికి దక్కిన గౌరవమన్నారు. డబుల్ బెడ్రూం నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. హైదరాబాద్ అభివృద్ధికి 10వేల కోట్లు కేటాయించామని చెప్పారు. తమను విమర్శించే ముందు కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు. (చదవండి: ప్రైవేటుకు పరుగు) -
ఇది ప్రగతిశీల బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020–21 పూర్తి సమతుల్యతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌గా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్ అని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల వికాసానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి హరీశ్‌రావును సీఎం అభినందించారు. మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఆర్థిక శాఖ అధికారులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. -
మాంద్యంలోనూ ప్రగతిబాట
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతి ఎన్నికలోనూ ప్రజలు మాపై సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు. మేం ఎంచుకున్న బాట సరైందని, మేం అవలంభిస్తున్న వ్యూహాలు సఫలమవుతున్నాయని తేల్చిచెప్పారు. మా పంథా ఇకపైనా కొనసాగించే నిర్ణయంతో వచ్చే నాలుగేళ్ల రాష్ట్ర భవిష్యత్తు పురోగతికి ప్రణాళిక రచన చేశాం. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలపై స్పష్టమైన అవగాహనతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రజల ముందుంచుతున్నాం. ఇది కేవలం వార్షిక బడ్జెట్ ధృక్పథంతో కాకుండా ప్రజలే కేంద్రంగా ప్రగతిశీల బడ్జెట్ రూపొందించాం’’అని 2020–21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు స్వాగ తిస్తున్నారని, అదే ఉత్సాహంతో వచ్చే నాలుగేళ్ల కాలానికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో వచ్చే సంవత్సరానికి వాస్తవిక, ప్రగతిశీల బడ్జెట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. అసెంబ్లీలో 62 నిమిషాలపాటు ఆయన బడ్జెట్ ప్రసంగం సాగింది. తన ప్రసంగం ప్రారంభానికి ముందు సీఎం చాంబర్లో, ప్రసంగం ముగించాక సభలో హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. హరీశ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సంక్షేమంలో కోత లేదు.. ‘‘సంక్షేమ కార్యక్రమాల నిధుల్లో ఎక్కడా కోత విధించలేదు. పైగా లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూ కావాల్సిన నిధులను ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతటి నిబద్ధతతో పనిచేస్తోందో ఈ బడ్జెట్ అంకెలే చాటిచెబుతున్నాయి. ఆర్థిక మాంద్యానికి విరుగుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచటమే.ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధిస్తోంది. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా.. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత ఐదేళ్లలో రాష్ట్ర సొంత రాబడి సగటు వృద్ధి రేటు 21.5 శాతం ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి 6.3 శాతం తగ్గి 15.2 శాతం వద్ద నిలిచింది. ఇక 2014 మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ. లక్షలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం. గత ఎన్నికల్లో కూడా ఆ హామీ ఇచ్చాం. ఆర్థిక మాంద్యం ముందరి కాళ్లకు బంధం వేస్తునప్పటికీ దాని అమలుకు శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రమే టాప్.. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉంది. 2019–20 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,28,216గా ఉంటే దేశ తలసరి ఆదాయం రూ. 1,35,050గా ఉంది. ఇది మన ప్రగతికి స్పష్టమైన సంకేతం. అంబేడ్కర్ మాటలు మననం చేసుకుంటూ... సమాజ వికాసానికి నిజమైన కొలమానం మహిళాభివృద్ధి స్థాయేనని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నారు. ఆయన మాటలను మననం చేసుకుంటూ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నాం. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి , కేసీఆర్ కిట్ పథకాలతో మహిళల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మహిళలపై అకృత్యాలను అరికట్టేందుకు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బడ్జెట్లో మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 1,200 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 57 ఏళ్లు నిండితే వృద్ధాప్య పింఛన్.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధా ప్య పింఛన్లు అందించబోతున్నాం. దీనివల్ల 39,41,976 ఆసరా పెన్షన్ల సంఖ్య భారీ గా పెరగనుంది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు రూ. 9,402 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో ఆ కేటాయింపులను రూ. 11,758 కోట్లకు పెంచాం. కాళేశ్వరం వెనుక కేసీఆర్ ఉక్కు సంకల్పం.. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రూపొంది రికార్డు సృష్టించేందుకు సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పమే కారణం. ఫలితంగా గోదావరి 150 కి.మీ. మేర జీవధారగా మారింది. ఇది తెలంగాణ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా ఉపయోగపడుతుంది. ఇదే స్ఫూర్తి తో పాలమూరు–రంగారెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కొద్ది కాలంలోనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణం పూర్తవుతుంది. వృద్ధిరేటుకు పన్నుల వాటా ఎసరు.. 2019–20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, బడ్జెట్లో వేసుకున్న అంచనాల కంటే రూ. 3,731 కోట్ల మేర తగ్గింది. రాష్ట్రానికి కేంద్రం నంంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారంలో నిధులు సకాలంలో అందడం లేదు. దీంతో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 2018–19లో 16.10 శాతం ఉంటే 2019–20 ఫిబ్రవరి చివరి నాటికి 6.3 శాతానికి తగ్గింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చే పన్నుల వాటా 2.43 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గింది. -
బడ్జెట్లో భారీగా కేటాయింపులు
ఇది పూర్తి సమతుల్యత బడ్జెట్. సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్. రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎవరి ఊహలు, అంచనాలకు అందని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్లో భారీ ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పన్ను వృద్ధి రేటు తగ్గుదల, ఆర్థిక మాంద్యం, కోవిడ్ ప్రభావం, కేంద్ర సాయం వంటి అంశాలను అస్సలు ఖాతరు చేయలేదు. రైతు, పల్లె, పట్టణం అభివృద్ధే లక్ష్యంగా.. సంక్షేమమే పరమావధిగా 2020–21 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రాష్ట్రంలోని ప్రతి రైతునూ రాజును చేసేవరకు నిద్రపోమంటూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈసారి బడ్జెట్లో అన్నదాతకు అగ్రతాంబూలమిచ్చింది. విద్యకు చదివింపులు ఘనంగా జరిపింది. ఆరోగ్య‘మస్తు’అనిపిం చింది. సంక్షేమానికీ సై అంది. ఆదివారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి హరీశ్‌రావు పింఛన్లకు పెద్ద మనసుతో నిధులిచ్చింది. పల్లె ప్రగతికి, పట్నం వృద్ధికి ప్రాధాన్యత కనబర్చింది. వెరసి.. పరిస్థితులు సహకరించకున్నా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. రైతు, పల్లె, పట్నం కేంద్రంగా అన్ని వర్గాలు, అన్ని శాఖలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్‌రావు తొలిసారిగా శాసనసభలో ప్రవేశపెట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ సమర్పించారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలూ లేనప్పటికీ, ఎన్నికల బడ్జెట్ తరహాలోనే అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. 2019–20 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే తాజా బడ్జెట్ ఏకంగా 25 శాతం మేర పెరిగింది. ఓటాన్ అకౌంట్‌తో సమానంగా.. అన్ని రకాల అంచనాలు, ఖర్చులు, కేటాయింపులను పెంచుతూ 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 2019–20 ఓటాన్ అకౌంట్ అంచనాలకు సమానంగా రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గతేడాది 1.82 లక్షల కోట్ల మేర ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టగా.. గతేడాది సెప్టెంబర్ 9న ప్రవేశపెట్టిన 2019–20 సాధారణ బడ్జెట్ అంచనాలు 1.46 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1.42 లక్షల కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తానికి రూ.40వేల కోట్లను కలిపి రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరపతి మెరుగ్గానే ఉన్నట్టు చూపించింది. పెరిగిన పన్ను అంచనాలు 2020–21 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను చూస్తే అన్ని రకాల పన్ను అంచనాలు పెరిగాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా రాష్ట్ర పన్నుల రాబడితోపాటు కేంద్రం నుంచి వచ్చే వాటా తగ్గుతుందనే అంచనాలను తలకిందులు చేస్తూ పన్ను అంచనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా పన్నేతర ఆదాయాన్ని 150శాతం వరకు పెంచింది. 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12వేల కోట్లకు పైగా పన్నేతర ఆదాయం రాగా, ఈసారి దాన్ని ఏకంగా రూ.30,600 కోట్లకు పెంచింది. కేంద్ర పన్నుల్లో వాటా, జీఎస్టీతో కలిపి రాష్ట్ర పన్నులు, గ్రాంట్ ఇన్ఎయిడ్, అమ్మకపు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ఆదాయం, ఇతర పన్నులు.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ పెద్ద ఎత్తున రాబడులను ఆశిస్తూ ప్రతిపాదనలు చేసింది. పన్నుల ద్వారా మొత్తం రూ.85,300 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసింది. ఈసారి రెవెన్యూ రాబడి రూ.1.43 లక్షల కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో 1.38 లక్షల కోట్ల వ్యయం పోగా రూ.4,482 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని లెక్కగట్టింది. అయితే, ద్రవ్యలోటు మాత్రం భారీ పెరిగింది. 2019–20లో ద్రవ్యలోటు రూ.24వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ.21,913 కోట్లకు తగ్గింది. అయితే, 2020–21 ఆర్థిక సంవత్సరానికి అది రూ.33,191.25 కోట్లకు పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కంటే ఇది దాదాపు రూ.11వేల కోట్లు ఎక్కువ. ఆదాయమార్గాల కోసం అన్వేషణ... పరిస్థితులు సానుకూలంగా లేకున్నా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అప్పులు, భూములు, నిరర్థక ఆస్తులపైనే ఆశలు పెట్టుకుందని అర్థమవుతోంది. హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలోనూ, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని నర్మగర్భంగానే వెల్లడించారు. ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిస్తున్నామని, ‘దిల్’సంస్థను తెరపైకి తెస్తున్నామని, భూముల అమ్మకాలకు సిద్ధంగా ఉన్నామని, రాజీవ్ గృహకల్ప వంటి నిరర్థక ఆస్తులను విక్రయిస్తామని, సొంత రాబడులను పెంచుకునే మార్గాలపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 2019–20లో రూ.12వేల కోట్లకు పైగా ఉన్న పన్నేతర ఆదాయాన్ని రూ.30,600 కోట్లకు పెంచినట్టు అర్థమవుతోంది. ఈ రెండేళ్ల ప్రతిపాదనల మధ్య ఉన్న దాదాపు రూ.18వేల కోట్ల వ్యత్యాసాన్ని భూములు, నిరర్థక ఆస్తుల అమ్మకం ద్వారానే సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైతన్నే రారాజు.. ఎన్నికల్లో కీలక హామీ అయిన రైతు రుణమాఫీ అమలుకు ఈ బడ్జెట్లో సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.6,200 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. రైతుబంధు సాయాన్ని రూ.12వేల కోట్ల నుంచి రూ.14వేల కోట్లకు పెంచింది. రైతుబీ మాను పెంచడంతో పాటు మార్కెట్ స్థిరీకరణ నిధిని కూడా పక్కాగా కేటాయించడం ద్వారా రైతన్నకు జైకొట్టింది. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు రూ.25వేల కోట్ల మేర కేటాయింపులు జరిపింది. ఇప్పటివరకు అమలవుతున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పింఛన్లకు దాదాపు రూ.12వేల కోట్లు ప్రతిపాదనలు చేసింది. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా రూ.10వేల కోట్లు కేటాయించడం ద్వారా విశ్వనగర అభివృద్ధికి బాటలు వేసింది. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.26వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ప్రభుత్వం.. డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ అవసరాలకు అనుగుణంగా గృహ నిర్మాణశాఖకు రూ.11వేల కోట్లకు పైగా నిధులు ప్రతిపాదించింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటివరకు ఉన్న బకాయిలను కూడా కలిపి రూ.2,600 కోట్ల మేర నిధులు కేటాయించింది. మొత్తం బడ్జెట్ రూ. 1,82,914.42 కోట్లు ప్రగతి పద్దు రూ. 1,04,612.62 కోట్లు నిర్వహణ పద్దు రూ. 78,301.80 కోట్లు బడ్జెట్ అంచనాలివే.. (రూ.కోట్లలో) రెవెన్యూ రాబడి 1,43,151.94 రెవెన్యూ వ్యయం 1,38,669.82 పన్ను రాబడి 85,300.00 పన్నేతర రాబడి 30,600.00 కేంద్రం వాటా 16,726.58 గ్రాంట్లు 10,525.36 రుణాలు 35,500 మూలధన వ్యయం 22,061.18 రెవెన్యూ మిగులు 4,482 ద్రవ్యలోటు 33,191.25 రూ. 65,480 తలసరి అప్పు.. రాష్ట్ర ప్రజలపై పెరిగిన అప్పుల భారం -
అన్నదాతకు అందలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అగ్రస్థానం కల్పించింది. బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయం, అనుబంధ శాఖలకు పెద్దపీట వేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 25,811.78 కోట్లు కేటాయించింది. గతం కంటే ఈసారి బడ్జెట్లో వ్యవసాయ, అను బంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పించడం విశేషం. అందులో ప్రగతి పద్దు రూ. 23,405.57 కోట్లు కాగా మిగిలిన రూ. 2,406.21 కోట్లు నిర్వహణ పద్దు. మొత్తం వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్లో ప్రగతి పద్దు కింద కేవలం వ్యవసాయ రంగానికి రూ. 23,221.15 కోట్లు కేటాయించగా సహకార, మార్కెటింగ్‌శాఖలకు రూ. 7.42 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 177 కోట్లు కేటాయిం చింది. వ్యవసాయ రంగానికి కేటాయించిన ప్రగతి పద్దు బడ్జెట్లో రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీలకే అగ్రస్థానం కల్పిం చారు. రైతు బంధు పథకం అమలు కోసం రూ. 14 వేల కోట్లు కేటా యించారు. 2018–19 బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించగా దానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. కొత్త పాస్‌పుస్తకాలు మంజూరు కావడం వల్ల రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరగనుండటంతో పెరిగే లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు అదనంగా పెంచినట్లు సర్కారు తెలిపింది. అంతేగాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికా వడం, పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రైతుబంధుకు గత బడ్జెట్లో కేటాయించిన సొమ్ముకు 1.20 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకోగా ఈసారి కొత్త పాస్‌పుస్తకాల సంఖ్య పెర గడం, ప్రాజెక్టులు, జలాశయాల ద్వారా మొత్తంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగిందన్న అంచనాతో 1.40 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కేటాయింపులు చేసింది. రైతుబంధు ద్వారా 2018–19 ఖరీఫ్‌లో రూ. 5,235 కోట్లు, రబీలో రూ. 5,244 కోట్లు పంపిణీ చేయగా 2019–20లో ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ. 12 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించారు. రైతు రుణమాఫీకి రూ. 6,225 కోట్లు... గత ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడం తెలిసిందే. అయితే గతంలో చేసిన రుణమాఫీకి, ఇప్పుడు రుణమాఫీకి కాస్త తేడా ఉంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించి అందుకు అనుగుణంగా రూ. 16,124 కోట్లను నాలుగు విడతల్లో మాఫీ చేసింది. ఈసారి బడ్జెట్లో రూ. 6,225 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో రూ. 25 వేలలోపు రుణాలున్న రైతులు 5,83,916 మంది ఉండగా వారందరి రుణాలను నూరు శాతం ఒకే దఫాలో మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కొత్త నిర్ణయం. గతానికి ఇప్పటికీ ఇదే ప్రధాన తేడా. ఒకేసారి వారందరికీ రూ. 1,198 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రుణమాఫీ మొత్తాలను ప్రతి రైతుకు వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తారు. అది కూడా ఈ నెలలోనే ఇస్తారు. ఇక రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపు ఉన్న రుణాలు రూ. 24,738 కోట్లుగా ఉండగా ఆయా రైతుల సంఖ్య ఎంతనేది వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సొమ్మును మాత్రం నాలుగు విడతలుగా అందజేస్తారు. అంటే నాలుగేళ్లలో క్లియర్ చేసే అవకాశముంది. వాటిని కూడా చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగానే అందిస్తారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ. 