హైదరాబాద్: శాసనసభ ఎన్నికలలో నోటా ఓట్లు కీలకమని మరోసారి రుజువైంది. బరిలోకి దిగిన అభ్యర్థులు నచ్చకపోతే నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) గుర్తును నొక్కే అవకాశం ఉండటంతో ఈసారి నోటాకు ఓట్లు బాగానే పడ్డాయి. గ్రేటర్‌లోని చాలా నియోజకవర్గాలలో మూడు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో 15,418 రాగా.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 12,824 వచ్చాయి. హైదరాబాద్‌లో నోటాకు 16,222 ఓట్లు పోలయ్యాయి.
అత్యధికం కుత్బుల్లాపూర్, అత్యల్పం నాంపల్లి..
అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో నోటాకు 4,079 ఓట్లు రాగా.. అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లొచ్చాయి. చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య గెలిచిన మెజారిటీ కంటే నోటా ఓట్లే ఎక్కువ ఉండటం కొసమెరుపు. ఇక్కడ యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్‌పై 268 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నోటాకు వచి్చన ఓట్లు 1,423 కావడం గమనార్హం. యాకుత్‌పురలో 878 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 704.
నోటా ఓట్లు గతంలో కంటే తక్కువే..
అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్లు నోటా ఓట్లు తక్కువే పోలయ్యాయి. గత ఎన్నికలలో మూడు జిల్లాలతో కూడిన గ్రేటర్‌లో నోటాకు 44,935 ఓట్లు రాగా.. తాజా ఫలితాల్లో 471 తగ్గి నోటాకు 44,464 ఓట్లొచ్చాయి. గతంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నోటాకు 17,078 ఓట్లు రాగా.. ఈసారి 16,222కు తగ్గాయి. రంగారెడ్డిలో గతంలో 13,242 ఓట్లు పోలవగా.. ఇప్పుడు 12,824 వచ్చాయి. మేడ్చల్–మల్కాజ్‌గిరిలో గతంలో 14,615 ఓట్లు రాగా.. ఈసారి 803 ఓట్లు ఎక్కువొచ్చాయి. తాజా ఫలితాల్లో నోటాకు 15,418 ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment