steel factory
-
స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. ఉవ్వెత్తున ఎగిసిన అగ్ని కీలలు..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. కాస్మారాలో ఉన్న రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్ నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఘటనాసమయంలో దాదాపు 100 మంది కార్మికులు ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. కాగా మంటల్లో కాలి ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు వేగంగా వ్యాపించాయి. కాగా.. మంటల్లో కాలి పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. పేలుడుకు సంబంధించిన కారణాలు ఉంకా తెలియలేదు. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
ఏపీలో రూ.350 కోట్లతో ఆర్జాస్ స్టీల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో ఉన్న ఆర్జాస్ స్టీల్ (గతంలో జెర్డావ్ స్టీల్) రెండు ప్లాంట్లను విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్లాంటు సామర్థ్యాన్ని 25–30 శాతం పెంచుతోంది. ఇందుకోసం రూ.350 కోట్లు పెట్టుబడి చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులు. నాణ్యతను మెరుగుపరిచేందుకు జర్మనీ నుంచి కాక్స్ సైజింగ్ బ్లాక్‌తోపాటు కాయిల్ రూపంలో ప్రత్యేక స్టీల్ ఉత్పత్తికై గ్యారెట్ కాయిలర్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త స్టవ్‌ల స్థాపనతోసహా స్టీల్ శుద్ధి సామర్థ్యం పెంచుతున్నారు. అలాగే పంజాబ్‌లోని మండి గోవింద్ఘర్ ప్లాంటు వార్షిక సామర్థ్యం ప్రస్తుతం ఒక లక్ష టన్నులు. దీనికి రూ.260 కోట్ల వ్యయంతో 60–70 శాతం సామర్థ్యం జోడిస్తున్నారు. మొత్తం ఈ రెండు ప్లాంట్లకుగాను రూ.610 కోట్ల పెట్టుబడి చేస్తుండగా.. సామర్థ్యం 5.5 లక్షల టన్నులకు చేరనుంది. 2025 నాటికి ఈ విస్తరణ పూర్తి అవుతుందని ఆర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తి వెల్లడించారు. వాహన రంగానికి అవసరమైన ప్రత్యేక స్టీల్ రెండు ప్లాంట్లలోనూ తయారవుతోంది. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలకు వీటిని కంపెనీ సరఫరా చేస్తోంది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
Russia-Ukraine war: రష్యా చేతికి మారియుపోల్
కీవ్: ఉక్రెయిన్‌లో వరుస ఎదురుదెబ్బలతో డీలా పడ్డ రష్యాకు ఎట్టకేలకు చిన్న ఊరట. కీలక రేవు పట్టణం మారియుపోల్‌పై రష్యా సైన్యాలు పూర్తిగా పట్టు సాధించాయి. దాదాపు మూడు నెలల పోరాటంలో రష్యాకు చిక్కిన అతి పెద్ద నగరం ఇదే! వాస్తవానికి అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీ మినహా నగరమంతా ఎప్పుడో రష్యా గుప్పెట్లోకి వెళ్లింది. ఫ్యాక్టరీలో దాగున్న ఉక్రెయిన్ సైనికులు మాత్రం రెండు నెలలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆహారం తదితర వనరులన్నీ నిండుకోవడంతో ఇక పోరాడలేక వారంతా సోమవారం నుంచి లొంగుబాట పట్టారు. అది బుధవారంతో ముగిసిందని రష్యా ప్రకటించింది. 959 మంది లొంగిపోయినట్టు వెల్లడించింది. వారిని బస్సుల్లో డోన్బాస్లో వేర్పాటువాదుల అధీనంలోని ఒలెనివ్కా నగరానికి తరలించారు. ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా వారికి ఉక్రెయిన్ కూడా మంగళవారమే పిలుపునిచ్చింది. ఖైదీల మార్పిడి కింద వారిని తమకు అప్పగిస్తారని ఉక్రెయిన్ భావిస్తుండగా, రష్యా మాత్రం కొందరినైనా యుద్ధ నేరాల కింద విచారిస్తామని చెబుతోంది. దాంతో లొంగిపోయిన వారి భవితవ్యంపై అయోమయం నెలకొంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసిన అత్యాధునిక ఆయుధాలతో కూడిన పలు నిల్వలను ధ్వంసం చేసినట్టు రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ చెప్పారు. వాటిలో ఎం777 హొవిట్జర్లు తదితరాలున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యా విడుదల చేసింది. చరిత్రాత్మక క్షణం: నాటో చీఫ్ మారియుపోల్ చిక్కిన ఆనందంలో ఉన్న రష్యాకు మింగుడు పడని పరిణామం చోటుచేసుకుంది. నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్లాండ్ బుధవారం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్నాయి. దీన్ని చరిత్రాత్మక క్షణంగా నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ అభివర్ణించారు. ‘‘ఈ క్షణాన్ని వదులుకోబోం. ఆ రెడు దేశాలకు తక్షణం సభ్యత్వం ఇచ్చేందుకు చర్యలు చేపడతాం’’ అని ప్రకటించారు. మామూలుగా ఏడాది పట్టే దరఖాస్తు పరిశీలన ప్రక్రియను రెండు వారాల్లో ముగించాలని నాటో నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఫిన్లండ్, స్వీడన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రష్యా మరోసారి హెచ్చరించింది. అయితే అమెరికా, ఇంగ్లండ్‌తో పాటు పలు నాటో దేశాలు ఇందుకు దీటుగా స్పందించాయి. దరఖాస్తులు ఆమోదం పొందేలోపు ఆ దేశాలపై రష్యా దుందుడుకు చర్యలకు దిగితే వాటికి అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని ప్రకటించాయి. వాటి చేరికకు మొత్తం నాటో సభ్య దేశాలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. టర్కీ వ్యతిరేకత నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నాటోలో చేరే ఉద్దేశం లేదని ఆస్ట్రియా వెల్లడించింది. ప్రతీకార చర్యల్లో భాగంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. ఉక్రెయిన్ పునరుద్ధరణకు 950 కోట్ల డాలర్ల రుణం మంజూరు చేయాలని యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించింది. ఉక్రెయిన్‌కు ఇప్పటికే 410 కోట్ల యూరోల సాయాన్ని సేకరించినట్టు కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. సైనికుడి నేరాంగీకారం యుద్ధ నేరాల విచారణ ఎదుర్కొంటున్న ఓ రష్యా సైనికుడు తనపై మోపిన అభియోగాలను అంగీకరించాడు. ఫిబ్రవరి 28న సమీ ప్రాంతంలో కార్లో కూర్చుని ఉన్న ఓ నిరాయుధ ఉక్రెయిన్ పౌరున్ని తలలో కాల్చి చంపినట్టు సార్జెంట్ వడీం షిషిమారిన్ (21) వెల్లడించాడు. -
ఆ రంగానికి కలిసొస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న యుద్ధం భారత ఉక్కు పరిశ్రమకు కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ దాడుల వల్ల కలిగిన సరఫరా అంతరాన్ని భర్తీ చేయడానికి భారతదేశంలోని ఉక్కు తయారీదారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. కానీ, ఎగుమతి పరంగా మన దేశ వాటా చాలా తక్కువ. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు యూరప్ దేశాలకు ఎక్కువగా ఉక్కును ఎగుమతి చేస్తాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్దం కొనసాగుతుండటం వల్ల ఉక్కు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేసేందుకు దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్(జెఎస్పీఎల్) తెలిపిన వివరాల ప్రకారం.. సరఫరా అంతరాయం వల్ల గత నెలలో ఉక్కు ధరలు 20 శాతం పెరగడంతో ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా ప్రాంతంలో ఉక్కు కొరత ఉంది. ఆ సరఫరాను భారతదేశం, పాక్షికంగా చైనా పూడ్చుతుంది" అని వి.ఆర్. శర్మ బ్లూమ్ బెర్గ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ కలిపి ఏడాదికి 44-45 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తాయని బ్రోకింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. రష్యా ఒక్కటే యూరప్‌కు 14-15 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తోంది. బెంచ్‌మార్క్ ధర మార్కెట్లో ఫిబ్రవరి 18 నాటికి హాట్ రోల్డ్ కాయిల్ స్టీల్ టన్నుకు 947 డాలర్లు ఉండేది. కానీ, మార్చిలో ఆ ధర టన్నుకు 1205 డాలర్లకు చేరుకుంది.. యూరప్‌లోని చాలా కంపెనీలు స్టీల్ ధరను పెంచడం ప్రారంభించాయి. దీంతో ఎగుమతి ధర పెరిగింది. భారతీయ కంపెనీలు టన్నుకు 1150 డాలర్ల ధరతో యూరప్‌కు ఉక్కును సులభంగా పంపగలవని, ఇది యూరప్‌లో నడుస్తున్న ధర కంటే దాదాపు 100 డాలర్లు తక్కువ అని వి.ఆర్. శర్మ చెప్పారు. ప్రస్తుతం భారత ఉక్కు పరిశ్రమ టన్నుకు దాదాపు 1000 డాలర్ల రేటుతో ఉక్కును ఎగుమతి చేస్తోందని ఆయన చెప్పారు. గత సంవత్సరం మన దేశ ఉక్కు & ఇనుప ఖనిజం ఎగుమతులలో దాదాపు మూడవ వంతు ఐరోపా దేశాలకు కంపెనీలు ఎగుమతి చేశాయి. ప్రధానంగా ఇటలీ, బెల్జియం, నేపాల్ & వియత్నాంలకు భారతదేశం 2021లో 20.63 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది. ఉక్కు సరఫరా కొరతను తీర్చడానికి భారతీయ ఉక్కు తయారీదారులు ఐరోపాకు రవాణాను పెంచాలని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్దం వల్ల ఏర్పడిన సరఫరా కొరత వల్ల ప్రస్తుతం దేశీయ అమ్మకాలు 25 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. (చదవండి: మార్కెట్లోకి మరో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే రేంజ్!) -
తెలంగాణలో సుగ్న మెటల్స్ రెండో ప్లాంట్ ఏర్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉక్కు తయారీ కంపెనీ సుగ్న మెటల్స్ తెలంగాణ వికారాబాద్‌లోని పరిగిలో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే ప్రాంతంలో సుగ్న 2008లో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టర్బో టీఎంటీ రాడ్లతో పాటూ ఉక్కు తయారీలో వినియోగించే బిల్లెట్లు, స్పాంజ్ ఐరన్ వంటివి కూడా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఉక్కు తయారీ, పటిష్టతను వివరించేందుకు వివిధ విభాగాల్లోని ఇంజనీర్లతో కలిసి సుగ్న మెటల్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) నితిన్ జైన్, ప్లాంట్ ఇంచార్జీ అజయ్ కుమార్ తదితరులు ప్లాంట్‌ను సందర్శించారు. -
