స్పష్టమైన ప్రకటన రాకుంటే తెలంగాణ అగ్నిగుండమే: హరీష్రావు
నేటి సాయంత్రంలోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖుత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ ఓ రోజు బంద్కు పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో హరీష్రావు మెదక్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాయలతెలంగాణ అంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ దిమ్మలను కూల్చివేస్తామని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ పుటకోమాటమారుస్తుండటం పట్ల హరీష్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు హైదరాబాద్ నగరంతో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేకాని ఇతర ప్రాంతాలను తెలంగాణలో కలిపితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు.