Nota votes
-
అభ్యర్థుల కంటే నోటాకే అధికం
యలమంచిలి రూరల్: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ, వైఎస్సార్సీపీ వంటి ప్రధాన పారీ్టల అభ్యర్థులను మినహాయిస్తే ఇతర పారీ్టలు, స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ప్రజల మద్దతును పొందడంలో విఫలమైన ఆ 13 మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు. వారికి పోలైన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉండడం విశేషం. పలకా శ్రీరామ్మూర్తికి 19,157, వేది వెంకటేష్ కు 24,833, నమ్మి అప్పలరాజుకు 2589, ఆడారి శరత్ చంద్రకు 1886, వడ్లమూరి కృష్ణస్వరూప్‌కు 3549, కర్రి విజయలక్ష్మికి 1578, తుమ్మగుంట అప్పలనాయుడుకు 1055, గారా సత్యారావుకు 3116, జున్నూరి జె శ్రీనివాస్‌కు 1195, డాక్టర్ తుమ్మపాల హరిశంకర్‌కు 1567, పెట్ల నాగేశ్వర్రావుకు 2179, సిద్ధా లోవరాజుకు 3845, వంకాయల రామచంద్రరావుకు 4001 ఓట్లు పోలవ్వగా వీరందరి కంటే అధికంగా నోటాకు 26,235 ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా మాడుగులలో 4880 ఓట్లు, అత్యల్పంగా అనకాపల్లిలో 1924 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అసెంబ్లీల పరిధిలో నోటాకు వచ్చిన ఓట్లు 20,111 జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రెండు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 4,107 రాగా..అత్యల్పంగా అనకాపల్లిలో 1,853 వచ్చాయి. యలమంచిలిలో 2,409, చోడవరంలో 3,849, మాడుగులలో 4,070, నర్సీపట్నంలో 3,824.. మొత్తం 20,111 ఓట్లు నోటాకు పడ్డాయి. -
ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..
హైదరాబాద్: శాసనసభ ఎన్నికలలో నోటా ఓట్లు కీలకమని మరోసారి రుజువైంది. బరిలోకి దిగిన అభ్యర్థులు నచ్చకపోతే నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) గుర్తును నొక్కే అవకాశం ఉండటంతో ఈసారి నోటాకు ఓట్లు బాగానే పడ్డాయి. గ్రేటర్‌లోని చాలా నియోజకవర్గాలలో మూడు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 15,418 రాగా.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 12,824 వచ్చాయి. హైదరాబాద్‌లో నోటాకు 16,222 ఓట్లు పోలయ్యాయి. అత్యధికం కుత్బుల్లాపూర్, అత్యల్పం నాంపల్లి.. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో నోటాకు 4,079 ఓట్లు రాగా.. అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లొచ్చాయి. చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య గెలిచిన మెజారిటీ కంటే నోటా ఓట్లే ఎక్కువ ఉండటం కొసమెరుపు. ఇక్కడ యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్‌పై 268 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నోటాకు వచి్చన ఓట్లు 1,423 కావడం గమనార్హం. యాకుత్‌పురలో 878 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 704. నోటా ఓట్లు గతంలో కంటే తక్కువే.. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్లు నోటా ఓట్లు తక్కువే పోలయ్యాయి. గత ఎన్నికలలో మూడు జిల్లాలతో కూడిన గ్రేటర్లో నోటాకు 44,935 ఓట్లు రాగా.. తాజా ఫలితాల్లో 471 తగ్గి నోటాకు 44,464 ఓట్లొచ్చాయి. గతంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నోటాకు 17,078 ఓట్లు రాగా.. ఈసారి 16,222కు తగ్గాయి. రంగారెడ్డిలో గతంలో 13,242 ఓట్లు పోలవగా.. ఇప్పుడు 12,824 వచ్చాయి. మేడ్చల్–మల్కాజ్‌గిరిలో గతంలో 14,615 ఓట్లు రాగా.. ఈసారి 803 ఓట్లు ఎక్కువొచ్చాయి. తాజా ఫలితాల్లో నోటాకు 15,418 ఓట్లు వచ్చాయి. -
Nalgonda: నోటాకు 11,297 ఓట్లు
నల్గొండ: ఉమ్మడి జిల్లాలో నోటాకు భారీగానే ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 11,297 ఓట్లు నోటాకు వచ్చాయి. భువనగిరి నియోజకవర్గంలో 882, ఆలేరు 659, సూర్యాపేట 760, నకిరేకల్ 969, తుంగతుర్తి 1,351, మునుగోడు 849, నాగార్జునసాగర్ 1,056, మిర్యాలగూడ 527, కోదాడ 887, హుజూర్నగర్ 843, దేవరకొండ 1,613, నల్లగొండలో 901 ఓట్లు పడ్డాయి. -
మునుగోడు బరిలో కేఏ పాల్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సూపర్ విక్టరీని అందుకుంది. దాదాపు 10వేల ఓట్లకుపైగా ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఘన విజయం సాధించారు. బీజేపీ రెండో స్థానంలో, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసిన పాల్‌కు 805 ఓట్లు వచ్చాయి. అయితే, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి రెండు డిజిట్ల సంఖ్యకే పరిమితమైన పాల్.. పదమూడో రౌండ్లో అత్యధికంగా 86 ఓట్లు సాధించారు. ఇక, అత్యల్పంగా 15వ రౌండ్(ఆఖరి రౌండ్)లో 11 ఓట్లు సాధించడం విశేషం. మరోవైపు.. ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. అంతా ఫ్రాడ్ అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించడంలేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్ అభ్యర్థులకు దాదాపు 6వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చని పక్షంలో ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు 482 మంది ఓటు వేశారు. ఇది కూడా చదవండి: ‘కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అంత సీన్ లేదు’ -
యూపీలో ఘోరపరాభవం.. అయినా సంబురాల్లో AAP!!
లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒకానొక దశలో యూపీ కంటే.. పంజాబ్ ఫలితాల మీదే దేశం మొత్తం ఆసక్తి కనబర్చింది. ఆప్ దెబ్బకు పంజాబ్ రాజకీయ చరిత్ర సంపూర్ణంగా మారిపోయింది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను ఆప్ ఏకంగా 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే ముందు.. పంజాబ్ వ్యాప్తంగా ర్యాలీలు, రోడ్‌షోలతో పండుగను జరుపుకోనుంది ఆప్. అయితే ఒక్క సీటు కూడా గెల్వకుండా చేదు అనుభవం చవిచూసిన యూపీలోనూ జోరుగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఆప్. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో ఆప్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అక్కడ ఓటింగ్ శాతం 0.38 మాత్రమే వచ్చింది. విచిత్రం ఏంటంటే.. ఇది నోటా కంటే తక్కువ. చాలామంది ఆప్ అభ్యర్థులు డిపాజిట్ కూడా గల్లంతు అయ్యారు. అయినప్పటికీ పంజాబ్ లో తాము సాధించిన ఘన విజయానికి సంబంధించి యూపీలో ర్యాలీలు చేపట్టబోతోంది. ఈ విషయాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తెలిపారు. యూపీ ఫలితాలు ఎలా ఉన్నా.. ఢిల్లీ మోడల్‌కే మాకు ఆదర్శం. ప్రతీ పల్లెలో జెండా ఎగరాలి. ప్రతీ ఒక్కరూ మా పార్టీ గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ లో తాము సాధించిన ఘన విజయం.. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆప్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారబోతోందనే ప్రజల భావనను తెలియజేస్తోందని సింగ్ చెప్పారు. తమ పార్టీ గుర్తు అయిన చీపురుతో దేశంలోని రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో గ్రామ స్థాయి నుంచి ఆప్ కు బలమైన క్యాడర్ ను తయారు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండేలా పోరాడుతామని... ఈ పోరాటం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. మార్చి 23, 24 తేదీల్లో లక్నోలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహిస్తామని... అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పర్ఫామెన్స్ పై ఈ సమావేశాల్లో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యవస్థను విస్తరించే అంశంపై కూడా చర్చిస్తామని అన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మధ్యే జరిగాయని... అందువల్లే ఇతర పార్టీలకు ఓట్లు పడలేదని అభిప్రాయపడ్డారు సంజయ్ సింగ్. -
యూపీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. టెన్షన్లో రాజకీయ పార్టీలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల పర్వంలో కొత్త అంశం కనిపించింది. పోటాపోటీగా ప్రచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జేడీ(యూ) పార్టీల కంటే ‘నన్ ఆఫ్ ది ఎబో(నోటా)’ మీటకు పడిన ఓట్లే ఎక్కువ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్‌సైట్‌లోని గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం పోలైన ఓట్లలో ఆప్‌నకు 0.35 శాతం, జేడీయూకు 0.11 శాతం ఓట్లు పడ్డాయి. అయితే, వీటికంటే ఎక్కువగా నోటాకు 0.69 శాతం ఓట్లు పడటం విశేషం. ఎంఐఎం పార్టీకి 0.47 శాతం ఓట్లు పడ్డాయి. సీపీఐ పార్టీకి 0.07 శాతం, ఎన్సీపీ పార్టీకి 0.05 శాతం, శివసేనకు 0.03 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎన్జేపీ(ఆర్వీ) పార్టీలు 0.01 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. ఏఐఎఫ్బీ, ఐయూఎంఎల్, ఎల్జేపీలకు ఒక్క ఓటు కూడా పడలేదని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీ మెజారిటీతో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి 41.6 శాతం ఓట్లు పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీకి 32 శాతం ఓట్లు, బీఎస్పీకి 12.8 శాతం, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు 3.02 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 2.38 శాతం ఓట్లు సాధించింది. మరోవైపు.. దశాబ్దాల పాటు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి ఒకటీ అరా తప్పిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే చవిచూస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు. -
ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ‘నోటా’కు ఆస్కారం లేదు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్న చోట ‘నోటా’కు ఏ మాత్రం అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని తెలిపింది. ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ‘నోటా’ను ఉపయోగించుకోవచ్చునంది. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ‘నోటా’ను వినియోగించుకోవడానికి నిబంధనలు అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన నిబంధనలు రూపొందించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న చోట నోటాను వినియోగించుకునే అవకాశాన్ని ఓటర్లకు ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీవీ భద్ర నాగశేషయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. -
ఆ నోటా ఈ నోటా
ఈవీఎంలో ఒక ఆప్షన్ ఉంటుంది. అదే నోటా... పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు (నన్–ఆఫ్–ది ఎబవ్) అని తేల్చి చెప్పడమే ఈ నోటా అర్థం. 2014లో నోటా ఓట్ శాతం ఎంత ఉందో... 2019లోనూ ఆ శాతం దాదాపు అదే విధంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఎన్నికల సంఘం వెబ్సైట్ అందించిన గణాంకాల ప్రకారం... సంబంధిత అంశాన్ని క్లుప్తంగా చూస్తే... ► 2019లో పోలైన మొత్తం ఓట్లలో నోటా శాతం 1.04% . 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాతం 1.08% . లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే 2019లో అత్యధిక ఓట్లశాతం నమోదయిన సంగతి తెలిసిందే. ► ఈ నోటారాష్ట్రాల వారీగా చూస్తే, నోటా శాతాల్లో తీవ్ర వ్యత్యాసం ఉండడం మరో విశేషం. అస్సాం, బిహార్లలో అత్యధికంగా 2.08% నోటా ఓటు నమోదయ్యింది. సిక్కింలో ఈ శాతం 0.65 శాతంగా ఉంది. ► ఈ నోటాపీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన ఒక తీర్పు నేపథ్యంలో దేశంలో నోటా విధానం ఆరంభమైంది. ► ఈ నోటాఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా వినియోగం ప్రారంభమైంది. అప్పట్లో ఆయా రాష్ట్రాల్లో నోటా ఓటు 1.85 శాతంగా ఉంది. -
అప్పట్లో ‘నోటా’దే అత్యధికం
సాక్షి, భైంసా : ‘నోటా’... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరు కూడా నచ్చకుంటే ఓటరు నిరభ్యంతరంగా తన వ్యతిరేకతను తెలిపేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఏర్పాటే నోటా. అభ్యర్థులెవరూ నచ్చకుంటే ఓటరు ఈవీఎంలో ఈ ‘నోటా’ బటన్ నొక్కి తన తీర్పునివ్వొచ్చు. ఇంత ప్రాధాన్యమున్న ‘నోటా’ మీటతో ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక సంబంధం ఉంది. ఎలాగంటే.. 2014లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో నోటా ఓట్లు 17,041 వచ్చాయి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలోనే నోటా ఓట్లు అత్యధికంగా రావడం ఓ సంచలనంగా మారింది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 10,47,024 ఓట్లు పోలవగా, నోటాకు 17041 ఓట్లు వచ్చాయి. అవగాహన లేకపోవడం వల్లే! విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు రాజకీయాల్లోని అవినీతి, అక్రమాలు, నాయకుల నేరచరిత్ర, అభ్యర్థుల గుణగణాలపై అవగాహన ఉండి ప్రశ్నిస్తారు. అంటే, మేధావి వర్గమే ఎన్నికల్లో నోటా వినియోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, 2014 ఎన్నికల్లో నోటాకు రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు రావడం కేవలం ఓటర్ల అవగాహనరాహిత్యం వల్లే కావొచ్చని భావించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో షెడ్యూల్ తెగలు, సామాజికవర్గానికి కేటాయించిన ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోనూ నోటా ఓట్లు అధికంగా నమోదయ్యాయి. రాజకీయచైతన్యం, అక్షరాస్యత అంతగాలేని గిరిజనులు అవగాహన లేమితో నోటా బటన్ నొక్కి ఉంటారని నిపుణులు నాడు అభిప్రాయపడ్డారు. -
ఫ్లాట్ బాధితుల నోటా బాట..
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : సాధారణంగా ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి ఓటెయ్యాలని నిర్ణయించుకుంటారు.అయితే, ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ‘నోటా’కు ఓటెయ్యాలని నిర్ణయించుకున్నారు. వారంతా నోయిడా ఫ్లాట్ కొనుగోలు బాధితులు. నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో ఫ్లాట్ల కొనుగోలుకు వేల మంది సొమ్ము కట్టారు. పదేళ్లయినా ఫ్లాట్లు అప్పగించకపోవడం, ఏ రాజకీయ నాయకుడు తమ సమస్యను పట్టించుకోకపోవడంతో ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. బాధితులు ఏర్పాటు చేసుకున్న ‘నోయిడా ఎక్స్టెన్షన్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ మెంబర్స్ అసోసియేషన్ (నెఫోమా) ఆధ్వర్యంలో ‘నో హోం నో వోట్’ ప్రచారం చేపట్టారు. ఈ సంఘంలో 20 నుంచి 25 వేల మంది సభ్యులున్నారు. వీరితో సంబంధాలున్న వారు మరో లక్ష మంది ఉన్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలు గౌతమ్ బుద్ధనగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో కొత్తగా 5 లక్షల మంది ఓట్లు నమోదు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఫ్లాట్ బాధితులున్నారు. రుద్ర ప్రాజెక్ట్స్‌లో వీళ్లు ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. 2015 నాటికే ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పిన ఆ సంస్థ ఇంత వరకు అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయిందని, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాలు వచ్చినా తమ కష్టం మాత్రం తీరలేదని నెఫోమా అధ్యక్షుడు అనూఖాన్ ఆరోపించారు. -
జనం నిరసనాస్త్రం ‘నోటా’
రాజకీయ శక్తుల్లో నానాటికీ పేరుకుపోతున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని లంచగొండితనాన్ని, సంతలో పశువులను కొన్నట్టే ఓట్లను కొనవచ్చునన్న ధీమాను ధనికవర్గ వ్యవస్థ పెంచుతూ వచ్చిన దాని ఫలితమే ‘నోటా’గా పరిణమించింది. పాలకుల తప్పుడు ఆచరణకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఎన్నికల ఓటింగ్ నిర్వహణ ప్రక్రియలో ‘నోటా’ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకునే అవకాశం కల్పించవలసి వచ్చింది. ఇటీవలే అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా లక్షలమంది ఓటర్లు నోటాకు ఓటువేయడం రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల అభిశంసనగానే గుర్తించాలి. నోటా ఇప్పుడు ప్రజలకు మిగిలిన ఏకైక ఆయుధం. ‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ (తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో) ఎన్నికల ప్రక్రియ ఆద్యంతమూ డబ్బు, మద్యం పంపిణీ చుట్టూనే తిరిగింది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు విచ్చలవిడిగా ఈ డబ్బులు పంపిణీ చేశారు. అధికారుల తనిఖీల్లో భారీ స్థాయిలో తెలం గాణలో నగదు పట్టుబడింది. ఇంత పెద్ద మొత్తంలో ధన ప్రభావం ఇంత వరకూ జరగలేదు. ఈ అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల సంఘం కూడా పూర్తిగా విఫలమయింది. ఓటర్ల జాబితాల్లోనూ భారీగా అక్ర మాలు జరిగాయి. రేపో మాపో పంచాయతీ లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇది గుణపాఠం కావాలి’’ – 30 ప్రసిద్ధ ప్రభుత్వేతర స్వతంత్ర సంస్థల (ఎన్జీవోస్) ‘ఎలెక్షన్ వాచ్’ సంయుక్తంగా జరిపిన నిఘా నివేదిక వెల్లడి (15.12.2018) ‘‘తెలంగాణలో 2014 నాటి ఎన్నికల ఫలితాలతో పోల్చితే 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవరూ నాకు నచ్చలేదని (నో టు–ఎబౌ) ‘నోటా’ గుర్తుకు తొలిసారిగా ఓటర్లు వేసిన ఓట్ల సంఖ్య భారీగా 47 శాతానికి చేరి మొత్తం ‘నోటా’ ఓట్ల సంఖ్య 2.5 లక్షలకు పెరి గింది. అలాగే రాజస్తాన్‌లో సంప్రదాయ పార్టీలైన సమాజ్‌వాదీ, ఎన్సీపీ, ఆర్.ఎల్.డి., కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీలకు వచ్చిన ఓట్ల కన్నా ‘నోటా’ ఓట్లు 4,67,781 ఓట్లుగా నమోదైనాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో ‘నోటా’ ఓట్లు 5,42,295లుగా, ఛత్తీస్‌గఢ్‌లో ‘నోటా’ పంచుకున్న ఓట్లు 2,82,744గా, మిజోరాంలో స్థానిక పార్టీలకన్నా 0.5 శాతం ఓట్లు ఎక్కువ గాను నోటా పంచుకుంది’’ – కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన ఇంతై, ఇంతింతై వటుడింతై నభో మండలానికి యాత్ర కట్టాడన్న సామెతగా గత 70 ఏళ్ల గణతంత్ర భారతంలో ఏ తొలి రెండు మూడు జనరల్ ఎన్నికలు మినహా ఆ తరువాత జరుగుతూ వచ్చిన ఎన్నికల్లో పాలకపక్ష రాజకీయాలు, నాయకులు ప్రజా ప్రయోజనాలకు, నీతికి, విలువలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నందుననే ప్రకటిత ప్రజా స్వామ్యానికి ప్రత్యామ్నాయాన్ని క్రమంగా ప్రజలు ఎన్నుకొనే పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పాలకుల భాగోతాన్ని, ఎన్నికల కమిషన్ అచేతనత్వాన్ని కనిపెడుతూ వచ్చింది. రాజకీయ శక్తుల్లో నానాటికీ పేరుకుపోతున్న అవినీతిని, పాల కుల ఆశ్రిత పక్షపాతాన్ని లంచగొండితనాన్ని, సంతలో పశువులను కొన్నట్టే ఓట్లను కొనవచ్చునన్న ధీమాను, నమ్మకాన్ని ధనికవర్గ వ్యవస్థ పెంచుతూ వచ్చిన దాని ఫలితమే ‘నోటా’గా పరిణమించింది. ప్రజా స్వామ్యం గురించిన పాలకుల ఆచరణకు ‘సుప్రీం’ అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఎన్నికల ఓటింగ్ నిర్వహణ ప్రక్రియలో ‘నోటా’ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకునే అవకాశం కల్పించవలసి వచ్చింది. ఈ అవకా శాన్ని (నోటా) ప్రజాస్వామ్య వ్యవస్థను, దానికున్న పవిత్రమైన విలు వను అపహాస్యం చేయడంగా భావించకూడదు. ప్రజలకున్న ఏకైక ఆయుధం ‘నోటా’ అన్న భావన క్రమంగా అల్లుకుపోవడానికి రాజకీయ వ్యవస్థ అవినీతే ప్రధాన కారణం. ఇంతకుముందు ‘సుప్రీం’ 2013–2014 (సెప్టెంబర్)లోనే ఓటింగ్ క్రమంలో ఓటర్లకు ఫలానా ‘అభ్యర్థుల్ని తిర స్కరిస్తున్నా’నని తిరస్కార ఓటును (నోటా) నమోదు చేసే హక్కును తొలిసారిగా కల్పించింది. మొదటిసారిగా ఈ హక్కును 2014లో అయిదు రాష్ట్రాలకు జరిగిన ఎన్ని కల్లో వినియోగంలోకి తెచ్చారు. ఈ హక్కును వినియోగించుకునేందుకు ప్రిసైడింగ్ ఆఫీసరు అనుమతి అక్కర్లేదు. ఆయా రాష్ట్రాల మొత్తం ఓటర్ల సంఖ్యలో ‘నోటా’ ఓట్ల సంఖ్య తక్కువగానే కన్పించవచ్చు. కానీ ‘నోటా’ ఓటర్ల సంఖ్య క్రమంగా ప్రతి ఎన్నికలకు పెరుగు తోందన్నది గమనార్హం. కూలంకషంగా ఎన్నికల సంస్కరణల నిర్వహణ జరిగేంతవరకూ, ‘నోటా’కు విలువ ఉంటుంది. కేజ్రీవాల్ పార్టీ ‘ఆప్’ అభ్యర్థి దివంగత కమెడియన్ జస్వాల్ భట్టీ భార్య, నటీమణి సావిత్రి భట్టీ ఇటీవల ‘నోటా పార్టీ’ని నెలకొల్పింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తుగా కరెన్సీ నోట్లను ప్రక టించింది. ఈ విన్యాసానికి ప్రధాన కారణం– ప్రజలకు ప్రజాస్వా మ్యంలో విశ్వాసం లేక కాదు. ఇది పాలకులు అసంఖ్యాక బడుగు, బల హీన వర్గాల, మైనారిటీ ప్రజల బాగోగులను విస్మరించి ధనికవర్గ ప్రయో జనాలకు కాపలాదారులుగా వ్యవహరిస్తుండటానికి ప్రతిస్పందనే. చివరికి 9 మాసాలకు ముందుగానే శాసనసభను నిరంకుశంగా రద్దు చేసే హక్కును రాజ్యాంగం పాలకులకు కల్పించకపోయినా దూకు డుమీద ముందుకుసాగడం, ఆ ప్రక్రియలో భాగంగా లక్షలాదిమంది పేర్లు తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితా నుండి తొలగించినందుకు నిరసనగా ఓటర్లు, ప్రతిపక్షాలు వీధుల్లోకి రావలసిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ రాష్ట్ర ఓటర్ల జాబితా నుంచి 22 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు గల్లంతు కావటం నిజ మేనని అంగీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన ‘అర్హత ఉండీ, జాబితాలో పేర్లు లేక, ఓట్లు వేయలేకపోయిన వారిని నేను క్షమాపణ వేడుకుంటున్నా. మరోసారి ఇలా జరక్కుండా జాగ్రత్తప డతాం. వ్యవధి లేకుండా, ముందస్తుగానే అసెంబ్లీ రద్దు కావటం, సమ యం లేక ఎన్నికల్ని ఆరుమాసాల్లోనే పూర్తి చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడటం, తదితర కారణాలవల్ల గల్లంతైన ఓటర్లపైన దృష్టిపెట్టేంత సమయం లేకపోయింద’ని సరిదిద్దుకోలేని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఒకవైపున ఇదే ఉన్నతాధికారి ఎన్నికల ప్రణాళికలో పార్టీలు ఉచిత హామీలను ఓటర్లకు ఇవ్వజూపరాదని స్పష్టం చేసినా, అధికారపక్షం అసెంబ్లీ వ్యవధి ముగియడానికి 9 నెలలు ముందే ఆకస్మికంగా దానిని రద్దుచేసి ఎన్నికలను తీసుకొచ్చింది. అంతేకాకుండా రూ. 50,000 కోట్లు వ్యయం కాగల ఉచిత హామీలను పోటాపోటీలమీద ప్రకటించి కూర్చుంది. ‘ఉచిత హామీల’ వల్ల గెలుపు ఖాతా తెరుచుకోవడానికి ఎన్నికల అడ్డదారి దొరక వచ్చునేమోగానీ పాలకులు ‘అక్కరకురాని చుట్టాలు’గానే ప్రజల దృష్టిలో మిగిలిపోతారు. అందుకనే అలాంటి ఉచిత హామీలను గెలిచే పార్టీ చేసినవైనా, ఓడిపోయే పార్టీ చేసేవైనా వాటికి ఆచరణ విలువ ఉండాలి. ప్రాజెక్టుల లేదా ఇతర మేజర్ హామీలను అమలుపరచడంలో జాప్యానికి లేదా ఏళ్ల తరబడి సాచివేతకు ఎన్నో కారణాలు చూపడం పాలకులకు అలవాటు. అందుకని ప్రజలకు తామిచ్చిన హామీలు అయిదేళ్లయినా నెరవేర నప్పుడు ఎన్నికలు ముగిసిన మర్నాడే, అంతకుముందు హామీపడిన ప్రాజెక్టుగాని, పథకాలుగాని మందకొడిగా నత్తనడకలో సాగుతున్నం దుకు కారణం ఏమిటి? చెప్పిన హామీకి కట్టుబడి బొక్కసం నుంచి నిధులు విడుదల చేయడంలో ఆలస్యమైనందునా, లేదా బొక్కసంలోనే అసలు నిధులు లేకనా అన్నది పాలకుడికి తెలియాలేగానీ అందుకు ఉన్నతాధికారులను నిందించి, వారిపై ఆగ్రహించి, కళ్లురిమి, పళ్లు నూరి నందున లాభం లేదు. హామీలివ్వడం, ఆదేశాలివ్వడం పాలకుడికి ఖర్చు లేని పని, ఓట్లు దండుకోవడానికి ‘సులభ గణితం’ సరిపోతుం దేమో కానీ పాలకుల గణాంకాలు లెక్క తప్పి హామీలు ‘గుంటపూలు’ పుడ్తు న్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని విశ్వాసంతో నమ్ముకుని ‘రాముడు మంచి బాలుడు’ అన్నట్టుగా కళ్లుకాయలు కాచేలా మంచి రోజుల కోసం 70 ఏళ్లు కూడా చాలక, ఇంకా ఇంకా ఎదురుతెన్నులు చూస్తున్న సామాన్య ప్రజాబాహుళ్యానికి, ఉత్తుత్తి హామీలకు విమోచన ఎప్పు డన్నది ఈ దోపిడీ వ్యవస్థలో ఎప్పటికీ ‘శేష ప్రశ్న’గానే మిగిలిపోతుంది. ఇంతకూ హామీపడిన పథకాలు, ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్ర మాలు అనుకున్న రీతిలో ఎందుకు అమలు జరగవో, అమలు కోసం అడ్డు తగులుతున్న కారణాలు తెలుసుకోవాలంటే ఎన్నికల్లో (2014) పోటీ చేసిన అభ్యర్థుల ఆస్తులు సగటున ఎలా పెరుగుతూ వచ్చాయో తెలుసుకోవాలని ‘ఎలెక్షన్ వాచ్’ కోరుతోంది. అభ్యర్థుల ఆస్తులు సగ టున రూ. 8.59 కోట్లు కాగా, అవి 2018లో తిరిగి ఎన్నికైన ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ తలొక్కరికి రూ. 15.03 కోట్లకు పెరిగిపోయింది. 40 మంది శాసనసభ్యులు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అంతకుమిం చిన ఆస్తులున్నట్టు ప్రకటించారు. కాగా ఆస్తులు పెంచుకున్నవారిలో అగ్రభాగాన ఉన్న ముగ్గురి ఆస్తుల విలువ రూ. 90 కోట్లనీ, అప్పులు రూ. 91 కోట్లనీ ప్రకటించుకున్నారు. కాగా 88 మంది టీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు, 19 మంది నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, వారిలో ఒక్కొ క్కరికి రూ. 10.84 కోట్లు ఆస్తులున్నట్లు అఫిడవిట్లు వెల్లడించాయి. వీరిలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకైతే రూ. 314 కోట్ల పై చిలుకు ఆస్తులు న్నాయి, ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేలు 7 గురికి సగటున ఒక్కొక్కరికి రూ. 10.84 కోట్లు ఆస్తులున్నాయి. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి రూ.161 కోట్ల ఆస్తి ఉంది. ఇలా మొత్తం 119 మంది తెలంగాణ శాసనసభ్యుల్లో 106 మంది కోటీశ్వరులే. ఎన్నికైన వారిలో 70 మంది (61 శాతం) పైన క్రిమి నల్ కేసులున్నాయి. ఇప్పుడు చెప్పుకోండి– ‘నోటా’ ఓటర్లు వందల సంఖ్య నుంచి, వేలకు వేలు లక్షలకు, లక్షలు కోట్ల సంఖ్య వైపుగా విస్తరించడానికి ప్రస్తుత ప్రజాస్వామ్యం మేడిపండుగా, అవినీతికి మారుపేరుగా అవతరించడం కారణమా లేక ధనిక వర్గ వ్యవస్థకు మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకనా అన్నది అసలు ప్రశ్న. దుర్యోధనుడికి ఏది మంచో తెలు సుగాని, దానివైపు అతడి మనస్సు మళ్లదట, చెడు ఏదో తెలుసుగాని దానినుంచి అతడి మనస్సు తప్పుకోదట. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నోటా ఓట్లు @ 38974
