quthbullapur
-
‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్: నిత్యం క్రయవిక్రయదారులతో రద్దీగా ఉండే కుత్బుల్లాపూర్ రిజిస్ట్రార్ కార్యాలయం మూడు నెలలుగా దాదాపుగా వెలవెలబోతోంది. దీనికి కార ణం కేవలం ఒక్క పదమే కారణమంటే ఆశ్చర్యంగా ఉన్నా, అదే నిజం. ఉన్నతాధికారుల ఉత్తర్వుల్లో ‘మరియు’అనే పదం స్థానంలో ‘నుండి’ అనే పదం టైపింగ్ చేయడమే ఆ పరిస్థితికి కారణం. అప్పటి ‘నుండి’ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆ ఒక్క పదంతో రెండు సర్వే నంబర్లకు బదులు ఏకంగా 168 సర్వే నంబర్లలోని వందల ఎకరాల స్థలాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. దీనికి హైడ్రా కూడా తోడవడంతో క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రతిరోజు 100కుపైగా జరిగే రిజిస్ట్రేషన్లు సగానికి తగ్గిపోయాయి. ‘మరియు’కు బదులు ‘నుండి’ కుత్బుల్లాపూర్ టౌన్ పరిధిలో 58, 226 సర్వే నంబర్లలో వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో వాటిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టరాదని వక్ఫ్ బోర్డు ఆగస్టు 27న ఆదేశాల జారీ చేసింది. ఆదేశాలలో 58 మరియు 226 సర్వే నంబర్లు అని టైపు చేయకుండా పొరపాటున 58 సర్వే నంబర్ నుండి 226 సర్వే నంబరు వరకు అని టైపు చేయడంతో ఏకంగా 168 సర్వే నెంబర్లపై ఈ ఎఫెక్ట్ పడింది. దీంతో వందల ఎకరాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేశారు. చదవండి: మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!వాస్తవానికి నిలిపివేసిన సర్వే నంబర్లలో వక్ఫ్‌బోర్డ్ స్థలం మొత్తం కేవలం ఒక ఎకరం ఒక గుంట స్థలం ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 నెలల నుంచి నిలిచిపోవడంతో 50 కాలనీలు, పలు బస్తీల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వెంటనే ఆదేశాల్లో దొర్లిన పొరపాటును సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ‘రిజిస్ట్రేషన్లు సగం మేర తగ్గిపోవడంతో డాక్యుమెంట్ రైటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, 5 హోటల్స్, మనీ ట్రాన్స్ఫర్ సెంటర్లు బోసిపోతున్నాయి’అని రవీందర్ ముదిరాజ్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కాలుష్య కోరల్లో కుత్బుల్లాపూర్
-
ఇంట్లో చనిపోయిన మహిళతోనే వారంపాటుగా సాధారణ జీవితం
-
ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..
హైదరాబాద్: శాసనసభ ఎన్నికలలో నోటా ఓట్లు కీలకమని మరోసారి రుజువైంది. బరిలోకి దిగిన అభ్యర్థులు నచ్చకపోతే నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) గుర్తును నొక్కే అవకాశం ఉండటంతో ఈసారి నోటాకు ఓట్లు బాగానే పడ్డాయి. గ్రేటర్‌లోని చాలా నియోజకవర్గాలలో మూడు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 15,418 రాగా.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 12,824 వచ్చాయి. హైదరాబాద్‌లో నోటాకు 16,222 ఓట్లు పోలయ్యాయి. అత్యధికం కుత్బుల్లాపూర్, అత్యల్పం నాంపల్లి.. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో నోటాకు 4,079 ఓట్లు రాగా.. అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లొచ్చాయి. చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య గెలిచిన మెజారిటీ కంటే నోటా ఓట్లే ఎక్కువ ఉండటం కొసమెరుపు. ఇక్కడ యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్‌పై 268 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నోటాకు వచి్చన ఓట్లు 1,423 కావడం గమనార్హం. యాకుత్‌పురలో 878 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 704. నోటా ఓట్లు గతంలో కంటే తక్కువే.. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్లు నోటా ఓట్లు తక్కువే పోలయ్యాయి. గత ఎన్నికలలో మూడు జిల్లాలతో కూడిన గ్రేటర్లో నోటాకు 44,935 ఓట్లు రాగా.. తాజా ఫలితాల్లో 471 తగ్గి నోటాకు 44,464 ఓట్లొచ్చాయి. గతంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో నోటాకు 17,078 ఓట్లు రాగా.. ఈసారి 16,222కు తగ్గాయి. రంగారెడ్డిలో గతంలో 13,242 ఓట్లు పోలవగా.. ఇప్పుడు 12,824 వచ్చాయి. మేడ్చల్–మల్కాజ్‌గిరిలో గతంలో 14,615 ఓట్లు రాగా.. ఈసారి 803 ఓట్లు ఎక్కువొచ్చాయి. తాజా ఫలితాల్లో నోటాకు 15,418 ఓట్లు వచ్చాయి. -
కుత్బుల్లాపూర్ లో BRS అభ్యర్థి కేపీ వివేకానంద నామినేషన్
-
Telangana: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కోల్డ్‌వార్!
కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ల మధ్య కోల్డ్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ రోజు ఎమ్మెల్సీ రాజు వర్గానికి చెందిన ఏ ఒక్కరూ ప్రజాప్రతినిధి, నాయకులు హాజరు కాకపోవడం చర్చగా మారింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద హాజరైనా ఈ కార్యక్రమానికి శంభీపూర్‌రాజు డుమ్మా కొట్టడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మరింత దూరం పెంచిందనే చెప్పుకోవచ్చు. ఆహా్వనం లేదని ఎమ్మెల్సీ వర్గం.. ఉన్నా కావాలనే తప్పించుకున్నారని ఎమ్మెల్యే వర్గం ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రి హరీష్‌రావు చొరవ తీసుకున్నా... కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ఎమ్మెల్సీ వర్గీయులు మొత్తం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి ఒకరికి ఒకరు దొరక్కుండా దోబూచులాడారు. చివరకు ఎమ్మెల్సీ రాజు ఇంట్లో ఎమ్మెల్యే వివేకానంద భేటీ కావడంతో ఇక సమస్య పరిష్కారం అయిందని అందరూ భావించారు. మంత్రి హరీష్ రావు చొరవతో ఇలా జరిగిందని పుకార్లు షికారులు చేశాయి. ► కానీ ఈ నెల 2 తేదీన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించే విషయంలో జరిగిన బహిరంగ సభకు ఇటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గాని అటు నిజాంపేట కార్పొరేషన్ ౖచైర్మన్ నీలా గోపాల్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి, కౌన్సిలర్లు ఏ ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం. అంతేకాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఓ రిసార్ట్‌లో ప్రజాప్రతినిధులు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేయడం కావాలనే ఓ పథకం ప్రకారం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు స్పష్టమైంది. ‘భీఫాం’పైనే... ఇప్పుడు హాట్ టాపిక్.! కుత్బుల్లాపూర్ అభ్యరి్థగా ఎమ్మెల్యే వివేకానంద్‌కు మూడోసారి అవకాశం కలి్పస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ నియోజకవర్గంలో కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు, ప్రజాప్రతినిధులు డిలోమాలో పడ్డారు. ఒకరి వెంట తిరిగితే మరొకరు దూరమవుతారన్న నెపంతో అంటిముట్టునట్లుగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థి విజయం కోసం ర్యాలీలు, విజయోత్సవ సభలు నిర్వహిస్తూ రాగా కుత్బుల్లాపూర్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ►ఎమ్మెల్సీ రాజు వర్గం నియోజకవర్గ వ్యాప్తంగా శంభీపూర్ రాజుకే టికెట్ వస్తుందని ప్రచారం కలి్పస్తూ అభ్యరి్థగా ప్రకటించిన వివేకానంద్‌కు బీ–ఫాం ఇవ్వరని చెబుతూ రావడం ఇప్పుడు స్థానికంగా చర్చగా మారుతుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లిన సందర్భంలో సైతం ఎడమొహం.. పెడమొహం గానే మాట్లాడుకొని రెండు గంటలసేపు ఉన్నప్పటికీ తర్వాత జరిగిన పరిణామాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఏది ఏమైనాపటికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వీరివివాదంపై దృష్టి సారించే వరకు ఇదే పరిస్థితి నియోజకవర్గంలో నెలకొని ఉంటుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
పక్క ఇళ్లపై ఒరిగిన పాతభవనం
-
అందరూ రెడ్డిలే.. టికెట్ నాకే అంటూ ప్రచారం.. అదృష్టం ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలోలో జోరు పెరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ పార్టీ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో అన్న విషయాన్ని స్పష్టంగా వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సొంటిరెడ్డి పున్నారెడ్డి 2018 నుంచి సీపీఆర్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయనకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండదండలు పుష్కలంగా ఉండగా రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉందని ప్రచారం చేసుకుంటున్నాడు. ► అదేవిధంగా 1986 నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న మరో ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి సైతం తనకి టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించి ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. రేవంత్‌రెడ్డి ఆశీస్సులు సైతం ఉన్నాయని ప్రచారం ఉంది. ► ఇదే క్రమంలో పీసీసీ ప్రతినిధి కొలను హనుమంత్‌రెడ్డి 70 రోజులుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రను చేస్తున్నారు. తప్పకుండా ప్రజల్లో ఉంటున్న ఆయన టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. ► అదేవిధంగా మొదటి నుంచి టీపీసీసీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా ఉండే జ్యోత్స్నా శివారెడ్డి సైతం టికెట్ కోసం రేసులో ఉన్నారు. ► అయితే పార్టీ అధిష్టానం ఈ నలుగురిలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్నది అంతుచిక్కకుండా ఉంది. ఎవరికివారు పోటీపడి ప్రచారంలో మునిగిపోతూ తమ ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతుండగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ వరించే అవకాశం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
ఇద్దరి చూపు అసెంబ్లీపైనే! నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారే అవకాశం కల్పిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటికే 2014 (టీడీపీ), 2018లో (టీఆర్ఎస్) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా వివేకానంద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి టికెట్ రేసులో తానూ ఉన్నానని ఇప్పటికే తన అనుచరుల ద్వారా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సంకేతాలు పంపడంతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్ విషయం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. సాక్షి, కుత్బుల్లాపూర్: ఇప్పటికే సిట్టింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే వివేకానంద అదే పార్టీకి చెందిన వ్యక్తి కావడం ఈ ఇద్దరి మధ్య గత సంవత్సర కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ముచ్చటగా మూడోసారి తనకి టికెట్ వస్తుందనే ధీమాతో ఎమ్మెల్యే వివేకానంద ముందుకు సాగుతుండగా.. కాదు ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ శంభీపూర్ రాజుకు టికెట్ కన్ఫర్మ్ అంటూ ఆయన అనుచరులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి 2014, 2018లో రెండు పర్యాయాలు ఉద్యమ నాయకుడిగా ఉన్న శంభీపూర్ రాజు టికెట్ ఆశించి భంగ పడ్డాడు. 2023లో జరిగే ఎన్నికల్లో తనకు తప్పకుండా అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారన్న పూర్తి నమ్మకంతో ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు. ఎమ్మెల్సీకి మద్దతుగా కార్పొరేటర్లు.. అంతేకాకుండా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, విజయశేఖర్గౌడ్లతో పాటు కార్పొరేటర్ల భర్తలు మహమ్మద్ రఫీ, సురేష్‌రెడ్డిలు ఇప్పటికే ఎమ్మెల్సీ రాజుకు పూర్తి మద్దతు పలికి ఆయన వెంట తిరుగుతున్నారు. పైన పేర్కొన్న కార్పొరేటర్లు సైతం సంవత్సర కాలంగా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కౌన్సిలర్లకు టచ్‌లో ఉంటూ.. స్థానిక సమస్యలు పరిష్కరిస్తూ.. ఇదే క్రమంలో కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్లకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రతిరోజు టచ్‌లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.అదే విధంగా నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో సైతం కార్పొరేటర్లుగా కొనసాగుతున్న వారి స్థానిక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతూ వస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ అంతేకాకుండా గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం కుత్బుల్లాపూర్ మండల కార్యాలయంగా కొనసాగుతున్న ఇంటిని సైతం అద్దెకు తీసుకొని ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించు కున్నట్లు సమాచారం. తనకే టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఎమ్మెల్యే! ఇదే క్రమంలో ఎమ్మెల్యే వివేకానంద సైతం ద్వితీయ శ్రేణి నాయకులతో డివిజన్ అధ్యక్షులను కలుపుకుని ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకు అధినేత కేసీఆర్ టికెట్ ఇస్తారన్న పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. ఏది ఏమైనా ఈసారి టికెట్ విషయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎయిమ్స్‌లో సీటు సాధించాలనే కోరిక.. ఆ ఒత్తిడితోనే..
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పదంగా ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల డివిజన్ దండమూడి ఎన్‌క్లేవ్‌లో నివాసముండే శ్రీరామదుర్గాప్రసాద్, అరుణ దంపతుల కుమార్తె శ్వేత(17) మారేడ్‌పల్లిలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 1వ తేదీ రాత్రి 9.30 గంటలకు శ్వేతతో కలిసి అరుణ బెడ్రూమ్లో నిద్రించింది. 2న ఉదయం 5.30 గంటలకు నిద్ర లేచి చూసేసరికి కుమార్తె కనిపించలేదు. అయితే స్టడీరూమ్‌లో చదువుకుంటోందని వెళ్లి చూడగా శ్వేత చున్నీతో సీలింగ్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు యువతిని కిందికి దించి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించాలనేది తన కుమార్తె కోరికని, ఆ ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (ఎయిర్ ఇండియాకు జరిమానా) ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మౌలిక వసతులకు పెట్టింది పేరుగా తెలంగాణ
కుత్బుల్లాపూర్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో మౌలిక వసతులకు పెట్టింది పేరుగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, నచ్చిన ప్రాపర్టీ కొనుక్కుని సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా సాధ్యమవుతోందని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. కొంపల్లి అస్పిసియస్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజులపాటు కొనసాగే ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో నార్త్‘ను ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పక్కా అనుమతులు, కచ్చితమైన సౌకర్యాల కల్పనలో క్రెడాయ్పై ప్రజలకు గట్టి నమ్మకం ఉన్నదన్నారు. మేడ్చల్‌కు దాదాపు 22 లక్షల స్క్వేర్ ఫీట్ల గేట్ వే ఆఫ్ ఐటీ పార్క్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిర్మాణ రంగం ఊపందుకుంటోందని తెలిపారు. ధరణి సమస్యలు పరిష్కరించండి: క్రెడాయ్ ప్రతినిధులు కాగా.. క్రెడాయ్ సభ్యులు నిర్మాణ సమయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ధరణి రికార్డుల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికే కనీసం 6 నెలలు సమయం పడుతోందని, ఇది నిర్మాణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. మురుగునీటి సమస్య, కనెక్టివిటీ రోడ్లు, ధరణి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రాపర్టీ షోలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డితో పాటు క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు జి.ఆనంద్‌రెడ్డి, కె.రాజేశ్వర్, ఎన్.జైదీప్‌రెడ్డి, బి.జగన్నాథ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌర, శివరాజ్ ఠాకూర్, కె.రాంబాబు, పలు ఆర్థిక సంస్ధలు, సందర్శకులు పాల్గొన్నారు. -
‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని
సాక్షి, హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన నారాయణరావు కుమారుడు హర్షిత్(20) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మైసమ్మగూడలోని శ్రీకాంత్‌రెడ్డి హాస్టల్లో ఉంటూ ప్రతి రోజు కాలేజీకి వెళ్లి వస్తుండేవాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్టల్ గదికి చేరుకున్న హర్షిత్ సాయంత్రం 4 గంటల సమయంలో తోటి స్నేహితులు వచ్చే సరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న వారు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా.. ‘చిన్న చిన్న తప్పులు చేశాను.. స్నేహితుల వద్ద అప్పులు కూడా తీసుకున్నాను.. చదువులో సైతం పూర్‌గా ఉన్నాను.. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్న’ అంటూ సెల్ఫీ వీడియో ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా తండ్రి నారాయణరావు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఫోన్ ఓపెన్ అయితే తెలుస్తుందన్న తండ్రి అనుమానం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా! -
పరిచయమైన మూడు రోజులకే పెళ్లి చేయాలంటూ.. యువకుడి హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఒకరోజు చూశాడు.. రెండో రోజు మాట్లాడాడు.. మూడో రోజు బిల్డింగ్ ఎక్కి ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేయండి.. లేదంటే చేస్తాను.. అంటూ ఓ యువకుడు హల్చల్ చేయడంతో కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి గ్రామంలో కలకలం రేపింది. పేట్‌బషీరాబాద్ ఎస్ఐ భాను, స్థానికుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా రాళ్లకల్ గ్రామానికి చెందిన కదిరి ఆంజనేయులు దూలపల్లిలో ఉంటున్న తన మామ ఇంటికి వచ్చి స్థానికంగా పని చేసుకుంటూ అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ మైనర్(13) అమ్మాయిని చూశాడు. రెండో రోజు ఆమెతో మాట కలిపాడు. ఇంతలో ఏమైందో ఏమో.. న కు ఆ పిల్లను ఇచ్చి పెళ్లి చేయమని శనివారం ఉదయం ఐదంతస్తుల బిల్డింగ్ ఎక్కి హల్చల్ చేయడం కలకలం రేపింది. ఈ విషయాన్ని స్థానికులు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి సమా చారం ఇచ్చారు. సదరు యువకుడు సై తం 100కు డయల్ చేసి తాను ఆత్మహకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు కొద్దిసేపు యువకుడితో మాటలు కలిపి స్థానికుల సాయంతో నాలుగు తగిలించి కిందకు తీసుకు వచ్చారు. సదరు అమ్మాయిపై ప్రేమ విషయాన్ని చెబుతూ రావడంతో స్థానికులు ఆరా తీయగా చిన్నారి మైనర్ అని తేలింది. ఈ మేరకు పోలీసులు న్యూసెన్స్ కేసు కింద సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చదవండి: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ -
పిట్టకొంచెం కూతఘనం
-
ఆల్ రౌండర్
-
కుత్బుల్లాపూర్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, కుత్బుల్లాపూర్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుడు, ఓ విటుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గత కొంతకాలంగా వెన్నెలగడ్డ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని మసాజ్ సెంటర్ నిర్వహిస్తూ వస్తున్నారు. అపార్ట్‌మెంట్‌కు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో గత నెలలో పలుసార్లు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. ఈ క్రమంలో పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మసాజ్ సెంటర్‌కు కస్టమర్ లాగా వెళ్లి కూపీ లాగారు. ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో ముగ్గురు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తండ్రి గేమ్ ఆడొద్దన్నాడని టెన్త్ విద్యార్థిని దారుణం.. -
కుత్బుల్లాపూర్: ఆరు రోజులాయె.. అతనెక్కడా..?