సీమను ఉద్ధరిస్తున్నట్టు పెద్ద బిల్డప్
-
పని తక్కువ.. ఆర్భాటం ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ఉత్తుత్తి స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేసి చంద్రబాబు మరొక డ్రామాకు తెరలేపారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు బాబుపై జీవీఎల్ ట్విటర్లో స్పందించారు. రాయేగా పోయేదేముందని శంకుస్థాపన చేశారని వ్యంగంగా మాట్లాడారు. ఇటువంటి అమలుకు నోచుకోని ‘చంద్రన్న శంకుస్థాపన రాళ్లు’ రాయలసీమలో చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అసలు గనుల వివరాలను అధ్యయనం చేయకుండా, పొందుపరచకుండా రాయలసీమ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో పని తక్కువ.. మోసం, ఆర్భాటం ఎక్కువని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఒక రాయి పడేసి రాయలసీమను ఉద్ధరిస్తున్నట్లు పెద్ద బిల్డప్ ఇస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టాస్క్‌ఫోర్స్‌లో డిసెంబర్ 17న ఇవ్వని వివరాలు, కేంద్రం లేఖ చంద్రబాబు మోసానికి ఆధారాలు అని రెండు పేజీలను ట్విటర్లో జీవీఎల్ అప్లోడ్ చేశారు. వీటిపైన పనిచేయకుండా శంకుస్థాపన చేయడం డ్రామానే అవుతుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇనుప ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లను గుర్తించినట్లు జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వజ్రపు గనుల ఆనవాళ్లను గుర్తించినట్లు జీఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం.శ్రీధర్ తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రగతిలో తమ శాఖ పలు కీలక ఆవిష్కరణలు చేసిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ పలు ఖనిజ నిక్షేపాలను గుర్తించిందన్నారు. ఈ మేరకు 2016–17 సంవత్సరానికి సంబంధించి నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఐరన్ ఓర్ నిక్షేపాలను తాము సర్వే ద్వారా గుర్తించామన్నారు. ఇవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆర్నకోండ ఎర్రబాలి బ్లాక్, చందోలి, అంబారీపేట బ్లాకులు, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని రబ్బనపల్లి, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గురిమల్ల, దబ్రీపేట, అబ్బాపూర్, మల్లంపల్లిలో 89.22 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలను తాము కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడే ఇనుము తయారీలో వాడే ముడి మాగ్నటైట్ నిక్షేపాలు సైతం ఉన్నాయని తెలిపారు. అయితే వీటితో నాణ్యమైన స్టీలును తయారు చేయలేమని చెప్పారు. కానీ వీటిని చిన్న చిన్న ఐరన్ పెల్లెట్ల తయారీకి వినియోగించవచ్చని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. రాష్ట్ర విభజన హామీల్లో ముఖ్యమైన బయ్యారం స్టీలు ఫ్యాక్టరీకి ఈ నిక్షేపాలు ఊతంగా నిలుస్తాయని అన్నారు. దీంతో బయ్యారం స్టీలు ఫ్యాక్టరీపై పోరాడుతున్న ప్రభుత్వానికి ఇది మంచి పరిణామమని ఆయన అభివర్ణించారు. ఆంధ్రాలో వజ్రపు నిక్షేపాలు.. అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో తక్కువ నాణ్యతగల ముడి వజ్రపు నిక్షేపాల ఆనవాళ్లు (కింబర్లేట్ పైప్)ను కనుగొన్నట్లు తెలిపారు. వీటిని శుద్ధి చేసి ఒక క్యారెట్ నాణ్యతగల వజ్రాలు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. -
వైవీయూ జ్ఞానభేరి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి కడప : ప్రస్తుతం మారుతున్న కాలంలో విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని.. తద్వారా వినూత్న ప్రయోగాలతో సత్ఫలితాలను ఆవిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. మంగళవారం సాయంత్రం యోగి వేమన యూనివర్సిటీలో జ్ఞానభేరి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ పిల్లలు ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కంప్యూటర్ కాలంలో ఎక్కడ చూసినా డిజిటలైజేషన్ కనిపిస్తోందని.. విద్యార్థులు కూడా ఒక విజన్ ప్రకారం ముందుకెళితే విజయం సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతి అంశం కూడా ప్రస్తుతం రియల్ గవర్నెన్స్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వయా డాట్ కామ్ మంత్రను వినియోగిస్తున్నామని.. దీనిపై నాయకులతోపాటు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. రానున్న 2050 నాటికి అనేక అంశాలకు సంబంధించిన టార్గెట్లు పెట్టుకున్నామని.. ప్రపంచంలో అన్ని అంశాల్లోనూ నెంబర్ వన్‌గా మనమే ఉంటామని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడేలా ప్రయోగాలు చేసేందుకు ఆలోచనలు చేయాలని పేర్కొన్నారు. కలలు కనండి.. నిజం చేసుకోండి.. కాని పక్షంలో అమలు చేయడానికి నేనుంటానని బాబు పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన కేంద్రం అన్ని విధాలా రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ఏ ఒక్క అభివృద్ధి విషయంలో కూడా మేలు చేయలేదని సీఎం దుమ్మెత్తిపోశారు. కడపలో ఖనిజ వనరులతోపాటు కరెంటు, భూమి, నీరు, రోడ్లు అన్నీ ఉన్నా ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని విమర్శించారు. నాలుగేళ్లపాటు ఎదురుచూశామని, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం కేంద్రం నుంచి రాకపోవడంతో తామే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని సంకల్పించినట్లు బాబు తెలిపారు. అందుకు సంబంధిం చి ఈనెల 27వ తేదీన ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ‘ఫాతిమా’ విద్యార్థులకు న్యాయం చేస్తాం కడపకు సంబంధించి ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. అవసరమైతే వైద్య విద్యకు ప్రభుత్వమే గ్రాంటు ఇచ్చి వారి సమస్యను పరిష్కరించేలా ఆలోచిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు రాష్ట్రంలో ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామని.. మరొకమారు గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు కృషి చేస్తామని సీఎం తెలిపారు. రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లా, కరువుతో అల్లాడిపోతున్న జిల్లాల్లో నీటిని పారిస్తామని.. తద్వారా సస్యశ్యామలం చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి అండదండగా ఉంటూ ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కృషి జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు సుమారు రూ. 25 కోట్లు అవసరమవుతుందని.. మంజూరు చేయాలంటూ ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో ఏర్పాటుకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ హరి కిరణ్, వైస్ చాన్స్‌లర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి, జేసీ కోటేశ్వరరావు, స్పెషల్ సెక్రటరీలు ఆదిత్యనాథ్‌దాస్, గిరిజాశంకర్, ఉన్నత విద్యాశాఖకమిషనర్ సుజాతశర్మ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు, కార్యదర్శి వరదరాజన్, అధికారులు కోటేశ్వరరావు, వెంకట్ ఈదర్, టెక్సాస్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కర్బారి, డాక్టర్ అశ్వంత్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వర్లు, అవధాని గరికపాటి నరసింహారావు, సినీ గాయకుడు గంగాధర్‌శాస్త్రి పాల్గొన్నారు. -
20నుంచి కడప ఉక్కు..ఆంద్రుల హక్కు ఉద్యమం
-
ఉక్కు ఉద్యమంపై విరిగిన లాఠీ
సాక్షి కడప/సెవెన్‌రోడ్స్ : వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ జాప్యానికి నిరసనగా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం.. పోలీసుల లాఠీచార్జితో ఉద్రిక్తంగా మారింది. ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులు, జెండాలు పట్టుకుని ర్యాలీగా తరలివచ్చారు. సుమారు అరగంటపాటు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, సంఘాల నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విద్యార్థి సంఘాల నేతలను అదుపు చేయడం కష్టతరంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. విద్యార్థి నాయకుడికి తీవ్ర గాయాలు విద్యార్థి నేతలందరినీ అరెస్టు చేసిన పోలీసులు.. విద్యార్థులను ఈడ్చి పడేశారు. లాఠీచార్జిలో వైవీయూకు చెందిన ఎస్ఎఫ్ఐ నాయకుడు నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్న అతన్ని వెంటనే కడప రిమ్స్ తరలించారు. తీవ్రంగా గాయపడి ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల లాఠీచార్జిని అధికార బీజేపీ, టీడీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలూ ఖండించాయి. ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఉక్కు పరిశ్రమ కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా అక్కడే ఉద్యమబాటలో ఉండగా.. కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆందోళనలో పాల్గొన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం జరిగే ప్రతి పోరాటానికి వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నా ఇప్పటి వరకూ ఏర్పాటు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, చంద్రబాబు ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసగించారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా కేంద్రంతో కలిసి అధికారాన్ని పంచుకున్న టీడీపీ.. నేడు ఉక్కు పరిశ్రమ కోసమంటూ దొంగ ఆందోళనలు చేపడుతోందని ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, వైఎస్సార్ స్టూడెంట్ ఫెడరేషన్, ఎన్ఎస్యూఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు విద్యా సంస్థల బంద్ ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ శనివారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పాటించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం SFI నేతల పాదయత్ర
-
తాడిపత్రి స్టీల్ ఫ్యాక్టరీలో విషాదం ఆరుగురు మృతి
-
తాడిపత్రి స్టీల్ ఫ్యాక్టరీలో విషాదం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో గురువారం విషాదం అలముకుంది. స్థానిక గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీలో విష వాయువు విడుదల కావడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. పెద్దగదిలో పది మంది కార్మికులు పని చేస్తుండగా విష వాయువు విడుదలైనట్లు తెలిసింది. దీంతో ఆ వాయువును పీల్చిన వారిలో రంగనాథ్, మనోజ్, లింగయ్య, గంగాధర్, వసీమ్, గురవయ్యలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని మిగిలిని కార్మికులు హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, సకాలంలో లోపాలను సవరించకుండా నిర్లక్ష్యం చేయడంతోనే విషవాయువు లీకైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు. కార్బన్ మోనాక్సైడ్ లీకవటంతో ప్రమాదం జరిగిట్టు ప్రాథమిక సమాచారం. 400 చదరపు అడుగుల గదిలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా లీకైనట్టు తెలుస్తోంది. తొలుత ముగ్గురు మృతి చెందగా, వారిని కాపాడేందుకు వెళ్లి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారందరూ నిరుపేదలుగా తెలుస్తోంది. ఉపాధి కోసం వారు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. పనికి వెళ్లిన వారు విగతజీవులు కావడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి తాడిపత్రి స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం ప్రకటించారు. విష వాయువు బారినపడిన బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను తాడిపత్రి ఆసుపత్రిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పైలా నరసింహయ్య, రమేశ్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం, ఒక ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో ఉద్రిక్తత గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన టీడీపీ నేత జిలాన్ బాషాను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
‘బయ్యారం’పై గవర్నర్‌కు వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని హామీలను అనుసరించి ప్రభుత్వపరంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని మంజూరు చేయాలని అఖిలపక్ష నేతలు బుధవారం గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. బయ్యారంలోని లక్షా 54 వేల ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్ అనే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిన సందర్భంలోనే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వొద్దని, వారికిచ్చిన లీజును రద్దు చేయాలని ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ డిమాండ్ చేస్తే అన్ని పార్టీలు బలపరచాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద నాటి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురవుతున్నందున ఖమ్మం జిల్లాకు ఉక్కు పరిశ్రమను ఇస్తామని చట్టంలో చేర్చిందని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని చెప్పడం విభజన హామీలను తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర ప్రజల ఆకాంక్షగా కేంద్రానికి తెలియజేయాలని కోరారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్.రమణ (టీటీడీపీ), ఎం.కోదండరాం (టీజేఎస్), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (టీపీసీసీ), కె.దిలీప్‌కుమార్ (టీజేఎస్), దొమ్మాటి వెంకటేశ్వర్లు (తెలంగాణ ఇంటి పార్టీ), కె.రవిచంద్ర (తెలంగాణ ప్రజాఫ్రంట్), జె.జానకీరాములు (ఆర్ఎస్పీ), సాదినేని వెంకటేశ్వర్రావు (సీపీఐ ఎంఎల్), భూతం వీరన్న (సీసీఐ ఎంఎల్) తదితరులు ఉన్నారు. -
సీఎం రమేష్‌కు గిన్నిస్ రికార్డ్ రావడం ఖాయం
-
మహిళలపై నేరాల్లో మనం నంబర్ 1
సాక్షి, అమరావతి: మహిళలపై జరుగుతున్న నేరాల్లో మన రాష్ట్రం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండటం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై మానభంగాలు, టీజింగ్, ఇంట్లో వేధింపులు పెరిగాయని చెప్పారు. సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రికి ఆంధ్ర ప్రదేశ్ హోంగార్డులు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. అర్ధరాత్రి మహిళలు సురక్షితంగా ఇంటికి రావాలని మహాత్మా గాంధీ అన్నారని, స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఆచరణలో ఇప్పటికీ సాధించుకోలేకపోయామని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి కమిటీ వేశామని, భవిష్యత్తులో ఏ ఆడబిడ్డనైనా మానభంగం చేసే దుర్మార్గులకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మహిళలపై వేధిం పుల కేసుల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల ఆస్తులను పరిరక్షించేందుకు లా అండ్ ఆర్డర్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని, ప్రతినెలా పోలీస్ స్టేషన్ల వారీగా క్రైమ్ బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించారు. హోంగార్డులకు పక్కా ఇళ్లు రాష్ట్రంలో హోంగార్డులకు కోరుకున్న చోట, వారు ఉండే చోటే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను పాదయాత్ర చేసినప్పుడు హోంగార్డులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటానికి శ్రీకారం చుట్టానని, రాష్ట్రానికి న్యాయం చేసే వరకూ కేంద్రాన్ని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. తాము కట్టే పన్నుల నుంచి ఇన్సెంటివ్‌గా కేంద్రం డబ్బులు ఇస్తే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టుకుంటామని తెలిపారు. హోంగార్డులవి చిన్న బతుకులు: ఏఆర్ అనూరాధ చాలీచాలని జీతాల నుంచే తమ ఖర్చులకు కొంత ఉంచుకుని ఎక్కడో ఉన్న తమ కుటుంబాలకు నగదు పంపే చిన్న చిన్న బతుకులు హోంగార్డులవని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డులు తాము విధులు నిర్వహించే పట్టణాల్లో అద్దెలు భరించలేక, గ్రామాల్లో నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతుంటారని అన్నారు. ప్రతి పోలీస్ అధికారి పక్కన హోంగార్డు లేకపోతే పని నడవదని, వారి కోసం అందరూ ఆలోచించాలని కోరారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు హోంగార్డులు చప్పట్లు, కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఏపీ హోంగార్డు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.గోవింద్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏవై ప్రసాద్, ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లతో ఉక్కు పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు
వైఎస్సార్ జిల్లా: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ వల్ల ఉక్కు కర్మాగారం వచ్చే పరిస్థితి లేదని రాజంపేట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి విమర్శించారు. సుండుపల్లిలో ఆకేపాటి విలేకరులతో మాట్లాడుతూ..సిగ్గు లేకుండా 25 ఎంపీ సీట్లు ఇవ్వండంటున్నచంద్రబాబు 19 ఎంపీలు ఉంటే ఏమి చేయగలిగాడని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలిచ్చిన ఇరు పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండి నాలుగు సంవత్సరాలుగా కాపురం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం అనుకూలత అనుమతులు ఇవ్వాలి.. అలా ఇవ్వకుండా కేంద్రంపై ఆరోపణలు చేస్తూ రాజకీయ దీక్షలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్సార్ ఉక్కు కర్మాగారం మంజూరు చేస్తే వాటిని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడని చెప్పారు. చంద్రబాబుకు వైఎస్సార్ కలలోకి కూడా గుర్తుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఉక్కు కర్మాగారం పేరుతో దీక్షలు చేసి విమర్శించడం సిగ్గు చేటని అన్నారు. రెండు సార్లు రాజ్యసభకు ఎంపికైనా ఏనాడూ ఉక్కు కర్మాగారం గురించి పార్లమెంటులో నోరు మెదపని వ్యక్తి సీఎం రమేష్ అని తూర్పారబట్టారు. నాడు ఉక్కు కర్మాగారానికి అడ్డుపడిన చంద్రబాబు నేడు దొంగదీక్షలు అంటూ మోసం చేస్తున్నాడని..అలాంటి బాబు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోవాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని వ్యాఖ్యానించారు -
దీక్షలా హ..హ..హ..!