1,000కోట్లు ఈ బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం ఏకంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పంటల విష యంలో పరిమితి విధిస్తుండటంతో రైతులు దళారులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటల కొనుగోలుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేయాలనేది సర్కారు ఉద్దేశం. ఈ ఏడాది పండిన కందులలో కొద్ది శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కంది రైతులను ఆదుకునే లక్ష్యంతో ఎంత ఖర్చయినా సరే మొత్తం కందులను కొనుగోలు చేయాలని బడ్జెట్లో స్పష్టం చేసింది. అలాగే ఈ ఏడాది రూ.600 కోట్లతో మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. రైతు బీమాకు రూ. 1,141 కోట్లు.. రైతు బీమాకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 1,141 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఏ రైతు, ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి వెంటనే రూ. 5 లక్షలు అందించడమే దీని ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి రైతుకూ బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రతి రైతు పేరిట రూ. 2,271.50 ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్ఐసీ సంస్థకు క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. రైతు చనిపోయిన 10 రోజుల్లోపే వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తుంది. ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఒక్కో రైతు వేదికను రూ. 12 లక్షలతో నిర్మించాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకోసం మొత్తం రైతు వేదికల నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ. 350 కోట్లు కేటాయించింది. పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం ఈసారి బడ్జెట్లో రూ. 100 కోట్లు, పశుపోషణ, మత్స్యశాఖకు రూ. 1,586.38 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ భావించినా బడ్జెట్లో మాత్రం నిరాశే ఎదురైంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 304.34 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం కేటాయింపులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతులకు విత్తన సరఫరా కోసం రూ. 55.51 కోట్లు కేటాయించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గత బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ. 25 కోట్లు కేటాయించారు. విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్ల మేర కేటాయింపులు చేశారు. రైతు బడ్జెట్ ఇది రైతు బడ్జెట్ అని మళ్లీ నిరూపితమైంది. బడ్జెట్లో అగ్రభాగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరం. రైతుబంధు పథకానికి అదనంగా రూ. 2 వేల కోట్లు కేటాయించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్షలోపు రైతు రుణాల మాఫీ కోసం రూ. 6,225 కోట్లు కేటాయించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటల కొనుగోళ్ల కోసం రూ. 1,000 కోట్లు కేటాయించడం సాహసోపేతమైన చర్య. – నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
లక్షా 82 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. ఆయన ప్రసంగిస్తూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదికి గాను రాష్ట్ర బడ్జెట్ 1,82,914.42 కోట్లుగా హరీష్‌రావు పేర్కొన్నారు. అదేవిధంగా రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు, ఆర్ధిక లోటు 33,191.25 కోట్లుగా మంత్రి వెల్లడించారు. ఇక ఆర్థిక మంత్రి హోదాలో హరీష్‌రావు తొలిసారి శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా.. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. హరీష్‌రావు ప్రసంగం హైలైట్స్: గతేడాది నుంచి దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉంది కేంద్రం నుంచి జీఎస్టీ రావడం లేదు 2019-20 వృద్ధి రేటు 6.5శాతంగా ఉంది గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంచనాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఖర్చు రూ.1.36 లక్షల కోట్లు 2018-19లో 14.3% ఉన్న జీఎస్డీపీ 19-20కి 12.6% తగ్గింది తెలంగాణ ఆర్థిక బడ్జెట్ 2020-21 ఏడాదికి గాను 1,82,914.42 కోట్లు రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు క్యాపిటల్ వ్యయం 22,061.18 కోట్లు ఆర్ధిక లోటు 33,191.25 కోట్లు సవరించిన అంచనా ప్రకారం.. 2019-20కి చేసిన అంచనా వ్యయం 1,42,152.28 కోట్లు రూ.25వేలు రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో మాఫీ ఈనెలలోనే రుణమాఫీ పూర్తి చేస్తాం రూ.25వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలు 4 విడతలుగా పంపిణీ చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తారు ఎంత ఖర్చైనా సరే కందులను కొనుగోలు చేస్తాం రైతుబంధు పథకానికి రూ.14వేల కోట్లు కేటాయింపు మూసీ రివర్‌ఫ్రంట్ కోసం రూ.10వేల కోట్లు కేటాయింపు మున్సిపల్‌శాఖకు 14,809 కోట్లు కేటాయింపు హైదరాబాద్ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లు పాఠశాల విద్య కోసం రూ.10,421 కోట్లు ఉన్నత విద్యాశాఖకు రూ.1,723 కోట్లు హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు వైద్య రంగానికి రూ.6,156 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు రూ.23,005 కోట్లు కల్యాణలక్ష్మీ పథకానికి రూ.1,350 కోట్లు కేటాయింపు గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు మైనారిటీల కోసం రూ.1,518 కోట్లు ఎస్సీ సంక్షేమం కోసం రూ.16534.97 కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం రూ.9,771.27 కోట్లు ఆసరా పెన్షన్ల కోసం రూ.11,750 కోట్లు సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు రవాణా, రోడ్లుభవనాలశాఖకు రూ.3494 కోట్లు పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు కేటాయింపు విద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు కేటాయింపు అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు ఎస్డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు కేటాయింపు మైక్రో ఇరిగేషన్ కోసం రూ.600 కోట్లు కేటాయింపు పాడిరైతుల ప్రోత్సాహం కోసం రూ.100 కోట్లు మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,200 కోట్లు పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనారిటీ జూనియర్ కళాశాలలు ఏర్పాటు ఈ ఏడాది నుంచి 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం - శంషాబాద్ బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ వరకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి రాష్ట్రంలో 2,72,763 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1181 కాగా రాష్ట్రంలో 1896 యూనిట్లు హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు 118 నుంచి 350కి పెంపు మరో 232 దవాఖానాలు త్వరలో ప్రారంభిస్తాం తెలంగాణలో కరోనా వైరస్ లేదు ఇప్పటి వరకు 12,427 పరిశ్రమలకు అనుమతులిచ్చాం 14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బోర్డు హరీష్‌రావు బడ్జెట్ ప్రసంగం ముగియడంతో శాసనసభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. -
1.58లక్షల కోట్ల పద్దు!
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఓటాన్ అకౌంట్ తో పోలిస్తే సాధారణ బడ్జెట్‌కు భారీగా కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆర్థిక ఏడాదికి కూడా వాస్తవిక కోణంలోనే బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదల అంచనాలను పరిగణనలోకి తీసుకుని గతేడాది బడ్జెట్ అంచనాల కన్నా 8% పెరుగుదలతో రూ. 1.58 లక్షల కోట్ల వరకు 2020– 21 వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న ట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం ప్రభావం వచ్చే ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం వరకు ఉంటుందనే అంచనాలు, కోవిడ్ ప్రభావంతో పారిశ్రామిక రంగ ఆదాయం పడిపోతుందేమోననే భయం ఉన్నా ప్రస్తుత ఆర్థిక ఏడాది రాబడులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉండటంతో ఈ మేరకు బడ్జెట్ అంచనాలకు వెళ్లవచ్చనే నిర్ధారణకు ఆర్థికశాఖ వర్గాలు వచ్చాయని సమాచారం. దీంతో గతేడాది రూ.1.46 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా, మరో రూ.12 వేల కోట్ల వరకు కలిపి మొత్తం రూ.1.58 లక్షల కోట్ల మేర బడ్జెట్ అంచనాలను అసెంబ్లీ ముందుం చేందుకు సిద్ధమయిందని సమాచారం. ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్‌రావు తొలిసారి ఆది వారం ఉదయం 11:30 గంటలకు 2020– 21 వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. కీలక రంగాలకు అదే ప్రాధాన్యం.. ఈసారి బడ్జెట్ లో కీలక రంగాలకు ప్రాధాన్యత మేరకు నిధులు కేటాయించనున్నారు. ప్రస్తు తం అమలవుతున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే విద్య, వైద్యం, సాగునీటి శాఖలతో పాటు ఈసారి గృహ నిర్మాణానికి (డబుల్ బెడ్ రూం ఇళ్లు) ఎక్కువ నిధులు కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు చేస్తు న్న విమర్శలకు తాళం వేసేందుకు బడ్జెట్లో నిధులు పెంచాలని, ఆ మేరకు ఇళ్లు కట్టి చూపించాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.6 లక్షలు ఇవ్వాలన్న హామీకి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గృహ నిర్మాణ శాఖకు నిధులు పెరగనున్నాయి. సాగునీటి శాఖకు ఈ సారి రూ.8,500 కోట్లు కేటా యించే అవకాశముంది. గతేడాది కన్నా రూ.1000 కోట్లు అధికంగా కేటాయించడంతో పాటు మరో రూ.15 వేల కోట్ల వరకు అప్పులు ప్రతిపాదించడం ద్వారా మొత్తం రూ.23,500 కోట్ల వరకు వచ్చే ఏడాది సాగునీటి రంగంపై ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక విద్య, వైద్యానికి గత ఏడాది కన్నా కేటాయింపులు పెంచనున్నారు. ఆపద్బంధు, కుట్టుమిషన్ల పంపిణీ బాధ్యతలను కూడా సంక్షేమ శాఖలకే అప్పగించనున్నారు. సగం రుణమాఫీకి యోచన... వ్యవసాయ రంగానికి కూడా నిధులు అంచనాలకు అనుగుణంగానే కేటాయించనున్నారు. ఈసారి రైతు రుణమాఫీకి గతేడాది కేటాయిం చిన రూ.6 వేల కోట్లతో పాటు మరో రూ.6 వేల కోట్లు ప్రతిపాదిస్తారని, మొత్తం రుణమాఫీ అమలుకు రూ.24వేల కోట్లు అవసరమవుతాయనే లెక్కల్లో సగం కేటాయించడం ద్వారా వచ్చే ఏడాది రెండు దఫాల్లో రైతుల రుణాలను సగం మేర మాఫీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అదే విధంగా రైతు బీమాకు గత ఏడాది కేటాయించిన రూ.700 కోట్లను రూ.1000 కోట్ల వరకు పెంచనున్నారు. ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు రూ.7,500 కోట్ల వరకు ఖర్చు కానున్నాయి. ఇక, జీతభత్యాలు, అప్పులకు వడ్డీల చెల్లింపులు, సబ్సిడీలు, విద్యుత్ రాయితీలకు కలిపి మరో ప్రణాళికేతర పద్దుల కింద రూ.50 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలు ఈ ఏడాది ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము మాట ఇచ్చింది వాస్తవమేనని, అయితే వీటి అమలుకు తమకు సమయం ఉందని సీఎం వ్యాఖ్యానించిన నేపథ్యంలో వాటికి ఈసారి బడ్జెట్లో కేటాయింపులు లేవనే తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పుడు జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లుందని, గత ఏడాది రూ.8.6 లక్షల కోట్లుండగా, ఈ సారి రూ.9.5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని కాగ్ లెక్కలు చెబుతున్నాయని సీఎం అసెంబ్లీలో చెప్పారు. దీని ఆధారంగా వివిధ శాఖల అవసరాలను క్రోఢీకరించి రూ.1.58 లక్షల కోట్ల వరకు ఈసారి అంచనాలు ప్రతిపాదించవచ్చనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోనూ కోత పడే అవకాశం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో నేరుగా గ్రామాలకు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.3 కోట్లుగా ఉన్న ఏసీడీఎఫ్ నిధులను రూ.1.5 కోట్లకు పరిమితం చేయనున్నట్లు సమాచారం. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదముద్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి శనివారం రాత్రి ప్రగతి భవన్లో సమావేశమై 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న తీర్మానం ప్రతిపై సైతం మంత్రివర్గ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిసింది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల విషయంలో శాసనసభలో ప్రభుత్వం అవలంబించాల్సిన వైఖరిపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. -
కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం
సాక్షి, తుంగతుర్తి : గోదావరి జలాల కోసం 50 ఏళ్లుగా పోరాడాం.. వేయి కళ్లతో ఎదురుచూశాం.. కానీ చుక్కనీరు రాలేదు. కాళేశ్వరం జలాల పుణ్యమాని ప్రస్తుతం జిల్లా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో సీనియర్ జర్నలిస్టు, రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన పిట్టవాలిన చెట్టు పుస్తకాన్ని ఆదివారం తుంగతుర్తి, దుబ్బాక ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, సోలిపేట రామలింగారెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీచైర్‌పర్సన్ గుజ్జ దీపికయుగేందర్రావులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ సభలో వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో మొదటి ఫలాలు సూర్యాపేట జిల్లాకే దక్కాయన్నారు. జిల్లా పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మొట్టమొదట జిల్లాకు విడుదల చేయించారని గుర్తుచేశారు. రెండు నెలల నుంచి కాళేశ్వరం జలాలు నిరంతరాయంగా జిల్లాకు వస్తున్నాయన్నారు. దీంతో జిల్లాలోని చెరువులు, కుంట లు నిండి, నీటితో కళకళలాడుతున్నాయన్నారు. కేసీఆర్ సీఎం కాకపోతే కాళేశ్వరం జలాలు వచ్చేవి కావు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మరో వెయ్యి జన్మలెత్తినా కాళేశ్వరం జలాలు వచ్చేవి కావన్నారు. హుజూర్నగర్ ఎన్నికలు అయ్యాక సీఎం కేసీఆర్ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెల్పడానికి వెళ్తున్న సందర్భంగా సూర్యాపేట ప్రాంతంలో ఆగి గోదావరి జలాలను చూసినప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం మాటల్లో చెప్పలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన కళ్లల్లో చూసిన ఆనందం మళ్లీ కాళేశ్వరం జలాలు చూశాక వచ్చిందన్నారు. సమైక్యాంధ్రలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా ఉండడం వల్ల 69 డీబీఎం పరిధిలో మరికొన్ని చెరువులకు నీరుపోవడం లేదని ఆ పరిస్థితిని ప్రస్తుతం చక్కదిద్దనున్నట్లు చెప్పారు. దివంగత నేతలు భీంరెడ్డి నర్సింహారెడ్డి, వర్ధెల్లి బుచ్చిరాములు బతికి ఉంటే గోదావరి జలాలను చూసి ఎంతో ఆనందపడేవారని గుర్తుచేశారు. తాము చేసిన పోరాటాల ఫలితంగానే నేడు గోదావరి జలాల వస్తున్నాయని వారి ఆత్మలు ప్రస్తుతం శాంతిస్తాయని చెప్పారు. చెరువులు నిండితేనే ఊర్లు పచ్చగా ఉండి రైతులు సంతోషంగా ఉంటారని అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో 60 ఏళ్లుగా జరగని అభివృద్ధిని కేవలం 5ఏళ్లలో సాధించానని గుర్తుచేశారు. కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపడానికి తన శాయశక్తులా కృషి చేశానని తెలిపారు. గతంలో నియోజవర్గంలో హత్యలతో రక్తం పారిందని, కానీ ప్రస్తుతం వాటికి స్వస్తిపలికి గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా చెరువులున్నది తుంగతుర్తి నియోజకవర్గమేనని తెలిపారు. గోదావరి జలాలతో చెరువులు కుంటలు నింపడంతో తన జీవితం ధన్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోజ, జేసీ సంజీవరెడ్డి, జెడ్పీవైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, జిల్లా చైర్మన్ ఎస్ఏ రజాక్, ఎంపీపీ గుండగాని కవితరాములుగౌడ్, వర్ధెల్లి శ్రీహరి, క్రిష్ణ, వజ్జ వీరయ్యయాదవ్, ఎన్.అయోధ్య, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం, సర్పంచ్ నకిరేకంటి విజయ్, బుద్ద సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు అబ్దుల్లా, గుడిపాటి సైదులు, వెంకటనారాయణ, సీతయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధెల్లికి పలువురి అభినందన సీనియర్ జర్నలిస్టు, పిట్టవాలిన చెట్టు పుస్తక రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, రామలింగారెడ్డితో పాటు పలువురు అభినందించారు. గతంలో చెంచులపై మరణం అంచున, ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణపై పిట్ట వాలిన చెట్టు అనే పుస్తకాలను రాయడం అభినందనీయమన్నారు. సామాజిక సృహ ఉన్న జర్నలిస్టు అని కొనియాడారు. తన నిధుల నుంచి ఈ పుస్తకానికి అయ్యే ఖర్చుకు సాయం అందిస్తానని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ప్రకటించారు. చరిత్రను గుర్తుచేయడం కోసమే ఇలాంటి పుస్తకాలను రాస్తున్నారని చెప్పారు. మంచి రచయితగా మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రచయిత వెంకటేశ్వర్లు కోరిక మేరకు ఆయన స్వగ్రామం కొత్తగూడెంకు కావాలి్సన నిధులు మంజూరు చేసి అన్నిరంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రులకు ఘన స్వాగతం రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలకు ఆదివారం ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో తుంగతుర్తి నుంచి కొత్తగూడెం వరకు భారీ బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అలాగే కొత్తగూడెం గ్రామస్తులు బతుకమ్మలు, కోలాటాల బృందంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వెన్నెల నాగరాజు కళాబృందం ఆధ్వర్యంలో వివిధ రకాల కళాప్రదర్శనలు ఇచ్చారు. అలాగే గోరెటి వెంకన్న పాడిన పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయి. కాగా యాదవసంఘం ఆధ్వర్యంలో మంత్రులకు గొర్రెపిల్లలను, గొంగడిని బహూకరించారు. -
జల విజయం టీఆర్ఎస్దే..
సాక్షి, నాగర్‌కర్నూల్/ తెలకపల్లి: కాంగ్రెస్ పార్టీ అ ధికారంలో ఉన్న పదేళ్లలో రైతుల గోడు ఏనాడూ ప ట్టించుకోలేదు, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లలో రైతులకు నీరందించాలని ప్రయత్నిస్తుం టే కాళ్ల మధ్యలో కట్టె పెడుతున్న చందంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం నాగర్క ర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలం లక్నారంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) కాలువల వెంట పాదయాత్రగా జలవిజయ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం బీడుగా మారడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. కేఎల్ఐ పథకం పూర్తి చేసే విషయంలో ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి లేదని, ఇక్కడి రైతులు కష్టాల్లోనే మునిగి తేలాలన్నదే వారి దుర్నీతి అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు రాత్రివేళ విద్యుత్ లేక ప్రమాదాలకు గురై మృతిచెందారని అన్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పాటుపడుతుందని, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేసి పనులు జరుగకుండా అడ్డుకుంటున్నది కాంగ్రెస్సేనని అన్నారు. ప్రజలు, రైతులు వారికి బుద్ధిచెప్పాలని, ప్రాజెక్టులు అడ్డుకునే కాంగ్రెస్‌కు ఎలాంటి శిక్ష వేయాలో మీరే నిర్ణయించాలని ప్రజలకు సూచించారు. మూడేళ్లలోనే పనులు పూర్తి... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేశారన్నారు. ఐదున్నర లక్షల ఎకరాలకు నీరందించేందుకు టీఆర్ఎస్ కృషిచేస్తుందని తెలిపారు. కేఎల్ఐలో రూ.600కోట్లు వెచ్చించామని అన్నారు. వచ్చే సంవత్సరంలో మరో వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి పూర్తి స్థాయిలో రైతులకు నీరందిస్తామన్నారు. కేఎల్ఐ వెంట రాత్రింబవళ్లు తిరుగుతూ పూర్తి చేస్తున్నామన్నారు. ఆవంచలో కాలువల పనులను పూర్తి చేయించి నీరందించామని చెప్పారు. పెద్దవాగుపై నిలబడి బ్రిడ్జిలు ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులు తీర్చామన్నారు. రైతులకు ఎక్కడెక్కడ కాలువల వెంట బ్రిడ్జిలు నిర్మించాలి, అసంపూర్తి పనుల గురించి రైతులతో అడిగి తెలుసుకునేందుకే జలవిజయ యాత్ర కొనసాగిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే మర్రితోపాటు ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొంటారని అన్నారు. ఎరువులు, విత్తనాలకు రూ.8వేలు ఇస్తాం.. వచ్చే సంవత్సరం నుంచి రైతులకు ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఎకరాకు రూ.8వేలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి సాగుకు నిర్విరామంగా విద్యుత్ అందిస్తామన్నారు. నీళ్లు వృథా కాకుండా ఆటో స్టార్టర్లను తొలగించుకోవాలని రైతులకు చెప్పారు. రైతుల అవసరాలు గుర్తించని కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ హయాంలో పొన్నాల లక్ష్మయ్య నీళ్ల మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, రైతుల అవసరాలు కూడా గుర్తించలేని మంత్రిగా కొనసాగారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఇటీవల అచ్చంపేటలో ప్రజాగర్జన పేరుతో నిర్వహించిన సభ కేవలం ఓట్ల కోసమేనని, ప్రజల కోసంకాదన్నారు. ఈ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రైతుల కష్టనష్టాలు తెలుసుకుని, తీర్చేందుకే ఈ పాదయాత్ర చేపడుతున్నారని అన్నారు. అనంతరం లక్నారం ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన కేఎల్ఐ పైలాన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే మర్రి పాదయాత్ర పెద్దూరుకు చేరుకుంది. పెద్దూరు, ఆలేరు గ్రామాల మధ్యనున్న కేఎల్ఐ బ్రిడ్జి పక్కన రాత్రికి బస చేస్తారు. అక్కడి నుంచి గట్టురాయిపాకుల, పెద్దపల్లి మీదుగా పాదయాత్రను కొనసాగించనున్నారు. ఈసందర్భంగా మహిళా సంఘాలకు రూ.కోటి 15లక్షల చెక్కును మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అందించారు. సాయిచంద్, కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే రాములు, టీఆర్ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, హన్మంతురావు, జెడ్పీటీసీ సభ్యులు నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
పలాయనం చిత్తగించారు!
-
పలాయనం చిత్తగించారు!
బీజేపీ నేతలపై హరీశ్‌రావు ధ్వజం ► సీఎం కేసీఆర్ అడిగిన ఏ ప్రశ్నకూ జవాబివ్వలేదు ► తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి ► చిత్తశుద్ధి ఉంటే హైకోర్టును విభజించాలి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన సవాలును స్వీకరించకుండా, కనీసం స్పందించకుండా బీజేపీ పలాయనం చిత్తగించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం రూ.లక్ష కోట్లు ఇచ్చినట్లు అధికారికంగా లెక్కలు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి సవాలు చేశారని, అయితే ఆయన అగిడిన ఏ ఒక్క ప్రశ్నకు బీజేపీ సమాధానం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీకి వెళ్లిపోయారని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి స్పందించినా సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని అన్నారు. దీంతో సీఎం చెప్పినవన్నీ అక్షర సత్యాలేనని బీజేపీ పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. అమిత్ షా అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడారని తేటతెల్లం అయిందన్నారు. సీఎం కేసీఆర్ రాజీనామాకు సిద్ధపడ్డా, వారు చెప్పిన దాంట్లో ఒక్కదానిని కూడా రుజువు చేయలేకపోయారని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు రూ.లక్ష కోట్ల గురించి వివరించకుండా, 90వేల ఇళ్ల గురించి మాట్లాడారని, అంటే రూ.లక్ష కోట్లు తప్పని ఒప్పుకున్నట్లేగా అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్ పనులు చేయండి: బీజేపీకి నిజంగానే తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే సీఎస్టీలో పెండింగ్‌లో ఉన్న రూ.19వేల కోట్లను, క్యాంపా పథకం కింద రావాల్సిన రూ.17వందల కోట్లను వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. హైకోర్టును తక్షణమే విభజించాలని, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయించాలనీ అన్నారు. ఏపీకి ఇచ్చినట్లుగానే తెలంగాణలోనూ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అమిత్ షా రాకతో బీజేపీ పదేళ్లు వెనక్కి పోయిందని, మోదీ, యోగీలు వస్తే పాతికేళ్లు వెనక్కి పోవడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు బీజేపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, మెదక్, వరంగల్ ఎంపీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో, అలాగే నారాయణఖేడ్, పాలేరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆడిన అబద్ధాలే మళ్లీ మళ్లీ ఆడారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ‘తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను అనేక రాష్ట్రాలు అభినందించాయి. యూపీ, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల అధికారులు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు..’అని మంత్రి పేర్కొన్నారు. వాస్తవాలు అలా ఉంటే బీజేపీ నేతలు మాత్రం బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నడిచినట్లు ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణలో నడవదని, రాష్ట్ర బీజేపీ నాయకులు తమ జాతీయ అధ్యక్షునికి తప్పుడు సమాచారం ఇచ్చి అబద్ధాలు మాట్లాడించారని, తాము మాట్లాడింది వాస్తవం కాదని క్షమాపణ చెప్పి ఉంటే గౌరవం పెరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. -
‘బయ్యారం’పై సమగ్ర నివేదిక ఇవ్వండి
అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కీలకమైన టాస్క్‌ఫోర్స్ నివేదికను సమగ్రంగా రూపొందించాలని నీటిపారుదల, భూగర్భ వనరుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భూగర్భ వనరుల శాఖ అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో ముడి ఇనుము లభ్యతపై ప్రస్తుతం భూగర్భ వనరుల శాఖ అధ్యయనం చేస్తోంది. అయితే బయ్యారంలో ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితం కాకుండా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నమూనాలు సేకరించడం ద్వారా ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావాల్సిందిగా ఇటీవల కేంద్రం సూచించింది. దీంతో సమగ్ర అధ్యయనానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు మంత్రికి వివరించారు. కాగా, వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్రంలో ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. -
ధర్మపురిలో మంత్రుల మకాం
శని, ఆదివారాల్లో సెలవుల దృష్ట్యా ధర్మపురికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. దీంతో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ధర్మపురిలో పుష్కరాల పర్యవేక్షకులుగా మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీష్‌రావులను నియమించారు. ఈ మేరకు వీరిద్దరు శని, ఆదివారాల్లో ధర్మపురిలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పుష్కరాలపై సమీక్షలు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. -
'బాబూ.. ఆ గొంతు మీదా కాదా?'
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడింది మీరో కాదో చెప్పాలని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చంద్రబాబును ప్రశ్నించారు. ఫోన్లో స్టీఫెన్‌తో మాట్లాడిన గొంతు మీదా కాదా అని హరీష్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. స్టీఫెన్‌తో ఫోన్ సంభాషణల విషయం గురించి చంద్రబాబు స్పష్టమైన సమాధానం చెప్పకుండా ఓటుకు నోటు కేసును పక్కదారిపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడి ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.ఓటుకు కోట్లు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. -
'బాబూ.. ఆ గొంతు మీదా కాదా?'
-
'టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతికి పాల్పడి ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్‌లో హరీష్ రావు మాట్లాడుతూ... ఓటుకు కోట్లు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. హైదరాబాద్ నగరంలో నివాసముండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారికి ఎందుకు రుణమాఫీ చేయాలేదని ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌ను హరీష్ రావు ప్రశ్నించారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం అన్ని ప్రాంతాల వారిని సమన్యాయంతో చూస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. -
'కాంగ్రెస్ పవర్ పోయింది.. ప్రజలకు పవర్ వచ్చింది'
హైదరాబాద్: కాంగ్రెస్ పవర్పోవడంతో తెలంగాణ ప్రజలకు పవర్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఆయన బుధవారం కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు కన్వీనర్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ నేతలు అభివృద్ధి నిరోధుకలని ఆయన విమర్శించారు. గతంలో తెలంగాణ రాకుండ అడ్డుకున్న వారే నేడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ సంకల్పంతో రానున్న 20ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రాజెక్టుల నిర్ణీత ఆయకట్టుకు నీరు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజె క్టుల కింద ఖరీఫ్ నాటికి నిర్దేశిత ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో 1.20 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సూచించారు. పంప్‌హౌస్ ల నిర్మాణం, భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కల్వకుర్తి మూడో దశ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న గామన్ ఇండియా కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని, సబ్ కాంట్రాక్టర్‌తో పనులు చేయించే అవకాశాలను పరిశీలించాలన్నారు. సోమవారం పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలసి హరీశ్‌రావు సమీక్షించారు. కల్వకుర్తి కింద భూసేకరణకు రూ.9 కోట్ల ప్రతిపాదనలను పంపాలన్నారు. -
క‘మీషన్’ కాకతీయ!
చెరువు పనుల నిధులు మెక్కుతున్న నేతలు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లపై పడుతున్న స్థానిక ప్రతినిధులు మొత్తం సొమ్ములో పది శాతం వరకు ఇవ్వాలని ఒత్తిళ్లు లేదంటే పనులు జరగనివ్వబోమని బెదిరింపులు సొంత వాళ్లకు సబ్ కాంట్రాక్టు కోసం మరికొందరి పట్టు విరాళాలు కోరుతున్న అధికార పార్టీ కార్యకర్తలు చెరువుల వద్ద శిలాఫలకాలు, పనుల ప్రారంభానికి ఆర్భాటాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే దందా తీవ్ర ఇబ్బందులతో ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో కమీషన్ల దందా మొదలైంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం స్థానిక ప్రజా ప్రతినిధులకు వరంగా మారింది. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ప్రస్తుతం కమీషన్ల కాక తగులుతోంది. నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అత్యధికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ బాగోతం పనుల నాణ్యతపై ప్రభావం చూపిస్తుందని, చివరకు ఈ కార్యక్రమమే అభాసుపాలయ్యే ప్రమాదముందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, మిషన్ కాకతీయ కాస్తా క‘మీషన్’ కాకతీయగా మారుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అంచనాలు రూపొందించడం నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ల వరకు అంతా సజావుగానే సాగిన ప్రక్రియ.. పనులు మొదలవడంతోనే పక్కదారి పట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్‌ను ఐదు నుంచి పది శాతం మేర కమీషన్ ఇవ్వాలని స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టుపడుతున్నారు. మరికొన్ని చోట్ల తాము సూచించిన వారికి సగం పని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అంచనా కంటే 25 నుంచి 30 శాతం అధిక మొత్తానికి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఈ పరిణామాలతో కంగుతింటున్నారు. కొందరు నాసిరకం పనులకు సిద్ధపడి నేతలతో రాజీపడుతుంటే, మరికొందరేమో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కమీషన్ ఇవ్వాల్సిందే..!: ప్రస్తుతం చేపట్టిన 9,577 చెరువుల పునరుద్ధరణ పనుల్లో ఇప్పటివరకు 6,268 చెరువుల పనులకు ప్రభుత్వం రూ. 2,500 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో 3,270 చెరువులకు ఇప్పటికే కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదరగా, 1645 చెరువుల పనులు ఇప్పటికే ఆరంభమయ్యాయి. పనులు మొదలైన చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు రంగ ప్రవేశం చేసేశారు. తమకు మొత్తం కాంట్రాక్టు సొమ్ములో ఐదు శాతం కావాలని కొన్ని చోట్ల, పది శాతం కంటే తక్కువ ఇస్తే పనులు చేయొద్దని మరికొన్ని చోట్ల డిమాండ్లు పెడుతున్నారు. ఇవ్వడానికి సిద్ధపడని కాంట్రాక్టర్లకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, కరీనంగర్ జిల్లా పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గాల్లోని కాంట్రాక్టర్లు ఇప్పటికే ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేటలోనే ఓ కాంట్రాక్టర్‌కు టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. తమకు ఐదు శాతం కమీషన్ ఇస్తేనే పనులు చేయనిస్తామంటూ వారు బెదిరించారు. ఈ సంగతి తెలిసి మంత్రి సదరు కార్యకర్తలను హెచ్చరించినట్లు సమాచారం. మంత్రి పరిధిలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. ఇక అన్ని జిల్లాల్లో ఇంతకన్నా ఘోరంగా ఉంది. అనేక చోట్ల బెదిరింపుల పర్వం జోరుగా సాగుతోంది. ‘అసలు నేనే టెండర్ వేసి ఉంటే నీకు వచ్చేదా.. అది దృష్టిలో ఉంచుకో.. మేం టెండర్లో పాల్గొనలేదు కాబట్టే నీకు పని వచ్చింది. నీకు ఎటూ 25 శాతం లాభం వస్తుంది.. అందులో నాకు 7.5 శాతం ఇవ్వు. అందులో సగం ముందే ఇచ్చేయ్’ అంటూ నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంట్రాక్టర్‌ను ఓ ఎంపీటీసీ బెదిరించినట్లు తెలిసింది. ఒప్పందం సమయంలోనే కమీషన్లు పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఉంటుందని, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని తెలిసి చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. అఘమేఘాల మీద కాంట్రాక్టర్‌గా లెసైన్సులు పొందారు. టెండర్ల ప్రక్రియ మొదలైన వెంటనే రూ. 50 లక్షలకు మించి అంచనా మొత్తం ఉన్న చెరువులకు ఇతరులు టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా స్టేషన్గణపూర్, నల్లగొండ జిల్లా నకిరేకల్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ నేతలులేదా వారి సమీప బంధువులే కాంట్రాక్టర్లుగా చెరువు పనులు చేజిక్కించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాల్కొండ వంటి కొన్ని నియోజకవర్గాల్లో మూడుసార్లు టెండర్లకు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. కొందరు ఔత్సాహికులు ముందుకు వచ్చినా స్థానిక టీఆర్ఎస్ నేతలు బెదిరించారు. పెద్ద ఎత్తున చెరువుల పనులు తీసుకోవాలని ముందుకు వచ్చిన ఇద్దరు కాంట్రాక్టర్లను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. స్థానిక నేతల ఒత్తిళ్ల మేరకు టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని జిల్లా స్థాయి అధికారి ఒకరు చెప్పారు. చివరకు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు తమ సొంత మనుషులకే టెండర్లు దక్కేలా చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో తీవ్ర ఒత్తిళ్లు మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 30 నుంచి రూ. 40 లక్షల టెండర్లు పూర్తిగా తమ మద్దతుదారులకే దక్కేలా స్థానిక ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకోగా, చెరువుల పనులు దక్కని చిన్న స్థాయి నేతలు కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల వెంట పడుతున్నారు. వారితో గొడవలకు దిగుతున్నారు. చెరువు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్న సమయంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు రంగప్రవేశం చేస్తున్నారు. ఒప్పందం ఖరారు కావాలంటే ముందుగా తమకు పని విలువలో పది శాతందాకా కమీషన్‌ను ఇవ్వాలని, లేదంటే తమకు సంబంధించిన ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్లు మాత్రమే తీసుకోవాలని షరతు పెడుతున్నారు. మాట వినని కాంట్రాక్టర్లు ఉంటే అధికారులతోనూ వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. మంత్రులు లక్ష్మారెడ్డి, కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఘటనలు కోకొల్లలు. చెరువులను దక్కించుకున్న కాంట్రాక్లర్లను బెదిరించి తమ వారికి ఆ పనుల్లో వాటా ఇప్పించే యత్నాలకు సైతం నేతలు దిగినట్లు తెలుస్తోంది. ఇక గ్రామ స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా ఇదే తరహా ఒత్తిళ్లకు దిగి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. పనుల ప్రారంభానికే అడ్డగోలు ఖర్చు ఒక నియోజకవర్గ పరిధిలో ఎన్ని చెరువుల పనులు ఆరంభమైతే అన్ని చెరవులను స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ఆరంభిస్తున్నారు. అలా ఒక్కో నియోజకవర్గ పరిధిలో 50 చెరువుల పనులను ఆరంభిస్తే ఆ చెరువు పనులన్నింటి వద్ద స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లతో శిలాఫలకం ఏర్పాటు, ఆ కార్యక్రమానికయ్యే ఖర్చు, ఫ్లెక్సీలు, కార్యకర్తలకు భోజనాలు అన్నీ కాంట్రాక్టర్లపైనే మోపుతున్నారు. దీంతో ఒక్కో చెరువు పనుల ప్రారంభానికే రూ. 30 వేల వరకు ఖర్చవుతోంది. ఈ లెక్కన కాంట్రాక్టర్లంతా కలిసి ఇప్పటివరకు రూ. 5 కోట్ల వరకైనా ఖర్చు చేశారని అంచనా. ఈ లెక్కన 9,577 చెరువులకు సంబంధించిన పనుల ప్రారంభానికి ఖర్చు రూ. 30 కోట్లు దాటుతుందని అధికారులు అంటున్నారు. మొత్తంగా మిషన్ కాకతీయ పనులపై ఓ ఉన్నతోద్యోగి మాట్లాడుతూ.. ‘మా బాధలు ఎన్నని చెప్పమంటారు. టెండర్ల వరకు బాగానే జరిగినా ఆ తర్వాత మా ప్రాణానికొచ్చింది. ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు ఏమని చెప్పమంటారు. గత అనుభవాల దృష్ట్యా ఏ విధంగా పనులు జరగకూడదని ప్రభుత్వం నిర్ణయించిందో.. అదే ఇప్పుడు పునరావృతమవుతోంది. దీనిపై ప్రభుత్వ పెద్దలే కల్పించుకోవాలి. అప్పుడే మిషన్‌ను కాపాడగలం’ అని ఆవేదనగా చెప్పారు. -
గోదావరి ప్రాజెక్టులపై ప్రభుత్వ దృష్టి!
ప్రాజెక్టుల వారీగా అధికారుల చర్యలు కంతనపల్లి, దేవాదులపై సమీక్షలు పూర్తి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, వరద కాల్వలో పునరావాసంపై సమీక్షించిన ముఖ్య కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా నిర్మాణంలో ఉన్న పనులను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా శరవేగంగా కసరత్తులు చేస్తోంది. ప్రాజెక్టు వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, సేకరించాల్సిన భూమి, అటవీ సమస్యలు, సహాయ పునరావాసం తదితరాలపై రోజూవారీ సమీక్షలు నిర్వహిస్తూ వేగం పెంచే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు స్థాయిలో దేవాదుల, కంతనపల్లిపై అటవీ శాఖతో సమీక్షలు జరగ్గా, సోమవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్‌మానేరు, కాళేశ్వరం, మంథని ఎత్తిపోతల పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన 1,300 ఎకరాల భూసేకరణను పూర్తి చేయాలని, 11 గ్రామాల్లో సహాయ పునరావాసం పూర్తికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని 2,400 ఎకరాలు, వరద కాల్వ పరిధిలోని మరో 2 వేల ఎకరాలు, మంథని, ఎల్లంపల్లి పరిధిలోని మరో 3,500లకు పైగా ఎకరాల భూసేకరణను వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని జోషి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి, ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు ప్రాజెక్టుల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీ నిర్వహించారు. దేవాదుల పరిధిలో నెలకొన్న అటవీ, భూసేకరణ సమస్యలను అధిగమించేందుకు 3 రోజుల కిందట అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే ఖరీఫ్ నాటికి 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరందించే చర్యలకు ఆదేశాలిచ్చారు. ఇక కంతనపల్లిలో ముంపు తగ్గింపు కోసం అవసరమైతే బ్యారేజీలో నీటి నిల్వను తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగింది. అయితే ఎత్తు ఏ మేరకు తగ్గించాలన్న దానిపై ఇప్పుడు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. భూసేకరణకు కలెక్టర్ల నియామకం భూసేకరణ కోసం డిప్యూటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రాణహిత-చేవెళ్ల సిద్ధిపేట డివిజన్‌కు కుసుమకుమారి, నిజామాబాద్ జిల్లాకు పద్మశ్రీ, ఎస్సారెస్పీ-2కు బీఎస్ లత, దేవాదులకు బి.విద్యాసాగర్, కంతనపల్లికి ఆర్.గోపాల్‌ను నియమించింది. -
మరో 45 రోజులపాటు ఇదే పని
వానలు పడేదాకా చెట్లు, గుట్టల వెంట తిరుగుతా.. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జోగిపేట: ‘నేను చెరువుల దీక్ష చేపట్టిన.. ఇంకా 45 రోజుల దాకా ఇదే పనిమీద ఉంట... తెలంగాణ రైతులందరికి నీళ్లందే దాకా నీరడిగా పనిచేస్త’ అని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా అందోల్ మండలం రాంసానిపల్లి, టేక్మాల్ మండలం కాద్లూర్‌లో మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వానలు పడేదాకా చెట్లు, గుట్టల వెంటే తిరుగుతానని చెప్పారు. నిన్న చిన్నశంకరంపేట, చేగుంటలో.. నేడు అందోల్‌లో పూడికతీత పనుల్లో పాల్గొన్నట్టు తెలిపారు. రేపు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. అధికారులు కూడా టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకొని మధ్యాహ్నం చెరువు గట్ల వద్దే తినాలని.. అలాగే పనుల నాణ్యతను పర్యవేక్షించాలన్నారు. పనిచేయని వారిపై చర్యలు.. చెరువు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనిచేయకపోయినా, ఆ వ్యక్తులకు అధికారులు సహకరించినా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఒక్కో అధికారి ఒక్కో చెరువును దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చెరువుల మరమ్మతుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కడుపులు కొట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిందని హరీశ్ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ నాయకులు రైతుల క డుపుకొడితే..కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారని ఆరోపిం చారు. సీఎం కేసీఆర్ చెరువుల మరమ్మతుల కోసం రూ.2 వే ల కోట్లు కేటాయించారన్నారు. పనులను పారదర్శకతకు ఈ-టెండర్లను నిర్వహించినట్టు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో మిషన్ కాకతీయను విజయవంతంగా ముందుకు తీ సుకెళ్తామన్నారు. బంగారు తెలంగాణకోసం మన భూముల్లో బంగారం పండించాలని మంత్రి సూచించారు. -
చంద్రబాబువి కుళ్లురాజకీయాలు
కరెంట్ అడిగితే కాల్చి చంపిన ఘనత ఆయనదే ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారు మంత్రి హరీశ్‌రావు ఫైర్ మెదక్: ‘కుళ్లు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. కరెంట్ అడిగితే.. రైతులను కాల్చిన చంపిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే’నని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సాయంత్రం మెదక్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే ఏకపక్షంగా సభను నడుపుతున్న చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విమర్శలు చేస్తున్న బాబు.. ఏపీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకోవడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో జాతీయ పతాకాన్ని అవమాన పర్చినందుకే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశామన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు దమ్ముంటే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని, హైకోర్టు విభజనపై చంద్రబాబు వైఖరిని కోరుతూ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. త్వరలో 800 ఇంజినీర్ల నియామకం మునిసిపల్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ఇందుకుగాను 800 మంది మునిసిపల్ ఇంజినీర్లను త్వరలో నియమించనున్నట్టు చెప్పారు. ఆదివారం సాయంత్రం మెదక్ ఖిల్లాపై మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు నాలుగు జిల్లాలకు ఒక మున్సిపల్ ఎస్ఈ ఉండేవారని, ఇకముందు రెండు జిల్లాలకు ఒక ఎస్ఈని నియమిస్తామన్నారు. జిల్లాకో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌ను నియమిస్తామని చెప్పారు. వావ్ పద్ధతి కింద ఐటీసీ సౌజన్యంతో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయనున్నట్టు తెలిపారు.పారిశుద్ధ్య సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తారని తెలిపారు. బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వలేం.. చేగుంట: బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందించలేమని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. చేగుంట మండలం రెడ్డిపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10 శాతం ఉండి, పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందిస్తామన్నారు. ప్రస్తుతం అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, వారందరికీ జీవనభృతి చెల్లిస్తామన్నారు. -
చెరువు కబ్జాలపై ఉక్కుపాదం
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సెమినార్లో మంత్రి హరీశ్‌రావు చెరువులకు కొత్త రూపునిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో కబ్జాలకు గురైన చెరువులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని, కబ్జాదారులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘మిషన్ కాకతీయ’లో భాగంగా పారిశ్రామీకరణ వల్ల కాలుష్యంతో నిం డిన చెరువులను పునరుద్ధరించడం ద్వారా కొత్తరూపునిస్తామని వెల్లడించారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరిలో ఉన్న పూర్తిస్థాయి కేటాయింపులను వినియోగించుకొని రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చెరువు నీటిని ఒడిసిపట్టగలిగితే గ్రామంలోని అన్ని కులాలకు పని దొరుకుతుందని, అదే జరిగితే సుస్ధిర సమగ్రాభివృధ్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. చెరువుల అభివృద్ధితోపాటే హరితహారం పేరిట చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి పారిశ్రామిక వర్గాలు సహకరించాలన్నారు. మిషన్ కాకతీయలో అన్ని జిల్లాలను చేర్చి హైదరాబాద్‌ను విస్మరించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్‌శాఖతో చెరువులను పునరుద్ధరించాలని సూచించారు. ఇదే సమయంలో పర్యావరణ సమతౌల్యత పాటించేం దుకు వీలుగా అడవులు తక్కువగా ఉన్న నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింతగా చేపట్టాలన్నారు. చెరువుల పునరుద్ధరణ జరగాల్సిన తీరు, భూగర్భ జల రక్షణ, జల భద్రత, జల కాలుష్యంపై వంటి అంశాలపై పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, మరో పర్యావరణవేత్త సుబ్బారావు, సీపీఎం ప్రతినిధి వరప్రసాద్, సీపీఐ ప్రతినిధి నరసింహా రావు, సోల్ సంస్థ కన్వీనర్ లుగ్నా, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి ఈ సెమినార్లో ప్రసంగించగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ అధ్యక్షురాలు కె.లీలా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సింహారెడ్డి, గేయ రచయిత అంద్శైపాల్గొన్నారు. -
పీఏసీపై ప్రకటన చేయనున్న హరీష్‌రావు
హైదరాబాద్: పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్ కమిటీలపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు బుధవారం అసెంబ్లీలో ప్రకటించనున్నారు. ఒక్కొ కమిటీలో 9 మంది సభ్యులుండే అవకాశం ఉందని సమాచారం. అయితే రైతు బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని హరీష్ రావు తెలిపారు. అవసరం ఉన్న ప్రతి చోట శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామన్నారు. -
7 నుంచి బడ్జెట్ సమావేశాలు
11న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్ధిక మంత్రి ఈటెల మార్చి 27 వరకు సమావేశాలు స్పీకర్, మండలి చైర్మన్ల తో సీఎం సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి 27వ తేదీ దాకా జరగనున్నాయి. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ సమావేశాల తేదీల గురించి గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. మార్చి 7 తేదీ ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. తొలుత అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ శనివారం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో సమావేశమై తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. 8, 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-2016 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను 11వ తేదీన సభలో ప్రవేశపెడతారు. 13, 14, 16 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ సమాధానం 17వ తేదీన ఉంటుంది. మొత్తంగా 12, 15, 21, 22 తేదీలను అసెంబ్లీకి సెలవులుగా నిర్ణయించారు. తర్వాత 23 నుంచి 27వ తేదీ వరకు వరుసగా సమావేశాలు జరుగుతాయి. కాగా, 27వ తేదీన ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఈనెల 27 రూల్స్ కమిటీ సమావేశం అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు అయినా, సభ జరిగే సమయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉదయం 9 గంటల నుంచి కానీ, 9.30 నుంచి కానీ సమావేశాలు మొదలు పెట్టాలన్న చర్చ జరిగింది. అయితే దీనిపై ఓ నిర్ణయానికి రాకపోవడంతో ఈనెల 27వ తేదీన జరిగే అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుని చెబితే, ఆ ప్రకారమే నిర్వహిద్దామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు ఆదివారం వచ్చిందని, ఆ రోజు సెలవు ఇస్తే బావుంటుందన్న ప్రతిపాదనను సీఎం తిరస్కరించారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్యమని, ఆదివారాలు, పండుగలు అని చూసుకోవాల్సిన అవసరం లేదని, సమావేశం జరగాల్సిందేనని ఆయన అన్నట్టు తెలిసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి 7వ తేదీ నుంచే ప్రారంభం కానున్నట్టు వార్తలు వచ్చిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వెళ్లారని, అయితే వారి తేదీలతో సంబంధం లేదని.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఏడు నుంచే మొదలు పెడదామని ఆయన స్పష్టంచేసినట్లు సమాచారం. స్పీకర్‌తో భేటీ తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి బడ్జెట్ సమావేశాల తేదీలను వివరించి, 7వ తేదీన ప్రసంగించడానికి రావాల్సిందిగా ఆహ్వానించడం.., గవర్నర్ దానికి అంగీకారం తెలపడం వెంట వెంటనే జరిగిపోయాయి. సీటింగ్ ఏర్పాట్లు భేష్ అసెంబ్లీ సమావేశ మందిరంలో సీటింగ్ ఏర్పాట్ల పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇరుగ్గా ఉన్న సీట్లను తొలగించి 170 మంది సభ్యులకు సరిపడేలా అధికారులు మరమ్మతులు చేపట్టారు. సీటింగ్ ఏర్పాట్లు బాగా ఉన్నాయని అధికారులను అభినందించిన సీఎం, నాలుగు ద్వారాల నుంచి సమావేశ మందిరంలోకి గ్రీన్ కార్పెట్లు వేయాల్సిందిగా సూచించారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇతర విప్‌లు, ఎంపీ బి.వినోద్‌కుమార్, అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాం పాల్గొన్నారు. -
పాలమూరుకే ప్రాధాన్యం
సాక్షి, మహబూబ్‌నగర్ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు జిల్లాకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు వ్యాఖ్యానించారు. జిల్లాలో వచ్చే ఖరీఫ్ నాటికి (జూన్‌లో) ఎత్తిపోతల పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ప్రాజెక్టుల పనులను స్వయంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించి మొదటి లిప్టు ద్వారా పంపు చేసి నింపిన సింగోటం రిజర్వాయర్‌ను పరిశీలించారు. అలాగే రెండో లిఫ్ట్ అయిన జొన్నలబొగడ, మూడో లిఫ్ట్ అయిన గుడిపల్లిగట్టు దగ్గర జరుగుతున్న పనులు పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్లను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగోటం రిజర్వాయర్‌ను పరిశీలించిన తర్వాత రంగసముద్రాన్ని పరిశీలించారు. అనంతరం నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. ఆ తర్వాత ఆయన సాయంత్రం గద్వాలలో విలేకరులతో మాట్లాడారు. ఈ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అందుకే జిల్లాలోని ఇరిగేషన్‌కు సంబంధించి రూ.340 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతిపాదిక ఆయకట్టుకు వచ్చే ఖరీప్ నుంచి కచ్చితంగా నీళ్లు ఇచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. అందులో భాగంగానే తానే స్వయంగా ప్రాజెక్టుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. మిషన్ కాకతీయలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యం లభించనుందన్నారు. జిల్లాలోని మొత్తం 7,500 చెరువులకు గాను ప్రతీ ఏడాది పదిహేను వందల చెరువులకు మరమ్మత్తులు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి పనికిరాని భూములను తాము ఇప్పటికే గుర్తించామని, అక్కడ పరిశ్రమలు స్థాపించి జిల్లాను అభివృద్ధిపథాన నడిపిస్తామన్నారు. వాళ్లు చేసింది సున్నా... కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాజెక్టుల పనులకు సంబంధించి కేవలం మట్టిపనులు మాత్రమే చేశారని, కీలక పనులన్నీ అలాగే వదిలేశారని వివరించారు. భూసేకరణ, రైల్వే నిర్మాణాలకు సంబంధించి ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్ కోసం కనీసం డబ్బులు కూడా మంజూరు చేయించలేకపోయారన్నారు. తమ ప్రభుత్వమే పాలమూరు ఎత్తిపోతల పథకానికి డీపీఆర్‌కు నిధులు మంజూరు చేయడమే కాదు... మొదటి దశ పనుల కోసం రూ.16వేల కోట్లు అంచనా కూడా వేసిందన్నారు. పాలమూరు ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చేత జిల్లాలో భూసేకరణ కోసం ప్రత్యేక కలెక్టర్ వనజను నియమించామన్నారు. అలాగే ఈ రోజు తనతో పాటు ఆర్అండ్ఆర్ కమిషనర్ మాణిక్రాజును వెంటబెట్టుకొని ప్రాధాన్యతను వివరించామన్నారు. కొన్నిచోట్ల కాల్వల్లో నీళ్లు ఉండటం చేత పనులకు ఆటంకం కలుగుతోందని... ఈ నాలుగు నెలలు అత్యంత కీలకం కావడంతో వాటిని నిలిపేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లా అభివృద్ధి కోరుకుంటున్నందున కొన్ని విషయాల్లో తాము కఠినంగా వ్యవహరించకతప్పదన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి ఆర్అండ్ఆర్ కాలనీల్లో రాత్రికి రాత్రే ఇళ్లు, పశువుల కొట్టాలు వెలుస్తున్నాయన్నారు. కొన్నిచోట్ల డబ్బులు తీసుకొని కూడా ఖాళీ చేయడం లేదని ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మంత్రి హరీష్‌రావు వెంట పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులున్నారు. -
రేవంత్.. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ఇసుక మాఫియా విషయంలో టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఖండిం చారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు 24 గంటల్లోగా రేవంత్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సచివాలయంలో మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రేవంత్‌రెడ్డికి అలవాటేనన్నారు. నా కుటుంబానికి సంబంధమే లేదు: పోచారం నిజమాబాద్ జిల్లాలో ఇసుక తవ్వకాల విషయంలో తనకు కాని, తన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనివల్ల తమకు పట్టు లేకుండాపోతోందని, పుట్టగతులు ఉండవన్న అక్కసుతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
‘కాకతీయ’కు ముంచుకొస్తున్న గడువు!