సాక్షి, కుత్బుల్లాపూర్: నాలాలో పడి గల్లంతైన వ్యక్తి జాడ ఆరు రోజులు గడుస్తున్నా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన రాత్రి 7 గంటలకు కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీపీఆర్ కాలనీలోని తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మోహన్‌రెడ్డి స్థానికంగా ఉన్న రాయల్ వైన్స్‌లో తన తోటి స్నేహితులు మురళికృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డిలతో మద్యం సేవించి ఇంటికి బయల్దేరుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భయంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన తోటి స్నేహితులు మరుసటి రోజు వరకు కుటుంబ సభ్యులకు తెలుపకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో 26వ తేదీ ఆదివారం సాయంత్రం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించిన మోహన్‌రెడ్డి భార్య భార్గవి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపడుతున్న ఈ క్రమంలో వైన్స్ దుకాణం వద్ద జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే నాలాలో పడి అదృశ్యమైన మోహన్‌రెడ్డి ఆచూకీ దొరకడం కష్టంగా మారింది. చదవండి: ఘరానా దొంగ: కారులో రెక్కీ.. ఇళ్లలో చోరీ కొంపముంచిన కక్కుర్తి... ► కుత్బుల్లాపూర్ గ్రామంలోని నాలాకు ఆనుకొని ఉన్న రాయల్ వైన్స్ నిర్వాహకుల కక్కుర్తి వల్ల వ్యక్తి అదృశ్యానికి కారణమైంది. వైన్స్ షాప్‌లో లభ్యమయ్యే వ్యర్థాలను పడేసే విధంగా గ్రేటర్ అధికారులు ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. గత రెండేళ్లుగా ఇదే తరహాలో చెత్తను వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న మోహన్‌రెడ్డి అకస్మాత్తుగా నాలాలో పడి కొట్టుకుపోవడం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ► అంతేకాకుండా కేసు విషయాలను తెలుసుకునేందుకు గురువారం కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత సర్కిల్ ఉప కమిషనర్ మంగతాయారు ముందే చెత్త వేస్తున్న విషయాన్ని గుర్తించి రూ.లక్ష జరిమానా వేయడం విశేషం. చదవండి: ఉన్నతాధికారులతో పరిచయాలు.. రూ. 10 కోట్లతో వ్యాపారి అదృశ్యం బాధ్యులెవరు..? ►సెప్టెంబర్ 25వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్ రెడ్డి సమీపంలో ఉండే స్నేహితులు మురళీకృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి ముగ్గురు కలిసి మద్యం షాప్‌కు వెళ్లారు. ► అదే రోజు రాత్రి మోహన్‌రెడ్డి నాలాలో పడి గల్లంతవ్వగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. సంఘటన జరగగానే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు అటు పోలీసులకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ► సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా గమనిస్తే మోహన్‌రెడ్డి జారిపడుతున్న క్రమంలో పక్కనే మరో వ్యక్తి అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యం పోలీసులు గుర్తించారు. ► కాగా కింద పడే క్రమంలో ఎవరైనా తోసేశారా? లేదా ప్రమాదవశాత్తు పడిపోయాడా? అన్న విషయంపై స్పష్టత కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ► మూడు రోజుల తర్వాత మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ► శనివారం రాత్రి వర్షం ఓ మోస్తరుగా ఉండగా ఆదివారం సోమవారం కుండపోత వర్షం పడింది. ► ఈ క్రమంలో గల్లంతైన మోహన్ రెడ్డి అందులో కొట్టుకుపోయి ఉంటాడని బీఆర్ఎఫ్ బృందం సభ్యులు తెలిపారు. జల్లెడ పడుతున్న పోలీసులు... ► మోహన్‌రెడ్డి ఆచూకీ కోసం జీడిమెట్ల సీఐ బాలరాజు నేతృత్వంలో బీఆర్ఎఫ్ బృందం కుత్బుల్లాపూర్, వెంకటేశ్వరనగర్, గణేష్‌నగర్, పాపయ్యయాదవ్ నగర్, హెచ్ఏఎల్ కాలనీ, బాలానగర్ తదితర ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న నాలా వెంట గాలింపు ముమ్మరం చేశారు. ► ఇదే విషయంపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత తమ సిబ్బందితో గాలింపులో పాల్గొన్నారు. ► విషయాన్ని గోప్యంగా ఉంచడం మూలంగా అతడి ఆచూకీ కనుక్కునే పరిస్థితి ఈ విషయంలో జాప్యం జరుగుతుందని ఇన్స్పెక్టర్ బాలరాజు ‘సాక్షి’తో అన్నారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు.. డెంగీతో యువ డాక్టర్ మృతి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకపక్క ప్రజలు జలుబు, దగ్గుతో బాధపడుతుండగా.. మరోవైపు విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి ప్రాణాలు తీస్తున్నాయి. ప్రబలుతున్న వ్యాధులపై సాక్షి ప్రత్యేక కథనం. – కుత్బుల్లాపూర్ ► కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో చెత్తా చెదారాలకు తోడు ఆయా ప్రాంతాల్లో పందులు, దోమల బెడద అధికంగా ఉంది. ► మలేరియా సిబ్బంది తూతూ మంత్రంగా కాలనీల్లో పర్యటిస్తూ పనులు చేస్తున్నా దోమలు విజృంభిస్తున్నాయి. ► దీంతో అనేకమంది డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ► ఓ యువ డాక్టర్ ప్రస్తుతం డెంగీతో మరణించడంతో స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతోంది. ► నిజామాబాద్‌కు చెందిన అర్పిత రెడ్డి (32) జీడిమెట్ల డివిజన్ మీనాక్షి ఎస్టేట్స్‌లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. 5 రోజుల క్రితం త్రీవమైన జ్వరం రావడంతో నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించగా డెంగీగా తేలింది. చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మృత్యువాత పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈమెకు ఒక కూతురు ఉంది. ఓ డాక్టర్ విధంగా డెంగీతో చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. పత్తాలేని వైద్యాధికారులు... చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి! ► ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలం మురికివాడల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన వైద్య ఆరోగ్య అధికారులు పత్తా లేకుండా పోవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. ఒకవైపు విషజ్వరాలు సోకి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికం అవుతోంది. స్థానికంగా పారిశుద్ధ్యం విషయంలో జంట సర్కిల్ వైద్యాధికారులు తమ పరిధి కాదన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గాజులరామారం సర్కిల్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఫొటోలకే పరిమితం అన్నట్లుగా స్థానికంగా విధులు నిర్వహించే వైద్యాధికారి తీరుపై పలు మురికివాడ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు.. ► కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ కేసులు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో విష జ్వరాలు సోకడం వల్ల మరింత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు. మీనాక్షి ప్రాంతానికి చెందిన ఓ మహిళ సుచిత్ర సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతుండగా, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల పేట్‌బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడింది. -
బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..
సాక్షి, కుత్బుల్లాపూర్: ఒక ద్విచక్ర వాహనానికి ఏకంగా 65 చలాన్లు ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. సుచిత్ర లయోలా కాలేజీ వద్ద బుధవారం రాత్రి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అల్వాల్‌కి చెందిన సయ్యద్ సాజిద్ (టీఎస్ 10 ఈపీ 8619) ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం చలాన్ల గురించి ఆరా తీయగా 64 ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 23,580 రూపాయలు అపరాధ రుసుం ఉన్నట్లు తెలుసుకుని రసీదు ఇచ్చి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే ఈ వాహన వివరాలు తనిఖీ చేయగా ఉమారామ్నగర్ అల్వాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా తేలింది. అయితే సదరు వాహనం తనదంటే తనది అని ఇద్దరూ మొండికేయడంతో వాహనానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు తీసుకురావాలని ఇద్దరికీ సూచించామని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: బైక్‌పై చలాన్లు చూసి షాకైన పోలీసులు విల్లాలో చోరీ నిజాంపేట్: సోలార్ ఫెన్సింగ్‌ను తొలగించి ఓ విల్లాలో దొంగతనానికి పాల్పడిన సంఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పోలీసులు తెలిపిన వివరాలు. బాచుపల్లిలోని శ్రీనివాస లేక్వ్యూలోని పసుపులేటి వెంకట శివకుమార్‌కు చెందిన విల్లాలోకి దొంగలు ప్రవేశించి రెండున్నర తులాల బంగారు హారం, 20 తులాల రెండు వెండి ప్లేట్ల ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
‘మీ జీవితంలో 17 ఏళ్లు ప్రశాంతత దూరం చేశాను.. నన్ను క్షమించండి’
సాక్షి, జీడిమెట్ల: మీ జీవితంలో 17 ఏళ్లపాటు ప్రశాంతత దూరం చేసినందుకు నన్ను క్షమించండి. మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఓ విద్యార్థి లేఖ రాసి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.బాలరాజు సమాచారం మేరకు... కుత్బుల్లాపూర్ డివిజన్ చెరుకుపల్లి కాలనీకి చెందిన ఎ.శివుడు కుమారుడు ఎ.పునీత్(17) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. సోమవారం ఉదయం నీట్ పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన పునీత్ రాత్రైనా తిరిగి రాలేదు. పునీత్ తండ్రి శివుడు కళాశాలకు వెళ్లి వాకబు చేయగా కళాశాల సిబ్బంది అక్కడకు రాలేదని తెలిపారు. పునీత్ రూంలో వెతకగా పునీత్ రాసిన ఉత్తరం లభించింది. దీంతో కంగారు పడిన పునీత్ తండ్రి సోమవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పోలీసులకు తలనొప్పి.. చచ్చిందెవరో.. చంపిందెవరో! స్నేహితురాలి వద్దకు వెళుతున్నానని... -
‘ఫాక్స్ సాగర్ చెరువుపై వదంతులు నమ్మొద్దు’
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువును కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్ఎల్సీ శంభీపూర్ రాజు, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌తో కలిసి పరిశీలించారు. ఫాక్స్ సాగర్ చెరువు పరిస్థితిపై అధికారులతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుమారు వందేళ్ల తర్వాత ఫాక్స్ చెరువులోకి భారీగా నీరు వచ్చిందన్నారు. సర్ ప్లస్ నీటిని బయటకు పంపించేందుకు తూము గేట్లు ఓపెన్ చేస్తున్నామన్నారు. ఇందుకు గాను శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద పని చేసే అనుభవం గలా సిబ్బందితో పనులు చేయిస్తున్నామన్నారు. (చదవండి: ఎమ్మెల్యే వివేకానందపై వీఆర్ఓ ఫిర్యాదు) అభివృద్ధి పనుల్లో భాగంగా తాము గతంలో చేపట్టిన చెరువు మరమ్మతు పనులతో ఫాక్స్ చెరువు గట్టు దృఢంగా ఉందని అన్నారు. తూము గేట్లు తెరిచినప్పటికీ లోతట్టు ప్రాంతాలు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. విడుదలైన నీటిని నాలలకు డైవర్ట్ చేస్తామని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. కొంత మంది చెరువు కట్టకు గండి పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం తగదని హితవు పలికారు. సుభాష్ నగర్ డివిజన్లో భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయం కావడంతో అక్కడ వరద నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. (చదవండి: మీర్‌పేట చెరువుకు గండి..ఆందోళనలో స్థానికులు) ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎటువంటి వదంతులు నమ్మవద్దన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. పోలీసులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ పద్మజా, మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, గండిమైసమ్మ ఎమ్మార్వో భూపాల్, కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ ఏవీఆర్ నరసింహ రావు, పేట్ బషీరాబాద్ ఎస్ హెచ్ఓ రమేష్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
-
వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి. వివేకానంద తనను బెదిరించాడని గాజుల రామారం వీఆర్ఓ శ్యామ్ కుమార్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆదేశాలమేరకు విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చినందుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడని అన్నారు. తనపై, రెవెన్యూ శాఖ అధికారులపై ఎమ్మెల్యే తిట్ల పురాణానికి సంబంధించి ఆడియో టేపులను పోలీసులకు అందించానని శ్యామ్ తెలిపారు. ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఎమ్మెల్యే వివేకానందపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్యామ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, అధికారులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలకు సంబంధించినదిగా ఓ ఆడియో టేపు ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇక ఎమ్మెల్యే తీరుపట్ల రెవెన్యూ ఉద్యోగులు మేడ్చల్ కలక్టర్ వద్ద ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్చల్) -
కలకలం రేపుతున్న యువతుల అదృశ్యం
దుండిగల్ : వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరారం రాజీవ్‌గృహకల్పకు చెందిన యాల పైడితల్లి కుమార్తె భారతి (21) ప్రైవేట్ ఉద్యో గం చేస్తోంది. ఈ నెల 20న డ్యూటీ కని కొంపల్లికి వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆమె జాడ తెలియలేదు. సోమవారం భారతి తండ్రి పైడితల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (విషాదం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య) మరో ఘటనలో.. దుండిగల్ గ్రామానికి చెందిన నర్సింహ కుమార్తె శిరీష (22) విద్యార్థి. కాగా 19న కుటుంబ సభ్యులు ఇంట్లోలేని సమయంలో ఎవరికి చెప్ప కుండా బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి నర్సింహ సోమవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త చేయి చేసుకోవడంతో.. దుండిగల్: భర్త చేయి చేసుకోవడంతో మనస్తాపం చెందిన భార్య ఇంటికి నుంచి వెళ్లిపోయిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన లక్ష్మారెడ్డి, పద్మావతి (38)లు భార్యాభర్తలు. ఈ నెల 20న రాత్రి 10 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో లక్ష్మారెడ్డి తన భార్య పద్మావతిని కొట్టాడు. గొడవ సద్దుమణిగిన తరువాత కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు. కాగా సోమవారం నిద్ర లేచి చూసేసరికి పద్మావతి కనిపించలేదు. చుట్టు పక్కల, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆమె జాడ తెలియలేదు. దీంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ వైరస్ బారరినపడక తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద్‌ను ‘సాక్షి’ఫోన్లో పలకరించగా వైద్యుల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతానని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు, శానిటైజర్లతో శుభ్రంగా ఉండాలని సూచించారు. (ఇప్పట్లో వదలదు!) -
అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకపర్వం
సాక్షి, కుత్బుల్లాపూర్: నగర శివారులోని ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచక పర్వానికి తెరలేపాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన సదరు ప్రొఫెసర్ ఓ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య ల్యాబ్‌కు పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు కరీంనగర్లో ఉన్న తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
వామ్మో కుక్క
కుత్బుల్లాపూర్: నగరంలో వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా దాడులకు తెగబడుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు 3.5 లక్షలున్న వీటి సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా 8 లక్షలకు పెరిగిపోయింది. నిధులు లేవన్న కారణంతో ప్రభుత్వం వీధి శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్సలను తగ్గించడంతో వాటి సంతానం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. మంగళవారం కుత్బుల్లాపూర్ పరిధి ప్రసూననగర్‌లోపాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న ఏడుగురు చిన్నారులపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ప్రసూననగర్ రామాలయం వీధికి చెందిన చిన్నారులు జ్ఞానేశ్వర్, హరిణి, లీనా, శ్రవణ్ తదితరులు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగావీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో సురేష్‌కుమార్ అనే వ్యక్తి దానిని తరిమికొట్టి చిన్నారులను కాపాడారు. సంక్షేమ సంఘం ప్రతినిధులు నాగశేఖర్‌గౌడ్, నాగేశ్వరరావు, నారాయణలకు సమాచారం అందించడంతో వారు చిన్నారులను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికితరలించారు. -
ఐలా.. చూస్తూ ఉంటే ఎలా..?
చింతల్: పన్నులు చెల్లించని వాణిజ్య సముదాయాలపై కొరడా ఝులిపించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. లక్షల్లో అద్దెలు తీసుకుని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని సదరు యజమానిపై గాంధీనగర్ ఐలా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సుమారు రూ.30 లక్షల మేర ప్రభుత్వానికి గండి పడింది. ఆర్థిక సంవత్సరం చివర్లో ఐలా అధికారుల హడావుడి అంతా ఇంతా కాదు. ఎంత హడావిడి చేసినా రూ.8, 9 కోట్లు రావాల్సిన ఆదాయం రూ.3 కోట్లకు మించి రావడం లేదు. ట్యాక్స్ వసూళ్ల సమయంలో హడావుడి చేసి ఒక్క రోజు గేట్లకు తాళాలు వేసి నోటీసులు ఇచ్చినా కొంతమంది భవన యజమానులు పన్నులు చెల్లించడం లేదు. గాంధీనగర్ ఐలా పరిధిలో 225 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో కొంతమేర 2005కు ముందు భవనాలను నిర్మించగా మరి కొంత మంది 2005 తర్వాత భవనాలను నిర్మించారు. ప్రభుత్వం ట్యాక్స్‌లను 100 శాతం మేర పెంచడంతో పారిశ్రామికవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఇందులో కొంతమంది పాత ట్యాక్స్ ప్రకారం చెల్లిస్తుండ గా కొందరు పారిశ్రామికవేత్తలు కేసు కోర్టు పరిధిలో ఉందన్న సాకుతో ట్యాక్స్‌లను చెల్లించడం మానేశారు. అక్కడే బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నా ఐలా అధికారులు కళ్లు మూసుకున్నారు. ఏళ్ల తరబడి ట్యాక్స్ కట్టని వారిపై చర్యలేవి..? ఐలా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పన్నులు చెల్లించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓ వ్యక్తి ఏకంగా 11 ఏళ్లలో కేవలం రూ.5 లక్షలు వరకు పన్నులు చెల్లించి మిగిలిన సొమ్మును చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. సీఐఈ గాంధీనగర్ పారిశ్రామికవాడలోని ప్లాట్ నెం 56/1, 56/2లో సదరు యజమాని 800 గజాలలో 2008లో రెండు ప్లాట్లలో కలిపి రెండు అంతస్తులు, పెంట్‌హౌజ్ నిర్మించి మొత్తం 30కి పైగా షెట్టర్లను వేసి లక్షల్లో అద్దెకు ఇస్తున్నాడు. 2008–19 వరకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే చెల్లించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీంతో సదరు వ్యక్తి మొత్తం రూ.28,67,196 లక్షల్లో బకాయిపడ్డాడు. ప్రతినెలా అతను అద్దెకు ఇస్తూ ఏకంగా రూ.5 లక్షలకు పైగానే సంపాదిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినా అధికారులు చోద్యం చూడటం అనుమానాలకు తావిస్తోంది. ట్యాక్స్ వసూళ్ల సమయంలో హడావుడి చేసే ఐలా అధికారులు ఇన్నేళ్లుగా పన్నులు చెల్లించని భవనాన్ని సీజ్ చేయాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఇంతమేర బకాయి రూపంలో గండి పడింది. నోటీసులకే పరిమితమవుతున్న అధికారులకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఉన్న వాటిని సీజ్ చేసే అధికారం ఉంది. కానీ ఇక్కడ అధికారుల తీరుచూస్తుంటే మాత్రం పలు అనుమానాలకు తావివ్వక మానదు. రెడ్ నోటీసులు జారీ చేస్తాం.. గాంధీనగర్ పారిశ్రామికవాడలోని ఎక్కువ మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి ఉన్న సదరు భవనాల యజమానులకు రెడ్ నోటీసులు జారీ చేస్తామని జీడిమెట్ల ఐలా కమిషనర్ నజీర్ అన్నారు. 2005 తరువాత నిర్మించిన అన్ని భవనాల యజమానులు పూర్తిస్థాయిలో ట్యాక్స్ చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. బకాయి ఉన్న భవనాల వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తాం.– నజీర్, జీడిమెట్ల ఐలా కమిషనర్ -
రెండున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
-
కూటమి ‘కూన’... విజయ ధీమా
సూరారం: అభ్యర్థులు ప్రచారంలోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత జోరు పెంచారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ (కాంగ్రెస్)తో ‘సాక్షి’ జోన్ ప్రతినిధులు శనివారం ఒక రోజు ప్రయాణించారు. ఉదయం 6గంటలకు ప్రారంభమైన ఆయన దినచర్య రాత్రి 10గంటల వరకు కొనసాగింది. సభలు, సమావేశాలు, ప్రజలతో ముఖాముఖి, రోడ్ షోలతో బిజీబిజీగా గడిపారు. ఆ వివరాలివీ... ♦ ఉదయం 6గంటలకు దినచర్య ప్రారంభించిన కూన శ్రీశైలంగౌడ్ తొలుత బజార్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ♦ ఉదయం 7గంటలకు బాచుపల్లిలోని కేహెచ్ఆర్ కన్వెన్షన్ హాల్లో విల్లాస్ అపార్టుమెంట్వాసులతో సమావేశమయ్యారు. ♦ ఉదయం 9:43గంటలకు టీడీపీ నేత కొలన్ హన్మంతరెడ్డితో కలిసి అల్ఫాహారం తీసుకొని, అక్కడి నుంచి బాచుపల్లిలో బైక్ ర్యాలీకి తరలి వెళ్లారు. ♦ ఉదయం 10:13గంటలకు బాచుపల్లి నుంచి నిజాంపేట, సాయినగర్, రాజీవ్‌గాంధీనగర్, ఇందిరానగర్‌ల మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. ♦ మధ్యాహ్నం 12:30గంటలకు వివిధ కాలనీల వాసులతో సమావేశమై పలువురితో ఫోన్లో మాట్లాడి ప్రచార శైలిని అడిగి తెలుసుకున్నారు. ♦ మధ్యాహ్నం 1:23గంటలకు జీడిమెట్ల డిపో వద్ద సూపర్‌మ్యాక్స్ కార్మికులను కలుసుకొని ప్రజాకూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ♦ మధ్యాహ్నం 2:27గంటలకు బాలానగర్ పారిశ్రామికవాడ వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్న ప్రాగా టూల్స్ కార్మికులతో సమావేశమై తనకు మద్దతు తెలపాలని కోరారు. ♦ మధ్యాహ్నం 2:43గంటలకు పక్కనే ఉన్న మల్హోత్ర పరిశ్రమ కార్మికులను కలుసుకొని హస్తం గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ♦ మధ్యాహ్నం 3:23గంటలకు భగత్‌సింగ్‌నగర్‌లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి బం ధువు గృహప్రవేశానికి వెళ్లి అక్కడే భోజనం చేశారు. ♦ సాయంత్రం 4గంటలకు గాజులరామారం చిత్తారమ్మ ఆలయం వద్ద గెస్ట్‌హౌస్‌లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీడీపీ డివిజన్ అధ్యక్షులతో సమావేశమై ఏపీ మాజీ మంత్రి కొండ్రు మురళితో చర్చించారు. అక్కడే కొంపల్లి ప్రాంతానికి చెందిన పలువురితో మాట్లాడారు. ♦ సాయంత్రం 4:30గంటలకు టీడీపీ మహిళా మండలి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రచార శైలిని అడిగి తెలుసుకున్నారు. ♦ సాయంత్రం 5:50గంటల నుంచి నిజాంపేటలోని వెంకటసాయి హిల్స్, కేటీఆర్ కాలనీ, బాలాజీ హిల్స్, బండారి లేఅవుట్లలో పర్యటిస్తూ రాత్రి 8గంటల వరకు ప్రచారం కొనసాగించారు. -
పార్టీ జెండాతో ఉరేసుకుని..
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద్‌ను భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓ అభిమాని పార్టీ జెండాతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంపేట రాజీవ్ గృహకల్పలో టి.గురువప్ప(52) నివాసం ఉంటున్నాడు. వారాంతపు సంతలో వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే అతడికి భార్య సంతోషితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వీరాభిమాని అయిన గురువప్ప స్థానికంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం షెడ్డులో పార్టీ జెండాతో శనివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి జేబులో ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో ‘‘అమర వీరులకు వందనాలు, ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానంద్‌ను గెలిపించాలి. ఆయన మంత్రి కావాలి. కేసీఆర్ తిరిగి సీఎం కావాలి. నా కుటుంబాన్ని ఆదుకోవాలి’’ అని రాసి ఉంది. -
పబ్లిక్ మేనిఫెస్టో కుత్బుల్లపూర్
-
ఢీ.. డిష్యుం.. డిష్యుం..!
హైదరాబాద్(కుత్బుల్లాపూర్): కారు, బైక్ ఢీ కొన్నాయి.. అంతలో కారులో ఉన్న ఓ వ్యక్తి కిందకు దిగి బైక్‌పై వచ్చిన వ్యక్తిని కొట్టాడు. అంతే సదరు బైకిస్ట్‌కు చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న నలుగురిని చితకబాదారు.. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. సుచిత్ర నుంచి కుత్బుల్లాపూర్ వెళ్లే రోడ్డులో జయరాంనగర్ వద్ద కారు, బైక్ ఢీకొనడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి స్థానికుడు కావడంతో అతడి స్నేహితులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటికి లాగి చితకబాదారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గొడవ పోలీస్‌స్టేషన్ కు చేరింది. -
విత్ డ్రా ఫాంలకు ఇంతలా..
చిత్రంలో కనిపిస్తున్న ఖాతాదారులు నగదు కోసం ఎగబడటం లేదు. బ్యాంకులో ఇచ్చే విత్ డ్రా ఫామ్ కోసం ఈ విధంగా బ్యాంక్ సిబ్బంది వెంట పడుతున్నారు. కేవలం విత్ డ్రా ఫామ్ కోసమే ఇంత ఇబ్బంది పడుతుంటే ఇక నగదుకు ఎన్ని కష్టాలు ఎదురవుతాయో అర్థం చేసుకోవచ్చు. కుత్బుల్లాపూర్ పరిధి షాపూర్‌నగర్ ఎస్బీహెచ్ వద్ద శుక్రవారం పోలీసుల సహకారంతో విత్ డ్రా ఫామ్‌లు పంపిణీ చేయాల్సి వచ్చింది. – కుత్బుల్లాపూర్ -
కొత్త జిల్లాలతో జనాల తికమక
-
గాంధీ జయంతినాడు ముక్కా చుక్కా!
కుత్బుల్లాపూర్: జాతిపిత మహ్మాత్మాగాంధీ జయంతి నేడు మాంసం విక్రయించరాదని, ఎవరైనా తమ ఆదేశాలు బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ మాంసం దుకాణాల్లో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు అంటించారు. ఆ తర్వాత అటు వైపు దృష్టి పెట్టకపోవడంతో ఆదివారం (గాంధీ జయంతి) కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో కొందరు మాంసం దుకాణదారులు యథావిధిగా షాపుల ముందే మేకలను కట్టి బహిరంగంగానే మాంసాన్ని విక్రయించారు. మరికొందరు షాపు షట్టర్లను సగం దించి.. గుట్టుచప్పుడుగా తమ దందా కొనసాగించారు. అలాగే, గాంధీ జయంతి నాడు మద్యం విక్రయాలపై నిషేధం ఉన్నా... మద్యం ఏరులైపారింది. వైన్ షాపులు ముందు మూత, వెనుక మద్యం గ్లాసుల మోత వినబడింది. జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, సూరారం, చింతల్ తదితర ప్రాంతాల్లో ఇదే దృశ్యం కనిపించింది. -
కుత్బుల్లాపూర్‌లో శిశు విక్రయం
హైదరాబాద్ : పెళ్లి కాకుండానే పుట్టిన పసికందును అమ్మేసి, ఆ యువతికి మరొకరితో పెళ్లి చేశారు. అయితే శిశు విక్రయ విషయం పోలీసుల దాకా వెళ్లటంతో చివరికి చిన్నారి ఐసీడీఎస్ అధికారుల ఒడికి చేరింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లికి ముందే గర్భం దాల్చి కూతురికి జన్మనిచ్చింది. అయితే, ఆమె తల్లి, అమ్మమ్మ కలిసి మూడో కంటికి తెలియకుండా ఆ శిశువును అదే రోజు వేరొకరికి విక్రయించేశారు. ఇది జరిగి తొమ్మిది నెలలవుతోంది. కాగా సదరు యువతికి నెల క్రితం వేరే యువకుడితో పెళ్లయింది. ఇదిలా ఉండగా శిశు విక్రయం విషయం ఆనోటా ఈనోటా ఐసీడీఎస్ అధికారులకు తెలిసింది. వారు శుక్రవారం పోలీసుల సాయంతో శిశువును స్వాధీనం చేసుకుని శిశుగృహకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు'
- ప్రజా వ్యతిరేక పాలనలో కేంద్ర, రాష్ట్రాలు - ప్రజలు గుణపాఠం చెబుతారు హైదరాబాద్ : గాంధీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠ పాలు చేయాలని కుట్ర పన్నిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం కుత్బుల్లాపూర్‌లోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక దినం ముగింపు సభకు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, వీ హనుమంతురావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 2019లో అధికారం కాంగ్రెస్‌దే : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియ ఉగ్రవాద వ్యతిరేక దినం ముగింపు సభకు హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియ మాట్లాడుతూ.. ఈ రోజు దేశప్రజలంతా సోషల్ మీడియా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడానికి రాజీవ్ ముందుచూపే కారణమన్నారు. రాజీవ్ విదేశాంగ విధానం ద్వారా భారత్ ప్రపంచ దేశాలకు మిత్రదేశంగా నిలవగా, మోదీ విదేశాంగ విధానం వల్ల నేపాల్, శ్రీలంక లాంటి మిత్రదేశాలు కూడా ఇతరదేశాలపై ఆధారపడుతున్నాయన్నారు. సోనియా, రాహుల్ నేతృత్వంలోనే 2019లో దేశం, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు పట్టెడు అన్నం పెట్టే ఎన్ఆర్జీయస్ పథకాన్ని మోదీ మార్చాలనే ప్రయత్నాన్ని రాహుల్ అడ్డుకున్నారని ఆయన తెలిపారు. దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇతర పార్టీల నుంచి గెలిచిన నాయకుల్ని అవినీతి సొమ్ముతో కేసీఆర్ కొనుగోలు చేస్తూ దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.తెరాస ప్రభుత్వాన్ని కూల్చాలని కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నారని కేసీఆర్ అనడం పచ్చిఅబద్ధమన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గాంధీ కుటుంబంపై కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠ పాలు చేయాలని చూస్తోందని ఆయన అన్నారు. ప్రజలే ఈ రెండు ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. టీఆర్ఎస్లో చేరినవారు దద్దమ్మలే : మాజీ మంత్రి సర్వే సత్యనారయణ ఉగ్రవాద వ్యతిరేక దినం ముగింపు సభకు హాజరైన మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై, పార్టీ ఫిరాయింపులపైనా ఘాటైన విమర్శలు చేశారు. తెరాస ప్రభుత్వంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి తెరాసలో చేరినవాళ్లంతా దద్దమ్మలు, సన్యాసులేనని ఆయన విమర్శించారు. తెరాస గెలిచిన ఎన్నికలన్నీ ఈవీఎంల టాంపరింగ్ తోనేనని, సొంత బలంతో కాదన్నారు. రాజీవ్ ఉంటే దేశం ముందుండేది : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీవ్ గాంధీ ఉండి ఉంటే ప్రపంచపటంలో మన దేశం ముందుండేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజీవ్,ఇందిరాగాంధీల చరిత్ర భావితరాలకు ఆదర్శమన్నారు. ప్రతిఒక్కరు రాజీవ్ ఆశయాల అడుగుజాడల్లో నడవాలని ఆమె పిలుపు నిచ్చారు. గాంధీ కుటుంబంతో మరిచిపోలేని అనుబంధం : వి.హనుమంతరావు రాజీవ్, ఇందిరా గాంధీలతో నా అనుబంధం మరిచిపోలేనిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు తప్ప అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. -
'హెచ్‌సీయూ లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు'
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో వెంకయ్యనాయుడు పాల్లొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... కులవివక్ష, మత వివక్ష సరికాదని.. సామాజిక సామరస్యం కావాలని అన్నారు. హెచ్‌సీయూ లాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. మైనార్టీల బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలకాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. రైతు కష్టాలను దీర్ఘకాలిక పరిష్కారాలు కావాలని చెప్పారు. దేవాలయాల్లో అందరికి ప్రవేశం ఉండాలని వెంకయ్య ఆకాంక్షించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి జిల్లా) : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. సంతానం కలగలేదని రాచి రంపాన పెట్టాడు. అదనంగా కట్నం తేవాలని చేయిచేసుకోవటం మొదలుపెట్టాడు. చివరకు ఏమైందో ఏమో.. అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలి బూడిదైంది ఆ ఇల్లాలు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రంగారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. ఈసీఐఎల్‌కు చెందిన సుశీలకు ఒక కుమారుడు రాజు, కుమార్తె శ్రీలత(భాగ్యలక్ష్మి) (29) సంతానం. డిగ్రీ వరకు చదువుకున్న శ్రీలత దేవరయాంజల్లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వరుసకు మేనమామ అయ్యే పోచయ్య(31)ను ప్రేమించి 2007లో కుషాయిగూడ సమీపంలోని ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి శ్రీలత కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. పిల్లలు లేరని వేధింపులు.. శ్రీలత, పోచయ్య కాపురం కొంతకాలం సజావుగానే సాగింది. పిల్లలు పుట్టకపోవటంతో పోచయ్య భార్యను అవమానించడం, కట్నం కోసం వేధించటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లిన శ్రీలత రూ.50 వేలు తెచ్చి ఇవ్వగా బైక్ కొన్నాడు. తరువాత ఆటో ట్రాలీకి రూ.లక్ష కావాలని, వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు రూ.80 వేలు కావాలని శ్రీలతను వేధించసాగాడు. ఆమె నిరాకరించటంతో పది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి పోచయ్య భార్య శ్రీలతను తీవ్రంగా కొట్టి, ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కాగా సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఇంట్లో నుంచి మంటలు వచ్చాయి. ఆ మంటల్లో శ్రీలత కాలి అక్కడికక్కడే చనిపోయింది. ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉండగా కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ప్రశ్నగా మారింది. కిరోసిన్ పోసి శ్రీలతను హతమార్చాడా లేదా.. మనస్తాపానికి గురైన శ్రీలత ఆత్మహత్య చేసుకుందా.. అన్న విషయం విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు 306, 498ఏ,174 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోచయ్య కోసం గాలిస్తున్నారు. -
యువకుడి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి జిల్లా) : ఒంటరితనాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవంతంగా తనువు చాలించాడు. రంగారెడ్డి జిలా కుత్బుల్లాపూర్ మండలం ఎంఎన్‌రెడ్డి నగర్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసించే జి.రాకేశ్‌గౌడ్(29) గురువారం రాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనాన్ని తట్టుకోలేకే ఈ లోకాన్ని వీడుతున్నానని అతడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి సతీమణి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి) : దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒకరు గాయపడ్డారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన దొడ్ల రమేష్, ఇ.రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా కొంపల్లి చంద్రగార్డెన్స్ సమీపంలో మంత్రి సతీమణి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న దొడ్ల రమేష్ కాలు విరిగిపోయింది. అతడిని వెంటనే పేట్బషీరాబాద్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి కారు డ్రైవర్ రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
దొంగలముఠా అరెస్ట్
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్ ) : నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక కారు, ఒక బైకు తోపాటు రూ. 11 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బాలనగర్ ఏసీపీ గురువారం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. గాజుల రామారం పరిధిలోని రొడ్డ మేస్త్రీనగర్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నగర పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి మీద పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా ముఠాను పట్టుకున్నారు. -
విధుల నుంచి తొలగించారని గర్భిణి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : విధుల నుంచి తొలగించారని మనస్తాపం చెందిన మహిళా కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలో సోమవారం జరిగింది. రోడ్మేస్త్రీ నగర్‌కు చెందిన పి. సంపూర్ణ(25) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఆమె విధులకు గైర్హాజరై సమ్మెలో పాల్గనడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన సంపూర్ణ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా ఆమె ఆరు నెలల గర్భవతి. ప్రస్తుతం ఆమెను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పేకాట అడ్డాపై దాడి : 12 మంది అరెస్టు
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్) : పేకాట అడ్డాపై పోలీసులు దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. కొంపల్లి సురేఖ ఆస్పత్రి వెనుక భాగంలో ఉన్న ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో శుక్రవారం పేకాట అడ్డాపై ఆకస్మిక దాడి చేయగా 12 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 65,900 నగదు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. -
ఇళ్ల పట్టాల పేరుతో మోసం
కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి) : ఇళ్ల పట్టాలు, డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, ఫించన్లు ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి స్థానికుల నుంచి రూ.200 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తున్నాడు. ఈ సంఘటన మంగళవారం నగరంలోని కుత్బుల్లాపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలోని పలువురికి ఇళ్ల పట్టాలు, డబుల్ బెడ్ రూం ఫాట్లు, ఫించన్లు, ఇప్పిస్తామని ఒక వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అంతేకాకుండా ఆధార్ కార్డులు, రెండు ఫోటోలు కావాలని డిమాండ్ చేశాడు. వెంటనే కాలనీ వాసులంతా జిరాక్స్ దుకాణం వద్ద గుమిగూడారు. విషయం తెలిసిన సాక్షి ప్రతినిధి అక్కడకు చేరుకొని విషయం ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. తెలంగాణ భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖ సోషల్‌సర్వీస్ కార్యకర్తగా చేప్పుకుంటున్న ఒక వ్యక్తి ఈ పనికి పూనుకున్నాడు. ప్రజల వద్ద నుంచి ఆధార్ కార్డులను స్వీకరిస్తున్నాడు. ఇతను ఈ నెల 8వ తేదీన కుత్బుల్లాపూర్‌లోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఇదే పని చేస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. కాగా నిందితుడు తాజాగా అదే కాలనీలో మళ్లీ ఈ పనికి పూనుకోవడం విశేషం. ఇదే విషయాన్ని అతన్ని అడగ్గా.. తనను పోలీసులు పట్టుకోలేరని, ఒక వేళ పట్టుకున్నా వెంటనే బయటకు వస్తానని చెప్పడం కొసమెరుపు. అయితే ఆధార్‌కార్డులు ఇచ్చిన స్థానికులు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మోసగాడు అక్కడి నుంచి జారుకున్నాడు. -
సర్వే చిత్రం - జనమే జనం
ఉద్యోగం కోసం... ఉపాధి కోసం వలస వచ్చేవారికి మేమున్నానంటూ గ్రేటర్‌లోని శివారు ప్రాంతాలు ఆశ్రయమిస్తున్నాయి. అక్కున చేర్చుకుంటున్నాయి. గూడు కల్పిస్తున్నాయి... ఫలితంగా ఆ ప్రాంతాల్లో జనాభా పెరుగుతోంది. అదీ మామూలుగా కాదు... జెట్ స్పీడుతో. ఇదేదో అంచనాతో చెబుతున్న మాట కాదు.. సమగ్ర కుటుంబ సర్వే సాక్షిగా వెల్లడైన వాస్తవం. నగరంలో భారమైన అద్దెలు...పెరుగుతున్న కాలుష్యం...వెరసి జనాలను శివారు బాట పట్టిస్తున్నాయి. హైదరాబాద్: గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో గడచిన మూడేళ్లలో జనాభా విపరీతంగా పెరిగింది. అనేక ప్రాంతాల్లో దాదాపు రెండింతలైంది. కోర్ సిటీ కంటే శివార్లలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. ఎల్బీనగర్లో మూడేళ్ల క్రితం 1,39,419 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం అవి 2,26,796కు చేరాయి. కుత్బుల్లాపూర్, కూకట్పల్లిల్లోనూ గణనీయంగా కుటుంబాలు పెరిగాయి. కుత్బుల్లాపూర్‌లో గతంలో 94,875 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 1.80 లక్షలకు చేరాయి. అంటే సంఖ్య దాదాపు రెట్టిం పైంది. కూకట్‌పల్లిలో 1,27,655 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 2,10, 343కు పెరిగాయి. సగటున కుటుంబానికి నలుగురిని లెక్కేసుకున్నా నాలుగు లక్షల జనాభా పెరిగింది. ఉప్పల్ సర్కిల్లో మాత్రం పెరుగుదల స్వల్పంగా నమోదైంది. గతంలో 41,188 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 6,441 కుటుంబాలు పెరిగి, మొత్తం 47, 629కు చేరుకున్నాయి. శేరిలింగంపల్లి-2, మల్కాజిగిరి సర్కిళ్లలో 40 వేలకు పైగా పెరిగాయి. చాలా కుటుంబాల వారు ఉమ్మడిగా ఉంటున్నప్పటికీ.. జనగణనలో విడివిడిగా నమోదు చేయించుకున్నా రు. సమగ్ర కుటుంబ సర్వేలో పేరు నమోదు చేయించుకోని పక్షంలో భవిష్యత్‌లో గ్యాస్, పాస్‌పోర్టు వంటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయేమోననే తలంపుతో ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారు. కోర్‌సిటీలోని ఖైరతాబాద్, అబిడ్స్ వంటి సర్కిళ్లలో పెరుగుదల పెద్దగా లేదు. వలస వచ్చే కుటుంబాలు.. జీవనోపాధి కోసం వచ్చేవారు శివారుల్లోనేఎక్కువగా ఉంటుండటం తో ఈ పరిస్థితి నెలకొంది. శివార్లలో లెక్కకు మిక్కిలి ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు కూడా అక్కడ జనా భా పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. పిల్ల ల చదువుల కోసం పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు శివార్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం ఇం దుకు కారణంగా చెబుతున్నారు. కోర్‌సిటీలో అద్దెల భారంతో పాటు కొత్త నిర్మాణాలు లేనందున అద్దెకు ఇళ్లు దొరకడం కూడా కష్టం కావడంతో నగరానికి వలస వచ్చేవారు శివార్లకే మొగ్గు చూపుతున్నారు. -