-
వైఎస్ఆర్ జిల్లా బంద్ చేపట్టిన వైఎస్ఆర్సీపీ,వామపక్షాలు
-
మెకాన్ తుది నివేదిక తరువాతే ఉక్కు ఫ్యాక్టరీపై ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: మెకాన్ సంస్థ ముసాయిదా నివేదిన సమర్పించిన తరువాతే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై తదుపరి ప్రకటన చేయగలుగుతామని, అప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట ప్రకటన చేయలేమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు గురువారం కూడా కేంద్ర మంత్రిని కలసి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి, ముడిసరుకు సరఫరాపై వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి ఒక్కరే విడిగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై మెకాన్‌కు పూర్తి సమాచారం ఇవ్వాలని టీడీపీ ఎంపీలకు సూచించానన్నారు. సదురు సంస్థ ముసాయిదా నివేదిక సమర్పించిన అనంతరం టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమై చర్చించాక తదుపరి ప్రకటన చేయగలుగుతామన్నారు. ప్లాంట్ ఏర్పాటుపై నాలుగేళ్లుగా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందన్న టీడీపీ విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయాలనుకుంటే ఇన్నిసార్లు కమిటీలు నియమించి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అవకాశాలపై ఎందుకు అధ్యయనం జరిపిస్తామని ఆయన ప్రశ్నించారు. ‘1966లో మా రాష్ట్రం (హరియాణా) ఏర్పడింది. ఇప్పటికి కూడా మా రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. అలాంటిది నాలుగేళ్లకే ఏపీ సమస్యలు పరిష్కరించలేదని చెప్పడం సరైందికాదు’ అని కేంద్ర మంత్రి అన్నారు. టీడీపీ ఎంపీల అభ్యర్థన మేరకు ఎంపీ రమేశ్‌తో కేంద్ర మంత్రి ఫోన్లో మాట్లాడి దీక్ష విరమించాలని సూచించారు. అంతకుముందు టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఎకరం రూ. నాలుగు లక్షలకు ఇస్తామని, రైల్వేలైన్‌కు అయ్యే ఖర్చులు భరిస్తామని కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెకాన్‌కు ఇవ్వాలని ఆయన సూచించారన్నారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ విషయంలో కాలయాపన చేస్తోందని విమర్శించారు. 24 గంటల్లో మెకాన్‌కు వివరాలిస్తామని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కావాలని కోరగా ఆయన తిరస్కరించారంటూ టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. అయితే ప్రధాని గురువారం ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. -
చంద్రబాబు పాలనంతా అవినీమయం
-
‘ఆయన మాటలు బీజేపీకి వినిపించడం లేదా’
సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదేమో కానీ, అప్పులమయం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 94 వేల కోట్లు ఉన్న అప్పును రెండు లక్షలకు తీసుకెళ్లడం అభివృద్దా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. ఉక్కు కర్మాగారం కోసం వామపక్షాలు పోరాడితే అరెస్టులు చేయించారని, కానీ ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఈ 29న కడప బంద్‌కు పిలుపునిచ్చామని.. అందరు సహకరించాలన్నారు. విశాఖలో భూకుంభకోణంపై సిట్ దర్యాప్తు ఎప్పటివరకు చేస్తారన్నారు. ఈ కుంభకోణాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారనే బయపెట్టడం లేదా అని ప్రశ్నించారు. వారం రోజులు గడువిస్తున్నామని.. ఒకవేళ నివేదిక బయటపెట్టకపోతే ఉద్యమిస్తామన్నారు. కార్మికుల, గిరిజన, విద్యార్ది ఉద్యోగల సమస్యపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్దమవుతున్నాయన్నారు. అన్ని వర్గాలతో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. జూలై 8 విశాఖలో కార్మికులు సమస్యలపై సభ ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది.. ఇసుక మాఫియా పెరిగిపోయింది.. అధికార పార్టీ నాయకులే భూదందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా జూలై 2న నీలం రాజశేఖర్ రెడ్డి శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతపురంలో ప్రారంభమయ్యే ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రజలను కేంద్రప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఫ్యుజుబులిటీ ఉన్నా రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో పరిశీలించమని ఉందనడం దారుణమన్నారు. కడప ఉక్క పరిశ్రమ వస్తుందని బీజేపీ మాటలాడుతోందని.. పీయూష్ గోయల్ అన్నమాటలు బీజేపీ వాళ్లకి వినిపించడం లేదా ప్రశ్నించారు. -
దీక్షలు చేస్తున్న వారే నాటి పర్సంటేజీల దోషులు
-
పర్సంటేజీల కోసం ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకున్నారు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లాలో ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం గొడవ చేస్తున్న వారే పర్సంటేజీల కోసం గతంలో అడ్డుకున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తీవ్రారోపణ చేశారు. జిందాల్ కంపెనీ అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పుడు అందులో వారికి వాటాలొచ్చే నిబంధనలు లేవనే భావనతో ఫ్యాక్టరీనే రాకుండా అడ్డుపడ్డారని పవన్ స్పష్టమైన ఆరోపణ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి ఆదివారం రాత్రి ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..తనకున్న సమాచారం మేరకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని జిందాల్ కంపెనీ ముందుకొచ్చిందన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ కావాలని గొడవ చేస్తున్న టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కొందరు.. ఆ జిందాల్ కంపెనీ ప్రతిపాదన వాళ్లకు అనుకూలంగా, లాభం కలిగించేదిగా లేదని అప్పుడు పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పుకోలేదని చెప్పారు. టీడీపీకి చెందిన వ్యక్తులకు లాభం కలిగే పరిస్థితులు లేనప్పుడు ఫ్యాక్టరీ అనుమతులు నిరాకరించడం.. వాళ్లకు లాభంగా ఉంటుందని అనుకున్నప్పుడే ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతి తెలపడం వంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పుడున్నాయని వివరించారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంలో, టీడీపీ నేతల్లో ద్వంద విధానం కనిపిస్తోందన్నా్డరు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి..ఇప్పుడు గొడవ చేస్తున్న వారికి లబ్ధి చేకూరే పరిస్థితి ఉంటే తప్ప ఆ ఫ్యాక్టరీ మొదలు కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితులు లేకుండా పోతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, ప్రాంతీయ విభేదాలు సైతం తలెత్తే పరిస్థితులు ఏర్పడ్డయ్యాన్నారు. అరాచక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛమైన పాలన ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన చూస్తుంటే చేసిన తప్పులనే మళ్లీ చేస్తున్నారు తప్పితే సరిదిద్దుకునే పరిస్థితులు లేవన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైఎస్సార్ కడప జిల్లాలో ఈ నెల 29వ తేదీన ప్రతిపక్షాలు నిర్వహించే బంద్‌కు వామపక్షాలు, జనసేన పార్టీ మద్దతు, సంఘీభావం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. -
సీఎం రమేశ్‌ది ఉక్కు దీక్ష కాదు..డొక్కు దీక్ష
-
టీడీపీది కార్పొరేట్ దీక్ష
సాక్షి, కడప కార్పొరేషన్ : ‘అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు’ అలాంటిది దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడక్కుండానే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారని, కొప్పర్తిలో రెండో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని తలంచారని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేశారు. ఆ రెండు ఉక్కు పరిశ్రమలు ఏర్పాటై ఉంటే జిల్లా అభివృద్ధిలో ఢిల్లీ, ముంబయి, కలకత్తాల సరసన ఉండేదని చెప్పారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం శనివారం స్థానిక పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్ఆర్సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. హోదా వస్తే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయని భావించి వైఎస్ జగన్ గుంటూరులో ఏడు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. హోదా వద్దు ప్యాకేజీ చాలునని మోదీ, అరుణ్‌జైట్లీకి సన్మానాలు చేసిన చంద్రబాబుకు హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్ఆర్సీపీకి మైలేజీ వస్తుందనే కేంద్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్నట్లు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రమేష్ పార్లమెంటులో ఏనాడు ప్రజా సమస్యలపై మాట్లాడిన చరిత్ర లేదన్నారు. హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే టీడీపీ నాయకులు అవి ఆమోదం పొందవని దుష్ప్రచారం చేశారన్నారు. నిన్న వారి రాజీనామాలు ఆమోదమయ్యాయని, ఇప్పుడు టీడీపీ వారు మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ చేస్తోంది కార్పొరేట్ దీక్ష అని వైఎస్సార్సీప నేతలు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు మాసీమబాబు, సుధాకర్‌రెడ్డి, తుమ్మలకుంట శివశంకర్, ఆర్వీఎస్రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్, మాజీ అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, చల్లా రాజశేఖర్, బంగారు నాగయ్య, నాగేంద్రారెడ్డి, బోలా పద్మావతి, పత్తి రాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, రఘునాథరెడ్డి, ఉత్తమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే చాలా నష్టం: ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే ప్రజలకు చాలా నష్టమని పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఛంబల్‌లోయ దొంగలముఠా తరహాలో టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారన్నారు. ఏడేళ్లుగా రాజ్యసభలో ఉండి ఉక్కు పరిశ్రమపై మాట్లాడని సీఎం రమేష్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. జిలాకు అన్యాయం చేస్తున్నారు: గోవిందరెడ్డి జిల్లా ప్రజలు టీడీపీకి ఓట్లు వేయలేదని చంద్రబాబుకు కోపమని, అందుకే అభివృద్ధి జరక్కుండా పట్టుబట్టి అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆరోపించారు. జిల్లాలో రెండు ఉక్కు పరిశ్రమలు నెలకొల్పాలని వైఎస్ కలలుగన్నారని, బ్రహ్మణి శంకుస్థాపన సమయంలో టీడీపీ వాళ్ల కళ్లు పడితే దిష్టి తగులుతుందనే బూడిద గుమ్మడికాయ కొట్టారన్నారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకూడదని చంద్రబాబు, కొన్ని పత్రికలు పనిగట్టుకొని వార్తలు రాశాయని గుర్తు చేశారు. కలిసిరమ్మంటే ఎగతాళి చేశారు: నారాయణ ఉక్కు పరిశ్రమ కోసం చేసే పోరాటానికి కలిసి రావాలని టీడీపీ నాయకులను కోరితే ఉక్కు పరిశ్రమ సాధ్యమేనా, పోరాటాలు చేస్తే ఫ్యాక్టరీ వస్తదా అని ఎగతాళి చేశారని ఉక్కు సాధన ఐక్యవేదిక కన్వీనర్ బి. నారాయణ అన్నారు. వారికి సిగ్గూ, శరం ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి ఉద్యమంలోకి రావాలన్నారు. టీడీపీ వాళ్లు ఏం చేస్తున్నారో, వారికైనా అర్థమవుతుందా.: మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏం చేస్తున్నారో, వారికైనా అర్థమవుతుందా...అని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఎద్దేవా చేశా రు. ఆనాడు ప్యాకేజీయే బాగుంది అన్నవారు నేడు ప్రాణాలైనా అర్పిస్తామంటూ దీక్షలు చేయడం హాస్యాస్పదమన్నారు.వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు నలిగిపోయారు:రఘురామిరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నలిగిపోయారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే తెల్లారినట్లు చంద్రబాబు హోదా, ఉక్కు ఫ్యాక్టరీ అంటున్నారని ఎద్దేవాచేశారు. జిల్లాకు 19 సార్లు వచ్చిన సీఎం ఒక్కసారైనా ఉక్కుఫ్యాక్టరీ గురించి మాట్లాడారా అని నిలదీశారు. చంద్రబాబు ఉండగా ఉక్కు పరిశ్రమ రాదని టీడీపీ నాయకులే చెబుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ది చెందింది సీఎం రమేష్, శ్రీనివాసులరెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, మేడా మల్లికార్జునరెడ్డిలేనన్నారు. రోజుకు కోటి రూపాయలు ఖర్చు పెట్టి టీడీపీ చేస్తున్నది కార్పొరేట్ దీక్ష అని విమర్శించారు. సీఎం రమేష్‌కు దమ్ముంటే కడప పార్లమెంటుకు పోటీ చేయాలని సవాల్ విసిరారు. డిపాజిట్ తెచ్చుకుంటే తాను ముక్కు, చెవులు కోసుకుంటానన్నారు. వైఎస్ఆర్సీపీకి ద్రోహం చేసిన వారికి పుట్టగతులుండవని హెచ్చరించారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ఘనాపాటి: రవీంద్రనాథ్‌రెడ్డి కళ్లార్పకుండా అనర్గళంగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాల్లో అయితే ఇలాంటి వారి నాలుక కోయడంగానీ, ఉరితీయడం గానీ చేస్తారన్నారు. వైఎస్ ఎవరి అంచనాలకు అందని విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించారన్నారు. కొప్పర్తి వద్ద రెండో ఉక్కు పరిశ్రమ కోసమే మద్దిమడుగు రిజర్వాయర్ ఏర్పాటు చేశారన్నారు. బీజేపీ, టీడీపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశాయన్నారు. సీఎం రమేష్ చంద్రబాబుకు బినామీ అని, ఎంతసేపు ఆయన సంపాదించేవాడేగానీ, సాధించేవాడు కాదని ఎద్దేవా చేశారు. 300 షుగర్ ఉన్న ఆయన నాలుగురోజులైనా ఇంత చెలాకీగా ఎలా ఉన్నారో అర్థం కాలేదన్నారు. బెంగళూరులో బీటెక్ రవి చేసే ఘనకార్యాలేంటో ప్రజలకు తెలుసన్నారు. -
ఉధృతంగా ఉక్కు పోరు
సాక్షి ప్రతినిధి, కడప/ప్రొద్దుటూరు టౌన్: వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన దిశగా ఉధృత పోరుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయ్యింది. ఈ మేరకు ఈనెల 29న అఖిలపక్షంతో కలిపి రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉక్కు పరిశ్రమ సాధనకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు ప్రొద్దుటూరులో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్వగృ హంలో గురువారం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో సజ్జల సమావేశం అయ్యా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 23న కడపలో భారీ ఎత్తున ధర్నా, 24న బద్వేలు, 25న రాజంపేటల్లో ధర్నాలు చేస్తామని తెలిపారు. జమ్మలమడుగులో 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మహాదీక్ష చేపడుతున్నామని చెప్పారు. అఖిలపక్షంతో కలిసి 27న రహదారుల దిగ్బంధం, 29న రాష్ట్ర బంద్ చేస్తామన్నారు. ఇక్కడ చేసే ప్రతి ఉద్యమం ఢిల్లీలో వినపడేలా చేస్తామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకుంది టీడీపీనే.. ‘‘టీడీపీది స్వార్థ రాజకీయం...దుర్మార్గపు ఆలోచన.. ఆ నాడు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుని, నేడు ఆమరణ దీక్ష చేస్తున్నారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ ఏనాడు ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తని టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ స్థాపించాలని 48 గంటలు నిరాహార దీక్ష చేసిన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరవింపజేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ మొక్కవోని దీక్షతో అన్ని పార్టీలను కలుపుకొని పోరాటాలు చేస్తోందన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నిరాహార దీక్ష కూడా పోరాటంలో ఒక దశ అన్నారు. పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్సార్సీపీ తీసుకుంటుందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీపై పేటెంట్ హక్కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. కడపలో ఉక్కుపరిశ్రమ అనే ఆలోచన ఎవ్వరూ చేయని సమయంలోనే దానికి వాస్తవ రూపం ఇచ్చే ప్రయత్నం వైఎస్ చేశారని తెలిపారు. ఆ కర్మాగారాన్ని స్వార్థపూరిత రాజకీయాలతో, దుర్మార్గపు ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందన్నారు. వైఎస్ మరికొద్దికాలం బతికున్నా ఈ సమయానికి ఉక్కు పరిశ్రమ రన్నింగ్‌లో ఉండేదన్నారు. దాదాపు లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి దక్కేదని తెలిపారు. టీడీపీ డ్రామాలను ప్రజలు చూస్తున్నారు.. విభజన చట్టంలో పొందుపర్చిన ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ పట్టించుకోలేదని సజ్జల అన్నారు. ఇప్పుడు టీడీపీ తామే చాంపియన్లమని చెప్పుకోవడానికి తాపత్రయ పడటం విడ్డూరమన్నారు. ఈ జిల్లా వాసులకు ఎవరు ఏమి చేశారు, ఎవరి హయాంలో అభివృద్ధి పనులు చేపట్టారన్నది తెలుసునన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి గండికొట్టి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎవరు నమ్ముతారని, టీడీపీ డ్రామాలు అందరూ గ్రహిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక కేంద్రం మెడలు వంచి స్టీల్ ఫ్యాక్టరీని వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఉక్కు పరిశ్రమ పనులు 2019లో మొదలై 2020–21 కల్లా ఫ్యాక్టరీలో ఉత్పత్తి మొదలవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎస్బి అంజాద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, అమరనాథరెడ్డి, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేల్ సమన్వయకర్తలు, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. మా ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం: రాచమల్లు ఉక్కు పరిశ్రమ సాధన కోసం వైఎస్సార్ జిల్లాకు చెందిన తమ ఎమ్మెల్యేలు ఏడుగురు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధమేనా? అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సవాల్ విసిరారు. గురువారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పుట్టపర్తి సెంటర్లో తాను చేపట్టిన 48గంటల దీక్ష విరమణ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారన్నారు. అందులో జిల్లాకు చెందిన వైఎస్ అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారన్నారు. జిల్లాలో 9మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు అమ్ముడుబోగా వైఎస్సార్సీపీలో ఏడుగురు ఉన్నారని తెలిపారు. టీడీపీ వద్ద ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిపి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, దొంగదీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్ ఉన్నారన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్షం ఈ 13 మందితో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసేందుకు సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. తొలిగా సంతకం చేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పదవుల ద్వారా వచ్చే విలువ, గౌరవం కంటే జిల్లా బిడ్డల భవిష్యత్తే తమకు ముఖ్యమన్నారు. రాజీనామాకు ఎంపీ సీఎం రమేశ్ సిద్ధమా? అని ప్రశ్నించారు. అఖిలపక్షం తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా కట్టుబడి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వెనుకబడింది వైఎస్సార్ జిల్లానేనని తెలిపారు. ఇలాంటి జిల్లాపై ప్రధాని మోదీకి ఎందుకు అంత పగ అని ప్రశ్నించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. 25 మంది ఎంపీలను తనకు ఇస్తే ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ సాధిస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు ఆయన వద్ద 19మంది ఎంపీలను పెట్టుకుని ఏమీ చేశారని ప్రశ్నించారు. 25మంది ఎంపీలను వైఎస్ జగన్‌కు ఇస్తే ఇవన్నీ సాధిస్తారన్నారు. ఇవి రాకపోతే తామంతా రాజకీయాలు వదిలేస్తామన్నారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి దీక్ష
-
ఆరేళ్లుగా పట్టించుకోకుండా నేడు దీక్షలా!
