హైదరాబాద్: పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్ కమిటీలపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు బుధవారం అసెంబ్లీలో ప్రకటించనున్నారు. ఒక్కొ కమిటీలో 9 మంది సభ్యులుండే అవకాశం ఉందని సమాచారం. అయితే రైతు బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని హరీష్ రావు తెలిపారు. అవసరం ఉన్న ప్రతి చోట శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామన్నారు.