‘ప్రభంజన’ భేరి
సాక్షి, హైదరాబాద్: వేలాదిగా జనం.. కిక్కిరిసిన కూడళ్లు.. రోడ్ షో వెంట పరుగులు.. భారీ బైక్ ర్యాలీ.. అడుగడుగునా అనూహ్య స్పందన.. వెరసి వైఎస్సార్సీపీ ముఖ్య నేత వైఎస్ షర్మిల మంగళవారం మండుటెండలో చేపట్టిన జనభేరికి ప్రజాభిమానం వెల్లువెత్తింది. ‘నేను రాజన్న కూతుర్ని.. మీ జగనన్న చెల్లెల్ని’ అంటూ షర్మిల ‘గ్రేటర్’ రోడ్‌షోలో చేసిన ప్రసంగం ఓటర్లలో స్ఫూర్తిని నింపింది. వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో విజయోత్సాహాన్ని కలిగించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్‌నగర్ నుంచి ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన జనభేరి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఎల్బీనగర్లో భారీ బహిరంగసభతో ముగిసింది. ఉదయం తొమ్మిది గంటల నుంచే షాపూర్‌నగర్‌లో రహదారులన్నీ జనమయమై.. పదకొండు గంటలకు భారీ సభగా మారింది. వైఎస్ సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించినప్పుడల్లా.. ‘వైఎస్సార్ అమర్ రహే’ అన్న నినాదాలు మిన్నంటాయి. చంద్రబాబు వైఫల్యాలను ఎండ గట్టిన సమయంలోనూ జనం నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. షాపూర్‌నగర్ నుంచి బోయిన్పల్లి వరకు జరిగిన రోడ్డు షోలో అభిమానులు రహదారులు వెంట పరుగులు తీస్తూ షర్మిలతో కరచాలనానికి పోటీ పడ్డారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో జరిగిన సభలకు భారీ ఎత్తున యువకులు, మహిళలు తరలివచ్చి ఆయా అభ్యర్థులకు మద్దతిస్తామంటూ షర్మిలకు భరోసానిచ్చారు. ఒకేరోజు ఐదు నియోజకవర్గాల్లో సాగిన షర్మిల ప్రచారానికి భారీ ఎత్తున స్పందన వ్యక్తం కావటంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్ రవికుమార్, జె శ్రీధర్ శర్మ నాయకత్వంలో పార్టీ ఎన్నికల గుర్తు ఉన్న జెండాలను వందలాది మంది చేత పట్టి ప్రచార రథం ముందు కదం తొక్కుతూ క్రమశిక్షణాయుతంగా నడుస్తూ అందర్నీ ఆకర్షించారు. కుత్బుల్లాపూర్ వైస్సార్ సీపీ అభ్యర్థి కొలన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. ఈ రోడ్‌షోలో షర్మిల వెంట మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి వి.దినేష్‌రెడ్డి, శాసనసభ అభ్యర్థులు కొలను శ్రీనివాసరెడ్డి (కుత్బుల్లాపూర్), వెంకట్రావు (కంటోన్మెంట్), జంపన ప్రతాప్ (కూకట్పల్లి), ఆదం విజయ్‌కుమార్ (సికింద్రాబాద్), పుత్తా ప్రతాప్‌రెడ్డి (ఎల్బీనగర్) తదితరులు పాల్గొన్నారు. -
8మంది నిందితులను గుర్తించిన పోలీసులు
హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఇద్దరు ఎస్ఐలపై చేయి చేసుకున్న కేసుపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం సమావేశం అయ్యారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎనిమిదిమంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లు అల్వాల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చిరించారు. కాగా పూటుగా మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించడంతో అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు .. ఇక అంతే.. తనపై పోలీసులు దాడి చేశారని హడావిడి చేసి అందరినీ తప్పుదోవ పట్టించాడు. ఈక్రమంలో కొంత మంది ఆదివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌పై రాళ్లతో దాడి చేసి అడ్డొచ్చిన ఇద్దరు ఎస్సైలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా ఎనిమిదిమందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి అల్వాల్ ట్రాఫిక్ ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో డ్రంకన్ డ్రైవ్ విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలకు ఎర్రగడ్డకు చెందిన జగదీష్ తయార్(50) మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేసేందుకు యత్నించగా అందుకు నిరాకరించాడు. దీంతో లా అండ్ ఆర్డర్ ఎస్సై తిరుపతి సిబ్బందితో అక్కడికి చేరుకుని బలవంతంగా జగదీష్‌కు పరీక్ష చేయగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు నమోదైంది. అయితే, జగదీష్ తన పేరుకు బదులు పక్క సీట్లో కూర్చున్న సురేష్ అగర్వాల్ పేరును తన పేరుగా చెప్పాడు. అంతే కాకుండా తనపై పోలీసులు దాడి చేస్తున్నారని.. వచ్చి కాపాడండంటూ కొంపల్లి థోలారిధనిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇక అంతే.. నాలుగు బస్సుల్లో తిరుగు ప్రయాణంలో ఉన్న వారంతా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రాళ్లతో దాడి చేసి అడ్డుకున్న ఎస్సై పురుషోత్తం, తిరుపతిపై దాడికి దిగారు. -
మద్యం తాగి.. తప్పుదోవ పట్టించి..
-
మద్యం తాగి.. తప్పుదోవ పట్టించి..
పూటుగా మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించడంతో అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు .. ఇక అంతే.. తనపై పోలీసులు దాడి చేశారని హడావిడి చేసి అందరినీ తప్పుదోవ పట్టించాడు. ఈక్రమంలో కొంత మంది ఆదివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌పై రాళ్లతో దాడి చేసి అడ్డొచ్చిన ఇద్దరు ఎస్సైలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సోమవారం సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా పలువురిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి అల్వాల్ ట్రాఫిక్ ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో డ్రంకన్ డ్రైవ్ విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలకు ఎర్రగడ్డకు చెందిన జగదీష్ తయార్(50) మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేసేందుకు యత్నించగా అందుకు నిరాకరించాడు. దీంతో లా అండ్ ఆర్డర్ ఎస్సై తిరుపతి సిబ్బందితో అక్కడికి చేరుకుని బలవంతంగా జగదీష్‌కు పరీక్ష చేయగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు నమోదైంది. అయితే, జగదీష్ తన పేరుకు బదులు పక్క సీట్లో కూర్చున్న సురేష్ అగర్వాల్ పేరును తన పేరుగా చెప్పాడు. అంతే కాకుండా తనపై పోలీసులు దాడి చేస్తున్నారని.. వచ్చి కాపాడండంటూ కొంపల్లి థోలారిధనిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇక అంతే.. నాలుగు బస్సుల్లో తిరుగు ప్రయాణంలో ఉన్న వారంతా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రాళ్లతో దాడి చేసి అడ్డుకున్న ఎస్సై పురుషోత్తం, తిరుపతిపై దాడికి దిగారు. ఇలా అర్ధరాత్రి 1.30 గంటల వరకు స్టేషన్ ఆవరణలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరిని మందలించినా దాడి చేసేందుకు సిద్ధంగా ఉండడంతో పోలీసులు సంయవనం పాటించారు. అప్పటికే విషయం తెలుసుకున్న బాలానగర్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావులు వారిని సముదాయించి అక్కడ నుంచి పంపించారు. జరిగిన ఘటన ను పోలీసులు సీరియస్‌గా తీసుకుని గొడవకు కారకుడైన జగదీష్‌పై కేసు నమోదు చేయడమే కాకుండా సీసీ పుటేజీ ఆధారంగా మరి కొంత మందిపైనా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు సీఐ ప్రవీందర్‌రావు తెలిపారు. -
కూన.. ఇది తగునా !
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయనపై చర్యలు తీసుకునేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని మహబూబ్‌నగర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ వాచ్వాయిస్ ఆఫ్ ది పీపుల్ కార్యదర్శి డి.ప్రవీణ్‌కుమార్ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కూన శ్రీశైలంగౌడ్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2009లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన శ్రీశైలంగౌడ్ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తను 10వ తరగతి మాత్రమే చదివినట్లు పేర్కొన్నారని.. రంగారెడ్డి జిల్లాలో కోర్టులో దాఖలైన ఓ కేసులో తాను బీకాం చదివినట్లు పేర్కొన్నారని పిటిషనర్ వివరించారు. అంతేకాక గౌడ్ సంపాదించిన ఆస్తులకూ, అఫిడవిట్లో పేర్కొన్న అస్తులకు ఏ మాత్రం పొంతన లేదని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని, తప్పుడు సమాచారంతో మోసం చేసిన శ్రీశైలంగౌడ్‌పై చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.