పది రోజుల్లో 4వేల చెరువులకు పరిపాలనా అనుమతులే లక్ష్యం అనుమతులు లభించినవి 480 చెరువులు మాత్రమే అనుమతుల కోసం ఆర్థిక శాఖ వద్ద మరో 678 చెరువుల అంచనాలు నేటి నుంచి పుంజుకోనున్న ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ఆరంభానికి ఓ పక్క గడువు ముంచుకొస్తుం డగా, మరో పక్క ముందుకు కదలని పనులు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. తొలి ఏడాది పునరుద్ధరించనున్న తొమ్మిది వేల చెరువుల్లో సగానికిపైగా పనులను జనవరి మూడో వారంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పటివరకు కేవలం ఐదు వందల చెరువులకు మాత్రమే పరిపాలనా అనుమతు లు లభించడం, ఇంకా చాలా పనులు పెండిం గ్లో ఉండటం చిన్న నీటి పారుదల శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పనుల సర్వే పూర్తయిన వాటికి, పరిశీలన(స్క్రూటినీ) పూర్తికాకపోవడం, పరిశీలన పూర్తయిన వాటికి పరిపాలనా అనుమతులు లభించకపోవడం, అనుమతులు లభించిన వాటికి టెండర్లు పిలవకపోవడం ఆ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పది రోజుల్లో సగానికి పైగా చెరువుల పనులను ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం అధికారుల సెలవు దినాలను సైతం కత్తరించి ప్రక్రియను వేగిరం చేసేలా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆటంకాలు అనేకం.. సమగ్ర చెరువుల సర్వే ద్వారా గుర్తించిన 46,531 చెరువుల్లో ప్రస్తుత ఏడాది 9,305 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ మూడోవారం నుంచే పనులను ప్రారంభించి జూన్‌లో వ ర్షాలు కురిసే సమయానికి పునరుద్ధరణ ప్రక్రియ ముగించాలని అంచనాలు సిద్ధం చేసుకుంది. అయితే పనుల అంచనాలు, పరిశీలన, పనుల అనుమతుల ఆమోదంలో జరిగిన ఆలస్యం మొత్తం ప్రక్రియనే జాప్యం చేసింది. అదీగాక అడ్డదిడ్డంగా వచ్చిన పనుల అంచనాలను పునఃపరిశీలన చేయాల్సి రావడం సైతం ప్రక్రియ జాప్యానికి కారణమైంది. ఇప్పుడు కూడా నీటిపారుదల శాఖ రాష్ట్ర కార్యాలయానికి చేరిన మొత్తం అంచనాల్లో 213 అంచనాలను తిరిగి సూపరింటెండెంట్ ఇంజనీర్ పరిశీలనకు తిప్పిపంపారు. ఈ కారణాల దృష్ట్యా ఇప్పటివరకు కేవలం 1,158 చెరువుల అంచనాలు మాత్రమే అన్ని దశలు దాటుకొని పరిపాలనా అనుమతుల కోసం ఆర్థిక శాఖను చేరాయి. ఇందులో రూ.190.17కోట్ల విలువ ఉన్న 480 చెరువుల పనులకు మాత్రం ఆమోదం లభించగా, మరో 678 చెరువుల అంచనాలు ఇంకా ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. ఇక చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలకు రూ.1,076కోట్ల అంచనా వ్యయంతో చేరిన 2,036 చెరువుల పనులను పూర్తిస్థాయిలో స్క్రూటినీ చేయాల్సి ఉండగా, స్క్రూటినీ చేసిన మరో రూ.880.33కోట్ల అంచనాలతో కూడిన 1,729 చెరువు పనుల నివేదికను ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంది. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడిఉన్న ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి జనవరి మూడో వారానికి సుమారు 4వేల చెరువుల పనులను ఆరంభించాలని భావిస్తున్నారు. మొదటగా పరిపాలనా ఆమోదం దక్కిన చెరువులకు టెండర్ల ప్రక్రియలో ఇదివరకున్న 15 రోజుల గడువును వారం రోజులకు కుదించి ప్రక్రియ ముగించేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రత్యేకంగా అధికారులతో అనునిత్యం సమావేశాలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఆర్థిక శాఖకు చేరుతున్న అంచనాలకు వెంటనే అనుమతులు లభించేలా సచివాలయంలో ప్రత్యేక లైజనింగ్ అధికారిని నియమించి పర్యవేక్షణ చేస్తున్నారు. సోమవారం నుంచి మిషన్ కాకతీయ పనులు మరింత వేగంగా జరుగుతాయని, అవసరమైతే ఆదివారాలు, సంక్రాంతి సెలవు దినాల్లోనూ అధికారులు తమ విధులను కొనసాగిస్తారని నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పాపం ‘కొప్పుల’
రాష్ట్ర మంత్రివర్గంలో చోటుకోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ చీఫ్‌విప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొప్పులను చీఫ్‌విప్ పదవి వరించడంతో జిల్లాకు మరో క్యాబినెట్ హోదా పదవి దక్కింది. ఇప్పటివరకు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు మంత్రులుగా ఉండగా, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సహాయ క్యాబినెట్ హోదా కలిగి ఉన్నారు. ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సాంస్కృతిక సారథి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ, క్యాబినెట్ హోదాను కల్పించారు. కరీంనగర్‌సిటీ: సౌమ్యుడిగా పేరొం దిన కొప్పుల ఈశ్వర్ తొలుత మేడారం ప్రస్తుత రామగుండం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించేవారు. ఎస్సీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ధర్మపురి ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో ఆయన ధర్మపురిని ఎంచుకున్నారు. టీఆర్ఎస్ నుంచి వరుసగా ఐదు ఎన్నికల్లో పోటీచేయడంతో పాటు ఘనవిజయం సాధించి రికార్డు నెలకొల్పారు. రాష్ట్రంలో ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు మాత్రమే ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతటి గుర్తింపు పొందిన కొప్పుల పార్టీ అధినేత కేసీఆర్‌కు సైతం విధేయుడుగా ముద్రపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, తొలి మంత్రివర్గంలోనే కొప్పులకు చోటు దక్కడం ఖాయమని, అది కూడా ఉప ముఖ్యమంత్రి అని అప్పట్లో ప్రచారం జరిగింది. రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒకటి మైనారిటీ, మరొకటి దళిత వర్గానికి ఇస్తానని కేసీఆర్ చెప్పడంతో దళిత కోటాలో డెప్యూటీ సీఎం కొప్పులే అని అంతా భావించారు. చివరి నిమిషంలో పరిస్థితి తారుమారు కావడంతో కొప్పులకు బదులు అదే కోటాలో వరంగల్ జిల్లా నుంచి రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. తొలి షాక్ నుంచి తేరుకున్న కొప్పుల తనకు కనీసం మంత్రి పదవైనా ఇస్తారని అధినేతపై గట్టి విశ్వాసం పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే స్పీకర్, చీఫ్‌విప్, విప్ తదితర పదవులను ఇస్తామన్నా ఆయన తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. మంత్రి పదవి తనకు కచ్చితంగా వస్తుందని, ఆ దిశగా కేసీఆర్ హామీ ఇచ్చారనే ధీమాతోనే ఆయన ముఖ్యమైన స్పీకర్ పదవిని కూడా వదులుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. చివరకు ఏ పదవి వద్దనుకున్నాడో ఆ చీఫ్‌విప్‌తోనే కొప్పుల సరిపెట్టుకోవాల్సి రావడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమీకరణల్లో భాగంగానేనా...? ఇదిలా ఉంటే జిల్లాలు, సామాజిక సమీకరణల మూలంగానే కొప్పులకు మంత్రి పదవి దూరమైంద ని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మంత్రి వర్గసభ్యుల సంఖ్య మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదనే నిబంధన ఉంది. రాష్ట్రంలో మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకు 15 శాతం అంటే 18 మందికి మించి మంత్రి మండలి ఉండరాదు. ఇప్పటికే 12 మందితో రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రాతినిథ్యం లేని జిల్లాలకు ఇవ్వడంతో పాటు, మహిళలు, గిరిజనులు, ఇతర సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవడంతో ఆరుగురితో కోటా నిండిపోయింది. దీనితో కొప్పులకు మొండిచేయి తప్పలేదని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జిల్లాకు తొలిసారి చీఫ్‌విప్ పదవి జిల్లాను తొలిసారి వరించింది. గతంలో విప్ పదవి జిల్లాకు వచ్చినప్పటికీ చీఫ్ విప్ పదవి రావడం ఇదే మొదటిసారి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మానకొండూర్ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ సైతం విప్‌గా కొనసాగారు. ప్రస్తుతం కొప్పులకు చీఫ్‌విప్ పదవి రావడంతో జిల్లాకు మొదటి సారి ఈ పదవి వ చ్చినట్లయింది. కక్కలేక...మింగలేక చీఫ్‌విప్ పదవి రావడంతో కొప్పుల ఈశ్వర్ పరిస్థితి క క్కలేక... మింగలేక అన్నట్లుగా తయారైంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు మంత్రి పదవి ఖాయమని ధీమాతో ఉన్న కొప్పులకు ఈ పరిణామం మింగుడుపడడం లేదు. చీఫ్‌విప్ పదవి క్యాబినెట్హోదా కలిగిందే అయినా మంత్రి పదవితో సమాన స్థాయి కాదనే బాధ ఆయన వర్గీయుల్లో నెలకొంది. మంత్రి పదవి రాలేదు కాబట్టి అసంతృప్తి వ్యక్తం చేయాలా... క్యాబినెట్ హోదాతో చీఫ్‌విప్ పదవి లభించింది కాబట్టి తృప్తిపడి సర్దుకుపోవాలో తెలియని అయోమయంలో కొప్పుల, ఆయన వర్గీయులు ఉన్నారు. ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చేనా? మంత్రివర్గంలో చోటు లభించని ఎమ్మెల్యేలను ఇతర పదవులతో భర్తీ చేస్తున్న క్రమంలో జిల్లా ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మంత్రి, ఆ స్థాయి పదవులు రాని ఆరేడుగురు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెడుతున్నట్లు శనివారం ప్రచారం జరిగింది. దీంతో మంత్రి పదవి రేసులో కూడా లేని కొంతమంది ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెంచుకున్నారు. వారి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి. రాజకీయ ప్రస్థానం 2004లో గని కార్మికునిగా ఉంటు అదే సంవత్సరంలో మేడారం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమ క్రమంలో ఎమ్మెల్యే పదవికి 2008లో రాజీనామా చేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 2009 సంవత్సరంలో పునర్విభజనలో అప్పటి బుగ్గారం స్థానంలో ధర్మపురి నియోజకవర్గం (ఎస్సీ రిజర్వడ్)గా మారింది. 2009 అసెంబ్లి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2010లో తెలంగాణ ఏర్పాటు విషయం లో శ్రీకృష్ణ కమిటీతీర్పును నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010 ఉప ఎన్నికల్లో మళ్లీ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. 2004 నుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. కోల్‌బెల్ట్ నుంచే ఎదిగిన ‘కొప్పుల’ .. గోదావరిఖని: కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రస్థానం కోల్‌బెల్ట్ నుంచే ప్రారంభమైంది. ఆయన 1972లో సింగరేణి సీఎస్పీ-1లో జనరల్ మజ్దూర్‌గా ఉద్యోగం పొందారు. వివిధ గనుల్లో పనిచేసి 2004లో మేడిపల్లి ఓసీపీలో ట్రిప్మెన్గా పని చేస్తూ 32 ఏళ్ల సర్వీస్ తర్వాత ఎన్నికల్లో పోటీచేసే నిమిత్తం రాజీనామా చేశారు. ఈశ్వర్ తొలుతవిప్లవ భావాలు కలిగిన సీపీఐఎంఎల్, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూలలో నిర్బంధంలో పనిచేశారు. ఆ సమయంలో సింగరేణి కార్మికుల సమస్యలపై వివిధ పోరాటాల్లో పాల్గొన్నారు. పలు సందర్భాలలో ఆయన జైలుకు వెళ్లా రు. టీడీపీలో చేరి మేడారం ఎస్సీ నియోజకవర్గం నుంచి 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2001లో టీఆర్ఎస్లో చేరారు. నాటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పొత్తుతో మేడారం నుంచి తొలి సారిగా, అనంతరం ధర్మపురి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
‘మిషన్ కాకతీయ’ను సవాల్‌గా స్వీకరిద్దాం
దేశానికే ఆదర్శంగా పునరుద్ధరణ చేపడదాం: మంత్రి హరీశ్ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు సూచన మండలానికో చెరువుకు తట్ట మోసేందుకు సిద్ధమని ప్రకటన పనుల్లో నాణ్యత, పారదర్శకత విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయను సవాల్‌గా స్వీకరిద్దామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. చెరువుల పునరుద్ధరణను విజయవంతం చేసి దేశానికే ఆదర్శంగా నిలుద్దామని హితవు పలికారు. శుక్రవారం రాష్ట్రంలోని చిన్న నీటిపారుదలశాఖ ఇంజనీర్లకు లాప్‌ట్యాప్‌లు, సర్వే పరికరాలు అందించే కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రూ.10కోట్ల విలువైన పరికరాలను వారికి అందించారు. ఈ సందర్భంగా మిషన్ కాకతీయ లక్ష్యాలు, ప్రభుత్వ విధానాల గురించి వారికి సూచనలు చేశారు. ‘ఇంజనీర్లకు పని నేర్చుకోవడానికి ఇదో అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని పునరుద్ధరణను సవాల్‌గా స్వీకరించండి. చెరువుల ఎంపిక, పనుల నాణ్యత, అంచనాల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరించండి. సొంతింటి ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అంతే జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగుల పట్ల ఎంత ప్రేమగా ఉంటామో నాణ్యత విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తాం. అనుకున్న సమయంలో పనులు పూర్తిచేయండి. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టండి. అమెరికాలో ఉన్నవారు సైతం తమ గ్రామం పనులను తెలసుకునేలా ఈ వివరాలుండాలి. వాటిపై మా కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చేంత వరకు ఆలస్యం చేయొద్దు. పనుల విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకుండా చూస్తాం’ అని పేర్కొన్నారు. పనుల నాణ్యతపై రాష్ట్ర కార్యాలయంలోని అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, పనుల్లో లోపాలుంటే ఇంజనీర్లదే బాధ్యత అని అన్నారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని, దీన్నొక ప్రజా ఉద్యమంగా మలచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. బుందేల్‌ఖంఢ్‌లో ప్రారంభిస్తామన్నారు... మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి వచ్చేందుకు అంగీకరించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో సైతం ప్రారంభిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలిసిన సందర్భంలో ఉమాభారతి తెలిపారని ఆయన వెల్లడించారు. -
దొంగ జపం చేయడంలో కొంగను మించిన బాబు
అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న అడగలేదేం? చంద్రబాబుపై నిప్పులు చెరిగిన హరీశ్ సిద్దిపేట: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ నేతలు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌వద్ద చేసిన ధర్నాను భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఖండించారు. టీడీపీ నేతలు దొంగ జపం చేయడంలో కొంగలను మించి పోయారని నిప్పులు చెరిగారు. గుడ్డి కొంగ చెరువు ఒడ్డున దొంగ జపం చేసినట్లు చంద్రబాబు.. హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఎన్టీఆర్‌పై ఎంతో ప్రేమ ఒలుకబోస్తు దొంగజపం చేశారని మండిపడ్డారు. శనివారం రాత్రి మెదక్ జిల్లా సిద్దిపేటలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఆయనపై చెప్పులు వేయించి ఆత్మను క్షోభపెట్టిన బాబు సహా టీడీపీ నేతలకు ధర్నా చేసే నైతిక హక్కు లేదన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారతరత్న బిరుదు కోసం ఎందుకు సిఫారసు చేయలేదని ప్రశ్నించారు. పార్లమెంటులో కనీసం ఎన్టీఆర్ ఫొటోను పెట్టడాన్ని వ్యతిరేకించిన ఆయన ఏపీలో వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజాగ్రహానికి గురై ప్రజల దృష్టిని మరల్చేందుకే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరుతో నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బాబు మరో రాష్ట్ర శాసన సభలో తీర్మానించిన అంశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి తెలంగాణ ప్రజల మనసులను గాయపర్చారని చెప్పారు. వెన్నుపోట్లకు, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా మారారని ఎద్దేవాచేశారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిన బాబుకు ఆ పథకాల అమలుపై ప్రశ్నించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. -
అసెంబ్లీని శాసిస్తున్న హరీశ్, కేటీఆర్
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ధ్వజం బండారం బయటపడుతుందనే సస్పెండ్ చేశారు సాక్షి, హైదరాబాద్: శాసనసభను బావ, బావమరుదులు శాసిస్తున్నారని, ఇతర మంత్రులకు మాట్లాడే అవకాశం కల్పించడం లేదని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఏ మంత్రి శాఖ విషయం అయినా తారకరామారావు, హరీష్‌రావు సమాధానాలు ఇస్తూ సభ గౌరవాన్ని మంటగలుపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. టీడీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఎ.రేవంత్‌రెడ్డి, వివేకానంద, పార్టీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సోమవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ శాసనసభ నడుస్తున్న తీరును చూసి మేధావులు, ఉద్యమకారులు అసహ్యించుకునే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ‘నా కూతురునే ప్రశ్నిస్తారా’ అనే నిరంకుశత్వంతో ఎమ్మెల్యేలను వారంరోజుల పాటు సస్పెండ్ చేశారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య తీరుకే విరుద్ధమన్నారు. ఎంపీ కవిత రెండు చోట్ల సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారని నిరూపించే సాక్ష్యాలు ఇచ్చినా, కేటీఆర్ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా, హెరిటేజ్ సంస్థపై విమర్శల మీద వివరాలు ఇచ్చినా స్పీకర్ ఇప్పటి వరకు పట్టించుకోవడంలేదని అన్నారు. సభలో ప్రభుత్వ బండారాన్ని బయటపెడతారన్న భయంతోనే తమ గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. బడ్జెట్లోని లొసుగులు, రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, సీసీఐ, మార్క్‌ఫెడ్ కొనుగోళ్లకు సంబంధించి తాము సభలో చర్చిస్తామని భయపడే వారం రోజుల పాటు సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్సేన్‌సాగర్ వద్ద 100 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తానని, కరీంనగర్‌ను న్యూయార్క్ చేస్తానని ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం ఉన్నదే ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టుకొనేందుకని, రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సస్పెండ్ చేసి కొత్త అంకానికి తెరతీశారని ఎద్దేవా చేశారు. వారం రోజులు సస్పెండ్ చేస్తారా అని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నిస్తే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుపై దాడి చేస్తే కాంగ్రెస్ సభ్యులను రెండేళ్లు సస్పెండ్ చేశారని హోంమంత్రి చెప్పడం విడ్డూరమని విమర్శించారు. తెలంగాణకు చెందిన విద్యాసాగర్‌రావుపై దాడిని హోంమంత్రి సమర్థించడం విచారకరమన్నారు. -
ఫిరాయింపులపై దద్దరిల్లిన అసెంబ్లీ
వాయిదా తీర్మానానికికాంగ్రెస్ సభ్యుల పట్టు ఫిరాయింపులను సీఎం ప్రోత్సహిస్తున్నారంటూ ఆందోళన నల్లబ్యాడ్జీలు ధరించి పోడియం వద్ద నినాదాలు పలుమార్లు వాయిదా పడిన అసెంబ్లీ కాంగ్రెస్ వైఖరిపై మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్‌రెడ్డి మండిపాటు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ బడ్జెట్ పద్దులపై సాగని చర్చ సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సోమవారం రాష్ర్టఅసెంబ్లీ దద్దరిల్లింది. కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో హోరెత్తింది. ప్రశ్నోత్తరాల సమయంలో మొదట రెండుసార్లు వాయిదా పడిన అసెంబ్లీని మధ్యాహ్నం మరోసారి సమావేశపరిచి పద్దులపై చర్చకు ఆహ్వానించినా పరిస్థితి మారలేదు. చివరకు సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టాలని స్పీకర్ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. సీట్లలోనుంచి లేచి పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం టీఆర్ఎస్కు తగదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన కాంగ్రెస్ సభ్యులు.. సీఎం కేసీఆర్ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని పోడియం వద్దకు వెళ్లి పట్టుబట్టారు. ఫిరాయింపులపై చర్చించాలని, పార్టీలు మారిన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత చూద్దామని స్పీకర్ పదేపదే విన్నవించినా సభ్యులు పట్టించుకోలేదు. రాజ్యాంగాన్ని రక్షించాలి, సీఎం డౌన్‌డౌన్, సీఎం రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాలంటూ నినదించారు. దీనిపై మంత్రి కే టీఆర్ మండిపడ్డారు. ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొంటూ ఇందిరాగాంధీ హయాం నుంచి పీవీ నరసింహారావు వరకు జరిగిన ఫిరాయింపులను ప్రస్తావించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ సభ్యులు ఎంతకూ నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ మధుసూదనాచారి మొదట సభను 10 నిముషాలు వాయిదా వేశారు. తిరిగి సభ 10.55 గంటలకు సమావేశమైంది. అయినా కాంగ్రెస్ సభ్యులు శాంతించలేదు. తమకు న్యాయం చేయాలని నినదించారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాంలాల్‌ను అడ్డంపెట్టుకొని దొడ్డిదారిన నాదెండ్ల భాస్కరరావును సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల హోరులో హరీశ్ మాటలు ఎవరికీ అర్థంకాలేదు. గందరగోళం మధ్య సభను రెండోసారి అరగంటపాటు స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 12.20 గంటలకుసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిందని పేర్కొంటూ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. బడ్జెట్ పద్దులను ప్రతిపాదించాల్సిందిగా మంత్రులను కోరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పద్దులను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమాలకు సంబంధించిన పద్దులపై మాట్లాడాల్సిందిగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ను సభాపతి కోరారు. పోడియం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యులతో ఉన్న సంపత్‌కుమార్ అందుకు నిరాకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్ పద్దులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... దీన్నుంచి తప్పించుకునేందుకే ప్రతిపక్ష పార్టీ ఆందోళనకు దిగిందని విమర్శించారు. బడ్జెట్‌ను రాష్ట్రమంతా అభినందిస్తుంటే తట్టుకోలేని ప్రతిపక్షాలు.. అనవసర రాద్ధాంతం చేస్తూ సభా కాలాన్ని వృథా చేస్తున్నాయన్నారు. ఏ సభ్యుడికైనా రాజకీయంగా పార్టీ మారే హక్కు ఉంటుందన్నారు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న నేతలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారో అందరికీ తెలుసని అన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వీడకపోవడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. -
ఉద్యోగులను వెనక్కుపంపడం ఏకపక్షం
అక్కడివారికి తెలంగాణలో పోస్టింగ్‌లు ఇవ్వబోం తెలంగాణ స్థానికులను అక్కడికి పంపలేం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేనికి మంత్రి హరీశ్ లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జోన్ల పరిధిలో ఎంపికై ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న అక్కడి స్థానికత కలిగిన నీటిపారుదల శాఖ ఉద్యోగులను వెనక్కు పంపుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సాకుగా చూపుతూ, ఉద్యోగులపై ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా ఇక్కడికి పంపించారంటూ అభ్యంతరం తెలిపింది. ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులకు తెలంగాణలో పోస్టింగ్‌లు ఇవ్వబోమని, అదే సమయంలో ఏపీ జోన్ల పరిధిలో ఎంపికై తెలంగాణలో పనిచేస్తున్న ఇక్కడి స్థానికత కలిగిన ఉద్యోగులను ఏపీకి పంపలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు ఏపీ నీటి పారుదల శాఖా మంత్రికి సోమవారం ఘాటుగా లేఖ రాశారు. తెలంగాణకు సంబంధించిన 5, 6 జోన్ల పరిధిలో ఎంపికై ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లను సొంతజోన్లకు వెళ్లిపోవాలని ఏపీసర్కార్ రెండురోజుల కిందట ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పెద్దసంఖ్యలో ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణకు రావాల్సి ఉంటుంది. వారంతా చేరితే ఇక్కడి ఉద్యోగుల పదోన్నతుల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశాల దృష్ట్యా వీటిని వెంటనే నిలిపివేయాలని మంత్రి హరీశ్‌రావు లేఖ ద్వారా అభ్యంతరం తెలిపారు. నీటిపారుదలశాఖ వర్గాల సమాచారం మేరకు, ‘మంత్రుల స్థాయి సమావేశం నిర్వహించే వరకు ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం చేయొద్దని గతంలోనే లేఖ ద్వారా కోరినా పూర్తి ఏకపక్షంగా నిర్ణయించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. తుది నిర్ణయం తీసుకునే వరకు బదలాయింపులను ఆపండి. లేనిపక్షంలో ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులకు తెలంగాణలో పోస్టింగ్‌లు ఇవ్వలేం’ అని లేఖలో పేర్కొన్నారు. అదేసమయంలో 1,2,3,4 జోన్లలో ఎంపికై తెలంగాణలో పనిచేస్తున్న ఇక్కడి స్థానిక ఉద్యోగులను ఏపీకి పంపలేమని, వారికి ఇక్కడే పోస్టింగ్‌లు ఇస్తామని లేఖలో కరాఖండీగా చెప్పారు. బలవంతంగా ఇక్కడికి పంపారు : ఏపీ ఉద్యోగులు కాగా ఈ విషయమై సోమవారం సాయంత్రం ఏపీ నుంచి బదిలీపై వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు మంత్రి హరీశ్‌రావును కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. తాము ఏపీలోనే పనిచేయాలని కోరుకుంటున్నా తమ ప్రభుత్వం బలవంతంగా తెలంగాణకు పంపుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఈ విషయమై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశామని స్పష్టం చేశారు. -
మంత్రిలా కాదు.. కార్మికునిలా పనిచేస్తా
మెదక్‌టౌన్: తాను మంత్రిలా కాకుండా కార్మికునిలా పనిచేస్తానని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ మజ్దూర్ యూనియన్(ఆర్టీసీ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి.హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్స్‌లో టీఎంయూ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్న తీరు చరిత్రపుటల్లో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయన్నారు. కార్మికుల హక్కులను కాపాడుతూ, ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఆర్టీసీ విభజన జరిగాక, కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం తక్షణ సాయం కింద ఆర్టీసీకి రూ.250 కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం నిబద్ధతో పనిచేసిన ఆర్టీసీ కార్మికుల రుణం తీర్చుకుంటామన్నారు. ఈనెల 13న జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి అభినందనీయమని, పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, 3 నెలల పాలనలో ఆర్టీసీ కార్మికులకు టీఆర్ఎస్ సర్కార్ ఎంతో చేసిందన్నారు. కొత్త డిపోల ఏర్పాటు, కార్మికుల సంక్షేమం, కొత్త బస్సుల కొనుగోలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షులు థామస్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎం.ఆర్.కె.రావు, మారయ్య, కె.ఎన్.రెడ్డి, జోనల్ కార్యదర్శులు ఆర్.ఎస్.రెడ్డి, శాఖయ్య, మెదక్ డిపో అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీరాజ్, ఆరీఫ్, శంకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు బాబు
జగ్గారెడ్డి తిన్నింటివాసాలు లెక్కించే రకం : హరీశ్‌రావు మెదక్/పాపన్నపేట: వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే, తరువాత స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డేనని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే కాంగ్రెస్, టీడీపీలు ఓటమిని అంగీకరించాయని, అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్, వెంకయ్యనాయుడులు ప్రచారానికి ఎగ్గొట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఎర్రబెల్లి సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని సంప్రదించకుండా సీమాంధ్రులతో బీ ఫాం తెచ్చుకున్న జగ్గారెడ్డికి జనం సమాధి కట్టడం ఖాయమన్నారు. జగ్గారెడ్డి తిన్నింటివాసాలు లెక్కించే రకమని ఆరోపించారు. అనంతరం పాపన్నపేట మండలం ఎల్లాపూర్, మల్లంపేట గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్లతో సాగునీరందిస్తామని చెప్పారు. ఎఫ్ఎన్, ఎం.ఎన్ కెనాళ్లకు పూర్తిస్థాయి సిమెంట్ లైనింగ్ వేయిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: హరీశ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని మంగళవారం టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన సవాల్‌కు మంత్రి స్పందించారు. ఒకవేళ జగ్గారెడ్డి ఓడిపోతే ఎమ్మెల్యే పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని ఆయన ప్రతి సవాల్ విసిరారు. -
ఉప ఎన్నికకు మద్దతు కూడగడుతున్న టీఆర్ఎస్
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని చెబుతున్న టీఆర్ఎస్.. ఆ దిశగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు సమాయత్తమైంది. అందులోభాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో వామపక్షాలు సీపీఐ, సీపీఎం కార్యదర్శలు చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని హరీష్ రావు వారికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ శాసనసభ, మెదక్ పార్లమెంట్ స్థానాల నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిలను బరిలోకి దింపాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాత్రికిరాత్రే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయితే బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. -
పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: హరీశ్‌రావు
అలంపూర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఐదులక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీఎస్ పనులను న్యాయ నిపుణుల కమిటీ నివేదిక మేరకు కేంద్రబలగాలను రప్పించైనా చేయిస్తామని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి కరెంట్‌ను కొనుగోలు చేసి రైతులు ఇబ్బం దులు పడకుండా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. వ్యవసాయానికి ఏడుగంటల కరెంట్‌ను అందించనున్నామన్నారు. -
ప్రాజెక్టులకు సహకరిస్తాం
తెలంగాణకు మహారాష్ట్ర హామీ ‘మహా’మంత్రితో హరీష్‌రావు చర్చలు సఫలం హైదరాబాద్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తామని మహా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సహా లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులకు చెందిన అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రాణహిత బ్యారేజ్ తుది అలైన్మెంట్, ముంపు ప్రాంతం, బ్యారేజ్ ఎత్తు అంశాలపై చర్చించుకునేందుకు ఈ ఏడాది ఆగస్టుకు ముందే అంతర్రాష్ట్ర స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిం ది. సాగునీటి ప్రాజెక్టులకున్న అడ్డంకులను తొలగించుకునే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు నేతృత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం బుధవారం ముంబైకి వెళ్లిం ది. మహారాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్‌తో భేటీ అయిన బృందం లెండి, దిగువ పెన్‌గంగ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై చర్చించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. లెండి ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సహాయ పునరావాసం, పునర్నిర్మాణం అందించేందుకు, హెడ్‌వర్క్‌లను పూర్తి చేసేం దుకు ఒప్పుకొంది. బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో 22 వేల ఎకరాలకు సాగునీరందించే లెండి ప్రాజెక్టును 2015లో పూర్తి చేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం, పెరిగిన అంచనా వ్యయానికి తగ్గట్టు వాటాను చెల్లించేందుకు అంగీకరించింది. బ్యారేజ్ నిర్మాణ అధ్యయనానికి మద్దతు.. దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు చేపట్టేందుకు రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాన్ని తిరిగి ధృవీకరించాలని కోరిన మహారాష్ట్ర అభ్యర్థనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దిగువ పెన్‌గంగ, కింద ప్రతిపాదించిన బ్యారేజ్‌ను ప్రధాన పెన్‌గంగ నుంచి విడదీయాలని, గతంలో చేసిన ప్రతిపాదనలకు కేంద్ర జల సంఘం నుంచి ఆమోదం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా.. మహారాష్ట్ర అంగీకారం తెలిపింది. పెన్‌గంగ డ్యామ్ దిగువన బ్యారేజ్ నిర్మించేందుకు పూర్తిస్థాయి అధ్యయనానికి మహారాష్ట్ర ప్రభుత్వం తమ సమ్మతి తెలిపింది. ప్రతినిధి బృందంలో రాష్ట్ర అటవీశాఖ మం త్రి జోగు రామన్న, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మం త్ షిండే, కోనేరు కోనప్ప, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, నీటిపారుదలశాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రాణహిత చీఫ్ ఇంజనీర్ హరిరామ్, గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్‌రావు ఉన్నారు. -
