ఉక్కు పరిశ్రమతోనే జిల్లా అభివృద్ధి
కడప వైఎస్సార్ సర్కిల్:
ఉక్కు పరిశ్రమతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ శనివారం కాంగ్రెస్, ప్రైవేటు స్కూల్స్, కడప బార్ అసోసియేషన్ సభ్యులు, వైద్యులు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తూ నిరసన తెలియజేశారు. ఈమార్నింగ్ వాక్ ఎర్రముక్కపల్లి నుంచి పాతకలెక్టరేట్ వరకు సాగింది .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపరిశ్రమ స్థాపనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వ పెద్దలకు ఉక్కుపరిశ్రమ స్థాపనలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలోఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు ప్రాణాత్యాగాలకయిన సిద్ధమన్నారు. ఇప్పటికైనా ఉక్కుపరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం కృషిచేయాలన్నారు. ఈ నెల 8 నుంచి జరిగే శాసన సభ సమావేశాల్లో జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం పై ఒత్తిyì తీసుకురావాలని శాసనసభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగరకార్యదర్శి వెంకటశివ విద్యార్ది,కార్మిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.