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లు నోటాకూ భారీగా ఓటు వేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చక పోవడంతో వార ంతా నోటా మీట నొక్కారు. గ్రేటర్ పరిధి లో 24 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 38,974 మంది నోటాకు ఓటు వేయడం గమనార్హం. నోటా ఓట్లు అత్యధికంగా నమోదైన నియోజక వర్గాల్లో మేడ్చల్ 3402 ఓట్లతో మొదటిస్థానంలో నిలువగా, కుత్బుల్లాపూర్ 2976 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎల్బీనగర్ 2858, ఉప్పల్ 2712ఓట్లు, శేర్లింగంపల్లి 24444 ఓట్లతో వరుస స్థానాల్లో నిలిచాయి. ముషీరాబాద్ 1545, అంబర్పేట్ 1462, మహేశ్వరం 2171, మలక్‌పేట్ 498, మల్కజ్గిరి 1630, కంటోన్మెంట్ 1571, సికింద్రాబాద్ 1582, సనత్‌నగర్ 1464, కూకట్పల్లి 2134, జూబ్లిహిల్స్ 1491, ఖైరతాబాద్ 1371, రాజేంద్రనగర్ 1664, బహదుర్ పురా1210, యాకుత్‌పుర 777, చాంద్రాయణగుట్ట 1009, నాంపల్లి 793, గోషామహల్ 709, కార్వాన్ 887, చార్మినార్ 614 ఓట్లు నోటాకు నమోదు కావడం గమ నార్హం. మేడ్చల్‌లో అత్యధికంగా నమోదు కాగా...చార్మినార్‌లో అత్యల్పంగా నమోదు కావడం కొసమెరుపు. -
నోటాకు వచ్చినన్ని కూడా రాలేదు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కనీస ప్రభావం కూడా చూపలేకపోయాయి. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ పార్టీలకు రాలేదు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ మంగళవారం పేర్కొన్న సమాచారం ప్రకారం ఛత్తీస్‌గడ్‌లో 2.1 శాతం (2,46,918) ఓట్లు నోటాకు రాగా..అక్కడ 85 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తంగా 0.9 శాతం (1,04,362) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎస్పీ, ఎన్సీపీలకు (20,233) 0.2 శాతం ఓట్లు లభించగా, సీపీఐకు 0.3శాతం (38,811)ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో నోటాకు మొత్తంగా 1.5 శాతం (5,11,785) ఓట్లు రాగా, ఎస్పీకి 1 శాతం(3,88,485), ఆప్‌కి 0.7 శాతం (2,37,897) ఓట్లు లభించాయి. రాజస్థాన్‌లో నోటాకు 1.3 శాతం (4,64,838) ఓట్లు రాగా సీపీఐ(మార్క్సిస్ట్)కు 1.3 శాతం(4,32,666), ఎస్పీలకు 0.2 శాతం (65,160) ఓట్లు లభించాయి. మిజోరాంలో నోటాకు 0.5 శాతం (2,917) ఓట్లు లభించగా, ప్రిజమ్‌కు 0.2 శాతం (1,262) ఓట్లు వచ్చాయి. నిర్మానుష్యంగా బీజేపీ ఆఫీసు న్యూఢిల్లీ: తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ, మిజోరాం మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు మిన్నంటాయి. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. -
నోటాకు 2.24 లక్షల ఓట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద అబై వ్)కు గణనీయ సం ఖ్యలో ఓట్లు పడ్డాయి. 2,24,709 మంది ఓటర్లు (1.1 శాతం ఓట్లు) నోటాకు ఓటేశారు. రెండు చోట్లలో గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ కన్నా నోటాకు పడిన ఓట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన మల్రెడ్డి రంగారెడ్డి కేవలం 376 ఓట్లతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతుల్లో ఓటమి పాలు కాగా, ఇక్కడ నోటాకు 1,119 ఓట్లు పడ్డా యి. బీజేఎల్పీ మాజీ నేత జి.కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో 1,016 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతుల్లో ఓటమి పాలుకాగా, ఆ నియో జకవర్గంలో నోటాకు 1,462 ఓట్లు వచ్చాయి. ఖమ్మం, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నోటా మూడోస్థానంలో నిలవడం విశేషం. ఇక 16 సీట్లలో నాలుగో స్థానంలో, 51 స్థానాల్లో ఐదోస్థానంలో నోటా నిలిచింది. ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులపై తమ అసంతృప్తిని నోటాకు ఓటు వేయడం ద్వారా వ్యక్తం చేశారు. ఖమ్మంలో 3,513, శేరిలింగంపల్లిలో 3,637, హుజూరాబాద్‌లో 2,867 ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే అలంపూర్ (3,492), ములుగు (3,249), ఉప్ప ల్ (2,712), నర్సంపేట (2,436) అందోల్ (2,4 06), జగిత్యాల (2,203), చెన్నూర్(2,135), మంథని (2,083), నిజామాబాద్ –రూరల్ (2,2 03), సికింద్రాబాద్ (1,582), ముషీరాబాద్ (1,664), అచ్చంపేట (1,485), సనత్‌నగర్ (1,464), గోషామహల్లో 709 ఓట్లు వచ్చాయి. -
ఓటేయకపోతే ప్రశ్నించలేరు!
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయడంలో నిర్లిప్తత ప్రదర్శించే యువత రేపు ప్రభుత్వం తమ ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని ఎలా ప్రశ్నించగలదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫ్యాప్సీ) సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడారు. ‘అక్కడి దాకా ఎందుకు... ఓటువేయని వాణిజ్య, వ్యాపార వర్గాలవారు నైతికంగా ప్రభుత్వాల నుండి సానుకూల విధానాలను ఎలా ఆశించగలరో చెప్పండి’అని ప్రశ్నించారు. ‘ఒక ఉత్తరాది రాష్ట్రంలో ఒక అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచి, తరువాత కేంద్రమంత్రి కూడా అయ్యారు. అంటే, ఈ దేశ ప్రజల తలరాతను రాసే నిర్ణయాలు తీసుకునే యంత్రాంగంలో ఒక భాగమయ్యారు. ఒక్క ఓటు కూడా విలువైనదే. అందుకే యువతీయువకులను, వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను ... అన్నివర్గాలను తప్పనిసరిగా ఓటేయండని ప్రాధేయపడుతున్నాం. కుంటిసాకులు చెప్పి పట్టణ, నగరాల్లోని ఎగువ మధ్య తరగతివారు, చదువుకున్నవారు, సంపన్న వర్గాలవారు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మీరు వేసే ఓటు అందరి బాగు కోసం ఉద్దేశించినది. యువతగా భవిష్యత్తులో ఎక్కువపాత్ర మీదే కదా, మీ నుంచే కొత్త తరం నాయకులు, ఆదర్శ నాయకులు పుట్టుకు రావాలి కదా !’’అని అన్నారు. ‘‘మీలో ఎంత మందికి ఓటు ఉంది, చేతులెత్తండి.’’అన్నప్పుడు కొద్దిమంది మాత్రమే చేతులెత్తడంతో ఆయన కొంత నిరుత్సాహపడ్డారు. జనవరిలో ఓటు నమోదు చేసుకోవచ్చు... ‘కొత్తవారికి ఓటు హక్కు నమోదు చేయడానికి ఎంతో కృషి చేశాం. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. గడువులు కూడా పొడిగిస్తూ ఎన్నోసార్లు అవకాశం కల్పించాం. ఫరవాలేదు. ఇప్పటికయినా మించి పోయిందేమీ లేదు. వచ్చే జనవరిలో ఓటర్ల జాబితా సవరణ జరిగినప్పుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదుకండి. గత సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 19వ తేదీల మధ్య దాదాపు 20 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. వీరు రేపు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలరు కూడా. ప్రజాస్వామ్యం పదికాలాలపాటు పరిఢవిల్లాలంటే ఇటువంటి మార్పు, ఈ చైతన్యం పెద్దఎత్తున రావాలి.’’అని రజత్‌కుమార్ ఉద్బోధించారు. పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా’బటన్ అయినా నొక్కితే, మీ నియోజకవర్గ అభ్యర్థికి మెజారిటీ తగ్గి, తన మీద ప్రజల విశ్వాసం తగ్గిపోతున్నదని తెలుసుకుని జాగ్రత్తపడతారని, బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల్లో కూడా మంచివారిని వడగట్టడం కోసం, వారెటువంటివారో ఓటర్లు తెలుసుకోవడం కోసం నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా పత్రికల్లో, వార్తా చానల్లో ఒకటికి మూడుసార్లు బాగా కనిపించేలా ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించామని ఆయన వివరించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు సి.ఎ.అరుణ్ లుహరుకా, ఉపాధ్యక్షుడు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘నోటా’ నొక్కండి.. మాకు తోడుండండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారానికి దిగాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ కీలకమైన సమయంలో నగరంలోని క్యాబ్ డ్రైవర్లు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఏ పార్టీకి ఓటు వేసినా లాభం లేదంటూ ‘నోటా’పాట అందుకున్నారు. ‘నోటా’పై నొక్కాలని ప్రజలను కోరుతున్నారు. వేలాది డ్రైవర్లు తమ వాహనాలపైన ఈ తరహా పోస్టర్లను అతికించుకొని తిరుగుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ‘నోటా’ప్రచారం పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్ధులను హడలెత్తిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించాయని, ఏ మేనిఫెస్టోలోనూ తమ సమస్యలను ప్రస్తావించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థల మోసాల బారి నుంచి కాపాడాలంటూ రాజకీయ పార్టీలకు, నేతలకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్, భాగస్వాముల మధ్య పోటీని తీవ్రతరం చేసిన క్యాబ్ సంస్థలు తమను తీవ్రంగా దోచుకుంటున్నాయని, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వలేదన్నారు. తమకు సహకారాన్ని అందించని రాజకీయ పార్టీలపైన నమ్మకాన్ని కోల్పోయి ‘నోటా’ప్రచారానికి దిగినట్లు సలావుద్దీన్ తెలిపారు. తెలంగాణ క్యాబ్, ట్యాక్సీ, ఆటో, తదితర సంఘటిత, అసంఘటిత రంగాల్లో కొనసాగుతున్న లక్షలాది మంది డ్రైవర్ల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది డ్రైవర్ల ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. -
అందరి ‘నోటా’..
‘నోటా’ ఇద్దరు అభ్యర్థుల ‘గెలుపు’తో దోబూచులాడింది. ఈ చెల్లని ఓటు నాడు బరిలో నిలిచిన అభ్యర్థుల్లో గుబులు పుట్టించింది. గత ఎన్నికలు మిగిల్చిన చేదు అనుభవంతో ఈసారి ఓట్లు ‘నోటా’కు పోకుండా అభ్యర్థులు ప్రత్యేక ప్రచారం కూడా చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చనప్పుడు ఓటర్లు ‘నో’ చెప్పే ఆయుధం నోటా (నన్ ఆఫ్‌ది అబవ్). ఈ ఓటు గత సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుర్తి, చేవెళ్ల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించింది. 2014 ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలలో ఈ ఆప్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఇలా ప్రవేశపెట్టిన తొలి ఫలితాల్లోనే నోటా దెబ్బ ఎలా ఉంటుందో జిల్లాలో ఇద్దరు అభ్యర్థులకు తెలిసివచ్చింది. 2014లో నోటాకు నమోదైన ఓట్లకంటే స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన రెండు నియోజకవర్గాలు రాష్ట్రంలోనే రెండు కాగా.. ఆ రెండూ రంగారెడ్డి జిల్లాలోనివే కావడం విశేషం. కల్వకుర్తి, చేవెళ్ల శాసనసభ స్థానాల్లో ఓటరు తీర్పులో నోటాయే కీలక భూమిక పోషించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1,52,160 మంది ఓటర్లు ‘నోటా’ నొక్కగా.. రంగారెడ్డి జిల్లాలో 11,019 మంది ఈ మీటకు ఓటేశారు. భయపెడుతోంది.. ఎన్నికల్లో ‘నోటా’కు చాలా ప్రాధాన్యం ఉంది. గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో రెండు చోట్ల గెలిచిన అభ్యర్థుల అధిక్యత కన్నా, ఈ ఓట్లదే పైచేయిగా కనిపించింది. అలా నోటాకు పోలయిన ఓట్లలో కొన్ని తమకు పడినా గెలిచే వాళ్లమన్న బెంగ పరాజితులను వెంటాడింది. అత్యల్ప ఓట్లతో ఓడిపోవడం ఒక ఎత్తయితే.. మెజార్టీ ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో నోటాకు పడడం వారిని కుంగదీసింది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తున్న నోటా.. ప్రస్తుత ఎన్నికల్లోను అభ్యర్థులను దిగాలు పడేలా చేస్తోంది. ఓటు విలువే కాదు.. నోటాకు వేస్తే ఎదురయ్యే పరిణామాలపైనా ఓటర్లను చైతన్య పరచాలని పార్టీ శ్రేణులను అభ్యర్థులు పురమాయిస్తున్నారు. ముఖ్యంగా త్రిముఖ, చతుర్ముఖ పోటీలు ఉండే నియోజకవర్గాల్లో ప్రతి ఓటు విలువైనదే. దీంతో అలాంటి వాతావరణంలో ఉన్న నియోజకవర్గాలలో ఓటర్లు ‘నోటా’కు ఓటు వేయకుండా వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నారు. కల్వకుర్తిలో పరేషాన్ కల్వకుర్తి సెగ్మెంట్లో చివరి రౌండ్ వరకు కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన లెక్కింపులో ఆఖరికి విజయం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డినే వరించింది. విశేషమంటే.. ఇక్కడ నోటాకు పోలైన ఓట్లు ఫలితంపై తీవ్ర ప్రభావం చూపాయి. వంశీచంద్‌రెడ్డి మెజార్టీ కేవలం 78 ఓట్లు మాత్రమే. ఇక్కడ నోటాకు పోలైన ఓట్లు 1,140. ఈ ఓట్లు గనుక ఇరువురు అభ్యర్థులెవరికైనా పడి ఉంటే తీర్పు ఇంకోలా ఉండేది. వంశీకి 42,782 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఆచారికి 42,704 ఓట్లు లభించాయి. చేవెళ్లలోనూ అదే సీన్.. చేవెళ్ల నియోజకవర్గంలోనూ పోటీ రసవత్తరంగా సాగింది. 2009 ఎన్నికలలోనూ గెలుపొటములను తక్కువ ఓట్లే ప్రభావితం చేయగా.. 2014 ఎన్నికలలో కూడా విజేత అత్యల్ప ఓట్ల మెజార్టీతో గెలిచి.. హమ్మయ్యా అనుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్య విజేతగా నిలిచిన గత ఎన్నికల్లో ఆయనకు లభించిన అధిక్యం 781 ఓట్లు. ఇక్కడ నోటాకు పడ్డ ఓట్లు 1,229. యాదయ్యకు 64,182 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి కేఎస్ రత్నంకు 63,401 ఓట్లు దక్కాయి. నోటా ఓట్ల ప్రాధాన్యాన్ని గుర్తు చేసే ఫలితమిది. ...::: డి.వెంకటేశ్వరరెడ్డి -