ప్రభుత్వ నిర్మాణాల్లో రాతి ఇసుక
‘సాక్షి’తో మంత్రి హరీశ్‌రావు ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేస్తాం కృత్రిమ ఇసుక వినియోగంపై ప్రజలకూ అవగాహన కల్పిస్తాం ఇసుక తవ్వకాలపై పటిష్ట విధానం.. మాఫియాకు చెక్‌పెట్టే చర్యలు పూడిక పేరుకున్న చెరువులు, రిజర్వాయర్లు, వాగుల్లో తవ్వకాలకు అనుమతి 2015 ఖరీఫ్ నాటికి 8- 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు హైదరాబాద్: అన్ని ప్రభుత్వ నిర్మాణాల్లో సాధారణ ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుక (రాళ్లను పగలగొట్టి రూపొందించే ఇసుక - రోబో శాండ్)ను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, గనుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో రాతి ఇసుక తయారీని ప్రోత్సహిస్తామని.. దీని వినియోగంపై ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తామని వెల్లడించారు. దీనివల్ల ఇసుక కొరతను నివారించడంతోపాటు ప్రజలకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న ఇసుక విధానంలో చాలా సమస్యలున్నాయని, వాటిని సవరించాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణలో ఇసుక విధానం, సమస్యలు, నీటి పారుదల ప్రాజెక్టులు తదితర అంశాల్లో చేపట్టనున్న పలు చర్యలపై హరీశ్‌రావు ‘సాక్షి’కి పలు వివరాలను వెల్లడించారు. ఈ అంశాలపై ఆయన మాటల్లోనే... ప్రత్యామ్నాయంపై దృష్టి.. రాతి ఇసుక వాడకంపై ప్రజల్లో ఇంకా చైతన్యం పెరగాలి. సాధారణ ఇసుకను వినియోగిస్తే నిర్మాణం ఎంత పటిష్టంగా ఉంటుం దో.. రాతి ఇసుకను వినియోగించినా అంతే పటిష్టంగా ఉం టుంది. ఒకవైపు దళారీ వ్యవస్థను, ఇసుక మాఫియాను నియంత్రిస్తూనే... మరోవైపు ప్రత్యామ్నాయ ఇసుక వాడకంపై దృష్టి కేంద్రీకరిస్తాం. హైదరాబాద్ శివార్లకు దూరంగా ఉన్న కొండ లు, గుట్టల్లో రాతి ఇసుక తయారీకి చాలా అవకాశాలున్నాయి. దీని తయారీ సామర్థ్యాన్ని పెంచుతూనే.. వాడకాన్ని పెంచేం దుకు చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ నిర్మాణాల్లో రాతి ఇసుకనే వినియోగించే విధంగా చర్య లు చేపడతాం. దీనికోసం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇకపై అన్ని ప్రభుత్వ నిర్మాణాల్లో రాతి ఇసుక వినియోగమే ఉంటుంది. వెంటనే నీరిచ్చేవాటికి ప్రాధాన్యత వచ్చే ఏడాది ఖరీఫ్‌నాటికి తెలంగాణ రాష్ట్రంలో కనీసం 8 నుంచి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అందుకోసం ఇప్పకిప్పుడే నీరు అందించగలిగే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా ఈ ఏడాది తీసుకుంటున్నాం. కరువు తీవ్రత ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఆర్డీఎస్, భీమా ఎత్తిపోతల పథకాలకు రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెడితే నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో కలిపి మరో నాలుగైదు లక్షల ఎకరాలకు కొత్తగా నీరివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. వీటితో పాటు చిన్న నీటి వనరులు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. వచ్చే ఖరీఫ్ నాటికి కనీసం 250 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చిన్న నీటి వనరుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. ముందు అనుమతులు తెస్తాం.. ప్రాణహిత-చేవెళ్ల పథకానికి రూ. 35 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే దీన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాకోసం పోరాడుతాం. అంతకంటే ముందు ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులకోసం పనిచేస్తున్నాం. అటవీ, పర్యావరణ, భూగ ర్భ, వాతావరణ శాఖ అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుతో మహారాష్ట్రలో కొంత ముంపు ఉంటుంది. దీనిపై 23వ తేదీన ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. అన్ని అనుమతులు సాధించి.. జాతీయ హోదా కోసం ఒత్తిడి తెస్తాం. ఇసుక విధానంపై అధ్యయనం ‘ఇసుక విధానంపై ఎంపిక చేసిన కొన్ని మండలాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని, సమస్యలను అధ్యయనం చేస్తున్నాం. ఇసుక తవ్వకాలకు జిల్లా కలెక్టర్ మాత్రమే అనుమతి ఇవ్వాలనే నిబంధనల వల్ల పలు సమస్యలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ప్రభుత్వానికి పన్ను రాకు న్నా.. వినియోగదారులకు ఇసుక తక్కువ ధరకు దొరుకుతున్నదా? అంటే అదీ లేదు. ఇసుక తవ్వకాల అనుమతులకు సంబంధించిన అధికారాన్ని రెవెన్యూ అధికారులకు ఇవ్వా లా? లేదా దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటుచేయాలా? అనేదానిపై అధ్యయనం చేస్తున్నాం. భూగర్భజలాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా, వినియోగదారులకు మేలు కలిగే విధంగా మధ్య దళారీ వ్యవస్థను అరికట్టేలా ఇసుక విధానం రూపొందించాలనుకుంటున్నాం. ఇక చెరువులు, రిజర్వాయర్లు, పెద్ద పెద్ద వాగులు కొన్ని పూడికతో నిండిపోయినట్టుగా నివేదికలు వస్తున్నాయి. వాటిల్లో ఇసుక తవ్వకాలకు కొంతకాలం అనుమతిస్తే పూడిక తగ్గిపోయి, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. పారదర్శకంగా టెండర్లు వేసి, ప్రభుత్వానికి ఆదా యం సమకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ఉంది. -
‘ప్రాణహిత’ పై టాస్క్ఫోర్సు
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హరీష్‌రావు హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల పథకానికి జాతీయ హోదా సాధించడానికి టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. వీలైనంత తొందరగా జాతీయహోదా లభించేలా ఈ బృందం కృషి చేస్తుందన్నారు. ఆదివారం వుంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయున వూట్లాడారు. భూగర్భ జల మట్టాన్ని పెంపొందించేందుకు చెక్‌డ్యాంలను నిర్మిస్తామని, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సభాగౌరవాన్ని పెంచే విధంగా శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. సభ జరిగే రోజుల్లో ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యేలా చూస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన హరీష్‌రావును పలువురు మంత్రులు, శాసనసభ్యులు కలసి అభినందించారు. -
సేవకుల్లా పనిచేస్తాం
గజ్వేల్, న్యూస్‌లైన్: నాయకుల్లా కాకుండా సేవకుల్లా పనిచేసి నవతెలంగాణ నిర్మాణానికి కృషిచేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్‌రావు అన్నారు. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంగళవారం ఇక్కడికి వచ్చారు.ఈ సందర్భంగా పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అందరికీ అందేలా ప్రయత్నిస్తామన్నారు. పభుత్వానికి, ప్రజలకు మధ్య పరస్పర విశ్వాసం, సహకారం ఉంటేనే లక్ష్యాలను చేరుకుంటామన్నారు. సమాజం నాకేమి ఇచ్చిందనే భావనతో కాకుండా నేను సమాజానికి ఏం చేశాననే భావనతో ముందుకెళ్లాలని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గజ్వేల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే నియోజకవర్గ ప్రగతిపై తొలి సమీక్ష ఇక్కడ నిర్వహిస్తున్నారని వివరించారు. అభివృద్ధిలో గజ్వేల్‌ను అగ్రభాగాన నిలుపుతామని వెల్లడించారు. గజ్వేల్-సిద్దిపేట తనకు రెండు కళ్లలాంటివని ఉద్ఘాటించారు. అందువల్లే తాను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఇక్కడికే వచ్చానని చెప్పారు. కార్యకర్తల మధ్య పుట్టిన రోజు వేడుకలు హరీష్‌రావు తన జన్మదిన వేడుకలను మంగళవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల మధ్య జరుపుకున్నారు. కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. కార్యక్రమంలో దుబ్బాక, సంగారెడ్డి ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, రఘుపతిరావు, గజ్వేల్ నగర పంచాయతీ 17వ వార్డు కౌన్సిలర్, పట్టణ ముఖ్య నాయకుడు గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్వీ జిల్లా మాదాసు శ్రీనివాస్ తదితరులు పొల్గొన్నారు. -
కాంగ్రెస్సే ధోకా పార్టీ
దొరలంతా ఆ పార్టీలోనే ఉన్నారు కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చింది: హరీశ్‌రావు హైదరాబాద్: తెలంగాణను 60 ఏళ్ల నుంచి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మించిన ధోకాబాజీ పార్టీ మరొకటి లేదని టీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో వ్యతిరేకత ఉన్నా సమైక్య రాష్ట్రంలో కలిపిన నాటి నుంచి పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, 1969లో 369 మందిని కాల్చిచంపడం, 11 మంది టీపీఎస్ ఎంపీలను కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని, 2004లో ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని 10 ఏళ్లు తాత్సారం చేయడం ఇలా .. కాంగ్రెస్ మోసాల చిట్టాకు అంతేలేదన్నారు. అంతేకాక 2009లో తెలంగాణ ప్రకటననుంచి వెనక్కుపోవడం, శ్రీకృష్ణ కమిటీ పేరుతో కాలయాపన.., 12వందల మంది విద్యార్థుల ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మించిన ధోకాబాజీ పార్టీ దేశంలోనే మరొకటి లేదన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రి జైరాం రమేశ్ వ్యక్తిగతంగా సమైక్యవాదిని అని బహిరంగంగా చెప్పారని, అలాంటి సమైక్యవాది తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటారా అని హరీష్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్‌ను దొర అని, టీఆర్ఎస్తో గడీల రాజ్యం వస్తుంది అని విమర్శిస్తున్న కాంగ్రెస్‌లోనే ఎక్కువమంది దొరలు ఉన్నారని హరీష్‌రావు దుయ్యబట్టారు. ఈ విషయంపై జైరాం రమేశ్‌కు అవగాహన లేనట్టుందని ఎద్దేవా చేశారు. దొరలను, దేశాయ్‌లను గెలిపించొద్దని కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా ప్రజలు చేస్తే కాంగ్రెస్‌కు 10 సీట్లు కూడా రావన్నారు. జైరాం రమేశ్ ప్రసంగానికి కాంగ్రెస్ అభ్యర్థులే తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సయయంలో అమెరికాకు పారిపోయిన టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమకారులు ఎవరో, ఉద్యమ ద్రోహులు ఎవరో పొన్నాల స్వంత గ్రామంలోనే తేల్చుకుందామని సవాల్ చేశారు. ప్రజల మధ్య ఉంటూ కేసీఆర్ పోరాడినందువల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ ఉద్యమంలో ఉంటూ ఇబ్బందులు పడుతుంటే, మంత్రి పదవులను అనుభవిస్తూ పొన్నాల, దామోదర రాజనరసింహ వంటివారు అవహేళనగా మాట్లాడిన విషయం ప్రజలకు గుర్తుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నాడని హరీష్‌రావు ఈ సందర్భంగా మండిపడ్డారు. సీమాంధ్రలోనూ అధికారం రాకుంటే చంద్రబాబుకు పిచ్చి పట్టడం ఖాయమని, హైదరాబాద్‌లోని పిచ్చాసుపత్రిలో ఒక గదిని చంద్రబాబుకు కేటాయిస్తామని అన్నారు. జూన్ 2 తర్వాత ఏర్పాటు కాబోయే ప్రభుత్వం టీఆర్ఎస్దేనన్నారు. ఇదిలా ఉంటే మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత సుధాకర్‌రెడ్డి, హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కోడ్ ఉల్లంఘిస్తున్న జానా: నోముల నాగార్జునసాగర్‌లో ఓడిపోతాననే భయంతో మాజీమంత్రి జానారెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఆరోపించారు. తండాల్లో రోడ్లు, అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్నారని చెప్పారు. వీటిపై ప్రశ్నించిన టీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టారని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడుతున్నాడని నోముల విమర్శించారు. -
కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ వెనుకబాటు
మహబూబాబాద్/నర్సంపేట/జనగామ, న్యూస్‌లైన్ : తెలంగాణ అన్ని విధాలుగా వెనుకబడటానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కార ణం.. ఆ పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహబూబాబాద్, నర్సంపేట, జనగామ పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానుకోటలో హరీష్‌రావు మాట్లాడుతూ బయ్యారం లో ఉక్కు పరిశ్రమకు అవసరమైన వనరులు న్నా ఏర్పాటు చేయలేదు.. కేంద్రమంత్రి బలరా మ్ నాయక్ గిరిజనుడై ఉండి, గిరిజన సమస్యలను పట్టించుకోలేదు.. మానుకోట అన్ని విధా ల అభివృద్ధి కుంటుపడటానికి పాలకుల నిర్లక్ష్య మే కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటున్న తరుణంలో పార్టీని బతికించుకోవడానికి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్టం ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం సీపీఐ కూడా ఉద్యమించిందని తెలిపా రు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మానుకోటలో ఐటీడీఏ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఏడాదిలోపే తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సీపీఐ నాయకులు మడత కాళిదాస్, తమ్మెర విశ్వేశ్వరరావు, విజయ్‌సారథి, అజయ్, టీఆర్ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, బానోత్ రవికుమార్, జి.అంజయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి అనిత నెహ్రూనాయక్, శంకర్‌నాయక్, సంగులాల్, నెహ్రూనాయక్, జిన్నారెడ్డి పద్మజ, జేరిపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వారిని గెలిపిస్తే గులాంగిరీ చేస్తరు.. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే చంద్రబాబు వద్ద, కాంగ్రెస్ వారిని గెలిపిస్తే ఢిల్లీలో గులాంగిరీ చేస్తారే తప్ప ప్రజలను పట్టించుకోర ని హరీష్‌రావు విమర్శించారు. నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలవూలలు వేసి నివాళులర్పించిన అనంతరం రోడ్ షోలో మాట్లాడారు. నర్సంపేటలో 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా సర్పంచ్‌లుగా పాలించి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కనీస సౌకర్యాలు కల్పించని మీరు ఏం ముఖా లు పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకుండా టీడీపీ నాయుకులు అడ్డుకుని తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సమగ్రాభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఆయున వెంట పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, సీతారాంనాయుక్, రాంచాం దర్ నాయుక్, శ్రీజానాయుక్, నయీమొద్దీన్, వుర్రి యూదవరెడ్డి, శరత్చంద్ర, ఎంవీ.రావూరావు, నంద్యాల కృష్ణారెడ్డి, మోతె జైపాల్‌రెడ్డి, నారుుని నర్సయ్యు, కావుగోని శ్రీనివాస్, గోనెల రవీందర్, పుట్టపాక కువూరస్వామి, వుచ్చిక నర్సయ్యు, వూజీ సర్పంచ్ గుంటి కిష న్, దార్ల రవూదేవి, గుండె బోరుున కొంరయ్యు, తదితరులు పాల్గొన్నారు. జనగామకు ‘పొన్నాల’ చేసిందేమీ లేదు మంత్రిగా పదేళ్లపాటు కొనసాగిన ప్రస్తుత టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జనగామ అభివృద్ధికి చేసిందేమి లేదు.. ఆడుకుందామంటే క్రీడా మైదానం లేదు.. కూర్చుందామంటే పార్కులేదు.. మోరీలు లేవు.. దోమలను చూసి ఇక్కడోళ్లకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నేత హరీష్‌రావు విమర్శించారు. రాత్రి జనగా మ పట్టణంలోని 1, 11 వార్డుల్లో నిర్వహించి న రోడ్‌షోలో మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం లో భాగంగా తెలంగాణను 24 జిల్లాలుగా.. అందులో జనగామన జిల్లా కేంద్రంగా చేసి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పా రు. కేసీఆర్‌ది కుటుంబపాలన అని విమర్శించే ముందు తన పరిస్థితి ఏమిటో పొన్నాల ఆలోచించుకోవాలన్నారు. కూట్లో రాయి తీయనోడు యేట్లో రాయి తీస్తాడా అని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలకు అవకాశం ఇచ్చాం.. అభివృద్ధి జరుగలేదు.. ఒక్కసారి టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూసిప్తామని హరీష్‌రావు అన్నారు. రైతులకు 8 గంటల కరెంటు, ఎస్టీలకు ఉద్యోగ, విద్యలో 12 శాతం రిజర్వేషన్, మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నాయకులు బక్క నాగరాజు, ఆరుట్ల దశమంత్‌రెడ్డి, ఉల్లెంగల కృష్ణ, ఆలూరి రమేష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి
కొండాపూర్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన ఆభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ఆభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని మల్కాపూర్, గిర్మాపూర్, తొగర్పల్లి గ్రామాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కళాకారుల ఆట పాటల మధ్య గ్రామాల్లో చేపట్టిన ర్యాలీలో హరీష్‌రావుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గారెడ్డికి తెలంగాణ ద్రోహిగా ముద్రపడిందన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులకు ఏజెంటుగా ఉంటూ ఆభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దోచుకొని మన డబ్బులు మనకే పంచడం దారుణమన్నారు. అలాంటి వ్యక్తి బలపర్చిన ఆభ్యర్థులను గెలిపిస్తే ఆంధ్రవాళ్లకు ఓట్లు వేసినట్లేనన్నారు. కొండాపూర్‌కు జెడ్పీ చైర్మన్ అయ్యే ఆవకాశం రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. 2001 నుంచి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, ఎమ్మెల్సీ పదవిని ఆరు నెలలకే త్యాగం చేసిన ఘనత పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణకు దక్కుతుందన్నారు. ఆయన మేనకోడలు నాగరాణి జెడ్పీటీసీ ఆభ్యర్థిగా కొండాపూర్ నుంచి పోటీ చేస్తున్నారన్నారు. ఆమెను గెలిపిస్తే జెడ్పీ చైర్మన్ పదవి రావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆభ్యర్థి పి. నాగరాణి, ఎంపీటీసీ ఆభ్యర్థులు వసంత అంజనేయులు గౌడ్, కౌసల్య జలంధర్, నీరాడివాణి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు మల్లాగౌడ్, మాణిక్‌రెడ్డి, యాదయ్య, అంజిరెడ్డి, శంకర్‌యాదవ్, పి.మల్లేశం, నాగయ్య, నర్సింలు, రాజునాయక్, ఖమ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
టెర్రరిస్టులకు, సీమాంధ్ర నేతలకు తేడా లేదు
సీమాంధ్ర నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నేతలపై దేశద్రోహుల కింద కేసులు నమోదు చేయాలని హరీశ్ రావు బుధవారం హైదరాబాద్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెర్రరిస్టులకు, సీమాంధ్ర నేతలకు కొంచం కూడా తేడా లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నేతలపై డీజీపీ బి.ప్రసాదరావు అనుసరిస్తున్న వైఖరిపై కూడా హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణ నేతలపై డీజీపీ సుమోటో కింద కేసులు బనాయిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అయితే సీమాంధ్ర వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ఈ సందర్భంగా డీజీపీని ప్రశ్నించారు. -
పాలమూరు ప్రగతికి పెద్దపీట
కోయిల్‌కొండ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు అభివృద్ధికి పెద్దపీట వేస్తామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.హరీష్‌రావు అన్నారు. జిల్లాలో వెనకబడిన నారాయణపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అలాగే దళితులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలను అమలుచేస్తామన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు వలస జిల్లాగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. తెలంగాణ రావాల్సిన నీళ్లను కడపకు దొచికెళ్లిన ఘనత సీమాంధ్ర నాయకులకే దక్కిందన్నారు. పక్కనే కృష్ణానది ఉన్నా సాగు, తాగునీటి కోసం ఈ జిల్లా ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకఏర్పాటైతే జిల్లాలోని అన్ని మండలాలకు సాగు, తాగునీటిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ ఊసెత్తని ఎమ్మెల్యేలు సీతమ్మ, దయాకర్‌రెడ్డి ఏ మొఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల రైతులకు వ్యవసాయ విద్యుత్ సక్రమంగా అందించి కాల్వల ద్వారా లక్షల ఎకరాలను సాగునీరు అందిస్తామన్నారు. అనంతరం టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం 14ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోయిల్‌కొండ మండలాన్ని మహబూబ్‌నగర్ నియోజవకవర్గంలో కలిపేందుకు కృషిచేస్తామన్నారు. ఈ సందర్భంగా మండలంలోని మల్కాపూర్, కోయిల్‌కొండ, పారుపల్లి, కోత్లాబాద్, సురారం, అభంగపట్నం తదితర గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు టి.హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, దేవరిమల్లప్ప, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యారాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో దోపిడీ జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: సమైక్యరాష్ట్రంలో ప్రైవేట్‌రంగం దోపిడీకి గురైందని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ప్రైవేట్ ఉద్యోగుల గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 83 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలు కోల్పోతే ప్రైవేట్ రంగంలో సీమాంధ్రుల దోపిడీకి అంతేలేకుండాపోయిందన్నారు. భూములు తెలంగాణవి ఉద్యోగాలు ఆంధ్రవి, కాలుష్యం తెలంగాణకు దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలుచేసిన తెలంగాణ ఏర్పడటం ఖాయమన్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థలను రద్దుచేస్తామన్నారు. ప్రైవేట్‌రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. టి.ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం ప్రారంభం తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల నూతన కార్యాలయాన్ని టి. హరీష్‌రావు ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన టీజేఏసీ రాష్ట్ర కోచైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకుంటున్న ద్రోహులకు నిలువనీడ లేకుండా చేస్తామన్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేక తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐక్యంగా ఉండి తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, సయ్యద్ ఇబ్రహీంలు మాట్లాడుతూ.. తెలంగాణ సాధించే వరకు టీఆర్ఎస్ విస్మరించదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి తీరుతామని, రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా టీఆర్ఎస్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శాంతిభూషణ్, నర్సింహా, బెక్కం జనార్దన్, డాక్టర్ సి.అమరేందర్, జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కన్వీనర్ రామకృష్ణగౌడ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
టి. బిల్లు విమానంలో కాకుండా ఎడ్లబండిలో తీసుకు వస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు తెలంగాణ బిల్లును యుద్ద విమానంలో తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం తెలుగువారిపై యుద్దం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు శుక్రవారం హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ బిల్లును విమానంలో కాకపోతే ఎడ్లబండిలో తీసుకువస్తారా అంటూ చంద్రబాబును హరీష్ రావు ప్రశ్నించారు. మామ ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచినప్పుడు అసెంబ్లీ స్పీకరుని తుని నుంచి హెలికాఫ్టర్‌లో తీసుకురాలేదా లేకుంటే ఆ సంగతి మరిచిపోయావా అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబుకు ఓ విధానం అంటూ లేదని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ సమైక్యాంధ్ర అంటే చంద్రబాబు కూడా సమైక్యాంధ్ర అంటూ వారిని కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పార్టీ తోక పార్టీటా మారిందని వ్యాఖ్యానించారు. -
స్పష్టమైన ప్రకటన రాకుంటే తెలంగాణ అగ్నిగుండమే: హరీష్‌రావు
నేటి సాయంత్రంలోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖుత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ ఓ రోజు బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో హరీష్‌రావు మెదక్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాయలతెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ దిమ్మలను కూల్చివేస్తామని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ పుటకోమాటమారుస్తుండటం పట్ల హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు హైదరాబాద్ నగరంతో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేకాని ఇతర ప్రాంతాలను తెలంగాణలో కలిపితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. -
సంపూర్ణ తెలంగాణ కావాలి
కొల్లాపూర్, న్యూస్‌లైన్: హైదారాబాద్‌పై పూర్తి హక్కులు కలిగిన సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు విశ్రమించేది లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు టి. హరీష్‌రావు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ మునిగిపోయే పార్టీ అని అన్నారు. చంద్రబాబు వైఖరి టీడీపీ నాయకులకే అర్థం కావడం లేదన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు బాబు అన్నివిధాలా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండల పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి టి.హరీష్‌రావుతో పాటు ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే. గోయల్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మా ఆంధ్ర, మీ తెలంగాణ అంటూ ప్రకటనలు చేయడం ఆయన వివక్షపూరిత ధోరణికి నిదర్శనమన్నారు. చిత్తూరు జిల్లాకు రూ.5800కోట్లు తాగునీటి కోసం కేటాయించిన సీఎం పాలమూరు జిల్లా కు అందులో పదిశాతమైన కేటాయించారా? అని ప్రశ్నించారు. దీనికి సీఎంతోపాటు చంద్రబాబు కూడా సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని త్యజించిన జూపల్లి కృష్ణారావును వచ్చే ఎన్నికల్లో 70వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో మళ్లీ జూపల్లికి మంత్రి పదవి దక్కుతుందని హరీష్‌రావు అన్నారు. దోచుకోవడమే సమన్యాయమా? అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే.గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలోని వనరులన్నింటి నుంచి సీమాంధ్ర వారు లబ్ధిపొందుతున్నారని అన్నారు. మా వనరులన్నీ దోచుకోవడమే సమన్యాయమా? అని ప్రశ్నించారు. భద్రా ద్రి రాముడిని కూడా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారా వు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదన్నారు.ప్రజల అమాయకత్వాన్ని ఆస రాగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందుతున్న ఆంధ్రా పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. కే సీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ వి ఠల్రావుఆర్యా, ఇంతియాజ్, నాయకులు కొత్తా రాంమోహన్‌రావు, కృష్ణప్రసాద్, రాంచంద్రారె డ్డి, బాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, గడ్డం శేఖర్యాద వ్, హన్మంతునాయక్, లక్ష్మి, రమాదేవి, రామన్‌గౌడ్, రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌పై తెలంగాణకే హక్కు నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు సమన్యాయం పేరుతో కప్పదాటు వ్యవహారం చేస్తున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు టి. హరీష్‌రావు విమర్శించారు. పూటకో మాట, రోజుకో లేఖ ఇస్తూ తెలంగాణకు అడ్డంకిగా మారారని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్‌లో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిలది పూర్తి అవకాశవాదమని, ఏపీఎన్జీఓల నాయకుడు అశోక్‌బాబు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టంచేశారు. టీజీ. వెంకటేష్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని హరీష్‌రావు అన్నారు. హైదారాబాద్ చుట్టూ ఉన్న భూములు, అక్రమ వ్యాపారాలపై ప్రేమతోనే ఆ విధంగా మాట్లాడుతున్నట్లు ఆరోపించారు. తెలంగాణ బిల్లును శాసనసభకు పంపితే ప్రోరోగ్ కాకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ మంత్రిగా రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుపై ఉందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తప్పనిసరి అని, నాగర్‌కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా ఏర్పడుతుందని చెప్పారు. పాలమూరు జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకుని చేసిన అభివృద్ధి రైతుల ఆత్మహత్యలేనని ఎద్దేవాచేశారు. సీఎం కిరణ్ గోదావరి నీటిని దమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా దోచుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి, జక్క రఘునందన్‌రెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రం విడిపోతుంటే అవతరణ వేడుకలెందుకు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోతున్నప్పుడు అవతరణ వేడుకలు ఎందుకని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత టి.హరీష్‌రావు ప్రశ్నించారు. నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ సందర్భంగా రూ. 45 కోట్ల ఖర్చుతో ప్రకటనలు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఆయన మండిపడ్డారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రావతరణ వేడుకలకు రూ.25 కోట్లతో పత్రికలకు ప్రకటనలు, రూ. ఐదు కోట్లతో టీవీ ప్రకటనలకు తోడు మరో రూ.15 కోట్లతో వివిధ ప్రాంతాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లాలు, వివిధ శాఖల ప్రకటనల ఖర్చులు కలిపితే ఈ మొత్తం దాదాపు రూ. వంద కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. రాష్ట్రావతరణ వేడుకల పేర ఖర్చు చేసే నిధులతో వరద కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సూచించారు. కిరణ్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు.. వాటిని నిబంధనల ప్రకారమే జారీ చేశారా అన్న దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం, పత్తి పంటను ప్రభుత్వమే పారసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాలని, పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.పదివేల సాయం అందజేయాలన్నారు. తుపానులు, వరదలు, కరువు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఒకలా.. తెలంగాణ ప్రాంతంలో మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఆరోపించారు. -
ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం: హరీష్‌రావు
తెలంగాణవాదులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని నిరసిస్తూ సోమవారం విద్యుత్ సౌథ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతుందని అన్నారు. ఆ ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హరీష్‌రావు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు విద్యుత్ సౌథలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.