సాక్షి, ప్రొద్దుటూరు టౌన్ : ఆరేళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సీఎం రమేష్ ఏనాడు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మాట్లాడలేదని, నేడు ఆమరణ దీక్ష అంటూ డ్రామా ఆడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పుట్టపర్తి సర్కిల్లో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ఎమ్మెల్యే బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే నిరుద్యోగ సమస్య పరిష్కరమవుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని తలచారన్నారు. ఆయన బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించారన్నారు. దీనికి రూ.1700 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. అయితే చంద్రబాబు కోర్టులో కేసు వేయడంతో పరిశ్రమ ఆగిపోయిందన్నారు. వైఎస్సార్సీపీ అన్ని పార్టీలను కలుపుకొని జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉద్యమాలను చేసిం దని తెలిపారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెయిల్ ప్రభుత్వ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల్లో అన్ని అంశాలపై పోరాడింది వైఎస్ జగన్ ఒక్కరే అని తెలిపారు. ఆరేళ్లుగా రాజ్యసభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ పార్లమెంట్లో ఈ ప్రాంతం గురించి, ఉక్కు పరిశ్రమ స్థాపనపై గళం విప్పలేదన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నాటకాలు ఆడుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏ పార్టీ పోరాడుతోందో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, 29న రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. నాలుగేళ్లుగా మాయమాటలు చెప్పారు నాలుగేళ్లుగా చంద్రబాబు మాయమాటలు చెప్పి కేంద్రంతో సంసారం చేశారని వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు అన్నారు. ఎన్నికలు వస్తుండటం, జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. పార్లమెంట్లో సీఎంరమేష్ ఏ రోజన్నా జిల్లాకు ఉక్కు పరిశ్రమ కావాలని ప్రశ్నించారా? అని అన్నారు. ఎప్పుడు కాంట్రాక్టర్లు చేసుకుని డబ్బు ఎలా దోచుకుందుకే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నా రు. తమ ఎంపీలు మొదటి నుంచి ఉక్కు పరిశ్రమ కోసం మాట్లాడుతునే ఉన్నారన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు నాటకమాడుతూ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ బద్వేలు సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలే రాష్ట్ర విభజనకు కారణమన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన స్టీల్ ప్లాంట్‌ను ఇవ్వలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు కావాల్సిన ఖనిజం మన వద్ద ఉందని తెలిపారు. -
స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసేవరకూ దీక్ష ఆగదు
-
మోదీ,బాబు కలిసి కడపకు అన్యాయం చేశారు
-
సీఎం రమేష్ ఈ నాలుగేళ్లు ఎక్కడికెళ్లావ్
సాక్షి, కడప కోటిరెడ్డి సర్కిల్ : స్వార్థ రాజకీయాల పేరుతో దొంగ దీక్షలు చేపట్టి రాయలసీమ ప్రజలను మోసగించొద్దు. ఈ నాలుగేళ్లలో మీ పుణ్యమా? అని రాయలసీమ నాశనం అయిందని, ఈ ప్రాంత అభివృద్ధి అంశాలపై ఏ చర్చకైనా సిద్ధమా? అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. శనివారం కడపలోని వైఎస్సార్ మొమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. రాయలసీమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కడపను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.దీనిని తిప్పి కొట్టడానికి రెండు కోట్ల జనాభా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. నాలుగేళ్లుగా సీఎం మొదలుకుని టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కడపలో ఉక్కుఫ్యాక్టరీ సాధ్యం కాదని పలు వేదికలపై చెప్పి ఇప్పుడు ఏర్పాటుకు కేంద్రం వ్యతిరేకిస్తోందని నెపం వేస్తే సహించేది లేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమను మేం బాధ్యతగా తీసుకుంటాం. వైఎస్సార్ జిల్లాలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఉదాహరణకు దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేసిన ఏపీ కార్ల్, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు, మైదుకూరుల్లోని పాలకర్మాగారాలు, దాణా ఫ్యాక్టరీ, తెలుగు గంగ, హాంద్రీ నీవా ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమ అభివృధ్ధిపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలని సీఎం రమేష్‌కు విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. నాలుగేళ్లుగా ఉక్కుఫ్యాక్టరీ గురించి ఏ మాత్రం పట్టించుకోని మీరు ఇప్పుడు తగుదునమ్మా అంటూ దీక్షలు చేస్తామనడం సిగ్గు అనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నామన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా ప్రకటించే ధైర్యం టీడీపీకి ఉందా? పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, జమ్ముకాశ్మీర్‌లు రెండో రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని, అదే తరహాలో రాయలసీమలో రెండో రాజధానిని 30 రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పించి ఏర్పాటు చేయించగలరా? అని సవాల్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారధి,గోసుల శ్రీనివాసరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల శ్రీనాధరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానీరెడ్డి, తదితరులు పాల్గొని మాట్లాడారు. -
కడపలో వైఎస్ఆర్సీపీ అధ్వర్యంలో ఉక్కు పోరాటం
-
ఉక్కుకర్మాగారం నిర్మించి తీరుతాం
సాక్షి, కొత్తగూడెం: ఆరు నూరైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి తీరుతామని ఐటీ, పురపాలక మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బయ్యా రంలో ఉక్కు కర్మాగార ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. కేవలం మాటల ప్రభుత్వంగానే కేంద్రం మిగిలిపోతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఎంతో దూరంగా ఉన్న విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పా టు సాధ్యమైనప్పుడు, అతి తక్కువ దూరంలో ఉన్న బయ్యారంలో ఎందుకు సాధ్యం కాదని ఆయ న ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఈ కర్మాగార ఏర్పాటుపై కేంద్రంతో పలు దఫాలుగా చర్చించామని, చివరకు రైల్వే లైను నిర్మాణంలో సగం నిధులను రాష్ట్రప్రభుత్వమే భరించేటట్టుగా ముందు కొచ్చినా కేంద్రం దీనిపై ఒక్క అడుగు ముందుకు వేయలేదని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం ముందుకు రాకున్నా సింగరేణి, ఇత ర స్థానిక ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల సహకారం తో ఆరు నూరైనా జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి తీరుతామని ఉద్ఘాటించారు. అలాగే.. ఉద్యోగాల్లో స్థానిక యువతకే ప్రాధాన్యం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో విమానాశ్రయ నిర్మాణం ఏర్పాటు జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని, దీనివల్ల మారుమూల ప్రాంత ప్రజల చెంతకే న్యాయం చేరుతుందన్నారు. గత 40 ఏళ్ల లో జరగని అభివృద్ధి ఈ నాలు గేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందన్నారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని దేశంలోనే మిన్నగా తీర్చిదిద్దుకుంటామని, దీని కి అందరూ సహకరించాలని కేటీఆర్ కోరా రు. సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సింగరేణి, ఐటీసీ, జాన్‌డీర్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రిని అడ్డుకున్న విద్యార్థులు పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను మైనింగ్ కళాశాల విద్యార్థులు అడ్డుకున్నారు. శిలాఫలకం వద్దకు దూసుకొచ్చి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్ విద్యార్థుల వద్దకు వచ్చారు. కళాశాలకు సరిపడా అధ్యాపకులు లేరని, సౌకర్యాలు సరిగా లేవని, ఒక్క కంపెనీ నుంచి కూడా ప్లేస్మెంట్ ఇప్పించలేదని విద్యార్థులు వాపోయారు. ఒకసారి కళాశాలను సందర్శించాలని డిమాండ్ చేశారు. దీంతో కేటీఆర్ మాట్లాడుతూ సమస్యను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పినా.. విద్యార్థులు వినకుండా నినాదాలు చేయడంతో మణుగూరు పర్యటన ఆలస్యం అవుతోందంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. -
కడప ఉక్కు - రాయలసీమ హక్కు
-
ఉక్కు ఫ్యాక్టరీ కోసం బంద్: వైఎస్ఆర్సీపీ నేతలు అరెస్ట్
-
ప్రభుత్వం ఉక్కుపాదం - సడలని సంకల్పం
సాక్షి, కడప : ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్సీపీ కార్యకర్తలు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. తెల్లవారుజామునుంచే వైసీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. బస్సులను డిపోలు దాటి రాకుండా అడ్డుకున్నారు. ఈ ఆందోళనల్లో ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, ఆర్సీపీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే వైసీపీ నాయకులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. శాంతి యుతంగా చేపట్టిన బంద్‌ను అణచివేయడానికి జిల్లా వ్యాప్తంగా అదనపు బలగాలను రంగంలోకి దించింది. ఎక్కడ పడితే అక్కడ బంద్‌లో పాల్గొన్నవారిని బలవంతంగా అరెస్టు చేశారు. రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం నేతలు నారాయణ, ఆంజనేయులులు పోలీసులు నిర్భందించారు. కడపలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న యువజన విభౠగం రాష్ట్ర కార్యదర్శి పాకా సురేష్, విద్యార్థి నేత ఖాజా రహంతుల్లాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టులపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేతలు శాంతియుతంగా బంద్ చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని మర్చిపోయిందని విమర్శించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటుందని ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం అడ్డుకున్నంత మాత్రానా ఉక్కుపోరాటం ఆగదని అంజాద్బాష, సురేష్‌బాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పిలుపుతో "కడప ఉక్కు- మాహక్కు" అంటూ పెద్దఎత్తున ప్రజలు, యువత బంద్‌లో పాల్గొన్నారు. రాయచోటిలో వైసీపీ నేతల అరెస్టు ఉక్కు కర్మాగారం కోసం తలపెట్టిన బంద్ రాయచోటిలో విజయవంతంగా జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర బీసీ యువజన నాయకులు మదన్మోహన్ రెడ్డి, విజయభాస్కర్, ఇతర పార్టీల శ్రేణులు ఆర్టీసీ డిపో ఎదుట భైఠాయించారు. కడప ఉక్కు, రాయలసీమ హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిపో వద్దకు చేరుకున్న పోలీసులు నిరసనకారులకు నోటీసులు జారీ చేశారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. బద్వేలులో విద్యాసంస్థల స్వచ్ఛంద మూసివేత : ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజలనుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్చందంగా మూసివేశారు. యువత తమ భవిష్యత్తు బాగుండాలంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టితీరాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరుమామిళ్ల, కలసపాడు మండల పార్టీ నేతలు బంద్‌లో పాల్గొన్నారు. -
ఉక్కుపై గళమెత్తిన అఖిలపక్షం
కడప కార్పొరేషన్ : విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఈనెల 25న నిర్వహించే బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వైఎస్ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో ‘ఉక్కు సాధన ఐక్యవేదిక’ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షులు బి. నారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమకు కావలసిన అన్ని రకాల ఖనిజాలు జిల్లాలో ఉన్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగాలంటే ఉక్కు పరిశ్రమ కావాలని దివంగత వైఎస్ఆర్ బ్రహ్మణి స్టీల్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయిందన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఉలుకూపలుకూ లేకుండా ఉందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటులో ఒత్తిడి తెచ్చినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని చెప్పారు. మేధావి సమాఖ్య అధ్యక్షులు ఎం. వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలవాలని సూచించారు. న్యాయవాదుల తరుపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు మస్తాన్‌వలీ తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ కరస్పాండెంట్ల సంఘం నాయకులు జోగిరామిరెడ్డి, ఇలియాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బండి జకరయ్య, అవ్వారు మల్లికార్జున, దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, కిషోర్‌కుమార్, సీఆర్వీ ప్రసాద్, బీఎస్పీ అధ్యక్షుడు సగిలి గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు చొరవ తీసుకోవాలి ఈనెల 25న బంద్‌కు సంబంధించి ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉక్కు సాధన ఐక్యవేదిక అధ్యక్షులు బి. నారాయణ అన్నారు. ఈ మేరకు విద్యార్థి సంఘాలు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతిరోజూ రెండు గంటల పాటు వీధుల్లో ప్రదర్శనలు చేయాలని తెలిపారు. ముందే విద్యాసంస్థలను మూసేయకుండా, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన తర్వాత బంద్‌లో పాల్గొనే విధంగా చేయాలని సూచించారు. మద్దతు ఉపసంహరించవచ్చు కదా! కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు కమిటీలు వేయడం కాలయాపన చేసేందుకేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. కేంద్రం సాయం చేయకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని సీఎం చెప్పడం సరికాదని, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే సరిపోతుందన్నారు. రాజధానిని కోల్పోయినప్పుడే అస్థిత్వం కోల్పోయాం–సీహెచ్ రాయలసీమ ప్రజలు రాజధానిని కోల్పోయినప్పుడే అస్థిత్వం కోల్పోయారని రాయలసీమ, కార్మిక, కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ ఎందుకు నిర్వహిస్తున్నది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని, ఎన్జీఓ నాయకులను కలసి ప్రభుత్వ కార్యాలయాలు మూయించాలన్నారు. ఓటుకు కోట్లు కేసువల్లే గట్టిగా నిలదీయలేని పరిస్థితి– ఎమ్మెల్యే ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆరోపించారు. రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి తీరాలన్నారు. ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా కడప ఉక్కు పరిశ్రమ గూర్చి కేంద్రాన్ని అడగకపోవడం దారుణమని తెలిపారు. -
డైలమాలో కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం
-
ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమిద్దాం!
►కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి అన్నీ అనుకూలమే ►అయినా పట్టించుకోని పాలక ప్రభుత్వాలు ►ఈ ప్రాంత అభివృద్ధికి పార్టీలకతీతంగా ఏకం కావాలి ►కడప ఉక్కు–రాయలసీమ హక్కు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు కడప రూరల్ : కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పెద్దఎత్తున ఉద్యమించడానికి పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ ఉద్యమాలకు సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కులా కడప ఉక్కు కోసం ఉద్యమించినప్పుడే ఫ్యాక్టరీ ఏర్పడుతుందని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కడప ఉక్కు పోరాట సమితి కన్వీనర్ ఎన్.రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కడప ఉక్కు–రాయలసీమ హక్కు అనే అంశంపై అఖిలపక్ష నేతలు, వివిధ సంఘాల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జిల్లాలో అన్నీ అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది మందికి ఉపాధి దొరకడంతోపాటు రాయలసీమ మొత్తం అభివృద్ది దిశగా అడుగులు వేస్తుందన్నారు. కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్‌బాష మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనా పగ్గాలను చేపట్టి మూడేళ్లు దాటినప్పటికీ ఆయన రాయలసీమకు చేసిందేమీ లేదని ఆరోపించారు. గతంలో ఏదైనా ఒక అంశంపై ఆందోళన కార్యక్రమాలు చేపడితే అధికారులు వచ్చి ఆరా తీసేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. కడప ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా కోటిరెడ్డి సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే ఆ ఉద్యమాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ జీవించి ఉంటే బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ వల్ల కడప మరో విశాఖలా మారేదన్నారు. కడప మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేపట్టే భవిష్యత్తు కార్యచరణ, చేపట్టే ఉద్యమాలకు తానెప్పుడూ ముందుంటానన్నారు. ఈ ఉద్యమంలో టీడీపీ, బీజేపీ నాయకులు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కడప ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్ ఎన్.రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనే కడప ఉక్కు పోరాట కమిటీ ధ్యేయమన్నారు. అందుకోసం భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున బహిరంగసభ, అనంతరం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ కోసం చేపట్టే ఉద్యమాల్లో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బండి జకరయ్య మాట్లాడుతూ నేటి పాలకులు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఏమాత్రం పట్టించుకోకపోవడం తగదని హితవు పలికారు. ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ ప్రజాప్రయోజనం కలిగించే కడప ఉక్కు ఫ్యాక్టరీ పాలక ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యాసంస్థల అధినేతలు జోగి రామిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎలియాస్‌రెడ్డి మాట్లాడుతూ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కాకపోతే అదొక చారిత్రాత్మక తప్పిదమవుతుందన్నారు. విద్యార్థి నాయకులు రవిశంకర్‌రెడ్డి, బీఎస్పీ నాయకులు గుర్రప్ప, వైఎస్సార్సీపీ నాయకులు సురేష్, భాస్కర్‌రెడ్డి, కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఇషాక్ అలీ, లింగమూర్తి, శేఖర్ పాల్గొన్నారు. -
ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం
బద్వేలు అర్బన్ : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఆపై మాట తప్పిన మంత్రి లోకేష్‌బాబుకు ఇక్కడ పర్యటించే హక్కు లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో భాగంగా మంగళవారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. మూడున్నరేళ్లు అవుతున్నా దాని ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా, పట్టణ కార్యదర్శులు వీరశేఖర్, చంద్రశేఖర్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శులు బి.అనిల్, పి.ప్రభాకర్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు జకరయ్య, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు శివరాం, సూరి, సత్యం, సాయి, సుధాకర్, హరి, మోహన్, పెంచలయ్య పాల్గొన్నారు. -
ప్రవీణ్ దీక్ష భగ్నం : ఆస్పత్రికి తరలింపు
వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరులో ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్న ప్రవీణ్‌కుమార్ రెడ్డి దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులు దీక్ష కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. -
ఉక్కు కోసం యువత ఉద్యమించాలి
బద్వేలు(అట్లూరు): కడప జిల్లాలో ఉక్కు ప్యాక్టరీ స్థాపన కోసం విద్యార్థులు ఉధ్యమించాలని రాయలసీమ అబివృద్ధి వేదిక(ఆర్డీఫ్)డివిజన్ కన్వీనర్ మాధన విజయకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం బద్వేలు పట్టణంలోని స్థానిక ఎంవీఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల చైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీఫ్ కొంత కాలంగా ఉక్కుపరిశ్రమ కోసం ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడంలేదని ప్రశ్నించారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటు పరిశీలనకు టాస్క్‌పోర్సు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రెండు నెలలు గడచినా పట్టించుకోవక పోవడం దారుణమన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమతో పాటు పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు డిశంబరు 8వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఎఫ్ డివిజన్ కార్యవర్గ సభ్యుడు చిన్నీ, డివిజన్ నాయకుడు వెంకటరమణ, కళాశాల కరస్పాండెంటు శంకరనారాయణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరిస్తున్న ‘ఉక్కు’!
పట్టాలెక్కని పరిశ్రమ అధ్యయనానికి మరో కమిటీ తొలుత రెండు బృందాల సర్వే రూ.30వేల కోట్ల ప్రాజెక్టుకు ముహూర్తమెప్పుడో..? సాక్షిప్రతినిధి, ఖమ్మం : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఊరిస్తోంది. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. పరిశ్రమ నిర్మాణం మాత్రం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెరుుల్) బృందం రెండున్నరేళ్ల క్రితం కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి ప్రభుత్వాలకు నివేదిక అందజేసింది. దీనిపై స్పందించని కేంద్రం.. తాజాగా మళ్లీ అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎప్పుడు పునాదులు పడతాయోనని ఆ ప్రాంతవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆధారమైన ముడి ఇనుప ఖనిజం జిల్లాలో పుష్కలంగా ఉంది. నిక్షేపాలు నిక్షిప్తమైన ఉన్న ప్రాంతంలోనే కర్మాగారం ఏర్పాటు చేయాలని జిల్లావాసులతోపాటు రాజకీయ పక్షాలు కొన్నేళ్లుగా నినదిస్తున్నారుు. అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని హామీలు గుప్పిస్తున్నారుు. ఉమ్మడి రాష్ట్రంలో 2014, మే 21, 22 తేదీల్లో ఎనిమిది మంది సభ్యులతో కూడిన సెరుుల్ బృందం గార్ల, బయ్యారంలో పర్యటించి.. ఇనుప ఖనిజాలున్న భూములను పరిశీలించింది. బయ్యారం, గార్ల, నేలకొండపల్లిలో ముడి ఇనుప ఖనిజంతోపాటు సంబంధిత ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెరుుల్ బృందం నివేదిక అందజేసింది. జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వాలకు నివేదికను పంపింది. బయ్యారంలో 25,700 హెక్టార్లు, గార్లలో 18,330 హెక్టార్లు, నేలకొండపల్లిలో 12,660 హెక్టార్లలో ముడి ఇనుప ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. అలాగే కారేపల్లి మండలం మాదారంలో 20 కిలోమీటర్ల మేరకు డోలమైట్ విస్తరించి ఉంది. నల్లగొండ జిల్లాలో సున్నపురారుు(లైమ్‌స్టోన్) అందుబాటులో ఉందని.. బయ్యారం నుంచి ఇక్కడి గనులకు 90 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు రైలు మార్గం 14 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు. స్టీల్ ప్లాంట్‌లో ముడి ఇనుమును శుద్ధి చేసేందుకు ప్రధానంగా నీరు అవసరం. అరుుతే బయ్యారం మండలానికి సమీపంలో ఎక్కడెక్కడ నీటి వనరులున్నాయో అధికారులు నివేదించారు. హైదరాబాద్‌లోని హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదికలో ప్రతిరోజు ప్లాంట్‌కు 5,000 క్యూబిక్ మీటర్ల(49 క్యూసెక్కులు) నీటి అవసరం ఉంటుందని, దీని ప్రకారం కొన్ని నీటి వనరులను జిల్లా అధికారులు ప్రతిపాదించారు. పామర్ కంపెనీ పరిశీలన ఏడాదిన్నర క్రితం గార్ల, బయ్యారంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పామర్ కంపెనీ ప్రతినిధుల బృందం ఇనుప ఖనిజం నిల్వలున్న భూములు, అధికారులు స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూములను పరిశీలించింది. గార్ల మండలం శేరిపురం, బయ్యారం మండలం ధర్మాపురంలో బృందం పర్యటించింది. ప్రభుత్వం పరిశ్రమ నిర్మాణం కోసం తమకు భూములు కేటారుుస్తే ఉక్కు కర్మాగారంతోపాటు థర్మల్ ప్రాజెక్టును నిర్మిస్తామని కంపెనీ బృందం ప్రకటించింది. దీంతో అసలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ సెరుుల్ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతుందా.. లేక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తుందా..? అనేది అప్పట్లో చర్చ జరిగింది. కేంద్రం.. రాష్ట్రానికి చేయూతనివ్వకపోతే భారీ ఎత్తున నిధుల సమీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పునాది పడేదెప్పుడు..? ఏళ్లతరబడి ఊరిస్తున్న బయ్యారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అరుుతే ఇటు సెరుుల్ అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్రానికి అందజేసినా.. కేంద్రం మాత్రం చూస్తాం.. చేస్తాం అంటూ కాలయాపన చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణంపై చురుకుగా ముందుకెళ్లకపోవడంతో.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నారుు. మంగళవారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఇక్కడ ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించడంతో.. ఇంకెన్నాళ్లు సర్వేలు, అధ్యయనాలతో కాలయాపన చేస్తారని ఇక్కడి ప్రాంతవాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
ఉక్కు పరిశ్రమతోనే జిల్లా అభివృద్ధి
కడప వైఎస్సార్ సర్కిల్: ఉక్కు పరిశ్రమతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ శనివారం కాంగ్రెస్, ప్రైవేటు స్కూల్స్, కడప బార్ అసోసియేషన్ సభ్యులు, వైద్యులు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తూ నిరసన తెలియజేశారు. ఈమార్నింగ్ వాక్ ఎర్రముక్కపల్లి నుంచి పాతకలెక్టరేట్ వరకు సాగింది .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపరిశ్రమ స్థాపనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వ పెద్దలకు ఉక్కుపరిశ్రమ స్థాపనలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలోఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు ప్రాణాత్యాగాలకయిన సిద్ధమన్నారు. ఇప్పటికైనా ఉక్కుపరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం కృషిచేయాలన్నారు. ఈ నెల 8 నుంచి జరిగే శాసన సభ సమావేశాల్లో జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం పై ఒత్తిyì తీసుకురావాలని శాసనసభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగరకార్యదర్శి వెంకటశివ విద్యార్ది,కార్మిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
'ఉక్కుపై ఉత్పత్తికి అంతరాయం లేదు'
విశాఖ: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రభావం విశాఖ ఉక్కు కర్మాగారంపై పాక్షికంగా పడింది. సూపర్వైజర్లు, బీఎంఎస్ సంఘానికి చెందిన కార్మికులు యథావిధిగా విధులకు హజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన ర్వారం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. సమ్మె వల్ల ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేదని యాజమాన్యం తెలిపింది. -
ఉక్కు సీమ హక్కు
ప్రొద్దుటూరు: జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసే వరకు ఉద్యమం ఆగదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన తేదీని ప్రకటించాలని కోరుతూ మంగళవారం స్థానిక పుట్టపర్తి సర్కిల్లో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజా సంఘాలతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేనిపోని సాకులతో ప్రభుత్వం ఉక్కు కర్మాగారం నిర్మించకుండా కాలయాపన చేస్తోందన్నారు. వాస్తవానికి వైజాగ్ స్టీల్ కర్మాగారానికి కూడా చత్తీస్గడ్ నుంచి ముడిసరుకు వస్తోందన్నారు. అలాగే ఆర్టీపీపీకి కూడా సింగరేణి నుంచి బొగ్గు సరఫరా అవుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎందుకు జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం లేదని ప్రశ్నించారు. ఉద్యమంలో భాగంగా ఈనెల 28న కలెక్టరేట్‌ను ముట్టడించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పల్లేటి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ వస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులతోపాటు మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, విరసం కార్యదర్శి వరలక్ష్మి, సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, షరాబు వ్యాపారస్తుల సంఘం కార్యదర్శి నామా శ్రీధర్, విజిటబుల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాఫర్ హుసేన్, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు పల్లా శేషయ్య, టైలర్స్ అసోసియేషన్ నాయకుడు షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యమించాలి
కడప వైఎస్సార్ సర్కిల్ : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రజా ఉద్యమంలా పోరాటం సాగించాలని ఎమ్మెల్యే ఎస్బి అంజద్‌బాషా పేర్కొన్నారు. శనివారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక రా.రా. గ్రంథాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పొందుపరిచి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాల్సిందిపోయి తనకేమి పట్టనట్లు వ్యవహారించడం తగదన్నారు. రాయలసీమలో నిరుద్యోగం తాండవించి, వలసలు వెళుతుంటే వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపడం సరికాదన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రంతో పోరాడాల్సిందిపోయి కేంద్ర పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ఎలాంటి అభివృద్ది నిధులు కేటాయించకుండా చేయడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తకపోవడం సహించరాని విషయమన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చి రెండున్న సంవత్సరాలు దాటుతున్నా ఎటువంటి అభివృద్దిగానీ, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసిన పాపాన పోలేదన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, పారిశ్రామికంగా అభివృద్ది జరగాలంటే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తప్పనిసరి అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించడానికి సిద్దం కావాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ది కోసం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అందుకు న్యాయవాదులు తమవంతు మద్దతుగా ఆందోళనలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కన్వీనర్ జేవీ రమణ మాట్లాడుతూ సీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బండి జకరయ్య మాట్లాడుతూ వెఎస్సార్ జిల్లా అన్ని విధాలా వెనుకబడి ఉందన్నారు.ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షులు సంగటి మనోహర్, సంఘ సేవకుడు సలావుద్దీన్, సీపీఎం కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు పి.అంకుశం, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఓబులేశు, పీడీఎస్‌యూ నాయకులు నాగేంద్ర పాల్గొన్నారు. -
'ఉక్కు కర్మాగారాన్ని సాధిద్దాం'
ప్రొద్దుటూరు: కడప ఉక్కు-సీమ హక్కు నినాదంతో అందరూ ఒక్కటై ఉద్యమించి వైఎస్ఆర్ జిల్లాకు ఉక్కు కర్మాగారాన్ని సాధించాలని ఉక్కు కర్మాగారం సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న సమితి కార్యాలయంలో మాట్లాడారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఏర్పాటు చేయతలపెట్టిన బ్రాహ్మణి ప్లాంట్‌ను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్లాంట్ ఏర్పాటైతే జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అధికార పార్టీ జిల్లాపై వివక్ష చూపుతోందని విమర్శించారు. ఐకమత్యంతో ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుందామని అన్నారు. -
కడప ఉక్కు కర్మాగారాన్ని తరలించొద్దు: సీపీఐ నారాయణ
కడప రూరల్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటుచేయనున్న ఉక్కు కర్మాగారాన్ని వేరొక ప్రాంతానికి తరలిస్తే ఊరుకోబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. నారాయణ హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లాలో ప్రతిపాదించిన ఉక్కు కర్మాగారాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంకు తరలించనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 'కడప ఉక్కు- రాయలసీమ హక్కు' నినాదంతో సోమవారం కడప పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ.. కర్మాగారం తరలింపు ఆలోచనను ప్రభుత్వాలు వెంటనే మానుకోవాలన్నారు. సమావేశంలో కడప ఎమ్మెల్యే అంజద్‌పాషా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, మానవ హక్కుల నేతలు పాల్గొన్నారు. -
‘బయ్యారం’పై సమగ్ర నివేదిక ఇవ్వండి
అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కీలకమైన టాస్క్‌ఫోర్స్ నివేదికను సమగ్రంగా రూపొందించాలని నీటిపారుదల, భూగర్భ వనరుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భూగర్భ వనరుల శాఖ అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో ముడి ఇనుము లభ్యతపై ప్రస్తుతం భూగర్భ వనరుల శాఖ అధ్యయనం చేస్తోంది. అయితే బయ్యారంలో ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితం కాకుండా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నమూనాలు సేకరించడం ద్వారా ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావాల్సిందిగా ఇటీవల కేంద్రం సూచించింది. దీంతో సమగ్ర అధ్యయనానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు మంత్రికి వివరించారు. కాగా, వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్రంలో ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. -
'ఉక్కు ఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలి'
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో ఉక్కుఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్(ఆర్ఎస్ఎఫ్) ఆధర్యంలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమకు ఇచ్చిన హామీ ప్రకారం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్థికి తోడ్పాటు అందించాలని విద్యార్థులు కోరారు. -
ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణానికి డిమాండ్
ఎన్నికల సమయంలో వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని టీడీపీ హీమీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 18న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జిల్లాకు రానున్న సందర్భంగా రాయలసీమకు న్యాయంగా రావాల్సిన సాగునీటి వాటాను కేటాయించటం, వైఎస్సార్ జిల్లాలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. -
బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి
ఖమ్మం : ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం చొరవ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలో వేలాదిమంది గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ లేదా ఇన్ఫాట్ నిగమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని పొంగులేటి సోమవారం పార్లమెంట్లో ప్రస్తావించారు. జిల్లాలో సుమారు 1.41 లక్షల ఎకరాల్లో ఇనుపరాయి నిక్షేపాలు దాగి ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో గార్ల, బయ్యారం, నేలకొండపల్లి మండలాలతో పాటు సమీప వరంగల్ జిల్లాలో కూడా ఫ్యాక్టరీకి కావల్సిన నిక్షేపాలు అపారంగా ఉన్నాయన్నారు. జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల రాష్ట్రానికి రూ.వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.