నచ్చలేదా... నోటా నొక్కుడే
సాక్షి,సదాశివనగర్(ఎల్లారెడ్డి):ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థులు గుర్తులతో పాటు నోటా(నన్ ఆఫ్ ది ఎబవ్)ను ఎర్పాటు చేశారు. సాధారణంగా ఓటర్లు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరికి ఓటు వేసే విధానం చాలా కాలంగా అమలులో ఉంది. 2014 సాధారణ ఎన్నికల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఓటర్లకు ఎవరూ నచ్చకపోతే వారి అభిప్రాయాన్ని తెలపడం కోసం ఈవీఎంలలో నోటాను పొందుపర్చారు. నోటా మీటను నోక్కితే ఆ ఓటు పోలింగ్‌లో ఉన్న ఆభ్యర్ధుల్లో ఎవరికీ చెందదు. అయితే ఓటరు తన ఓటు హక్కును వినియెగించుకున్నట్లు అవుతుంది. ఇలాంటి ఆవకాశం వివిధ దేశాల్లో ఓటర్లకు చాలా కాలాంగా ఆందుబాటులో ఉండగా భారత్‌లో గత సాధారణ ఎన్నికల నుంచి ఆమలులోకి తెచ్చారు. నోటాను ఆమలులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమీషన్ 2009లో తొలిసారి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు నివేదించింది. అప్పట్లో ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించినా పౌర హక్కుల సంస్థ పీయూసీయల్ దీనికి మద్ధతుగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు నోటాను అమలు చేయాలని సుప్రీం కోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పు ఇచ్చింది. దీంతో నచ్చకపోయినా ఎవరికో ఒకరికి ఓటు వేయాల్పిన అవరసవం లేకుండా నోటా నోక్కి అభ్యర్థులు ఎవరూ తనకు నచ్చలేదని ఓటరు తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం లభించింది. 2013లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మిజోరాం, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో నోటాను తోలిసారి అమలులోకి తెచ్చారు. ఆ తర్వాత 2014లో నోటా ఎర్పాటు చేయగా అప్పట్లో దేశవ్యాప్తంగా 1.1 శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. -
పంచాయతీ ఎన్నికల్లోనూ ‘నోటా’
మోర్తాడ్(బాల్కొండ) : ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే విధానంను ఎన్నికల కమిషన్ అమలులోకి తీసుకు వచ్చింది. నోటాకు ఓటు గడచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నుంచి అమలులోకి వచ్చింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. త్వరలో నిర్వహించబోయే పంచా యతీ ఎన్నికల్లో ఓటర్లు నోటాకు ఓటు వేసే చాన్స్ ను ఉపయోగించుకోవచ్చు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోయినా అధికార యంత్రాంగం మాత్రం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ ఉంటే ఎలాంటి గుర్తులను కేటాయిస్తామో అనే ఆంశాన్ని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో సర్పంచ్ స్థానానికి పోటీ ఉంటే కేటాయించే గుర్తులు, వార్డు స్థానాలకు పోటీ ఉంటే కేటాయించే గుర్తులను పరిగణనలోకి తీసుకుని బ్యాలెట్ పత్రాలను ముందస్తుంగా ముద్రించడానికి పంచాయతీ రాజ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్ర వారం నుంచి ఆరు రోజుల పాటు సర్పంచ్, వార్డు స్థానాలకు అవసరమైన బ్యాలెట్ల ముద్రణ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆయా మండలాల అధికారులు బ్యాలెట్ పత్రాల ముద్రణకు సిబ్బందిని కేటాయించారు. ఈవోపీఆర్డీలు, మండల పరిషత్ సూపరిండెంట్లు, పం చాయతీ కార్యదర్శులకు ఆయా మండలాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు అవసరమైన బ్యాలెట్ పత్రాల ముద్రణ విధులను అప్పగించారు. జిల్లా లో 530 సర్పంచ్ స్థానాలతో పాటు 4,932 వార్డు స్థానాలకు ఎన్నికలు మూడు విడతల్లో జరుగనున్నాయి. జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేసిన ప్రింటింగ్ ప్రెస్‌లలో రెవెన్యూ డివిజన్ల వారీగా బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఆర్డర్లను ఇచ్చారు. ఏ సర్పంచ్ స్థానానికి ఎంత మంది, అలాగే వార్డు స్థానానికి పోటీలో ఎంత మంది ఉంటారనే విషయం నామినేషన్ల పరిశీలన, విత్‌డ్రాల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు తెలియదు. నామినేషన్ల పరిశీలన, విత్‌డ్రాలు ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల అధికారి ఫాం 9 జారీ చేస్తేనే ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనే విషయం స్పష్టం అవుతుంది ఫాం 9 జారీ తరువాత ఎన్నికల నిర్వహణకు వారం రోజులే గడువు ఉంటుంది. తక్కువ సమయంలో బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి కాదనే ఉద్దేశంతో ముందస్తుగానే ముద్రణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే గతంలో బ్యాలెట్ పత్రాల్లో గుర్తులను ముద్రించి ఎన్నికల కు ముందుగానే సిద్ధంగా ఉంచేవారు. పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అవసరం ఉన్న గుర్తుల వరకు బ్యాలెట్ పత్రాని ఉంచి అవసరం లేని గుర్తులు ఉన్న పత్రాన్ని చింపివేసేవారు. అయితే ఇప్పుడు ప్రతి బ్యాలెట్ పత్రంలో నోటాకు గుర్తును కేటాయిస్తుండటంతో అంచనాలు వేసి బ్యాలెట్ పత్రాలను ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. నోటాకు ఇంటూ మార్క్‌ను కేటాయించగా ప్రతి బ్యాలెట్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులతో పాటు ఇంటూ మార్క్ ఉన్న గుర్తు ఉంటుంది. అంచనా ఇలా కొన్ని బ్యాలెట్ పత్రాల్లో రెండు ఎన్నికల గుర్తుల తో పాటు మరోటి నోటా గుర్తు ఉంటుంది. అంటే టూ ప్లస్ వన్, త్రీ ప్లస్ వన్, ఫోర్ ప్లస్ వన్, ఇలా గరిష్టంగా 16 గుర్తులతో పాటు ఒకటి నోటాకు అవకాశం ఉంటుంది. కొన్ని స్థానాల్లోనే పోటీ ఎక్కువగా ఉంటుందని ఎక్కువ స్థానాల్లో పోటీ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో బ్యాలెట్ పత్రా ల ముద్రణను ముందస్తుగా చేపట్టారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు సంబంధించి వివిధ సర్పంచ్, వార్డు స్థానాలకు గతంలో పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుం టున్నారు. ఒక వేళ బ్యాలెట్ పత్రాలు తక్కువ అని తేలితే ఇప్పుడు ముందస్తుగా ముద్రించిన వాటికి అదనంగా మరి కొన్నింటిని ముద్రిస్తే సమయం తక్కువ తీసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల్లోను నోటాకు చోటు ఇవ్వడం గ్రామాలలో చర్చనీయాంశం అవుతుందని చెప్పవచ్చు. -
గోవాలో అత్యధికంగా నోటా ఓట్లు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో అత్యధికంగా నోటా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 1.2 శాతం మంది నోటా బటన్‌ను నొక్కినట్లు తేలింది. ఆ తర్వాత స్థానంలో ఒక్క శాతంతో ఉత్తరాఖండ్ నిలిచిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ విజయ ఢంకా మోగించిన ఉత్తరప్రదేశ్‌లో 0.9 శాతం, పంజాబ్‌తో 0.7శాతం, మణిపూర్‌లో 0.5 శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చని సందర్భాల్లో ఓటర్లు నోటాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. -
నేతలకు 'నోటా' దెబ్బ
* 22 నియోజక వర్గాల్లో 5.58 లక్షల నోటా ఓట్లు * అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు * పుదుచ్చేరిలో నోటాకు 13,240 ఓట్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: బలమైన కొండ చిలువ చలిచీమల చేత చిక్కి చచ్చినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు నేతలు కేవలం నోటా ఓట్ల కారణంగా ఓటమి పాలయ్యారు. మొత్తం 22 నియోజకవర్గాల్లో 5.58 లక్షల మంది నోటాకు ఓటు వేసి అన్ని పార్టీల నేతలపై అయిష్టతను చాటుకున్నారు. కొందరు అభ్యర్థులను ఓటమి పాలుచేయడంలో నోటా ఓటర్లు కీలపాత్ర పోషించారు. ఎన్నికల్లో పోటీచేసే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం, ప్రతి అభ్యర్థికి ఓ చరిత్ర ఉంటుంది. పార్టీల సిద్ధాంతాన్ని, అభ్యర్థి నేపథ్యాన్ని ఇష్టపడని ప్రజలు ఓటును నోటాకు వేసి తమ నిరసనను వ్యక్తం చేసే వెసులుబాటు ఈవీఎంలలో ఉంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు గానూ 232 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. గురువారం ఓట్ల లెక్కింపు పూర్తికాగా 22 నియోజకవర్గాల్లో 5.58 లక్షల మంది నోటాకు ఓట్లు వేయడం ఎన్నికల కమిషన్‌ను ఆశ్చర్యపరిచింది. అంటే మొత్తం పోలైన ఓట్లలో 1.3 శాతం మంది నోటాకు ఓటువేశారు. ఈ నోటా ఓట్లు ఓ విధంగా అన్నాడీఎంకే అభ్యర్థులకు మేలుచేశాయి. 22 నియోజకవర్గాల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు నోటా ఓట్ల కంటే తక్కువ మెజార్టీలో గెలుపొందారు. రాధాపురం డీఎంకే అభ్యర్థి 47 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో 1831 మంది నోటాకు ఓటు వేశారు. వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ అన్నాడీఎంకే అభ్యర్థి చేతిలో కేవలం 87 ఓట్ల తేడాతో ఓటమిపాలైనారు. ఈ నియోజకవర్గంలో నోటాకు 1025 ఓట్లు పడ్డాయి. ఇలా అనేక నియోజకవర్గాల్లో నోటా ఓట్ల కారణంగానే అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపు బాటపట్టారు. రాధాపురం, కాట్టుమన్నార్ కోవిల్, అన్నానగర్, ఆవడి, పెరంబూరు, తిరుపోరూరు, తిరుమయం, తిరునెల్వేలీ, తిరువిడైమరుదూర్, కోవిల్పట్టి, మడత్తుకుళం, కినత్తుకడవు, కరూరు, కడైయనల్లూరు, చిదంబరం, సెయ్యూరు, పర్కూరు, తెన్‌కాశీ, పేరావూరణి, పాపిరెడ్డిపట్టి, ఓట్టాభిటరాంలలో నోటా ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించాయి.మదుైరె తిరుమంగళంలో పీఎంకే అభ్యర్థి కన్నయ్యకు కేవలం 843 ఓట్లు రాగా, ఆయన కంటే నోటాకే ఎక్కువ (1,572) ఓట్లు పడ్డాయి. తిరువళ్లూరు జిల్లా లో సుమారు 3వేల ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే ఈరోడ్డు, తూత్తుకూడి జిల్లాల్లో 34,278 ఓట్లు నోటాకు వేయడం ద్వారా అభ్యర్థులపై తమ అయిష్టతను చాటుకున్నారు. పుదువైలో నోటాకు 13,240 ఓట్లు: పుదుచ్చేరిలో 30 నియోజవర్గాల్లో మొత్తం 13,240 ఓట్లు నోటాకు వేశారు. తట్టాంజావడి నియోజకర్గంలో అత్యధికంగా 922 ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే మాకోయిల్ నియోజక వర్గంలో 109 ఓట్లు నోటాకు వేశారు. -
నోటా...ఎవరి కోటా?
సాక్షి, విశాఖపట్నం:నిజంగా అసలు అభ్యర్థులెవరూ నచ్చకపోవడంతో పోలైన ఓట్లా? లేదంటే ఒకరికి వేయాలనుకున్న ఓట్లు చివరకు నోటాకు పడ్డాయా? అనేదానిపై చర్చ జరుగుతోంది. అసలెందుకిలా జరిగిందనేదానిపై అన్ని వర్గాలు ప్రస్తుతం కిందామీద పడుతున్నాయి. వాస్తవానికి నోటా ఓట్లపై మైదాన ప్రాంతంలో కొంతవరకు అవగాహన ఉంది. దీంతో శుక్రవారం నాటి ఓట్ల లెక్కింపులో చాలా నియోజక వర్గాల్లో కొద్దొగొప్పొ అన్నట్లు 1500 లోపే నమోదయ్యాయి. కాని అసలేమాత్రం విస్తృత ప్రచారం లేని ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరగడంతో అసలేం జరిగిందనేది అంతుపట్టక పార్టీలు,అధికారులు ఆలోచనలో పడ్డారు. అరకు అసెంబ్లీ పరిధిలో 6,350, పాడేరు అసెంబ్లీ పరిధిలో 2,822, అరకు లోక్‌సభ స్థానంలో నోటాకింద 16,245 నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు మన్యంలోని ఈ ఓట్లపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు రకరకాల వాదనలు వినిపిస్తుండగా, కొందరు స్వతంత్ర అభ్యర్థులు సైతం నోటా ఓట్లు తమవిగా చెబుతున్నారు. అరకులో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తన ప్రచారంలో భాగంగా ఓటేసేటప్పుడు చివర్లో తనపేరు, గుర్తు ఉంటుందని ప్రచారం చేశారు. అయితే చివర్లో ఈయన పేరుకు ముందు నోటా ఓటు విభాగం ఉంది. దీంతో కుంభాకు వెళ్లాల్సిన ఓట్లన్ని నోటాకు పడ్డాయని పలువురు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ఈయనకు మొత్తం 25,548 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి సోమకు 29,485 ఓట్లు వచ్చాయి. నోటాకు 6.350 పోలయ్యాయి. దీంతో ఇవన్నీ తనకు రావలసిన ఓట్లేనని కుంబా వాదిస్తున్నారు. పోనీ ఈ వాదన సరైందే అనుకుంటే అటు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 2,822 నోటా ఓట్లు పోలయ్యాయి. వాస్తవానికి నోటాపై ఏజెన్సీలో కనీసం ప్రచారం లేని నేపథ్యంలో ఈ ఓట్లు ఏదొక అభ్యర్థి అనుకుని వేసి ఉంటారని పలువురు వివరిస్తున్నారు. అటు అరకు పార్లమెంట స్థానం పరిధిలో ఏకంగా 16,245 ఓట్లు పోలవడం రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లుగా చెబుతున్నారు. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన అరకు పార్లమెంట్లో ఇన్ని ఓట్లు పోలవడంపైనా అనేక రకాల వాదనలు పెరుగుతున్నాయి. చివరి నుంచి మొదటగా ఉన్న నోటా ఓటు విభాగం ఏదైనా అభ్యర్థిదేమోనని ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో చాలామంది భ్రమపడి ఓట్లు వేశారా అనే అంచనాలు నెలకొన్నాయి. నోటాపై ప్రచారం లేని మన్యంలో దీనికి ఇన్ని ఓట్లు పోలవడంతో పొరపాటుగా పడ్డవేనని అధికారులు వివరిస్తున్నారు.