సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లు నోటాకూ భారీగా ఓటు వేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చక పోవడంతో వార ంతా నోటా మీట నొక్కారు. గ్రేటర్ పరిధి లో 24 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 38,974 మంది నోటాకు ఓటు వేయడం గమనార్హం. నోటా ఓట్లు అత్యధికంగా నమోదైన నియోజక వర్గాల్లో మేడ్చల్ 3402 ఓట్లతో మొదటిస్థానంలో నిలువగా, కుత్బుల్లాపూర్ 2976 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎల్బీనగర్ 2858, ఉప్పల్ 2712ఓట్లు, శేర్‌లింగంపల్లి 24444 ఓట్లతో వరుస స్థానాల్లో నిలిచాయి. ముషీరాబాద్ 1545, అంబర్‌పేట్ 1462, మహేశ్వరం 2171, మలక్‌పేట్ 498, మల్కజ్‌గిరి 1630, కంటోన్మెంట్ 1571, సికింద్రాబాద్ 1582, సనత్‌నగర్ 1464, కూకట్‌పల్లి 2134, జూబ్లిహిల్స్ 1491, ఖైరతాబాద్ 1371, రాజేంద్రనగర్ 1664, బహదుర్ పురా1210, యాకుత్‌పుర 777, చాంద్రాయణగుట్ట 1009, నాంపల్లి 793, గోషామహల్ 709, కార్వాన్ 887, చార్మినార్ 614 ఓట్లు నోటాకు నమోదు కావడం గమ నార్హం. మేడ్చల్‌లో అత్యధికంగా నమోదు కాగా...చార్మినార్‌లో అత్యల్పంగా నమోదు కావడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment