
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల డేటా విశ్లేషణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఢిల్లీ ఓటర్లు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలైన బీఎస్‌పీ, సీపీఎం కంటే నోటా (నాన్ ఆఫ్ ది ఎబవ్)ఆప్షన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారని తేలింది.
మొత్తం పోలైన ఓట్లలో నోటా ఆప్షన్‌కు 0.57 శాతం ఓట్లు పడగా బీఎస్‌పీకి 0.55 శాతం, సీపీఎంకు 0.01శాతం మంది మాత్రమే ఓటేయడం గమనార్హం. ఈ రెండు పార్టీలకు దక్కిన ఓట్ల కంటే నోటా ఓట్ల శాతమే ఎక్కువ. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.01, జేడీయూకు 0.53 శాతం ఓట్లు పడ్డాయి.