‘బయ్యారం’పై సమగ్ర నివేదిక ఇవ్వండి
అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కీలకమైన టాస్క్‌ఫోర్స్ నివేదికను సమగ్రంగా రూపొందించాలని నీటిపారుదల, భూగర్భ వనరుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భూగర్భ వనరుల శాఖ అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో ముడి ఇనుము లభ్యతపై ప్రస్తుతం భూగర్భ వనరుల శాఖ అధ్యయనం చేస్తోంది. అయితే బయ్యారంలో ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితం కాకుండా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నమూనాలు సేకరించడం ద్వారా ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావాల్సిందిగా ఇటీవల కేంద్రం సూచించింది.
దీంతో సమగ్ర అధ్యయనానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు మంత్రికి వివరించారు. కాగా, వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్రంలో ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించారు.